kothagudem
-
ఐజీపీ ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళసభ్యులు
-
దర్గాలో సీతారామ కల్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని హజ్రత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ దర్గాలో సీతారాములకు శాస్తోక్త్రంగా కల్యాణం జరిపించడమే కాదు ఆ మరుసటి రోజు కోదండ రాముడికి ఘనంగా పట్టాభిషేకం కూడా చేస్తారు. ఇల్లెందు పట్టణానికి చెందిన సత్యనారాయణ ఈ దర్గాకు మాలిక్‌గా ఉన్నారు. 1960వప్రాంతంలో నాగుల్‌మీరా ఆయన కు కలలో కనిపించి సత్యనారాయణపురం సమీపంలోని అడవుల్లో తాను ఉన్నానని చె΄్పారు. అప్పటి నుంచి ఈ గుట్టపై ఓ చెట్టు కింద పుట్టలో కొలువై ఉన్న నాగుల్‌మీరాను ఆయన పూజించడంప్రారంభించారు. కాలక్రమంలో ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు ఈ దర్గాకు రావడం మొదలైంది. 1972 నాటికి ఈ అడవిలో దర్గా వెలిసింది. గడిచిన పాతికేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నుంచి కులమతాలకు అతీతంగా ఇక్కడికి భక్తులు రావడం మొదలైంది. ఈ క్రమంలో 2008లో కొందరు భక్తులు తమిళనాడు నుంచి సీతారాముల పంచలోహ విగ్రహాలను దర్గా ఆవరణలో ప్రతిష్టించి పూజించడంప్రారంభించారు. దర్గా ఆవరణలో ఒకవైపు మహ్మదీయ సంప్రదాయ ప్రకారంప్రార్థనలు నిర్వహిస్తూనే మరోవైపు హిందూ సంప్రదాయంలో శ్రీరాముడికి పూజలు చేసే ఆనవాయితీ మొదలైంది.నవమి కల్యాణంశ్రీరామనవమి సందర్భంగా నాగుల్‌మీరా దర్గా ఆవరణ లో తొలిసారిగా 2013లో శ్రీరాముడికి కల్యాణం, ఆ మరుసటి రోజు పట్టాభిషేకం జరిపించారు. వేదపండితులు శాస్తోక్త్రంగా ఈ వేడకలు నిర్వహించగా భక్తులు కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను కనులారా వీక్షించారు. హిందూ – ముస్లిం భాయి భాయి అనే స్ఫూర్తికి మరోసారిప్రాణప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ప్రతి నవమికి ఇక్కడ కల్యాణం, పట్టాభిషేక వేడుకలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకం ప్రత్యేకంశ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల్లో శ్రీరాముడి కల్యాణం జరిపిస్తారు. అంతటితో వేడుకలు ముగిస్తారు. భద్రాచలం తరహాలోనే సత్యనారాయణపురం దర్గాలో కూడా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని తొమ్మిది మంది వేదపండితులు శాస్తోక్త్రంగా జరిపిస్తూ శ్రీరాముడికి కిరీటధారణ చేస్తారు.దమ్మక్క వారసుల తలంబ్రాలుపోకల దమ్మక్క అనే గిరిజన మహిళ తొలిసారిగా భద్రాచలంలో సీతారాములకు పూజాదికాలు నిర్వహించింది. భద్రాద్రి రాముడికి తొలిసారిగా పూజలు అందించిన పోకల దమ్మక్క వారసుల్లో కొందరు నవమి సందర్భంగా దర్గాలో జరిగే కల్యాణ తంతుకు తొలి తలంబ్రాలు పంపిస్తారు. అదే విధంగా సత్యనారాయణపురం గ్రామంలోని రామాలయంలో జరిగే శ్రీరాముడి కల్యాణానికి దర్గా నుంచి ముత్యాల తలంబ్రాలు పంపే విధానం కూడా మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయప్రాంగణంలో శ్రీరాముడికి గుడిని నిర్మించాలని సంకల్పించారు. ఈ దర్గాప్రాంగణంలోనే చర్చి, మసీదు, గురుద్వారాలను కూడా నిర్మిస్తామని భవిష్యత్తులో సకల మతాల సమ్మేళనానికి ఈ దర్గాను వేదికగా మారుస్తామని ఇక్కడి భక్తులు అంటున్నారు.– సూరం శ్రావణ్‌రెడ్డి, సాక్షి, ఇల్లెందు రూరల్ -
ఊరంతా చేపల కూరే...!
వేసవి వచ్చిందంటే గ్రామాల్లోని చెరువుల్లో నీరు తగ్గుముఖం పడుతుంది. దీంతో స్థానికులు చేపల వేటకు ఉపక్రమిస్తారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామంలోని పెద్ద చెరువుకు మంగళవారం ఉదయమే చేరిన జనం జలపుష్పాలు వేటాడటంలో నిమగ్నమయ్యారు.ఊతలు, వలల సాయంతో చేపలు పట్టగా అందరికీ సరిపడా చేపలు (Fishes) దొరకడంతో ఉత్సాహంగా ఇళ్లకు బయల్దేరారు. దీంతో కుర్నవల్లి గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాల్లోని దాదాపు అందరి ఇళ్ల నుంచి మంగళవారం సాయంత్రానికి చేపల కూర (Fish Curry) వాసన ఘుమఘుమలాడింది. – కరకగూడెం అడుగంటిన మత్తడివాగుమార్చి మొదటివారం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలమట్టం గతంలో ఎన్నడూలేని విధంగా పది మీటర్ల లోతుకు పడిపోయింది. తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు తాగునీటిని అందించే తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరింది.ప్రాజెక్టు నీటిమట్టం (Water Level) 0.571 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.111లకు పడిపోయింది. నీరంతా అడుగంటడంతో ప్రాజెక్టు పూర్తిగా నెర్రెలు వారింది. ఏటా ఏప్రిల్ నెలాఖరు, మే మొదటివారంలో అడుగంటాల్సిన ఈ ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారానికే ఎండిపోవడం జిల్లాలోని భూగర్భజలాలు పడిపోతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్చదవండి: సైకిల్ చక్రం.. బతుకు చిత్రం -
సింగరేణి.. సూపర్ ప్లాన్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి (Singareni) ఇప్పుడు సంస్థ పరిధిలో పనిచేసే వారి ఆరోగ్యంపై కూడా దృష్టి సారించింది. కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రులకు నగదు చెల్లించే బదులు.. హైదరాబాద్‌లో సొంతంగానే కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిని నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది.లక్ష కుటుంబాలకు సేవలు..సింగరేణి సంస్థ పరిధిలో కార్మికుల నుంచి ఎగ్జిక్యూటివ్ కేడర్ వరకు మొత్తంగా 42 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో 34 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సింగరేణిలో రిటైర్డ్ అయి హెల్త్ స్కీంలో ఉన్నవారు మరో 30 వేలమంది వరకు ఉన్నారు. మొత్తంగా లక్షకు పైగా కుటుంబాలకు సింగరేణి వైద్యసేవలు అందిస్తోంది. ఇందుకోసం సంస్థ విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలో ఆస్పత్రులు ఉన్నాయి. మెరుగైన వైద్యం కోసం రామగుండం, భూపాలపల్లి, మణుగూరు, శ్రీరాంపూర్‌లో రీజనల్ ఆస్పత్రులు, కొత్తగూడెంలో ప్రధాన ఆస్పత్రి ఉంది. వైద్య, ఆరోగ్య విభాగాల కింద ఏటా రూ.500 కోట్ల వరకు సింగరేణి వెచ్చిస్తోంది.రిఫరల్‌కే రూ.150 కోట్లు..సాధారణంగా సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులు, కార్మికులకు ఆరోగ్య సమస్య ఎదురైతే తొలుత ఆయా ఏరియాల్లో ఉన్న డిస్పెన్సరీలు, ఏరియా ఆస్పత్రులకు వెళతారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాక, అవసరమైతే ఏరియాల నుంచి రామగుండంలోని రీజినల్, కొత్తగూడెం (Kothagudem) ప్రధాన ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. ఇక్కడ కూడా నయం కాని అనారోగ్య సమస్యలు ఉన్నా, అత్యవసర, ఆధునిక వైద్యసేవలు అవసరమైనా హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. అయితే సింగరేణిలో గత కొన్నేళ్లుగా రిఫరల్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. గడిచిన రెండేళ్లలో ఏకంగా 47,201 మందిని హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. దీంతో రిఫరల్ కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించే బిల్లు ఏటా సుమారు రూ.150 కోట్లు ఉంటోంది. సింగరేణి రిఫర్ చేస్తున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, దీనిపై దృష్టి సారించాలని సింగరేణి సీఎండీ బలరామ్ ఇటీవల సంస్థ పరిధిలోని వైద్యులకు సూచించారు.ఆయా ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరుస్తూ...ఆరోగ్య రంగంపై ఖర్చులో దాదాపు 30 శాతం వరకు రిఫరల్ వైద్యసేవల పేరిట కార్పొరేట్ ఆస్పత్రులకే చెల్లించాల్సి రావడంపై సింగరేణి దృష్టి సారించింది. దీంతో రామగుండం ఆస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియో సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సింగరేణి కార్మికులు ఎక్కువగా ఎదుర్కొనే శ్వాసకోస, కంటిచూపు, కీళ్ల నొప్పులు తదితర విభాగాల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. మలివిడతగా కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.చదవండి: టోల్ ప్లాజాల్లో చార్జీలు.. ఏ వాహనానికి ఎంత?హైదరాబాద్‌లోనూ..బొగ్గుతోపాటు థర్మల్, సోలార్, పంప్డ్ స్టోరేజ్ హైడల్ పవర్ ఉత్పత్తిలో సింగరేణి అడుగు పెడుతోంది. తొలిసారి తెలంగాణ వెలుపల ఒడిశా, రాజస్తాన్‌లో సంస్థ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. మరోవైపు కొత్తగూడెం, రామగుండం (Ramagundam) వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సేవలు అందించే నిపుణుల కొరత ఏర్పడే అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో ఓ వైపు సంస్థ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, వైద్యసేవలను అప్‌గ్రేడ్ చేస్తూనే, వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉండేలా హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సొంతంగా నిర్మించే దిశగా సింగరేణి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
మావోలకు లొంగుబాటే శరణ్యమా?
సాక్షి, హైదరాబాద్: భద్రతా బలగాల భారీ వేట.. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు (Maoist) అగ్ర నాయకులు.. తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్... వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు గత మూడేళ్లుగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గత నెలన్నరరోజుల్లో తెలంగాణ (Telangana) పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే.ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు.మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేషా లొంగిపోయిందని...ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేషాతోపాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో గతేడాది 41 మంది సరెండర్ 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలినవారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల వయో‘భారం’మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా ఐదు పదుల వయసు దాటినవారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులకంటే ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండాపోయారు. మరికొన్ని ప్రధాన లొంగుబాట్లు ఇలా...ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్‌స్టేషన్‌లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ఖేర్ ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు. ఈ ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ 2024 డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ 2, 2024లో పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట లొంగిపోయారు. డిసెంబర్ 10 2023న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు. జనవరి 1, 2022న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు. జనవరి 28, 2022న విశాఖపట్నం పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. -
కొత్తగూడెంలో ఎకో అడ్వెంచర్ పార్క్
లోతైన క్వారీలు, ఎత్తైన మట్టి దిబ్బలు, రాకాసి బొగ్గు, దుమ్మూ ధూళి.. సింగరేణి గనులు (Singareni Mines) అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇవే.. కానీ ఇప్పుడు అందమైన వనాలు, ఔషధ మొక్కలు, సీతాకోక చిలుకల పార్కులకు (Butterfly Park) సింగరేణి పాత గనులు చిరునామాలుగా మారుతున్నాయి. మైనింగ్‌లో జరిగే నష్టాలను ఆయా సంస్థలే పూరించాలని కేంద్ర పర్యావరణ శాఖ తెచ్చిన నిబంధన మేరకు మూసివేసిన గనుల వద్ద సింగరేణి సంస్థ కొన్నాళ్లుగా భారీగా మొక్కలు నాటి అడవులు (Forests) పెంచుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందమైన ఎకో పార్కులను అభివృద్ధి చేయటం మొదలుపెట్టింది. కొత్తగూడెంలో ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో ఎకో పార్క్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. - సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅందమైన వనాలు సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో రూ.3 కోట్లతో ఏర్పాటుచేసిన ఎకో పార్క్‌లో బటర్‌ఫ్లై గార్డెన్‌ను ఏర్పాటుచేశారు. ఎడారి, ఔషధ మొక్కలు, తాళ్లవనం (వివిధ దేశాలకు చెందిన తాటి చెట్లు), బోన్సాయ్ వంటి వివిధ దేశాల అరుదైన మొక్కలతో వేర్వేరు థీమ్‌లతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేశారు. పార్క్ ప్రాంగణంలోనే సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు కొలనులు ఉన్నాయి. సందర్శకులు ధ్యానం చేసుకునేందుకు బుద్ధవనం సిద్ధంగా ఉంది. వీటితోపాటు బర్డ్‌వాచ్ సెంటర్, వ్యూ పాయింట్, టాయిలెట్లు, కెఫటేరియాలు సిద్ధమయ్యాయి. పట్టణానికి దూరంగా నలువైపులా ఎత్తయిన కొండలు, దట్టంగా పరుచుకున్న చెట్ల నడుమ ఆధునిక సౌకర్యాలతో ఈ ఎకో పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడికి స్టడీ టూర్ల కోసం విద్యార్థులు వస్తున్నారు. టూరిజం శాఖకు అప్పగించే యోచనశ్రీరాంపూర్ ఏరియాలో మరో ఎకో పార్క్ (Eco Park) నిర్మా ణం జరుగుతోంది. ఈ రెండింటి తరహాలోనే సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో ఎకో పార్క్‌లను రెండుమూడేళ్లలో ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత భవిష్యత్‌లో మూతపడే ప్రతీ గని వద్ద ఇలాంటి పార్కులు నెలకొల్పుతారు. వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాక టూరిజం శాఖకు అప్పగించే యోచనలో సింగరేణి ఉంది. ఇప్పుడిప్పుడే ఎకో టూరిజం పుంజుకుంటుండటం,ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉండడంతో సింగరేణి సహకారం పర్యాటకరంగానికి మరిన్ని వన్నెలు అద్దనుంది.మైనింగ్‌పై అవగాహన కల్పించేలా.. ఎకో పార్క్ పక్కనే ఉన్న గౌతం ఖని ఓపెన్‌కాస్ట్ ఓవర్ బర్డెన్ మట్టి దిబ్బలపై పెంచిన వనంలో సైక్లింగ్ ట్రాక్, నాలుగు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ పాత్లను అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని ఎకో అడ్వెంచర్ పార్క్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. పార్క్ సమీపంలో వెంకటేశ్ ఖని మెగా ఓపెన్‌కాస్ట్ త్వరలో మొదలుకానుంది. దీంతో ఓపెన్‌కాస్ట్ ఉపరితలంపై మరో వ్యూ పాయింట్ (View Point) సిద్ధం చేసి.. ప్రతీరోజు నిర్ణీత సమయంలో గనుల్లో జరిగే బ్లాస్టింగ్‌ను సందర్శకులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా మైనింగ్ ప్రక్రియలో అడవులు, భూమి, జలవనరులకు జరిగే నష్టాలు ఎలా ఉంటాయి? వాటిని భర్తీ చేయడంలో సింగరేణి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి -
అశ్వాపురం మండలం మొండికుంటలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
-
కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సెక్రటేరియట్ మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్హైదరాబాద్- విజయవాడ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారంనారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాంమూసీ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారుమూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్,బీజేపీలు రాజకీయం చేస్తున్నాయిరేపు వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారువరంగల్కు ఎయిర్ పోర్ట్ 1999 నుంచి వింటున్నాం...కానీ ఏర్పాటు జరగలేదు. ఇప్పుడు ఆ కల సాకారం అయ్యిందిఎయిర్ పోర్ట్ పనులను 8 నెలల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాంమొదటి ఏడాది లోపే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యేలా పనులు పూర్తి చేస్తాంఏడాదిన్నర కాలంలోనే తిరుపతి, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నాం.భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్హైదరబాద్తో పాటు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లను వచ్చే నాలుగేళ్లలో సాధించుకుంటాంహైదరాబాద్ - విజయవాడ 6 లైన్ రోడ్డు వచ్చే జనవరిలో డీపీఆర్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాంఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిఫ్లైఓవర్ నిర్మాణాలు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు మాత్రమే అయ్యాయికేంద్రంతో మాట్లాడి వచ్చే ఏడాదిన్నర లోపు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాంవర్షాలు పడితే ఫ్లైఓవర్ కింద చాల మంది మరణించారు.. గత ప్రభుత్వం పట్టించుకోలేదురీజినల్ రింగ్ రోడ్డు పనులపై 2018లో బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కానీ పనులు పూర్తి కాలేదురీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పనులు వచ్చే నెలలో మొదలు పెడతాంశ్రీశైలం ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తాం -
ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీ, ఈడీలను పంపించు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నేడు తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి వసూళ్లు మొదలెట్టాడని ప్రధాని మోదీ అన్నారని..అవినీతి జరిగిందని తెలిస్తే ఐటీ, ఈడీలను రంగంలోకి దించాలి కానీ ఉత్త ఆరోపణలు చేయడం ఎందుకని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కొత్తగూడెంలో జరిగిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. చోటేభాయ్, బడేభాయ్ ఇద్దరూ ఒక్కటేనని, బయటకు మాత్రం వేర్వేరు అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీరికి ఓటేస్తే గోదావరి నీళ్లు మనకు దక్కవని, మోటర్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు. ఈ రెండు పార్టీ లకు ఓటేస్తే గోదావరిలో పడేసినట్టేనని వ్యాఖ్యానించారు. తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న గోదావరి నీటిని తమిళనాడుకు తరలించుకుపోయేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ కట్టి ఈ నీటిని ఎత్తుకుపోయేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. మన బతుకుదెరువు, మన జీవన్మరణ సమస్య అయిన గోదావరి నీటిని తీసుకుపోతాం అంటుంటే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కొత్తగూడెం జిల్లా ఉండాలా? వద్దా? ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని కేసీఆర్ అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత రాష్ట్రాన్ని అంధకారం చేస్తోందని విమర్శించారు. కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఈ జిల్లా ఉండాలా? వద్దా ? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు రూ.10వేలు అందిస్తే కాంగ్రెస్ పార్టీ రూ.15,000 ఇస్తామని చెప్పిందని, కల్యాణలక్ష్మి ద్వారా తాము ఆర్థికసాయం అందిస్తే, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ఎన్నికల హామీలో రూ. రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, మరి ఈ రోజు ఎంతమందికి రైతుబంధు అందింది, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, రుణమాఫీ ఎంత అమలు చేశారు.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ప్రాంతాల్లో త్రీఫేస్ కరెంట్ ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లు కాలిపోతున్నాయన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడ కాటకలిసిందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో కలుíÙత ఆహారం తిని భువనగిరిలో ఓ విద్యార్థి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిపై కుట్రలు చేస్తారు కేంద్రంలో అధికారంలో ఉన్న బడేభాయ్ ఆదేశాల మేరకు ఇక్కడి చోటే భాయ్ సింగరేణి మీద కుట్రలు చేసే ప్రమాదం ఉందని కేసీఆర్ హెచ్చరించారు. గతంలో ఆ్రస్టేలియా నుంచి అదాని దిగుమతి చేసుకున్న బొగ్గు కొనాలంటూ ప్రధాని మోదీ ఎంత ఒత్తిడి చేసినా ‘మాకు సింగరేణి బొగ్గు ఉంది.అదాని బొగ్గు అవసరం లేదు. ఒక్క టన్ను కూడా కొనను’అంటూ తెగేసి చెప్పానని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆదేశిస్తే.. నా తలకాయ తెగిపడ్డా మోటార్లకు మీటర్లు పెట్టనంటూ రైతుల ప్రయోజనాలు కాపాడిన చరిత్ర తనకు ఉందన్నారు. మత విద్వేషాలు రేపుతున్నారు.. తెలంగాణలో మత సామరస్యానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని కేసీఆర్ చెప్పారు. తమ హయాంలో ఏ ఒక్కరోజూ మత కలహాలు జరగలేదని గుర్తు చేశారు. కానీ ఈ రోజు హిందూ, ముస్లిం అంటూ విద్వేషాలు రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో నరేంద్రమోదీ అంత దరిద్రమైన పాల న చేసిన మరో నేత లేడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య పంచాయితీలు పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప మరేం లేదన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే నిధులు.. గోదావరి నీళ్లు తెలంగాణకు దక్కాలన్నా, కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావాలన్నా, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టొద్దన్నా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కేసీఆర్ కోరారు.ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత గెలిస్తేనే ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుంటామని చెప్పారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించానన్నారు. ‘జబ్‌తక్ తెలంగాణా మే కేసీఆర్ హై, తబ్‌తక్ సెక్యులర్ రియాసత్ రహేగా’అంటూ మైనారిటీలకు హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్లే: కేసీఆర్
సాక్షి, భద్రాద్రికొత్తగూడెంజిల్లా: ప్రాణమున్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడతానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్తగూడెంలో(ఏప్రిల్30) నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచార రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. ఫ్రీ బస్సు పెట్టి ఈ ప్రభుత్వం ఆటో కార్మికులను ఆగం చేసిందని మండిపడ్డారు. మోదీ, రేవంత్ ఒక్కటేనని వారికి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. ‘కొత్తగూడెంను జిల్లా చేయడానికి కారణం మారుమూల గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలని, పాలన అందాలని జిల్లా చేశాం. కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్‌తో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని చూస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు.రైతు బంధు 15వేలు ఇస్తామని అన్నారు, కానీ ఇప్పుడు ఒక్క రూపాయి అయిన ఇచ్చాడా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500, రూ. 2 లక్షల రుణమాఫీ ఇలాంటి హామీలు అటకెక్కాయి. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు. ఇప్పుడు కరెంట్ లేనే లేదు. పినపాక లాంటి నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ, గిరిజన గూడేలకు మిషన్ భగీరథ రావట్లేదు. వేల మందికి పోడు పట్టాలు ఇచ్చినం.గిరిజనులకు, మైనారిటీలకు గురుకులాలు పెట్టి విద్యలో సమూల మార్పు తెచ్చాం. ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్లు నిలిచిపోయాయి. గిరిజన బిడ్డల కోసం కోట్ల రూపాయల ఖర్చుతో గిరిజన భవనాలు కట్టించాం. సింగరేణి బిడ్డలకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇచ్చాం. సింగరేణిని ముంచే పనిలో చోటే భాయ్ రేవంత్ రెడ్డి, బడే భాయ్ నరేంద్ర మోదీ ఉన్నారు. పదేళ్ల క్రితం గద్దెనెక్కిన మోదీ భేటి పడావ్ భేటి బచావ్ ఏమైంది. నరేంద్రమోదీ దుర్మార్గ పాలన, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గోదావరి నదిని ఇచ్చంపల్లి నుంచి వేరే రాష్ట్రాలకు తరలించే కుట్ర చేస్తున్నారు. విద్యావంతులు, యువకులు ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో జీవన్మరణ సమస్య ఏర్పడింది. తెలంగాణను నాశనం చేసే పని మోదీ చేస్తున్నా రేవంత్ ఎందుకు మాట్లాడట్లేదు. తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టాలి అని చెప్తే నేను ఒప్పుకోలేదు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికులను రోడ్డున పడేశారు. గురుకులంలో కరీంనగర్లో బాలిక చనిపోతే రేవంత్ నోరు మెదపడం లేదు. కేంద్రం, రాష్ట్రం మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన, హిందు ముస్లిం గొడవలు లేకుండా శాంతిభద్రతలతో రాష్ట్రాన్ని పరిపాలించాం. కాంగ్రెస్- బీజేపీ రెండు ఒక్కటే అని ముస్లిం సోదరులు గమనించాలి. బీఆర్ఎస్ ఒక్కటే మతసామరస్యం కాపాడుతుంది’ అని కేసీఆర్ అన్నారు. -
సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్ !
భద్రాద్రి: ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్ పోలీసులు జరిమానా విధించిన ఘటన గురువారం వెలుగు చూసింది. పాల్వంచ మండలం నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో ట్రాక్టర్ వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ రూ.వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా స్టీరింగ్ ఉన్న ప్రతీ వాహనం డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనల మేరకు సీట్ బెల్టు పెట్టుకోవాల్సిందేనని చెప్పడం గమనార్హం. -
ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం
భారత దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. కానీ, అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికిలో లేదు. ఆంధ్రా ప్రాంతమంతా మదరాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉంటే, తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడిలోని హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉండింది. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టుల పేరు బరిలోకి దిగి 41 చోట్ల గెలిచింది. కమ్యూనిస్టులకు 20.09 శాతం ఓట్లు వచ్చాయి. అపుడు అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారా అన్నంత చర్చ జరిగింది. ఇతర చిన్న పార్టీలతో కలిసి కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రాంతంలో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరు పోటీ చేసి 37 చోట్ల విజయం సాధించింది. 1955లో జరిగిన ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులకు ఆంధ్ర పాంతంలో 30.82 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు అధికారానికి దగ్గరగానే ఉన్నా.. 1962 తర్వాత పార్టీలో వచ్చిన చీలిక వారిని బలహీన పరిచినా కూడా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు ఉమ్మడి ఏపీ శాసన సభలో వారి గొంతు బలంగానే వినిపించింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరీ దారుణంగా ఆ పార్టీల పరిస్థితి పడిపోయింది. 2023 శాసన సభ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడం ఔరా అనిపిస్తోంది. గత గణాంకాలకే ఇక పరిమితమా..? కమ్యూనిస్టులు ఉమ్మడిగానే ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలు తేలిగ్గా కొట్టిపారేయలేం. అందుబాటులో ఉన్న ఎన్నికల గణాంకాల ప్రకారం చూసినా.. రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగినంత దగ్గరగా వచ్చిన పార్టీ. ఆంధ్ర ప్రాంతంలో 1952 ఎన్నికల్లో 41 సీట్లు, 1955 ఎన్నికల్లో 15 స్థానాలు, తెలంగాణ ప్రాంతంలో 1952లో 37 సీట్లు, 1957లో 22 సీట్లు ఏపీ ఏర్పడిన తర్వాత 1962లో 51 సీట్లను కమ్యూనిస్టులు గెలుచుకున్నారు. 1964లో కమ్యూనిస్టుల్లో చీలిక ఏర్పడి సీపీఐ నుంచి విడివడిన వర్గం సీపీఐ (ఎం)గా ఏర్పడింది. 1964 మధ్యంతర ఎన్నికల్లో సైతం సీపీఐ 31, సీపీఎం 22 నియోజకవర్గాలను కైవసం చేసుకున్నాయి. ఒక సీపీఐ గురించి మాత్రమే చర్చిస్తే.. 1967లో 11, 1972లో 7, స్థానాలకు మాత్రమే పరిమితమై తన గ్రాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చింది. తెలంగాణ పరిధిలోని 119 స్థానాల అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడుకున్నా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుతో 2014లో కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది. 2018లో ఒక చోటా గెలవలేదు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న సీపీఐ ఈ ఎన్నికల్లో కేవలం ఒక్క చోట నుంచే పోటీ చేయడం విశేషం. 30 నియోజకవర్గాల ప్రాతినిధ్యం నుంచి ఒక్క స్థానానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఒక్కో ఎన్నికకు పోటీ చేసే స్థానాల సంఖ్యను కుదించుకుంటూ వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐకి 30 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉండింది. ఆ స్థానాల నుంచి ఒకసారి మొదలు ఆరేడు పర్యాయాలు గెలిచిన చరిత్ర కూడా ఉంది. ఆసీఫాబాద్‌లో సీపీఐ మూడు సార్లు గెలిచింది. ఆదిలాబాద్‌లో ఒక సారి ప్రాతినిధ్యం వహించింది. హుస్నాబాద్ (ఇందుర్తి రద్దయినది) నియోజకవర్గంలో ఆ పార్టీ ఏకంగా 6 సార్లు గెలిచింది. సాయుధ తెలంగాణ సేనాని బద్దం ఎల్లారెడ్డి ఇక్కడి గెలిచారు. దేశిని చినమల్లయ్య నాలుగు సార్లు విజయం సాధించారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక సారి గెలిచారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచారు. మెదక్, పెద్దవూర (ఇపుడు నాగార్జున సాగర్), నల్గొండ, భువనగిరి, నకిరేకల్, ఆలేరు, జనగామ, స్టేషన్ ఘనపూర్, నర్సంపేట, పరకాల, చేర్యాల (రద్దు అయ్యింది), పాలేరు నియోజకవర్గాల్లో ఒక్కో సారి విజయం సాధించి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో సీపీఐ 5 సార్లు గెలిస్తే.. అన్న సార్లూ చిలుముల విఠల్ రెడ్డి గెలిచారు. నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి సీపీఐ ఏకంగా 7 విజయాలను నమోదు చేసింది. బద్దూ చౌహాన్ హ్యాట్రిక్ సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో కూడా ఇక్కడ సీపీఐ నుంచి రవీంద్ర కుమార్ గెలిచి, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మునుగోడు నియోజకవర్గంలో కూడా సీపీఐకి 6 విజయాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో రద్దయిన మరో నియోజజకవర్గం రామన్నపేట నుంచి 4 సార్లు గెలిస్తే ఇందులో వరసగా మూడు సార్లు గెలిచిన గుర్రం యాదిగిరి రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. మహబూబాబాద్ లో 2 సార్లు, రద్దయిన బూర్గంపాడు (ఇపుడు పినపాక)లో 5 సార్లు, సుజాతనగర్ (ఇపుడు వైరా)లో 5 సార్లు, భద్రాచలంలో 2 సార్లు గెలిచింది. ఇక, ఇపుడు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం కొత్తగూడెంలో గతంలో రెండు సార్లు గెలిచింది. ఈ సారి అభ్యర్థిగా బరిలో ఉన్న సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గతంలో కూడా ఒక సారి విజయం సాధించారు. ఇంతగా విజయాల చరిత్ర ఉన్నా.. కేవలం ఒకే ఒక్క సీటు కోసం కాంగ్రెస్‌తో రాజీపడిపోవడాన్ని చివరకు పార్టీ వర్గాలు కూడా జీర్ణించుకోలేక పోతున్నాయి. :::మిత్రా. ఎన్ -
స్వతంత్రంగా జలగం పోరు..?
-
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్‌లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
మణుగూరులో భూ ప్రకంపనలు..
భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరులో మరోసారి భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా, వారం రోజుల్లో అక్కడ భూమి రెండుసార్లు కంపించడం విశేషం. వివరాల ప్రకారం.. మణుగూరులో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించింది. శుక్రవారం 4.40 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మణుగూరులోని శేషగిరినగర్, బాపనకుంట, శివలింగాపురం, విఠల్‌నగర్, రాజుపేటలో భూమి కంపించింది. ఈ క్రమంలో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. కాగా, వారం రోజుల్లో అక్కడ భూమి రెండు సార్లు కంపించింది. ఇది కూడా చదవండి: సేత్వార్ సమస్యలకు ‘చెక్’ -
గిరిజన విద్యార్థి.. కష్టాలను అధిగమించి,ఐఐటీలో సీటు సాధించింది
జె.ఇ.ఇ. ఎంట్రన్స్‌లో ర్యాంకు కొట్టడం సామాన్యం కాదు.అందుకై కొందరు రాజస్తాన్ వెళ్తారు. కొందరు హైదరాబాద్, విజయవాడ చేరుకుంటారు.తల్లిదండ్రులు గైడ్ చేస్తారు. కాని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు పుట్టిన కోయ విద్యార్థిని కొర్సా లక్ష్మి గురుకుల పాఠశాలలో చదువుకునే మంచి ర్యాంకు సాధించింది.పాట్నా ఐఐటీలో సీటు సాధించింది. కోయలలో ఒక అమ్మాయి సాధించిన స్ఫూర్తినిచ్చే విజయం ఇది. కొర్సా లక్ష్మి పరిచయం. కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్ సెంటర్ కోసం అవసరమైతే రాజస్థాన్‌లోని కోటాకు వెళతారు లేదా హైదరాబాద్, విజయవాడలలో ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో వేస్తారు. ఇక పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటుంటే టీవీలు బంద్ చేస్తారు. మాటా పలుకూ లేకుండా పిల్లలు ఇరవై నాలుగ్గంటలూ చదువుకునేలా చేస్తారు. మెటీరియల్ తెచ్చిస్తారు. చాలా హైరానా పడతారు. అదేం తప్పు కాదు. కాని ఇలాంటివన్నీ లేకుండా కూడా కొంతమంది విజయం సాధిస్తుంటారు. కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుకున్న కోయ విద్యార్థిని కుర్సా లక్ష్మి అలాంటి విజేతే. పట్టుదలతో చదువుకుని ర్యాంకు సాధించిన విజేత. ఐసులమ్మే తండ్రి కూతురు కొత్తగూడెం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండా కాటాయగూడెం. 300 గడపలున్న గ్రామం ఇది. అందరూ కోయలే. వ్యవసాయ కూలీలే. ఏ కొద్దిమందికో కాసింత భూమి ఉంటుంది. కొర్సా లక్ష్మి తండ్రి కన్నయ్యకు ఎకరం భూమి ఉంది. కాని వాన పడితేనే పండుతుంది. కన్నయ్య వ్యవసాయ కూలీగా వెళతాడు. తల్లి శాంతమ్మ కూడా. వ్యవసాయ పనులు లేనప్పుడు తన టీవీఎస్ ఎక్సెల్ మీద ఐస్ బాక్స్ పెట్టుకుని ఐసులమ్ముతాడు. ముగ్గురు పిల్లలు. కాని పెద్ద కొడుకు చదువు ఇష్టం లేక 7వ తరగతిలో ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండో కొడుకు మామూలు చదువే. చివరి అమ్మాయి లక్ష్మి బాగా చదువుకోవాలని నిశ్చయించుకుంది. పిన్ని స్ఫూర్తి కన్న తల్లిదండ్రులు చదువు లేని వారు కావడంతో లక్ష్మికి చదువులో ఏ సాయమూ చేయలేకపోయేవారు. ఆరవ తరగతి నుంచి కొత్తగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న లక్ష్మికి పిన్ని సుమలత స్ఫూర్తిగా నిలిచింది. డిగ్రీ చదువుకున్న సుమలత హాస్టల్లో ఉన్న లక్ష్మిని తరచూ కలుస్తూ చదువు విలువ చెబుతూ వచ్చింది. డబ్బుకు విలువ ఇవ్వని వారు కూడా చదువుకు విలువ ఇస్తారని తెలిపింది. సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చి లక్ష్మి మంచి చెడ్డలు చూసేది. ఆమె మాటలు లక్ష్మి మనసులో నాటుకుపోయాయి. ‘ఏ రోజూ కూడా రాత్రి ఒంటి గంట లోపు లక్ష్మి పుస్తకం మూయగా చూడలేదు’ అని లక్ష్మి బాబాయ్ రవి తెలిపాడు. గురుకుల పాఠశాలలో కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో దాదాపు వేయి మంది అమ్మాయిలు 6 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్నారు. ప్రిన్సిపాల్ దేవదాసు, ఉపాధ్యాయులు వీరి చదువు మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. చురుకైన విద్యార్థినులను ఎంపిక చేసి జె.ఇ.ఇలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్లో ఎం.పి.సి తీసుకున్న లక్ష్మి 992 మార్కులు సాధించింది. దాంతో ఇంకా ఉత్సాహంతో జె.ఇ.ఇకి ప్రిపేర్ అయ్యింది. జె.ఇ.ఇ అడ్వాన్స్‌డ్‌లో 1371వ ర్యాంకు సాధించింది. పాట్నా ఐ.ఐ.టిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో మొన్నటి ఆగస్టు మొదటివారంలో సీటు పొందింది. గురుకుల పాఠశాల నుంచి ఈ ఘనత సాధించిన అమ్మాయి లక్ష్మీ. ఐ.ఏ.ఎస్ చేయాలని... బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్ చేయాలనేది తన లక్ష్యమని కొర్సా లక్ష్మి చెప్పింది. జె.ఇ.ఇలో మంచి ర్యాంకు సాధించి ఐ.ఐ.టిలో సీటు పొందడంతో ఐ.టి.డి.ఏ అధికారులు లక్ష్మిని ప్రశంసించారు. ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. లక్ష్మి ఇంత బాగా చదవడంతో ఇంకా కొంతమంది ఆమె చదువును ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఆ ప్రోత్సాహం వల్ల లక్ష్మి ఐ.ఏ.ఎస్ చదివి పేద వర్గాల కోసం పని చేయాలని నిశ్చయించుకుంది. -
కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్‌కు గురైంది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. వివరాలు.. ఖమ్మంకు చెందిన సన్నీ, కొత్తగూడెంకు చెందిన మాధవి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఆటోలో వెళ్తున్న దంపతులను కారులో ఛేజ్ చేసిన దుండగులు..భర్తపై దాడి చేసి, యువతిని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. భార్యను ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి కారణాలతోనే తనపై దాడి చేసి, భార్యను కిడ్నాప్ చేశారని భర్త సన్నీ చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
సుప్రీంకోర్టులో వనమాకు ఊరట
న్యూఢిల్లీ: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ, రెండోస్థానంలోని జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ వనమా దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ మారినందున రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని జలగం తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కోరారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరగలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. వనమా విచారణకు హాజరుకాకపోవడం, ఆయా ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణపత్రాల వివరాలు, ఒక భార్య ఉన్నారా లేదా ఇద్దరు భార్యలు ఉన్నారా తదితర అంశాలన్నీ పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నందున వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతను కొనసాగించాలని దామా శేషాద్రినాయుడు కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం ప్రతివాదులు జలగం వెంకట్రావు, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అదనపు ఆధారాలు సమర్పించడానికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్‌కు అనుమతించింది. ప్రతివాదులు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం రిజాయిండర్కు మరో రెండు వారాలు గడువు ఇచ్చింది. చదవండి: సాత్నాల వాగులో రిమ్స్ పీజీ వైద్యుడి గల్లంతు.. మృతదేహం లభ్యం -
ఫోటోలు దిగితే టమాటలు ఫ్రీ..
-
నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి: జలగం
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చి న హైకోర్టు, ఆయనపై పోటీ చేసిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తా.. అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వచ్చి న జలగం వెంకట్రావు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి తనను ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చి న విషయాన్ని ఆయన వివరించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేశానో ప్రజలకు తెలుసని, ఎన్నికల షెడ్యూలుకు మరో మూడు నెలల సమయం ఉన్నందున ప్రజలకు మరింత మేలు చేస్తానని వెంకట్రావు పేర్కొన్నారు. -
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
-
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదన్న హై కోర్టు
-
సంచలనం.. కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు జోక్యంతో.. రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ప్రకటించింది ఉన్నత న్యాయస్థానం. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. వనమా గెలుపును ఆశ్రయిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు జలగం. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆస్తులు సక్రమంగా చూపించలేదనే అభియోగాలు ఉన్నాయి. వీటిని నిజమని తేల్చిన న్యాయస్థానం ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగానూ రూ. 5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇక డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావ్‌ను ఎమ్మెల్యేగా డిక్టేర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నుంచి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999,2004లోనూ ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన .. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పని చేశారు. ఇక 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా.. ఆపై బీఆర్ఎస్లో చేరారు. 4,120 ఓట్ల తేడాతో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్‌పై నెగ్గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు తనయుడే జలగం వెంకట్రావ్. ఈయన సోదరుడు జలగం ప్రసాద రావు సైతం మాజీ మంత్రి. కాంగ్రెస్ తరపున 2004లో తొలిసారి ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు వెంకట్రావ్. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీ(బీ)ఆర్ఎస్ తరపున పోటీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ టైంలో ఖమ్మం(ఉమ్మడి) నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్) తరపున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. -
కొత్త కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతేడాది కాలంగా ఇన్చార్జి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అమయ్‌కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. 2018 బ్యాచ్‌కు చెందిన అనుదీప్ దురిశెట్టి ప్రస్తుతం భద్రాది కొత్తగూడెం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్ధలు)గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న ప్రతీక్ జైన్ భద్రాచలం ఐటీడీఏ పీఓగా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీకి ఒకరి రాక.. మరొకరి పోక ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ నుంచి ఒకరు బదిలీ కాగా, మరొకరు రానున్నారు. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ, లీగల్, ట్రేడ్ లైసెన్సులు, హెల్త్, వెటర్నరీ)గా పనిచేస్తున్న ప్రియాంక అలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. స్నేహ శబరీష్ జీహెచ్ఎంసీకి అడిషనల్ కమిషనర్‌గా రానున్నారు. పూర్తి పేరు : అనుదీప్ దురిశెట్టి జననం : 6 జూలై 1989 విద్యార్హత : బీటెక్ (బిట్స్ పిలానీ, రాజస్థాన్) ఐఏఎస్ బ్యాచ్: 2018 (2017 యూపీఎస్సీ టాపర్) స్వస్థలం : మెట్పల్లి, జగిత్యాల జిల్లా -
కేటీపీఎస్ బూడిదతో నరకం అనుభవిస్తున్న ప్రజలు
-
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థలో రెండు డైరెక్టర్ పోస్టుల నియామక ప్రక్రియ సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో జరిగింది. పోటీ పడుతున్న వారి వివరాలను పరిగణనలోకి తీసుకున్నాక ఇద్దరి ని ఎంపిక చేశారు. మణుగూరు ఏరియా జీఎం జి.వెంకటేశ్వరరెడ్డిని డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్‌గా, ఆండ్రియాల ప్రాజెక్ట్ జీఎం ఎన్వీకే శ్రీనివాస్‌ను డైరెక్టర్(ఆపరేషన్స్)గా నియ మిస్తూ సింగరేణి సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పదవీకాలం రెండేళ్లు. కాగా, సింగరేణిలో డైరెక్టర్(పా) పోస్టు ఖాళీగానే ఉంది. -
దేశ రాజధానిలో సరిగా విద్యుత్, తాగునీరిచ్చే పరిస్థితి లేదు : సీఎం కేసీఆర్
-
భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బొగ్గు తరలింపు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే కారిడార్‌ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 12న ప్రారంభోత్సవం ఉంటుందని, అయితే దీనిని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌ను సింగరేణి బొగ్గు గనుల సంస్థతో కలిసి రైల్వే నిర్మించింది. 54.10 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.930 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఇందులో సింగరేణి సంస్థ రూ.619 కోట్లు భరించగా, మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ వ్యయం చేసింది. జోన్ పరిధిలో గతంలో సిమెంటు ఫ్యాక్టరీలకు సున్నపురాయిని తరలించేందుకు బీబీనగర్–గుంటూరు మధ్య ఉన్న విష్ణుపురం నుంచి ఖాజీపేట–విజయవాడ సెక్షన్ల మధ్య ఉన్న మోటుమర్రి వరకు ఓ సరుకు రవాణా రైల్వే లైనును నిర్మించారు. దాని తర్వాత రెండో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇదే. లారీలకు ప్రత్యామ్నాయంగా.. సింగరేణి సంస్థ సత్తుపల్లి పరిసరాల్లో భారీ సంఖ్యలో ఓపెన్‌కాస్ట్‌ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. విస్తరించే క్రమంలో ప్రత్యేకంగా రైల్వే లైన్ అవసరమని భావించి రైల్వే శాఖకు ప్రతిపాదించింది. రైల్వేకు ప్రయాణికుల రైళ్ల ద్వారా కంటే సరుకు రవాణా రైళ్ల ద్వారానే ఆదాయం అధికంగా నమోదవుతుంది. దీంతో సింగరేణి సంస్థ ప్రతిపాదనను వెంటనే అంగీకరించిన రైల్వే 2010లో ప్రాజెక్టును మంజూరు చేసింది. అయితే పదేళ్ల తర్వాత కానీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనా వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం ప్రస్తుతం పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలోని గనుల నుంచి నిత్యం వేయికి పైగా లారీలతో బొగ్గు వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు బొగ్గు లోడు లారీల రాకపోకలతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా దుమ్ము రేగుతుండటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ రైల్వే మార్గమే పరిష్కారమని తేల్చారు. మొత్తం మూడు స్టేషన్లు ఈ ప్రాజెక్టు కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. సారవరం క్రాసింగ్ స్టేషన్, చంద్రుగొండ క్రాసింగ్ స్టేషన్, పార్థసారథి పురం టెర్మినల్. సత్తుపల్లిలో పెద్దదైన జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్స్‌కు సంబంధించి సైడింగ్ స్టేషన్ పార్థసారథి పురంలోనే ఉంటుంది. ఈ మార్గంలో 10 మేజర్ బ్రిడ్జిలు, 37 మైనర్ బ్రిడ్జిలు, 40 ఆర్‌యూబీలు, 7 ఆర్ఓబీలు నిర్మించారు. రోజుకు ఐదారు రేక్‌ల బొగ్గు తరలింపు రోజుకు ఐదారు రేక్ (ఒక రైలు)ల లోడు తరలించాల్సి ఉంటుందని సింగరేణి సంస్థ ఆదిలోనే రైల్వే దృష్టికి తెచ్చింది. వచ్చే 30 ఏళ్లలో 200 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి తరలిస్తారని అంచనా. ప్రస్తుతం ఇక్కడినుంచి 7.5 మిలియన్ టన్నుల బొగ్గును లారీల ద్వారా వేరే ప్రాంతాల్లోని రైల్వే సైడింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రారంభంతో ఆ బాధ తప్పుతుంది. దాంతోపాటు ఏడాదికి మరో 2.5 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా ఇక్కడ లోడ్ చేయనున్నారు. ప్రస్తుతానికి బొగ్గుకే పరిమితం.. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి ఆంధ్రలోని కొవ్వూరుకు ఓ రైల్వే లైన్‌ను పదేళ్ల కింద మంజూరు చేశారు. ప్రస్తుతం బొగ్గు తరలింపునకు నిర్మించిన మార్గాన్ని దానికి అనుసంధానించి పొడిగిస్తే బాగుటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి మరో అదనపు లైను బదులు, సత్తుపల్లి వరకు నిర్మించిన బొగ్గు తరలింపు లైన్‌ను పొడిగిస్తే ఖర్చు తగ్గుతుందన్నది ఆలోచన. కానీ దీనిని సింగరేణి సంస్థ ఆమోదించాల్సి ఉంది. -
అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ముసలం.. కొత్తగూడెం నాదా? నీదా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి గులాబీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టిక్కెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి సీటు తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు సీటు కోసం పోటీ పడుతుంటే..తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోని సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. కారులో కమ్యూనిస్టులు గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈసారి ఏడాది ముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా పొత్తు కుదిరితే సీపీఐ వారు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, రాష్ట్ర సీపీఐ కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేది అంటూ టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్ళు పరుగులు తీస్తున్నాయి. కర్చీఫ్ వేసేది నేనే.! ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసేది తానే అంటున్నారు సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ మేరకు ఆయన శపథం కూడా చేశారు. టిక్కెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని ఆశపడినా... అంతిమంగా పోటీ చేసేది తానేనని ఘంటా పథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు వనమా వెంకటేశ్వరరావు. మరో వైపు మాజీ ఎమ్మేల్యే జలగం వెంకట్రావు సైతం టిక్కెట్ మీద ఆశపలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెప్పుకున్నా...సీపీఐ ఎంత డిమాండ్ చేసినా...చివరి నిమిషంలో తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. పోటీకి మాత్రమే ఆశ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం వెంకట్రావు... నియోజకవర్గంలో జరిగే పార్టీ, ప్రభుత్వ కార్యక్రామాలకు మాత్రం హాజరు కావడంలేదు. పైగా సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొనే కార్యక్రమాలవైపేతే కన్నెత్తి కూడా చూడటంలేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే..ఈ ఏపిసోడ్ లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్ త్రీలో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గులాబీ ముట్టుకుంటే ముళ్లేనా? ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడే సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీ పడుతూ శపథాలు చేస్తుంటే.. నేనూ ఉన్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడే హీటెక్కాయి. -
చిచ్చుపెట్టిన బైక్‌ర్యాలీ!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్‌ను, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్‌తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. నేను మహిళను, దండం పెడతా అన్నా.. ‘నేను ప్రయాణిస్తున్న బైక్‌ను యూసుఫ్ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కొత్తగూడెం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్పర్సన్ డ్రైవర్ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్పర్సన్ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్ మరో వీడియోలో స్పందించారు. -
వనమా రాఘవ రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించిన పోలీసులు
-
మ్యాగజైన్ స్టోరీ 8th January 2022
-
అతన్ని వదలొద్దు.. నాకు కడుపుకోత మిగిల్చాడు
-
వనమా రాఘవేంద్ర అరెస్ట్
-
మాతో చెబితే ఇలా జరిగేది కాదు!
పాల్వంచ: ‘మా ఆస్తుల పంపకాల విషయంలో వనమా రాఘవేందర్రావును కలిశాం. కానీ ఆయన ఏం మాట్లాడాడో మా తమ్ముడికే తెలుసు. మాతో చెబితే పరిష్కారమార్గం ఆలోచించే వాళ్లం. కానీ ఇం టికి పెద్దదిక్కుగా ఉండాల్సిన తమ్ముడే ప్రాణా లు తీసుకున్నాడు. భార్యాపిల్లల్ని కూడా చంపుకున్నాడు..’అని రామకృష్ణ సోదరి కొమ్మిశెట్టి లోగ మాధవి చెప్పారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మా నాన్న విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్ ఎక్కిన జీపులో ప్రయాణిస్తుండగా నక్సల్స్ మందుపాతరలో చనిపోయారు. మరో తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా భర్త కూడా ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఇక మిగిలింది మా అమ్మ, నేను, రామకృష్ణ. మా కుటుంబంలో మగదిక్కు తమ్ముడే. మాకు ఏం కావాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయనే చూసుకుంటాడనుకున్నాం. అయితే రామకృష్ణకు వ్యాపారాల్లో నష్టం వచ్చి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చి మిగిలిన ఆస్తుల పంపకాన్ని చూసుకోవాలని భావించినా సాధ్యపడలేదు. మా నాన్న ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబం బాగా తెలుసు. అందుకే వనమా వెంక టేశ్వరరావుతో మాట్లాడేందుకు వెళ్తే ఆరోగ్యం బాగో లేకపోవడంతో రాఘవేందర్ మాట్లాడాడు. అయితే ఆయ నేం మాట్లాడాడో.. మా తమ్ముడు ఎలా క్షోభకు గురయ్యాడో మాకు తెలియదు. తెలిస్తే మా సమస్యను మరోలా పరిష్కరించుకునే వాళ్లం. ఆస్తుల పంపకాలు కూడా నాలుగైదు రోజుల్లోనే సెటిల్ అయ్యేవి. ఇంతలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంత మానసిక బాధ పడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.’అంటూ మాధవి విలపించారు. కావాలనే రాఘవను ఇరికిస్తున్నారు పాల్వంచ: ‘ఆస్తి పంపకాల విషయంలో పెద్ద మనిషి అని వనమా రాఘవేందర్రావును కలిశాం. ఆయన మా మేలు కోరి పలు సూచనలు చేశాడు. కానీ ఎవరో కావాలనే ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో నా కొడుకును ప్రేరేపించి తప్పుదోవ పట్టించి చావుకు కారణమయ్యారు..’ అని రామకృష్ణ తల్లి సూర్యావతి కన్నీటి పర్యంతమయ్యారు. పాత పాల్వంచలో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆస్తి కోసం కుమారుడు రామకృష్ణ తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పారు. చాలాచోట్ల అప్పులు చేసిన అతను ఒకే సారి రూ.లక్షల్లో అప్పు ఉందని చెప్పాడని తెలిపారు. రాఘవతో మాటల సందర్భంగా జరిగిన విషయాలేవీ మా వద్ద ప్రస్తావించకుండా భార్య, పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడడం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. తన భర్త నక్సల్స్ పేల్చిన మందుపాతరలో చనిపోతే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కలెక్టర్ స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. -
వనమా రాఘవేంద్ర అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించగా.. రాత్రి 10 గంటలకు రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు కొత్త గూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పరిసరాల్లో రాఘవ ఉన్నట్టు సమాచారం అందిందని.. దమ్మ పేట మీదుగా రాజమండ్రికి వెళ్తున్న రాఘవ వాహనాన్ని పోలీసులు వెంబడించి పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి వద్ద అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాఘవను పాల్వంచకు తరలించామని.. ప్రాథమిక విచారణ పూర్తిచేశాక కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. పరారీపై ప్రచారాల మధ్య.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నాగ రామ కృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితితో కలిసి ఈనెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తమ ఆత్మహత్యలకు రాఘవ కారణమంటూ చనిపోయే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో ఈ నెల 6న వైరల్‌గా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. అప్పటి నుంచే రాఘవ పరారీలో ఉన్నారు. ఆయనను ఆరో తేదీనే కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారని, శుక్రవారం రాత్రి వరకు రాఘవ పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరిగింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతోపాటు పాత కేసులకు సం బంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేసి రౌడీషీట్ తెరుస్తామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్ ప్రకటించా రు కూడా. ఇది జరిగిన మరుసటి రోజే రాఘవను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించ డం గమనార్హం. అయితే శని, ఆదివారాలు కోర్టుకు సెలవులని.. రాఘవకు బెయిల్ రాకుండా ఉండేం దుకే శుక్రవారం రాత్రి అరెస్ట్ చూపారనే ప్రచారం జరుగుతోంది. రాఘవ వ్యవహారాలన్నింటినీ తిరగదోడిన పోలీసులు.. కేసుల నమోదుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. పోలీసుల అదుపులో మరో నలుగురు రాఘవ అక్రమాల వివరాలు తెలుసుకునేందుకు రెండు రోజుల క్రితమే ఆయన అనుచరులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వస నీయంగా తెలిసింది. పాల్వంచకు చెందిన ఇద్దరు, లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం పట్టణానికి చెందిన ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని.. కీలక సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం. వారిలో ఇద్దరు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది. కొత్తగూడెం బంద్ రాఘవను వెంటనే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలు శుక్రవా రం కొత్తగూడెం నియోజకవర్గ బంద్ నిర్వహించారు. ఆందోళనకు దిగిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కేసులో ఎమ్మెల్యే ఇంటిగోడకు నోటీసు పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టూ, బెయిల్‌పై ఉన్న రాఘవను విచారణ రావాలం టూ పోలీసులు శుక్రవారం పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా ఇంటి గోడకు నోటీసు అంటించడం చర్చనీయాంశమైంది. వెంకటేశ్వరరావు గతేడాది జూలై 29న తన చావుకు రాఘవ, మరో 42 మంది కారణమంటూ సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగాడు. విచారణలో ఉన్న ఆ కేసుకు సంబంధించి రాఘవ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. నోరువిప్పుతున్న రాఘవ బాధితులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య అనంతరం నెలకొన్న పరిస్థితులు, చోటు చేసుకుంటోన్న పరిణామాలను చూసి రాఘవ బాధితులు ఒక్కరొక్కరుగా తెరపైకి వస్తున్నారు. బాధిత మహిళలు కొందరు శుక్రవారం ‘సాక్షి’తో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులతో పాటు ఉన్నతాధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి ఉంటే రాఘవ దాష్టీకాలకు అప్పుడే తెరపడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం వెళితే డాక్యుమెంట్లు చింపేశారు.. నవభారత్ (పాల్వంచ)లో రూ.50 లక్షల విలువైన స్థలాన్ని రాఘవ అనుచరులు 2020 ఏప్రి ల్లో కబ్జా చేశారు, న్యాయం కోసం వెళ్తే రాఘవ నా వద్ద ఉన్న స్థలం డాక్యుమెంట్లు చించివేశారు, తర్వాత నాతో పాటు నా అన్నపైనా ఆయన అనుచరులు దాడి చేశారు. న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే ఫిర్యాదు కూడా తీసుకోలేదు. నన్ను, నాన్న, అన్నను అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. చివరకు రెవెన్యూ అధికారులూ నా గోడును పట్టించుకోలేదు. దీంతో పురుగుల మందు తాగి ఎలాగో బయటపడ్డా. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ రోజు పచ్చని కుటుంబం బతికి ఉండేది. – జ్యోతి, పాల్వంచ వారసత్వ భూమిని కాజేశారు.. పాల్వంచ పట్టణంలోని కాంట్రాక్టర్ కాలనీలో మా మామ గారికి మూడెకరాల ఖాళీ స్థలం ఉంది. అది నా భర్త జాన్రాంకుమార్కు వారసత్వ ఆస్తిగా వచ్చింది. 2020 మార్చిలో ఆ భూమిని చదును చేస్తుంటే రాఘవ.. అనుచరులు, పోలీసులతో అక్కడికి వచ్చాడు. ఆ భూమి తనదని బెదిరించాడు. పోలీసులు ఏ విషయం ఆరా తీయకుండా నన్ను, నా భర్తను జీపులో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు భూమి కాగితాలతో రాఘవ ఇంటికి వెళ్తే ఆయన దుర్భాషలాడారు. ఆ స్థలం జోలికి వస్తే చంపుతానని బెదిరించారు. ఇప్పటికీ ఆ భూమి రాఘవ అధీనంలోనే ఉంది. – శ్రీదేవి, పాల్వంచ చదవండి: వనమా రాఘవేంద్ర అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ -
కొత్తగూడెం బంద్ కు విపక్షాల పిలుపు
-
వనమా రాఘవ ఎక్కడ?
-
వనమా రాఘవ అరెస్ట్
-
నా కొడుకును పోలీసులకు అప్పగిస్తా: ఎమ్మెల్యే వనమా
సాక్షి, హైదరాబాద్: తన కొడుకు వనమా రాఘవపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు. రాఘవను నియోజకవర్గానికి, పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకును అప్పగిస్తానని వెల్లడించారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు రాఘవేందర్ నోటి నుంచి విన్నానంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం వనమా రాఘవ పరారీలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో వనమా రాఘవకు ఉచ్చు బిగుసుకుంటుండటంతో కొడుకు నిర్వాకంపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తాజాగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. చదవండి: సంచలనం రేకెత్తిస్తున్న రామకృష్ణ సెల్ఫీ వీడియో.. -
భద్రాద్రి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త మలుపు
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
తెలంగాణలో దంచి కొట్టిన వాన
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. కొన్ని జిల్లాల్లో సోమవారం ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిం డిపోయాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమో దైంది. వర్షాల కారణంగా ఓ చిన్నారి సహా ఇద్దరు మృత్యు వాత పడ్డారు. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. జిల్లాలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 17.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాల్వంచలో 16.4, చుంచుపల్లిలో 16.1, లక్ష్మీదేవిపల్లిలో 14.8, దమ్మపేటలో 12.6, టేకులపల్లిలో 11.4, అన్నపురెడ్డిపల్లిలో 10.8, ముల్కలపల్లిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. 2,491 ఎకరాల్లో వరి, 1,531 ఎకరాల్లో పత్తి పంటకు నష్టంవాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కిన్నెరసాని జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా పొంగిన వాగులు, చెరువులతో జిల్లాలో వందకు పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షంతో గనుల్లో నీరు నిలవడంతో కొత్తగూడెం ఏరియాలో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షపాతం నమోదైంది. పాల్వంచలో రహదారిపైకి వరద చేరడంతో కొట్టుకుపోతున్న వాహనాన్ని నిలబెడుతున్న స్థానికులు వరద నీటిలో చిక్కుకుని చిన్నారి మృతి పాల్వంచ పట్టణంలోని జయమ్మ కాలనీకి చెందిన శనగ రవి – నాగమణి దంపతుల కుమార్తె అంజలి వరద నీటి ప్రవాహంలో చిక్కుకుని మృతి చెందింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయ్యింది. అత్యధికంగా సంగెంలో 14.8 సెం.మీ, నడికుడలో 14.5, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. 28 కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల వద్దకు వెళ్లిపోతున్నారు. వరదలో కొట్టుకుపోయిన భవన నిర్మాణ కార్మికుడు జిల్లాలోని దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం రెడ్డి వెంకటరెడ్డి (42) అనే భవన నిర్మాణ కార్మికుడు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. గిర్నిబావిలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఉధృతంగా ప్రవహిస్తున్న ఈదులచెరువు మత్తడిలో కొట్టుకుపోయాడు. గమనించిన గ్రామస్తులు అతనిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొద్దిదూరంలో మర్రిచెట్టుకు తట్టుకుని ఉన్న వెంకటరెడ్డి మృతదేహాన్ని స్థానికులు ఒడ్డుకు చేర్చారు. కనువిందు చేస్తున్న జలపాతాలు ములుగు జిల్లా వాజేడు మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం కనువిందు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీమునిపాద జలపాతం కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కరీంనగర్, పెద్దపల్లిలో.. కరీంనగర్ జిల్లాలో జడివాన కురుస్తోంది. అత్యధికంగా కరీంనగర్లో 6.3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉదయ్‌నగర్ కాలనీలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. జగిత్యాలలో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీవాన మొదలైంది. జగిత్యాల, మెట్పల్లిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం వర్షం కొద్దిగా తెరపినిచ్చింది. ఉమ్మడి పాలమూరులో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజంతా ముసురు వర్షం కమ్ముకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కౌకుంట్ల–ఇస్రంపల్లి మధ్యవాగులో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం చౌటబెట్ల, మాచినేనిపల్లి గ్రామాల మధ్య కేఎల్ఐ కాల్వ కోతకు గురైంది.జిల్లాలో దాదాపు 500 ఇళ్లు దెబ్బతిన్నాయి. జూరాల ప్రాజెక్టు వద్ద 20 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు ఉమ్మడి మెదక్.. మెదక్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ముసురుగా ప్రారంభమైన వర్షం సోమవారం సాయంత్రానికి భారీ వర్షంగా మారింది. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సిద్దిపేట జిల్లాలో కూడవెల్లి, మోయతుమ్మెద, తాడూరు, హల్దీ వాగులు స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో వరంగల్– సిద్దిపేట దారిపై రాకపోకలు పూర్తిగా నిలిచాయి. దుర్గమ్మ ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతున్న మంజీరానది నిజామాబాద్‌లో.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా సోమవారం వానలు కురిశాయి. బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలోని గ్రామాల్లో మధ్యాహ్నం భారీ వడగళ్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఆర్మూర్ మండలం ఆలూరులో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో గడచిన పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం కూడా చాలాచోట్ల గరిష్టంగా 5 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. ఇంటిపై పిడుగుపాటు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దినేష్ ఇంటిపై పిడుగు పడటంతో గోడలు నెర్రెపడ్డాయి. టీవీ, ఫ్రిజ్, వంటపాత్రలు ధ్వంసమయ్యాయి. రవీంద్రనగర్ నుంచి కౌటాల మార్గంలో వంతెన పైనుంచి పారుతున్న వరద కుమురం భీం జిల్లాలో.. జిల్లాలోని చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. చింతలమానెపల్లి మండలంలోని నాగులవాయి వాగు, చింతలపాటి వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. చింతలమానెపల్లి నుంచి కౌటాల మండలానికి వెళ్లే మార్గంలో చింతలపాటి వద్ద వంతెన పైనుంచి వరద ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అడెపల్లి, రణవెల్లి, కారెబ్బెన, రుద్రాపూర్, డబ్బా తదితర గ్రామాల పరిధిలోని పంట భూములు నీట మునిగి బురద మేట వేశాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. అడెపల్లిలో నీటమునిగి బురదమేట వేసిన పత్తిపంట పిడుగుపాటుకు ఒకరి మృతి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కొలాంగూడలో మొక్కజొన్న పంటచేనులో మంచె కింద ఉన్న ఆత్రం రమేశ్(28)పై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నీట మునిగిన వరి పొలాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో.. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాతో పాటు హైదరాబాద్ జంటనగరాల్లో కురిసిన వర్షానికి మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువులు నిండాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆలేరు – సిద్దిపేట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 25 ఇళ్లు కూలిపోయాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం 1.67 సెం.మీ సగటు వర్షపాతం నమోదు అయ్యింది. రవీంద్రనగర్ నుంచి కౌటాల మార్గంలో వంతెన పైనుంచి పారుతున్న వరద ముగ్గురు విద్యార్థినులను కాపాడిన స్థానికులు హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండ గ్రామంలో వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురు విద్యార్థినుల ప్రాణాలను గ్రామస్తులు కాపాడారు. గ్రామానికి చెందిన గజ్జి ఆకాంక్ష, మేడిపల్లి వర్షిణి, మేడిపల్లి కావ్యలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డుపై భారీ వరద వెళ్తుండగా దాటేందుకు ప్రయత్నించారు. అయితే వరద ఉధృతికి కొట్టుకొని పోయి సమీపంలో ఉన్న చెట్లకు చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే తాళ్ల సాయంతో ముగ్గురిని సురక్షితంగా బయటికి తీశారు. పాల్వంచలో రహదారిపైకి వరద చేరడంతో కొట్టుకుపోతున్న వాహనాన్ని నిలబెడుతున్న స్థానికులు -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పేలిన ప్రెజర్ బాంబు
-
5 ఏరియాలు టాప్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్‌లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్‌లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్‌లో 20 ఓపెన్‌కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్‌తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్‌లోని మణుగూరు టాప్‌గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్‌లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
కొత్తగూడెం రైల్వే శాఖ పరిధిలో ఆక్రమణలు కూల్చివేత
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
-
మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య ఇకలేరు..
మధిర/ ఎర్రుపాలెం: కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చేకూరి కాశయ్య(85) హైదరాబాద్‌లో సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన సేవలను కొనియాడారు. నిబద్ధత గల నేతగా కీర్తి పొందిన ఈయన స్వగ్రామం ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు. చేకూరి నర్సయ్య-భాగ్యమ్మ దంపతులకు 1936లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలో పూర్తిచేసి ఆ తర్వాత మధిర హైసూ్కల్లో 1951-1952లో హెచ్ఎస్సీ పూర్తిచేశారు. విద్యార్థి నాయకుడిగా, మంచి వక్తగా, బహుభాషా కోవిధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొత్తగూడెంలో స్థిరపడి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఖమ్మంలో గురుదక్షిణ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రభుత్వ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మధిర టీవీఎం పాఠశాల పూర్వవిద్యార్థి సంఘాన్ని 1979లో స్థాపించగా ఆయన వ్యవస్థాపక ప్రతినిధిగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావుకు సన్నిహితుడిగానూ మెలిగారు. 1956లో హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. 1958–60లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1960లో కొత్తగూడెం పంచాయతీ సమితిలో విస్తరణాధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ 1964 మార్చిలో రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరిగి 1970లో కూడా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఇలా.. కొత్తగూడెం నియోజకవర్గంనుంచి 1972లో, 1978లో శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయాలకు పునాది మానవ సంబంధాలు, అనుబంధాలు అని చెబుతుండేవారు. 1978లో ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగంపై పోరాటం చేయడం, కమిషన్ చేయించడంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1978లో 80 వేలమంది సింగరేణి కార్మికులు 54 రోజులపాటు చేపట్టిన సమ్మె విజయం సాధించడంలో శాసన సభ్యుడిగా ఆయన పోరాట పటిమను, నిజాయితీని నిరూపించుకున్నారు. 1987లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా విజయం సాధించి తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నివాళి.. ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్ ఆవరణలో ఉంచిన చేకూరి కాశయ్య భౌతికకాయాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు తదితరులు నివాళులరి్పంచారు. -
కోవిడ్ దెబ్బతో అల్లాడుతున్న మావోలు, వీడియో వైరల్
సాక్షి, ఖమ్మం: ఇప్పుడిప్పుడే తిరిగి ఉనికి చాటుకోవాలనుకుంటున్న మావోయిస్టులపై సైతం కరోనా ఎఫెక్ట్ పడుతోంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు మావోలకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. మావోల్లో కొందరు కరోనా బారినపడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతోంది. మెరుగైన వైద్యం కోసం వారు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టుల రాక కొసం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీని వీడి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్ధికంగా కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చే విధంగా హామీ ఇస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజన్ పరిధిలో దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలో సుమారు 70 నుంచి100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి. కరోనా పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. వీరిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత (25లక్షల రూపాయల రివార్డ్),తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌లు ఉన్నట్లు సమాచారం. కోవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఏస్పీ అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారు. మరోవైపు మావోయిస్టుల్లో కొందరు కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మృతుల అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు కొని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా వైరస్ బారిన పడుతున్న మావోయిస్ట్ పార్టీలోని కొంతమంది నాయకులు, దళ సభ్యులు కూడా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ చెప్పారు. వీరిలో కొంతమంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుందని, ఇందులో అగ్ర నాయకులు కూడా ఉన్నరన్నారు. కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ నాయకులు ఎవరైనా వైద్య సదుపాయాలు కావాలనుకుంటే పార్టీ విడి రావాలని సూచిస్తున్నారు. పోలీసువారి సహాయం తీసుకొని చికిత్స చేయించుకొవాలన్నారు. చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
గోదావరిలో మునిగి ఇద్దరు అమ్మాయిల మృతి
సాక్షి, భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరిలో నీటమునిగి ఇద్దరు మృతి చెందారు. పట్టణం లోని కొత్త కాలనీకి చెందిన స్వాతి శుక్రవారం బట్టలు ఉతికేందుకు గోదావరికి వెళ్లారు. కూతురు మధు, మేనకోడలు ప్రవళిక కూడా ఆమెతోపాటు వెళ్లారు. అయితే స్వాతి బట్టలు ఉతుకుతున్న క్రమంలో మధు, ప్రవళిక గోదావరి నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. -
ఆడియో వైరల్ : చెల్లిపై అన్నలు లైంగిక దాడి
-
సొంత చెల్లిపై అత్యాచారం
-
ఇల్లు రాయించుకుని రోడ్డున పడేశారు
సాక్షి, కొత్తగూడెం: ‘కొడుకు, కోడలు నమ్మించి నా ఇల్లు రాయించుకున్నారు. సూటిపోటి మాటలతో నిత్యం నరకం చూపిస్తున్నారు. వారితో నాకు ప్రాణభయం ఉంది. రక్షణ కల్పించండి’ అంటూ ఓ వృద్ధురాలు సోమ వారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూగొల్లగూడెంకు చెందిన పెంటి భూలక్ష్మికి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అందరికి పెళ్లిళ్లు చేసింది. మూడో కొడుకు, కోడలు సత్యనారాయణ– మాధవి మాయమాటలు చెప్పి తన పేర ఉ న్న ఇల్లును సొంత చేసుకున్నారని, ఆపై మానసికంగా వేధిస్తున్నారని ఆమె వాపో యింది. ‘అయినా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడంతో కొట్టి మరీ గెంటేశారు. మిగిలిన కొడుకుల దగ్గరికి వెళ్లినా అవే ఛీదరింపులు. తమకు తెలియకుండా మూడో కొడుకు కు ఇల్లు ఎందుకు రాశావనే కోపంతో వారు కూడా పట్టించుకోవట్లేదు. దీంతో కొత్తగూడెంలో ఉన్న కూతురు, తమ్ముడి వద్ద ఆశ్రయం పొందుతున్నా. కొడుకు, కోడలుతో ప్రాణాపాయం ఉంది. రక్షణ కల్పించడంతోపాటు నా ఇల్లు నాకు ఇప్పించండి’ అంటూ భూలక్ష్మి సోమవారం అదనపు కలెక్టర్ అనుదీప్‌ను కలసి తన గోడు వెళ్లబోసుకుంది. -
క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం
సాక్షి, కొత్తగూడెం : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. స్కూళ్లు తెరవకున్నా క్లాసులు చెబుతానంటూ తీసుకొచ్చి మరీ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలు మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని చింతవర్రెలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఐదుగురు బాలికలున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొడ్డే సునీల్‌కుమార్ వీరిపై కొద్దిరోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరిౖకైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. దీంతో భయపడ్డ వారు మిన్నకుండి పోయారు. చదవండి: పరువు పోయిందని.. ప్రాణం తీసుకుంది ఈ క్రమంలోనే లైంగికదాడి కారణంగా ఓ విద్యార్థిని ఆస్పత్రి పాలైంది. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియగా.. మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులతో కలసి ఆ హెచ్ఎంను నిలదీశారు. గత రెండ్రోజులుగా ఈ విషయంపై మరో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించాడు. అది కాస్త బయటకు పొక్కడంతో గ్రామస్తులందరూ ఉపాధ్యాయుడిని మంగళవారం నిలదీసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్ భద్రకాళి, ఎంపీడీఓ రామారావు, సీడీపీఓ కనకదుర్గ, సీఐ గురుస్వామి, ఎస్సై అంజయ్య, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఆ చిన్నారులతో మాట్లాడారు. గ్రామస్తులు, తల్లిదండ్రులతో విషయంపై చర్చించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే డీఈఓ సోమశేఖరశర్మ.. సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. దీనిపై స్థానిక ఎస్సై అంజయ్యను వివరణ కోరగా.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పెద్దగుట్టపై పులి
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సాయిబులగుంపులోని కనకరాజు గుట్ట (పెద్ద గుట్ట)పై పులి ఐదు రోజులుగా మకాం వేసినట్లు తెలుస్తోంది. ఆవును చంపి తిన్న కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెల 29న తుమ్మలచెరువు గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవు మేతకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దాన్ని పులి చంపి ఉంటుందని అందరూ భావించారు. శుక్రవారం ఎఫ్ఆర్వో ప్రసాదరావు ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు పెద్ద గుట్టపై గాలింపు చర్యలు చేపట్టారు.అక్కడ దుర్వాసన వస్తున్న ఆవు కళేబరంతో పాటు పరిసరాల్లో పులి పాదముద్రలు, సంచరించిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో ఆవును పులే చంపి తిన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. పులి కనిపించలేదని ఎఫ్ఆర్వో తెలిపారు. గురువారం పత్తి చేల నుంచి కొందరు రైతులు, కూలీలు పత్తి తీసుకొని ట్రాక్టర్లపై వస్తుండగా మార్గమధ్యలో వారికి పులి కనిపించింది. వారి అరుపులు, కేకలకు పులి తిరిగి గుట్టపైకి వెళ్లినట్లు వారు చెప్తున్నారు. కాగా.. రైతులు, కూలీలు పత్తి చేల వద్దకు, పశువులు, జీవాల పెంపకందారులు అడవిలోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
సోషల్ మీడియా స్నేహం.. ఫోటోలు మార్పింగ్ చేసి!
సాక్షి, సింగరేణి(కొత్తగూడెం): ఫొటోలు మార్ఫింగ్ చేసి బాలికను బ్లాక్మెయిల్ చేసిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఠాణాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర సీఐ బి.సత్యనారాయణతో కలిసి వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన అక్కినపెల్లి శివకృష్ణ కొత్తగూడెంలోని గౌతంపూర్‌కు చెందిన బాలికను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి వాట్సాప్ ద్వారా ఆమె ఫొటోలు సేకరించాడు. ఫొటోలను మార్ఫింగ్ చేసి తిరిగి బాలిక వాట్సాప్‌కు పంపాడు. డబ్బులు, బంగారం ఇవ్వాలని లేకపోతే మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడి అంగీకరించింది. చదవండి : ఆ నది రక్తంతో ఎరుపెక్కుతోంది.. సెప్టెంబర్ 19న తన స్నేహితులు పాతకుంట సందీప్‌కుమార్, సుద్దపల్లి కార్తీక్, గిందమ్ విజయ్‌కుమార్‌లను గౌతంపూర్‌కు పంపాడు. వారు బాలిక నుంచి రెండు తులాల బంగారు ఆభరణం తీసుకుని, బెదిరించి వెళ్లారు. మళ్లీ ఈ నెల 3న శివకృష్ణ బాలికతో చాటింగ్ చేసి, రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము రుద్రంపూర్‌లోని ప్రగతివనం పార్కు వద్ద ఉన్నామని, వెంటనే డబ్బులు తెచ్చి ఇవ్వాలని బెదిరించాడు. విశ్వసనీయ సమాచారంతో టూ టౌన్ ఎస్హెచ్ఓ బి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా శివకృష్ణను, అతని మిత్రులు పాతకుంట సందీప్‌కుమార్, సుద్దపల్లి కార్తీక్, గిందమ్ విజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సీఐ సత్యనారాయణను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నడుస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు. ఎస్ఐలు రాజేందర్, రాంబాబు, ఏఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: విషాదం: ప్రేమికులిద్దరూ మృతి -
తుపాకుల మోత.. అట్టుడికిన అడవి
చర్ల : మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు ఈసారి ఏజెన్సీ ఆదివాసీల్లో వణుకు పుట్టించాయి. తుపాకుల మోతలు ఓవైపు, బాంబు పేలుళ్ల శబ్దాలు మరోవైపు భయాందోళనలు కలిగించాయి. ఇక సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలైతే ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే తీవ్రంగా భయపడ్డారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతం కావడం, మరో వైపు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ సభ్యులు మృత్యువాత పడడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోయారు. ఈనెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చర్ల–శబరి ఏరియా కమిటీ, భదాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి జిల్లా కమిటీలు, తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాయి. అయితే వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వరుస ఘటనలతో బెంబేలు.. చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో ఈనెల 23న రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అంతకు ముందు 19న చర్ల మండలం తేగడ – కలివేరు గ్రామాల మధ్య రాష్ట్రీయ రహదారి పక్కన మావో యిస్టులు ఏర్పాటు చేసిన 3 శక్తివంతమైన మందుపాతర్లను గుర్తించిన పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈనెల 6న పెదమిడిసిలేరు–తిప్పాపురం మార్గంలో గల ప్రధాన రహదారి పై మావోయిస్టులు మందుపాతరలు పేల్చారు. ఆ తెల్లవారి వద్దిపేట – పూసుగుప్ప అడవుల్లో ఎదురుకాల్పులు జరగగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల వివిధ గ్రామాలకు చెందిన పలువురు ఆదివాసీలను ఇన్ఫార్మర్లుగా భావిస్తూ మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ప్రజాకోర్టులు నిర్వహించి వారం రోజుల వ్యవధిలో 16 మందిని హతమార్చారు. ఇలా ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల చర్యలతో ఆదివాసీ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాల నిర్వహణలో గతం కంటే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఆదివాసీ గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ సామాన్య ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా భయాందోళన చెందారు. -
ఏజెన్సీలో ఎన్కౌంటర్.. టెన్షన్ టెన్షన్
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణలో మరోసారి మావోయిస్టుల ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా మావోల ఏరివేతపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసుశాఖ అటవీ ప్రాంతాల్లో వరుస కూంబింగులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చర్ల-చత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఎన్కౌంటర్ జరపడం గమనార్హం. చర్ల మండలంలోని వడ్డిపేట, పుస్సుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. మృతుల్లో ఒకరు శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో బ్యారెల్ గన్, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. (సమీక్షలతో డీజీపీ హల్ చల్) మరోవైపు కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు అలియాస్ శంకర్‌ను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్ చేపట్టారు. స్పెషల్ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే చర్ల మండలంలో తాజా ఎన్కౌంటర్ జరిపారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి వరుస పర్యటనల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్రల నుంచి తెలంగాణ లోకి మావోయిస్టుల కట్టడి విషయంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. -
భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో మావోయిస్ట్‌ల కలకలం
-
సరికొత్త వెలుగులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) రాష్ట్రానికి వెలుగులు అందించడం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక–మణుగూరు సరిహద్దులో 1,080 మెగావాట్ల (270‘‘4) విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్‌లో శుక్రవారం మొదటి యూనిట్ నుంచి సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) ప్రక్రియ విజయవంతం అయింది. దీంతో బీటీపీఎస్ నుంచి రాష్ట్రానికి ఇక నుంచి నిరంతరాయంగా వెలుగులు అందనున్నాయి. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీటీపీఎస్ మొదటి యూనిట్ నుంచి గంటకు 19.556 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి కానున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. 2015 ఏప్రిల్ 23న సీఎం కేసీఆర్ బీటీపీఎస్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో బీటీపీఎస్ మొదటిది. బీహెచ్ఈఎల్ సంస్థకు జెన్కో నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సీవోడీ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి యూనిట్ నుంచి 2019 సెప్టెంబరు 19న సింక్రనైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా సీవోడీ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ విజయవంతం గా పూర్తి చేశారు. ఈ నెల 2వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతం కావడంతో సీవోడీ ప్రక్రియ పూర్తయింది. ఇక రెండు, మూడు యూనిట్ల నిర్మాణం సైతం 70 శాతం పూర్తయినట్లు జెన్కో అధికారులు తెలిపారు. కొత్త సేవలపై హర్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఉన్న కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) ఆరు దశాబ్దాలుగా రాష్ట్రానికి వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. అయితే ఇందులో 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన కాలం చెల్లిన ఓఅండ్ఎం (1,2,3,4 దశలు) ప్లాంట్లను గత మార్చి 31న మూసివేశారు. వీటిని నిర్మించి 50 ఏళ్లు దాటడంతో నిబంధనల మేరకు మూసివేశారు. అయితే కేటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 7వ దశ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో సమస్య తీరింది. 2018 డిసెంబర్ 26న కేటీపీఎస్ 7వ దశ సీవోడీ ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రస్తుతం (720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 1, 2, 3, 4 దశలు మూసేశాక) ఇక్కడి నుంచి 7వ దశతో కలుపుకొని 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. తాజాగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రస్తుతం 2,070 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చినట్లయింది. కాగా బీటీపీఎస్ విజయవంతం కావడంతో సిబ్బందికి సీఎండీ ప్రభాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. -
తల్లీబిడ్డల ఫేస్ మాస్క్ : వైరల్ ఫోటో
సాక్షి, కొత్తగూడెం : అడవి బిడ్డలకు అక్కడ దొరికే అకులు అలమలే వారికి ఆహారము, వైద్యమూ. సరిగ్గా వైద్య సదుపాయంలేని ఆ కొండకోనల్లో దొరికే ప్రతి మొక్క వారికి ఓ మూలికే. చిన్న చిన్న అనారోగ్యాలకు గాయాలకు సైతం ఆకుపసర వైద్యంతోనే నెట్టుకొచ్చేస్తుంటారు. ప్రపంచమంతటా మానవాళిని కరోనా మహమ్మారి కలవరపెడుతున్న వేళ మాస్క్లనీ, శానిటైజర్లనీ, సామాజిక దూరమంటూ జాగ్రత్త పడతున్న తరుణమిది. ఈ నేపథ్యంలో కరోనా నుంచి తమను తాము కాపాడుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మ కాలనీలో ఆకులను మాస్క్‌కు మార్చి ఓ తల్లీబిడ్డా ధరించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు సైతం దీనిని నెట్టింట షేర్ చేస్తున్నారు. (బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన) ఇక కరోనా సోకకుండా అడవుల్లో ఉండే గిరిజనులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆకులతో సొంతంగా మాస్క్‌లు తయారుచేసి ముఖాలకు ధరిస్తున్నారు. నాలుగు గంటలపాటు తాజాగా ఉండే ఈ ఆకుల మాస్కులు ధరించి గొత్తికోయలు రోజువారి పనులు చేసుకుంటున్నారు. – దశరథ్ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
ఇక రెండు రోజులే..
సాక్షి, పాల్వంచ: సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు విద్యుత్ కాంతులు విరజిమ్మిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్) చరిత్ర తుది అంకానికి చేరుకుంది. పర్యావరణ ఆదేశాల మేరకు ఈ నెల 31తో తన ప్రస్థానానికి ముగింపు పలకబోతోంది. దీంతో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్రం కోల్పోనుంది. పాల్వంచలోని కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని 1966 – 1978 మధ్య కాలంలో ఏ,బీ,సీ స్టేషన్ల వారీగా 8 యూనిట్లను నిర్మించారు. వీటి ద్వారా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి వెలుగులు అందించింది. ఇంజనీర్లు, కార్మికులు కలిపి 2,500 మంది ఇప్పటివరకు పనిచేశారు. కిన్నెరసాని జలాశయం ఆధారంగా సమీపంలోని కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల సింగరేణి బొగ్గు సరఫరా చేసుకుని ఐదున్నర దశాబ్దాల పాటు ఏకధాటిగా ఉత్పత్తి అందించింది. జపాన్ టెక్నాలజీతో 1,2,3,4 యూనిట్లలో 240 మెగావాట్లు, 5, 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 7,8 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల ఉత్పత్తిని అందించింది. అయితే కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యూనిట్లను మూసివేయాలని సెంట్రల్ ఎలక్రి్టసిటీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, దాని స్థానంలో సూపర్ క్రిటికట్ టెక్నాలజీతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మరో ప్లాంట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఓఅండ్ఎం కర్మాగారాన్ని 2019 డిసెంబర్ 31న మూసి వేయాల్సి ఉండగా.. 7వ దశలో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో గత నవంబర్ 28వ తేదిన ఉత్పత్తిని నిలిపివేశారు. మరమ్మతు చేయడానికి నాలుగు నెలల కాలం తీసుకున్నారు. దీంతో డిసెంబర్ 31న మూసివేయాల్సిన ఓఅండ్ఎం కర్మాగారాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. మార్చి 31తో మూసేస్తాం కాలం చెల్లిన 720 మెగావాట్ల కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని మార్చి 31న మూసివేయాలని జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఐదున్నర దశాబ్దాల పాటు తన ప్రస్థానాన్ని సాగించి ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులు అందించింది. జ పాన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ కర్మాగారం ఇంతకాలం విజయవంతంగా ఉత్పత్తి అందించడం గొప్ప విషయం. కేటీపీఎస్‌తోనే పాల్వంచకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉందనడంలో సందేహం లేదు. మూసివేత నిర్ణయం బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో విరామం ప్రకటిస్తున్నాం. - జె.సమ్మయ్య, సీఈ -
హాట్‌టాపిక్‌గా డీఎస్పీ వ్యవహారం!
వరంగల్ అర్బన్, కాజీపేట అర్బన్ : కొత్తగూడెం డీఎస్పీ, ఆయన కుమారుడి వ్యవహారం ఇటు పోలీసులు, అటు ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వివిధ స్థాయిల్లో పని చేసిన సదరు డీఎస్పీ కుమారుడు(23)తో పాటు ఆ కుటుంబంతో సంబంధం ఉన్న మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదివితమే. ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంటూ సుమారు 21 మందికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అయితే, 21 మందిలో ఎవరికీ కూడా పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా డీఎస్పీ కుమారుడు తిరిగిన ప్రదేశాలు, ఆయన పాల్గొన్న పంక్షన్లలో కలిసిన స్నేహితులు, బంధువులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు ఎంజీఎం, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రులకు తరలించడంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలేం జరిగింది.... కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తూ ఈనెల 18న హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి వెళ్లారు. అయితే, యువకుడిని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క్వారంటైన్ చేయకుండా నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఈనెల 19న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండల రాఘవపురంలోని ఒక గహప్రవేశానికి వెళ్లి అదే రోజు తల్లాడ మండలం మిట్టపల్లికి వెళ్లి బంధువులను కలిశాడు. ఈ మేరకు 21వ తేదీన అనారోగ్యంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా 22న కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు.. 23న ఆయన కుటుంబ సభ్యులను, డీఎస్పీ కార్యాలయ సిబ్బంది, వారితో కలిసిన సుమారు 21 మందిని మొదటగా వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చి పరీక్షలు చేశాక నెగెటివ్ రావడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఇదే సమయంలో డీఎస్పీ, వారి కుటుంబసభ్యులకు ఈనెల 24న పరీక్షలు నిర్వహించగా.. డీఎస్పీతో పాటు వారి వంట మనిషికి పాజిటివ్‌గా నివేదిక రావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కాగా, సదరు డీఎస్పీ వివిధ స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేయగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
కొత్తగూడెంలో ప్రమాద ఘంటికలు!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే హైరిస్క్ జాబితాలో ఉన్న ఈ జిల్లాను వైరస్ వణికిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మారుమూలన ఉన్న భద్రాద్రి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపడం పట్ల జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. 4 కోవిడ్ కేసులు పాజిటివ్ కాగా.. వాటిలో ఏకంగా మూడు కేసులు కొత్తగూడెం పట్టణంలోనే నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అవి కూడా ఒకేచోట నమోదు కావడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. జిల్లాలో మొదటి కేసు ఇటలీ నుంచి అశ్వాపురం వచ్చిన ఓ యువతికి వచ్చింది. తర్వాత లండన్ నుంచి వచ్చిన కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు ఆవాజ్‌కు పాజిటివ్ వచ్చింది. లండన్ నుంచి వచ్చి బయట తిరగడంతోనే.. లండన్ నుంచి వచ్చిన ఆవాజ్ క్వారంటైన్లో ఉండకుండా యథేచ్ఛగా తిరగడం వల్ల ఇక్కడ కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డీఎస్పీకి, వాళ్లింటి వంట మనిషికి సైతం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లండన్ నుంచి వచ్చిన ఆవాజ్ డీఎస్పీ కార్యాలయం సిబ్బందితో పాటు, బయట స్నేహితులు సుమారు 30 మందితో కలిశాడు. డీఎస్పీ స్వగ్రామం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లికి వెళ్లి అక్కడ కూడా పలువురిని కలిశాడు. సరిహద్దు ఏపీలోని పశ్చి మగోదావరి జిల్లా చింతపూడిలో ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ 36 మందితో కరచాలనం చేసినట్లు తెలుస్తోంది. దీనికి గతంలో జిల్లాలో ఉండి ప్రస్తుతం ఏపీలోకి వెళ్లిన వేలేరుపాడు మండలానికి చెందినవారు కూడా వెళ్లారు. వారూ ఆవాజ్‌ను కలిశారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోనూ కలిసిన వారి గురించి అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక కొత్తగూడెంలో కటింగ్ షాప్‌కు వెళ్లడంతో సదరు వ్యక్తిని, తాజాగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వంట మనిషి కుటుంబీకులను కూడా పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తల్లాడ మండలం మిట్టపల్లిలోనూ 14 మందిని వైద్య పరీక్షలకు తరలించారు. వీరంతా రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆవాజ్‌ను కలసిన వ్యక్తులంతా ఇంకా ఎవరెవరిని కలిశారనే విషయమై ఆరా తీస్తున్నారు. మొత్తం వంద మందికి పైగా అబ్జర్వేషన్లో పెట్టారు. మరోవైపు అధికారులు ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. విదేశాల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనదేశానికి వచ్చినవారు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండకుండా విచ్చలవిడిగా తిరిగి విపత్కర స్థితి తీసుకు రావడం పట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విరుద్ధ ప్రకటనలపై విమర్శలు కాగా కొత్తగూడెం డీఎస్పీకి కోవిడ్ నెగెటివ్ వచ్చినట్లు మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ ప్రకటించారు. తీరా రాత్రి తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చిన బులెటిన్‌లో డీఎస్పీకి, వంట మనిషికి పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. ఈ పరిస్థితుల్లో జిల్లా పోలీసులు ఆదరాబాదరాగా నెగెటివ్ ఉన్నట్లు ప్రకటించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కొత్తగూడెం డీఎస్పీ, ఆయన కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీపై 307 సెక్షన్ కింద కేసు పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు డీఎంఎహెచ్‌ఓ కొత్తగూడెం వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన సీఐ జిల్లాలోని అశ్వారావుపేట సీఐ అబ్బయ్య గత సోమవారం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అక్కడ ఉన్న కెమిలాయిడ్స్ గెస్ట్‌హౌజ్‌లో సుమారు 200 మందికి పైగా భోజనాలు పెట్టారు. దీంతో ఫిర్యాదు అందుకున్న ఎస్పీ సునీల్‌దత్ సీఐ అబ్బయ్యను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. 12 దేశాల నుంచి 136 మంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 12 దేశాల నుంచి 136 మంది వచ్చారు. వీరిని హోం క్వారంటైన్లో ఉంచి వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖల పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 21 మంది క్వారంటైన్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇటలీ నుంచి వచ్చిన అశ్వాపురం యువతికి పాజిటివ్ రావడంతో ఆమెను కలసిన 48 మందిని అధికారులు అబ్జర్వేషన్లో పెట్టారు. -
డిఎస్పీ కుమారుడికి కరోనా
-
కొత్తగూడెం యువతికి కరోనా పాజిటివ్
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో తొలి కరోనా వైరస్ నమోదు కావడం కలకలం రేపింది. అశ్వారావుపేట మండలానికి చెందిన స్నేహ అనే యువతికి కరోనా పాజిటివ్ వచ్చిన వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యువతిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన యువతి ఇటలీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా తగ్గక పోవడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్‌ఉన్నట్లు తేల్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకి తరలించారు. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఆ యువతి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. -
వ్యాపారి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు సందేశం
సాక్షి, కొత్తగూడెం : వ్యాపారంలో స్నేహితులు మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీకి చెందిన ఎండీ ముక్తార్(33) కొత్తగూడెం పట్టణం చిన్నబజార్లో సనా డిజైనర్ వస్త్ర దుకాణం, జమా మసీద్ కాంప్లెక్స్‌లో లేడీస్ దుస్తుల షాపు నడిపించేవాడు. గత ఏడాది భద్రాచలంలో స్నేహితులతో కలిసి మరో వస్త్ర దుకాణం ప్రారంభించాడు. వ్యాపారంలో స్నేహితుడు రమేష్‌తో పాటు మరికొందరు మిత్రులు మోసం చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రికి సందేశం.. ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీడియో సందేశాన్ని రికార్డు చేసి పోస్టు చేశాడు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వీడియో పోస్ట్ చేశాడు. వ్యాపారంలో నష్టపోయిన తీరును వీడియోలో వివరించాడు. తాను స్థానిక ఎమ్మెల్యే అభిమానినని వీడియోలో తెలిపాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
నాడు నిలిపివేసి..నేడు ప్రయాణం సా..గదీసి
సాక్షి, కొత్తగూడెం : భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు వెళ్లే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఈ బండి తెల్లవారుజామున 05:45 గంటలకు కొత్తగూడెం నుంచి బయల్దేరేది. ప్రస్తుతం ఉదయం 06:45 గంటలకు షురూ అవుతోంది. డోర్నకల్ సమీపంలోని స్టేషన్ల మధ్యలో జరుగుతున్న రైల్వే ట్రాక్ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతుల కారణంగా రైలు నడిచే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే..ఈ ఆలస్యంతో నిత్యం రాకపోకలు సాగించేవారు చాలా అసౌకర్యం చెందుతున్నారు. ఈ రైలు ఎక్కి డోర్నకల్ స్టేషన్‌కు వెళ్లి..అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 05:45 గంటలకు రైలు వెళ్లినప్పడు డోర్నకల్ స్టేషన్లో హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే రైళ్లు ఉండేవి. ప్రస్తుతం మార్పు చేసిన సమయంతో..ఆ ట్రెయిన్లు దొరకట్లేదు. ముఖ్యంగా శాతవాహన, గోల్కొండ, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..అందట్లేదని వాపోతున్నారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వెళ్లేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది. రైల్వే అధికారులు చర్యలు చేపట్టి, పాత సమయంలోనే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలును కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. మార్చి దాకా ఇంతేనా? డోర్నకల్ సమీపంలో రైల్వే ట్రాక్ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతులు చేస్తున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 2020 మార్చి వరకు అని భావిస్తున్నారు. అయితే..మే వరకు కూడా పనులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రయాణీకుల ఇబ్బందులు సింగరేణి కార్మికులు ఉండే ప్రాంతాలను కలుపుతూ నడిచే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌ను ఈ ఏడాది మార్చి 26న రద్దు చేశారు. దీని స్థానంలో పుష్పుల్ రైలును వేశారు. అందులో టాయిలెట్లు లేక, సామగ్రి పెట్టుకునే ఏర్పాట్లు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అఖిలపక్ష నాయకులు చేసిన పోరాటాలు, రైల్వే అధికారులకు ఇచ్చిన వినతుల ఫలితంగా మళ్లీ గత అక్టోబర్ 8వ తేదీన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌ను అధికారులు పున:ప్రారంభించారు. తాజాగా గంట ఆలస్యం ఆంక్షలతో ప్రయాణికులు మళ్లీ మదన పడుతున్నారు. ఇతర రైళ్లను సరైన సమయంలో అందుకోలేకపోతున్నామని అంటున్నారు. రైల్వే ట్రాక్ పనులతో ఆలస్యం.. డోర్నకల్ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం నడుస్తున్న రైల్వే ట్రాక్ పనుల వలన సింగరేణి ప్యాసింజర్ గంట ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైం షెడ్యూల్ 2020 మార్చి వరకు కొనసాగనుంది. అయితే ఆ తర్వాత కూడా ఉన్నతాధికారులు కొనసాగించమంటే..అదే షెడ్యూల్‌ను కొనసాగిస్తాం. – కనకరాజు, రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, కొత్తగూడెం ఇబ్బంది పడుతున్నాం.. సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ప్రయాణ సమయాన్ని గంట లేటు చేయడంతో మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో తెల్లవారుజామున 5:45కు బయల్దేరినప్పుడు సరైన టైంకు చేరేవాళ్లం. ఇప్పుడు అలా వెళ్లలేకపోతున్నాం. – బొల్లం రమేష్, ప్రయాణికుడు చాలా క్రాసింగ్‌లు పెట్టారు.. రైల్వే అధికారులు చేసిన మార్పుల వలన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌కు చాలా క్రాసింగ్‌లు ఎదురవుతున్నాయి. సింగరేణి రైలును ఆపి, ఎదురుగా వచ్చే ఇతర ట్రెయిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డోర్నకల్‌లో ఇతర రైళ్లను అందుకోలేకపోతున్నాం. – రఘు, ప్రయాణికుడు -
సింగరేణిలో అత్యధిక ఇన్సెంటివ్ అతడిదే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఇటీవల ప్రకటించిన 28 శాతం లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన టింబర్‌యార్డు వర్క్‌మెన్ మందాల ఓదేలు అత్యధికంగా రూ.1.80 లక్షల ఇన్సెంటివ్ సాధించాడు. ఏరియాల వారీగా అత్యధిక ఇన్సెంటివ్‌లు సాధించిన వారి వివరాలను యాజమాన్యం సోమవారం విడుదల చేసింది. ఓదేలు అత్యధిక ఇన్సెంటివ్ సాధించి మొదటి స్థానంలో నిలువగా, రూ.1.76 లక్షలతో మందమర్రి ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీరాజ్ ద్వితీయ, రూ.1.67 లక్షలతో కొత్తగూడెం ఏరియా ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ రాంజీవన్ పాసి తృతీయ స్థానంలో నిలిచారు. బెల్లంపల్లి ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ రూ.1.38 లక్షలు, కార్పొరేట్ ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ బొజ్జ రవీందర్ రూ.1.34 లక్షలు, ఇల్లెందు ఏరియాకు చెందిన జూనియర్ కెమిస్ట్ మనోజ్ కుమార్ రూ.1.51లక్షలు, భూపాలపల్లి ఏరియాకు చెందిన ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ చిలుకల రాయలింగు రూ.1.42 లక్షలు, రామగుండం–1 ఏరియాకు చెందిన ఫోర్‌మెన్ కె.ముత్తయ్య రూ.1.55 లక్షలు, రామగుండం–2 ఏరియాకు చెందిన ఓవర్‌మెన్ గోపు రమేష్‌కుమార్ రూ.1.58 లక్షలు, రామగుండం–3 ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ నల్లని రాంబాబు రూ.1.52 లక్షలు, మణుగూరు ఏరియాకు చెందిన ఫిట్టర్ ముప్పారపు శ్రీనివాసరావు రూ.1.38 లక్షలు స్పెషల్ ఇన్సెంటివ్ సాధించారు. -
‘వర్సిటీ’ ఊసేది..?
సాక్షి, కొత్తగూడెం: ఉన్నత విద్యను యువతకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గతంలో రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం ఇప్పటివరకు ఒక్క వర్సిటీ కూడా మంజూరు కాలేదు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ వర్సిటీని ములుగులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ తప్పకుండా ఏర్పాటు చేస్తారనే ఆశలు ఉమ్మడి జిల్లా వాసుల్లో ఉన్నాయి. సింగరేణి కేంద్ర కార్యాలయం ఉన్న కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన ఆస్పత్రి సైతం ఉంది. దీంతో సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా.. అది కూడా ఎప్పటికప్పుడు వెనక్కే వెళుతోంది. చివరకు మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ దీనిపైనా స్పష్టత లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ విషయమై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అనుకూలంగా సిఫారసు చేసినప్పటికీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. దినదినాభివృద్ధి చెందుతున్న ‘గూడెం’.. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, సింగరేణి పుట్టిల్లయిన ఇల్లెందు ప్రాంతాలు బొగ్గు గనులతో భాసిల్లుతున్నాయి. మరోవైపు జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా కూడా మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోంది. కొత్తగూడెంలో సింగరేణి కేంద్ర కార్యాలయం ఉండడంతో పాటు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించాక మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి వివిధ దశల్లో కసరత్తు సైతం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సానుకూలంగానే వెళ్లాయి. సింగరేణి గనులతో పాటు పాల్వంచలో కేటీపీఎస్, అశ్వాపురంలో భారజల కర్మాగారం, ఐటీసీ పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా మణుగూరు–పినపాక మండలాల సరిహద్దుల్లో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మిస్తున్నారు. ఇలా పారిశ్రామిక రంగంలోనూ జిల్లా దూసుకెళుతోంది. మైనింగ్ స్కూల్‌నే యూనివర్సిటీగా... జిల్లాలో 400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను ధన్‌బాద్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ లేదా మైనింగ్ యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌లో మైనింగ్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, ఐటీ కోర్సులు ఉన్నాయి. ఇందులో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె.సీతారామారావు ఇతర నిపుణలు ఉన్నారు. కొత్తగూడెం ఏరియాకు పలుమార్లు వచ్చిన ఈ కమిటీ 2016 సెప్టెంబర్ 26న చివరిసారిగా పర్యటించి.. కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌ను ‘మైనర్ అండ్ టెక్నలాజికల్ డీమ్డ్ యూనివర్సిటీ’గా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. కొత్తగూడెం రుద్రంపూర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను సైతం ఇందులో విలీనం చేయాలని సూచించింది. అసెంబ్లీలో చర్చ... 2017 చివరిలో జరిగిన అసెంబ్లీ సమావేశా ల్లోనూ ఈ అంశం చర్చకు రాగా, నాటి మంత్రి కడియం శ్రీహరి వర్సిటీ ఏర్పాటుకు తగిన విధంగా ముందుకు వెళతామని హామీ ఇచ్చారు. 2018 మార్చిలో మైనింగ్ విశ్వవిద్యాలయం పై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని భావించినా అది నిరాశే అయింది. ప్రస్తుత గవర్నర్ తమిళిసై మైనింగ్ వర్సిటీ ఏర్పాటుపైనా చొరవ తీసుకోవాలని విద్యాభిమానులు కోరుతున్నారు. -
రామయ్యనూ పట్టించుకోలే..
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో పాలనను పూర్తి అవినీతియమంగా మార్చి తన కుటుంబానికి మాత్రమే దోచిపెడుతున్న కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని, చివరకు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్యను సైతం నిర్లక్ష్యం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ అన్నారు. కొత్తగూడెంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అవినీతి పాలనతో విసుగు చెందిన ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ తల్లీకొడుకుల పార్టీగా మారిపోవడం, ఆ పార్టీ నుంచి గెలిచిన వారు సిగ్గులేకుండా టీఆర్ఎస్లో చేరుతుండడంతో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆయన ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్ బాటలో నడుస్తుండడంతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. 70 ఏళ్ల జమ్ముకశ్మీర్ సమస్యను 70 రోజుల్లో పరిష్కరించిన బీజేపీ.. సింగరేణి కార్మికుల సమస్యలను సైతం పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. సింగరేణి కార్మికుల శ్రమను టీఆర్ఎస్ దోచుకుంటోందని, ఏరు దాటాక బోడ మల్లయ్య అన్న చందంగా సింగరేణి కార్మికుల విషయంలో కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన నల్ల సూర్యులు అగ్నిసూర్యులై ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ హయాంలో సింగరేణితో పాటు, తెలంగాణ వ్యాప్తంగా అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పాల్గొన్న నాయకులను ఖాతరు చేయకుండా ఉద్యమ ద్రోహులకు మంత్రిపదవులు ఇచ్చారని, రజాకార్ల పార్టీ మజ్లిస్‌తో స్నేహం చేస్తూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శించారు. కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగీ, షోయబుల్లాఖాన్ లాంటి వారు చేసిన త్యాగాలను మరుగున పరిచి తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే సెప్టెంబర్ 17న అభినవ సర్ధార్ పటేల్ అమిత్‌షా తెలంగాణలో జాతీయజెండా ఎగురవేస్తారన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో బిడ్డింగ్‌కు పోకుండా అక్రమంగా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అవినీతిమయమైన పాలనతో నయాం నిజాంలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు కేసీఆర్ బాహుబలి అయితే, అక్కడ చాలామంది కట్టప్పలు సైతం ఉన్నారని తెలుసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం పాకిస్తాన్‌ను సంతోషపెట్టేలా మాత్రమే పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో కోనేరు సత్యనారాయణ, జిల్లా ఇన్చార్జి అమర్నాథ్, రంగాకిరణ్, ముస్కు శ్రీనివాసరెడ్డి, కుంజా సత్యవతి పాల్గొన్నారు. -
అభివృద్ధే ధ్యేయం
సాక్షి, ఖమ్మం : జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా పరిషత్ తొలి పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించింది. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయిన కోరం కనకయ్య(టేకులపల్లి)తో పాటు వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు(చుంచుపల్లి), మిగిలిన జెడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులతో కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఎన్నికల అధికారి హోదాలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలన వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేయడంతో పాటు గత ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని అన్నా రు. ప్రస్తుతం కొత్త జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పా టు కావడంతో గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టే అవకాశం కలిగిందన్నారు. గిరిజన ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర రంగాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా పనిచేస్తానన్నారు. ఇప్పటికే గత ఐదేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందిందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే భద్రాద్రి, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ తనకు ఈ విధంగా నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాధించిన స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. అందరి తోడ్పాటుతో జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తర్వాత పంచాయతీలు, ప్రస్తుతం పరిషత్‌లు కూడా విభజించడంతో పాలన దగ్గరైందన్నారు. అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి జెడ్పీ చైర్మన్‌గా కోరం కనకయ్య, వైస్ చైర్మన్‌గా కంచర్ల చంద్రశేఖర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్లు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్, అన్ని మండలాల జెడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తొలిసారిగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ వారిచే ప్రమాణం చేయించారు. వారిలో వాంకుడోతు ఉమాదేవి (ఇల్లెందు), భూక్య కళావతి (జూలూరుపాడు), కొమరం కాంతారావు (కరకగూడెం), పోశం నరసింహారావు (మణుగూరు), సున్నం నాగమణి (ములకలపల్లి), బిందు చౌహాన్ (సుజాతనగర్), వాగబోయిన రామక్క (గుండాల), లాలమ్మ (అన్నపురెడ్డిపల్లి), చిన్నంశెట్టి వరలక్ష్మి (అశ్వారావుపేట), మేరెడ్డి వసంత (లక్ష్మీదేవిపల్లి), బరపటి వాసుదేవరావు (పాల్వంచ), కొడకండ్ల వెంకటరెడ్డి (చండ్రుగొండ), పైడి వెంకటేశ్వరరావు (దమ్మపేట), ఇర్పా శాంత (చర్ల), కామిరెడ్డి శ్రీలత (బూర్గంపాడు), బెల్లం సీతమ్మ (దుమ్ముగూడెం), దాట్ల సుభద్రాదేవి (పినపాక), సూదిరెడ్డి సులక్షణ (అశ్వాపురం), కొమరం హనుమంతరావు (ఆళ్లపల్లి), కో–ఆప్షన్ సభ్యులు షర్ఫుద్దీన్ అహ్మద్, సయ్యద్ రసూల్ ఉన్నారు. -
ఎన్డీ నేత లింగన్న హతం
సాక్షి, ఖమ్మం(గుండాల) : అప్పుడే తెల్ల వారింది.. రైతన్నలు చేను చెలకల్లోకి పయనమవుతున్నారు.. ఒక్కసారిగా అటవీ ప్రాంతం నుంచి తుపాకుల మోత.. దీంతో భయాందోళనకు గురై ఉరుకులు పరుగులు పెట్టారు.. తేరుకునే సరికి పోలీసులకు, ఎన్డీ దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయనే విషయం దావానలంలా వ్యాపించింది. ఈ కాల్పుల్లో న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాల నేత, రీజినల్ కార్యదర్శి పూనెం లింగయ్య(50) అలియాస్ లింగన్న మృతి చెందాడు. మరో నేత గోపన్నతో సహా ముగ్గురు సభ్యులు తప్పించుకున్నారు. ఇంకో ఇద్దరు పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్నారు. క్రమంగా చుట్టుపక్కల జనం సంఘటన స్థలానికి చేరుకున్నారు. లింగన్న మృతదేహాన్ని మార్గం తప్పించి తరలిస్తుండగా జనం వెంటపడ్డారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు సుమారు 40 రౌండ్ల వరకు గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని దేవళ్లగూడెం రోళ్లగడ్డ మధ్య బుధవారం చోటుచేసుకుంది. పది రోజులుగా కూంబింగ్.. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత వారం పది రోజులుగా మండల సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. అప్పటికే పోలీసుల టార్గెట్‌గా ఉన్న లింగన్న, ఆయన ఆరుగురు దళ సభ్యు లు రోళ్లగడ్డ సమీపంలోని పందిగుట్టపై ఉన్నట్లు సమాచారం. దీంతో పక్కా ప్రణాళికతో గ్రేహౌండ్స్ బలగాలు సుమారు మంగళవారం రాత్రికే ఆ అటవీ ప్రాంతంలో మోహరించారు. బుధవారం తెల్లవారు జామున పోలీసులు లింగన్న, దళ సభ్యుల స్థావరాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. లింగన్న మృతి.. తప్పించుకున్న దళ సభ్యులు పోలీసులకు, దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లింగన్న మృతి చెందగా దళంలో ఉన్న బయ్యారం దళకమాండర్ గోపన్నతో పాటు మరో ఐదుగురు తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు దళ సభ్యులు దేవళ్లగూడెం–రోళ్లగడ్డ మధ్య తుపాకులతో పారిపోతుండగా అదుపులోకి తీసుకుని సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు స్థానికుల సమాచారం. అయితే అప్పటికే లింగన్న మృతి చెందాడు. పందిగుట్ట వద్ద పడిగాపులు ఎదురుకాల్పులు జరిగిన సంఘటనా స్థలానికి ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు చుట్టపక్క గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు సుమారు 300 మంది పైగా పందిగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుట్టపైకి పోలీసులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. మీడియాను సైతం అడ్డుకున్నారు. అప్పటికే పోలీసులపై నినాదాలు చేశారు. చాలా సేపటి తర్వాత మీడియా, జనం కలసి గుట్టపైకి వెళ్లారు. స్థావరాల వద్ద అన్నం, కూరగాయలు, వాటర్ క్యాన్లు, తదితర సామగ్రి మాత్రమే ఉన్నాయి. గుట్టపై పోలీసులుగానీ, మృతదేహాలు గానీ లేవు. మరో దారిలో పోలీసులు మృతదేహా న్ని మోసుకెళ్తుండడాన్ని గమనించి జనం వెంటపడ్డారు. మృతదేహం అడ్డగింత...ఉద్రిక్తత సాధారణంగా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే మృతదేహాన్ని ఉంచి మీడియాకు చూపించి గ్రామస్తుల సహకారంతో మృతదేహాలను తీసుకెళ్తుంటారు. అలా జరగకుండా మరో మార్గంలో తరలిస్తుండగా వెంట పడుతూ ఉద్రేకానికి గురైన ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వారు. మృతదేహాన్ని వదిలి పోలీసులు కొద్ది దూరం వెళ్లారు. అప్పటికే ఇద్దరు పోలీసుల తలలు పగిలాయి. దీంతో ప్రతిఘటించిన పోలీసులు గాలిలో 18 విడతలుగా సుమారు 40 రౌండ్లకు పైగా కాల్పులు జరుపుతూనే జనాన్ని చెదరగొట్టారు. ఈ సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మీడియాపై సైతం పోలీసులు విరుచుకుపడ్డారు. మూడు దఫాలుగా కాల్పులు పందిగుట్ట ప్రాంతంలో కాల్పులు మూడు దఫాలు గా పది నిమిషాలకోసారి జరిగాయి. స్థావరంపై ఒకసారి, సభ్యులు పారిపోతుండగా, ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకునప్పుడు మరోసారి కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కనికరించలేదు గుండాల: నా భర్తను ఒక్కసారి చూద్దామని దగ్గరకు వెళితే.. పోలీసులు కనీసం కనికరం చూపించలేదంటూ లింగన్న భార్య కన్నీరు మున్నీరయింది. సంఘటనా ప్రాం తం నుంచి గుండాల వరకు మృతదేహాన్ని తీసుకొస్తుండగా క్షణంపాటు కూడా చూపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంట తడి పెట్టించింది. ప్రతి ఒక్కరికీ లింగన్న సుపరిచితుడు కావడంతో బంధువులతో, పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మృతదేహాన్ని ట్రాక్టర్ ద్వారా గుండాలకు తీసుకవచ్చి సుమోలో కొత్తగూడెం తరలించారు. ఇల్లెందు ఇన్చార్జి డీఎస్పీ ఎస్ఎం అలీ గుండాలకు చేరుకుని పరిస్థితిన సమీక్షించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో లింగన్న మృతదేహం సింగరేణి(కొత్తగూడెం): సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళనేత లింగన్న మృతదేహాన్ని పోలీసులు కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి బుధవారం సాయంత్రం తీసుకువచ్చారు. డాక్టర్ల సమ్మె కారణంగా బుధవారం పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని భద్రపరిచారు. గురువారం లింగన్న మృతదేహానికి ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలున్నాయి. కాగా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్ద గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులను మోహరించారు. ఆందోళనకారులు ఆస్పత్రికి చేరుకుంటారనే సమాచారంతో వన్‌టౌన్ సీఐ కుమారస్వామి పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గాలింపు చేపడుతుండగా కాల్పులు జరిపారు కొత్తగూడెం: కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఎదురైన నక్సల్స్ కాల్పులు జరపడంతో.. ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ కాల్పుల ఘటనలో ఒక నక్సలైట్ మృతిచెందగా, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వారు పారిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘటన స్థలంలో ఒక నక్సలైట్ మృతదేహాన్ని గుర్తించడంతోపాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్, విప్లవ సాహిత్యం, కొంత సామగ్రిని స్వాధీనపరచుకున్నట్లు వివరించారు. పారిపోతున్న సాయుధులైన రామకృష్ణ, మహేష్ అనే నక్సలైట్లను అదుపులోకి తీసుకోగా.. నక్సల్స్ సానుభూతిపరులు వారిని అడ్డగించి, రాళ్లు రువ్వి, అపహరించుకుని పోయారని పేర్కొన్నారు. మృతిచెందిన నక్సలైట్‌ను పూనెం లింగయ్య అలియాస్ లింగన్నగా గుర్తించామని, ఇతను న్యూడెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని, ఇతనిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కాల్పుల ఘటనలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడేనికి చెందిన స్టేట్ కమిటీ మెంబర్ ధనసరి సమ్మయ్య అలియాస్ గోపన్న, జిల్లా కమిటీ సభ్యుడు ఆరేం నారాయణ అలియాస్ నరేష్, అజ్ఞాత దళ సభ్యుడు నాగన్న ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పోలీసులపై దాడి చేసిన నక్సల్స్ సానుభూతిపరులపై, పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు నక్సల్స్‌ను అపహరించినందుకు గుండాల ఠాణాలో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో ఎదురుకాల్పులు
-
ప్రభుత్వ కార్యలయం ఎదుట వివాహిత హల్చల్
కొత్తగూడెంరూరల్: కొత్తగూడెం డివిజన్లో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న బి.భాస్కర్‌నాయక్ తనను వివాహం చేసుకుని, ఇప్పుడు తానెవరో తెలియదంటూ బుకాయిస్తున్నాడని ఓ మహిళ మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఉరి వేసుకుంటానంటూ..హల్చల్ చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త చనిపోయాక హైదరాబాద్‌లోని ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తోంది. కొంతకాలం తర్వాత అక్కడే విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌నాయక్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ మహిళను భాస్కర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన భాస్కర్ ఆమెను పట్టించుకోకపోవడంతో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె డయల్ 100కు ఫోన్ చేయడంతో సీఐ కుమారస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మహిళను, భాస్కర్ నాయక్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. తనను వివాహం చేసుకుని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని, తాను గతంలో హైదరాబాద్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశానని తెలిపింది. కాగా భాస్కర్ మాత్రం తనకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు ఉద్యోగం కావాలంటే పెట్టించానని తెలిపారు. దీంతో తిరిగి హైదరాబాద్‌లోనే కేసు పెట్టాలని సీఐ కుమారస్వామి ఆమెకు సూచించి పంపించారు. కాగా డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద అదే శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కూతురి దగ్గరకు వెళ్లి..తిరిగివస్తూ
సాక్షి, కొత్తగూడెం : విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని చూసేందుకు కుటుంబమంతా కలిసి వెళ్లారు.. ఎన్నో జ్ఞాపకాలను.. మధుర క్షణాలను మూటగట్టుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మరో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యం చేరుకోవచ్చు ఆలోపే రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ భీతావహ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబ సభ్యులు కాగా, మృతుల్లో భార్య, భర్త ఉన్నారు. ఇక మరో దంపతుల్లో భార్య చనిపోగా.. భర్త మృత్యువుతో పోరాడుతున్నారు. టూటౌన్ సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం పట్టణ పరి«ధిలోని బర్లిఫిట్కు సమీపంలో గల ఝాన్సీ ఆసుపత్రిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న పాలపర్తి రమేష్ (40) పెద్దకూతురు పూజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆదివారం కావడంతో పర్లపల్లి రమేష్, అతని భార్య ప్రశాంతి (34), సోదరుడు సురేష్ , సోదరుని భార్య సుజాత (38), చిన్న కూతురు లిఖితతో కలిసి విజయవాడలోని కూతురు పూజను చూసేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు పూజతో అందరూ కలిసి సరదాగా గడిపారు. అనంతరం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో చుంచుపల్లి మండలంలోని పెనగడప సమీపానికి రాగానే కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి వెళ్లుతున్న బొగ్గు టిప్పర్ ఎదురుగా వచ్చి కారును ఢీ కొంది. దీంతో కారు కొంతదూరంలో ఎగిరిపడి నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో కారు నడుపుతున్న పర్లపెల్లి రమేష్, అతని సోదరుని భార్య సుజాత అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రమేష్ భార్య ప్రశాంతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. రమేష్ సోదరుడు సురేష్, కూతురు నిఖితలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికుల సాయంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. బర్లిఫిట్ సమీపంలోని శశ్మానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇంటికి చేరేలోపే.. సుమారు 160 కిలోమీటర్ల దూరం సురక్షితంగా ప్రయాణించిన రమేష్ కుటుంబ సభ్యులు మరో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొత్తగూడెంలోని ఇంటికి చేరుకునేవారు. ఆ లోపే మృత్యువు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కబళించింది. అర్ధరాత్రి 11.40 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో పెనగడప గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిద్రమత్తులో నుంచి వారు తేరుకొని లేచి చూసేసరికి కారు నుజ్జునుజ్జకావటం, కళ్లెదుట రెండు మృతదేహాలు పడి ఉండటం చూసి భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రమాద స్థలాన్ని కొత్తగూడెం డిఎస్పీ ఎస్ ఎం అలీ సోమవారం పరిశీలించారు. ప్రమాద వివరాలను సీఐ తుమ్మా గోపిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామం ప్రారంభం నుంచి చివరి వరకు బారికేడ్లు ఏర్పాటు చేయించారు. రోడ్డుకు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తీయించమని నేషనల్ హైవే అధికారులకు సూచించారు. -
బీజేపీ ‘పుర’ పోరు దిశగా..
సాక్షి, కొత్తగూడెం : గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కొంతమేరకు బలం కలిగిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సరికొత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. జిల్లాలో మొత్తం ఆరు మున్సిపాలిటీలు ఉండగా, కేవలం రెండు మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో మాత్రమే అధికార యంత్రాంగం వార్డుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ల సర్వే చేపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ రెండు మున్సిపాలిటీల్లో బలం పెంచుకునేందుకు తగిన ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగూడెం పట్టణంలో ఆ పార్టీకి కొంతమేరకు ఓటింగ్ ఉండగా, ఇల్లెందు మున్సిపాలిటీలో మాత్రం కొన్ని వార్డుల్లో బహుముఖ పోటీ జరిగితే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు ఇల్లెందులో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు హాజరుకానున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం, ఇల్లెందు పట్టణాలకు వరుసగా కేంద్రమంత్రులను తీసుకొచ్చేందుకు జిల్లా పార్టీ నాయకత్వం తగిన ప్రణాళికలు తయారు చేసుకుంటోంది. వివిధ పార్టీల్లోని అసంతృప్త నాయకులను కేంద్ర మంత్రుల సమక్షంలో చేర్చుకునేందుకు తగినవిధంగా పలువురితో మంతనాలు సైతం జరుపుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రెండు మున్సిపాలిటీలపై ఎక్కువ దృష్టి సారించారు. వార్డుల్లో బహుముఖ పోటీ ఉంటే గెలుపొందే అవకాశాలున్న నాయకులపై మరింత నజర్ పెట్టారు. ఓటింగ్ శాతాన్ని పెంచుకునేలా తగినవిధంగా వ్యూహాలు రచిస్తున్నారు. 6 నుంచి సభ్యత్వం.. మరోవైపు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సైతం ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. జిల్లాలోని 23 మండలాల్లో మొత్తం 75వేలకు పైగా సభ్యత్వాలు చేయించేందుకు ఆ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగనుంది. అనంతరం ఆగస్టు 12వ తేదీ నుంచి బూత్ కమిటీలను వేయనున్నారు. సెప్టెంబర్ ప్రణాళికలు పొందించుకుంటున్న బీజేపీ ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి ఈ నెల 6 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ నేడు ఇల్లెందులో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం 1వ తేదీ నుంచి మండల, పట్టణ కమిటీలు ఎన్నుకునేందుకు నిర్ణయించారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలోనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉండడంతో మరింత ముమ్మరంగా చేపట్టేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉండడంతో పాటు, రాష్ట్రంలోనూ 4 పార్లమెంటు స్థానాలు గెలవడంతో కొంతమేరకు జిల్లాలోనూ జోష్ పెరిగిందని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లా కావడంతో జిల్లాలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును తరచూ పర్యటించేలా ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ గిరిజనుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి, సుదీర్ఘకాల పోరాటాలు చేసిన బాపూరావు పర్యటనల వల్ల పార్టీకి మేలు కలుగుతుందని, బలపడేందుకు అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. జిల్లాలోనూ ఆదివాసీల పోడుభూముల సమస్య ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో ఆదివాసీల సమస్యల విషయంలోనూ ఏజెన్సీలో బాపూరావును విస్తృతంగా తిప్పాలని యోచిస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ పంపిణీ ద్వారా మహిళలకు దగ్గరయ్యామని, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ ద్వారా యువతకు దగ్గరయ్యామని, తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు టచ్‌లో ఉన్నట్లు పార్టీ నాయకత్వం చెబుతోంది. -
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై కేసు
సింగరేణి (కొత్తగూడెం): అటవీ శాఖాధికారుల విధులను ఆటంక పరిచారనే అభియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం కేసులు నమోదయ్యాయి. వనమాతోపాటు ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు, పలువురు నాయకులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్ వద్ద అటవీ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు అటవీ అధికారులు కందకాలు తవ్వారు. ఆ భూములకు పట్టాలు ఉన్నాయంటూ పలువురు సాగుదారులు అడ్డుకున్నారు . ఈ విషయాన్ని గిరిజనులు ఎమ్మెల్యే వనమా దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఘటన స్థలానికి చేరుకుని అటవీ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంఆర్పీ.రావు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు, మాజీ ఎంపీటీసీ పూనెం శ్రీను, ఖానాముద్దీన్, లింబియాపై కేసులు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ వివరించారు. -
రవాణాలోనూ రికార్డే..
సింగరేణి : కొత్తగూడెం ఏరియా బొగ్గు రవాణాలోనూ రికార్డు సృష్టించింది. సింగరేణివ్యాప్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో అధికంగా రవాణా చేసింది. 2018–19లో 112.17 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 124.17 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. ఇదే క్రమంలో కొత్తగూడెంలోని ఆర్‌సీహెచ్‌పీ ద్వారా 10.11 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేశారు. 2,725 రేకుల ద్వారా 92,07,426 టన్నులు బొగ్గును రవాణా చేసింది. రోడ్డు మార్గం ద్వారా 9,10,550 టన్నులు రవాణా చేసింది. గడచిన కొన్నేళ్లలో.. కొత్తగూడెం ఏరియాలో 2013–14లో 1,938 రేకుల ద్వారా 71,54,953 టన్నుల బొగ్గును రవాణా చేశారు. 2014–15లో 1,958 రేకుల ద్వారా 71,17,818 టన్నులు, 2015–16లో 1943 రేకుల ద్వారా 69,64,967 టన్నులు, 2016–17లో 2,093 రేకుల ద్వారా 75,17,453 టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేశారు. 2017–18లో 2,265 రేకుల ద్వారా 78,75,227 టన్నుల బొగ్గు రవాణా చేయగా, 2018–19లో 2,725 రేకుల ద్వారా 92,07,426 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు సింగరేణి గణాంకాలు తెలుపుతున్నాయి. ముందస్తు ప్రణాళికతోనే.. సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ఏరియా జీఎం సూచనలు, సలహాలతో ముందస్తు ప్రణాళికల వల్ల 10మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధ్యమైంది. సెకండరీ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు, కార్మిక సంఘాల సహకారంతో రోజూ, నెలవారీ, వార్షిక లక్ష్యాలు సాధించాం. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత వార్షిక లక్ష్యాలను కూడా సాధిస్తాం. – శ్రీకాంత్, ఆర్‌సీహెచ్‌పీ ఎస్ఈ -
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
సాక్షి, పాల్వంచ: పేలుడు పదార్థాలతో, ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తున్న కరపత్రాలతో వెళుతున్న ముగ్గురు మావోయిస్టు పార్టీ కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించారు. స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాలు... పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఐ మడత రమేష్, ఎస్ఐ వెంకటప్పయ్య ఆధ్వర్యంలో ఈ నెల 8న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో టేకులచెరువు గ్రామంలో మారుతి లింగయ్య ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు మారుతి లింగయ్య, అశ్వాపురం మండలం మామిళ్ళవాయి గ్రామానికి చెందిన మడలి ఇరమయ్య, బూర్గంపాడు రాజీవ్‌నగర్‌కు చెందిన మద్వి యెడమయ్య ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్ధాలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లను స్వాధీనపర్చుకున్నారు. మావోయిస్ట్ పార్టీలో లింగయ్య చురుగ్గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు పార్టీ తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శి ఆజాద్‌కు కొంతకాలంగా కొరియర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఖమ్మం, మహబుబాబాద్ నుంచి పేలుడు పదార్థాలను సేకరించి ఆజాద్‌కు చేరవేశాడు. 2018 మార్చిలో ఆజాద్ ఆదేశాలతో విజయవాడలో వాకీటాకీలు, సెల్ ఫోన్లు, పవర్ బ్యాంక్, యూనిఫామ్, బూట్లు, సిమ్ కార్డ్‌లు, పేలుడు పదార్థాలు సేకరించి ఇచ్చాడు. ఆజాద్‌కు ఇతడు నమ్మిన బంటు. ఆజాద్ ఆదేశాలతో గత నెల 25న అశ్వాపురం, పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లో (ఎన్నకలు బహిష్కరించాలని రాసి ఉన్న) పోస్టర్లు వేశాడు. పేలుడు పదార్థాలు అక్రమంగా సేకరించి, మావోయిస్టులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచాడు. ఇంతలోనే పోలీసులకు దొరికిపోయాడు. క్వారీల నుంచి పేలుడు పదార్ధాల సేకరణ క్వారీల్లో బ్లాసింగ్‌కు ఉపయోగించే పేలుడు పదార్థాలను వీరు కొంత కాలంగా సేకరిస్తున్నారని ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్వారీల్లోని సిబ్బందితో వీరు సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారి నుంచి పేలుడు పదార్థాలను రోజుకు కొంత చొప్పున పక్కదోవ పట్టించి, మావోయిస్ట్ కొరియర్లకు అమ్ముతున్నారని చెప్పారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ మధుసూధన్ రావు, సీఐ మడత రమేష్, బూర్గంపాడు ఎస్ఐ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీలకు వరం.. గురుకులం..
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మైనారిటీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు 2016–17 విద్యా సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. భద్రాద్రి జిల్లాలో ఆ ఏడాది రెండు పాఠశాలలను ఏర్పాటు చేసింది. 2017–18లో మరో నాలుగు పాఠశాలలను ప్రారంభించింది. ఈ గురుకులాల్లో 70 శాతం ముస్లిం మైనారిటీలకు, 30 శాతం ఇతరులకు సీట్లు కేటాయిస్తారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.1.40 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రతి పాఠశాలలో అరబిక్ ట్యూటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నమాజు చేసుకునేందుకు ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. స్పోర్ట్స్ కిట్ సౌకర్యంతో పాటు రెగ్యులర్ పీఈటీలనూ నియమించారు. జిల్లాలోని అశ్వారావుపేట, బూర్గంపాడు, కొత్తగూడెంలో బాలికలకు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెంలో బాలుర కోసం పాఠశాలలు ఏర్పాటుచేశారు. భద్రాచలం, కొత్తగూడెం బాలుర పాఠశాలలను కలిపి పాల్వంచలోని శేఖరంబంజరలో ఉన్న కేఎల్ఆర్ భవనంలో కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం బాలికలకు నేషనల్ డిగ్రీ కళాశాల భవనాన్ని కేటాయించారు. ఈ రెండింటిఇల్లందు బాలుర పాఠశాలను సింగరేణి భవనంలో, అశ్వారావుపేట బాలికల పాఠశాలను జెడ్పీహెచ్ఎస్ పాత భవనంలో, బూర్గంపాడు బాలికల పాఠశాలను ఐటీడీఏ గిరిజన సంక్షేమ వసతి గృహంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో మొత్తం 1600 మంది విద్యనభ్యసించడానికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 1400 మంది చదువుతున్నారు. ఏడాదికి ఒక తరగతి చొప్పున అప్‌గ్రేడ్.. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో 627 మంది బాలికలు, 773 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగూడెం బాలికల పాఠశాలలో 360, బూర్గంపాడు బాలికల పాఠశాలలో 152, అశ్వారావుపేట బాలికల పాఠశాలలో 115 మంది బాలికలు, మిగితా పాఠశాలల్లో బాలురు చదువుతున్నారు. అయితే ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో పాల్వంచలోని కేఎల్ఆర్, కొత్తగూడెంలోని నేషనల్ డిగ్రీ కళాశాల భవనాలకు అద్దె చెల్లించి పాఠశాలలను కొనసాగిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో సొంత భవనాలను నిర్మించా లని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబా ద్, వికారాబాద్ జిల్లాలకు భవనాలు మంజూరయ్యాయి. భద్రాద్రి జిల్లా రామవరంలో బాలికల పాఠశాల నిర్మాణానికి ఏడెకరాల స్థలాన్ని, అశ్వారావుపేటలో ఐదెకరాలు, ఇల్లెందులో 3.5 ఎకరాలు కేటాయించారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంగా ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్‌డీపీ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం బాలికలు, ఇల్లందు బాలుర పాఠశాలల్లో 9వ తరగతి వరకు అవకాశం ఉండగా మిగిలిన పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే విద్యనభ్యసించవచ్చు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని అప్‌గ్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2019–20 సంతవ్సరానికి జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 31 తుది గడువుగా నిర్ణయించారు. 9వ తరగతి ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు నాణ్యతా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఆటలు, యోగా ఉంటాయి. శీతాకాలంలో వేడినీళ్ల సౌకర్యం కూడా కల్పించాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్రమం తప్పకుండా మెనూ అందజేస్తున్నాం. – జి.ముత్యం, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి -
ఎస్టీలకే దక్కిన పీఠం..
సాక్షి, కొత్తగూడెం: జిల్లాల పునర్విభజన తరువాత ఆవిర్భవించనున్న సరికొత్త జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ రెండున్నర సంవత్సరాలుగా జిల్లా, మండల పరిషత్‌లు ఉమ్మడిగానే ఉన్నాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుండడంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయినప్పటికీ మరికొన్ని మండలాలు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోకి వెళ్లాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉండగా, వాటిలో భద్రాచలం, కొత్తగూడెం మండలాలు పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్నాయి. మిగిలిన 21 మండలాల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు, ఆయా మండలాల పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలకు గాను జెడ్పీటీసీలు ఎస్టీ జనరల్‌కు 05, ఎస్టీ మహిళలకు 05 కేటాయించారు. జనరల్ 05, జనరల్ మహిళకు 06 రిజర్వ్ చేశారు. మొత్తం మహిళలకు 11 రాగా, జనరల్‌కు 10 వచ్చాయి. బీసీ, ఎస్సీలకు ఒక్క జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం కూడా కేటాయించలేదు. ఇక మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్టీ జనరల్‌కు 09, ఎస్టీ మహిళలకు 09, జనరల్‌కు 01, జనరల్ మహిళకు 01, ఎస్సీ మహిళకు 01 కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో మహిళలకు 11, జనరల్‌కు 10 వచ్చాయి. వీటిలో ఎస్టీ కోటాలోనే మొత్తం 18 ఎంపీపీలు వచ్చాయి. బీసీలకు ఒక్క ఎంపీపీ కూడా రాలేదు. జెడ్పీటీసీలపైనే అందరి దృష్టి.. మండల ప్రజాపరిషత్‌లు సింహభాగం ఎస్టీలకు రిజర్వు కావడంతో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 21 జెడ్పీటీసీల్లో 10 ఎస్టీలకు రిజర్వు కాగా, 11 జెడ్పీటీసీలు జనరల్‌కు వచ్చాయి. వీటిల్లో 05 జనరల్, 06 జనరల్ మహిళలకు కేటాయించారు. జిల్లాలో గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి విజయం సాధించింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఓట్లపరంగా ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ ఎన్నికలపై పకడ్బందీగా దృష్టి పెట్టాయి. అయితే తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా నడిచింది. సింహభాగం పంచాయతీలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. దీంతో టీఆర్ఎస్లోనూ జోష్ వచ్చింది. ఇక భద్రాద్రి జిల్లాలో వామపక్షాలు స్థానికంగా గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు సైతం తగినన్ని జెడ్పీటీసీలు, మండల పరిషత్‌లు గెలుచుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ పీఠం సాధించేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 11 సాధించే విషయంలో ప్రతి జెడ్పీటీసీ స్థానం కీలకమే. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పీఠం కోసం సైతం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఇక మండల ప్రజాపరిషత్‌ల అధ్యక్ష పదవుల విషయంలో రాజకీయం మరింత రసవత్తరంగా ఉండనుంది. కొన్ని మండలాల్లో 4 ఎంపీటీసీ స్థానాలు, మరొకొన్ని మండలాల్లో 5 ఎంపీటీసీలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఒక్క ఎంపీటీసీ గెలుచుకున్నవారు సైతం ఎంపీపీ రేసులో ముందు వరుసలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, మండల పరిషత్‌ల పోరు రసవత్తరంగా మారనుంది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల జనాభా, రిజర్వేషన్లు.. మండలం మొత్తం జనాభా జెడ్పీటీసీ స్థానాలు రిజర్వేషన్ ఆళ్లపల్లి 12268 1 ఎస్టీ జనరల్ అన్నపురెడ్డిపల్లి 21130 1 జనరల్ మహిళ చండ్రుగొండ 27911 1 జనరల్ చర్ల 42947 1 ఎస్టీ మహిళ చుంచుపల్లి 42290 1 జనరల్ దుమ్ముగూడెం 46802 1 ఎస్టీ జనరల్ గుండాల 15857 1 ఎస్టీ మహిళ జూలూరుపాడు 33395 1 ఎస్టీ మహిళ కరకగూడెం 15221 1 ఎస్టీ జనరల్ లక్ష్మీదేవిపల్లి 38093 1 జనరల్ మహిళ మణుగూరు 40026 1 జనరల్ ములకలపల్లి 34794 1 ఎస్టీ జనరల్ పాల్వంచ 33673 1 జనరల్ పినపాక 33155 1 జనరల్ మహిళ టేకులపల్లి 47879 1 ఎస్టీ జనరల్ ఇల్లందు 57302 1 ఎస్టీ మహిళ అశ్వాపురం 43067 1 జనరల్ మహిళ బూర్గంపాడు 36910 1 జనరల్ మహిళ దమ్మపేట 58444 1 జనరల్ సుజాతనగర్ 27989 1 ఎస్టీ మహిళ మొత్తం 768805 21 -
అ‘ధన’పు కష్టం
సాక్షి, కొత్తగూడెం: మార్కెటింగ్ శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరట్లేదు. ఇందుకు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. కందులు, మొక్కజొన్నలకు ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం, కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడం, పౌరసరఫరాల శాఖ, సీసీఐ బకాయిల చెల్లింపు ప్రక్రియ పూర్తి కాకపోవడం వంటి కారణాలన్నీ కూడా అదనపు ఆటంకాలుగానే మారాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2018–19లో జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం తగ్గుతోంది. మొత్తం 59 గోదాములు, 20 చెక్‌పోస్టులు ఉన్నాయి. కందులు, మొక్కజొన్న పంటలకు ఒకశాతం మార్కెట్ ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి తగ్గడంతో మార్కెటింగ్ ఆదాయంపై గట్టి ప్రభావం పడింది. కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడంతో పాటు పోలవరం విలీన మండలాల్లో కొన్ని ఉండిపోవడంతో కచ్చితంగా ఆదాయానికి గండి పడింది. దీనికి తోడు పౌరసరఫరాల శాఖ, కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) ద్వారా బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకంజలో ఉంది. కొన్ని గోదాములను ఎన్నికల సామగ్రి భద్రపరిచేందుకు ఉపయోగిస్తుండగా, అత్యధిక గోదాముల్లో పౌరసరఫరాల శాఖ వారి ధాన్యం, సీసీఐ వారి పత్తిని నిల్వ ఉంచారు. వీటి ద్వారా రావాల్సన ఆదాయ బకాయిలు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. బకాయిల క్రమం ఇలా.. సీసీఐ ద్వారా మార్కెటింగ్ శాఖకు ఇప్పటివరకు రూ.50 లక్షలకుపైగా బకాయి నిధులందాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.3 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఇందులో గతేడాదికి సంబంధించి రూ.కోటి, ఈ సంవత్సరానికి రూ.2కోట్లు రావాల్సి ఉంది. అయితే పౌరసరఫరాల శాఖ వాళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజును తదుపరి ఏడాదిలో చెల్లిస్తుండడంతో బకాయిలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. ఇక పత్తి పంట ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేసినప్పటికీ ఆ మేరకు సాధించలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 47,294 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. అయితే ఇందులో ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే భారీగా తగ్గిపోవడంతో ఈ ప్రభావం మార్కెటింగ్ శాఖ ఆదాయంపైనా పడింది. ఎకరానికి కేవలం 2 నుంచి 3 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగబడి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మొత్తం 9,59,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని భావించగా, అది మూడోవంతుకు కూడా రాలేదు. గతేడాది ఈ సమయానికి జిల్లాలోని బూర్గంపాడు, దమ్మపేట, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, చర్ల మార్కెట్ కమిటీల ద్వారా అనుకున్న లక్ష్యంలో 5.85 శాతం ఎక్కువగా ఆదాయం సాధించగా ఈసారి మాత్రం తగ్గింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది 45.64 శాతం తక్కువగా ఉంది. -
భగీ‘వ్యథ’..
సాక్షి, కొత్తగూడెం: ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం.. భగీ‘వ్యథ’గా మారింది. వరుసగా పైపులైన్లు లీకవుతున్నాయి. ప్రధాన పైపులైన్ తరచూ లీకవుతుండడంతో నీరు భారీగా ఎగసిపడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో తిప్పలు తప్పడం లేదు. పలుచోట్ల పౌరులు గాయాలపాలవుతున్నారు. 16 నెలల క్రితం పైపులైన్ పనుల సమయంలో పాల్వంచ మండలంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అనేక చోట్ల పైపులు లీకవుతూనే ఉన్నాయి. ఇక ఇంట్రావిలేజ్ పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలోని మూలమలుపు వద్ద జాయింట్ వాల్వ్ లీక్ అయి ఇటీవల నీరు ఏరులై పారింది. చండ్రుగొండలోని బొడ్రాయి సెంటర్, మసీదు వద్ద భగీరథ పైపులు పగిలాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఈ నెల 14వ తేదీన మండల కేంద్రంలోని బాలాజీస్వామి ఆలయం ఎదురుగాగల హోటల్ ముందు పైపు పగిలిపోవడంతో హోటల్ ధ్వంసమైంది. రేకులు మొత్తం కూలిపోయి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోయాయి. ఇంట్లోకి మొత్తంనీరు వెళ్లింది. చర్ల మండల కేంద్రంలోని పూజారిగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వారం రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి నీళ్లు వృథాగా పోయాయి. కలివేరు, పూజారిగూడెంలలో పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేయగా, కుదునూరులో పగిలిన పైపులైన్‌కు ఇంకా మరమ్మతులు చేయలేదు. ములకలపల్లి మండలంలో మిషన్ భగీరథ పథకంలో గత ఏడాది మే 20వ తేదీన పాల్వంచ నుంచి మండల పరిధిలోని రామచంద్రాపురం వరకు ట్రయల్‌రన్ చేయగా, మాదారం అటవీ ప్రాంతంలో పైపులైన్ లీకయింది. ఫౌంటెన్లా నీరు విరజిమ్మింది. సంబంధిత అధికారులు మరమ్మతులు నిర్వహించారు. 2018 జూలై 31వ తేదీన చుంచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలిపోవడంతో అటుగా వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడటమే కాకుండా ట్రాఫిక్ నిలిచిపోయింది. మిషన్ భగీరథ పైప్‌లైన్ ఒక్కసారిగా లీకై పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు విడుదలయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున నీరు ప్రవహించడంతో రహదారి నీటి ప్రవాహంగా మారింది. పాల్వంచ మండలం జగన్నాధపురం పంచాయతీ తోగ్గూడెం–జగన్నాధపురం గ్రామాల మధ్య మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనుల్లో భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో.. 2017 అక్టోబర్ 7వ తేదీన నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు.వారు పైపులు బిగిస్తుండగా వర్షం కురిసింది. ఆ సమయంలో లోతులో పనిచేస్తున్నవారు పైకి వచ్చే పరిస్థితి లేక.. మట్టి పెళ్లలు పడడంతో ముగ్గురూ మృతి చెందారు. -
సంక్షేమ సింగరేణి
సింగరేణి సంస్థ 2018లో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోయింది. గతం కంటే అధికంగా వృద్ధి రేటు సాధించింది. బొగ్గు ఉత్పత్తి సాధనలోనూ, కార్మికులకు లాభాల వాటా పంచడంలోనూ ముందుంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పిన సింగరేణి.. సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపక్రమించింది. ఈ మేరకు పనులు ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది ఎన్నో బహుమతులు అందుకుంది. క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా కార్మికులను ప్రోత్సహించింది. కాగా ఏడాది కాలంలో సంస్థవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. –సింగరేణి(కొత్తగూడెం) జనవరి 1న సింగరేణి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 25న కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్లో ప్రెస్ ఇన్మఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో మీడియా వర్క్‌షాపు నిర్వహించారు. 29న కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి సుశీల్‌కుమార్ సింగరేణి గనులను, సింగరేణి విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఫిబ్రవరి హైదరాబాద్‌లో నిర్వహించిన 78వ ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్లో సింగరేణి సేవా సమితి స్టాల్‌కు అలంకార విభాగంలో ద్వితీయ బహుమతి వచ్చింది. 12న ఎంపీ జితేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి అందించారు. 16న హైదరాబాద్‌లో నిర్వహించిన మైనింగ్ టుడే సదస్సు ఎగ్జిబిషన్లో సింగరేణి నెలకొల్పిన ఆధునిక స్టాల్.. పబ్లిక్ సెక్టార్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది.18న భూపాలపల్లి ఏరియాలోని 8 ఇంక్లైన్లోగల మంజూరు నగర్లో రూ కోటి 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ భి భాస్కర్‌రావు భూమిపూజ నిర్వహించారు. మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు రామగుండం–1,2 ఏరియాల్లో కోలిండియా స్థాయి క్రికెట్ పోటీల ను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. 7 నుంచి 15వ తేదీ వరకు రామగుండం–1,2 ఏరియాల్లో కోలిండియా స్థాయి క్రికెట్ పోటీల ను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏప్రిల్ 1న 2017–18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అత్యధికంగా 203 శాతం వృద్ధి రేటు సాధించినట్లు సీఎండీ ప్రకటించారు. ఇదే నెలలో తొలిసారిగా గనుల వారీగా కాంట్రాక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించి కాంట్రాక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించారు. నిరుద్యోగులకు రూ.50 లక్షలు కేటాయించి కొత్తగూడెం ఏరియా పరిధిలో స్కిల్ డెవలపమెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. 13న సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రతిష్టాత్మక ఆసియా పసిఫిక్ ఎంటర్‌పెన్యూర్‌షిప్–2018 అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. మే సింగరేణిలో తొమ్మిది చోట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 11న బోర్డు ఆమోదించింది. రూ. 1360 కోట్లు అంచనా వ్యయంతో తొలిదశగా 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం. 12న భువనేశ్వర్‌లో ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నారు. 13న ఒడిశాలోని నైనీబ్లాక్‌లో డ్రిల్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 19న బెల్లంపల్లి ఏరియాలో కొత్తగనులైన గోలేటి ఓపెన్కాస్ట్గని, చింతకూడ ఓపెన్‌కాస్ట్ గనులకు డైరెక్టర్ పీపీ భాస్కర్‌రావు తదితరులు సమీక్ష చేశారు. జూన్ 5న నైనీబ్లాక్కు రైలు మార్గంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శితో సీఎండీ శ్రీధర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన సింగరేణి స్టాల్‌కు అత్యంత ఆదరణ లభించింది. 20న కజకిస్తాన్‌లో ప్రపంచ మైనింగ్ సదస్సుకు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. 28న దుబాయిలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశ ప్రముఖుల నుంచి ఔట్ స్టాండింగ్ లీడర్ షిప్ అవార్డును సీఎండీ అందుకున్నారు. 16న దక్షిణ భారత స్థాయి పరిశ్రమల సదస్సులో సింగరేణి సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 19న సత్తుపల్లిలో సింగరేణి కార్మికులకు కొత్త క్వార్టర్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జూలై అత్యధిక జీఎస్టీ చెల్లింపుదారునిగా సింగరేణికి అవార్డు. ఈఅండ్ఎం డైరెక్టర్ సలాకుల శంకర్ ఈ అవార్డును అందుకున్నారు. 7న ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో సైరన్ యూ ట్యూబ్ ప్రారంభించారు. 11న జరిగిన 545 బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం 2017–18లో సింగరేణి సంస్థ రూ.1212 కోట్ల లాభం ఆర్జించినట్లు నిర్దారించారు. ఇదే నెలలో అంతర్జాతీయ స్థాయిలో అత్యంత విశ్వసనీయ కంపెనీగా సింగరేణికి అవార్డు వచ్చింది. డైరెక్టర్(పీపీ) ఈ అవార్డును అందుకున్నారు. ఆగస్టు 1న జైపూర్‌లోని సింగరేణి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ రైలు మార్గం, మార్గంపై బొగ్గు రవాణను ప్రారంభించారు. 2.44 కిలోమీటర్ల వాటర్ పైప్‌లైన్ పనులు కూడా ప్రారంభించారు. 10న సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు అందుకుంది. 29న రూ.1212 కోట్ల లాభాల్లో కార్మికులకు వాటా కింద 27 శాతం కేటాయించారు. రూ. 327 కోట్లను కార్మికులకు పంపిణీ చేశారు. 30న కేడర్ స్కీంలపై ఒప్పందం జరిగింది. 11 అలవెన్స్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 900 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా ప్రమోట్ చేశారు. సెప్టెంబర్ 7న ఎక్స్‌లెన్స్ ఇన్ ఫెర్మార్మెన్స్ అవార్డును సింగరేణి జీఎం కార్పొరేట్ (పి అండ్ పి) రాజేశ్వరరెడ్డి అందుకున్నారు. 17న కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో కార్మికుల క్వార్టర్లకు ఏర్పాటు చేసిన ఏసీలు ఏర్పాటు చేశారు. 20న జరిగిన బోర్డు సమావేశంలో ఓబీ తొలగింపు, కొత్త డంపర్లు, డోజర్ల కొనుగోలు అనుమతులకు, కోలిండియాలో మాదిరిగా సింగరేణి అధికారులకు వేతనాల చెల్లింపునకు ఆమోదం లభించింది. 27న నైనీ బ్లాక్ జీఎం విజయరావు కోల్ ఇండియా ప్రొడక్టవిటి అవార్డును అందుకున్నారు. అక్టోబర్ 8న డెహ్రాడూన్‌లో జరిగిన ప్రజాసంభందాల సదస్సులో సింగరేణి పీఆర్వో పాల్గొన్నారు. 20న లేబర్ కమిషనర్ శ్యాంసుందర్‌తో భేటీ అయిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మూడు అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. 24,25 తేదీల్లో శ్రీరాంపూర్ ఏరియాలో కంపెనీస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆటలు నిర్వహించారు. నవంబర్ పశ్చిమ బెంగాల్లో 11 నుంచి 13 వరకు జాతీయ రెస్క్యూ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సింగరేణి తరఫును రెండు జట్లు పాల్గొని బహుమతులు సాధించాయి. 16న సింగరేణి సంస్థకు బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు లభించింది. 27న ఒకే రోజు 2,45,000 టన్నుల బొగ్గు రవాణా చేసి సింగరేణి రికార్డు సృష్టించింది. డిసెంబర్ 8న డెహ్రాడూన్‌లో జరిగిన ప్రజాసంభందాల సదస్సులో సింగరేణి పీఆర్వో పాల్గొన్నారు. 20న లేబర్ కమిషనర్ శ్యాంసుందర్‌తో భేటీ అయిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మూడు అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. -
అభివృద్ధి పథంలో..
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2018లో అభివృద్ధి పరంగా అనేక మెరుపులు మెరవగా, కొన్ని అంశాల్లో మరకలు అంటాయి. వివిధ రంగాల్లో జిల్లా తనదైన ముద్ర వేయగా, కొన్ని అంశాల్లో నిరాశ మిగిలింది. అలాగే మరికొన్ని మరకలు అంటాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 6.7లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు లభించాయి. మొదట 5లక్షల ఎకరాలకు నీరందించాలని అనుకున్నప్పటికీ తరువాత 6.7లక్షల ఎకరాలకు పెరగడంతో అంచనా రూ.7,926 కోట్ల నుంచి రూ.13,884 కోట్లకు ప్రభుత్వం పెంచింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో తొలి సమీక్ష సమావేశం సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులపైనే చేశారు. సీతారామ ప్రాజెక్టు కోసం రూ.11వేల కోట్ల నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయిందని, పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుకు భద్రాద్రి జిల్లాలో అవసరమైన భూసేకరణ ఇప్పటికే మే 30కు పూర్తి చేశారు. రాష్ట్రానికి వెలుగులు అందించే కేటీపీఎస్ నుంచి కొత్తగా రూ.6,045 కోట్లతో నిర్మించిన 7వ దశ ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించడంతో పాటు ఈ నెల 26వ తేదీన జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సీవోడీ(కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. దీంతో ప్రస్తుతం కేటీపీఎస్ నుంచి మొత్తం 2,460 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుతోంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లో రూ.7,241 కోట్లతో 1,080 మొగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్‌లో మొదటి దశకు సంబంధించి హైడ్రాలిక్ పరీక్ష విజయవంతంగా పూర్తి చేశారు. వచ్చే మార్చిలోగా మొదటి దశలో ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనులు ముమ్మరంగా చేస్తున్నారు. బొగ్గు రవాణాకు రైల్వేలైన్ నిర్మాణం సర్వే సాగుతోంది. సారపాకలో ఉన్న ఐటీసీ పీఎస్పీడీ రాష్ట్రప్రభుత్వ బెస్ట్ ఎంప్లాయీస్ ప్రాక్టీసెస్ అవార్డును, పాల్వంచలోని నవభారత్ వెంచర్స్ బెస్ట్ సీఎస్ఆర్ పెర్ఫార్మెన్స్ అవార్డు, అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీకి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు సాధించాయి. పాలనాపరంగా మరింత వికేంద్రీకరణ జరిగింది. జిల్లాలో గతంలో 205 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 479 కు చేరింది. కొత్తగా 274 పంచాయతీలు పెరిగాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా భద్రాద్రి జిల్లాలో గిరిజనులకు ఏకంగా 463 పంచాయతీలు రిజర్వు అయ్యాయి. ఆగస్టు 2 నుంచి కొత్త పంచాయతీలు అమలులోకి వచ్చాయి. పాలనా నియామకాల కోసం భద్రాద్రి పేరుతో ప్రభుత్వం మే 25న ప్రత్యేక జోన్ ఏర్పాటుచేసింది. ఈ జోన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 18లక్షల ఎకరాల్లో 11లక్షల ఎకరాలు అటవీ భూములే. ఈ నేపథ్యంలో భూసర్వే చేసిన యంత్రాంగం 3.19లక్షల ఎకరాలకు పట్టా పుస్తకాలు ఇవ్వడంతో పాటు, ఆర్ఓఎఫ్ఆర్ కింద మరో 79,184 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. రూ.2,242 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేస్తున్నారు. జిల్లాలో 2,804 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేశారు. జిల్లాలోని 1,826 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన ఇంట్రావిలేజ్ పనులు మాత్రం 20శాతం పూర్తయ్యాయి. రూ. 100 కోట్ల నిరాశ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్‌ప్లాన్ కింద రూ.100కోట్లు ఇచ్చేందుకు గత మూడు బడ్జెట్లలో పెడుతున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఒక్కపైసా విదల్చలేదు. భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశం గత రెండున్నర సంవత్సరాలుగా నిర్వహించలేదు. జిల్లా ఏర్పాటు తరువాత ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరగకపోవడం గమనార్హం. మణుగూరులో ఏరియా ఆసుపత్రి నిర్మించి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించలేదు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా సాకారం కాలేదు. మణుగూరు మండలంలోని చినరావిగూడెం–దుమ్ముగూడెం మండలం పర్ణశాల వరకు గోదావరి నదిపై వంతెన నిర్మాణం కోసం వచ్చిన నిధులను అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో ఖర్చు చేశారని స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. -
సింగరేణికి ఏడాదికి రూ.35 వేల కోట్లు
సూపర్‌బజార్ (కొత్తగూడెం): రాబోయే ఐదు సంవత్సరాల్లో సింగరేణి సంస్థ సంవత్సరానికి రూ.35 వేల కోట్ల నికర ఆదాయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొ న్నారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఆయన శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. 2013 నుంచి సింగరేణి సంస్థ నికరలాభాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల లాభాలను ఆర్జించిందని చెప్పారు. 2013 – 14 ఆర్థిక సంవత్సరం నుంచి 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి మైలురాయిని అధిగమిస్తూ వస్తోందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 68 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. గతంలో సింగరేణి రూ.400 కోట్లకు మించి లాభాలను సాధించలేకపోయిందని, ఇప్పుడు కార్మికులు, ఉద్యోగుల సమైక్య కృషి, ప్రభుత్వ సహకారంతో రూ.1,200 కోట్ల లాభాలను ఆర్జించే స్థితికి చేరుకుందని వివరించారు. రాబోయే ఐదేళ్లలో మరో 12 గనులను కొత్తగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా 6 గనులను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా దేశంలోనే 5వ స్థానంలో సింగరేణి సంస్థ నిలవడం తమకు గర్వంగా ఉందని చెప్పారు. -
అన్నదాతల్లో ‘పెథాయ్’ తుపాన్ భయం
అశ్వారావుపేట రూరల్: అన్నదాతల్లో పెథాన్ తుపాన్ భయం వెంటాడుతోంది. బలంగా వీస్తున్న ఈదురు గాలులతో రైతుల్లో అలజడి మొదలైంది. గడిచిన మూడు రోజులుగా వాతావరణం చల్లబడి, ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు ఆదివారం ఉదయం నుంచి వర్షం కురవడంతో రైతుల్లో అందోళన నెలకొంది. ఇప్పటికే వరి కోతలు దాదాపుగా పూర్తి కాగా, పొలాల్లో ధాన్యం రాశులు ఆరబెట్టుతున్నారు. అదేవిధంగా ఆరిపోయిన ధాన్యం రాశులను అధిక శాతం మంది రైతులు విక్రయించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కేంద్రాల్లో రైతులు విక్రయాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని రోజుల తరబడి కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దాంతో రైతులు ధాన్యం కేంద్రాల్లోనే ఉండిపోతుంది. ఈ తరుణంలో ముంచుకొస్తున్న పెథాయ్ తుపాన్, కురుస్తున్న వర్షంతో ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు రైతులు పడుతున్న పాట్లు వర్ణాతీతంగా ఉన్నాయి. మండలంలోని నారాయణపురం, నెమలిపేట, అచ్యుతాపురం, ఊట్లపల్లితోపాటు మరికొన్ని చోట్ల ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు కుప్పకుప్పలుగా ఉండగా వర్షానికి తడిచిపోకుండా ఉండేందుకు కప్పడానికి టార్ఫాలిన్లు అంతంత మాత్రంగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. దాంతో చాలా మంది రైతులు టార్ఫాలిన్ల కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అదే విధంగా మరికొంత మంది రైతులు అశ్వారావుపేట, వినాయకపురం గ్రామాల్లో అద్దెకు ఇస్తున్న పరదాలను తీసుకొచ్చి ధాన్యం బస్తాలు, పొలాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై కప్పుతున్నారు. ఒకొక్క పరదాను వ్యాపారులు రోజుకు రూ.30 వరకు అద్దె తీసుకుంటుండటంతో రైతులపై మరింత భారం పడుతోంది. మరో వైపు నారాయణపురం, నెమలిపేట, ఊట్లపల్లి, అచ్యుతాపురంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోగా, వీటిపై కప్పేందుకు టార్ఫిలిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో గ్రామ సమైఖ్య సిబ్బంది సైతం వాటిని వర్షం పాలు కాకుండా చూసేందుకు ఇక్కట్ల పడాల్సి వస్తోంది. కాగా కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యం రాశులను ఎప్పటికప్పడు రైతుల నుంచి కొనుగోలు చేసి, లారీల ద్వారా రైస్ మిల్లర్లు, గోదాంలకు తరలిస్తే ఈ సమస్య ఉండదని, కానీ అధికారులు చేస్తున్న తాత్సారం వల్ల ఇటు గ్రామ సమైఖ్య బాధ్యులు, అటు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టాల కోసం పరుగులు చండ్రుగొండ:పెథాన్ తుపాన్ అన్నదాత గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చిన దశలో పెథాన్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం పంటను తడిపేస్తుంది. మండలంలోని దామరచర్లలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు 20 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉన్నాయి. కాంటాలు కాకపోవడంతో ధాన్యం రాసులుగా పడి ఉన్నాయి. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు పట్టాల కోసం రైతులు పరుగులు తీశారు. కిరాయి పట్టాలు సరిపడక పోవడంతో కొత్త పట్టాలు కొనుగోలు చేశారు. పట్టాల కొనుగోళ్ళు రైతులకు ఆర్థికంగా అదనపు భారంగా పరిణమించింది. పట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో చిరు జల్లులు అన్నపురెడ్డిపల్లి: పెధాయ్ తుపాన్ ప్రభావంతో మండలంలోని అన్నపురెడ్డిపల్లి, ఎర్రగుంట, పెంట్లం, అబ్బుగూడెం, మర్రిగూడెం, రాజాపురం, జానికీపురంలో ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లులు పడాయి. మండల పరిధిలోని గుంపెన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తాము విక్రయించిన ధాన్యం తడవకుండా బస్తాలపై పరదాలు కప్పి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం కారణంగా చలిప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వణికిస్తున్న తుఫాను దమ్మపేట: పెథాన్ తుపాను ముంచుకొస్తుందని తెలుసుకుని రైతుల్లో వణుకుపుడుతోంది. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు, చల్లటి గాలుల నడుమ చిరుజ్లులు పడ్డాయి. దీంతో పొలం పనుల్లో రైతులు శ్రమిస్తుండగా పడిన జల్లులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కోసిన వరి పంటను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు తుపాను విరుచుకు పడితే కోలుకోలేమని, ఎవరు ఎంత సాయం చేసినా తమను కష్టాల నుంచి గట్టెక్కించలేరన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. -
గెలిచారు.. ఓడారు..
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలోని అధికార, ప్రతిపక్షాల్లో ఒకవైపు మోదం, మరోవైపు ఖేదం నెలకొంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం సగమే అయింది. జిల్లాలోని ఐదు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్ కూటమి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర మథనంలో పడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర అన్ని జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ దాదాపు స్వీప్ చేసినట్టుగా ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే భద్రాద్రి జిల్లాలో మాత్రం సీన్ పూర్తి రివర్స్ అయింది. ఇక్కడ టీఆర్ఎస్ అసలు ఖాతానే తెరవలేదు. కాంగ్రెస్ పార్టీ నాలుగు, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో మాత్రమే ‘కారు’కు డిపాజిట్ దక్కింది. ఉమ్మడి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ధరావత్తు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పినపాక, అశ్వారావుపేట, వైరా స్థానాల్లో గెలిచింది. ఇల్లెందు, పాలేరు, మధిర, ఖమ్మం సీట్లలో కాంగ్రెస్, సత్తుపల్లిలో టీడీపీ, భద్రాచలంలో సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు. తర్వాత కాలంలో వైరాలో గెలిచిన మదన్‌లాల్, అశ్వారావుపేట నుంచి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, పినపాకలో గెలిచిన పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందులో గెలిచిన కోరం కనకయ్య, ఖమ్మంలో గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్ఎస్లో చేరారు. పాలేరు నుంచి గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్కు ఏడు స్థానాల్లో ప్రాతినిధ్యం లభించి జిల్లాలో మంచి బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచింది. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కూటమిని తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన మహా మహా నాయకులు ప్రజాతీర్పుతో మట్టికరిచారు. అయితే జిల్లాలో మాత్రం తీర్పు ఇందుకు భిన్నంగా వచ్చింది. టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆయా నియోజకవర్గాల్లో ఓటమిపాలైంది. పినపాక, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల స్వయంకృతాపరాధమే ఓటమి పాలు చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ పోటీ నడిచింది. ఈ మూడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు సమీపానికి వచ్చి ఓటమి చెందారు. సిట్టింగ్‌లకు నో చాన్స్.. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గెలిచిన వారందరూ కొత్తవారే. అయితే కొత్తగూడెంలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో గెలిచిన రేగా కాంతారావు గతంలో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించినవారే. ఇల్లెందు నుంచి గెలుపొందిన బాణోత్ హరిప్రియ, అశ్వారావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. హరిప్రియ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం కాగా, ఈసారి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మెచ్చా నాగేశ్వరారవు గతంలో టీడీపీ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా అదే పార్టీ నుంచి గెలుపొందారు. భద్రాచలం నుంచి గెలిచిన పొదెం వీరయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించారు. ఈ సారి భద్రాచలం నుంచి ఎన్నికయ్యారు. ములుగు టికెట్ సీతక్కకు ఇవ్వడంతో చివరి నిమిషంలో భద్రాచలం వచ్చిన వీరయ్య.. వారం రోజుల ప్రచారంతోనే విజయం సాధించడం విశేషం. మోదం.. ఖేదం.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీయగా, జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. దీంతో రెండు పక్షాల్లోనూ మోదం, ఖేదం కలిగింది. ఓడినప్పటికీ ప్రభుత్వం అండతో నియోజకవర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని టీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన అభ్యర్థులు చెపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతామని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయోనని జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. -
ఆ సీటుపై మూడు పార్టీల కన్ను
సాక్షి, కొత్తగూడెం: అసెంబ్లీ రద్దయి నేటికి 50 రోజులైనా కాంగ్రెస్ కూటమిలో సీట్ల సర్దుబాట్లు, టికెట్ల కేటాయింపు ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జిల్లాలోని అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై ఇప్పటికీ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ మధ్య స్పష్టత రాలేదు. తమకే టికెట్ వస్తుందంటూ ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం తీవ్ర టెన్షన్‌కు లోనవుతున్నారు. ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశించే వారి మధ్యనే గట్టి పోటీ నెలకొంది. అశ్వారావుపేట, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో కూటమిలోని మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇక జిల్లాలో ఏకైక జనరల్ స్థానమైన కొత్తగూడెం సీటు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనకు చివరి అవకాశంగా తీవ్రంగా యత్నిస్తున్నారు. మరోవైపు రేణుకాచౌదరి ఆశీస్సులతో టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఎడవల్లి కృష్ణకు భారీగా ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 23 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా, పొత్తులో ఈ సీటు తమకే ఇవ్వాలని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) సైతం కొత్తగూడెం సీటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. నేరుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చిన్నికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, సీపీఐలను కోరుతున్నారు. దీంతో ఈ సీటుపై ఉత్కంఠ మరింతగా పెరిగింది. అన్నిచోట్లా అదే పరిస్థితి.. మిగితా స్థానాల్లోనూ ఎవరికి ఎక్కట టికెట్ వస్తుందనే విషయంలో ఏ పార్టీకీ స్పష్టత లేదు. అశ్వారావుపేట టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి సున్నం నాగమణి, బాణోత్ పద్మావతి, కోలా కృష్ణమోహన్, కారం శ్రీరాములు పోటీ పడుతుండగా, టీడీపీ మాత్రం ఈ సీటు తమకే వస్తుందని.. మెచ్చా నాగేశ్వరరావు పోటీలో ఉంటారని చెపుతోంది. దీంతో ఈ సీటుపై ఇప్పటివరకు సందిగ్ధం వీడలేదు. పినపాకలో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. అయితే ఈ సీటు కోసం బాణోత్ అశోక్ అనే ఎన్ఆర్ఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కొత్తగూడెం సీటు సీపీఐకి రాకపోతే పినపాక స్థానం ఆ పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ కూడా స్పష్టత రాలేదు. ఇల్లెందు నుంచి కాంగ్రెస్ పోటీ చేయడం ఖాయమైనప్పటికీ ఇక్కడ 31 మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా చీమల వెంకటేశ్వర్లు, ఊకె అబ్బయ్య, హరిప్రియ, దళ్‌సింగ్‌నాయక్, డాక్టర్ రామచంద్రునాయక్, మంగీలాల్‌నాయక్ రేసులో ఉన్నారు. ఊకె అబ్బయ్య కొత్తగా పార్టీలో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్ మరో సర్వే చేయించింది. భద్రాచలం నియోజకవర్గం నుంచి కారం కృష్ణమోహన్, కృష్ణబాబు, కుర్స వెంకటేశ్వర్లు పోటీ పడుతుండగా, ములుగు మాజీ ఎమ్మెల్యే దనసరి అనసూయ(సీతక్క)ను ఇక్కడ నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈ సీటుపై సైతం పూర్తి క్లారిటీ లేకుండా పోయింది. ప్రత్యర్థులెవరోనని టీఆర్ఎస్ ఎదురుచూపులు.. గత 50 రోజలుగా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఎవరు వస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసుకుని రెండో విడతలో అడుగు పెట్టినప్పటికీ.. ప్రధాన ప్రత్యర్థిని బట్టి జయాపజయాలు ఆధారపడి ఉంటాయని వారు భావిస్తున్నారు. -
వృద్ధ దంపతులను నరికి చంపిన దుండగులు
-
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ
కొత్తగూడెం అర్బన్ : ఫ్రెండీ పోలీసింగ్‌తో నేరాలను సులభంగా నియంత్రించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ఓఎస్డీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లాలోని అధికారులు, సిబ్బంది, ఐటీ సెల్, డీసీఆర్బీ సిబ్బందితో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని, వారి మనసులను చూరగొనేలా సేవలందించాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులకు అక్కడి సమస్యలను తెలిపిన వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా నేరాలను సులభంగా నియంత్రించవచ్చన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయడంలో కోర్టు అధికారులతో సమన్వయం పాటించాలని, కేసుల పురోగతిని ఎప్పటికప్పడు తెలుసుకోవాలని చెప్పారు. గుట్కా, మట్కా, పేకాట, గ్యాంబ్లింగ్ స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేయాలన్నారు. సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. లైసెన్స్‌లేకుండా, మద్యం తాగి వాహనాలు నడిపే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చిన్న పిల్లలపై, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు దిగేవారిపై చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేర నియంత్రణకు సాంకేతికపరమైన అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి సమాచారాన్ని వాటిలో నిక్షిప్తం చేసేలా అధికారులు, సిబ్బంది అంతా నైపుణ్యం సాధించాలన్నారు. అసాంఘిక శక్తులపై ఎప్పటికప్పడు సమాచారం సేకరించి ముందుగానే వాటిని అదుపు చేసేందుకు కృషి చేయాలన్నారు. తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సస్పెక్ట్ షీట్స్, రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఆర్ డీఎస్పీ కుమారస్వామి, కొత్తగూడెం డీఎస్పీ ఎస్ఎం.అలీ, పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు, మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా, ఎస్పీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, నాగరాజు, ఐటీ సెల్, డీసీఆర్బీ సీఐ రమాకాంత్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, సీఐలు రవీందర్, షుకూర్, సిహెచ్.శ్రీనివాస్, టి.గోపి, కుమారస్వామి, కొండ్రు శ్రీను, సత్యనారాయణరెడ్డి, అల్లం నరేందర్, వెంకటేశ్వర్లు, అశోక్, దోమల రమేష్, అబ్బయ్య, ఆర్ఐలు కృష్ణ, సోములు, కామరాజు, ప్రసాద్, దామోదర్, స్టేషన్ రైటర్లు, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరే ఉద్యోగులు
సూపర్‌బజార్(కొత్తగూడెం) : యువజనులకు, క్రీడాకారులకు సేవలందించాల్సిన జిల్లా యువజన, క్రీడల శాఖా కార్యాలయం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రెండు శాఖలను ఒకే శాఖ పరిధిలోకి తీసుకువచ్చినా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేదు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరిగింది. ఈ రెండింటిలో ఒక శాఖకు ఒక్కరు కూడా సిబ్బంది లేకపోవడం గమనార్హం. చివరకు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పోస్టు సైతం ఇన్చార్జి పాలనలోనే సాగుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత పూర్తిస్థాయిలో జిల్లా యువజన, క్రీడల అధికారి (డీఎస్ఓ)గా వెంకటరంగయ్య నియమితులయ్యారు. 2017 సెప్టెంబర్ మాసంలో ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో జిల్లాలో పరిశ్రమల శాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.అజయ్ కుమార్‌కు డీఎస్‌ఓగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయన కూడా ఇటీవల బదిలీ కావడంతో సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లా పరిశ్రమల శాఖాధికారిగా బదిలీపై వచ్చిన జె.రాజారాంకు డీఎస్ఓ అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో జిల్లా అధికారితోపాటు సూపరింటెండెంట్, అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు మరో ఆరుగురు వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్‌లు కలిపి మొత్తం 13 మంది సిబ్బంది నిబంధనల ప్రకారం ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ శాఖలో ఇన్చార్జి డీఎస్‌ఓతోపాటు సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అటెండర్ గతంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన బదిలీలలో ఖమ్మానికి బదిలీ కాగా, ఇక్కడి కార్యాలయానికి మాత్రం ఎవరినీ నియమించలేదు. ఇన్చార్జి డీఎస్‌ఓగా ఉన్న పరిశ్రమల శాఖాధికారికి ఆ శాఖలో ఉండే పని ఒత్తిడి కారణంగా ఈ శాఖపై పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా ఏర్పాటు కాకముందు యువజన, క్రీడలు వేరువేరు శాఖలు ఉండగా, జిల్లా ఏర్పాటు అనంతరం వీటిని విలీనం చేశారు. అప్పటి యువజన శాఖలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లే ప్రస్తుతం రెండు శాఖలకు కలిపి పని చేస్తుండటం గమనార్హం. క్రీడాపోటీల నిర్వహణ అంతంతమాత్రమే యువజన, క్రీడల శాఖలో సిబ్బంది కొరత కారణంగా జిల్లాలో క్రీడాపోటీల నిర్వహణతోపాటు ఇతర పలు శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణ పూర్తిస్థాయిలో కొనసాగడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి యువజనులకు, క్రీడాకారులకు అవసరమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసి నిర్వహించాలని పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపించాం జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ పోస్టులను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి పంపించాం. –జె.రాజారాం, ఇన్చార్జి డీఎస్ఓ -
స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ తెలంగాణగా ‘మల్లికా యాదవ్’
సూపర్‌బజార్(కొత్తగూడెం) : కొత్తగూడెం పట్టణంలోని నేతాజీ వ్యాయామశాలకు చెందిన వి.మల్లికాయాదవ్ రాష్ట్రస్థాయి సీనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారుపతకం సాధించడంతోపాటు స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మల్లికాయాదవ్ బ్యాక్స్కాడ్ విభాగంలో 180 కేజీలు, బెంచ్‌ప్రెస్‌లో 80, డెడ్‌లిఫ్ట్‌లో 180 కేజీల బరువులు ఎత్తి బంగారు పతకంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆగస్టులో గుంటూరు జిల్లా మదనపల్లిలో జరగనున్న సీనియర్ జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా మల్లికకు ఉమ్మడి జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ఎ.నాగరాజు, జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వసంతరావు, ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీనివాస్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ కూచన కృష్ణారావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.మహిదర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖాసీ హుస్సేన్, కె.మొగిళిలు అభినందనలు తెలిపారు. -
ఔట్ సోర్సింగ్ టెండర్లు రద్దు చేయాలి
సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణిలో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి చేపట్టిన ఔట్ సోర్సింగ్ టెండర్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ అడ్వైజర్ దమ్మాలపాటి శేషయ్య డిమాండ్ చేశారు. గురువారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం రమణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ క్లరికల్ ఖాళీలను అంతర్గత అభ్యర్థులతోనే భర్తీ చేయాలని కోరారు. గతంలో డైరెక్టర్ పా సింగరేణి వ్యాప్తంగా ఉన్న క్లరికల్ ఖాళీలను అంతర్గత అభ్యర్థులతో తాత్కలికంగా నియమించి, అనంతరం వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత పొందిన వారిని శాశ్వత పద్ధతిపై నియమిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గుత్తుల సత్యనారాయణ, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వంగా వెంకట్, బ్రాంచి కార్యదర్శి జి వీరస్వామి, కె రాములు, ఎస్ సుధాకర్, మెంగెన్ రవి, గట్టయ్య, పి చంద్రయ్య, ఎంవీ రావు, ఎస్ శ్రీనివాస్, ఎమ్ ఎ నభి,హుమాయిన్, హనీఫ్, బి సత్యనారాయణ, ఆర్ సాంభమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గుడ్డు లేకుండానే ఫుడ్డు
కొత్తగూడెం : పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. మెనూ ప్రకారం వారానికి మూడు రోజులు తప్పనిసరిగా గుడ్లు వడ్డించాలి. ఇటీవల కొత్తగూడెం నియోజకవర్గంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయప్రాత ఫౌండేషన్‌కు అప్పగించారు. గుడ్లు మాత్రం కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై 22 రోజులు గడిచినా ఒక్కసారి కూడా గుడ్డు వడ్డించలేదు. పాఠశాలల పునఃప్రారంభం నుంచి అందని గుడ్లు జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథంకంలో వారంలో మూడు రోజులపాటు గుడ్లను వండి పెట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని 1065 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 49,159 మంది విద్యార్థులు, 169 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 22,728 మంది, 139 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 15,584 మంది.. మొత్తం 87,471 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.4.13 పైసలు, అదనంగా గుడ్డుకు రూ. 4లు, ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ6.18కు అదనంగా గుడ్డుకు రూ. 4లు చొప్పున అదనంగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చెల్లిస్తారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గుడ్డు ధరతో కలుపుకొని ఒక్కో విద్యార్థికి రూ. 8.18 పైసలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 21,989 మంది విద్యార్థులకు అందని పౌష్టికాహారం కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ ఏడాది జనవరి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో ఆయా వంట ఏజెన్సీల ఆధ్వర్యంలోనే గుడ్లు కొనుగోలు చేసి విద్యార్థులకు అందచేస్తున్నారు. అక్షయపాత్ర సంస్థ సేవలను అందచేస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం గుడ్లు అందటం లేదు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ, సుజాతనగర్ మండలాల పరిధి లోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం 21,989 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. వీరందరికి పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి గుడ్లు వడ్డించడంలేదు. అక్షయపాత్ర ప్రారంభమైన అనంతరం గుడ్లను సరఫరా చేసేందుకు టెండర్ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. వీటిని ఉడికించి విద్యార్థులకు వడ్డించే బాధ్యత కుక్కర్ కం హెల్పర్లపై ఉంటుంది. వేసవి సెలవులు ముగిసే వరకు ఇదే తంతు కొనసాగింది. పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత గుడ్లు కొత్తగూడెం నియోజకవర్గంలోని ఏ పాఠశాలకూ చేరుకోలేదు. దీంతో ఇటు విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సదరుశాఖ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. గుడ్లను అందించటం లేదు మా దగ్గర పాఠశాలలు ప్రారంభం అయినప్పటి నుంచి గుడ్లను వండి పెట్టడం లేదు. వారం రోజులకు మూడు మార్లు పెట్టాలని మెనూలో మాత్రం ఉంది. ఎందుకో..మాకు అయితే అందటం లేదు. -పవన్‌కుమార్, చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల రెండు రోజుల్లో పరిష్కరిస్తాం గుడ్లు అందటం లేదని రెండు రోజుల క్రితమే నా దృష్టికి వచ్చింది. సరఫరాకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. సోమవారం నుంచి యథావిధిగా గుడ్లు అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. -డి వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారిణి -
విధినిర్వహణలో సెల్‌ఫోన్ మాట్లాడినందుకు..
కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలో పని వేళ లో సెల్ ఫోన్ మాట్లాడుతున్న ఓ ఉపాధ్యా యుడిని జిల్లా విద్యాశాఖాధికారిణి డి వాసంతి సస్పెండ్ చేశారు. డీఈఓ కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలను గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఎస్ నర్సింహారావు సెల్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. అదేవిధంగా పాఠశాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. అకడమిక్ క్లాసులను ఇప్పటి వరకు ప్రారంభించలేదని గుర్తించిన డీఈఓ.. ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్త ర్వులను విడుదల చేశారు. ఈ సందర్భం గా డీఈఓ వాసంతి మాట్లాడుతూ... పాఠశాల తరగతి గదులలో సెల్‌ఫోన్ విని యోగం నిషేధమని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మాంసం ప్రియులారా జర జాగ్రత్త..
రామారావు ఓ చిరుద్యోగి.. జీతం రాగానే అటు నుంచి అటుగా మాంసం షాపుకెళ్లి కిలో మటన్ కొనుగోలు చేసి ఇటికి తీసుకెళ్లాడు. దాన్ని ఆయన భార్య కుక్కర్లో పెట్టి గంట వరకు ఉడికించింది. అయినా ఉడక లేదు. మళ్లీ ఉడికించింది. ఎలాగో అలా తినేశారు. ఒక గంట తరువాత రామారావుకు కడుపునొప్పితో విరేచనాలు పట్టుకున్నాయి. వెంటనే ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్ అతన్ని పరీక్షించి అపరిశుభ్రమైన మాంసాన్ని తినడం వలనే ఇలా జరిగిందని చెప్పాడు. ఇంకేముంది వెయ్యి రూపాయల వరకు వదిలాయి. ఇది ఒక్కరామారావు మాత్రమే ఎదుర్కొన్న సమస్య కాదు. నిత్యం అనేక మంది మాంసం ప్రియులు ఎదుర్కొంటున్న సమస్య... చుంచుపల్లి కొత్తగూడెం : ముక్క లేనిదే ముద్ద దిగని రోజులివి.. వారాలతో పని లేకుండా నిత్యం మాంసాహారానికే జనం మొగ్గుచూపుతున్నారు. దీంతో పట్టణా ల్లో ఎక్కడ చూసినా ఫుట్‌పాత్‌లు, ఫాస్ట్‌పుడ్ సెం టర్లు, హోటళ్లు నిత్యం ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. మారుతున్న పరిస్థితులు, ప్రజల ఆహారపు అలవాట్ల నేపధ్యంలో మనం తింటున్న మాంసాహారం ఎంతవరకు సురక్షితం..! అని లోతుగా ఆరా తీస్తే ఆందోళన కలిగిం చే విషయాలు వెలుగుచూస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొంద రు వ్యాపారులు జిల్లాలో ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలను జరుపుతున్నారు. మరికొంత మంది వ్యాపారులైతే రోగాల భారిపడి చనిపోయే దశలో ఉన్న జీవాలను సైతం వదలడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వాటి మాంసాన్ని కూడా అంటగడుతున్నారు. ఆదివారం రోజున వ్యాపారుల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. తాము అమ్మిందే మాంసం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటుగా జిల్లా కేంద్రం కొత్తగూడెం లోనూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇక్కడ వ్యా పారులు దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నా రు. మార్కెట్లు, బజార్లలో అమ్మకాలు జరిపే మాం సం సెంటర్లలో రోగాల బారినపడిన బక్క మేక లు, గొర్రెల దట్యాలకు ఏకంగా మేకపోతు తోకలను అతికించి జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అపరిశుభ్రమైన, రోగాల బారిపడిన మాంసం భుజించడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కొంత కాలంగా ఇలాంటి అమ్మకాలు పట్టణాల్లో జోరుగా సాగుతున్నాయి. పర్యవేక్షించని పశువైద్యాధికారులు.. జీవాలను వధించే దగ్గర నుంచి విక్రయించే వరకు పర్యవేక్షించాల్సిన సంబంధిత పశువైద్యాధికారు లు అటువైపుగా తొంగిచూసిన దాఖలాలు లేవని విమర్శలున్నాయి. పట్టణాల్లో యథేచ్ఛగా అమ్మకాలు.. జిల్లాలో మాంసం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న, చనిపోయిన జీవాలను చౌకగా కొనుగోలు చేసి వాటిని కోసి విక్రయిస్తున్నారు. జిల్లాలో 397 మాంసం దుకాణాలు జిల్లా వ్యాప్తంగా సుమారు 397 మటన్ దుకాణా లున్నాయి. ప్రధానంగా పట్టణాలలో వీటి సంఖ్య అధికంగా ఉంది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటుగా ఒక మోస్తరు పెద్ద గ్రామాల్లో మటన్ షాపులున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కిలో మటన్ రూ.440 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.400 పలుకుతుంది. జిల్లాలో రోజుకు 80 క్వింటాళ్ల వరకు మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి. ఇక ఆదివారమైతే ఏకంగా వంద క్విం టాళ్లకు పైగానే మాంసం విక్రయాలు జరుగుతా యి. పట్టణాల్లో మటన్‌ను రిటేల్‌గా అమ్మే వ్యా పారులు గ్రామీణ ప్రాంతాలు, సంతల్లో తిరిగి అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను కొనుగో లు చేస్తుంటారు. వాటిని ఆది, బుధ వారాల్లో తమ ఇంట్లో వధించి అనంతరం షాపుల్లో పెట్టి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రధానంగా పట్టణాలైన కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, పాల్వంచలో జరుగుతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తూకంలోనూ మోసాలు.. మరో వైపు మటన్ అమ్మే తూకంలోనూ వ్యా పారులు మోసాలకు పాల్పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న మేకల, గొర్రెలను కోసి అమ్మడం ద్వారా ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని విమర్శలొస్తున్నాయి. పట్టించుకోని, పంచాయతీ, మున్సిపల్ అధికారులు.. మాంసం విక్రయాల విషయంలో పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం మూలంగానే వ్యాపారుల ఆగడాలు పెరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిజానికి మున్సిపాలిటీ, పంచాయతీ స్థాయిలో మాంసం విక్రయాలపై పర్యవేక్షణ ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహించాలి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశు వధశాలలున్నా కానీ అక్కడ ఎవరూ గొర్రెలు, మేకలను వధించిన దాఖలాలు లేవు. పశు వైద్యాధికారులు ధ్రువీకరించాకే ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలను పశువధశాలలో కోయాల్సి ఉంటుంది. మార్కెట్లో ఏ మాంసాన్ని అమ్ముతున్నారో ఎవరికీ అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. చర్యలు తీసుకుంటాం మాంసం అమ్మకాలకు కోసే జీవాలను వ్యాపారులు బాధ్యతగా పశువధశాలలకు తీసుకురావాలి. దీని విషయంలో గతంలో నోటీసులు ఇచ్చినా మార్పు రాలేదు. మళ్లీ నోటీసులు జారీ చేస్తాం. నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. మాంసం వ్యాపారులు ఆహార కల్తీ నిరోధక చట్టానికి లోబడి విక్రయాలు చేయాలి. అపరిశుభ్రమైన వాతావరణం, రోగాలపాలైన జీవాల మాంసం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్, కొత్తగూడెం -
బైక్, లారీ ఢీ..ఒకరి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి మండలం బోజ్జాయిగూడెం ఆరో మైలు తండా వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బూడిద లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకిస్ట్ అక్కడికక్కడే మృతిచెందగా..వెనక కూర్చున్న యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గమనించి ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు రోంపేడు గ్రామానికి చెందిన భూక్యా సురేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
మణుగూరుటౌన్(భద్రాద్రి కొత్తగూడెం): సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మోటర్ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణ తరగతులను సమితి అధ్యక్షురాలు ఉమా నర్సింహారావు మంగళవారం ప్రారంభించారు. మణుగూరు ఏరియాలోని పీవీ కాలని భద్రాద్రి స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి నిర్వాసిత కుటుంబాల నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు, లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామన్నారు. అందుకోసం 40 మంది యువకులను ఎంపిక చేస్తామని, రెండు గ్రూపులుగా చేసి నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏరియా పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, సంక్షేమ అధికారులు సింగు శ్రీనివాస్, రామేశ్వర్, సేవా సమితి సభ్యురాలు షాకీరా, స్పోర్ట్స్ సూపర్ వైజర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
స్పీడందుకున్నాయ్..!
సాక్షి, కొత్తగూడెం: కలెక్టరేట్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. జిల్లా ఆవిర్భావం తర్వాత కొత్త కలెక్టరేట్ నిర్మాణం కోసం స్థలం ఎంపికలో జాప్యం జరిగింది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కావడంతో పనులు వేగంగా నడుస్తున్నాయి. పాల్వంచ (నవభారత్) లోని వెంకటేశ్వరస్వామి ఆలయం – కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ మధ్య కలెక్టర్ కార్యాలయం నిర్మించనున్నారు. సర్వే నంబరు 405లో ఉన్న మైనింగ్ కళాశాలకు చెందిన 25 ఎకరాలను గత నవంబర్‌లో పాల్వంచ తహసీల్దారు ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. గుట్టలా ఉండే ఈ ప్రాంతాన్ని మూడు నెలల కాలంలో చదును చేశారు. కలెక్టరేట్ ప్రధాన కార్యాలయానికి సంబంధించి కాంక్రిట్ పుట్టింగ్ పనులు పూర్తి కాగా, కాలమ్స్(పిల్లర్లు) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కలెక్టరేట్ పక్కనే ఆడిటోరియం కూడా నిర్మించనున్నారు. 1.50 లక్షల చదరపు అడుగులతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ 17 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 36 శాఖల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. 14 నెలలకు స్పష్టత.. జిల్లా ఏర్పడి 14 నెలలు గడిచిన తరువాత కలెక్టరేట్ నిర్మాణంపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రస్తుత స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే శ్రీరామనవమి రోజున సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటు చేసింది. కొత్తగూడెంలో వివిధ శాఖల కార్యాలయాలను సింగరేణి భవనాలలో ఏర్పాటు చేశారు. అయితే నూతనంగా ఏర్పడిన జిల్లాలతో పాటు మరికొన్ని పాత జిల్లాలకు కలిపి మొత్తం 26 జిల్లాల్లో కలెక్టరేట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉంచాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణాల మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేసింది. 9 జిల్లాల్లో 1.50 లక్షల చదరపు అడుగులతో, 17 జిల్లాల్లో 1.20 లక్షల చదరపు అడుగులతో భవనాలు నిర్మించేలా మార్గదర్శకాలను సూచించింది. ఇందుకోసం 17 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ ప్రతిపాదనలు వచ్చిన ఏడాది తర్వాత కానీ కలెక్టరేట్ల నిర్మాణం పలు జిల్లాలో ప్రారంభం కాలేదు. నూతన జిల్లాల ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్, సిరిసిల్ల, సిద్దిపేటలో కలెక్టరేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు స్థలాల పరిశీలన.. చివరకు పాల్వంచలో జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పలు స్థలాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ప్రధానంగా కొత్తగూడెం నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డుకు నడుమ ఉన్న స్థలం, ఆ తర్వాత కొత్తగూడెంలోని రామవరం వద్ద ఉన్న స్థలాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ స్థలాల ఎంపిక విషయంలో ఏడాది దాటినా సందిగ్ధం వీడకపోవడంతో మధ్యే మార్గంగా కొత్తగూడెం – భద్రాచలం రోడ్డులో ప్రభుత్వ మైనింగ్ కళాశాల, నవభారత్ వెంకటేశ్వర స్వామి దేవాలయం మధ్యలో ఉన్న 25 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి కలెక్టరేట్ నిర్మాణానికి అనువుగా, జిల్లాలోని అన్ని మండలాల వారికి అందుబాటులో ఉంటుందని నివేదిక సమర్పించడంతో పనులు వేగవంతమయ్యాయి. 17 ఎకరాల్లో నిర్మాణం... ప్రభుత్వం ప్రతిపాదించినట్లు 1.50 లక్షల చదరపు అడుగులతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం 17 ఎకరాలలో జరగనుంది. అంతే కాకుండా 36 శాఖల కార్యాలయ భవనాలు అన్ని ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కలెక్టర్ కార్యాలయం, రెసిడెన్సీలను 6 వేల చదరపు అడుగులలో, జాయింట్ కలెక్టర్ రెసిడెన్సీని 3వేల చదరపు అడుగులలో, జిల్లా రెవెన్యూ అధికారి రెసిడెన్సీని 2,500 చదరపు అడుగులలో నిర్మించనున్నారు. 36 శాఖల కార్యాలయాలు, వాటికి కాన్ఫరెన్స్ హాళ్లు, ఇతర అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. 148 మంది అధికారులకు, సిబ్బందికి 1500 చదరపు గజాలలో క్వార్టర్లలను నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. పనులు వేగవంతమయ్యాయి పాల్వంచ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చదును చేసిన స్థలంలో కొత్త కలెక్టరేట్ పనులు వేగంగా నడుస్తున్నాయి. శంకుస్థాపనకు సంబంధించి ఖచ్చితమైన తేదీ ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. ఆ కార్యక్రమం ఎప్పుడు చేసేందుకైనా సరే సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. -రాంకిషన్, జాయింట్ కలెక్టర్ -
చేపల పెంపకం బాగుంది
కూసుమంచి: పాలేరులోని పీవీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రాన్ని ఆదివారం ఆఫ్రికన్ దేశాలకు చెందిన 15 మంది ప్రతినిధులు సందర్శించి..ఇక్కడి చేపల పెంపకం తీరు బాగుందని కొనియాడారు. ఇండో–ఆఫ్రికన్ సమ్మిట్–3 లో భాగంగా వారు కేంద్రప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్, సెంట్రల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆçఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చ ర్ సంయుక్త ఆద్వర్యంలో వారు పర్యటకు వచ్చారు. పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ఇట్టి బృందానికి శాస్త్రవేత్త నాగార్జున్ కుమార్ నాయకత్వం వహించారు. ప్రధాన శాస్త్రవేత్త విద్యాసాగర్‌రెడ్డి, సిబ్బంది ఘన స్వాగతం పలికి..చేపల పెంపకం, యాజమాన్య పద్ధతులు, పరిశోధనలు తదితర అంశాలను ప్రధానశాస్త్రవేత్తలు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం పరిశోధన కేంద్రంలోని చేపలు పెంచే ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ యూనిట్‌ను సందర్శించగా..వాటి ఫలితాలను శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పద్ధతిలో చేపల పెంపకంపై ప్రతినిధులు ఆసక్తిని కనబరిచారు. ఇక్కడ చేపల పెంపకం చాలా బాగుందని కితాబిచ్చారు. పరిశోధనా కేంద్రంలో మొక్కలను నాటారు. అనంతరం ఇక్కడే భోజనాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి, పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ సాంకేతికత ఇచ్చిపుచ్చుకునేందుకే... ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ శాస్త్రవేత్త నాగార్జున్ కుమార్ మాట్లాడుతూ.. గత నెల 15 నుంచి ఈ బృందం తెలంగాణాలో పర్యటిస్తుందని అన్నారు. ఇండో–ఆఫ్రికన్ దేశాలు వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. దీనిలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై అధ్యయనం చేసేందుకు ఆఫ్రికన్ ప్రతినిధుల బృందం ఇక్కడికి వచ్చిందన్నారు. నైజీరియా నుంచి 10 మంది, ఇథియోఫియా నుంచి నలుగురు, మలానీ నుంచి ఒక్కరి చొప్పున ఈ బృందంలో ఉన్నారని వివరించారు. ఉన్నారని అన్నారు. ఈబృందం ఈనెల 7వరకు వివిధ పరిశోదన కేంద్రాలను సందర్శిస్తారని అన్నారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం
వైరారూరల్: మండలంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన సట్టి రామకృష్ణ, బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై తాండ్ర నరేష్ తెలిపిన వివరాలు.. తనను రామకృష్ణ వేధిస్తున్నాడంటూ రెబ్బవరం గ్రామస్తురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అతడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనతోపాటు తెచ్చుకున్న పురుగు మందును తాగాడు. పోలీసులు గమనించి, వెంటనే వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
గ్రామస్థులకు శాపంగా మారిన ఓపెన్ క్రాష్ గనులు
-
హోరాహోరీగా ఎదురు కాల్పులు
-
హోరాహోరీగా ఎదురు కాల్పులు
చర్ల (భద్రాచలం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు గ్రామాలు శనివారం పోలీసులు–మావోయిస్టుల ఎదురుకాల్పులతో అట్టుడికాయి. గంటపాటు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా సాగిన కాల్పులతో ఆదివాసీలు పరుగున ఇళ్లల్లోకి వెళ్లి ప్రాణాలను దక్కించుకున్నారు. పలు ఇళ్ల పైకప్పులకు తూటాలు తగిలి సిమెంటు రేకులు, పెంకులు పగిలాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు శనివారం తోగ్గూడెం– చర్ల మండలం తిప్పాపు రం గ్రామాల మధ్య వేసిన రోడ్డును తనిఖీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి సుమారు 300 మంది మావోయిస్టులు చర్ల మండలంలోని ఎర్రంపాడు, గోరుకొండ గ్రామాల మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి పోలీసు బలగాలు తారసపడగా మావోయిస్టులు మొదట కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులూ ఎదురుకాల్పులకు దిగారు. దీంతో మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే గోరుకొండ మీదుగా ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి పారిపోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో గోరుకొండ గ్రామానికి చెందిన శ్యామల మంగయ్య, వెట్టి కేశ, కొవ్వాసి బీమె ఇళ్ల పైకప్పులకు తూటాలు తగిలి రేకులు, పెంకులు పగిలిపోయాయి. కాల్పుల శబ్దాలకు గోరుకొండ, తిప్పాపురం గ్రామాలకు చెందిన ఆదివాసీలు భయంతో ఇళ్లలో తలుపులు వేసుకొని రెండు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 200 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారని వారు తెలిపారు. ఈ సమయంలో మావోయిస్టులు ‘రండిరా.. మీరో మేమో తేల్చుకుందాం’అని పోలీసులకు సవాల్ విసిరారని, పోలీసులు ‘ఫైర్.. ఫైర్’అంటూ అరిచారని గ్రామస్తులు తెలిపారు. చర్ల మండలం కలివేరు సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ బలగాలు హుటాహుటిన తిప్పాపురం తరలివెళ్లాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులకు తీవ్ర గాయాలు కాగా, వీరేందర్సలాం అనే హెడ్ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మావోయిస్టులను సహచరులు భుజాలపై ఎత్తుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. -
గిరిజనుల ఉపాధి పథకంలో రూ.4 కోట్ల కుంభకోణం
-
సెల్ఫీలు కాదు అభిమానులు సహకరించాలి
సాక్షి, కొత్తగూడెం: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొత్తగూడెంలో ఆయన అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడకుండా.. తన రాజకీయ యాత్రకు సంయమనంగా సహకరించాలని ఆయన కోరారు. ‘కొత్తగూడంలో చాలా సమస్యలున్నాయి. పోడు భూములు, రైల్వే లైన్, మైనింగ్ వర్సిటీ, పర్యావరణం వంటి సమస్యలున్నాయి. సమస్యలపై సమరం కంటే వాటిపై అధ్యయనానికే ప్రాధాన్యతనిస్తా. నిపుణులతో చర్చించి వాటి పరిష్కార మార్గాలు చూపుతా. కొత్తగూడెంలో మైనింగ్ పరిశ్రమ, మెడికల్ కాలేజీ రావాల్సిన అవసరముంది’ అని పవన్ అన్నారు. క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న శ్రీజ అనే బాలిక పవన్ కల్యాణ్‌ను కలిసింది. శ్రీజ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సమయంలో పవన్ ఆమెను పరామర్శించి.. ఓదార్చారు. శ్రీజ ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కొత్తగూడెంలో పర్యటన అనంతరం పవన్ ఖమ్మం బయలుదేరి వెళ్లారు. -
మైనింగ్ గ్రామాల అభివృద్ధికి రూ.290 కోట్లు
కొత్తగూడెం/చుంచుపల్లి: జిల్లాలో మైనింగ్ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి రూ.290 కోట్లు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో జిల్లా మినరల్ ఫౌండేషన్ ప్రథమ సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ ప్రభావిత గ్రామాల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించి వాటి అభివృద్ది కోసం కృషి చేస్తోందని అన్నారు. ఈ నిధులను జిల్లాలోని మైనింగ్ ప్రభావిత 86 గ్రామాలలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు గ్రామసభలను నిర్వహించి తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నిధులలో 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు, ప్రజల సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించుటకు, ప్రజలకు శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు వినియోగిస్తామని, మిగితా 40 శాతం నిధులను మంచినీటి సరఫరా, వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, విద్య, స్త్రీ, శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాభివృద్ధి తదితర పనులకు కేటాయి స్తామని వివరించారు. రెండు కిలోమీటర్ల లోపు మైనింగ్ ప్రభావిత ప్రాంత గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి జాబితాను సింగరేణి అధికారులు అందజేయాలని కోరారు. జిల్లా మినరల్ ఫౌండేషన్‌లో సభ్యులుగా మైనింగ్ ప్రభావిత గ్రామంలోని ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థులు తీర్మానం చేసి పంపాలని, ఆ జాబితా ఆధారంగా జిల్లా కమిటీలో సభ్యులుగా నియమిస్తామని అన్నారు. పనులు ఆలస్యం కాకుండా తక్షణమే తీర్మానాలు చేయాలన్నారు. మంజూరు చేసిన నిధులలో ప్రతి సంవత్సరం 5 శాతం ఏదేని జాతీయ బ్యాంకులో భవిష్యత్ అవసరాల కోసం జమ చేస్తామని, 5 శాతం నిధులు జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యా లు వంటి అత్యవసర సమయాలలో వినియోగించేందు కు కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మం తు మాట్లాడుతూ జిల్లాలో ఎ క్కువ శాతం సింగరేణి సంస్థ మినరల్స్ ద్వారానే వచ్చాయ ని అన్నారు. ఈ నిధుల కేటాయింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రధాన మౌలిక వసతులను గుర్తించి, మొదట వాటికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. మైనింగ్ ప్రభావిత ప్రాంతాన్ని రెండు కిలోమీటర్లకే పరిమితం చేయడంతో పలు గ్రామాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలను ధ్వంసం చేసి ఆయా గ్రామాలకు అన్యాయం చేయటం తగదన్నారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. ఈ విషయాలను ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ పంపితే, సింగరేణి ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం జరిగేలా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, జేసీ రాంకిషన్, డీఆర్డీఓ జగత్‌కుమార్‌రెడ్డి, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ ఛైర్పర్సన్లు పులి గీత, మడత రమ తదితరులు పాల్గొన్నారు. -
జియో సిమ్‌లిచ్చారు.. సిగ్నల్ లేదు
కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల్లో అంతరాయాలను నిరోధించేందుకు ప్రభుత్వం జియో హాట్‌స్పాట్‌కు చెందిన రూటర్, సిమ్‌లను పంపిణీ చేసింది. జిల్లాలో తొలి విడతగా 95 ప్రభుత్వ, 8 కస్తూర్బా పాఠశాలలకు అందించింది. కానీ కొన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో జియో నెట్వర్క్ సేవలు అందటం లేదు. కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాల్లో అసలు జియో నెట్ వర్క్‌ను ఆ కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. ములకలపల్లి, దమ్మపేట, పినపాక, టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి వంటి చోట్ల మండల కేంద్రాల్లో తప్ప ఇతర గ్రామాల్లో జియో ఊసే లేదు. ఈ క్రమంలో జియో సిమ్, హాట్స్పాట్లను పంపిణీ చేసినా ఉపయోగంలేకుండా పోయింది. జియో సిగ్నల్స్ లేని చోట ఇతర నెట్వర్క్ సిమ్‌లను ఉపయోగించే అవకాశం లేకపోవడంతో ఇవి వృథాగా మారనున్నాయి. ప్రజాధనమూ ఖర్చయిపోయింది. సమయమూ వృథా.. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్ తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో డిజిటల్ పాఠాల్లో అంతరాయం కలుగుతోంది. పాఠశాలల సమాచారం కూడా ఆన్లైన్లోనే ఎంఈవో, డీఈఓ కార్యాలయాలకు అందజేస్తున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలు అందకపోవడంతో సమాచారం పంపేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మండల కేంద్రాలకు రావాల్సి వస్తోంది. దీంతో విలువైన బోధన సమయం వృథా అవుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ నెట్‌వర్క్‌కు చెందిన జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వైపై హాట్‌స్పాట్ రూటర్‌ను, జియో నానో సిమ్‌లను జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసింది. పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌లకు అనుసంధానం చేసి ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని ఆదేశాలను జారీ చేసింది. కానీ సిగ్నల్స్ లేనికారణంగా మళ్లీ అదే సమస్య ఏర్పడింది. సిగ్నల్స్ ఉంటే ఉపయోగమే.. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. మిగిలిన కొద్దిరోజులు విద్యార్థులకు చాలా అమూల్యమైనవి. మోడల్ టెస్టుల అనంతరం వెనుకబడిన సబ్జెక్టులలో పునశ్చరణ, ముఖ్యమైన పాయింట్లు, బిట్లు, ఇతర సబ్జెక్టు వివరాలను బోధించేందుకు డిజిటల్ తరగతులు చాలా ఉపయోగపడతాయి. సైన్స్, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టులను ప్రాక్టికల్‌గా, యానిమేషన్ చిత్రాల ద్వారా సులభరీతిలో బోధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందచేసిన వైఫై సేవలు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడుతుండగా, మరికొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఉపయోగపపడం లేదు. జిల్లాలో వైఫై సేవలు పాక్షికంగానే మిగిలిపోనున్నాయి. వైఫై సామగ్రిఅందచేసిన పాఠశాలలు ఇవే: కరకగూడెం – 02 కొత్తగూడెం –06 పినపాక –04 లక్ష్మీదేవిపల్లి –04 చర్ల –04 పాల్వంచ –10 దుమ్ముగూడెం –03 బూర్గంపాడు –07 అశ్వాపురం –04 భద్రాచలం –03 మణుగూరు –02 ములకలపల్లి –03 గుండాల –01 దమ్మపేట –07 ఆళ్లపల్లి –01 అశ్వారావుపేట –06 ఇల్లెందు –06 టేకులపల్లి –06 జూలూరుపాడు –04 చండ్రుగొండ –03 అన్నపురెడ్డిపల్లి –02 చుంచుపల్లి –04 సుజాతనగర్ –03 -
దండకారణ్యం జల్లెడ!
మావోయిస్టులు గత పది రోజుల్లో నాలుగుసార్లు పేల్చివేతలు, బెదిరింపులకు పాల్పడ్డారు. జిల్లా సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పోలీస్ బేస్‌క్యాంపులకు అత్యంత సమీపంలోనే ఈ చర్యలకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌తో పాటు కేంద్ర బలగాల సంయుక్త ఆధ్వర్యంలో దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. సాక్షి, కొత్తగూడెం: మూడేళ్లుగా జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు నామమాత్రంగా ఉన్నప్పటికీ సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మాత్రం కొనసాగుతున్నాయి. 2015 నుంచి జిల్లాలో అడపా దడపా పలు చర్యలకు పాల్పడిన మావోయిస్టులు రెండు నెలలుగా భద్రాద్రి జిల్లా చర్ల, దుమ్ముగూడెం, భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనేక విడతలుగా కరపత్రాలు వేశారు. వెంకటాపురం మండలంలో గత డిసెంబరు 4వ తేదీన ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చారు. పోలీసులు గుర్తించి∙ తొలగించడంతో భారీ పేలుడు తప్పినట్లైంది. మావోయిస్టు వారోత్సవాలు, అమరవీరుల వారోత్సవాలు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల సమయంలోనూ కార్యకలాపాలు అంతగా లేవు. అయితే ఈ క్రమంలో పది రోజులుగా మాత్రం చర్ల, దుమ్ముగూడెం, భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలాలకు సరిహద్దుల్లో మన రాష్ట్ర సరిహద్దుకు అతి సమీపంలో రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే రహదారుల పనులను అడ్డగించేందుకు వివిధ విధ్వంసక చర్యలకు దిగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, బస్తర్, సుక్మా, దంతెవాడ జిల్లాలు, ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లాలో రోడ్డు పనులను అడ్డగించేందుకు దాదాపు 150 వరకు వివిధ రకాల యంత్రాలను, వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి జిల్లాకు అనుసంధానమయ్యే రహదారుల పనులను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే నిర్మించిన వంతెనలను పేల్చివేశారు. వారం రోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లోని కుంట వద్ద తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సును పేల్చివేసేందుకు యత్నించారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలో కేంద్ర బలగాలతో పాటు, మూడు రాష్ట్రాల బలగాలు సైలెంట్‌గా కూంబింగ్ చేసేందుకు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వ సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎస్టీఎఫ్(స్పెషల్ టాస్క్ ఫోర్స్), డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్స్), తెలంగాణకు చెందిన యాంటీ నక్సల్ స్క్వాడ్, గ్రేహౌండ్స్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ బలగాలు ఈ ఆపరేషన్లోకి దిగినట్లు సమాచారం. సరిహద్దుల వారీగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఆయా మూడు రాష్ట్రాల బలగాలు, కేంద్ర బలగాలు క్లాష్ కాకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కాగా గత నెల 25వ తేదీన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న, ఆయన భార్య రజిత లొంగిపోవడంతో పాటు ప్రస్తుత మావోయిస్టు చర్యల నేపథ్యంలో సరిహద్దుల్లో కనిపించని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 26న తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం జిల్లాలో ఆకస్మికంగా పర్యటించి వెళ్లడం గమనార్హం. జిల్లాలో మావోయిస్టు చర్యలు.. ∙మావోయిస్టులు ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించే అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, అదేవిధంగా సెప్టెంబరు 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు, డిసెంబరు 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాల సందర్భంగా ఈ మండలాల్లో పోస్టర్లు వెలిశాయి. ఇందులో భాగంగా గత డిసెంబరు 4వ తేదీన వెంకటాపురం మండలంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు మందుపాతర అమర్చారు. 17వ పీఎల్జీఏ వారోత్సవాల్లో భాగంగా పోస్టర్ల కింద మందుపాతర అమర్చారు. దీనిని గుర్తించిన పోలీసులు వెలికితీసి నిర్వీర్యం చేశారు. ∙2015, మే 25న అప్పటి ఉమ్మడి జిల్లాలో ఉన్న (ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా) వెంకటాపురం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కుర్సం బాలకృష్ణను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. ∙2015, అక్టోబరు 14న తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం బాలకృష్ణను హత్య చేశారు. అదేవిధంగా 2017లో జిల్లాలోని దుమ్ముగూడెం మండలం మారాయిగూడేనికి చెందిన ఇద్దరిని అపహరించిన మావోయిస్టులు పది రోజుల తరువాత విడిచిపెట్టారు. జిల్లా సరిహద్దు అవతల ఛత్తీస్‌గఢ్‌లో.. గత డిసెంబరు 22న కాచారం వద్ద కాచారం, గాజులగుట్ట సీఆర్పీఎఫ్ బేస్‌క్యాంపులకు సరుకులు తీసుకెళ్లే వాహనాలతో పాటు రోడ్డు పనులకు సంబంధించిన 30వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. 27న ధర్మపేట లోలెవల్ బ్రిడ్జిని పేల్చారు. 28న రోడ్డు పనులు చేయొద్దని కూలీలను హెచ్చరించారు. 30న దంతెవాడ జిల్లా తోయిలంక వద్ద రోడ్డు పనులు చేస్తున్న జేసీబీ, రోడ్డు రోలర్, పొక్లెయిన్ర్, 2 ట్యాంకర్లు, 2 ట్రాక్టర్లు తగులబెట్టారు. ఈ ఘటనలో రూ.80లక్షల ఆస్తి నష్టం జరిగింది. -
విద్యావాలంటీర్పై ఉన్మాది ఘాతుకం
-
దారుణం : యువతిని చంపి.. ఆత్మహత్య
సాక్షి, కొత్తగూడెం : యువతిని దారుణంగా హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో చోటుచేసుకుంది. దమ్మపేట శివారులోని నెమలిపేట ప్రాథమిక పాఠశాలలో ప్రవళిక అనే యువతి విద్యావాలంటీర్ గా పని చేస్తోంది. కాగా, శనివారం వనమా శ్రీనివాస్ అనే యువకుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తాను కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈవ్‌టీజర్‌ను ఉతికారేసింది
-
ఆపరేషన్ థియేటర్లో త్రాచుపాము
-
వైద్యుల నిర్లక్ష్యం..ఆటోలో ప్రసవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భవతి ఆటోలోనే ప్రసవించింది. వివరాలు..కొత్తగూడెం జిల్లాకేంద్రం మేదరబస్తీకి చెందిన పూజ డెలివరీ నిమిత్తం జిల్లా ఆసుపత్రికి శుక్రవారం ఉదయం పదిన్నర సమయంలో వచ్చింది. ఆసుపత్రికి వచ్చి అర్ధ గంట అయినా డాక్టర్లు పట్టించుకోకపోవడంతో నొప్పులు ఎక్కువై ఆటోలోనే ప్రసవించింది. తల్లీ, బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నారు. మీడియా అక్కడికి రావడంతో హడావిడిగా వైద్య సిబ్బంది బాలింతను చేతులతోనే ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. బాలింతను తీసుకువెళ్లడానికి కనీసం ఓ స్ట్రెచర్ లేకపోవడం గమనార్హం. వైద్యుల నిర్లక్ష్యం పట్ల గర్భిణీ బంధువులు విస్మయం వ్యక్తం చేశారు. పూజకు ఇది రెండో కాన్పు. రెండో కాన్పులో మగబిడ్డ జన్మించాడు. -
బాలింత మృతి: బంధువుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం: వైద్యం వికటించడం వల్లే బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లాలోని టేకులపల్లి మండలం తొమ్మిదో మైలు తండాకు చెందిన తేజావత్ ప్రమీల(20) పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టగా కొద్దిసేపటికే ప్రమీల కన్నుమూసింది. కాగా.. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె మృతిచెందిదని బంధువులు ఆందోళనకు దిగారు. -
ఇంట్లో 50 గుడ్లు పెట్టిన పాము
చుంచుపల్లి: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 గుడ్లు పెట్టిన పామును ఎక్కడైనా చూశారా.. ఓ నాగుపాము 50 గుడ్లు పెట్టింది. ఈ వింత దృశ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. ఈ కాలనీలో నివాసముంటున్న ఎల్ఐసీ ఉద్యోగిని జి. రాజారాణి ఆదివారం ఇంట్లో పనిచేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బుస్ మన్న శబ్దం వినిపించింది. ఆ ఇల్లంతా వేతికి చూడగా ఇంటి ఆవరణలో ఉన్న ఇసుక బస్తాల్లో నాగుపాము గుడ్లను పొదుగుతూ కనిపించింది. భయభ్రాంతులకు గురైనా ఆమె కుటుంబీకులు ప్రాణాధార ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి పామును పట్టుకుని దాని గుడ్లను సురక్షితంగా బయటకు తిసి చూస్తే మొత్తం 50 గుడ్లు ఉన్నాయి. దీంతో స్థానికులు పామును, దాని గుడ్లను చూసేందుకు తరలివచ్చారు. బుసలు కొడుతున్న పామును ట్రస్ట్ అధ్యక్షుడు జిమ్ సంతోష్, సభ్యులు మధు, సూర్యలు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. -
కరెంటుకు.. కొత్త వెలుగు!
కొత్తగూడెం జిల్లాలో సిద్ధమవుతున్న 2 భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ► కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్ నిర్మాణం 70 శాతం పూర్తి ► ఈ ఏడాది డిసెంబర్‌లోగా విద్యుదుత్పత్తి దిశగా చర్యలు.. ► వివాదాలు, అడ్డంకులను అధిగమించిన భద్రాద్రి ప్లాంట్ ► వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పూర్తికి లక్ష్యం రాష్ట్రానికి వెలుగులు అందించేందుకు రెండు భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్) 7వ దశ ప్లాంట్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి కానున్నాయి. ఇదే జిల్లాలోని మణుగూరులో నిర్మిస్తున్న 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్) వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించనుంది. పర్యావరణ అనుమతులు ఆలస్యంగా రావడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కేసుల వల్ల ముందుగా నిర్దేశించుకున్న భద్రాద్రి ప్లాంట్ నిర్మాణ గడువు తీరిపోయింది. గత ఏప్రిల్‌లోనే భద్రాద్రి ప్లాంట్ పనులు ప్రారంభించగా, వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) కొత్త గడువును పెట్టుకుంది. అలాగే దాదాపు 70 శాతం నిర్మాణం పూర్తయిన కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేసేందుకు జెన్కో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ అడ్డంకులు అధిగమించిన భద్రాద్రి.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మూడేళ్ల కింద తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్న సమయంలో, కేవలం 24 నెలల కాలంలో భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘బీహెచ్ఈఎల్’ముందుకు వచ్చింది. అప్పటికే బీహెచ్ఈఎల్ వద్ద 270 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లతో మొత్తం 1,080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు సిద్ధంగా ఉండడంతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం బీహెచ్ఈఎల్ ప్రతిపాదనకు అంగీకరించింది. 24 నెలల్లోపు భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసేందుకు 2015 మార్చి 21న జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం జరిగింది. రూ.7,290.60 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ విద్యుత్ కేంద్రం గత మార్చి 31లోపే పూర్తి కావాల్సి ఉండగా వివాదాలు, ఎన్జీటీ కేసులతో ఈ ప్లాంట్ చిక్కుల్లో పడింది. పర్యావరణ అనుమతులు రావడానికి ముందే జెన్కో నిర్మాణ పనులు చేపట్టడంతో ఎన్జీటీ కేసులు చుట్టుముట్టాయి. సబ్ క్రిటికల్ టెక్నాలజీపై కేంద్ర విద్యుత్ శాఖ ఆంక్షలు ఉండడంతో పర్యావరణ అనుమతులు ఆలస్యంగా లభించాయి. ఈ అవాంతరాలను అధిగమించి గత ఏప్రిల్ 1న పనులను ప్రారంభించగా, ఇప్పటి వరకు 5 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మళ్లీ పనులకు అంతరాయం కలిగింది. రూ.7,290.60 కోట్ల అంచనా వ్యయంలో రూ.5,044 కోట్లను ప్లాంట్ నిర్మాణం కోసం బీహెచ్ఈఎల్కు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే యంత్రాలు, పరికరాల కోసం జెన్కో రూ.1,975.25 కోట్లను బీహెచ్ఈఎల్కు చెల్లించింది. ఈ యంత్రాలు, పరికరాలను ప్లాంట్ నిర్మాణ స్థలానికి రెండేళ్ల కిందే తరలించినా, అడ్డంకుల వల్ల పనులు 5 శాతానికి మించి జరగలేదు. చిమ్నీలు, కూలింగ్ టవర్ల కోసం తవ్విన భారీ గుంతల్లో చేరిన వర్షపు నీటిని బయటకు తోడి మళ్లీ పనులను పునః ప్రారంభించారు. కొత్తగూడెం.. కేవలం మూడేళ్లలో పూర్తి అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి విద్యుత్ ప్లాంటైన 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ విద్యుత్ కేంద్రాన్ని కేవలం మూడేళ్లలో నిర్మించి రికార్డు సృష్టించాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి గతంలో కనీసం 8 ఏళ్ల సమయం పట్టగా, కేటీపీఎస్ 7వ దశను మాత్రం మూడేళ్లలోపు నిర్మించేందుకు జెన్కో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తోంది. రూ.5,548 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మించేందుకు బీహెచ్ఈఎల్తో జెన్కో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 జనవరి 1 నుంచి 24 నెలల్లోపు ఈ ప్లాంట్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.2,634 కోట్ల వ్యయంతో 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. బాయిలర్ పనులు 90 శాతం పూర్తికాగా, టర్బైన్, జనరేటర్ స్టాటర్, కోల్ ప్లాంట్ పనులు సైతం దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. 5 వేల మంది కార్మికులతో రాత్రింబవళ్లు పనులు జరుగుతుండగా, ఈ ఏడాది చివరిలోగా బాయిలర్‌ను లైటప్ చేయాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. ఏవైనా కారణాలతో ఆలస్యమైతే వచ్చే మార్చిలోగా నిర్మాణం పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. మార్చిలోగా భద్రాద్రి లైటప్ చేస్తాం ఎన్జీటీ కేసుతో భద్రాద్రి నిర్మాణం రెండేళ్లు జాప్యమయింది.అయినా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి వచ్చే మార్చిలోగా ఈ ప్లాంట్‌కి సంబంధించిన బాయిలర్లను లైటప్ చేస్తాం. ఇప్పటికే 70% పనులు పూర్తయిన కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వర్షాలతో కొన్ని రోజులుగా అంతరాయం కలుగుతోంది. వర్షాలు తగ్గిన తర్వాత కార్మికుల సంఖ్యను మరింత పెంచి పనుల వేగాన్ని పెంచుతాం. – ప్రభాకర్‌రావు, జెన్కో సీఎండీ -
అనుమతులు లేని ఆస్పత్రి సీజ్
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని వినాయకుడి ఆలయం సమీపంలో ఉన్న సంఘమిత్ర ఆసుపత్రిని వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రిని సీజ్ చేయడానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, సిబ్బంది రాగా ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్ల బంధువులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల బందోబస్తు మధ్య ఆసుపత్రి ప్రధాన ద్వారానికి అధికారులు తాళం వేసి సీల్ వేశారు. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నట్లు సమాచారంతోనే అక్కడికి వచ్చి, తనిఖీలు నిర్వహించి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
► ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో రూ.40.15 కోట్లతో 2,500 యూనిట్లు మంజూరు ► 31వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కొత్తగూడెంరూరల్: జిల్లాలోని ఎస్సీ యువతీ, యువకులకు 2017–18 ద్వారా బ్యాంకు రుణాలు పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎస్సీ కార్పొరేషన్ కోసం ఆన్లైన్ చేసుకుని ఉంటే ఆ దరఖాస్తును రెన్యువల్ చేసుకోవాలి. జిల్లాలో 2,542 యూనిట్లకు గాను రూ.40.15 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇందులో రూ.లక్ష రుణానికి రూ.80 వేలు సబ్సిడీ ఇస్తుండగా, రూ.2 లక్షల రుణానికి రూ.70 వేలు సబ్సిడీ వర్తిస్తుంది. రూ.2 లక్షలు పైబడిన యూనిట్‌కు రూ.60 వేలు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షలకు మించకుండా బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు గలవారు అర్హులుగా ప్రకటించారు. ఈనెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్‌కార్డు, సాంకేతిక విద్యార్హత జతపర్చి పట్టణానికి చెందిన అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్‌కు, మండలాల అభ్యర్థులు ఎంపీడీఓకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తరువాత, వాటికి సంబంధించి జిరాక్స్ పత్రాలు ఇవ్వాలి. జిల్లాలో జనాభా ప్రాతిపదికన నాలుగు మున్సిపాలిటీలు, ఇతర మండలాలకు యూనిట్ల కేటాయింపు రెండుమూడు రోజుల్లో జరగనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహేశ్వర్ తెలిపారు. గతంలో 2016–17కు సంబంధించిన యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని, త్వరలో వాటికి సంబంధించిన సబ్సిడీని ఎకౌంట్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్సీలు ఉపయోగించుకుని స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మహేశ్వర్ పేర్కొన్నారు. -
సింగరేణి కార్మికుల నిర్భంధం, ఉద్రిక్తత
కొత్తగూడెం: సింగరేణి సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. అధికారులు సమ్మె విచ్ఛిన్నానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక నేతలు సైతం అదేరీతిలో తిప్పి కొడుతున్నారు. నిరసనకు దిగుతున్న కార్మికులను నిర్బంధించి దూర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. తాజాగా బుధవారం ఉదయం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(autuc)కు చెందిన ఇద్దరు నాయకులు 5బీ పీవీకేలో షాప్ట్ హెడ్ మీదకు ఎక్కి దూకుతామని బెదిరిస్తున్నారు. కూసన వీరభద్రం, రఘు అనే యూనియన్ నేతలు, సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తున్న అధికారుల తీరుకు నిరసనగా కేజీ టవర్ ఎక్కి దూకుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీ, గిరిజనులు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. హరితహారం పేరున ఆదివాసీ, గిరిజన పేదల భూములు గుంజుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని, రైతులపై అక్రమంగా బనాయించిన కేసులు రద్దు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. అలాగే 10 వేల రూపాయల ఆర్దిక సాయం అందించి, గిరిజన, దళిత కుటుంబాలకు భూమి పంచాలని కోరారు. -
ఆసరా.. ఆలస్యం
♦ రెండు నెలలుగా ఇదే పరిస్థితి ♦ ఈసారి బ్యాంకుల విలీనంతో జాప్యం సాక్షి, కొత్తగూడెం: ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది రాష్ట్రంలోని ఆసరా పింఛనర్ల పరిస్థితి. కుటుంబపరంగా ఎటువంటి ఆసరా లేని వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 పింఛన్ ప్రతినెలా ఏదో ఒక కారణంతో ఆలస్యమవుతూనే ఉంది. జూన్ 6వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని 36,37,949 మంది పింఛనర్లకు ఏప్రిల్ నెల పింఛన్ ఇవ్వకపోవడంతో తమ కుటుంబ అవసరాలు తీరక వృద్ధ పింఛనర్లు, వికలాంగులు, వితంతువులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రంలోని ఎస్‌బీహెచ్‌తో సహా ఐదు ప్రధాన బ్యాంకులు విలీనం కావడం వల్ల ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారడం, బ్యాంకుల కంప్యూటర్లపై పనిఒత్తిడి పెరగడంతో సర్వర్లు మొరాయించడం వంటి సాంకేతిక కారణాల వల్ల బ్యాంకుల్లో ఆసరా పింఛన్లు ఇంకా జమకాని పరిస్థితి నెలకొంది. ఈ సాంకేతిక సమస్యలు ఎప్పుడు తొలగుతాయో, తమ పింఛన్ ఎప్పుడు బ్యాంకులో పడుతుందో తెలియక పింఛనర్లు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో 13,59,597 మంది వితంతు, 13, 31,103 మంది వృద్ధాప్య, 4,65,047 మంది వికలాంగులు, 34,728 మంది చేనేత కార్మికులు, 58, 372 మంది గీత కార్మికులు, 3, 48, 301 మంది బీడీ కార్మికులు, 40,801 మంది ఇతర పింఛనర్లు ప్రతినెలా ఆసరా పింఛన్ అందుకుంటున్నారు. బ్యాంకుల విలీనం పేరుతో ఈసారి పింఛన్ ఆలస్యం కాగా.. గత మార్చి నెల ఆసరా పింఛన్‌ను ప్రభుత్వం నుంచి బ్యాంకుల్లో నగదు జమ కాలేదన్న కారణంతో ఆ పింఛన్ ఏప్రిల్ 20 నుంచి 22 తేదీల్లో పడాల్సిన డబ్బును మే 5వ తేదీన పంపిణీ చేశారు. ఇక ఏప్రిల్ నెల పింఛన్ మే 20 నుంచి 22వ తేదీలోగా బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా, జూన్ 5 వరకు రాలేదు. అయితే కేవలం పింఛన్‌పైనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్న లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇప్పటికీ పింఛన్ అతీగతీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల చెల్లింపులు బ్యాంకులకు అనుసంధానం చేయడంతో తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పింఛన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఆసరా’తో పింఛనర్లు తమ నెలవారీ ఖర్చులను కొంతవరకైనా తీర్చుకునే అవకాశం ఉంటుంది. నిత్యావసరాలతోపాటు ఆస్పత్రులకు ఈ పింఛన్ నుంచే ఖర్చు చేస్తుంటారు. అయితే గతంలో పింఛన్లను నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఇచ్చేవారు. కానీ గత రెండేళ్లుగా బ్యాంకు ఖాతాల్లో మాత్రమే పింఛన్లను జమ చేస్తున్నారు. దీనివల్ల అసలైన లబ్ధిదారులకే పింఛన్ లభించే అవకాశం ఉందనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్ల కోసం బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఎవరో ఒకరిని బతిమాలి వారి సహాయంతో వెళ్లి పింఛన్లు తెచ్చుకుంటున్నారు. -
వారసత్వ ఉద్యోగాలు సాధిద్దాం
కొత్తగూడెం : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సింగరేణిలో సమ్మె చేసైనా వారసత్వ ఉద్యోగాలు సాధిద్దామని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం పీవీకే 5ఇంక్లైన్ గనిలో హెచ్ఎంఎస్ పిట్ సెక్రెటరీ రాంశంకర్ కోరి ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్‌కు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ హాజరై మాట్లాడారు. 2002 సంవత్సరంలో వారసత్వ ఉద్యోగాలు పూర్తిగా పోవుటకు ఒక్క ఏఐటీయూసీ నుంచి ఏడుగురు సంతకాలు పెట్టి పోగొట్టారన్నారు. ఈనెల 27వ తేదీన ఆర్ఎల్సీ దగ్గర వారసత్వంపై చర్చలు విఫలమైతే కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, నజీర్, అజీమ్, శ్రీనివాస్, క్రిష్ణమూర్తి, సుధాకర్, సహదేవ్, చిరంజీవి, దేవసహయం, రాము పాల్గొన్నారు. -
జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, కొత్తగూడెం: భగభగ మండే భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా కూడా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం. ఉదయం 7 గంటల నుంచే ఎండవేడి మొదలవుతోంది. మధ్యాహ్నం సమయానికి పట్టణం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారిపోతుండటంతోపాటు షాపులన్నీ మూతపడుతున్నాయి. దీంతో వ్యాపారాలు సైతం మందగించాయి. సాయంత్రం 6 గంటలు దాటితే తప్ప ప్రజలెవరూ బయటకు వచ్చేందుకు మొగ్గు చూపడంలేదు. మరోవైపు వేడి గాలుల కారణంగా జిల్లాలో వడదెబ్బమృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతీరోజు కనీసం నలుగురు వడదెబ్బ కారణంగా మృతిచెందుతున్నారు. జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు 23 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు చెప్తుండగా, ఒక్కరు కూడా వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారిక లెక్కల్లో లేకపోవడం గమనార్హం. ఎండలు విపరీతంగా పెరుగుతున్నా చలివేంద్రాల సంఖ్య పెరగడంలేదు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని, ఇటు ఉన్నతాధికారులు, మరోవైపు ప్రజా ప్రతినిధులు ఆదేశాలు జారీ చేసినా వారు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని చలివేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ ఊసు కన్పించడంలేదు. ఇక కొత్తగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక్క చలివేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మే నెల ముంచుకొస్తున్నా.. రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నా అధికారుల్లో మాత్రం చలనం రావడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎండాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు సమావేశాలు తప్ప ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. -
అరుదైన వనమూలికలతో హెర్బల్ నర్సరీ !
-
కొత్తగూడెం జిల్లాలో వాన బీభత్సం
-
కొత్తగూడెంలో గాలి,వాన బీభత్సం
కొత్తగూడెం : జిల్లాను శుక్రవారం భారీ గాలి, వాన కుదిపేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు వృక్షాలు కూలిపోయాయి. మున్సిపాలిటీ 29 వ వార్డులో గాలివాన బీభత్సానికి భారీ వృక్షం నేలకూలి విద్యుత్ తీగలపై పడటంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ లైన్ల కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రైటర్‌బస్తీలో గోడ కూలడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. లక్ష్మీదేవిపల్లిలో మరో భారీ మర్రి వృక్షం హోటల్‌పై కూలడంతో ఒకరికి గాయాలయ్యాయి. రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పంటపొలాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసిపోయింది. ఎర్రగుంట శాంతినగర్‌కు చెందిన మంద దుర్గమ్మ(50) అనే మహిళపై పిడుగు పడటంతో మృతిచెందింది. చిన్నలక్ష్మి అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. -
దీపం అంటుకొని దంపతుల మృతి
కొత్తగూడెం: దేవుని విగ్రహాల ముందు ముట్టించిన దీపం అంటుకుని జరిగిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోశాలు(58), వెంకమ్మ(54) దంపతులు పెట్రోల్, కిరోసిన్ విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఇంట్లో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కిరోసిన్ పై పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వెంకమ్మ అక్కడికక్కడే మృతి చెందగా...పోశాలుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ఆయన మృతి చెందాడు. అగ్నిప్రమాదంలో దంపతుల మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
టీడీపీ నేత కోనేరు దీక్ష భగ్నం
కొత్తగూడెం: పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా కొత్తగూడెం బస్టాండు సెంటర్లో టీడీపీ నేత కోనేరు సత్యనారాయణ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దీక్షా స్థలిని ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అడవిలో యువతి సజీవదహనం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి సమీపంలోని అడవిలో ఓ యువతిని సజీవదహనం చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జాకారం గ్రామానికి చెందిన ఎస్తి రాణి(18)గా గుర్తించారు. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆమె అదృశ్యమైంది. బుధవారం సజీవదహనమై కనిపించింది. పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్మగ్లర్ల దందా
-
థింక్ డిఫరెంట్ : సరికొత్త 'క్లచ్ సైకిల్' ఆవిష్కరణ
-
అంబరాన్నంటిన బాలోత్సవ్
► వ్యర్థానికి అర్థం చెప్పిన చిన్నారులు ► ఆలోచింపజేసిన కార్యక్రమాలు ► ఆకట్టుకున్న ప్రదర్శనలు సాక్షి, కొత్తగూడెం: బాలల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి.. వారిలోని ప్రతిభా పాటవాలను చాటిచెప్పేందుకు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహిస్తున్న బాలల పండగ బాలోత్సవ్‌కు రెండో రోజైన శుక్రవారం అనూహ్య స్పందన లభించింది. దాదాపు 7 రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు వివిధ అంశాల్లో తమ ప్రతిభను చాటేందుకు బాలోత్సవ్‌ను వేదికగా చేసుకున్నారు. కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన 14 వేదికలపై జూనియర్, సీనియర్ విభాగాలకు పోటీలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం కథారచన, భరతనాట్యం, కూచిపూడి, నీతిపద్యాలు, ఏకపాత్రాభినయం, ఫోక్ డాన్స, ఫ్యాన్సీ డ్రెస్, స్పెల్‌బీ, సినీ, లలిత, జానపద గీతాలు, క్విజ్, లేఖారచన, వ్యర్థంతో అర్థం, నాటికలు నిర్వహించారు. అనేక మంది విద్యార్థులు వ్యర్థ వస్తువులతో అద్భుతాలు సృష్టించి వేదికపై ప్రదర్శించడం, వాటి ప్రయోజనాలను వివరణాత్మకంగా విశ్లేషించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎందుకూ పనికిరావనుకున్న అరటి తొక్కలను ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాన్ని ఇల్లెందు మండలం మాదారం పాఠశాలకు చెందిన విద్యార్థులు వివరించారు. అరటి తొక్కను రెండు రోజులపాటు నానబెట్టి, అనంతరం పెరట్లో పెరుగుతున్న మొక్కలకు ఔషధంగా వేస్తే అవి అద్భుతంగా పెరుగుతాయని వివరించిన తీరు ఆకట్టుకుంది. ఇక చెత్త కాగితాలతో తమకేం పని అనుకునే వారికి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో.. పాల్వంచకు చెందిన డీఏవీ పాఠశాల విద్యార్థులు వివరించారు. చిత్తు కాగితాలు, వాడి పడేసిన ఇంజక్షన్ బాటిళ్లతో చీకటి గదుల్లో వెలుగులు నింపవచ్చని నిరూపించారు. వీటిని బెడ్ ల్యాంప్‌లుగా ఎలా చేయాలో చూపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాలబాలికలు చేసిన జానపద, కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ ఖమ్మంలోని జాన్సన్ కిడ్స పాఠశాలకు చెందిన విద్యార్థి చేసిన నృత్యం ఆకట్టుకుంది. అలాగే ఓ చిన్నారి ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకు తెలియ దురా’ పాటకు చేసిన నృత్యం ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్, తమ వేషభాషల తో, హావభావాలతో ఇచ్చిన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరింపజేశాయి. బాలోత్సవ్ కన్వీనర్ రమేష్‌బాబు అన్ని వేదికలను పర్యవేక్షిస్తూ.. కార్యక్రమాలను వీక్షించారు. -
భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన ఎంపీ కవిత
-
ఒక స్వప్నం ఒక కుటుంబం
బాలోత్సవ్ మంచి పని చేయాలని అందరికీ ఉంటుంది. ఆలోచన గొప్పదే! కానీ కార్యరూపం దాల్చాలంటే... ఆ స్వప్నానికి ఒక కుటుంబం తోడు కావాలి. అది భార్య పిల్లలు అమ్మ నాన్నే కాదు... సమాజం అన్న కుటుంబం కావాలి! కొత్తగూడెంలో రమేశ్‌బాబు పిల్లలకి చదువులే కాదు, సృజనాత్మక పోటీలు అవసరమని ఒక వేదికను సమకూర్చారు. అంతే! సమాజంలోని కుటుంబాలన్నీ ఆ వేదికకు తోరణాలు కట్టాయి. అన్నీ రోడ్లు రోమ్కు దారితీస్తాయో లేదో కాని నవంబర్ వచ్చిందంటే చాలు అన్ని స్కూళ్లు కొత్తగూడెంకే దారి తీస్తాయి. నవ్వే పిల్లలు, ఉత్సాహంగా చేతులు ఊపే పిల్లలు, కళ్లు నక్షత్రాల్లా మెరిసే పిల్లలు... అత్యద్భుతమైన ప్రతిభను తమలో నింపుకున్న పిల్లలు... తమకు ఇంత ప్రతిభ ఉందని ఏమాత్రం తెలియని పిల్లలు వీరంతా కొత్తగూడెం వచ్చి తోటి పిల్లలను కలుస్తారు. పోటీల్లో కలబడతారు. గెలిచి ఆనందపడతారు. ఓడిపోయి మరుసటి సంవత్సరానికి కావలసిన పట్టుదలను ఓడిపోవడంలోని ఘనతను స్వీకరించి వెళతారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక సాదాసీదా పట్టణం ఇలాంటి వినూత్నమైన విన్యాసానికి పూనుకోవడం ఈ పిల్లల వేడుకను 24 ఏళ్లు నిర్వహించి 25వ ఏట నిర్వహించుకునే స్థితికి ఎదగడం ఏమాత్రం ఆషామాషీ కాదు. ఎంతో పట్టుదల, వాత్సల్యం, ప్రజల సహకారం, పిల్లల ఉత్సహం తోడైతేనే ఇది సాధ్యం అవుతుంది. 1991లో మొదలైన వేడుకలు స్కూళ్లంటే చదువులు... హోమ్‌వర్క్‌లు... మార్కులు... ర్యాంకులు... ఇవి మాత్రమే కాదు. నిజానికి ఇవి పిల్లల జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆ సంగతి అందరూ మర్చి పోతున్నారు అనిపించింది కొత్తగూడెంకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబుకు. కొత్తగూడెం క్లబ్‌కు కార్యదర్శి అయిన వెంటనే క్లబ్ ద్వారా పిల్లలకు సృజనాత్మక కళల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అనుకున్నారాయన. చక్కటి పాట పాడకుండా, గొప్పగా వేణువు ఊదకుండా, హాయిగా తోటి బాలలతో బృందనృత్యం చేయకుండా గడిచే బాల్యం బాల్యమే కాదనేది ఆయన భావనే. పిల్లలకు చదువు మాత్రమే నూరి పోయాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనాధోరణిలో మార్పు తేవడానికి కూడా ఆయన సాంస్కృతిక పోటీలు అవసరమని భావించారు. అలా మొదలయ్యిందే ‘బాలోత్సవ్’. 1991లో ఏ ముహూర్తాన ఆ ఉత్సవం మొదలైందో కాని పదులు వందల సంఖ్యల్లో పాల్గొనే వేడుక నుంచి నేడు దాదాపు 15000 మంది బాలలు పాల్గొనే ఉత్సవంగా అది ఎదిగింది. అందరూ గర్వపడే స్థాయికి చేరింది. ఈసారి నాలుగురోజుల పాటు... ప్రతి సంవత్సరం 3 రోజులపాటు నిర్వహించే బాలోత్సవ్ ఈసారి రజతోత్సవం సందర్భంగా 4 రోజులపాటు జరగనుంచి. వివిధ రంగాలలో నిష్ణాతులుగా పేరొంది, బాలలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే అగ్రగణ్యులను ఈ ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. ప్రముఖ కవి గూడ అంజయ్య కవితలపై పోటీలు నిర్వహించనున్నారు. తొలుత భరతనాట్యం, వక్తృత్వం, క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలకే పరిమితమైన బాలోత్సవ్ ఇప్పుడు బాలల చేత వీధినాటికలు వేయించి వాటిని విశ్లేషించడం, షార్ట్‌ఫిల్మ్స్ (లఘుచిత్రాలు) చూపించి వాటి ప్రాధాన్యతను విశ్లేషించడం వంటి 29 రకాల పోటీలు నిర్వహిస్తున్నది. మొత్తం 29 అంశాల్లో 48 విభాగాలలో పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్లబ్ ప్రాంగణంలో 12 వేదికలు ఏర్పాటు కానున్నాయి. ఈ వేదికలపై ఏకకాలంలో పోటీలు జరుగుతుంటాయి. ప్రతి ఇల్లూ విడిదే... కొత్తగూడెంలో పెద్ద పెద్ద హోటళ్లు లేవు. వేలాది గదులు ఉన్న బసలు లేవు. మరి ఇంత పెద్ద వేడుక ఎలా జరుగుతున్నట్టు? కొత్తగూడెం వాసుల వల్లే. అక్కడ బాలోత్సవ జరిగే ఈ నాలుగురోజులూ ప్రతి ఇల్లూ ఒక విడిది గృహం అయిపోతుంది. ప్రతి నివాసం ఒక ఆత్మీయ సదనం అయిపోతుంది. బాలోత్సవ్‌కు సహకరించేదుకు ముందుకు వచ్చిన కుటుంబాలు తమకు కేటాయించిన పిల్లలకూ వారి తల్లిదండ్రులకూ తమ ఇంట్లోనే విడిడి కల్పిస్తారు. వారికి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తారు. అంతేకాదు తమ పిల్లలను సైతం క్రమం తప్పకుండా ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా కొత్తగూడెం వాసులు ఉత్సాహపరుస్తూ ఈ వేడుకు విజయం కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈసారి బాలోత్సవ్ పోటీ అంశాలు 1. చిత్రలేఖనం (స్పాట్ డ్రాయింగ్); 2. తెలుగు మాట్లాడుదాం; 3. వీధినాటికా విశ్లేషణ (స్ట్రీట్ ప్లే ఎనాలసిస్); 4. లఘుచిత్ర సమీక్ష (షార్ట్ ఫిలిం రివ్యూ); 5. కవితా రచన; 6. కథారచన; 7. కథా విశ్లేషణ; 8. భరత నాట్యం; 9. కూచిపూడి; 10. పేరిణి నాట్యం (లాస్యం - తాండవం, సోలో); 11. జానపద నృత్యం; 12. క్విజ్; 13. సినీ, లలిత జానపద గీతాలు; 14. విచిత్ర వేషాధారణ (ఫ్యాన్సీడ్రెస్); 15. అనగా అనగా.. (కథచెబుతా వింటారా!); 16. నీతి పద్యం; 17. లేఖారచన; 18. వ్యర్థంతో అర్థం 19. వాద్య సంగీతం (ఇన్స్ట్రుమెంటల్ మ్యూజికల్); 20. గ్రూప్ డాన్స్ జానపదం (అందరికీ); 21. నాటికలు; 22. మట్టితో బొమ్మలు చేద్దాం; 23. ఏకపాత్రాభి నయం 24. స్పెల్ బీ; 25. వక్తృత్వం (ఇంగ్లీష్, తెలుగు); 26. గ్రూప్‌డాన్స్ భరతనాట్యం (అందరికీ); 27. గ్రూప్‌డాన్స్ కూచిపూడి నృత్యం (అందరికీ); 28. సంప్రదాయం 29. గూడ అంజయ్య గీతాలు పిల్లల ముఖాల్లో సంతోషం చూశా! మీరొక డాక్టరు. మీకు ఉంటే పేషంట్లతో అనుబంధం ఉండాలి. మరి పిల్లలంటే ఎందుకింత ప్రేమ.... రమేశ్: నేను వృత్తిరీత్యా డాక్టర్నే అయినా నాలోనూ ఒక తండ్రి తాత ఉన్నాడు. నేను కూడా బాల్యాన్ని గడిపి పెద్దవాణ్ణయ్యాను. మా అమ్మది మధిర దగ్గర మహదేవపురం. నాన్నది తెనాలి దగ్గర చెన్నపాలెం. నేను రైతు కుటుంబంలో జన్మించాను. పల్లెటూరూ ఏటి గట్టున స్వేచ్ఛగా ఆడుకోవడం ఇలాంటి బాల్యం నాకు తెలుసు. రాను రాను ఆ బాల్యం మిస్సవడం గమనించాను. పాఠశాలలు కారాగారాల్లా మారాయి. చదువుతో పాటు ఆటా పాటా కళ ఉండేదే నిజమైన పాఠశాల. పిల్లలు స్కూళ్లలో ఏవైతే మిస్సవుతున్నారో అవి బాలోత్సవ్‌లో ఉండాలని ఈ ఉత్సవాన్ని మొదలెట్టాం. ఈ పనిలో మీకు తోడు నిలిచింది ఎవరు? చటర్జీగారని ఒక లెక్చరర్ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రిటైర్డ్ అధ్యాపకులు శర్మగారు, సింగరెణి ఉద్యోగులు చంద్రశేఖర్, మాధవరావు గార్లు ఇంకా చాలామంది ఈ పనిలో నాకు సపోర్ట్‌గా ఉన్నారు. 25 సంవత్సరాలలో మీకు బాగా సంతృప్తినిచ్చిన సంవత్సరం ఏది? ప్రతి సంవత్సరం సంతృప్తినిచ్చింది. దానికి కొలబద్దగా పొగడ్తలని కాకుండా పిల్లల మొహాల్లో ఆనందాన్ని మేం తీసుకుంటాం. ఈ ఈవెంట్‌కు వచ్చిన పిల్లలు ఎవరూ డిజప్పాయింట్ అవరు. ఈ బాలోత్సవ్ వల్ల మీరేమి సాధించారు? ఒక పిల్లవాడు వెయ్యి మంది పిల్లల ఎదుట నిలుచుని ఒక కథ చెబుతాయి. ఒక అమ్మాయి పాట పాడుతుంది. ఇంకొందరు ఒక నాటకం వేస్తారు. ఇవన్నీ ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేవే. పర్సనాల్టీ డెవలప్మెంట్ అంటే కొటేషన్స్ చెప్పడం కాదు. ఇలాంటి పనులు చేయాలి. బాలోత్సవ్ సాధించినది మానసిక ఫలితాలను. అవి పైకి కనిపించేవి కాదు. సాహిత్యాన్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టున్నారు? అవును. మేము కథారచనను, కథాపఠనాన్ని ఒక ముఖ్యమైన పోటీగా బాలోత్సవ్‌లో నిర్వహిస్తాం. పిల్లలు అప్పటికప్పుడు ఒక కథ రాస్తారు. చాలా బాగా రాస్తారు. వాసిరెడ్డి నవీన్, ఓల్గా, వాడ్రేవు వీరలక్ష్మిదేవి, చంద్రలత వంటి సాహిత్యకారులు నేరుగా బాలోత్సవ్‌లో పాల్గొని పిల్లలతో సంభాషించడంమంచి రిజల్ట్స్‌కు కారణం. ఈసారి ఎన్నిరాష్ట్రాల నుంచి పిల్లలు వస్తున్నారు? తెలుగు మాతృభాషగా కలిగినవారు ఏ రాష్ట్రంలో ఉన్నా పాల్గొనవచ్చని చెబుతున్నాం. ఈసారి ఆంధ్ర, తెలంగాణ, చత్తిస్గఢ్, డిల్లీ, కర్నాటక, పాండిచ్చేరి, గుజరాత్... రాష్ట్రాల నుంచి పిల్లలు పాల్గొంటారు. ప్రతి రోజూ సుమారు ఎంతమంది పాల్గొంటారు? ఎన్నివేలో సరిగ్గా చెప్పలేను. కాని కొత్తగూడెం వాళ్లు కాకుండా సుమారు 7000 మంది ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎందుకంటే మేము అంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు రాత్రికి వెళ్లిపోగా 5000 మంది రాత్రి పూట భోజనం చేస్తారు. డబ్బు ఎలా చేస్తారు? ఎవర్నీ రూపాయి అడగం. మా పని తెలిసి తమకు తాము ఇచ్చేవారే అందరూ. కెసిపి సిమెంట్స్ ఇందిరాదత్గారు, ఆగ్రోటెక్ సాంబశివరావుగారు ముఖ్యులు. మా అన్న కొడుకు శ్రీనివాసరావు - బాబాయ్... నువ్వు మంచిపని చేస్తున్నావు భోజనం ఖర్చులు నేను చూసుకుంటాను అని వాడే చూసుకుంటున్నాడు. దీని కొనసాగింపు ఏమిటి? బాలోత్సవ్ ఒక్క కొత్తగూడెంలోనే కాదు ప్రతి ఊళ్లోనూ జరగాలని నా కోరిక. ప్రతి ఊళ్లోనూ పిల్లలకు ఇలాంటి వేదికలు కావాలి. మమ్మల్ని చూసిన తర్వాత భద్రాచలంలో, మధిరలో చేస్తున్నారు. కాకినాడలో భారీగా బాలోత్సవం జరుగుతోంది. ఇక మీదట చిలుకలూరిపేట, విజయవాడ, గుంటూర్లలో చేయడానికి ఆ ప్రాంతవాసులు ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? -
కొత్తగూడెంలో సాంకేతిక విశ్వవిద్యాలయం
నవంబర్ ఆఖరులోగా ప్రభుత్వానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్సీహెచ్ఈ) నిర్ణయించింది. గనులు, ఖనిజాలకు సంబంధించిన పరిశోధనలు, అధ్యయనాలకు కేంద్రంగా దీన్ని కొనసాగించాలని భావిస్తోంది. ధన్‌బాద్ ఐఐఎం తరహా లో ఏర్పాటు చేసే ఈ వర్సిటీకి కొత్తగూడెం అనువైన ప్రాంతమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమావేశ మందిరంలో టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్ పాపిరెడ్డి, ప్రొఫెసర్ వెంకటాచలం, కార్యదర్శి శ్రీనివాసరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ ఏర్పాటుకు సింగరేణి, కోల్ ఇండియా సంస్థలు సహకరించనున్నాయి. ప్రత్యేక సాంకేతిక వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ వీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు చర్చించారు. వర్సిటీని కొత్తగూడెంలో ఏర్పాటు చేయడమే సరైందని సభ్యులు భావించారు. డిప్లమో నుంచి పరిశోధనల వరకు అన్ని రకాల కోర్సులు ప్రవేశపెట్టాలని, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. విద్యాకేంద్రంగా ఉన్న ప్రాంతంలోనే పరిశ్రమల హబ్ అభివృద్ధి సాధ్యమన్నారు. వర్సిటీ ఏర్పాటుకు సభ్యులంతా ఏక గ్రీవంగా మద్దతు పలికారు. నవంబర్ ఆఖరులోగా వర్సిటీ ఏర్పాటుపై కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రామవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొత్తగూడెం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో ముందు చక్రం ఊడిపోవడంతో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరిలో మట్టపర్తి అక్షయ(6) అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో ఆటోలో 9 మంది ఉన్నారు. -
భవనం.. భయం భయం!
శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలు యజమానులకు ‘మున్సిపల్’ నోటీసులు తర్వాత పట్టించుకోని అధికారులు వర్షాలకు కూలుతాయేమోనని పరిసర ప్రజల ఆందోళన కొత్తగూడెం : జోరుగా కురుస్తున్న వర్షాలు.. కాలంతీరిన భవనాలు.. నానిన గోడలు.. శ్లాబులు.. ఎప్పుడు కూలుతాయో తెలియని అయోమయం.. ఇలా పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇదే తరహా ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అయినప్పటికీ పాత భవనాల కూల్చివేత విషయంలో అధికారుల్లో చలనం కనిపించడం లేదు. కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత పట్టించుకునే నాధులే కరువయ్యారు. పురాతన భవనాలు ప్రజలను వణికిస్తున్నాయి. కాలంతీరిన భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని పురాతన భవనాల గోడలు నానిపోయాయి. కొన్ని భవనాల గోడల్లో మొక్కలు పెరిగిపోయి దెబ్బతినగా.. మరికొన్ని పాక్షికంగా కూలిపోయి ఉండటంతో ఎప్పుడు కూలిపోతాయోనని ప్రజలు భయాందోâýæనకు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరిన పాతకాలం భవనాలు వరుసగా కూలిపోయి.. ప్రమాదాలు సంభవిస్తుండటంతో ఇక్కడి ప్రజల్లో కూడా ఇదే భయాందోâýæన కొనసాగుతోంది. పాత భవనాలను ఎక్కడికక్కడ కూల్చివేయాలని అటు ప్రభుత్వం ఆదేశించినా.. ఇటు ప్రజలు విజ్ఞప్తులు చేసినా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయ ఒత్తిâýæ్లకు తలొగ్గి పాత భవనాల జోలికి వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. నోటీసులిచ్చి వదిలేస్తున్న అధికారులు ఖమ్మం జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో గల పురాతన భవనాలను అధికారులు గుర్తించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 25, ఇల్లెందులో 30, మధిరలో 13, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 67 భవనాలను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. వాటి యజమానులకు నోటీసులు జారీ చేసి ఏళ్లు గడుస్తున్నాయి. కానీ.. ఇప్పటివరకు వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లలో నివసించే ప్రజలు భయాందోâýæనలకు గురవుతున్నారు. ఇప్పటిౖకెనా అధికారులు స్పందించి గుర్తించిన భవనాలను కూల్చివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి పట్టణంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. రెండేâýæ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని మేదరబస్తీలో పాతకాలం భవనం కూలిపోవడంతో.. అందులో నివాసం ఉంటున్న వారిలో తల్లితో సహా ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ పురాతన భవనం పాక్షికంగా కూలింది. అయితే ఆ భవనం గాంధీ జయంతి రోజు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం పక్కనే మరో భవనంలో బ్రాందీ షాపు ఉండటం.. ప్రతిరోజు అక్కడ వందలాది మందితో రద్దీగా ఉంటుంది. గాంధీ జయంతి కావడంతో వై¯Œ్స బంద్ ఉండటంతో జనసంచారం లేదు. దీంతో భవనం కూలినప్పటికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కూలిన భవనానికి చెందిన కొన్ని శిథిలాలు వై¯Œ్సకు చెందిన బాత్రూమ్లో సైతం పడటం గమనార్హం. ప్రమాదకరంగా ఉంటే తొలగిస్తాం.. మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలను ఇప్పటికే గుర్తించాం. ఇప్పటికే భవనాల యజమానులకు నోటీసులు అందజేశాం. వాటిని యజమానులు తొలగించని పక్షంలో ప్రమాదకరంగా మారితే భవనాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూల్చివేస్తాం. – సైఫుల్లా అహ్మద్, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం -
సమంత సందడి
-
డబుల్ రెంట్
‘కొత్త’ జిల్లాలో పెరిగిన అద్దెలు భవనాల కోసం అధికారుల పరుగులు ఇళ్ల వెతుకులాటలో ప్రభుత్వ ఉద్యోగులు మెయిన్ రోడ్డు వెంట కనిపించని ఖాళీ భవనాలు కొత్తజిల్లాకేంద్రం కొత్తగూడెంలో ఇంటి అద్దె మోత మోగుతోంది. నిన్నమొన్నటి వరకు నామమాత్రపు కిరాయికి ఇళ్లను అద్దెకు ఇచ్చిన వారు ఇప్పుడు ఏకంగా డబుల్ రెంట్ వసూలు చేస్తున్నారు.కాస్త అదనపు సౌకర్యాలు కల్పిస్తే దానికి తగినట్లే కిరాయినీ పెంచేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగులు ఉండేందుకు ఇళ్లు కావాలని తిరుగుతుండటంతో ఇదే అదనుగా రెంట్ రెట్టింపు చేస్తున్నారు. మెయిన్‌రోడ్డు వెంట ఎక్కడ కూడా ఖాళీ భవనాలంటూ కనిపించకుండా పోయాయి. టులెట్ బోర్డు కనిపిస్తే చాలు పరుగులు తీస్తున్నారు. కొత్తజిల్లా ఆవిర్భావం నాటికి ఈ రెంట్లు మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. - కొత్తగూడెం పట్టణం, మేజర్ పంచాయతీల్లో గృహాల సంఖ్య ------------------------------------------------------- కొత్తగూడెం 19,100 లక్ష్మీదేవిపల్లి 4,700 చుంచుపల్లి 4,000 ------------------------------------------------------ 27,800 ------------------------------------------------------ కొత్తగూడెం జిల్లా కేంద్రం కానుండటంతో ఇక్కడే అన్ని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రైవేటు అద్దె భవనాలు అవసరమయ్యాయి. అంతేకాక ప్రైవేటు సంస్థలు, వ్యాపారులు సైతం తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో వివిధ కమర్షియల్ భవనాలతోపాటు ఇళ్లకు కూడా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాల కోసం అనువుగా ఉన్న ప్రైవేటు భవనాలను వెతికేందుకు ఆయా శాఖల అధికారులు కొత్తగూడెంతోపాటు మండల పరిధిలోని చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి పంచాయతీల పరిధిలో ఇళ్లను జల్లెడ పడుతున్నారు. పట్టణంలో ఖాళీ ఇళ్లు తక్కువగా ఉండటం.. ఉన్న కొన్ని భవనాలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా లేకపోవడంతో గల్లీగల్లీ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా.. కొందరు యజమానులు మాత్రం డిమాండ్ చేసిన అద్దె చెల్లిస్తే.. అవసరమైతే భవనాలను అవసరాలకు అనుగుణంగా కట్టించి ఇస్తామని చెప్పడం గమనార్హం. ఇక పట్టణంలోని ఎంజీ రోడ్, ఇతర ప్రధాన రహదారుల వెంబడి ఖాళీ భవనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మొదలైన నిర్మాణాలు జిల్లా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తరలి రానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు అద్దెకు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటి నుంచే పలువురు ఇళ్ల యజమానులు ముందుచూపులో భాగంగా నివాస గృహాల నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న అద్దెలను కూడా గృహ యజమానులు రెండింతలు పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు. జిల్లా కేంద్రం కానుండటంతో ఇటు గృహ యజమానులకు కలిసిరానుంది. ప్రస్తుతం ప్రధాన రహదారి వెంబడి గృహాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దె సుమారు రూ.2వేల నుంచి రూ.3వేలకు పైగా ఉంది. జిల్లా కేంద్రంగా ప్రకటించిన తరువాత రూ.5వేలకు పైగా పెరిగింది. ఖాళీగా లేని కమర్షియల్ భవనాలు పట్టణంలో వ్యాపారాభివృద్ధికి ప్రస్తుతం కమర్షియల్ భవనాల అవసరం ఉన్నప్పటికీ ఏ ఒక్కటీ ఖాళీగా కనిపించడం లేదు. ఎంజీ రోడ్, ప్రధాన రహదారుల వెంట ఉన్న కమర్షియల్ భవనాలన్నీ నిండిపోయాయి. కొత్తగా కమర్షియల్ భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు పలువురు ఖాళీ స్థలాల యజమానులు పనులు సైతం ప్రారంభించారు. భవిష్యత్‌లో కమర్షియల్ భవనాల అవసరం మరింత ఉండే అవకాశాలు ఉండటంతో దానిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణమైతే వివిధ వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందడంతోపాటు ప్రైవేటు సంస్థలు సైతం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. కాగా.. ఇప్పుడున్న అద్దెలకు రెట్టింపు స్థాయిలో పెరుగుతాయని కమర్షియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. -
చైతన్యనగర్, కొత్తగూడెంలో పిడుగుపాటు
గేదె మృతి, ధ్వంసం అయిన ఇంటిగోడ ఖమ్మం అర్బన్: నగరంలోని రెండు వేర్వురు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఉరుములు మెరుపుతో కూడిన వర్షం ప్రభావంతో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. చైతన్యనగర్‌లో వెంకటేశ్వరరావు ఇంటిపై పిడుగుపడటంతో గోడకు రంధ్రం పడింది. ఇంట్లోని విద్యుత్ పరికాలు దగ్ధం అయినట్లు ఆయన తెలిపారు.తాము ఇంట్లోనే ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆ సమయంలో వచ్చిన మెరుపులతో భారీ శబ్ధం రావడంతో తమ ఇంటి సమీపంలోనే పిడుగు పడినట్లు భావించామన్నారు. గురువారం ఉదయం చూస్తే ఇంటి పైన గోడకు రంధ్రం పడి పగుళ్లు వచ్చాయన్నారు. ఆ ప్రాంతాన్ని కార్పొరేటర్ చావా నారాయణరావు పరిశీలించారు. 7వ డివిజన్లోని కొత్తగూడెంలో కె.హనుమంతురావుకు చెందిన ఇంట్లో పిడుగు పడింది.దాని ధాటికి రూ. 70 వేల విలువ చేసే పాడి గేదె అక్కడిక్కడే మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపారు. -
పకడ్బందీగా పంపకాలుండాలి
సమీక్షలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాల పునర్విభజనలో పంపకాలు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర శాఖాధిపతుల ఆమోదం పొందిన ఉద్యోగుల జాబితాకు అనుగుణంగానే కేటాయింపులు ఉండాలన్నారు. టీటీడీసీ భవన్లో ఆయా శాఖల జిల్లా బాధ్యులతో కేటాయింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వశాఖలలో కేడర్‌తో సంబంధం లేకుండా సిబ్బంది కేటాయింపులుండాలన్నారు. రాష్ట్ర శాఖ బాధ్యుల జాబితా, జిల్లా అధికారుల కేటాయింపుల జాబితా ఒకేలా ఉండాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు జాబితా అడిగినా పంపించేందుకు పర్యవేక్షక అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉద్యోగుల జాబితాతో పాటు నూతన జిల్లాలో కార్యాలయ వసతి, చిరునామా, కార్యాలయ మ్యాప్, ప్రస్తుతం జిల్లా కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫైళ్ల వివరాలు, వాహనాలను విడదీసి జాబితాను సంబంధిత పర్యవేక్షక అధికారులకు అందించాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలు, అద్దెవాహనాల వివరాలు కూడా పొందుపర్చాలన్నారు. సింగిల్ కేడర్ పోస్టులు రెండు లేదా మూడు ఉన్న పక్షంలో ఒక సింగిల్ కేడర్ పోస్టును నూతన జిల్లాకు కేటాయించాలన్నారు. పాత జిల్లాలో ఉన్న శాఖలు కొన్ని కలిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం, రాష్ట్ర హెచ్ఓడీల ఆదేశాల మేరకు సిబ్బంది జాబితా తయారు చేయాలన్నారు. నూతన జిల్లాలో శాఖాధిపతిని నిర్దేశిస్తూ జాబితా ఇవ్వాలన్నారు. నూతనంగా ఏర్పడే జిల్లాలో అవసరమైన వనరులన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయాల భవనాల కేటాయింపులు జరపాలన్నారు. వాటి మరమ్మతులకు నిధులు మంజూరు కాని పక్షంలో ప్రైవేట్ భవనాలను ప్రభుత్వ రేట్ల ప్రకారం అద్దెకు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు యజమానితో అగ్రిమెంట్ చేయించుకోవాలన్నారు. కొన్ని శాఖల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా పంచాలన్నారు. ఫైళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని ఉమ్మడిగా ఉన్న ఫైళ్లను స్కాన్, జిరాక్స్ తీసి నూతన జిల్లాకు పంపాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, డీఆర్వో శ్రీనివాస్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు పాల్గొన్నారు. -
‘కొత్త’ కార్యాలయాల కోసం కసరత్తు
– సింగరేణి భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే జలగం – అధికారుల నివాసాలకు సింగరేణి క్వార్టర్లు కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ఏర్పాటవుతున్న తరుణంలో జిల్లా కార్యాలయాల కోసం సింగరేణి భవనాలను స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆదివారం పరిశీలించారు. ఆర్డీఓ రవీంద్రనాథ్, డీఎస్పీ సురేందర్‌రావులతో కలిసి ఇప్పటికే రెవెన్యూ అధికారులు గుర్తించిన భవనాలను, కలెక్టరేట్ కోసం కేటాయించిన సింగరేణి పీఅండ్‌పీ బిల్డింగ్‌ను సందర్శించారు. త్రీ ఇంక్లైన్లో సింగరేణి అధికారుల క్వార్టర్లను పరిశీలించి..కలెక్టర్, ఎస్పీ, జేసీలకు కావాల్సిన నివాస భవనాలను కేటాయించేందుకు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీఅండ్‌పీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలం కలెక్టరేట్ విస్తరణ కోసం ఉపయోగపడుతుందని, మీటింగ్ హాల్‌కోసం మార్పులు చేయాలని, వాహనాల పార్కింగ్ కోసం పాత పీఅండ్‌పీ భవనం అనువుగా ఉంటుందని అధికారులకు సూచించారు. సీటీసీ భవనం వెనుక ఉన్న ఖాళీ స్థలం కార్యాలయాల ఏర్పాటు కోసం పనిచేస్తుందన్నారు. జిల్లా ఏర్పాటుకు సమయం ఆసన్నమైనందున రెవెన్యూ, పోలీస్ అధికారులు త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని, ప్రజలకు చేరువలో పరిపాలనా యంత్రాంగం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధర్నాచౌక్‌కు అనువైన స్థలాన్ని సేకరించాలన్నారు. జిల్లా కార్యాలయాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మరణమృదంగం
-
కూలి పనుల కోసం వెళ్తే..
కొత్తగూడెం(ఖమ్మం జిల్లా) : కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కూలి పనుల కోసం వెళ్లిన ఓ మహిళపై కొత్తగూడెంకు చెందిన తాపీ మేస్త్రీ ముద్దారపు వెంగలయ్య(38) అత్యాచారం చేశాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తాపీ మేస్త్రీని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మహిళకు తీవ్రరక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిపై అత్యాచారయత్నం: కేసు నమోదు
కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ యువతి(21) సోమవారం అర్థరాత్రి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వస్తోంది. అదే సమయంలో లోతువాగు వద్ద ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆమెతోపాటు ఉన్న యువకుడిని తాడుతో బైక్‌కు కట్టేసి యువతిని పొదల్లోకి లాక్కెళ్లి, అత్యాచారానికి యత్నించారు. అతికష్టంమీద ఆ యువతి వారి నుంచి తప్పించుకుని రోడ్డుపైకి పరుగుతీసింది. అదే సమయంలో అటుగా వస్తున్న పోలీసులకు విషయం తెలపడంతో వారు ఆగంతకుల కోసం గాలించారు. అయితే, అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కొత్తగూడెంలో 51.5 డిగ్రీల ఉష్ణోగ్రత!
కొత్తగూడెం (ఖమ్మం జిల్లా): కొత్తగూడెంపై సూర్యప్రతాపం కొనసాగుతోంది. వరుసగా రెండు రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం 52 డిగ్రీలు, సోమవారం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిన్నచిన్న వ్యాపారస్తులు షాపులను మూసివేసి ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పట్టణం మొత్తం వెలవెలపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోగా, షాపులన్నీ మూతపడ్డాయి. పట్టణంలో రెండురోజులుగా అనధికారిక కర్ఫ్యూ కొనసాగుతోంది. రోడ్ల వెంట వ్యాపారాలు చేసుకునేవారు ఎండదెబ్బకు కుదేలవుతున్నారు. ఎండలతో పండ్లు పాడైపోతుండటంతో పండ్ల వ్యాపారులు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. జ్యూస్ పాయింట్లు, చెరకు రసం, కూల్‌డ్రింక్ లకు బాగా గిరాకీ పెరిగింది. చలివేంద్రాలు అంతంతమాత్రమే సేవలందిస్తుండటంతో దాహార్తి తీర్చుకునేందుకు పాదచారులు, ప్రయాణీకులు లీటరు నీటిని రూ.8లకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు గొడుగులు, ముఖానికి రుమాళ్లు, టోపీలు ధరించి వస్తున్నారు. సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల వద్ద మరో రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉండటంతో కార్మికులు విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
నిప్పుల కొలిమిలా కొత్తగూడెం..
- 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు - నిప్పుల కొలిమిలా రహదారులు - నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు - హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం అగ్నిగుండంగా మారింది. రహదారులు నిప్పుల కొలిమిని తలపించాయి. వడగాడ్పుల దెబ్బకు ప్రజలు విలవిల్లాడారు. ఆదివారం 52 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రచండ భానుడి ధాటికి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైన భానుడి ప్రభావం.. క్రమక్రమంగా మధ్యాహ్నానికి ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక ఇళ్లల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోత, వేడి గాలులతో అల్లాడిపోయారు. వారాంతపు సంత కూడా వెలవెలబోయింది. సాయంత్రం 7గంటల అనంతరమే ప్రజలు సంతకు వచ్చేందుకు ఆసక్తి కనబరిచారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతోపాటు సింగరేణి ఓపెన్‌కాస్టు గనికి అతి చేరువలో ఉన్న కారణంగా ఏటా కొత్తగూడెంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. మే నెలలో రోళ్లు పగిలిపోయేలా భానుడి ప్రభావం ఉంటుంది. మరోవైపు రామగుండంలో అత్యధికంగా 46.2 డిగ్రీలు, భద్రాచలంలో 45.4, ఆదిలాబాద్‌లో 45.3, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత కొత్తగూడెం 52.0 రామగుండం 46.2 భద్రాచలం 45.4 ఆదిలాబాద్ 45.3 ఖమ్మం 44.4 నిజామాబాద్ 43.6 హన్మకొండ 43.5 నల్లగొండ 43.0 మెదక్ 42.4 హైదరాబాద్ 42.0 మహబూబ్‌నగర్ 39.2