వివాదస్పద వ్యాఖ్యలకు సురేశ్ గోపి క్షమాపణ!
వివాదస్పద వ్యాఖ్యలకు సురేశ్ గోపి క్షమాపణ!
Published Sun, Aug 10 2014 8:26 PM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి క్షమాపణలు తెలిపారు. నా వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బందికి గురిచేసి ఉంటే, అందుకు నా క్షమాపణలు తెలియచేసుకుంటున్నాను. ముఖ్యమంత్రిని విమర్శించడం తన వ్యాఖ్యల ఉద్దేశం కాదు. ఏ ప్రాజెక్ట్ కైనా అనుమతి తెలిపే ముందు సంప్రదింపులు జరుపాల్సి ఉండాల్సింది అని యూఎస్ నుంచి ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో సురేశ్ గోపి అన్నారు.
గత వారం ఓ బహిరంగ సభలో సురేశ్ గోపి మాట్లాడుతూ.. ప్రతిపాదిత అరన్ములా ఎయిర్ పోర్టు పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్నారని, ఉమెన్ చాందీకి కొన్ని విషయాల అవగాహన లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా కేరళలో దుమారం రేగుతోంది. మంత్రులు డయస్పోరా, కేసీ జోసఫ్, రాధకృష్ణన్ లు సురేష్ గోపిపై విమర్శల్ని ఎక్కుపెట్టారు. అంతేకాకుండా సురేశ్ గోపి ఇంటిని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించి.. దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు.
Advertisement
Advertisement