tamil actress
-
రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త
రిలీజై రెండు వారాలవుతున్నా సరే ఇంకా 'పుష్ప 2' హవా కొనసాగుతోంది. మూవీలోని జాతర సీన్ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒకరిద్దరు మహిళలు.. ఏకంగా కూర్చున్న సీటులోనే పూనకాలతో ఊగిపోయిన ఒకటి రెండు వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ షాకింగ్ అనుభవం.. యువ నటికి ఎదురైంది. ఆ విషయాన్ని ఇన్ స్టాలో పంచుకుంది.(ఇదీ చదవండి: మన సినిమా.. ఆస్కార్ రేసు నుంచి ఔట్)తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్.. రీసెంట్గా 'పుష్ప 2' సినిమా చూడటానికి వెళ్లింది. జాతర సీన్ వచ్చినప్పుడు ఈమె పక్కన కూర్చున్న మహిళ.. సామీ అని గట్టిగా అరిచిందట. దీంతో సంయుక్త తెగ భయపడిపోయింది. ఆమె భర్త ఏమో తనని కంట్రోల్ చేయాలని చూశాడు. భయమేసి.. పది రూపాయుల టికెట్‌కు వెళ్లి కూర్చున్నా అని సంయుక్త ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.అయితే పూనకాలు రావడం, భయపడటం కాదు గానీ థియేటర్లలో ఇంకా రూ.10 టికెట్స్ ఉన్నాయా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అది కూడా మాల్లో ఇంత తక్కువ రేటు ఏంటి? అని ఈమెని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదలా ఉంచితే 12 రోజుల్లో రూ.1450 కోట్లపైనే వసూళ్లని 'పుష్ప 2' సాధించింది. ఈ వీకెండ్, వచ్చే వారం క్రిస్మస్ పండగ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్) -
సీరియల్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు
తమిళంలో సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి గాయత్రికి ప్రమాదం జరిగింది. మెషీన్లో ఈమె చెయ్యి ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని సాయి గాయత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 1-2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఓవైపు సీరియల్ నటిగా చేస్తూనే సాయి గాయత్రి బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా పెట్టుకుంది. పాండియన్ స్టోర్స్, నీ నాన్ కాదల్ తదితర సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే పలు వ్యక్తిగత కారణాలతో ఈ రెండు ప్రాజెక్ట్‌ల నుంచి మధ్యలోనే బయటకొచ్చేసింది. గతేడాది తల్లిదండ్రులతో కలిసి 'సాయి సీక్రెట్స్' అనే బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టింది.సబ్బులు, హెయిర్ ఆయిల్ తదితర ఉత్పత్తులు తన సంస్థలో తయారు చేసి విక్రయించేది. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న టైంలో సాయి గాయత్రి చెయ్యి.. అనుకోకుండా ఓ యంత్రంలో ఇరుక్కుంది. దీంతో కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
నాకు భయం లేదు.. అరెస్ట్‌కి ముందు కస్తూరి వీడియో
తెలుగు ప్రజలపై కొన్నిరోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని హైదరాబాద్‌లో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అయితే తమిళనాడు నుంచి తప్పించుకుని పారిపోయి ఇక్కడి వచ్చిందనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు వీటిపై కస్తూరి స్పందించింది. తాను ఇక్కడికి రావడానికి అది కారణం కాదని చెప్పుకొచ్చింది. ఈమెని అరెస్ట్ చేయడానికి ముందు ఓ వీడియోని రికార్డ్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన కస్తూరి.. షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని చెప్పింది. షూటింగ్ ముగిసిన వెంటనే తమిళనాడు పోలీసులకు సహకరించానని పేర్కొంది. తనకు ఎలాంటి భయం లేదని చెప్పుకొచ్చింది. పోలీస్ వ్యాన్‌లోకి వెళ్లేటప్పుడు మాత్రం చేయి పైకెత్తి చూపిస్తూ కాస్త హంగమా చేసింది.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?)వివాదం ఏంటి?నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి చెప్పిందితెలుగువాళ్లపై కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. దీంతో తప్పు తెలుసుకుని రోజుల వ్యవధిలోనే క్షమాపణ చెప్పింది. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ అప్పటికే తమిళనాడులో ఈమెపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందుస్తు బెయిల్ కోసం అప్లై చేసింది. కానీ కోర్ట్ ఈమె బెయిల్‌ని తిరస్కరించింది. దీంతో హైదరాబాద్‌కి పారిపోయి వచ్చింది. కస్తూరికి నవంబర్ 29వరకు తమిళనాడు కోర్ట్ రిమాండ్ విధించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Chennai: Court remands actor Kasthuri to judicial custody till November 29. - PTI #Kasthuri pic.twitter.com/wj4b8M0W8r— Deccan Chronicle (@DeccanChronicle) November 17, 2024 -
పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్
ప్రముఖ తమిళ నటి విద్యా ప్రదీప్ శుభవార్త చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కడుపుతో ఉన్న ఫొటోలని షేర్ చేసింది. ఇందులో భర్తతో కలిసి హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్)కేరళకు చెందిన విద్యా ప్రదీప్.. 2010 నుంచి సినిమాల్లో ఉంది. స్వతహాగా డాక్టర్ అయిన ఈమె.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నటిగా కొనసాగుతోంది. సహాయ పాత్రలతో పాటు పలు తమిళ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.13 ఏళ్ల క్రితం మైకేల్ అనే ఫొటోగ్రాఫర్‌ని పెళ్లి చేసుకుంది. చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. సినిమాలు ఏవైనా ఉంటే విద్యా ప్రదీప్.. ఇండియా వచ్చి వెళ్తుండేది. ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి) -
యోగా ట్రైనర్‌ను పెళ్లాడిన నటి.. ఫోటోలు వైరల్
తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ రమ్య పాండియన్ ప్రియుడిని పెళ్లాడింది. బెంగళూరుకు చెందిన యోగా నిపుణుడు లోవల్ ధావన్‌తో కలిసి ఏడడుగులు వేసింది. ఈ పెళ్లి వేడుకకు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ వేదికగా నిలిచింది. ఈ ప్రేమజంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి చేసుకున్న లొకేషన్ కూడా అదిరిందని కామెంట్లు చేస్తున్నారు.అలా మొదలైందిగతేడాది బెంగళూరులో యోగా శిక్షణ కార్యక్రమంలో రమ్య, లోవల్ ధావన్‌ల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఈ జంటను పెద్దలు ఆశీర్వదించడంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రులు, సెలబ్రిటీల కోసం చెన్నైలో నవంబర్ 15న రిసెప్షన్ ఏర్పాటు చేశారు.సినిమా నుంచి బుల్లితెరకుకాగా రమ్య పాండియన్.. డమ్మీ టపాసు, జోకర్, రామే ఆండాళుమ్ రావణే ఆండాళుమ్ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. కూకు విత్ కోమలి షోతో పాపులర్ అయింది. ఈ షోలో మొదటి సీజన్లో పాల్గొన్న ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. అలాగే తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో టాప్ 5లో చోటు దక్కించుకుంది. తర్వాత బిగ్‌బాస్ అల్టిమేట్ షోలో పాల్గొనగా సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విజయ్ సినిమా చూసి థియేటర్లో నిద్రపోయా: హీరోయిన్
తమిళ నటి అదితి బాలన్ శాకుంతలం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే వచ్చిన సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానికి సోదరిగా నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దళపతి విజయ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 15 నిమిషాల్లో నిద్రలోకి..విజయ్‌కు నేను పెద్ద అభిమానిని. వింటేజ్ విజయ్ అంటే చాలా ఇష్టం. అతడి అన్ని సినిమాలు చూస్తాను. అన్నింటిలోకెల్లా కిల్లీ నా ఫేవరెట్ మూవీ. ఒకసారేమైందంటే పాండిచ్చేరిలో దాదాపు 20 మంది ఫ్రెండ్స్ కలిసి బీస్ట్ సినిమా చూసేందుకు వెళ్లాం. 15 నిమిషాల వరకు బాగానే చూశాం. నానా హంగామా చేశాం. తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాం. నేనైతే ఏకంగా నిద్రపోయాను. నా ఫ్రెండ్స్ అది కూడా వీడియో తీశారు. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంనిజంగానే బీస్ట్ మూవీ చూస్తుంటే తెలియకుండానే నిద్ర ఆవహించింది అని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నటివి అయ్యుండి హీరో గురించి ఇలాగే మాట్లాడతావా? అని మండిపడుతున్నారు. కాగా అదితి బాలన్.. అరువి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది. కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ యాక్ట్ చేస్తోంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ?
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మొదటినుంచీ ప్రచారం జరుగుతున్నట్లే ఈసారి కమల్ హాసన్ స్థానంలోకి విజయ్ సేతుపతి హోస్ట్‌గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో షో ప్రారంభం అవుతుండటంతో ఈసారి హౌస్‌లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఆ జాబితాలో.. విజయ్ సేతుపతితో కలిసి మహారాజ మూవీలో యాక్ట్ చేసిన సచన నమిదాస్ పేరు కూడా ఉంది. ఈ ప్రచారంపై నటి ఇంతవరకు స్పందించలేదు. కాగా మహారాజ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన సచన.. ప్రస్తుతం 1947 మూవీతో పాటు శివకార్తికేయన్ 23వ సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రిక్షాలో వెళ్తూ ప్రముఖ నటి తల్లి కన్నుమూత
ప్రముఖ నటి అభినయ ఇంట్లో విషాదం. ఆమె తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. రిక్షాలో బయటకెళ్లిన ఆమె.. ఊహించని విధంగా కన్నుమూసింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు నటి వెల్లడించింది. ఆగస్టు 17న ఇదంతా జరిగినట్లు అభినయ చెప్పింది. ఇన్ స్టాలో తల్లిని తలుచుకుని చాలా పెద్ద పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ హక్కులు.. ఏకంగా వందల కోట్లు?)తమిళనాడుకు చెందిన అభినయకు పుట్టుకతోనే బధిర. అంటే మాట్లాడలేదు, వినపడదు. అయినా సరే సినిమాల్లో నటిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేశ్-వెంకటేశ్‌కి చెల్లిగా నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. వీటితో పాటు నేనింతే, కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, ధృవ, రాజుగారి గది 2, సీతారామం, గామి, ద ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.'అమ్మ నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇలా సడన్‌గా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే చనిపోయావు. తండ్రి-కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాద్ధృచ్చికమో కదా! నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు. ప్రతిచోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావ్. ఇప్పుడు నీ బాధ్యతని సాయిసునందన్ తీసుకుంటాడు. జన్మంటూ ఉంటే మళ్లీ మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా అమ్మ. రెస్ట్ ఫరెవర్ అమ్మ' అని భావోద్వేగంతో అభినయ రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన లేడీ కమెడియన్
ప్రముఖ లేడీ కమెడియన్ శుభవార్త చెప్పేసింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో విషయాన్ని ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు, ఫాలోవర్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ: సమంత)ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ శంకర్. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రాల్లోనూ ఇంద్రజ సహాయ పాత్రలు చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది.ఈ ఏడాది మార్చిలో కార్తీక్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఇంద్రజ.. ప్రస్తుతం తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది. ఈ విషయం తెలియగానే ఎమోషనల్ అయిపోయానని, మాటలు రావట్లేదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. లవ్ మామ అని భర్తని ఉద్దేశించి తెగ ప్రేమ కురిపించింది.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య) View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) -
రూ.3 లక్షలిస్తేనే ప్రమోషన్స్.. హీరోయిన్‌పై నిర్మాత ఫైర్!
కోలీవుడ్ బ్యూటీ అబర్నతి ఇటీవలే మాయ పుత్తగం అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. తాను ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ నరకప్పర్ ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ జూలై 30న చెన్నైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి అబర్నతి డుమ్మా కొట్టింది.డబ్బు కావాలిహీరోయిన్ తీరుపై నిర్మాత సురేశ్ కామాక్షి మండిపడ్డాడు. ప్రమోషన్స్‌కు రావాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని బయటపెట్టాడు. అంతేకాకుండా స్టేజీపై ఎవరి పక్కన కూర్చోవాలనేది కూడా తానే నిర్ణయించుకుంటానని చెప్పినట్లు తెలిపాడు. అయితే తన వైఖరితో చిత్రయూనిట్ ఇబ్బందిపడుతోందని గమనించిన బ్యూటీ వారికి సారీ చెప్పింది. ఇక మీదట ప్రమోషన్స్‌కు వస్తానని హామీ ఇచ్చింది.హీరోయిన్‌పై సెటైర్లుప్రమోషన్స్కు వస్తానని చెప్పి మాట తప్పిన అబర్నతిపై నిర్మాత మరోసారి ఫైరయ్యాడు. తమిళ సినిమా, తమిళ నిర్మాతలు బతకాలంటే ఇలాంటివారు శాశ్వతంగా దూరంగా ఉండటమే మంచిదని సెటైర్లు వేశాడు. ఈ వ్యవహారంపై చిత్రయూనిట్.. తమిళ సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది. కాగా అబర్నతి.. జైల్, తేన్, ఇరుగపట్రు వంటి చిత్రాలతో పాపులర్ అయింది.చదవండి: సిగరెట్ తాగిన హీరోయిన్? అబ్బే, మా అమ్మాయికి అలవాటు లేదు! -
Shruti Reddy: స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న శ్రుతి రెడ్డి (ఫోటోలు)
-
ఆ తర్వాతే సినిమాలకు గుడ్ బై: యంగ్ హీరోయిన్
బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా 2019లో సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా విజయన్. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంబరై చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపుపొందారు. దిండుగల్‌లోని రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా విజయన్.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సార్పట్టా పరంబరై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి.అలానే నక్షత్రం నగర్గిరదు, కళువేత్తి మూర్కన్, అనీతి వంటి చిత్రాల్లో దుషారా విజయన్ నటించారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్, ధనుష్ హీరోగా వస్తోన్న రాయన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ సరసన వీర ధీర శూరన్ చిత్రంలో నటిస్తున్నారు.మంచి అభినయం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్ అందాలారబోతకు వెనుకాడేది లేదని దుషారా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రాయన్ చిత్రంలో నటించడం సాధనగా భావిస్తున్నానన్నారు. తాను ధనుష్‌కు వీరాభిమానినని తెలిపారు. ఆయనతో కలసి నటించాలన్న చిరకాల కోరిక రాయన్ చిత్రంతో నెరవేరిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను ఉత్తర చెన్నై యువతిగా నటించినట్లు చెప్పారు. తాను 35 ఏళ్ల వయసు తరువాత నటనకు గుడ్‌బై చెబుతానని అన్నారు. ఆ తరువాత విదేశీయానం చేస్తానని చెప్పారు. అలా తాను పయనించని దేశం ఉండదని దుషారా విజయన్ పేర్కొన్నారు. -
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ సునయన. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె ప్రముఖ యూట్యూబర్, దుబాయ్‌కు చెందిన ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖలీద్ ఇటీవల జూన్ 26న అమ్మాయి వేలికి డైమండ్ రింగ్‌తో చేతులు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.కాగా.. సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్‌లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది.మొదటి భార్యతో విడాకులు..కాగా.. జూలై 1న ఖలీద్ అల్ అమెరీ మాజీ భార్య సలామా మొహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ తాను, ఖలీద్ విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీనే కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆమె పేర్కొంది. దుబాయ్‌కు చెందిన ఖలీద్ అల్ అమెరికీ సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri) -
పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి
ప్రముఖ నటి ఇంద్రజ శంకర్.. సోషల్ మీడియా దెబ్బకు బలైపోయింది. తమిళ నటుడు రోబో శంకర్ కూతురు ఈమె. దళపతి విజయ్ 'విజిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసింది. నెల క్రితం చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగి నెల రోజులు కావొస్తున్నా గానీ వివాదాలు మాత్రం ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భర్తతో కలిసి పాల్గొన్న ఇంద్రజ.. ఆ వివాదాలపై క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్)కార్తీక్ అనే వ్యక్తిని ఇంద్రజ శంకర్ పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకలకు తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల దగ్గర చాలామంది సెలబ్రిటీల వరకు హాజరయ్యారు. అయితే పెళ్లిలో ఇంద్రజ తన తండ్రికి ముద్దు పెట్టడం, కార్తీక్.. ఇంద్రజ తల్లితో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే వాటిని దురుద్దేశంతో చూడొద్దని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది.అలానే భర్తతో కలిసి తాను ఓ ఫొటోని పోస్ట్ చేయగా.. దానికి అసహ్యకరమైన కామెంట్స్ వచ్చాయని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది. 'నా మీద ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అతడి పేరు సరిగా గుర్తులేదు. 'ఇప్పుడు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఎక్కువరోజులు కలిసుండలేరు. కొన్నిరోజులు ఆగితే విడివిడిగా ఇంటర్వ్యూ ఇస్తారు. త్వరలో విడాకులు తీసుకుంటారు' అని ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇలా కామెంట్స్ పెట్టడంతో నేను చాలా బాధపడ్డాను. అయినా వేరొకరి గురించి అలా ఎలా కామెంట్ చేస్తారు?' అని ఇంద్రజ తన ఆవేదనని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే) -
నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్
గ్లామరస్ పాత్రలకు యాషికా ఆనంద్ పెట్టింది పేరు. కవలై వేండామ్ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు, దృవంగళ్ 16, నోటా, జాంబీ తదితర సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే కొన్నాళ్ల ముందు ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తుండగా యాషికా ఆనంద్ భయంకరమైన కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ప్రాణాలతో పోరాడింది. మూడు నెలల తర్వాత తిరిగి మామూలు మనిషైంది. ఆ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఇటీవల 'సిల నేరంగళిల్' సినిమాలో నటించిన ఈ భామ ప్రస్తుతం ఇవన్ దాన్ ఉత్తమన్, రాజభీమ, పాంబాట్టం తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. (ఇదీ చదవండి: రూ.50 లక్షలు నష్టపోయా.. ఆస్తులమ్మేశా: బుల్లితెర నటి) కాగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాషికా ఆనంద్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తాను 17 ఏళ్ల వయసులోనే ఓ తమిళ సినిమా చేసినట్లు చెప్పింది. అలాంటి గ్లామర్ పాత్రల్లో నటిస్తే, నిజ జీవితంలోనూ అలానే ఉంటారని కొందరు అనుకుంటారని, చాలా అవమానకరమెన కామెంట్స్ చేస్తుంటారని చెప్పింది. చాలా నెగిటివ్‌గానూ మాట్లాడుతుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటివి తనకు బాధ కలిగించినా తనని అసహించుకునే వాళ్లని దూరంగా ఉండి, తనను చూసి ఎంజాయ్ చేయమనే చెబుతానని యాషికా చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే కారు ప్రమాదం తరువాత తన జీవితమే మారిపోయింది తెలిపింది. ఆ సమయంలో కంటికి నిద్రే కరువైందని, కన్ను మూస్తే ప్రమాద సంఘటనే గుర్తొచ్చేదని అప్పటిరోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంది. అలాంటి పరిస్థితి నుంచి మళ్లీ నటిస్తానని అనుకోలేదని పేర్కొంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఇంకెన్నాళ్లు ఈ దారుణాలు.. ఇంకెంతకాలం భరించాలి: నటి ఆవేదన
నటి సోనా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈమె బహు భాషా నటి. అంతకు మించి ఏదో ఒక ఘటనతో వార్తలో తరచుగా కనిపించే నటి. శృంగార తారగానూ ముద్ర వేసుకున్న సోనాలో నిర్మాత, దర్శకురాలు కూడా ఉన్నారు. తాజాగా తన బయోపిక్‌ను స్మోక్ అనే పేరుతో స్వీయ దర్శకత్వంలో వెబ్ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. కాగా ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన బాలిక అత్యాచారం, హత్యా ఘటనపై స్పందించింది. ఈ రోజు మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని.. కానీ ఇటీవల పాండిచ్చేరిలో చిన్నారికి జరిగిన దారుణ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక అమ్మాయిగా ఎలా ఉండాలో అనేది కూడా తెలియని ఆ బాలికను చిత్ర వధ చేసి ప్రాణాలు తీయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇలాంచి క్రూరమైన ఘటనతో మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? లేక మృగాల మధ్య జీవిస్తున్నామా? అని తెలియడం లేదన్నారు. ఒక నటిగా తానూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని బయట పడ్డానని చెప్పారు. మృగాల్లాంటి మగాళ్ల మధ్య జీవించడానికి.. రక్షించుకోవడానికి అనునిత్యం పరుగులు తీస్తూనే ఉన్నామన్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న ఈ నాగరిక ప్రపంచంలో మహిళలను అణచివేయడం.. కించపరచడం, తప్పుగా చిత్రీకరించడడం కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంకా ఎంతకాలం మౌనంగా భరించాలి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నటి సోనా పేర్కొన్నారు. -
తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి
జనాల్ని మోసం చేయడంలో దొంగలు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే మిగతా విషయాలేమో గానీ సెలబ్రిటీలు పేరు చెప్పి డబ్బులు కాజేసే పనులు చేస్తుంటారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి పేరు చెప్పి లక్షలు వెనకేసుకునే పనిలో పడ్డారు. కానీ సదరు నటి స్పందించడంతో బండారం అంతా బయటపడింది. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) ఏం జరిగింది? తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అల్య మానస.. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదింంచింది. కొన్నిరోజుల క్రితం 'వణక్కం తమిళగం' అనే షోలో పాల్గొంది. ఆ షోలో ఈమె.. మార్కెటింగ్ స్కీమ్ గురించి చెప్పినట్లు.. దీని ద్వారా లెక్కలేనంతగా డబ్బు సంపాదిస్తున్నానని ఈమె చెప్పినట్లు ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలు పత్రికల్లోనూ ఇదే విషయం పబ్లిష్ కాగా.. ఈ విషయం అల్య మానస దృష్టికి వెళ్లింది. 'అల్య మానస బాగా డబ్బు సంపాదిస్తోంది. ఈమెలానే మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటే.. దిగువన లింక్ క్లిక్ చేయండి' అని తన పేరు చెప్పి జరుగుత్ను మోసంపై అల్య మానస ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మార్కెటింగ్ స్కీమ్ గురించి షోలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని, కారు-ఇల్లు కొన్న విషయం నిజమే కానీ వాటిని ఈఎంఐ పద్ధతి తీసుకున్నానని చెప్పింది. అన్నింటికీ మించి అడ్డదారిలో కోటీశ్వరురాలిని కావాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు) -
నటి జీవితం విషాదాంతం: మమకారం మరిచిన కన్న కొడుకే!
అమ్మను మించిన దైవం లేదని అందరమూ నమ్ముతాం. కానీ మద్యం, డబ్బు వ్యామోహం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. దీనికి ఉదారహణే తమిళ నటి హత్య. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన వివరాలను పరిశిలిస్తే.. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ‘కడైసి వివాసాయి’ సినిమాతో పాపులర్ తమిళ నటి కాసమ్మాళ్ హత్యకు గురైంది. అదీ కని పెంచిన సొంత కొడుకు నామకోడి ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు. నామకోడి 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ, తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ విబేధాలు, వాగ్వాదం జరుగుతుండేవి. గత ఆదివారం (ఫిబ్రవరి 4) రోజు కూడా మద్యం కోసం డబ్బులివ్వమని తల్లిని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది అంతే విచణక్ష మరిచిన అతగాడు చెక్కతో తల్లిపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని మధురైకి సమీపంలోని అనయ్యూర్లోని కాసమ్మాళ్ స్వగృహంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రాథమిక విచారణ తరువాత,కేసు నమోదు చేసిన పోలీసులు నామకోడిని అరెస్ట్ చేశారు. కాసమ్మాళ్, ఆమె భర్త దివంగత బాలసామి దంపతుల నలుగురు పిల్లలలో నామకోడి ఒకరు. కాగా కాసమ్మాళ్ 2022లో విడుదలైన 'కడైసి వివాసాయి' చిత్రంలో విజయ్ సేతుపతి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఎం మణికండాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నల్లంది, యోగి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. -
కమెడియన్ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి!
తమిళ కమెడియన్ రోబో శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. విజిల్, పాగల్ సినిమాల్లో.. ఇందుకోసం రోబో శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్ హీరోగా నటించిన బిగిల్(తెలుగులో విజిల్ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్' మూవీలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ. ఎవరీ రోబో శంకర్.. ఆమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు. View this post on Instagram A post shared by SmartDecors (EVENT PLANNERS) (@smart_decors.in) View this post on Instagram A post shared by @clicks_by_vishnu_kumar_ చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఆమిర్‌తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్ ఎలా ఉందంటే? -
ఆ హిట్ సినిమాల్లో నటించిందీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా మరి?
ఏ సినిమా అయినా సరే ఫేమ్, క్రేజ్ లాంటివి హీరోహీరోయిన్లకే వస్తాయి. అయితే కొన్నిసార్లు వీళ్లతో పాటు సైడ్ క్యారెక్టర్స్ చేసినోళ్లు కూడా ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా అప్పట్లో పలు హిట్ సినిమాల్లో కనిపించింది. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తినే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నీలిమ రాణి. గుర్తుచ్చినట్లే ఉంది కానీ ఐడియా రావట్లేదు కదా! చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె.. పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది. స్కూల్ చదువుతున్నప్పుడే ఈమెకు ఛాన్సులొచ్చాయి. అలా తెలిసీ తెలియని వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. కమల్ హాసన్ 'క్షత్రియ పుత్రుడు' చిత్రంతో అరంగేట్రం చేసింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) దాదాపు పదేళ్ల గ్యాప్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా నాలుగు సినిమాలు చేసిన నీలిమ.. ఆ తర్వాత రూట్ మార్చింది. సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 2003 నుంచి మొదలుపెడితే స్టిల్ ఇప్పటికీ అటు సినిమాలు ఇటు సీరియల్స్‌లో నటిస్తూనే ఉంది. నటి,నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్టు, హోస్ట్.. ఇలా డిఫరెంట్‌గా క్రేజ్ సంపాదించింది. కెరీర్ మొత్తంలో ఈమెకు విలన్ తరహా పాత్రలు బాగా పేరు తెచ్చాయని చెప్పొచ్చు. కార్తీ 'నా పేరు శివ', విశాల్ 'పొగరు' లాంటి సినిమాలు చూస్తే మీకు ఈమె కనిపిస్తుంది. అలానే తెలుగులో 'వసుంధర', 'ఇది కథ కాదు', 'తాళి కట్టు శుభవేళ' లాంటి సీరియల్స్‌లోనూ నీలిమ సందడి చేసింది. వ్యక్తిగత జీవితానికి వస్తే.. తమిళ సినిమాల్లోనే అసోసియేట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఎసాయి వానన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే చాలారోజుల తర్వాత ఈమె ఫొటో, సోషల్ మీడియాలో కనిపించడంతో తొలుత మనోళ్లు గుర్తుపట్టలేకపోయారు. ఐడియా వచ్చిన తర్వాత ఈమె ఆమెనే కదా అని మాట్లాడుకున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) View this post on Instagram A post shared by Neelima Rani (@neelimaesai) -
ఇప్పటివరకు ఒక లెక్క ఇకమీదట ఒక లెక్క అంటున్న హీరోయిన్
వైవిధ్యభరిత పాత్రలతో సత్తా చాటుతున్న నటి వసుంధర. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన పేరాన్మై చిత్రంలో జయంరవితో కలిసి నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఈ భామ ఒకరు. ఈ సినిమా తరువాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా విభిన్న కథా చిత్రాల దర్శకుల ప్రాజెక్టుల్లోనూ నటించేలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అలా ఈ ఏడాది కన్నై నంబాదే, తలైకూత్తల్ అనే రెండు సినిమాలతో పాటు మోడ్రన్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. కాగా వసుంధర ఇప్పుడు మళ్లీ బిజీ నటిగా మారారు. ఇప్పటి వరకు సెలక్టివ్ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు. ఇక నుంచి పాత్రల ఎంపికలో తన నిబంధనలను మార్చుకుంటున్నానంటున్నారు. ఇంతకుముందు ప్రతి నాయికగా నటిస్తే ప్రేక్షకుల్లో చెడు ఇమేజ్ క్రియేట్ అయ్యేదని, మారుతున్న కాలంలో అలాంటి పాత్రలను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అందుకు తన అభిమాన నటి రమ్యకృష్ణనే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆమె ఇటీవల పాజిటివ్, నెగెటివ్ పాత్రల్లోనూ సత్తా చాటుతున్నారన్నారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలతో బోర్ కొడుతోందని, విలనిజంతో నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నారు. తాను ఇప్పుడు అలాంటి చాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలా ప్రస్తుతం ఒక మల్టీస్టారర్ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇది మహిళల ఇతివృత్తంతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పబ్ గోవా వెబ్‌సీరీస్ ఫేమ్ లక్ష్మీనారాయణన్రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. దీనితో పాటు ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. తన పుట్టిల్లు తమిళనాడు అని, అయితే ఇకపై తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Vasundhara (@ivasuuu) చదవండి: నటి విచిత్రను ఇబ్బంది పెట్టిన తెలుగు హీరో ఎవరు.. కమల్ ఈ సాహసం చేయగలరా? -
21 ఏళ్లకే విడాకులు.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: నటి
పైకి నవ్వుతూ ఉన్నంతమాత్రాన వారి జీవితాలు సంతోషంగా సాగిపోతున్నట్లు కాదు. కొందరు అంతులేని విషాదాన్ని, దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకుని బయటకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. నలుగురినీ నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. తమిళ యాంకర్, నటి స్వర్ణమాల్య కూడా అదే కోవలోకి వస్తుంది. యుక్త వయసులోనే ఎన్నో కష్టాలను చూసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. 21 ఏళ్లకే విడాకులు.. కారణం తెలీదు 'నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు యూత్ ఇన్నొవేషన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాను. అప్పుడు కొంత బెరుకు ఉండేది. నిజానికి నేను ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటాను. నాకు యుక్త వయసులోనే పెళ్లి చేశారు. కానీ అది ఎంతోకాలం నిలవలేదు. 21 ఏళ్లకే విడాకులు అయిపోయాయి. అప్పుడతడి వయసు 25. ఆ వయసులో మాకు ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది కూడా పెద్దగా తెలియదు. బహుశా అమెరికా లైఫ్‌స్టైల్ నాకు వంటపట్టలేదేమో! డిప్రెషన్, చచ్చిపోదామనుకున్నాను ఈ విడాకుల వల్ల నాకన్నా నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడ్డారు. చదువులపై ధ్యాస పెడితే ఈ బాధ నుంచి బయటపడొచ్చన్నారు. ఈ బ్రేకప్, కొట్లాటల వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాను. జీవితం అంటే ఇదేనా? ఎందుకు బతకాలి? అని విరక్తి చెందాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పరిస్థితి చూడలేక నా సోదరి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి రెండు నెలలు పట్టింది' అని చెప్పుకొచ్చింది. కాగా యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్వర్ణమాల్య తర్వాత నటిగానూ మారింది. మణిరత్నం దర్శకత్వం వహించిన అలైపుతే సినిమాలో ఓ పాత్రలో నటించింది. నటన, యాంకరింగ్.. రెండింటిలోనూ ఆరితేరిన ఆమె ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతోంది. నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: కొత్తింట్లో దీపావళి.. పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్.. ఎంతైనా ఆమె మనసు బంగారం! -
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ కోలీవుడ్ నటి ఇంట్లో విషాదం నెలకొంది. నటి బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అలియాస్ విక్కీ ఇటీవల చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రితీలో మృతి చెందారు. విఘ్నేష్ వయస్సు 40 ఏళ్లు కాగా.. ప్రస్తుతం చెన్నైలోని సాలిగ్రామం దశరథపురం అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న విఘ్నేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాబిలోనా సోదరుడిని కొద్ది రోజుల క్రితం చెన్నైలోని వలసరవాక్కంలో సాధారణ పెట్రోలింగ్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేష్‌కు క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలోనూ అతను అనేక నేరాలకు పాల్పడినట్లు సమాచారం. కాగా.. నటి బాబిలోనా శాస్త్ర (2000), ఇష్క్ కా ఆచార్ (2004), లెవెల్ క్రాస్ (2002) వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నిర్మలా ఆంటీ అనే చిత్రంలో కనిపించారు. అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి కాగా.. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. -
జై భీమ్ నటి హీరోయిన్గా కొత్త సినిమా.. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో..
విభిన్న కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నటుడు శశికుమార్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన అయోత్తి చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన కళుగు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సత్య దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా జైభీమ్ చిత్రం నటి లిజోమోల్ జోస్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సుదేవ్నాయర్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా శరవణన్, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ మాళవిక, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయగణపతి పిక్చర్స్ పతాకంపై పాండియన్ పరశురాం నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది 1990 ప్రాంతంలో జరిగే కథాచిత్రంగా ఉంటుందన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్లర్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం చైన్నె పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. నటుడు శశికుమార్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని, కథ, కథనం, నేపథ్యం కొత్తగా ఉంటుందని, త్వరలోనే టైటిల్ ప్రకటించి చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: ‘భగవంత్ కేసరి’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.. కాజల్ కంటే ఎక్కువే! -
ప్రముఖ నటి, దర్శక నిర్మాత కన్నుమూత
కోలీవుడ్ సీనియర్ నటి, దర్శక నిర్మాత జయదేవి (65) చైన్నెలో కన్నుమూశారు. తొలుత డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన జయదేవి ఆ తరువాత నటిగా ఇదయ మలర్, సాయ్ందాడమ్మా సాయ్ందాడు,వాళ నినైత్తాళ్ వాళలామ్,సరిమాన జోడీ, రజనీకాంత్‌తో గాయత్రీ అనే చిత్రంలోనూ నటించారు. ఆ తరువాత నిర్మాతగా మారి మట్రవై నేరిల్, వా ఇంద పక్కమ్, నండ్రీ మీండుమ్ వరుగై తదితర చిత్రాలను నిర్మించారు. వా ఇంద పక్కమ్ చిత్రం ద్వారా పీసీ శ్రీరామ్‌ను ఛాయాగ్రహకుడిగా పరిచయం చేసిన ఘనత ఈమెదే. ఆ తరువాత నలమ్ నలమాగియ ఆవల్, విలాంగు మీన్, పాశం ఒరు వేషం వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు వేలు ప్రభాకరన్‌ను పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత విడిపోయారు. స్థానిక పోరూర్‌లోని సమయపురత్తిల్ వీధిలో నివశిస్తున్న జయదేవి కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిశారు. జయదేవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.