
ఫైల్‌ఫోటో
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో తొలి కరోనా వైరస్ నమోదు కావడం కలకలం రేపింది. అశ్వారావుపేట మండలానికి చెందిన స్నేహ అనే యువతికి కరోనా పాజిటివ్ వచ్చిన వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యువతిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన యువతి ఇటలీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా తగ్గక పోవడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్‌ఉన్నట్లు తేల్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకి తరలించారు. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఆ యువతి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment