
ప్రయాగరాజ్ మహాకుంభమేళా వల్ల పూసలమ్మే మోనాలిసా అనే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈమెకు ఏకంగా సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా వచ్చింది. అయితే ఈమెకు అవకాశమిచ్చిన దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు బెదిరిస్తున్నాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడమే దీనికి కారణం.
(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)

బాధితురాలు చెప్పిన దాని ప్రకారం.. 2020లో టిక్ టాక్, ఇన్ స్టా ద్వారా దర్శకుడు సనోజ్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఈ యువతి పరిచయమైంది. 2021 జూన్ 17న ఈమెకు ఫోన్ చేసిన సనోజ్ మిశ్రా.. తాను ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానని రావాలని కోరాడట. కానీ ఆమె రాలేదు. కలవడానికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయంతో సనోజ్ ని వెళ్లి కలిసింది.
సదరు యువతిని ఓ రిసార్ట్ కి తీసుకెళ్లిన సనోజ్ మిశ్రా.. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ విషయం బయటకు చెప్తే.. ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడట. ఇలా పెళ్లి, సినిమా అవకాశాలు పేరు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడట. దీంతో ఈమె దిల్లీలోని నబీ కరీమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)