తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం జెన్కో అధికారులతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం జెన్కో అధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యను ఎదుర్కొనేందుకు వారితో చర్చించారు.
6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరులలో పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని రెండేళ్లలో పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యలను అధిగమిస్తామని కేసీఆర్ చెప్పారు.