నటి మనోరమకు ఛాతినొప్పి | Veteran Tamil actress Manorama hospitalised | Sakshi
Sakshi News home page

నటి మనోరమకు ఛాతినొప్పి

Published Mon, Mar 31 2014 11:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

నటి మనోరమకు ఛాతినొప్పి

నటి మనోరమకు ఛాతినొప్పి

చెన్నై: ప్రఖ్యాత దక్షిణాది నటి మనోరమకు ఆదివారం ఛాతినొప్పి వచ్చింది. చికిత్స నిమిత్తం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్టు బంధువొకరు తెలిపారు. మనోరమకు గుండె పోటు వచ్చి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం రాత్రి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఇంకా నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. మనోరమకు యాంజియోప్లాస్టీ చేయవచ్చని చెప్పారు.

మనోరమ గత ఐదు దశాబ్దాలుగా పలు దక్షిణాది భాషా చిత్రాల్లో నటించారు. తమిళంలోనే 750 సినిమాల్లో నటించారు. దక్షిణాది హాస్య నటీమణుల్లో మనోరమది అగ్రస్థానం. సూర్య హీరోగా గతేడాది విడుదలైన సింగం-2లో మనోరమ నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement