ఎన్నికల సందడి అయిపోయింది. దేశంలో ఎన్టీయే ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించగా, చంద్రబాబు సీఎం కానున్నారు. వీళ్ల సంగతి పక్కనబెడితే దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలువురు సెలబ్రిటీలు అధికారం దక్కించుకున్నారు. కొందరికి మాత్రం నిరాశ తప్పలేదు.
(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా ఎన్నికైంది.
మలయాళ నటుడు సురేష్ గోపీ రికార్డ్ సృష్టించారు. త్రిసూర్ నుంచి ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.
టీవీ సీరియల్ 'రామాయణ్'తో చాలా గుర్తింపు తెచ్చుకున్న రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్.. ఈసారి మీరట్ నుంచి ఎంపీగా గెలిచారు.
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేసిన రచనా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి ఎంపీగా జయకేతనం ఎగరవేసింది.
'రేసుగుర్రం' విలన్ రవికిషన్.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఈయన రెండోసారి గెలిచారు.
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ హేమామాలిని.. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం.
బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్ సోల్ నుంచి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీలుగా గెలిచారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, హిందుపూర్, పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధించారు.
ఇలా చాలామంది ఈ సారి ఎన్నికల్లో గెలిచారు. మరోవైపు కొందరు ఓడిపోయారు కూడా. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీత.. షిమోగాలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ ఎంపీ బరిలో దిగి ఓడిపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్)
Comments
Please login to add a commentAdd a comment