సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి : తెలంగాణలో కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లోనూ కేసులు బయటపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కేసులు బయటపడుతుండడం చూస్తున్నాం. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 120 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది.
గాంధీ ఆస్పత్రి సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 120 మందికి పైగా కరోనా సోకగా.. ఇందులో 38 మంది వైద్యులు, 48 మంది పీజీ విద్యార్థులు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ పరిణామాలతో పేషెంట్ల ట్రీట్మెంట్ కి ఇబ్బందులు ఎదురవుతుండగా.. పేషెంట్ల బంధువుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.
మరోవైపు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇన్ పేషంట్లు గా ఉన్న 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు 9మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. లక్షణాలు ఉన్న మరికొందరి ఆసుపత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు.
భద్రాద్రిలో..
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షణాలున్న 286 మందికి కరోనా పరీక్షలు నిర్వహించించగా.. వీళ్లలో 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment