
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా ధిల్లాన్ నిర్మాతగా అవతారమెత్తింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రచయితగా మారిన ఆమె గతేడాది రిలీజైన ఏక్ విలన్ రిటర్న్స్, రక్షా బంధన్‌లకు తనే స్వయంగా కథ అందించింది. ఇప్పుడేకంగా షారుక్ ఖాన్ నటిస్తున్న డుంకీ సినిమాకు కూడా తనే కథ అందించడం విశేషం. రచయితగా సత్తా చాటుతున్న ఆమె తాజాగా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసింది.
కథా పిక్చర్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించింది. తన తొలి ప్రాజెక్ట్‌ను దో పట్టి అని ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. 'కథా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాజోల్, కృతీ సనన్ వంటి ప్రతిభగల హీరోయిన్లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది కనిక.
కనికా ధిల్లాన్ పర్సనల్ లైఫ్..
రాఘవేంద్రరావు తనయుడు, డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి- కనికా ధిల్లాన్ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2017లోనే వీరిద్దరూ విడిపోగా 2019లో వచ్చిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి కలిసి పని చేశారు. ఈ చిత్రానికి ప్రకాశ్ దర్శకత్వం వహించగా.. కనికా కథా సహకారం అందించింది. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత కనికా ధిల్లాన్ స్క్రీన్ రైటర్ హిమాన్షుతో ప్రేమలో పడగా 2021 ఆరంభంలో పెళ్లి చేసుకున్నారు. కాగా రాజ్ కుమార్ రావు ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ చిత్రాన్ని తీసి ప్రకాష్ చేతులు కాల్చుకున్నాడు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు.
చదవండి: పక్షవాతానికి గురైన హీరో కాలు.. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా
Comments
Please login to add a commentAdd a comment