Manorama
-
ఆరు నెలల తర్వాత ఓటీటీకి హనీ రోజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక సినీ ప్రియులు పంథానే మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఏ భాషల్లో తెరకెక్కించినా సరే.. డబ్బింగ్ చేసి ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తున్నారు. అలా స్ట్రీమింగ్ అయ్యే వాటిలో మలయాళ చిత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా మరో మలయాళ సూపర్ హిట్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. మలయాళంలో తెరకెక్కించిన రాణి: ది రియల్ స్టోరీ సెప్టెంబర్ 2023లో విడుదలైంది. కేరళలో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 7న మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇది కేవలం మలయాళ ప్రేక్షకుల మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాకు శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు ధర్మరాజన్ని రహస్యంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పనిమనిషి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది అలాంటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రంలో హనీ రోజ్, గురు సోమసుందరం, ఇంద్రన్స్, అశ్విన్ గోపీనాథ్, అశ్వత్ లాల్, భావన, నియతి కాదంబి, మాలా పార్వతి, అనుమోల్, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. -
నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!
లెన్స్, మస్కిటో ఫిలాసఫీ, తలైకూత్తల్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్ర దర్శకుడు జియో బేబీ సమర్పణలో మెన్ కైండ్ సినిమాస్, నితీష్ ప్రొడక్షన్స్, సిమెట్రీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి కీలకపాత్రలో నటించారు. ఆమెతో పాటు లిజోమోల్, వినీత్, కలేశ్ రామనాథ్, అనుష్క, దీప ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా కాదల్ ఎంబదు పొదువుడమై మూవీ 54వ ఇండియన్ పనోరమ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైనట్లు మేకర్స్ తెలిపారు. తమిళ చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్నాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఈ ఆధునికకాలంలో మనుషుల భావాలు, దురాలోచనలు, సామాజిక పరిస్థితి, విజ్ఞానం వంటి అంశాలతో కూడిన ఆధునిక ప్రేమను ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కాగా 2023 ఏడాదిగానూ ఇండియన్ పనోరమ చిత్రోత్సవాలకు 408 చిత్రాలు నామినేట్ కాగా.. అందులో 25 చిత్రాలు మాత్రమే ఎంపికై నట్లు చెప్పారు. ఆ 25 చిత్రాల్లో తమ కాదల్ ఎంబదు పొదువుడమై చిత్రం చోటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఈ సినిమాకు కన్నన్ నారాయణన్ సంగీతమందించగా.. శరవణన్ సినిమాటోగ్రఫీ అందించారు. -
వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ
పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో టీచర్లదే ప్రముఖ పాత్ర. అయితే, తరగతిలో ఉన్న విద్యార్థుల్నే కాదు.. వీధుల్లో చిల్లర డబ్బులు అడుగుతూ (యాచిస్తూ) తిరుగుతున్న వీధి బాలలను కూడా బడిలో చేర్పించి, తానే స్వయంగా పాఠాలు బోధిస్తూ... వారి జీవితాలనే మార్చేస్తున్నారు మనోరమ టీచర్. ఆసరాలేని పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తూ వారిని చేరదీసి, ఆశ్రయమివ్వడమే కాకుండా విద్యాబుద్ధులు సైతం నేర్పించి భవిష్యత్‌ను బంగారు మయం చేస్తుండడంతో మనోరమను అంతా మమ్మీజీ అని పిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ పరివాహక జిల్లా బల్లియాలో పుట్టింది మనోరమ. చిన్నప్పటినుంచి ఆడుతూ పాడుతూ రోజూ గుడికి వెళ్తుండేది. గుళ్లో వచ్చే సాంబ్రాణీ, పూల పరిమళాలను ఆస్వాదిస్తోన్న మనోరమకు.. గుడినుండి బయటకు వచ్చేటప్పుడు మాసిన, చిరిగిపోయిన దుస్తులు ధరించి దీనంగా యాచించే పిల్లలు కనిపించేవారు. వాళ్లు కొన్నిసార్లు మనోరమ దగ్గరకు వచ్చి ప్రసాదం పెట్టమని అడిగేవారు. చిన్న లడ్డు ముక్క ఇస్తే వాళ్ల సమస్య తీరిపోతుందా? అనిపించేది తనకు. కానీ ఏం చేయాలో అప్పట్లో అర్థం కాలేదు. వాళ్లకెలా సాయం చేయాలి? అన్న ఆలోచనలతోనే ఇంటర్ కాగానే బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసి, తర్వాత పూర్వాంచల్ యూనివర్శిటీలో బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సంపాదించింది. పాఠాలతోపాటు.. పోస్టింగ్ డెహ్రాడూన్‌లో రావడంతో అక్కడ టీచర్‌గా పనిచేస్తూనే, ఆల్ ఇండియా రేడియోలో అంధ విద్యార్థులకు కథల పుస్తకాలను చదివి వినిపించేది. కథల విన్న విద్యార్థుల వ్యక్తం చేసే సంతోషం ఆమెకు చాలా సంతృప్తినిచ్చేది. ఇంతలోనే మనోరమకు పెళ్లి అవడం, భర్త లక్నోలో ఉండడంతో తను కూడా లక్నో వెళ్లింది. లక్నోలో కూడా గుడికి వెళ్లినప్పుడు యాచించే పిల్లలు కనిపించేవారు. చిన్నప్పటినుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్న మనోరమ... యాచించే పిల్లల వద్దకు వెళ్లి ఇలా ‘అడుక్కోవడం తప్పు, మీరు ఈ వయసులో ఇటువంటి పనులు చేయకూడదు. చదువుకోవాలి’ అని హితవు చెప్పేది. ఆమె మాటలు వినడానికి పిల్లలు గుంపుగా పోగయ్యేవారు. అప్పుడు ఆ పిల్లలకు స్నానాలు చేయించి, కొత్తబట్టలు తొడిగి, తలకు నూనె రాసి, దువ్వి వాళ్లను అద్దంలో చూపిస్తూ ‘చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో’... అడుక్కోవడం అంటే దేవుడిని కించపరచడంతో సమానమని చెప్పి, అడుక్కోవద్దని వారించేవారు. ఈ మాటలు విన్న పిల్లలు, కొంతమంది తల్దిండ్రులు నిజమే కదా! అని అర్థం చేసుకుని తమ పిల్లలను స్కూళ్లలో చేర్చి చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. మనోరమ పనిచేసే స్కూలు, ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పించి, వారి పిల్లల యాచకత్వాన్ని మాన్పించారు. దత్తత సెంటర్.. మనోరమ ప్రారంభంలో డెభ్బై మంది దాకా పిల్లలను స్కూళ్లలో చేర్పించింది. రోజురోజుకి నిరాశ్రయ యాచక పిల్లల సంఖ్య పెరగడం, వాళ్లను ఆదరించే వారు లేకపోవడం వంటి కన్నీటి గాథలకు చలించి పోయిన మనోరమ వారికోసం దత్తత కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. 2004లో ‘జమి అప్ని ఆస్మా మేరా’ పేరుతో దత్తత కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్లో ఇల్లువాకిలి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, నా అనేవారు లేని వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది. ఎవరైనా ఈ సెంటర్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే వారికి దత్తత ఇస్తుంది. అలా ఇప్పటిదాకా పదకొండు వందలమంది పిల్లలను యాచన నుంచి మాన్పించగలిగింది. వీరిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది క్యాటరింగ్, డ్రైవర్స్, హౌస్‌కీపింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు బీఏ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయిలైతే బ్యూటీపార్లర్, కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ వర్క్ లు నేర్చుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మనోరమ భర్త కూడా తనకి అన్ని పను ల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సాయం చేయడం వల్ల ఆమె ఇంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగారు. లక్నోలో యాచకత్వం చేసే పిల్లల సంఖ్య కూడా తగ్గింది. నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లల్ని చేరదీసి బడికి పంపిస్తూ, భవిష్యత్‌ను మారుస్తున్న మనోరమను అంతా ‘మమ్మీజీ’ అని పిలుస్తున్నారు. అవార్డులు.. టీచర్‌గా పాఠాలు చెప్పి సరిపెట్టుకోకుండా స్కూలు బయట ఉన్న పిల్లల్ని స్కూలుకు వచ్చేలా చేసి వారి జీవితాలనే తీర్చిదిద్దిన మనోరమను గుర్తించిన హిందుస్థాన్ టైమ్స్ ‘ఉమెన్ ఎచీవర్స్ అవార్డుతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘గోమతి గౌరవ్ సమ్మాన్’ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది టీచర్‌గా రిటైర్ అయిన మనోరమ తన సమాజసేవను కొనసాగిస్తున్నారు. భర్తతో మనోరమ -
నటి మనోరమ ఐదుగురు సీఎంలతో నటించిందన్న విషయం మీకు తెలుసా?
ప్రముఖ నటి మనోరమ 12 ఏళ్ల వయసులోనే నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 1937 మే26న తమిళనాడులో జన్మించిన ఆమె చిన్న వయసులోనే వెయ్యికి పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ సహా పలు భాషల్లో సుమారు 1500 సినిమాల్లో ఎంతోమంది అగ్ర నటులతో కలిసి నటించింది. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించింది. 2009 వరకూ ఈ రికార్డును ఎవరూ అధిగమించలేదు. ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారం సహా పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకుంది. అభిమానులు ఈమెను ఎంతో ప్రేమగా ‘ఆచి’ అని పిలుస్తారు. ఇక మనోరమ తన నటనా జీవితంలో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించింది. వారిలో తమిళనాడు మాజీ సీఎంలు జయలలిత, అన్నాదురై, ఎం.జి.రామచంద్రన్, కరుణానిధి సహా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావు ఉన్నారు. అదే విధంగా ప్రముఖ నటులు శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్‌హాసన్ సహా ఎంతో మంది అగ్ర నటులతో నటించారు. గుండెపోటుతో 2015 అక్టోబర్ 10న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనోరమ కన్నుమూశారు. చదవండి: ఆ వార్తలను నమ్మకండి : నటుడు చంద్రమోహన్ ఇంకా నటించాలనుంది కానీ..: రజనీకాంత్ -
నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?
సినిమా: ప్రఖ్యాత దివంగత నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు మింగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. భూపతి స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. కాగా, భూపతికి మద్యపానం అలవాటు ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో భూపతికి మద్యం లభించకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై భూపతి కుమారుడు రాజరాజన్ మాట్లాడుతూ.. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, మద్యం అలవాటు ఉన్న ఆయన మత్తు కోసం నిద్ర మాత్రలు వేసుకున్నారని, ఆత్మహత్యాయత్నం కాదన్నారు. వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. తల్లి మనోరమతో భూపతి -
సినీ నటి మనోరమ ఇక లేరు
-
మనోరమకు కన్నీటి వీడ్కోలు
-
నవరస నాయకి మనోరమ
వెండి తెర మీద ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడి పోవడంలో దిట్ట్ట మనోరమ. నవరసాల్ని పండించి ప్రేక్షకుల్ని మైమరపించడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకున్న మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలసి నటించి సరికొత్త రికార్డును సైతం తన సొంతం చేసుకున్నారు. దక్షిణాది సినీ వినీలాకాశంలో హాస్యనటిగా, అక్కగా, అమ్మగా, అత్తగా, బామ్మగా.. ఇలా ఎన్నో వైవిధ్య పాత్రల్లో వెండి తెర మీద కన్పించిన మనోరమ జీవిత పయనం అన్నీ ఒడిదొడుకులే... తమిళసినిమా : తంజావూర్ జిల్లా మన్నార్ కుడిలో 1937 మే 26వ తేదీన కాశీకిలకుడైయార్, రామామృతమ్మాళ్ దంపతులకు జన్మించిన గోపి శాంత అలియాస్ మనోరమ. బాల్య మంతా కారైకుడి సమీపంలోని పల్లత్తూర్లోనే గడిచింది. ఐదో తరగతి వరకు చదువుకున్న ఆమె తన దృష్టిని నాటకాల వైపునకు మళ్లించింది. 12వ ఏట వీధి నాటకాల ద్వారా నటన వైపునకు అడుగులు వేసిన గోపి శాంత అంచెలంచెలుగా ఆ రంగంలో ఎదిగారు. 1952లో మరుమగన్ నాటకంతో తన ప్రతిభ చాటుకున్న గోపి శాంత ఆతర్వాత పల్లత్తూర్ పాపగా నాటక రంగంలో ఓ వెలుగు వెలిగారు. వెయ్యికి పైగా నాటకాల్లో వివిధ పాత్రల్లో నటించడంతో పాటుగా గాయనిగా తన ప్రతిభను చాటుకున్నారు.అండమాన్ కాదలీ నాటకం ద్వారా రంగస్థల నటిగా పరిచయమయ్యారు మనోరమ. అప్పట్లో ఆ పాత్ర పోషించాల్సిన నటి రాకపోవడంతో తనను అనూహ్యంగా స్టేజీ ఎక్కించి తనను నటిని చేశారని మనోరమ ఇక సారి తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైతో కలసి నటించిన ఓ నాటకం ఆమె జీవితానికి ఓ మలుపుగా చెపవచ్చు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి కరుణానిధి రచించిన మణిమగుడం నాటకంలో మనోరమ పేరుతో ఆమె చేసిన హాస్య పాత్ర ప్రేక్షకుల హృదయాల్ని తాకింది. ఆ నాటి నుంచి హస్యపాత్రల మీద దృష్టి కేంద్రీకరించిన గోపి శాంత తన పేరును కూడా మనోరమగా మార్చుకున్నారు. 1958లో కళంజ్జర్ కన్న దాసన్ ప్రొడక్షన్లో మాలై ఇట్ట మంగై చిత్రం ద్వారా గుర్తింపు ఉన్న పాత్రతో వెండి తెరకు మనోరమ పరిచయమయ్యారు. అయితే ఆమెను ప్రాచుర్యం చేసిన చిత్రం తిల్లానా మోహనాంబాళ్. అనాటి నుంచి తన జీవనగమనాన్ని వెండి తెరకు అంకితం ఇచ్చారు. 1500 వరకు చిత్రాల్లో ఎన్నెన్నో పాత్రలకు జీవం పోసిన మనోరమ నిర్మాత అవతారం కూడా ఎత్తారు. ఆమె నిర్మాణ సారథ్యంలో రూపొందించిన దూరత్తు సొందం చిత్రం ఇండియన్ పనోరమలో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది. ఐదుగురు ముఖ్యమంత్రులతో.. భారతీయ సినిమా గర్వించదగ్గ నటి మనోరమ .ఏ పాత్ర చేసినా అందులో జీవించిన మహానటి మనోరమ. ఒక తమిళంలోనే కాదు తెలుగు, మలయాళం, హిందీ,సింగళ్ మొదలగు ఐదు భాషల్లో నటించి ప్రపంచ ఖ్యాతి గాంచిన అభిమానుల మనోరమ్యం ఈమె. తమిళంలో మనోరమ నటించిన అద్భుత చిత్రాలు మచ్చుకు కొన్ని చెప్పాలంటే కల్లత్తేర్ కన్నయ్య, పార్ మగలే పార్, లవకుశ, తిరువిలైయాడళ్, కందనైకరుణై, యార్నీ, ఎదుర్‌నీశ్చల్, తిల్లానా మోహనాంబాళ్, పడిక్కాద పట్టణమా, ఇలా కటా రెండా చెప్పుకుంటూ పోతూనే ఉండవచ్చు. మనోరమలో మంచి గాయని కూడా ఉన్నారు. మగల్ ఉన్ సమత్తు చిత్రంతో గాయనిగా పరిచయమై 300కు పైగా పాటలు పాడారు. అంతే కాదు, ఐదుగురు ముఖ్యమంత్రులతో నటించిన అరుదైన ఘనత మనోరమది. దివంగత డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్‌లతో కలిసి నటించారు. మనోరమ తెలుగు సినిమాతోనూ విడదీయరాని అనుబంధం ఉంది. శుభోదయం, రిక్షావోడు, అల్లరిప్రియుడు, బావనచ్చాడు, అరుంధతి, క్రిష్ణార్జున తదితర చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు. పలు పాత్రలకు జీవం పోసిన మనోరమ సినీ జీవితం అప్రహతంగా సాగి 2013లో రూపొందిన సింగం-2తో ఆగింది. ఆ తరువాత ఆనారోగ్యానికి గురవ్వడంతో నటనకు దూరమయ్యారు.అయితే ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. సూర్య నటించనున్న సింగం-3లో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ చిత్రం ప్రారంభం కాకుండానే మనోరమ కన్ను మూయడం విచారకరం. మరో విషయం ఏమిటంటే కరెక్ట్‌గా పది రోజుల క్రితం తమిళ సినీ పత్రికా విలేకరుల కార్యక్రమంలో పాల్గొన్న మనోరమ కమల్‌హాసన్, శివకుమార్‌ల నుంచి సత్కారం పొంది తనకు ఇంతకంటే ఏమి కావాలి? ఈ క్షణంలో ప్రాణం పోయినా సంతోషమే అని పేర్కొనడం గమనార్హం. -
మనోరమకు అశ్రు నివాళి...
ప్రముఖ సీనియర్ నటి, తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల మన్ననలందుకున్న మనోరమ శనివారం అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నైలో మనోరమ భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే ఆమెకు గౌరవ సూచకంగా తమిళ సినీ పరిశ్రమ ఆదివారం షూటింగ్‌లు, సినిమా వేడుకలను రద్దు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సినీప్రముఖులు రజనీకాంత్, కమల్‌హాసన్ శరత్‌కుమార్, విజయ్‌కాంత్ తదితరులు ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మనోరమ పార్థివ దేహంతో అంతిమ యాత్ర ఆరంభమైంది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు దారి పొడవునా పుష్పాంజలి ఘటించారు. ఈ యాత్ర రెండు గంటల పాటుగా సాగింది. ఆరున్నర గంటల సమయంలో మైలాపూర్ కైలాసపురం శ్మశాన వాటికలో మనోరమ భౌతికదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నటిగా గిన్నిస్ రికార్డ్: తమిళంలో ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఆమెది. తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులతో నటించారు. ఆమె తెలుగులో నటించిన ఆఖరి చిత్రం ‘అరుంధతి’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి ఏకంగా ఆమె 1500 చిత్రాల్లో న టించారు. ఇందుకు గానూ ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. 2002లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారామె. -
కామెడీ ఆర్టిస్ట్ గా పరిచయమై..
ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న అత్యుత్తమ నటి అశేష అభిమానులను వదిలి వెళ్లిపోయింది. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుపరిచితురాలైన సీనియర్ నటి మనోరమ శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1960, 1970 దశకాలలో తమిళ వెండితెరను శాసించిన మనోరమ 1937 మే 26న తమిళనాడులోని మన్నార్గుడిలో జన్మించారు. మనోరమ అసలు పేరు గోపిశాంత. 12 ఏళ్ల చిన్న వయసులోనే నాటకరంగంలోకి అడుగుపెట్టిన ఆమె స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కరుణానిధి రాసిన ఎన్నో నాటకాలల్లో నటించారు. 1958లో రిలీజ్ అయిన మళ ఇట్ట మంగై సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించారు మనోరమ. తొలి సినిమాలోనే కామెడీ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన ఆమె ఆ తరువాత ఎక్కువగా ఆ తరహా పాత్రలే చేస్తూ వచ్చారు. 1963లో వచ్చిన కొంజమ్ కుమారి సినిమాలో హీరోయిన్గా నటించినా తరువాత కూడా కామెడీ పాత్రల మీదే దృష్టిపెట్టారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాల పాటు తమిళ ఇండస్ట్రీలో ఆమె లేకుండా ఒక్క సినిమా కూడా రాలేదంటే అతిషయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఏ స్థాయి సినిమా అయిన అందులో మనోరమ కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను రాసేవారు. తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కమెడియన్స్ అనిపించుకున్న చాలా మందితో ఆమె జంటగా నటించారు. అలనాటి మేటి నటులు చంద్రబాబు, చో రామస్వామి, తంగవేళు, తెంగై శ్రీనివాసన్, ఎమ్ ఆర్ రాధ, నగేష్ లాంటి సీనియర్ నటులతో కలిసి ఎన్నో సినిమాల్లో హాస్యాన్ని పండిచారు. అంతేకాదు నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన అరుదైన రికార్డ్ మనోరమ సొంతం. తమిళనాడు ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎమ్ జి రామ్‌చంద్రన్, జయలలితలతో ఆమె కలిసి నటించారు. అల్లరి ప్రియుడు, కుంతీ పుత్రుడు, జెంటిల్‌మేన్, రిక్షావోడు, బావనచ్చాడు, అరుంధతి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు మనోరమ. సినీరంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డ్ తో సత్కరించగా, భారత ప్రభుత్వం 2002లో పద్మ శ్రీ అవార్డ్ తో గౌరవించింది. 1988లో ఆమె నటించిన పుతియా పట్టై సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డ్ ను కూడా అందుకున్నారు. వీటితో పాటు తెలుగు, తమిళ రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు, ఫిలింఫేర్ అవార్డ్ లు ఎన్నో అందుకున్నారు. ఎన్నో అద్భుత పాత్రలతో సినీ అభిమానులను అలరించిన మనోరమ మరణం తమిళ పరిశ్రమకేకాదు యావత్ భారత సినీ పరిశ్రమకే తీరనిలోటు. భౌతికంగా ఆమె మనల్ని వదిలిపోయినా ఆమె చేసిన పాత్రలు, ఆమె పూయించిన నవ్వులు ఎప్పుడూ మనకు ఆ మహానటిని గుర్తు చేస్తూనే ఉంటాయి. -
సినీ నటి మనోరమ ఇక లేరు
చెన్నై: ప్రముఖ సినీ నటి మనోరమ (78) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు. 1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు. (ఫోటో గ్యాలరీ ...) 1980లో శుభోదయం సినిమాతో తెలుగు రంగంలోకి ప్రవేశించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్మెంట్ అవార్డు సాధించారు. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1937, మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో మనోరమ జన్మించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. మనోరమకు ఒక కుమారుడు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2. మనోరమ నటించిన తెలుగు చిత్రాలు: ♦ శుభోదయం ♦ జెంటిల్‌మేన్ ♦ రిక్షావోడు ♦ పంజరం ♦ బావనచ్చాడు ♦ మనసున్నమారాజు ♦ అరుంధతి ♦ నీప్రేమకై ♦ కృష్ణార్జున -
దయనీయ స్థితిలో మనోరమ
సీనియర్ నటి మనోరమ ఆరోగ్య పరిస్థితి క్షీణించి, దిక్కు లేకుండా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఆమెనెవరూ పట్టించుకోవడంలేదని నటుడు మన్సూర్ అలీఖాన్ వాపోయారు. సహస్రాధిక చిత్రాల్లో నటించి చరిత్రకెక్కిన బహుభాషా నటి మనోరమ. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించి రక్తి కట్టించే నటధీశాలి మనోరమ. ఆ మధ్య బాత్రూమ్లో కాలుజారి పడినప్పటి నుంచి మనోరమ అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. మూత్రనాళ సమస్యతో బాధపడుతున్న మనోరమ కొన్ని నెలల క్రితం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే మూత్రనాళ సమస్య నుంచి ఆమె కోలుకోలేదు. ఈ విషయం గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ వెల్లడిస్తూ ఎంజీఆర్, శివాజీ కాలం నుంచి మనోరమ నటిస్తురన్నారు. ఈ తరం నటులతో కూడా నటించారని తెలిపారు. కొంతకాలం క్రితం మూత్రనాళ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరిన మనోరమ మళ్లీ అదే సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే ఆమెనెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించలేదని తెలిపారు. తాను తన కూతురు వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికి ఇటీవల మనోరమ ఇంటికి వెళ్లానని చెప్పారు. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి గుండె బరువెక్కిందన్నారు. మనోరమ వెయ్యి చిత్రాలకు పైగా నటించి కోట్లాది రూపాయలను సంపాదించారని, ఇప్పటికీ ఆమె ఆస్తులు కోట్ల విలువ చేస్తాయన్నారు. అయినా ఆమెను ఆస్పత్రిలో చేర్చే దిక్కు లేకపోవడం విచారకరం అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ మనోరమపై ప్రేమాభిమానాలు కలిగి వున్నారని ఆమెను ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తే, మనోరమ మరి కొంత కాలం ఆరోగ్యంగా జీవించగలరని మన్సూర్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు. -
నటి ఫ్యామిలీలో ఆస్తి కోసం డిష్యూం డిష్యూం
చెన్నై : నటి మనోరమ ఆస్తి వ్యవహారం కుటుంబసభ్యుల మధ్య కలకలం రేపుతోంది. వేయికి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రఖ్యాత నటి మనోరమ. అలాంటి మనోరమపై ఆమె మనవరాలు అభిరామి (25) చెన్నై సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలుచేశారు. అందులో నటి బామ్మ మనోరమ ప్రఖ్యాత నటి అని, ఆమెకు చెన్నై తిరువళ్లూరు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తులున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం తన బామ్మ ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారు. తన చుట్టూ ఏమి జరుగుతోందో తెలియని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తన తండ్రి భూపతి మందుకు బానిసై మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన స్థానిక టీనగర్లో ఉన్న ఇంటిలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. వీరి అనారోగ్య పరిస్థితిని సాకుగా తీసుకుని తన సోదరుడు డాక్టర్ రాజరాజన్ తన బామ్మ ఆస్తులను తన పేరుకు మార్చుకున్నారని పేర్కొన్నారు. తన బామ్మ సొత్తులో తనకు సమభాగం చెందాలని తెలిపారు. అలాంటిది రాజరాజన్ ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని తాను అలాంటి చర్యలకు పాల్పడితే తనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ శనివారం న్యాయమూర్తి లక్ష్మీకాంతన్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై నటి మనోరమ కొడుకు భూపతి ఆయన భార్య ధనలక్ష్మి, కొడుకు రాజరాజన్ ఈ నెల 22వ తేదీ లోపు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
నటి మనోరమకు అస్వస్థత
చెన్నై: ప్రముఖ తమిళ నటి మనోరమ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం మనోరమకు ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. మనోరమ గుండెపోటుకు గురై ఉండవచ్చని భావిస్తున్న వైద్యులు.. ఆమెకు యాంజియోప్లాస్టీ చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించారని, వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు -
నటి మనోరమకు ఛాతినొప్పి
చెన్నై: ప్రఖ్యాత దక్షిణాది నటి మనోరమకు ఆదివారం ఛాతినొప్పి వచ్చింది. చికిత్స నిమిత్తం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్టు బంధువొకరు తెలిపారు. మనోరమకు గుండె పోటు వచ్చి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం రాత్రి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఇంకా నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. మనోరమకు యాంజియోప్లాస్టీ చేయవచ్చని చెప్పారు. మనోరమ గత ఐదు దశాబ్దాలుగా పలు దక్షిణాది భాషా చిత్రాల్లో నటించారు. తమిళంలోనే 750 సినిమాల్లో నటించారు. దక్షిణాది హాస్య నటీమణుల్లో మనోరమది అగ్రస్థానం. సూర్య హీరోగా గతేడాది విడుదలైన సింగం-2లో మనోరమ నటించింది.