ఓ భర్త తన భార్యని మోసం చేశాడు. చెప్పాలంటే అలాంటి ఇలాంటి మోసం కాదు. పెళ్లి, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నప్పటికీ మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఈ భార్యకి విడాకులు ఇచ్చేశాడు. దీంతో చాలా కుమిలిపోయింది. ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తన ఆవేదన బయటపెడుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు సడన్‌గా మాజీ భర్తకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అందరికీ కొత్త డౌట్స్ మొదలయ్యాయి. అవును పైన చెప్పినది పవన్-రేణు దేశాయ్ గురించే..
పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరికీ తెలుసు. ఈ విషయంలో తనని తాను ఎంత సమర్ధించుకున్నా.. ముగ్గుర‍్ని(వేర్వేరుగా) పెళ్లి చేసుకోవడం తప్పే కదా! కానీ ఈ మహానుభావుడు ఒప్పుకోడు. అప్పట్లో అలా జరిగింది, ఇలా చేశాను అని ఏదో కవర్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంటాడు. మొదటి భార్య గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. మూడో భార్య మన దేశస్థురాలే కాదు. పవన్ పుణ్యామా అని రెండో భార్య రేణు దేశాయ్ మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
రీసెంట్‌గా తన యూట్యూబ్ ఛానెల్‌లో రేణు దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేసింది. తన విషయంలో పవన్ చేసింది ముమ్మాటికీ తప్పే అని చెబుతూనే.. పొలిటికల్‌గా ఆయన(పవన్) సమాజానికి ఉపయోగపడతారని, నమ్ముతున్నానని కామెంట్స్ చేసింది. పిల్లల్ని, కుటుంబాన్ని వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది. అయితే ఇవన్నీ పెద్దగా నమ్మేలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇలా సడన్ యూటర్న్ కొత్త కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఈమె ఇలా మాట్లాడటం వెనుక దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.
(చదవండి: చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే)
కె.రాఘవేంద్రరావు మనవడు, పవన్-రేణుల కొడుకు అకీరా.. ఇద్దరు కూడా ఈ మధ్యే అమెరికాలోని ఓ యాక్టింగ్ స్కూల్‌లో చేరారు. ఈ విషయమై ట్వీట్ చేసిన కాసేపటికే రాఘవేంద్రరావు ఎందుకో ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే కొడుకు భవిష్యత్‌ని చూపించి రేణు దేశాయ్‌తో తన భర‍్త(పవన్) మంచోడు అని సర్టిఫికెట్ ఇప్పించి, ఎలక్షన్‌లోపు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చంద్రన్న-పవన్ కలిసి ఇదంతా ప్లాన్ చేస్తున్నారేమో అనే సందేహం వస్తుంది. రేణు దేశాయ్ లేటెస్ట్ వీడియో వెనక చంద్రబాబు హస్తం ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది.
(చదవండి: పోలీస్ ఆఫీసర్లుగా ఆన్ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు)
ఎందుకంటే చంద్రబాబుకి కె.రాఘవేంద్రరావుతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ కలిసి పవన్-రేణు దేశాయ్‌ల వ్యవహారాన్ని వెనక వైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే చంద్రబాబు.. ఇలా తన దత్తపుత్రుడి ఇమేజ్ కాపాడటానికి చేసే ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది కాలమే నిర్ణయిస్తుందిలే!
Comments
Please login to add a commentAdd a comment