ఆరు నెలల తర్వాత ఓటీటీకి హనీ రోజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | 'Rani: The Real Story' Is Now Streaming On This OTT | Sakshi
Sakshi News home page

Honey Rose: ఆర్నెళ్ల తర్వాత ఓటీటీకి రియల్ స్టోరీ.. కేవలం వారికి మాత్రమే!

Published Tue, Mar 5 2024 10:00 PM | Last Updated on Wed, Mar 6 2024 8:50 AM

Honey Rose The Real Story the family based film Streaming On This Ott - Sakshi

ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక సినీ ప్రియులు పంథానే మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఏ భాషల్లో తెరకెక్కించినా సరే.. డబ్బింగ్‌ చేసి ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తున్నారు. అలా స్ట్రీమింగ్‌ అయ్యే వాటిలో మలయాళ చిత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా మరో మలయాళ సూపర్‌ హిట్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

మలయాళంలో తెరకెక్కించిన రాణి: ది రియల్ స్టోరీ సెప్టెంబర్ 2023లో విడుదలైంది. కేరళలో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 7న మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇది కేవలం మలయాళ ప్రేక్షకుల మాత్రమే అందుబాటులో ఉండనుంది. 

ఈ సినిమాకు శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు ధర్మరాజన్‌ని రహస్యంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పనిమనిషి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది అలాంటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రంలో హనీ రోజ్, గురు సోమసుందరం, ఇంద్రన్స్, అశ్విన్ గోపీనాథ్, అశ్వత్ లాల్, భావన, నియతి కాదంబి, మాలా పార్వతి, అనుమోల్, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement