manuguru
-
కోల్ కారిడార్‌కు లైన్‌క్లియర్!
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ ప్రతిపాదనలకే పరిమితమైన కోల్ కారిడార్ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఇటీవల అందిన డీపీఆర్‌ను పరిశీలించిన రైల్వే బోర్డు, దీనిని సాధ్యమయ్యే ప్రాజెక్టుగా తేల్చటంతో తుది ఆమోదం లభించే కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ)కి చేరింది. ఇక్కడ ఆమోదం లభిస్తే.. కేంద్ర బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. 207.80 కి.మీ. నిడివితో ఉండే ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3997 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పొందుపరిచారు. 1999లో తొలుత ఈ లైన్‌కు ప్రతిపాదించగా, తిరిగి 2013లో మరోసారి రూ.1112 కోట్ల నిర్మాణ అంచనాతో ప్రతిపాదనను పునరుద్ధరించారు. చివరకు గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉండటంతో.... ప్రస్తుతం రామగుండం నుంచి మణుగూరుకు వరంగల్–మహబూబాబాద్–డోర్నకల్–కారేపల్లి–పాండురంగాపురం మీదుగా రైల్వేలైన్ ఉంది. ఈ మార్గంలో మణుగూరు వెళ్లాలంటే 287 కి.మీ. ప్రయాణించాలి. ఈ మార్గంలో డోర్నకల్ జంక్షన్ వరకు విజయవాడ, విశాఖపట్నం మార్గం కావటంతో ప్రయాణికుల రైళ్లు అధికంగా తిరుగుతాయి. రామగుండం నుంచి బొగ్గులోడుతో గూడ్సు రైళ్లు అధికంగా తిరుగుతాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రామగుండం–మణుగూరు మధ్య నేరుగా ప్రత్యామ్నాయ రైలు మార్గం అవసరమని నిర్ణయించారు. కొత్త మార్గంలో ప్రయాణిస్తే 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో సమయంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. అన్నింటికి మించి రైలు ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గి ఇటు ప్రయాణికుల రైళ్లు, అటు సరుకు రవాణా రైళ్లు వేగంగా గమ్యం చేరతాయి. కోల్‌మైన్ టూ పవర్‌ప్లాంట్స్.. రామగుండం నుంచి పెద్ద ఎత్తున బొగ్గు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం సరైన రైలు మార్గం లేక రోడ్డు ద్వారా తరలిస్తున్నారు. రోడ్లు పాడవటంతోపాటు ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. రైల్వేలైన్ అందుబాటులో ఉంటే..మణుగూరులో ఉన్న భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు బొగ్గు తరలింపు సులభవుతుంది. దీంతోపాటు కాకతీయ, పాల్వంచ పవర్ప్లాంట్లకు దగ్గరి దారి అవుతుంది. ఇక కొత్తగూడెం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరికి కొత్తలైన్ నిర్మిస్తోంది. అక్కడి పారిశ్రామిక వాడతో ఈ కొత్త మార్గం అనుసంధానం కానుంది. వెరసి పారిశ్రామిక పురోగతికి కూడా ఇది దోహదం చేయనుంది. పర్యాటక ప్రాంతాల అనుసంధానం.. పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతాలతో కొత్త మార్గం నిర్మించనున్నారు. కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోట గుళ్లు, లక్నవరం, బొగత జలపాతం ప్రాంతాల మీదుగా సాగుతుంది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఇది ఎంతో వీలుగా ఉంటుంది. పర్యాటకంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ అటవీ ప్రాంతాలు కావటంతో సరైన రవాణా వ్యవస్థ లేదు. లక్షల మంది వచ్చే మేడారం జాతర సందర్భంలో భక్తులు ఆ ప్రాంతానికి చేరేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైలుమార్గం అందుబాటులోకి వస్తే, ప్రత్యేక రైళ్లు నడపటం ద్వారా లక్షల మందిని సులభంగా తరలించే వీలు కలుగుతుంది. గిరిజిన ప్రాంత ప్రయాణికులకు.. గిరిజన ప్రాంతాలకు సరైన రైలు మార్గం లేదన్న వెలితి కూడా దీనితో తీరుతుంది. రాఘవాపురం, మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి లాంటి ప్రాంతాలవాసులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త మార్గంలో దాదాపు 13 వరకు స్టేషన్లు ఉండే అవకాశముంది. ఉత్తర భారత్ వైపు వెళ్లే రైళ్లను ఎక్కువగా నడిపేందుకు ఇది ప్రత్యామ్నాయ లింకు మార్గంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది. రైటప్: కొత్తగా నిర్మించే రైల్వే లైన్ మార్గం ఇలా.. -
ఆడుకుంటూ కారులో ఎక్కి ఊపిరాడక.. మణుగూరులో విషాద ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: ముక్కుపచ్చలారని చిన్నారి జీవితం.. మూడేళ్లకే ముగిసింది. బుడి బుడి అడుగులేస్తూ ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని మృత్యువు కారు రూపంలో కబళించింది. డోర్లు లాక్ కావడంతో అందులోనే ఊపిరాడక కన్నుమూసింది. మణుగూరు సాంబాయిగూడెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సాయి లిఖిత అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న కారు ఎక్కింది. డోర్లు లాక్ కావడంతో రాత్రంతా అందులోనే ఉండిపోయింది. ఉదయం నిద్ర లేచిన తల్లిదండ్రులు ఆందోళనతో బిడ్డ కోసం అంతా గాలించారు. చివరకు కారులో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. అప్పటికే సాయి లిఖిత ఊపిరాడక కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా.. స్థానికంగా విషాదం నెలకొంది. -
టైఫాయిడ్లోనూ వైద్య సేవలందిస్తూ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతూ చేతికి సెలైన్‌తోనే విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు వైద్యురాలు కృష్ణశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ప్రభ్వుత్వాస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణశ్రీ కొద్దిరోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం అయితే చేతికి సెలైన్ కూడా పెట్టుకున్నారు. అంత అనారోగ్యంలో కూడా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 24 గంటలపాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించారు. ఇన్ పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వారి రికార్డులను పరిశీలించారు. కృష్ణశ్రీ గతంలో వరదల సమయంలో కూడా పేషంట్లకు విశేషమైన సేవలందించిన ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి -
మణుగూరులో భూ ప్రకంపనలు..
భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరులో మరోసారి భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా, వారం రోజుల్లో అక్కడ భూమి రెండుసార్లు కంపించడం విశేషం. వివరాల ప్రకారం.. మణుగూరులో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించింది. శుక్రవారం 4.40 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మణుగూరులోని శేషగిరినగర్, బాపనకుంట, శివలింగాపురం, విఠల్‌నగర్, రాజుపేటలో భూమి కంపించింది. ఈ క్రమంలో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. కాగా, వారం రోజుల్లో అక్కడ భూమి రెండు సార్లు కంపించింది. ఇది కూడా చదవండి: సేత్వార్ సమస్యలకు ‘చెక్’ -
వినూత్న రీతిలో విద్యార్థులకు విద్యాబోధన
-
National Apprenticeship Mela 2023: 9న పీఎం అప్రెంటిస్‌షిప్ మేళా
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా యువతకు కెరీర్ అవకాశాలను పెంపొందించేందుకు ఈ నెల 9న దేశవ్యాప్తంగా 242 జిల్లాల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకొనేందుకు అవకాశాలు ఇవ్వనున్నాయి. ఈ అప్రెంటిస్‌షిప్ మేళాను తెలంగాణలోని 6 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అభ్యర్థులు తమ పేర్లను apprenticeshipindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. తమకు దగ్గరగా ఎక్కడ మేళా నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు కలిగి.. 5వ నుంచి 12వ తరగతి వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ డిప్లొమా హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొనవచ్చు. ఏమేమీ కావాలి.. రెజ్యూమ్ మూడు కాపీలు మార్క్షీట్లు, సర్టిఫికెట్ మూడు కాపీలు ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్) మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఎక్కడెక్కడంటే... తెలంగాణలోని మణుగూరు ప్రభుత్వ ఐటీఐ (భద్రాద్రి కొత్తగూడెం), ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ(హైదరాబాద్), భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ(జయశంకర్ భూపాలపల్లి), పెద్దపల్లి ప్రభు త్వ ఐటీఐ(పెద్దపల్లి), అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ(రంగారెడ్డి), భువనగిరి ప్రభుత్వ ఐటీఐ(యాదాద్రి భువనగిరి)ల్లో మేళా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రభుత్వ ఐటీఐ(బీ) (అనంతపురం), కాకినాడ ప్రభుత్వ ఐటీఐ (కాకినాడ), విజయవాడ ప్రభుత్వ ఐటీఐ(ఎన్టీఆర్ కృష్ణా), మాచర్ల ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటీఐ (పల్నాడు), ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ(బీ) (ప్రకాశం), ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ(శ్రీకాకుళం), తిరుపతి ప్రభుత్వ ఐటీఐ(తిరుపతి), విశాఖపట్టణం ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) (విశాఖపట్టణం), కడప ప్రభుత్వ ఐటీఐ (వైఎస్సార్ కడప)ల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. (క్లిక్ చేయండి: విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు) -
కడవరకూ కాంగ్రెస్‌లోనే..: ఎమ్మెల్యే వీరయ్య
మణుగూరు టౌన్: బతికున్నంత కాలం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టంచేశారు. మణుగూరులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం ప్రజలే తనకు దేవుళ్లని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం, దేశంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్లో బీజేపీ గెలిచినంత మాత్రాన ఆ ప్రభావం అంతటా ఉండదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
కీలక ముందడుగు.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేపట్టిన మణుగూరు – రామగుండం రైల్వేలైను నిర్మాణంలో కీలక అడుగు పడింది. దీంతో రాబోయే బడ్జెట్లో ఈ లైనుకు నిధులు మంజూరు కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. చదవండి: కేసీఆర్ ఆదిపురుష్: ఆర్జీవీ సంచలన ట్వీట్ చాన్నాళ్లుగా.. బొగ్గు, విద్యుదుత్పత్తి కేంద్రాలుగా ఉన్న మణుగూరు, రామగుండం మధ్య కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని రెండు దశాబ్దాల కిందట లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సర్వే నిర్వహించారు. ఆ తర్వాత కూడా అనేక మార్లు సర్వేలు జరిగాయి. ఇరవై ఏళ్లుగా సర్వేలు తప్ప లైన్ విషయంలో మరే పురోగతి కనిపించలేదు. భద్రాచలం రోడ్డు – కొవ్వూరు రైల్వే లైన్ తరహాలోనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కదలిక వచ్చింది భూసామర్థ్య పరీక్షలు ఇటీవల సరుకు రవాణాకు రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. త్వరగా సరుకు రవాణా కోసం ప్రత్యేక ట్రాక్‌లను సైతం నిర్మిస్తోంది. దీంతో పాటు ట్రిపుల్ ఆర్(రివర్, రైల్, రోడ్డు) కాన్సెప్‌్టతో సరుకు రవాణాకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇటు మణుగూరు, అటు రామగుండం రెండు పట్టణాలు గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. ఈ రెండు పట్టణాల మధ్య రోడ్డు మార్గం ఉంది. ఇప్పుడు అదనంగా రైలు మార్గం నిర్మాణంపై కేంద్రం దృష్టి సారించి, ఇప్పటికే సర్వే పూర్తయినందున రైలు మార్గం నిర్మాణానికి రెడీ అవుతోంది. అందులో భాగంగా రైలు మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ములుగు జిల్లాలో పలు ప్రాంతాల్లో మట్టి నమూనా పరీక్షలు జరుగుతున్నాయి. ప్రయోజనాలు ప్రస్తుతం రామగుండం – కాజీపేట – డోర్నకల్ – భద్రాచలంరోడ్డు – మణుగూరు మార్గం 291 కి.మీ. నిడివితో ఉంది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే దాదాపు వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అదే విధంగా భూపాలపల్లిలో ఉన్న సింగరేణి బొగ్గుగనులు, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్లకు రైలుమార్గం అందుబాటులోకి వస్తుంది. న్యూఢిల్లీ – చెన్నై గ్రాండ్‌ట్రంక్ లైన్లో నాగ్‌పూర్ – విజయవాడ సెక్షన్లో కీలక ప్రత్యామ్నాయ మార్గంగా ఈ లైన్ నిలవనుంది. రైలు మార్గం ఇలా మణుగూరు – రామగుండం కొత్త మార్గానికి సంబంధించి రామగుండం దగ్గర ఉన్న రాఘవాపురం రైల్వే స్టేషన్ నుంచి ఈ లైన్ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మంథని – భూపాలపల్లి – మేడారం – తాడ్వాయి – కాటాపూర్ – గోపాలపురం – రామనుజపురం మీదుగా మణుగూరుకు చేరుకుంటుంది. మొత్తంగా రాఘవాపురం నుంచి మణుగూరు వరకు 197 కి.మీ నిడివితో ఈ మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. చివరి సారిగా చేసిన సర్వేలో ఈ లైన్ నిర్మాణానికి రూ. 3,000 కోట్లు ఖర్చు కావొచ్చని అంచనా వేశారు. -
బీటీపీఎస్‌లో నాలుగో యూనిట్ సింక్రనైజేషన్
మణుగూరు టౌన్: తెలంగాణ ఏర్పడ్డాక ఏర్పాటుచేసిన భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో చివరిదైన నాలుగో యూనిట్ సింక్రనైజేషన్ (బొగ్గును మండించే ప్రక్రియ)ను ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సచ్చిదానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో 270 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్ల నిర్మాణానికి బీహెచ్ఈఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, నాలుగో యూనిట్ పనులను ఇప్పుడు సింక్రనైజేషన్ చేశామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ యూనిట్ నిర్మాణం పూర్తిచేసి సీఓడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్డ్) చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈమేరకు సింక్రనైజేషన్ విజయవంతంగా పూర్తిచేసిన సీఈ బాలరాజు, అధికారులను ఆయన అభినందించారు. -
పాస్‌పుస్తకం కోసం రైతు వినూత్న నిరసన
మణుగూరు టౌన్: భూమి పట్టా పాస్‌పుస్తకం కోసం ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లారం రెవె న్యూ గనిబోయినగుంపు సమీపంలో తన కు 5.03 గుంటల భూమి ఉందని, పట్టా దారు పాసుపుస్తకం కోసం ఐదేళ్లుగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడంలేదని మిడి యం సింగయ్య అనే రైతు తెలిపాడు. చదవండి: ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి తలనొప్పి.. అంతేకాకుండా తన అధీనంలో ఉన్న భూమిని ములుగు జిల్లా అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన పింగాళి చినరాజు పేరిట పట్టా చేశారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సింగయ్య బుధవారం తహసీ ల్దార్ కార్యాలయం మెట్లపై పడుకుని నిరసన తెలిపాడు. పాస్‌పుస్తకం ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చోగా.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో సింగయ్య ఆందోళన విరమించాడు. చదవండి: టాప్‌టెన్‌లో ఏపీ విద్యార్థుల హవా -
మణుగూరు ఓసీ–2లో ఘోర ప్రమాదం
మణుగూరు టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ–2లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు ప్రకాశవని ఖని ఓపెన్ కాస్ట్ (పీకేఓసీ)–2 క్వారీలో ఇద్దరు కార్మికులను తీసుకొని వెళ్తున్న బొలెరో వాహనం.. 100 టన్నుల డంపర్‌ను దాటుతుండగా అది ఢీకొట్టింది. అదే వేగంతో ఆగకుండా బొలెరో వాహనంపైకి ఎక్కి ముందుకు వెళ్లడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ఉన్న మణుగూరు ఓసీ–2 ఎలక్ట్రీషియన్ అజ్మీరా బాషా (49), హెల్పర్ పరసా సాగర్ (34), బొలెరో ఓనర్–కమ్–డ్రైవర్ వెల్పుల వెంకన్న (45) అక్కడికక్కడే మృతి చెందారు. అజ్మీరా బాషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా పీవీ కాలనీ ఎంసీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇక సాగర్ ఇటీవల డిపెండెంట్‌గా ఉద్యోగంలో చేరగా ఆయనకు పెళ్లి కాలేదు. వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణుగూరు ఏరియాలోని పీకేఓసీ–2లో తొలిసారి ఈ తరహా ప్రమాదం జరగడంతో కార్మికులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా జీఎం జక్కం రమేష్, ఎస్‌ఓటూ జీఎం డి.లలిత్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద సంతాపం తెలిపారు. సంస్థపరంగా వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చిన్నదారులు.. భారీ యంత్రాలు ఓపెన్ కాస్టు గనుల్లో భారీ యంత్రాలను వినియోగిస్తుండగా రహదారులు మాత్రం తక్కువ వెడల్పుతో ఉంటున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు కార్మికులు, చెబుతున్నారు. క్వారీల్లో భారీ డంపర్లు నడవడానికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదంటున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం క్వారీల్లో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విశాలమైన రహదారులు నిర్మించాలని, డంపర్లు వెళ్లే ప్రాంతాల్లో ఇతర వాహనాలు రాకుండా ప్రత్యేక దారులు ఏర్పాటు చేయాలని కోరారు. -
5 ఏరియాలు టాప్.. ఆరు ఏరియాలు వెనుకంజ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021– 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్‌లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్‌లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్‌లో 20 ఓపెన్‌కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్‌తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్‌లోని మణుగూరు టాప్‌గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్‌లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
సింగరేణి సిగలో అద్భుతం: వేడినీటి బుగ్గతో విద్యుత్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి తన జియో థర్మల్ ప్లాంట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా భూమి(బుగ్గ) నుంచి వేడినీరు ఉబికి వస్తోంది. సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం బొగ్గు నిక్షేపాలను అన్వేషిస్తుండగా ఈ విషయం బయటపడింది. మోటార్ల సాయం లేకుండా ఏళ్ల తరబడి వేడినీరు వందల అడుగుల నుంచి వస్తుండటంతో నీటి ఆవిరి ద్వారా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా కాలుష్యరహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన (ఒక గ్రామానికి సరిపడే విద్యుత్) ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర బొగ్గు శాఖ రూ.1.72 కోట్లు మంజూరు చేసింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో కొంతభాగాన్ని పరిసర గ్రామాల్లోని పంట భూముల కోసం ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించింది. ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ద్వారా విద్యుదుత్పత్తి వేడినీటి ఆవిరి యంత్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయటమే జియోథర్మల్. ఇందుకు ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ (ఏఆర్సీ) అనే సాంకేతిక ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తకుండా విద్యుదుత్పత్తి చేసేందుకు మొదటిసారిగా సింగరేణి చరిత్ర పుటల్లోకి ఎక్కేందుకు ముందుకు వెళ్తోంది. ఈ పక్రియతో నిరంతరం విద్యుదుత్పత్తి చేయొచ్చని సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఉన్నతాధికారులు 2018–19లో సర్వే నిర్వహించారు. రెండేళ్ల కింద కుదిరిన ఒప్పందం.. 480 మీటర్ల లోతులో దాదాపు 51 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఈ వేడి నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును సింగరేణి సంస్థ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ సంస్థతో 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా, 1989లో అప్పటి సింగరేణి చీఫ్ జియాలజిస్ట్ ఎ. వెంకటేశ్వరరావు పగిడేరులో ఓ రైతు వేసిన మంచినీటి బోరులో వేడి నీరు వస్తోందనే విషయం తెలుసుకుని నీటిని పరిశీలించారు. ఎండాకాలం కావడంతో బోరులోని నీరు వేడెక్కి ఉంటుందని భావించారు. తర్వాత ఆ విషయాన్ని అధికారులు విస్మరించారు. అయితే ఈ విషయం మళ్లీ ప్రాచుర్యం పొందడంతో ఎక్స్‌ప్లోరేషన్ అధికారులు నీటిని, నీటి నుంచి వెలువడే ఆవిరిని పరిశీలించి జీఎస్ఐకి పంపారు. దీంతో ఆ సంస్థ సర్వే చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జియోథర్మల్ ప్లాంట్‌కు బీజం పడింది. -
అభయారణ్యంలో ఎదురుకాల్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లెందు: మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో ఉన్న అభయారణ్యంలో బుధవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్ట్ యాక్షన్ టీములు సంచరిస్తున్నాయనే సమాచారంతో మూడు రోజులుగా పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కరకగూడెం, ఆళ్లపల్లి సరిహద్దు మల్లేపల్లితోగు వద్ద మావోయిస్టులు తారసపడటంతో పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. 10 మంది వరకు మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే తప్పించుకున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో వారి సామగ్రి లభించింది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను మోహరించి కూంబింగ్ ముమ్మరం చేశారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు హైదరాబాద్ తరలించారు. కాగా ఆ ప్రాంతంలో ఎక్కువమంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో.. మావోయిస్టులపై పోరులో భాగంగా పోలీసు బలగాలు గోదావరి పరీవాహక ప్రాంతం వ్యాప్తంగా కూంబింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాయి. గతంలో ఎండాకాలంలోనే మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో, తెలంగాణలోని అభయారణ్యంలో పోరు జరిగేది. అయితే ప్రస్తుతం మాత్రం ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పటికీ పోరు నడుస్తోంది. ఈ నెల 13న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలోని మాంగీ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ నుంచి నలుగురు మావోయిస్టులు తప్పించుకోగా, వారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మంచిర్యాల–ఆదిలాబాద్ డివిజన్ కార్యదర్శి మైలవరపు అడేళ్లు అలియాస్ భాస్కర్ కూడా ఉన్నట్లు సమాచారం. పోడు భూముల సమస్య నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ జిల్లాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల మీదుగా వచ్చి గోదావరి దాటి మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల మీదుగా ఇతర జిల్లాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గోదావరి పరీవాహక అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కాగా కూంబింగ్ కొనసాగుతుందని ఏఎస్పీ (ఆపరేషన్స్) రమణారెడ్డి తెలిపారు. ఉలిక్కిపడ్డ ఏజెన్సీ ఎదురుకాల్పుల సంఘటనతో ఏజెన్సీ ఉలిక్కి పడింది. మూడు రోజులుగా ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు సబ్ డివిజన్లలో స్పెషల్ పార్టీ బలగాలతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చినట్లు సమాచారం అందుకున్న వరంగల్, భద్రాద్రి పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మణుగూరు ఏరియాలోని మల్లేపల్లితోగు అటవీ ప్రాంతంలో ఉదయం 9గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ ప్రకటించారు. దామోదర్, భద్రూ, శాంత, భాస్కర్లతో కూడిన సుమారు 10 మంది మావోయిస్టుల కోసం అన్వేషిస్తుండగా, మణుగూరు ఏరియా మల్లేపల్లితోగు, రంగాపురం అటవీ ప్రాంతంలో నక్సల్స్ తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాల్పుల నేపథ్యంలో గుండాల మండలంలోని దామరతోగు, చెట్టుపల్లి అటవీ ప్రాంతం, తాడ్వాయి మండలంలోని దుబ్బగూడెం, గంగారం మండలంలోని పాకాల ఏరియా, ఇల్లెందు, గుండాల మండలాల సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఉధృతం చేశారు. 2019 ఆగస్టు 21 తెల్లారుజామున మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో గుండాల మండలం దామరతోగుకు చెందిన జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతి చెందాడు. ఏడాదిలోపు అదే ప్రాంతంలో మళ్లీ ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఏజెన్సీలో ఆందోళన నెలకొంది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతుండగా, ఇదే అదునుగా మావోయిస్టులు ఏజెన్సీలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా వర్షాకాలంలో ఆకు పచ్చబడ్డ తర్వాత ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. వర్షాల కారణంగా ఇప్పటికే అటవీ ప్రాంతం కూడా పచ్చబడింది. గతేడాది కూడా గుండాల మండలం రోళ్లగడ్డ వద్ద మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో న్యూడెమోక్రసీ దళనేత లింగన్న ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలానికి ఆనుకునే ఉన్న ములుగు జిల్లాలోని మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెంలలో రెండు రోజుల క్రితమే మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. మణుగూరురూరల్: ఎదురుకాల్పుల ఘటనతో మణుగూరు సబ్‌డివిజన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ ఎంఏ షుకూర్ నేతృత్వంలో బుగ్గ, ఖమ్మంతోగు ప్రాంతాలకు వెళ్లే అటవీప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. కాల్పుల ఘటనతో ఆదివాసీగూడేలు వణికిపోతున్నాయి. -
దారుణం : బాలికపై 8మంది అత్యాచారం
సాక్షి, మణుగూరు(ఖమ్మం) : మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్యగనర్‌కు చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మణుగూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బి.రాంమాంజనేయులు ఘటన వివరాలను వెల్లడించారు. గత నెల 27న బాధిత బాలిక తన తల్లికి పరిచయస్తులైన దుమ్ముగూడెం మండలం రామారావుపేట గ్రామానికి చెందిన పూజారి కల్యాణ్‌కు భద్రాచలం వస్తున్నానని ఫోన్ నుంచి మెస్సేజ్ పంపింది. కల్యాణ్ బాలికను ద్విచక్రవాహనంపై తన ఇంటికి తీసుకెళ్లి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా అనుభవించాడు. అయితే అక్టోబర్28న బాలికను కల్యాణ్ భద్రాచలం బస్టాండ్‌లో దింపాడు. ఆమె మణుగూరుకు చేరుకుంది. మణుగూరు నుంచి తన చిన్ననానమ్మ గ్రామమైన గంగోలు వెళ్లేందుకు సాయిబాబా గుడి వద్ద మణుగూరుకు చెందిన ముత్తారపు వెంకటేష్ ఆటో వద్దకు వచ్చి భద్రాచలం వెళ్లాలని చెప్పింది. వెంకటేష్ బాలికను తప్పుదారి పట్టించి పర్ణశాల తీసుకెళ్లి సాయంత్రం వరకు బోటు షికారు చేయించాడు. అనంతరం బాలికతో ఆటోలో వస్తుండగా గంగోలు వద్ద ఆపమన్నా ఆపకుండా తీసుకొచ్చి సారపాక దాటాక రెడ్డిపాలెం వెళ్లే మట్టి దారిలో కొంతదూరం తీసుకొచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడాలనుకున్నాడు. అదే ప్రాంతంలో ఉన్న సందెళ్ల రామాపురం గ్రామానికి చెందిన సోడె రాంబాబు ఏలియాస్ బాబు, పొడియం సాయి, తెల్లం కృష్ణ, ఆంతోటి ప్రశాంత్, వినయ్‌లు విషయాన్ని గమనించి ఆటో వద్దకు వచ్చారు. వీరిలో ఇద్దరు కాపలా ఉండి మితావారు ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బెదిరించి ఆటో డ్రైవర్‌ను, బాలికను ఆటో ఎక్కించి పంపించారు. దీంతో ఆటో డ్రైవర్ బాలికను మణుగూరు గుట్ట మల్లారంలోని శివబాలాజీ లాడ్జ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంచాడు. ఆటో డ్రైవర్ తెల్లవారు జామున బాలికను తిరిగి భద్రాచలం తీసుకెళ్లగా తనపై అత్యాచారం జరిపిన వారిలో ఒకడు వెంబడించాడు. భయంతో అదే ఆటోలో మణుగూరులోని ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకుంది. ఆటో డ్రైవర్ బాలికను భద్రాచలం బస్సు ఎక్కించగా బాలిక సీతారామపురంలోని కల్యాణ్ కటింగ్ సాపు వద్దకు వెళ్లింది. కల్యాణ్ బాలికను ద్విచక్ర వాహనంపై మళ్లీ భద్రాచలం తీసుకొచ్చాడు. అక్కడ తను బట్టలు మార్చుకోవాలని అడగగా భద్రాచలంలోని సాయిబాబా గుడి ఏరియా వెనక తన స్నేహితుడి రూంకు తీసుకెళ్లి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి బాలికను గంగోలులో విడిచిపెట్టాడు. గంగోలులో చిననానమ్మ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక తిరిగి భద్రాచలం వచ్చి కల్యాణ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో కల్యాణ్ బాలిక తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో బాలిక తల్లి, మారు తండ్రి ఆటోలో భద్రాచలం వెళ్లి బాలికను ఇంటికి తీసుకొచ్చారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అత్యాచారానికి పాల్పడిన అందరినీ అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఆటోను, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. వీరిపై మైనర్ బాలికపై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ షుకూర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రి మెట్లపై నిస్సహాయ స్థితిలో..
సాక్షి, ఖమ్మం: చావు బతుకుల మధ్య ప్రభుత్వ ఆసుపత్రి మెట్లెక్కినా వైద్యం అందక గంట సేపు రక్తం మడుగులో నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన హృదయ విదారక సంఘటన ఆదివారం రాత్రి మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరినగర్‌కు చెందిన ఆనంద్ హోండా షోరూం ఎదురుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు క్షతగాత్రుడిని దగ్గర్లోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ముందు మెట్ల మీద కూర్చోబెట్టి వైద్యం కోసం వారు ప్రయత్నించారు. ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడం, సమయానికి 108 అందుబాలులో లేకపోవడంతో క్షతగాత్రుడు మెట్లపైనే గంట సేపు రక్తం మడుగులోనే నరకయాతన అనుభవించాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం కొద్ది బాధితుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి 100 పడకల ఆసుపత్రిలో వైద సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని కోరుతున్నారు. -
ఎన్‌కౌంటర్‌తో అలజడి
సాక్షి, కొత్తగూడెం: మణుగూరు మండలం బుడుగుల సమీప అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం 6 – 7 గంటల మధ్య పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ దళసభ్యుడు, గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతిచెందాడు. మృతదేహం వద్ద రెండు తపంచాలు, 17 బుల్లెట్లు, రెండు కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పినపాక నియోజకవర్గంలో 20 రోజుల వ్యవధిలోనే రెండు ఎన్కౌంటర్లు జరగడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కార్యకలాపాల విస్తరణకు మావోల యత్నం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కార్యకలాపాలు విస్తరించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి భద్రాద్రి ఏజెన్సీలో చొరబడి గోదావరి పరీవాహక ప్రాంతాల ద్వారా ఇతర జిల్లాల్లోకి వచ్చి రిక్రూట్మెంట్లు చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా వలస గొత్తికోయ గ్రామాలపై దృష్టి పెట్టారు. మూడు నెలలుగా మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషణ్ ఆధ్వర్యంలో వచ్చిన యాక్షన్ టీమ్‌లు పినపాక, ఇల్లెందు డివిజన్లలో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 రోజుల తేడాతో వరుసగా రెండు ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. గత నెల 31న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో గుండాల మండలం రోళ్లగడ్డ వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రీజినల్ కార్యదర్శి, అజాత దళాల కమాండర్ లింగన్న దళం తారసపడింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో లింగన్న మృతిచెందాడు. మిగిలిన సభ్యులు తప్పించుకున్నారు. తాజాగా బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ మణుగూరు ఏరియా దళ కమాండర్ జాడి వీరస్వామి హతమయ్యాడు. అయితే ఈ రెండు ఎన్కౌంటర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోళ్లగడ్డ ఎన్కౌంటర్ జరిగినప్పుడు లింగన్న మృతిచెందిన విషయాన్ని కొన్ని గంటలపాటు ధ్రువీకరించకుండా వ్యవహరించడంతో గుండాల మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తిరుగుబాటు చేశారు.పోలీసులపై రాళ్లు రువ్వి దాడి చేశారు. ఇక ప్రస్తుతం మణుగూరు మండలం బుడుగుల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలోనూ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేందుకు మీడియాకు అనుమతి ఇవ్వకపోగా, మృతిచెందిన వీరస్వామి ఫొటో తీసే అవకాశం కూడా కల్పించలేదు. మృతదేహాన్ని మణుగూరు ఆస్పత్రికి తరలిస్తున్నామని కాసేపు, కొత్తగూడెం ఆస్పత్రికని మరికొంత సేపు చెప్పి.. చివరకు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో మీడియా నిరసన వ్యక్తం చేసింది. పోలీసుల జల్లెడ.. మూడు నెలల క్రితం హరిభూషణ్ ఆధ్వర్యంలో గోదావరికి రెండువైపులా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి రెండు యాక్షన్ టీమ్‌లు వచ్చినట్లు సమాచారం. ఇవి భద్రాద్రి జిల్లాలోని చర్ల, ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలాల మీదుగా గోదావరి దాటి పినపాక, మణుగూరు, కరకగూడెం, గుండాల, ములుగు జిల్లా లోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. యాక్షన్ టీమ్‌లు చర్ల మండలం నుంచి గోదావరి దాటి పినపాక మండలంలోని భూపతిరావుపేట, పిట్టతోగు, దోమెడ, కరకగూడెం మండలం ఆర్.కొత్తగూడెం, గుండాల మీదుగా మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అభయారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. తెలంగాణలో కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న భద్రాద్రి, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో పోడు భూముల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు గిరిజన ప్రాంతాల్లో పట్టు పెంచుకుని కొత్తగా రిక్రూట్మెంట్లు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు చర్ల మండలం బెస్తకొత్తూరుకు చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును హతమార్చారు. ఇప్పటివరకు సరిహద్దుకు అవతల ఛత్తీస్‌గఢ్ పరిధిలో మావోలకు, పోలీసులకు మధ్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు ఏజెన్సీతోపాటు ఇల్లెందు, మణుగూరు ఏజెన్సీలో సైతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు రిక్రూట్మెంట్లు, ఇటు ఎన్కౌంటర్లతో ఏజెన్సీలో అలజడి చోటుచేసుకుంది. ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు: భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ మణుగూరు: ఎదురు కాల్పుల్లో మణుగూరు ఏరియా కమిటీ ఇన్చార్జ్ దళ కమాండర్ జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మణుగూరు డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల అనంతరం జిల్లాలో రెండు, మూడు మావోయిస్టు టీంలు తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయన్నారు. గతంలో లాగా మావోయిస్టులు యూనిఫాం ధరించకుండా సాధారణ దుస్తుల్లో ప్రజల్లో సంచరిస్తూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. వీరస్వామి మణుగూరు ఏరియా దళ కమాండర్‌గా, నర్సంపేట, ఇల్లెందు ఏరియా కమాండర్‌గా భద్రు, సుధీర్ ఇన్చార్జ్గా, ఏటూర్‌నాగారం, కాటారం, మహదేవ్పూర్ డివిజన్ కమిటీ దళ కమాండర్‌గా పూన సుధాకర్‌లు వ్యవహరిస్తున్నారన్నారు. నాలుగు రోజుల క్రితం వీరస్వామి, రవి మిగతా సభ్యులు పాల్వంచ వలస ఆదివాసీ గ్రామంలో సంచరిస్తూ, రెండు రోజుల క్రితం మణుగూరులోని వలస ఆదివాసీ గిరిజన గ్రామమైన బుడుగులకు చేరుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిలో భాగంగానే స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం తెల్లవారు జామున బుడుగుల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుం డగా వీరస్వామి, అతడి టీం పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతిచెందాని తెలిపారు. ఏజెన్సీ అప్రమత్తం చర్ల: ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఒక దళ సభ్యుడు మృతి చెందగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్న క్రమంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. మణుగూరు ప్రాంతానికి సమీపంలో ఉన్న గోదావరి దాటి ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతానికి పారిపోతారనే అనుమానంతో గోదావరి తీర ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు. భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం.. ఎన్కౌంటర్లో హతమైన వీరస్వామి మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. తల్లిదండ్రుల మృతితో అనాథ ఆశ్రమానికి.. గుండాల: జాడి వీరస్వామి అలియాస్ రవి గుండాల మండలం దామరతోగా గ్రామానికి చెందిన వ్యక్తి. హైదారాబాద్‌లో ఉంటున్న వీరస్వామి గతంలో న్యూడెమోక్రసిలో పనిచేశాడు. ఇతను తల్లిదండ్రులు, సోదరుడు మృతి చెందాడు. బంధువుల సాయంతో హైదరాబాద్ లోని ఓ అనాథ ఆశ్రమంలో చేరాడు. అప్పుడప్పుడు దామరతోగు గ్రామానికి వచ్చిపోయేవాడని బంధువులు తెలిపారు. తన పెద్దనాన్న జాడి నర్సయ్య భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మృతి చెందగా అతన్ని చూసేందుకు వచ్చాడని తెలిపారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందే వరకు అతను మావోయిస్టులతో ఉంటున్నట్లు తమకు సమాచారం లేదని తెలిపారు. నాలుగేళ్ల కిత్రం న్యూడెమోక్రసీ రామన్న దళంలో చేరి రెండేళ్ల పాటు పని చేశాడు. 2017లో దళం నుంచి రెండు తుపాకులతో పారిపోయి పోలీసుల ముందు లొంగిపోయాడు. అనంతరం 2017 నుంచి మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. అప్పుడప్పుడు బయటకు వస్తూ.. పోతూ భద్రూ దళంలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ఆదర్శనగర్‌లో భారీ చోరీ
సాక్షి, ఖమ్మం: మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్‌లో ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోని నగదు, బంగారం, వెండిని దొంగలు దోచుకువెళ్లిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన బుద్ధ వెంకటేశ్వర్లు సింగరేణి ఉద్యోగి. తోటి కార్మికుడికి దెబ్బ తగలడంతో భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వెంకటేశ్వర్లు భార్య కొత్తగూడెంలో చదువుతున్న తన కూతరు వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు ఇంటి ముందు తలుపు గొళ్లెం తొలగించేందుకు తలుపును కొద్దిభాగం ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. మధ్య గదిలో ఉన్న బీరువాను తెరిచి అందులో ఉన్న రూ.50 వేల నగదును, 8 తులాల బంగారం, 1 కేజీ వెండిని దోచుకెళ్లారు. తెల్లవారు జామున హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు అక్కడి పరిస్థితిని చూసి హతాశుడయ్యాడు. నివాసంలోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న మొత్తాన్ని దోచుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్ పరిశీలించి క్లూస్ టీంకు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న క్లూస్ టీం సిబ్బంది నమూనాలను సేకరించగా, పోలీసులు విచారణ చేపట్టారు. -
పోలింగ్ సామగ్రి వచ్చే..
సాక్షి,మణుగూరురూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఈనెల 10న ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు ఐటీడీఏ పీఓ, పినపాక నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వీపీ.గౌతమ్ తెలిపారు. సోమవారం మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రశాంతంగా నిర్వహించేందుకు 13సెక్టార్లు, 27విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. 70మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని, ప్రత్యేక డ్యూటీ చేసే ఉద్యోగులు ఉదయం 5గంటలకే ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు. సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు 48ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, 10వ తేదీన పంపిణీ సెంటర్లలో పోలింగ్ సిబ్బంది1190, ఇతర కౌంటర్లలో 70మంది ఉద్యోగులు విధులు చేస్తారని తెలిపారు. వారికి కావాల్సిన భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. 231పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పెట్టుకోడానికి 231బ్యాగ్‌లు వారి పోలింగ్ కేంద్రాల నంబర్లతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలిపారు. సిబ్బంది, ఉద్యోగులు సకాలంలో హాజరై ఏన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్టీ.ప్రకాశరావు, ఎస్డీసీ బి.వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పరిపాలనా అధికారి సురేష్‌బాబు, ఏపీఓ పవర్ అనురాధ, పీఎంఆర్సీ రమణయ్య, భావ్‌సింగ్, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు. -
మతి స్థిమితం లేని బాలికపై అఘాయిత్యం
సాక్షి,మణుగూరుటౌన్: పట్టణంలోని మతి స్థిమితం లేని బాలిక(14)పై సోమవారం రాత్రి లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపిన వివరాలు...బెలూన్లు కొనేందుకని పట్టణంలోని షాపు వద్దకు వెళ్లిన మతి స్థిమితం లేని బాలికను ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. గాంధీనగర్ చర్చి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ యువకులు పారిపోయారు. చుట్టుపక్కల వారు ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బైక్‌పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడి చేసింది తామేనని వారు ఒప్పుకున్నారు. వీరిని– అశోక్‌నగర్‌కు చెందిన డేగ యశ్వంత్, కరకగూడెం మండలం తురుములగూడెం గ్రామస్తుడు నిట్టా ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడైన పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామస్తుడు సిద్ధి నరేష్ పరారీలో ఉన్నాడు. వీరు ముగ్గురూ గతంలో కూడా గాంధీనగర్‌కు చెందిన బాలికను కిడ్నాప్ చేసి వదిలేశారు. నరేష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
అభివృద్ధి పథంలో..
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2018లో అభివృద్ధి పరంగా అనేక మెరుపులు మెరవగా, కొన్ని అంశాల్లో మరకలు అంటాయి. వివిధ రంగాల్లో జిల్లా తనదైన ముద్ర వేయగా, కొన్ని అంశాల్లో నిరాశ మిగిలింది. అలాగే మరికొన్ని మరకలు అంటాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 6.7లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు లభించాయి. మొదట 5లక్షల ఎకరాలకు నీరందించాలని అనుకున్నప్పటికీ తరువాత 6.7లక్షల ఎకరాలకు పెరగడంతో అంచనా రూ.7,926 కోట్ల నుంచి రూ.13,884 కోట్లకు ప్రభుత్వం పెంచింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో తొలి సమీక్ష సమావేశం సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులపైనే చేశారు. సీతారామ ప్రాజెక్టు కోసం రూ.11వేల కోట్ల నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయిందని, పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుకు భద్రాద్రి జిల్లాలో అవసరమైన భూసేకరణ ఇప్పటికే మే 30కు పూర్తి చేశారు. రాష్ట్రానికి వెలుగులు అందించే కేటీపీఎస్ నుంచి కొత్తగా రూ.6,045 కోట్లతో నిర్మించిన 7వ దశ ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించడంతో పాటు ఈ నెల 26వ తేదీన జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సీవోడీ(కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. దీంతో ప్రస్తుతం కేటీపీఎస్ నుంచి మొత్తం 2,460 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుతోంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లో రూ.7,241 కోట్లతో 1,080 మొగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్‌లో మొదటి దశకు సంబంధించి హైడ్రాలిక్ పరీక్ష విజయవంతంగా పూర్తి చేశారు. వచ్చే మార్చిలోగా మొదటి దశలో ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనులు ముమ్మరంగా చేస్తున్నారు. బొగ్గు రవాణాకు రైల్వేలైన్ నిర్మాణం సర్వే సాగుతోంది. సారపాకలో ఉన్న ఐటీసీ పీఎస్పీడీ రాష్ట్రప్రభుత్వ బెస్ట్ ఎంప్లాయీస్ ప్రాక్టీసెస్ అవార్డును, పాల్వంచలోని నవభారత్ వెంచర్స్ బెస్ట్ సీఎస్ఆర్ పెర్ఫార్మెన్స్ అవార్డు, అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీకి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు సాధించాయి. పాలనాపరంగా మరింత వికేంద్రీకరణ జరిగింది. జిల్లాలో గతంలో 205 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 479 కు చేరింది. కొత్తగా 274 పంచాయతీలు పెరిగాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా భద్రాద్రి జిల్లాలో గిరిజనులకు ఏకంగా 463 పంచాయతీలు రిజర్వు అయ్యాయి. ఆగస్టు 2 నుంచి కొత్త పంచాయతీలు అమలులోకి వచ్చాయి. పాలనా నియామకాల కోసం భద్రాద్రి పేరుతో ప్రభుత్వం మే 25న ప్రత్యేక జోన్ ఏర్పాటుచేసింది. ఈ జోన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 18లక్షల ఎకరాల్లో 11లక్షల ఎకరాలు అటవీ భూములే. ఈ నేపథ్యంలో భూసర్వే చేసిన యంత్రాంగం 3.19లక్షల ఎకరాలకు పట్టా పుస్తకాలు ఇవ్వడంతో పాటు, ఆర్ఓఎఫ్ఆర్ కింద మరో 79,184 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. రూ.2,242 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేస్తున్నారు. జిల్లాలో 2,804 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేశారు. జిల్లాలోని 1,826 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన ఇంట్రావిలేజ్ పనులు మాత్రం 20శాతం పూర్తయ్యాయి. రూ. 100 కోట్ల నిరాశ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్‌ప్లాన్ కింద రూ.100కోట్లు ఇచ్చేందుకు గత మూడు బడ్జెట్లలో పెడుతున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఒక్కపైసా విదల్చలేదు. భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశం గత రెండున్నర సంవత్సరాలుగా నిర్వహించలేదు. జిల్లా ఏర్పాటు తరువాత ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరగకపోవడం గమనార్హం. మణుగూరులో ఏరియా ఆసుపత్రి నిర్మించి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించలేదు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా సాకారం కాలేదు. మణుగూరు మండలంలోని చినరావిగూడెం–దుమ్ముగూడెం మండలం పర్ణశాల వరకు గోదావరి నదిపై వంతెన నిర్మాణం కోసం వచ్చిన నిధులను అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో ఖర్చు చేశారని స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. -
మణుగురులో గుబాలించిన గులాబీ
సాక్షి, మణుగూరుటౌన్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మణుగూరులో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు విచ్చేశారు. కేసీఆర్ సభ దృష్ట్యా మణుగూరు గులాబీమయమయింది. సీటైప్ సంతోష్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు 12 గంటలకే సభాప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి సుమారుగా 25 వేల మంది జనం తరలివచ్చారు. షెడ్యూల్ ప్రకారం మణుగూరులో సీఎం కేసీఆర్ సభ 1 గంటకు ప్రారంభం కావాల్సి ఉండగా 2:48 గంటకు హెలికాప్టర్ ద్వారా మణుగూరు చేరుకున్నారు. సభా ప్రాంగంణం 10 వేల మందికి ఏర్పాటు చేశారు. అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో జనం రావడంతో హనుమాన్‌టెంపుల్ వరకు జనంతో జాతరను తలపించింది. సభా ప్రాంగణం సరిపోక పోవడంతో పక్కన వున్న ఖాళీ ప్రదేశం నుంచి, పక్కన ఉన్న భవనాలు గోడలు, భవనాలపై నిలబడి ప్రజలు కేసీఆర్ ప్రంగాన్ని తిలకించారు. సీఎం కేసీఆర్ పినపాక నియోజకవర్గానికి మొదటి సారి రావడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మణుగూరుకు రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అంతేకాకుండా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి మణుగూరు కోల్‌బెల్ట్‌కు రావడంతో కార్మికులు కూడా భారీగా సభకు హాజరయ్యారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి తోగ్గూడెం సమ్మక్క సారలమ్మ టెంపుల్ వరకు భారీగా ట్రాపిక్ జామ్ అయింది. కేసీఆర్ మాట్లాడుతూ... పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. జనాన్ని చూసి కేసీఆర్ ‘పాయం’ గాలి బాగుంది భారీ మెజారిటీతో గెలుపుఖాయమని అనడంతో జనం కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది. -
కాంగ్రెస్ వల్లే ముందస్తు ఎన్నికలు : కేసీఆర్
సాక్షి, మణుగూరు : అభివృద్దికి అడుగడుగున అడ్డం పడుతున్న కాంగ్రెస్ నేతల వల్లే ముందస్తు ఎన్నికలకు వచ్చామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగిన ప్రజాశ్వీరాధ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పోడు భూముల సమస్య ఎజెన్సీ ప్రాంతంలో తీవ్రంగా ఉందని, అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిచ్చి.. పోడు రైతులకు హక్కులు కల్పిస్తామన్నారు. వీటికి రైతు బంధు, రైతు భీమా పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమం ప్రజల ముందే ఉందని, ప్రజలు నిజ నిజాలు గుర్తించి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తేలిగ్గా నిర్ణయం తీసుకోవద్దని, మళ్లీ కాంగ్రెస్, టీడీపీలను నమ్మితే అంతే సంగతులను హెచ్చరించారు. 58 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనలోని కరెంట్ సరఫరాకు ఇప్పటి సరఫరాకు తేడా గమనించాలన్నారు. ఈ సారి బ్రహ్మాండమైన మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కానీ పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఢిల్లీ పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలని, అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. పినపాక టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కొత్తగూడెం సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడటం వల్లే కొత్తగూడెం జిల్లాగా అవతరించిందన్నారు. జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీ, మినీ ఎయిరోడ్రమ్ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
భార్య, అత్తపై విచరక్షణా రహితంగా దాడి
-
భార్య, అత్తపై ఎస్సై దారుణం
మణుగూరు : అధికారం ఉంది కదా అనే అహంకారంతో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. భార్య తన తప్పును ఎత్తిచూపడంతో సహించలేక వీరంగం సృష్టించాడు. భార్య, అత్తపై విచక్షణా రహితంగా దాడి చేసి మృగంలా ప్రవర్తించాడు. బాధితులు తెలిపిన వివరాలు... పాల్వంచకు చెందిన పర్వీన్, మణుగూరు ఎస్సై జితేందర్, 2015 ఖమ్మంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. అయితే ఏడాది నుంచి ఆమెను కాపురానికి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. ఇదే విషయం అడిగేందుకని పర్వీన్, ఆమె తల్లి... మహిళాసంఘాల నాయకులు, బంధువులతో కలిసి మణుగూరు పీవీ కాలనీ సీ–టైప్‌లోని ఎస్సై ఇంటికి వచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎస్సై జితేందర్ భార్య, అత్తపై దాడి చేశారు. ఈ ఘటనలో పర్వీన్ తీవ్రంగా గాయపడ్డారు. ‘ఎస్సై జితేందర్, వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందుకే పర్వీన్‌ను కాపురానికి తీసుకెళ్లడం లేదు. పైగా, ‘నువ్వు రావద్దు, నాకు విడాకులు ఇవ్వు’ అని తరచూ వేధిస్తున్నాడంటూ’’ పర్వీన్ బంధువులు ఆరోపించారు. ఈ దాడిపై, మణుగూరు పోలీస్ స్టేషన్లో పర్వీన్ పిర్యాదు చేశారు. సీఐ వివరణ.. ఈ ఘటనపై మణుగూరు సీఐ కోండ్ర శ్రీనును ‘సాక్షి’ వివరణ కోరగా... బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడతామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మణుగూరులో గ్రామాన్ని ముంచెత్తిన వరద నీరు
-
ఏజెన్సీలో ఉగ్రమూలాలు!
మణుగూరు : మావోయిస్టు æప్రభావిత ప్రాంతంగా పేరున్న మణుగూరు సబ్ డివిజన్లో గత సంవత్సర కాలంలో ఉగ్రవాద మూలాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఈ ప్రాంత వాసులకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర పోలీసులు గుర్తించడం గమనార్హం. ఈనెల 12న రాత్రి జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గుగూ తమ సంస్థకు చెందిన వారేనని అన్సార్ గజ్వతుల్ హింద్(ఏజీòహెచ్) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, ఈ ముగ్గురిలో ఒకరు అశ్వాపురానికి చెందిన యువకుడు మహ్మద్ తౌఫిక్(27) కావడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ వార్త మణుగూరు సబ్‌డివిజన్‌లో సంచలనం రేకెత్తించింది. తౌఫిక్ అశ్వాపురంలోని భారజల కర్మాగార ఉద్యోగి రజాక్ చిన్న కుమారుడిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో యువత ఉగ్రవాద భావాలపై మొగ్గు చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. సబ్‌డివిజన్‌లో పెరుగుతున్న ఉగ్రభావాలు మణుగూరు సబ్ డివిజన్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, పరిచయాలు ఎక్కువగా కలిగిన వ్యక్తులు క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. 5 నెలల క్రితం మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న సోమేశ్వరరావు అనే మత ప్రవక్తను హైదరాబాద్ పోలీసులు రామానుజవరం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తీవ్రవాదిగా మారిన యువకుడు... మహ్మద్ తౌఫిక్ హెవీ వాటర్‌ప్లాంట్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. డిప్లొమా చదివేందుకు వనపర్తి వెళ్లి.. మధ్యలోనే చదువు మానేసి వచ్చాడు. ఆ తర్వాత అశ్వాపురంలోనే ఉంటూ దొంగతనాలు చేస్తూ 2009లో పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత కాలనీలో ఆకతాయిలతో కలిసి పలు అల్లర్లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. 2016 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే చదువుకుంటున్నట్లు తల్లిదండ్రులను నమ్మించాడు. ఈ క్రమంలో తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పడ్డాయి. కాగా, తౌఫిక్ అన్సార్ గజ్వతుల్ హింద్ అనే తీవ్రవాద సంస్థలో కీలకంగా పనిచేశాడని ఎన్కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చింది. తన కొడుకు సమాజంలో పరువుపోయే పని చేశాడని, వాడి శవం కూడా తనకు వద్దని మృతుని తండ్రి రజాక్ ‘సాక్షి’కి తెలిపారు. మణుగూరు సబ్‌డివిజన్‌పై పెరిగిన నిఘా తీవ్రవాద భావాలు గల వ్యక్తులు మణుగూరు సబ్ డివిజన్లో పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడి తీవ్రవాద మూలాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మహ్మద్ తౌఫిక్ కదలికలపై ముందుగానే సమాచారం తెలుసుకొని అతనిపై నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అతడి ఆచూకీ కోసం 3 నెలల క్రితం కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్‌లో, సెక్యూరిటీలో, అశ్వాపురం పట్టణలో పలు వివరాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. తౌఫిక్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు, స్నేహితులు, అతనితో కలిసి సోషల్ మీడియాలో భావాలు పంచుకున్న వ్యక్తులపై కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు, రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు. ఇలా చేస్తాడని ఊహించలేదు : మహ్మద్ రజాక్, తౌఫిక్ తండ్రి తౌఫీక్ మృతిపై అతడి తండ్రి రజాక్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా తన కుమారుడు ఇలా చేస్తాడని అనుకోలేదని అన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు జాబ్ చేస్తున్నానని చెప్పాడని, వ్యాపారం చేస్తానంటూ ఆరు నెలల క్రితం రూ.30,000 తీసుకెళ్లాడని తెలిపారు. తన కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. అతడి మృతదేహానికి తనకు ఏ సంబంధం లేదని చెప్పారు. -
భార్యను చంపిన భర్త
మణుగూరుటౌన్: కట్టుకున్న భార్యకు తోడు నీడగా ఉండాల్సిన భర్తే ఆమెపాలిట కాలయముడయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఇది సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన నోముల లింగయ్య, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తన భార్య నాగమణి(50)ని సోమవారం రాత్రి అడిగాడు. ఆమె నిరాకరించడంతో బీరువాలో ఉన్న నగదును తీసుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన లింగయ్య, పక్కనే ఉన్న కత్తితో ఆమెను పొడిచాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోఆమె మృతిచెందింది. నాగమణిని ఆమె భర్త నోముల లింగయ్య, కోడలు నోముల అరుణ కలిసి హత్య చేశారంటూ మృతురాలి అక్క కొండ వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో మణుగూరు సీఐ మొగిలి, కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నారు. -
50 కేజీల గంజాయి స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని మణుగూరులో పోలీసులు జరిపిన తనిఖీల్లో 50కేజీల గంజాయి పట్టుబడింది. పట్టణ ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టిన పోలీసులు స్కార్పియోలో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో ఓ కత్తి, ఇనుపరాడ్‌తో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మణగూరు సీఐ మొగిలి తెలిపారు. గంజాయి ప్యాకెట్లను స్థానిక ఎమ్మార్వో తిరుమలాచారి పరిశీలించారు. కేసు నమోదు చేసి మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి
మణుగూరు: కొత్తగూడెం జిల్లా మణుగూరు పాత కాట వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబాయిగూడెంకు చెందిన ఆకుకూరల రైతులను ఎక్కించుకుని మణుగూరు వెళ్తున్న టాటా మేజిక్ ఆటోను మణుగూరు నుంచి సాంబాయిగూడెం వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘భద్రాద్రి’ తనిఖీ నివేదిక సానుకూలం
కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదిక యాదాద్రి ప్లాంట్‌కు అనుమతులపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 (4x270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) సాధ్యమేనని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదించింది. పర్యావరణ అనుమతులు రాకముందే పనులు చేపట్టిన దృష్ట్యా అసలు ఈ ప్లాంట్‌కు ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ సాధ్యమేనా? కాదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని నెలల కింద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ గత నెల 17-19 తేదీల్లో మణుగూరులో తనిఖీలు జరిపి ఆ శాఖకు సమగ్ర అధ్యయన నివేదిక సమర్పిం చింది. మొత్తం ప్లాంట్ నిర్మిత ప్రాంతంలోని 1.85% భాగంలో మాత్రమే జెన్కో పనులు చేపట్టిందని, ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సాధ్యమేనని నివేదించింది. ఈ కమిటీలోని ఓ సభ్యుడు మాత్రం ప్రస్తుత పరిస్థితిలో అసెస్మెంట్ కష్టమని విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత నెల 29,30వ తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) ఈ నివేదికపై చర్చించి మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని ఆమోదించింది. యాదాద్రి నివేదిక తయారీలో జెన్కో గ్రంథ చౌర్యం.. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 (5x800) మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల జారీ అంశంపై నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ మరోసారి వాయిదా వేసింది. ఇతర ప్లాంట్ల నివేదికలను కాపీ పేస్ట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను జెన్కో తయారు చేసి గ్రంథ చౌర్యానికి పాల్పడిందని ఆక్షేపించింది. జెన్కోపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫారసు చేసింది. బొగ్గు రవాణా కోసం రైల్వే, పోర్టులతో ఒప్పందాలు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు తదితర వివరాలతో కొత్త నివేదికను సమర్పిం చాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నిర్వహించిన బహిరంగ విచారణలో వచ్చిన ప్రజల అభ్యం తరాలకు సమాధానాలను ప్రధాన పత్రికల్లో ప్రచురించాలని, జెన్కో వెబ్సైట్లో ప్రదర్శనకు ఉంచి ప్రజల నుంచి తదుపరి అభ్యంతరాలను స్వీకరించాలని ఆదేశించింది. -
నీలకంఠేశ్వరా..ద్విలింగ రూపుడా
కాకతీయ చరిత్రకు నిదర్శనం – ఢిల్లీ సుల్తానుల దాడిని ఎదుర్కొన్న దేవాలయ ప్రాంతం రెండు శివలింగాలుండడం ఇక్కడి ప్రత్యేకం మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి వారి చరిత అనేకం కాకతీయుల కాలంలో విరాజిల్లి పూజలందుకున్న పవిత్ర లింగం..900 ఏళ్లు శిథిలాల్లో కలిసి బయల్పడిన మహిమాన్విత లింగం..మరెక్కడా లేనివిధంగా భూగర్భంలో పూజలందుకుంటున్న నీలకంఠేశ్వర లింగం..మణుగూరులో దర్శనమిస్తోంది. ఇక్కడికొస్తే భక్తిభావమే కాదు..చారిత్రక ఆనవాళ్లను మననం చేసుకోవచ్చు. గరళకంఠుడైన మహాశివుడు..ఇక్కడి ఆలయంలో పానవట్టం కింద ఉన్న శివలింగంతో పాటు, కచ్చితంగా అదే స్థానంలో ఆలయం కిందిభాగంలో పూజలందుకోవడం..అరుదైన, అద్వితీయ అనుభూతిని అందిస్తోంది. భక్తి, ఆరాధనతో కొలిస్తే..పునీతం చేస్తోంది. – మణుగూరు శతాబ్దాల చరితం..దర్శిస్తే పునీతం మణుగూరులోని కాకతీయుల కాలంనాటి శ్రీ నీలకంఠేశ్వరాలయం కాకతీయుల చరిత్రకు మచ్చుతునకగా నిలుస్తోంది. చరిత్రను పరిశీలిస్తే ఈ ఆలయాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు 1161లో నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోటకట్ట అనేవారు. ఈ ఊరిని మణిపురంగా పిలిచేవారు. కాకతీయుల కాలంలో విరాజిల్లిన నీలకంఠేశ్వరాలయాన్ని అనంతర కాలంలో మహ్మదీయ రాజులైన ఢిల్లీ సుల్తానులు 1162లో ధ్వంసం చేశారు. ఇక్కడ శిథిలాలు, మట్టిదిబ్బలో శివలింగం ఉండింది. ఇక్కడికి సమీపంలోని ప్రాచీన వేణుగోపాలస్వామి ఆలయంలో కన్నె వీరభద్రయ్య అనే ఓ సన్యాసి ఉండగా..ఆయనకు కలలో శివలింగం ఉన్నట్లు కనిపించడంతో మట్టిదిబ్బను తన శిశ్యులు మల్లిడి లాలయ్య, పూజారి తాతయ్య, పాల్వాయి రామచంద్రయ్య, కందుకూరి అనంతరామయ్యలతో 1958లో తవ్వించారు. దాదాపు 900 ఏళ్లతర్వాత ఇక్కడ భూగర్భంలో శివలింగం బయల్పడింది. ఇనేళ్ల చరిత కలిగిన స్వామివారిని పూజిస్తే జీవితం పునీతం అవుతుందని భక్తుల విశ్వాçÜం. ======================= భూగర్భ దర్శనం..స్వామివారి ప్రత్యేకం శివలింగంతో పాటు బయల్పడిన నంది, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిషి్ఠంచారు. శివలింగాన్ని భూగర్భం నుంచి పైకి తెచ్చి ఆలయం నిర్మించాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో..అప్పటి నుంచి ఇలా భూగర్భంలోనే ఉంచుతున్నారని స్థానికులు మల్లిడి లాలయ్య తెలిపారు. 1995 తర్వాత పలువురు దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. భూగర్భంలో ఉన్న శివలింగాన్ని యథావిథిగా ఉంచేసి..పైభాగంలో మరోటి ప్రతిషి్ఠంచారు. భూగర్భంలో ఉన్న లింగానికి సీలింగ్ పైభాగంలో జాలీ ఏర్పాటు చేసి..రెండు లింగాలకు పానవట్టాలు ఉంచారు. ఇక్కడ ఒకేసారి భూగర్భంలో, పైభాగంలో స్వామివార్లను దర్శించుకోవడాన్ని భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించి పులకిస్తుంటారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయంలో శివరాత్రి, కార్తీక మాస పూజలను ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయ పూజారిగా రామచంద్రమూర్తి వ్యవహరిస్తున్నారు. శివలింగానికి గోదావరి జలాలతో సహస్ర ఘటాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. -
మునుగూరు!
lకట్టువాగుకు రివిట్మెంట్ లేక అవస్థలు lఆక్రమణలకు గురవుతున్న కాలువలు lపూడికతీత ఊసెత్తని ‘సింగరేణి’ lనరకయాతన పడుతున్న కాలనీవాసులు రివిట్మెంట్ లేని కట్టువాగు.. ఆక్రమణలకు గురవుతున్న వాగులు, కాల్వలు.. కుచించుకుపోతున్న కాల్వల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం.. ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు.. వర్షం వచ్చిందంటే మణుగూరు ప్రజల పరిస్థితి కక్కలేక.. మింగలేకుండా ఉంది. వర్షాకాలం ఎక్కువ భాగం కాలనీలు ముంపునకు గురవుతుండడంతో నరకయాతన పడాల్సి వస్తోంది. – మణుగూరు మణుగూరు: మణుగూరు ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల పట్టణం దాదాపు 90 శాతం జలమయం అయింది. పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న కట్టువాగు, ఆంధ్రా బ్యాంకు సమీపం నుంచి ప్రవహించే సింగారం అలుగు కాలువ పలుచోట్ల అక్రమణలకు గురికావడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు అంటున్నారు. దాదాపు 90 శాతం వీధులు జలమయం కావడంతోపాటు కొత్తగూడెం–ఏటూరునాగారం ప్రధాన రహదారిపైకి సైతం వరద నీరు చేరడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సుందరయ్య నగర్, శ్రీశ్రీనగర్, గాంధీ నగర్, ఆదర్శ నగర్, మేదరబస్తీ, లెనిన్ నగర్, కాళీమాత ఏరియా, చేపల మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాలు వరద నీటితో నిండిపోయి.. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పలసింగారం నుంచి వచ్చే సింగారం అలుగు కాలువ అనేక చోట్ల ఆక్రమణలకు గురికావడంతో వర్షం వచ్చినప్పుడు కాలువ పొంగి.. వరద నీరు వీధులు, ఇళ్లలోకి వస్తోంది. అలాగే స్టేట్‌బ్యాంక్ పక్క నుంచి ప్రవహించే కట్టువాగు నీరు గతంలో మణుగూరు చెరువులోకి సాఫీగా వెళ్లేది. దీని పైభాగంలో ఆక్రమణలు, కిందిభాగంలో భారీగా పూడిక పేరుకుపోవడంతో వర్షం వచ్చినప్పుడు పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. కాలువల ఆక్రమణల వల్ల రివిట్మెంట్ కట్టే విషయం మరుగున పడుతోంది. ఇక పూడిక తీయకపోవడంతో మణుగూరు చెరువు అనుకున్న సమయానికి నిండే పరిస్థితి లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. పూడిక తీతకు సహకరిస్తామని ఎమ్మెల్యేకు చెప్పిన సింగరేణి అధికారులు సైతం ముఖం చాటేయడం గమనార్హం. దీంతో సింగరేణి సహకారం అంతంతమాత్రమే అన్నట్లుగా ఉంది. పైభాగంలో ఆక్రమణలు, కిందిభాగంలో పూడిక తీయకపోవడంతో వరద నీరు నేరుగా వీధులు, ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. దీంతో కొన్ని రోజులపాటు పట్టణంలో మురుగు పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చినప్పటి నుంచి వర్షాలు తగ్గేవరకు పట్టణ ప్రజలు భయంభయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
మణుగూరు :ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో మంగళవారం స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విప్పల సింగారం నుంచి జీఎం ఆఫీసు రోడ్డులో వస్తున్న హోలీ ఫ్యామిలీ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి... అదుపుతప్పి బస్సు కాల్వలోకి దూసుకెళ్ల్లింది. అందులోని ఐదుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఖమ్మం : ఖమ్మం జిల్లా మణుగూరులో మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న మురళీమోహన్ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 4 వేలు నగదుతోపాటు 300 మత్తు ఇంజక్షన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మురళీమోహన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలపల్లి ప్రభుత్వాసుపత్రిలో మురళీమోహన్ ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. -
మున్సి‘పోల్స్’?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: త్వరలో పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రితోపాటు ఈ రెండింటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ప్రభుత్వం కూడా గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఈ రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై చర్చ సాగుతోంది. 50 శాతం వార్డులు, చైర్మన్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేస్తూ గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎన్నికలు జరుగుతారుు. ఎన్నికలు ఎందుకు జరగలేదంటే.. ఏజెన్సీ ఏరియాలో ఉన్న గ్రామపంచాయతీ పరిధిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసే విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి ఎన్నికలు జరపాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలి. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల చట్టాలను ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వర్తింపచేయాలని పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగ సవరణ సాధ్యం కాకపోవడంతో ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ అంశం పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఆదిలాబాద్ జిల్లా మందమర్రితోపాటు జిల్లాలోని పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. పాల్వంచ మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగి ఆ తర్వాత నిలిచిపోయాయి. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయడం, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలు నిర్వహించడంపై కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు జరగలేదు. మణుగూరుకు ఒక్కసారీ ఎన్నికలు లేవు.. మణుగూరు పంచాయతీని 2005లో మే 31న థర్డ్‌గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపాలిటీగా ఏర్పాటైన సమయంలో పంచాయతీలో 20 వార్డులు, 26వేల మంది జనాభా ఉంది. అయితే అప్పట్లోనే ఏజెన్సీ పరిధిలోని పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేస్తే పన్నులు పెరుగుతాయని గిరిజన సంఘాల నేతలు బండారు నాగేశ్వరరావు, వట్టం రాంబాబులతోపాటు భద్రాచలం పట్టణానికి చెందిన యాసం రాజులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంటీరియర్ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ పరిస్థితులతో ఒక్కసారి కూడా మణుగూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం మణుగూరు మున్సిపాలిటీ జనాభా 23 డివిజన్లలో 42 వేలు ఉంది. సింగరేణి నిర్వాసిత ప్రాంతాలైన ఎగ్గడిగూడెం, మల్లేపల్లి, పద్మగూడెం, కొమ్ముగూడెం గ్రామాలు ఖాళీ కావడంతో రెండు డివిజన్లు లేకుండా పోయాయి. అదే విధంగా అన్నారం, చినరాయిగూడెం, కమలాపురం గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగిం చాలని ఆప్రాంతాల ప్రజలు సైతం కోరుతున్నారు. ఈగ్రామాలు తొలగించి సమితిసింగారంలోని పట్టణ ప్రాంతాన్ని మున్సిపాలిటీలో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత తెరపైకి.. పాల్వంచకు 16 ఏళ్లు, మణుగూరుకు 11 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదనే వాదనలున్నాయి. అయితే ఏజెన్సీ చట్టాల ప్రకారం ఆస్తి పన్ను, ఇతర పన్నులపై వివాదం కొనసాగుతోంది. ఏజెన్సీలోని మున్సిపాలిటీలను 50 శాతం రిజర్వేషన్లతోపాటు చైర్మన్ పదవులను కూడా ఎస్టీలకు కేటాయించాలనే డిమాండ్లున్నాయి. ఇదంతా పార్లమెంట్ పరిధిలో ఉండటంతో చట్ట సవరణ జరగడానికి చాలాకాలం పట్టే అవకాశం ఉంది. ఈపరిస్థితుల్లో ఎన్నికల సంఘం చొరవ తీసుకుని వీటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఒడిశా తరహాలో గవర్నర్ ప్రత్యేక అనుమతితో ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో ఈ దిశగా ప్రభుత్వం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసింది. దీంతో ఈ మున్సిపాలిటీల ఎన్నికలకు మార్గం సుగమమవుతుందా..? లేదా మళ్లీ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తారా..? అని జిల్లావ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేచింది. పాల్వంచ పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడంతో పాల్వంచ మున్సిపాలిటీని రద్దు చేయలేక, మున్సిపల్ పాలక వర్గ ఎన్నికలు నిలిపివేశారు. అసలు షెడ్యూల్డ్ ఏరియాని మున్సిపల్ ఏరియాగా మార్చే వీలు లేకున్నా అప్పటి పాలకులు, అధికారులు పారిశ్రామికంగా వేగంగా విస్తరిస్తున్న పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయాలని 1987 ఫిబ్రవ రిలో పాల్వంచ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అదే ఏడాది మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల పదవీ కాలం అనంతరం మూడేళ్లపాటు ఎన్నికలు నిలిపివేశారు. తిరిగి 1995 మార్చిలో ఎన్నికలు జరగగా, ఆ కౌన్సిల్ 2000 వరకు కొనసాగింది. అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడంతో ఎన్నికలు లేకుండా నిలిచిపోయాయి. తొలిసారి పాల్వంచ ఎన్నికలు జరిగినప్పుడు జనాభా 25వేలు ఉండగా.. ప్రస్తుతం 24 వార్డులు.. 80వేలకు జనాభా చేరింది. -
మార్పు తప్పదు!
బీటీపీఎస్ నిర్మాణంపై నీలినీడలుముందుచూపు లేని టీఎస్ జెన్కోకేంద్రం సీరియస్ కావడంతోపునరాలోచన పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్ల గగ్గోలు మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) నిర్మాణంపై అస్పష్టత నెలకొంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సీతారాంపురం గ్రామాల వద్ద నిర్మించే ప్లాంటు, ఉత్పత్తికి సంబంధించి కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడమే కాక కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు ల శాఖ నుంచి ఎలాంటి పర్యావరణ అనుమతులు రాకుండానే హడావుడిగా బీహెచ్ఈఎల్ ద్వారా టీఎస్ జెన్కో నిర్మాణ పనులు మొదలుపెట్టి.. శరవేగంగా చేయిస్తుండడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గత ఏడాది సెప్టెంబర్ నుంచే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఒక్కొక్కటి 270 యూనిట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్ల ద్వారా 1,080 మొగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో సుమారు 1100 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భూనిర్వాసిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీలు చెల్లించకపోవడంతోపాటు ఉద్యోగాలు కోరుకున్న 371 మంది యువతకుఇప్పటికీ ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు మాత్రం శరవేగంగా జరిగాయి. 2016 డిసెంబర్ కల్లా మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో యూనిట్ పనులతోపాటు స్విచ్‌యార్డ్, బాయిలర్, చిమ్నీ పనులు సైతం పునాది దశను దాటాయి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మానవ హక్కుల వేదిక ద్వారా నేషనల్ ట్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పర్యావరణ అనుమతులు లేనందున భద్రాద్రి పనులు నిలిపేయాలని జెన్కోను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే కోరుతూ టీఎస్ జెన్కో హైకోర్టును ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు లేనందున పనులెలా చేస్తారని హైకోర్టు సైతం జెన్కోను ప్రశ్నించింది. ఇందులో హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ప్రతివాదిగా చేర్చింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి వచ్చిన డిప్యూటీ డెరైక్టర్ కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ పనులను తనిఖీ చేసుకుని వెళ్లి.. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ సీరియస్‌గా పరిగణించడంతోపాటు హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ సైతం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులపై ప్రశ్నించింది. దీంతో 20 రోజుల కిందట ప్లాంట్ పనులు పూర్తిగా నిలిపేశారు. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయమై ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయింది. ఏ అధికారి సైతం ఈ విషయమై స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు సబ్ కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోగా, యంత్రాలు ఆపివేయడంతో అవి దెబ్బతింటాయని ఆందోళనకు గురవుతున్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవలంబిస్తేనే అనుమతులు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, విద్యుత్ శాఖల నిబంధనల ప్రకారం 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంకన్నా ఎక్కువగా ఉంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే 1080 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నందున కాలుష్యం తక్కువగా వెదజల్లే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ మాత్రమే వాడుతుండడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినప్పటికీ పనులు చేపట్టడంతో పరిస్థితి గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం బంతి హైకోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ అంశాలపై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారడంతోపాటు దీనికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ మారిస్తేనే పర్యావరణ అనుమతులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పటివరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో జెన్కోపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో టీఎస్ జెన్కో పునరాలోచనలో పడింది. మరోవైపు కాలం చెల్లిన మెటీరియల్ వదిలించుకునేందుకు బీహెచ్ఈఎల్ పనికిరాని పరికరాలను టీఎస్ జెన్కోకు అంటగట్టేందుకు ప్రయత్నించిందనే అనుమానాలను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ, పరికరాలు మారిస్తేనే బీటీపీఎస్‌కు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. -
మణుగూరులో కార్డన్ సెర్చ్
మణుగూరు (ఖమ్మం) : ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వందల లీటర్లలో నాటుసారాను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. -
మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచి మేనేజర్ ఆత్మహత్య
ఖమ్మం : ఖమ్మం జిల్లా మణప్పురం గోల్డ్‌లోన్ మణుగూరు బ్రాంచి మేనేజర్ మేరిపురి రాజు(28) బుధవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన రాజు మణుగూరులో మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అందులోని ఉద్యోగులంతా ఆఫీస్ పక్కనే ఉన్న ఒక గదిలో ఉంటున్నారు. ఉద్యోగులంతా ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఉండగా రాజు గదికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల బ్రాంచీలో రూ.1.20 లక్షలు లోటు రావడంతో ఉద్యోగులంతా కలిసి దాన్ని పూడ్చారు. కంపెనీలోని పై అధికారుల ఒత్తిడి, తన మూలంగా కిందిస్థాయి ఉద్యోగులు ఇబ్బంది పడ్డారనే ఆత్మన్యూనతాభావం రాజును వెంటాడింది. అదే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించిన సీఐ పెద్దన్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమపేరుతో మోసం - కట్నం కోసం మరో యువతితో పెళ్లి
ఖమ్మం: అతను చేసేది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం. ఓ యువతిని ప్రేమించాడు. మోసం చేశాడు. కట్నం కోసం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మణుగూరులో ఈ ఘటన జరిగింది. ఆ కానిస్టేబుల్ ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తరువాత అదనపు కట్నం కోసం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయిన యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
రూ. 39,000 కోట్లతో కొత్త కాంతులు
* ప్లాంట్ల నిర్మాణ అంచనాలతో టీ సర్కారుకు జెన్ కో నివేదిక * మణుగూరు, కొత్తగూడెంపై ప్రత్యేకంగా దృష్టి * విదేశీ బొగ్గును వినియోగించే యోచన * భూసేకరణే ప్రధాన అవరోధం * మిగతా విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కొనసాగుతున్న పరిశీలన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించ తలపెట్టిన కొత్త థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు రూ.39 వేల కోట్లు ఖర్చవుతాయని జెన్కో లెక్కగట్టింది. స్థానికంగా బొగ్గు లభ్యం కాకపోతే... మొత్తం విదేశీ బొగ్గుతోనే ఈ కొత్త ప్రాజెక్టులను నిర్వహించాలని యోచిస్తోంది. అయితే ప్రాజెక్టులన్నింటికీ భూసేకరణే ప్రధాన అవరోధంగా మారనున్నట్లు భావిస్తోంది. ఈ మేరకు కొత్త ప్లాంట్లకు అంచనా వ్యయంతో పాటు యూనిట్ల నిర్మాణానికి ఎంత విస్తీర్ణంలో భూములు అవసరం? అందుబాటులో ఉన్నదెంత? అదనంగా ఏ మేరకు భూసేకరణ చేపట్టాలి? ఎంత మేరకు నీరు, బొగ్గు అవసరం? అనే వివరాలతో తాజా నివేదికను రాష్ట్ర ఇంధన శాఖకు సమర్పించింది. భారీగా నిధులు అవసరం.. జెన్కో అంచనాల ప్రకారం కొత్తగా ప్రతిపాదించిన మణుగూరు థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం రూ.7,020 కోట్లు కావాలి. కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టులో నిర్మించనున్న ఏడో యూనిట్‌కు రూ. 5,200 కోట్లు, తర్వాత చేపట్టనున్న కాకతీయ థర్మల్ ప్లాంట్ మూడో దశ, రామగుండం, సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ. 26,780 కోట్లు అవసరం. ఇక అవసరమైన భూమిని పరిశీలిస్తే... కొత్తగూడెంలో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి మొత్తం 460 ఎకరాలు కావాల్సి ఉంది. ప్రస్తుతం పాల్వంచలో ఉన్న కేటీపీపీ పరిసరాల్లోనే 230 ఎకరాలు అందుబాటులో ఉంది. అదనంగా మరో 230 ఎకరాల భూమి సేకరించాలి. ఈ మేరకు ప్రతిపాదనలను జెన్కో ఇప్పటికే పాల్వంచ ఆర్డీవోకు అందజేసింది. ఈ ప్లాంటు నిర్వహణకు 25 క్యూసెక్కుల నీరు అవసరం. బూర్గంపాడు సమీపంలో గోదావరి నుంచి ప్రస్తుతమున్న 25 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా ఈ నీటిని సరఫరా చేసుకునే వీలుంది. ఇక ఈ యూనిట్‌కు ఏడాదికి 4.72 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఎక్కువ నాణ్యత ఉండే విదేశీ బొగ్గును వాడితే.. 2.70 మిలియన్ టన్నులు సరిపోతుందని అంచనా. దేశీయంగా సరిపడేంత బొగ్గు లభ్యం కాని పక్షంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుని.. 440 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ పోర్టు నుంచి రవాణా చేసుకునే వీలుందని జెన్కో నివేదికలో పొందుపరిచింది. సగం దేశీయ బొగ్గు, సగం విదేశీ బొగ్గు వినియోగించే ప్రతిపాదనలతో పాటు పూర్తిగా విదేశీ బొగ్గును వాడుకునేలా... రెండు విధాలుగా ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేసింది. ఇక మణుగూరు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం 1080 మెగావాట్ల ఉత్పత్తికి నాలుగు 270 మెగావాట్ల యూనిట్లను స్థాపించనున్నారు. మొత్తం 1,031 ఎకరాల భూమి అవసరమని జెన్కో గుర్తించింది. ఇటీవలే భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి రూ. 51 కోట్లను జెన్కో ఇప్పటికే రెవెన్యూ విభాగానికి డిపాజిట్ చేసింది. మణుగూరు ప్లాంట్‌కు 40 క్యూసెక్కుల నీరు అవసరం. ప్రాజెక్టుకు అవసరమైన 3.40 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని, కాకినాడ పోర్టు నుంచి 500 కిలోమీటర్లు రవాణా చేసుకోవాల్సి ఉంటుందని జెన్కో నివేదికలో పేర్కొంది. బీహెచ్ఈఎల్కు పనులు.. మణుగూరు, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఈపీసీ విధానంలో బీహెచ్ఈఎల్కు అప్పగించింది. ఒప్పందం ప్రకారం కేవలం 30 నెలల వ్యవధిలోనే మణుగూరు ప్లాంట్ నిర్మాణానికి బీహెచ్ఈఎల్ అంగీకరించింది. నిర్మాణానికి సంబంధించిన ధరలతో పాటు యంత్రాలు, ప్లాంటుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై జెన్కో నియమించిన కమిటీ బీహెచ్ఈఎల్ మధ్య చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పాల్వంచ, మణుగూరు, పినపాక మండలాల్లో భూ సేకరణ ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకంగా మారనుంది. భూసేకరణ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుందని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేస్తోంది. దీంతో జెన్కో ఆశించిన సమయంలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయా.. లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
మణుగూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయూలి
మణుగూరు : మణుగూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి ఫోన్లో సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైబల్ వెల్పేర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దృష్టికి నియోకవర్గ సమస్యలను తీసుకెళ్లినట్లు తెలిపారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయూలని, నియోజకవర్గంలోని పులుసుబొంత ప్రాజెక్టు కిన్నెరసాని కాలువ పనులకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేయాలని కోరామని చెప్పారు. 11ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన పూర్తిచేయా ని, చెరువులు, కుంటలకు మరమ్మతులు చే యూలని, గిరిజన బాలికల రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరి నట్టు వివరించారు. పీహెచ్సీలో సిబ్బంది ని నియమించాలని, గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మిం చాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరామని తెలిపారు. మణుగూరు పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీలో ఖాళీలను భర్తీ చేయూలని కోరినట్లు చెప్పారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పం దించారని తెలిపారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. -
కొత్తగూడెం, మణుగూరులలో పవర్ ప్లాంట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం జెన్కో అధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యను ఎదుర్కొనేందుకు వారితో చర్చించారు. 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరులలో పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని రెండేళ్లలో పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యలను అధిగమిస్తామని కేసీఆర్ చెప్పారు. -
మణుగూరులో మరో 1,600 మెగావాట్ల ప్లాంట్లు!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మణుగూరు సమీపంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 2 యూనిట్లు ఏర్పాటు కానున్నా యి. ఈ మేరకు టీ జెన్కో ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇప్పటికే మణుగూరు ఏడూళ్ల బయ్యారం ప్రాంతంలో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు కలిపి 1,080 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలను బీహెచ్ఈఎల్(భెల్)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే మరోచోట 800 మెగావాట్ల 2 యూని ట్లను మొత్తం 1,600 మెగావాట్ల ప్లాంట్లను నిర్మిం చాలని నిర్ణయించినట్టు టీ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు ఖమ్మం కలెక్టర్ ఇలంబర్తిని తీసుకెళ్లి సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో ప్రభాకర్‌రావు మంగళవారం సమావేశమయ్యారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను ఇప్పటికే ప్రారంభించామని సీఎం కేసీఆర్‌కు కలెక్టర్ వివరించినట్టు తెలిసింది. మణుగూరు సమీపంలో మొత్తం 2,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ పేర్కొన్నట్టు సమాచారం. -
‘పవర్‌ప్లాంట్’ స్థల పరిశీలన
మణుగూరు : మణుగూరు మండలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 1080 మెగా వాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలాన్ని గురువారం ఢిల్లీకి చెందిన బీహెచ్ఈఎల్(భెల్) బృందం జిల్లా జేసీ సురేంద్రమోహన్‌తో కలిసి పరిశీలించింది. భెల్ సీనియర్ ఇంజనీర్ శ్రీనివాసరావు, సీనియర్ మేనేజర్ మధుసూదన్‌రావు, డిప్యూటీ మేనేజర్ అనిల్కండల్వాలా, సీనియర్ ఇంజనీర్ సోయబ్దుగ్గల్లు మండలంలోని రామానుజవరం పంచాయతీ చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సాంబాయిగూడెం గ్రామాల్లో భూమిని , గోదావరి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. భూ పరిశీలన పనులకు జేసీ శంకుస్థాపన చేశారు. అనంతరం భెల్ బృందానికి పవర్ ప్రాజెక్టు స్థలానికి సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. ఈ భూములను పరిశీలించిన భెల్ అధికారులు ప్రభుత్వం తర్వగా భూమి అప్పగిస్తే వెంటనే ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని అన్నారు. రెండు సంవత్సరాల్లోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల రైతులనుద్దేశించి జేసీ మాట్లాడారు. ప్రాజెక్టు పరిధిలో 477 ఎకరాల పట్టా భూమిలో 374 మంది రైతులు ఉన్నారని అన్నారు. అసైన్మెంట్ భూమి 240 ఎకరాల్లో 169 మంది రైతులు ఉన్నారని, ప్రభుత్వ భూమి 400 ఎకరాలు ఉందని అన్నారు. భూమి కోల్పోతున్న రైతులకు తగిన విధంగా పరిహారం అందిస్తామని, నిర్వాసిత గిరిజనులకు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని అన్నారు. త్వరలో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని, డిసెంబర్‌లోగా ప్రజాసేకరణ పూర్తి చేసి స్థలాన్ని అప్పగిస్తే నిర్మాణ పనులు వెంటనే ప్రారంభిస్తారని అన్నారు. పరిహారం గురించి రైతులు ఆందోళన చెందవద్దని, ఏ మాత్రం అన్యాయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మణుగూరు తహశీల్దార్ శ్రీనివాసులు, కేటీపీఎస్ ఎస్ఈ రాంప్రసాద్‌లతో పాటు స్థానిక ఆర్ఐలు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
చెత్త సింగారం
చెత్త సింగారం మణుగూరు : మండల పరిధిలోని సమితిసింగారం పంచాయితీ పరిధిలో సమస్యలు పేరుకుపోతున్నాయి. పంచాయితీ పరిధిలోని అశోక్‌నగర్, సాయినగర్, రాజీవ్గాందీనగర్, వెంకటపతినగర్, అరుందతీనగర్, కూనవరం ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త నిండి ఉంటుంది. కుండీలు నిండినా పట్టించుకనే దాఖలాలులేవు. అశోక్‌నగర్‌లోని ప్రధాన రహదారిలో దుమ్ము కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. పాలక మండలి ఏర్పాటై ఆరు నెలలు దాటినా పంచాయితీలో ఎటువంటి అభివృద్ది జరగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
'దొంగగా భావించి యువతిని చితకబాదారు'
మణుగూరు : షాపింగ్‌కు వచ్చిన ఢిల్లీకి చెందిన ఓ యువతిపై ఖమ్మం జిల్లా మణుగూరులో దాడి జరిగింది. తెలుగు భాష రాకపోవడంతో దొంగగా భావించిన ఓ షాపు యాజమాన్యం ఆమెను చితకబాదింది. స్థానిక నీలగిరి సూపర్ మార్కెట్లో సరుకులు కొందామని ఢిల్లీకి చెందిన సంజు అనే యువతి వచ్చింది. అయితే ఆమెకు తెలుగు రాకపోవడంతో దొంగగా భావించిన సూపర్‌మార్కెట్ యాజమాన్యం ఆమెపై దాడి చేసింది. దెబ్బలకు తాళలేక ఆమె బయటకు పరుగెడుతున్నా.. యాజమాన్యం విడిచి పెట్టలేదు. వెంటపడి మరీ ఆమెను చితక్కొట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. సూపర్‌మార్కెట్ యాజమాన్యం అత్యుత్సాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సూపర్‌మార్కెట్ యాజమాన్యంపై సంజు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
దొంగ అనుకుని చితకొట్టిన జనం
-
డ్వాక్రా సంఘాల స్కాలర్షిప్లు స్వాహా
ఖమ్మం: డ్వాక్రా సంఘాల స్కాలర్షిప్లను స్వాహా చేసిన ఘటన జిల్లాలోని మణుగురు, పినపాక మండలాల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. తమకు రావాల్సిన స్కాలర్షిప్లను కాజేసారని కొందరు మహిళలు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) సిబ్బంది చేతివాటం ప్రదర్శించి స్కాలర్షిప్లను స్వాహా చేసారని మహిళలు ఆరోపిస్తున్నారు. మణుగూరు, పినపాక మండలాల్లో డ్వాక్రా పథకం కింద మహిళలు రావాల్సిన స్కాలర్షిప్లు రాకపోవడంతో ఆరాతీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సిబ్బందే కాజేసినట్లు ఆధారాలు లభించడంతో మహిళలు ఆందోళన చేపట్టారు. .