
యంగ్ హీరోయిన్ శృతి నారాయణన్ (Shruthi Narayanan) ప్రైవేట్ వీడియో లీక్ కావడం కోలీవుడ్‌లో దుమారం రేపుతోంది. ఆడిషన్ పేరుతో కొందరు స్కామర్లు ఆమె ఒంటిపై దుస్తుల్లేకుండా వీడియో రికార్డు చేశారు. తర్వాత దాన్ని పలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశారు. అలా ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై శృతి నారాయణన్ నోరు విప్పింది. దయ చేసి వీడియోలు లింకులు అడగడం ఆపేయండని అర్థించింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టింది.
దయచేసి వైరల్ చేయకండి
నా గురించి వైరల్ అవుతున్న వీడియో మీకు సరదాగా ఉందేమో! కానీ అది నాకు, నా కుటుంబానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా? నాకేం చేయాలో పాలు పోవట్లేదు. నేనొక అమ్మాయిని.. నాకూ భావోద్వేగాలుంటాయి. నా చుట్టూ ఉండేవారికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. మీరు పరిస్థితిని మరింత అద్వాణ్నంగా మారుస్తున్నారు. దయచేసి ఆ వీడియోను వైరల్ చేయొద్దు. మీకు మరీ అంత కావాల్సి వస్తే మీ అమ్మదో, చెల్లిదో, ప్రేయసిదో వీడియోలు చూడండి.

మీకిది తమాషాగా ఉందా?
వాళ్లు కూడా అమ్మాయిలే కదా.. వారికి కూడా నాలాంటి శరీరమే ఉంటుంది కాబట్టి వారి ప్రైవేట్ వీడియోలు చూసి ఆనందించండి. మీకిదంతా వినోదంగా ఉందేమో కానీ ఒకరి జీవితం అని గ్రహించట్లేదు. అవకాశాల కోసం ఇంతకు దిగజారాలా? అని నన్ను తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు ఆడవారినే తప్పుపడతారు? ఆ వీడియో లీక్ చేసినవారిది.. అలాంటి వీడియోలు చూసేవారిది తప్పు కాదా? ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీ తల్లికి, అక్కకు, భార్యకు, నానమ్మకు ఉన్నట్లే అందరు ఆడవారికీ అదే శరీరం ఉంటుంది.
మనిషిగా ప్రవర్తించండి
మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావిస్తోంది కేవలం ఒక వీడియో కాదు.. ఒక మనిషి జీవితం, మానసిక ఆరోగ్యం. డీప్‌ఫేక్ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దయచేసి ఇక ఆపేయండి.. లింకుల కోసం అడగడం మానుకోండి. మనిషిగా ప్రవర్తించండి. డీప్ ఫేక్ వీడియో అయినా, నిజమైన వీడియో అయినా సరే దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం నేరం. మనిషిగా మెదులుకోండి అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా శృతి 'సిరగడిక్క ఆశై' అనే తమిళ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది.

చదవండి: మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?