
దాదాపు మూడు వందల సినిమాల్లో నటించిన బిందు ఘోష్ (Bindu Ghosh) ఇప్పుడు దీన స్థితిలో ఉంది. తమిళ, తెలుగు భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ఆమె మంచాన పడింది. మూడు నెలలుగా కాలేయం, బీపీ సంబంధింత సమస్యలతో బాధపడుతోంది.
క్షీణించిన ఆరోగ్యం..
తల్లి అనారోగ్య పరిస్థితి గురించి తనయుడు, కొరియోగ్రాఫర్ శివాజీ మాట్లాడుతూ.. అమ్మకు 76 ఏళ్లు. ఒకప్పుడు 118 కిలోల బరువుండేది. అనారోగ్యం వల్ల ఏకంగా 38 కిలోలకు తగ్గిపోయింది. ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అమ్మ సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోయింది.
తెలుగులో ఏయే సినిమాలు?
అందుకే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ మధ్యే తమిళనాడు ప్రభుత్వం స్పందించి అమ్మకు చికిత్స అందిస్తోంది అని పేర్కొన్నాడు. బిందు ఘోష్.. కృష్ణగారి అబ్బాయి, దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, చిత్రం భళారే చిత్రం వంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించింది. తమిళంలో నటిగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గానూ రాణించింది.
చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
Comments
Please login to add a commentAdd a comment