కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మురళీమోహన్
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మురళీమోహన్
Published Fri, Aug 1 2014 7:11 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో రెండువేల ఎకరాల్లో ఫిలిం సిటీ అభివృద్ధి చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ మురళీమోహన్ స్వాగతించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ చూపుతున్న చొరవ హర్షణీయం అని అన్నారు.
గురువారం జరిగిన సమావేశంలో రెండువేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని సీఎం తెలిపారు.
Advertisement
Advertisement