రియల్ స్టోరీతో వస్తోన్న అనుపమ పరమేశ్వరన్..! | Tollywood Actress Anupama Parameswaran Lead Role In Real Story | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: రియల్ స్టోరీతో వస్తోన్న అనుపమ పరమేశ్వరన్..!

Published Fri, Dec 20 2024 3:34 PM | Last Updated on Fri, Dec 20 2024 3:48 PM

Tollywood Actress Anupama Parameswaran Lead Role In Real Story

మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ సినిమాను యధార్థ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిస్తున్నారు. ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి ఫణీంద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొందనేదే అసలు కథ. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో జానకి కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.

రియల్ స్టోరీ కావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గిరీష్ నారాయణన్ , జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement