అనుకున్నట్లుగానే 'పుష్ప 2' ట్రైలర్ వైల్డ్ ఫైర్‌లా ఉంది. పెద్దగా కథ రివీల్ చేయలేదు గానీ మూవీ ఎంత గ్రాండియర్‌గా ఉండబోతుందనేది శాంపిల్ చూపించారు. తొలి భాగంలో ఉన్న చాలామంది యాక్టర్స్.. ట్రైలర్‌లో కనిపించారు. వీళ్లతో పాటు పలు కొత్త పాత్రలు కూడా కనిపించాయి. మిగతా వాళ్ల సంగతేమో గానీ అరగుండుతో ఓ పాత్ర కనిపించింది. ఇంతకీ ఈ నటుడు ఎవరబ్బా అని అందరూ బుర్ర గోక్కుంటున్నారు.
ట్రైలర్‌లో అర గుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన నటుడి పేరు తారక్ పొన్నప్ప. స్వతహాగా కన్నడ నటుడు అయిన ఇతడు 'కేజీఎఫ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న 'దేవర'లోనూ విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకుగా నటించాడు. ఇప్పుడు 'పుష్ప 2'లోనూ కీలక పాత్ర పోషించినట్లే కనిపిస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పుష్ప 2లో చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ మూవీ టర్న్ అయ్యే ట్విస్ట్ మాత్రమే కాదు. పుష్ప లైఫ్ మారిపోయే ట్విస్ట్ & టర్న్ తీసుకొస్తుంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ తారక్ పొన్నప్ప చేసిన రోల్ ఏంటనేది మూవీ రిలీజైతే గాని తెలియదు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పాట్నాలో ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇదిప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఎందుకంటే లక్షకు పైగా జనాలు అల్లు అర్జున్‌ని చూడటానిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.
(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment