Gandhi hostipal
-
చైనాతో ఇండియాను పోల్చొద్దు.. కరోనాపై భయాలు వద్దు
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో కోవిడ్ ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నవన్ని ఒమిక్రాన్ సబ్ వేరియంట్లేనని, భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతు ఇండియాకు చైనాకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. చైనా అజాగ్రత్తగా వ్యవహించిందని, అక్కడి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ జరగలేదని, హెర్డ్ ఇమ్యూనిటీ రాకపోవడంతో మరోమారు విజృంభిస్తున్నట్లు నిపుణుల పరిశీలన లో తేలిందన్నారు. ఇండియాను చైనాతో పోల్చవద్దన్నారు. ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో వ్యా క్సినేషన్ వందశాతం పూర్తయిందన్నారు. ఒమిక్రాన్ సబ్వేరియంట్లే వ్యాప్తిలో ఉన్నాయని, కరోనా వైరస్ రూపాంతరం చెంది కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ► చిన్నారులు, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు, దీర్ఘకాల రుగ్మతలతో బాధపడేవారు కోవిడ్ తర్వాత వచ్చే బ్లాక్‌ఫంగస్ వంటి రుగ్మతల బారిన పడే అవకాశాలున్నాయని, వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ► మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ (డీఎంఈ) రమేష్‌రెడ్డి ఆదేశాల మేరకు కరోనా పాజిటివ్ బాధితుల నుంచి నమూనాలు సేకరించి గాంధీ మెడికల్ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ► కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తు, మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లతో చేతులు పరిశుభ్రం చేసుకోవాలని, సామూహిక, ఎక్కువమంది గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు. ► గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఎనిమిది మంది కోవిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. గత కొన్ని నెలలుగా బాధితుల సంఖ్య పదికి మించలేదన్నారు. ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదని, వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
దమ్మాయిగూడ బాలిక మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన చిన్నారి ఇందు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. కాగా ఇందు పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు గుర్తించిన వైద్యులు.. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చారు. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే చెరువులో ఎవరైనా తోసేశారా..? తనే ఆడుకుంటూ పడిందా అనేది తేలాల్సి ఉంది. దమ్మాయిగూడలో ఉద్రిక్తత దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలిక మృతదేహంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టు తమకు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందు మృతిపై స్పఫ్టత ఇవ్వాలని, చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. -
అవీ సర్కారు ఆసుపత్రులు.. ఆరోగ్యశ్రీ లేకుంటే.. వైద్యమూ అందట్లే!
ఆమె పేరు శ్వేత (పేరు మార్చాం)... పది రోజుల క్రితం ప్రసవం కోసం నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు మగ బిడ్డ పుట్టాడు. డిశ్చార్జి సమయంలో మగబిడ్డ పుట్టినందున రూ.3 వేలు చెల్లించాలని అక్కడి సిబ్బంది ఒత్తిడి చేశారు. వైద్యాధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో రూ. 3 వేలు, ఇతరత్రా రూ.500 చెల్లించి బయటికొచ్చారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగికి ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే గుండె వైద్యం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌పేషంట్లుగా చేరే రోగులకూ చాలాచోట్ల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. రెండు మూడు రోజులు ఇన్‌పేషంట్‌గా ఉంటే సొమ్ములు ఇవ్వాల్సిందే. లేకుంటే వారికి వైద్యసేవలు గగనమే. ఇలాంటి వాటిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధమేంటని.. ఎవరికైనా ఉచిత వైద్యం చేయాల్సిందే కదాని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉచిత వైద్యం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. కోట్లలో వసూలు... సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవానికి, ఇతర చికిత్సలకు ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్న పరిస్థితులున్నాయి. విచిత్రమేంటంటే కొన్ని చోట్ల కేసీఆర్ కిట్టు ఇచ్చినందుకూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి దందాల్లో కొందరు డాక్టర్లు సూత్రధారులుగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వసూలు చేసిన సొమ్మును డాక్టర్‌కు లేదా ఏజెన్సీ నిర్వాహకుడికి ఇచ్చి అంతా పంచుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో జరిగే కాసుల దందాతో ఏడాదికి రూ.కోట్లు వసూలు అవుతున్నాయి. నిలోఫర్‌లో ఏడాదికి రూ. 2 కోట్లు, గాం«దీలో రూ.కోటిన్నర, ఉస్మానియాలో రూ. కోటి వరకు వసూలు అవుతున్నట్లు అంచనా. జిల్లా ల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనూ జోరుగా వసూళ్లపర్వం సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 6 లక్షల కాన్పులు జరుగుతుండగా, వీటిలో 4 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. డబ్బులు వస్తేనే చేయగలం! యాంజియోగ్రాం చేసేటప్పుడు అవసరమైతే స్టెంట్లు వేయాలని, వాటికి ఖర్చవుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ అడుగుతున్నామని వైద్యులంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అయితే స్టెంట్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలోనూ ఇదే పద్ధతి నడుస్తోంది. కాగా, ‘గాంధీ’లోని ఒక గైనకాలజీ వైద్యురాలు ఆపరేషన్‌కు రూ.10 వేలు డిమాండ్ చేశారని ఒక బాధితురాలు ఇటీవల లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలోనూ వసూలు దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రసవానికి వచి్చన మహిళ నుంచి ఆడబిడ్డ పుడితే రూ. 2 వేలు, మగబిడ్డ పుడితే రూ.3 వేలు ఇవ్వాలన్న షరతు పెట్టారు. ఈ దందా వెనుక ఒక ప్రముఖ వైద్యుడు కీలకంగా ఉండటం గమనార్హం. కాసుల కక్కుర్తిలో మచ్చుకు కొన్ని... ► గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగంలో ఆడబిడ్డ పుడితే రూ. వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 1,500 వసూలు చేస్తున్నారు. ► పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రితోపాటు బేలాలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన వారి నుంచి అబ్బాయి పుడితే రూ.2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. ► హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే రూ.వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 2 వేలు డిమాండ్ చేస్తున్నారు. ► నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడ బిడ్డ పుడితే రూ.వెయ్యి, మగ బిడ్డ పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. డెలివరీ తరువాత ఆయాలకు రూ. 500 ఇవ్వాల్సి వస్తోంది. ► జనగామ జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడబిడ్డ పుడితే రూ.500, మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి గుంజుతున్నారు. ► ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ప్రభుత్వం మందులు సరఫరా చేస్తున్నా, అందుబాటులో లేని ఔషధాల కొనుగోలుకు బడ్జెట్ కేటాయించినప్పటికీ రోగులు ప్రైవేట్ దుకాణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఐదు రకాల మందులు రాస్తే కనీసం రెండు రకాల ఔషధాలు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిందే. నాకు ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ జన్మించాడు. గురువారం డిశ్చార్జి చేసేటప్పుడు అక్కడి సిబ్బంది రూ.వెయ్యి వసూలు చేశారు. అలాగే కేసీఆర్ కిట్టుకూ వంద రూపాయలు తీసుకున్నారు. - ఝాన్సీ, హైదరాబాద్ -
Gandhi Hospital: ఓపీకి వస్తే బీపీ తప్పదు
సాక్షి, హైదరాబాద్: గాంధీఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి రోగులు పోటెత్తారు. నగర నలుమూలలతోపాటు పలు జిల్లాలకు చెందిన బాధితులు వైద్యసేవల కోసం సోమవారం పెద్దసంఖ్యలో తరలిరావడంతో కంప్యూటర్ చిట్టీలు మొదలుకొని వైద్యపరీక్షలు, స్కానింగ్‌లు, రక్తపరీక్షలు, చివరకు మందుల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఓపికి వస్తే బీపీ తప్పలేదని, ఉన్న రోగం వదిలించుకునేందుకు వస్తే కొత్తరోగాలు అంటుకుంటున్నాయని పలువురు బాధితులు వాపోతున్నారు. ఓపీ చిట్టీ కౌంటర్ల సంఖ్య పెంచాలనే నిర్ణయం కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈవినింగ్ ఓపీ సేవలు ప్రారంభమైనప్పటికీ ఉదయం పూట వచ్చేందుకే రోగులు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మార్నింగ్ ఓపీకి రద్దీ పెరిగిందని ఆస్పత్రి అధికారి వ్యాఖ్యానించారు. గాంధీ ఓపీ విభాగంలో సోమవారం సుమారు మూడున్నర వేల మందికి వైద్యసేవలు అందించారు. రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు, వసతి సౌకర్యాలు కల్పించి మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. చదవండి: నగరాన్ని ముంచెత్తిన జోరు వాన.. వరద నీటిలో చిన్నారుల ఈత -
Hyderabad: డెంగీ, ఇతర వ్యాధులతో తల్లడిల్లుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: నగరంపై విషజ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సీజనల్ ఫీవర్లు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. బస్తీ దవాఖానాల్లో పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. కరోనా సమయంలో కనపడకుండా పోయిన సీజనల్ వ్యాధులన్నీ ఇప్పుడు విరుచుకుపడుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ బాధితులు దవాఖానాల బాట పడుతున్నారు. అధికారుల గణాంకాల్లో తక్కువగా కనపడుతున్నా, డెంగీ కేసుల సంఖ్య భారీగానే ఉందని ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్ల రద్దీ, ప్లేట్లెట్లకు పెరుగుతున్న డిమాండ్ వెల్లడిస్తోంది. మరోవైపు వైద్యారోగ్య శాఖ కేవలం నామమాత్రపు చర్యలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీ ఓపీ విభాగంలో క్యూలైన్లలో బారులు తీరిన రోగులు గాంధీఆస్పత్రి/ నల్లకుంట/తార్నాక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో గత నెలలో 16, ఈ నెలలో ఇప్పటివరకు 6 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణ రోజుల్లో ఓపీ రోగుల సంఖ్య 60– 70 వరకు ఉంటే ప్రస్తుతం 110 నుంచి 120 మందికి, అలాగే 50 వరకు ఓపీ ఉండే సనత్‌నగర్ అశోక్ కాలనీ బస్తీ దవాఖానాలో ఆ సంఖ్య 100కు చేరింది. ఇక్కడ 6 దాకా డెంగీ కేసులున్నాయి. సనత్‌నగర్ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్లో సాధారణ రోజుల్లో 100–120 వరకు ఉండే సంఖ్య 150కు చేరింది. గత రెండు వారాల్లో ఇక్కడి యూపీహెచ్సీ పరిధిలో 2 డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. అదే విధంగా కొండాపూర్ ఏరియా జిల్లా ఆస్పత్రికి రోజు 400 నుంచి 450 మంది వస్తున్నారు. వీరిలో రోజుకు 40 నుంచి 50 మంది జ్వరంతో బాధపడుతున్నవారు ఉండగా, రోజుకు 20 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. ‘వర్షాలతో మురుగు పేరుకుపోవడంతో దోమల ద్వారా జ్వరాలు సోకుతున్నాయి. ప్రస్తుతం పేషెంట్ల సంఖ్య రెట్టింపు అయ్యింది’ అని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్, డాక్టర్ వరదాచారి చెప్పారు. ఉప్పల్‌లో ఇంటికొకరు.. ఉప్పల్‌లో ఇంటికి ఒకరు చొప్పున విష జ్వరాలు బారిన పడుతుంటే వీరిలో చిన్న పిల్లలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో ఓపీల దగ్గర క్యూలు సైతం భారీగా పెరిగాయి. రోజుకు 80 నుంచి 100 వరకు ఉండే ఓపీలో 150 వరకు పెరగింది. వైరల్ ఫీవర్ల తీవ్రత ఉందని, ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో గత 25 రోజులుగా దాదాపు 30కి పైగా డెంగీ కేసులను నమోదయినట్లు వైద్యాధికారి సౌందర్యలత తెలిపారు. అలాగే రెండు మలేరియా కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ‘గత నెల రోజులుగా డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ రోజుల్లో నిత్యం 600లోపు ఓపీ ఉంటోంది. కొద్ది రోజులుగా 1000కి పెరిగింది’ అని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ చెప్పారు. గాంధీలో రోగుల రద్దీ.. విషజ్వరాల వ్యాప్తితో సికింద్రాబాద్ గాం«దీఆస్పత్రికి రోగుల సంఖ్య భారీగా పెరిగింది. అవుట్ పేషెంట్ విభాగంలో 1500 నుంచి 2000 వరకు, ఇన్‌పేషెంట్ విభాగంలో 1800 మందికి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం గాం«దీలో 160 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్లు ఆస్పత్రి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓపీ విభాగంలో కంప్యూటర్ చిట్టీలు, వైద్యసేవల కోసం వందలాది మంది రోగులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఇన్పేòÙంట్ విభాగంలోని పలు వార్డుల్లో రోగుల సంఖ్య పెరగడంతో ఫ్లోర్బెడ్స్ (నేలపై పరుపు)వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. నెలరోజల నుంచి గాంధీ ఆస్పత్రికి రోగుల రద్ధీ అధికంగా ఉందని, విషజ్వరాలకు గురైన రోగులు ఓపీకి 500, ఐపీలో 250 మంది గతం కంటే అధికంగా వస్తున్నట్లు గుర్తించామని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. -
‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స: సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు!
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రోగికి సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. స్పృహలో ఉన్న రోగి మెదడులోని కణితి(ట్యూమర్)నితొలగించి శభాష్ అనిపించుకున్నారు. ఈ రకమైన సర్జరీని వైద్యపరిభాషలో అవేక్ క్రేనియటోమీ అంటారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, న్యూరోసర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ ప్రకాశరావు, అనస్తీషియా వైద్యురాలు ప్రొఫెసర్ శ్రీదేవి తెలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు(60) అస్వస్థతతో ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చేరింది. న్యూరాలజీ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో ప్రమాదకరమైన రీతిలో కణితి(ట్యూమర్) పెరుగుతున్నట్లు గుర్తించారు. సాధారణ సర్జరీ చేస్తే రోగి ప్రాణానికే ప్రమాదమని భావించి న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు సంయుక్తంగా అవేక్ క్రేనియటోమీ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. గురువారం ఉదయం సంబంధిత వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సుమారు గంట సమయం వెచ్చించి ఆమెలో నమ్మకం కల్పించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్లోని టేబుల్‌పైకి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చారు. మెదడు పైభాగాన్ని తెరిచి సర్జరీ చేస్తున్న సమయంలో ఫిట్స్, పెరాలసిస్‌తోపాటు పలు రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతో స్పృహలో ఉన్న ఆమెతో నిరంతరాయంగా మాట్లాడుతూ యాక్టివ్‌గా ఉంచారు. తనకు చిరంజీవి, నాగార్జున అంటే అభిమానమని, చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పడంతో కంప్యూటర్ ట్యాబ్‌లో ఆ సినిమాను చూపించారు. ఆమె సినిమా చూస్తుండగా వైద్యులు సుమారు రెండు గంటలు తీవ్రంగా శ్రమించి మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్యూమర్‌ను తొలగించారు. వైద్యుల హర్షం తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన అవేక్ క్రేనియటోమీ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు ప్రకాశరావు, ప్రతాప్‌కుమార్, నాగరాజు, శ్రీదేవి, సారయ్య, ప్రతీక్ష, అబ్బయ్య, పీజీలు కిరణ్, గిరీశ్, యామిని, స్ఫూర్తి, నర్సింగ్ సిబ్బంది రాయమ్మ, సవిన, రజిని, సుమ, వార్డ్బాయ్ నవీన్, వెంకన్నను వైద్యమంత్రి హరీశ్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీలు శోభన్‌బాబు, నర్సింహనేత, టీజీజీడీఏ గాంధీ యూనిట్ అధ్యక్షకార్యదర్శులు రాజేశ్వరరావు, భూపేందర్ రాథోడ్ తదితరులు అభినందించారు. -
ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకి పోవచ్చుగా..
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలకు కేరాఫ్‌గా పేర్కొనే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో నిరుపేదలకు ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకు పోవచ్చుగా.. అక్కడ కాకపోతే ఇక్కడికి రావాలి కానీ.. అందరూ నిమ్స్‌కు వచ్చేస్తే ఎలా అంటూ ఓ ఉన్నతాధికారి అగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు వెనువెంటనే వైద్యం అందించాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నిమ్స్‌కు వచ్చిన ప్రతి రోగికీ మెరుగైన వైద్యసేవలను అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను మరింతగా ఆధునికీకరించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు సైతం ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు. ఆచరణలో నిమ్స్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పేద రోగులకు సరైన వైద్య సేవలు అందించకపోగా వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం బాధాకరంగా మారుతోందంటూ పేదరోగులు వాపోతున్నారు. గరీబోళ్లం సారూ.. డబ్బులు లేవంటే ఉన్నకాడికి కట్టించుకొని మిగతావి సీఎంఆర్ఎఫ్ నుంచి ఎన్వోసీ తెచ్చుకోమంటూ ఉచిత సలహాపడేస్తున్నారు. రేపు డిశ్చార్జి చేస్తాం.. పోయి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోవాలంటూ ఆయా రోగులపై ఒత్తిడి తేవడంతో జిల్లాలకు వెళ్లి ఎమ్మెల్యే ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్వోసీ లెటర్ తెచ్చుకోవాల్సి వస్తోంది. తీరా అప్పటికే నాలుగైదు రోజులు గడిచిపోతుండటంతో ఆ బిల్లు చెల్లించేదాకా డిశ్చార్జీ చేయడం లేదు. సారూ.. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే పది రోజులు ఆగి రమ్మంటున్నారు. పది రోజుల తర్వాత వస్తే టెస్టులన్నీ చేసి బెడ్లు లేవు వారం రోజులు ఆగాలంటున్నారు. డబ్బులు చెల్లిస్తే మాత్రం వెంటనే బెడ్ ఇచ్చి అడ్మిట్ చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా.. డబ్బులు కట్టించుకున్నారు.. ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కళావతి(54) కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రతరం కావడంతో ఈ నెల 4వ తేదీన మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ను ఆశ్రయించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా రూ. 5 వేలు కట్టించుకొని మరీ అడ్మిషన్ చేయించుకున్నారు. చికిత్సలో భాగంగా ఇన్ఫెక్షన్ కారణంగా కాలేయంలో సగభాగాన్ని తొలగించారు. అందుకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు, చివరకు బ్యాండేజ్ సైతం బయట నుంచి తెచ్చుకోమన్నారు. అందుకు ఆమెకు రూ. 25 వేల వరకు ఖర్చయ్యింది. తీరా డిశ్చార్జి చేస్తాం.. సీఎంఆర్ఎఫ్ తెచ్చుకోమన్నారు. ప్రభుత్వం నుంచి రూ. 1.50 లక్షలు సహాయం అందింది. బుధవారం డిశ్చార్జి సమ్మరీని ఇచ్చిన అధికారులు ఇంకా రూ. 13 వేలు కట్టమన్నారు. అంతంతమాత్రంగా ఉన్న తమ ఆర్థిక పరిస్థితితో ఆ మొత్తాన్ని కూడా కట్టలేని పరిస్థితి. ఆ రోజంతా అధికారుల చుట్టూ ఎంత తిరిగి ప్రయోజనం లేకుండా పోయింది. ఆస్పత్రి మెడికల్ సూపరిండెంటెంట్ను కలిసి డబ్బులు లేవంటూ వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని కళావతి తనయుడు నరేష్ వాపోయారు. పైగా ఇక్కడికి ఎందుకొచ్చారు. గాంధీకో.. ఉస్మానియాకో వెళ్లాల్సింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సారూ.. అంటే ప్రభుత్వం ఎప్పుడో డబ్బులు ఇస్తుంది.. అప్పటివరకు ఆస్పత్రి ఎలా నడవాలి అంటూ ప్రశ్నించారన్నారు. మా దగ్గర ఊరికి పోయేందుకు డబ్బులు లేవు సార్.. వేరే వాళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్నాం.. అంటూ వేడుకున్నా నా పరిధిలో లేదు ఓ రెండు వేలు తగ్గిస్తా.. పొద్దున్నే మూడ్ ఆఫ్ చేయొద్దు.. వెళ్లిపోండి అంటూ ఆయన చిర్రుబుర్రులాడటంతో.. చివరికి మిత్రుల సహాయంతో ఆస్పత్రి నుంచి బయటపడ్డామని నరేష్ తెలిపారు. (క్లిక్: మంకీపాక్స్‌పై ఆందోళన వద్దు.. నిర్లక్యం చేయొద్దు!) -
సికింద్రాబాద్ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడ్డ 13 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి మేజర్, ముగ్గురికి మైనర్ ఆపరేషన్లు చేసిన వైద్యులు.. వారి శరీరంలోకి దిగిన ఎనిమిది తుపాకీ పెల్లెట్లను వెలికితీశారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం గుండ్రేటిపల్లికి చెందిన దండు మహేశ్ (21)కు వీపు భాగంలో శస్త్రచికిత్స చేసి రెండు పెల్లెట్లు బయటికి తీశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు నాగేందర్‌బాబు (21) కాలులోకి దూసుకుపోయిన రెండు పెల్లెట్లను.. కామారెడ్డిజిల్లా నిజాంసాగర్‌కు చెందిన పి.మోహన్ తొడ, నడుము భాగాల్లో దిగిన రెండు పెల్లెట్లను వెలికి తీశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లక్కం వినయ్ (20)కు ఛాతీపై కుడివైపు.. కర్నూల్ జిల్లా మంత్రాలయానికి చెందిన జగన్నాథ్ రంగస్వామి(20)కి పక్కటెముకల్లో దిగిన ఒక్కో పెల్లెట్‌ను బయటికి తీశారు. వీరంతా ఐసీయూలో కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఇక స్వల్ప గాయాలైన మరో ఎనిమిది మంది కోలుకున్నారని.. కానీ వారు మానసిక ఆందోళనలో ఉండటంతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వారిని మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాక డిశ్చార్జి చేస్తామన్నారు. (చదవండి👉🏻 ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!) మానసిక నిపుణులతో కౌన్సెలింగ్.. రైల్వేస్టేషన్ ఘటనతో క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారని.. వారికి ఆస్పత్రి మానసిక నిపుణులు కౌన్సెలింగ్ చేస్తున్నారని వైద్యులు తెలిపారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వీరు ఆత్మహత్యకు యత్నించే అవకాశాలూ ఉన్నాయని.. అందుకే కౌన్సెలింగ్ ఇచ్చి, వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సంబంధిత వైద్యాధికారి వెల్లడించారు. (చదవండి👉🏻 ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి) -
‘డిఫెన్స్’లో చర్చిస్తాం.. పార్లమెంట్లో నిలదీస్తాం
గాంధీ ఆస్పత్రి(హైదరాబాద్): అగ్నిపథ్ కారణంగా గత 48 గంటల్లో దేశవ్యాప్తంగా 24 మంది యువకులు మృతి చెందారని, యువతకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందని, ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. పార్లమెంటు సభ్యులమైన రాహుల్‌గాంధీ, తాను డిఫెన్స్ స్టాండింగ్ కమిటీలో చర్చిస్తామని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్మీ అభ్యర్థులపై బనాయించిన కేసులను, అనర్హత ప్రకటనను ఉపసంహరించుకోవాలని, మృతి చెందిన రాకేశ్ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అగ్నిపథ్‌ను రద్దు చేసి సాధారణ పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై ప్రధాని మోదీ అవగాహనలోపం, యువకుల భావోద్వేగమే హింసకు దారితీసిందన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో గాయపడి గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారంరాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, ఆర్మీ ఉద్యోగార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్ కాపాడేందుకు సీఎం కేసీఆర్ కంటే ప్రతిపక్షనేతగా తనకు ఎక్కువ బాధ్యత ఉందని పేర్కొన్నారు. సైన్యంలో చేరాలనుకునే యువతను నిరాశపరుస్తున్న అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ డిమాండ్ చేశారు. వెనుక గేటు నుంచి దర్జాగా.. పద్మారావునగర్ వైపు ఉన్న గేటు నుంచి రేవంత్ గాంధీ ఆస్పత్రిలోకి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. గతంలో ప్రగతిభవన్ ముట్టడికి, ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీల్లోకి వేర్వేరు మార్గాల ద్వారా చేరుకున్న రేవంత్‌రెడ్డి గాంధీ ఆస్పత్రిలోకి ఎలా ప్రవేశిస్తారోనని కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు, వాహనాలు, అంబులెన్స్‌లను కూడా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో వెనుకగేటు నుంచి రేవంత్‌రెడ్డిని పోలీసులే సాదరంగా ఆహ్వానించడం గమనార్హం. గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ సీఐ నరేశ్‌లు దగ్గరుండి రేవంత్‌ను క్షతగాత్రుల వద్దకు తీసుకువెళ్లడం విశేషం. -
పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదం.. గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బలగాల మోహరింపుతో శనివారం సాయంత్రం హైటెన్షన్ నెలకొంది. అగ్నిపథ్ నిరసనల్లో గాయపడ్డ అభ్యర్థులను పరామర్శించేందుకు వెళ్లారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభ్యర్థులను పరామర్శించేందుకు వెనుక గేటు నుంచి గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లారు రేవంత్‌రెడ్డి. అనంతరం బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో.. పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మెయిన్ గేట్ వద్ద పోలీసులు భారీ బలగాలు మోహరించారు. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల సంగతేంటి? ఘట్కేసర్: సైన్యంలోనూ అవుట్ సోర్సింగ్‌కు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. అగ్నిపథ్ నిరసనల మీద స్పందించిన ఆయన.. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ‘‘అగ్నిపథ్‌తో దేశభద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. సైన్యంలో చేరడానికి రాతపరీక్షల కోసం.. 20 నెలలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు’’ అని ఆయన అన్నారు. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకునేంత వరకు కేంద్రంపై పోరాటం తప్పదని స్పష్టం చేశారాయన. ఇదిలా ఉంటే.. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో చనిపోయిన వరంగల్ ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి రాకేశ్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఘట్ కేసర్ లో నిరసన చేపట్టారు. గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష నాంపల్లి: అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని.. ఏఐసీసీ పిలుపులో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. -
గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
-
బోయిగూడ అగ్ని ప్రమాదం.. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ ఏం చెప్పాడంటే..
సాక్షి, హైదరాబాద్: బోయిగూడలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షి.. బీహార్‌కు చెందిన ప్రేమ్ కుమార్ బుధవారం పోలీసులకు కీలక విషయాలను వెల్లడించారు. ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్క్రాప్ గోడౌన్ యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు. రెండేళ్ల నుంచి స్క్రాప్ గోడౌన్లో పనిచేస్తున్నట్టు తెలిపాడు. నిన్న రాత్రి తనతో పాటుగా మరో 11 మంది రెండు గదుల్లో నిద్రపోతున్నామని చెప్పాడు. ఓ చిన్న రూమ్‌లో తనతో పాటు బిట్టు, సంపత్ ఉండగా.. మరో తొమ్మిది మంది వేరే గదిలో నిద్రపోతున్నారని తెలిపాడు. కాగా, రాత్రి 3 గంటల సమయంలో గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అన్నాడు. దీంతో కార్మికులందరూ బయటకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో తాను ఎంతో కష్టంతో కిటీకీలో నుంచి బయటకి దూకి ప్రాణాలను కాపాడుకున్నట్టు తెలిపాడు. కానీ, మిగిలిన వారంతా మంటల్లోనే సజీవ దహనమయ్యారని ఆవేదన చెందాడు. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారని.. అనంతరం తనను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ప్రేమ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్తో స్క్రాప్ గోదాం ఓనర్ సంపత్ పై కేసు నమోదు పోలీసులు వెల్లడించారు. సంపత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, మృతులను సికిందర్(40), బిట్టు కుమార్ రామ్(20), సత్యేందర్ కుమార్(30), చెట్టిలాల్ రామ్(28), దామోదర్(27), శింటు కుమార్(27), దుర్గా రామ్(35), రాకేష్(25), దీపక్ కుమార్ రామ్(26), పంకజ్(26), దరోగా కుమార్(35)గా గుర్తించారు. ప్రేమ్(25) ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. -
జూన్‌లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని, దీనికి భయపడాల్సిన అవసరంలేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మొదటి వేవ్ నుంచి పరిశీలిస్తే నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో కరోనా వేవ్‌లు వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, ఫోర్త్ వేవ్ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. గాంధీఆస్పత్రిలో 14 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. నెల రోజులుగా గాంధీలో కోవిడ్ అడ్మిషన్, కోవిడ్ డెత్ ఒక్కటి కూడా జరగలేదన్నారు. గాంధీలో డైట్ కమిటీ సమావేశం... సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో రోగులకు ఆహారం అందించే డైట్ క్యాంటిన్ నిర్వహణ, పనితీరు మరింత మెరుగు పర్చేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సెమినార్ హాలులో డైట్ కమిటీ సమావేశం నిర్వహించారు. (క్లిక్: గుడ్ న్యూస్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై కీలక ప్రకటన) -
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా మారింది. వివక్షకు నిలువుటద్దాన్ని తలపిస్తోంది. తెలంగాణ వైద్య ప్రదాయినిగా.. ప్రభుత్వ వైద్యరంగానికి పెద్ద దిక్కుగా ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వైద్యుల నియామకాల్లో చిన్నచూపునకు గురవుతున్నాయి. ప్రధానమైన విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు సేవల్లో జాప్యంతో పాటు వైద్య విద్యాబోధన కుంటుపడుతోంది. – గాంధీ ఆస్పత్రి గాంధీలోని 35 విభాగాల్లో 273 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు మంజూరు కాగా ఖాళీగా 51 పోస్టులు ఉండటం గమనార్హం. ప్రధాన విభాగాలైన జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్, అనస్తీషియా, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎస్పీఎం తదితర విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. అనస్తీషియా, బయోకెమిస్త్రీ విభాగాలకు ప్రొఫెసర్లే లేకపోవడం అత్యంత దయనీయం. 60 మంది ప్రొఫెసర్లకు గాను 56 మంది మాత్రమే ఉన్నారు. వైద్యవిద్యా బోధనలో కీలకపాత్ర పోషించే అసోసియేట్ ప్రొఫెసర్లు 74 మందికి కేవలం 51 మంది ఉన్నారు. 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 విభాగాల్లో 139 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 115 మంది మాత్రమే ఉండగా, 24 ఖాళీలు ఉన్నాయి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సైకాలజీ, మైక్రోబయోలజీ, పెథాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఎస్పీఎం) వంటి నాన్క్లినికల్ విభాగాల్లో 59 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకుగాను ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. శస్త్రచికిత్సల్లో జాప్యం శస్త్రచికిత్సలో కీలకమైన అనస్తీషియా విభాగంలో వైద్యుల కొరత పట్టి పీడిస్తోంది. కేటాయించిన మూడు ప్రొఫెసర్ పోస్టులతోపాటు ఒక అసోషియేట్, ఎనిమిది అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 12 పోస్టులు గత కొన్నేళ్లుగా భర్తీ చేయకపోవడంతో పలు విభాగాల్లో జరగాల్సిన శస్త్రచికిత్సలు తరచూ వాయిదా పడుతున్నాయి. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యుల కొరత, శస్త్రచికిత్సల జాప్యం కారణంగా ఆపరేషన్ థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ముందుకు సాగని వైద్యవిద్య.. గాంధీ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యా బోధనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో గాంధీని కోవిడ్ నోడల్ సెంటర్‌గా ఏర్పాటు చేయడంతో వైద్యవిద్య కుంటుపడింది. ఓ వైపు కరోనా, మరోవైపు వైద్యుల కొరతతో రెండేళ్లుగా చదువులు ముందుకు సాగలేదని ఓ వైద్యవిద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా రెగ్యులర్ వైద్యుల నియామకం చేపట్టకపోవడం, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న వైద్యులకు విద్యాబోధనలో అనుభవం లేకపోవడం, కేవలం రోగుల వైద్యసేవలకే పరిమితం కావడంతో వైద్యవిద్య మూలనపడింది. భర్తీ చేయాల్సిన పోస్టులివే.. గాంధీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మూడు కేటగిరీల్లో మొత్తం 51 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆ వివరాలు ఇలా.. అనస్తీషియా– 12, జనరల్ మెడిసిన్– 5, నియోనెటాల్ పిడియాట్రిక్–1, రేడియాలజీ– 1, టీబీ అండ్ సీడీ – 2, సైకియాట్రిస్ట్– 3, కార్డియాలజీ– 1, నెఫ్రాలజీ –1, యూరాలజీ– 1, అనాటమీ–1, సైకాలజీ– 2, ఫార్మకాలజీ–1, ఫోరెన్సిక్ మెడిసిన్–1, మైక్రోబయోలజీ–1, పెథాలజీ–1, ఎస్పీఎం–2, గైనకాలజీ–4, పిడియాట్రిక్– 3, న్యూరాలజీ– 2, పిడియాట్రిక్ సర్జరీ– 2, న్యూరోసర్జరీ–1, సీటీ సర్జరీ– 3 పోస్టులతో పాటు మరో 8 నాన్క్లినికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
పేదల ప్రాణాలకు భరోసా
గాంధీఆస్పత్రి: కోవిడ్ సెకెండ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా బాధించింది. ఆక్సిజన్ అందక రోగి మృతి చెందాడు అనే వార్తలు దేశవ్యాప్తంగా వినిపించాయి. ఆయా ప్రభుత్వాలు ప్రాణవాయువు కోసం పాకులాడాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాహనట్యాంకుల ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఆయా ఆస్పత్రులకు సరఫరా చేసింది. నాటి పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో పలు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ నిధులతో అత్యంత అధునాతనమైన మరో ప్లాంట్‌ను సిద్ధం చేసింది. 26 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్‌ను నిల్వ చేసే ట్యాంకులున్నాయి. నూతనంగా మరో 20 కేఎల్ ట్యాంకు మంజూరైంది. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సుమారు మూడువేల మంది రోగులకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం గాంధీ ఆస్పత్రి సొంతం. ► కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో 20కేఎల్, 6 కేఎల్ (కిలోలీటర్లు) సామర్ధ్యం గల రెండు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు వెయ్యి మంది రోగులకువెంటిలేటర్‌పై 24 గంటల పాటు ఆక్సిజన్ అందించవచ్చును. ► 26 కేఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఉండగా, నూతనంగా మరో 20 కేఎల్ ట్యాంకు మంజూరైంది. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని నిర్మాణం పూర్తయితే 46 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుంది. ► సుమారు రెండున్నర కోట్ల రూపాయల పీఎం కేర్ నిధులతో కేంద్రప్రభుత్వం అత్యంత అధునాతనమైన రెండు ఆక్సిజన్ ప్లాంట్లను గాంధీప్రాంగణంలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే అక్సిజన్ 95 శాతం స్వచ్ఛంగా ఉంటుంది. ► కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా నిమిషానికి వెయ్యి చొప్పున రెండు యూనిట్స్ ద్వారా రెండు వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చును. ఆక్సిజన్ ప్రెషర్ స్వింగ్ ఎడ్సార్ప్‌సన్ పద్ధతిలో ఈ యూనిట్ పనిచేస్తుంది. ► కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పలు ఫార్మా, ల్యాబోరేటరీలకు చెందిన ఆరు కంపెనీలు కోట్లాది రూపాయల వ్యయంతో గాంధీప్రాంగణంలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాయి. ఈయూనిట్ల ద్వారా గాలిలో ఉన్న ఆక్సిజన్ (అట్మాస్పియర్ ఎయిర్) ను సేకరించి, ప్రత్యేక పద్ధతిలో ఆక్సిజన్‌ను వేరుచేసి పైప్లైన్ల ద్వారా రోగులకు సరఫరా చేస్తారు. ► గాలిలో 20 శాతం ఆక్సిజన్, 70 శాతం నైట్రోజన్, 10 శాతం వివిధ రకాల గ్యాస్‌లు ఉంటాయి. అట్మాస్పియర్ ఎయిర్ ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్ 93 నుంచి 95 శాతం స్వచ్ఛంగా ఉండగా, లిక్విడ్ ఆక్సిజన్ 99 శాతం çప్యూరిటీగా ఉంటుంది. వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తారు. ► గాంధీఆస్పత్రిలో ప్రధాన భవనంలోని ఎనిమిది అంతస్థులు, ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్, అత్యవసర విభాగ భవనాలు, ఎమర్జెన్సీవార్డులు, లేబర్‌రూంలతోపాటు గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని లైబ్రరీ భవనంలో ఆక్సిజన్ పైప్లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ పైప్లైన్ల పొడవు సుమారు 52 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ► ఆక్సిజన్ పైప్లైన్లు మరమ్మత్తులకు గురైతే రోగులకు అందించేందుకు సుమారు 200 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు నేరుగా తీసుకువెళ్లేందుకు సిలిండర్లకు ట్రాలీలు అనుసంధానం చేశారు. ► గాంధీలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి. పీఎం కేర్ ఆధ్వర్యంలో రెండు యూనిట్లు, అరబిందో ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్, దివీస్ ల్యాబోరేటరీస్, హెటిరో ల్యాబ్స్, ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్, నాట్కో ఫార్మా లిమిటెడ్ కంపెనీలు ఆక్సిజన్ ప్లాంట్స్‌ను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత కోవిడ్ నోడల్ సెంటరైన గాంధీఆస్పత్రిలో అత్యంత అధునాతన వసతులు, మౌళిక సదుపాయాలు కల్పించి, నిరుపేదలకు మరింత మెరుగైన సేవలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. సుమారు రెండువేలకు పైగా వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు సిద్ధం చేశామని, సుమారు మూడు వేల మంది రోగులకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యం సాధించామన్నారు. – రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ -
TS: ఆస్పత్రుల్లో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి : తెలంగాణలో కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లోనూ కేసులు బయటపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కేసులు బయటపడుతుండడం చూస్తున్నాం. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 120 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రి సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 120 మందికి పైగా కరోనా సోకగా.. ఇందులో 38 మంది వైద్యులు, 48 మంది పీజీ విద్యార్థులు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ పరిణామాలతో పేషెంట్ల ట్రీట్మెంట్ కి ఇబ్బందులు ఎదురవుతుండగా.. పేషెంట్ల బంధువుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇన్ పేషంట్లు గా ఉన్న 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు 9మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. లక్షణాలు ఉన్న మరికొందరి ఆసుపత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. భద్రాద్రిలో.. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షణాలున్న 286 మందికి కరోనా పరీక్షలు నిర్వహించించగా.. వీళ్లలో 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ వెల్లడించారు. -
గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ పౌరులతోపాటు కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో 44 మందికి, ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌గా తేలింది. గాంధీలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు బోధన సిబ్బంది, 10 మంది హౌజ్ సర్జన్స్ కోవిడ్ బారిన పడ్డారు. అదే విధంగా ఉస్మానియాలో 25మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ స్టూడెంట్స్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా తెలంగాణలో సోమవారం 1,825 కోవిడ్ కేసులు నమోదయయాయి. ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,95,855, మరణాల సంఖ్య 4,043కి చేరింది. ప్రస్తుతం 14, 995 యాక్టివ్ కేసులున్నాయి. చదవండి: కరీంనగర్లో దంచికొట్టిన వాన..కుప్పకూలిన 70 అడుగుల లైటింగ్ కటౌట్ చదవండి: సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ -
ఆశలన్నీ హరీష్‌రావుపైనే..
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి కీలక విభాగాల్లో ప్రధానమైన సమస్యలు కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్నాయి. అత్యంత ప్రాధాన్యత గల వైద్యశాఖకు పలువురు మంత్రులు మారిన ‘గాంధీ’ పరిస్థితుల్లో మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో సిద్ధం చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చక బుట్టదాఖల అవుతున్నాయి. నిధులు మంజూరైనా పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. ఆర్థిక, సాంకేతిక పరమైన అడ్డంకులతోపాటు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధి ఫలాలు అందడం లేదని నిరుపేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావుకే వైద్య ఆరోగ్య శాఖ అప్పగించడంతో గాంధీ దవాఖానాలో నెలకొన్న సమస్యలు పరిష్కారమైనట్లేనని ఆస్పత్రి పాలనయంత్రాంగంతోపాటు వైద్యులు, రోగులు భావిస్తున్నారు. వైద్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈనెల 11న హరీష్‌రావు గాంధీ ఆస్పత్రిని సందర్శించి, రేడియాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ మెషిన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం గాంధీ పాలనయంత్రాంగం, అధికారులు, వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమస్యలు ఇవీ.. ►కార్డియాలజీ విభాగంలోని క్యాథ్‌ల్యాబ్ రెండేళ్లుగా పనిచేయడంలేదు. వేలాది మంది హృద్రోగులు అప్పులు చేసి ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. నూతన క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు ప్రతిపాదనల దశలోనే ఉంది. ఆధునిక క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసి గుండె చప్పుడు ఆగి పోకుండా చూడాలని పలువురు హృద్రోగులు కోరుతున్నారు. ►రేడియాలజీ విభాగంలోని ఎమ్మారై స్కానింగ్ మెషిన్ మూలనపడింది. కోట్లాది రూపాయలతో అత్యాధునిక మెషిన్ కొనుగోలు చేశారు. విద్యుత్ సరఫరా చేసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడంతో సదరు ఎమ్మారై మిషన్ గోడౌన్‌కే పరిమితమైంది. ►సీడాక్ సంస్థతో ఒప్పంద కాలపరిమితి ముగియడంతో కంప్యూటర్ వ్యవస్థ పనిచేయడంలేదు. ఓపీ విభాగంలో చేతి రాతతో చిట్టీలు ఇవ్వడంతో రోగులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చునే పరిస్థితి నెలకొంది. ►ఐపీ బ్లాక్‌లోని ఆస్పత్రి 8వ అంతస్తులో అవయవ మార్పిడి కోసం మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం సుమారు రూ.50 కోట్లు కేటాయించినట్లు ప్రకటించగా, నేటికీ టెండరు ప్రక్రియ దాటకపోవడం గమనార్హం. ►రోగులతోపాటు వైద్యులకు ఆహార పదార్థాలు స రఫరా చేసే డైట్ క్యాంటిన్ సెల్లార్‌లోని మురుగునీటిలోనే కొనసాగుతోంది. డైట్ క్యాంటిన్ నిర్మా ణం కోసం స్థల పరిశీలన దశలో ఆగిపోయింది. ►సీసీ కెమెరాలు ఏర్పాటు గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొనసాగుతోంది. వైద్యులపై తరచూ దాడులు జరగడంతోపాటు రోగులకు చెందిన విలువైన వస్తువులు దొంగతనాలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విశేషం. ►20 లక్షల చదరపు అడుగుల వైశ్యాలం గల గాంధీ ప్రాంగణంలో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ టేకర్ సిబ్బంది సరిపడేంత లేరు. వీరి సంఖ్య పెంచాలని లిఖితపూర్వకంగా పలుమార్లు విజ్ఞప్తి చేసిన వైద్య ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆస్పత్రికి చెందిన ఓ కీలక అధికారి వ్యాఖ్యానించడం విశేషం. ►పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గాంధీ వైద్యులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని పెంచకపోవడం గమనార్హం. గ్రామాన్ని తలపించే గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్ కొనసాగుతున్నాడు. దశాబ్ధాలుగా రిక్రూట్మెంట్ లేకపోవడం, ఉన్నవారంతా పదవీవిరమణ పొందడంతో ఆయా రంగాల్లో నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ►సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్కింగ్ టెండర్లు రద్దు చేయడంతో వేలాది వాహనాలు గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. దారి లేకపోవడం ప్రాణాపాయస్థితిలో అంబులెన్స్‌ల్లో వచ్చే బాధితులుకు వైద్యసేవలు అందించడంలో జాప్యం జరుగుతోంది. ►గాంధీ ఆస్పత్రిలో ఫైర్ సేప్టీ లేకపోవడంతో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించి కోట్లాది రూపాయల వైద్య పరికరాలు బూడిత అవుతున్నాయి. ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని కోరుతూ గాంధీ అధికారులు పలుమార్లు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవలే అగ్ని ప్రమాదం సంభవించడంతో వారాల పాటు వైద్యసేవలకు విఘాతం కలిగింది. ►వీటితో పాటు అనేక చిన్నాచితక సమస్యలతో నిరుపేద రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నిరుపేదల రోగులతోపాటు వైద్యులు, వైద్యవిద్యార్థులు, సిబ్బంది సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని వైద్య మంత్రి హరీష్‌రావును కోరుతున్నారు. -
Hyderabad: వ్యాధుల రొద.. రోగుల వరద!
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా మహమ్మారి జడలు విప్పి నాట్యం చేస్తుంటే.. దీనికి తోడు ఇతర వ్యాధులూ నగర వాసుల్ని పట్టిపీడిస్తున్నాయనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. డెంగీ, మలేరియా, డయేరియా, విష జ్వరాలు జనాలను భయకంపితుల్ని చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. వందల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు దవాఖానాలకు పోటెత్తుతున్నారు. సోమవారం గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చికిత్స కోసం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించడం వ్యాధుల తీవ్రతకు దర్పణం పడుతోంది. చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు.. ఫీవర్ ఆస్పత్రిలో క్యూలైన్.. నిలోఫర్ ఆవరణలో కిక్కిరిసి.. -
గాంధీ ఆస్పత్రి: హృదయ విదారకం.. ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు..
సాక్షి, గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి గైనకాలజీ విభాగంలో ఇరువురు బాలింతలకు ఒకే బెడ్ కేటాయించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రధాన భవనంలోని మొదటి, రెండు అంతస్తుల్లో గైనకాలజీ విభాగం కొనసాగుతోంది. గైనిక్ సాధారణ, లేబర్ వార్డుల్లో కలిపి సుమారు 200 మందికి వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. ప్రతిరోజు 25 నుంచి 30 డెలివరీలు జరుగుతాయి. ఇరువురు బాలింతలకు ఒకే బెడ్ కేటాయించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. కరోనా సమయంలో బాలింతలు, శిశువుల కలిసి మొత్తం నలుగురు ఒకే పడకపై ఎలా పడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేబర్‌వార్డులో ఒకే మంచంపై ఇరువురు బాలింతలు తమ శిశువులతో ఉన్న దృశ్యాలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి పాలన యంత్రాంగం స్పందించి విచారణ చేపట్టింది. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం కోవిడ్ పడకలతో సమస్య ఉత్పన్నం.. కరోనా మొదటి, సెకండ్‌వేవ్‌ల సమయంలో గాంధీ గైనకాలజీ విభాగం అత్యుత్తమ సేవలు అందించింది. కరోనా సోకిన వందలాది మంది గర్భిణులకు పురుడు పోసి తల్లీబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పాజిటివ్ గర్భిణులు, థర్డ్‌వేవ్ వస్తే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కొన్ని వార్డులను కరోనా కోసం కేటాయించడం, డెలివరీ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో పడకల సమస్య ఉత్పన్నమయినట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట గైనకాలజీ పడకల సంఖ్య పెంపు.. గైనకాలజీ విభాగంలో పడకల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. ఇరువురు బాలింతలకు ఒకే బెడ్ కేటాయించినట్లు మా దృష్టికి రావడంతో విచారణ చేపట్టాం. కొన్ని బెడ్లపై బాలింతలతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయకులు ఉన్నట్లు గుర్తించాం. గైనకాలజీ విభాగంలో కొన్ని వార్డులను కోవిడ్‌కు కేటాయించడంతో అందుబాటులో ఉన్న పడకల సంఖ్య కొంతమేర తగ్గాయి. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
Gandhi hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా స్వల్ప లక్షణాలున్నాయి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. గత రెండురోజులుగా నీరసంగా ఉంటే Covid టెస్టు చేయించుకుని, Positive గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులూ,Please isolate yourselves. I have mild symptoms. Nothing to worry at all. pic.twitter.com/mqYTfC8fmL — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 10, 2021 ఆదివారం నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ భారీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. -
Hyderabad: థర్డ్‌వేవ్ నేపథ్యంలో అప్రమత్తం.. ఆసుపత్రులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేర్పిన గుణపాఠంతో ప్రభుత్వాలు మేల్కొన్నాయి. వందకు పైగా పడకలున్న ఆస్పత్రుల్లో ఇక ఆక్సిజన్ ప్లాంట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రంగంలోకి దిగింది. అన్ని ఆస్పత్రుల్లో ఇకపై ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మహా నగరంలో ఇప్పటికీ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లోనే కాదు అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు లేవు. రోగుల అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కంపెనీల నుంచి సిలిండర్లు తెప్పించి అందిస్తుండటం, అత్యవసర పరిస్థితుల్లో తీవ్రమైన కొరత ఏర్పడుతుండటం ఈ అంశం ఇటు ప్రైవేటు ఆస్పత్రులనే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఇరుకునపెడు తోంది. థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొస్తున్న నేపధ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆ మేరకు నూరు పడకలు దాటిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు తప్పనిసరి చేసి ఆ మేరకు ఆయా ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది. భవిష్యత్తు అవసరాల మేరకు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో 19,697 సాధారణ పడకలు ఉండగా, 16405 ఆక్సిజన్, 8,486 వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. నిజానికి ఆయా ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యసేవలు అందాలంటే రోజుకు కనీసం 384 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఆ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఇదే అంశాన్ని కేంద్రానికి స్పష్టం చేసింది. అయితే కేంద్రం మాత్రం రోజుకు 160 నుంచి 200 టన్నులకు మించి సరఫరా చేయలేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ప్రత్యేక రైళ్లు, విమానాలు పంపి ప్రాణవాయువు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఆ విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తుగా వందపడకల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ పరిధిలోని ఆస్పత్రులకు తాఖీదులు జారీ చేస్తున్నారు. పడకల సామర్థ్యాన్ని బట్టి ప్లాంట్ తెలంగాణ వ్యాప్తంగా వంద పడకలకుపైగా ఉన్న ఆస్పత్రులు 500 వరకు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే 300 వరకు ఉన్నాయి. ఇక 200 పడకలు దాటిన ఆస్పత్రులు వంద వరకు ఉండగా...500 పడకలు దాటినఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. వీటిలో వంద నుంచి 200 పడకల సామర్థ్యం ఉన్న ఒక్కో ఆస్పత్రిలో నిమిషానికి 500 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ట్యాంకులను, 200 నుంచి 500 పడకలు ఉన్న ఆస్పత్రిలో నిమిషానికి 1000 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంటును, 500పైగా పడకలున్న ఆస్పత్రిలో నిమిషానికి 2వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో రూ.2.50 కోట్లతో నిమిషానికి రెండు వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఉత్పత్తి ప్లాంటును ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. సామాజిక బాధ్యతగా మరో ఆరు కార్పొరేట్ సంస్థలు ఇదే ఆస్పత్రిలో ఐదు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా రోజుకు నాలుగు టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన ఆక్సిజన్ ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తారు. ఆక్సిజన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం (నిమిషానికి) ఇలా... పడకల సామర్థ్యం ఉత్పత్తి సామర్థ్యం 100 నుంచి 200 500 ఎల్పీ 200 నుంచి 500 1000 ఎల్పీ 500పైగా.. 2000 ఎల్పీ -
Gandhi Hospital: 19 నుంచి నాన్‌కోవిడ్ సేవలు
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి కోవిడ్, నాన్‌కోవిడ్ సేవలు అందించాలని ఆస్పత్రి అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి గాంధీలో కేవలం కోవిడ్ బాధితులకు మాత్రమే వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న క్రమంలో నాన్‌కోవిడ్ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గాంధీలో 215 కరోనా, 179 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు వైద్యసేవలు పొందుతున్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్న 44 మందిని సోమవారం డిశ్చార్జీ చేసినట్లు నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నాన్‌కోవిడ్ సేవలను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. ఆర్థో ఐసీయూ, సెకండ్ ఫ్లోర్‌తో పాటు లైబ్రరీ భవనంలో కోవిడ్, బ్లాక్‌ఫంగస్ వార్డులు ఏర్పాటు చేస్తామని, గతంలో మాదిరిగా క్యాజువాలిటీ, ఓపీ, ఐపీ భవనాల్లో నాన్‌కోవిడ్ సేవలు కొనసాగుతాయని వివరించారు. థర్డ్‌వేవ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తీవ్రత ఏమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
థర్డ్‌వేవ్‌పై ఆందోళన.. డాక్టర్లేమంటున్నారంటే..
సాక్షి, హైదరాబాద్: ‘ఆగస్టు మొదటి వారంలో థర్డ్‌వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే వైరస్ తీవ్రతపై ఇప్పటికీ స్పష్టత లేదు. సెకండ్ వేవ్‌లో కనిపించినంత తీవ్రత కన్పించకపోవచ్చు. దీనిపై ఆందోళన అవసరం లేదు. డెల్టా ఫ్లస్ వంటి కొత్త వేరియంట్లు వస్తే కేసులు పెరిగే అవకాశం ఉంది’ అని గాంధీ ఆస్పత్రి సపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఇప్పటి వరకు 500 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందించామని, వీరిలో వంద మందికి దవడ రీకన్స్ట్రక్షన్ సర్జరీలు, 300 మంది ముక్కు, వంద మందికి పైగా కంటి సంబంధిత చికిత్సలు చేసినట్లు తెలిపారు. 50 వేల మందికి చికిత్స.. ఫస్ట్‌వేవ్‌లో 35 వేల మందికి చికిత్స చేశామని. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 15 వేల మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. సెకండ్‌వేవ్‌లో సీరియస్ కేసులే ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బాధితుల్లో 1500 మంది చిన్నారులు ఉన్నారని. మరో 1500 మంది గర్భిణులకు ఆస్పత్రిలో పురుడు పోశామన్నారు. ఆశీర్వాదాలే ఇమ్యూనిటీ బూస్టర్లు.. ఫస్ట్‌వేవ్‌లో చికిత్సపై ఓ స్పష్టత లేదని, రోజంతా పీపీఈ కిట్లు ధరించి, రోగుల మధ్య గడపాల్సి వచ్చిందన్నారు. దాదాపు 15 నెలలుగా రోగుల మధ్యే జీవిస్తున్నామని, ఇప్పటి వరకు ఆస్పత్రిలో 280 మందికి పైగా వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో కోలుకున్న వారి ఆశీ ర్వదాలే తమకు ఇమ్యూనిటీ బూస్టర్లుగా పని చేస్తున్నాయి. కేసులు మరింత తగ్గితేనే.. ఆస్పత్రిలో 700 మంది వరకు చికిత్స పొందుతున్నారని, కోవిడ్ సహా బ్లాక్‌ఫంగస్ కేసుల సంఖ్య తగ్గితే సాధారణ సేవలు పునరుద్ధరిస్తామన్నారు. -
ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: వైఎస్ షర్మిల
హైదరాబాద్: వరి, మిర్చి పంటలు కొనుగోలు చేయాలని రైతన్నలు ఆందోళనలు ఓవైపు.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదనే మనస్తాపంతో మరోవైపు నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఇంకోవైపు. ఈ కరోనా కష్ట కాలంలో మహిళలు తమ కుటుంబ పోషణ కోసం తమ పేరుమీదున్న ఇళ్లను, బంగారాన్ని, చివరకు, మంగళ సూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి.. దీనస్థితిలో కాలం వెళ్ల దీస్తున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ తెలంగాణలోని వాస్తవ పరిస్థితి, కానీ ప్రభుత్వానికి ఇవేమి కనిపించడం లేదన్నారు. వైఎస్.షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరాశోభన్ తో కలిసి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కోవిడ్ మేనేజ్మెంట్ బాగుందని, టెస్టింగ్ గానీ, వ్యాక్సినేషన్ సిస్టమ్ గానీ, మెడికల్ సర్వీసెస్ అంతా బాగుందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ‘అన్నీ బాగున్నాయని మీకు మీరు సొంత డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అసలు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ముందు తెలుసుకోవాలన్నారు. అటు.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా.. సీఎం కేసీఆర్ కూడా తాను చేసే పనులు తెలంగాణ ప్రజలెవ్వరూ గమనించడం లేదనుకోవడం పొరబాటన్నారు. చికిత్స కోసం యశోద ఆసుపత్రి వెళ్లిన కేసీఆర్ పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతి రోజు తాము విన్నవిస్తున్నా.. దున్నపోతు మీద వాన పడ్డ చందంగా దాన్ని ఈ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. తమ ఒత్తిడి తట్టుకోలేక కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణలోని 26 లక్షల కుటుంబాలకే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి కేసీఆర్ దొర, దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నామన్నారు. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒట్టి దిక్కుమాలిన పథకం అన్న కేసీఆర్.. ఇప్పుడే అదే స్కీమ్‌లో ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అటు.. ఆయుష్మాన్ భారత్‌లో అన్ని వ్యాధులకు 5 లక్షల రూపాయల వరకే పరిమితి ఉందని, అదే ఆరోగ్యశ్రీలో కొన్ని పథకాలకు 13 లక్షల రూపాయల వరకు పరిమితి ఉందని షర్మిల తెలిపారు. కరోనా వైద్యానికి లక్షలకు లక్షలు ఖర్చువుతున్నాయని, ఈ డబ్బునంతా ఎవరు చెల్లిస్తారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలని మరోమారు డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ షర్మిల. ఇక కరోనా సమయంలో చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం డ్వాక్రా మహిళలు 10 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని, ఇది గత ఏడాదితో పోలిస్తే 60 శాతం అధికమని ఆమె చెప్పుకొచ్చారు. ఉపాధి లేక, ఆదాయం రాక, ప్రభుత్వం ఆదుకోక లక్షలాది మహిళలు అప్పుల పాలయ్యారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అటు.. వైఎస్సార్ పాలనలో మాదిరిగా ఇప్పుడున్న కేసీఆర్ పాలనలో విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అని మాట ఇచ్చి ఆ మాటను సీఎం కేసీఆర్ తప్పడం వల్లే, పిల్లల చదువుల కోసం మహిళలు అప్పులు చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పుడు వైద్యానికి తోడు, బతికేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మహిళా సాధికారతా..? ఆడవాళ్లు అప్పులు చేస్తే గానీ ఇళ్లు గడవలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉందన్నారు. ఇదేనా సంక్షేమం, ఇదేనా మహిళా సాధికారతా.. ముఖ్యమంత్రి ఆలోచన చేయాలన్నారు. మహిళలంటే సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ చులకనేనని అందుకే వారికి పదవులు ఇవ్వరన్నారు. ఒకవేళ వాళ్లు తిరగబడితే తెలంగాణ తల్లి సాక్షిగా వారిపై దాడులు చేసి అవమానిస్తారని వాపోయారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్ల, చేతగాని తనం వల్ల 10 లక్షలకు పైగా మహిళలు అప్పుల పాలయ్యారని, డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ‘గత మూడేళ్లుగా మహిళా సంఘాల రుణాల వడ్డీలకు ఎగనామం పెడుతున్నారు. ఆ వడ్డీ భారం కూడా అక్కచెల్లెమ్మల మీదే పడుతుంది. ఆ వడ్డీ, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇది కేసీఆర్ ప్రభుత్వ కనీస బాధ్యత’ అని అన్నారు. చదవండి: కరోనా కాలం: మరీ 70 వేల రూపాయలా?! సాకులతో సరి.. సీరియస్‌నెస్ లేదు మరి! -
ధైర్యంగా ఉండండి.. కరోనా బాధితులకు కేసీఆర్ భరోసా
సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్యం ఎలా ఉంది?.. వైద్యులు బాగా చూస్తున్నారా?.. వేళకు మందులిస్తున్నారా?.. భోజనం బాగుందా?..’ అంటూ గాంధీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో తొలిసారి బుధవారం ఆయన గాంధీ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. నేరుగా ఐసీయూలోకి వెళ్లి ఆక్సిజన్, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను పరామర్శించారు. పీపీఈ కిట్లు, చేతులకు గ్లౌవ్స్ లేకుండా కోవిడ్ వార్డును సందర్శించి బాధితులతో మాట్లాడారు. ‘మీది ఏ ఊరు?.. ఏం పేరు?.. వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. నేను కూడా ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డాను. హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నాను. మీరు కూడా కోలుకుంటారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి.. అన్ని విధాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అని రోగుల బంధువులకు భరోసా ఇచ్చారు. రోగులు, వారికి సహాయకులుగా వచ్చిన వారు చెప్పింది ఓపికగా విని, తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గాంధీలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. నిమిషానికి 2,000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్లాంటు మొత్తం కలియతిరిగి పనితీరు, ఉత్పత్తి, ఆక్సిజన్ నాణ్యతపై డాక్టర్ రాజారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాంధీలో వైద్యసేవలు అందిస్తున్న ఔట్ సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు, జూనియర్ వైద్యులతో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రాణాలు తెగించి వైద్య సేవలు అందిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. ఇదే సమయంలో కొంత మంది ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు, జూనియర్ డాక్టర్లు సమస్యలతో కూడిన వినతీపత్రం సీఎంకు అందించేందుకు యత్నించగా.. ‘మీ సమస్య నా దృష్టిలో ఉంది. త్వరలోనే మీతో మాట్లాడుతా. అన్ని సమస్యలు పరిష్కరిస్తా’ అని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేసి పంపాలని అక్కడే ఉన్న డీఎంఈ రమేష్‌రెడ్డిని ఆదేశించారు. వైద్య సిబ్బందికి భరోసా ‘క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి బ్రహ్మండంగా సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలి. మీకు ఏదైనా సమస్య ఉన్నా.. అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి, మీకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది’ అంటూ ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బందికి భరోసా ఇచ్చారు. సుమారు గంటపాటు ఆస్పత్రిలో ఉన్నారు. సీఎం రాకతో ఉదయం 10 గంటలకే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాంధీకి చేరుకుని, ఆస్పత్రిలోని వార్డులు సహా పరిసర ప్రాంతాలను రసాయణాలతో శానిటైజ్ చేశారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న రోగుల సహాయకులను బయటికి పంపారు. గాంధీ ఆస్పత్రి సందర్శనలో సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్‌రెడ్డి, పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆనందం.. ‘2007 నుంచి ఆస్పత్రిలో 220 మందిమి ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్నం. ఎబోలా, స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడే కాకుండా ప్రస్తుతం కోవిడ్ వార్డుల్లోనూ విధులు నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో భాగంగా మా ప్రాణాలే కాకుండా.. మా కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నాం. మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి ఆదుకోండి’ అని స్టాఫ్ట్ నర్సులు సీఎం కేసీఆర్‌తో మొరపెట్టుకున్నారు. దీనికి ఆయన సుముఖతను వ్యక్తం చేయడమే కాకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఔట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తామెంతో ఎంతో సంతోషిస్తామని స్పష్టం చేశారు. సీఎం రాక గర్వకారణం.... సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి రావడం గర్వకారణంగా భావిస్తున్నాం. ఐసీయూ సహా మరో మూడు వార్డులు సందర్శించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల రోగులతో స్వయంగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వెంటిలేటర్‌పై ఉన్నవారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపారు. వారి సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. – డాక్టర్ రాజారావు, సూపరింటిండెంట్, గాంధీ రోగులకు ధైర్యం... ‘మీది ఏ ఊరు?.. ఏం పేరు?. నేను కూడా కోవిడ్ బారిన పడ్డా. హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నా. మీరు కూడా కోలుకుంటరు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం అన్ని విధాలా మీకు అండగా ఉంటుంది.’ ఔట్సోర్సింగ్ నర్సులకు హామీ... ‘కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది సేవలు అందిస్తుండటం అభినందనీయం. క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలి. మీకు ఏదైనా సమస్య ఉన్నా.. అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి, మీకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది’ రేపు వరంగల్ ఎంజీఎంకు సీఎం సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడనున్నారు. చదవండి: యథావిధిగా ఆంక్షలు.. అదనపు సడలింపులు లేనట్టే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలను పరిశీలించిన సీఎం కేసీఆర్
-
తొలిసారిగా గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్
-
కోవిడ్ బాధితులను పరామర్శించిన కిషన్ రెడ్డి
-
గాంధీ ఆస్పత్రి: కరోనా బాధితులు ఫుల్, ఐసీయూ బెడ్లు నిల్
గాంధీఆస్పత్రి: కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఐసీయూ పడకలు రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఉన్న 722 మంది రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీలో మొత్తం 1850 పడకలు ఉండగా 500 ఐసీయూ (వెంటిలేటర్), 1250 ఆక్సిజన్ బెడ్ల కోసం కేటాయించారు. ఐసీయూ పడకలు రోగులతో నిండిపోవడంతో వెంటిలేటర్ అవసరమైన రోగులు అంబులెన్స్‌ల్లోనే గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నెలకొంది. అత్యవసర విభాగం వద్ద కరోనా ట్రైయాజ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి రోగుల చిరునామా ఇతర వివరాలను నమోదు చేసి వైద్యపరీక్షల అనంతరం వార్డుల్లోకి తరలిస్తున్నారు. కరోనా మృతుల సంఖ్య అమాంతం పెరగడంతో కోవిడ్ మార్చురీగా మార్చారు. ఇక్కడ సుమారు 150 మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉంది. సాధారణ పోస్టుమార్టంలను నిలిపివేశారు. ప్రమాదాల్లో మృతి చెందినవారిని ఉస్మానియా మార్చురీకి తరలిస్తున్నారు. ఆక్సిజన్ కొరత లేదు సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదు. ఇక్కడ 20 టన్నులు, 6 టన్నుల కెపాసిటీ కలిగిన రెండు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఆక్సిజన్ ట్యాంకులను నింపుతున్నాం. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి బాధితులు చివరి నిమిషంలో గాంధీఆస్పత్రికి రిఫరల్‌పై వస్తున్నారు. గాంధీ వైద్యులు, సిబ్బంది రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన సెకండ్‌వేవ్ పట్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి. – రాజారావు, సూపరింటెండెంట్ ( చదవండి: GHMC Sanitation: పేరు గొప్ప.. ఊరు దిబ్బ ) -
రేపటి నుంచి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్
-
గాంధీ కోవిడ్ ఆస్పత్రి.. కరోనా రోగులకే సేవలు
సాక్షి, హైదరాబాద్, గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం, మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మళ్లీ పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు, సర్జరీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న సాధారణ రోగులను డిశ్చార్జి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. నాన్ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు గాంధీ ఆస్పత్రి పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వైద్య విద్యార్థుల అభ్యర్ధన మేరకు.. జనవరి నుంచి సాధారణ ఓపీ, ఇన్‌పేషెంట్ సేవలను కూడా ప్రారంభించారు. మొత్తం 1,890 పడకల్లో 300 పడకలను కోవిడ్ విభాగానికి కేటాయించి, మిగతా సేవలు అందించారు. అయితే కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గాంధీలో కోవిడ్ బెడ్లను కూడా పెంచుతూ వచ్చారు. తాజాగా మళ్లీ పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో ఒక్క రోజే 152 మంది హెల్త్ సీరియస్‌గా ఉన్న కరోనా రోగులు అడ్మిట్ కావడం ఆందోళనకరంగా మారింది. గాంధీలో 400 వెంటిలేటర్, 1,250 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోగుల సంఖ్య మరింత పెరిగితే ఓపీ విభాగం, లైబ్రరీ భవనాల్లో మరో 300 బెడ్లు అదనంగా ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేశారు. సాధారణ రోగులకు ఇబ్బంది ప్రస్తుతం గాంధీలో 462 మంది కోవిడ్, 923 మంది నాన్ కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. నాన్ కోవిడ్ విభాగంలో సాధారణ సమస్యలతో చికిత్స పొందుతున్నవారు 75 శాతం వరకు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే వారిని డిశ్చార్జి చేయడం మొదలుపెట్టారు. అయితే ఇలా హఠాత్తుగా డిశ్చార్జి చేసి ఆస్పత్రి నుంచి వెళ్లిపొమ్మంటుండటంతో రోగులు, వారి బంధువులు అయోమయానికి గురవుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన రోగులు అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆందోళనలో పడ్డారు. ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా కొందరు అనివార్య పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు ఉస్మానియా దాదాపు ఫుల్ ఉస్మానియా పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే ఆ భవనాన్ని ఖాళీ చేశారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఓపీ, కులీకుతుబ్‌షా భవనంలో కలిపి 948 పడకలు అందుబాటులో ఉండగా.. ఇప్పటికే 630 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇక గాంధీ నుంచి పెద్ద సంఖ్యలో రిఫరల్‌పై వచ్చే రోగులను ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక వైద్యులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉస్మానియాకు రోజూ సగటున 1,800 నుంచి 2,000 వరకు ఓపీ రోగులు వస్తున్నారు. గాంధీ మూతపడటంతో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ఓపీ, ఇన్‌పేషెంట్లకు చికిత్స ఎలాగన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు ఈఎస్ఐ, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏరియా ఆస్పత్రుల్లో బెడ్లు పెంపు రోగుల రద్దీ నేపథ్యంలో ప్రస్తుతమున్న కోవిడ్ ఆస్పత్రులకు అదనంగా.. కొత్తగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో 8, హయత్‌నగర్ సీహెచ్‌సీలో 6, జంగమ్మెట్, సీతాఫల్మండిలో 10 పడకల చొప్పున, శ్రీరాంనగర్ యూసీహెచ్‌సీలో ఐదు పడకలు అదనంగా సమకూర్చారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే.. ‘‘కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకే గాంధీని కోవిడ్ ఆస్పత్రిగా మార్చుతున్నారు. గాంధీలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలు, ఇతర వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇక్కడ శనివారం నుంచి కేవలం కోవిడ్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సీరియస్‌గా ఉన్న 462 మంది కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాం.’’ -రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ హైదరాబాద్‌లోని పలు కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు, రోగుల లెక్క ఇదీ.. ఆస్పత్రి మొత్తం బెడ్లు రోగులు గాంధీ ఆస్పత్రి 1,890 424 టిమ్స్ 1,261 455 ఈఎస్ఐ 109 102 కొండాపూర్ 110 09 కింగ్‌కోఠి 350 240 చెస్ట్ ఆస్పత్రి 123 53 చదవండి: సాధారణ కరోనా రోగులకు బెడ్స్ లేనట్టే..! కర్ణాటక సీఎం యడ్యూరప్పకు మళ్లీ పాజిటివ్.. ఆస్పత్రికి తరలింపు -
కరోనా ఉధృతి : టీకా కోసం పడిగాపులు
గాంధీ ఆస్పత్రి : కరోనా వైరస్ నివారణకు గాను ఒక వైపు టీకా ఉత్సవ్ పేరిట ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రచారం జరుగుతుండగా, మరోవైపు సెకెండ్ డోస్ వ్యాక్సిన్ కోసం గంటల తరబడి నిరీక్షించిన వయోవృద్ధులు నిరాశతో వెనుతిరిగిన ఘటన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి వ్యాక్సిన్ సెంటర్లో జరిగింది. వివరాలు... ఈనెల 12వ తేదిన కోవాగ్జిన్ సెకెండ్ డోస్ తీసుకోవాలని సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 80 మంది సీనియర్ సిటిజన్స్ సోమవారం ఉదయం 8.30 గంటలకు గాంధీ టీకా కేంద్రానికి చేరుకున్నారు. వీరందరికీ ఇచ్చేందుకు సరిపడ కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు స్టాక్ లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు నిరీక్షించారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వృద్ధులు గంటల కొద్ది నిరీక్షించి నీరసానికి గురయ్యారు. 33 డోసులు తక్కువ వచ్చాయి : రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ పలువురు వృద్ధులు సెకెండ్డోస్ టీకా కోసం నిరీక్షించిన మాట వాస్తమేనని, కొన్ని డోసులు తక్కువ రావడంతో సమస్య ఉత్పన్నం అయిందని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఈనెల 12వ తేదిన 73 మందికి కోవాగ్జిన్ సెకెండ్ డోస్ వేయాల్సి ఉందని, అయితే 40 డోసులే రావడంతో మిగిలిన 33 మందికి టీకా వేయలేకపోయామని వివరించారు. -
ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయమే ప్రాణం తీసింది!
చిలకలగూడ: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంచడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాకతీయ వర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున నిమ్స్ మిలీనియం బ్లాక్ ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్ రాంసింగ్ తండాకు చెం దిన సునీల్ డిగ్రీ చదివాడు. ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగం కోసం ప్రయ త్నం చేస్తున్నాడు. 2016లో నిర్వహించిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించి దారుఢ్య పరీక్షల్లో రాణించలేకపోయాడు. ప్రస్తుతం హన్మకొండలో పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ప్రభుత్వం ఇక ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయదన్న మనస్తాపంతో గత నెల 26న కేయూ క్రీడా మైదానంలో పురుగుల మందు తాగాడు. ‘నేను చేతకాక చావడం లేదు.. నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే అతడిని ఎంజీఎం ఆస్పత్రికి.. పరిస్థితి ఆందోళనకరంగా మారడటంతో నిమ్స్‌కు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గాంధీలో పోస్టుమార్టం.. ఉద్రిక్తత సునీల్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని నిరసన తెలపడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఆందోళన చేపట్టిన బీజేవైఎం, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, జనసేన యూత్వింగ్, వైఎస్ షర్మిల పార్టీలకు చెందిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం, కార్ఖానా ఠాణాలకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పలు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శ్రీహరి, సుమన్‌శంకర్, దయాకర్, విజయ్‌కుమార్, రవి, మహేందర్, రవినాయక్, వైఎస్ షర్మిల పార్టీ ముఖ్యనేతలు ఇందిరాశోభన్, సాహితి, యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనారెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ప్రత్యేక అంబులెన్స్‌లో సునీల్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. మరణవాంగ్మూలంగా సెల్ఫీవీడియోను పరిగణించాలి: బండి సంజయ్ సునీల్ తీసుకున్న సెల్ఫీ వీడియోను మరణవాంగ్మూలంగా స్వీకరించి, అందుకు కారణమైన సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గాంధీ మార్చురీ వద్ద మృతుని కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు వివేక్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. సునీల్ ఆత్మహత్యాయత్నానికి ముందు తీసుకున్న వీడియోలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతోనే మనస్తాపం చెందానని, తన మృతికి సీఎం కేసీఆర్ కారణమని స్పష్టంగా చెప్పాడని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని.. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, కేసీఆర్ ఉద్యోగం ఊడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సునీల్ కుటుంబసభ్యులకు షర్మిల టీం పరామర్శ సునీల్ కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పార్టీ ముఖ్యనేతలు ఇందిరాశోభన్, సాహితీ పరామర్శించారు. తర్వాత నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం లోటస్‌పాండ్‌లో మీడియాతో సాహితి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఇంటి ముట్టడి... సాక్షి ప్రతినిధి, వరంగల్: సునీల్ మృతి వార్త ఉమ్మడి వరంగల్‌లో దావానలంలా వ్యాపించింది. శుక్రవారం ఉదయం నుంచే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఇంటి ఆవరణలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని హన్మకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, సునీల్ మృతదేహం శుక్రవారం సాయంత్రం తండాకు చేరుకోగా.. ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు గ్రామస్తులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబులెన్స్ ముందు బైఠాయించారు. సునీల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం కావాలంటూ డిమాండ్ చేశారు. ఐఏఎస్‌ను కావాల్సినోన్ని.. ‘మిత్రులందరికీ నమస్కారం.. ఫ్రెండ్స్.. నేను చేతకాక చనిపోవడం లేదు. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు నా లెక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.. నేను పాయిజన్ తీసుకున్నా. తెలంగాణలో ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్లు లేవు. గత ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నా.. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని.. ఇలా చనిపోతున్నా. విద్యార్థుల్లారా.. మీరు కేసీఆర్‌ను విడిచిపెట్టకండి.. అసలే విడిచిపెట్టకండి,’ – సెల్ఫీ వీడియోలో సునీల్ -
పేద, మధ్య తరగతి దంపతులకు సంతాన ప్రాప్తిరస్తు!
సాక్షి, సిటీబ్యూరో: సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి దంపతులకు ఇకపై సర్కారీ ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు గాంధీ, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక హంగులతో కూడిన సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద ఒక్కో సెంటర్లో రూ.5 కోట్ల చొప్పున ఖర్చు చేసి, చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను, ల్యాబ్‌లను సమకూర్చనుంది. ఖరీదైన ఈ సేవలను ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, మధ్య తరగతి దంపతులకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఐయూవీ (ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్)తో పాటు ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సేవలను ఉచితంగా పొందే అవకాశం పేదలకు లభించనుంది. పిల్లలకోసం ‘ప్రైవేటు’కు పరుగులు నిజానికి ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరక్క ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. దీనికి తోడు గంటల తరబడి ల్యాప్‌టాప్‌లను ఒళ్లో పెట్టుకుని పని చేస్తుండటంతో ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఆకలేసినప్పుడల్లా క్యాంటిన్లో రెడిమేడ్‌గా దొరికే పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో ఇది స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీకెండ్ పార్టీ పేరుతో అతిగా మద్యం తాగడం వల్ల దాంపత్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో ప్రస్తుతం పట్టణాలకు, పల్లెలకు పెద్ద తేడా లేదు. ఫలితంగా ప్రస్తుతం ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. చివరకు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇవి ఖరీదుతో కూడిన చికిత్సలు కావడంతో ప్రస్తుతం ఈ సేవలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. . ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇవి లేకపోవ డంతో పేద, మధ్య తరగతి దంపతులు పిల్లల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపై వారికి పైసా ఖర్చు లేకుండా ఈ ఖరీదైన సేవలను అందించాలని ప్రభుత్వం భావించించింది. రూ.ఐదు కోట్లతో అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు మరో రూ.రెండు కోట్లతో మందులు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చునుంది. పేద దంపతులకు ఇదో వరం రెండేళ్ల క్రితం ప్రభుత్వం గాంధీలో ప్రయోగత్మాకంగా సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతి గురువారం ఓపీలో సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 400 మందికి ఐయూవీ (ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్), మరో 8 వేల మందికి సాధారణ చికిత్సలు అందించాం. కరోనా కారణంగా గత మార్చి నుంచి ఈ సేవలను నిలిపివేయాల్సి వచి్చంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ ఈ సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించాం. ప్రభుత్వం కొత్తగా కేటాయించిన నిధులతో కీలకమైన ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. – డాక్టర్ మహాలక్ష్మి, గైనకాలజిస్ట్, గాంధీ ఆస్పత్రి -
టీకా శుభారంభం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు శనివారం దేశవ్యాప్తంగా మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలోనూ శుభారంభమైంది. తెలంగాణవ్యాప్తంగా తొలిరోజు టీకాల కార్యక్రమం విజయవంతమైంది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జీహెచ్ఎంసీ పరిధిలోని తిలక్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ముందు వరుసలో నిలిచిన గాంధీ ఆసుపత్రిలో శనివారం ఉదయం 10:30 గంటలకు ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు వైద్యులు తొలి టీకా వేశారు. అలాగే నిమ్స్‌లో తొలి టీకాను ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు చంద్రకళ, తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలో ఆయాగా పని చేస్తున్న రేణుక తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై దంపతుల సమక్షంలో ఓ లబ్ధిదారుడికి టీకా వేస్తున్న సిబ్బంది. తీవ్ర దుష్ప్రభావాలు రాలేదు.. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 140 ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఆక్స్ఫర్డ్–సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ టీకాలను లబ్ధిదారులకు ఇచ్చారు. తొలిరోజు 4,296 మందికిగాను 3,962 మంది (92.22 శాతం మంది లబ్ధిదారులు) టీకా వేసుకున్నారు. 33 జిల్లాలకుగాను 16 జిల్లాల్లో నూటికి నూరు శాతం మంది లబ్ధిదారులు టీకా వేసుకున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. టీకా వేసుకున్న లబ్ధిదారులకు తీవ్రమైన దుష్ప్రభావాలేవీ రాలేదని, కేవలం 11 మందిలో ఇంజక్షన్ ఇచ్చిన చోట కాస్త నొప్పి, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం వంటి స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. టీకా వేసుకున్నానంటూ బొటనవేలిపై ఉన్న సిరా చుక్కను మీడియాకు చూపుతున్న డీఎంఈ రమేశ్‌రెడ్డి, వ్యాక్సినేషన్ సక్సెస్ అంటూ విజయ చిహ్నం చూపుతున్న ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, నార్సింగి పీహెచ్సీలో మంత్రి సబిత, ఎంపీ రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు టీకా సురక్షితమని రుజువైంది... రాష్ట్రవ్యాప్తంగా 92 శాతానికిపైగా లబ్ధిదారులు తొలిరోజు టీకా వేసుకోవడం, ఎక్కడా సీరియస్ రియాక్షన్లు రాకపోవడంతో వ్యాక్సిన్ సురక్షితమైనదేనని రుజువైందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం వ్యాక్సినేషన్ తీరును విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదైన తర్వాత సరిగ్గా 321 రోజులకు టీకా వేయడం చరిత్రాత్మకమన్నారు. అన్నిచోట్లా వైద్య సిబ్బంది ధైర్యంగా ముందుకు వచ్చి టీకా వేసుకున్నారని వివరించారు. వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి, మాజీ సంచాలకుడు డాక్టర్ పుట్టా శ్రీనివాస్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ తదితరులు కూడా తొలిరోజు టీకా వేసుకున్నట్లు వివరించారు. తిలక్‌నగర్‌లోని అర్బన్ పీహెచ్సీలో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీకా తీసుకుంటున్న ఆయా రేణుక వెంటనే రక్షణ లభించదు... వ్యాక్సిన్ వేసుకున్న వారికి వెంటనే వైరస్ నుంచి రక్షణ లభించదని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మొదటి డోసు తర్వాత 28 రోజులకు మరో డోసు వేసుకోవాలని, మొదటి డోసు నుంచి 42 రోజుల తర్వాతే వైరస్ నుంచి పూర్తి రక్షణ వస్తుందన్నారు. ఆ తర్వాత కూడా లబ్ధిదారులు కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు. అప్పుడు ఒకవేళ వైరస్ బారినపడినా వారి నుంచి ఇతరులకు వ్యాపించదన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు రెండ్రోజులపాటు మద్యం తీసుకోవద్దని, ఆహార నియమాలు పాటించాలని కోరారు. టీకా కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వారందరినీ అరగంటపాటు పరిశీలనలో ఉంచామన్నారు. వారిని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. సాధారణ ప్రజలు టీకా నమోదు ఎప్పటి నుంచి చేసుకోవాలన్న విషయంపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. సందేహాలు, సలహాల కోసం 104 నంబర్‌ను సంప్రదించాలన్నారు. 947 మందికి గ్రేటర్లో.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్న 34 సెంటర్లలో తొలిరోజు మొత్తం 1,020 మంది లబ్ధిదారులకుగాను 947 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 73 మంది వ్యక్తిగత కారణాలతో టీకా కేంద్రాలకు రాలేదు. టీకా వేయించుకున్న వారిలో కొందరికి స్వల్ప నొప్పి, వాపు సమస్యలు తలెత్తగా వారికి వెంటనే ఆయా ఆస్పత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. నార్సింగి ఆరోగ్య కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 100% టీకాలు నమోదైన జిల్లాలు 1) ఆదిలాబాద్, 2) జనగాం, 3) జయశంకర్ భూపాల్పల్లి, 4) గద్వాల 5) కరీంనగర్ 6) కొమురం భీం 7) మహబూబ్‌నగర్ 8) మంచిర్యాల 9) నాగర్‌కర్నూల్ 10) నిర్మల్ 11) నిజామాబాద్ 12) రాజన్న సిరిసిల్ల 13) వికారాబాద్ 14) వనపర్తి 15) వరంగల్ అర్బన్ 16) యాదాద్రి గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతున్న ఈటల. చిత్రంలో కిషన్‌రెడ్డి, సీఎస్ తదితరులు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తాం దేశ ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేపట్టాం. వ్యాక్సిన్ రూపొందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఆయా సంస్థలకు కృతజ్ఞతలు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తగిన జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా రెండో డోస్ తీసుకోవాలి. – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వైరస్‌కు ఎండింగ్ వ్యాక్సిన్ రాకతో వైరస్‌కు ఎండింగ్ వచ్చింది. రెండో డోస్ నాటికి ప్రపంచంలోనే అత్యధిక వాక్సిన్ పంపిణీ దేశంగా భారత్ నిలుస్తుంది. కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్ల కృషి అభినందనీయం. ప్రధాని సూచన మేరకు ఫ్రంట్‌లైన్ వారియర్స్ టీకా తీసుకున్న తర్వాతే ప్రజలతో కలసి వ్యాక్సిన్ తీసుకుంటా. వ్యాక్సిన్‌పై అపోహలు, ఆందోళన వద్దు. – గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనాకు చరమగీతం కరోనా టీకా విజయవంతం కావడంతో కరోనాకు చరమగీతం పాడిæనట్లయింది. వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియ. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో దశలవారీగా టీకాల కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి కూడా వ్యాక్సిన్ అందిస్తాం. – వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్తుకు భరోసా.. కరోనా టీకా భవిష్యత్తుకు భరోసా కల్పించింది. టీకా తయారీలో హైదరాబాద్ హబ్‌గా మారింది. ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణం. ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మొదటి దశలో వ్యాక్సిన్ వేసుకోవట్లేదు. మాకు ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడే వ్యాక్సిన్ వేసుకుంటాం. – మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు అదృష్టంగా భావిస్తున్నా తొలి టీకాకు నన్ను ఎంపిక చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు కల్పించిన భరోసా, ధైర్యంతోనే తొలి టీకా తీసుకొనేందుకు ముందుకొచ్చా. టీకా తీసుకున్నాక సమస్యలేవీ రాలేదు. హెల్త్ వర్కర్లంతా ధైర్యంగా టీకా వేసుకోవాలి. – గాంధీ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు, తెలంగాణలోనే తొలి టీకా తీసుకున్న కిష్టమ్మ -
తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్ , సీఎస్ సోమేష్‌కుమార్ పరిశీలించారు. తిలక్‌నగర్ పీహెచ్సీలో వ్యాక్సినేషన్‌ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాలపై అపోహలు వద్దని తెలిపారు. ప్రతి మూడింట ఒక వ్యాక్సిన్ హైదరాబాద్‌లోనే తయారవుతుందన్నారు. వ్యాక్సిన్‌లో ప్రపంచానికి హైదరాబాద్ హబ్‌గా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: తొలి టీకా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా.. నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మనదేశంలో వ్యాక్సిన్ విడుదల కావడం చాలా గర్వంగా ఉందన్నారు.వ్యాక్సిన్ విషయంలో భయం ,ఆందోళన అవసరం లేదని, అన్ని పరీక్షల తరువాతే వ్యాక్సిన్ వచ్చిందని ఆమె తెలిపారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుందన్నారు. చదవండి: టీకా.. ఆపై సిరా వ్యాక్సినేషన్లో 50 వేలమంది సిబ్బంది పాల్గొంటారు. వ్యాక్సిన్ వేసేందుకు 10 వేలమంది వైద్యసిబ్బందికి ప్రత్యేకశిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 1,213 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకాలు వేయాలని అధికారులు నిర్ణయించారు. తొలిరోజు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తారు. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 4,200 మందికి టీకా వేయనున్నారు. -
పెద్ద పెద్ద గదులు.. చిన్న సమస్యలతో మచ్చ!
పేదోడికి జబ్బు చేస్తే.. చూసేది సర్కారీ దవాఖానావైపే.. దేవుడి లెక్క చేతులెత్తి దండం పెట్టేది.. ఆ డాక్టరు బాబుకే.. ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే పెద్ద పెద్ద భవనాలు.. పెద్ద పెద్ద గదులు.. కదా.. అయితే.. అక్కడుండే చిన్నచిన్న సమస్యలు.. అంతోటి పెద్ద పెద్ద ఆస్పత్రుల ప్రతిష్టకు మచ్చను తెచ్చిపెడుతున్నాయి.. వైద్యం కోసం వెళ్తే సామాన్యులకు కష్టాలను ‘కొని’ తెచ్చిపెడుతున్నాయి. ఒకచోట డాక్టర్ బాబు సరిగా రారు.. మరోచోట పరీక్షలు చేసే పరికరాలు పనిచేయవు.. ఇంకోచోట దూదికీ దిక్కులేదు.. కొద్దిపాటి నిధులు కేటాయించి.. కాస్త దృష్టిపెడితే.. సరిదిద్దగలిగే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు ఎన్నో.. ఈ కొత్త ఏడాదిలో దానిపై దృష్టి పెడితే.. ప్రభుత్వ దవాఖానా ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం.. ఆ సమస్యలు వాటి వివరాలు ఏంటో ఓసారి చూద్దామా.. – సాక్షి, హైదరాబాద్ సూది మందు వేయాలి.. శ్రద్ధ కాస్తపెట్టాలి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. అక్కడ కరోనా, ఇతర వైద్యసేవ లు అందుతున్నాయి.ఇక్కడి రెండు సీటీ స్కాన్లలో ఒకటి పాడైపోయింది. ఉన్న ఒక్క ఎంఆర్ఐ మిషన్ కూడా పనిచేయడంలేదు. రోగులను పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ల కోసం రూ.20 కోట్లలోపు ఖర్చు చేస్తే వేలాదిమంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. అక్కడ కరోనా, ఇతర వైద్యసేవ లు అందుతున్నాయి.ఇక్కడి రెండు సీటీ స్కాన్లలో ఒకటి పాడైపోయింది. ఉన్న ఒక్క ఎంఆర్ఐ మిషన్ కూడా పని చేయడంలేదు. రోగులను పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ల కోసం రూ.20 కోట్లలోపు ఖర్చు చేస్తే వేలాదిమంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉస్మానియాలో పనిచేయని సీటీ స్కాన్ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో రెండు సీటీ స్కాన్లు ఉండగా, ఒకటి మరమ్మతుల్లో ఉంది. ఐసీయూల్లో ఉండే మల్టీ చానల్ మానిటర్లు పనిచేయడంలేదు. సీటీ స్కాన్‌ను మరమ్మతు చేయడానికి రూ.10 వేలు, మల్టీచానల్ మానిటర్ల కోసం రూ.లక్ష వరకు కేటాయిస్తే అవి అందుబాటులోకి వచ్చే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఒకవేళ కొత్తవి కొనుగోలు చేసినా రూ. 2 కోట్లు ఖర్చుచేస్తే సరి. జిల్లా ఆసుపత్రుల్లో పెద్ద పరీక్షలకు దిక్కేది రాష్ట్రంలో అనేక జిల్లా ఆసుపత్రుల్లో కీలకమైన సీటీ స్కాన్, అ్రల్టాసౌండ్, 2డీ ఎకో వంటి వైద్య పరికరాలు అందుబాటులో లేవు. దీంతో ఆయా ఆసుపత్రులకు వచ్చే పేదరోగులు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ లేబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్కో ఆసుపత్రి రూ.3 కోట్ల మేర ఖర్చు చేసినా వీటిని సమకూర్చుకోవచ్చు. 46 కొత్త ఆసుపత్రులు నిర్మించినా? రాష్ట్రంలో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) నిర్మించారు. వాటిని నిర్మించి దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ, చిన్న, చిన్న పనులు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఆయా కొత్త ఆసుపత్రులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఒక్కో ఆసుపత్రికి సరాసరి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.2.30 కోట్లు ఖర్చు చేస్తే ఇవి పూర్తిస్థాయి సేవలు అందిస్తాయి. మూడు నెలల మందులు వారానికే.. పీహెచ్సీ, సీహెచ్‌సీ మొదలు జిల్లాస్థాయి ఆసుపత్రులు, ఆపై ఆసుపత్రుల వరకు చాలా చోట్ల రోగులకు సరిపడా మందులు ఇవ్వడంలేదు. బీపీ, షుగర్, ఆస్తమా, పక్షవాతం, కీళ్ల నొప్పులు తదితర రోగాలకు నిత్యం వాడాల్సిన మందులను వారానికే ఇస్తున్నారు. వారం తర్వాత ఆయా మందులను రోగులు బయట కొంటున్నారు. నెల నుంచి మూడు నెలల వరకు మందులు ఇస్తే ఎటువంటి సమస్యా తలెత్తదు. ఆ మేరకు మందులను సర్దుబాటు చేయాలి. దీనికి బడ్జెట్‌తో సంబంధంలేదు. ఇలా చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ పీహెచ్‌సీలు, ఇతర కొన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు నిత్యం రావడంలేదన్న విమర్శలున్నాయి. రోజూ డాక్టర్ వస్తారన్న నమ్మకం కల్పిస్తే చాలు రోగులు ఓపీలో చూపించుకుంటారు. దీనికి కావాల్సింది పర్యవేక్షణ అనేక ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు ఏళ్లు, నెలల తరబడి మూలనపడి ఉంటున్నాయి. దాదాపు 20 శాతం వరకు మరమ్మతుల్లో ఉన్నాయి. వాటిని మరమ్మతు చేస్తే రోగులకు ఎంతో ప్రయోజనం. అందుకోసం కొన్ని ఆసుపత్రులకు కలిపి టెక్నీíÙయన్లను నియమించుకోవాలి. వాటికయ్యే ఖర్చు అత్యంత స్వల్పం అనేక ఆసుపత్రుల ప్రాంగణాల్లో పిచి్చమొక్కలు దర్మనమిస్తున్నాయి. మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో వాటిని తొలగించి ఉద్యాన శాఖ ద్వారా మంచి మొక్కలు పెంచితే ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేషెంట్ కేర్ ప్రొవైడర్లు ఉండాలి. పరీక్షలు ఎక్కడ చేస్తారు? ఏ డాక్టర్ ఎక్కడ ఉంటారో తెలియజెప్పాలి. రిసెప్షన్ సెంటర్ ఉండాలి. తద్వారా రోగులకు గైడ్ చేయాలి. డాక్టర్లు చూసి మందులు రాసి వెళ్తారు. కానీ, రోగికి వచి్చన జబ్బుపై చర్చించి అవసరమైన సలహాలు ఇవ్వరు. ఈ పరిస్థితి మారాలి. -
గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డు బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి బెడ్‌షీట్‌ను తాడుగా ఉపయోగించి.. ఆస్పత్రి వెనుక వైపు గల గేటు దూకి వీరు పరారైనట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులో ఉన్న ఖైదీల వార్డులో కరోనా సోకిన 19 మందికి వైద్యం అందిస్తున్నారు. వారిలో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు చెందిన ఖైదీలు అబ్దుల్ అర్బాజ్ (21), సోమసుందర్ (20), మహ్మద్ జావీద్ (35), పార్వతీపురం నర్సయ్య (32)లను బుధవారం పోలీసులు చేర్చారు. గురువారం చేపట్టిన తనిఖీల్లో నలుగురు ఖైదీలు తక్కువగా ఉండటంతో అన్ని వార్డుల్లో గాలించారు. ప్రిజనర్స్ వార్డు బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడంతో ఈ నలుగురు ఖైదీలు పరారైనట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఉన్నతాధికారులకు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలోని చాలా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఖైదీల పరారీపై పోలీసులు స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నట్లు తెలిసింది. -
గాంధీలో కరెంట్ కోత.. కరోనా పేషెంట్ల అవస్థలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరెంట్ కోతలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు గంటల పాటు కరెంట్ లేక కరోనా పేషెంట్లు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వెంటిలేటర్లపై ఉన్న పేషెంట్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ వెంటనే జనరేటర్ పంపాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక కోవిడ్ ఆస్పత్రుల్లో జనరేటర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. అంతేకాక కోవిడ్ ఆస్పత్రుల్లో జనరేటర్ల పనితీరును పరీక్షించాలని అవసరమైన చోట అదనపు జనరేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. (జ్వరం వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు : ఈటల) -
గాంధీ ఆసుపత్రిలో దారుణం..కరోనా వార్డులో
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకి మంగళవారం ఉదయం శ్రీనివాస్ అనే రోగి చనిపోయాడు. అయితే 8 గంటలు కావస్తున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృతదేహం బెడ్‌మీదే పడి ఉంది. తీవ్ర దుర్వాసనతో కరోనా వార్డు కంపు కొడుతుండటంతో మిగతా కరోనా రోగులు వార్డు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అనేకసార్లు అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఒక్క రోజు సమ్మె చేపట్టడంతో మృతదేహాన్ని తరలించే నాదులే కరువయ్యారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ పరిశుబ్రంగా ఉంచాల్సిన కరోనా వార్డు కంపు కొడుతున్నా అధికారులు పట్టించుకోని వైనం మరోసారి గాంధీ నిర్లక్ష్యానికి దర్శనమిస్తోంది. -
గాంధీలో పేషెంట్ల పరిస్థితి దయనీయం
సాక్షి, హైదరాబాద్ : పోరాడాల్సింది వ్యాధితో.. రోగితో కాదని ప్రభుత్వం ఓవైపు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... కరోనా వైరస్ సోకి ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో బాధితులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితికి ఈ వీడియో అద్ధం పడుతోంది. కోవిడ్ వార్డుల్లో అటెండర్లు లేక కరోనా పేషెంట్లు ఆరు బయటే పడి ఉన్నారు. కనీసం సాయం చేసేవారు లేక ఇద్దరు రోగులు అవస్థలు పడుతున్నారు. 60మంది కరోనా పేషెంట్లకు కేవలం నలుగురు మాత్రమే వార్డు బాయ్స్ ఉన్నారు. మరోవైపు కరోనా కేసులతో గాంధీ ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా వల్లే మృతి చెందాడని... కరోనా మహమ్మారి బంధుత్వాలను, మానవతా విలువలను మంటగలిపింది. వివరాళ్లోకి వెళితే.. టోలిచౌకి పారామౌంట్ కాలనీలోని ఓ భవనంలో మొదటి అంతస్తులో హారూన్ షా అద్దెకు నివాసముంటున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో ఉంటున్నారు. గత నెల 30వ తేదీన ఇతను భోజనం చేస్తుండగా ఒకేసారి కుప్పకూలిపోయి కిందబడటంతో పెద్ద శబ్దం వచ్చి పక్క ఫ్లాట్ వాళ్లు వచ్చి చూసి వెళ్లిపోయారు. మరుసటి రోజు హారూన్ షా మృతి చెందాడని తెలవడంతో కరోనా వల్లే మృతి చెందాడని స్థానికంగా పుకార్లు లేచాయి. ఈ పుకార్లతో హారూన్ ఇరుగుపొరుగు వారు తమ ఫ్లాట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారే తప్పా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా మృతుడి దూరపు బంధువైన ముజాహెద్ అనే వ్యక్తి విషయం తెలుసుకుని అక్కడికి వచ్చాడు. స్థానికులెవరూ అంత్యక్రియలకు సహకరించకపోవడంతో ముజాహెద్ సఖీనా ఫౌండేషన్ వారిని సంప్రదించాడు. గతంలో అనాథలు, కోవిడ్–19తో మృతి చెందిన వారికి సఖినా ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించింది. -
కరోనా జయించిన బాలాపూర్ సీఐ
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ సీఐ సుధీర్ కృష్ణ కరోనా జయించారు. కోవిడ్ బారినుంచి పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారు. గతనెల 20న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో 14రోజులపాటు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14 రోజులు హోం క్వారైంటన్లో ఉండనున్నారు. ఇంటినుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. మానసికంగా దఢంగా ఉండి కరోనాను ఎదుర్కోవాలని సుధీర్ అన్నారు. అధైర్య పడకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలని సూచించారు. ఉన్నతాధికారులు, డాక్టర్లు ఇచ్చిన మనోధైర్యం ఎంతగానో ఉపకరించిందని చెప్పారు. కరోనా సోకినపుడు మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమని, వ్యాయామం, యోగా, ధ్యానంతో ఇమ్యునిటీ పవర్ పెంచుకోవచ్చని అన్నారు. మంచి పోషకాహరం తీసుకుంటే కరోనాను జయించవచ్చని సుధీర్ కృష్ణ తెలిపారు. (చదవండి: తీర్థాల ఘటనపై మంత్రి, కలెక్టర్ సీరియస్) -
‘సాక్ష్యమిదే! పరిస్థితులు అస్సలు బాగాలేవు’
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఓ వివాహిత వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. జ్వరంతో అనారోగ్యం పాలైన తన భార్య రోహిత ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిందని ఆమె భర్త శ్రీకాంత్ ఆరోపించారు. బెడ్లు లేవని ఆస్పత్రుల యాజమాన్యాలు తిప్పి పంపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోహితను కాపాడుకోవడం కోసం రాత్రంతా నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ కనికరించలేదని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల తీరు ప్రైవేటు కన్నా దారుణంగా ఉందని విమర్శించారు. చివరకు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా రోహిత బుధవారం చనిపోయిందని శ్రీకాంత్ తెలిపారు. సమయానికి వైద్యం అంది ఉంటే ఆమె ప్రాణాలు నిలిచేవని అన్నారు. ప్రభుత్వం, అధికారులు చెప్తున్నట్టు బయట పరిస్థితులు లేవని, అనారోగ్యం పాలైతే పట్టించుకునేవారు కరువయ్యారని చెప్పారు. (చదవండి: తెలంగాణలో ఒక్క రోజే 499 కరోనా కేసులు) -
వైద్యులు తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : కరోనా పరీక్షల నిమిత్తం వైద్యులు తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆచూకీ లభించడంలేదని హైదరాబాద్‌లోని ఓ పోలీస్ట్‌షన్‌లో కేసు నమోదు అయ్యింది. మంగల్‌ఘాట్ ఎస్ఐ రణ్వీర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన నరేందర్ సింగ్ అనే వ్యక్తిని మే 30న కింగ్‌కోఠీ ఆస్పత్రికి కొంతమంది వైద్యులు తీసుకునివెళ్లారు. కోవిడ్ లక్షాణాలు ఉన్నాయని అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిజానికి తనకు ఎలాంటి లక్షణాలు లేవు. చివరిసారిగా జూన్ 2న నరేందర్ వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో ముచ్చటించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్ఐ తెలిపారు. (తెలంగాణలో కొత్తగా 237 కరోనా కేసులు) మరోవైపు నరేందర్ సింగ్ ఆచూకీ కోసం అతడి తల్లీ, సోదరుడు కూడా గాలిస్తున్నారు. తమ కుమారుడు వివరాలను తెలపాలంటూ తల్లీ విలపిస్తున్నారు. ఇదిలావుండగా నరేందర్ గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు కూడా నమోదు కాలేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో అతను ఏమైపోయాడోనని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 15 రోజులుగా ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఆత్మీయులిచ్చిన ధైర్యం ఆత్మవిశ్వాసం..
సాక్షి, హైదరాబాద్: కరోనా.. కరోనా.. అంతటా దీని గురించే చర్చ.. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్ తీవ్రత ఇప్పుడు మన దగ్గర రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. లాక్డౌన్ సడలింపులతో జనజీవన సందడి పెరిగిన వేళ వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని, బయటికెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, ఇంట్లోకి రాగానే శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ నిర్మూలనకు ప్రత్యేకించి మం దులు, వ్యాక్సిన్ లేనందున దానితో సహజీవనం చేయక తప్పదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఈ వైరస్ మనలోకి ప్రవేశిస్తే ఎలా? అనే సందేహం అందరికీ వచ్చేదే. సైదాబాద్ సమీపంలో మాదన్నపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఏకంగా 60శాతం మందికిపైగా కరోనా వైరస్ బారినపడడం కలకలం రేపింది. ప్రస్తుతం వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ పేషెంట్ అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘‘తొలుత మా అపార్ట్మెంట్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు మా అపార్ట్మెంట్ వాసులందరినీ సరోజినీదేవి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా దాదాపు సగం మందికిపైగా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిజల్ట్ చెప్పిన వెంటనే ఊపిరి ఆగినంత పనైంది. మా ఇంట్లో ముగ్గురికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగించింది. కానీ నాలో ఆత్మవిశ్వాసం సడలలేదు. ఇద్దరికీ ధైర్యం చెప్పా. జాగ్రత్తగా ఉండాలని సూచించా. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ముగురినీ మూడు వార్డుల్లో ఉంచారు. ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజు నాకు దగ్గు, జ్వరం మొదలైంది. వైద్యలు వెంటనే ఐసీయూకి తరలించి పారాసిటమాల్‌తో పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, యాంటిబయాటిక్ మాత్రలు ఇచ్చారు. మూడు రోజుల్లో కోలుకున్నా. రెండ్రోజులుగా నా ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో మూడు రోజులు ఇదే స్థాయిలో ఉంటే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతాననిపిస్తోంది. కానీ నాకు కరోనా పాజిటివ్ రావడంతో మా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు సైతం కలత చెందారు. ఒకరితర్వాత ఒకరు వరుసగా ఫోన్లు చేయడం, సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పడంతో నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. వాట్సాప్‌లో దాదాపు రెండువేల మెసేజ్‌లు వచ్చాయి. నా కోసం ఇంతమంది ఆలోచిస్తున్నారా.. అనే భావన నన్ను మరింత దృఢంగా చేసింది. మనకు కష్టం వచ్చినప్పుడు మన వెనక ఎవరుంటారనే సందేహం రావడం సహజం. కానీ నాకు ఇంతమంది ధైర్యాన్నివ్వడంతో చాలా త్వరగా కోలుకున్నా. ఈ వైరస్ వస్తే చనిపోతామనే అపోహ వద్దు. సకాలంలో గుర్తించి వైద్యుల సలహాలు పాటిస్తే చాలా ఈజీగా నమయవుతుంది. వసతులు బాగున్నాయి.. గాంధీ ఆస్పత్రిలో సేవలు చాలా బాగున్నాయి. సౌకర్యాలతో పాటు వాష్‌రూమ్‌లు, ఐసీయూలు, వార్డులన్నీ కార్పొరేట్ ఆస్పత్రి కంటే బాగున్నాయి. తొలుత తీసుకెళ్లిన సరోజినీదేవి ఆస్పత్రిలో వసతులు చూసి చాలా ఆందోళన చెందా. కరోనా పాజిటివ్ రావడంతో బతుకుతానా? లేదా? అనే సందేహం వచ్చింది. కానీ గాంధీలో చేరాక ఆ ఆలోచన పోయింది. సరోజినీదేవి ఆస్పత్రిలో వసతులు మరింత మెరుగుపర్చాలి’’. -
ఇది నాకు అతి పెద్ద బహుమతి: శేఖర్ కమ్ముల
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు తమకు శీతల పానియాలు అందిస్తున్నందుకుగానూ గాంధీ ఆస్పత్రి వద్ద ఆయన పేరుతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ట్విటర్ వేదికగా దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల ‘‘ గాంధీ ఆస్పత్రి వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నా కోసం ఇలా చేయటం వెలకట్టలేనిది. ఇది నాకు అతి పెద్ద బహుమతి. నేను చేసిన ఓ పని మిమ్మల్ని కదిలించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ, మీరు రాత్రింబవళ్లు మా కోసం చేస్తున్న దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ( రానా పెళ్లిపై సురేష్ బాబు క్లారిటీ ) I'm overwhelmed....... This is a priceless guesture from the GHMC sanitation workers at Gandhi Hospital ......my biggest award. I feel extremely happy that I could do something that touched you but it's nothing compared to what you do for us, day in and day out. pic.twitter.com/EkYAz8Wbnf — Sekhar Kammula (@sekharkammula) May 13, 2020 కాగా, మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధీ ఆస్పత్రి పరిధిలోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం శీతల పానియాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు శేఖర్ కమ్ముల. దాదాపు 1000 మందికి బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ అందిస్తున్నారు. ఓ నెల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. అంతేకాకుండా కర్నూల్ టౌన్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా శీతల పానియాలను అందిస్తున్నారాయన. -
ఈఎస్ఐసీలో ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులపై ప్లాస్మా ట్రయల్స్ చేసేందుకు గాంధీ ఆసుపత్రితోపాటు హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ హాస్పిటల్‌కు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 113 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 28 ఆసుపత్రులకు అనుమతి ఇచ్చారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో రెండింటికి అనుమతి వచ్చింది. ప్రస్తుతం ఈఎస్ఐసీలో కరోనా చికిత్సలు చేయడం లేదు. ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా కరోనా చికిత్స ప్రారంభించే అవకాశముంది. అలాగే గుజరాత్లో 5, రాజస్తాన్‌లో 4, పంజాబ్‌లో ఒకటి, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 4, మధ్యప్రదేశ్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, కర్ణాటక, చండీగఢ్‌లో ఒక్కో ఆసుపత్రికి అనుమతి ఇచ్చారు. మరో 83 ఆసుపత్రుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని ఐసీఎంఆర్ వెల్లడించింది. దరఖాస్తుల పరిశీలనలో హైదరాబాద్‌లోని అపోలో, ఏఐజీ ఆసుపత్రులు కూడా ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. (చదవండి: తెలంగాణలో మరో 10 పాజిటివ్ ) -
కరోనా ఉన్న గర్భిణీకి డెలివరీ చేసిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్‌పై యుద్ధంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఓ వైపు కరోనా బాధితులకు చికిత్స అందిస్తూనే మరోవైపు అత్యవసర సేవల్లోనూ పాల్పంచుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన ఓ గర్బణీకి గాంధీ ఆస్పత్రి వైద్యులు డెలివరీ చేశారు. పలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడగలిగారు. దీంతో డెలివరీ చేసిన వైద్యులను పలువురు అధికారులు అభినందిస్తున్నారు. వైరస్ సోకినా తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్న తరువాత వారిని స్వస్థలానికి పంపుతామని వైద్యులు తెలిపారు. (దేశంలో కొత్తగా 3390 పాజిటివ్ కేసులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1401284236.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గాంధీలో కరోనా లేదన్నారు, కానీ..
సాక్షి, హైదరాబాద్/ మంచిర్యాల : కరోనా లక్షణాలు లేవని గాంధీ ఆసుపత్రి నుంచి తిప్పి పంపిన మహిళ కరోనా కారణంగానే మృతి చెందారు. ఈనెల 14న హైదరాబాద్‌లో మృతిచెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. కరోనా అనుమానంతో చెన్నూరు మండలం ముత్తేరావుపల్లికి చెందిన మహిళ తొలుత మంచిర్యాలలో ఆస్పత్రిలో చేరారు. అనంతరం మంచిర్యాల నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మహిళను తరలించారు. అయితే కరోనా లక్షణాలు లేవని గాంధీ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈనెల 14న మహిళ మృతి చెందారు. మృతిచెందిన అనంతరం ఆమెకు కోరోనా పరీక్షలు జరపగా, ఈరోజు వచ్చిన రిపోర్టులో మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు లేకపోవటంతో గ్రీన్ జోన్‌గా మంచిర్యాల కొనసాగుతోంది. అదే ప్రాంతంలో కరోనాతో మహిళ మృతిచెందడంతో కలకలం రేగింది. మహిళ బందువులు, మంచిర్యాలలో మృతురాలికి ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు, వైద్య సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. -
ఇలాంటి ఘటనలు సహించం
-
గాంధీ ఆసుపత్రి ఘటనపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో అధికారుల అడ్డగింత ఘటనలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ‘ ఇటువంటి వ్యక్తులు కేవలం మూర్ఖులే కాదు! వారి వల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితుడు బుధవారం బాత్రూమ్లో జారిపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతడి చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లపై, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఐసోలేషన్ వార్డులోని కిటికి అద్దాలు ధ్వంసం చేశారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు. Incidents of doctors & staff being attacked in Gandhi hospital & officials being obstructed in Nizamabad are intolerable & will be dealt seriously by Telangana Govt These individuals are not only ignorant but they are a potential hazard to others also#TelanganaFightsCorona — KTR (@KTRTRS) April 2, 2020 -
‘గాంధీ’ వైద్యులు ధైర్యం చెప్పడం వల్లే.. కోలుకున్నా
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ : తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ బాధితుడు.. వైరస్ బారి నుంచి విజయవంతంగా కోలుకొని డిశ్చార్జి అయిన హైదరాబాద్‌వాసి గంప రామ్‌తేజ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో ‘మన్‌కీ బాత్’లో తన అనుభవాలు, గాంధీ వైద్యులు అందించిన సేవలు, వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలు, భయాలపై సవివరంగా పంచుకున్నారు. కరోనా వైరస్ సోకిందని తెలియగానే ఆయనకు ఏమనిపించింది? అసలు ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? గాంధీ ఆస్పత్రిలో చికిత్స ఎలా జరిగింది? కరోనా వైరస్ అనుమానితులు, విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్లో ఎందుకు ఉండాలి? క్వారంటైన్లో ఉన్నప్పుడు తాను ఎలా ఉన్నాడు? తెలంగాణ సమాజంపై ఉన్న బాధ్యత ఏంటి? ఈ మహమ్మారి దేశం నుంచి వెళ్లిపోతుందని ఆయన నమ్ముతున్నారా? లాంటి అనేక విషయాలపై మనసువిప్పి మోదీతో మాట్లాడారు. కరోనా సోకిన తనకు చికిత్స చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు, నర్సులు చాలా మంచివాళ్లని, ఈ వైరస్ బారి నుంచి తాను బతికి బయటపడటానికి వారు నూరిపోసిన ధైర్యమే కారణమని చెప్పారు. మోదీ, రామ్తేజల మధ్య జరిగిన సంభాషణ వారి మాటల్లోనే... మోదీ : ఎస్.. రామ్ రామ్‌తేజ : నమస్కారమండి. మోదీ : ఎవరు? రామ్గారేనా మాట్లాడేది. రామ్‌తేజ : అవును సార్, రామ్‌నే.. మోదీ : రామ్ నమస్తే.. రామ్‌తేజ : నమస్తే.. నమస్తే.. మోదీ : మీరు కరోనా వైరస్ పెనుప్రమాదం నుంచి బయటపడ్డారని విన్నా. రామ్‌తేజ : అవును సార్ మోదీ : మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. మీరు పెను ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను. రామ్‌తేజ : నేను ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగిని. పనిలో భాగంగా మీటింగ్స్ కోసం దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోకుండానే అలా జరిగిపోయింది. తిరిగి రాగానే జ్వరం లాంటివి మొదలయ్యాయి సార్. ఆ తర్వాత ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో నన్ను చేర్చారు. ఆ తర్వాత 14 రోజులకు నాకు నయమైంది. నన్ను డిశ్చార్జి చేశారు. నిజంగా అదంతా తలుచుకుంటే భయంకరంగా ఉంటుంది. మోదీ : మీకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసిందన్నమాట. రామ్‌తేజ : అవును సార్. మోదీ : మీకు ఈ వైరస్ ఎంతో భయంకరమైనదన్న విషయం ముందే తెలుసు కదా. రామ్‌తేజ : తెలుసు సార్. మోదీ : అయితే వైరస్ సోకిన విషయం తెలియగానే ఏమనిపించింది? రామ్‌తేజ : ఒక్కసారిగా భయం వేసింది. ముందయితే నేను నమ్మలేకపోయా. అలా ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు మన దేశంలో కేవలం ఇద్దరు, ముగ్గురికే ఈ వ్యాధి సోకింది. నాకేమీ అర్థం కాలేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను క్వారంటైన్లో ఉంచారు. రెండు, మూడు రోజులు అలాగే గడిచిపోయాయి. అక్కడ ఉన్న డాక్టర్లు.. నర్సులు... మోదీ : ఆ ఇంకా... రామ్‌తేజ : వాళ్లు ఎంతో మంచివాళ్లు. ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు. నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. నేను తొందరగా కోలుకుంటానంటూ ధైర్యం చెప్పేవారు. పగలు ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాట్లాడేవాళ్లు. నర్సులు కూడా మాట్లాడేవాళ్లు. మొదట్లో భయం వేసింది. కానీ క్రమంగా ఇంత మంది మంచివాళ్ల మధ్య ఉన్న నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏం చేయాలో వాళ్లకు తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుందన్న విశ్వాసం పెరిగింది. మోదీ : మీ కుటుంబ సభ్యుల మానిసిక స్థితి ఎలా ఉండేది? రామ్‌తేజ : నేను ఆస్పత్రిలో చేరిన మొదట్లో వాళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ మీడియా కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. నాకూ, నా కుటుంబ సభ్యులకూ, చుట్టుపక్కల వారికి కూడా అది ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజురోజుకూ నా పరిస్థితిలో మెరుగుదల కన్పించింది. డాక్టర్లు మాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు కూడా అన్ని విషయాలు చెప్పేవారు. వారు ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఏవిధంగా చికిత్స చేస్తున్నారో అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు చెప్పేవారు. మోదీ : మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు? మీ కుటుంబ సభ్యులు ఏయే జాగ్రత్తలు తీసుకునేవారు? రామ్‌తేజ : నేను క్వారంటైన్లోకి వెళ్లిన తర్వాతే ఈ విషయం తెలిసింది. అయితే క్వారంటైన్ తర్వాత కూడా మరో 14 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ 14 రోజులు ఇంటి దగ్గరే ఒక గదిలో ఉండాలని చెప్పారు. ఇంట్లో తమకు తాముగా క్వారంటైన్లో ఉండాలని మా కుటుంబ సభ్యులకు చెప్పారు. నేను ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఒక గదిలో ఉండేవాడిని. దాదాపుగా రోజంతా మాస్క్ తగిలించుకొనే వాడిని. తినడానికి గదిలోంచి బయటకు వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడిని. ఇది ఎంతో ముఖ్యం. మోదీ : సరే రామ్.. మీరు పుంజుకొని బయటకు వచ్చారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. రామ్‌తేజ : ధన్యవాదాలు సార్. మోదీ : మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉన్నారు కదా... మీ అనుభవంపై ఆడియో తయారు చేసి... రామ్‌తేజ: ఆ సార్... మోదీ : ఇతరులతో పంచుకోండి. ప్రజలతో పంచుకోండి. దీనిని సామాజిక మాధ్యమంలో వైరల్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి దూరంగా ఉండటానికి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. రామ్‌తేజ : అవును సార్. బయటకు వచ్చాక చూస్తున్నాను. క్వారంటైన్ అంటే తమను తాము జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది నిజంగా అలాంటిది కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. క్వారంటైన్ అంటే అదేదో మచ్చలాంటిది అనుకోకండి. మోదీ : మంచిది రామ్. మీకు ఎన్నెన్నో శుభాకాంక్షలు. రామ్‌తేజ : ధన్యవాదాలు.. ధన్యవాదాలు. సార్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. మోదీ : ఆ చెప్పండి... చెప్పండి. రామ్‌తేజ : నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కోసం తీసుకోలేదు. అంతేకాదు.. మీ కారణంగా మేమందరం కూడా క్షేమంగా బయటపడగలమని ఆశిస్తున్నా. మోదీ : ఈ వైపరీత్యం నుంచి దేశం బయటపడాలి. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి. రామ్‌తేజ : ఏమీ కాదు సార్. మొదట్లో నాకు భయం వేసింది. మీరు లాక్డౌన్ లాంటి చర్యలు తీసుకున్నప్పుడు నాలో నమ్మకం పెరుగుతోంది. మనందరం మీ సహాయంతో బయటపడతాం సార్. ధన్యవాదాలు. మోదీ : ధన్యవాదాలు సోదరా... కృతజ్ఞతలు. రామ్‌తేజ : ధన్యవాదాలు సర్. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశవాసులారా... రామ్‌తేజ చెప్పినట్లు ఆయనకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారు. ఆ కారణంగానే ఆయన ఆరోగ్యవంతుడై మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు’ అని పేర్కొన్నారు. అనంతరం తరువాత ఆగ్రాకు చెందిన ఆశోక్ కపూర్, వైద్య నిపుణుడు, ఢిల్లీకి చెందిన డాక్టర్ నీతేష్ గుప్తా, పుణేలోని డాక్టర్ బోర్సేలతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. నిత్యావసర సేవలు అందిస్తున్న రవాణా, బ్యాంకింగ్ వంటి రంగాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. (లాక్డౌన్ 15న ఎత్తేసే చాన్స్ లేదు) గాంధీలో వైద్య సేవలు బాగున్నాయి : గాంధీ ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి తన అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. తాను యుకే నుంచి వచ్చానని, కరోనా లక్షణాలు కనిపించడంతో 104కి కాల్ చేసి గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యానని చెప్పాడు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ వార్డులో చేరి ఆదివారం నాటికి 13 రోజులు అయిందని పేర్కొన్నాడు. గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో వైద్యసేవలు, వసతి సౌకర్యాలు చాలా బాగున్నాయని, వైద్యులు చాలా కేర్ తీసుకుంటున్నారని వివరించాడు. -
ఆ వైద్యులను ఆగస్ట్ 15న ఘనంగా సత్కరిస్తాం..
సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: ‘గుడి భయపడింది. మసీదు భయపడింది.. చర్చి భయపడింది.. దేశాధినేతలు భయపడుతున్నారు. కానీ ‘మీ కోసం మేం ఆస్పత్రిలో ఉంటాం.. మా కోసం మీరు ఇంట్లో ఉండండి’ అంటూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కంటికి కన్పించని కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. మీకేం కాదు.. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు నగరంలోని గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో కరోనా నోడల్ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, టెక్ని షియన్లు, హౌస్‌కీపింగ్ వర్కర్లు, అంబులెన్స్ సిబ్బంది. ‘వైద్యో నారాయణో హరి’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. మనల్ని మాత్రం ఇళ్లలో ఉండమంటూ.. వాళ్లు మాత్రం ప్రమాదకరమైన వైరస్‌తో పోరాడుతున్న బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ రియల్ హీరోలకు.. రీలు హీరోలే కాదు.. సమస్త ప్రజానీకం రెండు చేతులెత్తి హాట్సాఫ్ చెబుతోంది. వైద్యులే నిజమైనదేవుళ్లంటూ చేతులు జోడించి ప్రణమిల్లుతోంది. ప్రాణాలను లెక్క చేయకుండా.. స్వైన్‌ఫ్లూ.. నిఫా.. ఎబోలా.. తాజాగా కరోనా.. ఇలా కొత్తగా ఏ వైరస్ విస్తరించినా చికిత్సలకు గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులే పెద్దదిక్కు. ఆయా ఆస్పత్రుల్లో ఎన్నో స్పెషాలిటీ విభాగాలు ఉన్నప్పటికీ.. కరోనా చికిత్సల విషయంలో జనరల్ మెడిసిన్, ఫల్మొనాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలదే కీలకపాత్ర. వైద్యులు సహా స్టాఫ్ నర్సులు, టెక్నిషియన్లు, శానిటేషన్, సెక్యురిటీ సిబ్బంది చికిత్సల్లో ముందుంటారు. రోగుల ప్రాణాలను కాపాడేందుకు వీరంతా తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఆస్పత్రిలో బాధితులకు చికిత్సలు అందించే క్రమంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా వారు కూడా ఆయా రోగాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. గాంధీలో పదేళ్ల క్రితమే స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల బాధితులే కాకుండా.. సరిహద్దు రాష్ట్రాల్లోని బాధితులు కూడా చికిత్స కోసం ఇక్కడికే వస్తుంటారు. ఇలా ఇప్పటి వరకు పదివేల మందికిపైగా ఉచితంగా వైద్యసేవలు అందించారు. మృత్యువుతో పోరాడుతున్న అనేక మందికి ప్రాణాలు పోశారు. ఈ క్రమంలో కొంత మంది వైద్య సిబ్బంది కూడా అనారోగ్యం పాలుకావాల్సి వచ్చింది. అయినా వారు మాత్రం ఇప్పటి వరకు వెనకడుగు వేయలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితులెదురైనా ఏమాత్రం అధైర్యపడకుండా రోగులు, వారి బంధువులకు అండగా నిలుస్తున్నారు. బాధితుల సేవలో 300మందికిపైగా సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీలో 40 పడకల సామర్థ్యంతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. నల్లకుంట ఫీవర్‌లో మరో 40 పడకలు ఏర్పాటు చేసింది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 20, ఉస్మానియాలో 10 పడకలతో కరోనా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 450 మందికిపైగా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇప్పటికే 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మిగిలిన వారికి నెగిటివ్ నిర్ధారణ కావడంతో వారిని ఆ తర్వాత హోం క్వారంటైన్‌కు తరలించారు. గాంధీ ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితులకు సేవలు అందించేందుకు 200 మంది అందుబాటులో ఉన్నారు. వీరంతా మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో 50 మందికిపైగా వైద్య సిబ్బంది వీరిలో సేవలు ఉండగా, ఫీవర్ ఆస్పత్రిలో మరో 50 మందికిపైగా ఉన్నారు. ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ చాలా ప్రమాదమని వీరికి తెలుసు. ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుందని తెలుసు. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌తో పోరాడుతున్న బాధితులకు వీరంతా ఎంతో ధైర్యంగా సేవలు అందిస్తున్నారు. వైద్యుల రూపం లో ఉన్న దేవుళ్లుగా ప్రజలచే ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ విభాగం.. కీలకం.. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన బాధితుల కుటుంబాలు, అంతకు ముందు వారికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న బంధువులు, స్నేహితులను గుర్తించడంలో జిల్లా సర్వేలెన్స్ బృందం కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ జిల్లా సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహర్ష నేతృత్వంలోని వైద్య బృందం క్లోజ్ కాంటాక్ట్ ట్రేసింగ్‌లో చూపిస్తున్న చొరవ అభినందనీయం. పాజిటివ్ బాధితుని క్లోజ్ కాంటాక్ట్‌లను గుర్తించడం ఒక ఎత్తయితే.. వారి నుంచి మరొకరికి వైరస్ విస్తరించకుండా వారందరినీ నోడల్ కేంద్రాలకు పంపి, వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించడం మరో ఎత్తు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన తొలి కరోనా పాజిటివ్ బాధితుని నుంచి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో సింహభాగం ఆయన నేతృత్వంలోని వైద్య బృందం ట్రేసవుట్ చేసినవే కావడం గమనార్హం. చాలెంజ్‌గా తీసుకున్నాం కోవిడ్ వైరస్‌ను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వంతో పాటు వైద్య ఉన్నతాధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజల నుంచి మాత్రం ఆశించిన ఫలితం కనిపించడంలేదు. ఇతర దేశాల నుంచి వచ్చేవారు, లక్షణాలు కలిగినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలకు హాజరు కావాలి. వైరస్‌ను నియంత్రించి బాధితులకు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి చేసేందుకు కత్తిమీద సాము చేస్తున్నాం. మహేంద్రహిల్స్‌కు చెందిన బాధితునికి స్వస్థత చేకూర్చి డిశ్చార్జి చేయడం కోవిడ్‌పై సాధించిన మొదటి విజయంగా భావిస్తున్నాం.– ప్రొఫెసర్ రాజారావు, జనరల్ మెడిసిన్ ఆగస్ట్ 15న ఘనంగా సత్కరిస్తాం.. గాంధీలో కోవిడ్ ఐసోలేషన్, ఐసీయూల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆర్‌ఎంఓలు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలు అనన్యమైనవి. సొంత కుటుంబ సభ్యులు, బస్తీ ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా, ప్రాణాపాయమని తెలిసినా చిత్తశుద్ధితో విధులు నిర్వహించడం గొప్ప విషయం. కోవిడ్ వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఘనంగా సత్కరించి అవార్డులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.– శ్రవణ్‌కుమార్, గా«ంధీ సూపరింటెండెంట్ -
కరోనా: కలకలం రేపిన వియత్నాం బృందం
సాక్షి, నల్లగొండ : నల్గొండలో వియత్నాం బృందం పర్యటన కలకలం రేపింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో విదేశీయులు ఎక్కడ కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లగొండ పర్యటనకు వచ్చిన 12 మంది వియత్నాం పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైల్ ఖానా సమీపంలో ప్రార్ధన మందిరంలో గురువారం అర్ధరాత్రి 12 మంది పెద్దలు, ఇద్దరు చిన్నారుల గల వియత్నాం బృందం సంచరించటాన్ని గుర్తించారు. ఆ తరువాత వైద్యులు, అధికారుల సూచనలతో వారందరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. (ఓ కరోనా.. ఇది నీకు వినిపిస్తోందా?) కాగా వియత్నాంకు చెందిన వీరంతా భారత్ పర్యటనలో భాగంగా మార్చి 4న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడి నుంచి ఈనెల 9న నాంపల్లి స్టేషన్‌కు చేరుకున్నారు. ఇద్దరు గైడ్లతో కలిపి మొత్తం 14 మంది అదే రోజున నల్లగొండలో దిగారు. అయితే స్థానికుల సమాచారం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు నల్లగొండకు వచ్చి 14 రోజులు అవుతోన్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని.. అయినా ముందు జాగ్రత్త కోసం గాంధీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కరీంనగర్లో పర్యటించిన ఇండోనేషియా బృందంలోని ఎనిమిది మందికి కరోనా పాజిటీవ్ అని తేలడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. దీంతో విదేశీయులు ఎక్కడా పర్యటించకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. -
కొత్తగూడెం యువతికి కరోనా పాజిటివ్
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో తొలి కరోనా వైరస్ నమోదు కావడం కలకలం రేపింది. అశ్వారావుపేట మండలానికి చెందిన స్నేహ అనే యువతికి కరోనా పాజిటివ్ వచ్చిన వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యువతిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన యువతి ఇటలీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా తగ్గక పోవడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్‌ఉన్నట్లు తేల్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకి తరలించారు. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఆ యువతి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. -
మంచిర్యాలలో కరోనా కలకలం.. గాంధీకి తరలింపు
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కరోనా వైరస్ కేసు కలకలం రేపింది. ఇటీవల ఇటలీ నుంచి మంచిర్యాల వచ్చిన యువకుడు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. కరోనా వ్యాప్తిస్తోందన్న భయాందోళనల నడుమ.. అతని కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యలు కరోనా లక్షణాలు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్ మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీకి చెందిన ఈ యువకుడు ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటలీ కరోనా ఉధృతి విపరీతంగా ఉండటంతో 12 రోజలు క్రితం మంచిర్యాలకు చేరుకున్నాడు. అయితే అప్పటి నుంచే అతని ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. (మాల్స్, సినిమా హాల్స్ బంద్) -
కరోనా అలర్ట్: ఉస్మానియాలో నిర్ధారణ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇటీవల కోవిడ్-19 పాజిటివ్‌గా నమోదైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కోలుకున్నాడని తెలిపారు. వైరస్ బారిన పడిన సాఫ్ట్వేర్ యువకుడికి తొలి పరీక్షలో నెగిటివ్ వచ్చిందని, రేపు పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి రెండో రిపోర్టు రానుందని ఆయన మీడియాతో మంగళవారం అన్నారు. మన వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతకలేదని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. (చదవండి: నో కోవిడ్.. హైదరాబాద్ సేఫ్! ) ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో మాట్లాడాను. విదేశాల నుంచి తిరిగి వస్తున్న వారందరికీ స్క్రీనింగ్ చేయాలని కోరాం. అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అనుమానితుల్ని ఐసోలేషన్ వార్డుకు తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నాం. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలపై అధికారులతో మరోసారి సమీక్షించాం. రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు గాంధీలో మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఉస్మానియాలో కూడా పరీక్షలు చేయడానికి అనుమతి వచ్చింది. రెండు స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్ మిషన్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం’అని మంత్రి ఈటల పేర్కొన్నారు. -
ఏపీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి: ప్రపంచ దేశాలను కోవిడ్–19 వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను పూర్తిగా నిఘా పరిధిలోకి తెచ్చారు. ఏపీలోని ఎయిర్ పోర్టులు, పోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనప్పటికీ.. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి.. కోవిడ్ అనుమానిత లక్షణాలు లేకపోతేనే బయటకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వైద్య, ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. విశాఖ ఎయిర్ పోర్టుతో పాటు గంగవరం, విశాఖ, కృష్ణపట్నం పోర్టులలో థర్మల్ స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఎలాంటి అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించినా వారిని తక్షణమే సంబంధిత ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. సింగపూర్, కౌలాలంపూర్, దుబాయ్ నుంచే వచ్చారు.. మార్చి 3వ తేదీ వరకు మన రాష్ట్రానికి ఎక్కువ మంది సింగపూర్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ఆ తరువాత స్థానంలో కౌలాలంపూర్, దుబాయ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యధికంగా 2,638 మంది 24 విమానాల్లో వచ్చారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి 20 విమానాల ద్వారా 1,905 మంది వచ్చారు. దుబాయ్ నుంచి ఎక్కువ విమానాలు అంటే 34 వచ్చినా ప్రయాణికులు 1,869 మంది మాత్రమే విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. మొత్తం 11 చార్టెర్డ్ ఫ్లైట్ల ద్వారా 58 మంది వచ్చారు. మార్చి 3వ తేదీ వరకూ మొత్తం 89 విమానాల ద్వారా 6,470 మంది విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చారు. చైనా, సింగపూర్, సౌత్ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మొత్తం 28 షిప్పుల్లో 678 మంది విశాఖ పోర్టుకు వచ్చారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టు ద్వారా కూడా ప్రయాణికులు ఏపీకి వచ్చారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య 1,125 మంది అని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ముఖాలకు మాస్కులు తగిలించుకుని ఉన్న రోగులు ఐదు జిల్లాల్లో 10 అనుమానిత కేసులు మన రాష్ట్రంలోనూ కోవిడ్–19 అనుమానిత కేసులు నమోదయ్యాయి. విజయవాడలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి.కొండేపాడులో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన ఒకరు, విశాఖ ఎయిర్ పోర్టులో ముగ్గురు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో వారిని ముందు జాగ్రత్త చర్యగా ఐసొలేషన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి రక్తం, గొంతు నుంచి కళ్లె శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపించారు. – సాక్షి, అమరావతి బ్యూరో/ఏలూరు టౌన్/ శ్రీకాకుళం/రాజమహేంద్రవరం/విశాఖపట్నం ‘పశ్చిమ’లో ఇద్దరు .. పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయి. అనుమానితుల్లో ఒకరు మస్కట్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తూ గతనెల 18న బి.కొండేపాడులోని తన మావయ్య ఇంటికి వచ్చాక జ్వరం, జలుబు బారిన పడ్డాడు. అతడి మావయ్యకు కూడా జ్వరం, దగ్గు రావడంతో కుటుంబ సభ్యులు కోవిడ్ అనుమానంతో ఇద్దరినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వారిని ఐసొలేషన్ వార్డులో చేర్చి రక్ల, కళ్లె నమూనాలను సేకరించి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. సోంపేటలో ముగ్గురు శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ముగ్గురు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా.. బుధవారం ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారిని రిమ్స్‌కు తరలించారు. వారం రోజుల క్రితం కువైట్ నుంచి వచ్చిన ముగ్గురూ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పూణె పంపించారు. విశాఖలో ముగ్గురు కోవిడ్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో విశాఖ ఎయిర్ పోర్టులో ముగ్గురిని అక్కడి వైద్యులు కోవిడ్ వార్డుకు పంపించారు. ఈ ముగ్గురు గత నెలలో మలేసియా వెళ్లి మంగళవారం విశాఖ తిరిగొచ్చారు. జ్వరం, తీవ్ర జలుబు, గొంతునొప్పి ఉండటంతో వైద్యులు బుధవారం చెస్ట్ ఆసుపత్రిలో గల ఐసొలేటెడ్ వార్డులో చేర్చి నమూనాలు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. విజయవాడలో ఒకరు కృష్ణా జిల్లా విజయవాడలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయేమోననే అనుమానంతో ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆ వ్యక్తి విధుల్లో భాగంగా ఇటీవల జర్మనీకి వెళ్లాడు. రెండు రోజుల క్రితం విజయవాడలోని బంధువుల ఇంటికి వచ్చిన అతడు జలుబు, జ్వరంతో ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు రక్త నమూనా, గొంతులోని కళ్లెను సేకరించి పూణె ల్యాబ్‌కు పంపించారు. విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ముందుజాగ్రత్తగా ఏర్పాటు చేసిన ఒక రూమ్ ‘తూర్పు’లో ఒకరు కోవిడ్ వైరస్ సోకిందనే అనుమానంతో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను బుధవారం కాకినాడ సామాన్య ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆ యువకుడు ఈ ఏడాది జనవరి 21న దక్షిణ కొరియా వెళ్లాడు. నెల రోజులపాటు అక్కడే ఉండి గత నెల 22న హైదరాబాద్ చేరుకున్నాడు. గత నెల 28న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అత్త వారిల్లు గోదశివారిపాలెం చేరుకున్నాడు. జలుబు, దగ్గు బారినపడటంతో వైద్యాధికారులు అతడిని కాకినాడలోని జీజీహెచ్‌కు తరలించి ఐసొలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రక్త, కళ్లె నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపించారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వరకు ప్రైవేట్ బస్సులో అతడితోపాటు ప్రయాణించిన 40 మంది ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో వైద్య, ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. -
కరోనా అలర్ట్: ‘రిపోర్టు వస్తేనే చెప్పగలం’
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పర్యటించారు. కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న అనుమానితుడిని వైద్యులతో కలిసి బుధవారం ఉదయం కలెక్టర్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. కోవిడ్-19పై ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదు. (చదవండి : తూర్పుగోదావరిలో కరోనా కలకలం!) అనుమానిత వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించాం. రిపోర్టు వచ్చాకే అతనికి కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయం చెప్పగలం. అనుమానితుడు తిరిగిన ఇంటిని కూడా డొమెస్టిక్ ఐసోలేషన్‌లో పెట్టాం. కరోనా వైరస్‌పై సాఫ్ట్వేర్ ఉద్యోగి బంధువులకు అవగాహన కల్పించాం. చికిత్సకు సంబంధించి అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాం’అని కలెక్టర్ పేర్కొన్నారు. (చదవండి: కరోనా భయం : హోలీ వేడుకలపై పిటిషన్) -
వారికి కరోనా సోకలేదు: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నాటికి 47 మంది కోవిడ్-19(కరోనా వైరస్) అనుమానితులకు పరీక్షలు నిర్వహించినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రాజు తెలిపారు. వారిలో 45 మంది షాంపిల్స్ నెగటివ్‌గా తేలాయని పేర్కొన్నారు. మరో ఇద్దరి షాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని తెలిపారు. గురువారం నాటికి ఇందుకు సంబంధించిన రిపోర్టులు వచ్చే అవకాశం ఉందని.. అప్పటివరకు వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ ఆస్పత్రిలో ఉంచుతామని స్పష్టం చేశారు. (కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన సర్కార్) కాగా ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారని శ్రీనివాస రాజు స్పష్టం చేశారు. అతడిని కలిసిన మరో వ్యక్తికి వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఇక వీరిద్దరు కాకుండా మిగిలిన 45 మంది నెగిటివ్‌గా తేలినప్పటికీ... 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మీడియా బులెటిన్ విడుదల చేసింది.(కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్) -
నగరంలో కోవిడ్-19 కలకలం!
'సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘కోవిడ్–19’ వైరస్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ సోకిన వ్యక్తికి పాజిటివ్ అని తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టీవీలు, ఇతర మీడియా ద్వారా విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. కరోనా బాధితుడు ప్రస్తుతానికి ఒక్కడే అని తేలినా...ఆ వ్యక్తి నగరంలోని దాదాపు 80 మందితో క్లోజ్‌గా తిరిగినట్లుగా తెలుస్తోంది. అతను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాడు...ఏ వాహనం ఉపయోగించాడు... జనసమర్థం ఎక్కువగా ఉన్న సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌కు వెళ్లాడా..మిత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లాడా...వారి కుటుంబ సభ్యులతో ఒకే ఇంట్లో గడిపాడా...వంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. నిలకడగా కరోనా బాధితుని ఆరోగ్యం.. వేసవి ప్రారంభమై పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు చేరడంతో హీట్‌కు వైరస్ మనుగడ సాధించలేదని ఇప్పటివరకు భావించారు. కానీ వాతావరణంలోని టెంపరేచర్‌తో సంబంధం లేకుండా వైరస్ విస్తరించే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌వార్డులో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ బాధితుడి (24) నుంచి ఆ తర్వాత ఎంత మందికి వైరస్ సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరిని గుర్తించడం వైద్య ఆరోగ్యశాఖకు కష్టతరంగా మారింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయట పడేందుకు 2 నుంచి 14 రోజుల సమయం పడుతుండటం, ఆ లోపు మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో గ్రేటర్‌వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక బాధితుడు నివాసం ఉన్న సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లో జనం భయపడుతున్నారు. తమలో ఎవరికైనా వైరస్ సోకిందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఈ ఏరియాలో జనసంచారమే కన్పించలేదు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ పారిశుధ్య చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరిలో కరోనా కలకలం! మారేడుపల్లి: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో మొదటి కేసుగా మహేంద్రహిల్స్ రవి కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా వైరస్ (కోవిడ్–19) నిర్ధారణ కావడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. మంగళవారం కాలనీలో నిర్మానుష్య వాతావరణం కన్పించింది. వైరస్ సోకిన వ్యక్తి ఐదు రోజుల క్రితం కాలనీలో ఎటువంటి మాస్క్ ధరించకుండా సంచరించాడని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడితో పాటు ఇంట్లో అతడి తల్లిదండ్రులు ఉంటారు. వారిని ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు. కరోనా బాధితుడి నివాసానికి చుట్టుపక్కల ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు. రవి కాలనీతో పాటు త్రిమూర్తికాలనీ, వైజయంతి కాలనీ, బాలంరాయి సొసైటీ తదితర ప్రాంతాల్లో కూడా కరోనా అంశం చర్చనీయాంశమైంది. మహేంద్రా హిల్స్‌లో భయం భయం మెట్రో సిబ్బందికి కరోనా అలర్ట్ మెట్రో సిబ్బందికి కరోనా వైరస్‌పై పూర్తి అవగాహన కల్పించామని, పరిశుభ్రత చర్యలు చేపట్టాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు, స్టేషన్లు ఎస్కలేటర్లు, ప్రయాణికులు రైల్లో పట్టుకొని నిలబడే పరిసరాలను రాత్రి వేళల్లో పరిశుభ్రంగా డిటర్జెంట్లతో శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెట్రో రైలు స్టేషన్లలో అనౌన్స్ మెంట్లు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ సిబ్బంది అలర్ట్ మారేడుపల్లి: మహేంద్రహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో కంటోన్మెంట్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు మంగళవారం రవికాలనీలో పారిశుధ్ధ్య చర్యలు చేపట్టారు. శానిటేషన్ విభాగం అధికారులు వీధుల్లో బ్లీచింగ్ పౌడర్, లైవ్పౌడర్, మలేరియా నివారణ మందు స్ప్రే చేశారు. చెత్త చెదారాన్ని తొలగించారు. కంటోన్మెంట్ శానిటేషన్, హెల్త్ విభాగం అధికారులు కరోనా బాధితుడి నివాస పరిసర ప్రాంతాలను సందర్శించారు. చుట్టుపక్కల ఇళ్లల్లో ఉంటున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్ సూచించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాధిని నిరోధించవచ్చునన్నారు. (చదవండి: కోవిడ్ కట్టడికి 100 కోట్లు) ఉమ్రా యాత్రకు బ్రేకులు.. ముస్లింల ఉమ్రా యాత్రకు బ్రేక్ పడింది. సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. కరోనా నేపథ్యంలో మక్కా, మదీనా సందర్శన గత వారం రోజులుగా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉమ్రా యాత్రికులను ఏకంగా విమానాశ్రయాల నుంచే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏటా ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా ప్రార్థనల కోసం వేలాది మంది వెళ్ళివస్తుంటారు. ఉమ్రా వీసాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో యాత్రలు సైతం వాయిదా పడి ట్రావెల్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు సౌదీ ఆరేబియాకు విజిట్ వీసా కూడా నిలిచిపోయింది. ఈ ఏడాది జూలై చివర్లో ప్రారంభం కానున్న హజ్ యాత్రపై కూడా కరోనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. బంజారాహిల్స్: కరోనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్ లోని చైనా ఆహార పదార్థాలు అందించే హోటళ్లు గత నాలుగైదు రోజులుగా వెలవెలబోతున్నాయి. చైనాకు చెందిన పలు ప్రాచైజీలు హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌళి, సికింద్రాబాద్, మాదాపూర్, హిమాయత్‌నగర్, సుచిత్ర, కేపీహెచ్‌బీ కాలనీల్లో కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 లోనూ చైనా రుచులతో కూడిన మరో హోటల్ నడుస్తోంది. చైనాకు చెందిన చైన్ గ్రూప్ కావడంతో మసాలా దినుసులతో పాటు, వివిధ సామాగ్రిని చైనా నుంచే తెప్పిస్తుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ హోటల్లకు గిరాకీ తగ్గుముఖం పట్టింది. సోమవారం ఏకంగా నగరంలో కరోనా కేసు నమోదు కావడంతో మంగళవారం ఈ హోటళ్లకు వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. నగరంలోని పలు చైనీస్ రెస్టారెంట్లలో చైనా, మణిపాల్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువతీ, యువకులు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో వీరందరూ భయాందోళనకు గురౌతున్నారు. చైనీస్ హోటళ్లు వెలవెల బస్సులో ఉన్నప్పుడు వైరస్ లేదు! గల్ఫ్ రిటర్న్స్‌కు కరోనా దడ..! చాంద్రాయణగుట్ట: హైదరాబాదీ గల్ఫ్ రిటర్న్స్‌కు కోవిడ్–19 ( కరోనా) భయం పట్టుకుంది. దుబాయ్ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో పాతబస్తీలో కలకలం రేగింది. పాతబస్తీకి చెందిన పలువురు దుబాయ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, లండన్ తదితర దేశాలకు వెళ్లి వస్తుంటారు. కరోనా వైరస్ కారణంగా విమానాశ్రయాల్లో ఆయా దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా, కోవిడ్–19 ప్రభావం తీవ్రంగా ఉండడంతో రాకపోకలకు బ్రేక్ పడింది. గల్ఫ్‌దేశాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా రావాల్సి ఉండటంతో దుబాయ్ విమానాశ్రయంలో నిలిపి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో గంటల కొద్ది ఆలస్యం జరుగుతోంది. రెండు రోజుల క్రితం బార్కాస్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందగా, అతడి కుమారుడు లండన్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వచ్చేందుకు ప్రయత్నించగా దుబాయి విమానాశ్రయంలో ఏడు గంటలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ పరిస్థితుల్లోనైనా సేవలందిస్తాం కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వంతో పాటు వైద్యశాఖ ఉన్నతాధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యవృత్తిలోకి వచ్చిన రోజే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైద్యసేవలు అందిస్తామని చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాం. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న మా తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తూ నా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు. – నిహారిక, ఎంబీబీఎస్ విద్యార్థిని వైరస్ ప్రభావం తగ్గాకే వస్తా కోవిడ్ వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతే గాంధీ ఆస్పత్రికి వస్తాను. మంగళవారం ఓపీ విభాగంలో చూపించుకునేందుకు ఇక్కడికి వచ్చాను. తీరా వచ్చాక కోవిడ్ వైరస్ అంటూ అందరూ భయపెడుతున్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే నాకు కూడా భయం వేస్తోంది. తక్షణమే గాంధీ ఆస్పత్రి ప్రాంగణం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాను. అన్నీ సర్దుకున్నాక వచ్చి డాక్టర్లకు చూపించుకుంటాను. అప్పటి వరకు ఇక్కడికి రాకవపోవడమే ఉత్తమం అనుకుంటున్నా. – సతీష్, ఫిల్మ్‌నగర్ ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు గల్ఫ్ రిటర్న్స్ రాకపోకలు వాయిదా వేసుకుంటున్నారు. దుబాయి, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారు కరోనా భయంతో సెలవుల్లో ఇక్కడికి రావడానికి, వచ్చిన వారు తిరిగి వెళ్లడానికి భయపడుతున్నారు. అత్యవసర పరిస్ధితుల్లో సైతం రాకపోకలకు ఇబ్బందిగా మారింది. విమానాశ్రయాల్లో పకడ్భందీ చర్యలు చేపట్టినా... కరోనా భయం మాత్రం వణికిస్తోంది. –గులాం ఆహ్మద్ ఖాద్రీ , సైదాబాద్ స్వదేశానికి రాలేక పోతున్నా దుబాయ్, ఆస్ట్రేలియాలో హోటళ్ల వ్యాపారం ఉంది. వారం రోజులు దుబాయ్‌లో ఉన్నా. ఇక్కడ కరోనా భయం తీవ్రంగా ఉంది. దీంతో ఆస్ట్రేలియాకు వచ్చాం. ఇక్కడ కూడా దాదాపు అలాగే ఉంది. ఇండియాకు వెంటనే రావాలనుకున్న అనుకూలించడం లేదు. – మహ్మద్ బా ఉస్మాన్, బార్కాస్ -
కామారెడ్డిలో కరోనా.. గాంధీకి తరలింపు
సాక్షి, నిజామాబాద్ : ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. భారత్‌లో ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. హైదరాబాద్‌లోనూ సోమవారం తొలికేసు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జిన్న రాజయ్య (50)కు కరోనా సోకిందనే అనుమానం కలుగుతోంది. వ్యాధి లక్షణాలు కనిపించడంతో తొలుత కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బాధితున్ని తరలించారు. అయితే రాజయ్య వారం క్రితమే దుబాయ్ నుంచి వచ్చినట్లు కుటుంబ సభ్యలు చెప్పడంతో అక్కడి వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దుబాయ్ నుంచి భారత్‌కు చేరకుని వారం అవుతోందని, అప్పటి నుంచి తీవ్ర జ్వరం, తుమ్ముల, వాంతులు వస్తున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అతనికి వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో గాంధీకి తరలించినట్లు వైద్యలు పేర్కొన్నారు. (భారత్‌లో మరో కరోనా కేసు నమోదు) -
79 మంది కోవిడ్ అనుమానితులకు పరీక్షలు
సాక్షి, గాంధీ ఆస్పత్రి: నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 79 మంది కోవిడ్ అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించామని నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరంతో ఓ వ్యక్తి గురువారం ఆస్పత్రికి రాగా ఐసోలేషన్ వార్డులో చేర్చుకుని నమూనాలు సేకరించి కోవిడ్–19 నిర్ధారణ పరీక్ష కోసం గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు పంపించామన్నారు. 78 మందికి కోవిడ్ నెగటివ్ వచ్చిందని, గురువారం చేరిన అనుమానితునికి సంబంధించిన నివేదిక శుక్రవారం అందుతుందన్నారు. -
హైదరాబాద్‌లో కోవిడ్ గుబులు!
సాక్షి, హైదరాబాద్: చైనాలోని వూహాన్ పట్టణ కేంద్రంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్(కరోనా) వైరస్ తెలంగాణ రాష్ట్రంలోనూ అలజడి సృష్టించింది. చైనా తదితర దేశాల నుంచి హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు వస్తుండడంతో ఏ క్షణాన ఈ వైరస్ ఇక్కడి ప్రజలను కబళిస్తుందోనన్న ఆందోళన ఈ వారమంతా నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ వైరస్ సోకిందని, పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చిందన్న వార్తలు ఈ ఆందోళనలను మరింత అధికం చేశాయి. చివరకు వారికి కూడా నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని తేలడంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. కోవిడ్ వైరస్ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంది. ప్రత్యేక పర్యవేక్షణతో ఆ శాఖ ఉన్నతాధికారులు కోవిడ్ వైరస్‌పై యుద్ధమే చేశారంటే అతిశయోక్తి కాదు. గత పది రోజుల నుంచి మొత్తం 92 మందిని పరీక్షించారు. ఇందుకోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోనే థర్మల్ స్కానింగ్ ద్వారా ప్రయాణికులను క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. కోవిడ్ వైరస్ నగరంలోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వారిని వైద్యాధికారులు నిశితంగా పరీక్షించారు. వైరస్ లేదని తేలిన తర్వాతే వారిని ఆసుపత్రుల నుంచి బయటకు పంపారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వసంత్ అనే వైద్యాధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే, దాంతో తనకు సంబంధం లేదని, తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆ వైద్యుడు ఆత్మహత్యాయత్నం చేయడం, ఆయనకు డాక్టర్ల జేఏసీ మద్దతివ్వడం లాంటి ఘటనలు జరిగాయి. మొత్తంమీద గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే వైరస్ మాట వినిపించింది. చైనాతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఏం జరుగుతోందన్న దానిపై ప్రజలు ఆరా తీస్తూ కనిపించారు. ముఖ్యంగా చైనాలో నెలకొన్న పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. కోవిడ్ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలంటూ... వాడాల్సిన మందులు ఇవేనంటూ ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. వాటిని నమ్మొద్దంటూ నిపుణులు సూచించారు. -
గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై ఈటల ఆగ్రహం
-
గాంధీ ఆసుపత్రిలో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అక్రమాలపై బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో పరిణామాలు, ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆసుపత్రి అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. డాక్టర్ వసంత్‌కుమార్ ఆరోపణలపై మంత్రి ఆరా తీశారు. డాక్టర్ స్థాయిలో ఉన్న ఆయన ఆత్మహత్యకు యత్నించడం సరికాదన్నారు. వైద్యశాఖలో జరుగుతున్న వాటిపై కమిటీలు ఏర్పాటు చేస్తామని..ఎప్పటికప్పుడు తమకు నివేదికలు ఇస్తుంటాయని మంత్రి పేర్కొన్నారు. వాస్తవాలు వెలికితీస్తాం..బాధ్యతులను శిక్షిస్తాం.. వ్యక్తుల కంటే వ్యవస్థే ముఖ్యమని.. వాస్తవాలు వెలికి తీసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ఇంటర్‌షిప్‌కు సంబంధించి లీవ్ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మాత్రమే అనుమతులు తీసుకోవాలన్నారు. హాజరుకు సంబంధించి సూపరిండెంట్‌కి ఎలాంటి అధికారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టీచింగ్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను స్టడీ చేయాలని మంత్రి ఈటల సూచించారు. అవకతవకలపై విచారణ గాంధీ ఆసుపత్రిలో అవకతవకలపై విచారణకు వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. విచారణ చేసే బాధ్యతను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులకు 100 శాతం హాజరు తప్పనిసరి చేశారు. విద్యార్థుల హాజరు నమోదు బాధ్యతల నుంచి సూపరిండెంట్‌ను తొలగించారు. -
8,212 మందికి కరోనా స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా థర్మల్ స్కానింగ్ ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల 30 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 8,212 మందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసింది. వారంతా చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, సింగపూర్, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చినవారే. కరోనా లక్షణాలుంటే ప్రాథమికంగా థర్మల్ స్కానింగ్‌లో గుర్తించడానికి వీలుంది. ప్రధానంగా జ్వరం ఉష్ణోగ్రతలు థర్మల్ స్కానింగ్‌లో గుర్తిస్తారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే నేరుగా నిర్ధారిస్తున్నారు. థర్మల్ స్కానింగ్‌లో కరోనా అనుమానిత లక్షణాలున్న వారిలో కొందరిని ఆసుపత్రికి తరలించగా, మరికొందరికి జాగ్రత్తలు సూచిస్తూ వారి వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని సలహాలిచ్చి పంపారు. ఇప్పటివరకు 96 మందిని బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఒంటరిగా 28 రోజులు ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు సూచించాయి. వారంతా వివిధ జిల్లాలకు చెందినవారు. కాగా వారి వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే వారికి కరోనా అనుమానిత లక్షణాలున్నాయన్న ప్రచారం జరిగితే, చుట్టుపక్కలున్న వారు బహిష్కరణ చేసే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖ వరా>్గలు తెలిపాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 87 మంది నుంచి నమూనాలను సేకరించారు. వారిలో 85 మందికి నెగెటివ్ రాగా, మరో ఇద్దరి నమూనాలను గురువారం పరీక్షల కోసం పంపారు. వాటి వివరాలు రావాల్సి ఉంది. కరోనాపై ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు వేడిగా ఉండటంతో కరోనా వైరస్ బతికే పరిస్థితి ఉండదని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు భరోసా ఇస్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించాలని పదేపదే చెబుతున్నారు. అనంతర పర్యవేక్షణపై అయోమయం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా వైరస్‌పై తలెత్తుతున్న అనేక అనుమానాలను నివృత్తి చేస్తూ బులిటెన్ విడుదల చేసింది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని విమానాశ్రయంలో థర్మల్ స్కానింగ్‌లో స్క్రీనింగ్ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జ్వరం వచ్చిన వ్యక్తులను గుర్తించడంలో థర్మల్ స్కానర్లు ప్రభావవంతంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ సోకితే వారు అనారోగ్యానికి గురై జ్వరం రావడానికి 2 నుంచి 10 రోజుల సమయం పడుతుందని, ప్రాథమిక దశలో ఉన్నప్పుడు థర్మల్ స్కానింగ్‌లో కనుగొనలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యక్తులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలేంటనే దానిపై స్పష్టత లేదు. జ్వరం, జలుబు, ఇతరత్రా అనుమానిత లక్షణాలున్న వారినే గుర్తించి ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేస్తున్నారు. అయితే 8 వేల మందిని స్క్రీనింగ్ చేశాక, వారిలో వేలాది మందికి అప్పటికప్పుడు లక్షణాలు లేవు. కానీ వారిలో ఎవరికైనా తర్వాత కరోనా లక్షణాలు వృద్ధి చెందుతున్నాయా లేదా అన్న విషయంలో పర్యవేక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వారిని సాధారణ ప్రయాణికుల మాదిరిగా పంపేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వారి ఆరోగ్య పరిస్థితులపై స్పష్టమైన నిఘా పెట్టలేదన్న చర్చ జరుగుతోంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ కూడా ఎటువంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని పలువురు అంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో సూచనలు.. కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు తరచుగా చేతులను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి. లేదా సబ్బుతో కడుక్కోవాలి. చేతులు శుభ్రం చేసిన తర్వాత చేయి తడి లేకుండా ఆరబెట్టాలి. చైనా నుంచి లేఖ లేదా ఏదైనా ప్యాకేజీలను స్వీకరించడం సురక్షితమే. వాటి నుంచి కరోనా వైరస్ సంక్రమించదు. లేఖలోని అక్షరాలు లేదా ప్యాకేజీలలో ఉండే వస్తువులపై ఒకవేళ కరోనా వైరస్ ఉన్నా అది ఎక్కువ కాలం జీవించదు. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల నుంచి కరోనా వైరస్ వస్తుందనడానికి ఆధారాల్లేవు. అయినా పెంపుడు జంతువులతో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ సబ్బుతో చేతులు కడుక్కోవడం సురక్షితం. న్యుమోనియాకు ఉపయోగించే వ్యాక్సిన్లు కరోనా వైరస్ రాకుండా ఏమాత్రం కాపాడలేవు. ఈ వైరస్ కొత్తది.. పైగా భిన్నమైన లక్షణాలున్నది. దీనికి సొంత టీకా రావాల్సి ఉంది. అయితే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి టీకాలు వేయించుకోవడం మంచిదే. వెల్లుల్లి తింటే కరోనా రాదన్న వాదనకు ఆధారాల్లేవు. వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారమే. ఇది కొన్ని యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. నువ్వుల నూనె వాడటం వల్ల కరోనా వైరస్ శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుందన్న వాదనలో వాస్తవం లేదు. నువ్వుల నూనె కరోనా వైరస్‌ను చంపదు. అన్ని వయసుల వారికి కరోనా వైరస్ సోకుతుంది. ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి ఉన్న వారికి ఈ వైరస్‌తో తీవ్ర అనారోగ్యం కలిగే ప్రమాదముంది. కరోనా వైరస్ నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట మందులు లేవు. -
మరో తొమ్మిది కరోనా అనుమానిత కేసులు
గాంధీ ఆస్పత్రి : కరోనా అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శనివారం 9 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 70 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, 62 కేసుల్లో నెగటివ్ వచ్చింది. మరో 8 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. కాగా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి శనివారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. అనుమానిత రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గాంధీలో 10 పడకల సామర్థ్యంతో అదనంగా మరో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎంఈ చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. 5 స్వైన్‌ఫ్లూ కేసులు.. స్వైన్‌ఫ్లూ మహమ్మారి చాపకింది నీరులా విస్తరిస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శనివారం కొత్తగా 5 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీకి చెం దిన ఓ వృద్ధురాలు (64), నల్లగొండ జిల్లా త్రిపురారం గ్రామానికి చెందిన వృద్ధుడు(60), చాంద్రాయణగుట్టకు చెందిన వృద్ధురాలు(68), మహబూబ్‌నగర్ జిల్లా హేండ్‌వాడకు చెందిన వ్యక్తి (35), ఫతేనగర్‌కు చెందిన నెలన్నర వయసు గల పాపకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ అనుమానితులకు గాంధీ ఆస్పత్రి డిజాస్టర్, పీఐసీయులో అడ్మిట్ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు గాంధీలో 10 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా.. వీరిలో ఐదుగురిని సురక్షితంగా డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. -
హైదరాబాద్‌లో ‘కరోనా’ కలకలం..
సాక్షి, హైదరాబాద్ : చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులను వైద్యులు గుర్తించారు. కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అలాగే వైరస్ సోకిందనే అనుమానంతో ఇప్పటికే పలువురు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా మియాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే అతను చైనా నుంచి నగరానికి వచ్చారు. అయితే ప్రస్తుతం గాంధీలో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు కోసం ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అనుమానితుల రక్త నమూనాలను కొరియర్ ద్వారా విమానాల్లో పుణేకు పంపి పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఆ ఫలితాలు రావడానికి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా గాంధీ ఆసుపత్రిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని వైద్య యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. గాంధీ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేసేందుకు అనువుగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అలాగే చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేకంగా థర్మల్ స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. చదవండి : కరోనా పరీక్షలు ఇక ‘గాంధీ’లోనే భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’ -
గాంధీలో కరోనా పరీక్షలు
-
కరోనా పరీక్షలు ఇక ‘గాంధీ’లోనే
సాక్షి, హైదరాబాద్ : కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటివరకు కరోనా పరీక్షలు పుణేలో నిర్వహిస్తున్నారు. అక్కడకు రక్తనమూనాలను కొరియర్ ద్వారా విమానాల్లో పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు రావడానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇప్పుడు ఈ ఇబ్బందులేవీ లేకుండా గాంధీ ఆసుపత్రిలోనే నిర్వహించాలని వైద్య యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గాంధీ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేసేందుకు అనువుగా ఉందని వైద్య అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కరోనా నిర్ధారణ కిట్లను సరఫరా చేయాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఫీవర్ ఆసుపత్రిలోనూ చేయడానికి వీలుందని ఈటల పేర్కొంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, దేశంలోని 10 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో గాంధీ ఆసుపత్రి ఉండటం గమనార్హం. రెండు సార్లు పరీక్షలు తప్పనిసరి.. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఇక నుంచి 2 సార్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్రానికి మార్గదర్శకాలు జారీచేసింది. ఒకసారి రక్త పరీక్ష చేశాక అందులో నెగిటివ్ వచ్చినా 48 గంటల్లో మరోసారి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దీనివల్ల పూర్తిస్థాయిలో కచ్చితత్వం వస్తుందనేది కేంద్రం భావన. ఇప్పటివరకు తెలంగాణలో 10 మంది కరోనా అనుమానంతో ఫీవర్ ఆసుపత్రికి వచ్చారు. వారిలో ఐదుగురికి ఎలాంటి లక్షణాల్లేవని నిర్ధారించారు. మరో ఐదుగురి రక్త నమూనాలను పుణేకు పంపించారు. వీరి ఫలితాలు నేడు పుణే నుంచి వస్తాయి. అయితే మొదటి ఐదుగురికి నెగిటివ్ వచ్చినా మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ ఐదుగురిలో ముగ్గురు చైనాలోని వుహాన్ నుంచి హాంకాంగ్ మీదుగా భారత్‌కు వచ్చినట్లు ఫీవర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. -
గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక ఎమర్జెన్సీ బ్లాక్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన ఎమర్జెన్సీ బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 60 ఐసీయూ పడకలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం రూ.8 కోట్ల వ్యయంతో ఈ బ్లాక్‌ను తీర్చిదిద్దుతున్నారు. గతంలో సాధారణ పద్ధతిలో మాత్రమే ఎమర్జెన్సీ బ్లాక్ ఉండగా, ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చివేసి ప్రత్యేక బ్లాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. అత్యవసర కేసులన్నీ ఇక్కడకే.. ఎటువంటి అత్యవసర కేసు అయినా ముందుగా ఈ ఎమర్జెన్సీ బ్లాక్‌కు వస్తుంది. ఇక్కడ రోగిని ప్రాథమికంగా పరీక్షించాక అవసరాన్ని బట్టి ఇందులోనే ఉంచాలా? లేక సంబంధిత స్పెషలిస్టు వార్డులకు పంపాలా అనేది నిర్ణయిస్తారు. ఈ ఎమర్జెన్సీ బ్లాక్‌లో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని డీఎంఈ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వైద్య పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. అలాగే నిపుణులైన వైద్యులను నియమించనున్నారు. అవసరాన్ని బట్టి అందులో పనిచేసే వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సుశిక్షితులైన వైద్య సిబ్బందిని తీసుకొచ్చే అవకాశముంది. ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొటోకాల్ కాబట్టి ఆ మేరకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఏటా సగటున 90 వేల మెడికల్ ఎమర్జెన్సీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో అత్యధికంగా 70 శాతం రోడ్డు ప్రమాద బాధితులవి కాగా, రెండో స్థానంలో గుండెపోటు కేసులున్నాయి. ఇందులోనూ ఎక్కువ శాతం అత్యవసర కేసులు గాంధీ ఆస్పత్రికే వస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు చేర్చుకోని అనేక కేసులు సైతం ఇక్కడికే వస్తుంటాయి. ఇక నిమ్స్ ఆస్పత్రిలో పడకలు లేకపోతే గాంధీ ఆస్పత్రికే వెళ్లమని అక్కడి వైద్యులు సూచిస్తుంటారు. గాంధీలో పడకలు ఉన్నా.. లేకున్నా రోగులను వెనక్కి పంపించరు. ఎలాగోలా సర్దుబాటు చేస్తారు. మరోవైపు గుండెపోటు బాధితుల చికిత్స కోసం ఇక్కడే స్టెమీ హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేదు ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొటోకాల్ పద్ధతిలో అత్యాధునిక వసతులతో దీన్ని నెలకొల్పుతున్నాం. ఇంత పెద్ద ఎమర్జెన్సీ బ్లాక్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా లేదు. నిమ్స్‌లోనూ ఇంత పెద్దది లేదు. ఎంత పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి అయినా ఎమర్జెన్సీ బ్లాక్ కేవలం 20–30 పడకలకు మించి ఉండదు. వచ్చే నెలలో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్ రెడ్డి -
దీపక్ కిడ్నాప్ మిస్టరీ వీడింది!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కిడ్నాపైన ఏడాదిన్నర బాలుడు దీపక్ ఆచూకి లభ్యమైంది. అర్ధరాత్రి బాలున్ని గుర్తి తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. చిలకలగూడ పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో దీపక్‌ను ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు ముఠాగా ఏర్పడి ఇద్దరు చిన్నారులతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మౌలాలికి చెందిన రాధిక, తులసీరామ్ దంపతులకు నలుగురు సంతానం.. వారు రాము(9), ధనిరాం(6), లక్ష్మణ్(4), దీపక్ (18 నెలలు). తులసీరామ్ ఓ కేసులో జైలులో ఉన్నాడు. డెలివరీ కోసం వచ్చిన బంధువును పరామర్శించేందుకు రాధిక ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలోని విజిటర్స్ షెడ్డులోనే ఆమె ఉంటోంది. గత నెల 5న ఉదయం నిద్రలేచి చూడగా దీపక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ ముఠా బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ముఠాలో ముగ్గురు మహిళలతోపాటు 12 ఏళ్ల బాలుడు, పదేళ్ల బాలిక ఉన్నట్లు సమాచారం. -
మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం ప్రారంభం
-
దిశ నిందితుల రీ పోస్ట్‌మార్టం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం ప్రారంభమైంది. ఇందుకోసం ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఢిల్లీ)కు చెందిన ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యుల బృందం హైదరాబాద్ చేరుకుంది. గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్న నాలుగు మృత దేహాలకు సోమవారం ఉదయం రీ పోస్ట్‌మార్టం చేపట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు టేబుల్స్ పై రీ పోస్ట్‌మార్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క మృతదేహం పోస్ట్‌మార్టం ప్రక్రియకు సుమారు గంటన్నర సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా. రీ పోస్ట్‌మార్టం ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనున్నది. సాయంత్రం 5 గంటల లోపల రీ పోస్ట్‌మార్టం నివేదికను వైద్యులు సీల్డ్ కవర్లో భద్రపరచనున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రీ పోస్ట్‌మార్టం జరిగే మార్చురీ లోపలికి ఎవరిని అనుమతించటం లేదని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి వర్గాలు రీ పోస్ట్‌మార్టంకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
హైకోర్టు ఆదేశాలతో గాంధీకి మృతదేహాలు
-
దిశ : గాంధీకి చేరుకున్న నిందితుల మృతదేహాలు
సాక్షి, హైదరాబాద్ : చటాన్‌పల్లి ఎన్కౌంటర్లో మరణించిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కు ల కమిషన్ విచారణ చేపట్టడంతో పాటు పలు ప్రజా సంఘాలు కోర్టులో కేసులు వేశాయి. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టడం, ఆ తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేయడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించారు. శుక్రవారం వరకు ఇక్కడే భద్రపర్చనున్నారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు -
‘గాంధీ’ లో 11 నెలల బాలుడు కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక అనే మహిళ కొద్ది రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు వచ్చారు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే తన 11 నెలల కుమారుడితో కలిసి ఉంటున్నారు. రాధిక భర్త నేరం చేసిన కేసులో చంచల్ గూడ జైలులో ఉన్నారు. దీంతో రాధిక గాంధీ ఆస్పత్రిలోని వెయిటింగ్ రూమ్‌లో బాలుడితో కలిసి ఉంటున్నారు.గురువారం తెల్లవారు జామున 4 గంటలకు గుర్తుతెలియన వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసి పరారయ్యారు. కాసేపటి తర్వాత నిద్రలేవగా పక్కన బాబు కనిపించలేదు. దీంతో ఆమె కంగారుపడిన ఆమె చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఉదయం 7.36గంటల సమయంలో బాలుడిని కిడ్నాప్ చేసినట్లుగా గాంధీ ఆస్పత్రిలోని సీసీ టీవి పుటేజ్‌లో ద్వారా కనుగొన్నారు. మెయిన్ గేట్ దగ్గర సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో అనుమానితున్ని సరిగా గుర్తించలేకపోతున్నామని పోలీసులు పేర్కొన్నారు. అదృశ్యమైన బాలుణ్ణి వెతికేందుకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్ రూట్లలలో మరిన్ని సీసీటీవీలను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.