
తెలుగు ప్రజలపై కొన్నిరోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని హైదరాబాద్‌లో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అయితే తమిళనాడు నుంచి తప్పించుకుని పారిపోయి ఇక్కడి వచ్చిందనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు వీటిపై కస్తూరి స్పందించింది. తాను ఇక్కడికి రావడానికి అది కారణం కాదని చెప్పుకొచ్చింది. ఈమెని అరెస్ట్ చేయడానికి ముందు ఓ వీడియోని రికార్డ్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన కస్తూరి.. షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని చెప్పింది. షూటింగ్ ముగిసిన వెంటనే తమిళనాడు పోలీసులకు సహకరించానని పేర్కొంది. తనకు ఎలాంటి భయం లేదని చెప్పుకొచ్చింది. పోలీస్ వ్యాన్‌లోకి వెళ్లేటప్పుడు మాత్రం చేయి పైకెత్తి చూపిస్తూ కాస్త హంగమా చేసింది.
(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?)
వివాదం ఏంటి?
నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి చెప్పింది
తెలుగువాళ్లపై కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. దీంతో తప్పు తెలుసుకుని రోజుల వ్యవధిలోనే క్షమాపణ చెప్పింది. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ అప్పటికే తమిళనాడులో ఈమెపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందుస్తు బెయిల్ కోసం అప్లై చేసింది. కానీ కోర్ట్ ఈమె బెయిల్‌ని తిరస్కరించింది. దీంతో హైదరాబాద్‌కి పారిపోయి వచ్చింది. కస్తూరికి నవంబర్ 29వరకు తమిళనాడు కోర్ట్ రిమాండ్ విధించింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
Chennai: Court remands actor Kasthuri to judicial custody till November 29. - PTI #Kasthuri pic.twitter.com/wj4b8M0W8r
— Deccan Chronicle (@DeccanChronicle) November 17, 2024