ఖమ్మం : ఖమ్మం జిల్లా మణుగూరులో మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న మురళీమోహన్ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 4 వేలు నగదుతోపాటు 300 మత్తు ఇంజక్షన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్స్టేషన్కు తరలించారు. మురళీమోహన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలపల్లి ప్రభుత్వాసుపత్రిలో మురళీమోహన్ ఫార్మసిస్ట్గా పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.