K. Raghavendra Rao (director)
-
టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ బంజారాహిల్స్ షేక్‌పేట పరిధిలో రెండెకరాల భూకేటాయింపుపై సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కె. కృష్ణమోహన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని రెండెకరాల భూమిని రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు తాజాగా రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాయితీ ధరతో ప్రభుత్వం భూమి కేటాయిస్తే.. వారు దాన్ని షరతులకు విరుద్ధంగా వాడుతున్నారని ఆయన పిల్ దాఖలు చేశాడు. ఆ భూమిలో పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పిల్లో బాల కిషన్ పేర్కొన్నాడు. దీనిపై విచారించిన హైకోర్టు రాఘవేంద్రర్ రావుతో పాటు కృష్ణ మోహన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ విచారించింది. -
యాక్షన్ థ్రిల్లర్ 'ఎస్ 99' టీజర్ విడుదల
జగన్మోహన్, శ్వేతా వర్మ, శివన్నారాయణ, రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి, దేవీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఎస్ 99’. టెంపుల్ మీడియా పతాకంపై యతీష్, నందిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘టీజర్ బాగుంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జగన్మోహన్. -
శ్రీవల్లి కళ్యాణంకి శ్రీకారం
చిన్న చిత్రాల నిర్మాతగా కెరీర్‌ని ఆరంభించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ నూరవ చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. భీమవరం టాకీస్‌పై ఈ ల్యాండ్ మార్క్ చిత్రాన్ని కె. రాఘవేంద్ర రావుతో నిర్మించనున్నట్లు శుక్రవారం రామసత్యనారాయణ తెలిపారు. నేడు రామసత్యనారాయణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘త్వరలోనే ‘శ్రీవల్లి కళ్యాణం’ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది విడుదల చేస్తాం. సుమన్, రవళి జంటగా నిర్మించిన ‘ఎస్.పి. సింహా’తో నిర్మాతగా నా కెరీర్ చిన్నగా ఆరంభమైంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నిర్మించాను. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తీసిన ‘ఐస్‌క్రీమ్’ పార్ట్ వన్, పార్ట్ టూలతో నిర్మాతగా నా కెరీర్ పుంజుకుంది. ‘ట్రాఫిక్’, ‘వీరుడొక్కడే’, ‘బచ్చన్’, ‘శీనుగాడి లవ్ స్టోరీ’ తదితర అనువాద చిత్రాలు లాభాలతోపాటు ఆత్మసంతృప్తిని ఇచ్చాయి. ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో సునీల్–బిగ్ బాస్ కౌశల్‌తో ‘అతడు ఆమె ప్రియుడు’ నిర్మించాను. యండమూరి కథతో వర్మ డైరెక్షన్లో ‘తులసి తీర్థం’ త్వరలో మొదలు కానుంది. అలాగే రాఘవేంద్రరావు డైరెక్షన్లో నిర్మించనున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శ్రీవల్లి కళ్యాణం’ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి’’ అన్నారు. -
ఆ రోజు రాఘవేంద్రరావుకు జీవితంలోనే స్పెషల్
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు జీవితంలో విశిష్టమైన రోజు ఏప్రిల్ 28. బాక్సాఫీస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘అడివి రాముడు’ విడుదలైన రోజు అది. రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన శిష్యుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ విడుదలైన రోజు కూడా ఏప్రిల్ 28. ఇలాంటి ఒక ప్రాముఖ్యత ఉన్న ఏప్రిల్ 28న రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న తాజా చిత్రం ‘పెళ్లిసందడి’ పాటల సందడి మొదలవుతోంది. గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన శ్రీకాంత్ ‘పెళ్లిసందడి’కి రోషన్ ‘పెళ్లిసందడి’ సీక్వెల్ కాదు. ఇది ఓ కొత్త కథ. ఆ ‘పెళ్లిసందడి’కి చక్కని సంగీతం అందించిన కీరవాణి ఈ ‘పెళ్లిసందడి’కి కూడా సంగీతం అందించారు. ఈ సినిమాలోని ఓ పాటను ఈ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్, సాహిత్యం: చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. సాయిబాబా. చదవండి: ఒకే బాటలో నయనతార.. త్రిష! -
టాప్ హీరోయిన్ అవుతావన్నాను
‘‘స్వీటీ (అనుష్క)ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడే సౌత్‌లో టాప్ హీరోయిన్ అవుతావన్నాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ తను ఈ స్థాయికి వచ్చినందుకు గర్వంగా ఉంది. ప్రయత్నిస్తే సినిమాలు దొరుకుతాయి. కానీ, పాత్రలన్నీ నిన్ను (అనుష్క) వెతుక్కుంటూ వచ్చాయి.. ఏ హీరోయిన్‌కీ ఆ అవకాశం దక్కలేదు’’ అన్నారు డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. అనుష్క లీడ్ రోల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. క్రితి ప్రసాద్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలవుతోంది. ‘సూపర్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క ఫిల్మ్ ఇండస్ట్రీలో 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. కానీ, దేవసేన పాత్ర ఇచ్చినందుకు గర్వపడుతున్నా. ‘నిశ్శబ్దం’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి.. ఏప్రిల్ 2న సినిమా కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘హీరోయిన్లలో అనుష్కలాంటి మంచి అమ్మాయి ఉండటం అరుదు’’ అన్నారు డి. సురేశ్ బాబు. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఐదారు నెలల క్రితం జార్జియాకి వెళ్లాను. అక్కడ కారు డ్రైవర్, కేర్ టేకర్ గాజా ‘మీకు స్వీటీ (అనుష్క) తెలుసా?’ అన్నాడు. సర్ప్రైజింగ్గా అనిపించింది. ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం అనుష్క జార్జియాలో ఉన్నప్పుడు గాజానే కారు డ్రైవర్, కేర్ టేకర్‌గా ఉండేవాడు. తన కారుని ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోతే అనుష్క కొత్త కారు కొనిచ్చిందట. అంత మంచి అమ్మాయి. మంచి టీమ్‌తో తను చేసిన ‘నిశ్శబ్దం’ పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘స్వీటీ.. నీ కెరీర్లో మరో పదేళ్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటావని కచ్చితంగా చెబుతున్నా’’ అన్నారు నిర్మాత పీవీపీ. ‘‘సూపర్’ సినిమా హీరోయిన్ కోసం ముంబై వెళ్లా. అక్కడ అనుష్క వచ్చింది. ఏం చేస్తుంటావని అడిగితే యోగా టీచర్ అంది. నాగార్జునగారికి చూపించి, ఆడిషన్స్ చేద్దామన్నాను.. చాలా బాగుంది.. ఏం పర్లేదు ఆడిషన్స్ వద్దన్నారాయన. వినోద్ బాల వద్ద నటన నేర్చుకుంది. ‘నిశ్శబ్దం’ బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. అనుష్క మాట్లాడుతూ– ‘‘సూపర్’ నుంచి ‘నిశ్శబ్దం’ వరకూ ఎందరో డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ పదిహేనేళ్లలో మంచీ, చెడులు తెలిశాయి’’ అన్నారు. ‘‘అనుష్కగారితో ‘నిశ్శబ్దం’ సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్ ‘‘అనుష్క కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అన్నారు హేమంత్ మధుకర్. ‘‘అనుష్క నిజంగానే ‘లేడీ సూపర్‌స్టార్’. తన మంచి లక్షణాలతో ఓ పుస్తకం రాయొచ్చు’’ అన్నారు కోన వెంకట్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కిరణ్, శోభు యార్లగడ్డ, చార్మీ, ప్రశాంతి, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూఛిబొట్ల, డైరెక్టర్లు శ్రీవాస్, దశరథ్, వైవీఎస్ చౌదరి, వీరూ పోట్ల, హీరోయిన్ అంజలి పాల్గొన్నారు. -
మరింత కొత్తగా...
వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలను లిఖించుకున్నారు దర్శకులు కె. రాఘవేంద్రరావు. ఆయన తీసిన చిత్రాలు కొత్త తరం డైరెక్టర్లకు మార్గదర్శకత్వం అంటే అతిశయోక్తి కాదు. అయితే రాఘవేంద్రరావు రెండేళ్లుగా సినిమాలు చేయడం లేదనే ఆయన అభిమానుల బాధ తీరిపోయింది. మంగళవారం కె.రాఘవేంద్రరావు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించారు. ‘‘నా కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేకమైనది. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో’’ అంటూ ‘‘ముగ్గురు డైరెక్టర్స్‌తో... ముగ్గురు హీరోయిన్లతో దర్శకేంద్రుడి సినిమా! హీరో??’’ అని రాసి ఉన్న పోస్టర్ కూడా షేర్ చేశారు. 2017లో నాగార్జున హీరోగా వచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో సినిమా రాని విషయం తెలిసిందే. -
మే 23న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కె.రాఘవేంద్రరావు (దర్శకుడు), చంద్రమోహన్ (నటుడు) ఈరోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 9. వీరికి ఈ సంవత్సరం ఆస్తుల విలువ పెరుగుతుంది. కోర్టుకేసుల్లో విజయం సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పోలీసులు, మిలిటరీ వారికి ఇది మంచి సమయం. పోలీసు డిపార్ట్మెంట్లో పని చేయాలనుకునేవారి కల నెరవేరుతుంది. సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలోని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్ ఇంజినీర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు. అయితే కొత్త పనులు మొదలు పెట్టడానికి మాత్రం ఇది తగిన సమయం కాదు. లక్కీ నంబర్స్: 1,5,6,9. లక్కీ డేస్: మంగళ, శుక్ర, ఆదివారాలు. లక్కీ కలర్స్: రోజ్, క్రీమ్, ఆరంజ్, రెడ్. సూచనలు: వాహనాలు నడిపేటప్పుడు మితిమీరిన వేగం పనికిరాదు. పదునైన ఆయుధాలు వాడేటప్పుడు అప్రమత్తత అవసరం. రక్తదానం చేయడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం, అనాథ విద్యార్థులకు సాయం చేయడం, సుదర్శన హోమం చేయించుకోవడం. - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్