
సాక్షి, గాంధీ ఆస్పత్రి: నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 79 మంది కోవిడ్ అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించామని నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరంతో ఓ వ్యక్తి గురువారం ఆస్పత్రికి రాగా ఐసోలేషన్ వార్డులో చేర్చుకుని నమూనాలు సేకరించి కోవిడ్–19 నిర్ధారణ పరీక్ష కోసం గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు పంపించామన్నారు. 78 మందికి కోవిడ్ నెగటివ్ వచ్చిందని, గురువారం చేరిన అనుమానితునికి సంబంధించిన నివేదిక శుక్రవారం అందుతుందన్నారు.