murali mohan
-
మనవరాలి పెళ్లిపై మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మనవరాలి పెళ్లితో నటుడు మురళీ మోహన్ (Murali Mohan).. సంగీత దర్శకుడు కీరవాణికి చుట్టమయ్యాడు. మురళీ మోహన్ మనవరాలు రాగ.. కీరవాణి కుమారుడు, హీరో శ్రీ సింహ (Sri Simha) ఈ మధ్యే పెళ్లిపీటలెక్కారు. ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు ఆటపాటలతో, డ్యాన్సులతో ఉత్సాహంగా గడిపారు. తాజాగా ఈ వెడ్డింగ్ గురించి మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.అలా మొదలైంది'రాజమౌళి కోడలు పూజ, నా మనవరాలు రాగ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఆ సమయంలో రాజమౌళి (SS Rajamouli), కీరవాణి కుటుంబాలు ఎంత బాగా కలిసున్నాయో కళ్లారా చూసింది. ఫ్రెండ్స్‌లాగా ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటూ చాలా క్లోజ్‌గా, ఆప్యాయతగా ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే ఫామ్ హౌస్‌కు వెళ్లి గేమ్స్ ఆడేవారు.తనే ప్రపోజ్ చేసిందిఇదంతా రాగకు బాగా నచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబమంటే చాలా ఇష్టం. అందుకని ఆ రెండు కుటుంబాలు అలా కలిసిమెలిసి ఉండటం చూసి ముచ్చటపడిపోయింది. తనే ఒకరోజు శ్రీసింహకు ప్రపోజ్ చేసింది. ఈ విషయం మొదట మాకు చెప్పలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నీకు నచ్చినవాళ్లెవరూ లేరా? అని అడిగాను. అప్పుడు తన మనసులో మాట బయటపెట్టింది. (చదవండి: అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్)ఎంత సంతోషమేసిందో!కీరవాణి కుమారుడు శ్రీసింహను ఇష్టపడ్డాను.. మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. తన సెలక్షన్ బాగుండటంతో అందరం ఓకే అన్నాం. పెళ్లిలో కూడా వాళ్లు ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యారో.. పెళ్లికూతుర్ని వధువు తరపువారు పల్లకి మోస్తూ మండపానికి తీసుకెళ్లాలి. కానీ అప్పుడు కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ సహా మరికొందరు పల్లకి మోసి తనను తీసుకెళ్లారు. ఎంతో సంతోషమేసింది' అని చెప్పుకొచ్చాడు.రాగ ఎవరంటే?మురళీ మోహన్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు రామ్మోహన్- రూపల కుమార్తెనే రాగ. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా మూవీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ఆ సంఘటనతో మతం మారాను: రెజీనా కసాండ్రా -
రాసిపెట్టుంది.. భార్య గురించి శ్రీసింహ స్పెషల్ కామెంట్స్ (ఫోటోలు)
-
మురళీమోహన్ మనవరాలి పెళ్లిలో ఆర్ఆర్ఆర్ కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
గ్రాండ్‌గా మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి వేడుక (ఫోటోలు)
-
మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి...ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఆ విషయంలో నన్ను క్షమించండి.. అల్లు అర్జున్ రిక్వెస్ట్)మురళీ మోహన్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది.శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇదేమైనా ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్) 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైడ్రా’ కూల్చివేతలు.. మాదాపూర్‌లో ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో మరో కట్టడాన్ని హైడ్రా ఆదివారం(సెప్టెంబర్8) కూల్చివేసింది. ఈ భవనంలో హోటల్ నిర్వహించే వాళ్లు కూల్చివేతలను అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామని ఆందోళనకు దిగడంతో అక్కడ ఉదద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్ పోసుకున్న వ్యక్తి నిప్పంటించుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. హోటల్ భవనాన్ని కూల్చివేస్తామని ఇప్పటికే నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరళీమోహన్ ‘జయభేరి’కి నోటీసులుసినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్కు హైడ్రా తాజాగా నోటీసులిచ్చింది. గచ్చిబౌలిలోని రంగలాల్‌కుంట చెరువులో జయభేరికి చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొంది. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు..హైదరాబాద్‌లోని చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా కొనసాగిస్తోంది. తాజాగా ఆదివారం(సెప్టెంబర్ 8) ఉదయం దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని అక్రమ విల్లాలు, మదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, సున్నం చెరువులో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేస్తుండగా భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మియాపూర్‌లోని స్వర్ణపురి కాలనీలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సంగాారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. హెచ్ఎంటీ నగర్, వాణి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇదీ చదవండి.. కూల్చివేతే చెరువుల పరిరక్షణా..? -
ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసిన మురళి మోహన్!
చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "నేను-కీర్తన". ఈ సినిమా ద్వారా చిమటా రమేష్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి "కొంచెం కొంచెం.. గుడుగుడు గుంజం" అనే లిరికల్ వీడియో ఐటమ్ సాంగ్‌ను నటుడు మురళిమోహన్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ..'ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను - కీర్తన మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్లో కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని అన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు రమేష్ బాబు తెలిపారు. ఈ చిత్రంలో సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. -
‘రేవు’ పార్టీలో హేమాహేమీలు..ఆర్జీవి మురళీమోహన్ (ఫొటోలు)
-
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
మురళీమోహన్‌కు సన్మానం
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీ మోహన్‌కి 'నట సింహ చక్రవర్తి' బిరుదు ప్రదానం చేశారు. వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ఆధ్వర్వంలో ఈ వేడుకకి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సినీ పెద్ద మురళీమోహన్ గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా నన్ను ఈ ఈవెంట్ కి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. విష్ణు బొప్పన గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అన్నారు. బిజీ షెడ్యూల్ ని కూడా పక్కనపెట్టి మురళీమోహన్ గారి కోసం ఈవెంట్ కి రావడం జరిగింది. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మురళీమోహన్ గారు ఆయన్ని సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక సినీ యాక్టర్ గా చూశాను రాజకీయ నాయకుడిగా చూసాను బయట మంచి వ్యక్తిగా కూడా చూడడం జరిగింది అలాంటి వ్యక్తికి సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ‘నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని 'నటసింహ చక్రవర్తి' బిరుదునివ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది’అని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. ‘ప్రతి ఏడాది పేద కళాకారులకు స్కూల్ ఫీజులు లేదా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈసారి వికలాంగులకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతులు మీదుగా చెక్కుల అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’అని వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా సీతారామం దర్శకుడు హను రాఘవపూడి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, బింబిసార దర్శకుడు వశిష్ట, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ ఎస్తేర్, గాయని హారిక నారాయణ, గాయకుడు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఆ హిట్ సినిమాకు 50 ఏళ్లు.. ఘనంగా స్వర్ణోత్సవం!
ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళ ప్రధాన పాత్రల్లో కె. సత్యం దర్శకత్వంలో కాకర్ల కృష్ణ నిర్మించిన చిత్రం ‘ఇంటింటి కథ’ (1974). ఈ సినిమా విడుదలై 50 ఏళ్లయిన సందర్భంగా నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం జరిగింది. కాకర్ల కృష్ణ మనవడు త్రికాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత, నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. మురళి మోహన్ మాట్లాడుతూ– ‘‘వీబీ రాజేంద్ర ప్రసాద్‌గారి జగపతి సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా ప్రయాణం ప్రారంభించిన కృష్ణ ఆ తర్వాత ‘ఇంటింటి కథ’ సినిమాతో నిర్మాతగా మారారు’ అని అన్నారు. కాకర్ల కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇంతమంది ఆత్మీయల సమక్షంలో నా స్వర్ణోత్సవం జరగటం సంతోషంగా ఉంది. ఇది నా జీవితాంతం తీపి జ్ఞాపకంగా ఉంటుంది. కృష్ణ స్వర్ణోత్సవం జరగడం సముచితంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. నిర్మాతలు కె. దామోదర ప్రసాద్, జి. ఆదిశేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇలాంటి వైవిధ్యమైన పాయింట్‌తో ఇప్పటి వరకు సినిమా రాలేదు: రాజేశ్వరి చంద్రజ
‘‘రాంబాబుగారు ‘కలశ’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ఇప్పటివరకూ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇలాంటి వైవిధ్యమైన పాయింట్‌తో సినిమా రాలేదని చెప్పగలను. సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’’ అని రాజేశ్వరి చంద్రజ వాడవల్లి అన్నారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో కొండ రాంబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘కలశ’. రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించిన ఈ సినిమా నెల 15న రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కి అతిథులుగా విచ్చేసిన నటుడు మురళీమోహన్ ‘ఓ చిట్టి తల్లి..’ అనే పాటని, దర్శకుడు వీర శంకర్ ‘కలశ..’ అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్. థ్రిల్లర్ అంటే రాతకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తీత అంటే కెమెరా వర్క్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే సంగీతానికి కూడా. వీటి విషయంలో దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. నిర్మాత రాజేశ్వరి గారు ఈ చిత్రం పట్ల చూపించిన శ్రద్ధ ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’అని అన్నారు. కొండా రాంబాబు మాట్లాడుతూ– ‘‘చంద్రజగారు, స్వామిగార్లకు ఇది తొలి సినిమా అయినా బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు’’ అన్నారు. -
కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్ మనవరాలు..
పెళ్లిళ్ల సీజన్ కావడంతో సెలబ్రిటీలు కూడా ఇంతకుమించిన మంచి తరుణం మళ్లీ దొరకదంటూ లైఫ్‌లో ఓ అడుగు ముందుకేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని వుడ్స్‌లోనూ తారలు పెళ్లి సందడితో బిజీగా ఉన్నారు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆస్కార్ గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ.. నటుడు మురళీ మోహన్ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. వచ్చే ఏడాదే పెళ్లి తాజాగా ఈ వార్తలపై మురళీ మోహన్ స్పందిస్తూ అది నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. తనకు ఓ అమ్మాయి సంతానం. త్వరలో ఆమె పెళ్లి జరగబోతోంది. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో తన వివాహం జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు సంతానం. ఈమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా వెళ్లనుంది. పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివర్లో జరగనుంది' అని పేర్కొన్నాడు. మురళీ మోహన్ మనవరాలు ఏం చేస్తుంది? కాగా మాగంటి మురళీ మోహన్ కొడుకు పేరు రామ్ మోహన్. ఈయన ఏకైక కుమార్తె పేరు 'రాగ'. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ సినిమాలతో టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చదవండి: 18 ఏళ్లకే పెళ్లి, ఐదేళ్లకే విడాకులు.. ముగ్గురు పిల్లలతో.. తెలుగు హీరోయిన్ కన్నీటి కష్టాలు.. -
మాగంటి మురళీ మోహన్ కుటుంబంతో కీరవాణి వియ్యం
టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆస్కార్ అవార్డ్‌తో తెలుగు పరిశ్రమను ప్రపంచానికి తెలిపిన ఎమ్.ఎమ్ కీరవాణి కుమారుడు హీరో శ్రీసింహ పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. నిర్మాత, సినీ నటుడు,వ్యాపారవేత్త అయిన మురళీ మోహన్ మనుమరాలితో శ్రీసింహ ఏడు అడుగులు వేయనున్నాడని సమాచారం. శ్రీసింహ ఇప్పటికే భాగ్ సాలే, మత్తు వదలరా, ఉస్తాద్ వంటి చిత్రాల్లో నటించి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా తన బాబాయ్ రాజమోళితో పాటు పలు సినిమాలకు కూడా పనిచేశాడు. మురళీ మోహన్‌కు ఒక అమ్మాయితో పాటు రామ్ మోహన్ అనే అబ్బాయి ఉన్నారు. ఆయన కుమార్తెనే శ్రీసింహకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు. రామ్ మోహన్- రూప మాగంటిలకు జన్మించిన ఏకైక కుమార్తె పేరు 'రాగ' కొద్దిరోజుల క్రితమే ఆమె ఐఎస్బీలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే పలు కీలక బాధ్యతల్లో వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనకు ఇరుకుటుంబాలు వచ్చాయని తెలుస్తోంది. కానీ ఈ వివాహం గురించి రెండు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ విషయం ప్రచారంలో మాత్రమే ఉంది. -
దళిత గళం గొంతు నొక్కి!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ రిజర్వుడు నియోజక వర్గాలకు సంబంధించి టీడీపీ దళిత నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలైనా, నియోజకవర్గాలైనా, దళిత నేతలైనా చంద్రబాబు, లోకేశ్‌కు ఎప్పుడూ చిన్నచూపేనని స్పష్టం చేస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో లోకేశ్ పర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు జరిగిన దారుణ అవమానాన్ని గుర్తు చేస్తున్నారు. కనీస ప్రాధాన్యం లేకుండా.. యువగళం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. దాదాపు పన్నెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరిగింది. సత్యవేడులో హెలెన్, కొండేపిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని గెలిపించాలని కోరడం మినహా మిగిలిన నియోజవర్గాల్లో తమ నాయకులకు లోకేశ్ కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని టీడీపీలో దళిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గంగాధర నెల్లూరు, సూళ్లూరుపేట, గూడూరు, సింగనమల, కోడుమూరు, నందికొట్కూరు, బద్వేలు, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగినప్పటికీ లోకేశ్ దళిత నాయకుల ఊసెత్తలేదు. కనీసం ఇన్చార్జీలని చెప్పేందుకూ నిరాకరించారు. పూతలపట్టు ఇన్చార్జిగా మురళీమోహన్ పేరును యువగళం పాదయాత్ర తరువాత చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. తమ వారిని హీరోలుగా కీర్తిస్తూ.. యువగళం పాదయాత్ర ఇతర నియోజక వర్గాలలో సాగినప్పుడు లోకేశ్ తీరులో తేడా స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. అద్దంకిలో గొట్టిపాటి, వినుకొండలో ఆంజనేయులు, గురజాలలో యరపతినేనిని ఆ ప్రాంత హీరోలని ప్రశంసిస్తూ తమను విస్మరించడాన్ని ఏ కోణంలో చూడాలని టీడీపీలోని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వుడు స్థానాల్లో నాయకులను చులకనగా చూడటం, ఇతర వర్గాల విషయంలో మాత్రం లోకేశ్ వైఖరి కొట్టొచ్చినట్లు కనపడుతోందంటున్నారు. ఉన్నత వర్గాలదే పెత్తనం.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని రిజర్వుడు స్థానాల్లోనూ ఆయన వర్గానిదే పెత్తనం. జీడీ నెల్లూరు నియోజకవర్గం వ్యవహారాలన్నీ చిట్టిబాబునాయుడు కనుసన్నల్లోనే జరగాల్సిందే. గూడూరులో పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేటలో నెలవల సుబ్రమణ్యం, సింగనమలలో బండారు శ్రావణి, సంతనూతలపాడులో విజయకుమార్, బద్వేలులో రాజశేఖర్ పేరుకు మాత్రమే నాయకులు. సింగనమలలో అగ్రవర్ణాలకు చెందిన వారితో కూడిన త్రిసభ్య కమిటీదే పెత్తనం. కోడుమూరులో ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, నందికొట్కూరులో గౌరు వెంకటరెడ్డి, బద్వేలులో కె.విజయమ్మ చెప్పినట్లే నడుచుకోవాలి. అక్కడ దళిత నేతలది మౌనవ్రతమే. -
శ్రీదేవిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు: మురళీ మోహన్
జగమే మాయ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నటుడు మురళీ మోహన్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత కీలక పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. 15 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉంటాననుకున్న ఆయన 50 ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్నాడు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లడంతో పదేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే పూర్తిగా సినిమాలకే అంకితమవ్వాలనుకుంటున్నానని ఇటీవలే మురళీ మోహన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అక్కినేని నాగేశ్వరరావు అభిమానిని అని చెప్పే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. 'ఇండస్ట్రీలో ఉన్న శ్రీరామచంద్రుడిని నేనే అని నాగేశ్వరరావు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. శ్రీదేవి వాళ్ల అమ్మకు ఓ ఆలోచన వచ్చింది. ఈయన బుద్ధిమంతుడిలా ఉన్నాడు, బాగున్నాడు.. ఇలాంటి అబ్బాయికి మనమ్మాయినిస్తే బాగుంటుందని ఆలోచించింది. మరి తనకు ఎందుకలా అనిపించిందో నాకు తెలియదు. నిర్మాతగా సినిమాలు చేద్దామంటే నన్ను సెట్స్‌కు రావద్దన్నారు. అవసరమైనప్పుడు డబ్బులు పంపిస్తే చాలన్నారు. అలాంటప్పుడు ఇంకేం చేయాలి?' అన్నాడు మురళీ మోహన్. చదవండి: నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది: పార్వతి -
ఎన్టీఆర్ అవార్డ్స్‌కు అరుదైన గౌరవం.. !!
నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 8 రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు మురళీ మోహన్ పాల్గొని అవార్డులు అందజేశారు. తెలుగు సినీ నటులు మురళి మోహన్, కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్, దర్శకులు సురేష్ కృష్ణ, అశోక్, సత్యానంద్, సీనియర్ జర్నలిస్టులు వినాయక రావు, ధీరజ అప్పాజీ, కూనిరెడ్డి శ్రీనివాస్‌లకు ఈ అవార్డులు దక్కాయి. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ వేడుకను ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేదికపై 101 మందికి అవార్డులు అందజేయగా.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన ఎఫ్టీపీసీ సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా - కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి లకు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లండన్ సీఈఓ రాజీవ్ శ్రీవాత్సవ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. మురళి మోహన్ మాట్లాడుతూ.. 'జాతీయ స్థాయిలో ఇంతమందిని ఒక వేడుకలో భాగస్వామ్యం చేయడం ఎంతో కష్టసాధ్యం. అయినప్పటికీ యుగపురుషుడు ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ సంస్థలు ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించారని.' అని అన్నారు. నటన, సేవా రంగాలలో ఎన్టీఆర్ ఎందరికో ఆదర్శ ప్రాయులని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. (ఇది చదవండి: Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?) ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, జెన్కో చైర్మన్ ప్రభాకర రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీ ప్రముఖులు బసిరెడ్డి, దామోదర్ ప్రసాద్, కాశీ విశ్వనాధ్, ఎన్టీఆర్ మనవడు నందమూరి యశ్వంత్, తుమ్మల ప్రసన్న కుమార్, గౌతమ్ రాజు తదితరులు విచ్చేసి గ్రహీతలకు అవార్డులను బహూకరించారు. -
సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక నిర్ణయం!
‘నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1973 మార్చిలో నా సినిమా (‘జగమే మాయ’) షూటింగ్ మొదలైంది. నన్ను హీరోగా పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు, పీవీ సుబ్బారావుగార్లకు నా కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు మురళీమోహన్. చిత్రపరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీమోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఓ 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాననుకున్నాను. అందరి సహకారానికి అదృష్టం తోడవ్వడంతో 50 ఏళ్లు ఉండగలిగాను. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లినందు వల్ల పదేళ్లు సినిమాలకు బ్రేక్ వచ్చింది. ఇక పూర్తిగా సినిమాలకు అంకితమవ్వాలను కుంటున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్‌ని. చనిపోయేంతవరకు సినిమాల్లో నటిస్తుంటానని, ఆ మాటను నిజం చేశారాయన. ఏయన్నార్‌గారి స్ఫూర్తితో ఇక నటనకే అంకితం అవుతాను’’ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ‘మిథునం’ చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి రాసిన ‘అమ్మే దైవం’ పాట వీడియోను రిలీజ్ చేశారు మురళీమోహన్. -
చైతో ఉన్న ఇంటినే ఎక్కువ డబ్బిచ్చి మరీ సొంతం చేసుకున్న సామ్
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మీద విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆమె ఏం చేసినా తప్పుపట్టారు నెటిజన్లు. అంతేకాదు, చైతూ నుంచి కోట్లాది రూపాయలు భరణం తీసుకుందని, ఆస్తి రాయించుకుందని ఏవేవో పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సామ్ అవన్నీ అసత్యపు ప్రచారాలేనని కుండ బద్ధలు కొట్టేసింది. తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'నాగచైతన్య- సమంత మా ఇల్లు కొనుక్కున్నారు. అందులోనే కలిసి ఉండేవారు. తర్వాత వారిద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారు. అందుకని వారు నివసిస్తున్న ఇంటిని అమ్మేశారు. కానీ కొత్తిల్లు రీమోడలింగ్ చేసేంతవరకు ఇక్కడే ఉంటామని అనడంతో మా ఇల్లు కొనుక్కున్నవారు సరేనని అంగీకరించారు. ఇంతలోనే వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత మంచి ఇంటి కోసం సమంత బయట ఎక్కడెక్కడో చూసొచ్చింది.. కానీ ఎక్కడా తనకు నచ్చలేదు. సేఫ్టీ కూడా ఇక్కడే బాగుందని అభిప్రాయపడిన సమంత నా దగ్గరకు వచ్చి ఇల్లు కావాలని అడిగింది. మేము మీకు అమ్మాం, మీరు ఇంకొకరికి అమ్మారు కదా, ఇప్పుడేం చేయగలనమ్మా.. అన్నాను. అప్పుడామె ఆ ఇల్లు కొన్నవాళ్లతో మాట్లాడి వారికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆ ఇంటిని తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం అక్కడే తన తల్లితో కలిసి నివసిస్తోంది' అని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్. చదవండి: భారీ బడ్జెట్, అత్యంత ఘోరమైన ఫ్లాప్.. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు రెండో పెళ్లి, వివాహమైన ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిన నటి -
పనిమనిషి చెప్పేదాకా చైసామ్ విడిపోతున్నారని తెలియదు
నాగచైతన్య- సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తరచూ వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే వీరి విడాకుల గురించి తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పందించాడు. ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అలాంటి చూడముచ్చని జంట ఎలా విడిపోయిందో అర్థం కావడం లేదన్నాడు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మాకు హైదరాబాద్‌లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్ పైన నా కుటుంబం కోసం ప్రత్యేకంగా ఇళ్లు కట్టుకున్నాం. ఒకటి నా కోసం, రెండోది నా కొడుకు కోసం, మరోటి నా తమ్ముడు కిషోర్ కోసం. 14వ అంతస్థులో స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. నాగచైతన్య ఓసారి మా ఇల్లు చూసి మాకు కావాలండీ అని అడిగితే ఇది అమ్మడానికి కాదు మా ఫ్యామిలీ కోసం కట్టుకున్నామని చెప్పాను. దీంతో నాగార్జున అడిగాడు. అప్పటికే నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. వారి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయన అడిగేసరికి కాదనలేకపోయాను. కానీ మాలో ఎవరిది ఇచ్చేయాలా? అని ఆలోచనలో పడినప్పుడు నా కొడుకు తనది ఇచ్చేయమన్నాడు. పెళ్లికి ముందే చైతూ ఒక్కడే ఉండేవాడు, పెళ్లయ్యాక సామ్‌తో ఉండేవాడు. అయితే వాళ్లు ఒక ఇల్లు కొనుకున్నారు. అది బాగు చేయించుకుని అందులోకి మారడానికి ఒక ఏడాది పడుతుందని చై చెప్పాడు. అంతలోనే విడాకులు తీసుకున్నారు. అసలు వాళ్లు విడిపోతున్నారన్న విషయం నాకన్నా ముందు పనిమనిషులకే తెలిసింది. కానీ వాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కలిసి వాకింగ్, వర్కవుట్స్ చేసేవారు. ఎప్పుడూ గొడవపడలేదు. వాళ్లు విడిపోతున్నారన్న విషయం ముందే తెలిసి ఉంటే నాగార్జునతో మాట్లాడి కలపడానికి ప్రయత్నించేవాడిని. కానీ అప్పటికే వాళ్లు నిర్ణయం తీసుకున్నారు' అని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్. చదవండి: అతనికి నేను ఎలాంటి డబ్బు ఇచ్చేది లేదు: ఆర్జీవీ ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. -
మంచు విష్ణు చేతుల మీదుగా ‘నీ చిత్రం చూసి’ టీజర్
మురళి, శివానీ నాయుడు జంటగా మహీంద్రా బషీర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీ చిత్రం చూసి’. మురళీ మోహన్.కె నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేసిన మా చిత్రం టీజర్‌కి, ఏపీ మాజీ మంత్రి గడ్డం వినోద్ వెంకటస్వామి ఆవిష్కరించిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలో మా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు దర్శక-నిర్మాతలు. -
ఆ సీన్ చూసి కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారు: మురళీ మోహన్
Murali Mohan Interesting Comments On Krishna: సూపర్ స్టార్ కృష్ణపై సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణలాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదంటూ ప్రశంసలు కురిపించారు. కాగా నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిచన ఆయన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఇద్దరం ఇంటర్లో క్లాస్‌మెట్స్, ఒకే బెంచ్‌లో కూర్చునే వాళ్లమంటూ ఆసక్తికర విషయం చెప్పారు. చదవండి: బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్ అలాగే ‘ఇంటర్ ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఇద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యాం. అయితే కాలేజీ మొత్తంలో కృష్ణ చాలా అందగాడు. అందరు ఆయన వెంట పడేవారు. ఇంటర్ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన తేనె మనసులు మూవీతో హీరోగా మారారు. ఆ తర్వాత అనతి కాలంలోనే ఆయన సూపర్ స్టార్‌గా ఎదిగిన విషయం మీ అందరికి తెలిసిందే’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం తాను కూడా కొద్ది రోజుల్లోనే సినిమాల్లోకి వచ్చానని, హీరోగా కొన్ని సినిమాలు చేశానన్నారు. ఆ తర్వాత నటుడి నుంచి నిర్మాతగా మారానంటూ వారసుడి మూవీ సమయంలో చోటు చేసుకున్న ఓ చేదు సంఘటన గురించి చెప్పారు. చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ ‘కృష్ణ-నాగార్జున కాంబినేషన్లో వారసుడు చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమాలో నాగార్జున ఓ సీన్లో తండ్రి కృష్ణను నిలదీస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్ణణ తారాస్థాయికి చేరుతుంది. ఇందులో కృష్ణను నాగార్జున ఎదురించడం, నువ్వెంత అంటూ ఆయనతో అమర్యాదగా వ్యవహరిస్తాడు. అది చూసిన కృష్ణ ఫ్యాన్స్ మా ఇంటి మీదకు గొడవకు వచ్చారు. కొంతమంది అయితే ఏకంగా నన్ను కొట్టడానికి వచ్చారు’ అని అన్నారు. అంతేకాదు కృష్ణ గారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడని, ఇది ఆయనను అగౌరవ పరచడమే అంటూ తనతో ఘర్షణ పడ్డారన్నారు. ఆ సీన్‌ని సినిమా నుంచి తొలగించాలని, లేదంటే సీన్ మార్చమంటూ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారని ఆయన అన్నారు. చదవండి: ‘కేజీఎఫ్’ హీరో యశ్‌పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ‘‘అది సినిమా.. కథను, పాత్రను బట్టి చూడండి. పర్సనల్‌గా తీసుకోవద్దు’ అని నేను నచ్చచెప్పినా వినలేదు. దీన్ని బట్టి అప్పడు నాకు అర్థమైంది ఆయనకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని. ఇక కృష్ణ గారు బయట కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన నిర్మాతల హీరో అని అనొచ్చు. ఒక నిర్మాత సినిమా ప్లాప్‌తో డబ్బులు పోగొట్టుకుంటే.. ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి .. తనతో సినిమా చేస్తానని చెప్పేవారు. నిర్మాతలు డబ్బులు లేవని చెప్పినా అవన్నీ తరువాత మీరు సినిమా మొదలు పెట్టండి అని భరోసా ఇచ్చేవారు. అలాంటి గొప్ప మనిషిని నేను ఇంతవరకు చూడాలేదు” అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. కాగా తెలుగులో మురళీమోహన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కృష్ణ, శోభన్ బాబు వంటివారు అగ్ర హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన మురళీమోహన్. తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
SIIMA Awards 2021: అవార్డుల వేడుకలో మెరిసిన నటీ, నటులు( ఫోటోలు)
-
సేల్‌డీడ్‌లో చెప్పినవీ చేయరా?
సాక్షి, న్యూఢిల్లీ: సేల్‌డీడ్‌లో చెప్పిన అంశాలు బిల్డర్లు తప్పకుండా పాటించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొట్టేయాలంటూ జయభేరి నిర్మాణసంస్థకు చెందిన దుగ్గిరాల కిషోర్, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్, మాగంటి రామ్మోహన్ దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. సేల్‌డీడ్‌లో రాసింది ఎలా తగ్గిస్తారని, మునిసిపాలిటీకి వదిలేసింది ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించింది. ఇదీ నేపథ్యం.. జయభేరి సిలికాన్ కంట్రీ (జేఎస్సీ)లోని బీటా కాంప్లెక్స్ నివాసి బండ్రెడ్డి మధుసూదన్ 2003లో కారు పార్కింగ్ సహా 3,010 చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేశారు. సేల్ డీడ్‌లో జయభేరి ప్రాపర్టీస్ పలు అంశాలను ప్రస్తావించింది. ‘ప్రధాన రహదారిని ఆనుకుని 7,322 చదరపు అడుగుల ఓపెన్ ప్లాట్ ఉంది. ఈ స్థలాన్ని 2005లో జేఎస్టీ రియాలిటీ లిమిటెడ్ గతంలో డీహెచ్ఎఫ్ఎల్కు విక్రయించింది. 2007లో జయభేరి సిలికాన్ టవర్స్ పేరిట భనవం నిర్మించారు. జేఎస్సీలో 18,521 చదరపు అడుగుల్లో ఆల్ఫా, బీటా, గామా టవర్లు నిర్మించారు. ప్లాటు ఉత్తరం వైపు 3,197 చదరపు అడుగుల క్లబ్ హౌస్ ఉంది. జేఎస్సీ ఫ్లాట్ యజమానులకు క్లబ్‌హౌస్‌లో ఉచిత ప్రవేశం. ఈ లేఔట్ 1999 నాటిది’ అని సేల్‌డీడ్‌లో పేర్కొంది. ఈ సేల్డీడ్లోని పలు అంశాలు క్షేత్రస్థాయిలో లేవని మధుసూదన్ 2008లో గుర్తించారు. ‘7,322 చదరపు అడుగుల ఓపెన్ ప్లాటు జయబేరి సిలికాన్ టవర్స్ (జేఎస్టీ) ఆధీనంలోకి వచ్చింది. సేల్‌డీడ్‌లో డ్రైవ్వే 24 అడుగులని పేర్కొనగా 16 అడుగులే ఉంది. మూడు టవర్ల మొత్తం ఏరియా 16,568.045 చదరపు అడుగులే ఉంది. జయభేరి సిలికాన్ కంట్రీ యజమానులకు చెందిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ) జయభేరి సిలికాన్ టవర్స్ పేరిట బదిలీ అయింది. అపార్ట్మెంట్ యజమానులకు వినియోగహక్కులు మాత్రమే మిగిలాయి’ అని పేర్కొంటూ మధుసూదన్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారు. పోలీసులు దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మధుసూదన్ ట్రయల్ కోర్టు, వినియోగదారుల ఫోరం, హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీలను ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు మురళీమోహన్‌కు అనుకూలంగా డిశ్చార్జి పిటిషన్‌ను అనుమతించింది. దీంతో క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ మధుసూదన్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ అంశాలతోపాటు క్రిమినల్ చార్జ్‌లు కూడా నమోదు చేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మురళీమోహన్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
మురళీమోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. హెచ్ఎండీఏ నిబంధనలను అతిక్రమించిన జయభేరి కన్స్ట్రక్షన్స్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జయభేరీ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్ విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఓ కొనుగోలుదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుడికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. -
Maa Elections 2021: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మురళీ మోహన్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఎలక్షన్ డేట్ రాకముందే పోటీ రసవత్తరంగా మారింది. దీంతో గతంలో కంటే ఈసారి 'మా' ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలెట్టేశారు. ఈ ఎన్నికలపై సోషల్ మీడియాలోనూ వాడీ-వేడి చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరణంలో సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ 'మా' ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మా ఎన్నికలు ఉండవని.. ఏకగ్రీవమే జరుగుతుందని బాంబు పేల్చారు. గతంలో మా మెంబర్స్ తక్కువగా ఉండటంతో చాలా పద్దతిగా ఉండేదని, కానీ ఇప్పుడు అలా లేదంటూ ఆరోపణలు గుప్పించారు. ఎవరికి పడితే వాళ్లకు మా సభ్యత్వం దొరుకుతుందని, దీంతో ఎవరు మా మెంబరో కాదో కూడా తెలియడం లేదని విమర్శించారు. గాడి తప్పిన 'మా' ను మళ్లీ పట్టాలెక్కించడానికి తనతో పాటు చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు లాంటి సినీ పెద్దలు మాట్లాడుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అందరిని ఒకతాటి పైకి తెచ్చి ఏకగగ్రీవంగా మా ఎన్నికలు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. మురళీ మోహన్ కామెంట్స్‌తో మా అధ్యక్ష బరిలో ఉన్న వాళ్లకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది. -
Erra Mallelu: తెలుగుతెరపై అరుణోదయం.. ఎర్ర మల్లెలు
ఎర్ర బావుటాను ఎగరేసిన హిట్ చిత్రాలెన్నో చరిత్రలో ఉన్నాయి కానీ, ట్రెండ్ సెట్టర్ ఏది? ఓ చిన్న విప్లవ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టిస్తుందా? స్టేజ్ సాంగ్స్ సినిమాల్లోనూ సూపర్ హిట్టవుతాయా? వీటన్నిటికీ జవాబు – రెడ్ స్టార్ మాదాల రంగారావు నటించి, ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మించిన ‘ఎర్రమల్లెలు’. ‘నాంపల్లి టేసను కాడి..’, ‘ఓ లగిజిగి లంబాడీ..’, ‘బంగారు మా తల్లీ...’ పాటలు!! 40 ఏళ్ళ క్రితం బాక్సాఫీస్ వద్ద ‘ఎ ర్రమల్లెలు’ పూచాయి. నేటికీ జనం గుండెల్లో విప్లవ సుగంధాలు వెదజల్లుతూనే ఉన్నాయి. వెండితెర అలా ఎరుపెక్కింది! తెలుగు సిన్మాకు 1980 – 81 కాలం ఓ కీలక మైలురాయి. ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ (’77)తో మొదలైన పూర్తి కమర్షియల్ ఫార్ములా చిత్రాల హవా సాగుతున్న సందర్భం అది. కానీ, ఆ కాలంలోనే ‘చలిచీమలు’ (’78), తెలంగాణ సాయుధ పోరాటంపై ‘మాభూమి’ (’79), అభ్యుదయచిత్రం ‘యువతరం కదిలింది’ (1980 ఆగస్ట్ 15), ఆ వెంటనే దేశంలోని నిరుద్యోగాన్ని ఎత్తిచూపుతూ బాలచందర్ ‘ఆకలిరాజ్యం’ (1981 జనవరి 9) వచ్చాయి. అన్నీ విజయం సాధించాయి. ‘గరీబీ హఠావో’ అన్నది వట్టి నినాదంగానే మిగిలిపోయి, జనం మనసుల్లో అసంతృప్తి పెరుగుతున్న కాలంలో వచ్చిన జనజీవన పోరాట చిత్రాలివి. లోలోపల కుతకుతలాడుతున్న జనం... వాస్తవ జీవితానికీ, తమలో పేరుకున్న అసంతృప్తికీ తెరపై వ్యక్తీకరణగా ఈ సినిమాలను చూశారు, ఆదరించారు. ఆ నేపథ్యంలో ‘ఎర్రమల్లెలు’ వచ్చింది. దర్శకుడు ధవళ సత్యం నిజానికి, తెలుగు తెరపై సినీ పెద్దలెందరో అంతకు ముందూ విప్లవ చైతన్యం కథలో అంతర్లీనంగా చెబుతూ వచ్చారు. కాకపోతే, కమర్షియల్ షుగర్ కోటింగ్‌లో చూపారు. అవేవీ నేరుగా ఎర్ర జెండాను ఎత్తిపట్టుకున్నవి కావు! కమ్యూనిస్టు పార్టీ చిహ్నాలతో మే డే పాటలు పెట్టినవీ కావు!! కానీ, ‘ఎర్రమల్లెలు’ నుంచి తెలుగుతెర కమర్షియల్ చట్రంలో ఉంటూనే అరుణారుణమయ్యే నేర్పు నేర్చింది. జనమూ లాల్‌సలామ్ కొట్టారు. విప్లవ పంథాకు ట్రేడ్ మార్క్‌గా... మాదాల తెలుగులో రెడ్ సినిమాల ట్రెండ్ సెట్టర్ అంటే కచ్చితంగా నటుడు, నిర్మాత మాదాల రంగారావే! ఆయన తీసిన సినిమాలన్నీ అలాంటివే! ‘‘...నా ఆశకు ఆశయం తోడై, జనాశయం చేయూతై వెండితెరను ఎరుపెక్కించాను. ఎరుపు విప్లవానికి చిహ్నం. సమసమాజమే విప్లవ లక్ష్యం. ఆ విప్లవమే నా ఊపిరిగా, నాలో ఊపిరున్నంత వరకు నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను...’’ అంటూ ‘ఎర్రమల్లెలు’ రిలీజు టైములోనే స్పష్టంగా ప్రకటించారు మాదాల. సమస్యలు, సెన్సార్ యుద్ధాలు ఎన్ని ఎదురైనా, మాదాల జీవితాంతం విప్లవభావాలకే కట్టుబడడం విశేషం. దటీజ్ కామ్రేడ్ మాదాల! ‘యువతరం’తో... కదలిక నిర్మాతగా మాదాల చేసిన తొలి ప్రయత్నం – ‘యువతరం కదిలింది’. కాలేజీ వాతావరణం, అందులోనే గ్రామీణ సమస్యలు, యువతరం ఆలోచనల్లో రావాల్సిన మార్పులు – ఇలా అనేక అంశాలను చర్చించిందీ సినిమా. మాదాల, రామకృష్ణ, సాయిచంద్, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ఆ అభ్యుదయ చిత్రం సంచలన విజయం సాధించింది. 3 నందులు గెల్చింది. వామపక్షవాది – ప్రజానాట్యమండలిలో మాదాల మిత్రుడు ధవళ సత్యం అప్పటికే ‘జాతర’తో దర్శకుడై, మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రెండో సినిమాతో హిట్ సినిమా దర్శకుడనిపించుకున్నారు. దర్శకుడిగా ఆయనకు మూడో సినిమా ‘ఎర్రమల్లెలు’. నిజానికి, ‘యువతరం కదిలింది’ రిలీజై, సక్సెసయ్యాక ధవళ సత్యం, మాదాల రాజమండ్రిలో ఓ కమ్యూనిస్టు పార్టీ సభకు హాజరయ్యారు. ‘‘అక్కడే జనం మధ్య మాదాల ఉత్సాహంగా ‘ఎర్రమల్లెలు’ ప్రకటించారు. మద్రాసుకు తిరుగు ప్రయాణంలోని డిస్కషన్లలో మాదాల కథకు హంగులద్దా’’రు సత్యం. కార్మిక – కర్షక సమస్యల కథతో... తెల్లగా, స్వచ్ఛంగా ఉండే మల్లెలకు విప్లవ సూచకంగా ఎర్రదనమనే మాటను కలిపి, విరోధాభాసగా మార్చి, ‘ఎర్రమల్లెలు’ అనే వినూత్నమైన పేరు పెట్టడం ఓ ప్రయోగం. అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం. ఊళ్ళోని చదువురాని జనాన్ని పావులు చేసి ఆడుకొనే ముగ్గురు దుష్టులు. ఆ ఊళ్ళో చదువు చెప్పడానికి ఓ మాస్టారు వస్తారు. ఆయన వల్ల జనంలో చైతన్యం రగిలి, ఆ ముగ్గురు దుష్టులకు తోడున్న పక్క ఊరి ఫ్యాక్టరీ ఓనర్ కూడా ప్రజా విప్లవ జ్వాలల్లో భగ్గుమనడం ఈ చిత్రకథ. ఏకకాలంలో అటు గ్రామీణ సమస్యల్ని, ఇటు కార్మిక సమస్యల్ని చూపిన సినిమా ఇది. దెబ్బకు దెబ్బే మార్గమనే ఉగ్రవాది రంగా (మాదాల), ఆవేశంతో పాటు ఆలోచన కావాలనే కార్మిక నేత సూరి (మురళీమోహన్), మాస్టారు (నల్లూరి) లాంటి మంచి పాత్రలు, కొన్ని దుష్టపాత్రల మధ్య ఆలోచింపజేసేలా కథ సాగుతుంది. సిన్మాలాగా కాక ఒక ఉద్యమంలా, ఎక్కడో చూసినట్టుగా – వాస్తవంగా జరుగుతున్నట్టు అనిపించే పద్ధతిలో ఒంగోలు, టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ధవళ సత్యం దీన్ని తీశారు. అదే ‘ఎర్రమల్లెలు’కు బలం. నరసాపురం నాటక రచయిత, ప్రజానాట్యమండలి ఎమ్జీ రామారావు రాసిన డైలాగ్స్ ప్లస్సయ్యాయి. ప్రజాగీతాలకు పట్టం సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రభంజనం నడుస్తున్న రోజులవి. 1981లో వచ్చిన తెలుగు చిత్రాల్లో మూడొం తులుకు ఆయనదే మ్యూజిక్. ఆ కమర్షియల్ కింగ్ ఈ విప్లవాత్మక ‘ఎర్రమల్లెలు’కు సంగీతం అందించడం ఓ విచిత్రం. ‘ఎర్రమల్లెలు’ పాటలు ఆ రోజుల్లో వీధి వీధినా మారుమోగాయి. ఎర్రజెండాలు, సుత్తి – కొడవలి చిహ్నాలతో కార్మిక దినోత్సవ గీతం ‘అన్యాయం అక్రమాలు..’ (రచన అదృష్టదీపక్) కార్మిక సంఘాలకు కొత్త ఉత్సాహమిచ్చింది. ఇప్పటికీ మే డే అంటే ఆ పాట తెలుగునాట ఊరూవాడా మోగుతుంటుంది. ‘ఓ లగిజిగి లంబాడీ...’, ‘బంగారు మా తల్లీ...’ పెద్ద హిట్టయ్యాయి. ప్రజానాట్యమండలి కళాకారుడిగా ప్రదర్శనలిచ్చిన రోజుల్లో ధవళ సత్యం రాసి, స్టేజీ పాడిన పాపులర్ గీతాలివి. మరో ప్రజానాట్యమండలి బిడ్డ ప్రభు రాసి, వేదికపై పాడే ‘నాంపల్లి...’ కూడా తెరకెక్కింది. సినీరంగానికొచ్చాక ధవళ సత్యం ఈ ‘నాంపల్లి..’, ‘బంగారు మాతల్లి...’ పాటల్ని సినిమాల్లో పెట్టుకోమని ఎందరినో అడిగారు. చివరకు తానే దర్శకుడయ్యాక వాడారు. మహామహులకు తెరంగేట్రం జంధ్యాల చిత్రాల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న సుత్తి వీరభద్రరావుకూ, సీరియల్స్‌లో నేటికీ అలరిస్తున్న నటి శివపార్వతికీ ‘ఎర్రమల్లె’లే తెరంగేట్రం. ‘ఇదే అమెరికాలో అయితే...’ అనే లాయర్ పాత్ర వీరభద్రరావుకు మంచి పేరు తెచ్చింది. తర్వాతి కాలంలో దర్శకుడైన మాదాల మిత్రుడు టి. కృష్ణ తెరపై తొలిసారి కనిపించిందీ ‘ఎర్రమల్లె’లే. సినిమాలో పూర్తి నిడివి ఉండే పాలేరు పాత్ర కోసం కృష్ణ గడ్డం పెంచారు. గడ్డం గెటప్ బాగుందని అందరూ అనడంతో జీవితాంతం కంటిన్యూ చేశారు. సినీ విప్లవంలో... బాటసారులు ‘ఎర్రమల్లెలు’ వేసిన వెండితెర విప్లవమార్గం ఆ తర్వాత ఎందరెందరికో ఆదర్శమైంది. చివరకు హీరో కృష్ణ, మోహన్ బాబు, దర్శకుడు దాసరి లాంటి స్టార్లు కూడా ‘ఎన్కౌంటర్’, ‘అడవిలో అన్న’, ‘ఒసేయ్ రాములమ్మ’ (1997)తో ఈ దోవలోకి వచ్చి, సినిమాలు తీశారు. దాన్నిబట్టి ఇదెంత పెద్ద కమర్షియల్ ఫార్ములాగా వెలిగిందో అర్థం చేసుకోవచ్చు. మాదాల రెడ్ ఫిల్మ్స్ దశాబ్దం సాగితే, ఆయన మిత్రుడు టి.కృష్ణ లేడీ ఓరియంటేషన్తో మరింత ఎఫెక్టివ్‌గా ఇదే భావజాలం తెరపై చూపారు. దర్శకుడు వేజెళ్ళ సత్యనారాయణ ‘మరోమలుపు’ (’82) వగైరాతో వచ్చారు. పూర్తి ఎర్ర సిన్మాలు కాకున్నా, సామాజిక సమస్యలతో చర్చ రేపారు. ఈ పునాదుల్ని బలోపేతం చేసుకుంటూ ‘అర్ధరాత్రి స్వతంత్రం’ (1986)తో మొదలెట్టి ‘ఎర్రసైన్యం’ (1994)తో ఆర్. నారాయణమూర్తి ఏకంగా ‘పీపుల్స్ స్టార్’ అయ్యారు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాలుగా అదే జెండా, ఎజెండాలను భుజానికెత్తుకొని, ఒంటరి పోరాటం చేస్తున్నారు. మిగతావారంతా ఆర్థిక ఆకర్షణతో అతిథులుగా వచ్చిపోయారు కానీ, అప్పుడు మాదాల – ఇప్పుడు నారాయణమూర్తి మాత్రం నిబద్ధతతో సమస్యాత్మక, విప్లవ పంథా చిత్రాలే తీయడం విశేషం. వీటన్నిటికీ ఊపునిచ్చింది కాబట్టే, ‘ఎర్రమల్లెలు’ ఇవాళ్టికీ ఓ చరిత్ర. మాదాల – ధవళ సత్యం బృందం అన్నట్టు, సమాజంలో ‘‘ఈ దోపిడీలు, ఈ దురంతాలు ఉన్నంతకాలం – ప్రతి మల్లియ మనసు ఎరుపెక్కుతుంది. ప్రతి రోజూ ఒక మేడే అవుతుంది!’’ రేపుల ఇమేజ్ నుంచి రెడ్ స్టార్‌గా.. ఒంగోలు దగ్గర భూస్వామ్య కుటుంబంలో పుట్టి, డాక్టర్ అవమంటే యాక్టరైన వ్యక్తి మాదాల రంగారావు. ఎన్జీ రంగాను ఇష్టపడే కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టుల వైపు, కళల వైపు మొగ్గారాయన. గుంటూరు హిందూ కాలేజీ, ఒంగోలు సి.ఎస్.ఆర్. శర్మ కాలేజీ రోజుల్లోనే విద్యార్థి సంఘాలు, ప్రజానాట్యమండలి బృందాలతో దోస్తీ కట్టారు. ‘నల్లూరి అన్న’ శిక్షణలో రంగస్థలంపై పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. సోషియాలజీ చదివి, సినిమాల్లోకి వెళ్ళారు. ‘చైర్మన్ చలమయ్య’, ‘ఆడంబరాలు– అనుబంధాలు’ (1974), ‘బాబు’, ‘తీర్పు’ – ఇలా అనేక చిత్రాల్లో వేషాలు వేశారు. ‘ఎర్రమల్లెలు’లో... మాదాల ఎదురుదెబ్బలు తిన్నారు. నమ్మిన వామపక్ష భావాల్ని ప్రచారం చేస్తూ, తానే హీరోగా సినిమాలెందుకు నిర్మించకూడదని నిర్మాతయ్యారు. అలా తెలుగు సినిమాను అరుణ మార్గం పట్టించారు. ఆవేశం తెప్పించారు. అప్పట్లో ‘బంగారు చెల్లెలు’ (1979)లో శ్రీదేవిని రేప్ చేసే పాత్ర సహా, తెరపై పలుమార్లు రేపిస్టు పాత్రలేయడంతో కొందరు మాదాలను ‘రేపులరంగారావు’ అని గేలిచేశారు. కానీ అదే మాదాల వరుస విప్లవచిత్రాలతో విజయాలం దుకున్నాక ఆ ఇమేజే మారిపోయింది. ‘రేపుల రంగారావు’ అని వెక్కిరించిన నోళ్ళే ‘రెడ్ స్టార్’ అని ఆకాశానికెత్తాయి. బాక్సాఫీస్ మల్లెలు నిజాయతీ, నిబద్ధతతో తీసిన ‘ఎర్రమల్లెలు’కు జనం నీరాజనం పట్టారు. 23 కేంద్రాల్లో రిలీజై, 17 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం చేసుకుంది. ఆ జోరు కొనసాగి, విజయవాడ (రామా టాకీస్), గుంటూరు (శ్రీలక్ష్మీ), తిరుపతి (జయశ్యామ్) సహా ఏడెనిమిది కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. గత నలభై ఏళ్ళుగా తెలుగులో వస్తున్న రెడ్ ఫిల్మ్స్‌కు ట్రెండ్ సెట్టరైంది. తెలుగులో రిలీజైన వెంటనే ఈ చిత్రం తమిళంలోకి ‘సివప్పు మల్లి’ (1981 ఆగస్ట్ 15)గా రీమేకైంది. సంసారపక్ష సినిమాలు తీసే ప్రసిద్ధ ఏ.వి.ఎం. సంస్థ దీన్ని నిర్మించడం మరీ విశేషం. తిరుపతిలో సినిమా చూసిన తమిళ దర్శక, నిర్మాతలు రీమేక్‌లో కూడా మాదాలతోనే నటింపజేయాలనుకున్నారట. అయితే, అప్పటికే తదుపరి చిత్రం ‘విప్లవశంఖం’ (1982 ఏప్రిల్ 9)తో బిజీగా ఉన్న మాదాల చేయలేనన్నారట. చివరకు తమిళంలో హీరో విజయకాంత్, ముచ్చర్ల అరుణ నటించారు. తర్వాతి కాలంలో భక్తి చిత్రాలు తీసిన శతాధిక సినిమాల రామనారాయణన్ ఈ తమిళ విప్లవ రీమేక్‌కు దర్శకుడు! తమిళ రీమేక్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అభ్యుదయంలో... ఆత్మీయ మిత్రులు ఒంగోలులో రెండున్నర దశాబ్దాలు నడిచిన ‘స్టూడెంట్స్ ఫెడరేషన్’ (ఎస్.ఎఫ్) మెస్, విద్యార్థి సంఘం ఏ.ఐ.ఎస్.ఎఫ్. కార్యకలాపాలు, ‘ప్రజానాట్యమండలి’ నల్లూరి వెంకటేశ్వర్లు అన్న మార్గదర్శనం... ఇవన్నీ ఎందరికో అభ్యుదయ పాఠశాల. మాదాల, దర్శకుడు టి. కృష్ణ (నేటి హీరో గోపీచంద్ తండ్రి) నుంచి ‘వందేమాతరం’ శ్రీనివాస్ దాకా ఎంతోమంది అక్కడ తయారైనవాళ్ళే! ‘‘కళ కళ కోసం కాదు... ప్రజల కోసం’’ అని నమ్మినవాళ్ళే! ఆచరించినవాళ్ళే!! కాలేజీ నుంచి మాదాల – టి. కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్. నిండైన విగ్రహం ఉన్న మాదాలను సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించింది కృష్ణే! మధ్యలో కొంతకాలం కృష్ణ వెనక్కి వచ్చేసి, ఒంగోలు పొగాకు వ్యాపారం చేసుకున్నారు. నల్లూరి, కె. రాధాకృష్ణ, ..., యు.విశ్వేశ్వరరావు, మాదాల, ..., ..., టి. కృష్ణ మాదాల మద్రాసులోనే చావో రేవో అని కూర్చున్నారు. మాదాల నిర్మాత అయినప్పడు మద్రాసు వచ్చి తొలి (‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’) చిత్రాలకు సాయంగా నిలిచిందీ కృష్ణే. తర్వాతి కాలంలో స్క్రిప్టులో మార్పులపై మాట వినని మాదాలతో విభేదించి, కృష్ణ తానే దర్శకుడయ్యారు. ఆత్మీయ ‘రంగన్న’కు దీటుగా ఎదిగారు. మాదాల ‘ప్రజాశక్తి’, ‘స్వరాజ్యం’, ‘జనం– మనం’, ‘ఎర్రమట్టి’ – ఇలా 7 చిత్రాలు నిర్మించారు. 36 ఏళ్ళే జీవించిన టి.కృష్ణ దర్శకుడిగా తీసినవీ ఏడే ఫిల్మ్స్. కలసి ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు మిత్రుల జీవితంలో గమ్మతై ్తన పోలిక ఇది. ఆ పాట... శైలజకు టర్నింగ్ పాయింట్! అప్పుడప్పుడే గాయనిగా పైకి వస్తున్న ఎస్పీబీ చెల్లెలు ఎస్పీ శైలజకు ఈ ‘ఎర్రమల్లెలు’ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో ఆమె పాడిన ‘నాంపల్లి టేసను కాడి..’ మోత మోగిపోయింది. ఆమె కెరీర్‌కు ఈ పాట పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఎన్నో ప్రైవేట్ అవార్డులను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఎక్కడ సంగీత విభావరి జరిగినా, ఆమె ఈ పాట పాడాల్సిందే! ఈ పాటకు మాదాల కుమారుడు – నేటి నటుడు డాక్టర్ మాదాల రవి నటించడం విశేషం. బాలనటుడిగా అదే అతనికి తెరంగేట్రం. ఆపై ‘స్వరాజ్యం’(1983)లో ఫుల్ లెన్త్ రోల్లో రవి నటించారు. ‘‘నటనలోకి వస్తానని అనుకోలేదు. ‘ఎర్రమల్లెలు’ టైమ్‌కి ఏడో తరగతి చదువుతున్నా. రికార్డయిన పాటల్ని ఇంట్లో పదే పదే వింటూ, ఓ రోజు ‘నాంపల్లి...’ పాటకు హుషారుగా డ్యా¯Œ ్స చేస్తున్నా. నాన్న గారు అది చూసి, ఆ పాట నా మీదే తీశారు. డ్యా¯Œ ్స మాస్టర్ కూడా లేని ఈ పాటను ఒకే రోజున ఉదయం 8కి మొదలుపెట్టి సాయంత్రం 4 కల్లా చిత్రీకరించారు’’ అని రవి చెప్పారు. ఒంగోలులో రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఈ పాట తీశారు. ఆ పాట చిత్రీకరణలో ధవళ సత్యం వెంట టి. కృష్ణ, బి. గోపాల్ లాంటి నేటి ప్రముఖులెందరో ఉన్నారు. ఆ పాట ఎంత ట్రెండ్సెట్టరంటే– తర్వాత వచ్చిన అభ్యుదయ, విప్లవ సిన్మాలన్నిట్లో ఇలాంటి సోషియో – పొలిటికల్ సెటైర్ సాంగ్స్ వచ్చాయి. ‘నేటిభారతం’(1983)లోని ‘అత్తో పోదాం రావే సర్కారు దవాఖానకు...’, ‘రేపటి పౌరులు’(1986)లోని ‘అయ్యా నే సదివి బాగుపడతా..’ లాంటి పాటలే అందుకు సాక్ష్యం! – రెంటాల జయదేవ -
సుజనా, మురళీ మోహన్ ఆశీస్సులు తీసుకోలేదా?
సాక్షి, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మఠాలు, స్వామిజీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. 2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసింది. మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. (చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు: మల్లాది) మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాది. గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు.. మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది?. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది. యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా? అప్పట్లో శారదా పీఠం వెళ్లి సుజనా చౌదరి, మురళీ మోహన్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా?. చంద్రబాబు డైరెక్షన్లో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారు. స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదు. వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించింది. యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణా లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చింది. మేం అలా రాసి ఇవ్వలేదు. మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టం.’ అని అన్నారు. -
ప్రేమ పోరాటం
గౌతమ్ వ్యాస్ , ‘మిస్ తెలంగాణ’ దీపికా వధానిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్రవంతి మురళీ మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీ శివాయ్ ఫిలింస్ పతాకంపై కె.రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. స్రవంతి మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందనున్న చిత్రమిది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్ గోవాలో, మూడో షెడ్యూల్ కేరళలో జరగనుంది. నలభై రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తాం. ఈ చిత్రానికి కెమెరా: జిఎస్. రాజ్ (మురళి ), సంగీతం: శివ నందిగామ. -
అందరూ మహానటులే
‘‘నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావుగార్లు ధ్రువతారలు. ఏ వేడుకలకు పిలిచినా వచ్చేవారు. అవార్డులు ఇస్తే తీసుకునేవారు. కానీ నేటి తరంలో కొందరు కళాకారులు పబ్లిక్‌లోకి వచ్చి అవార్డులు అందుకోవడం వల్ల తమ గౌరవం తగ్గిపోతుందన్నట్లుగా భావిస్తున్నారు. అది సరైనది కాదు. వారు ఎన్టీఆర్, ఏయన్నార్ల క్రమశిక్షణను ఫాలో కావాలని కోరుకుంటున్నాను’’ అని కళాబంధు, టీఎస్సార్ లలిత కళాపరిషత్ వ్యవస్థాపకులు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘అభినయ మయూరి’ అనే బిరుదుతో ప్రముఖ నటి జయసుధను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాల గురించి హైదారాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలామంది సినిమాను, కళాకారులను అపార్థం చేసుకుంటుంటారు. నిజం చెప్పాలంటే సినిమాల్లో ఉన్న దైవశక్తి ఇంకెందులోనూ లేదు. నటీనటులు, దర్శకులు, రచయితలు, గాయకులు.. ఇలా అందరూ కలిస్తేనే మనం సినిమాను ఎంజాయ్ చేయగలుగుతున్నాం. నేను సంతోషంగా ఉండటానికి కారణం కళాకారులను ప్రోత్సహించుకోవడమే. కళని ఒక ఈశ్వరశక్తిగా భావించే వ్యక్తిని నేను. గత ఏడాది జమునగారిని సన్మానించాం. ఈ ఏడాది ఈ నెల17న ‘అభినయ మయూరి’ బిరుదుతో జయసుధగారిని సత్కరిస్తున్నాం. దాదాపు 46ఏళ్ల సినిమా ప్రస్థానం ఉన్న ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్నారు. మనమందరం గర్వించదగ్గ నటీమణి ఆమె. 16న ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు. ‘‘తిరుపతి’ సినిమాలో నేను, జయసుధగారు కలిసి నటించాం. ‘జ్యోతి’ సినిమాతో ఆమెకు పెద్ద పేరు వచ్చింది. సుబ్బరామిరెడ్డిగారు జయసుధగారికి ఈ అవార్డు ఇవ్వబోతుండటం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో అవార్డు ఫంక్షన్స్‌ను కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. ప్రభుత్వం తరఫు అవార్డులు ఇవ్వడం లేదు. నంది అవార్డుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే అవార్డు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటి ప్రభుత్వమైనా గుర్తించి అవార్డులను ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సుబ్బరామిరెడ్డిగారికి కళలన్నా, కళాకారులన్నా మంచి అభిమానం. మహానటి అంటే మనమందరం ఒకరే అనుకుంటాం. కానీ అందరూ మహానటులే. లేకపోతే ఒక ఆర్టిస్టుగా ఎక్కువ కాలం నిలబడలేం. జమునగారి నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నాను. గొప్పనటి జమునగారు నన్ను మహానటి అని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోకాలంగా కష్టపడుతున్నందుకు కళాకారులకు అవార్డులనేవి గుర్తింపు. కొన్ని అవార్డ్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులను పక్కన పెట్టేశాయి. అవార్డ్స్ ఇవ్వండి.. మీరే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? వేడుకలకు, ప్రారం భోత్సవాలకు, స్వచ్ఛంద సేవ, సామాజిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటాం. స్వచ్ఛభారత్ అంటూ ఊడ్చుతాం. ఇలా అన్నీ చేస్తాం. మమ్మల్ని గుర్తించి అవార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇండస్ట్రీలో ఇద్దరు సోదరులు.. ఒకరు మురళీమోహన్‌గారు, మరొకరు మోహన్‌బాబుగారు. వీరితో ఎన్నో సినిమాలు చేశాను’’ అన్నారు. ‘‘ఇంతమంది కళాకారులను ప్రోత్సహిస్తూ తనకు సినిమాల పట్ల, సినిమా పరిశ్రమల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు సుబ్బరామిరెడ్డిగారు. కళాకారులను మర్చిపోకుండా గౌరవిస్తున్నారు. మురళీమోహన్‌గారు అందాల హీరో. ఆయన ఇప్పుడు తెల్ల జుత్తుతో ఉంటే మాకు నచ్చడం లేదు (నవ్వుతూ). ‘పండంటి కాపురం’ సినిమాలో నా కూతురిగా నటించారు జయసుధ. మా అమ్మాయి నటిగా ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి జమున. -
మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్‌ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సోమవారం హైదరాబాద్‌లోని మురళీమోహన్ నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునేంతవరకూ విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా మురళీమోహన్ను ఇప్పటికే సినీనటుడు చిరంజీవి దంపతులు పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
మురళీమోహన్ను పరామర్శించిన మెగాస్టార్
టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. తాజాగా మురళీమోహన్‌కు శస్త్ర చికిత్స జరగడంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేర్ ఆసుపత్రి బృందం వెన్నుముకకు సంబంధించిన ఈ చికిత్సను ఎంతో జాగ్రత్తగా అందించిందని, తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మురళీమోహన్ను చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
మురళీమోహన్‌కు చేదు అనుభవం
కడియం, (రాజమహేంద్రవరం రూరల్) : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో శుక్రవారం ప్రచారం చేపట్టిన ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు జనం నుంచి చేదు అనుభవం ఎదురైంది. తమకు నాలుగున్నరేళ్లుగా రోడ్డు సమస్య ఉందని, పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు ఓట్లు అడిగేందుకు మా వీధిలోకి ఎలా వస్తారంటూ కడియపులంక కొబ్బరితోట కాలనీ, పల్లాలమ్మ గుడివీధికి చెందిన ప్రజలు అడ్డుకున్నారు. తమ వాహనాలను రోడ్డుకు అడ్డుగా పెట్టి వీధిలోకి రావద్దంటూ నిలబడ్డారు. మాజీ సర్పంచి భర్త వార రాము, ఎంపీటీసీ భర్త బోడపాటి గోపీలు అక్కడికి చేరుకుని స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో మీరు ఓట్లు వేస్తే ఎంత? వేయకపోతే ఎంత? అంటూ టీడీపీ నేతలు వాదనకు దిగారు. ప్రచార రథంపై ఉన్న గోరంట్ల.. ‘వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. పోనీయవయ్యా.. ఎవడాపుతాడో చూస్తా..’ అంటూ ప్రచార రథాన్ని ముందుకు కదిలించారు. -
మురళీమోహన్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: రాజమండ్రి ఎంపీ, టీడీపీ నాయకుడు మురళీమోహన్‌పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ 2 కోట్ల రూపాయలకు సంబంధించి మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీరిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై గురువారం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలకు నిమ్మలూరి శ్రీహరి, పండరి అనే ఇద్దరు వ్యక్తులు హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో అనుమానస్పదంగా కనిపించారు. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 2 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టగా జయభేరి ఉద్యోగులు జగన్మోహన్, ధర్మరాజులు వారికి డబ్బు ఇచ్చినట్టు నిందితులు తెలిపారు. ఈ డబ్బు కోసం యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్ రాజమండ్రిలో ఎదురుచూస్తుంటారని కూడా పేర్కొన్నారు. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్, అక్కడి నుంచి గరీబ్‌రథ్ ట్రైన్లో రాజమండ్రికి తరలించేందుకు నిందితులు యత్నించారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 171(బీ), (సీ), (ఈ), (ఎఫ్) లకింద కేసు నమోదు చేశామ’ని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మురళీమోహన్ కోడలు రూపకు అందజేయడానికే ఆ మొత్తం తీసుకెళ్తున్నామని నిందితులు అంగీకరించారు. -
చంద్రబాబు ఉండేది గుంటూరు.. నోటరీ కృష్ణా జిల్లా
టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను చూస్తే అంతా ఆశ్చర్యపోతారు.ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జిల్లాలోని మరో ముగ్గురు అఫిడవిట్లలో తప్పులు బయటపడ్డాయి. చంద్రబాబు తను నివాసం ఉంటున్న చిరునామా గుంటూరు జిల్లా ఉండవల్లి అయితే.. కృష్ణా జిల్లాఅడ్వకేట్తో నోటరీ తయారుచేయించి తప్పులో కాలేశారు. అయినా సీఎం చంద్రబాబు నామినేషన్‌ని ఆమోదించారు. చంద్రగిరి, తిరుపతి, గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో అనేక నిజాలను దాచి పెట్టారు. వారి ముగ్గురి నామినేషన్లు ఆమోదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీరు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు సహా నలుగురు టీడీపీ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో వాస్తవాలు దాచిపెట్టారు. దీంతో వారి నామినేషన్లను ఆమోదించిన అధికారులు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. కుప్పం టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తాను నివాసం ఉంటున్న ఇంటి చిరునామా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి. అయితే ఆయన నోటరీని మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది సీతారామ్ చేత తయారుచేయించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని చంద్రగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. ఈయన సమర్పించిన అఫిడవిట్లో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ దాచిపెట్టారు. పాకాల మండలం ఆదెనపల్లిలో ఖాతా నంబర్ 283తో 32 సర్వే నంబర్లలో సుమారు 10 ఎకరాల వరకు భూమి ఉంది. అయితే నోటరీలో చూపించింది కేవలం 8 సర్వే నంబర్లలో ఉన్న భూమి మాత్రమే చూపించారు. పులివర్తి నాని భార్య కె.గానసుధ పేరున 1.30 ఎకరాలు ఉన్నట్లు చూపించా రు. వాస్తవంగా ఆమె పేరునయాదమర్రి మండలం కుక్కలపల్లిలో సర్వే నంబర్ 510/4ఏలో మొత్తం 3.32 ఎకరాల భూమి ఉంది. ఆస్తుల వివరాలను దాచిపెట్టిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పేరున రెండు పాన్ కార్డులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపిం చారు. నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి రెండు పాన్ కార్డులు ఉండకూడదు. ఆస్తులు కూడా నాని పేరున చూపించారు. సుగుణమ్మ.. ఇదేందమ్మా...! తిరుపతి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ సమర్పించిన అఫిడవిట్లో వాస్తవాలు దాచిపెట్టారు. అఫిడవిట్‌లోని 12వ పేజీలో ఉండాల్సిన మూడు కాలమ్స్ మాయమయ్యాయి. హెచ్యుఎఫ్, వారసులు 1, 2, 3 గడులు (కాలమ్స్) పూర్తి చేయాలి. అయితే సుగుణమ్మ సమర్పించిన అఫిడవిట్లో అవి కనిపించలేదు. 14వ పేజీలో వివరాలు మాత్రం చూపించారు. హోటల్, కారు, ఎయిర్ కండిషనర్, ఫర్నీచర్స్, మోటార్ వాహనం, ఇతరత్రా చూపించారు. అయితే అవి ఎవరికి చెందినవి అనే వివరాలు పొందుపరచలేదు. ఏడవ గడిలో 6, 7, 8లో ఆస్తులను చూపించారు. అవి ఎవరి అని స్పష్టం చెయ్యలేదు. ఇంకా 550 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపిం చారు. అవి కూడా ఎవరివి అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే.. తిరుచానూరు వద్ద సర్వే నంబర్ 255/1బి, 256/1లో 87 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని 2006లో రూ.9,84,905 కొనుగోలు చేసినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ కేవలం రూ.1,04,400గా చూపించారు. అదే విధంగా సర్వే నంబర్ 254/3లో 35 సెంట్ల భూమిని 2007లో రూ.5, 04, 565 కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ కేవలం రూ.45,500 మాత్రమేనట. సర్వే నంబర్ 256/1లో 21 సెంట్ల స్థలాన్ని 2008లో రూ.6,86,820కి కొనుగోలు చేశారు. ప్రస్తుతం దాని విలువ రూ.25,200గా చూపించారు. సర్వే నంబర్ 251/10ఏలో 3.75 సెంట్ల స్థలాన్ని 2009లో రూ.1,74,640కి కొనుగోలు చేస్తే.. అదే స్థలం ప్రస్తుతం రూ.4,875గా చూపించారు. వాస్తవంగా ఇక్కడ సెంటు స్థలం సుమారు రూ.25 లక్షలు పలుకుతోంది. సెంటు భూమి లేదు..వ్యవసాయం ద్వారా ఆదాయమట గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి గుమ్మడి హరికృష్ణ తనకు వ్యవసాయ భూములు లేవని చూపించారు. అయితే వ్యవసాయం ద్వారా రూ.5,88,650 ఆదాయం చూపించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ప్లాట్ నంబర్ 153. సర్వే నంబర్ 239/3, 3ఏని చూపించారు. అందులో విస్తీర్ణం, విలువ చూపలేదు. ఇంకా హరికృష్ణ తండ్రి 2014లో ఒక ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ ప్లాటు విలువ అప్పట్లో రూ.9 లక్షలు. ప్రస్తుతం ఆ ప్లాటు మార్కెట్ విలువ చూపలేదు. హరికృష్ణ భార్య భార్గవి టీటీడీ కేంద్ర ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె ఇన్‌కంట్యాక్స్ ఏమీ లేదని చూపించారు. వింజం లక్ష్మిరెడ్డి పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు చూపించారు. ఆ నివాసం అద్దెదా? సొంతమా? అనే వివరాలను పొందుపరచలేదు. అఫిడవిట్లో కారు ఉందన్నారు. ఆ వాహనాన్ని ఫైనాన్స్‌లో తీసుకున్నారా? నేరుగా డబ్బులిచ్చి కొనుగోలు చేశారా? అనే వివరాలు లేవు. ఇదిలా ఉంటే ‘నో డ్యూస్’ సర్టిఫికెట్స్ ఎక్కడా చూపలేదు. ఈ నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అనేక తప్పులు ఉన్నా రిటర్నింగ్ అధికారులు ఆమోదించడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబునాయుడు అఫిడవిట్ -
పార్టీ సేవలో ఎంపీ మురళీమోహన్ కోడలి సంస్థ
సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను నిర్వహించే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీ స్కామ్‌తో ఏపీలో ఆ పార్టీకి సేవలు అందిస్తున్న పలు ఐటీ సంస్థల్లో కలవరం మొదలైంది. ఆయా సంస్థల్లో ఉన్న ఇబ్బందికర డేటాను క్లియర్ చేయాలని (తొలగించాలని) అధికార పార్టీ నేతల నుంచి నిన్న సాయంత్రం మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐటీ మంత్రి నారా లోకేశ్ అనుచరులుగా చెప్పుకొనే కొందరు రంగంలోకి దిగి తమ పార్టీకి అనుకూలంగా ఉండే ఐటీ సంస్థను అప్రమత్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. డేటా చోరీ స్కామ్‌కు సంబంధించి ఎవరైనా వచ్చి ప్రశ్నించినా వివరాలు చెప్పొద్దని, మీ కార్యాలయంలోని కంప్యూటర్స్ (సిస్టమ్స్)లో హార్డ్ డిస్క్‌లను క్లియర్ చేసి, రోజువారీ పనులు చేసుకుంటున్నట్టు కూల్‌గా ఉండాలని కీలక నేతలు దిశానిర్ధేశం చేసినట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ మాదిరిగానే ఏపీలో దాదాపు 13 సంస్థలు పనిచేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన శాఖలు, వాటి వివరాలు, పనితీరు, సేవలు, అబ్ధిదారుల సమాచారం.. ఇలా అనేక పేర్లతో అనేక ఐటీ సంస్థలను సర్వీసు ప్రొవైడర్లుగా ఏర్పాటు చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది రూపాయాల ప్రజాధనం ఫలహారంగా పంచుతూ వచ్చింది. ప్రభుత్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీ కోసం పనిచేసే ఐటీ సంస్థలకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో కొన్ని ఐటీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కొన్ని సంస్థలను సొంత పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్టు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ వ్యవహారంతో తేటతెల్లమైంది. ప్రోనిక్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈపీ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొడ్ ట్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎల్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీఆర్ టెక్నాలజీస్, శ్రేయ కంప్యూటర్స్, ఇన్వెంట్జీ ఎంటర్ ప్రైజెస్ ప్రైౖవేట్ లిమిటెడ్, ప్రొస్పెక్టా టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అల్కోర్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘన జీయోమెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రభుత్వంలోని పలు శాఖలకు సేవలందిస్తున్నాయి. వాటికి ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. వాటిలో కొన్ని సంస్థలు టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తూ హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌కు డేటాను అందజేసినట్టు సమాచారం. పార్టీ సేవలో ఎంపీ మురళీమోహన్ కోడలి సంస్థ టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలికి చెందిన టెలీబ్లూ ఐటీ సంస్థ ప్రభుత్వంతో పలు అంశాలపై ఒప్పందాలు చేసుకుని పార్టీకి సేవలు చేస్తోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. రాజధాని ప్రాంతంలోని కుంచనపల్లిలో ఉన్న ఈ కార్యాలయంలో దాదాపు 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన ఆర్టీజీఎస్ నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థకు అప్పగించినట్టు తెలిసింది. ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్(మెస్సేజ్)లు పంపించి పలు అంశాలపై ప్రజలను ఆరా తీసే ఈ సంస్థ రాజకీయ కోణంలో మంత్రి లోకేశ్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోందని చెబుతున్నారు. ఇటీవల ఈ సంస్థ నుంచి ఒక ఉద్యోగి అభిప్రాయ సేకరణ పేరుతో ప్రకాశం జిల్లా పెదదోర్నాల గ్రామంలో టీడీపీ కార్యకర్తకు ఫోన్ చేసాడు. మా గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన వారికి అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇచ్చారంటూ టీడీపీ కార్యకర్త బదులిచ్చాడు. మీరు చెప్పిన సమాచారం లోకేశ్ కార్యాలయానికి చెబుతామని, వారు చర్యలు తీసుకుంటారని టెలీబ్లూ సంస్థ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. -
సర్వే గుట్టు.. లాడ్జీలో రట్టు!
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపు వ్యవహారం జిల్లాలోనూ బట్టబయలైంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కనుసన్నల్లో సర్వే బృందం పనిచేసినట్లు తెలుస్తోంది. చౌదరికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఎస్ఆర్ నాగభూషణానికి చెందిన ‘వైభవ్’ లాడ్జి కేంద్రంగా ఈ వ్యవహారం సాగింది. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో సర్వే బృందాన్ని లాడ్జీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుండగా.. ‘సాక్షి’ ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో గుట్టు రట్టయింది. టీడీపీ ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థలో పనిచేస్తున్న విజయవాడ యువకులు సర్వే కోసం అనంతపురంలో తిష్టవేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అడ్డడారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ బలహీనపడిన నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ నేతలు వక్ర మార్గాలను ఎంచుకున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, తద్వారా వీలైనన్ని ఓట్లు తొలగిస్తే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందచ్చనే కుటిల ఆలోచనకు తెర తీశారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక రచించారు. మొదట సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి ఓటరు కార్డులను సేకరించారు. వీటి ఫొటోలను ట్యాబ్‌లు, సెల్ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఓటరు కార్డు అనేది ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపుకార్డు. ఈ సమాచారాన్ని వ్యక్తి అనుమతి లేకుండా రాజకీయ అవసరాలకు వాడుకోకూడదు. అయితే ఓటరు కార్డు ఫొటోలు సేకరించిన సర్వే బృందం ఈ వివరాలన్నీ టీడీపీకి చెందిన వెబ్సైట్లోకి చేరవేశారు. ఓటర్ ఐడీ కార్డులో ఏ ఫొటో ఉందో, అదే ఫొటోను కాపీ చేసి టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులో ముద్రించారు. అంటే ఓటర్ ఐడీలోని సమాచారం టీడీపీ నేతలు పూర్తిగా సేకరించారనేందుకు ఇంతకంటే సాక్ష్యాం మరొకటి ఉండదు. దీన్నిబట్టి ఓటరు కార్డుదారుల ప్రమేయం లేకుండానే వారి పేరుతో టీడీపీ గుర్తింపు కార్డులు జారీ అయ్యాయనేది స్పష్టమవుతోంది. ఇది టీడీపీ చేసిన మొదటి తప్పు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు, ఓటరు ఐడీ కార్డులో ఒకే ఫొటో ఉన్న దృశ్యం ఓటర్ ఐడీ సమాచారంతోనే ఫారం–7 దరఖాస్తుల అప్లోడ్ టీడీపీ గుర్తింపుకార్డులోని ఫొటో, ఓటర్ ఐడీ ఫొటో చూస్తే టీడీపీ సభ్యత్వకార్డులు ఉన్న వారి సమాచారంతో పాటు, సభ్యత్వ కార్డులు లేని ఓటర్ల సమాచారం కూడా సేకరించారని అర్థమవుతోంది. ఈ సమాచారం ఆధారంగా వైఎస్సార్సీపీ నేతల ఓట్లు తొలగింపునకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎవరి ఓటు వారే తొలగించుకునేలా, భార్య ఓటు భర్త, వైఎస్సార్సీపీ కార్యకర్త ఓటు ఆ పార్టీ నాయకుడు తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. చివరకు అనంతపురంలోని 84వ పోలింగ్ బూత్ పరిధిలోని బీఎల్ఓ లక్ష్మి ఓటును కూడా తొలగించాలని దరఖాస్తు చేశారంటే ఈ దరఖాస్తుల్లోని డొల్లతనం తేటతెల్లమవుతోంది. అనంతపురంతో పాటు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇదే తరహాలో తప్పుడు సమాచారంతో వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించడమే లక్ష్యంగా దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన సర్వే బృందాలను వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పోలీసులు తిరిగి వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. అయితే సర్వే బృందాలతో తమకేమీ సంబంధం లేదని ఇన్నాళ్లూ టీడీపీ నేతలు బుకాయించారు. తాజా ఉదంతంతో ‘సర్వే బృందాలు’ టీడీపీ కనుసన్నల్లో పనిచేశాయనే విషయం స్పష్టమైంది. ‘వైభవ్’ లాడ్జీలో 20 రోజులుగా తిష్ట అనంతపురంలో సర్వే చేసేందుకు విజయవాడ నుంచి 15 మంది యువకులను ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి రప్పించినట్లు తెలుస్తోంది. వీరిని తనకు సన్నిహితుడైన ఎస్ఆర్ నాగభూషణానికి చెందిన బళ్లారిరోడ్లోని ‘వైభవ్’ లాడ్జీలో ఉంచారు. 206, 208తో పాటు మరో నాలుగు గదుల్లో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా నగరంలో సర్వే చేసి వ్యక్తిగత సమాచారం సేకరించడంతో పాటు ఇదివరకే ఉన్న ఓటర్ ఐడీ కార్డు సమాచారం ద్వారా ‘ఫారం–7’ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే బృందానికి చంద్రబాబు నాయుడు(సీఎం కాదు) అనే వ్యక్తి నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, రాష్ట్రవ్యాప్తంగా సర్వేకు సంబంధించి దుమారం రేగడం, తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేయడంతో సర్వే బృందాలను విజయవాడకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలిసి ‘సాక్షి’ బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు లాడ్జీకి వెళ్లింది. 206 గదిలోకి వెళితే ఇద్దరు యువకులు ఉన్నారు. వీరి పేర్లను ఆరా తీస్తే చెప్పలేదు. అయితే తమది విజయవాడ అని, జయభేరి కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పారు. 10 రోజులుగా ఇక్కడే ఉంటున్నామన్నారు. ‘జయభేరి’ అనేది ఎంపీ మురళీ మోహన్‌కు సంబంధించిన కంపెనీ. లగేజీ సర్దుకుని తిరుగు ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్నారు. 208 గది వద్దకు వెళితే లాక్ చేశారు. వీరు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. -
నేను, నా వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయం..
సాక్షి, తూర్పు గోదావరి : రానున్న ఎన్నికల్లో తాను గానీ, తన కుటుంబసభ్యులుగానీ పోటీ చేసేది లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలుగా మాత్రం కొనసాగుతామని చెప్పారు. ‘మా’ ట్రస్ట్ కార్యకలాపాలు చూసుకోవాల్సి ఉందని మురళీమోహన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదంటూనే మరోవైపు తనకున్న డిమాండ్లను చంద్రబాబు ముందు పెడుతున్నట్టు తెలిసింది. కేవలం మురళీమోహన్ మాత్రమే కాకుండా మరి కొంతమంది సిట్టింగ్ టీడీపీ ఎంపీలు సైతం ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం అయితే అనారోగ్య కారణాలుతో ఎంపీగా పోటీ చేయలేనని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అమలాపురం పార్లమెంట్‌కు టీడీపీ నేతలు మరో వ్యక్తిని పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రజల్లో వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ఆదరణ కారణంగానే టీడీపీ నాయకులు ఓటమి భయంతో పోటీకి దూరమవుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. -
బాబోయ్ ... మాకొద్దీ టిక్కెట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీకి విచిత్రకరమైన పరిస్థితి ఎదురైంది. ఈసారి వైఎస్సార్సీపీకే రాష్ట్ర ప్రజలు పెద్ద పీట వేస్తున్నారని, ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని జాతీయ చానెల్స్‌తోపాటు అనేక సర్వే సంస్థలు ప్రకటిస్తుండడంతో టీడీపీకి భయం పట్టుకున్నట్టు ఉంది. వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగులు ఆసక్తి చూపడం లేదు. భారీగా ఖర్చు పెట్టినా లాభం లేదని అనుకుంటున్నారో ఏమో గానీ పోటీకి వెనక్కి తగ్గుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గాలపై విజయవాడలో సీఎం సమక్షంలో శుక్రవారం జరిగిన సమీక్షల్లో సిట్టింగులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎందుకిలా... పార్టీ పరిస్థితి బాగోలేని విషయం, బాబు పాలనను ప్రజలు చీదరించుకుంటున్న వైనం...ఆది నుంచీ సీఎం చంద్రబాబు చేస్తున్న యూ టర్న్ గిమ్మిక్కులతో ఓటర్ల నాడి తెలుసుకున్న టీడీపీ నేతలు పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారేమో... ఈసారికి తమకు టిక్కెట్ వద్దంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. సంకుచితతత్వంతో రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని, అవినీతి పెరిగిపోయిందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. జిల్లాకు సంబంధించి ఇప్పటికే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అమలాపురం పార్లమెంట్‌కు టీడీపీ నేతలు మరో వ్యక్తిని పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, కాకినాడ ఎంపీ తోట నరసింహం అయితే అనారోగ్య కారణాలుతో ఎంపీగా పోటీ చేయలేనని అధిష్టానానికి చెప్పేశారు. ఈ నేపథ్యంలో తన సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. మరోవైపు రాజమహేంద్రవరం ఎంపీ, సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన అనుచరుడైన మురళీమోహన్ కూడా పోటీ చేయలేనని చేతులేత్తేశారు. తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదంటూనే తనకున్న డిమాండ్లను చంద్రబాబు ముందు అప్పటికే పెడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని విజయవాడలో జరిగిన పార్టీ సమీక్షలో సీఎం చంద్రబాబుకు నేరుగా చెప్పినట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలకు సిట్టింగులు ఆసక్తిచూపకపోవడంతో కొత్తవారిని చూసుకోవల్సిన విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట, ప్రత్తిపాడుపై వీడని చిక్కుముడి... జగ్గంపేట నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి జంపయ్యారు. తనకున్న వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ స్వలాభాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో జగ్గంపేట టిక్కెట్ తనకే వస్తుందన్న ధీమాతో జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేయలేనని చెప్పి, జగ్గంపేట టిక్కెట్ తన సతీమణి వాణికి ఇవ్వాలని తోట నరసింహం డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం జరిగిన సమీక్షలో ఇదే డిమాండ్ పెట్టడంతో జగ్గంపేటపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేకపోయారు. మరోవైపు జ్యోతుల నెహ్రూ మాదిరిగానే పార్టీ ఫిరాయించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. తానొక్కటి తలిచితే మరోటి జరిగిందన్నట్టుగా వరుపుల సుబ్బారావు అడుగులు వేయగా డామిట్ కథ అడ్డం తిరిగినట్టు తన మనవడు వరుపుల రాజా రూపంలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గెలిపించిన పార్టీని కాదనుకుని వస్తే ఇప్పుడు టిక్కెట్ లేదంటూ టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందుతుండటంతో అయోమయంలో పడ్డారు. ప్రస్తుతానికి ప్రత్తిపాడుపై కూడా పీటముడి మరింత బిగిసుకుంటోంది. ఈ విషయంపై కూడా విజయవాడలో జరిగిన సమీక్షలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాలపై మాత్రం సూచన ప్రాయంగా స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. -
వీడియో దుమారం: టీడీపీ ఎంపీల వివరణ
సాక్షి, ఏలూరు: హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షల వ్యవహారం బయటపడటంతో టీడీపీ ఎంపీలు నష్టనివారణ చర్యలకు దిగారు. తమ సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి దుమారం రేగడంతో వివాదాన్ని తగ్గించేందుకు మీడియా ముందుకు వచ్చారు. ఈ వీడియో మార్ఫింగ్ అని నమ్మబలికే ప్రయత్నం చేశారు. తమ మాటలను మార్ఫింగ్ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈ రకంగా ప్రసారం చేయడం భావ్యం కాదని మండిపడ్డారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ పన్నిన కుట్రగా ఎంపీలు పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కితాబిచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాయలసీమను రతనాల సీమగా చంద్రబాబు మార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం -
టీడీపీ ఎంపీలకు చంద్రబాబు క్లాస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలక అంశాల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రదర్శిస్తున్న చులకన భావం, వారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కీలకమైనవేవీ ఇప్పటివరకు నెరవేరకపోగా, కడప ఉక్కు కర్మాగారం, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు వంటి వాటి విషయంపై టీడీపీ ఎంపీల నైజం తేటతెల్లం చేసే వీడియో బయటకుపొక్కడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకించి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో ఢిల్లీ వేదికగా ఆందోళన చేయాలన్న అంశంపై టీడీపీ ఎంపీలు సమావేశమైన సందర్భంగా ఒక్కక్కరు తేలిక భావంతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో లీక్ కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవాక్కయ్యారు. అలాంటి వీడియో లీక్ కావడంపై ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. ఎంపీలు చాటుమాటుగా మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించిన వీడియో ఎవరు చిత్రీకరించారు? ఎలా బయటకు పొక్కింది? అన్న విషయాలపై విచారణ చేయించాలని నిర్ణయించారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, జేసీ దివాకర్ రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీభవన్ లో సమావేశమయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కడప ఉక్కు కర్మాగారం కోసం ఏదో పోరాటం చేసినట్టు బిల్డప్ ఇవ్వడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికొచ్చారు. ఆ క్రమంలో వారంతా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశంపై చాలా తేలికగా, చులకన భావంతో స్పందించారు. పార్టీ అధినేత చెప్పినట్టుగానే తమ వంతుగా నిరాహార దీక్ష చేయడంపై సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ అంటూ ఒక్కో ఎంపీ ఒక్కో రకంగా తమలోని ఆలోచనలు బయటపెట్టారు. అంతా సరదాగా సమావేశాన్ని ఎంజాయి చేశారు. అయితే తమ నిజస్వరూపం బయటపెట్టేలా వీడియో రికార్డవుతుందని వారు ఊహించలేకపోయారు. వారు మాట్లాడిన మాటల వీడియో మీడియాలో దర్శనమీయడంతో పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తమ నాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతం కావడం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నివ్వెరపోయారు. ఇదే అంశంపై పార్టీ ఎంపీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలా వీడియో తీస్తుండగా గమనించకుండా ఎలా ఉన్నారు? ఇంతకు ఆ వీడియో తీసిందెవరు? అంటూ వారిపై ఆగ్రహం ప్రదర్శించారు. తమ వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారమయ్యాయని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీడియో రికార్డింగ్ ఎవరు చేశారో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఇలాంటివి బయటకు పొక్కడం వల్ల పార్టీ పరువు పోతుందంటూ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటలకు వక్రీకరించారని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ ఏదో చెబుతుండగా, ఇకనుంచి బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇలాంటివి బయటకు రావడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. సంబంధిత కథనం : బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం -
బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ ఇది ఓ టీడీపీ ఎంపీ మాట. దీక్షలు, హామీల సాధనపై ఆ పార్టీ నేతల చిత్తశుద్ధిని బయట పెట్టిన వ్యాఖ్య. కడుపుకాలిన ప్రజలు ఓ పక్కన కష్టాలకోర్చుకుని దీక్షలు చేస్తుంటే.. కడుపు నిండిన టీడీపీ నేతల వెటకారాన్ని బయటపెట్టిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించకుండా టీడీపీ ఎంపీలు చేస్తున్న కపటనాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతమయ్యాయి. హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షలు చివరికి వారి నోటివెంటే చెప్పుకున్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ సాధన కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం, కేంద్ర మంత్రి వద్ద ధర్నా చేస్తాం అంటూ ఆ పార్టీ ఎంపీలు గత రెండు రోజులుగా ఢిల్లీలో నడుపుతున్న వ్యవహారం బూటకమని తేలిపోయింది. బుధవారం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో సమావేశమైనా స్పష్టమైన హామీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రానికి ఇవ్వాల్సిన సమాచారంపై చర్చించేందుకంటూ టీడీపీ ఎంపీలు దివాకర్‌రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’ అని అన్నారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి కల్పించుకొని ‘ఈయన్ను పెడదాం..డన్’ అన్నారు. ఇంతలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకొని.. ‘ఆయన్న మొదటి రోజే రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లాం (గత పార్లమెంటు సమావేశాల్లో దీక్ష పేరుతో చేసిన డ్రామా ఉదంతాన్ని ఉటంకిస్తూ). అలాంటిది మీరెందుకు ఆయన్ను అంటారు’ అని అన్నారు. వెంటనే ఎంపీ రామ్మోహన్నాయుడు స్పందిస్తూ.. ‘అదేకదా’ అని అనగానే ఎంపీలందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘జోనూ లేదు.. గీనూ లేదు’ అంటూ విశాఖ రైల్వే జోన్ సాధనలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేనితనాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కపట నాటకాలా?? కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు ఆడుతున్న నాటకం బయటపడటంతో ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీల వెటకారపు మాటలపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యలపై టీడీపీ నేతల నీతి, నిజాయితీ ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ దీక్షలు చేసి అసలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, కపట నాటకాలతో రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసమే దీక్షల డ్రామా మొదలుపెట్టారని భావిస్తున్నారు. గారడీలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు ఇంద్రజాల దిగ్గజం పీసీ సర్కార్‌ను మించిన వాడని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు జిమ్మిక్కులపై ఆయన ట్విటర్లో మండిపడ్డారు. గాల్లో అసెంబ్లీని నిర్మించి కార్యకలాపాలు కొనసాగిస్తారని, అంకెల్లోనే అభివృద్ధి చూపుతారని, చెట్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను హరితవనం చేస్తారని, ప్రసంగాల్లోనే యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి, అన్యాయ పాలనలో రాష్ట్రం దశాబ్దాల వెనక్కి పోయిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని, ఆకాంక్షలను గాలికొదిలేశారని మండిపడ్డారు. -
‘వెంకన్న చౌదరి’పై మురళీమోహన్ మళ్లీ..
సాక్షి, హైదరాబాద్: కలియుగ దైవం తిరుమలేశుడికి కులాన్ని ఆపాదిస్తూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారలేదు. వేంకటేశ్వరుడిని ‘వెంకన్న చౌదరి’గా పేర్కొన్న వీడియో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడం, దీంతో టీడీపీ ఇరకాటంలో పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మురళీమోహన్ శుక్రవారం మళ్లీ ఓ వీడియోను విడుదల చేశారు. నోరు జారడం సహజంగా జరిగేదేనని, దేవుడితో కూడా ఇదే చెప్పుకున్నానని అన్నారు. టంగ్ స్లిప్ సహజమే!: ‘‘రాజమండ్రిలో ఒక మీటింగ్‌లో పొరపాటున ‘వెంకన్న చౌదరి’ అన్నాను. అప్పటిదాకా బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని ‘చౌదరిగారూ.. చౌదరిగారూ..’ అని మాట్లాడుకున్నాం. వెంకన్న చౌదరి అనడం టంగ్ స్లిప్పే తప్ప.. దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కాను. ఎందుకంటే అసలు నాకు కులాల మీద నమ్మకమే ఉండదు. అలాంటిది వెంకటేశ్వరస్వామికి కులం ఎలా అంటగడతాను? టంగ్ స్లిప్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఉదయం పూజ చేసేటప్పుడు కూడా దేవుడికి మొక్కుకున్నా.. ‘టంగ్ స్లిప్ అయింది స్వామి.. పొరపాటుగా అన్నాను.. కావాలని అనలేదు..’ అని దేవుడికి దండం పెట్టుకున్నా’’ అంటూ మురళీమోహన్ వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగింది?: బుధవారం రాజమండ్రిలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ ఓటమికిగల కారణాలను విశ్లేషించారు. ఆ క్రమంలో మా ‘వెంకన్న చౌదరి’ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందంటూ ఏకంగా దేవుడికి కులాన్ని అంటగట్టేశారు. మురళీమోహన్ వ్యాఖ్యలు పెనుదుమారం రేగడంతో టీడీపీ ఇరాకటంలో పడింది. నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఇప్పుడు మురళీమోహన్ మరో వీడియోను పోస్ట్ చేశారు. -
వెంకన్న చౌదరిపై మురళీమోహన్ వివరణ
-
దేవుళ్లకూ కులం ఆపాదనా...!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా తెలుగుదేశం నేతల తీరుపై విసిగివేసారిన ప్రజలు తాజాగా ఆపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలతో అవాక్కవుతున్నారు. అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రజలను కులాలు, మతాలుగా చీలుస్తూ చేస్తున్న ప్రసంగాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వీటిపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మినీమహానాడులో ఆ పార్టీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అంటూ సంబోధించడాన్ని చూసి హవ్వ అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం అగ్రనేతలు కులాల వారీగా ప్రస్తావనలు చేస్తూ వివిధ వర్గాల పట్ల తమ మనసులోని వైఖరిని బయట పెట్టుకుంటుండగా చివరకు దేవుళ్లకూ ఈ కులాల గొడవను అంటగట్టడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని మతలబులు చేసిందో అందరికీ తెలిసిందేనని, అయినా ఆపార్టీకి మెజార్టీ రాకుండా ఆగడానికి కారణం... మా ‘వెంకన్న చౌదరియే’నని వ్యాఖ్యానించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలురకాల సెటైర్లతో కూడిన వ్యాఖ్యలు, చిత్రాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఆపార్టీ అధినేత చంద్రబాబు ఇంతకు ముందు ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఏకంగా మీడియా సమావేశంలోనే మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ద్వారకా తిరుమలలో స్పీకర్ కోడెల చౌదరి కూడా మన కమ్మోళ్లే ఎప్పుడూ అధికారంలో ఉండాలని, అందుకు మనోళ్లంతా కష్టపడాలని చెప్పారంటూ విమర్శలు వచ్చాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటూ చంద్రబాబు, ఇతర నేతల తీరుపై విమర్శలు సామాజిక మాద్యమాలలో వెల్లువెత్తుతున్నాయి. మనసులో మాటలూ వచ్చేస్తుంటాయి... గతకొంతకాలంగా టీడీపీ నేతల ప్రసంగాల్లో వారి మనసులో మాటలు బయటపెడుతున్నారని పలువురు సామాజిక మాధ్యమాల్లో పేర్కొంటున్నారు. ‘అవినీతి, కులప్రీతి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీనే. సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఉరివేసుకున్నటే’ అంటూ గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొనడాన్ని, భారతదేశాన్ని అవినీతి దేశంగా మార్చేవరకు నిద్రపోనని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను వారు గుర్తుచేస్తున్నారు. -
బీజేపీకి మెజారిటీ రాకుండా ‘వెంకన్న చౌదరి’ అడ్డుకున్నారు
-
బీజేపీని ‘వెంకన్న చౌదరి’ అడ్డుకున్నాడు
సాక్షి, హైదరాబాద్ : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ మురళీ మోహన్ ‘వెంకన్న చౌదరి’ అని సంబోధించారు. కర్ణాటక ఎన్నికల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశం సందర్భంగా మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నా చంద్రుడు మాత్రం ఒక్కడే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మురళీమోహన్ పేర్కొన్నారు. -
శ్రీరెడ్డి అలా చేయడం తప్పు: మురళీ మోహన్
రాజమండ్రి : తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న శ్రీరెడ్డి అంశంపై రాజమండ్రి ఎంపీ, సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. ‘ఒక భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వను’ అన్నారు. తెలుగు సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందటూ, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి వివాదం తరువాత రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను వివాదంలోకి లాగటంపై మెగా ఫ్యామిలీ, ఇండస్ట్రీ వర్గాలు సీరియస్ అయ్యాయి. నటుడు శివ బాలాజీ పవన్ ను దూషించినందుకు శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. -
టీడీపీలో ‘సినిమా’ పంచాయితీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సినిమా పంచాయితీ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ వ్యవహారాన్ని నటుడు, ఎంపీ మురళీ మోహన్ వద్ద పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రస్తావించారు. దీంతో రాజేంద్రప్రసాద్‌పై ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. గురువారం జరిగిన టెలీకాన్ఫరెన్స్ పాల్గొన్న ఆయన, రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినిమా పరిశ్రమ నుంచి మెజార్టీ నటులు, సాంకేతిక సిబ్బంది టీడీపీలోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు తనతో పాటు ఇండస్ట్రీలోని చాలామందిని బాధపెట్టాయని ఈ సందర్భంగా మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. అయితే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల సారాంశం పూర్తిగా తెలియదన్న చంద్రబాబు.. ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం టీడీపీ విధానం కాదని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక వేళ ఎవరైనా అలా ప్రవర్తించినా తప్పక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. మరోవైపు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. ప్రముఖులుగా ఉన్నవారు ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొంటే బాగుంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా పరిణామాలపై రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి. అసలేం జరిగింది? ప్రత్యేక హోదా పోరాటంపై తెలుగు సినిమా పరిశ్రమకు ఏ మాయరోగం వచ్చింది? చేవ తగ్గిపోయిందా? రూ.వందల కోట్ల కనక వర్షం మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారా? అంటూ ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్ రెండు రోజుల క్రితం తీవ్రంగా విమర్శించారు. తెలుగు డైరెక్టర్లు హీరోయిన్ల అందాలను వర్ణించడానికే పనికొస్తారు తప్ప.. వారికి సామాజిక స్పృహ, బాధ్యత లేవని దుయ్యబట్టారు. తెలుగు సినిమా కళాకారులు హైదరాబాద్‌లో బానిస బతుకులు బతుకుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తారని, ఆస్తులు లాక్కుంటారని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు కోసం సినీపరిశ్రమంతా ఒక్కతాటిపైకి వచ్చి ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే ఇక్కడి కళాకారులు మాత్రం ఏసీ గదుల్లో కులుకుతున్నారంటూ ఆరోపించారు. అవార్డులు రాకపోతే లొల్లి చేసే వీరు రాష్ట్రానికి నిధులు రావడం లేదన్న విషయం చెవులకు ఎక్కడం లేదా? మీ కళ్లకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ హోదా ఉద్యమంలో పాల్గొనాలని లేకపోతే 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుగు సినిమా కళాకారులను వెలివేయడానికి వెనుకాడరంటూ హెచ్చరించారు. దర్శక, నిర్మాతల ఫైర్ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై పలువురు దర్శక, నిర్మాతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సూటిగా అడిగారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? టీడీపీ నాయకులే లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు టీడీపీలోనే ఉన్నారని, వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. -
కన్నీళ్లు పెట్టిన శివాజీరాజా
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన హాస్యనటుడు గుండు హనుమంతరావుకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శిరాజీరాజా, కాదంబరి కిరణ్ తదితరులు గుండు హనుమంతరావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు సన్నిహితుడైన గుండు హనుమంతరావు మరణం కలిచివేసిందన్నారు. ‘అమృతం ధారావాహిక మా ఇద్దరికి చాలా ప్రత్యేకం. చెన్నై నుంచి మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో హనుమంతరావు ఇవ్వని ప్రదర్శన లేదు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఆయన కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుంద’ని శివాజీరాజా అన్నారు. మంచి వ్యక్తి: మోహన్‌బాబు గుండు హనుమంతరావు మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి అని సీనియర్ నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు.. ‘గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి. మా నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చాలా సినిమాల్లో నటించాడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాథుడిని వేడుకొంటున్నాన’ని మోహన్‌బాబు అన్నారు. -
ఆశగా ఎదురు చూస్తాం: కేఈ
సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం జాతీయ అంశంగా మారిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో వివిధ పార్టీలు గళం విప్పుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కేంద్రానికి కనబడ్డం లేదా? విభజన చట్టం అమలు కోసం కేంద్రం ముందు ఏపీ మోకరిల్లాలా?.. సమాఖ్య వ్యవస్థలో ఇదేం దుస్థితి అని వాపోయారు. మిత్రపక్షమైన తమకే ఇంతటి వివక్ష వుందని గ్రహించిన ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సందిగ్ధంలో పడ్డాయన్నారు. మార్చి 5 వరకు సహనంతో, ఆశగా ఎదురు చూస్తామని.. ఐదు అంశాల్లో కొన్నైనా నెరవేరతాయన్న నమ్మకం టీడీపీ ఎంపీలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పవన్‌పై విరుద్ధ ప్రకటనలు రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తేల్చేందుకు నిజనిర్ధారణపై కమిటీ ఏర్పాటుచేయనున్నట్టు జనసేన పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ నాయకులు భిన్నంగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుపుకుపోతామని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయని జనసేన కమిటీ వేయడం ఏమిటన్న అభిప్రాయాన్ని కేఈ కృష్ణమూర్తి వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినవాళ్లు, చేయనివాళ్లు కమిటీలు వేస్తే ఏం మాట్లాడతామ’ని ఆయన వ్యాఖ్యానించారు. -
త్వరలో విజయకృష్ణ ట్రస్ట్ స్టార్ట్ చేస్తాం – నరేశ్
సీనియర్ హీరో నరేశ్ జన్మదిన వేడుకలు శనివారం సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో అభిమానుల సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ – నరేశ్ కెరీర్ ఇప్పుడు మంచి బూస్ట్‌లో ఉంది. ‘శతమానం భవతి’ సినిమా దర్శకుణ్ణి సన్మానించడం సంతోషంగా ఉంది. నిర్మాత ‘దిల్’ రాజు ఒకే ఏడాది ఆరు హిట్స్ సాధించడం విశేషం. నరేశ్ ఇలానే మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అటు సినిమాలతో అలరిస్తూ ఇటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నరేశ్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విజయ నిర్మల. ‘‘అప్పుడే 50 ఏళ్లు అంటే నమ్మబుద్ధి కావటం లేదు. నా దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. వినోదం పంచటం, సేవ చేయటమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. విజయ కృష్ణ పేరుతో త్వరలో ట్రస్ట్ ఏర్పాటు చే స్తాను’’ అన్నారు నరేశ్. నటుడు మురళీమోహన్ ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, వేగేశ్న సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
'సినిమా వాళ్లు అద్దాల మేడల్లో ఉంటారు'
మా (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు మా అధ్యక్షుడు శివాజీ రాజా పలు నిర్ణయాలను ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన కళాకారులను ఆదుకునేందుకు మా అసోషియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో మా ఆధ్వర్యంలో నిర్మించనున్న వృద్ధాశ్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్ వీ కృష్ణరెడ్డిగారిని చైర్మన్ గా నియమించినట్టుగా ప్రకటించారు. లక్షలు సంపాదిస్తూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ మెంబర్ షిప్ తీసుకొనివారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. అయితే పేద కళాకరుల విషయంలో మాత్రం మెంబర్ షిప్ తీసుకోక పోయినా పరవాలేదన్నారు. ఇటీవల మరణించిన ప్రొడక్షన్ మేనేజర్ చిరంజీవి కుటుంబానికి మా అసోషియేషన్ తరుపున 6 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. పేద కళాకారుల కోసం మా అధ్యక్షుడు శివాజీ రాజా 25 వేల రూపాయలను మా అసోషియేషన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్ మాట్లాడుతూ ' సినిమా వాళ్లు అద్దాల మేడల్లో ఉంటారు. అది ఒక్క రాయి వేస్తే పగిలిపోతుంది. మీడియా సినిమా వాళ్ల విషయంలో అత్యుత్సాహం చూపిస్తోంది. ఏ సంఘటన జరిగినా సినిమా వాళ్లు అంటే ఒకటికి పదిసార్తు చూపిస్తున్నారు. ఇది సరైంది కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య ఒక వెబ్ సైట్ లో సినీ ప్రముఖుల గురించి అభ్యంతరకరంగా రాస్తున్నారు. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నా'మన్నారు. మా అసోషియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకను బాహుబలి వేడుక కన్నా ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఈ వేడుకలో తెలుగు సినీ కళాకారులంతా పాల్గొంటారన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రన్న బీమా, కేసీఆర్ బీమా పేరుతో కళాకారులకు పాలసీలు ఇవ్వబోతున్నారని తెలిపారు. ఆ పాలసీల కోసం రూ. 15 నామినల్ ఫీజు కట్టాలని తెలిపారు. -
పరిచయం తర్వాత ఏమైంది?
వెంకీ, లాస్య జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో దీపక్ కృష్ణన్ నిర్మించిన సినిమా ‘తొలి పరిచయం’. మురళీ మోహన్, సుమన్ కీలక పాత్రధారులు. ఇంద్రగంటి స్వరపరిచిన ఈ సినిమా పాటలను విడుదల చేసిన రాజమండ్రి ఎంపీ, నటుడు మురళీ మోహన్ మూడు పాటలు బాగున్నాయని మెచ్చుకున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఈతరం యువత మనోభావాలను ప్రతిబింబించే చిత్రమిది. ఓ అమ్మాయి, అబ్బాయి పరిచయం తర్వాత ఏమైందనేది చిత్రకథ. వినోదం, కుటుంబ విలువలకు ప్రాముఖ్యత ఇచ్చాం’’ అన్నారు. ‘‘దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ వరసకు నాకు బ్రదర్ అవుతారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పాట, పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పాట నేనే స్వరపరిచా. ఈ సినిమాలో స్వరకర్తగా, గాయకుడిగా, పాటల రచయితగా మూడు పాత్రలు పోషించా’’ అన్నారు ఇంద్రగంటి. ‘మా’ అధ్యక్షులు శివాజీ రాజా, చిత్ర సహ నిర్మాత సురేశ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎన్టీఆర్ అవార్డు
హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2012-13 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు ప్రకటించగా, సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు పురస్కారంగా లభించే నటరత్న నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు (2012)కు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ఇక 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన చలనచిత్ర అవార్డులను త్వరలో ప్రకటిస్తామని నటుడు మురళీమోహన్ తెలిపారు. అలాగే ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ఘనంగా ప్రదానం చేస్తామన్నారు. ఈ అవార్డులను ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ప్రకటించారు. 2012 జాతీయ అవార్డులు బీఎన్ రెడ్డి అవార్డు-సింగీతం శ్రీనివాసరావు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు-దగ్గుబాటి సురేష్ రఘుపతి వెంకయ్య అవార్డు- కోడి రామకృష్ణ 2013 జాతీయ అవార్డులు ఎన్టీఆర్ అవార్డు-హేమమాలిని బీఎన్ రెడ్డి అవార్డు-కోదండరామిరెడ్డి నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు- దిల్ రాజు రఘుపతి వెంకయ్య అవార్డు- వాణిశ్రీ -
22 పేర్లతో పద్మ అవార్డుల జాబితా
- లిస్టులో సినీ నటుడు మురళీ మోహన్, సతీష్‌రెడ్డి, పీవీ సింధు - కేంద్రానికి సిఫార్సు చేసిన రాష్ట్ర సర్కారు సాక్షి, అమరావతి: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే పద్మ అవార్డులకు 22 మంది పేర్లతో జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ పేరును పద్మభూషణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అలాగే రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు సతీష్‌రెడ్డి పేరును పద్మభూషణ్ అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజత పథక విజేత పీవీ సింధు, మృదంగ విద్మాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు, ప్రముఖ నృత్య కళాకారిణి ఆనంద శంకర జయంత పేర్లను పద్మభూషణ్‌కు సిఫార్సు చేసింది. ఈఎన్టీ స్పెషలిస్ట్ విష్ణుస్వరూపరెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ గురువారెడ్డి, చేనేత రంగం నుంచి రమణయ్య, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ పేరును పద్మశ్రీకి సిఫార్సు చేసింది. ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో సర్జన్‌గా పనిచేస్తున్న సి.కె.దుర్గ పేరును కూడా పద్మ అవార్డుకు సిఫార్సు చేసింది. వీరితోపాటు మరిన్ని రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లనూ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. -
సిరిసిల్లలో ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సిరిసిల్ల మండలకేంద్రంలో పాతిపాక మురళీమోహన్(43) అనే వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఖమ్మం : ఖమ్మం జిల్లా మణుగూరులో మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న మురళీమోహన్ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 4 వేలు నగదుతోపాటు 300 మత్తు ఇంజక్షన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మురళీమోహన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలపల్లి ప్రభుత్వాసుపత్రిలో మురళీమోహన్ ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. -
పోటీ పడి మరీ నేతలు కునుకేశారు...
తిరుపతి : టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో నేతలు దర్జాగా కునుకేశారు. ఆవులింత అంటువ్యాధి అన్నట్లుగా తిరుపతి మహానాడులో నేతలు కూడా ఒకరి తర్వాత ఒకరు నిద్రలో జోగుతూ కెమెరాకు చిక్కారు. నిద్రాదేవి కరుణించడంతో వేదికపైనే నిద్రమత్తులోకి జారుకున్నారు. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందు..... రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సహ మరో నేత ముందున్నారు. ఓవైపు నేతలు ప్రసంగిస్తుండగానే మరోవైపు వీరు మాత్రం హాయిగా నిద్రపోయారు. ఇక ఇదే సీన్ శుక్రవారం నాటి మహానాడులో జరిగింది. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప కూడా కునుకేశారు. వీరి వెనకే కూర్చున్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో మీడియా ప్రతినిధులు పోటీపడి మరీ చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
నిర్మాత సురేశ్ బాబుకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఫిలిం చాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్ బాబుకు హైకోర్టు ఊరటనిచ్చింది. చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించకుండా సురేశ్ బాబును నియంత్రిస్తూ సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేశ్ బాబు ఫిలిం చాంబర్‌కు బకాయిలున్నారని, అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని, అయినా కూడా పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పంపిణీదారుడు మురళీమోహన్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సివిల్ కోర్టు, చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించకుండా సురేష్‌బాబును నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు చాంబర్, ఇటు సురేశ్ బాబు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సురేష్‌బాబు ఎలాంటి బకాయిలు లేరని, నిబంధనల మేరకు ఎన్నికైన వ్యక్తిని బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వారు స్వామి దర్శనం చేసుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
అమరావతిలో జయభేరి భారీ వెంచర్స్
-
పవన్ మాట్లాడిన విధానంలో తప్పులేదు
-
అప్పుడు మురళీమోహన్ ఎందుకు కో్ర్టుకెళ్లారు
-
అదిరేటి స్టెప్పు మీరేస్తే...!
నందమూరి బాలకృష్ణ ఏ సినిమా వేడుకలో పాల్గొన్నా ‘ఓ డైలాగ్ కొట్టు గురూ’ అని అభిమానులు అభిమానంగా అడుగుతారు. ఒకవేళ అదే వేదికపై జ్యోతిలక్ష్మి లాంటి ఐటమ్ డ్యాన్సర్ కూడా కనిపిస్తే, ఆమెతో కలిసి ఓ స్టెప్ వెయ్ గురూ అని అడిగినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఒకప్పుడు ‘జ్యోతిలక్ష్మి చీర కట్టింది... పాపం చీరకే సిగ్గేసింది..’, ‘అంతం కాదిది.. ఆరంభం.. మూడు చుక్కల ముద్దుల విందు...’, ‘పరువాల లోకం.. పడుచోళ్ల మైకం..’ వంటి ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను కనువిందు చేసిన జ్యోతిలక్ష్మిని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. ఆమెతో కలిసి బాలకృష్ణ నిజంగానే డ్యాన్స్ చేశారు. ఇందుకు వేదికగా నిలిచింది ‘సంతోషం’ అవార్డుల వేడుక. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో జ్యోతిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఏయన్నార్ స్మారక అవార్డును కృష్ణంరాజు, గోల్డెన్ జూబ్లీ అవార్డును కృష్ణ, జీవిత సాఫల్య పురస్కారాన్ని విజయనిర్మల, డి. రామానాయుడు స్మారక అవార్డును అల్లు అరవింద్ , అల్లు రామ లింగయ్య స్మారక అవార్డును గొల్లపూడి మారుతీ రావు, ఈవీవీ స్మారక అవార్డును రేలంగి నరసింహా రావు అందు కున్నారు. 2014 లెజెండ్రీ అవార్డు అందుకున్న బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు తన సినిమాలోని కొన్ని డైలాగ్స్ చెప్పారు. అదే అభిమానుల కోరిక మేరకు జ్యోతిలక్ష్మీతో కలిసి ‘గు గ్గు గ్గు గ్గు గ్గుడెసుంది..’ పాటకు స్టెప్పులు వేశారు. అదిరేటి ఈ స్టెప్పులు అవార్డు వేడుకకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యాయని ‘సంతోషం’ సురేశ్ కొండేటి పేర్కొన్నారు. ఇంకా కథానాయిక శ్రీయ చేసిన డ్యాన్స్ కూడా వీక్షకులను అలరించింది. ఈ వేడుకలో నటులు మురళీ మోహన్, రామ్‌చరణ్, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, వీవీ వినాయక్, ఎన్. శంకర్, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పలువురు తారలకు అవార్డులు అందజేశారు. -
మురళీ మోహన్ ల్యాండ్ మాట ఏమిటి?
-
కుప్పం హెడ్ కానిస్టేబుల్‌కు ఇండియన్ పోలీస్ మెడల్
చిత్తూరు (అర్బన్) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులకు అందించే ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ఈ సారి జిల్లా నుంచి ఒక్కరినే వరిం చింది. కుప్పం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఏ.మురళీమోహన్‌కు ఐపీఎంను ప్రకటిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. 1990లో కానిస్టేబుల్‌గా విధుల్లోకి వచ్చిన మురళీమోహన్ విధి నిర్వహణలో 222 రివార్డులు, ఆరు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2009లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవాపతకాన్ని అందుకున్నారు. 2012లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఈయనకు పదోన్నతి లభించింది. -
'ప్రత్యేకహోదా ఇస్తామంటే రాజీనామాకైనా సిద్ధం'
రాజమండ్రి రూరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామంటే అవసరమైతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనేది సున్నితమైన అంశమని, తమ నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంతో సామరస్యపూర్వక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తి బలం ఉందని, తెలుగుదేశం పార్టీ బెదిరించినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని ఆరోపించారు. దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారన్నారు. -
పుష్కరాలకు 400 మంది ఈతగాళ్లు
కొవ్వూరు: గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిసారిగా అగ్నిమాపక శాఖ ద్వారా ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆ శాఖ రీజినల్ అగ్నిమాపకశాఖ అధికారి డి.మురళీమోహన్ తెలిపారు. జిల్లాలోని కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం మండలాల పరిధిలోని స్నానఘాట్టాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. కొవ్వూరులో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 400 మంది అగ్నిమాపక సిబ్బందిని ఎంపిక చేసి ఈతలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈనెల 30వ తేదీతో శిక్షణ పూర్తవుతుందని, వచ్చేనెల 7న రిహార్సులు నిర్వహిస్తామన్నారు. వచ్చేనెల 12వ తేదీన సిబ్బందికి విధులు కేటాయిస్తామని తెలిపారు. వీరిలో 200 మంది చురుకైన ఈతగాళ్లను ఎంపిక చేసి నది లోపల బోట్లపై ఉంచుతామన్నారు. పుష్కర నగర్, లైటింగ్ తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆష్కా లైట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పుష్కరనగర్, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి జనరద్దీ ప్రదేశాలలో ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తగా అగ్నిమాపక శకటాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో 14 ఏ గ్రేడు, 54 బీ గ్రేడు స్నానఘట్టాలను గుర్తించామని ఇక్కడ 600 మంది అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 15 ఏ గ్రేడు, 64 బీ గ్రేడు స్నానఘట్టాలున్నాయని ఇక్కడ 700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తుల రక్షణ కోసం తూర్పుగోదావరిలో 13, పశ్చిమగోదావరిలో 10 రబ్బర్ బోట్లను వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. స్నానఘట్టాలు శుభ్రం చేసేం దుకు తూర్పుగోదావరిలో 40, పశ్చిమగోదావరిలో 30 పోర్టబుల్ పంప్‌లను వినియోగిస్తామన్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఐదు పోర్టబుల్ పంపుసెట్లు, నాలుగు రబ్బర్ బోట్లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఉభయగోదావరి జిల్లాల అగ్నిమాపకశాఖ అధికారులు బి.వీరభద్రరావు, టి.ఉదయ్‌కుమార్, స్ధానిక అగ్నిమాపక అధికారి ఎన్. సుబ్రమణేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఏఈ జి.మణికంఠరాజు ఆయన వెంట ఉన్నారు. -
లింగాల ఎంపీడీఓ ఆత్మహత్యాయత్నం
కడప: కడప జిల్లాలో ఇటీవల సస్పెండైన లింగాల ఎంపీడీఓ మురళీ మోహన్ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్డీఓపై ఫిర్యాదు చేసినందుకు మురళీ మోహన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దాంతో మనస్థాపం చెందిన మురళీ తన చావుకు ఆర్డీఓ, కలెక్టర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డే కారణమని పలువురికి ఎస్ఎంఎస్లు పంపి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ప్రస్తుతం మురళీ మోహన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'మీకు పోలవరంపై మాట్లాడే హక్కు లేదు'
హైదరాబాద్:పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించి అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. రాజ్యసభలో ప్రకటన చేసి డ్రాఫ్ట్ లో చేర్చకపోవడం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదన్నారు. గత యూపీఏ ప్రభుత్వం డ్రాఫ్ట్ లో చేర్చి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని మురళీ మోహన్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కును కాంగ్రెస్ కోల్పోయిందన్నారు. -
'రంగస్థల' జ్యూరీ చైర్మన్‌గా మురళీ మోహన్
హైదరాబాద్: 2013, 2014 ఏళ్లకు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సినీ నటుడు, ఎంపీ మురళీ మోహన్ చైర్మన్‌గా జ్యూరీని నియమించింది. మొత్తం ఆరుగురు ఉండే ఈ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు జి.బ్రహ్మయ్య, ఎన్.ముక్తేశ్వరరావు సభ్యులుగానూ, సమాచార శాఖ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. దీనికి తోడు 2013, 14 సంవత్సరాలకు నంది నాటక అవార్డుల ఎంపికకు కూడా పలు కమిటీలను నియమించారు. -
దయచేసి ప్రతి ఒక్కరు సహకరించాలి....
-
'తీర్పు తర్వాతే 'మా' ఫలితాలపై స్పష్టత'
-
తీర్పు తర్వాతే 'మా' ఫలితాలపై స్పష్టత : మురళీమోహన్
హైదరాబాద్ : 'మా' ఫలితాలు ఎప్పుడు వెల్లడిచేస్తామన్నది మంగళవారం తెలుస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికల ఫలితాల ఎప్పుడు వెల్లడిస్తామన్న అన్న దానిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం సుమారు 150 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అగ్ర హీరోలు ఎవ్వరూ ఇప్పటివరకూ ఓటు వేయలేదని సమాచారం. 350 లోపే ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
జయసుధ వెనక ఓ శక్తి: రాజేంద్రప్రసాద్
-
'మా' ఎన్నికలకు జయసుధ ప్యానల్ ప్రచారం
-
సినీ పరిశ్రమ మేలు కోసం యాగం
‘‘పలువురు సినీ ప్రముఖులు ఇటీవల ఆకస్మికంగా కన్ను మూశారు. దాంతో, అందరూ సినీ పరిశ్రమకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అందుకే సినీ పరిశ్రమ మేలు కోసం స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ‘అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం’ చేస్తున్నాం. పరిశ్రమలోని అన్ని శాఖల వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని నటీనటుల సంఘం అధ్యక్షులు మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ యాగానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మద్దినేని రమేశ్, ఆకెళ్ల గిరిబాబు, శివకృష్ణ తదితరులు మాట్లాడారు. -
మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ
బంజారాహిల్స్: రాజమండ్రి ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ తనయుడు మాగంటి రామ్మోహన్ ఇంట్లో వారంలో వరుసగా రెండు సార్లు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు శ్రీలంక నుంచి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున బ్యాగులోని రూ.6 లక్షల విలువైన నగలు, విదేశీ కరెన్సీ చోరీ జరిగింది. ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే మళ్లీ ఖరీదైన టీవీని ఆగంతకులు దొంగిలించారంటూ రామ్మోహన్ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఐ రాంబాబు ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఘటనా స్థలికి వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు కూడా వచ్చారు. ఇప్పటికే రామ్మోహన్ ఇంట్లో వంట మనిషి, పని మనుషులు, డ్రైవర్‌తో పాటు ఏడుగురిని పోలీసులు విచారించారు. -
పగబట్టిన పాము!
పాము పగ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నమైన కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘నంజుపురం’, తెలుగులో ‘నాగలాపురం’ పేరుతో విడుదల కానుంది. కె. సృజన సమర్పణలో మురళీమోహన్ కూసుపాటి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. రాఘవ్, మోనికా జంటగా చార్లెస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు చేసిన పొరపాటు వల్ల పాము పగబడుతుంది. చంద్రగ్రహణం నాటికి అతన్ని చంపేయాలనుకుంటుంది. మహాభక్తురాలైన అతని ప్రేయసి ఎలాగైనా ప్రియుణ్ణి కాపాడుకోవాలనుకుంటుంది. తను అనుకున్నది సాధించిందా? లేదా అనేది తెరపై ఆసక్తిగా ఉంటుంది. ప్రేమ, పగ, సెంటిమెంట్‌తో సాగే సినిమా’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పి.మంగమ్మ. -
ఎంపీ మురళీమోహన్ ఇంట్లో చోరీ
బంజారాహిల్స్: ప్రముఖ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కుమారుడి ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... అపోలో ఆసుపత్రి సమీపంలోని ఫిలింనగర్ సైట్-2లో మురళీమోహన్ కుమారుడు మాగంటి రాంమోహన్ నివాసం ఉంటు న్నాడు. మురళీమోహన్ కుటుంబ సన్నిహితురాలు శ్రీలంక నివాసి నాచియర్ తొండమాన్ అనే మహిళ నగరంలో తమ స్నే హితురాలి వివాహానికి హాజరయ్యేందుకు గతనెల 28న నగరానికి వచ్చి రాంమోహన్ నివాసంలో బస చేసింది. గతనెల 30న వివాహానికి హాజరై తిరిగి వచ్చాక నగలను హ్యాండ్‌బ్యాగ్‌లో భద్రపర్చుకుంది. ఆదివారం ఉదయం శ్రీలంక తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతూ హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న నగలను సూట్‌కేస్‌లో పెట్టేందుకు చూడగా కనిపిం చలేదు. దీంతో విషయాన్ని రాంమోహన్‌కు తెలియజేసి అంతటా వెతికింది. అయినా కనిపించకపోవడంతో తన నగలు చోరీ అయ్యాయని ఆదివారం బంజారాహిల్స్ పోలీ సులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరి శీలించి, క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.6 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫి ర్యాదులో పేర్కొంది. బంజారాహిల్స్ క్రైం ఇన్స్పెక్టర్ రా ంబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశ్రమకు ఏదో పట్టింది.. అవసరమైతే పూజలు..
-
'వీబీ రాజేంద్ర ప్రసాద్ నిజాయితీపరుడు'
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం పట్ల మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ సంతాపం ప్రకటించారు. ఆయన్న ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించారని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. వ్యక్తిగతంగా ఆయనెంతో నిజాయితీపరుడని వెల్లడించారు. నటీనటులను ఆయన ఎంతో గౌరవించేవారని చెప్పారు. ఫిల్మ్ నగర్ ఆలయం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం తీరని లోటని సంగీత దర్శకుడు కోటి అన్నారు. -
ఎంపీలపై విచారణకు ఆదేశం
ఏలూరు : గోదావరి జిల్లాల్లో కోడి పందేల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ విషయంలో ముగ్గురు ఎంపీల తీరుపై విచారణ జరపాల్సిందిగా జిల్లా ఎస్పీని న్యాయ సేవాధికార సంస్థ ఆదేశించింది. మాగంటిబాబు, మురళీమోహన్, గోకరాజు గంగరాజుపై జిల్లాకు చెందిన న్యాయవాది బాబూ గణేష్ న్యాయసేవాధికార సంస్థలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముగ్గురు ఎంపీలు కోడిపందేల విషయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కోన్నారు. దాంతో.. ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశించారు. -
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా
-
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా
ఏలూరు: కోడిపందాలు ఆడుతు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ ఎంపీలు పోలీసులను డిమాండ్ చేశారు. నేతల అరెస్ట్‌కు నిరసనగా మంగళవారం ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజుతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించారు. దాంతో జడ్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లాలోని ద్వారక తిరుమలలో కోడిపందాలు ఆడుతున్న దాదాపు 17 మంది టీడీపీ నేతలను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు. అదికాక రాష్ట్రంలో కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలను నిర్వహించినా, జూదమాడినా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. దాంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుపా నేతృత్వంలోని ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ గతవారం హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
పుష్కరాల కోసం నిధులు విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడుతో కలసి మురళీమోహన్ మాట్లాడుతూ... రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయంలో రాత్రిపూట విమానాలు దిగేందుకు అనుమతించాలని పౌర విమానయానశాఖను ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాజమండ్రి - కోవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి మరమ్మతుకు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... బలవంతపు మతమార్పిడులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని గుర్తు చేశారు. కాని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్‌నే చేస్తున్నాయని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. -
అలా ఏలా మూవీ పోస్టర్స్
-
మురళీ మోహన్ గారికి అక్కడేం పనో..?!
-
భూములు కొంటే తప్పేంటి?
* నేను బిల్డర్‌ని, రియల్ ఎస్టేట్ వ్యాపారిని * రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తుళ్లూరు: ‘నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, బిల్డర్‌ను.. భూములు కొంటే తప్పేంటి..’ అని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని గ్రామపెద్ద పెద్దారావు ఇంటివద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన రాజధాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజారాజాధానిగా రూపొందాలని తుళ్లూరు మండలాన్ని ముఖ్యమంత్రి ఎంపిక చేశారని చెప్పారు. ఇక్కడి యువకులకు విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ఇక్కడకు వస్తారని, విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ఇలా భవిష్యత్ తరాలు చెప్పుకొనే రీతిలో రాజధాని నిర్మిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భూములు కొన్నారా అని అడగ్గా ఒక్క సెంటు భూమి కూడా కొనలేదని, కొన్నట్లు నిరూపిస్తే పేదలకు రాసి ఇచ్చేస్తానని చెప్పారు. స్వతహాగా తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్‌నని ఒకవేళ కొంటే మాత్రం తప్పేమిటని ప్రశ్నించారు. ఆయన వెంట ఎంకేఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముప్పవరపు కృష్ణారావు, స్నేహహస్తాలు ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు అనుమోలు సత్యనారాయణ తదితరులున్నారు. -
అలా ఏలా మూవీ స్టిల్స్
-
ఈ నెల 30న...పన్నెండు గంటల పాటు మేము సైతం
హుదూద్ తుపాన్ బీభత్సం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సుందర నగరం విశాఖకి పూర్వ శోభను తెచ్చే ప్రయత్నంలో ‘మేము సైతం’ అంటూ తెలుగు చిత్రపరిశ్రమ నడుం బిగించింది. సినిమా స్టార్లందరూ ఒకే వేదికపైకి వచ్చి, 12 గంటల పాటు నిర్విరామంగా సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరిశ్రమలోని వివిధ శాఖల ప్రతినిధులు ఈ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ -‘‘గత నెల 12న జరిగిన ప్రకృతి వైపరీత్యం అందరికీ తెలిసిందే. హుదూద్ తుపాన్ ధాటికి ఉత్తరాంధ్ర తీవ్రంగా దెబ్బతిన్నది. ఇలాంటి విపత్తు పరిణమించిన ప్రతిసారీ... బాధితుల్ని ఆదుకోవడానికి ‘మేము సైతం’ అంటూ సినీ పరిశ్రమ ముందుకొస్తూనే ఉంది. ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా ఈ నెల 30న హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’’ అని తెలిపారు. ‘‘ఈ నెల 30ని సినీపరిశ్రమకు సెలవు దినంగా, వచ్చే నెల రెండో ఆదివారం పనిదినంగా ప్రకటించాం. మంచి దృక్పథంతో 12 గంటల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమం.. అంద రికీ కావల్సినంత వినోదాన్ని పంచుతుంది’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ -‘‘ఈ కార్యక్రమానికి పరిశ్రమ వారు మాత్రమే ఆహ్వానితులు. బయటవారికీ టికెట్లు అమ్ముతాం. అయితే, టికెట్ కొన్నంత మాత్రాన లోపలికి అనుమతించం. లక్కీ డీప్ ద్వారా కొందరిని ఎంపిక చేసి, వారినే అనుమతిస్తాం. టికెట్ ధర రూ. 500. పరిశ్రమనే కమిటీగా భావించి సమష్టిగా చేస్తున్న కార్యక్రమం ఇది. ‘మేము సైతం డాట్ కామ్’ ద్వారా కార్యక్రమ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బు సేకరించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తాం. సినీ పరిశ్రమకు చెందిన స్టార్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అన్నారు. ఇంకా ఏపీ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్, నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎ.శ్యామ్‌ప్రసాదరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, జెమినీ కిరణ్, మధుర శ్రీధర్, కెవీరావు తదితరులు మాట్లాడారు. -
రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్
పాడైపోతున్న రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని సందర్శించాల్సింగా రైల్వే మంత్రి సదానంద గౌడను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆహ్వానించారు. హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వీటి పునరుద్ధరణకు వెంటనే పనులు చేపట్టాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అలాగే విద్యుత్ శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయంలోనూ సాయం చేయాలని తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరానని మురళీ మోహన్ వెల్లడించారు. -
'శ్రీను, ప్రకాశ్‌రాజ్ వివాదం సమసిపోతుంది'
-
'శ్రీను, ప్రకాశ్‌రాజ్ వివాదం సమసిపోతుంది'
రాజమండ్రి: నటుడు ప్రకాశ్‌రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య వివాదం త్వరలో సమసిపోతుందని మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి విషయాలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని, మీడియాకెక్కడం మంచిదికాదన్న అభిప్రాయాన్ని మురళీమోహన్ వ్యక్తం చేశారు. 'ఆగడు' సినిమా నుంచి ప్రకాశ్‌రాజ్ ను తొలగించడంతో వివాదం చెలరేగింది. శ్రీను వైట్ల అహంకారి అని ప్రకాశ్ రాజ్ ఘాటుగా విమర్శించారు. తన మాటలను సిగ్గులేకుండా ఆగడు సినిమాలో వాడుకున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశ్‌రాజ్ కే సిగ్గులేదని శ్రీనువైట్ల ఎదురుదాడి చేశారు. -
రైల్వే అభివృద్ధికి నిధులు తెస్తా
రాజమండ్రి సిటీ : గోదావరి పుష్కరాలు సక్రమంగా నిర్వహించేందుకు.. రైల్వే ప్రయాణికులకు అన్నివిధాల సౌకర్యాలు క ల్పించేందుకు అవసరమైన సప్లమెంటరీ నిధులు తీసుకొస్తానని.. అందుకు రైల్వే మంత్రి సదానందగౌడ్‌తో సమావేశమై చర్చిస్తానని రాజమండ్రి ఎంపీ మురళీమొహన్ అన్నారు. రాజమండ్రి రైల్వేస్టేషన్లో గాంధీ జయంతిని పురష్కరించుకుని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్లాట్ ఫాం శుభ్రం చేశారు. రోడ్‌కం రైల్వే వంతెన శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి నిధులు సమకూర్చుతాని చెప్పారు. పుష్కరాల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖాళీ ప్రదేశాలలో షెల్టర్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత విద్యార్థులు, ఉద్యోగులతో కలసి రైల్వేస్టేషన్లో ర్యాలీ నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎస్కే గుప్తా ఉద్యోగులతో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. రాజమండ్రి సిటీఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, స్టేషన్‌మేనేజర్ బీఎస్ఆర్శాస్త్రి పాల్గొన్నారు. మధురపూడి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ప్రవేశపెట్టిన క్లీన్అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రస్తుతం దేశమంతటా ప్రధాని నరేంద్రమోడీ అమలుచేస్తున్న స్వచ్ఛభారత్ ఒక్కటేనని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇక్కడకు విచ్చేసిన ఆయన ఎయిర్‌పోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛ భారత్ విజయం సాధిస్తుందన్నారు. కాలికి దెబ్బతగిలినా ఢిల్లీకి వెళ్లి కార్యకలాపాలు నిర్వహించానని.. తాను అందుబాటులో లేనని కొన్ని ఛానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం దురదృష్టకరమన్నారు. -
అక్కినేని పేరుతో అవార్డులివ్వాలి
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకుఎంపీ మురళీమోహన్ విజ్ఞప్తి సాక్షి, సిటీబ్యూరో: దివంగత మహానటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిటఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వాలని ఎంపీ, నటుడు మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో యువ కళావాహిని ఆధ్వర్యంలో ఎస్. కొండలరావు సారథ్యంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ నేతృత్వంలో నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. మహానటుడు అక్కినేని 91వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల ప్రారంభోత్సవంలో మురళీ మోహన్ మాట్లాడుతూ ఈ విషయమై సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు ఆలోచించాలని కోరారు. తెలుగు జాతి ఉన్నంత వరకు మహానటులు అక్కినేని, ఎన్టీఆర్‌లు గుర్తుండి పోతారని అన్నారు. నాటక రచయిత డీఎస్ దీక్షిత్‌లు మాట్లాడుతూ ఏటా నిర్వహించే ఈ నాటిక పోటీల ప్రారంభ, ముగింపు సభలకు వారి వారసులు నాగసుశీల, నాగార్జునలు తప్పక హాజరు కావాలని కోరారు. అంతకుముందు అక్కినేని చిత్రపటానికి ఎంపీ మురళీమోహన్ పూలమాల వేశారు. ఏఎన్ఆర్ నాటక కళాపరిషత్‌ను అక్కినేని కుమార్తె నాగసుశీల ప్రారంభించారు. అనంతరం కళాకారులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ (ఆకాశవాణి), జి.ఎల్.ఎన్.మూర్తి(థియేటర్ క్రిటిక్), జర్నలిస్టులు మహమ్మద్ రఫీ, పి.అబ్బులు, వి.రాజశేఖర్(దూరదర్శన్), డి.సురేష్ కుమార్, రాధాప్రశాంతి (సినీ నటి), ఎన్.రవికుమార్ తదితరులకు డాక్టర్ అక్కినేని నాటక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి.కృష్ణకుమారి, సినీ నటి గీతాంజలి, నటులు ఎల్.బి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుర్బానీ, నచ్చావోయ్ నారాయణ అనే నాటికలను ప్రదర్శించారు. -
విజిలెన్స్ మోనటరింగ్ కమిటీ చైర్మన్‌గా మురళీమోహన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీకి చైర్మన్, కో-చైర్మన్లను నియమిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ నియమితులయ్యారు. కో-చైర్మన్లుగా కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, కో-చైర్‌పర్సన్‌గా అరకు ఎంపీ కొత్తపల్లి గీతను నియమించారు. -
బాబు మ్యాజిక్ చేయడు.. అంతా కష్టపడాలి: మురళీమోహన్
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబు మాయ చేస్తాడు.. మ్యాజిక్ చేస్తాడు.. అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి కష్టపడాలి’ అని రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడ ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని కావడం ఆంధ్రుల అదృష్టమని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలించడం అంత సులువేమీ కాదని మురళీ మోహన్ ఉద్ఘాటించారు. -
'చంద్రబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడనుకోవద్దు'
హైదరాబాద్: వాణిజ్య రాజధాని అయిన విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం మంచి నిర్ణయమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు. చంద్రబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడని అనుకోకుండా అందరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్, రాజమండ్రికో తరలిపోవడం అనేది సులభం కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మాదిరిగా వైజాగ్‌లో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఫిలించాంబర్ లో బాపు సంతాప సభ
-
లండన్ లో ఏం జరిగిందంటే..!?
‘‘తెలుగు సినీ కళాకారులకు మరింత ఉపాధి దొరకాలంటే... చిన్న సినిమాలు విజయం సాధించాలి. తెలుగు సినిమా కళకళలాడేది అప్పుడే’’ అని మురళీమోహన్ అన్నారు. పృధ్వీరాజ్, ప్రతాప్‌పోతన్, ఆండ్రియా, నందిత ప్రధాన పాత్రధారులుగా అనిల్ సి.మీనన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘లండన్ బ్రిడ్జ్’. ఈ చిత్రం ‘లవ్ ఇన్ లండన్’గా తెలుగులో విడుదల కానుంది. సుంకేశుల రాజాబాబు నిర్మాత. రాహుల్‌రాజ్, శ్రీవల్సన్ జె. మీనన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో మురళీమోహన్ ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం లండన్వెళ్లిన ఓ యువకుడికి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమా కథ. మానవసంబంధాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘ప్రేమకథాచిత్రమ్’ తర్వాత తనకు లభించిన మరో విజయమిదని, మలయాళంలో కూడా విజయాన్ని దక్కించుకోవడం ఆనందంగా ఉందని నందిత అన్నారు. -
లవ్ ఇన్ లండన్ మూవీ ఆడయో ఆవిష్కరణ
-
మురళీ మోహన్ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ.
న్యూఢిల్లీ: మహిళల వస్త్రధారణ హుందాగా ఉండాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ గురువారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం రాజ్యసభ దద్దరిల్లింది. పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుడు విప్లోవ్ థాకూర్ మురళీమోహన్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేడీ సభ్యులు ఒడిశాలో వరదల అంశాన్ని ప్రస్తావించడం... గందరగోళం నడుమ సభ 15 నిమిషాలు వాయిదా పడింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సాధ్వి సావిత్రి భాయ్ పూలే లోక్‌సభలో చర్చ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటింగ్ సరళి బయటకు తెలియకుండా ఉండేందుకు టోటలైజర్ అనే కొత్త ఓట్ల లెక్కింపు మెషిన్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో శుక్రవారం వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై తామింకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 24 తర్వాతే అఖిలపక్ష భేటీ: కేంద్రం సివిల్ సర్వీసెస్ పరీక్షా వివాదంపై అఖిలపక్ష భేటీ ఈ నెల 24న తర్వాతే ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ఈ నెల 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని వెంకయ్య చెప్పారు. -
మురళీ మోహనుడికే.......!
సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ మీద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడితో పాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించినట్లున్నాయి. టీటీడీ ఛైర్మన్ పదవికి మురళీమోహన్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక టీటీడీ ఛైర్మన్ పదవి రేసులోకి వెళ్లిన మురళీ మోహన్... ఈ పదవి కోసం పట్టువదలని విక్రమార్కులు చాలామందే ఉన్నా, వాళ్లందరినీ పక్కకు తోసి ముందు వరుసలో నిలిచారట. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్రంలోని అని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా మురళీ మోహన్ నియామకంపై మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇటీవల 75వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన మనసులోని మాటను బయటకు వెల్లడించారు. ఇందు కోసం మురళీమోహన్ ...బాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇక పాలక మండళ్లు రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయటమే ఆలస్యం ఆశావహులు పైరవీలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ రాతపూర్వకంగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఎప్పటి నుంచో చెబుతున్నారు. స్థానికుడైన తనకే పదవి ఖాయమని ఇప్పటివరకూ ధీమాలో ఉన్నారు. దాంతో మురళీమోహన్, చదలవాడ మధ్యే గట్టి పోటీ నెలకొంది. కాగా ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ కోసం పనిచేసిన తనకే ఆ పదవి దక్కుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు భంగపడి.... టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానంటేనే టీడీపీలో చేరానని.. జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఎదురుచూసిన రాయపాటి సాంబశివరావుకు మరోసారి ఆశాభంగం తప్పేలా లేదు. ఇక టీటీడీ పాలక మండలి అధ్యక్ష పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులు చేజిక్కించుకుంటారా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరో రెండు రోజులు వేచి చూస్తే కానీ.. వెంకన్న, బాబుల కరుణ ఎవరికి దక్కిందో కచ్చితంగా తేలదు. -
మురళీమోహన్ వ్యాఖ్యల పై దుమారం
-
మాట్లాడడానికి వేరే అంశం దొరకలేదా
-
మురళీమోహన్ క్షమాపణ
-
మహిళలపై మురళీమోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మురళీమోహన్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో రెండువేల ఎకరాల్లో ఫిలిం సిటీ అభివృద్ధి చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ మురళీమోహన్ స్వాగతించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ చూపుతున్న చొరవ హర్షణీయం అని అన్నారు. గురువారం జరిగిన సమావేశంలో రెండువేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని సీఎం తెలిపారు. -
విగ్గు కాదు...
నలుగురు సినిమావాళ్లు కలుసుకుంటే వారి మధ్య సినిమా మాటలు, షూటింగ్‌ల ముచ్చట్లే దొర్లుతాయి. ఇక పాతతరం నటులైతే అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. నిన్నటితరం సినీతారలు మురళీమోహన్, జయసుధ శనివారం మాదాపూర్ ‘లామార్స్ హెయిర్ సొల్యూషన్స’ ప్రారంభోత్సవంలో కలుసుకున్నప్పుడు వారి మధ్య ఇలాంటి సంభాషణే సాగింది. పాత సినిమాల్లో తాము విగ్గు ధరించిన సందర్భాలు, అవతలి వారికి అసలైన జుట్టో, విగ్గో తెలియక తికమక పడ్డ సరదా జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నారు. -
సీఎం గారు వచ్చారు.. వెళ్లారు!
-
'బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
-
నాడు శిక్ష తప్పినా.. నేడు కక్ష కాటేసింది
ప్రత్తిపాడు : వారిద్దరూ బంధువులు. అంతేకాదు.. 24 ఏళ్ల కిందట ఒక హత్య కేసులో నిందితులు కూడా. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు. చివరకు సుప్రీం కోర్టులో కేసు వీగిపోవడంతో బయటపడ్డారు. వారే మూడేళ్లుగా శత్రువులుగా మారారు. ఇంటి దారి విషయంపై వివాదం పగను రగిల్చింది.దాని ఫలితమే మంగళవారం గజ్జనపూడిలో చోటుచేసుకున్న దారుణ ఘటన. ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో బొబ్బిలి సత్యనారాయణ, అతడి ఇద్దరు కుమారులను గారా తాతాబ్బాయి వర్గీయులు పాశవికంగా చంపిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సత్యనారాయణ, తాతాబ్బాయిలు బంధువులే. వీరిద్దరు 1990లో ఒక హత్య కేసులో నిందితులు కాగా న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అయితే సుప్రీంకోర్టు కేసు కొట్టివేయడంతో కేసు నుంచి బయట పడ్డారు.ఇంటిదారి విషయంలో మూడేళ్లుగా జరగుతున్న గొడవ ఈ ఘాతుకానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాతబ్బాయితో పాటు 12 మంది పథకం ప్రకారం కత్తులతో దాడిచేసి సత్యనారాయణ, అతడి ఇద్దరు కొడుకులు లక్ష్మీనారాయణ, అర్జుబాబులను హత్య చేశారు. మృతదేహాలకు బుధవారం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శవపరీక్ష నిర్వహించారు. హతుడు లక్ష్మీనారాయణ భార్య గంగాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన రోదనలు పోస్టుమార్టం కోసం బుధవారం సత్యనారాయణ, అతని ఇద్దరు కొడుకుల మృతదేహాలను గజ్జనపూడి నుంచి ప్రత్తిపాడు సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. మృతుల బంధువులు, భార్యాపిల్లలు అక్కడకు చేరుకున్నారు. సత్యనారాయణకు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణకు భార్య గంగాభవాని, కుమార్తెలు శివదుర్గ, లోవలక్ష్మి (8వ తరగతి), కుమారుడు అయ్యప్పస్వామి (5వ తరగతి) ఉన్నారు. మూడో కుమారుడు అర్జుబాబుకు భార్య సత్యవతి, కుమార్తె సింధు (3), ఏడాది వయసున్న కనకారావు సంతానం. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాం పథకం ప్రకారం తన తండ్రి, సోదరులను హత్య చేశారని సత్యనారాయణ మిగిలిన ఇద్దరు కుమారులు వీరబాబు, త్రిమూర్తులు విలపించారు. కాలు దెబ్బతిన్న గేదెకు కట్టుకట్టే ప్రయత్నంలో ఉన్న తన తండ్రి, సోదరులను కత్తులతో నరికి హత్య చేశారని తెలిపారు. ఆ సమయంలో తాము సమీప పొలంలో గొర్రెలను మేపుతున్నామని, సంఘటన విషయం తెలిసిన వెంటనే తాము పారిపోయామన్నారు. ప్రత్తిపాడు సీహెచ్‌సీ వద్ద పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యుడు బుగతా బంగార్రాజు, రేచుకట్ల సింహాచలం, మానుకొండ లచ్చబాబు, టీడీపీ నాయకులు పర్వత సురేష్, పల్లా గోపి, కొమ్ముల కన్నబాబు, గజ్జనపూడి సర్పంచ్ శింగిడి వెంకటేష్, గొనగాల వెంకటరమణ తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. రెండు దశాబ్దాల కిందట.. రెండు దశాబ్దాల క్రితం అంటే 1990లో... ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో భూముల స్వాధీన ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆ సమయంలో బుగత బంగార్రాజు, పల్లా నూకరాజు తదితరులపై పోలీసులు టాడా కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు. ఈ కేసులకు కారకుడుగా భావించి, గారా తాతబ్బాయి (నిందితుడు), బొబ్బిలి సత్యనారాయణ (హతుడు) తదితరులు గజ్జనపూడిలో మొల్లి అప్పారావు అనే వ్యక్తిని కత్తులు, బళ్లేలతో దాడి చేసి, హత్య చేశారు. ఆ సమయంలో పౌరహక్కుల నేత దివంగత కె.బాలగోపాల్ గజ్జనపూడి సందర్శించారు. ఈ కేసులో సత్యనారాయణ, తాతబ్బాయిలకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని హైకోర్టు కూడా ఖరారు చేసింది.సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుని, కేసు నుంచి బయటపడ్డారు. వారిద్దరి తరఫున ఈ కేసును పౌర హక్కుల ఉద్యమ నేత కేజీ కన్నాభిరాన్ వాదించారు. ఈ కేసులో తాతబ్బాయి, సత్యనారాయణ నాలుగేళ్ల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. పోస్టుమార్టం పూర్తి ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామంలో హత్యకు గురైన ముగ్గురి మృతదేహాలకు బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్టుమార్టం పూర్తయ్యింది. గజ్జనపూడిలో మంగళవారం సాయంత్రం బొబ్బిలి సత్యనారాయణ, అతడి కొడుకులు లక్ష్మినారాయణ, అర్జుబాబులను గారా తాతబ్బాయి వర్గీయులు కత్తులతో దాడి చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోలీసులు బుధవారం ఉదయం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వాటికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం బంధువులకు అప్పగించారు. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు, ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు సూర్యనారాయణ, సుంకర మురళీమోహన్, ఎస్సై వై.రవికుమార్‌లు పోస్టుమార్టం పూర్తయ్యేవరకు సీహెచ్‌సీలోనే ఉన్నారు. పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్ సీహెచ్‌సీకి చేరుకుని, మృతుల కుటుంబీకులను పరామర్శించారు. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు ముఖ్యమంత్రులతో ప్రకటన ఇప్పిస్తాం
‘‘తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్‌కు తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. తెలుగు సినిమా హైదరాబాద్‌లోనే స్థిరంగా ఉంటుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌గారిని కూర్చోబెట్టి వారిద్దరి ద్వారా ఈ విషయంపై ఓ ప్రకటన ఇప్పించనున్నాం. వారిద్దరూ కలిసి ఓ ప్రకటన చేస్తే ఇక ఈ విషయంపై ఎలాంటి సందేహాలూ ఉండవు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ అన్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ -‘‘చెన్నయ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిరావడానికి 20 ఏళ్లు పట్టింది. మళ్లీ ఇక్కడ్నుంచీ వైజాగ్ అంటే... మాలాంటి వారికి తేలికే కానీ, పరిశ్రమలోని చిన్న చిన్న కార్మికులకు, జూనియర్ ఆర్టిస్టులకు అది కష్టతరమైన విషయం’’ అని చెప్పారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఈ విషయంపై కలిశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌తో పాటు నటుడు రఘుబాబు పుట్టిన రోజును కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. పరుచూరి గోపాలకృష్ణ, మహర్షి రాఘవ, కృష్ణుడు, ఉత్తేజ్, శశాంక్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇద్దరు ముఖ్యమంత్రులతో ప్రకటన ఇప్పిస్తాం
‘‘తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్‌కు తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. తెలుగు సినిమా హైదరాబాద్‌లోనే స్థిరంగా ఉంటుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌గారిని కూర్చోబెట్టి వారిద్దరి ద్వారా ఈ విషయంపై ఓ ప్రకటన ఇప్పించనున్నాం. వారిద్దరూ కలిసి ఓ ప్రకటన చేస్తే ఇక ఈ విషయంపై ఎలాంటి సందేహాలూ ఉండవు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ అన్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ -‘‘చెన్నయ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిరావడానికి 20 ఏళ్లు పట్టింది. మళ్లీ ఇక్కడ్నుంచీ వైజాగ్ అంటే... మాలాంటి వారికి తేలికే కానీ, పరిశ్రమలోని చిన్న చిన్న కార్మికులకు, జూనియర్ ఆర్టిస్టులకు అది కష్టతరమైన విషయం’’ అని చెప్పారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఈ విషయంపై కలిశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌తో పాటు నటుడు రఘుబాబు పుట్టిన రోజును కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. పరుచూరి గోపాలకృష్ణ, మహర్షి రాఘవ, కృష్ణుడు, ఉత్తేజ్, శశాంక్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఒకటి కాదు.. 33..!
వివేక్, సునీత మరసియార్ జంటగా రూపొందిన చిత్రం ‘33 ప్రేమకథలు’. మురళీమోహన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని శివగణేశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అజయ్ పట్నాయక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని మురళీమోహన్, ప్రచార చిత్రాలను చింతల రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. మురళీమోహన్ మాట్లాడుతూ -‘‘ఈ ‘33 ప్రేమకథల్లో’ నాదీ ఓ కథ. అదెలా ఉంటుందో మీరు తెరపైనే చూడాలి. దర్శకుడు ఉత్సాహవంతుడు. ఏదో చేయాలనే తపన అతనిలో ఉంది. పెద్ద బడ్జెట్లో తీసిన చిన్న సినిమా ఇది’’ అన్నారు. ఇందులోని 8 పాటలనీ పదిమంది సంగీత దర్శకులు పాడారని, ఈ ఫీట్ దర్శకుని వల్లే కుదిరిందని సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ చెప్పారు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు నూకారపు సూర్యప్రకాశరెడ్డి, పూర్ణిమ, కృష్ణుడు, శివపార్వతి తదితరులు మాట్లాడారు. -
సినిమా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు
‘‘సినిమా పరిశ్రమ ఇక్కడి నుంచి వెళ్లిపోతుందా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. సినిమా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు. అయినా ఎందుకు వెళ్లాలి? మేము సినిమాలు తీసేది తెలుగు వారి కోసమే కదా!’’ అని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘33 ప్రేమకథలు’ ఆడియో వేడుకలో మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పరిశ్రమకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి 15 ఏళ్లు పట్టింది. ఇప్పటికీ డాన్స్, మ్యూజిక్ విభాగాలకు సంబంధించి చెన్నై, ముంబైల పైనే ఆధారపడుతున్నాం. తెలంగాణ వాళ్లు కూడా ఇక్కడి నుండి పరిశ్రమ వెళ్లాలని కోరుకోవడం లేదు’’ అని మురళీమోహన్ చెప్పారు. అయితే భవిష్యత్తులో రాజమండ్రి, వైజాగ్ల్లో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. - ‘మా’ అధ్యక్షులు మురళీమోహన్ -
కేసీఆర్‌ను కలిసేందుకు సినీ ప్రముఖుల క్యూ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిసేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు క్యూ కడుతున్నారు. తాజాగా ఆయనను టీడీపీ మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు కల్యాణ్ రామ్, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గురువారం కలిశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సినీనటుడు మోహన్ బాబు నిన్న కేసీఆర్‌ను కలిశారు. ప్రత్యేక తెలంగాణను సాధించినందుకు కేసీఆర్ మోహన్ బాబు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే మురళీ మోహన్, ఆర్ నారాయణ మూర్తి, రామానాయుడు, సురేష్ బాబు, అలీ, వేణుమాధవ్, అశోక్ కుమార్, శివకృష్ణ, కేఎస్ రామారావు తదితరులు ఉన్నారు. -
రాజమండ్రి ఎంపీగా మురళీమోహన్
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాగంటి మురళీమోహన్ గెలుపొందారు. శుక్రవారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఆవరణలో జిల్లా పరిధిలోని రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి నియోజకవర్గాల కౌంటింగ్ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు సెగ్మెంట్ల లెక్కింపును ఆ జిల్లా కేంద్రమైన ఏలూరులో చేపట్టారు. అన్ని సెగ్మెంట్లలో కూడా మురళీమోహన్‌కు మెజారిటీ లభించింది. మొత్తం నియోజకవర్గంలో 14,16,859 ఓట్లు ఉండగా, అందులో 11,50,445 పోలయ్యాయి. వీటిలో మురళీమోహన్‌కు 6,20,791 ఓట్లు పోలవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరికి 4,58,691 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,62,091 ఓట్ల మెజారిటీతో మురళీమోహన్ విజయం సాధించినట్టు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి గంధం చంద్రుడు ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం ఆరు గంటల్లోపు కౌంటింగ్ పూర్తవ్వగా, సాంకేతిక కారణాల వల్ల నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం కౌంటింగ్ రాత్రి తొమ్మిది దాటే వరకు కొనసాగింది. ఇక్కడ కౌంటింగ్ పూర్తయిన అనంతరం రాత్రి పది గంటల ప్రాంతంలో మురళీమోహన్ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. -
పోస్టాఫీసులో ఆన్లైన్ అకౌంట్లు
- పాస్ పుస్తకాలు అప్డేట్ చేసుకోండి - పోస్టల్ సూపరింటెండెంట్ మురళీమోహన్ విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: పోస్టాఫీసులో ఆన్లైన్ ద్వారా అకౌంట్లు నిర్వహించనున్నామని పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.మురళీమోహన్ తెలిపారు. బ్యాంకుల్లో లావాదేవీలు మాదిరిగా సేవింగ్స్ బ్యాంకు (ఎస్బీ) సేవలు విస్తృతం చేస్తామన్నారు. ప్రతి ఖాతాదారుడు ఎస్బీ అకౌంట్‌ను అప్డేట్ చేయాలని సూచిం చారు. విజయనగరం హెడ్ పోస్టాఫీసును పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌లోకి తీసుకున్నారన్నారు. త్వరలో ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొదటి దశలో ప్రధాన కార్యాలయంలో సేవింగ్స్ బ్యాంకు ఖాతాలను, వాటి సమాచారాన్ని కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకుని అకౌంట్లను ఆన్లైన్ చేయనున్నామన్నారు. ఈ ఖాతాలను బదిలీ చేసేందుకు ఈ నెల 16న చర్యలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. విజయనగరం హెడ్ పోస్టాఫీసులోని ఖాతాదారులంతా వారి పాస్ పుస్తకాలను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఎస్బీ, ఆర్డీ, టీడీ, ఎంఐఎస్, పీపీఎఫ్ ఖాతాలు అప్డేట్ చేసుకుంటే ఆన్లైన్ వ్యవస్థను త్వరితగతిన ప్రారంభించడానికి వీలువుతుందని మురళీమోహన్ తెలిపారు. తొలుత ప్రధాన కార్యాలయాలను ఆన్లైన్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభించి ఆ తర్వాత గ్రామాల్లో ఉన్న సబ్ పోస్టాఫీసులు, బ్రాంచి పోస్టాఫీసులకు కూడా దశలవారీగా కోర్ బ్యాంకింగ్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
మూడింటా.. మళ్లీ మునకేనా!
ఎంపీ స్థానాల్లో టీడీపీ ఎదురీత కష్టించిన వారిని విస్మరించిన అధినేత కాకినాడ, అమలాపురాల్లో వలసనేతలకే చాన్స్ సహాయ నిరాకరణ చేస్తున్న పార్టీ శ్రేణులు రాజమండ్రిలో మురళీమోహన్‌కు తప్పని ప్రతికూలత సాక్షి ప్రతినిధి, కాకినాడ : మారుతున్న సమీకరణలతో జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఏటికి ఎదురీదుతోంది. గత రెండు ఎన్నికల్లో ఆ స్థానాల్లో పార్టీ తరఫున చంద్రబాబు ఎవరిని బరిలోకి దింపినా ఓటమి తప్పలేదు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పునరావృతమవుతుందన్న నిఘావర్గాల నివేదికలతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కనపెట్టి, డబ్బు సంచులతో వలస వచ్చిన వారికి సీట్లు ఇచ్చిన టీడీపీ జిల్లాలో కొత్త కుంపటిని రాజేసుకుంది. అసెంబ్లీ అభ్యర్థుల్లో సమర్థులు లేకపోవడం, వారికి, ఎంపీ అభ్యర్థులకు మధ్య కొరవడిన సమన్వయం, చంద్రబాబు ఒంటెత్తు పోకడలతో విసుగెత్తిన పార్టీ శ్రేణుల సహాయ నిరాకరణ...ఈ పరిస్థితే దాదాపు మూడు పార్లమెంటు స్థానాల్లోనూ కనిపిస్తోంది. పార్టీ నేతలకే తెలియని ‘పండుల’ ఎస్సీలకు రిజర్వు చేసిన అమలాపురం ఎంపీ స్థానం నుంచి పార్టీ ముఖ్య నాయకులకు కనీసం ముఖపరిచయం కూడా లేని పండుల రవీంద్రబాబును బరిలోకి దింపడంతో పార్టీ శ్రేణుల్లో నిస్తేజం అలముకుంది. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని కోణాల్లో సమర్థుడైన మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్‌ను బరిలోకి దింపడంతోనే టీడీపీలో కలవరం మొదలైంది. విశ్వరూప్ తనకంటూ సొంత బలగాన్ని సిద్ధం చేసుకుని, ఇతర సామాజికవర్గాల మద్దతు కూడగట్టడంలో నిమగ్నమయ్యారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఏడాది క్రితమే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ప్రకటించారు. చివర్లో ఆయనను కాదని పండుల రవీంద్రబాబునుకు అభ్యర్థిత్వం కట్టబెట్టడంతో ఎదురైన అసంతృప్తిని చల్లార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడన్నది తప్ప రవీంద్రబాబుకు టిక్కెట్ ఇవ్వడానికి కారణమేముందని కేడర్ ఆవేదన చెందుతోంది. నియోజకవర్గానికి కొత్త కావడం, నాయకులు, అక్కడి ప్రజలతో పెద్దగా పరిచయాలు కూడా లేకపోవడంతో రవీంద్రబాబు ప్రచారంలో వెనుకబడ్డారనే చెప్పాలి. గొల్లపల్లి నుంచి ఎదురైన అసంతృప్తి జ్వాలలను చక్కదిద్దుకునేందుకే సమయాన్నంతటినీ వెచ్చించాల్సి వచ్చిందని, ఈలోపు పుణ్యకాలం కాస్తా గడిచి పోతోందని రవీంద్రబాబు వర్గీయులు అంటున్నారు. నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి, రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల అభ్యర్థులు పోటీ ఇవ్వగలిగే స్థితిలో లేకపోవటం, ప్రచారంలో వెనుకబాటు, నాయకులను సమన్వయం చేసుకోలేని రాజకీయ అనుభవరాహిత్యం వంటి ప్రతికూలతలతో రవీంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటున్నారు. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యాకులైన ఎస్సీ సామాజికవర్గం మొదటి నుంచీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ వైపే మొగ్గుతున్నారు. డబ్బు ఒక్కటే ప్రామాణికంగా పరిగణిస్తున్న అధినేత తీరును పార్టీ శ్రేణులు గర్హిస్తున్నాయి. కాగా జై సమైక్యాంధ్ర నుంచి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ జీవీ హర్షకుమార్ పోటీ నామమాత్రమేనంటున్నారు. ‘తోట’కు కలిసిరాని కేడర్ దాదాపు ఇదే పరిస్థితి కాకినాడ ఎంపీ నియోజకవర్గంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ అవకాశాన్ని ఆశించి, ముందు నుంచీ పార్టీ కోసం పని చేసిన పోతుల విశ్వంను కాదని, మాజీ మంత్రి తోట నరసింహంకు టిక్కెట్టు ఇవ్వడం పార్టీ శ్రేణులకు జీర్ణం కావడం లేదు. విభజనకు కారణమైన కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయంగా అడ్రస్ ఉండదన్న ముందుచూపుతో తోట కాంగ్రెస్‌ను వీడి టీడీపీ పంచన చేరారు. తుది శ్వాస వరకు కాంగ్రెస్‌ను వీడేది లేదన్న నరసింహం రాత్రికిరాత్రే ఫిరాయించేసి ‘సైకిల్’ ఎక్కేసినా ద్వితీయశ్రేణి నేతలు, కేడర్ మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. జగ్గంపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యతిరేకతే మూటగట్టుకున్న తోట ఎంపీ అభ్యర్థిగా ఎలా నెగ్గుకురాగలరని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న’ చందంగా.. కాపు సామాజికవర్గానికి వైఎస్సార్ సీపీ 8 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిందనే ఉద్దేశంతో పిఠాపురం, పెద్దాపురంలలో చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చేసి కాపు సామాజికవర్గానికి కట్టబెట్టడం ద్వారా ఆ ఫార్ములాను ఫాలో అయ్యామన్న టీడీపీ చివరకు చేతులు కాల్చుకుంది. మంత్రిగా ఎదురైన వ్యతిరేకత తోటపై పడి పార్టీని దెబ్బ తీస్తోందని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రమంత్రి పళ్లంరాజుకు పీఆర్పీ నుంచి గట్టి పోటీ ఇచ్చిన చలమలశెట్టి సునీల్ ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. పార్టీకి వివిధ వర్గాల్లో ఉన్న ఆదరణ, గత ఓటమి అనంతరం నాయకులు, కేడర్‌తో మమేకమై ఉండటంతో సునీల్‌కు గెలుపు ధీమానిస్తున్నాయి. -
పరిశీలన ముగిసింది
సాక్షి, రాజమండ్రి :సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజమండ్రి ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ సమర్పించిన అఫిడవిట్లో లోపాలున్నాయని, ఆయన భార్య ఆస్తుల వివరాలను తప్పుగా పేర్కొన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు వెంకట రమణచౌదరి ప్రతిపాదితుడు పెనుమర్తి సాయిప్రసాద్ చౌదరి రిటర్నింగ్ అధికారి గంధం చంద్రుడుకు ఫిర్యాదు చేశారు. సుమారు మూడున్నర గంటల విచారణ అనంతరం మురళీమోహన్ నామినేషన్‌ను ఆర్ఓ అంగీకరించారు. ఈ నిర్ణయం వివాదాస్పదం కాగా మిగిలిన ప్రాంతాల్లో పరిశీలన ప్రశాంతంగా ముగిసింది. రాజమండ్రి ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్‌కు డమ్మీగా నామినేషన్ వేసిన ఆయన కుమారుడు రామ్మోహన్రావు నామినేషన్ పత్రాల్లో లోపాలుండడంతో ఆర్వో తిరస్కరించారు. అమలాపురం ఎంపీ సీటుకు బీజేపీ అభ్యర్థిగా పెయ్యిల శ్యామ్‌ప్రసాద్ సమర్పించిన పత్రాల్లో ఏ, బీ ఫారాలు లేనందున, అదే పార్టీ మరో అభ్యర్థి గుర్రాల వీరరాఘవులు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకపోవడంతో పాటు సరైన వివరాలు సమర్పించనందున, స్వతంత్ర అభ్యర్థి రేవు సుధాకర్ సమర్పించిన పత్రాల్లో పది మంది ప్రతిపాదితుల సంతకాలు లేనందున వారి నామినేషన్లను తోసిపుచ్చారు. కాకినాడ ఎంపీ సీటుకు టీడీపీ డమ్మీ అభ్యర్థి తోట సరస్వతి, ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటరమణల నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇలా.... రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి బీజేపీ, బీఎస్పీ డమ్మీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కర ణకు గురయ్యాయి. కాకినాడ రూరల్‌లో ఇద్దరు టీడీపీ డమ్మీ అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థితో పాటు క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అభ్యర్థి నామినేషన్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. కాకినాడ సిటీలో ఆర్జేడీ, క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ, మరో ముగ్గురు ఇండిపెండెంట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అమలాపురం అసెంబ్లీకి జై సమైక్యాంధ్ర అభ్యర్థికి డమ్మీగా నామినేషన్ వేసిన నెల్లి రమేష్, బీజేపీ అభ్యర్థి పెయ్యిల శ్యామ్ప్రసాద్ల నామినేషన్లను తిరస్కరించారు. ప్రత్తిపాడులో ఇండిపెండెంట్, టీడీపీ డమ్మీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. పెద్దాపురంలో టీడీపీ రెబల్స్ ఐదుగురి నామినేషన్లు, సరైన సమాచారం పొందుపర చని కారణంగా మరో ఇద్దరు ఇండిపెండెంట్ల నామినేషన్లను తిరస్కరించారు. పి.గన్నవరంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ డమ్మీ అభ్యర్థుల ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ రెబల్స్‌గా బరిలోకి దిగిన ఆర్.సుబ్బరాజు, గంగుమళ్ల సత్యనారాయణ, అనుసూరి పద్మలత, గంగుమళ్ల నాగేశ్వరరావుల నామినేషన్లను సరైన ధృవపత్రాలు లేకపోవడంతో నిరాకరించారు. బీజేపీ తరఫున అద్దేపల్లి శ్రీధర్ లక్ష్మణ్ వేసిన నామినేషన్‌ను అవసరమైన సమాచారం లేని కారణంగా తోసిపుచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి కె.కాశిబాబు నామినేషన్‌తో పాటు టీడీపీ, కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థుల నామినేషన్లు అనర్హతకు గురయ్యాయి. రాజోలులో ఇండిపెండెంట్లు, డమ్మీలు కలిపి మొత్తం పది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మండపేటలో ముగ్గురు ఇండిపెండెంట్ల నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. రాజానగరంలో టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్‌కు డమ్మీగా ఆయన భార్య అన్నపూర్ణ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. జగ్గంపేటలో కాంగ్రెస్, టీడీపీ డమ్మీ అభ్యర్థులు తోట వీరవెంకటాచలం, జ్యోతుల నాగసూర్యవేణిల నామినేషన్లను తిరస్కరించారు. రంపచోడవరంలో టీడీపీ, కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర డమ్మీ అభ్యర్థులు, ఒక ఇండిపెండెంట్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత ఉదయ భాస్కర్ నామినేషన్‌ను కూడా తిరస్కరించారు. అనపర్తిలో టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించి నామినేషన్ వేసిన పడాల సునీత, టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్టారెడ్డికి డమ్మీగా వేసిన మూలారెడ్డి, బీజేపీ అభ్యర్థి హరినారాయణరెడ్డిల నామినేషన్లు తిరస్కర ణకు గురయ్యాయి. కాగా తుని, పిఠాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో అన్ని నామినేషన్లూ సక్రమంగా ఉన్నాయి. -
‘తూర్పు’న తారల తళుకులు
ఎన్నికల రణరంగంలో సినీ తారల తళుకులు తూర్పు గోదావరి జిల్లా రాజకీయ చరి త్రకు ఓ ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి, విజయాన్ని సొంతం చేసుకున్న తారలు ఉన్నారు. గోదావరి వాసులు కళాకారులను ఆదరిస్తారనడానికి ఆ విజయాలే తార్కాణం. కాగా ఇక్కడి నుంచి బరిలో నిలిచి అదష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశ పడ్డ వారిలో నిరాశే మిగిలిన వారూ ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని వివిధ నియోజక వర్గాల నుంచి బరిలో ఉండి గెలిచిన వారు, ఓడిన వారు, అదష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వారి వివరాలు జమున సినీ తారల తళుకు బెళుకులతో సీట్లు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ 1989 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ప్రముఖ నటి జూలూరి జమునను బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జమున 1989 నుంచి 1991 వరకూ ఎంపీగా కొనసాగారు. 1991లో పోటీచేసి ఓడిపోయారు. కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణంరాజు బీజేపీ నుంచి 1998లో కాకినాడ ఎంపీగా గెలిచి, విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా కొనసాగారు. 1999లో ఓడిపోయారు. 2004లో నర్సాపురం నుంచి ఎంపీగా నెగ్గారు. 2009లో పీఆర్పీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ పడి ఓడిపోయారు. మురళీమోహన్ రాజమండ్రి లోక్‌సభ స్థానానికి మురళీమోహన్ స్థానికుడు కాకపోయినా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సినీ గ్లామర్‌తో ఎదుర్కోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను అభ్యర్థిగా నిలుపగా ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. జయప్రద పై నటులందరూ స్థానికేతరులుగా ఉండి ఈ ప్రాంతంలో బరిలో నిలిచారు. కానీ రాజమండ్రి ఆడపడుచు జయప్రద మరో రాష్ట్రంలో ఎన్నికల గోదాలో దిగి విజయాలు సాధించారు. 1962లో రాజమండ్రిలో పుట్టిన జయప్రద చిన్ననాడే నగరం వదిలి వెళ్లి పోయారు. 1994లో టీడీపీలో చేరిన జయప్రద ఎన్టీఆర్ మరణానంతరం పార్టీని వీడారు. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అక్కడ వ్యక్తిగత, రాజకీయపరమైన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పలు విమర్శలు ముప్పిరిగొన్నా తట్టుకుని నిలబడ్డారు. బాబూమోహన్ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత పార్టీలో చేరి మెదక్ జిల్లా ఆంధోల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ ఎన్టీఆర్ మరణానంతరం లక్ష్మీ పార్వతి నాయకత్వంలోని ఎన్టీఆర్ టీడీపీలో చేరారు. 1996 ఎన్నికల్లో అమలాపురం ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చీల్చి, ఆ పార్టీ అభ్యర్థి బాలయోగి పరాజయానికి కారకులయ్యారని ప్రచారం సాగింది. బాబూమోహన్ 1.43 లక్షల ఓట్లు పొంది మూడోస్థానంలో నిలిచారు. 1998లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ పోటీ చేసిన బాబూ మోహన్ అప్పుడూ ఓటమినే చవి చూశారు. హేమ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె పొలిటికల్ పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. తన సొంత జిల్లా తూర్పుగోదావరి నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హేమ పోటీ చేస్తున్నారు. -
సినీ నటుడు మురళీమోహన్ అరెస్ట్
ఏలూరు: సినీ నటుడు, టీడీపీ నాయకుడు మురళీమోహన్ను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 29న ద్వారకాతిరుమలలో అనుమతిలేకుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించినందుకు ఆయనను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. మురళీమోహన్తోపాటు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీరమణిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిని భీమడోలు కోర్టులో హాజరుపరిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
గోరంట్లకు అలీ కితకితలు
రాజమండ్రి : ఎన్నికలు దగ్గర పడుతున్నా తెలుగుదేశంలో నేతలకు టిక్కెట్ ఫీవర్ వీడడంలేదు. నిన్నటి వరకూ సుంకవల్లి సూర్య, నేడు సినీనటుడు అలీ.. ఇలా రోజుకో పేరు తెరపైకి వస్తుండడంతో తెలుగు తమ్ముళ్లకు బీపీ పెరిగిపోతోంది. ఈ ప్రచారాలు రాజమండ్రి టిక్కెట్‌ను తన హక్కుగా భావించే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఏదిఏమైనా నేనే ఇక్కడ నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఆయన స్వీయ సంతృప్తిని పొందుతున్నారు. అలీ ఫీవర్ రెండు రోజులుగా రాజమండ్రి టీడీపీ నేతలకు అలీ ఫీవర్ పట్టుకుంది. ఆదివారం రాజమండ్రిలో పర్యటించిన ప్రముఖ హాస్యనటుడు అలీ తాను రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని మరోసారి ప్రకటించడంతో నేతల్లో కలవరం మరింత పెరిగింది. అలీకి అధిష్టానం హమీ ఇచ్చిందనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఈ పరిణామాలు టీడీపీ శ్రేణుల ను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఖండించని మురళీ మోహన్ రాజమండ్రి టీడీపీ పార్లమెంటు అభ్యర్థి మురళీమోహన్ ఆదివారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అలీ వ్యవహారంపై కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు మురళీమోహన్ ఎక్కడా లేదని చెప్పలేదు. అలీ గురించి అధిష్టానం చూసుకుంటుందని ఆయన మాట దాటేయడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. స్థానికుడైన అలీకి మైనారిటీల పూర్తి మద్దతు ఉందని భావిస్తున్నారు. దీంతో కొందరు నేతలే అలీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్టు తెలుస్తోంది. కాదు..కాదు నేనే.. కానీ గోరంట్ల మాత్రం రాజమండ్రి అభ్యర్థిని నేనే అని పైకి చెప్పుకుంటున్నారు. కార్యకర్తల సమావేశంలోనూ ఇదే మాట చెప్పారు. సిటీ టికెట్ తనదేనన్న ధీమాతో పార్టీ తరఫున కార్పొరేషన్ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అలీ వ్యవహారం గోరంట్లకు మింగుడు పడడంలేదు. పార్టీలో గోరంట్ల నియంతృత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న కొందరు ముఖ్యులు కూడా అలీ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మురళీమోహన్ కూడా లేదు కాదు అనకుండా అధిష్టానంపై నెట్టే ప్రయత్నం చేశారంటున్నాయి పార్టీ వర్గాలు. అలీ కూడా సినీ వర్గం కావడంతో మురళీమోహన్‌కు కొంత సానుకూలత ఉంటుందని చెబుతున్నారు. ఇంకా రాజమండ్రి రూరల్ టికెట్‌పై ఇంకా క్లారిటీ లేని తరుణంలో అభ్యర్థుల మార్పులు ఉండవచ్చనే అభిప్రాయాన్ని పలువురు నేతలు సైతం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలీ మేటర్ తేలిగ్గా లీసుకోవాల్సింది కాదని పరిశీలకులు అంటున్నారు. -
పవన్‌ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం: మురళీమోహన్
పవన్ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు, సినీనటుడు మురళీ మోహన్ చెప్పారు. పదవుల కోసం కాకుండా, దేశానికి సేవ చేయాలనే మంచి భావం ఉన్న వ్యక్తి పవన్ అని ఆయన అన్నారు. అందుకే అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి రావాలని తెలిపారు. కిరణ్ పార్టీ దింపుడు కల్లం లాంటిదని, కాంగ్రెస్ వెంటిలేటర్ మీద ఉందని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు చేసిన ప్రసంగంలో పవన్ కూడా చంద్రబాబు గురించి గానీ, తెలుగుదేశం పార్టీ గురించి గానీ ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో ఇప్పుడు పవన్ గ్లామర్‌ను ఉపయోగించుకోడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే సినీ పరిశ్రమకు చెందిన మురళీమోహన్‌తో మాట్లాడించినట్లు భావిస్తున్నారు. -
‘సిటీ’ల్లో సవాల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. సీట్ల కోసం వారంతా ‘బస్తీ మే సవాల్’ అంటున్నారు. ప్రధానంగా జిల్లాలో రాజమండ్రి, కాకినాడ నగరాల పరిధిలోని రెండు నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలకు పొగపెట్టేందుకు వైరివర్గం ప్రయత్నిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గాల్లో అన్నీ తామే అన్నట్టు వ్యవహరిస్తున్న ఆ ఇన్చార్జిలకు ఎన్నికల్లో టిక్కెట్లు రాకుండా చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. జిల్లా కేంద్రంగా కాకినాడ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పరిసర ప్రాంతాలతో కూడినది కాకినాడ సిటీ నియోజకవర్గం. ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గం రాజకీయాలలో చైతన్యవంతమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీలో టిక్కెట్ల కుంపటి రాజుకుంది. కాకినాడ సిటీ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు టిక్కెట్టు ఖాయమైందనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. సీటు తనదేనని ధీమాతో ఉన్న కొండబాబుకు సొంత సామాజికవర్గం నుంచే ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. మత్స్యకార సామాజికవర్గం తన వెంట ఉంటుందనే భరోసాతో ఉన్న కొండబాబుకు పోటీగా కాంగ్రెస్ అదే సామాజికవర్గం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుంటోంది. గత ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన బందన హరి పేరు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ హరిని బరిలోకి దింపితే కొండబాబు టిక్కెట్టుకు జెల్లకొట్టినట్టేనంటున్నారు. గత ఎన్నికల్లో హరి కారణంగానే టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. తాజా రాజకీయ పరిణామాలను బేరీజు వేస్తున్న టీడీపీ అధిష్టానం కొండబాబును పక్కన పెట్టవచ్చనే అనుమానాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొండబాబుతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, పోతుల విశ్వం వర్గీయులు పైకి చెబుతున్నా.. అంతర్గతంగా టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీంతో కొండబాబు వర్గం ముత్తా, పోతుల వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంధువు ద్వారా బాబుపై ముత్తా ఒత్తిడి! జిల్లాలో సీనియర్ మంత్రిగా, ఎమ్మెల్యేగా విశేషమైన అనుభవం కలిగిన ముత్తా పదేళ్లుగా రాజకీయాలకు దూరమైపోయారు. వెంట ఉండే వర్గం కూడా తలో గూటికి చెల్లాచెదురైపోయారు. ఈ పరిస్థితుల్లో ముత్తా పట్ల టీడీపీ అధినేత చంద్రబాబుకు సానుకూలత లేకపోయినాసమీప బంధువైన బడా పారిశ్రామికవేత్త ద్వారా ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం పార్టీలో జోరందుకుంది. మరోపక్క కాంగ్రెస్ నుంచి బందనను బరిలోకి దింపితే సామాజిక సమీకరణల్లో విశ్వంకు టిక్కెట్టు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొండబాబు వెంట ఉండే ముఖ్యనేతల్లో దాదాపు అందరూ వైఎస్సార్ సీపీ సిటీ కోఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెంట నిలిచారు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తున్న పార్టీ జిల్లా ముఖ్యనేతలు కూడా కొండబాబు అభ్యర్థిత్వంపై పునరాలోచన చేస్తున్నారని సమాచారం. రాజమండ్రి నుంచి పోటీకి ‘సై’ అన్న ఆలీ దాదాపు ఇవే పరిస్థితులు రాజమండ్రి సిటీలో కూడా కనిపిస్తున్నాయి. అక్కడ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టిక్కెట్టు రాకుండా వైరి వర్గమంతా ఒకటైంది. పార్టీ రాజమండ్రి పార్లమెంటు ఇన్చార్జి, సినీ నటుడు మురళీమోహన్, గోరంట్లతో మొదటి నుంచి పొసగని గన్ని కృష్ణ వర్గాలు బుచ్చయ్యకు టిక్కెట్టు రాకుండా చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మురళీమోహన్‌తో మొదటి నుంచీ మంచి సంబంధాలు కలిగిన ప్రముఖ హాస్య నటుడు ఆలీని తెర మీదకు తీసుకువస్తున్నట్టు సమాచారం. రాజమండ్రికి చెందిన ఆలీ గతం నుంచీ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రిలో గంధోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆలీ మనసులో మాటను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేస్తాననే ఆసక్తిని వ్యక్తం చేసినా పార్టీ నుంచి అనేది చెప్పకుండా దాటవేశారు.ఆలీకి గతం నుంచి టీడీపీతో దోస్తీ ఉన్న క్రమంలో ఆయనను బరిలోకి దింపడం ద్వారా గోరంట్లకు చెక్ పెట్టేందుకు మురళీమోహన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారంటున్నారు. ఈ ప్రయత్నాలకు ఊతమిచ్చేందుకు గన్ని వర్గీయులు ఉండనే ఉన్నారు. ఈ పరిణామాలతో రెండు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. -
నేడు థియేటర్లు, షూటింగ్‌లు బంద్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం షూటింగ్‌లన్నీ బంద్ పాటిస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీమోహన్ వెల్లడించారు. అలాగే సినిమా థియేటర్లు కూడా బంద్ పాటించాలని కోరారు. షూటింగ్‌లు, థియేటర్లు బంద్ పాటించాలన్న నిర్ణయాన్ని అన్ని కార్మిక సంఘాలకు తెలియజేశామన్నారు. అలాగే గురువారం రాష్ట్రంలో అన్ని టెలివిజన్ షూటింగ్‌లకూ సెలవు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ డిజిటల్ సినీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డి.సురేష్‌కుమార్ తెలిపారు. అక్కినేని మరణవార్తతో బుధవారం సినీ కార్యాలయాలు మూతపడ్డాయి. మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చినప్పుడు అక్కినేనికి చెందిన అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లోనే 24 క్రాఫ్ట్‌ల కార్యాలయాలు వెలిశాయి. సినీ కార్మికుల నివాసాలతో పాటు సినీ అనుబంధ కార్యాలయాలూ ఇక్కడే ఏర్పాటయ్యాయి. వివిధ సినీ యూనియన్లతో పాటు వీటన్నింటికీ అనుబంధమైన ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం కూడా అన్నపూర్ణ స్టూడియో వద్దే ఏర్పాటైంది. అక్కినేని మృతితో ఆయా కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అక్కినేనికి సినీ పరిశ్రమకు చెందిన వివిధ విభాగాల వారంతా నివాళులర్పించారు. -
రేపు షూటింగ్‌లు, సినిమా థియేటర్లు బంద్
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం తెలుగు చిత్ర పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు, షూటింగ్‌లు నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు అక్కినేని భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు హైదరాబాద్ రానున్నారు. అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు వచ్చే అవకాశం ఉంది. అక్కినేని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. -
'ఆ బాధ జీవితాంతం మిగిలిపోతుంది'
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావును చివరిసారిగా చూడలేకపోయానన్న బాధ తనకు జీవితాంతం మిగిలిపోతుందని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. వారం రోజుల క్రితం ఆయనను చూసేందుకు వెళదామనుకున్నానని, అయితే అక్కినేని నీరసంగా ఉండటంతో వాయిదా పడిందన్నారు. ఆ తర్వాత తాను అనుకోకుండా రాజమండ్రి వెళ్లాల్సి ఉండటంతో అక్కినేనిని కలుసుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్నార్‌తో ఆత్మీయ అనుబంధం ఉందని, ఆయన మరణంతో తాను కుటుంబ పెద్దను పోగొట్టుకున్నంత బాధగా ఉందని మురళీ మోహన్ అన్నారు. అక్కినేని వందేళ్లు బతకాలని తాను అన్నప్పుడల్లా.... ఎన్నేళ్లు బ్రతికామన్నది కాదని... ఎంత ఆరోగ్యంగా బతికామన్నదే ముఖ్యమనేవారని... ఆ స్మృతులను మురళీమోహన్ ఈ సందర్భంగా తలుచుకున్నారు. తనకు క్యాన్సర్ సోకిందని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన గుండె ధైర్యం ఉన్న మనిషి అని.... అనంతరం ఆపరేషన్ చేయించుకున్నారని, మరో రెండు మూడేళ్లు ఆరోగ్యంగా ఉంటారనుకున్నానని... ఇంతలోనే ఆయనకు మరణం ముంచుకు వచ్చిందని అన్నారు. -
అమ్ముడుపోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
జి. దొంతమూరు (రంగంపేట), న్యూస్‌లైన్ :తన జీవితంలో ఎక్కడైనా అమ్ముడు పోయానని రుజువుచేస్తే దేనికైనా సిద్ధమేనని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. కేపీఆర్ రసాయన మూలకాల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జి.దొంతమూరు, బాలవరం గ్రామాల్లో జరుగుతున్న నిరశన దీక్షా శిబిరాలను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కేపీఆర్ గుప్పిట్లో మురళీమోహన్ అనే అపరిచిత కరపత్రాలపై స్పందించిన ఆయన వివరణ ఇచ్చారు. రెండు గ్రామాల వారిని ఉద్దేశించి మాట్లాడారు. తనకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని, తనకే అలాంటి ఫ్యాక్టరీలు 10 కట్టగల ఆర్థిక స్థోమత ఉందన్నారు. తాను కేపీఆర్ సంస్థకు తొత్తును కాదని, 30 ఏళ్లుగా దీక్ష చేపడుతున్న అయ్యప్ప మాలపై ఒట్టు వేసి చెబుతున్నానన్నారు. కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసిన నాయకుల చరిత్ర నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. తాను దానపరుణ్ణే కాని దాసోహపరుణ్ణి కాదన్నారు. కరపత్రాల వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లిందని, సరైన సమయంలో సరైన రీతిలో ఆయన స్పందిస్తారని మురళీమోహన్ అన్నారు. తాను కేపీఆర్ సంస్థకు తొత్తును కాదని డబ్బు కోసం ఆశించిన తొత్తులే వారికి దాసోహం అంటున్నారని మండిపడ్డారు. పేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో ఉచితంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోత్సాహానిస్తున్నానన్నారు. ఆరోగ్యశిబిరాలు సమాజ సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నానే తప్ప ప్రచారం కోసం కాదన్నారు. ఇలాంటి కరపత్రాలు వేసినవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కేపీఆర్ వ్యతిరేక ఉద్యమాలకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. 322 రోజులుగా కేపీఆర్ సంస్థ పనులకు వ్యతిరేకంగా నిరశన ఉద్యమాలు చేయడం అభినందనీయమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని మురళీమోహన్ జోస్యం చెప్పారు. ‘మీసమస్యను తప్పనిసరిగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.’ ఆ కరపత్రాలతో తమకు సంబంధం లేదని కేపీఆర్ సంస్థ పనుల వ్యతిరేక పోరాట సమితి అధ్యక్ష, కార్యదర్శులు గిరిజాల సత్తిబాబు, కాకరపల్లి సూరిబాబు తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు పెండ్యాల నళినీకాంత్, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల గోవింద్, పార్టీనాయకులు గారపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'ఏవీఎస్ బాగానే ఉన్నారు.. మాట్లాడుతున్నారు'
నటుడు ఏవీఎస్ అనారోగ్యానికి గురైనా.. బాగానే ఉన్నారు అని శుక్రవారం సాయంత్రం మీడియాతో మురళీ మోహన్ అన్నారు. ఏవీఎస్ మాట్లాడుతున్నారు అని తెలిపారు. ఆయనపై టెలివిజన్ లో వస్తున్న వార్తలన్ని అవాస్తవాలు అని అన్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారు అని అన్నారు. గ్లోబల్ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు ఏవీఎస్ ను మణికొండలోని ఆయన కుమారుడి నివాసానికి తీసుకువెళ్లారు. ఏవీఎస్ ను చిత్ర రంగ పరిశ్రమ కు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఏవీఎస్ త్వరలోనే కోలుకుంటారు అని సహచర నటులు విశ్వాసం వ్యక్తం చేశారు. -
రాష్ట్ర సచివాలయ సిమాంధ్ర ఉద్యోగుల ఫోరం కో - ఛైర్మన్ మురళీమెహన్తో సాక్షి వేదిక