k raghavendra rao
-
‘లైలా’గా మారిన విశ్వక్ సేన్..కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: టైటిల్ సాంగ్ రిలీజ్
చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.కె.ఆర్, బాల రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఆదివారం నాడు ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "దర్శకుడు బాల నాకు బాగా కావాల్సిన మనిషి. అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీన్ గా పనిచేశాడు.ఇప్పుడు సొంత డైరెక్షన్ లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే మంచి టైటిల్ తో చిత్రాన్ని నిర్మించారు. పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను స్వరపరచి ఆలపించింది. సాంగ్ బాగుంది. మా దర్శకుడు బాలకు, సినిమాలోని నటీనటులకు అందరికి శుభాకాంక్షలు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు. -
సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్: చిరంజీవి
‘వెంకటేశ్ తో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్. . తన ‘మల్లీశ్వరి’ నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్, ప్రేమ కథలు.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. కలిసి సినిమా చేయాలనేది మా ఇద్దరి కోరిక. మంచి కథ కుదిరితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుంది'అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విక్టరీ వెంకటేశ్ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని తాజాగా ‘సెలబ్రేటింగ్ వెంకీ 75’ పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వేడుకే ఇది. కథలో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నారు వెంకీ. ఇప్పటికే అన్ని రకాల జానర్స్‌ని టచ్ చేశాడు. ఇకపై కూడా ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నాను’ అన్నారు. విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘కలియుగ పాండవులు’తో నా ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ తదితర అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాల్ని గమనించి ప్రోత్సహించారు. మొదట్లో ‘విక్టరీ’ అనేవారు. తర్వాత ‘రాజా’ అని పిలిచారు. కొన్నాళ్లు ‘పెళ్లికాని ప్రసాద్’ అన్నారు. తర్వాత ‘పెద్దోడు’, ‘వెంకీ మామ’ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను. నా 75వ చిత్రం ‘సైంధవ్’ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందర్నీ అలరిస్తుంది. నా ప్రయాణంలో కుటుంబం అందించిన ప్రోత్సాహం ఎంతో గొప్పది. చిరంజీవి గారితో కలిసి త్వరలోనే సినిమా చేస్తా’ అన్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ‘వి అంటేనే విక్టరీ అనే డైలాగ్‌తోనే వెంకటేశ్ ప్రయాణం మొదలైంది. అందుకు తగ్గట్టే తన ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. రామానాయుడు నాపై పెట్టిన బాధ్యత మేరకే వెంకటేశ్‌ని తెరకు పరిచయం చేశా. తన ఎదుగుదలకు మాత్రం తను ఎంచుకున్న కథలు, పాత్రలు, తన అన్నయ్యే కారణం. ఇన్ని రకాల సినిమాలు మరే హీరో చేయలేడేమో అనేలా ఆయన కెరీర్ కనిపిస్తుంది’ అన్నారు. నాని మాట్లాడుతూ .. ‘అందరి అభిమానులు ప్రేమించే హీరో వెంకటేశ్. తెరపైనా, తెరవెనుక ఆయన జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి నటుడి కుటుంబం వెంకటేశ్‌లా ఉండాలని కోరుకుంటుంది’అన్నారు. -
కండోమ్ తెచ్చిన కష్టాలు.. ఆసక్తికరంగా సర్కారు నౌకరి ట్రైలర్
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్ గా నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, సునీతతో పాటు చిత్రం బృందం పాల్గొంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గోపాల్(ఆకాష్)కి ఆరోగ్య శాఖలో ఉద్యోగం వస్తుంది. కొత్తగా పెళ్లైన భార్య (భావన)తో కలిసి తెలంగాణలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్తాడు. గ్రామాల్లో నిరోధ్ వాడకం గురించి అవగాహన కల్పించడం అతని పని. కానీ గోపాల్‌కు ఆ ఊరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. నిరోధ్ వాడకం గురించి తెలియక వాటిని పిల్లలు ఆడుకునే బుగ్గలుగా చూస్తారు. అంతేకాదు గోపాల్ని బుగ్గలోడు అని హేళన చేస్తారు. గోపాల్ చేసే పని కాపురంలో కూడా చిచ్చు పెడుతుంది. ఆ ఉద్యోగం భార్యకు నచ్చదు. దీంతో ఉద్యోగమో నేనో తేల్చుకోమని భార్య అంటుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? ఉద్యోగాన్ని ప్రాణంగా భావించే గోపాల్ తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేదే మిగతా కథ. ట్రైలర్ కామెడీగా అనిపించినా.. చాలా ఇదొక ఎమోషనల్ స్టోరీలా ఉంది. -
అవినీతి బాబును వెనకేసుకొస్తోన్న 'టాలీవుడ్' పెద్దలు
అవినీతిలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి చంద్రబాబు జైలుకెళ్లినా.. ఆయన వల్ల ఏదో రూపంలో లబ్ధి పొందిన కొందరు సినీ ప్రముఖులు బ్రహ్మాండం బద్దలైపోయినట్లు లోకమంతా అన్యాయమైపోయినట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. తాము అభిమానించే చంద్రబాబును విడుదల చేయాలని కోరితే ఓకే అనుకోవచ్చు. కానీ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిన ఏపీ ప్రభుత్వాన్ని అర్జంట్‌గా రద్దు చేసేసి, రాష్ట్రపతి పాలన పెట్టేయాలంటూ కొందరు ఉన్మాద డిమాండ్లు చేస్తున్నారు. తాను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబే చెప్పలేకపోతున్నారు. ఆయన తరపు న్యాయవాదులూ ఈ మాట అనడం లేదు. కానీ కొందరు సినీ మనుషులు మాత్రం కణ్వమహర్షిని అరెస్ట్ చేసినట్లు తెగ బాధపడిపోతున్నారు. దీన్ని చూసి మేథావులు ఏవగించుకుంటున్నారు. రూ.371 కోట్ల లూటీ అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో పట్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆధారాలు చూసిన తర్వాతనే గౌరవ న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కుంభకోణంలో తాను డబ్బులు తినలేదని కానీ, తన షెల్ కంపెనీలకు డబ్బులు రాలేదని కానీ చంద్రబాబు అనలేదు. ఆయన కోర్టులో వాదించిందల్లా తనను అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు కోర్టులో హాజరు పరచలేదని ఫిర్యాదు చేశారు. అయితే సీఐడీ పోలీసులు నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని ఏసీబీ కోర్టు భావించింది. అందుకే చంద్రబాబు నాయుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసినా కూడా కొంతమందికి మాత్రం ఆయన్ను అరెస్ట్ చేయడం నచ్చడం లేదు. అందులోనూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాలుగా ఆర్ధికంగా పదవుల పరంగా లబ్ధి పొందిన కొందరు సినీ రంగ ప్రముఖులయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం మహా అపరాధం అన్నట్లు విలవిల్లాడిపోతున్నారు. చంద్రబాబునే అరెస్ట్ చేస్తారా? అంటూ పళ్లు పటపట కొరికేస్తున్నారు. సినీ నిర్మాత, టిడిపి కార్యకర్త, చంద్రబాబు హయాంలో భూముల పరంగా లబ్ధిపొందిన కొద్ది మంది అస్మదీయుల్లో ఒకరు అయిన అశ్వనీదత్ అయితే చంద్రబాబును అరెస్ట్ చేసిన వారిలో ఏ ఒక్కరికీ పుట్టగతులుండవని శపించేశారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు అశ్వనీదత్‌కు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆయన శాపాలు నిజం అయిపోయేవేమో! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వంలో పదవి అనుభవించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు సహజంగానే రుణం తీర్చుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడి అరెస్ట్ అన్యాయం అన్నారు. అది రాజకీయ కక్ష సాధింపే అని కూడా అన్నారు. ఆయన్ను విడుదల చేయాలని కోరారు. అందులో ఎలాంటి తప్పూ లేదు కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తూ దొరికిపోయినట్లు లోకంలో ప్రతీ ఒక్కరికీ తెలిసినా బాబు అభిమానులు ఇలాంటి డిమాండ్లతో కాలక్షేపం చేయాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు మేధావులు. ఇక మరో నిర్మాత కె.ఎస్.రామారావు అయితే చాలా క్రియేటివిటీ చూపించారు. కమర్షియల్‌గా చంద్రబాబు వల్ల ఆయన ఏం లబ్ధి పొందారో తెలీదు కానీ చంద్రబాబుపై ఉన్న కేసులో ఆధారాలు లేవని రామారావు అనేశారు. ఆధారాలు లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేస్తున్నాయి?.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ బాబును ఎందుకు అరెస్ట్ చేసింది? ఆధారాలు లేకపోతే ఎందుకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు? ఆధారాలు లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు న్యాయస్థానంలో దాన్ని సవాల్ చేయలేదు? చంద్రబాబు అరెస్ట్ మీకు తెలీకుండానే జరిగిందా? అంటూ కె.ఎస్.రామారావు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. అంత వరకు ఫర్వాలేదు. చంద్రబాబు నాయుడు చాలా నిజాయితీ పరుడు అని అభిప్రాయపడ్డారు. పోనీలే అది ఆయన అభిప్రాయం అనుకోవచ్చు. కానీ ఓ పిచ్చి డిమాండ్ కూడా చేశారు రామారావు. ఉన్నట్లుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలట. జగన్మోహన్ రెడ్డిని దింపేసి రాష్ట్రపతి పాలన విధించేయాలట? రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపైనా, ప్రజాస్వామ్యంపైనా కేఎస్ రామారావుకు ఎంత గౌరవం ఉందో ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి. సినిమా డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. బయటకు వచ్చినపుడు పైన చెప్పినోళ్లంతా మనుషుల్లా మాట్లాడాలి అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు అవినీతి చేశాడా? లేదా అన్నది కోర్టులు తేలుస్తాయి. ఒకవేళ ఆయన తప్పు చేయలేదని కోర్టు నమ్మితే ఆయన్ను విడుదల చేస్తాయి. ఆయన తప్పునకు దర్యాప్తు సంస్థలు సమర్పించిన ఆధారాలు సరైనవే అని భావిస్తే చంద్రబాబు నాయుడికి చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు. ఈ లోగా చంద్రబాబు నాయుడి దగ్గరో ఆయన పార్టీ నేతల దగ్గరో లేదంటే చంద్రబాబు కొమ్ము కాసే పత్రికల దృష్టిలో పడాలనో.. ఇలాంటి సినీ ప్రముఖులు నోటికెంతొస్తే అంతా మాట్లాడ్డం మాత్రం క్షమించరాని నేరమే అంటున్నారు విశ్లేషకులు. :::CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు -
'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!
ఓ భర్త తన భార్యని మోసం చేశాడు. చెప్పాలంటే అలాంటి ఇలాంటి మోసం కాదు. పెళ్లి, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నప్పటికీ మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఈ భార్యకి విడాకులు ఇచ్చేశాడు. దీంతో చాలా కుమిలిపోయింది. ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తన ఆవేదన బయటపెడుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు సడన్‌గా మాజీ భర్తకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అందరికీ కొత్త డౌట్స్ మొదలయ్యాయి. అవును పైన చెప్పినది పవన్-రేణు దేశాయ్ గురించే.. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరికీ తెలుసు. ఈ విషయంలో తనని తాను ఎంత సమర్ధించుకున్నా.. ముగ్గుర్ని(వేర్వేరుగా) పెళ్లి చేసుకోవడం తప్పే కదా! కానీ ఈ మహానుభావుడు ఒప్పుకోడు. అప్పట్లో అలా జరిగింది, ఇలా చేశాను అని ఏదో కవర్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంటాడు. మొదటి భార్య గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. మూడో భార్య మన దేశస్థురాలే కాదు. పవన్ పుణ్యామా అని రెండో భార్య రేణు దేశాయ్ మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రీసెంట్గా తన యూట్యూబ్ ఛానెల్లో రేణు దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేసింది. తన విషయంలో పవన్ చేసింది ముమ్మాటికీ తప్పే అని చెబుతూనే.. పొలిటికల్‌గా ఆయన(పవన్) సమాజానికి ఉపయోగపడతారని, నమ్ముతున్నానని కామెంట్స్ చేసింది. పిల్లల్ని, కుటుంబాన్ని వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది. అయితే ఇవన్నీ పెద్దగా నమ్మేలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇలా సడన్ యూటర్న్ కొత్త కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఈమె ఇలా మాట్లాడటం వెనుక దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. (చదవండి: చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే) కె.రాఘవేంద్రరావు మనవడు, పవన్-రేణుల కొడుకు అకీరా.. ఇద్దరు కూడా ఈ మధ్యే అమెరికాలోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేరారు. ఈ విషయమై ట్వీట్ చేసిన కాసేపటికే రాఘవేంద్రరావు ఎందుకో ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే కొడుకు భవిష్యత్‌ని చూపించి రేణు దేశాయ్‌తో తన భర్త(పవన్) మంచోడు అని సర్టిఫికెట్ ఇప్పించి, ఎలక్షన్‌లోపు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చంద్రన్న-పవన్ కలిసి ఇదంతా ప్లాన్ చేస్తున్నారేమో అనే సందేహం వస్తుంది. రేణు దేశాయ్ లేటెస్ట్ వీడియో వెనక చంద్రబాబు హస్తం ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది. (చదవండి: పోలీస్ ఆఫీసర్లుగా ఆన్ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు) ఎందుకంటే చంద్రబాబుకి కె.రాఘవేంద్రరావుతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ కలిసి పవన్-రేణు దేశాయ్‌ల వ్యవహారాన్ని వెనక వైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే చంద్రబాబు.. ఇలా తన దత్తపుత్రుడి ఇమేజ్ కాపాడటానికి చేసే ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది కాలమే నిర్ణయిస్తుందిలే! -
సర్కారు నౌకరి టీజర్.. ఎమోషనలైన సింగర్ సునీత
గాన మాధుర్యంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించే గాయని సునీత. తెలుగులో టాప్ సింగర్‌గా వెలుగొందుతున్న ఈమె తనయుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సర్కారు నౌకరి పేరుతో తీస్తున్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. భావనా వళపండల్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో బ్యానర్ స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. 1996లో కొల్లాపూర్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. నువ్వు చేసిన పూజలన్నీ ఫలించినయ్.. సర్కారు నౌకరున్నోడు నీ మొగుడు కాబోతుండు అన్న డైలాగ్‌తో హీరో ప్రభుత్వ ఉద్యోగి అని అర్థమవుతోంది. టీజర్ అయితే ఆసక్తికరంగా సాగింది. సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ - నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి బ్రేక్ ఇచ్చారు. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు అన్నారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ.. 'ఈ మధ్య పంచతంత్ర కథలు అనే వెబ్ సిరీస్ చేశాను. ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఆయన ఆఫీస్‌కు రమ్మని పిలిచారు. వెళ్లి కలిస్తే నేను పంచతంత్ర కథలు ఎలా మొదలుపెట్టి ఎలా ఎండ్ చేశానో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటే అది ఎక్కడికైనా చేరుతుందని అర్థమైంది. ఒక లైన్ కథ వినిపిస్తే ఆయనకు నచ్చింది. వెంటనే మా సంస్థలో చేద్దామని చెప్పారు. నాకు సర్కారు నౌకరి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెబుతున్నా' అన్నారు. సింగర్ సునీత మాట్లాడుతూ.. 'రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. ఈ సంస్థలో డబ్బింగ్ చెప్పాం, పాటలు పాడాను, ఇది మాకు హోమ్ బ్యానర్ లాంటిది. నంది అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నా ఇంత ఎమోషనల్ కాలేదు. ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడటం ఉద్వేగంగా ఉంది. రాఘవేంద్రరావు గారు మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటుడే కాదు సంస్కారం,మంచి నడవడిక ఉన్న వ్యక్తి. అతనికి ఫ్యూచర్, కెరీర్ బాగుంటాయని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా లైఫ్ లో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావొచ్చు. ఈ సినిమాలో నేనొక ప్రమోషనల్ సాంగ్ పాడాను. సర్కారు నౌకరి సినిమా బాగా వచ్చింది' అని చెప్పింది. చదవండి: 8 ఏళ్లకే ఇండస్ట్రీలో ఎంట్రీ.. హీరోయిన్గా మారిన డ్యాన్సర్ -
నిర్మాతగా మారిన రాఘవేంద్రరావు మాజీ కోడలు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా ధిల్లాన్ నిర్మాతగా అవతారమెత్తింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రచయితగా మారిన ఆమె గతేడాది రిలీజైన ఏక్ విలన్ రిటర్న్స్, రక్షా బంధన్‌లకు తనే స్వయంగా కథ అందించింది. ఇప్పుడేకంగా షారుక్ ఖాన్ నటిస్తున్న డుంకీ సినిమాకు కూడా తనే కథ అందించడం విశేషం. రచయితగా సత్తా చాటుతున్న ఆమె తాజాగా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసింది. కథా పిక్చర్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించింది. తన తొలి ప్రాజెక్ట్‌ను దో పట్టి అని ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. 'కథా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాజోల్, కృతీ సనన్ వంటి ప్రతిభగల హీరోయిన్లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది' అని ట్విటర్లో రాసుకొచ్చింది కనిక. కనికా ధిల్లాన్ పర్సనల్ లైఫ్.. రాఘవేంద్రరావు తనయుడు, డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి- కనికా ధిల్లాన్ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2017లోనే వీరిద్దరూ విడిపోగా 2019లో వచ్చిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి కలిసి పని చేశారు. ఈ చిత్రానికి ప్రకాశ్ దర్శకత్వం వహించగా.. కనికా కథా సహకారం అందించింది. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత కనికా ధిల్లాన్ స్క్రీన్ రైటర్ హిమాన్షుతో ప్రేమలో పడగా 2021 ఆరంభంలో పెళ్లి చేసుకున్నారు. కాగా రాజ్ కుమార్ రావు ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ చిత్రాన్ని తీసి ప్రకాష్ చేతులు కాల్చుకున్నాడు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు. చదవండి: పక్షవాతానికి గురైన హీరో కాలు.. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ఫుల్ బిజినెస్‌మెన్‌గా -
హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు సంగీత ప్రేక్షకులకు చాలా ఏళ్ల నుంచి తెలిసిన పేరు సునీత. సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. ప్రస్తుతం పాటలు పాడటంతోపాటు పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ చాలా ఫేమస్ అయింది. ఈమె కుమార్తె ఇప్పటికే ఓ సినిమాలో పాట పాడి గాయనిగా పరిచయమైంది. ఇప్పుడు కొడుకు ఆకాశ్ ఏకంగా హీరో అయిపోయాడు. తాజాగా ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశారు. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) సునీత్ రియాక్షన్ 'కంగ్రాట్స్ ఆకాశ్.. ఓ తల్లీ, కుమారుడి కల నెరవేరిన రోజు ఇది. ప్రపంచానికి నువ్వు నాకు చెప్పిన కథని చూపించడంతో, నటుడు కావాలనే సాకారం చేసుకోవడం కోసం నువ్వు పడిన శ్రమ, వృత్తి పట్ల నిబద్ధత, నువ్వు చేసిన త్యాగాలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని సింగర్ సునీత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు. ఫస్ట్ లుక్ లో ఏముంది? 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ బట్టి చూస్తుంటే.. 1980ల్లో జరిగిన కథలా అనిపిస్తుంది. ఓ పెద్ద చెట్టు, దానికి కండోమ్ ప్యాకెట్స్ డబ్బా, వెనక పల్లెటూరు చూస్తుంటే ఆసక్తి కలుగుతోంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?) -
ఆస్కార్ తీసుకునే ముందు రమా రాజమౌళికి ఒక్కటే మాట చెప్పా..
-
ప్రతిభ ప్రామాణికం కాదు బాబూ భజనే కొలమానం
-
దారుణమైన కామెంట్లు.. అసహ్యంగా, బాధగా ఉంది: తమ్మారెడ్డి
తెలుగు ఖ్యాతినే కాదు యావత్ భారతదేశ ఖ్యాతిని పెంచిన సినిమా ఆర్ఆర్ఆర్. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ కళాఖండానికి వేల కోట్ల కలెక్షన్లు వచ్చిపడ్డాయి. ఈ సినిమా నుంచి నాటునాటు పాట ఆస్కార్ రేసులో పోటీపడుతున్న విషయం తెలిసిందే! ఆర్ఆర్ఆర్ టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ అందరూ చప్పట్లు కొడుతుంటే ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచేందుకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బు తనకిస్తే ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొడతానంటూ కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై స్పందించాడు తమ్మారెడ్డి భరద్వాజ. 'నేను ఒక సెమినార్లో పాల్గొని అక్కడి యంగ్ డైరెక్టర్స్‌తో దాదాపు మూడు గంటలు మాట్లాడాను. అందులో ఒక నిమిషం క్లిప్ విని ఎవరెవరో రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ బడ్జెట్‌పై మాట్లాడాను. దీనిపై కొందరు చాలా దారుణంగా కామెంట్లు చేయడం బాధ కలిగించింది. ఒకరేమో అకౌంట్స్ సమాచారం అడుగుతారు. మరొకరేమో బూతులు తిడుతున్నారు. చాలా బాధగా, అసభ్యంగా, అసహ్యంగా ఉంది. వాళ్ల సంస్కారం వాళ్లది, నా సంస్కారం నాది. నేనేమీ గుర్తింపు కోసం పాకులాడటం లేదు. బహుశా నన్ను టార్గెట్ చేసకుఉని వాళ్లు గుర్తింపు కోరుకుంటున్నారో తెలీదు. నేను కొన్ని రోజుల ముందు రాజమౌళిని అభినందిస్తూ వీడియో పోస్ట్ చేశాను. మరి అప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడలేదే?' అని విమర్శించాడు. -
ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీపై సీనియర్ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండిస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ సినీ దిగ్గజాలు, సినీ ప్రియులు అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: జేమ్స్ కెమెరూన్ డబ్బు తీసుకొని పొగుడుతున్నారా? లెక్కలున్నాయా?: కె. రాఘవేంద్రరావు సూటి ప్రశ్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మిత్రుడు భరద్వాజ్‌కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి కానీ, రూ.80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ ట్వీట్ చేశారు. ఇక దర్శకేంద్రుడి మద్దతుగా నెటిజన్లు, ఆరఆర్ఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే తిరుగుతారు. 80 కోట్ల రూపాయలు ఉంటే పది సినిమాలు తీస్తారు సరే.. అందులో ఒకటైన ఆస్కార్‌కు వెళుతుందనే గ్యారంటీ ఇస్తారా? భరద్వాజ గారు’ అంటూ ఓ నెటిజన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరో నెటిజన్ స్పందిస్తూ ‘విచిత్రమైన మనిషి, విచిత్రమైన కామెంట్స్’ అసహనం వ్యక్తి చేశాడు. చదవండి: ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి కాగా రీసెంట్గా రవింద్ర భారతీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘రూ.200 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ బడ్జెట్. ఆ తర్వాత రూ.600 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఆర్ఆర్ మూవీ తీశారు. ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం రూ.80 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. Satruvulu ekkada undaru andi mana pakkane tirugutuntaru. 80crores unte 10 cinemalu teesukovachu correct ye. aah 10 cinemalu lo okatyna oscar vastundi aney gaurantee isthara bharadwaj garu. — Challapalli Anurag 🇮🇳 (@anurough) March 9, 2023 పాపం భరద్వాజులు గారు చల్లగా Attention తీసుకుని జారుకుందాం అనుకున్నారు కానీ తెలుగు జాతిని గర్వపడేలా చేసిన @RRRMovie & @ssrajamouli గారి మీద రాయి వేసి జారుకుందాం అని చుస్తే, తెలుగు వారు తెలుగు ప్రముఖుల గమ్ముగా వుంటారని భావించి నట్లు ఉన్నారు. — CMA Monesh (@Cmamonesh) March 9, 2023 -
RRR Movie: నీ దగ్గర లెక్కలున్నాయా భరద్వాజ్: కె. రాఘవేంద్రరావు ఫైర్
'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిందని, అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్లకు గానూ అంతగా ఖర్చు పెడుతున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆ 80 కోట్లు తనకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతామంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలో తనపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముకుల నుంచి సైతం విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఇదే విషయంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. మిత్రుడు భరద్వాజకి అంటూ మొదలు పెట్టిన ఆయన తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి, అంతేగాని 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా..? హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా డబ్బు తీసుకొని 'ఆర్ఆర్ఆర్'చిత్రం గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా..? అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. pic.twitter.com/wy5FcWjs0W — Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023 -
అందుకే నాకు వయసు గుర్తుకు రాదు: కె. రాఘవేంద్ర రావు
K Raghavendra Rao About Age In Wanted Pandu God Press Meet: ‘‘డైరెక్టర్ శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు పీ.ఆర్, కెమెరామేన్ మహీరెడ్డి వంటి వాళ్లతో పనిచేయడం వల్ల నాకు వయసు గుర్తుకు రాదు’’అని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండు గాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అన్నది ట్యాగ్‌లైన్. కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘తనికెళ్ల భరణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నారు. ‘పెళ్లి సందడి’కి మంచి డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేస్తే బావుంటుందనిపించింది. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాకు నేను ఓ అసిస్టెంట్ డైరెక్టర్లా వర్క్ చేశాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. చదవండి: పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్ -
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ప్రేమలేఖ.. ఎవరికంటే ?
K Raghavendra Rao Book A Love Letter What I Wrote To Cinema: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలతో అనేక మంది హీరోలకు మంచి సక్సెస్ ఇచ్చారు. ఇక హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనేలా పేరు తెచ్చుకున్నారు. అయితే మే 23 ఈ దర్శకేంద్రుడి జన్మదినం. ఈరోజుతో 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తన జన్మదినానికి ఉన్న ప్రత్యేకతను ఒక లేఖ ద్వారా వివరించారు. 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అనే పుస్తకాన్ని రాసినట్లు పేర్కొన్నారు రాఘవేంద్ర. ఈ పుస్తకం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ''ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే, దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం. ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌పై తొలిసారి క్లాప్ కొట్టడంతో నా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు నాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. పదేళ్ల పాటు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.ఎస్ ప్రకాశ్‌రావు గారు అందించిన ‘బాబు’ (1975) చిత్రంతో దర్శకునిగా సినిమా ప్రయాణం. ఆ రోజు నుంచి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులు అవార్డులు, రివార్డులు ఎన్నిచూసుంటాను. చదవండి: ఆ హీరోయిన్స్‌ను జిరాఫీలు అన్న అదితి రావ్.. ఎందుకంటే ? 48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో ‘‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’’అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు, రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతన్నాను. చదవండి: సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి ‘‘అబద్దాలు రాయటం అనర్ధం, నిజాలు రాయటానికి భయం.. అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు. విప్పి చెప్పలేదు. కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం.....’’ అంటూ తన బుక్ గురించి చెప్పుకొచ్చారు దర్శక దిగ్గజం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. చివరగా నేను చెప్పేదొక్కటే ‘సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు, ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. '' కె.రాఘవేంద్రరావు -
మహేశ్‌బాబులా అశోక్ ముందుకెళ్లిపోతాడు: రాఘవేంద్రరావు
‘‘నాకు హీరో కావాలనుంది’ అని అశోక్ చిన్నప్పటి నుంచి అనేవాడు.. ‘రాజకుమారుడు’తో మహేశ్‌బాబుని పరిచయం చేశాను. మహేశ్‌లా అశోక్ కూడా టకటకా ముందుకెళ్లిపోతాడు’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ–‘‘శ్రీమంతుడు’కి అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. మహేశ్‌గారు ఎలా నటిస్తున్నారో నోట్ బుక్‌లో రాసుకుంటున్నప్పుడే సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో తెలిసింది’’ అన్నారు. గల్లా పద్మావతి మాట్లాడుతూ– ‘‘నటన అంటే ఇష్టం’ అని అశోక్ చెప్పినప్పుడు లైట్ తీసుకున్నాం. సింగపూర్, అమెరికాలో చదువుకుని వచ్చాక కూడా తనలో నటనపై అదే ప్యాషన్ కనిపించింది. అందుకే నేను, జయదేవ్‌గారు ప్రోత్సహించాం’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎంపీ గల్లా జయదేవ్. హీరో రానా, నిర్మాత ఆదిశేషగిరి రావు పాల్గొన్నారు. -
‘బ్యాక్ డోర్' కచ్చితంగా విజయం సాధిస్తుంది: కె.రాఘవేంద్రరావు
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్యాక్ డోర్" టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్’అన్నారు. రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
ఆయన్ను చూస్తే చాలనుకున్నాను... సినిమా చేశాను
దిలీప్‌కుమార్ అందరూ మెచ్చిన నటుడు. భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన నటుడు. అంతటి లెజండరీ నటుడు మన తెలుగు హీరో కృష్ణంరాజు నిర్మించిన ‘ధర్మ్ అధికారి’లో నటించారు. ఇది కృష్ణంరాజు రెండు పాత్రల్లో నటించి, నిర్మించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’కి హిందీ రీమేక్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్రరావు హిందీ రీమేక్‌ని తెరకెక్కించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున తండ్రీ కొడుకులుగా బి. గోపాల్ దర్శకత్వం వహించిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ హిందీ రీమేక్ ‘కానూన్ అప్నా అప్నా’లో దిలీప్ కుమార్ నటించారు. ఈ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలోనే తెలుగు నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించారు. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘రాముడు–భీముడు’ హిందీ రీమేక్ ‘రామ్ ఔర్ శ్యామ్’లోనూ దిలీప్‌కుమార్ నటించారు. తెలుగు నిర్మాతలు చక్రపాణి, బి. నాగిరెడ్డి నిర్మించగా, తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇలా తెలుగు చలనచిత్ర దర్శక–నిర్మాతలతో దిలీప్‌కుమార్‌కి అనుబంధం ఉంది. ఇప్పుడు దిలీప్‌కుమార్ భారతీయ సినీరంగాన్ని విషాదంలో ముంచి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనతో సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు, కృష్ణంరాజు, బి. గోపాల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన విశేషాల్లోకి వెళదాం... ► నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. నేల టికెట్ కొనుక్కుని మరీ ఆయన సినిమాలు చూసేవాణ్ణి. అలాగే నాకు దిలీప్ కుమార్గారంటే కూడా చాలా ఇష్టం. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్ అందరం దిలీప్ కుమార్‌గారు రోజుకి 18 లక్షలు తీసుకుంటారట, చాలా పెద్ద హీరో అని చెప్పుకునేవాళ్లం. అసలు దిలీప్గారిని లైఫ్‌లో దూరంగా అయినా నిలబడి చూడగలమా? అనుకునేవాణ్ణి. కానీ ఆయన సినిమాకి డైరెక్షన్ చేయగలిగాను. ► నాగేశ్వరరావుగారు, నాగార్జునగారు తండ్రీ కొడుకులుగా నా దర్శకత్వంలో వచ్చిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ని ప్రొడ్యూసర్ ఏస్ఆర్ ఆంజనేయులుగారు హిందీలో రీమేక్ చేద్దామన్నారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్‌తో ఈ సినిమా చేస్తున్నాం అని ఆయన అన్నారు. అసలు నాకేమీ అర్థం కాలేదు. ఇంత అదృష్టం మనకు దక్కుతుందా అనిపించింది. దూరంగా అయినా చూడగలుగుతామా? అనుకున్న నాకు ఆయన్ను డైరెక్షన్ చేసే చాన్స్ అంటే చాలా ఆనందంగా అనిపించింది. షాకింగ్‌గా కూడా అనిపించింది. ► ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఆంజనేయులుగారు నన్ను ముంబయ్ తీసుకెళ్లారు. దిలీప్‌కుమార్‌గారి ఇంటికి వెళ్లాం. వెళ్లగానే ఆయన కాళ్లకు దండం పెట్టాను. కాసేపయిన తర్వాత ‘ఏంటీ మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. డైరెక్టర్ ఏమీ మాట్లాడటంలేదు’ అని ఆంజనేయులుగారిని దిలీప్‌గారు అడిగారు. ‘అలా ఏం లేదు. మీకు పెద్ద ఫ్యాన్ ఆయన. మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట్లాడకుండా ఉండిపోయారు’ అంటే ఆయన నవ్వుకున్నారు. అలా ఆయనతో ‘కానూన్ అప్నా అప్నా’ సినిమా చేశాను. ► రీ టేక్ అని చెప్పడానికి టెన్షన్ పడిన సందర్భాలు లేవు. ఎందుకంటే దిలీప్‌గారు చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవారు. ఈ సినిమా కమిట్ అయినప్పుడు ‘గోపాల్.. తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్టయిందని నాకు తెలుసు. నాకున్న ఇమేజ్‌కి తగ్గట్టుగా కాకుండా వేరే ఏదైనా ట్రై చేద్దాం.. డిస్కస్ చేద్దాం’ అని చెప్పి, అప్పట్లో రాజేశ్ ఖన్నాగారి ‘ఆరాధన’కు రచయితగా చేసిన సచిన్ బౌమిక్ని పిలిపించారు. దిలీప్‌గారు కొన్ని సలహాలూ సూచనలూ ఇచ్చి, ‘నువ్వు ‘నో’ అంటే ‘నో’. నీకూ కరెక్ట్‌గా అనిపిస్తేనే పెట్టు. లేకపోతే వద్దు. ఎందుకంటే తెలుగు వెర్షన్ కోసం చాలా రోజులు వర్క్ చేశారు. ఆ కథ డిస్ట్రబ్ కాని మార్పులే చేద్దాం. లేకపోతే వద్దు’ అన్నారు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ► ‘నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.15 లోపు షూటింగ్‌కి వస్తాను. నా అలవాటు అది. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి’ అని ముందే మాతో అన్నారు. ఆయనకు తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేశాం. దిలీప్‌గారు బాగా షటిల్ ఆడేవారు. బాగా ఎక్సర్సైజులు కూడా చేసేవారు. అవన్నీ చేసుకుని చెప్పినట్లుగానే 12 గంటలకల్లా లొకేషన్లో ఉండేవారు. కంటిన్యూస్‌గా సాయంత్రం 3 గంటల వరకూ షూటింగ్ చేసినా బ్రేక్ కావాలనేవారు కాదు. 3 గంటల తర్వాత లైట్‌గా లంచ్ తిని, ఓ అరగంట రెస్ట్ తీసుకుని, మళ్లీ ఫుల్ ఎనర్జీతో షూటింగ్లో పాల్గొనేవారు. హైదరాబాద్‌లో, మదరాసులలో షూటింగ్ చేసినప్పుడు బస చేసిన హోటల్లో షటిల్ ఆడుకుని షూటింగ్‌కి వచ్చేవారు. ► అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అప్పుడు నాగేశ్వరరావుగారు వచ్చారు. దిలీప్‌గారు, ఆయన ఇద్దరూ కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. ఒకరినొకరు గౌరవించుకున్న తీరు చూసి, నాకు చాలా ముచ్చటేసింది. ► దిలీప్‌గారు ఎక్కువ టేక్స్ తీసుకునేవారు కాదు. ‘కానూన్ అప్నా అప్నా’కి ఖాదర్ ఖాన్ డైలాగ్ రైటర్. ఆయన ఒక పెద్ద క్యారెక్టర్ కూడా చేశారు. ఖాదర్ రాసిన వెర్షన్ తీసుకెళ్లి, దిలీప్‌గారు ఫైనల్‌గా ఒక వెర్షన్ రాసుకొచ్చేవారు. ఖాదర్ ఖాన్ రాసిన ఫ్లేవర్ పోకుండా చిన్న చిన్న మార్పులతో డైలాగులు రాసుకొచ్చేవారు. క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి ఆయన అలా చేసేవారు. అంటే.. ఎంత హోమ్‌వర్క్ చేసేవారో ఊహించవచ్చు. ► కానూన్ అప్నా అప్నా’ చేసిన కొంతకాలం తర్వాత ఓ సందర్భంలో చెన్నైలో దిలీప్కుమార్గారిని కలిశాను. గుర్తుపట్టి, ‘గోపాల్.. ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించారు. ఒక లెజండరీ నటుణ్ణి కోల్పోయాం. చాలా బాధగా ఉంది. ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చిన నటుడు – కృష్ణంరాజు ► ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు దిలీప్‌కుమార్. ప్రతి సినిమాలో ఆయన నటన ఎంతో గొప్పగా ఉంటుంది. వ్యక్తిగా కూడా చాలా గొప్పవారు. దిలీప్‌కుమార్‌కి నేను పెద్ద అభిమానిని. ‘బొబ్బలి బ్రహ్మన్న’ సినిమాలో యంగ్, ఓల్డ్ క్యారెక్టర్స్ నేనే చేసినప్పటికీ హిందీలో రీమేక్ చేయాలన్నప్పుడు పెద్ద వయసు పాత్రకు ధర్మేంద్రను, యంగ్ క్యారెక్టర్‌కు జితేంద్రను అనుకున్నాం. అలా అనుకున్నప్పటికీ దిలీప్‌కుమార్ అభిమానిగా ఆయన నటిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ నటిస్తారో లేదో అని సందేహం. కానీ దిలీప్‌కుమార్‌గారు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమా చూసి, నాకు ఫోన్ చేసి అభినందించారు. నటిస్తానని అన్నారు. అలా ‘ధర్మ్ అధికారి’ ఆరంభమైంది. ఇందులో యంగ్ క్యారెక్టర్‌ను జితేంద్ర చేశారు. ► సాధారణంగా దిలీప్‌కుమార్‌గారు సినిమా షూటింగ్‌కు మధ్యాహ్నం 12 గంటల మధ్యలో వచ్చేవారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఉదయం ఏడు గంటలకే సెట్స్‌కి వచ్చేవారు. ఇందులోని ధర్మ్ రాజ్ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నేనంటే ఆయనకు ఉన్న ఇష్టం కూడా ఆయన్ను సెట్స్‌కు రప్పించిందేమో! ‘భాయీజాన్’ అంటూ ఆప్యాయంగా హత్తుకునేవారు. ► ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఓ సందర్భంలో జితేంద్ర ఓ సన్నివేశానికి ఇంకా కాస్ట్యూమ్‌తో రెడీ కాలేదు. దిలీప్‌కుమార్‌గారు ఆలస్యంగా వస్తారని ఆయన అనుకున్నారు. కానీ ఆల్రెడీ వచ్చారని, షాట్‌కు రెడీ అయిపోయారని చెప్పాను. ‘దిలీప్‌గారు అప్పుడే వచ్చారా.. అబద్ధం చెప్పకు’ అని జితేంద్ర అన్నారు. ‘లేదు.. వచ్చారు’ అని చెప్పగానే అప్పటికప్పుడు జితేంద్ర షాట్‌కు రెడీ అయ్యారు. ► ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రం 100 డేస్ ఫంక్షన్‌కు దిలీప్‌గారు వచ్చారు. ఆయనతో పాటు ఆయన భార్య సైరా బానుని కూడా తీసుకువచ్చారు. నేను, దిలీప్, ఆమె ఒకే చోట పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు వేదిక మీద ఉన్న ‘బొబ్బిలి బ్రహ్మన్న’ పోస్టర్ చూసి, ఆయన ఎవరు? అని దిలీప్గారిని సైరా బాను అడిగారు. ‘నీ పక్కన ఉన్న అతన్ని అడుగు’ అని నన్ను చూపిస్తూ, ఆయన చమత్కరించారు. అప్పట్లో నేను యంగ్‌గా ఉన్నాను. పోస్టర్లో పెద్ద వయసున్న బ్రహ్మన్న గెటప్‌లో నన్ను గుర్తుపట్టలేకపోయారామె. యంగ్ రవి పాత్రను మాత్రమే నేను చేశానని ఆమె అనుకుని ఉంటారు. లెజెండ్ దూరమయ్యారు – కె. రాఘవేంద్రరావు భారతీయ సినిమా చరిత్రలో టాప్ లెజెండ్ దిలీప్‌కుమార్‌గారు. అన్ని రకాల పాత్రలు చేసిన గొప్ప నటుడు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ స్క్రిప్ట్ చదివి, సినిమా చూడగానే హిందీ రీమేక్‌లో నటించడానికి ఒప్పుకున్నారాయన. ఈ సినిమా షూటింగ్ అప్పుడు రాజమండ్రిలో చిన్న విలేజ్ దగ్గర ఓ ఇల్లు తీసుకున్నాం. అప్పుడు దిలీప్‌గారి భార్య సైరా బాను కూడా వచ్చారు. ఇద్దరూ చాలా సింపుల్ పర్సన్స్. ఒక గొప్ప వ్యక్తితో, గొప్ప నటుడితో సినిమా చేయడం నాకు హ్యాపీ అనిపించింది. ఇండియన్ ఇండస్ట్రీ ఒక లెజెండ్‌ని కోల్పోయింది. ప్రముఖుల నివాళి ‘‘ఒక శకం ముగిసింది. ఇక భారతీయ సినిమా అంటే దిలీప్‌కుమార్‌కి ముందు ఆ తర్వాత అనాలి’’ అంటూ దక్షిణ, ఉత్తరాది భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు దిలీప్‌కుమార్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లెజెండరీ యాక్టర్ దిలీప్‌కుమార్‌గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో దిలీప్‌కుమార్‌గారు ఒకరు. ఆయన ఒక యాక్టింగ్ ఇనిస్టిట్యూషన్. తన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సినీ సంపద. – చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమకు దిలీప్‌కుమార్‌గారి మరణం తీరని లోటు. ఒక నటుడిగా మొదలై స్టార్‌గా ఎదిగిన దిలీప్‌గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. అయితే వివిధ సందర్భాల్లో ఆయన్ను కలుసుకోగలిగినందుకు ఐ యామ్ బ్లెస్డ్. – మోహన్‌బాబు దిలీప్‌కుమార్ సార్ మనకు శాశ్వతంగా దూరమయ్యారనే వార్త నన్ను బాధించింది. ఆయన ఎప్పటికీ ఓ లెజెండ్. మన హృదయాల్లో దిలీప్‌గారి లెగసీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – వెంకటేశ్ ప్రపంచ సినిమాపై దిలీప్‌కుమార్ చెరగని ముద్ర వేశారు. గ్రేటెస్ట్ యాక్టర్. లెజెండ్స్ ఎప్పటికీ బతికే ఉంటారు – రవితేజ దిలీప్‌గారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్ అందరికీ ఓ ప్రేరణ. సినీ చరిత్రలో నిలిచిపోతారు. – మహేశ్‌బాబు భారతీయ సినీ పరిశ్రమ ఎదుగుదలలో దిలీప్‌కుమార్‌గారి పాత్ర విలువైనది. – జూనియర్ ఎన్టీఆర్ దిలీప్‌కుమార్‌గారి మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం. – రామ్‌చరణ్ దిలీప్‌కుమార్‌గారు భారతీయ సినిమాకు చేసిన కృషి అసమానమైనది. ఈ తరం యాక్టర్స్‌కే కాదు. భవిష్యత్ తరాల యాక్టర్స్‌కూ ఆయన ఓ స్ఫూర్తి. – అల్లు అర్జున్ ఒక ఇనిస్టిట్యూషన్ వెళ్లిపోయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రను రాస్తే అది కచ్చితంగా దిలీప్‌కుమార్‌కు ముందు, దిలీప్‌కుమార్ తర్వాత అన్నట్లు ఉంటుంది. – అమితాబ్ బచ్చన్ దిలీప్ కుమార్‌తో నేను ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాను. దిలీప్, సైరా బానులతో నాకు మంచి అనుబంధం ఉంది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలనే కాదు.. ఇతర సంగతుల గురించి కూడా మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయన సినిమాలు విడుదలైన ప్రతిసారీ సైరా నన్ను వాళ్ల ఇంటికి ఆహ్వానించేవారు. నేను వెళితే ‘‘మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు.. మన ‘మధుమతి’ (దిలీప్‌కుమార్ సరసన వైజయంతీ మాల నటించిన సినిమా) వచ్చారు’’ అని దిలీప్‌తో సైరా అనేవారు. అప్పుడు ‘ధనో వచ్చింది’ అని దిలీప్ అనేవారు. ‘గంగాజమున’ చిత్రంలో నేను పోషించిన పాత్ర పేరు ధనో. దిలీప్‌కుమార్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. తనతో కలిసి ఉండేందుకు ఆ అల్లాయే దిలీప్‌ను పిలిచాడని అనుకుంటున్నాను. – వైజయంతీ మాల నా ఆప్యాయమైన సోదరుడు దిలీప్‌కుమార్‌ని కోల్పోయాను. మా దిలీప్ ఉండటం ఆ స్వర్గానికే అదృష్టం. – ధర్మేంద్ర నా జీవితంలో ఓ తండ్రిలా ఉన్న దిలీప్ సార్‌తో నాకు ఎన్నో ప్రత్యేకమైన అనుభూతులు ఉన్నాయి. – సంజయ్ దత్ ఇండియన్ సినిమా అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఇలాంటి ప్రతిభాశాలి లేరు, రారు. – సల్మాన్ ఖాన్ అద్భుత నటన ద్వారా విలువైన, వెలకట్టలేని, ప్రత్యేకమైన బహుమతులను మాకు ఇచ్చిన యూసుఫ్ సాహెబ్‌కు ధన్యవాదాలు. నా దృష్టిలో మీరెప్పటికీ గ్రేటెస్ట్. సలామ్! – ఆమిర్ ఖాన్ ఈ ప్రపంచంలో చాలామంది హీరోలు ఉండొచ్చు. కానీ మా యాక్టర్స్ హీరో దిలీప్‌కుమార్ సారే. ఇండియన్ సినిమాలో ఆయన మరణంతో ఓ శకం సమాప్తమైపోయింది. – అక్షయ్‌కుమార్ -
‘పెళ్లి సందD’ కి క్రేజీ ఆఫర్... ఓటీటీలో విడుదలకు సిద్దం!
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడడంతో సినీ ప్రియులకు ఓటీటీ వేదికలు కీలకమైన ప్రత్యామ్నాయాలుగా మారాయి. కరోనా ముందు ఓటీటీ వేదికలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఓటీటీ వేదికలో సభ్యత్వం తీసుకుని ఇంట్లో కూర్చొని హాయిగా సినిమాలు చూస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్లుగా ఓటీటీ సంస్థలు ఢిపరెంట్, ఢిపరెంట్ కంటెంట్‌ని అందుబాటులోకి తీసుకోస్తుంది. ఇక థియేటర్లు ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేకపోవడంతో చిన్న, మీడియం సినిమాలు మెల్లిమెల్లిగా ఓటీటీ బాట పడతున్నాయి. ఇప్పటికే ఈ వారంలో ‘ఏక్ మినీ కథ’, ‘అనుకోని అతిథి’లాంటి సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. తాజాగా మరో టాలీవుడ్ మూవీ ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘పెళ్లి సందD’ఓటీటీ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం. రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘పెళ్లి సందD’ని కొనేందుకు ముందుకు వచ్చాయని, అవి ప్రకటించిన ఆఫర్లు కూడా నిర్మాతకు లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయని, ఎప్పుడైనా ఈ డీల్ ఓకే అయిపోవొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నెట్టింట వినిపిస్తోన్న ఈ వార్తలు చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ‘పెళ్లి సందD’ విషయానికొస్తే... శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడికి సీక్వెల్ ఇది. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా నటిస్తున్న ఈ సినిమాని కె.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. -
Pelli SandaD: ఆకట్టుకుంటున్న ‘బుజ్జులు బుజ్జులు..’ సాంగ్
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్లి సందD. మూవీ నుంచి మరో పాట విడుదల అయింది. రాఘవేంద్రరావు పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ‘బుజ్జులు బుజ్జులు’అనే ఫోక్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. బాబా సెహగల్, మంగ్లీ ఆలపించిన ఈ సాంగ్ కు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన “ప్రేమంటే ఏంటి” సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కె. రాఘవేంద్రరావు
-
పెళ్లి సందడి@25.. రాఘవేంద్రరావు ఎమోషనల్ ట్వీట్
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా సినిమాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి. ఈ చిత్రంలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సౌందర్య లహరి.. స్వప్న సుందరి’, ‘నవ మన్మథుడా.. అంతి సుందరుడా’, ‘హృదమనే కోవల తలుపులు తెరిచే తాళం ప్రేమ’ లాంటి పాటలు వింటే ఇప్పటికీ ఏదో అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా అశ్వనీదత్, అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 12,1996లో విడుదలైంది. బుధవారం నాటికి ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరరావు ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘పెళ్లిసందడి. నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను’ అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పెళ్లి సందD సినిమా హీరోయిన్ పేరును తెలియజేస్తూ మరో ట్వీట్ చేశారు. ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందD సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం... త్వరలో థియేటర్లో కలుద్దాం. అని ట్విటర్ ద్వారా తెలియజేశారు. కాగా అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీ లీల.. కిస్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ విడుదల అవ్వకుండానే శ్రీమురళి నటిస్తోన్న భారతే అనే మూవీలో అవకాశం సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పెళ్లిసందDతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. -
ఫ్యాన్స్‌కి ఖుషీ?
మూడేళ్ల విరామం తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం ‘పెళ్లి సందడి’ టైటిల్‌నే ఈ కొత్త సినిమాకు పెట్టారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తారని టాక్. అలాగే హీరోయిన్గా శ్రీదేవి చిన్న కుమార్తె, జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కనిపించే అవకాశం ఉందట. హీరోయిన్స్ పేరు ప్రస్తావనలో ఖుషీ కపూర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అనేక బ్లాక్‌బస్టర్స్‌లో కనిపించారు శ్రీదేవి. ఆమె కెరీర్లో ముఖ్యమైన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. తెలుగులో శ్రీదేవి ఓ ప్రత్యేకమైన స్థానం. ఖుషీ తెలుగు తెరకు పరిచయం అయితే శ్రీదేవి అభిమానులు ఖుషీ అవుతారు. మరి ఖుషీ ఇస్తారా? చూడాలి. ఒకవేళ ఈ సినిమా అంగీకరిస్తే ఇదే ఖుషీ కపూర్‌కి తొలి సినిమా అవుతుంది. ఇంకా హిందీలో కూడా ఆమె నటించలేదు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘పెళ్లి సందడి’కి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. -
పెళ్లి సందడి మళ్లీ మొదలు
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన వందకు పైగా చిత్రాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలున్నాయి. మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఆయన బెస్ట్ సినిమాల్లో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పెళ్లి సందడి’ ఒకటి. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు ఆయన. ‘మ్యూజికల్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయి, నటీనటుల వివరాలు త్వరలో చెబుతాం’ అని ఓ వీడియో ద్వారా ప్రకటించారు. మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. -
‘రాజకుమారుడు’కి 21 ఏళ్లు.. మహేష్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలై నేటికి (గురువారం) 21 వసంతలు పూర్తి చేసుకుంటోంది. 1999 జూలై 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా మహేష్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్లో అశ్వినీదత్ నిర్మించారు. బాలీవుడ్ భామ ప్రీతి జింతా హీరోయిన్ నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా, సూపర్ స్టార్ కృష్ణ క్యామియో రోల్ చేయడం విశేషం. కాగా హీరోగా 21 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మహేష్ ఇప్పటి వరకు 26 సినిమాలు చేశాడు. (టాలీవుడ్ టాప్-10 లవింగ్ హీరోలు!) ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్‌బాబు ట్విటర్లో పోస్ట్ చేశారు. తనకు తొలి చిత్రం రాజకుమారుడు హిట్ ఇచ్చినందుకు రాఘవేంద్రరావు, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా అనుభవంతో నటనలో తనెంతో నేర్చుకున్నట్లు వెల్లడించారు. రాఘవేంద్ర రావు, చిత్ర యూనిట్‌తో కలిసిన పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా ద్వారా ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించిన అశ్వినీదత్‌కు చిత్ర బృందానికి రాఘవేంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబు తన కెరీర్లో ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విటర్లో పోస్టు చేశారు. (‘శభాష్ సైబరాబాద్ పోలీస్.. ఎస్సీఎస్సీ’ ) 21 years and how ❤️❤️❤️ Thank you @Ragavendraraoba for making my first a super special one. The learning that came with the experience is something I'll always cherish. Extremely glad to have known and worked with you and our amazing team🤗#21YearsForRajakumarudu pic.twitter.com/OqRio9280o — Mahesh Babu (@urstrulyMahesh) July 30, 2020 రాజకుమారుడు కి 21 వసంతాలు... ఎన్నో మధుర జ్ఞాపకాలు... మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను...@urstrulyMahesh @realpreityzinta@VyjayanthiFilms #Manisharma#21YearsForRajakumarudu pic.twitter.com/jlQnGZVlIn — Raghavendra Rao K (@Ragavendraraoba) July 30, 2020 మా రాజకుమారుడు కి 21 వసంతాలు ❤️@urstrulyMahesh @Ragavendraraoba#Manisharma @realpreityzinta@adityamusic @VyjayanthiFilms#21YearsForRajakumarudu pic.twitter.com/ZYiaiy9gfh — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 30, 2020 -
104 డిగ్రీల జ్వరంతో ధినక్ తా ధినక్ రో...
స్క్రీన్ మీద మాస్ హీరో చిరంజీవి, అందాల సుందరి శ్రీదేవి ‘ధినక్ తా ధినక్ రో..’ అంటూ డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తున్న ప్రేక్షకులకు ఒకటే హుషారు. అభిమానులు కూడా థియేటర్లో స్టెప్పులేశారు. హీరోయిన్లు ఎలానూ పాటల్లో గ్లామరస్‌గా కనిపిస్తారు. హీరోలు కూడా హ్యాండ్సమ్గా కనిపిస్తారు. ఈ పాటలో చిరంజీవి అలానే కనిపించారు. అయితే ఈ పాట చిత్రీకరించినప్పుడు ఆయన 104 డిగ్రీల జ్వరంతో ఉన్నారు. నేటితో (మే 9) ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలై 30 ఏళ్లయింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని విశేషాలను వైజయంతీ సంస్థ పంచుకుంది. ‘దినక్ తా ధినక్ రో’.. పాటకు వాహినీ స్టూడియోలో భారీ సెట్ వేశాం. షూటింగ్ అయిపోగానే శ్రీదేవి హిందీ సినిమా షూటింగ్‌కు ఫారిన్ వెళ్లిపోవాలి. కానీ చిరంజీవికి 104 డిగ్రీల హై ఫీవర్. రిలీజ్ డేట్ మే 9 అని ప్రకటించాం. చిరంజీవి హై ఫీవర్‌తోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. ఒక డాక్టర్ సెట్లో ఉండేట్లు ప్లాన్ చేసుకున్నాం. అనకున్న తేదీకి విడుదల చేయగలిగామంటే చిరంజీవియే కారణం. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతదర్శకుడు. ట్యూన్స్ అన్నీ మెలోడీవే. కానీ చిరంజీవి, శ్రీదేవి అంటే మాస్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా? రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వేటూరి ‘ఇదే ట్యూన్ ని మాస్ సాంగ్ చేస్తాను చూడండి’ అంటూ ‘అబ్బ నీ తీయనీ దెబ్బ’ అని రాశారు. ఈ పాటని రాఘవేంద్రరావు మైసూర్, బెంగళూర్లలో జస్ట్ రెండే రోజుల్లో ఫినిష్ చేశారు. కానీ ‘అందాలలో మహోదయం’ పాటకు మాత్రం 11 రోజులు పట్టింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌నీ మ్యాజికల్‌గా చూపించిన డీఓపీ విన్సెంట్ గారు, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం, ఎడిటింగ్ స్కిల్‌తో సినిమాకి సూపర్ టెంపోనిచ్చిన చంటి, పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు.. ఇలా ఎందరో. ఎన్నో రకాలుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ . ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్. -
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి
‘‘సముద్రమంత లోతున్న మంచితనం, శిఖరమంత ఎత్తున్న గొప్పతనం.. నా జీవితంలో మంచికీ చెడుకి మధ్య నిల్చున్న వ్యక్తి చిరంజీవి’’ అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘మెగాస్టార్– ది లెజెండ్’ పుస్తకాన్ని ‘కళాబంధు’ టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించి, దర్శకుడు రాఘవేంద్రరావుకి తొలి ప్రతిని అందజేశారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘హిమాలయాలంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి. అందుకే ఆయన 40 ఏళ్లుగా స్టార్‌గా ఉన్నారు. మరో 20 ఏళ్లు కూడా ఉంటారు’’ అన్నారు. ‘‘మొదటి 3–4 ఏళ్లే మేమిద్దరం బావ–బామ్మర్దిగా ఉన్నాం. ఆ తర్వాత స్నేహితుల్లా ప్రయాణించాం. చిరంజీవిగారితో నాది 40ఏళ్ల ఏమోషనల్ జర్నీ. కష్టపడే తత్వానికి నిదర్శనం ఆయన’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని పుస్తకంగా మలచడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఈ పుస్తకం వెనుక మూడేళ్ల ప్రయాణం ఉంది’’ అన్నారు వినాయకరావు. ‘‘చిన్నతనంలో నాన్న ఎంత కష్టపడి పని చేసేవారో చూసే అవకాశం మాకు దొరికేది కాదు. ఇప్పటికీ మాకు ఏం అందించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పుస్తకం ద్వారా నాన్నకు మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. వినాయకరావుగారికి మా కుటుంబం, అభిమానులందరి తరఫున ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్. మురళీమోహన్, దర్శకుడు బి.గోపాల్, వీవీ వినాయక్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను
‘‘సరిలేరు నీకెవ్వరు, ‘అల.. వైకుంఠపురములో, జాను’ చిత్రాలతో ఈ ఏడాది అప్పుడే ‘దిల్’ రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ అందమైన ప్రేమకథ. క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజలి’, నేను డైరెక్ట్ చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాల క్లైమ్యాక్స్ తర్వాత ‘జాను’ చిత్రం అంతలా కదిలించింది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తొలి రోజు నుంచి ఇటు ఇండస్ట్రీ నుండి అటు మీడియా, సోషల్ మీడియా, ప్రేక్షకుల నుండి మా ‘జాను’కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేమ్, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. శర్వానంద్, సమంత కళ్లతోనే నటించారు. మా బ్యానర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెబుతున్నారు. జనరల్‌గా సినిమాలు తీసేటప్పుడు లెక్కలు వేసుకుంటాను.. కానీ ‘జాను’కి లెక్కలు వేసుకోలేదు. ఇలాంటి సినిమాను ప్రోత్సహిస్తేనే మరిన్ని మంచి సినిమాలు చేయగలం’’ అన్నారు. ‘‘సినిమాని చూసిన వారందరూ చాలా పాజిటివ్‌గా స్పందించారు’’ అన్నారు సమంత. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. హిట్స్ కొడుతున్నా కానీ... నటుడిగా ఏదో మిస్ అయ్యాననే భావన మనసులో ఉండిపోయింది.. అది ‘జాను’తో తీరింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను’’ అన్నారు. దర్శకులు బి.వి.ఎస్. రవి, నందినీ రెడ్డి, పాటల రచయిత శ్రీమణి, రచయిత ‘మిర్చి’ కిరణ్ మాట్లాడారు. -
‘జాను’ థ్యాంక్స్ మీట్
-
ఇండస్ట్రీలోని త్రీ మంకీస్ మేమే
‘‘ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద వాళ్లున్నా నన్ను, మంచు లక్ష్మి, అలీని ఎందుకు పిలిచారు? మేం ముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని, ఇండస్ట్రీలో ఉన్న త్రీ మంకీస్ మేమే అని మమ్మల్ని పిలిచినట్టున్నారు’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. కారుణ్య చౌదరి హీరోయి¯Œ గా నటించారు. అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి నిర్మించిన ఈ సినిమా రేపువిడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు’ లాంటి టైటిల్స్ ఏ హీరోకి పెట్టినా సరిపోతాయి. ‘3 మంకీస్’ టైటిల్ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడం కంటే ‘జబర్దస్త్’ లో చేయడమే కష్టం’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీతో పాటు చిన్న దర్శకులు బాగుంటారు’’అన్నారు నటుడు అలీ. ‘‘మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు నగేష్. ‘‘ఇలాంటి పాత్ర చేస్తానని జీవితంలో అనుకోలేదు’’ అన్నారు రాంప్రసాద్. ‘‘మా ముగ్గురికీ ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ రాదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ ప్రపంచంలో సాయం అనే మందు లేక చాలా మంది చనిపోతున్నారని మా చిత్రంలో చెప్పాం’’ అన్నారు అనిల్. హీరో ఆకాష్ పూరి, కారుణ్య చౌదరి, రచయిత అరుణ్, కెమెరామేన్ సన్నీ మాట్లాడారు. -
కొత్త శౌర్యను చూస్తారు
‘‘నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గెడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు. గెడ్డం ఉంటే ఫైటర్‌గా ఉంటాడు. కీరిటం పెడితే కృష్ణుడిలా, క్యాప్ పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సక్సెస్‌ల సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది’’ అన్నారు ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు. నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్ కుటుంబ కథా చిత్రంలా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలా మంచిదని అంటుంటారు. మా సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు’’ అన్నారు నాగశౌర్య. ‘‘ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. ఓ మంచి కారణంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమణతేజ. ‘‘మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు నేను ఏదో ఒక కంప్లైట్ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు. రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు’’ అన్నారు ఐరా క్రియేషన్స్ డిజిటల్ డైరెక్టర్ గౌతమ్. ‘‘అవకాశాల కోసం ప్రయత్నించి ఇక ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. ‘ఛలో’ వంటి సూపర్ సక్సెస్ కొట్టిన నాగశౌర్య సినిమాకు నేను డైలాగ్స్ రాయడం ఏంటీ? అనుకున్నాను. శౌర్య ఓ సీన్ ఇచ్చి రాయమన్నారు. రాశాను. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ‘నువ్వు ఈ సినిమాకు రాస్తున్నావ్’ అన్నారు. చాలా సంతోషపడ్డాను’’ అన్నారు డైలాగ్ రైటర్ పరశురామ్. -
ఒక్కటయ్యారు
సినీ నటి అర్చన(వేద) వివాహం పారిశ్రామికవేత్త జగదీష్‌తో హైదరాబాద్‌లో జరిగింది. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, ‘కళాబంధు’టి. సుబ్బరామిరెడ్డి, నటుడు మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సురేష్ కొండేటి, డైరెక్టర్ ఓంకార్, నటీనటులు మంచు లక్ష్మి, మధుమిత, ఆలీ, శివబాలాజీ, సమీర్, అశ్విన్‌బాబు, రవిశంకర్, యాంకర్ సుమతో పాటు పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
ట్రైలర్ బాగుంది
హీరోయిన్ ఈషా రెబ్బా నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ మా సినిమాలో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత శ్రీనివాస్ కానూరు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, కెమెరామన్ ‘గరుడవేగ’ అంజి, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
రచయితలే లేకపోతే మేము లేము
‘‘నేను పరిచయం చేసిన రచయితలు.. ముఖ్యంగా సత్యానంద్, పరుచూరి బ్రదర్స్, భారవి, హరనాథ్‌బాబు, జంధ్యాలతో పాటు ఇతర రచయితలకు ధన్యవాదాలు. రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. రచయితలు అందరూ దర్శకులయ్యారు. అందుకనే కొత్త రచయితల్ని నమ్ముకోవాల్సిందే’’ అని ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘తెలుగు సినీ రచయితల సంఘం’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం ‘వజ్రోత్సవ వేడుకలు’ ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి చేతులమీదుగా సీనియర్ రచయితలు ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సినీపరిశ్రమలో దర్శక–నిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించేది, సన్నిహితంగా ఉండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌గారికి అది తెలిసిందే. రచయితలే లేకపోతే మేం లేం అనేది వాస్తవం. ఈ మధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్లాం. అక్కడ వెండి సింహాసనంపై సత్యానంద్‌ను కూర్చోబెట్టారు రాఘవేంద్రరావుగారు. అది చూశాక.. కరెక్టేకదా.. ఆ స్థానం అలంకరించే అర్హుడు సత్యానంద్ అనిపించింది. సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్‌గారు రాకపోవడం లోటుగా భావిస్తున్నా. వారిద్దరూ మనకు నిధి లాంటివారు. ‘మాయాబజార్’ నుంచి ఈ కాలం వరకు ఉన్నారు. వారిని సన్మానించుకునే అవకాశం నాకు ఇస్తే బాగుంటుంది’’ అన్నారు. నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ రచయితలు సరస్వతీ పుత్రులు. వారిని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదు. నేను మొదట అప్రెంటీస్‌గా పనిచేసింది ఎం.ఎం. భట్‌గారి దగ్గర. అక్కడే శ్రీశ్రీగారు పరిచయం. ఆ తర్వాత ఆరుద్రగారు. ఆయన ఎన్నో సిల్వర్‌జూబ్లీలు ఇచ్చారు. కానీ ఆరుద్రగారి చివరిరోజు ఏ నిర్మాత రాలేదు. తొలి అవకాశం కోసం నేను వెంటపడింది సత్యానంద్‌గారినే. నాకు తండ్రిలాంటి దాసరి నారాయణరావుగారు, సోదరుడు రాఘవేంద్రావుగారితో పాటు దర్శకుల ఆశీస్సులతోనే ఈ స్థితిలో ఉన్నా. మనకంటే ఎందరో అందగాళ్లు, మేథావులున్నారు. కళామతల్లి మనకు అవకాశం ఇచ్చింది.. దాన్ని కాపాడుకుందాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, డా.పాలకేడేటి సత్యనారాయణ, విజయేంద్రప్రసాద్‌లకు గౌరవ పురస్కారాలు అందజేశారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పోసాని కృష్ణమురళీ, ఆకుల చంద్రబోసు, సుద్దాల అశోక్‌తేజ, జెకె. భారవి, ఆకుల చిన్నికృష్ణ, అనంత శ్రీరామ్, భాస్కరభట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో పాటు పలువురు రచయితలకు విశిష్ట రచనా పురస్కారాలు అందించారు. -
మంచి కామెడీ
సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. యు.కె. ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించారు. ఈ చిత్రంలోని రెండవ పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘పాట చాలా బాగుంది. తప్పకుండా ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది’’ అన్నారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా బాగా నటించారు. దసరాకి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి, దర్శకులు విశ్వనాథ్‌గారు రిలీజ్ చేసిన మొదటి గీతానికి మంచి స్పందన వచ్చింది. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ‘‘చలపతి కొత్తవాడైనా అనుభవం ఉన్నవాడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు. -
నా జీవితంలో ఇదొక మార్పు
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వీవీ వినాయక్ ‘సీనయ్య’ చిత్రంతో తొలిసారి హీరోగా మారారు. నరసింహ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆది’ సినిమాతో వినయ్(వినాయక్)తో నా ప్రయాణం మొదలైంది. మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమా వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ చేశాం. ఈ సినిమా పేరే మా ఇంటిపేరుగా మార్చేంత హిట్ సాధించింది. 1982–1984 నేపథ్యంలో సాగే కంప్లీట్ ఎమోషనల్ స్టోరీ ‘సీనయ్య’. ఈ సినిమాలో ఎవర్ని హీరోగా అడుగుదామా? అనుకుంటున్న తరుణంలో మా సంస్థలో సినిమాలు చేసిన దర్శకులు గుర్తుకువచ్చారు. ఈ కథకు వినయ్ అయితే సరిపోతాడనిపించి నరసింహతో చెప్పగానే ఎగై్జటింగ్‌గా ఫీలయ్యాడు. ఆ తర్వాత వినయ్‌కు కథ చెప్పడంతో నటిస్తా అన్నాడు. ఈ కథలో భాగమైన హరిని భవిష్యత్‌లో దర్శకుడిగా పరిచయం చేస్తా. వచ్చే ఏడాది వేసవిలో ‘సీనయ్య’ విడుదల చేస్తాం’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘రాజుగారు ఓ రోజు వచ్చి...‘నువ్వు నన్ను ‘దిల్’ రాజుని చేశావ్. నేను నిన్ను హీరోని చేద్దాం అనుకుంటున్నా’ అన్నారు. నరసింహ చెప్పిన కథ నచ్చి, పాత్ర కోసం బరువు తగ్గాను. ఇప్పుడు ఎలాంటి దుస్తులైనా వేసుకోగలుగుతున్నా (నవ్వుతూ). జీవితంలో నాకు ఇదొక మార్పు’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్ కథ ఇది’’ అన్నారు నరసింహ. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సి.కల్యాణ్, డీవీవీ దానయ్య, అనిల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ, రచయిత హరి పాల్గొన్నారు. -
ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను
‘‘ఉండ్రాజవరంలోని నా స్నేహితుని ఇంట్లో మడత మంచం మీద పడుకొని పాట ఎలా తీయాలి అని సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. సెకనుకోసారి ఠంగ్, ఠంగ్ అని మోత వినిపించడంతో అతన్ని ‘ఏంటి’ అని అడిగాను. ఈ ఊళ్లో బిందెలు తయారు చేస్తారు అని చెప్పాడు. అంతే... పాట ఎలా తీయాలో ఐడియా తట్టింది’’ అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్ ప్లస్ పతాకంపై హరీశ్ శంకర్ దర్శకత్వంలో గోపీ అచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రీమిక్స్ చేసిన ‘దేవత’ చిత్రంలోని శోభన్‌బాబు, శ్రీదేవిల ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ‘దేవత’ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ పాటకు ఇంత కీర్తి ప్రతిష్టలు రావటానికి కారణం అయిన ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పాలి. వారు ముఖ్యంగా చిత్రనిర్మాత డి. రామానాయుడు, స్వరకర్త చక్రవర్తి, పాట రాసిన వేటూరి గారు. ఇప్పుడు ఈ పాటను చూపించిన టీమ్ అందరూ నన్ను 37 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ‘మీరు చేసిన బిందెల మధ్యలో శోభన్‌బాబు, శ్రీదేవి ఉంటారు... చాలా బిందెలు అవసరం అవుతాయి. అవి వాడుకొని మళ్లీ ఇచ్చేస్తాం’ అని చెప్పాను. బిందెలు తయారు చేసే ఆయన 1000 బిందెలను చేసి ఇచ్చారు. మనం ఈ రోజుకీ ఈ పాటను చెప్పుకుంటున్నాం అంటే ఎందరో చేసిన కృషి ఫలితమే ఇది. నేను నిర్మాత బావుండాలని కోరుకునే దర్శకుడిని. ఇన్ని బిందెల్లో పూజా హెగ్డే నడుము మీద పెట్టుకున్న బిందె నాకు ఇస్తే తీసుకెళ్తాను (నవ్వుతూ). నేను పూజను చూసిన మొదటిరోజే చెప్పాను. ఈ అమ్మాయి నంబర్‌వన్ హీరోయిన్ అవుతుందని. వరుణ్ గురించి చెప్పేదేముంది. ఆల్రెడీ పెద్ద హీరో అయ్యాడు. ఇప్పుడు నేను హీరోయిన్ పూజని ఏ పండుతో కొడతాను అంటే చెర్రీ పండుతో ఆమె నడుము మీద కొడతాను’’ అని చమత్కరించారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నా ఏడెనిమిదేళ్ల కల ఇది. 2019లో బిందెలతో పాట చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాను. యానంలో ఈ పాట షూట్ స్టార్ట్ చెయ్యగానే నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. శ్రీదేవిగారు చేసిన ఈ పాటలో పూజాని తప్ప ఎవరినీ ఊహించలేను. వరుణ్ చాలా బాగా డాన్స్ చేశాడు. నేను నిర్మాతలను 500 బిందెలడిగితే వాళ్లు నాకు 1500 బిందెలను ఇచ్చారు. ఇది వేటూరిగారు రాసిన పాట. ఈ పాట తీయటం రాఘవేంద్ర రావు లాంటి గురువుగారికి శిష్యుడు ఇస్తున్న పువ్వు ఇది. వేటూరిగారి లిరిక్స్‌ని వాడుకున్నందుకు ఆయన కుమారుడు వేటూరి రవిగారికి రెమ్యునరేషన్ ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను స్వతహాగా పాటలు, డాన్సులకు అంత కంఫర్ట్ కాదు. కానీ ఈ చిత్రంలో రీమిక్స్ సాంగ్ అనగానే చిరంజీవి గారిదో, పవన్ గారి పాటో ఉంటుంది అనుకున్నాను. కానీ, శోభన్‌బాబు గారి పాట అనగానే చాలా ఎగై్జట్ అయ్యాను. ఇంత బాగా రీక్రియేట్ చేస్తారనుకోలేదు. నేను బాలుగారి పాటలకు వీరాభిమానిని’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు గోపి అచంట, రామ్ ఆచంట, పూజా హెగ్డే, మిక్కీ. జె. మేయర్, అవినాష్, శేఖర్ మాస్టర్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ
దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని (మే 4) దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ (టీఎఫ్‌డీటీ)ను ఏర్పాటు చేయాలని ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు తీర్మానించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి వైద్యం, విద్య, కుటుంబ అవసరాలకు సహాయం చేసే విధంగా ఒక నిధిని ఏర్పాటు చేసి, ఈ డబ్బుపై వచ్చే వడ్డీతో అర్హులైన వారికి తోడ్పాటుని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముందుగా దర్శకులు రాజమౌళి 50 లక్షలు, దర్శకుడు రాఘవేంద్రరావు 10 లక్షలు, ఆర్కా మీడియా వారు 15 లక్షల విరాళం అందించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ ఆలోచనను మెచ్చి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుల సంఘం ప్యానెల్ మిగతా దర్శకుల సహాయ, సహకారాలతో ఈ టీఎఫ్‌డీటీ ట్రస్టును బుధవారం (24–07–2019) రిజిస్టర్ చేశారు. ‘‘టీఎఫ్డీటీకి మరింత మెరుగైన భవనం, లైబ్రరీ, ఫంక్షన్ హాల్, దర్శకత్వ శాఖలో ప్రావీణ్యత తరగతులు, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా కేటీఆర్‌గారికి జన్మదిన (జూలై 24) శుభాకాంక్షలు’’ అని టీఎఫ్‌డీటీ మేనేజింగ్ ట్రస్టీ ఎన్. శంకర్ పేర్కొన్నారు. రాఘవేంద్రరావు అధ్యక్షుడిగా ఉన్న ఈ సంఘంలో దర్శకులు వీవీ వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, వంశీపైడిపల్లి, మెహెర్ రమేష్, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్రసాద్, కాశీ, బి.వి.ఎస్. రవి ట్రస్టీ సభ్యులుగా, మెహెర్ రమేష్ ట్రెజరర్‌గా వ్యవహరిస్తారు. -
పిల్లల సక్సెస్ చూసినప్పుడే ఆనందం
‘‘మీ తాతయ్య(రాజేంద్రప్రసాద్) నవ్వించేవారు.. నువ్వు(సాయి తేజస్విని) భయపెడుతున్నావ్. ‘మహానటి’ చిత్రంతో నటన మొదలుపెట్టావు. మన సక్సెస్ కన్నా మన పిల్లల సక్సెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహించారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ కీలక పాత్రల్లో నటించారు. కమల్ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మించిన ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘నిర్మాతల్లో ఒకరైన బాషాకి రాఘవేంద్రరావు తెలుసు.. రాజమౌళి తెలుసు... అందరితోనూ పని చేశాడు. నా సినిమాలకు చాలా వరకు ఆయనే నేపథ్య సంగీతం అందించారు. నేపథ్య సంగీతం లేకపోతే సినిమానే లేదు. సావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్.. ఇలా ఏ పాత్రకైనా ప్రియమణి సరిపోతుంది’’ అన్నారు. నటుడు డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన కీరవాణిగారిని, ఆర్.పి. పట్నాయక్.. ఇంకా ఇంత మంచి మహానుభావులను ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. మా మనవరాలు గురించి నేను చెప్పకూడదు.. ప్రేక్షకులే ఈ సినిమా చూసి ఎలా నటించిందో చెప్పాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయినట్లే. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. తేజస్విని బాగా నటించింది’’ అన్నారు ప్రియమణి. ‘‘నేను చేసిన ‘అనగనగా ఓ దుర్గ’ చిత్రం చూసి బాషాగారు కథ చెప్పమన్నప్పుడు ‘సిరివెన్నెల’ కథ చెప్పాను. బాషాగారికి, బోరాగారికి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కుదిరింది’’ అన్నారు ఓం ప్రకాష్. ‘‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని బాషా, కమల్ బోరా అన్నారు. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి, ఆర్.పి. పట్నాయక్, నిర్మాత సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
సమంత.. 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి!
మహానటి, రంగస్థలం, మజిలీ, యూటర్న్, తమిళంలో సూపర్‌డీలక్స్ ఇలా ప్రతీ సినిమాతో సక్సెస్ కొడుతూ.. నటిగా మరో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ను హైస్పీడ్‌తో దూసుకుపోయేలా చేస్తోంది సమంత. పెళ్లి చేసుకున్నాక సమంత రూటే మారిపోయింది. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. తనలోని నటిని కొత్తగా ఆవిష్కరించేందుకు.. వచ్చే నెలలో ‘ఓ బేబీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్దాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అయితే సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. నెటిజన్లతో పాటు, సెలబ్రెటీలు కూడా ట్రైలర్‌కు లైక్‌లు కొడుతూ.. షేర్ చేస్తున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఈ ట్రైలర్‌పై స్పందిస్తూ సమంత డెబ్బై ఏళ్ల బామ్మల నటించింది అనడం కంటే డెబ్బై ఏళ్ల అనుభవం ఉన్న నటిలా చేసిందంటూ పొగడ్తల వర్షం కురింపించారు. ‘ నేను ఓ బేబీ సినిమా చూశాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్‌గా ఉంది. సమంత డెబ్బై ఏళ్ల బామ్మగా చేసింది అనడం కన్నా డెబ్బై ఏళ్ల అనుభవం ఉన్న నటిగా చేసింది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది’ అని ట్వీట్ చేస్తూ.. ట్రైలర్‌ను షేర్ చేశారు. ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. -
ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్లలతో!
నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR’ అంటూ ట్వీట్ చేశారు రాఘవేంద్ర రావు. 2017లో రిలీజ్ అయిన ఓం నమో వేంకటేశాయ సినిమా తరువాత రాఘవేంద్ర రావు మరో సినిమా చేయలేదు. ఒక దశలో ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకున్నట్టే అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబందించిన ఎనౌన్స్మెంట్ రావటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR pic.twitter.com/pJoD8vSFYD — Raghavendra Rao K (@Ragavendraraoba) 28 May 2019 -
కామెడీ అండ్ ఫాంటసీ
‘ఈ నగరానికి ఏమైంది?’ ఫేమ్ సాయి సుశాంత్, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రాఘవేంద్ర వర్మ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు బీఏ సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్ హన్నుర్కర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ–ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సాయి, సిమ్రాన్, చాందిని.. ఇలా ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు కుదిరారు. మంచి సాంకేతిక నిపుణులతో తెరెక్కిస్తున్నాం’’ అన్నారు విశ్వాస్. తనికెళ్ల భరణి, ప్రియదర్శి, మకరంద్ దేశ్ పాండే, శిశిర్ వర్మ, ఝాన్సీ, వినీత్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు బి. జోష్ సంగీతం అందిస్తున్నారు. -
చిన్న సినిమాగా చూడొద్దు
‘‘ప్రాణం ఖరీదు’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఈ రోజుల్లో బాగా చదువుకున్నవాళ్లు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా మంచి ఆలోచనలు, చక్కటి కథ, స్క్రీన్‌ప్లేతో ఇండస్ట్రీకి వస్తున్నారు.. వారందరికీ స్వాగతం. ‘ప్రాణం ఖరీదు’ చిత్రాన్ని చిన్నదిగా చూడొద్దు. మంచి సినిమాలను ఆదరిస్తే ఇంకా మంచి కుర్రోళ్లు హీరోలుగా, డైరెక్టర్‌గా, రైటర్స్‌గా వస్తారు’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ప్రశాంత్ మాట్లాడుతూ–‘‘నేను అడగ్గానే పెద్ద మనసుతో మా ‘ప్రాణం ఖరీదు’ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన రాఘవేంద్రరావుగారికి కృతజ్ఞతలు. మా టీమ్ ఎంతో కష్టపడి విరామం లేకుండా ఇండియాలో ఈ సినిమా చిత్రీకరించాం. ఈ నెల 15న చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. షఫి, జెమినీ సురేష్,‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన, కెమెరా: మురళి మోహన్ రెడ్డి, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్. -
అనిల్ సినిమాలు చూస్తే జిమ్‌కు వెళ్లక్కర్లేదు
‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇలా షీల్డ్స్ ఇవ్వడం చూసి చాలా ఏళ్లయ్యింది. ‘దిల్’ రాజు మంచి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఇక అనిల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు కూడా వెళ్లనక్కర్లేదు’’ అని దర్శకులు కె. రాఘవేంద్రరావు అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘ఎఫ్ 2’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్–లక్ష్మణ్ నిర్మించిన ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా, రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నా సినిమాల్లో ‘పెళ్ళిసందడి, గంగోత్రి’ సినిమాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. వెంకటేష్ గత సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువగా నవ్వించాడు, వరుణ్ కూడా మంచి నటనను కనపరిచాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోవడానికి ముఖ్య కారణం అనిల్. మా హీరోలిద్దరూ బిజీగా ఉండటం, అనిల్ తన నెక్ట్స్ మూవీకి, అలాగే మేం నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఆల్రెడీ బిజీగా ఉన్నా... ఈ వేడుక చేయడానికి నిర్ణయించుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఎక్కడా గ్యాప్ లేకుండా కామెడీతో అనిల్ ఇరగొట్టేశాడు. టాలెంట్‌ను వెతికి పట్టుకుని, ఎంకరేజ్ చేయడం ‘దిల్’ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. నవ్విస్తే చాలు.. ప్రేక్షకుడు లాజిక్, మేజిక్ల గురించి ఆలోచించడు’’ అన్నారు యస్వీ కృష్ణారెడ్డి. ‘‘ఈ సినిమాకు సంబంధించి ఈ షీల్డుని చూస్తే .. దీనికి సంబంధించిన జ్ఞాపకం మైండ్‌లో రీల్లా తిరుగుతుంది. అందుకనే ఈ ఫంక్షన్ చేశాం. 107 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు.. 130 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసిన సినిమా ఇది. ‘నువ్వునాకు నచ్చావ్’ లాంటి ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాను వెంకటేష్‌గారు చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనకు మరోసారి తెలిసింది. వరుణ్‌తేజ్ కామెడీజోనర్లో చేసిన తొలి చిత్రమిది. అలాగే తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్‌గారు, ఇలా ప్రతి ఆర్టిస్ట్‌కు, సాంకేతిక నిపుణలకు థాంక్స్.రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు కుటుంబతో సమానం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నా 10వ సినిమా బెస్ట్ మూవీగా నిలవడం, సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం పట్ల çసంతోషంగా ఉన్నాను’’ అన్నారు మెహరీన్. -
యువత మనోభావాలకు అద్దం పట్టేలా ఉంది
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే’ అనేది ఉపశీర్షిక. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 30న ఆడియోను, వచ్చే నెల రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రవాస భారతీయుడైన ఉదయ్‌కుమార్‌గారు నిర్మించిన ఈ చిత్రం టీజర్ యువతరం మనోభావాలకు అద్దం పట్టేలా ఉంది. సత్యానంద్ శిష్యరికం కాబట్టి హీరోగా ఈశ్వర్ చక్కని ప్రతిభ కనబరిచాడు. ఈశ్వర్‌కు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. ఉదయ్‌కుమార్–రఘురాజ్లు ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారి చేతులమీదుగా మా సినిమా టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈశ్వర్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘రాఘవేంద్రరావుగారి చేతులమీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవ్వడం శుభసూచికం. ప్రేమ, పెళ్లి విషయాల్లో నేటియువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాస్తవాలు ఏంటి? అనే అంశాలను సినిమాలో చూపించాం’’ అని రఘురాజ్ అన్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు. -
దర్శకేంద్రుడి సారథ్యంలో డాన్స్ డాక్యుమెంటరీ
విద్య, విజ్ఞానం, సంస్కృతి, కళల ద్వారా సమాజ సేవ చేయడమే లక్ష్యంగా గత 10 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్న పద్మా మోహన్ గారి సారధ్యంలో రూపొందిన డాక్యుమెంటరీ చిత్రం ‘ఆధ్యాత్మ రామాయణం- బాలకాండ’. ఆంధ్ర నాట్యం మీద అవగాహన కల్పించడానికి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలతో ఈ డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను శ్రీమతి దెందులూరి పద్మామోహన్, ఆమె కుమార్తె దెందులూరి మూర్తి అఖిల జ్యోతి స్వయంగా నర్తించి సమర్పిస్తున్నారు. కళాకృష్ణ నృత్య దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాణ నేతృత్వ సారధ్యంలో మీర్ దర్శకత్వంలో ఈ డాక్యమెంటరీ రూపొందింది. దీనికి సంబంధించిన పాత్రికేయుల సమావేశంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య విశిష్ట కృషి పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అందజేశారు. రామకమల్ ల్యాబ్స్ ప్రొప్రైటర్ పి.ఎస్.శ్రాస్త్రి, ప్రఖ్యాత హరికథా విద్వాంసురాలు శ్రీమతి ఉమామహేశ్వరి, ప్రముఖ యోగా శిక్షకులు జి.చంద్రకాంత్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘మన పిల్లలకి సంస్కృతి, సంప్రదాయాలు, కళలను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అవశ్యకతను గుర్తించి ఓ షౌండేషన్‌ను స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నళినీ మోహన్, పద్మా మోహన్‌లకు అభినందనలు తెలుపుతున్నాను’ అన్నారు. నృత్య దర్శకుడు కళా కృష్ణ మాట్లాడుతూ - ‘నాట్యంలోని అభిరుచి గురించి ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్న దెందులూరి ఫౌండేషన్‌కు నా సహకారం ఎప్పుడూ ఉంటుంద’న్నారు. -
ఆర్ట్ డైరెక్షన్ టు డైరెక్షన్
మహేశ్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా రిలీజైనప్పుడు అందులో వేసిన చార్మినార్ సెట్ గురించే మాట్లాడారు. ఆ సినిమాకి ఆ సెట్ కీలక పాత్ర వహించింది. ఇప్పుడెందుకు ఆ సెట్ గురించి అనుకుంటున్నారా! ఏమీ లేదు.. ఆ చిత్ర కళాదర్శకుడు అశోక్ కోరలత్ దర్శకునిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్టం’. ఏ.కె మూవీస్ పతాకంపై ఆషా అశోక్ నిర్మిస్తున్నారు. కళా దర్శకునిగా భారత దేశంలోని అన్ని ముఖ్య భాషల్లో దాదాపు 150 పై చిలుకు చిత్రాలకు పని చేశారు అశోక్. ఐదు నంది అవార్డులను కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఆయన దర్శకుడిగా మారి, తెరకెక్కించిన ‘ఇష్టం’లో రామ్‌కార్తీక్, పార్వతి అరుణ్ హీరో హీరోయిన్లు. సినిమా మొత్తం పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అశోక్. కె మాట్లాడుతూ– ‘‘ఇదో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. చిత్రంలోని ప్రేమకథ కూడా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఆడియోను, సినిమాను రిలీజు చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. విజయం అందుకుంటామన్న దీమా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : వివేక్ మహాదేవ. -
‘ఆ సినిమా హిట్టవ్వడం నా దురదృష్టం’
‘హిమ్మత్వాలా’ సినిమా.. అందులోని.. ‘నయినోం మే సప్నా.. సప్నోం మే సజ్నా’ పాట ఎంతగా హిట్టయ్యాయో సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే తమన్నా- అజయ్ దేవగణ్ జంటగా ఈ సినిమాను మరోసారి రీమేక్ చేశారు కూడా. ‘ఊరికి మొనగాడు’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే సినీ అభిమానుల గుండెల్లో కొలువైన అందాల నటి శ్రీదేవి మాత్రం.. హిమ్మత్వాలా సినిమా హిట్టవ్వడాన్ని తన దురదృష్టంగా భావించారట. తనకు తొలి విజయాన్ని అందించిన సినిమా ఫక్తు కమర్షియల్ సినిమా కావడంతో ఆమె కాస్త నిరాశ చెందారట. ఈ విషయాన్ని ‘శ్రీదేవి : క్వీన్ ఆఫ్ హర్ట్స్’ అనే పుస్తకంలో పొందుపరిచారు. దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగిన శ్రీదేవి ‘సోల్వా సావన్’ అనే సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో నాలుగేళ్ల పాటు బాలీవుడ్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత 1983లో శ్రీదేవి- జితేంద్ర జంటగా తెరకెక్కిన హిమ్మత్వాలా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రూపొందించిన ఈ సినిమాతో శ్రీదేవి గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు పొందారు. అయితే కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కావాలని ఆమె అనుకోలేదట. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘ తమిళ ప్రేక్షకులు నా సహజ నటనను ఇష్టపడతారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకుల అబిరుచి వేరు. సద్మా(వసంత కోకిల రీమేక్) ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు నన్ను గ్లామరస్ పాత్రల్లో చూడాలని ఫిక్స్ అయ్యారు. అందుకే హిమ్మత్వాలా సక్సెస్‌ను నా దురదృష్టంగా భావిస్తా. కానీ ఏదో ఒకరోజు నాలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుందని ఆమె అన్నట్లు ‘శ్రీదేవి’ పుస్తకంలో పేర్కొన్నారు. కాగా హిందీలో శ్రీదేవి తొలి హిట్ హిమ్మత్వాలా 35వ వార్షికోత్సవానికి ఒకరోజు ముందుగానే ఆమె మరణించడం గమనార్హం. -
గుండెను తడిమేలా ఘంటసాల ది గ్రేట్
‘‘ఘంటసాల అంటే పాట. పాట అంటే ఘంటసాల అని మనందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియజేసేదే ఈ చిత్రం’’ అని ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. ఘంటసాల పాత్రను గాయకుడు కృష్ణచైతన్య పోషించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో ఆయన సతీమణి లక్ష్మీ నీరజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్స్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. డిసెంబర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘‘రామారావు చేసిన ఈ సాహసాన్ని అభినందించాలి. పాత్రల గురించి బాగా స్టడీ చేసి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘బయోపిక్‌లు తీయడం చాలా కష్టం. గట్స్ ఉండాలి. ఇందులో హీరోగా ఓ పాత్ర చేశాను. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా రామారావు వర్క్ చేశారు’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గొప్ప విజయాలను నమోదు చేయడమే కాకుండా గుండె తడి చేసి, గుండెను తడిమేసే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అన్నారు సుదర్శన్. ‘‘నేను చాలా చిన్నవాణ్ని. మొదట ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇప్పుడు అలా ఎందుకు అన్నానా అనిపిస్తోంది. ఘంటసాలగారి పాటలు విన్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాం’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘ఘంటసాలగారి మీద ఆరాధనతో ఈ సినిమా తీశాను. మా కష్టాన్ని అభినందిస్తారనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు వాదనల. -
నాన్న గర్వపడేలా చేస్తా
‘‘మా అబ్బాయి సత్యానంద్‌గారి వద్ద యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. నేనున్న ఫీల్డ్‌లోకే తను కూడా రావడం హ్యాపీ’’ అని నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఆయన తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. మరో డైరెక్టర్ హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘విజయ్ నన్ను సలహా అడిగినప్పుడు ‘నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్.. చిరంజీవిగారిలా కష్టపడు. ఆయనలా సేవాగుణం కలిగి ఉండు’ అని చెప్పా. 32 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు మా అబ్బాయ విజయ్‌ని కూడా అదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘చంద్రశేఖర్ ఏలేటిగారి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా డైరెక్షన్ చేస్తున్నా. హారర్ జానర్లో సాగే కామెడీ థ్రిల్లర్ ఇది’’ అన్నారు కె. రమాకాంత్. ‘‘నేను హీరో అవడానికి అమ్మానాన్నల సపోర్ట్‌తో పాటు మా మామయ్య సపోర్ట్ ఉంది. నాన్న గర్వపడేలా చేస్తానన్న నమ్మకంతో హీరోగా తొలి అడుగు వేస్తున్నా’’ అన్నారు విజయ్ రాజా. రచయితలు పరుచూరి బ్రదర్స్, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ ప్రకాష్ అన్నంరెడ్డి, హీరోలు శ్రీకాంత్ , తరుణ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల. -
మహాద్భుతం
‘‘సావిత్రిగారి గురించి రాసే అర్హత తెచ్చుకున్నాకే ఆమె కథ రాస్తా’... ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణి ఇలానే అంటుంది. కానీ సావిత్రి లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాక, ఇన్స్పైర్ అయ్యి అనుభవం పెరిగే వరకూ ఆగకుండా రాస్తుంది. ఆ మాటకొస్తే.. ‘మహానటి’ తీయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ వయసు, అనుభవం ఎంత? చాలా చాలా తక్కువ. అయినా కన్విక్షన్, ప్యాషన్ ఉంటే వయసు, అనుభవంతో పనేంటి? పైగా సావిత్రి లైఫ్ హిస్టరీ తెలుసుకున్నాక నాగ్ అశ్విన్‌కి ఆమె అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అదే ‘మహానటి’ జీవితాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేలా చేసింది. టైటిల్ రోల్లో కీర్తీ సురేష్, జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ తదితర తారలతో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘నాగ్ అశ్విన్ బ్రహ్మాండంగా తీశాడు.. కీర్తీ నటన అద్భుతం’ అంటు న్నారు. ట్వీటర్ ద్వారా కొందరు ప్రముఖులు తమ అనుభూతిని పంచుకున్నారు. 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (మే, 9) భారీ వర్షం. చాలా పెద్ద సినిమా (జగదేక వీరుడు అతిలోక సుందరి) తీశామనే ఆనందం. ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు.. ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు. మరుసటిరోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. మా అశ్వనీదత్‌గారికి ఆ రోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. సరిగ్గా అదే రోజున ‘మహానటి’ విడుదలైంది. ఆ రోజున ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో ఈ రోజు ‘మహానటి’ నిర్మించడానికీ అంతే ధైర్యం కావాలి. సావిత్రిగారి చరిత్రను తరతరాలకు అందించిన స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్‌కి ధన్యవాదాలు. సావిత్రి పాత్రలో కీర్తీ జీవించింది. జెమినీ గణేశన్‌గా దుల్కర్ నటన అద్భుతం. నాగ్ అశ్విన్, చిత్ర యూనిట్‌కు నా అభినందనలు. – దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మహానటి క్లాసిక్, ఇన్స్పిరేషనల్ బయోపిక్. కీర్తీ సురేశ్ ‘మాయాబజార్’ డ్యాన్స్‌లతో సావిత్రిగారిని తిరిగి తీసుకువచ్చింది. సమంతా అదరగొట్టింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి క్లాసిక్ మాకు అందించినందుకు వైజయంతీ మూవీస్‌కు స్పెషల్ థ్యాంక్స్. – ‘మెర్సల్’ ఫేమ్ దర్శకుడు అట్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ పెర్ఫార్మెన్స్ నేను చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ల్లో ఒకటి. కేవలం ఇమిటేటింగ్ కాదు, సావిత్రి గారి పాత్రకు ప్రాణం పోసింది. దుల్కర్ ఈజ్ ఫెంటాస్టిక్. నేను అతని ఫ్యాన్ అయిపోయా. కంగ్రాట్స్ నాగ్ అశ్విన్, స్వప్నా. మీ నమ్మకం, డిటర్మినేషన్ అద్భుతం. – దర్శకుడు రాజమౌళి థ్యాంక్యూ నాగ్ అశ్విన్.. ఈ సినిమా తీసినందుకు. సావిత్రిగారు అమరులు. నీ రైటింగ్, నీ రీసెర్చ్, నీ స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు. నాగీ ఆలోచనను, అతని కన్విక్షన్‌ను నమ్మి ఈ సినిమాను నిర్మించినందుకు స్వప్నా, ప్రియాంకకు కంగ్రాట్స్. టేక్ ఏ బౌ గర్ల్స్. సమంతా.. ఇలాంటి పాత్ర ఎంచుకోవడం గ్రేట్. నీ రోల్‌ను కమాండబుల్గా చేశావు. క్లైమాక్స్‌లో నీ నటన చాలా రోజులు గుర్తుండిపోతుంది. – దర్శకుడు వంశీ పైడిపల్లి నాగ్ అశ్విన్ నన్ను సావిత్రిగారి ఎరాలోకి తీసుకువెళ్లిపోయారు. ఏం సినిమా... ఇలాంటి పాత్ర చేసే అవకాశం కీర్తీ సురేశ్‌కి రావడం నిజంగా బ్లెస్డ్. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చైతన్య సూపర్బ్. స్వప్నా అండ్ టీమ్‌కు కంగ్రాట్స్. – దర్శకుడు మారుతి నాగ్ అశ్విన్, స్వప్నా, వైజయంతి మూవీస్ బోల్డ్ ఆలోచన ఇది. అద్భుతమైన నటీనటులతో సినిమా ఎగ్జిక్యూట్ చేశారు. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నా. ప్రతి ఒక్కరి నటన నచ్చింది. ‘కీర్తీ యూ కిల్డ్ ఇట్’. సమంతా.. నన్ను ఏడిపించేశావ్. దుల్కర్.. నువ్వు సూపర్. మోహన్‌బాబుగారు, విజయ్, క్రిష్, ప్రకాశ్ రాజ్ అందరూ కన్విన్సింగ్‌గా చేశారు. తాత రోల్లో చైతన్యను చూడటం హ్యాపీగా ఉంది. హార్ట్ ఈజ్ హ్యాపీ. – సుశాంత్ -
చంద్రబాబుకు టాలీవుడ్ మద్దతు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టాలీవుడ్ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా నిలుస్తామని తెలుగు సినీ పరిశ్రమ తెలిపింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కె. రాఘవేంద్రరావు, అశ్వినీదత్, కెఎల్ నారాయణ, కె వెంకటేశ్వర్రావు, జెమిని కిరణ్, జీకే తదితరులు చంద్రబాబుని శుక్రవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అఖిల పక్షం పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏప్రిల్ 6 వరకు నల్లబ్యాడ్జీలు ధరించనున్నట్టు సినీ ప్రముఖలు తెలిపారు. -
బాలనటి నుంచి మహానటి వరకు...
సాక్షి, సినిమా : శ్రీదేవికి స్టార్ స్టేటస్ అందించటంలో ముఖ్య పాత్ర పోషించిన దర్శకులెవరంటే ముందుగా వినిపించే పేరు కే రాఘవేంద్ర రావుదే. దర్శకేంద్రుడి డైరెక్షన్లోనే పదహారేళ్ల వయసు చిత్రంతో ఆమె హీరోయిన్గా మారారు. ఆపై ఆయన తెరకెక్కించిన వేటగాడు, జస్టిస్ చౌదరి, గజదొంగ, కొండవీటి సింహం, దేవత, జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆమె హఠాన్మరణ నేపథ్యంలో ఆయన స్పందించారు. పదహారేళ్ళ వయసు నుంచి అతిలోక సుందరి వరకు.... తెలుగు తమిళ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు... శ్రీదేవి అధిరోహించని మైలు రాయి లేదంటే అతిశయోక్తి కాదు...అంటూ ట్వీట్ చేశారు. ‘బాలనటి నుంచి మహానటి వరకు నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి హఠాన్మరణం అత్యంత బాధాకరం . భారతీయ చిత్ర పరిశ్రమ కి తీరని లోటు.. ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. -
నాటకాలను బతికిద్దాం – రాఘవేంద్రరావు
‘‘మనకు తెలిసి రాజులెందరో ఉంటారు. ఆ రాజుల్లో రారాజు రామానాయుడుగారు. నార్త్ ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంతో ౖÐð భవం తీసుకొచ్చారా యన’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రజతోత్సవ వేడుకల్లో భాగంగా డా. డి. రామానాయుడు 3వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో ‘మా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నాటక రంగం నుంచి సినిమారంగానికి వచ్చిన నటుడు జయప్రకాశ్‌రెడ్డిని సన్మానించారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మరుగున పడిపోతున్న నాటకాలను బయటకి తీసుకురావాలి. నాటకాలను బతికించి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొత్త కళాకారులు బయటికొస్తారు’’ అన్నారు. ‘‘నా కల్యాణ మండపం కార్ల షెడ్లా అయిపోతోంది. అందులో నాటకాలు వేయించండి’ అని రామానాయుడుగారు చనిపోయే ముందు నాతో అన్నారు. ‘రామానాయుడు కళా సమితి’ ఏర్పాటు చేసి నాటకాలను ప్రోత్సహించ నున్నాం. ఈ సమితిలో సభ్యత్వం తీసుకొని నాటకరంగ అభివృద్ధికి తోడ్పడాలి’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘భారతదేశ చలనచిత్ర రంగానికి రామానాయుడుగారు ఓ మోనార్క్. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్ అయిన ఆయన ఓ మహాసముద్రం’’ అన్నారు నటుడు ఆర్. నారాయణ మూర్తి. ‘‘మా నాన్నగారు స్థాపించిన సంస్థ ఈ స్థాయిలో ఉందంటే ఎందరో దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులే కారణం’’ అన్నారు నిర్మాత డి.సురేశ్‌బాబు. ‘‘నలుగురు సన్మాన గ్రహీతలకు ఒక్కొక్కరికి 11వేల నగదును దర్శకుడు హరీష్‌శంకర్ అందించారు’’ అన్నారు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా. నటులు కోటా శ్రీనివాసరావు, విద్యాసాగర్, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్, ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బెనర్జీ, కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ, ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. -
పసి వయసుకి యుక్తవయసుకి మధ్య...
పసి వయసుకి.. యుక్త వయసుకి మధ్య గున్న ప్రాయంలో ఉన్న కొంతమంది స్నేహితుల కథతో రూపొందుతోన్న చిత్రం ‘గున్న’. సాలగ్రామ్ సినిమా పతాకంపై విప్లవ్.కె దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం నేపథ్యాన్ని, పాత్రల స్వభావాన్ని తెలిపేందుకు తయారు చేయించిన ప్రీ–పోస్టర్, లోగోను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఆవిష్కరించి, ‘‘లోగో డిజైన్ బాగుంది. టీమ్‌కి మంచి పేరు రావాలి’ అన్నారు. ‘‘ఎనిమిది నెలలుగా ప్రధాన పాత్రల ఎంపిక జరుగుతోంది. సామ్రాట్, ప్రజ్ఞాత, నిఖిల్, ఆర్మాన్ , మెహక్, ఐశ్వర్యలను ఎంపిక చేశాం. త్వరలో మిగిలిన ఇద్దరు ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసి, మార్చిలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. కేయస్వీ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కాస్టింగ్ డైరెక్టర్: హర్ష ఉప్పలూరి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, పాటలు: డా. జివాగో, డిఓపి: భరణి.కె.ధరన్ , ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, నిర్మాణ నిర్వాహణ, లైన్ ప్రొడ్యూసర్: సి.హెచ్.వి.ఎస్.ఎన్ .బాబ్జీ. -
'ఆ వార్తల్లో నిజం లేదు'
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను భాద్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఖండించారు. గత రెండు మూడు రోజులుగా కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సన్నిహితులు అభినందనలు తెలిపారు. అయితే ఈ విషయంపై బయట వస్తున్న వార్తల్లో నిజం లేదని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఎస్వీఎస్సీ ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్నానని.. మరిన్ని వైవిధ్యమైన కార్యక్రమాలతో అలరిస్తూ స్వామి సేవలో తరలించాలన్నదే తన కోరిక అని దర్శకేంద్రుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు మెంబర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
స్వామి ఆవిష్కరణ..
అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కతున్న భక్తిరస ప్రధాన చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. స్వామి ఆవిష్కరణ అంటూ వేంకటేశ్వరుడి పాత్ర పోషిస్తున్న నటుడు సౌరభ్‌ను పరిచయం చేశారు. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబాగా కనిపించనున్న విషయం తెలిసిందే. రేపే శ్రీవారి దర్శనం అంటూ శుక్రవారం రాఘవేంద్ర రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎప్పటికప్పుడు చిత్ర షూటింగ్ విశేషాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఓం నమో వెంకటేశాయ' శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది. -
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం
-
నాగార్జున, కీరవాణితో నాలుగోసారి..
హైదరాబాద్: అన్నమయ్య, రామదాసు, షిర్డీ సాయిబాబా వంటి భక్తిరస ప్రధానమైన చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మరో అపూర్వమైన భక్తి చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. హీరో నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణితో జత కట్టి ‘నమో వెంకటేశయా’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ నెల 25న (శనివారం) ముహూర్తం షాట్ తో ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్టు ఆయన ట్విట్టర్ లో తెలిపారు. ‘ఈ రోజే నేను, నాగార్జున, తిరుమల దర్శనం చేసుకుని తిరిగొచ్చా. నాగార్జున, కీరవాణిలతో నా నాలుగో భక్తిరస చిత్రాన్ని ఈ నెల 25న ముహూర్తం షాట్ తో ప్రారంభించబోతున్నాం’ అని తెలిపారు. గడ్డం లేకుండా తొలిసారి.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గడ్డం లేకుండా సాధారణంగా కనిపించరు. కానీ తాజాగా ఆయనే స్వయంగా ట్విట్టర్ లో గడ్డం లేని ఫొటోను పెట్టారు. తాను గడ్డంతో కనిపించడం వెనుక ఉన్న సంప్రదాయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ‘జ్యోతి సినిమా అప్పట్నుంచి ప్రతీ సినిమా మొదలు పెట్టినప్పుడు గడ్డం తీసేసి.. షూటింగ్ పూర్తి అయిన రోజునే మళ్ళీ తీస్తాను. అదే సాంప్రదాయాన్ని ఈ సినిమాకి (నమో వెంకటేశాయ) కూడా కొనసాగించాలనుకుంటున్నాను’ అని ట్విట్టర్ లో తెలిపారు. -
నాగార్జున కొత్త సినిమా పేరు ఖరారు
తిరుమల: అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు 'ఓం నమో వెంకటేశాయ' పేరు ఖరారు చేశారు. నాగార్జున, రాఘవేంద్రరావు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబా పాత్ర పోషించనున్నారు. ఈ నెల 25న సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందిస్తున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది. -
ఒక అన్నయ్య రాజు.. ఇంకో అన్నయ్య మంత్రి
‘‘నా సక్సెస్ఫుల్ జర్నీలో కీరవాణి, రాజమౌళి తండ్రులకు భాగముంది. నాతో పనిచేసిన కీరవాణి, రాజమౌళి మంచి విజయాలు అందుకున్నారు. వారి సక్సెస్‌లు చూసి ఓ తండ్రి, గురువులా ఆనంద పడుతున్నా. కాంచి కూడా వారిలాగే సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. నటుడిగా, రచయితగా ప్రేక్షకులకు పరిచయమైన ఎస్ఎస్ కాంచి దర్శకత్వం వహించిన చిత్రం ‘షో టైమ్’. రణ్‌ధీర్, రుక్సర్ మీర్ జంటగా జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. రాజమౌళి మాట్లాడుతూ- ‘‘మా కుటుంబంలోని 13మంది కజిన్స్లో కీరవాణి అన్నయ్య కింగ్ అయితే కాంచి అన్నయ్య మంత్రి. టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను హీరో అవ్వాలనే తపనతో పూజలు చేసేవాణ్ణి. హీరో అవ్వాలనుందనే విషయాన్ని సిగ్గుతో ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కాంచి అన్నయ్య ఏమవుదామనుకుంటున్నావు? అని అడిగితే హీరో కావాలనుందని చెప్పా. హీరో అవ్వాలంటే ఊర్లో ఉంటే ఎలా? ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి నాకు గైడ్‌లా వ్యవహరిం చారు. ఆయన ఎప్పుడో దర్శకుడవ్వాల్సింది.. ఇప్పుడయ్యారు. ఫస్ట్ లుక్ టీజర్‌తోనే కట్టిపడేశారు. ట్రైలర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు. కాంచి మాట్లాడుతూ- ‘‘దర్శకత్వం చేయాలన్నది నా కల కాదు కానీ, ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘భారతీయ సినిమా ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే నా ఆశ. అందులో భాగంగానే ‘షో టైమ్’ నిర్మించా. హాలీవుడ్ నటుడు జాకీచాన్‌తో ఓ చిత్రం నిర్మించబోతున్నా’’ అని సుధీర్ పూదోట చెప్పారు. -
సన్యాసినిగా స్వీటీ?!
‘బాహుబలి’ సినిమాలో డీ-గ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ మలి భాగంలో అనుష్క గ్లామరస్‌గా కనిపించనున్నారు. మధ్యలో ‘సైజ్ జీరో’ సినిమా కోసం 20 కిలోల బరువు పెరిగి ‘చక్కనమ్మ కొంచెం లావెక్కినా అందమే’ అని నిరూపించారు. ప్రస్తుతం చేస్తున్న ‘భాగమతి’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కోసం మళ్లీ సన్నగా నాజూగ్గా తయారయ్యారు స్వీటీ. ఇలా విభిన్న రకాల పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళుతున్న అనుష్క మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం. నాగార్జున ప్రధాన పాత్రలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో అనుష్క సన్యాసిని పాత్రలో కనిపించనున్నారట. ఇదే గనక నిజమైతే స్వీటీ కెరీర్లో ఇదొక వెరైటీ రోల్‌గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. -
పాఠాలు మొదలెట్టిన దర్శకేంద్రుడు
సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, తన అనుభవాన్ని పాఠాలుగా నేర్పించడానికి సిధ్దమయ్యారు. చాలా కాలం క్రితమే కెఆర్ఆర్ క్లాస్రూమ్ పేరుతో ప్రొమో రిలీజ్ చేసిన దర్శకేంద్రుడు. తాజాగా తన తొలి ఎపిసోడ్‌ను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్లో దర్శకుడు కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..? స్క్రీప్ట్ ను ఎలా అర్థం చేసుకోవాలి..? తానెలా డైరెక్టర్ అయ్యాను..? అనే అంశాలను ప్రస్థావించారు. అంతేకాదు ఎపిసోడ్ చివరలో.. తన ముందున్న టేబుల్ మీద నంది అవార్డుతో పాటు డబ్బుల కట్టలను ఎందుకు పెట్టానో కామెంట్ చేయండి అంటూ ప్రేక్షకులకు పజిల్ వేశారు. దర్శకేంద్రుడి తొలి పాఠంపై ఆయన శిష్యుడు రాజమౌళి స్పందించారు. 'మీరు చెప్పిన పాఠం నేను అసిస్టెంట్‌గా పనిచేసిన రోజులకు సరిగ్గా సరిపోతుంది. క్రాంతిగారి దగ్గర పనిచేసినప్పుడు నేను బెరుగ్గా ఉండేవాణ్ని, మీ దగ్గర పని చేసే సమయంలో కొంత యాక్టివ్ అయ్యాను. అదే నా తొలి విజయానికి కారణం అయ్యింది. అందుకే సహాయ దర్శకుడు యాక్టివ్‌గా ఉండటంతో పాటు అన్ని విషయాలను గమనిస్తూ ఉండాలి'. అంటూ ట్వీట్ చేశారు. కెఆర్ఆర్ క్లాస్ రూమ్ తొలి ఎపిసోడ్ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేసిన రాజమౌళి. '50 ఏళ్ల అనుభవాన్ని కొన్ని నిమిషాలకు కుదించి చెపుతున్నారు. ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నవారు తప్పక చూడాల్సిన వీడియో' అంటూ కామెంట్ చేశారు. 50 years of experience condensed into few minutes. KRR's classroom is a must watch for every film enthusiast.https://t.co/5mYROczfV6 — rajamouli ss (@ssrajamouli) 11 June 2016 eventually resulted in my first break student no:1. So so important for the asst directors to be active and observant. — rajamouli ss (@ssrajamouli) 11 June 2016 -
శ్రీవారి సేవలో రాఘవేంద్రరావు, కీరవాణి
తిరుమల: ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత భారవి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు ఆలయానికి వచ్చారు. నాగార్జున కథానాయకుడిగా ‘ ఓం నమో వేంకటేశాయ’’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథ ప్రతులను స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, రాఘవేంద్రరావుతో బేటీ అయి చర్చించారు. ఈ కొత్త చిత్రం ప్రారంభంలో భాగంగానే ఈనెల 16వ తేదీన నాగార్జున తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకునే అవకాశం ఉంది. -
వెంకన్నను దర్శించుకున్న దర్శకేంద్రుడు
తిరుమల : తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితోపాటు మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట.. కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. -
జక్కన్న... దర్శకేంద్రుడిని ఫాలో అవుతున్నాడా?
హైదరాబాద్ : వెండితెర సెల్యూలాయిడ్‌పై తనదైన శైలిలో చిత్ర రాజాలను చెక్కుతున్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. భారీగా పెరిగిన జుట్టు, గెడ్డంతో ఉన్న రాజమౌళిని చూస్తుంటే ఆయన గురువు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావునే ఫాలో అయిపోతున్నట్లు ఉన్నారు. ఎందుకంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు కూడా ఏదైనా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన దగ్గర నుంచి అది పూర్తి అయ్యేవరకూ గెడ్డం తీయకుండా ఉంటారు. ఆ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు రావాలి, అ తర్వాతే రాఘవేంద్రుడు తిరుమల వెళ్లి.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరునికి తలనీలాలు, గెడ్డం సమర్పించుకుంటారు. ఆ విషయం అందరికి తెలిసిందే. చూడబోతే రాజమౌళి కూడా రాఘవేంద్రుడి అడుగులో అడుగు వేస్తున్నట్లున్నారు. ఎందుకంటే రాజమౌళి కూడా జుట్టు, గెడ్డం భారీగా పెంచేశారు. దాదాపు మూడేళ్ల కష్టం.... రూ. 250 కోట్ల భారీ బడ్జెట్.... దేశ విదేశాల నుంచి సాంకేతిక సహాయకులు ...అత్యుత్తమ గ్రాఫిక్స్... భారీ తారాగణంతో నిర్మించిన చిత్రం బాహుబలి. ఆ చిత్రం శుక్రవారం విడుదలైంది. చిత్రం హిట్ అని ప్రేక్షకుల నుంచి టాక్ వస్తుంది. మరీ గురువుగారి లాగానే రాజమౌళి కూడా తిరుమల వెళ్తారా? లేక ఎస్ఎస్ రాజమౌళి పేరులోనే ఉన్న శ్రీశైలం వెళ్తారా? లేక రాజమౌళి గెడ్డం తీస్తాడా లేదా అనేది ఫిల్మ్ నగర్ టాక్. -
ఆర్యతో అనుష్క రెండోసారి
ఆర్య, అనుష్క రెండోసారి జతకడుతున్నారు. ఇంజి ఇడుప్పళగి పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పివిపి నిర్మిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో జీరో సైజ్ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు కెఎస్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు ప్రకాష్ తెలుపుతూ ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్ కథా చిత్రం అన్నారు. ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. తాను చెన్నైలోనే పుట్టి పెరిగాను కాబట్టి తమిళ ప్రేక్షకుల అభిరుచి తెలుసన్నారు. ఈ ఇంజి ఇడుప్పళగి చిత్రాన్ని రెండు భాషల్లో ఆయా నేటివిటీకి తగ్గట్టుగా చిత్రీకరించనున్నట్లు తెలిపారు. తన తండ్రి రాఘవేంద్రరావు ఛాయలు పడకుండా తన శైలిలోనే రూపొందిస్తానన్నారు. అనుష్క మాట్లాడుతూ ఆర్యతో రెండో సారి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. -
ఆంధ్రబాలానంద సంఘం వజ్రోత్సవం
-
రాఘవేంద్రరావు, నాగ్ కాంబినేషన్లో మరో చిత్రం
హైదరాబాద్ : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హీరో నాగార్జున కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఇటీవల దర్శకుడు రాఘవేంద్రరావు ఆ చిత్ర కథను హీరో నాగార్జునను కలసి వివరించారు. ఇదే విషయంపై రాఘవేంద్రరావు మాట్లాడుతూ... రెండు వారాల క్రితం రాఘవేంద్రరావుగారు కలసి తనకు కథను వివరించారని చెప్పారు. కథ, కథనం మనస్సుకు హత్తుకునే విధంగా ఉందని... తాను నటించేందుకు సిద్దమని రాఘవేంద్రరావుగారికి వెల్లడించినట్లు చెప్పారు. . కథనం చాలా బాగుందని... ఈ చిత్రంలో నటించేందుకు తాను అంగీకరించినట్లు చెప్పారు. అయితే ఇప్పటికే పలు చిత్రాలలో మహాబిజీగా ఉన్న నాగ్... ఆ చిత్రాలు పూర్తికాగానే ఈ చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి చిత్రాలకు ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అలాగే రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో త్వరలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా ప్రేక్షకులు మనసు దోచుకుంటుందని ఫిలింవర్గాలు సమాచారం. -
ఎర్రజెండా ఉన్నంతవరకూ నారాయణమూర్తి గుర్తుంటాడు : కె. రాఘవేంద్రరావు
‘‘మేం ఏసీ గదుల్లో కూర్చుని కథలు రెడీ చేస్తుంటే, నారాయణమూర్తి ఎర్రటి ఎండలో రోడ్ల మీద నడుస్తూ కనిపిస్తాడు. అప్పుడు కథలు అల్లుకుంటాడు. ఎర్రజెండా ఉన్నంతకాలం అతను గుర్తుంటాడు’’ అని సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ఆర్. నారాయణమూర్తి స్వీయదర్శకత్వంలో నిర్మించి, నాలుగు పాత్రలు పోషించిన చిత్రం ‘రాజ్యాధికారం’. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ వేడుకలో పాల్గొన్న రాఘవేంద్రరావు మాట్లాడుతూ,‘‘1980లో నేను దర్శకత్వం వహించిన ‘మోసగాడు’లో స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన పాటలోని ఒక్క లైన్‌కి జాతీయ జెండా పట్టుకుని నారాయణమూర్తి చాలా ఆవేశంగా నటించాడు’’ అంటూ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. రచయిత, దర్శకుడు జేకే భారవి, ప్రజా గాయకుడు గద్దర్, ప్రజా కవులు జయరాజు, గిద్దె రామనర్సయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. గద్దర్ మాట్లాడుతూ -‘‘సినిమా ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం గొప్ప విషయం. గత ముప్ఫై ఏళ్లుగా నారాయణమూర్తి ఈ దిశగానే సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు మా వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అన్నారు. మంచి, చెడుల మధ్య పోరాటమే ఈ చిత్రమని నారాయణమూర్తి పేర్కొన్నారు. -
అది ఏఎన్నార్ మ్యాజిక్: నాగార్జున
హైదరాబాద్: 'మనం' సినిమాలో బోర్ కొట్టించే సన్నివేశాలు లేవని అక్కినేని నాగార్జున తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఇప్పటి ట్రెండ్‌కు తగినట్టుగా ఈ సినిమా తీశామని ఆయన వెల్లడించారు. తన మొదటి సినిమా విడుదలైన మే 23నే మనం కూడా విడుదలకానుండడం యాధృచ్చికమని చెప్పారు. ఎన్నికలు ముగిసిన వారం తర్వాత విడుదల చేయాలన్న ఉద్దేశంతో 23వ తేదీని ఎంచుకున్నామని వివరించారు. ఇదే రోజు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పుట్టినరోజు కూడా అని చెప్పారు. అలాగే మనం పదాన్ని ఇంగ్లీషులో ఎటువైపు నుంచి చదివినా ఒకేలా ఉంటుందన్నారు. ఇవన్ని అనుకుని చేసివని కాదన్నారు. అది ఏఎన్నార్ మ్యాజిక్ అని నాగార్జున అన్నారు. చివరి క్షణం వరకూ నటునిగానే కొనసాగాలన్న నాన్నగారి ఆశకు ప్రతిరూపమే ‘మనం’ సినిమా అని నాగార్జున అంతకుముందు చెప్పారు. నాన్నగారి చివరి సినిమా ‘మనం’ జన హృదయాల్లో కలకాలం గుర్తుండిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.