Suresh Gopi
-
కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్‌ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. -
చిత్రపరిశ్రమలో వేధింపులు.. మీడియాపై సురేష్ గోపి ఆగ్రహం
మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు అక్కడ ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.మలయాళం సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ... కోర్టే సమాధానం ఇస్తుందన్నారు. చిత్ర పరిశ్రమలో ఆరోపణలు మీడియాకు ఆహారంగా మారిందని అన్నారు. ‘మీరు ఆ వార్తలతో డబ్బులు సంపాదించవచ్చుకానీ ఓ పెద్ద వ్యవస్థను నేలకూలుస్తున్నారు. మేకలు కొట్టుకునేలా చేసి, ఆ తర్వాత మీలాంటి వాళ్లు వాటి రక్తాన్ని తాగుతారు. ప్రజల మెదళ్లను మీడియా తప్పుదోవ పట్టిస్తోంది’ అని సురేశ్ గోపి మండిపడ్డారు.తాను ప్రైవేట్ పర్యటనలో ఉన్నానని, మలయాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి(అమ్మ) చెందిన ప్రశ్నలు కేవలం ఆ ఆఫీసును విజిట్ చేసినప్పుడు మాత్రమే అడగాలని ఆయన పేర్కొన్నారు. ఇది ఉండగా మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. తాజాగా ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నట్లు హేమ కమిషన్ తెలిపింది. -
‘సినిమా లేకుండా ఉండలేను.. కేంద్రమంత్రి పదవి ఎక్కువేం కాదు’
కేంద్ర మంత్రిత్వ పదవి, సినిమాల్లో నటించడంపై నటుడు సురేషి గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీ కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేషి గోపి.. ఇటు సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ వార్తలపై సురేష్ గోపి స్పందించారు. మంత్రి పదవిలో ఉంటూ సినిమాల్లో నటించినందుకు తనను కేంద్ర సహాయ మంత్రిగా తొలగిస్తే.. తనను తాను రక్షించుకున్నట్లేనని పేర్కొన్నారు. అదే విధంగా తన తదుపరి చిత్రం 'ఒట్టకొంబన్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరానని.. ఇంకా దీనిపై ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అయితే సెప్టెంబర్ 6న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.కాగా సురేషి గోపి ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి ఉన్నారు. అటు సినిమాల్లోనూ నటన కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రస్తుతం తన వద్ద అనేక స్క్రిప్ట్‌లు ఉన్నాయని, వీటిలో 20 నుంచి 22 సినిమాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అనుమతి కోరగా.. ఆయన ఎన్ని సినిమాల్లో నటించాలని అడిగారని చెప్పారు.@నేను 22 సినిమాల్లో నటించాల్సి ఉందని అమిత్ షాకు చెప్పాను. అయితే దీనిని ఆయన పక్కన పెట్టారు. ప్రస్తుతం సినిమాల్లోకి నటించేందుకు అనుమతి ఇస్తానని చెప్పారు. ఇప్పుడైతే సెప్టెంబర్ 6 నుంచి షూటింగ్లో పాల్గొంటాను’ అని కేరళలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.‘మంత్రి పదవిని నిర్వహించేందుకు సహకరించడానికి మంత్రివర్గానికి చెందిన ముగ్గురు, నలుగురు అధికారులను నా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సినిమా సెట్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇదంతా వీలు కాకపోతే.. వారు నన్ను కేంద్ర పదవి నుంచి తీసివేస్తే, అది నాకు మేలు చేసిన వాడిగా భావిస్తాను. నేను మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ ఆ కోరిక లేదు. నా కోసం కాకుండా నన్ను ఎన్నుకున్న త్రిసూర్ ప్రజల కోసం నాకు మంత్రి పదవి ఇస్తున్నామంటూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నేను తలవంచి అంగీకరించాను. ఇప్పటికీ నేను మా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. కానీ నా అభిరుచి (సినిమా) లేకుండా ఉండలేను’ అని పేర్కొన్నారు. -
Narendra Modi: అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
వయనాడ్: భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల ధాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు. బురద దారుల్లో మోదీ నడక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వయనాడ్ జిల్లాలోని చూరమల, ముండక్కై, పుంచిరిమట్టామ్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత కాల్పెట్టాలో దిగారు. రోడ్డు మార్గంలో చూరమలకు చేరుకున్నారు. బురద, రాళ్లతో నిండిపోయిన దారుల్లో కాలినడకన కలియదిరిగారు. వరద బీభత్సాన్ని స్వయంగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులతో, సహాయక సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి మెప్పడిలో సహాయక శిబిరానికి చేరుకొని, బాధితులతో సంభాíÙంచారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. స ర్వం కోల్పోయామంటూ బోరుమని విలపించారు. ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. గూడు లేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధి తు లు కోరగా, తప్పకుండా ఇస్తామంటూ మోదీ చెప్పారు. పలువురు చిన్నారులతోనూ ఆయ న సంభాíÙంచారు. వరదల తర్వాత భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కాసేపు నడిచారు. మోదీ పర్యటన సందర్భంగా చూరమలలో రహదారికి ఇరువైపులా వందలాది మంది జనం గుమికూడారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అరి్థంచడానికి వచ్చామని వారు చెప్పారు. -
ఇందిరాగాంధీ.. భారతమాత: సురేశ్ గోపీ
త్రిసూర్: ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధాని ఇందిరను ఆయన భారత మాత(మదర్ ఆఫ్ ఇండియా)గాను, కేరళ దివంగత సీఎం కె.కరుణాకరన్‌ను సాహసోపేతుడైన పాలకుడిగాను అభివర్ణించారు. త్రిసూర్ జిల్లా పుంకున్నమ్లో ఉన్న కరుణాకరన్ సమాధి ‘మురళి మందిరం’ను సురేశ్ గోపీ ఇటీవల సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన గురువుకు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చానని, దీనిని రాజకీయం చేయొద్దంటూ కోరారు. -
మరో వివాదంలో కేంద్ర మంత్రి సురేష్‌గోపీ
తిరువనంతపురం: ఇటీవలే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేరళ బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేష్‌గోపీ మరో వివాదానికి తెర తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ది నేషన్’గా అభివర్ణించి సంచలనం రేపారు.శనివారం(జూన్ 15) కేరళ త్రిసూర్‌లోని కాంగ్రెస్ నేత కరుణాకరణ్ సమాధి ‘మురళి మందిర్’ను సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా సురేష్‌గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేగాక కరుణాకరన్‌తో పాటు మాజీ సీఎం ఈకే నయనార్ తనకు రాజకీయ గురువులని తెలిపారు. కేరళ కాంగ్రెస్‌కు కరుణాకరణ్ తండ్రి అని చెప్పారు. అయితే తన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించవద్దని మీడియాను కోరారు. ఇటీవల తాను కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో తొలిసారిగా బీజేపీ ఖాతా తెరిచింది. త్రిసూర్ నుంచి సురేశ్‌గోపీ 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రాష్ట్రం నుంచి గెలిచిన తొలి బీజేపీ ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. దీంతో కేంద్రంలోని మోదీ3.0 మంత్రి వర్గంలో సురేశ్గోపీకి చోటు దక్కింది. -
కేంద్ర సహాయక శాఖ మంత్రిగా సురేష్ గోపి
కేరళ బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు సురేష్ గోపి సాంస్కృతిక సహాయక శాఖ పదవి దక్కించుకున్నారు. అయితే ఆదివారం (జూన్ 9న) మోదీ 3.0లో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా సురేష్ గోపి తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే రాజీనామా వార్తల్ని సురేష్ గోపి ఖండించారు. ‘నేను కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నామంటూ పలు మీడియా సంస్థలు కథనాల్ని ప్రచారం చేశాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అవి పూర్తిగా తప్పుడు కథనాలు’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మేం కేరళ అభివృద్ధి శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాము అని గోపి అన్నారు. -
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
గెలుపోటములు సాధారణం.. కానీ కొన్ని విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. చరిత్రనే తిరగరాస్తాయి. అలా తన సక్సెస్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు నటుడు సురేశ్ గోపి. అవును మరి! 1952లో లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా కేరళలో బీజేపీ గెలిచిందే లేదు. ఇంతకాలంగా అసాధ్యమనుకున్న కమలం విజయాన్ని తన గెలుపుతో సుసాధ్యం చేసి చూపించాడు.ప్రాణం కాపాడుఈ సక్సెస్‌తో సురేశ్ గోపీ గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో! కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో! 1992 జూన్ 6న భార్యాబిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్పృహలోకి వచ్చేసరికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాడు. కళ్లు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు. నా ప్రాణం కాపాడు స్వామీ అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ తన ప్రాణం అంటే ఆయన కూతురు లక్ష్మి. గుండెలో గూడు కట్టుకున్న బాధగాయాలు బాధిస్తున్నా ఎలాగోలా సత్తువ కూడదీసుకుని ఏడాదిన్నర వయసున్న కూతురిని చూసేందుకు ఐసీయూలోకి వెళ్లాడు. కొనప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు. ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్ మాసం అంటేనే ఆయనకు భయం, అయిష్టత! ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు సైతం నొప్పులు లేస్తాయట!జూన్ నెలలోనే..అయినా ఆ నొప్పి భరించడం తనకిష్టమేనంటాడు. అదే తన కూతురితో ఉన్న చివరి జ్ఞాపకాలని జీవం లేని నవ్వు విసురుతాడు. నలుగురు పిల్లలున్నా సరే లక్ష్మి లేని లోటును ఎవరూ పూడ్చలేడంటాడు. విధి ఎంత విచిత్రమో కదా! జూన్ నెలలో అతడి కూతుర్ని తీసుకెళ్లిపోయింది. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో అతడికి ఊహించని విజయాన్ని అందించింది.రాజకీయ నేపథ్యం..సురేశ్ గోపి 2016లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. తర్వాత బీజేపీలో చేరాడు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేసినా విజయం వరించలేదు. నిరాశతో వెనుదిరగలేదు. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిసూర్ ఎంపీగా గెలిచాడు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేశ్ గోపి తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు.చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్‌గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ -
ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?
ఎన్నికల సందడి అయిపోయింది. దేశంలో ఎన్టీయే ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించగా, చంద్రబాబు సీఎం కానున్నారు. వీళ్ల సంగతి పక్కనబెడితే దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలువురు సెలబ్రిటీలు అధికారం దక్కించుకున్నారు. కొందరికి మాత్రం నిరాశ తప్పలేదు.(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా ఎన్నికైంది.మలయాళ నటుడు సురేష్ గోపీ రికార్డ్ సృష్టించారు. త్రిసూర్ నుంచి ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.టీవీ సీరియల్ 'రామాయణ్'తో చాలా గుర్తింపు తెచ్చుకున్న రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్.. ఈసారి మీరట్ నుంచి ఎంపీగా గెలిచారు.టాలీవుడ్లో హీరోయిన్గా చేసిన రచనా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి ఎంపీగా జయకేతనం ఎగరవేసింది.'రేసుగుర్రం' విలన్ రవికిషన్.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఈయన రెండోసారి గెలిచారు.బాలీవుడ్ బ్యూటీ క్వీన్ హేమామాలిని.. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం.బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్ సోల్ నుంచి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీలుగా గెలిచారు.ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, హిందుపూర్, పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధించారు.ఇలా చాలామంది ఈ సారి ఎన్నికల్లో గెలిచారు. మరోవైపు కొందరు ఓడిపోయారు కూడా. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీత.. షిమోగాలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ ఎంపీ బరిలో దిగి ఓడిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్) -
కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ.. నటుడికి భారీ విజయం
2024 లోక్ సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి, నటుడు సురేశ్ గోపి విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మలయాళ నటుడు తన ప్రత్యర్థిపై గెలుపొందారు. ఆయన విజయంతో భాజపా కేరళలో తన ఖాతా తెరిచింది. తన సమీప ప్రత్యర్థి వీఎస్ సునీల్ కుమార్‌పై(సీపీఐ) ఘనవిజయం సాధించారు. దాదాపు 73 వేలకు పైగా మెజార్టీతో సురేశ్ గోపి గెలిచారు. -
జానకిగా వచ్చేస్తున్న 'అనుపమ పరమేశ్వరన్'
'టిల్లు స్క్వేర్'తో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మలయాళం సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అనుపమ పరమేశ్వరన్. ‘టిల్లు స్క్వేర్’లో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది. ఇందులో జానకిగా అనుపమ ప్రేక్షకుల ముందుకు రానుంది. లాయర్‌గా మలయాళ సీనియర్ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న అనుపమ దర్శకుడితో ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. 'నా తదుపరి చిత్రానికి డబ్బింగ్ పూర్తైంది' అంటూ అందులో రాసుకొచ్చింది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా.. ఆమె తరఫున కేసును వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో సురేష్ గోపి కుమారుడు మాధవ్ సురేష్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
PM Modi: గురువాయూరు గుడిలో ప్రధాని మోదీ పూజలు.. నూతన దంపతులకు ఆశీర్వాదం (ఫొటోలు)
-
సింపుల్‌గా గుడిలో నటుడి కూతురి పెళ్లి.. ఆశీర్వదించిన మోదీ
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూతురు భాగ్య సురేశ్.. శ్రేయాస్ మోహన్‌తో ఏడడుగులు నడిచింది. వీరి వివాహం బుధవారం (జనవరి 17) ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వేడుకగా జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ప్రధాన నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 30 జంటలకు మోదీ ఆశీర్వాదాలు ఈ సందర్భంగా అక్కడున్న అందరినీ చిరునవ్వుతో పలకరించారు. అనంతరం మోదీ.. తన చేతుల మీదుగా నూతన వధూవరులు పూలదండలు మార్చుకునే కార్యక్రమాన్ని జరిపించారు. తర్వాత కొత్త జంట.. తమను ఆశీర్వదించండంటూ మోదీ పాదాలకు నమస్కరించింది. వీరితో పాటు అదే ఆలయంలో పెళ్లి చేసుకున్న మరో 30 కొత్త జంటలను మోదీ ఆశీర్వదించారు. స్టార్ సెలబ్రిటీల సందడి కాగా సినీతారలు మమ్ముట్టి, మోహన్‌లాల్, దిలీప్, ఖుష్బూ, జయరాం తదితర సెలబ్రిటీలు కుటుంబంతో సహా విచ్చేసి ఈ పెళ్లి మండపంలో సందడి చేశారు. వివాహ వేడుకల అనంతరం రిసెప్షన్ కోసం పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వారి కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులంతా వేరే ఆడిటోరియానికి వెళ్లినట్లు తెలుస్తోంది. సురేశ్ గోపి కూతురి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #Malayalam superstars arriving for #SureshGopi daughter wedding in #GuruvayoorAmbalaNadayil, in the presence of #PM @narendramodi ji! pic.twitter.com/BErxC23saa — Sreedhar Pillai (@sri50) January 17, 2024 చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్.. అసలు విషయం ఇదా! -
ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!
సోషల్ మీడియా వచ్చాక నెటిజన్స్ కామెంట్లకు అడ్డులేకుండా పోయింది. ముఖ్యంగా సినీ కారలు, వారి కుటుంబసభ్యులు తరచూగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఓ తాజాగా ఓ ప్రముఖ నటుడి కుమార్తె ట్రోలింగ్ గురయ్యారు. ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె భాగ్య ఇటీవలే కెనడాలోని ఓ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె పట్టా అందుకున్న ఫోటోలను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఆమె ఈ ఫోటోల్లో సంప్రదాయ దుస్తులైన చీరలో కనిపించింది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) అయితే ఇది చూసిన ఓ నెటిజన్.. 'కంగ్రాట్స్.. మీరు చీరలు పక్కనపెట్టి వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోండి. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్లకు శారీ సెట్ కాదు. ఫ్యాషన్ దుస్తుల్లోనే మీరు చాలా స్మార్ట్‌గా ఉంటారు.' అంటూ కామెంట్ చేశాడు. ముందు నీ పని చూసుకో అయితే ఇది చూసిన భాగ్య అతనికి కాస్తా గట్టిగానే రిప్లై ఇచ్చింది. మీరిచ్చిన ఉచిత సలహాకు థ్యాంక్స్.. నా బరువుతో మీకేం పనిలేదు. మీరు అనవసరంగా ఆందోళన పడొద్దు. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటా. పట్టా అందుకున్నప్పుడు సంప్రదాయ దుస్తులే ధరించా. అందరిలాగా పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. నా గురించి కామెంట్ చేయడం మాని.. ముందు మీ పనిపై దృష్టి పెట్టండి.' ఘాటూగానే బదులిచ్చింది. కాగా.. మలయాళ నటుడు సురేశ్ గోపీ తెలుగువారికి సుపరిచితులే. ఆయన పోలీస్ పాత్రలో నటించిన పలు మలయాళీ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?) View this post on Instagram A post shared by Bhagya (@bhagya_suresh) -
మామూలు రైతు కాదు... ఆర్గానిక్ రైతు.. మోదీకి లేఖ
ఇవాళ రేపు పదో తరగతి విద్యార్థులంటే ఆన్లైన్ చదువులు ముగిశాక స్నేహితులతో కబుర్లు, ఓటిటిలో సినిమాలు, ఫోన్లో కాలక్షేపం వీడియోలు.... కాని జయలక్ష్మి అవేం చేయదు. చదువు ముగిసిన వెంటనే ఇంటి వెనుక ఉన్న పెరటి తోటకు వెళుతుంది. అక్కడ తాను పెంచుతున్న కాయగూరల చెట్లను చూసుకుంటుంది. వాటి బాగోగులలో నిమగ్నమైపోతుంది. ‘పెద్దయ్యాక నువ్వేమవుతావు’ అనంటే ఇంజనీరో డాక్టరో అని చెప్పడం స్టీరియోటైప్ జవాబు. జయలక్ష్మి గొప్ప రైతుని కావాలని అనుకుంటోంది. మామూలు రైతు కాదు... ఆర్గానిక్ రైతు. (చదవండి: ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!) పూల నుంచి పంట వరకు కేరళలోని పథానంతిట్ట జిల్లాలోని పండలం అనే చిన్న పల్లె జయలక్ష్మిది. తండ్రి బెంగళూరులో ప్రయివేటు ఉద్యోగం చేస్తాడు. తల్లి పాలిటెక్నిక్ లెక్చరర్. వాళ్లది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కాని జయలక్ష్మికి చిన్నప్పటి నుంచి పూలంటే ఇష్టం. పూల మొక్కలు ఎక్కడ ఉన్నా ఆగి చూసేది. ఇంటికి తెచ్చి వేసేది. కాని పదో క్లాసు వచ్చేసరికి ఈ ఆసక్తి ఆమెకు సేంద్రియ పద్ధతిలో పెరటి సేద్యం చేసేలాగా పురిగొల్పింది. విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగించేందుకు కేరళ ప్రభుత్వం ‘కర్షక తిలక’ అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అక్కడి ప్రభుత్వ బడులలో కూడా ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇవన్నీ జయలక్ష్మికి ఉత్సాహం ఇచ్చాయి. ఇంట్లో తన సొంత పంటను మొదలెట్టింది. అన్ని రకాల కాయగూరలను కేవలం సేంద్రీయ పద్థతిలో పండించసాగింది. అన్నీ తెలుసు అయితే అందరిలా ఏవో ఒక మొక్కలు ఏదో ఒక పద్ధతిలో జయలక్ష్మి పెంచలేదు. ఆమె వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో తనకు కావలసిన పరిజ్ఞానం పొందింది. ఏ కాయగూర ఎన్నాళ్లకు పూతకొస్తుందో ఏ ఆకుకూర ఏ సీజన్లో వేయాలో ఆమె దగ్గర కచ్చితమైన టైంటేబుల్ ఉంది. మట్టి, ఎరువు, నీరు... అన్నీ ఆమెకు ఏ పాళ్లో తెలుసు. అందుకే 2018లో ఆమె పెరటి పంటను మొదలుపెడితే రెండేళ్లలో ఆమె వల్ల ఇంటికి కావాల్సిన కూరగాయల బాధ తప్పడమే కాక బయటకు అమ్మి రాబడి సాధించేంతగా పంట ఎదిగింది. అంతే కాదు ‘కర్షక తిలక’ అవార్డు కూడా సొంతం చేసుకుంది. (చదవండి: లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయా?!) ప్రధాని మోదీకి లేఖ జయలక్ష్మి ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాసింది. ‘మన్ కీ బాత్’లో సేంద్రియ వ్యవసాయం పట్ల యువతకు పిలుపు ఇవ్వాలని, సేంద్రియ వ్యవసాయానికి మద్దతు ప్రకటించి రైతులను ఉత్సాహపరచాలని ఆ లేఖలో కోరింది. దానికి జవాబుగా మోదీ.. జయలక్ష్మి కృషిని ప్రశంసిస్తూ ఒక లేఖను కేరళ రాజ్యసభ సభ్యుడు, నటుడు సురేశ్‌గోపి ద్వారా పంపారు. ఇది ఒక్క పక్క జరిగితే మొన్నటి సోమవారం పథానం తిట్టకు వచ్చిన సురేశ్ గోపిని కలిసి జయలక్ష్మి తాను పెంచిన జామ మొక్కను బహూకరించింది. ‘అమ్మా.. ఇది నా దగ్గర కాదు.. ఏకంగా ప్రధాని నివాసంలోనే పెరగాలి. నేను దీనిని ప్రధానికి బహూకరిస్తాను’ అన్నాడు సురేశ్ గోపి. గురువారం (సెప్టెంబర్ 2) ఢిల్లీలో ప్రధానికి ఆ మొక్కను బహూకరించాడు కూడా. ఈ సంగతి తెలిసి జయలక్ష్మి ఎంతో సంతోషపడుతోంది. సాటి విద్యార్థులు కూడా ఆమెను చాలా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. చదువుతో పాటు ఈ దేశపు మట్టి గురించి, పంట గురించి, కనీసం నాలుగైదు మొక్కలు పెంచాల్సిన పరిజ్ఞానం గురించి కూడా నవతరం ఎరుక తెచ్చుకోవాల్సి ఉంది. అందుకు జయలక్ష్మి వంటి వారు ఒక కేటలిస్ట్ అవుతారు తప్పక. జయలక్ష్మీ జిందాబాద్. -
కొడకారా దోపిడీ కేసు.. రాజకీయ చిత్తులు-జిత్తులు
కేరళ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన బీజేపీకి ‘హవాలా మనీ’ ఆరోపణలు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. కార్యకర్తల స్థాయి నుంచి కీలక నేతల దాకా ప్రతీ ఒక్కరి మధ్య ఈ స్కామ్ చిచ్చుపెడుతోంది. ఎన్నికలకు ముందు త్రిస్సూరు కొడకారా హైవేపై దోపిడి జరగడం.. ఈ కేసులో బాధితుడు ఫిర్యాదు చేసిన సొమ్ముకంటే ఎక్కువ సొమ్మును పోలీసులు రికవరీ చేస్తుండడం, ఆ సొమ్ముతో రాజకీయ నేతలకు లింకులు.. వెరసి పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి అక్కడి రాజకీయాలు. త్రిస్సూరు: ఎన్నికల్లో గెలుపు కోసం కేరళ బీజేపీ డబ్బులు పంచాలని ప్రయత్నించిందని, కానీ బీజేపీ నేతలే ఆ డబ్బు కోసం దోపిడీ డ్రామాలు ఆడారనే ఆరోపణలు.. ప్రస్తుతం ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. అయితే ఇదంతా ఎల్డీఎఫ్(సీపీఐ-ఎం) రాజకీయ కుట్రలో భాగమేనని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ప్రభుత్వంతో కుమ్మక్కై పోలీసులు కుట్రకు పాల్పడుతున్నాయని ఆదివారం బీజేపీ పక్ష నేతలంతా మీడియా సమావేశం నిర్వహించి ఆరోపణలకు దిగారు. ఈ సమావేశంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్‌తో పాటు కేంద్ర మంత్రి మురళిధరన్, పార్టీ మాజీ అధ్యక్షులు కుమ్మనం రాజేంద్రన్, కృస్ణదాస్ ఇంకా సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇలా మొదలైంది.. ఏప్రిల్ 7న త్రిస్సూరుకు చెందిన షమ్జీర్ శామ్సుదీన్ అనే వ్యక్తి కొడకారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఏప్రిల్ 3న రాత్రి.. అంటే అసెంబ్లీ ఎలక్షన్లకు మూడు రోజుల ముందు షమ్జీర్ తన కారులో కొచ్చివైపు వెళ్తున్నాడు. ఆ టైంలో కొడకారా ఫ్లైఓవర్ వద్ద తొమ్మిది మంది దుండగులు ‘ఫేక్ యాక్సిడెంట్’తో తనను ఆపారని, బెదిరించి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తీసుకెళ్తున్న పాతిక లక్షల రూపాయలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతను ఒంటరిగా వెళ్లి ఫిర్యాదు చేయలేదు. అతని కూడా వ్యాపారవేత్త ఏకే ధర్మరాజన్ కూడా ఉన్నాడు. ధర్మరాజన్ ఆరెస్సెస్ సభ్యుడు. ఆయన ఆ డబ్బును చాలామంది దగ్గరి నుంచి అప్పుగా తీసుకున్నానని చెప్పడం, సరిగ్గా దోపిడీ జరిగింది ఎన్నికల టైం కావడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. డొంక కదిలింది.. ఈ కేసులో దీపక్ అనే వ్యక్తి పోలీసులు మొదటగా అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారంతో ఈ దోపిడీలో పాల్గొన్న మరో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు పాతిక లక్షల కంటే ఎక్కువ సొమ్మును రికవరీ చేయడంతో అసలు ట్విస్ట్ మొదలైంది. దీంతో పోలీసులు ధర్మరాజన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. యువ మోర్చా నేత సునీల్ నాయక్ తనకు ఆ డబ్బు ఇచ్చాడని ధర్మరాజన్ చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు సునీల్ పిలిపించుకుని విచారించారు. తనకు ఆ డబ్బు బయటి నుంచి వచ్చిందని, ధర్మరాజన్తో తనకున్న లావాదేవీల కారణంగానే ఆ డబ్బు ఇచ్చానని చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు మరోసారి ధర్మరాజన్‌ను ఇంటరాగేషన్ చేయడంతో.. ఆ సొమ్ము బీజేపీ నేతల కోసమేనని ధర్మరాజన్ చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో లింకులు! త్రిస్సూరులోని ఓ హోటల్లో బీజేపీ కీలక నేత ఒకరు తనకోసం రూమ్ బుక్ చేశారని ధర్మరాజన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది నిజమేనని ఒప్పుకున్న బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్.. కేవలం ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఇంఛార్జిగా ఉన్న ధర్మరాజన్ కోసం ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ సొమ్ము బీజేపీకి చెందిన మరో ముగ్గురు నేతలకు అందించాల్సి ఉందని ధర్మరాజన్ చెప్పగా, వాళ్లు మాత్రం ఆ డబ్బుతో తమకేం సంబంధం లేదని పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ కేసులో అరెస్టయిన దీపక్.. దోపిడీ జరిగిన తెల్లారే బీజేపీ ఆఫీస్‌కు వెళ్లాడన్న విషయం వెలుగులోకి రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పైగా రికవరీ సొమ్ము దగ్గర దగ్గర మూడున్నర కోట్ల రూపాయలు ఉండొచ్చని పోలీసులు అంచనాకి వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగప్రవేశంతో ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో కోటి రూపాయల దాకా సొమ్ము రికవరీ అయినట్లు తెలుస్తోంది. సొంత నేతల పనేనా? ఈ దోపిడీలో ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్.. దోపిడీ తర్వాత బీజేపీ ఆఫీస్‌కు వెళ్లిన విషయాన్ని పార్టీ కూడా ధృవీకరించింది. అయితే దోపిడీకి సంబంధించి సొంత నేతలపైనే అధిష్టానానికి అనుమానం వచ్చిందని, ఆ కోణంలోనే దర్యాప్తు కోసం కొందరిని ఆఫీస్‌కు పిలిపించుకున్నామని, అందులో కార్యకర్త దీపక్ కూడా ఉన్నాడని బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్ చెప్పాడు. దీంతో ఈ దోపిడీ స్కెచ్ బీజేపీలోని సొంత నేతల పనే అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు కొడాకరా దోపిడీ గురించి బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసుకున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కేరళ బీజేపీలో అంతర్గత కుమ్ములాట వల్లే ఇదంతా జరిగి ఉండొచ్చని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అయితే ఈ కాంట్రవర్సీకి బీజేపీ కేరళ అధిష్టానం దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే.. ఇదంతా ఎల్డీఎఫ్ కుట్రలో భాగమేనని వాదిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని పట్టుకోవాల్సింది పోయి.. బీజేపీ నేతలతో ముడిపెట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపణలను దిగింది. నిందితుల్లో లెఫ్ట్ నేత కూడా?! పోలీసులు నిందితుల కాల్ లిస్టులను పరిశీలించాల్సింది పోయి.. వ్యాపారవేత్త అయిన ధర్మరాజన్ కాల్ లిస్ట్‌ను జల్లెడ పడుతోందని బీజేపీ మండిపడింది. ఈ కేసులో ఆరెస్ట్ చేయాల్సిన నిందితుడు మరోకడున్నాడని, అతను లెఫ్ట్ పార్టీ యూత్ వింగ్ లీడర్ మాత్రమే కాదని, త్రిస్సూరుకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఆ నిందితుడు ఈ కేసు నుంచి తప్పించునేందుకు వామపక్ష ఉద్యమవేత్త ఎన్ఎన్ పురం సాయం కూడా తీసుకున్నాడని చెప్పాడు. సీపీఎం నేత కొడియారి బాలకృష్ణన్ కొడుకును బెంగళూరులో డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేయగా, ప్రతీకారంగానే తన కొడుకు హరికృష్ణన్‌ను విచారణపేరుతో ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సురేంద్రన్ ఆరోపణలకు దిగారు. సిట్ ముందుకు నేతలు కొడకారా దారి దోపిడీ కేసు వ్యవహారంలో కేరళ బీజేపీ కీలక నేతల్ని ప్రశ్నిస్తోంది సిట్. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సురేంద్రన్ ఎన్నికల టైంలో ఇద్దరికి లంచాల ప్రలోభం చూపెట్టాడన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆయన డ్రైవర్‌తో పాటు ముఖ్య అనుచరుల్ని సిట్ ప్రశ్నించింది కూడా. ఇక సురేంద్రన్ తనయుడు హరికృష్ణన్.. దోపిడీ జరిగిన రోజు ధర్మరాజన్తో పలుమార్లు ఫోన్‌కాల్స్ మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో హరికృష్ణన్‌కు సిట్ నోటీసులు పంపింది. మరోవైపు బీజేపీ నేత, నటుడు సురేష్ గోపీని కూడా(హెలికాఫ్టర్ల ప్రచారంపై) ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొడకారా కేసులో న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈడీ దృష్టి కొరకాడ హవాలా మనీ కేసు అని, ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యం చేసుకోవాలని కోరుతూ లోక్‌తంత్రిక్ జనతా దళ్ యువ విభాగం జాతీయాధ్యక్షుడు సలీం మడావూర్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసులో జోక్యం చేసుకుంటుందో లేదో తెలపాల్సిందిగా ఈడీ ఏజెన్సీని ధర్మాసనం కోరింది. అయితే ఈడీ వారం గడువు కోరగా.. కోర్టు పదిరోజుల గడువు మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈడీ ఇప్పటికే ఈ కేసు ఫైల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
Club House Scam: టాప్ హీరోహీరోయిన్ల ఫేక్ ఫ్రొఫైల్స్
ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్వర్కింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా ఆ యాప్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్ ‘క్లబ్‌హౌజ్’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్ ఫ్రొఫైల్స్‌తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్‌తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్ సల్మాన్, సీనియర్ హీరో సురేష్ గోపీ ఈ యాప్‌లో తమకు ప్రొఫైల్స్ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్ నివీన్ పౌలీ స్పందించాడు. ‘‘హలో ఫ్రెండ్స్. నాకు క్లబ్‌హౌజ్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్ గోపీ, దుల్కర్ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్ రాధికా వేణుగోపాల్ సాధిక కూడా ఈ ఫేక్ స్కామ్‌పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్, జోజు జార్జ్‌లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ ‘ఫేక్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఉంచింది. So, I am not on on Clubhouse. These accounts are not mine. Please don’t impersonate me on social media. Not Cool ! pic.twitter.com/kiKBAfWlCf — dulquer salmaan (@dulQuer) May 31, 2021 క్లబ్‌హౌజ్ ఏంటంటే.. ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్లబ్‌హౌజ్‌ను మనదేశంలో ఈ ఏప్రిల్‌లోనే లాంఛ్ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్ యాప్స్ల్లాగా కాదు. ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్‌ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్హౌజ్కి క్రేజ్ పెరుగుతోంది. ఇక ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్‌హౌజ్ ఆడియో కన్వర్జేషన్ యాప్.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ప్రత్యేకంగా ఆన్లైన్ రూమ్స్‌తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్‌పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
ఐదు రాష్ట్రాల ఫలితాలు : గెలిచిన, ఓడిన నటులు వీరే
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ ఓడిపోయాడు. త్రిస్సూర్ నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. -
సురేష్ గోపి @ 250
ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి త్వరలోనే ఓ కొత్త మైలు రాయిని అందుకోబోతున్నారు. నటుడిగా 247 సినిమాల వరకూ చేశారాయన. 248, 249వ íసినిమాలకు ప్లానింగ్ జరిగిపోయింది. తాజాగా 250వ చిత్రం కూడా అంగీకరించారు. ఈ స్పెషల్ సినిమా మరింత స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సురేష్ గోపి మాస్ లుక్‌లో కనిపించనున్నారు. మాథ్యువ్ థామస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
14 ఏళ్ల తర్వాత
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్నారు మలయాళ నటుడు సురేశ్ గోపీ, శోభన. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్ గోపీ. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో చివరిసారి కలసి నటించారు. లేటెస్ట్గా అనూప్ సత్యన్ దర్శకత్వంలో ఈ జంట నటిస్తోంది. తొలిరోజు షూటింగ్లో తీసిన ఫొటో ఇది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. -
పనిచేయని సురేష్ గోపి స్టార్ ఇమేజ్
మలయాళ నటుడు సురేష్ గోపి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగారు. త్రిస్సూర్ నుంచి తన స్టార్ ఇమేజ్ను నమ్ముకొని పోటి చేసిన సురేష్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సురేష్ గోపి ఈ సారి త్రిస్సూర్ నుంచి లోకసభ బరిలో అధృష్టాన్ని పరీక్షించుకున్నారు. విద్యార్థి నాయకుడిగా సీపీయం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ తరపున ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం ఎన్నికల్లో సురేష్ గోపికి ప్లస్ అవుతుందని భావించారు. 2006 ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన సురేష్ గోపి, ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలో నిలిచారు. సురేష్ గోపికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్, సీపీఐ అభ్యర్థి రాజాజీ మాథ్యూ థామస్‌ల నుంచి గట్టిపోటి ఎదురైంది. ముందుగా త్రిస్సూర్ నుంచి తుషార్‌ను బరిలో దించాలని భావించిన బీజేపీ చివరి నిమిషంలో తుషార్‌ను వాయ్‌నాడ్ నుంచి, సురేష్ గోపిని త్రిస్సూర్ నుంచి బరిలో నిలిపారు. -
మళ్లీ డ్యూయెట్
డ్యూయెట్ అంటే కలిసి పాడక్కర్లేదు. స్టెప్పులు వేయక్కర్లేదు.. ఆడక్కర్లేదు.మళ్లీ ఈ కాంబినేషన్ తెర మీద కనపడితే చాలు.. మన హార్ట్ బీట్ స్టెప్పులేస్తుంది. వెల్కమ్ బ్యాక్. జనం ఒకసారి ఒక హిట్ పెయిర్‌ను కన్ఫర్మ్ చేశారంటే వాళ్లమాట వాళ్లే వినరు. హిందీలో అలా రాజ్ కపూర్– నర్గీస్ జంటను కన్ఫర్మ్ చేశారు. తెలుగులో అక్కినేని– సావిత్రి జంటను కన్ఫర్మ్ చేశారు. తమిళంలో ఎం.జి.ఆర్–జయలలిత జంటను కన్ఫర్మ్ చేశారు. ఆ మధ్య చిరంజీవి– రాధిక, బాలకృష్ణ–విజయశాంతి, నాగార్జున–అమల, వెంకటేశ్– సౌందర్య హిట్ పెయిర్‌గా నిలిచారు. ఇటీవల నాగ చైతన్య– సమంత, నితిన్–నిత్యామీనన్, రాజ్‌తరుణ్–అవికా గోర్ వంటి పెయిర్స్ కూడా జనానికి నచ్చాయి. ఇలా ఒకసారి హిట్ అయితే ఎన్నాళ్ల గ్యాప్ వచ్చినా మళ్లీ ఒకసారి వారు తెర మీదకు వస్తే చూడాలనుకుంటారు. ఈ విషయం కనిపెట్టే చాలా గ్యాప్ తర్వాత తిరిగి శోభన్‌బాబు–వాణిశ్రీ–శారదల కాంబినేషన్‌తో ‘ఏమండీ... ఆవిడ వచ్చింది’ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు ఈ.వి.వి. సత్యనారాయణ. సినిమా వారికి కాసులు కావాలి. కనుక పాత మేజిక్‌ను రిపీట్ చేయడానికి వాళ్లూ ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి ‘రీ– యూనియన్లు’ ఈ ఏడాది చాలానే చూడబోతున్నాం. ప్రభు–మధుబాల ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మేన్’ సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశారు మధుబాల. ఆ తర్వాత కుటుంబం కోసం టైమ్ కేటాయిస్తూ ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన పాత కో–స్టార్ ప్రభుతో కలిసి తిరిగి యాక్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ అనే సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఓ రీమేక్ కోసం నటిస్తున్నారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కాలేజ్ కుమార్’ సినిమా తమిళ రీమేక్‌లో వీరిద్దరూ జోడీ కడుతున్నారు. అరుణ్ విజయ్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లు. ప్రియదర్శన్ దర్శకుడు. అమితాబ్–రమ్యకృష్ణ కెరీర్ పీక్‌లో ఉండగా దక్షిణాది భాషల సినిమాలను తన గ్లామర్‌తో నింపిన రమ్యకృష్ణ హిందీసినిమా రంగాన్ని కూడా ఆకర్షించారు. అంతేనా? ఏకంగా అమితాబ్ పక్కన నటించే చాన్స్ కొట్టేశారు. వీరిద్దరూ కలిసి ‘బడే మియా ఛోటే మియా’లో నటించారు. ఆ సమయంలో ఫ్లాపుల్లో ఉన్న హీరో మోహన్‌బాబుకు రమ్యకృష్ణ నట భాగస్వామ్యంతో వచ్చిన ‘అల్లుడుగారు’ హిట్ అయినట్టు డౌన్లో ఉన్న అమితాబ్‌కు ‘బడే మియా చోటే మియా’ కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బి, రమ్యకృష్ణ ఒక తమిళ సినిమాలో కలసి నటిస్తున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో అమితాబ్ తొలిసారిగా ఓకే చేసిన తమిళ చిత్రం ‘ఉయంవర మణిదన్’లో ఆయన పక్కన నటించే అవకాశం రమ్యకు దక్కింది. తమిళవానన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో యస్.జె. సూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శోభన–సురేశ్ గోపి మలయాళ ఇండస్ట్రీలో శోభన–సురేష్ గోపీది హిట్ కాంబినేషన్. ‘మణిచిత్రతాళే’, ‘ఇన్నలే’, ‘కమిషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను ఆడియన్స్‌కు ఈ జంట అందించింది. ‘కమిషనర్’ 2005లో రిలీజ్ అయింది. మళ్లీ పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శోభన–సురేశ్ గోపీ ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌గా రూపొందుతున్న సినిమాలో కలిసి కనిపిస్తారు. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రాధిక–శరత్ కుమార్ రాధిక– శరత్ కుమార్ ఆఫ్‌స్క్రీన్ కపుల్. ఆన్‌స్క్రీన్ కూడా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘నమ్మ అన్నాచ్చి’, ‘సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్‌కుమార్, రాధిక నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. 20 ఏళ్ల తర్వాత ‘వానమ్ కొట్టటుమ్’లో జోడీగా కనిపించనున్నారు. విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కే ఈ చిత్రానికి ధన దర్శకుడు. కథను ధనతోపాటు మణిరత్నం అందిస్తున్నారు. సెట్స్ మీద ఉన్నవే కాదు. ఆల్రెడీ మూడు భారీ రీ యూనియన్లు ఈ ఏడాది జరిగిపోయాయి. ‘కళంక్’ చిత్రం కోసం సంజయ్ దత్–మాధురీ దీక్షిత్ 25 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలైంది. ‘సాజన్’, ‘ఖల్నాయక్’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. మరో జంట అనిల్ కపూర్, జూహీ చావ్లాది కూడా హిట్ పెయిర్. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వీరి లాస్ట్ చిత్రం. పదకొండేళ్ల తర్వాత ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ కోసం మళ్లీ çకలిశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజైంది. అలాగే అనిల్ కపూర్– మాధురి దీక్షిత్లది కూడా మంచి జోడి. ‘ధక్ ధక్ కర్నే లగా’.. పాటలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌ల కెమిస్ట్రీని అంత సులువుగా మరచిపోలేం. ఈ ఇద్దరూ సుమారు 18 సినిమాల్లో కలసి నటించారు. పద్ధెనిమిదేళ్ల తర్వాత ‘టోటల్ ధమాల్’లో అనిల్ కపూర్– మాధురీ దీక్షిత్ కలసి యాక్ట్ చేశారు. స్వీట్ కపుల్–గులాబ్ జామూన్ ఈ ఏడాది మరో రీ–యూనియన్ని సిల్వర్ స్క్రీన్ చూడబోతోంది. ఈ జోడీ కలిసి స్క్రీన్ మీద కనిపించి ఎనిమిదేళ్లు అయింది. ఈ రియల్ లైఫ్ స్వీట్‌కపుల్ అభిషేక్ బచ్చన్–ఐశ్వర్యారాయ్ ఇన్నేళ్ల తర్వాత ‘గులాబ్ జామూన్’ అనే సినిమా కోసం జతకట్టారు. 2010లో నటించిన ‘రావణ్’ ఈ జంట కలిసి నటించిన చివరి చిత్రం. నువ్వు నేను – మరో సినిమా కోలీవుడ్‌లో సూర్య–జ్యోతికలది సూపర్‌హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ జోడీగా సుమారు 5 సినిమాల్లో కనిపించారు. వాటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘కాక్క కాక్క’ బ్లాక్‌బస్టర్. సూర్య కెరీర్ యూటర్న్ తిప్పిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనల్లో దర్శక–నిర్మాతలు ఉన్నారని వినిపించింది. ఇందులో సూర్య, జ్యోతికలనే యాక్ట్ చేయించాలని అనుకుంటున్నారట. పదమూడేళ్లయింది వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించి. ‘సిల్లును ఒరు కాదల్’ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’) జంటగా వీరిద్దరి చివరి చిత్రం. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
మలయాళంలో మళ్లీ
యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా శోభనను సిల్వర్ స్కీన్‌పై మిస్ అవుతున్నారు ఆమె అభిమానులు. 2005 నుంచి ఇప్పటివరకూ చాలా తక్కువ సినిమాల్లో కనిపించారు శోభన. 2013లో ‘తిర’ అనే మలయాళ చిత్రం, 2014లో ‘కొచ్చడయాన్’ అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఓ మలయాళ చిత్రంలో కనిపించడానికి శోభన అంగీకరించారు. నజ్రియా నజీమ్, శోభన కీలక పాత్రల్లో నూతన దర్శకుడు అనూప్ సత్యన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సురేశ్ గోపి కీలక పాత్రలో కనిపిస్తారు. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్ గోపి. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో కనిపించిందీ జోడీ. మరి తాజా చిత్రంలో జంటగా నటిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. జూన్‌లో ఈ సినిమా ఆరంభం కానుంది. -
ప్రముఖ హీరోయిన్‌పై ఛార్జీషీట్?
ప్రముఖ హీరోయిన్ అమలాపాల్‌పై ఛార్జీషీట్‌కు రంగం సిద్ధమైంది. నకిలీ అడ్రస్‌తో కారు రిజిస్ట్రేషన్.. పన్ను ఎగవేత కేసులో ఆమె చిక్కులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టులో లొంగిపోయిన ఆమె.. వెంటనే బెయిల్‌పై బయటికొచ్చారు. ఈ కేసులో ఇప్పుడు ఛార్జ్‌షీట్ నమోదు చేయాలని కేరళ ప్రభుత్వం.. పోలీస్ శాఖను ఆదేశించినట్లు సమాచారం. మాతృభూమి కథనం ప్రకారం.. ఫేక్ అడ్రస్‌తో కోటి రూపాయల విలువ చేసే కారును పుదుచ్చేరిలో అమలాపాల్ రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో కేరళ ప్రభుత్వానికి ఆమె రూ. 20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లయ్యింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో కేరళ సర్కార్ క్రైమ్ బ్రాంచ్‌ను రంగంలోకి దించించింది. ఒక్క అమలనే కాదు.. సీనియర్ నటుడు సురేష్ గోపీ, మరో హీరో పహద్ ఫజిల్ కూడా ఇదే తరహాలో పన్ను ఎగ్గొట్టారని తేలింది. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పక్కా ఆధారాలతో వారిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే.. ప్రభుత్వం వారికి పన్నులు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించింది. వారిలో ఫహద్ పన్ను చెల్లించటంతో అతనిపై కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, అమలా, సురేష్ గోపీ మాత్రం పన్ను చెల్లించేందుకు నిరాకరించటంతో ఈ కేసులో కఠినంగా వ్యవహారించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఛార్జ్‌షీట్ నమోదు చేయాలని క్రైమ్ బ్రాంచ్‌కు సూచించిందంట. అయితే సురేష్ గోపి రాజ్యసభ సభ్యుడు కావటంతో ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది. -
చంద్రబాబును కలిసిన సురేష్ గోపి
సాక్షి, అమరావతి: మొదటిసారిగా ఏపీ రాజధాని అమరావతికి రావడం చాలా ఆనందంగా ఉందని మలయాళ హీరో, రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి అన్నారు. శుక్రవారం సీఎం చంద్రబాబును సచివాలయంలో ఆయన కలిశారు. కేరళలో జరిగే జాతీయ బనానా ఫెస్టివల్‌కు చంద్రబాబును ఆహ్వనించారు. ఈ సందర్భంగా సురేష్ గోపి మాట్లాడుతూ... 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు తన సొంత గ్రామం కల్లియార్లో జరగనున్న జాతీయ అరటిపళ్ల ఉత్సవానికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ ఫెస్టివల్‌కు జాతీయస్థాయిలో విద్యార్థులు, శాస్త్రవేతలు, అరటి రైతులు హాజరవుతారని చెప్పారు. దేశంలో అరటి ఉత్పత్తిలో ఏపీ అగ్ర స్థానంలో ఉన్నందున.. ముఖ్య అతిథిగా పాల్గొనాలని చంద్రబాబును కోరినట్టు వెల్లడించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసి ఆహ్వానిస్తామన్నారు. ఈ ఫెస్టివల్ లో 457 రకాల అరటి ఉత్పత్తులు ప్రదర్శనకు రానున్నాయి. కల్లియార్ గ్రామ పంచాయతీ, కేంద్ర, రాష్ట్ర సంస్థల భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ సోషల్ యాక్షన్(సీఐఎస్‌ఎస్‌ఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.