
భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరులో మరోసారి భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా, వారం రోజుల్లో అక్కడ భూమి రెండుసార్లు కంపించడం విశేషం.
వివరాల ప్రకారం.. మణుగూరులో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించింది. శుక్రవారం 4.40 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మణుగూరులోని శేషగిరినగర్, బాపనకుంట, శివలింగాపురం, విఠల్‌నగర్, రాజుపేటలో భూమి కంపించింది. ఈ క్రమంలో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. కాగా, వారం రోజుల్లో అక్కడ భూమి రెండు సార్లు కంపించింది.
ఇది కూడా చదవండి: సేత్వార్ సమస్యలకు ‘చెక్’