సింగరేణి సంస్థ 2018లో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోయింది. గతం కంటే అధికంగా వృద్ధి రేటు సాధించింది. బొగ్గు ఉత్పత్తి సాధనలోనూ, కార్మికులకు లాభాల వాటా పంచడంలోనూ ముందుంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పిన సింగరేణి.. సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపక్రమించింది. ఈ మేరకు పనులు ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది ఎన్నో బహుమతులు అందుకుంది. క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా కార్మికులను ప్రోత్సహించింది. కాగా ఏడాది కాలంలో సంస్థవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. –సింగరేణి(కొత్తగూడెం)
జనవరి
1న సింగరేణి భవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 25న కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్‌లో ప్రెస్ ఇన్మఫర్‌మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో మీడియా వర్క్‌షాపు నిర్వహించారు. 29న కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి సుశీల్‌కుమార్ సింగరేణి గనులను, సింగరేణి విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు.
ఫిబ్రవరి
హైదరాబాద్‌లో నిర్వహించిన 78వ ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్‌లో సింగరేణి సేవా సమితి స్టాల్‌కు అలంకార విభాగంలో ద్వితీయ బహుమతి వచ్చింది. 12న ఎంపీ జితేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి అందించారు. 16న హైదరాబాద్‌లో నిర్వహించిన మైనింగ్ టుడే సదస్సు ఎగ్జిబిషన్‌లో సింగరేణి నెలకొల్పిన ఆధునిక స్టాల్.. పబ్లిక్ సెక్టార్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది.18న భూపాలపల్లి ఏరియాలోని 8 ఇంక్లైన్‌లోగల మంజూరు నగర్‌లో రూ కోటి 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ భి భాస్కర్‌రావు భూమిపూజ నిర్వహించారు.
మార్చి
7 నుంచి 15వ తేదీ వరకు రామగుండం–1,2 ఏరియాల్లో కోలిండియా స్థాయి క్రికెట్ పోటీల ను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. 7 నుంచి 15వ తేదీ వరకు రామగుండం–1,2 ఏరియాల్లో కోలిండియా స్థాయి క్రికెట్ పోటీల ను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఏప్రిల్
1న 2017–18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అత్యధికంగా 203 శాతం వృద్ధి రేటు సాధించినట్లు సీఎండీ ప్రకటించారు. ఇదే నెలలో తొలిసారిగా గనుల వారీగా కాంట్రాక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించి కాంట్రాక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించారు. నిరుద్యోగులకు రూ.50 లక్షలు కేటాయించి కొత్తగూడెం ఏరియా పరిధిలో స్కిల్ డెవలపమెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. 13న సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రతిష్టాత్మక ఆసియా పసిఫిక్ ఎంటర్‌పెన్యూర్‌షిప్–2018 అవార్డును ఢిల్లీలో అందుకున్నారు.
మే
సింగరేణిలో తొమ్మిది చోట్ల సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుకు 11న బోర్డు ఆమోదించింది. రూ. 1360 కోట్లు అంచనా వ్యయంతో తొలిదశగా 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం. 12న భువనేశ్వర్‌లో ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నారు. 13న ఒడిశాలోని నైనీబ్లాక్‌లో డ్రిల్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 19న బెల్లంపల్లి ఏరియాలో కొత్తగనులైన గోలేటి ఓపెన్‌కాస్ట్‌గని, చింతకూడ ఓపెన్‌కాస్ట్ గనులకు డైరెక్టర్ పీపీ భాస్కర్‌రావు తదితరులు సమీక్ష చేశారు.
జూన్
5న నైనీబ్లాక్‌కు రైలు మార్గంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శితో సీఎండీ శ్రీధర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన సింగరేణి స్టాల్‌కు అత్యంత ఆదరణ లభించింది. 20న కజకిస్తాన్‌లో ప్రపంచ మైనింగ్ సదస్సుకు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. 28న దుబాయిలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశ ప్రముఖుల నుంచి ఔట్ స్టాండింగ్ లీడర్ షిప్ అవార్డును సీఎండీ అందుకున్నారు. 16న దక్షిణ భారత స్థాయి పరిశ్రమల సదస్సులో సింగరేణి సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 19న సత్తుపల్లిలో సింగరేణి కార్మికులకు కొత్త క్వార్టర్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
జూలై
అత్యధిక జీఎస్టీ చెల్లింపుదారునిగా సింగరేణికి అవార్డు. ఈఅండ్‌ఎం డైరెక్టర్ సలాకుల శంకర్ ఈ అవార్డును అందుకున్నారు. 7న ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో సైరన్ యూ ట్యూబ్ ప్రారంభించారు. 11న జరిగిన 545 బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం 2017–18లో సింగరేణి సంస్థ రూ.1212 కోట్ల లాభం ఆర్జించినట్లు నిర్దారించారు. ఇదే నెలలో అంతర్జాతీయ స్థాయిలో అత్యంత విశ్వసనీయ కంపెనీగా సింగరేణికి అవార్డు వచ్చింది. డైరెక్టర్(పీపీ) ఈ అవార్డును అందుకున్నారు.
ఆగస్టు
1న జైపూర్‌లోని సింగరేణి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ రైలు మార్గం, మార్గంపై బొగ్గు రవాణను ప్రారంభించారు. 2.44 కిలోమీటర్ల వాటర్ పైప్‌లైన్ పనులు కూడా ప్రారంభించారు. 10న సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు అందుకుంది. 29న రూ.1212 కోట్ల లాభాల్లో కార్మికులకు వాటా కింద 27 శాతం కేటాయించారు. రూ. 327 కోట్లను కార్మికులకు పంపిణీ చేశారు. 30న కేడర్ స్కీంలపై ఒప్పందం జరిగింది. 11 అలవెన్స్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 900 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా ప్రమోట్ చేశారు.
సెప్టెంబర్
7న ఎక్స్‌లెన్స్ ఇన్ ఫెర్మార్మెన్స్ అవార్డును సింగరేణి జీఎం కార్పొరేట్ (పి అండ్ పి) రాజేశ్వరరెడ్డి అందుకున్నారు. 17న కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో కార్మికుల క్వార్టర్లకు ఏర్పాటు చేసిన ఏసీలు ఏర్పాటు చేశారు. 20న జరిగిన బోర్డు సమావేశంలో ఓబీ తొలగింపు, కొత్త డంపర్లు, డోజర్ల కొనుగోలు అనుమతులకు, కోలిండియాలో మాదిరిగా సింగరేణి అధికారులకు వేతనాల చెల్లింపునకు ఆమోదం లభించింది. 27న నైనీ బ్లాక్ జీఎం విజయరావు కోల్ ఇండియా ప్రొడక్టవిటి అవార్డును అందుకున్నారు.
అక్టోబర్
8న డెహ్రాడూన్‌లో జరిగిన ప్రజాసంభందాల సదస్సులో సింగరేణి పీఆర్వో పాల్గొన్నారు. 20న లేబర్ కమిషనర్ శ్యాంసుందర్‌తో భేటీ అయిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మూడు అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. 24,25 తేదీల్లో శ్రీరాంపూర్ ఏరియాలో కంపెనీస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆటలు నిర్వహించారు.
నవంబర్
పశ్చిమ బెంగాల్‌లో 11 నుంచి 13 వరకు జాతీయ రెస్క్యూ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సింగరేణి తరఫును రెండు జట్లు పాల్గొని బహుమతులు సాధించాయి. 16న సింగరేణి సంస్థకు బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు లభించింది. 27న ఒకే రోజు 2,45,000 టన్నుల బొగ్గు రవాణా చేసి సింగరేణి రికార్డు సృష్టించింది.
డిసెంబర్
8న డెహ్రాడూన్‌లో జరిగిన ప్రజాసంభందాల సదస్సులో సింగరేణి పీఆర్వో పాల్గొన్నారు. 20న లేబర్ కమిషనర్ శ్యాంసుందర్‌తో భేటీ అయిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మూడు అంశాలపై ఒప్పందం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment