కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్ | MM Keeravani Son Sri Simha Pre Wedding Pic | Sakshi
Sakshi News home page

Sri Simha Wedding: మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి

Published Mon, Nov 18 2024 7:07 AM | Last Updated on Mon, Nov 18 2024 12:40 PM

MM Keeravani Son Sri Simha Pre Wedding Pic

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

(ఇదీ చదవండి: ఆ విషయంలో నన్ను క్షమించండి.. అల్లు అర్జున్ రిక్వెస్ట్)

మురళీ మోహన్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్‌ మోహన్‌.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్‌ మోహన్‌- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది.

శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇదేమైనా ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్)

 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement