Real story
-
జగనన్న చేసిన సాయం.. ‘తండేల్’లో చూపకపోవడం బాధాకరం
శ్రీకాకుళం అర్బన్: తండేల్ సినిమా యథార్థ ఘటన ఆధారంగా తీసినప్పటికీ అందులో పూర్తిస్థాయిలో సన్నివేశాలు చూపలేదని కె.మత్స్యలేశం గ్రామవాసి, మత్స్యకార సంఘ నాయకుడు, న్యాయవాది మూగి గురుమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రీల్ స్టోరీ తీశారే తప్ప రియల్ స్టోరీ తీయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 నవంబర్ 28న 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా చిక్కుకున్నారని, వారిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అపుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజాంలో జరుగుతున్న పాదయాత్రలో కలిశామని, మత్స్యకార కుటుంబాల సమస్య వివరించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బందీలను విడిపించారన్నారు. అనంతరం 22 మంది మత్స్యకారులతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున ఆర్ధిక సహాయం కూడా చేశారన్నారు. ఈ సంఘటన తండేల్ సినిమాలో లేకపోవడం బాధాకరమన్నారు.ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలుశ్రీకాకుళం అర్బన్: ‘తండేల్’ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సినిమా చిత్ర కథా రచయిత తీడ కార్తీక్ అన్నారు. శ్రీకాకుళంలోని ఎస్వీసీ థియేటర్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండేల్ సినిమా విజయంతో వచ్చిన సౌండ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. సక్సెస్ మీట్‌కు చిత్ర యూనిట్ మొత్తం త్వరలోనే శ్రీకాకుళం రానుందని తెలిపారు. మత్స్యకారుడు గనగళ్ల రామారావు మాట్లాడుతూ పాకిస్తాన్లో తాము పడిన ఇబ్బందులు, బాధలను దర్శకుడు చందు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. బందీగా ఉన్న సమయంలో అన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయన్నారు. సమావేశంలో ఎస్వీసీ థియేటర్ మేనేజర్ రవి, అభిమానులు పాల్గొన్నారు. -
రియల్ స్టోరీతో వస్తోన్న అనుపమ పరమేశ్వరన్..!
మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ సినిమాను యధార్థ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిస్తున్నారు. ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి ఫణీంద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొందనేదే అసలు కథ. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో జానకి కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.రియల్ స్టోరీ కావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గిరీష్ నారాయణన్ , జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
సైన్సు సినిమా.. అక్టోబర్ స్కై
‘అక్టోబర్ స్కై’ 1999లో విడుదలైన హాలీవుడ్ సినిమా. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో కోల్ వుడ్ అనే ఓ చిన్న గ్రామంలో జరిగిన నిజజీవిత కథ ఆధారంగా తీశారు. ఆ గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఓ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల రాకెట్ తయారు చెయ్యాలని ఆలోచన వస్తుంది. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఎంతో వ్యతిరేకతని ఎదుర్కొని చివరికి చిన్న రాకెట్ తయారు చేస్తారు. ఆ రాకెట్‌ని ఓ జాతీయస్థాయి సైన్స్ ప్రాజెక్ట్ పోటీలో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్ హికమ్’. ఆ హోమర్ హికమ్ ఆ తర్వాతి కాలంలో తన రాకెట్ తయారీ అనుభవాన్ని ‘రాకెట్ బోయ్స్’ పేరుతో పుస్తకం రాశాడు. యూనివర్సల్ స్టూడియోస్ వారు పుస్తకం హక్కులు కొని ‘అక్టోబర్ స్కై’ పేరుతో సినిమాగా విడుదల చేసి హిట్ సాధించారు. పుస్తకం పేరు ‘రాకెట్ బోయ్స్’ను యథాతథంగా సినిమాకు కూడా పెడితే ‘ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు’ అని యూనివర్సల్ స్టూడియోస్ వారు అభిప్రాయపడడం చేత Rocket Boys అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే 'Rocket అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది 'October Sky' అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా సిలబస్‌లో పెట్టాయి. -
ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ.. ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోన్న ట్రైలర్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సూపర్బ్ అంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. తమ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
మిస్టరీ: అక్కడికి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా?
ప్రపంచాన్ని వణికించే ప్రదేశాల్లో ‘దార్గాస్’ ఒకటి. రష్యాలోని ‘నార్త్ ఒసీషియా– అలానియా’ రిపబ్లిక్లో గిజెల్డన్ నది సమీపంలో ఉన్న ఓ చిన్న పర్వతం మీద ఉన్న దార్గాస్ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని పిలుస్తారు. దీన్ని గ్రామం అనే కంటే శ్మశానాల దిబ్బ అనడమే కరెక్ట్. అక్కడి స్థానికులు పగటి పూట కూడా ఆ పర్వతం మీదకు ఒంటరిగా వెళ్లరు. ఆ దరిదాపుల్లో ఒంటరిగా తిరగరు. రాత్రి అయితే ఆ పర్వతం వైపు చూడను కూడా చూడరు. ‘నార్త్ ఒసీషియా–అలానియా’లో అత్యధికంగా నివసించే ఒసీషియన్ గిరిజన తెగకు చెందిన చరిత్రను చెబుతుంది ఈ ప్రాంతం. మధ్యయుగం నాటి ఒసీషియన్స్.. మరణించిన తమ కుటుంబసభ్యుల మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారట! ఇక్కడి శిథిల నిర్మాణాలు ఇంకెన్నో భయపెట్టే కథనాలతో బెదరగొడతాయి. దార్గాస్లో 99 సమాధులు చిన్నచిన్న ఇళ్ల మాదిరి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని దగ్గరదగ్గరగా.. ఇంకొన్ని దూరం దూరంగా.. మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా.. కనిపిస్తాయి. వాటికి ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది. దాని లోపలికి దిగడానికి పెద్దపెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే! అక్కడ సుమారు 10 వేలకుపైనే అస్థిపంజరాలు ఉన్నాయని అంచనా వేశారు పరిశోధకులు. అయితే అక్కడున్న శవపేటికలు పడవ ఆకారంలో ఉన్నాయట. చనిపోయిన వారి ఆత్మ.. నదులను దాటుకుని స్వర్గానికి వెళ్లడానికి పడవ అవసరమని అక్కడి స్థానిక పురాణాలు చెబుతాయి. ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు, వస్తువులను కూడా ఉంచేవారు. అయితే దార్గాస్ పర్వతం మీదకు వెళ్లినవారు తిరిగిరారనే ప్రచారం కూడా ఉంది. కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీదకెక్కి, అక్కడి సమాధుల మధ్యకు వెళ్లి, ఇక తిరిగి రాలేదట! దార్గాస్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతుంటారు. నిజానికి అక్కడ కేవలం 99 సమాధులే ఉన్నా, పదివేలకు పైగా అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నకు బదులుగా ఒక విషాదగాథ వినిపిస్తుంది. 18వ శతాబ్దంలో ఒసీషియాలో ప్లేగు వ్యాపించింది. ఆ సమయంలో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం.. ఈ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను పునరుద్ధరించి.. అక్కడ ప్లేగు వ్యాధిగ్రస్తులను ఉంచేవారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. వారికి కావాల్సిన ఆహారాన్ని, వస్తువులను అందించేవారట. వ్యాధి సోకిన వారు తిరిగి ఊళ్లోకి రావడానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట. దాంతో ఆ పర్వతం మీదే ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు కనీసం ఖననానికి కూడా నోచుకోకపోవడంతో మిగిలిన వ్యాధిగ్రస్తులు కుళ్లిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారని చరిత్ర చెబుతోంది. వరుస మరణాలతో నాటి పరిస్థితి చాలా ఘోరంగా గడిచిందట. నిజానికి దార్గాస్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఒక పక్క నది.. మరో పక్క ఎత్తయిన కొండలు, కొన్నిసార్లు నేలమీద దట్టంగా పేరుకున్న మంచు, మంచు కరిగినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల.. ఇలా కాలానికి తగ్గట్టుగా మారే దార్గాస్ ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి అందరూ సాహసించరు. కొందరు సాహసికులు మాత్రమే ఇక్కడికి Ðð ళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా రాత్రిపూట దార్గాస్ కొండల మీదకు వెళ్లేందుకు అనుమతి లేదు. మరి నిజంగానే అక్కడకి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు.. తెలుగులోనూ వస్తోన్న థ్రిల్లర్ మూవీ!
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో టాలీవుడ్ అభిమానుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. తెలుగు వర్షన్‌ను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. కాగా.. 2006లో కొడైకెనాల్లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 𝐓𝐡𝐞 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐠𝐫𝐨𝐬𝐬𝐢𝐧𝐠 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐚𝐦 𝐟𝐢𝐥𝐦 - #ManjummelBoys is now coming to 𝐞𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐚𝐮𝐝𝐢𝐞𝐧𝐜𝐞 ❤️🔥 Grand release worldwide on April 6th. Telugu release by @MythriOfficial, @Primeshowtweets & @SukumarWritings ✨… pic.twitter.com/xDULaAgbVx — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2024 -
ఆరు నెలల తర్వాత ఓటీటీకి హనీ రోజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక సినీ ప్రియులు పంథానే మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఏ భాషల్లో తెరకెక్కించినా సరే.. డబ్బింగ్ చేసి ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తున్నారు. అలా స్ట్రీమింగ్ అయ్యే వాటిలో మలయాళ చిత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా మరో మలయాళ సూపర్ హిట్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. మలయాళంలో తెరకెక్కించిన రాణి: ది రియల్ స్టోరీ సెప్టెంబర్ 2023లో విడుదలైంది. కేరళలో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 7న మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇది కేవలం మలయాళ ప్రేక్షకుల మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాకు శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు ధర్మరాజన్ని రహస్యంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పనిమనిషి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది అలాంటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రంలో హనీ రోజ్, గురు సోమసుందరం, ఇంద్రన్స్, అశ్విన్ గోపీనాథ్, అశ్వత్ లాల్, భావన, నియతి కాదంబి, మాలా పార్వతి, అనుమోల్, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న రియల్ క్రైమ్ థ్రిల్లర్.. ఆ టాలీవుడ్ మూవీని దాటేసి!
ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేస్తున్నారు. ముఖ్యంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సాధారణ సినిమాలతో పోలిస్తే.. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు. తెలుగులో ఇటీవల రిలీజైన దూత, ది విలేజ్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవలే ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్' ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హత్యల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. డిసెంబర్ 22న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా టాప్-3లో నిలిచింది. టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ, షారుక్ ఖాన్ జవాన్‌ను, ఆక్వామన్ చిత్రాలను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 30 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించారు. -
టీజర్ తో షాక్ ఇచ్చిన నరేష్,పవిత్ర.. రియల్ కథనే సినిమాగా మళ్ళీపెళ్లి..
-
కన్నబిడ్డల కోసం ఆ తల్లి పోరాడింది, చివరకు..
పిల్లలకు చిన్నగాయమైనా, కాసేపు కనిపించకపోయినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది.. వాళ్లను తమ నుంచి శాశ్వతంగా దూరం చేసే యత్నం చేస్తే? తమ సంరక్షణలో పెరగనివ్వకుండా చట్టాలు అడ్డుకుంటే!. సముద్రాల అవతల ఎక్కడో విదేశాల్లో దూరమైన బిడ్డలు.. స్వదేశంలో తల్లి చెంతకు చేరిన కథే ఇది. అందుకోసం చట్టం పోరాడిందామె. ఈ క్రమంలో భర్తకు దూరమైంది. ఆయినా ఆమె కుంగిపోలేదు. ప్రయత్నించి.. చివరకు పిల్లలను దక్కించుకుంది. ఆ కథనే రాణీ ముఖర్జీ లీడ్ రోల్లో బాలీవుడ్లో ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’గా తెరకెక్కించారు. తన కన్నబిడ్డల కస్టడీ కోసం భారత్‌కు చెందిన ఓ మహిళ.. నార్వే ప్రభుత్వంతో పోరాడింది. ఆ పోరాటం అప్పట్లో వార్తల్లో హెడ్‌లైన్స్ అయ్యింది. ఆ గడ్డపై ఓటమి పాలైనా.. అది తాత్కాలికమే అయ్యింది. చివరికి స్వదేశానికి చేరుకుని పిల్లల కోసం కోర్టు మెట్లెక్కింది. ఆ తల్లి విజయం సాధించి పదేళ్లు పూర్తైంది. ఇంతకీ అప్పుడేం జరిగింది.. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన అనురూప్ ఛటర్జీ ఉద్యోగం రిత్యా నార్వేకు వెళ్లాడు. కూడా భార్య సాగరికాను తీసుకెళ్లాడు. అప్పటికే వాళ్లకు ఓ కొడుకు ఉన్నాడు. ఆటిజంతో బాధపడుతున్న ఆ బాబును చూసుకోవడంతోనే సాగరికకు సరిపోయేదట. ఈలోపు ఆమె మళ్లీ గర్భం దాల్చింది. దీంతో కొడుకును చూసుకోవడం కష్టంగా మారిందామె. ఇదే ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి, కన్నబిడ్డలను దూరం చేసేందుకు నార్వే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. నార్వేలో పిల్లల సంరక్షణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందరూ వాటిని పాటించాలి. పిల్లలను కొట్టినా.. చివరకు చేత్తో తినిపించినా శిక్షార్హమైన నేరమే. అలాంటిది కొడుకు కోసం సెపరేట్ బెడ్ లేకపోవడం(తండ్రితోనే పడుకునేవాడు)తో.. ఆమె తన కొడుకును సరిగా చూసుకోవడం లేదంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్(Barnevarne అని కూడా అంటారు)కు ఫిర్యాదు వెళ్లింది. వెంటనే అనురూప్ ఇంటికి బార్నెవార్నె అధికారులు వెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె గర్భవతిగా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఈ క్రమంలో.. ఆమె కొడుకు వెళ్లే ప్లే స్కూల్ నిర్వాహకులు.. సాగరిక దినచర్య సరిగా ఉండదని, తరచూ పిల్లాడి విషయంలో కౌన్సిలింగ్‌కు పిలిచేవాళ్లమంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్‌కు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంతలో మరో బిడ్డను ప్రసవించాక ఆ పరిస్థితి మరింత దిగజారింది. పిల్లలిద్దరినీ ఆమె సరిగా పెంచడం లేదంటూ.. వాళ్లను తల్లిదండ్రులకు దూరంగా సంరక్షణా కేంద్రంలో ఉంచారు. అలాగే 18 ఏళ్లు నిండేవరకు వారు అక్కడే పెరుగుతారని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. ఇది జరిగింది 2011లో. అప్పటికి కొడుకు వయసు రెండున్నరేళ్లు కాగా, పాపకి ఏడాది వయసు కూడా లేదు. కోర్టుకు వెళ్తే.. సంరక్షణా కేంద్రానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. కావాలంటే ఏడాదిలో మూడుసార్లు మాత్రమే వచ్చి చూడొచ్చంటూ కోర్టు తల్లిదండ్రులకు చెప్పింది. మానసికంగా వాళ్లకు కుంగదీసింది ఈ పరిణామం. ఆ ప్రభావంతో అనురూప్-సాగరికల మధ్య దూరం పెరిగి.. విడిపోయారు. కోల్‌కతా కోర్టు తీర్పు అనంతరం బయట సంతోషంగా సాగరిక మరోవైపు సాగరిక కథ హెడ్‌లైన్స్ ద్వారా భారత్‌కు చేరింది. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దౌత్యపరమైన పరిష్కారం కోసం యత్నించింది. కానీ, నార్వే ప్రభుత్వం మొండివైఖరి అవలంభించింది. చివరికి.. భారత్ ఒత్తిడికి తలొగ్గి బంధువులకు అప్పగించేందుకు నార్వే ప్రభుత్వం అంగీకరించింది. అలా.. 2012లో పిల్లలు భారత్‌లోని తమ బంధువు వద్దకు వచ్చారు. కానీ, సాగరిక తన న్యాయపోరాటం ఆపలేదు. స్వస్థలానికి చేరుకున్నాక.. కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిందామె. 2013 జనవరిలో కోల్‌కతా హైకోర్టు పిల్లలను ఆమె కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఎట్టకేలకు ఆమె బిడ్డలు ఆమె చెంతకు చేరారు. ఆ సమయంలో ఆ తల్లికి అవి వర్ణించలేని క్షణాలు. సాగరిక పోరాటాన్నే ఇప్పుడు తెరపై రాణీ ముఖర్జీ ప్రదర్శించబోతున్నారు. మార్చి 17వ తేదీన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రం విడుదల కానుంది. :::సాక్షి ప్రత్యేకం -
సంచలన హైడ్రామా పడ.. ఆ నలుగురు ఏమయ్యారు?
వాస్తవ కథ తెర రూపానికి క్రియేటివిటీని జోడించడం షరా మామూలుగా మారింది ఈరోజుల్లో. కానీ, మలయాళ చిత్రం ‘పడ’(సైన్యం)కి అలాంటివేం ఎదురు కాలేదు. ఎందుకంటే.. ఇదొక నాటకీయమైన పరిణామం. నలుగురు అతివాదులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనే పడ చిత్రానికి కథ. ఇందుకోసం ఓ కలెక్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలోనే కొన్ని గంటలపాటు బంధించి.. అధికారులతో పాటు రాజకీయ నాయకులనూ హడలెత్తిస్తారు. చివరికి డిమాండ్ నెరవేర్చే హామీతో.. కలెక్టర్ నిర్బంధం నుంచి విడిచిపెట్టి, పోలీసులు తమనేం చేయకూడదనే షరతు మేరకు స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తారు. ఆఖర్లో.. మీడియా ముందు తాము తెచ్చినవి డమ్మీ ఆయుధాలంటూ ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. పడ కథ ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఆ నలుగురు అతివాదులు ఏమయ్యారు?. అసలు పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఎపిసోడ్‌కి ముందు.. తర్వాత ఏం పరిణామాలు జరిగాయి?. ఈ హైడ్రామా చివర్లో ఆ నలుగురు మీడియా ముందు ఇచ్చిన ట్విస్ట్‌ను కలెక్టర్ రెడ్డి ఎందుకు నమ్మట్లేదు?.. 1996 అక్టోబర్ 4వ తేదీన.. అయ్యన్‌కాళి పడ గ్రూప్ ఉద్యమకారులు కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్లు.. అప్పటి పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డిని తొమ్మిది గంటలపాటు బంధీ చేశారు. కలెక్టర్ ఆఫీస్‌కు రోజూవారీ వచ్చే ఫిర్యాదుదారుల్లాగా వచ్చి.. తుపాకీ, డైనమెట్లు చూపించి సిబ్బందిని బెదిరించి కలెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు తొమ్మిది గంటలకు పైగా ఈ హైడ్రామా నడిచింది. మావోయిస్ట్ సానుభూతి పరులైన ఈ గ్రూప్ సభ్యులు.. వివాదాస్పదమైన ఆదివాసీ ల్యాండ్ బిల్లు రద్దు కోసం ఈ పని చేశారు. చాలాకాలం నుంచే రెక్కీ.. 1996లో ఈకే నాయర్ నేతృత్వంలోని(ముఖ్యమంత్రి) లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ సర్కార్ కేరళ షెడ్యూల్ తెగల (భూముల బదిలీపై పరిమితి, అన్యాక్రాంతమైన భూముల పునరుద్ధరణ) చట్టాన్ని సవరించింది. ఈ సవరణల ద్వారా తమ భూమిపై ఆదివాసీల హక్కులకు భంగం కలుగుతుందనేది అయ్యన్‌కాళి పడ ఆవేదన. అందుకే పాలక్కాడ్ కలెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డిని బంధించి.. డమ్మీ ఆయుధాలతో నిరసన వ్యక్తం చేయాలని, తద్వారా దేశం దృష్టిని ఆ అంశంపైకి మళ్లించాలని ప్లాన్ వేసింది. ఈ మొత్తం ఆపరేషన్‌కి రావుణ్ణి మాస్టర్ మైండ్. కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్ నలుగురు సభ్యులు. తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అనుకుని ఈ ఆపరేషన్‌కి ముందుకొచ్చారు వాళ్లు. వాస్తవానికి ఈ ఆపరేషన్‌ను చాలాకాలం వాయిదా వేస్తూ వచ్చారు. అందుకుకారణం.. నలుగురిలో ఒకరు వెనుకంజ వేయడం. చివరికి.. ఆవ్యక్తి సైతం ముందుకు రావడంతో పనులు మొదలుపెట్టారు. పాలక్కాడ్ కలెక్టరేట్ దగ్గర రెండువారాలు రెక్కీ వేశారు. పర్యావరణ వేత్తల ముసుగులో కలెక్టరేట్‌కు వెళ్లారు. ఈ ఆపరేషన్‌లో బాబును రాజకీయ మధ్యవర్తిగా, రమేషన్ మిలిటరీ కమాండర్ పాత్ర పోషించారు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఆ నలుగురు శిక్షణ తీసుకున్నారు. గుడ్డు పొరలు, ప్లాస్టిక్ పైపులు, వైర్లు టేపుతో డమ్మీ డైనమెట్లు, డమ్మీ తుపాకీ.. ఇలా కొంత సామాగ్రిని బ్యాగుల్లో వేసుకుని వెళ్లారు. కూడా ఆకలి తీర్చుకునేందుకు డ్రైఫ్రూట్స్, విటమిన్ సి ట్యాబెట్స్, బ్రెడ్ బిస్కెట్లు అరటి పండ్లు మోసుకెళ్లారు. వాస్తవానికి.. వాళ్ల లక్ష్యం డిప్యూటీ కలెక్టర్. కానీ, ఆ ఆఫీస్ దూరంగా ఉండడంతో.. కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకున్నారట. తొమ్మిది గంటల హైటెన్షన్ 1996 అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10.30 ప్రాంతంలో.. కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్ నలుగురు అయ్యన్‌కాళి పడ సభ్యులు పాలక్కాడ్ కలెక్టర్ రెడ్డిని బంధించారు. ఆపై తమ డిమాండ్‌ను సీఎస్ సీపీ నాయర్‌తో పాటు కోజికోడ్‌లోని ఏషియన్ నెట్ ఛానెల్(ఆ టైంకి కేరళలో అదొక్కటే ప్రైవేట్ ఛానెల్)కు సమాచారం అందించారు. మధ్యలో కలెక్టర్‌ను తన భార్యతోనూ ఫోన్లో మాట్లాడించి.. ఆమెనూ బెదిరించారు కూడా. మధ్యలో పోలీసుల బలవంతపు చర్యను అడ్డుకునేందుకు క్రాకర్స్ మందు గుండును కాల్చి భయపెట్టారట. ఇక మధ్యవర్తిత్వం కోసం ఉద్యమవేత్త ముకుందన్ మీనన్, జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్.. ఈ ఇద్దరి పేర్లను తొలుత పరిశీలించారు. చివరగా.. అడ్వొకేట్ వీరచంద్ర మీనన్ మధ్యవర్తిగా వ్యవహరించమని కోరారు. మధ్యవర్తి వీరచంద్ర మీనన్ చర్చలతో చివరకు హామీ మీద చర్చలకు సిద్ధమయ్యారు. అదే రాత్రి.. జిల్లా జడ్జి కే. రాజప్పన్ ఆచారీ సమక్షంలో కలెక్టర్‌ను వదిలేయడంతో పాటు ఎలాంటి కేసు లేకుండా స్వేచ్ఛగా బయటకు వచ్చేశారు. ఆ నలుగురూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యే జేబులో పైసా లేకుండా వెళ్లారట. అందుకే అడ్వోకేట్ వీరచంద్ర మీనన్ కారులోనే త్రిస్సూర్‌లో దిగి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. వేట.. అరెస్టులు పాలక్కాడ్ కలెక్టర్ బంధీ వ్యవహారంలో కలెక్టర్ రెడ్డి ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదు చేయలేదు. దీంతో జడ్జి ఆచారీ ఎలాంటి కేసులు ఉండవనే హామీ ఇవ్వడంతో పోలీసులను వాళ్లను వదిలేసినట్లు సినిమాలో చూపించారు. కానీ, కలెక్టర్ రెడ్డితో బలవంతంగా పోలీసులు కేసు పెట్టించారని శివకుట్టీ ఆరోపిస్తున్నారు. ఆ నలుగురి కోసం వేట ఉధృతిన సాగింది. ఈ నలుగురినే కాదు.. ఆ సమయంలో ఆదివాసి భూహక్కుల కోసం పోరాడిన కొందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏడు నెలల తర్వాత.. అజయన్ మన్నూర్ను మువట్టుపులలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఏడాదిన్నరలో రమేషన్, శివకుట్టీని వయనాడ్, అట్టపుడి ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. అయితే నాలుగో నిందితుడు బాబు మాత్రం ఘటన జరిగిన 14 ఏళ్లకు .. అంటే 2010లో పాలక్కాడ్ కోర్టులో సరెండర్ అయ్యాడు. ఈ వ్యవహారంలో బాబు తప్ప అందరినీ దోషులుగా నిర్ధారించింది కోర్టు. బాబును కలెక్టర్ రెడ్డి గుర్తు పట్టకపోవడమే అందుకు కారణం!. వాస్తవానికి ముగ్గురు నిందితులకు పదమూడున్నర ఏళ్ల శిక్ష పడాల్సి ఉందని, కానీ, కుట్రకు సంబంధించిన ఆరోపణలేవీ రుజువు కాకపోవడం, వాళ్లది ఉన్నత లక్ష్యం కావడం, కలెక్టర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా వ్యవహరించినందుకుగానూ నిందితులకు మూడున్నరేళ్లకు శిక్ష తగ్గించింది కోర్టు. ఆపై అభ్యర్థన పిటిషన్ల మేరకు.. ఆ శిక్షను ఏడాదికే కుదించారు. ఈ కేసులో అప్పీల్ పిటిషన్ ఇంకా కేరళ హైకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. ఈ వ్యవహారంలో ఆ నలుగురు మొత్తంగా.. 113 రోజులపాటు రిమాండ్‌లో గడిపారు. The four 'extremists' called up @NewIndianXpress office in Palakkad, and informed their intention to hold a press conference. Express was told to alert this to other media offices in Palakkad, as per this report. In the film, Express was changed to Asianet? https://t.co/hxPCYGtEbx — Rajesh Abraham🇮🇳 (@pendown) April 1, 2022 నాటకీయత లేదు కానీ.. ఆంధ్రప్రదేశ్ అబ్దుల్లాపురంలో పుట్టిన డబ్ల్యూఆర్ రెడ్డి.. కేరళ 1986 క్యాడర్‌కు చెందిన అధికారి. అయితే పాలక్కాడ్ ఘటన తర్వాత రాజకీయంగానూ ఆయన విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆయన మావోయిస్టుల సానుభూతిపరుడని, పలక్కడ్ ఘటనలో నిందితులకు సహకరించారనే విమర్శల్ని ఎల్డీఎఫ్ గుప్పించింది. అయితే.. రాజకీయాల్లో, ప్రత్యేకించి కేరళ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అంటున్నారు ఆయన. విమర్శలను ఆయన చాలా తేలికగా తీసుకున్నారు. పడ కథలో నాటకీయత అనే అంశం కనిపించలేదు. చాలా బాగా తీశారు. క్లైమాక్స్‌లో మీడియా వాళ్లను ప్రశ్నిస్తున్నప్పుడు, వారు కేవలం బొమ్మ పిస్టల్ మరియు నకిలీ పేలుడు పదార్థాలను మాత్రమే తీసుకెళ్లారని చెప్పారు. వారు ఆయుధాలు కలిగి ఉన్నారని నేను 'అనుకోవడం' లేదు. ఎందుకంటే వారు నిజంగా ఆయుధాలు కలిగి ఉన్నారని నాకు తెలుసు. ఆ విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. వారి బ్యాగ్‌లను తనిఖీ చేయడానికి, వారి వాదనను ధృవీకరించడానికి ఎవరు ఆ సమయానికి ప్రయత్నించలేదు. బదులుగా, కథనాన్ని వేగంగా మార్చడంలో వాళ్లు విజయం సాధించారు. ఇదంతా జర్నలిజం వైఫల్యంగా నేను భావిస్తున్నాను. వాళ్లు నాకు ఎలాంటి హాని తలపెట్టలేదని, మర్యాదపూర్వకంగా వ్యవహరించారని మాత్రమే జడ్జి ముందు చెప్పాను. అంతేగానీ కేసు పెట్టనని అనలేదు(బహుశా అది దర్శకుడి క్రియేటివిటీ ఏమో!). ఆ మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేశా. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి నాపై లేదు అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు రెడ్డి. కేరళలో కొన్నాళ్లపాటు పని చేసిన తర్వాత కేంద్రం సర్వీసులకు ఆయన బదిలీపై వెళ్లారు. నటుడు అర్జున్ రాధాకృష్ణన్(ఎడమ).. డబ్ల్యూఆర్ రెడ్డి (ఫైల్ ఫొటో.. కుడి వైపు) పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఉదంతంలో.. డమ్మీ ఆయుధాలతో పది గంటలపాటైన నిలువరించగలిగామని చెప్తున్నారు అజయన్. అయితే అప్పటి సీఎం ఈకే నాయర్.. ఆ ఘటన జరిగిన సమయానికి ఎమ్మెల్యే కూడా కాదు. తలస్సెరీ బై ఎలక్షన్ హడావిడిలో ఉన్నారాయన. ఆ ఎన్నికలు ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే కలెక్టర్‌ను కాపాడాలనే ప్రయత్నాలు చేయించారు. ఒకవేళ.. ఈరోజుల్లో గనుక అలాంటి ఘటనే జరిగి ఉంటే.. ఈపాటికే చచ్చి ఉండేవారేమో అంటున్నారు ఆ నలుగురు. మరి ఇంత చేసి.. వాళ్ల డిమాండ్ ఏమైంది?.. ఎవరూ పట్టించుకోలేదు. మీడియా అదంతా బంధీ నాటకంగా అభివర్ణించింది. ఆ తర్వాత ఆ విషయమూ, బంధీ వ్యవహారమూ కనుమరుగు అయి పోయాయి. పడ సినిమా షూటింగ్లో దర్శకుడు కమల్ దళిత నేత అయ్యన్‌కాళి పేరిట వెలిసిన రెబల్ గ్రూప్(మావోయిస్ట్ సానుభూతి).. అయ్యన్‌కాళి పడ. ప్రస్తుతం ఈ నలుగురు ఉద్యమవేత్తలుగా క్రియాశీలకంగా ఉన్నారు. కలెక్టర్‌ను బంధించిన ఘటన ఆధారంగానే.. జర్నలిస్ట్ కమ్ దర్శకుడు అయిన కేఎం కమల్ ‘పడ’ సినిమాను తీశాడు. ప్రకాశ్ రాజ్, కున్జక్కో బోబన్, దిలీశ్ పోతన్, ఇంద్రన్స్, సలీం కుమార్, వినాయకన్, జోజు జార్జ్ లాంటి తారాగణంతో సినిమాను తెరకెక్కించాడు. పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఘటన జరిగిన సమయంలో కమల్ జర్నలిజం డిప్లోమా స్టూడెంట్‌గా ఉన్నాడట. 2018 నుంచి నాలుగేళ్లపాటు ఈ ఉదంతంలో ఉన్న అందరినీ కలుసుకుని.. సినిమాగా తెరకెక్కించాడు. క్యారెక్టర్ల పేర్లకు మాత్రమే కొంచెం మార్పులు చేశాడు. అందుకే సినిమా పట్ల ఆ నలుగురే కాదు.. ఎవరూ పెద్దగా అభ్యంతరాలేవీ వ్యక్తం చేయలేదు. పడ మూవీ.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది -
పొలిటికల్ మిషన్
నవీన్ చంద్ర హీరోగా హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర, మై విలేజ్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మిషన్ 2020’. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రేరణతో వాస్తవ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. కరణం బాబ్జీ దర్శకత్వంలో కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కేవీఎస్‌ఎస్‌ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 5న సినిమా విడుదల కానుంది. ‘‘ఈ సినిమాను చూసి ఏషియన్ ఫిలిమ్స్ విడుదల చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో సినిమా తీయడం అంటే డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. సినిమా బాగా నచ్చింది కాబట్టి నైజాంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్. ‘‘పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు కరణం బాబ్జీ. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలు ఘనవిజయం సాధించాయి. సినిమా కూడా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు కేవీఎస్‌ఎస్‌ఎల్ రమేష్ రాజు. ఎగ్జిబిటర్ శ్రీధర్, సంగీతదర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ తదితరులు పాల్గొన్నారు. -
'నా సినిమా'.. సంచలనం
తనకు జరిగిన అన్యాయంపై సినిమా నిర్మించడానికి కథను రూపొందిస్తున్నానని, అందులో ఓ ప్రముఖ నటి హీరోయిన్గా నటించనుందని సినీ నటి తారాచౌదరి వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఓ గొడవ ద్వారా వార్తల్లోకి వచ్చిన తారా చౌదరి తన నివాసంలో సాక్షితో మాట్లాడారు. తాను తీసే సినిమాలో చాలా సంచలనాలు ఉండబోతున్నాయని, తనను కేసుల్లో ఎలా ఇరికించారు, ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలను ప్రస్తావించబోతున్నట్లు వెల్లడించారు. దీనికంటే ముందు తానే నిర్మాతగా భారీ బడ్జెట్‌తో మరో సినిమాను నిర్మిస్తున్నట్లు, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యం.. మొదటి సినిమా పూర్తవగానే సమాజ సేవకు నడుంబిగిస్తానని ఆమె తెలిపారు. వృద్ధులు, అనాథలు, వికలాంగులకు ఆశ్రమాలు నిర్మించే యోచన ఉందన్నారు. సేవా కార్యక్రమాల కోసం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏడు సంవత్సరాలుగా పబ్లిసిటీ లేకుండా సమాజసేవ చేస్తున్నానని, ఒంగోలు, గుంటూరు, తెనాలిలో పలు సహాయ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. చాలా మంది బడాబాబులు సమాజ సేవ కోసం డబ్బులు ఇస్తుంటారని, అయితే ఒక వేదిక లేకపోవడంతో వారు విరాళాలు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. తనకు తెలిసిన మిత్రులతో ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాలను సమాజ సేవ కోసం వినియోగిస్తానని తెలిపారు. పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదు... ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటానని, పరిచయం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే యోచన ఉందన్నారు. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోబోనని రెండు సినిమాలు పూర్తయిన తర్వాతనే వచ్చే ఏడాది వివాహం చేసుకుంటానని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశా.. 2012 మార్చి 31వ తేదీన అక్రమ కేసుల ద్వారా అరెస్టు అయి జైలు జీవితం గడిపానని, విడుదలైన తర్వాత బెంగళూర్ వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు చెప్పారు. వ్యాపారంలో మంచి ఆదాయం వచ్చిందని, ఇప్పుడు ఆ డబ్బుతోనే సినిమా తీయాలనే లక్ష్యంతో ఇటీవలే హైదరాబాద్‌కు మకాం మార్చినట్లు తెలిపారు. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అసలే లేదన్నారు. సమాజంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించడం, అన్యాయం చేసిన వారిపై కక్ష తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించారు. -
తెరపైకి మరో యథార్థగాథ
ఇంతకు ముందు మలయూర్ మంబట్టియాన్, శివలపేరి పాండి వంటి యథార్థ కథా చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా 1940లో తమిళ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న వీర్ ముత్తు అనే వ్యక్తి ఇతి వృత్తంగా రూపొందస్తున్న చిత్రం వీరన్ ముత్తురాకు అని ఆ చిత్ర దర్శకుడు రాజశేఖర్ తెలిపారు. దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ నిర్మించిన వెలుతుకట్టు చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన కధిర్ వీరన్ముత్తు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో లియాశ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, తమిళనాడు, శివగంగ జిల్లాలలోని ఆవరనకాడు గ్రామంలో రాబిన్‌హుడ్ లాంటి యువకుడు వీరన్ముత్తు అని తెలిపారు. ఈయన ఇతివృత్తాన్ని చిన్నతనంలో తన తల్లి చాలా సార్లు చెప్పేవారన్నారు. దాన్ని తానిప్పుడు కొన్ని కమర్షియల్ అంశాలను జోడించి వీరన్ముత్తురాకు పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ యథార్థ కథకు కొంచెం రొమాంటిక్ సన్నివేశాలను జోడించినట్లు చెప్పారు. ఈ చిత్రం తన సినీ కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇస్తుందనే విశ్వాసాన్ని నటుడు కధిర్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏమవుతుందో వేచిచూద్దాం! -
మరో రియల్ స్టోరీతో ఏక్తా కపూర్
-
రియల్.. గన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలు... రాయలసీమకు చెందిన రియల్టర్లు.. ఆదిలాబాద్‌లో భూదందా.... ఈ మూడు ప్రధాన ఇతివృత్తాలుగా సినిమా స్టోరీని తలపించేలా ఓ రియల్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే సీఐడీ దర్యాప్తుతోపాటు పోలీసు ఉన్నతాధికారుల విచారణ వరకు వెళ్లిన ఈ వ్యవహారం తాజా గా బయటపడింది. పోలీసు విభాగం ఇప్పటికీ రహస్యంగా ఉంచిన ఈ ఘటనకు సంబంధించి ‘సాక్షి’కి విశ్వసనీయంగా అందిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలు ఏడాది కిందట ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో చెరో 50 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. రాయలసీమకు చెందిన ఓ బడా రియల్టర్ ఈ భూములను అమ్మకానికి పెట్టాడు. ఓ బ్రోకర్ చెప్పిన మాయమాటలు నమ్మి... ఇద్దరు సీఐలు లక్షలాది రూపాయలు కట్టబెట్టి బినామీ పేర్లతో ఈ భూములను సొంతం చేసుకున్నారు. కాగితాలపై విలువైన భూమిని తక్కువ ధరకు అమ్ముతున్నట్లుగా చూపించిన దళారులు.... ఏకంగా సీఐలకు కుచ్చుటోపీ పెట్టారు. అక్కరకు రాని అటవీశాఖ భూములు, వాగులు, వంకలున్న ప్రాంతాన్ని అంటగట్టారు. తీరా... తాము మోసపోయిన విషయాన్ని సీఐలు గుర్తించేలోగా జారుకున్నారు. రాయలసీమకు చెందిన కె.విజయకుమార్‌రెడ్డి ఈ భూముల లావాదేవీల్లో సీఐకి, రియల్టర్‌కు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. ఎట్టకేలకు అతడి ఆచూకీ తెలుసుకున్న సీఐలు... తమ డబ్బులు తమకు ఇప్పించాలని పట్టుబట్టా రు. అప్పటికీ రియల్టర్ తమ దారికి రాకపోవటంతో బెదిరించారు. ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలని నానాతంటాలు పడ్డారు. ఒకదశలో తమ దగ్గర ఉండే తుపాకీ చూపిం చి భయపెట్టారని... డబ్బులిప్పించాలని బెదిరిస్తున్నారని విజయకుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకున్న రాజకీయ అండదండలతో రియల్టర్ ఈ వ్యవహారాన్ని సీఐడీ విభాగానికి చేరవేశారు. రంగంలోకి దిగిన సీఐడీ విభాగం రహస్యంగా దర్యాప్తు చేపట్టింది. ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్పీ రవీందర్ హయాంలో విచారణ నివేదిక కోరినట్లు తెలిసింది. నిజానిజాలు బయటపడటంతో సీఐలపై చర్యలు తీసుకునేందుకు సీఐడీ పావులు కదిపింది. ఈలోగా సీఐలు తమవంతు ప్రయత్నాలు చేయటం... ఆ విభాగంలోని ఉన్నతాధికారులు బదిలీ కావడంతో ఈ స్టోరీకి బ్రేక్‌లు పడ్డాయి. సినీఫక్కీలో సాగిన ఈ చాటుమాటు వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తొక్కిపెట్టారా? శరవేగంగా ఆరా తీసిన సీఐడీ విభాగం ఈ ఫైలును పక్కన పడేసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
రియల్ స్టోరీ