patients
-
రాష్ట్రానికి చలిజ్వరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ మొదలు ఏజెన్సీ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. ఏ ఆస్పత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో ఔట్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కిక్కిరిసిపోతున్న పెద్దాస్పత్రులు ⇒ హైదరాబాద్‌లోని ఒక్క ఫీవర్ ఆస్పత్రికి ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన జ్వరాల బాధితులు 12,080 మందికావడం ఆందోళనకరం. నాలుగైదు రోజులుగా రోజూ 800 వరకు ఔట్ పేషెంట్లుగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ జ్వర సంబంధ సమస్యలతో సుమారు 700 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ⇒ ఇక చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్‌కు సోమవారం 1,600 మంది ఔట్ పేషెంట్లుగా నమోదుకాగా.. ఇందులో చలి కారణంగా ‘న్యుమోనియా’వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్ పేషెంట్లుగా 1,300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ⇒ ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం జనరల్ మెడిసిన్ కింద వైద్యం కోసం వచ్చిన ఔట్పేషెంట్లు 290, ఇక గాంధీ ఆస్పత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన ఔట్ పేషెంట్ల సంఖ్య 35,547. అంటే సగటున ప్రతీరోజు 1,500 మంది వస్తున్నారు. ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతీరోజు 300 నుంచి 500 మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు. ⇒ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రతీరోజు 50కి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఉట్నూరు ఐటీడీఏ, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట మన్ననూరు, కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కానీ చాలా మంది గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గరే సొంత వైద్యం చేసుకుంటున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. తగ్గిన డెంగీ, చికున్‌గున్యా... ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు.. నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. డెంగ్యూ కేసులు సెప్టెంబర్, అక్టోబర్‌లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,500కు పైగా డెంగీ కేసులు నమోదవగా..సెపె్టంబర్లో 1,542, అక్టోబర్‌లో 854 కేసులు ఉన్నాయి. ఈ నెలలో 22వ తేదీ వరకు 168 కేసులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇక చికున్‌గున్యా కేసులు సెప్టెంబర్‌లో 183, అక్టోబర్‌లో 13 నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 13 కేసులే వచ్చాయని వివరిస్తున్నారు. మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి... కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది. దీని కారణంగా న్యుమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఇబ్బందిపడుతున్న వారు అధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది కూడా. చలితో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.ఈ చిత్రంలోని తల్లీకొడుకులు ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామానికి చెందినవారు. తల్లి మిరియాల రాజమ్మకు వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, కుమారుడు అనుపాల్కు టైఫాయిడ్. ఇద్దరూ ఇప్పుడు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి పెరగడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.చలిజ్వరంతో బాధపడుతున్నా..చలి, తీవ్ర జ్వరం, కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా దవాఖానాకు వచ్చిన. డాక్టర్లు పరీక్షించి వార్డులో చేర్చుకున్నారు. పొద్దున, సాయంత్రం వచ్చి చూస్తున్నారు. కొంచెం నయమైంది. – తూడి సోమక్క, వనపర్తి, లింగాల గణపురంశ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో 2,350 మంది ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చారు. అందులో 80 మంది జ్వరాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల టెస్టులు చేయడానికి ఎక్స్‌రే, ఈసీజీ, ట్రెడ్మిల్, టూడీ ఈకో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సరిపడా టెక్నీíÙయన్స్ లేక అన్ని టెస్టులు ఒక్కరే చేస్తున్నారు. సరిపడా మందులు ఉన్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీయడం లేదు. – డాక్టర్ గోపాలరావు, జిల్లా వైద్యాధికారి, ములుగుసీజనల్ వ్యాధులతో జాగ్రత్త శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి గాలిలో తిరగవద్దు. బయటికి వెళ్లినప్పుడు మాసు్కలు ధరించడం మంచిది. వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి -
కోల్‌కతా: పేషెంట్ కుమారుడిపై దాడి.. భద్రతపై జూడాల ఆందోళన
కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం హాస్పిటల్‌లోని ఓ రోగి కుమారుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ(ఆదివారం) ఉదయం ఆస్పత్రిలోకి చొరబడి ఒక రోగి బంధువుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా, డాక్టర్ల భద్రతా చర్యల గురించి జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.‘‘ఉదయం 8 గంటల సమయంలో 10-15 మంది వ్యక్తులు మోటారుబైక్‌లపై వచ్చి ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్‌కు చొరబడి, ఈ రోజు డిశ్చార్జ్ కావాల్సిన బంకురాకు చెందిన రోగి కుమారుడు సౌరవ్ మోదక్పై దాడి చేశారు. మోదక్‌కు తీవ్రగాయాలవడంతో అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు’’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.Mob attack on patient's relatives at Trauma Care Centre of SSKM Hospital, Kolkata. Police once again mere spectators! This is the state of security and healthcare safety in a top government medical college like SSKM. Shame! What will the political slaves of TMC say now? Or are… pic.twitter.com/E71IpS34aq— Dr. Abhinaba Pal (@abhinabavlogs) October 13, 2024 జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో.. ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేశామనే సీఎం మమమతా ప్రభుత్వ భరోసాపై ఈ దాడి ఘటన తీవ్ర అనుమానాలకు తావిస్తోందని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఆసుపత్రి భద్రతా వ్యవస్థ వైఫల్యానికి ఈ ఘటన స్పష్టమైన ఉదాహరణ అని ఓ జూనియర్ డాక్టర్ అన్నారు. ఎస్ఎస్కేఎం వంటి పెద్ద ఆసుపత్రిలో ఇటువంటి దాడి సంఘటన జరిగితే.. భద్రతను కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నిబద్ధతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని తెలిపారు.ఇక.. ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ట్రామా కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిపై జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
బీహార్‌లో డెంగ్యూ విజృంభణ.. ఒక్కరోజులో 90 కేసులు
పట్నా: బీహార్‌లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్నాలో వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పాట్నాలో ఒక్కరోజులో అత్యధికంగా 90 మంది డెంగ్యూ బారినపడ్డారు.పాట్నా జిల్లాలో మొత్తం డెంగ్యూ బాధితుల సంఖ్య 1,147కి చేరింది. కంకర్‌బాగ్ ప్రాంతం డెంగ్యూ కేసులకు హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ ప్రతీ ఇంటిలోనూ డెంగ్యూ బాధితులు కనిపిస్తున్నారు. తానాలోని కంకర్‌బాగ్, అజీమాబాద్ తర్వాత బంకీపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. 28 మంది కంకర్‌బాగ్‌లో డెంగ్యూతో బాధపడుతున్నారు. బంకీపూర్‌లో 23 మంది, పాటలీపుత్రలో 13 మంది, అజీమాబాద్‌లో ఏడుగురు డెంగ్యూ బారినపడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. బీహార్‌లో మొత్తం 2,419 మంది డెంగ్యూ బారినపడినట్లు వైద్యాధికారులు గుర్తించారు.డెంగ్యూతో ఇప్పటివరకు బీహార్‌లో ఎనిమిది మంది మృతిచెందారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఎంసీహెచ్‌లోని మెడిసిన్ విభాగం సీనియర్ వైద్యుడు డాక్టర్ రాజన్ కుమార్, ఎన్ఎంసీహెచ్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ సోకకుండా ఉండాలంటే దోమలను నివారించాలన్నారు. ఇది కూడా చదవండి: ఏడడుగుల గోడ దూకి మేకను ఎత్తుకెళ్లిన తోడేళ్లు -
గుండెపోటు మరణాలు తగ్గాయ్!
సాక్షి, హైదరాబాద్: గత పది, పదిహేనేళ్లతో పోలిస్తే ఇప్పుడు గుండెపోటు మరణాలు తగ్గాయని ప్రముఖ వైద్యులు వెల్లడించారు. కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయన్నది వాస్తవం కాదన్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక జన్యు పరీక్షతో ఎంతో ప్రయోజనం ఉంటుందని జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో పలు వురు డాక్టర్లు, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్‌లోని జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏఐజీ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ బి.సోమరాజు, నిమ్స్ మాజీ డైరెక్టర్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, అపోలో ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు, యూరాలజిస్ట్ డాక్టర్ దీపిక, డాక్టర్ సత్యనారాయణ, జీ నోమ్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ గాంధీ మాట్లాడారు. జెనెటిక్ పరీక్షల వల్ల కొందరికి కొన్ని రోగాలకు మందులు వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చని, కొందరికి ఎంత డోసు వాడాలో స్పష్టత వస్తుందన్నారు. మనిíÙకీ, మనిషికీ జన్యుపరంగా తేడా ఉంటుందని... ఆ ప్రకారమే మందుల అవసరం ఉంటుందన్నా రు. ఆ తేడాను గుర్తించకపోతే కొందరికి మందులు సరిగా పనిచేస్తే, కొందరిపై దు్రష్పభావాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఔషధాల వినియోగంలో..: కార్డియాక్ ఔషధాల దీర్ఘకాలిక వినియోగంలో లోతైన అవగాహన అవసరమని వక్తలు చెప్పారు. కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడంలో క్లోపిడోగ్రెల్, రక్తం గడ్డకట్టే స్థాయిలను తగ్గించడంలో స్టాటిన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయితే అవి వ్యక్తిగతంగా రోగులపై ఏ స్థాయిలో పనిచేస్తున్నాయోననే విషయాన్ని అర్థం చేసుకోవడంలో జన్యు పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ, జెనెటిక్ టెస్టు వల్ల ఏ వ్యక్తికి ఏ మందు అవసరం? ఎంత మోతాదులో అవసరం? అసలు మందులు వేయాల్సిన అవస రం ఉందా? లేదా? వంటి స్పష్టత వస్తుందన్నారు.అపోలో స్పెక్ట్రా చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ, డాక్టర్లు రాసిచ్చే మందుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి పని చేయడం లేదన్నారు. అందుకే జన్యు పరీక్ష చేస్తే ఏది అవసరమో నిర్ధారణకు రావొచ్చన్నారు. జెనెటిక్ పరీక్ష ధర రూ.10 వేలు: జీనోమ్ ఫౌండేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4.15 ఎకరాల భూమి కేటాయించిందని డాక్టర్ గాంధీ వెల్లడించారు. త్వరలో భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకు స్థాపన చేస్తారన్నారు. జీనోమ్ టెస్ట్‌కు తాము రూ.10 వేలు చార్జి చేస్తున్నామన్నారు. ఒకసారి పరీక్ష చేస్తే జీవితాంతం ఆ రిపోర్టు ఉపయోగపడుతుందన్నారు. దాని ప్రకారం అవసరమైన మోతాదులో డాక్టర్లు మందులు ఇవ్వడానికి వీలుపడుతుందని చెప్పారు. -
నిలిచిపోయిన ఓపి సేవలు.. రోగుల ఇబ్బందులు..
-
తిరుపతి రుయా హాస్పిటల్లో సమస్యల తిష్ట
-
వైద్య సౌకర్యాలు లేక విశాఖ KGHలో రోగుల అవస్థలు
-
క్యాబేజీ ఆకులతో కట్టుకడితే కీళ్లనొప్పులు తగ్గుతాయా?
క్యాబేజీ అంటే చాలామంది పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే దీనివాసన చాలామందికి నచ్చదు. అయితే క్యాబేజీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడం నుంచి అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే క్యాబేజీ ఆకులతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుందని మీకు తెలుసా?క్యాబేజీ ఆకులను యూరోపియన్ జానపద వైద్యంలో పేదవారి పౌల్టీస్ (పిండికట్టు) అని పిలుస్తారు. వృద్ధులలో అత్యంత సాధారణమైన దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్. అలాంటి వారు క్యాబేజీ ఆకులను పాదాలకు చుట్టి రాత్రంతా ఉంచడం వల్ల కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు పెయిన్ కిల్లర్స్ కన్నా అద్భుతంగా పనిచేస్తాయని, ఈ ఆకుల్లో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వీటిని కొద్దిగా నూనెతో వేడిచేసి కానీ, ఐస్‌తో కలిపి ఐస్ ప్యాక్‌లాగా గానీ వాడతారు. ఇవి సురక్షితమైనవి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి దీర్ఘకాలికంగా ఉపయోగించవచ్చు. ధూమపానం చేసేవారు క్యాబేజీ లేదా బ్రోకలీని తిన్న పది రోజుల తర్వాత వారి సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు 40 శాతం తగ్గినట్టు పరిశోధనల్లో తేలింది.ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 81 మంది వ్యక్తులపై 2016లో ఒక చిన్న అధ్యయనం జరిగింది, అక్కడ మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు క్యాబేజీ ఆకు చుట్టడం ద్వారా ఫలితం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే దీని నిర్ధారణకు "మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు. 2018లో చేసిన మరొక అధ్యయనంలో పురుషులలో మోకాలికి ఐస్‌తో పాటు, క్యాబేజీ ఆకులను చుట్టి కట్టడం వలన వాపు తగ్గినట్టు గమనించారు. నోట్: ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది. -
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
కేరళలో ‘గవదబిళ్లలు’ వ్యాప్తి.. ఒక్క రోజులో 190 కేసులు!
కేరళలో ‘గవదబిళ్లలు’(మంప్స్) వ్యాధి బారినపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 190 కేసులు బయటపడడంతో వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా బాధితుని రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధిని ‘చిప్మంక్ చీక్స్’ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారినపడనప్పుడు జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుని బుగ్గలు వాచినట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి లక్షణాలు బాధితునిలో రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి. పారామిక్సోవైరస్ అనే వైరస్ కారణంగా ‘గవదబిళ్లలు’ వ్యాప్తి చెందుతుంది. ఇది బాధితుని నోటి నుంచి వెలువడే నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ‘గవదబిళ్ల’ బారిన పడినవారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. యాంటీబయాటిక్స్‌తో ఈ వ్యాధి త్వరగా నయం కాదు. ‘గవదబిళ్ల’ బారినపడినవారు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. -
థైరాయిడ్ ఉంటే అన్నం తినకూడదా?
థెరాయిడ్ ఇటీవల చిన్నా, పెద్ద అందర్నీ వేధిస్తున్న సమస్య ఇది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలు అంత ఇంత కాదు. విపరీతంగా బరువు పెరిగిపోయి నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మహిళలకు ప్రెగ్నెన్సీ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఈ థెరాయిడ్ ఉన్నవారు అస్సలు అన్నమే తినకూడదంటున్నారు నిపుణులు. ఇదేంటి అన్నమే మనకు శక్తినిచ్చేది అలాంటి అన్నమే వద్దంటే ఎలా? అసలు థెరాయిడ్ ఉన్నవారు ఎందుకు అన్నం తికూడదు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా!. కొందరూ అన్నాన్నే మూడు పూటలా తింటుంటారు. ఇందులో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగని ఇలా ఎక్కువగా తింటే మాత్రం అమాంతం బరువు పెరుగుతారు. నిజానికి డైటింగ్ చేసి బరువు తగ్గాలనుకునేవారే అన్నాన్ని తక్కువగా తీసుకుంటారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూదట. ఒకవేళ అన్నం తినాలనుకున్నా వైట్‌రైస్ అస్సలు వద్దంటున్నారు నిపుణులు. దాని బదులు బ్రౌన్‌రైస్ తీసుకోమని సూచిస్తున్నారు. బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అందుకే థైరాయిడ్ రోగులు అన్నం తినకూడదని చెప్తుంటారు. గ్లూటెన్ మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంలో ప్రతిరోధకాలను తగ్గించి, థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే అన్నాన్ని అతిగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అన్నంలో ఉండే పిండి పదార్థం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో మనకు చాలా త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకేముంది కడుపు నిండేదాక ఆబగా తింటుంటాం. కానీ ఇది బరువును అమాంతం పెంచుతుంది. ఈ కారణంగానే థైరాయిడ్ రోగులను అన్నం తినొద్దని అంటారు. నిపుణులు ఏమంటున్నారంటే.. థెరాయిడ్ రోగులు అన్నం ఇలా ఎక్కువగా తింటే థైరాయిడ్ తో పాటుగా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం తదితర పరిమాణలు ఎక్కువుగా ఉంటాయి. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని చెబుతున్నారు. ఒకవేళ తినాలనుకున్నా బాగా నానబెట్టి వార్చి తినడం మంచిది. ఇలా చేస్తే గంజి రూపంలో బియ్యంలో ఉంటే కొన్ని విటమిన్లు వెళ్లిపోతాయి. కాస్త బెటర్‌గా ఉంటుంది. ఇక అలానే నానబెట్టి వండుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ రైస్‌కి ప్రిఫెరెన్స్ ఇవ్వండి. అదే సమయంలో తగు మోతాదులో తినేందుకు యత్నించండి. అంటే ఇక్కడ రైస్ క్వాంటిటీ తక్కువగానూ, కూర కంటెంట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోమని చెబుతున్నారు. అన్నాన్ని ఎలా వండి తినాలి? అన్నం తినడం ఇష్టమైతే దీన్ని రకరకాల కూరగాయలతో మిక్స్ చేసి డైట్ లో చేర్చుకోవచ్చు. కానీ అన్నాన్ని చాలా తక్కువగా తినాలి. అన్నం తక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే ఏ సమస్యా ఉండదు. అయితే మీ ఆహారంలో మార్పులు చేయడానికి ముందు ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. ఈ సూచనలు, సలహాలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడని సంప్రదించి పాటించటం మంచిది. (చదవండి: రెడ్‌లైట్ థెరఫీతో షుగర్ తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ప్రసాదం తెచ్చిన తంటా!.. రోడ్డుపైనే సెలైన్లు పెట్టి..
వందలాది మంది రోగులు నడి రోడ్డు మీదే చికిత్స అందించారు వైద్యులు. పైగా చెట్లకు తాళ్లు కట్టి..వాటికి సైలెన్స్ బాటిళ్లను వేలాడదీశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రాలోని బుల్దానాలో వారం రోజుల పాటు జరిగిన మత కార్యక్రమంలో అపసృతి చోటు చేసుకుంది. ఆఖరి రోజున ప్రసాదంగా తీసుకున్న ఆహారం కారణంగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అయితే అంతమందిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ బెడ్ల కొరత కారణంగా చాలామందిని రోడ్డుమీదే పడుకోబెట్టి చికిత్స అందించారు. వారందరికి చెట్లకు కట్టివేసిని తాళ్ల సాయంతో సైలెన్ వేలాడదీసి ఇవ్వడం జరిగిది. అయితే దాదాపు 300 మంది అస్వస్థకు గురవ్వగా, వారిలో30 మంది పరిస్థితి విషమంగా ఉదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 300 మంది అస్వస్థకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు బాధితులు మాట్లాడుతూ..సమయానికి ఆస్పత్రిలో వెద్యులు ఎవరూ లేరని వాపోయారు. రోగులకు వైద్యం చేయించేందుకు ప్రైవేట్ వైద్యులను పిలిపించల్సి వచ్చిందని అన్నారు. కాగా ఆ జిల్లా కలెక్టర్ కిరణ్ పాటిల్ మాట్లాడుతూ..మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో ఇతర అవసరమైన వైద్య పరికరాలతో సహ వైద్యుల బృందాలతో సత్వరమే చికిత్స అందిస్తున్నామని అన్నారు. అలాగే ప్రసాదం నమునాలు ల్యాబ్‌కి పంపించి పరీక్షలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. (చదవండి: ఈ షర్ట్ చాలా కాస్ట్లీ గురూ!) -
టీబీ రోగులకు డ్రోన్ సేవలు
బీబీనగర్ : టీబీ రోగుల కోసం బీబీనగర్ ఎయిమ్స్ ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రోన్ సేవలు విజయవంతమయ్యాయి. టీబీ రోగులు, అనుమానితుల నుంచి రక్త పరీక్షలకు నమునాలు సేకరించి వెనువెంటనే ల్యాబ్‌లకు పంపించడం, తిరిగి అవసరమైన మందులను రోగులకు పంపేందుకు డ్రోన్ సాయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలపరిధిలో 150 మంది నమునాలను సేకరించి డ్రోన్ ద్వారా ల్యాబ్‌లకు పంపి.. తిరిగి మందులు చేరవేశారు. ఆదివారం ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్‌భాటియా డ్రోన్ సేవల గురించి వెల్లడించారు.రెండు నెలలుగా డ్రోన్ సేవలపై చేపట్టిన ప్రయోగాలు ఫలించడంతో టీబీ రోగులకు చాలా సులువుగా సేవలు అందుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన డ్రోన్ సేవలను ఇటీవల ఎయిమ్స్‌కు వచ్చిన కేంద్రమంత్రి ఆర్కే.సింగ్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు అనుసంధానం భువనగిరి, రామన్నపేట, బీబీనగర్ బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు డ్రోన్లను అనుసంధానం చేశారు. ఇక్కడి నుంచి రోగుల నమునాలను సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్లకు డ్రోన్ ద్వారా పంపుతారు. తిరిగి అక్కడి నుంచి రోగులకు అవసరమయ్యే టీబీ మందులు, ట్యూబ్‌లు, రియాజెంట్లను డ్రోన్‌లో అమర్చి రోగులకు పంపుతారు. దీని కోసం ప్రస్తుతం ఎయిమ్స్‌లోని 3 డ్రోన్ పైలెట్లు, 2 డ్రోన్లు అందుబాటులో ఉంచారు. రోగుల ఖర్చు తగ్గించేందుకు సహాయపడుతుంది డ్రోన్ సేవల ద్వారా టీబీ నిర్థారణలో ట్యూమరౌండ్ సమయం తగ్గించడం, దూర ప్రాంతాల్లో, రవాణా సరిగ్గా లేని చోట నివసించే వ్యక్తులకు రవాణా ఖర్చులు తగ్గించేలా డ్రోన్ సేవలు సహాయపడతాయి, జిల్లా టీబీ కార్యాలయం నుంచి డ్రోన్ కార్యకలాపాలను పీహెచ్‌సీలతో పాటు సబ్‌సెంటర్లకు సైతం విస్తరిస్తున్నాం. – వికాస్‌భాటియా, డైరెక్టర్, ఎయిమ్స్ -
సీఎం జగన్ పెద్ద మనసు.. ఆపన్నులకు అండగా..
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నులకు మరోసారి అండగా నిలిచారు. ఆయన గురువారం చింతపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు సీఎంను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. వారి పరిస్థితులను తెలుసుకున్న సీఎం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వెంటనే తగిన సాయం చేసి వారిని ఆదుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ను ఆదేశించారు. దీంతో ఆయన వెంటనే ముగ్గురు బాధితులకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలను వారి ఖాతాల్లో శుక్రవారం జమ చేశారు. కండరాల వ్యాధితో బాధపడుతున్న చింతపల్లి మండలం గుమ్మడిగొండకు చెందిన అడిగర్ల రమ్యశ్రీ, బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన పంపోతి కొండబాబు, పెరాలసిస్‌తో బాధపడుతున్న చింతపల్లి మండలం దిబ్బగరువుకు చెందిన మోరి కృష్ణవేణిలు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశించిన 24 గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం వారి అకౌంట్లలో జమవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్! -
కంటి ఆస్పత్రికి పేషంట్ల క్యూ.... అంతా దీపావళి టపాసుల బాధితులే!
హైదరాబాద్: నగరంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకట్టారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది కంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వీరంతా దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ గాయపడిన వారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది పెద్దవారే కావడం గమనార్హం. దీపావళి సందర్భంగా టపాసులు పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంత చెబుతున్నా మార్పు రావడం లేదు. ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా బాణాసంచా కాలుస్తూ గాయాల బారిన పడుతున్నారు. టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు అవసరమని, ముఖ్యంగా కళ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. -
మనసున్న మారాజు సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసున్న మహారాజు అని మరోమారు చాటుకున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధుల విడుదల కోసం మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన్ను తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం వద్ద పలువురు వ్యాధిగ్రస్తులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారందరి కష్టాన్ని ఓపికగా విని.. తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబును ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ కొద్ది గంటల వ్యవధిలోనే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న ఏడుగురికి తక్షణ సాయంగా రూ.5.5 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. –పుట్టపర్తి అర్బన్ (శ్రీసత్యసాయి జిల్లా) -
డోలీ కట్టి.. రోగిని తరలించి
కెరమెరి(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లాలో ఈ ఏడాది వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండడంతో వాగు అవతలి గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతం. సాధారణ ప్రజలే కాకుండా రోగులూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులను కొన్నిసార్లు చేతులపై, ఇంకొన్నిసార్లు మంచంపై వాగు దాటించిన సంఘటనలు తెలిసిందే. తాజాగా కెరమెరి మండలం బోరిలాల్‌గూడ గ్రామానికి చెందిన ఆడే నాందేవ్ శుక్రవారం రాత్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఓ వైపు పొంగిపొర్లుతున్న అనారపల్లి వాగు, మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న రోగి.. ఈ పరిస్థితుల్లో అతన్ని శనివారం ఆరుగురు కుటుంబ సభ్యులు డోలీపై పడుకోబెట్టి వాగు దాటించారు. అనార్పల్లి నుంచి జీపుపై కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం మళ్లీ వాగు దాటించి ఇంటికి చేర్చారు. -
కొడుకు హఠాన్మరణం ఆ తండ్రిని..ఏకంగా..
ఒక్కో ఘటన లేదా పరిస్థితులు మనిషిని తనకే తెలియని తనలోని ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవి కొందర్నీ మహనీయుడిని చేస్తే మరికొంర్ని వక్రమార్గంలో పయనించేలా చేస్తాయి. ఇక్కడొక తండ్రి కొడుకుని కోల్పోడమే జీర్ణించుకోలేని సతతమవుతున్న స్థితిలో తన కొడుకులా మరెవరూ అలా చనిపోకూడదనే గొప్ప ఆలోచనకు తెరతీసింది. ఇంకొన్నాళ్లు ఉండాల్సిన కొడుకు ఎలా అకాల మరణం చెందాడన్న ఆ సందేహమే అతడిని ఓ సరికొత్త చైతన్యం వైపుకి తీసుకెళ్లింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్‌లోని భారత సంతతి చెందిన జే పటేల్‌కి 30 ఏళ్ల బలరామ్ అనే కొడుకు ఉన్నాడు. అతను లండన్‌లో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అనూహ్యంగా మరణించాడు. దీంతో జీర్జించుకోలేని బలరామ్ తండ్రి తన కొడుకు ఎలా చనిపోయాడన్న సందేహంతో విచారించడం ప్రారంభించాడు. తన కొడుకు సరైన చికిత్స సకాలంలో అందలేదని, సరైన సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్లే చనిపోయినట్లు వెల్లడైంది. దీంతో అతను ఆస్పత్రిలోని పేషెంట్స్ సమస్యల పూర్వాపరాలు, జీవన వ్యవధిని నమోదు చేయడం ప్రారంభించాడు. అంతేగాదు చికిత్సలో తలెత్తుతున్న వైద్యుల తప్పుల తడకల గురించి కొత్త ఛారిటీ ఫౌండేషన్‌ని కూడా ప్రారంభించి రోగుల హక్కుల కోసం ప్రచారం చేస్తున్నాడు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌లో తన కొడుకు ఆస్పత్రి కన్సల్టెంట్, మిగతా సిబ్బంది చికిత్స సంరక్షణ వైఫల్యం కారణంగానే తీవ్ర నొప్పి, అసౌకర్యంతో ముందుగానే చనిపోయినట్లు అందరికీ తెలియజేశాడు. తాను చేసే ఈ కార్యక్రమాల ద్వారా అయిన తన కొడుకు బలరాం ట్రీట్మెంట్లో ఎలాంటి తప్పులు జరిగాయి అనే దానిపై ప్రభుత్వం స్పందించి..సత్వరమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాని అన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ బంధువు, స్నేహితుడు, మరెవరైనా.. వారి ఆత్రతను ఆవేదనను ఆస్పత్రి యాజమాన్యం అస్సలు పట్టించుకోదని, అక్కడ తతెత్తుతున్న లోపాలను సరిదిద్దే యత్నం కూడా చేయదని ఆవేదనగా చెబున్నారు పటేల్. బ్రిటన్ పార్లమెంటు ఈ విషయంపై మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరి నిమిషంలో తన కొడుకు ఆరు ప్రాణాపాయ సంకట పరిస్థితులతో పోరాడడని చెప్పారు. తన కొడుకు చిన్నతనంలో కూడా ఎనిమిది నుంచి 10 ఏళ్ల వరకు మానసికి వయసు సంబంధించిన పెరుగదల సమస్యతో ఇబ్బంది పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. అలా.. అలా నెమ్మదిగా మానసిక వికాసం కలుగుతుందనేలోపు ఇలాంటి ఘోరంగా జరిగిందని అన్నారు. అతను అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు, ప్రేమగా ఉండేవాడంటూ కొడుకుని గుర్తుచేసుకున్నారు. ఇది పీడకలలా తనను వెంటాడుతూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు పటేల్. తన కొడుకు ఇంకొన్నాళ్లు జీవించాల్సిన వాడని, తగిన చికిత్స అందించడంలో జాప్యం, మంచి వైద్యం లేకపోవడం తదితర కారణాల వల్లే మరణించాడన్నారు. అందుకే తాను ఈ ఛారిటీ ద్వారా రోగులకు చికిత్సకు సంబంధించిన వివరాలు సేకరించి అకాల మరణాలను నివారించేలా చేయడమే గాక వారికి మంచి వైద్యం అందేలా ప్రత్యామ్నాయం మార్గాన్ని(వైద్యానికి సంబంధించిన సెకండ్ ఓపినియన్) ఎలా ఎంచుకువాలో అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. దీనికి యూకే ప్రభుత్వం, యూకే ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లే మద్దతు ఇవ్వడంతోనే ఈ ప్రచారానికి పిలుపు ఇచ్చినట్లు పటేల్ తెలిపారు. ఇక 2021లో సెప్సితో మరణించి 13 ఏళ్ల మార్తా తల్లి కూడా ఇలానే "మార్తాస్ రూల్" అనే పేరుతో వైద్య చికిత్సకు సంబంధించిన సెకండ్ ఓపెనియన్ కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. (చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్‌లోనే తొలిసారిగా..) -
క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్!
సాధారణంగా రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారెవరైనా... ‘ఇన్నాళ్లూ పనిచేసి అలసిపోయాం, ఇక విశ్రాంతి తీసుకుందాం’ అనుకుంటారు. అయితే సుకన్య, సంధ్యారావులు మాత్రం ఇలా అనుకోలేదు. రిటైర్మెంట్ తరువాత కొత్త వ్యాపారం చేయాలనుకున్నారు. అరవై ఏళ్లకు దగ్గరలో ఉన్నా వారిలోని హుషారు, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అక్క సుకన్య ఎమ్మెస్సీ చేసింది. దానికితోడు టీచింగ్, ఫార్మా, ఆడిటింగ్, ఆర్ట్స్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ ఇంజినీర్ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్‌లో పనిచేసిన అనుభవం వాటికి తోడైంది. అయితే అనుకోకుండా ఎదురైన ఒక సంఘటన వల్ల వారు క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా స్త్రీలకు అవసరం అయిన ప్రత్యేక తరహా దుస్తులను రూపొందిస్తూ తమ వైవిధ్యాన్ని కూడా చాటుకుంటున్నారు. అత్తయ్య అవస్తలు చూసి... దుస్తుల పరిశ్రమలో ఇరవై ఏళ్లపాటు పనిచేసిన సంధ్య తనకు తనే బాస్ కావాలి అనుకునేది. ఈ క్రమంలోనే ఏదైనా దుస్తుల తయారీ కంపెనీ పెడితే బాగుంటుందని అనుకున్నారు అక్కాచెల్లెళ్లు. వీరు ఇలా ఆలోచిస్తున్న సమయంలో... వీరిద్దరికీ ఎంతో ఇష్టమైన వీరి మేనత్తకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. సుకన్య, సంధ్యలకు మంచి స్నేహితురాలిలా ఉండే మేనత్త క్యాన్సర్‌తో బాధపడడం వారిని కలచి వేసింది. ఒకపక్క క్యాన్సర్ బాధిస్తుంటే మరోపక్క ఆమె ధరించే దుస్తులు ఆమెకు సౌకర్యంగా లేకపోవడాన్ని ఇద్దరూ గమనించారు. క్యాన్సర్‌తో బాధపడే ఎంతోమంది రోగులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ రోగులు ధరించడానికి వీలుగా ఉండే దుస్తులు రూపొందిస్తే వందలాది మంది క్యాన్సర్ రోగులకు సాయం చేసినట్లే అనుకుని ‘వీకీ వేర్’ పేరిట క్యాన్సర్ రోగులకు దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు. సలహాలు... సూచనలతో... ఆంకాలజిస్టులు, క్యాన్సర్ రోగుల సలహాలు, సూచనలు తీసుకుని 2017లో తలకు పెట్టుకునే టోపీని రూపొదించారు. కాటన్‌తో తయారు చేసిన ఈ టోపీని కీమోథెరపీ చేయించుకునేటప్పుడు ధరించడానికి అనుకూలంగా తయారు చేశారు. తరువాత మాస్టెక్టమీ బ్రాలను రూపొందించారు. చర్మానికి సౌకర్యంగా ఉండే బ్రాలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా క్యాన్సర్ రోగులకు అవసరమైన వాటిని స్వయం సహాయక గ్రూపులతో తయారు చేయిస్తూ సాటి మహిళ లకు ఉపాధి కల్పిస్తున్నారు. వీరి వీకీ వేర్ ఉత్పత్తులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. రోగులకు ఇలా... వీకీ వేర్ ఉత్పత్తులు తయారయ్యాక క్యాన్సర్ రోగులకు టెస్టింగ్ కోసం పంపించి, వారికి అన్నివిధాల సౌకర్యంగా ఉన్నాయన్న నిర్ధారణ అయిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నారు. క్యాన్సర్ కేర్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను కలిసి వీకీ వేర్ గురించి చెప్పడం, క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న రోగులకు వాటిని ఇవ్వడం ద్వారా వీకీ వేర్ రోగులకు చేరుతున్నాయి. వీకీ వేర్ వెబ్సైట్, సోషల్ మీడియా, ఈ కామర్స్ సైట్ల ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు సుకన్య, సంధ్యారావులు. ‘‘మీ కలలను ఎప్పటికీ వదులుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు కంటోన్న కల మీద నమ్మకం ఉంచండి. అది తీరడానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చు. అయినా వెనక్కి తగ్గవద్దు. కలను నిజం చేసుకునే క్రమంలో ఎవరినైనా సాయం అడగడానికి సిగ్గుపడవద్దు. ఇలా నిజాయితీగా ముందుకు సాగితే వ్యాపారం ఏదైనా రాణించగలుగుతారు’’ అని సుకన్య, సంధ్యలు యువతరానికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. (చదవండి: పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా? ) -
అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో హేతుబద్దికరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఉద్యోగుల హేతుబద్దికరణ ప్రక్రియకు అనుమతించారు. రోగుల తాకిడికి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్‌వో మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌లో ఇక ఆరుగురు డీఎంహెచ్వోలు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరుగురు డీఎంహెచ్వోలు ఉంటారు. కొత్త డీఎంహెచ్వోలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 మంది ఉంటారు. ఇక రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్రీచ్ కార్యకలాపాలు సీహెచ్‌సీలతో నిర్వహి స్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లను బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. 4,246 ఎంపీహెచ్ఏ పోస్టులు మంజూరు 1,712 పోస్ట్‌లను సూపర్‌న్యూమరరీ పోస్ట్‌లుగా మార్చారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు. దాంతో పీహెచ్‌సీలు, ఇతర సంస్థలలో మంజూరు చేసిన ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల స్థానం మారదు. దాంతో 4,246 ఎంపీహెచ్ఏ (మహిళ) పోస్టులను మంజూరు చేశారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన స్పష్టతను వైద్య, ఆరోగ్యశాఖ ఇవ్వలేదు. మార్గదర్శకాల్లో కొంత గందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల తాకిడికి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది. -
ఎలాంటి ఆక్సిజన్ కొరత లేదు.. నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై వైద్యుల క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురు మృతి చెందడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. ఆక్సిజన్ కొరతపై దుష్ప్రచారాన్ని సూపరిండెంట్ సిద్ధా నాయక్ ఖండించారు. ఎలాంటి ఆక్సిజన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తీవ్ర అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని సూపరింటెండెట్ పేర్కొన్నారు. చదవండి: ఆ నలుగురిపై సీఎం జగన్ కౌంటర్లు.. అందుకేనా? -
దేశంలో 10 కోట్ల మంది డయాబెటిక్ రోగులు
దేశంలో 10 కోట్ల మంది డయాబెటిక్ రోగులు -
300 మంది రోగుల హత్య.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు
కొరుక్కుపేట(తమిళనాడు): అనారోగ్యంతో ఆస్పత్రులకు వచ్చినవారిని ఓ కిరాతకుడు దారుణంగా చంపేశాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదేళ్లలో సుమారు 300 మంది రోగులను హత్య చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే చెబుతున్న వీడియో తమిళనాట తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలు.. తమిళనాడులోని నామక్కల్ జిల్లా పల్లిపాళయం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో పనిచేసే ఓ ఉద్యోగికి సహాయకుడిగా ఉన్న మోహన్‌రాజ్ (50) అనే వ్యక్తి చిన్నచిన్న పనులు చేస్తుండేవాడు. తాను పెద్దఎత్తున హత్యలు చేసినట్లు మోహన్‌రాజ్ ఓ వ్యక్తికి చెబుతున్న వీడియో ఈ నెల 18వ తేదీన బయటకు వచ్చింది. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన వృద్ధులకు వారి బంధువుల కోరిక మేరకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి దాదాపు 300 మందిని హత్య చేసినట్లు మోహన్‌రాజ్ ఆ వీడియోలో వెల్లడించాడు. చెన్నై, బెంగళూరులోనూ కొద్దికాలం ఆస్పత్రుల్లో పనిచేసే సమయంలో ఇలాంటి హత్యలు చేసినట్లు తెలిపాడు. చదవండి: భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న యువతి.. కన్నేసిన మాజీ ప్రియుడు ఒక్కో హత్యకు రూ.5 వేలు తీసుకునేవాడినని పేర్కొన్నాడు. ఆ వీడియోను పరిశీలించి తాము విచారణ చేయగా, మోహన్‌రాజ్ డబ్బులు తీసుకుని హత్యలకు పాల్పడుతున్నట్లు తేలిందని పల్లిపాళయం పోలీసు ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ శనివారం తెలిపారు. ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, తాను హత్యలు చేసినట్లు తమ విచారణలో నిందితుడు అంగీకరించడంతో అరెస్ట్ చేశామని చెప్పారు. -
క్షేత్రస్థాయిలో విజయవంతంగా ఫామిలీ ఫిజీషియన్ పథకం
-
కిమ్స్ ఆసుపత్రి లో చీమలపాడు క్షతగాత్రులు
-
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్‌కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్‌లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్‌గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్‌రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్‌లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్‌లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్‌తో ఫ్లూయిడ్‌ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స
బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. లక్షల మందికి సోకుతూ వేగంగా విస్తరిస్తోంది. జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసిన క్రమంలో పరిస్థితులు దారుణంగా మారాయి. వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దగ్గు, దమ్ము, శ్వాసకోస సంబంధిత సమస్యలతో వయోవృద్ధులు ఆసుపత్రులకు పరుగులుపెడుతున్నారు. బెడ్లు సరిపోకపోవడంతో హాలులోనే నెలపైనే చికిత్స అందిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితులు దయనీయంగా కనిపిస్తున్నాయి. బెడ్లు నిండిపోవడంతో కోవిడ్ బాధితులకు హాల్లోనే చికిత్సలు అందిస్తున్నారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతూ హార్ట్ మానిటర్స్, ఆక్సిజన్ ట్యాకులతో ఉన్న రోగుల దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. షాంఘైలోని ఓ ఆసుపత్రి హాల్లోనే రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఇదీ చదవండి: బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం -
కుప్పం వేదికగా చంద్రబాబు కని‘కట్టు’ కథ
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా నిన్నటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో జనం చనిపోయిన ఉదంతాలను మరిపించి ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామాలు పతాక స్థాయికి చేరాయి. పోలీసుల లాఠీఛార్జీలో తమ కార్యకర్తలు గాయపడ్డారంటూ నిన్నటి నుంచి గగ్గోలు పెట్టిన చంద్రబాబు… కనికట్టు కథ బట్టబయలైంది. చంద్రబాబు రాకముందు చేతికి, తలకు ఎటువంటి కట్లు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ కార్యకర్తలు గురువారం కుప్పంలో ఆ కార్యకర్తలను పరామర్శించే ఒక సీన్‌ను చంద్రబాబు క్రియేట్ చేశారు. చంద్రబాబు పరామర్శకు వచ్చే సరికి మహానటులైన టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో బెడ్ల మీద తమకు గాయాలతో బాధపడుతున్నట్టుగా ఒక స్టిల్ ఇచ్చారు. తీరా చంద్రబాబు రాగానే.. యథాలాపంగా తన వంతు పాత్రను రక్తికట్టించారు. వారిని ఓదారుస్తున్నట్టుగా, భరోసానిస్తున్నట్టుగా బ్రహ్మాండంగా స్టిల్స్ ఇచ్చారు. ఈ పరామర్శ ముగిసిన తర్వాత చంద్రబాబు తన దైన శైలిలో రెచ్చిపోతూ మీడియాతో మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. అంత వరకూ చూసేవాళ్లకు బాగానే ఉంది. కాకపోతే.. ఇక్కడే ఒక ట్విస్ట్. చంద్రబాబు కనికట్టు కథ… బట్టబయలైంది. ఇలా చంద్రబాబు వెళ్లారో లేదో… ఆ వెంటనే మహా నటులైన టీడీపీ కార్యకర్తలు తమ బెడ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. చంద్రబాబు పరామర్శ సమయంలో కనికట్టు కన్నీరు పాలైన ఆ వార్డు.. తర్వాత ఖాళీగా దర్శనమిచ్చింది. బాబు వచ్చారు..పరామర్శ డ్రామా మొదలెట్టారు చంద్రబాబు వెళ్లగానే వార్డులో ఖాళీగా దర్శనమిస్తున్న బెడ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్ డ్రామాను చంద్రబాబు రక్తికట్టిస్తున్న తీరు.. -
Telangana: హెల్త్ ప్రొఫైల్‌కు బ్రేక్.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: హెల్త్ ప్రొఫైల్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించి సర్కారుకు ప్రతిపాదన చేసింది. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్‌కు శ్రీకారం చుట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. వైద్యపరీక్షలు నిర్వహించగా అత్యధికులకు అనారోగ్య సమస్యలు కనిపించాయి. మరోవైపు తమకు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయా అన్న భయాందోళన బాధితుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సర్కారు తాత్కాలికంగా వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వ్యాధులున్న వారందరికీ పరీక్షలు నిర్వహించడం, డాక్టర్ కన్సల్టేషన్ కల్పించడం సవాల్‌తో కూడిన వ్యవహారమే కాకుండా, అందుకు అవసరమైన మందులు సమకూర్చడం కూడా కష్టమనే భావన అధికారుల్లో నెలకొంది. ఫలానా జబ్బు ఉందని తెలియగానే రోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కాలంలో భయం కారణంగా అనేకమంది ఆసుపత్రుల పాలైనట్లుగా, ఇప్పు డు వైద్యపరీక్షలు చేస్తే అవసరమున్నా లేకున్నా, బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీసే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆ రెండు జిల్లాల హెల్త్ ప్రొఫైల్‌లో వెలుగు చూసిన అంశాలు, తదుపరి నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. వచ్చే హెల్త్ ప్రొఫైల్‌లో పరీక్షల సంఖ్య కుదింపు 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వివిధ రకాల టెస్టులు చేయడం ద్వారా ముందస్తుగా ఏమైనా వ్యాధులుంటే వాటికి వైద్యం అందించాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆ వివరాలతో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందనుంది. సిరిసిల్ల, ములుగు కాకుండా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఇప్పటికే హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించాల్సి ఉండగా, తాత్కాలికంగా వాయిదా వేశారు. జనవరి 18 నుంచి ఐదు నెలలపాటు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల సమయం సమీపించే అవకాశముంది. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా 30 టెస్టులు చేశారు. కానీ, రానున్న హెల్త్‌ప్రొఫైల్ కార్యక్రమంలో పరీక్షల సంఖ్యను కుదించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. ఏదో ఒక అనారోగ్యం.. ములుగు జిల్లాలో 1,81,540 మందికి స్క్రీనింగ్ చేయగా 1,10,527 మందికి ఏదో ఒకరకమైన అనారోగ్యం ఉన్నట్లు తేలింది. 11,896 మందికి థైరాయిడ్, 28,281 మందికి లివర్ సమస్యలు, 28,857 మందికి కాల్షియంలోపం, సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్)లో 23,216 మందికి అసాధారణ అనారోగ్య సమస్యలు, లిపిడ్ ప్రొఫైల్‌లో 65,586 మందికి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువమందికి రక్తహీనత ఉంది. 12,186 మందికి కిడ్నీ సమస్యలు, అమైలేస్ ఎంజైమ్ లోపంతో 11,752 మంది, మరో 10,124 మందికి యూరిక్ యాసిడ్, 9,775 మందిలో నియంత్రణలో లేని డయాబెటీస్ ఉన్నట్లు తేలింది. చదవండి: Group 4 Notification: శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. -
Gandhi Hospital: ఓపీకి వస్తే బీపీ తప్పదు
సాక్షి, హైదరాబాద్: గాంధీఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి రోగులు పోటెత్తారు. నగర నలుమూలలతోపాటు పలు జిల్లాలకు చెందిన బాధితులు వైద్యసేవల కోసం సోమవారం పెద్దసంఖ్యలో తరలిరావడంతో కంప్యూటర్ చిట్టీలు మొదలుకొని వైద్యపరీక్షలు, స్కానింగ్‌లు, రక్తపరీక్షలు, చివరకు మందుల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఓపికి వస్తే బీపీ తప్పలేదని, ఉన్న రోగం వదిలించుకునేందుకు వస్తే కొత్తరోగాలు అంటుకుంటున్నాయని పలువురు బాధితులు వాపోతున్నారు. ఓపీ చిట్టీ కౌంటర్ల సంఖ్య పెంచాలనే నిర్ణయం కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈవినింగ్ ఓపీ సేవలు ప్రారంభమైనప్పటికీ ఉదయం పూట వచ్చేందుకే రోగులు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మార్నింగ్ ఓపీకి రద్దీ పెరిగిందని ఆస్పత్రి అధికారి వ్యాఖ్యానించారు. గాంధీ ఓపీ విభాగంలో సోమవారం సుమారు మూడున్నర వేల మందికి వైద్యసేవలు అందించారు. రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు, వసతి సౌకర్యాలు కల్పించి మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. చదవండి: నగరాన్ని ముంచెత్తిన జోరు వాన.. వరద నీటిలో చిన్నారుల ఈత -
అంతిమ దశలో ఆత్మీయ ‘స్పర్శ’
అంత్యదశలో ఏ బాధా లేకుండా ప్రశాంతంగా నిష్క్రమించాలనేది ప్రతి మనిషి ఆశ. కానీ చావు పుట్టుకల మధ్యలో పుట్టుకొస్తున్న రోగాలు మరణానికి ముందే నరకాన్ని చూపెడుతున్నాయి. అలా కాకుండా... చివరి దశలో ఉన్న రోగుల ముఖాలకు చిరునవ్వులు అద్దుతోంది నగరంలోని స్పర్శ్ హోస్పైస్. దశాబ్దకాలంగా ఉచిత పాలియేటివ్ కేర్ (చివరి రోజుల్లో ఉన్న మనిషికి అందించే సేవ)కు చిరునామాగా నిలుస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్రవ్యాధులతో చావుబతుకులమధ్య ఉన్న నిరుపేద రోగుల పట్ల సమాజమూ నిర్దయగానే ప్రవర్తిస్తుంటుంది. ఈ పరిస్థితిని గమనించే ఈ ప్రత్యేక సేవల్ని ప్రారంభించామంటున్నారు స్పర్శ్ నిర్వాహకులు. రోటరీ క్లబ్ బంజారాహిల్స్ శాఖ నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛంద సేవ.. ప్రభుత్వం, దాతల సహకారంతో ఎప్పటికప్పుడు అత్యాధునిక హంగులతో రోగులకు అద్భుత సేవలందిస్తోంది. మరిన్ని కొత్త సేవలతో ఇటీవలే కొత్త ప్రాంగణంలోకి మారింది. ఈ సందర్భంగా స్పర్శ్ ట్రస్టీలు డా.సుబ్రహ్మణ్యం, ఎన్.సురేష్‌రెడ్డి, రోటరీ క్లబ్ బంజారాహిల్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్, సెంటర్ హెడ్ శశిధర్లు సాక్షితో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సేవల వివరాలు వారి మాటల్లోనే.. ‘చికిత్స కన్నా చిరునవ్వులే మిన్న... ఆసుపత్రుల్లో మెడికల్ కేర్ ఎక్కువ ఉంటుంది. అయితే అవసాన దశలో ఉన్న రోగుల కోసమే స్పర్శ్ ఏర్పాటైంది కాబట్టి.. ఇక్కడ మెడికల్ కేర్ 25 శాతం మాత్రమే. రోగులకు మానసిక, సాంఘిక, ఆధ్యాత్మికపరమైన ఆలంబన అందుతుంది. నెలకు 50 నుంచి 100 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. ఇక్కడ 82 బెడ్స్ ఉన్నాయి. మహిళలకు, పురుషులకు వేర్వేరు విభాగాలున్నాయి. రోగులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పచ్చిక, చెట్లు పెంచుతున్నాం. పిల్లల కోసం మరొక వార్డ్ సిద్ధమవుతోంది. వాళ్ల ఆటపాటలకోసం ప్లే ఏరియానూ ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు సహాయంగా మరొకరు ఉండేందుకు ఉచిత వసతి అందిస్తాం. చివరిరోజుల్లో ఉన్నవారు ఏవైనా ప్రత్యేకంగా తినాలనుకుంటే వండి వడ్డించేందుకు వంటగది ఏర్పాటు చేశాం. మినీ లైబ్రరీ ఉంది. సినిమా స్క్రీనింగ్, పండుగ, పుట్టినరోజు వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలను విశాలమైన యాంఫీ థియేటర్లో నిర్వహిస్తాం. చివరినిమిషం వరకూ ఉల్లాసంగా ఉంచేందుకే ఈ తపన. అత్యాధునిక వసతులతో మార్చురీ ఉంది. అంతిమ సంస్కారాలకూ సహకారమందిస్తాం. ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. హోమ్ విజిట్స్ కోసం వ్యాన్లు అంతిమ ఘడియల్ని అయినవారి మధ్యే గడపాలనుకునే రోగుల ఇళ్లకు వెళ్లి హోమ్ కేర్‌కోసం 6 వ్యాన్లు ఏర్పాటు చేశాం. రోగిని తీసుకురాలేని పరిస్థితి ఉంటే మనవాళ్లు వెళతారు. ప్రతీ వ్యాన్‌కీ నర్స్, సోషల్ వర్కర్, ఫిజీషియన్, అసిస్టెంట్ ఉంటారు. ఈ వ్యాన్స్‌తో గత నెల 696 విజిట్స్ జరిగాయి. రోగి పరిస్థితిని బట్టి వారానికి ఒక్కసారి, రెండుసార్లు వారి ఇంటికెళ్లి చూస్తాం. ఒక్కో రోగి దగ్గర పావుగంట నుంచి రెండు, మూడు గంటలవరకూ ఉంటారు. నగరం నుంచి 80కి.మీ. పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సేవలుంటాయి. చిరునవ్వు నడిపిస్తోంది.. స్పర్శ్ నిర్వహణలో ఎన్ని వ్యయ ప్రయాసలున్నా రోగుల ముఖాల్లోని చిరునవ్వు అన్నింటినీ మరిపిస్తోంది. మమ్మల్ని నడిపిస్తోంది. నెలకు రూ.40లక్షల వ్యయమవుతుంది. ఎస్బీఐ, పలు కార్పొరేట్ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. ప్రాంగణంలోని కొంత భాగాన్ని ప్రభుత్వ అనుమతితో అద్దెకివ్వడం వల్ల కొంత ఆదాయం వస్తోంది. ఏటా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. -
రుయాలో అడుగడుగునా నిర్లక్ష్యం
ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప రుయా ఆస్పత్రి అధికారుల తీరు మారడంలేదు. అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు మెరుగైన చికిత్స కరువైంది. ఉన్నతాధికారులు పరిశీలన చేసి మందలించినా ప్రయోజనం లేదు. తిరుపతి తుడా: రాయలసీమ పెద్దాస్పత్రిగా తిరుపతి రుయా పేరుపొందింది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ప్రభుత్వం ఆస్పత్రి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వైద్య పరికరాల కోసం నాడు–నేడు ద్వారా రూ.450 కోట్లు కేటాయించింది. వైద్యుల పదోన్నతులు, బదిలీలను చేపట్టింది. వైద్యాధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఇటీవల రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ యజమానుల తీరు పై ఓ అ«ధికారిని సస్పెండ్ చేశారు. మరో ఉన్నతాధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఆస్పత్రిలో పర్యటించి లోటుపాట్లపై కన్నెర్ర చేశారు. అత్యవసర విభాగం నిర్వహణ లోపంపై మండిపడ్డారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినా అధికారుల తీరు మారలేదు. రుయా ఆస్పత్రి వర్కింగ్ కమిటీ సభ్యుడు బండ్ల చంద్రశేఖర్ రాయల్ గురువారం అర్ధరాత్రి ఆస్పత్రిలో పర్యటించారు. నైట్ డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేకపోవడంపై ఆరా తీశారు. వార్డుల్లో రోగు లను ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు స్ట్రెక్చర్లపై తీసుకెళ్లడంలోను నిర్లక్ష్యాన్ని గుర్తించారు. సహాయకులే రోగులను మరో వార్డుకు, వైద్య పరీక్షలకు తీసుకెళుతుండడం ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆస్పత్రి పర్యవేక్షణాధికారి నిర్వాకంవల్లే.. ఆస్పత్రి పర్యవేక్షనాధికారి ఎవరి అధికారాలను వారికి ఇవ్వకుండా తనవద్దే ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలు నెలకొంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులకు డ్యూటీలు కేటాయించడం, వైద్య సిబ్బందితో విధులు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని రుయాలో పాలనను గాడినపెట్టి రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు -
శానిటేషన్.. పరేషాన్!
♦వనపర్తి ప్రభుత్వాస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉన్న ప్రసూతి వార్డు ఇది. గతంలో 100 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిని 330 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ కనీసం 80 మంది శానిటేషన్ వర్కర్లు అవసరం. కానీ ఉన్నది 44 మందే. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించకపోవడం, సరిగా శుభ్రం చేయకపోవడంతో వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. పలు వార్డులు, గదుల్లో పందికొక్కులు తిరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ♦సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రి శానిటేషన్ స్టోర్ గది, ఆస్పత్రిలో వాడే నాసిరకం ఫినాయిల్, ఇతర సామగ్రి ఇవి. ఇక్కడ తగిన శుభ్రత కోసం వినియోగించే సామగ్రి లేదు. కాస్త ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ మాత్రమే ఉన్నాయి. 3 నెలలుగా పరిస్థితి ఇలాగే ఉందని సిబ్బంది, రోగులు చెప్తున్నారు. ♦రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్యం దుస్థితికి ఇవి చిన్న ఉదాహరణలు. ఆస్పత్రుల్లో శానిటేషన్ పనులు చేసే కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడం.. ఏమాత్రం నాణ్యతలేని సామగ్రిని వినియోగించడం.. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం.. తూతూమంత్రంగా క్లీనింగ్ చేయడం వంటివి పరిపాటిగా మారిపోయాయి. అధికారవర్గాలు దీనిని పట్టించుకోకపోవడంతో ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో శానిటేషన్ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు కొరకడం.. గతంలో మెదక్ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని పందికొక్కులు కొరుక్కుతినడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా పారిశుధ్య లోపం, కొరవడిన పర్యవేక్షణ కారణమనేది సుస్పష్టం. ఇలాంటి సమయంలో అసలు సమస్య ఎక్కడ? ఎవరు బాధ్యులు? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రక్షాళన చేపట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని.. దీనిని ఆసరాగా తీసుకుని శానిటేషన్ కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో బుధవారం ‘సాక్షి’ చేపట్టిన విజిట్‌లో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. ప్రైవేట్ ఏజెన్సీల తెంపరితనం, రోగుల అవస్థలు వెలుగుచూశాయి. సిబ్బంది లేరు.. పరిశుభ్రత అసలే లేదు.. ♦ప్రభుత్వాస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పర్యాయాలు వార్డులు, ఆవరణ, ఐసీయూ, ఇతర గదులను షిఫ్టుల వారీగా శుభ్రం చేయాలి. కానీ చాలాచోట్ల రెండుసార్లు మాత్రమే శుభ్రం చేస్తున్నారు. ♦శానిటేషన్ ఏజెన్సీలు అగ్రిమెంట్ ప్రకారం.. నాణ్యమైన డెట్టాల్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్, ఇతర సామగ్రి వినియోగించాలి. చాలాచోట్ల డెట్టాల్ వాడటంలేదు. ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కూడా నాసిరకాలవి వినియోగిస్తున్నారు. ♦శానిటేషన్ సిబ్బంది హాజరుకు సంబంధించి ఒకట్రెండు చోట్ల మినహా ఎక్కడా బయోమెట్రిక్ హాజరు లేదు. ఏజెన్సీల నిర్వాహకులు దీనిని ఆసరాగా చేసుకుని కొందరితో హాజరుపట్టికలో సంతకాలు చేయించి బయట పనులకు వినియోగించుకుంటున్నారు. ప్రతినెలా పదుల సంఖ్యలో సిబ్బంది వేతనాలను మిగుల్చుకుంటున్నారు. ♦నిబంధనల ప్రకారం శానిటేషన్ సిబ్బందికి నెలకు రూ.9,400 వేతనం ఇవ్వాలి. కా>నీ చాలాచోట్ల రూ.8 వేలు, కొన్నిచోట్ల అయితే రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండటంతో పారిశుధ్య సిబ్బంది పనిపై శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ♦కొత్తగా మెడికల్ కళాశాలలు ప్రారంభమైన చోట.. వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్య సిబ్బంది సంఖ్య పెంచలేదు. దానితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలాఖరులోగా నోటిఫికేషన్ వేసి టెండర్ ఆహ్వానిస్తామని అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల ఇదే దుస్థితి.. ♦ఖమ్మం జిల్లాలో 400 పడకల ప్రభుత్వాస్పత్రిలో 80 మందే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. అందులోనూ కొందరే విధుల్లో ఉంటున్న పరిస్థితి. ఊడవడం, తుడవడం వంటివి ఒకరిద్దరే.. అదీ తూతూమంత్రంగా ముగిస్తున్నారని రోగుల బంధువులు చెప్తున్నారు. టాయిలెట్ల క్లీనింగ్ దారుణమని, బ్లీచింగ్ పౌడర్ కూడా సరిగా చల్లడం లేదని మండిపడుతున్నారు. ♦మెదక్ జిల్లాలోని వంద పడకల ఆస్పత్రిలో మూడు విడతల్లో కలిపి కేవలం 15 మంది పారిశుధ్య కార్మికులే ఉన్నారు. వీక్లీ ఆఫ్‌లు, సెలవులు పోగా.. రోజూ పనిచేసేది ముగ్గురు, నలుగురే. దీనితో పారిశుధ్యం కొరవడింది. ఆస్పత్రి ఆవరణలో మార్చురీ పక్కన చెత్తాచెదారం నిండిపోయింది. జనగామ జిల్లా ఆస్పత్రిలో ఫ్లోర్‌ను తుడుస్తున్న శానిటేషన్ వర్కర్ ఇతను. ఆస్పత్రిలో 17 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. వార్డులను రోజూ మూడుసార్లు శుభ్రం చేయాల్సి ఉండగా.. రెండుసార్లే క్లీన్ చేస్తున్నారు. సోప్ ఆయిల్, హైపోక్లోరైడ్, యాసిడ్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటివి నాసిరకంగా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో 170 మంది పారిశుధ్య సిబ్బందికిగాను 112 మంది మాత్రమే ఉన్నారు. దానితో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇక మంచిర్యాల ఆస్పత్రి 200 పడకలకు అప్‌గ్రేడ్ అయినా.. 40 మందే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. దుర్వాసన వస్తున్నా పట్టించుకోవట్లేదు కాలుకు గాయమవడంతో చికిత్స కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చాను. రెండు రోజులుగా వార్డులో ఉంటున్నాను. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. –నర్సింహ, రామచంద్రపురం, భువనగిరి -
ఆయుష్మాన్ భారత్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయుష్మాన్ భారత్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎంతో హైప్ చేసిందని.. కానీ, ఆ పథకం కింద కోవిడ్ రోగులకు మాత్రం ఉచితంగా వైద్యం అందించలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కరోనా సమయంలో కోవిడ్ రోగులు, ప్రజల విషయంలో కేంద్రం అశ్రద్ధ చూపిందని మండిపడ్డారు. ఇక, కోవిడ్ రోగులను, కోవిడ్ వర్కర్లను, దేశ ప్రజలను నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. కోవిడ్ సమయంలో బాధితులకు ఉచిత వైద్యం అందలేదని, పేదలకు కనీస ఆదాయం కూడా రావడంలేదని అన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. COVID पीड़ितों का इलाज मुफ़्त में करवाया? - नहीं ग़रीबों और श्रमिकों को न्यूनतम आय मिली? - नहीं छोटे उद्योगों को डूबने से बचाया? - नहीं The PM does not CARE! pic.twitter.com/68J08eQKyk — Rahul Gandhi (@RahulGandhi) March 24, 2022 -
ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులిస్తేనే సేవలు
-
కూకట్ పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్ ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పోగలు వ్యాపించాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సిబ్బంది.. రోగులను హుటాహుటిన వేరే ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను అదుపులోనికి తెస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌లను ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేశారు. స్థానికుల సహయంతో అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. చదవండిః ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం! -
TS: ఆస్పత్రుల్లో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి : తెలంగాణలో కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లోనూ కేసులు బయటపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కేసులు బయటపడుతుండడం చూస్తున్నాం. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 120 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రి సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 120 మందికి పైగా కరోనా సోకగా.. ఇందులో 38 మంది వైద్యులు, 48 మంది పీజీ విద్యార్థులు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ పరిణామాలతో పేషెంట్ల ట్రీట్మెంట్ కి ఇబ్బందులు ఎదురవుతుండగా.. పేషెంట్ల బంధువుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇన్ పేషంట్లు గా ఉన్న 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు 9మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. లక్షణాలు ఉన్న మరికొందరి ఆసుపత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. భద్రాద్రిలో.. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షణాలున్న 286 మందికి కరోనా పరీక్షలు నిర్వహించించగా.. వీళ్లలో 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ వెల్లడించారు. -
గాంధీ ఆస్పత్రికి కోవిడ్ బాధితుల క్యూ
Covid Patients At Gandhi Hospital: గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధితులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. ఇన్‌పేషెంట్ వార్డుల్లో సుమారు 70 నుంచి 80 మంది మాత్రమే ఉండగా, తాజాగా ఈ సంఖ్య 111కు చేరింది. ఫలితంగా మెయిన్ బిల్డింగ్‌లోని సెకండ్ ఫ్లోర్ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు కూడా ఉన్నారు. తగ్గినట్లే తగ్గిన ఇన్‌పేషంట్ల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వంద మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ఒమిక్రాన్ బాధితులే. చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.. -
కరోనా చావులు.. కాకి లెక్కలు!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన కరోనా చావులు..కాకి లెక్కలను తలపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించిన ఈ గణాంకాలకు కోవిడ్ ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్లో అందుతున్న దరఖాస్తులకు అసలు పొంతన కుదరడం లేదు. ఇబ్బడిముబ్బడిగా అర్జీలు వస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలపట్టుకుంటున్నారు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) బాధితులు కోవిడ్‌తో చనిపోయినప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లు, చికిత్స పొందిన ఆస్పత్రి జారీ చేసిన మెడికల్ బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంతో వీటిలో కొన్ని తిరస్కరణకు గురవుతుండగా 90శా తానికి పైగా దరఖాస్తులు సాయానికి అర్హమైనవిగా తేలినట్లు తెలిసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టు రిపోర్ట్, ఇన్‌పేషెంట్ మెడికల్ బిల్లులు, ఛాతి ఎక్సరే, సిటీస్కాన్ రిపోర్టులు, వైద్యులు సిఫార్సు చేసిన మందులు, మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ నెంబర్ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, అర్హత పొందిన దరఖాస్తులను కలెక్టర్లకు ప్రతిపాదిస్తుండడం విశేషం. దాచినా..దాగని లెక్కలు కోవిడ్ మరణాలను కూడా విపత్తుల జాబితాలో చేర్చి మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందజేయాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా రూ.50,000 చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ మేరకు బాధిత కుటుంబాలు ఆన్లైన్లో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2,300పైగా దరఖాస్తులు అందగా, రంగారెడ్డిలో 750పైగా, మేడ్చల్‌లో 550 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుకు తుది గడువు లేకపోవడంతో అర్జీదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాలతో పోలిస్తే ఆన్లైన్లో కలెక్టర్లకు అందుతున్న అర్జీల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇదిలా ఉంటే వైరస్ సోకినట్లు బయటికి తెలిస్తే ఇంటిని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించి, కుటుంబసభ్యులను వైద్య పరీక్షలు, హోం ఐసోలేషన్ పేరుతో ఆస్పత్రికి తరలించే ప్రమాదం ఉందని భావించి మొదట్లో చాలా మంది కుటుంబ సభ్యుల మరణాలను సాధారణ మరణాలుగా చెప్పుకున్నారు. వాస్తవానికి కోవిడ్‌తో చనిపోయినప్పటికీ..కుటుంబసభ్యులు చేసిన పొరపాటుతో ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందలేకపోతున్నారు. (చదవండి: గ్రహాంతరవాసులను చూసేందకు వెళ్తున్నా!... అంటూ హాస్యగాడిలా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే చివరికి!! -
ప్రధాన ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకులకు వసతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతో పాటు వచ్చే సహాయకులకు వసతి కల్పించేందుకు ఆస్పత్రుల పరిసర ప్రాంతాల్లో తగిన ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతోపాటు వస్తున్న సహాయకులు సరైన వసతి, సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు శనివారం సీఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దసరా పండుగ నుంచే వసతి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే ఈ కేంద్రాల్లో హరేకృష్ణ మిషన్ ఫౌండేషన్ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో తాగునీరు, శానిటేషన్‌తోపాటు మహిళా అటెండెంట్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హరేకృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ కౌంతేయ దాస్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎం.డి. చంద్రశేఖర్, వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
మీరు మధుమేహ బాధితులా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..
హూస్టన్: మీరు టైప్ 1 డయాబెటిస్ (మధుమేహం) బాధితులా? వయసు 40 ఏళ్లు దాటిందా? అయితే, జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే మీరు కోవిడ్–19 మహమ్మారి బారినపడితే తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరే అవకాశాలు పిల్లలతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా ఉంటాయట. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో జరిగిన తాజా అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాలను ఎండోక్రైన్ సొసైటీకి చెందిన క్లినికల్ ఎండోక్రైనాలజీ, మెటాబాలిజం జర్నల్‌లో ప్రచురించారు. పిల్లలకు కరోనా సోకితే లక్షణాలు బయటపడవు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా స్వల్పమే. కానీ, డయాబెటిస్తో బాధపడు తున్న పెద్దల్లో కరోనా మహమ్మారి ప్రాణాం తకంగా పరిణమిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. పిల్లలు, యువత కంటే టైప్ 1 డయాబెటిస్ ఉన్న పెద్దలకు(40 ఏళ్లు దాటినవారు) కరోఓనా సోకితే తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. చదవండి: Vice President Venkaiah Naidu: వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి -
Hyderabad: ఖరీదైన కాస్మొటిక్ సర్జరీ ఇక ఉస్మానియాలో కూడా..
సాక్షి, అఫ్జల్‌గంజ్(హైదరాబాద్): కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన కాస్మొటిక్ సర్జరీని ఉస్మానియా వైద్యులు ఉచితంగా నిర్వహించి సత్తా చాటుకున్నారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్ వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినికి కుడివైపు రొమ్ము పెరగకపోవడంతో ఆగస్టులో వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. అమ్మాయికి వైద్యులు ఓపీ ద్వారా చికిత్స అందించి మళ్లీ రావాల్సిందిగా సూచించారు. అనంతరం ఈ నెల మొదటి తేదీన ఆస్పత్రికి రాగా అదేరోజు ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి నేతృత్వంలో డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్, డాక్టర్ అశ్వన్ కిషోర్, డాక్టర్ ఫయాజ్, డాక్టర్ విజయ్ బాబు, డాక్టర్ మధులిక, డాక్టర్ అజయ్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండూ నాయక్ నేతృత్వంలోని డాక్టర్ పావని, డాక్టర్ అనుపమ, డాక్టర్ ఆనంద్ బృందం దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి ఆగ్మెంటేషన్ మమోప్లాస్టీ శస్త్ర చికిత్సను సిలికాన్ ఇన్‌ప్లాంట్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్‌ను అమర్చి పూర్తి చేశామన్నారు. శస్త్ర చికిత్స జరిగి పదిహేను రోజులు గడిచిందని, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి శస్త్ర చికిత్సకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ఉస్మానియాలో అన్నో అభివృద్ది పనులు జరుగుతూ పేదలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రోగులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఉస్మానియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చదవండి: రాజు మృతి: సింగరేణి ఊపిరి పీల్చుకుంది -
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 41 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందన్నారు. రాష్ట్రానికి కోటి 68లక్షల 61వేల 809 వ్యాక్సిన్ డోసులు పంపించినట్లు తెలిపారు.13.18లక్షల డోసులు తెలంగాణలో నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ఆయన అన్నారు. -
కోవిడ్ నుంచి కోలుకున్నా..మళ్లీ ఇదేం బాధరా భగవంతుడా
సాక్షి, సిటీబ్యూరో: కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందం బాధితుల్లో ఎంతో కాలం నిలవడం లేదు. మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ వారిని (మ్యూకర్ మైకోసిస్) బ్లాక్ ఫంగస్ రూపంలో మరో వైరస్ మళ్లీ వెంటాడుతోంది. మే రెండో వారంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని ఇందుకు నోడల్ సెంటర్‌గా ఎంపిక చేసింది. పడకల సామర్థ్యానికి మించి కేసులు రావడంతో గాంధీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక బ్లాక్ ఫంగస్ విభాగాలు ఏర్పాటు చేసింది. 86 శాతం మంది టీకా తీసుకోని వారే ►ఈఎన్టీ వైద్యులు ఆస్పత్రిలో అడ్మిటైన 300 మంది బ్లాక్ ఫంగస్ బాధితులపై ఇటీవల ఓ సర్వే చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ►వైరస్ బారిన పడిన బాధితుల్లో 86 శాతం మంది టీకా తీసుకోని వారే కావడం గమనార్హం. కేవలం ఆరు శాతం మంది మాత్రమే ఫస్ట్ డోసు పూర్తి చేసుకున్నట్లు వెల్లడైంది. ►అంతేకాదు ఎంపిక చేసిన బాధితుల్లో 280 మంది మధుమేహ బాధితులే. వీరిలో 51 శాతం మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత డయాబెటిక్, డినోవాలు వెలుగు చూడగా, 43 శాతం మందికి కరోనాకు ముందే మధు మేహం ఉన్నట్లు గుర్తించారు. ►కరోనా చికిత్సల్లో వైద్యులు రెమ్‌డెసివిర్, ఇతర స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వినియోగించడమే ఇందుకు కారణమని తెలిసింది. ప్రస్తుతం మరో 200 మంది బాధితులు గాంధీలో ప్రస్తుతం 150 కోవిడ్ పాజిటివ్/బ్లాక్ ఫంగస్ కేసులు ఉండగా, ఈఎన్టీలో 50 మంది వరకు చికిత్స పొందు™తున్నారు. వీరిలో కొంత మంది దవడ సర్జరీల కోసం ఎదురు చూస్తుండగా, మరికొంత మంది ముక్కు, కన్ను సర్జరీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సెంటర్లలో రోజుకు పది నుంచి పదిహేను సర్జరీలు జరుగుతున్నాయి. ►బ్లాక్ ఫంగస్ కారణంగా కన్ను, ముక్కు, దవడ భాగాలను కోల్పోయిన బాధితులు వాటి స్థానంలో కృత్రిమ అవయవాలను అమర్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ►పేదలకు ఈ ప్లాస్టిక్ సర్జరీలు భారంగా మారాయి. ఆర్థికస్తోమత ఉన్న వారు యుక్త వయస్కులు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు చేయించుకుంటున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. 150 మందికి దెబ్బతిన్న కంటిచూపు ► ఈఎన్టీ, గాంధీ, సరోజినీదేవి ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 2,676 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ► వీరిలో 1896 మందికి వైద్యులు సర్జరీలు చేశారు. వీరిలో 150 మందికి కంటి సంబంధిత సర్జరీలు చేయగా...దాదాపు అందరూ చూపును కోల్పోయినట్లే. ► 650 మందికి దవడ, దంతాలను, 350 మందికి ముక్కు, మరో 746 మందికి ఇతర భాగాల తొలగింపు శస్త్రచికిత్సలు చేశారు. గాంధీ, ఈఎన్టీ ఆస్పత్రుల్లో నమోదైన కేసులు మొత్తం బ్లాక్ ఫంగస్ కేసులు : 2676 వీరిలో ఎంత మందికి సర్జరీలు చేశారు : 1896 కంటి సర్జరీలు : 150 పన్ను తొలగింపు సర్జరీలు : 650 ముక్కు తొలగింపు సర్జరీలు : 350 ఇతర భాగాల తొలగింపు : 746 -
MCH Hospital : ఒకరికి చేయాల్సిన శస్త్ర చికిత్స మరొకరికి..
‘గత నెలలో జిల్లా కలెక్టర్ శశాంక మాతా శిశు ఆసుపత్రి సందర్శనకు వెళ్లారు. ఓ రిటైర్డ్ వైద్యురాలి భర్త (ఆయన కూడా వైద్యుడే) కలెక్టర్ ముందు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైన ఓ రిటైర్డ్ అధికారి తన భార్యకు సంబంధించిన పదవీ విరమణ బెనిఫిట్స్ రాకుండా అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఎంసీహెచ్‌లో కాంట్రాక్టు డాక్టర్‌గా చేరేందుకు కూడా అడ్డుపడుతున్నాడని ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిని అధ్వానంగా మార్చిన సదరు కాంట్రాక్టు డాక్టర్‌ను తొలగించాలని కోరారు. ఆసుపత్రిలో రింగ్ మాస్టర్లా వ్యవహరిస్తున్న సదరు కాంట్రాక్టు అధికారికి రూ.1.15 లక్షల వేతనం ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు’. సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని మాతా శిశు కేంద్రం (ఎంసీహెచ్) అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన ఈ కేంద్రం నిర్లక్ష్యం, అలసత్వానికి వేదికగా మారింది. ఇక్కడి డాక్టర్లు బాధ్యతలు మరిచిపోయి వైద్యవృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తుంటే.. సిబ్బంది రోగులను ఆదాయ వనరులుగా భావిస్తూ పీక్కుతింటున్నారు. గర్భిణుల ప్రసూతి సమయంలో డాక్టర్లు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అడ్డగోలుగా తయారైంది. శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులనే మారుస్తూ గర్భిణుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఆసుపత్రిలో వైద్యుల నియామకం మొదలు ఆసుపత్రి నిర్వహణ వరకు ఒకరిద్దరు ‘పెద్ద’ల చేతుల్లోనే ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో ఓ రిటైర్డ్ డాక్టర్‌కు ఏటా లక్షల రూపాయలు చెల్లిస్తూ అడ్మినిస్ట్రేటర్‌గా పెట్టి ఆసుపత్రి పరువును బజారుకీడుస్తున్నారు. ఆసుపత్రికి చెందిన రెగ్యులర్ వైద్యాధికారులు కూడా కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వైద్యున్ని చూసి భయపడే పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ వైద్యులను కాదని.. ఇటీవల గైనకాలజీ విభాగం హెచ్‌వోడీ మూడు నెలలపాటు లీవులో వెళ్లారు. అయితే.. ఆ పోస్టులో ఇన్చార్జిగా మరో రెగ్యులర్ వైద్యురాలిని నియామకం చేయాల్సి ఉండగా, ఓ కాంట్రాక్టు జూనియర్ వైద్యులరాలికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదేంటని అడిగే పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా పోయింది. పూర్తిగా ఆసుపత్రి రాజకీయ నాయకుల చేతుల్లో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. వైద్యులు రెండు గ్రూపులుగా విడిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్లే ప్రసవం కోసం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ అధికారిదే హవా.. ఆసుపత్రి నిర్వహణ కోసం ఓ రిటైర్డ్ డాక్టర్‌ను కాంట్రాక్టు పద్ధతిన ప్రతినెలా రూ.1.15 లక్షల వేతనంతో నియమించారు. సదరు అధికారి నిర్వహణ మరిచి అన్నింట్లో తల దూరుస్తూ రింగ్ మాస్టర్లా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎంసీహెచ్‌లో బాధ్యతలు అప్పగిస్తే.. ఎంసీహెచ్‌తోపాటు జిల్లా ఆసుపత్రిలో చక్రం తిప్పుతున్నారు. అన్నీ తానై నడుపుతున్నారు. ఓ గ్రూపును తయారు చేసి తన వెంటే ఉంచుకొని హల్చల్ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ, పర్మినెంట్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, వారిపై ఫిర్యాదులు, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు మొదలైన అన్ని పనులకు ఉన్నతాధికారులను గు ప్పిట్లో పెట్టుకొని చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఓ రాజకీయ పార్టీ అండతోనే ఈ రిటైర్డ్ డాక్టర్‌ను నియమించి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియామకాల్లోనూ.. జిల్లా ఆసుపత్రిలో అయినా సరే ఎంసీహెచ్ ఆసుపత్రిలో అయితే సదరు రింగ్‌మాస్టర్ తెలియకుండా కాంట్రాక్టు పద్ధతిన నాల్గవ తరగతి ఉద్యోగి కూడా ఉద్యోగం సంపాదించలేని పరిస్థితి. సదరు అధికారిని ప్రసన్నం చేసుకుంటేనే కింది నుంచి పైస్థాయి వరకు ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. అతన్ని కాదని ఇతరులతో పైరవీలు చేయించారో ఏ స్థాయిలోనైనా అడ్డుకునే శక్తి అతనికి ఉంది. ఉన్నతాధికారులంతా అతని గ్రిప్‌లోనే ఉండడంతో ఆయన ఆడింది ఆటగా నడుస్తోంది. సిజేరియన్ ఘటనపై విచారణకు కమిటీ.. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాలతి అనే మహిళకు వైద్యులు నిర్లక్ష్యంతో సిజేరియన్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆర్ఎంఓ డాక్టర్ శౌర య్య, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్‌లతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల ఆదేశాలు జారీ చేశారు. వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు మాతాశిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి భర్త, వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరోత్తమ్ రెడ్డి మంగళవారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరోత్తమ్‌రెడ్డి భార్య మాలతి 7 నెలల గర్భిణి. ఈ నెల 17న ఆమెకు కడుపులో నొప్పి రావడంతో 108 వాహనంలో కరీంనగర్‌లోని మాతాశిశు కేంద్రానికి తరలించారు. గర్భసంచికి కుట్లు వేయాలని 21న నరోత్తమ్‌రెడ్డి భార్యను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. డెలివరీ ఆపరేషన్‌కు వచ్చారనుకొని వైద్యులు నిర్లక్ష్యంగా పొట్టచీరారు. దీనివల్ల పుట్టబోయే పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరోత్తమ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కాళేశ్వరం అద్భుత సృష్టి.. ఈనెల 25న డిస్కవరీ చానల్లో -
మానసిక రుగ్మతలతో బాధపడుతున్న కోవిడ్ భాదితులు
-
oxygen concentrator: పుణే సంస్థ కొత్త డిజైన్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ రెండో దశలో ప్రజలు వణించింది. ముఖ్యంగా కేసుల ఉధృతి ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఆక్సిజన్ కొరతతో చాలామంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పుణేకు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకోసం ఒక కొత్త డిజైన్‌ను అభివృద్ధి చేసింది. కరోనావైరస్ బాధితులకు ఉపయోపడేలా డూ-ఇట్-యువర్ సెల్ఫ్( డీఐవై) అనే డిజైన్‌ను రూపొందించింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని తయారు చేశామని అనాశ్వర్ టెక్నాలజీస్ డైరెక్టర్ కరణ్ తారాడే ప్రకటించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ భారతదేశంలో, భారతీయుల కోసం భారతీయులచే అభివృద్ధి చేసినట్టు చెప్పుకొచ్చారు. డిజైన్‌ను సరళంగా, సాధ్యమైనంత చౌక ధరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఇంజనీర్లు ఇంటర్నెట్లో 'ఆక్సికిట్' ద్వారా గాలి నుంచి ఆక్సిజన్ సేకరిస్తున్న తీరు బాగా ఉన్నప్పటికీ ఓపెన్ సోర్స్‌లో, స్వల్పంగా మార్పులతో దీన్నితయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం 1970 లలో కనుగొన్న విదేశీ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను చాలా కుటుంబాలు వినియోగిస్తున్నాయని తారాడే చెప్పారు. అలాగే కరోనా మూలంగా దాదాపు ప్రతీ పౌరుడు ప్రభావితమవుతున్నారు. అందుకే తమ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిఒక్కరికీ అందుబాలోకి ఉండాలని బావిస్తున్నామని తరాడే చెప్పారు. ఆక్సిజన్ ఎనలైజర్‌ను కూడా తయారు చేశాం కానీ చాలా ఖరీదైంది కావడంతో కాలామందికి అందుబాటులో లేదన్నారు. ఈ డిజైన్‌ను యూట్యూబ్ వీడియోలు, గితుబ్రిపోజిటరీ ఉపయోగించి అభివృద్ధి చేశామని తెలిపారు. 'ఆక్సికిట్' టెక్నాలజీలో భారతీయ అవసరాలనకనునుగుణంగా మార్పులతో తీర్చిదిద్దామన్నారు. ముఖ్యంగా నిమిషానికి 15 లీటర్ల (ఎల్పిఎం)ఆక్సిజన్ కోసం 'డూ ఇట్ యువర్ సెల్ఫ్' డిజైన్‌ను అభివృద్ధి చేశామనీ, 90 శాతానికి పైగా స్వచ్ఛతను అందించే 20 ఎల్పిఎం మోడల్‌పై కూడా పని చేస్తున్నామన్నారు. అంతేకాదు వీటిపై ప్రాథమిక పరిజ్ఞానంతో ఎవరైనా దీన్ని చేయగలుగుతారని కూడా ఆయన చెప్పారు. మెకానికల్ ఇంజనీర్ అయిన తారాడే తన అల్ట్రా-పోర్టబుల్ వాటర్ క్రిమిసంహారక వ్యవస్థ ప్రాజెక్ట్ కోసం 2018 లో నీతి అయోగ్ 'స్మార్ట్ ఇండియా హాకథాన్'లో మొదటి బహుమతిని గెలుచుకోవడం విశేషం. చదవండి: యూపీలో దారుణం: ఆక్సిజన్ నిలిపివేసి మాక్ డ్రిల్ Samsung స్మార్ట్‌టీవీ: అద్భుత ఫీచర్లు -
వారి కోసం స్టెప్పులేసిన డాక్టర్లు: వీడియో వైరల్
అసోం: కోవిడ్-19 సెకండ్ వేవ్ భయపెడుతున్న సమయంలో అసోంలోని కరోనా ఆసుపత్రి వైద్యులు మరోసారి వార్తల్లో నిలిచారు. సిల్చార్ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల బృందం పాటలు ,డాన్స్‌లతో కరోనా బాధితులను ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నించిన తీరు పలువురు ప్రశంసలందుకుంటోంది. వీరితోపాటు కరోనాకు చికిత్స పొందుతున్నవారు కూడా కలిసి నృత్యం చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు అత్యంత ఒత్తిడికి గురవుతున్న రోగుల కుటుంబ సభ్యులకు భరోసాతో నిస్తున్నారు. పీపీఈ కిట్లలో బెంగాలీ, హిందీ పాటలతోపాటు, జానపద పాటలకు వీరు వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హమ్ హోంగే కామియాబ్తో పాటు, బరాక్ వ్యాలీ ప్రాంతంలో ప్రసిద్ధ జానపద నృత్యం ధమాయిల్ ను కూడా వారు ప్రదర్శించారు. దీంతో వైద్యులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసోం, కాచర్ జిల్లాలోని సిల్చార్ ఎస్ఎం దేవ్ సివిల్ హాస్పిటల్ ఆరోగ్య సంరక్షణ నిపుణులు కోవిడ్-19తో బాధపడుతున్న పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు నృత్యాలను ఒక సాధనంగా ఉపయోగించు కున్నారు. తద్వారా వారిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. డాక్టర్ జూరీ శర్మ నాయకత్వంలోని ఈ బృందం పీపీఈ సూట్లలో రోగులతో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు దేశంలో సోమవారం కొత్తగా 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,427 మరణాలు సంభవించాయి. -
కోవిడ్ వేళ.. అండగా ఆమె
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ... బాధితులకు మీరు అండగా ఉంటున్నారా? ఉచితంగా..ఉదారంగా సేవలందిస్తున్నారా? ఐసోలేషన్ పేషెంట్లకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నారా? ఆక్సిజన్ అవసరమైన వారికి సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందించారా? అవసరమైన రోగులకు అంబులెన్స్ వసతి కల్పించారా? మీ సేవలు ఏ రూపంలో ఉంటున్నాయి..మాతో పంచుకోండి. మీకు తెలిసిన వాళ్లు కానీ..మీకు సాయం చేసిన వాళ్లు కానీ ఉంటే స్పందించండి ఆ మనసున్న మారాజుల వివరాలు మాకు ఫొటోలతో సహా పంపించండి ‘సాక్షి’లో ప్రచురిస్తాం. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్/మెయిల్ చేయండి. Satyasakshi@gmail.com ( ph.no.. 9912199485 ), Hanumadris@gmail.com ( ph.no ..9160666866 ) నగరానికి చెందిన 7 రేస్ ఫౌండేషన్ సామాన్యులకు ఆసరాగా నిలుస్తోంది. కరోనా సోకిన పేదవారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ శారద పేర్కొన్నారు. ఈసీఐఎల్, ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి, యాప్రాల్, నేరేడ్మెట్, ఆర్కేపురం తదితర ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 7రేస్‌ని సంప్రదించిన బాధితుల ఇంటి వద్దకే ఆహారం అందిస్తున్నారు. బస్తీల్లో రైస్ కిట్ అందజేస్తున్నారు. ఇందులో పప్పు దిçనుసులు, వంట నూనెతో పాటు నిత్యావసర సరుకులు ఉంటున్నాయి. 99080 88258ను సంప్రదిస్తే ఆదుకుంటామని శారద సూచించారు. నేనున్నాననీ.. స్వచ్ఛంద సంస్థలతో పాటు కొంతమంది వ్యక్తిగతంగానూ ముందుకొచ్చి ఔదార్యం కనబరుస్తున్నారు. వీరిలో నగరానికి చెందిన నవత ఒకరు. కరోనా బాధితులకు నేనున్నాననే భరోసానిస్తున్నారు. 63042 19659ను సంప్రదించిన వారికి నెగెటివ్ వచ్చేంత వరకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. నిమ్స్, గాంధీ, టిమ్స్ తదితర ప్రాంతాల్లో 3500 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశామని నవత తెలిపారు. తనకున్న పరిచయాలతో రక్తదానం కూడా చేయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోనా బాధితులు, పోస్ట్ కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలను అందిస్తోంది హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్. ఈ ఐసోలేషన్ సెంటర్లను 80 బెడ్ల సామర్థ్యంతో మూసాపేట్, అల్వాల్‌లో ప్రారంభించినట్లు సంస్థ ఫౌండర్ హిమజ తెలిపారు. నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. రోగులకు అవసరమైన చికిత్స అందించడానికి డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అవసరమైన మందులు, ఆహారం అందిస్తారు. దిశా ఫౌండేషన్, అభయం ఫౌండేషన్లు సహకారం అందిస్తున్నాయి. అనాథాశ్రమాలకూ అండగా.. నగరంలోని అనాథ, వృద్ధాశ్రమాలకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిసిన్ మాస్క్‌లు, న్యాప్కిన్లు, శానిటైజర్లను అందిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. సేవలను పొందాలనుకునే వారు 91827 35664ను సంప్రదించవచ్చు. చదవండి: కరోనాతో అనాథలైన చిన్నారులకు చేయూత -
కర్నూల్ జిల్లాలో కోవిడ్ భాదితులకు నాణ్యమైన ఫుడ్
-
ఎప్పుడొచ్చారు.. ఇప్పుడెలా ఉంది? : సీఎం కేసీఆర్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘ఏమ్మా బాగున్నవా.. ఆరోగ్యం ఎట్లుంది.. ఏ ఊరే పెద్దమనిషి.. ఎప్పుడొచ్చారు.. భోజనం మంచిగ పెడ్తున్నరా.. గోలీలు మంచిగ ఇస్తున్నరా..’’ అంటూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరామర్శిం చారు. పేషెంట్లు చికిత్స పొందుతున్న బెడ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు అందుతున్నాయా, టైం ప్రకారం మందులు, గోలీలు ఇస్తున్నరా అని అడిగి తెలుసుకున్నారు. ‘‘డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటరు. ఆరోగ్యం మంచిగ కాగానే ఇంటికి పంపిస్తరు. ఏం ఫికర్ పడొద్దు. అండగా నేనున్నా..’’ అంటూ బాధితుల్లో మనో ధైర్యం నింపారు. కరోనా బాధితులు, ఇతర రోగులకు చికిత్సకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని.. అందరికీ మంచి చికిత్స అందించాలని వైద్యులు, ఇతర సిబ్బందిని ఆదేశించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. వార్డులన్నీ కలియదిరిగి, బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. తర్వాత ఎంజీఎం ఆస్పత్రి విస్తరణ, నూతన భవనంపై అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమిడెసివిర్, ఇతర మందుల లభ్యత, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో మాట్లాడి.. వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న సేవలను అభినందించారు. బాధితుడిని తేలిక పరుస్తూ.. సీఎం: మీదే ఊరు, పేరేంటిది పెద్దమనిషి? వెంకటాచారి: సార్.. వెంకటాచారి సార్... మట్టెవాడ సీఎం: ఎన్ని రోజులైంది వచ్చి ఇక్కడికీ వెంకటాచారి: పన్నెండు రోజులైతంది సారు... సీఎం:ఇప్పుడెలా ఉంది... వెంకటాచారి: మంచిగనే ఉన్నది సారు.. గోలీలు ఇస్తున్నరు... భోజనం పెడుతున్నరు సీఎం: మందులు వాడుతా ఉండూ.. తొందరగానే తగ్గుతుంది... (సీఎం కేసీఆర్ పరామర్శ అనంతరం ఆ వృద్ధుడు వెంకటాచారి ఆనందంతో ‘కేసీఆర్ జిందాబాద్.. కేసీఆర్ నా రెండో ప్రాణం’ అంటూ నినాదాలు చేశారు.) సెంట్రల్ జైల్లో ఖైదీలతో మాట్లాడిన సీఎం.. ఎంజీఎం సందర్శన తర్వాత.. అక్కడికి సమీపంలో ఉన్న సెంట్రల్ జైలును కేసీఆర్ సందర్శిం చారు. బ్యారక్‌లు, ఓపెన్ జైలు, నర్సరీలలో కలియతిరి గారు. ఖైదీలతో మాట్లాడారు. ఏ నేరంపై వచ్చారు, ఏ ఊరు, కుటుంబ పరిస్థితి ఏమిటని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో ఆలకించారు. అభ్యర్థనలను స్వీకరించారు. జైలు లోపల ఉన్న ఫినాయిల్, సోప్, స్టీల్ ఫర్నిచర్, ప్రింటింగ్ ప్రెస్, చేనేత వస్త్రాల తయారీ యూనిట్లను, ఖైదీలు తయారుచేస్తున్న శానిటైజర్, మాస్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా జైలు అధికారులతో సీఎం మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రిని పూర్తిగా మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మార్చనున్నామని.. సెంట్రల్ జైలును మరోచోటికి తరలించి, ఈ ప్రదేశంలో అన్ని చికిత్సలు, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. నూతన జైలు నిర్మాణానికి ఎంత భూమి అవసర మని సీఎం అడగ్గా.. 130 ఎకరాల వరకు కావాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు సైతం 130 ఎకరాల్లో ఉందని, వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు మహా పరివర్తన, ఉన్నతి తదితర కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ఖైదీలకు ఉపాధి కల్పించే కర్మాగారాలు, తీవ్రవాదులను ఉంచే హైసెక్యూరిటీ బ్యారక్స్, ఓపెన్ జైలు వంటి వాటికోసం కలిపి కనీసం 100 ఎకరాలకుపైన భూమి అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి తదితరులు ధాన్యం సేకరణ వేగిరం చేయండి కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాను హెలికాప్టర్లో వస్తుండగా రోడ్లమీద వడ్ల కుప్పలు కనిపించాయని చెప్పారు. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో పడతారని, అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఉన్నతాధికారులు ఉన్నారు. కఠినంగా లాక్డౌన్ అమలు ఆస్పత్రి, జైలు సందర్శన తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం పేరుపేరునా పలకరించి మాట్లాడారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటని అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ‘‘రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీ, కలెక్టర్లపై ఉంది. ఉదయం సడలింపు ఇచ్చిన నాలుగు గంటలు మినహా.. మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చెయ్యాలె. అలసత్వం వహించకూడదు. ఉదయం 10గంటల 10 నిమిషాల తర్వాత పాస్ హోల్డర్స్, అత్యవసర సేవల వారు తప్ప మరెవరూ రోడ్డు మీద కనిపించకుండా చర్యలు చేపట్టాలి. సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు. కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ సరిగా అమలు జరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనుంచైనా కఠినంగా అమలు చేయాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా అమలు చేయిస్తున్నారని.. నగరాల్లో, పట్టణాల్లో మాత్రం పకడ్బందీగా అమలు కావాల్సి ఉందని చెప్పారు. దీనిపై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. ఎంజీఎంలో యాదమ్మతో.. ధైర్యంగా ఉండు సీఎం కేసీఆర్: అమ్మా.. మీ పేరేంటి? యాదమ్మ: యాదమ్మ సార్ ఏ ఊరమ్మ... ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది రంగశాయిపేట.. ఇక్కడ్నే వరంగల్‌లో.. ఇప్పుడెలా ఉంది.. మంచిగనే ఉందిగదా! సార్ ఇప్పుడు మంచిగనే ఉంది.. పూర్తిగా మంచిగైతే ఇంటికి పోదామని సూత్తన్న భోజనం, గోలీలు మంచిగ ఇస్తున్నరా..? మంచిగనే ఇస్తున్నరు. తొందరగ నయమైతే బాగుండనిపిస్తుంది మీకేమీ కాదు.. ధైర్యంగా ఉండు.. అండగా నేనుంటా సార్.. మీరు చల్లగుండాలె.. కరోనాకు చికిత్స పొందుతున్న 68 ఏళ్ల వృద్ధురాలి వద్దకు కేసీఆర్ వెళ్లగానే ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ‘‘సార్ మిమ్మల్ని చూసి చాన్నాళ్లయింది. మీరిక్కడికి రావడం, మిమ్ములను చూడటం సంతోషంగా ఉందయ్యా. మీరు చల్లగా ఉండాలె..’’ అని సంతోషపడ్డారు. సీఎం పర్యటన సాగిందిలా.. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు, పలు ఇతర కార్యక్రమాల కోసం సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్‌లో పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి వచ్చా రు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యా హ్నం 12.40 గంటలకు ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. డబుల్ మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించి 45 నిమిషాల పాటు ఆస్పత్రిలో కలియదిరిగారు. ఐసీయూ, వార్డులను సందర్శించారు. కోవిడ్ బాధితులు, ఇతర పేషెంట్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. తర్వాత సమీపంలోని సెంట్రల్ జైలును పరిశీలించా రు. ఖైదీలు, జైలు అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
Telangana: కరోనా బాధితులతో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరంగల్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు శుక్రవారం రోడ్డుమార్గాన వెళ్లారు. వరంగలోని ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ వార్డులను పరిశీలించారు. కరోనా వైరస్ బాధితులకు సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో సీఎం మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ సందర్శించిన విషయం తెలిసిందే. నగరంలో 5 గంటలు.. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఉమ్మడి వరంగల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర జిల్లాల్లో పర్యటించినా.. వరంగల్ నగరానికి చాలాకాలం తర్వాత వస్తున్నారు. సుమారు 5 గంటల పాటు వరంగల్‌లో ఉండనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఎంజీఎం ఆస్పత్రి, సెంట్రల్ జైలును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. కోవిడ్ వార్డులో బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై ఆరా తీశారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆరు సెక్టార్లుగా భారీ భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్, పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి ఏర్పాట్లను పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్: 88 మంది కోవిడ్ రోగుల మాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు పలువురు.. డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు. ఈ విధంగా ఇప్పటికి 88 మంది బాధితులు ఆస్పత్రి నుంచి మాయం అయినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కింగ్‌కోఠి ఆసుపత్రిలో కోవిడ్ టెస్టుల కోసం వచ్చిన వారి సంఖ్య 14,664. వీరిలో 1,802 మంది అడ్మిట్ కాగా 782 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 261 మంది మృత్యువాత పడ్డారు. 671 మంది రోగుల్లో కొందరు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కొందరు గాంధీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 88 మంది చికిత్స పూర్తికాకుండానే అంటే నెగెటివ్ రాకముందే కన్పించకుండా పోవడం విస్మయం కలిగిస్తోంది. వీరి విషయంలో ఆస్పత్రి అధికారుల వద్ద సరైన వివరాలు లేకపోవడం గమనార్హం. సరైన సెక్యూరిటీ, పర్యవేక్షణ లేని కారణంగానే ఎవరు పడితే వారు లోపలికి రావడం, రోగులు కాస్త కోలుకున్నాక ఎవరికీ చెప్పకుండానే వెళ్లిపోవడం జరుగుతోందనే విమర్శలున్నాయి. పేషెంట్లకు ట్యాగ్లు వేయడం, సహాయకులకు పాస్‌లు ఇవ్వడం వంటివి సరిగా అమలు కావడం లేదని తెలుస్తోంది. వాళ్లంతా చెప్పకుండా వెళ్లినట్టు కాదు ఆ 88 మంది చెప్పకుండా వెళ్లినట్టేం కాదు. కొంతమంది మాకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇష్టం లేదని చెప్పి వెళుతున్నారు. కొందరు చెప్పకుండా వెళ్తున్నారు. అలా వెళ్లిన సంగతి తెలిసిన వెంటనే పోలీసులకు చెబుతున్నాం. రోగులు చెప్పకుండా వెళ్లడానికి వీల్లేకుండా సెక్యూరిటీని పెంచే దిశగా ఆలోచిస్తున్నాం. – డాక్టర్ రాజేంద్రనాథ్,సూపరింటెండెంట్ -
విశాఖలో కరోనా మృతులకు ఉచితంగా దహన సంస్కారాలు
-
హెచ్చరిక: హోం ఐసోలేషన్‌లో రెమిడెసివిర్ తీసుకోవద్దు
న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను తీసుకోవద్దని, ఆక్సిజన్ స్థాయి 94కు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ‘హోం ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు, జాగ్రత్తలు’ అనే అంశంపై ఎయిమ్స్ డాక్టర్లు నీరజ్ నిశ్చల్, మనీష్‌లు శనివారం ఒక వెబినార్‌లో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఆక్సిజన్ స్థాయిలను పరీక్షిస్తున్నపుడు పేషెంట్ వయసు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ►ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ... లక్షణాలు అలాగే కొనసాగితే మరోసారి టెస్టు చేయించుకోవాలి. ►ఐసోలేషన్ ఉన్నవారు మందులను సరైన మోతాదులో, సరైన సమయంలో వాడితేనే ఉపయోగం ఉంటుంది. ►ఐసోలేషన్‌లో వాడే ఏ మందులైన డాక్టర్ల సలహా మేరకే వాడాలి. ►బీపీ, షుగర్, గుండెజబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 ఏళ్లకు పైబడిన పేషెంట్లు డాక్టర్లను సంప్రదించాకే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ►హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లు తప్పకుండా మూడు పొరల మాస్క్‌ను వాడాలి, ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి దాన్ని మార్చాలి. ►ఒకరికొకరు ఎదురుపడాల్సిన పరిస్థితుల్లో పేషెంట్, సహాయకుడు ఇద్దరూ ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ►అజిత్రోమైసిన్ టాబెట్ల వాడొద్దని కోవిడ్ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. -
‘పొరుగు’ రోగులను ఇబ్బంది పెట్టట్లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం వచ్చే పొరుగు రాష్ట్రాల కోవిడ్–19 బాధితులను ఏమాత్రం ఇబ్బంది పెట్టడంలేదని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇక్కడి ఆస్పత్రుల్లో ముందుగా బెడ్ రిజర్వ్ చేసుకుని వస్తే మంచిదని, బెడ్ లేకుండా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడటం సరికాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వస్తున్న రోగులను అడ్డుకుంటున్నట్లు వస్తున్న విమర్శలపై శ్రీనివాసరావు ఈమేరకు స్పందించారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోని 45 శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతోనే నిండిపోయాయని తెలిపారు. కొందరు కోవిడ్–19 బాధితులు చికిత్స కోసం ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నారని, సకాలంలో చికిత్స దొరక్క ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా బెడ్ రిజర్వ్ చేసుకుని ఆస్పత్రితో యాజమాన్యంతో ఇక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ నుంచి అనుమతి తీసుకుంటే సరిపోతుందన్నారు. ‘బెడ్ రిజర్వ్ చేసుకున్న ఆస్పత్రి వర్గాలు ప్రభుత్వానికి నిర్ణీత పద్ధతి ప్రకారం రోగి సమాచారాన్ని అందిస్తాయి. దాన్ని పరిశీలించి, వెంటనే అనుమతి జారీ చేస్తాం. ఆ ధ్రువీకరణ పత్రాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న పోలీసు బృందాలకు పంపిస్తాం. వారు దాన్ని పరిశీలించి వెంటనే రోగులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. చాలా సులభంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. రిజర్వ్ చేసుకున్న బెడ్‌ను మరో రోగికి కేటాయించడానికి వీల్లేదు’అని ఆయన చెప్పారు. దీని వల్ల ఇతర రాష్ట్రాల నుంచి రోగి రాగానే చికిత్స మొదలు పెట్టడానికి అవకాశం కలుగుతోందన్నారు. నిమిషాలు, గంటల వ్యవధిలోనే కంట్రోల్ రూమ్ నుంచి అనుమతులు ఇస్తున్నామని, శుక్రవారం ఐదుగురు పేషెంట్లకు ఈ తరహాలో అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. బిహార్, ఢిల్లీ నుంచి కూడా పేషెంట్లు.. రాష్ట్రంలోని 17 జిల్లాలు పొరుగు రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నాయని, సరిహద్దు రాష్ట్రాలే కాకుం డా బిహార్, ఢిల్లీ నుంచి కూడా పేషెంట్లు హైదరాబాద్‌కు వస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 15–20 పెద్ద ఆస్పత్రుల్లోనే బెడ్లకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. ఆస్పత్రుల వారీగా బెడ్ల లభ్యతపై లైవ్ డాష్ బోర్డ్ తీసుకొచ్చామని, పేషెంట్ ఏదైనా ఆస్పత్రికి వెళ్లడానికి ముందు రోగి పరిస్థితిని బట్టి నోడల్ ఆఫీసర్ ఆస్పత్రిలో మాట్లాడి అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. అలాంటప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందవచ్చని సూచించారు. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పడకల వివరాలను లైవ్‌లో అప్డేట్ చేస్తున్నా మని, నాణ్యమైనవైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభు త్వం కేటాయిస్తున్న ఆక్సిజ¯Œ ఏ రోజుకి ఆ రోజే సరిపోతోందని, దీంతో ఆక్సిజ¯Œ ఆడిట్ విధానం పెట్టుకున్నామన్నారు. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావొచ్చన్నారు. సెకండ్‌వేవ్‌లో పరిస్థితులు పూర్తి భిన్న ంగా ఉన్నాయని, గతంలో ఎవరైనా కరోనా బాధి తుడు ఆస్పత్రిలో చేరితే వారంలో డిశ్చార్జి అయ్యేవారని, ఇప్పుడు 2–3 వారాలు పడుతోందన్నారు. రాష్ట్రంలో 18 వేల బెడ్స్ ఉంటే 53 వేలకు పెం చారని, ఇతర రాష్ట్రాల వారినే కాకుండా మన రాష్ట్రంలోని వారికి కూడా మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య శాఖపై ఉందని చెప్పారు. -
Telangana Check Post: మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వస్తున్నామా?
తిరుపతికి చెందిన అబ్దుల్లా (38) కరోనా బారిన పడడంతో స్థానికంగా వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆయన భార్య హుటాహుటిన అంబులెన్స్ మాట్లాడుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. కానీ తెల్లవారుజామున 5.30 గంటలకు గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. దాంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా బెడ్స్ ఖాళీలేవన్నారు. తన భర్త ప్రాణాలు కాపాడాలంటూ ఆమె వేడుకున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. విష యం తెలుసుకున్న ఇన్చార్జి కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అబ్దుల్లాను ఆస్పత్రిలో చేర్పించారు. పేరు లత. స్వస్థలం విజయనగరం జిల్లా. కరోనా బాధితురాలు. పరిస్థితి విషమించిందని వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు బయలుదేరారు. దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వారిని.. కోదాడ మండలం రాంపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపేశారు. అనుమతి లేదని చెప్పడంతో విధిలేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లతో వచ్చిన అంబులెన్సులను పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపేశారు. హైదరాబాద్‌లో ఆస్పత్రి బెడ్ అలాట్మెంట్, కోవిడ్ కంట్రోల్ రూం పాస్ ఉంటేనే పంపిస్తామంటూ ఆపేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించి, ఆక్సిజన్ పెట్టుకుని వచ్చిన పేషెంట్లను కూడా వదిలిపెట్టలేదు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక్కొక్కటిగా వరుసగా వచ్చిన అంబులెన్సులు సరిహద్దుల వద్ద బారులు తీరాయి. కంట్రోల్ రూం పాస్ లేని ఖాళీ అంబులెన్స్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా పోలీసులు తిప్పి పంపించేశారు. గద్వాల పోలీసులు 20కిపైగా అంబులెన్సులను నిలిపివేశారు. కోదాడలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన అంబులెన్సులు బారులు తీరాయి. అంతదూరం వచ్చిన అంబులెన్సులను వెనక్కి పంపడంతో రోగుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దామరచర్ల, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు, భద్రాచలం చెక్‌పోస్టుల వద్దా ఇదే పరిస్థితి కనిపించింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చేవారు, కర్ణాటక ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్కారు ఆదేశాలతో.. పొరుగు రాష్ట్రాల కోవిడ్ పేషెంట్లు చికిత్స కోసం తెలంగాణలోని ఆస్పత్రులకు వస్తే.. ఆస్పత్రి అంగీకార పత్రం ఉండాలని, కోవిడ్ కంట్రోల్ రూంకు వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో గురువారం వరకు ఆస్పత్రి కన్ఫర్మేషన్ ఉంటే అంబులెన్సులను అనుమతించిన పోలీసులు.. కంట్రోల్ రూం నుంచి లెటర్ లేదంటూ శుక్రవారం తెల్లవారుజాము నుంచే నిలిపివేశారు. పుల్లూరు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత ఏపీ వైపు నుంచి వస్తున్న కోవిడ్ అంబులెన్సులను ఆపేయడంతో జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 23 అంబులెన్సులను సరిహద్దుల నుంచే వెనక్కి పంపించారు. రెండు అంబులెన్స్‌లకు కంట్రోల్ రూం లేఖలు ఉండటంతో అనుమతించారు. మరికొందరు పేషెంట్ల బంధువులు అంబులెన్సులతో సరిహద్దుల వద్దే వేచి చూశారు. అంబులెన్సులను అడ్డుకుంటున్న విషయం తెలిసి ఏపీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్లు చెక్‌పోస్టు వద్దకు వచ్చారు. అంబులెన్స్‌లకు అనుమతి ఇవ్వాలంటూ గద్వాల ఎస్పీ, స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ క్రమంలో కోవిడ్ రోగుల బంధువులు, ఏపీ బీజేపీ కార్యకర్తలు పుల్లూరు చెక్‌పోస్టు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక సందర్భంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్లు చెక్‌పోస్టు వద్ద మోహరించి బందోబస్తు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత అంబులెన్స్‌లకు అనుమతి ఇచ్చారు. రాత్రి 10 గంటల వరకు 12 అంబులెన్స్‌లకు హైదరాబాద్‌కు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోనూ.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్ అంబులెన్సులను కూడా సరిహద్దుల్లో అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద అంబులెన్సులను తిప్పి పంపేశారు. బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు వేడుకున్నా.. తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. కాళ్లుపట్టుకుంటాం.. వదలండి.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే కోవిడ్ అంబులెన్సులను అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకే సుమారు 14 అంబులెన్స్‌లు తిప్పిపంపారు. హైదరాబాద్‌లోని ఆస్ప త్రుల్లో బెడ్ మంజూరు చేసిన పత్రం, కోవిడ్ కంట్రోల్ రూం అనుమతి ఉన్న కొద్దిమందిని మాత్రమే అనుమతించారు. బెడ్ ఉన్నా కంట్రోల్ రూం లేఖ లేకుంటే అనుమతి ఇవ్వలేదు. దీంతో కోవిడ్ పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఆందో ళన వ్యక్తం చేశారు. పరిస్థితి విషమంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటూ.. కాళ్లు పట్టుకుంటామంటూ బతిమాలారు. విజయనగరం నుంచి వచ్చిన లత, ఏలూరు నుంచి వచ్చిన రాజేశ్వరి, తిరుపతి నుంచి వచ్చిన అబ్దుల్లాల బంధువులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాది భారతదేశం కాదా.. మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వస్తున్నామా? ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని అడ్డుకోవడం ఏమిటి’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకైనా వదులుతారేమోనన్న ఆశతో కొందరు చెక్‌పోస్టు వద్దే ఎదురుచూశారు. కొందరి అంబులెన్సులలో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోవడంతో.. జగ్గయ్యపేట, నందిగామ నుంచి తెప్పించుకున్నారు. తిరిగి వెళ్తున్న క్రమంలో ఇద్దరు పేషెంట్లు చనిపోయినట్లు తెలిసింది. కాగా.. అంబులెన్సులను ఆపేశారన్న విషయం తెలిసిన ఏపీ ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రామాపురం క్రాస్‌రోడ్డుకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. కరోనాతో ప్రాణాలు పోతుంటే.. ఎక్కడా లేనట్టు తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్‌లు నిలిపివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతుంటే.. ఆపేస్తారా? కరోనాతో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి సీరియస్ అవుతోందని.. అన్నీ సమకూర్చుకుని, కంట్రోల్ రూం లెటర్ తీసుకుని బయల్దేరే సమయం ఎక్కడ ఉందని కరోనా రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమవారి ప్రాణాలు కాపాడుకునేందుకు అంత దూరం నుంచి వస్తే.. ఆంక్షల పేరుతో వెనక్కి పంపడమేంటని మండిపడ్డారు. తమను అనుమతించాలని కోరారు. కన్నీళ్లు పెట్టుకుంటూ.. కాళ్లు పట్టుకుంటామని బతిమాలారు. అయినా తామేమీ చేయలేమని.. ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నామని పోలీసులు చేతులెత్తేశారు. చివరికి చేసేదేమీ లేక కరోనా పేషెంట్ల బంధువులు ఆవేదనతోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం అనుమతి ఇవ్వకపోతారా అన్న ఆశతో చెక్‌పోస్టుల వద్ద వేచి ఉన్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలు రావడంతో పోలీసులు సాయంత్రం ఆరేడు గంటల సమయం నుంచి అంబులెన్సులను వదిలిపెట్టారు. -
ఇక తెలంగాణలో ప్రవేశానికి ఇవి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేసింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్ రూమ్‌కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది. 040–24651119 లేదా 94944 38251 వాట్సాప్ లేదా ఐడీఎస్పీఎట్తెలంగాణ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌కు వివరాలను పంపాలని తెలిపింది. రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబర్, రిజర్వ్ చేసిన బెడ్ టైప్ తదితర సమాచారాన్ని ఆస్పత్రి యాజమాన్యం కంట్రోల్ రూమ్‌కు పంపిస్తే.. వారికి అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని వివరించింది. ఈ పత్రం ఆధారంగా రాష్ట్రంలో ప్రయాణించి ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ( చదవండి: వైరల్: కరోనా బాధితులతో డాన్స్ చేయించిన నర్సులు ) -
బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఇద్దరు మృతి!
సాక్షి, గాంధీ ఆస్పత్రి/ భైంసా/భైంసా టౌన్ (ముథోల్): కరోనా నుంచి కోలుకున్న తర్వాత, కరోనా చికిత్స పొందుతున్న కొందరిలో బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో ఈ ఫంగస్ సోకి ఇద్దరు చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ తీవ్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాగే కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కూడా వేరే ఆస్పత్రులు, ప్రాంతాల నుంచి రిఫరల్‌పై వచ్చారని తెలిసింది. ఫంగస్ సోకిన ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్ సాధారణ వ్యాధేనని, కరోనా మొదటి వేవ్‌లో కూడా పలువురు బ్లాక్ ఫంగస్ బారినపడ్డారని గుర్తుచేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, కరోనా రోగులు, కోవిడ్ నుంచి కోలుకున్న వారు, స్టెరాయిడ్ మందులు వినియోగించేవారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ సోకుతుంది. ఇద్దరి మృతిపై అనుమానాలు..? భైంసా డివిజన్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారన్న అనుమానాలు స్థానికులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. భైంసా మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి, కుభీర్ మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలతోనే మృతి చెందారని అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉండే మరో వ్యక్తి, కుభీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇవే లక్షణాలతోనే హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కంటి చూపు కోల్పోవడం, ముక్కులో ఇన్ఫెక్షన్ తదితర లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించలేదు. భైంసా డివిజన్.. మహారాష్ట్రకు సరిహద్దున ఉండటం, ఇదే రకం కేసులతో అక్కడ చాలామంది మృతి చెందినట్లు తెలిసింది. లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కన్పిస్తున్నాయి. కోవిడ్ బారిన పడి కోలుకున్న మధుమేహం బాధితులు, క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నవారు ఈ ఫంగస్ బారిన పడుతున్నారు. భైంసా డివిజన్లో ఈ లక్షణాలతోనే ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. అలాగే భైంసా డివిజన్‌కు చెందిన మరో ఇద్దరు ఇవే లక్షణాలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ ఫంగస్ బారిన పడినవారు వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే కంటిచూపుతో పాటు కోలుకునే అవకాశాలు తక్కువ. అందుకే కరోనా నుంచి కోలుకున్న తరువాత ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – కాశీనాథ్, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్, భైంసా బ్లాక్ ఫంగస్ ఏంటి? బ్లాక్ ఫంగస్, ‘మ్యూకోర్మైకోసిస్’గా పిలిచే ఈ వ్యాధి కొత్తదేం కాదు. గతంలో కూడా ఉంది. కానీ తాజాగా కోవిడ్ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకోర్’ అనే ఫంగస్ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరితో ప్రాణాపాయం తప్పదు అంటున్నారు నిపుణులు. బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించడం ఎలా... బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్ లెవల్స్ సడెన్‌గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ సోకిందని అనుమానించాలి. ( చదవండి: మీరు డాక్టరా..? అయితే రూ.2 వేలు ) -
కామారెడ్డి ఆస్పత్రి లో కోవిడ్ పేషెంట్ల తో కలిసి నర్సుల డాన్స్
-
కరోనా: కోలుకున్నా ఇళ్లకు వెళ్లని రోగులు.. సీఎం ఆగ్రహం
శివాజీనగర: కరోనా నుంచి కోలుకున్నా ఇళ్లకు వెళ్లకుండా కరోనా బాధితులు ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రోగుల తీరుపై సీఎం యడియూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నాటకలోని శివాజీనగరలో మంగళవారం కోవిడ్ వార్ రూమ్‌లను సీఎం తనిఖీ చేశారు. సుమారు 503 మంది 20 రోజులు ఆస్పత్రుల్లో ఉండి కోలుకున్నారు. అయితే వారంతా డిశ్చార్జ్ అయ్యే ఆలోచనలో లేనట్లు తెలుస్తోందన్నారు. బెడ్ల కొరత ఉండడంతో కోలుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని ఈ సంద్భంగా ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. టీకాలు వచ్చిన తక్షణమే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు. వార్ రూంల సిబ్బంది సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి -
షాకింగ్: 6 వేల మంది కరోనా బాధితుల అదృశ్యం?
సాక్షి, బనశంకరి: రాజధాని బెంగళూరులో కరోనా రక్కసి ఉధృతి కొనసాగడానికి వైరస్ సోకిన కొన్ని వేలమంది అదృశ్యమైనట్లు ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలో దాదాపు 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో 10,835 మంది అదృశ్యం కాగా వారి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. ప్రస్తుతం మళ్లీ 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో సిలికాన్‌సిటీ వాసుల్లో తీవ్ర ఆందోళన ఉంది. తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు మొబైళ్లు సిచ్చాఫ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వారిని కనిపెట్టడం పోలీసులు తలనొప్పిగా మారింది. వీరు మరింతమందికి కరోనా అంటిస్తారనే భయం నెలకొంది. -
ఆస్పత్రి నుంచి 23 మంది కరోనా బాధితులు పరార్
ఢిల్లీ: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యారు. ఆస్పత్రి సిబ్బందికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లారో తెలియదు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 23 మంది ఆస్పత్రి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఢిల్లీలోని బారా హిందూ రావ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మాయమవుతుండడంతో ఆస్పత్రి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) మేయర్ జై ప్రకాశ్ వెల్లడించారు. హిందూ రావు ఆస్పత్రిలో మొత్తం 250 బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా ఆస్పత్రిగా మార్చారు. బెడ్లన్నీ ఎప్పుడూ నిండుగా ఉంటున్నాయి. అయితే రికార్డుల్లో ఏప్రిల్ 19 నుంచి మే 6వ తేదీ వరకు జాబితా పరిశీలించగా 23 మంది కనిపించలేదు. వారు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారని గుర్తించారు. అయితే ఆ కరోనా బాధితులు మంచి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రిలో చేరేందుకు వెళ్లి ఉంటారని మేయర్ చెప్పారు. ఈ విధంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగడం సాధారణంగా మారిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ చదవండి: హిందూ యువతికి పాక్‌లో అత్యున్నత పదవి -
కరోనా కాదు.. ముందు భయాన్ని వీడండి.. థింక్ పాజిటివ్
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్లో ఉంటూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడంతో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా చిన్న చిట్కాలతో కరోనాను చిత్తు చేశారు. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగాతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసి శ్వాస సంబంధ సమస్యలు అధిగమించారు. కుటుంబసభ్యులు, బంధువులతో వీడియో కాలింగ్, ఛాటింగ్ చేస్తూ ఒంటరితనాన్ని దూరం చేస్తూ ఆనందంగా గడిపారు. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవల్స్ తగ్గకుండా చూసుకున్నారు. వేడినీళ్లు మాత్రమే తాగుతూ, ఉప్పు, పసుపు వేసిన నీటిని గొంతులో పోసుకుని గార్గిల్ చేస్తూ, రెండు పూటలా ఆవిరిపట్టారు. గదిలో ఒంటరిగా ఉన్నామనే భావన మనసులోకి రానీయకుండా, ఒత్తిడి కలిగించే అంశాలను ఆలోచించకుండా, కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో క్వారంటైన్‌ను మామూలు రోజుల్లాగే కామన్‌గా గడిపారు. గడువు ముగిసిన తర్వాత నిర్వహించిన వైద్యపరీక్షల్లో నెగిటివ్ రావడంతో కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. హోంఐసోలేషన్లో ఉంటూ కరోనాపై విజయం సాధించిన పలువురు సలహాలు, సూచనలతోపాటు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ధైర్యమే బతికించింది నా వయసు 65 ఏళ్లు.. మాది ఉమ్మడి కుటుంబం. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. టెస్ట్ చేయిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో జాయిన్ చేస్తామంటే వద్దని, హోంఐసోలేషన్లో ఉంటానని చెప్పాను. తర్వాత కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. నలుగురం కలిసి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఉన్నాం. పల్స్ ఆక్సిమీటర్ తెప్పించుకున్నా. ప్రతిరోజు ఉదయం ప్రాణాయామం, యోగా సాధన. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వీడియో కాలింగ్, చాటింగ్ చేసుకుంటూ ఆనందంగా గడిపాను. 14 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగిటివ్ వచ్చింది. – మణెమ్మ, శ్రీనివాసనగర్, సీతాఫల్మండి భయాందోళన వద్దు కరోనా పాజిటివ్ వస్తే భయాందోళన వద్దు. గతనెల 5వ తేదీన నాకు, మానాన్న నర్సింగ్‌రావుకు ఒకేరోజు జ్వరం వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకున్నాక జ్వరం తగ్గింది. వైద్యుల సూచన మేరకు కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. హోంక్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా నాన్న అందించిన ధైర్యంతో భయాన్ని పోగొట్టింది. ఆవిరి పట్టడం, కషాయం తాగడం, పోషకాహారం తినడంతోపాటు మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చే సంగీతం, పాటలు వింటూ ఆనందంగా గడిపాం. అమ్మ సహకారంతో హోంక్వారంటైన్ పూర్తిచేశాం. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. – లక్ష్మీప్రియ, ప్రైవేటు ఎంప్లాయి, న్యూబోయిగూడ జాగ్రత్తలు పాటించా.. నేను కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో నాల్గవ తరగతి కాంట్రాక్ట్ ఉద్యోగిని. కరోనా బాధితుల మధ్యే సేవలు అందిస్తుంటాను. ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురికావడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంట్లో భార్యతోపాటు ముగ్గురు చిన్నపిల్లలు, వృద్ధురాలైన అమ్మ ఉన్నారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఇతర వైద్యులు ఆస్పత్రిలో బాధితులకు ఇచ్చే కౌన్సిలింగ్ గుర్తుకు వచ్చింది. అవసరమైతేనే ఆస్పత్రికి రావాలి. జాగ్రత్తలు పాటిస్తే సులభంగా తగ్గిపోతుంది. ఆ మాటలు గుర్తొచ్చి 14 రోజులు హోంక్వారంటైన్లో ఉన్నాను. ఇప్పుడు కరోనా నెగిటివ్ వచి్చంది. – గణపతి, గాంధీఆస్పత్రి స్టాఫ్ మెదడులో హార్మోన్ల సంఖ్య తగ్గి.. తీవ్రమైన భయాందోళనకు గురికావడం వల్లే కరోనా మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒత్తిడి పెంచే అంశాలు వలన మెదడులోని హార్మోన్ల సంఖ్య తగ్గి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయవు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మవద్దు. ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా తగ్గుతుందని వీడియోను చూసిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా బాధితులు మధుర క్షణాలను మాత్రమే గుర్తుచేసుకుని ఆనందంగా ఉండాలి. గాంధీ ఆస్పత్రిలో ప్రతిరోజూ వందలాది మంది బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ఆలోచన విధానంలో మార్పు తెచ్చి స్వస్థత చేకూర్చేందుకు కృషి చేస్తున్నాం. – జూపాక అజయ్‌కుమార్, సైకియాట్రిస్ట్ ( చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ ) -
కోవిడ్ బాధితులకు పఠాన్ సోదరుల సాయం
న్యూఢిల్లీ: కరోనా వల్ల అతలాకుతలం అయిన ఢిల్లీ ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముందుకొచ్చాడు. మహమ్మారి వల్ల పూట గడవడం కూడా కష్టమైన దక్షిణ ఢిల్లీ ప్రజలకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనున్నట్లు పఠాన్ తెలిపాడు. క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ (సీఏపీ) ద్వారా ఈ సేవా కార్యక్రమం జరగనున్నట్లు అతను స్పష్టం చేశాడు. ‘ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం ప్రస్తుతం మన ముందున్న కనీస బాధ్యత. అందుకే సీఏపీ ద్వారా దక్షిణ ఢిల్లీలో ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా’ అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్, అతని సోదరుడు యూసుఫ్ పఠాన్ 4 వేల మాస్క్‌లను అందజేశారు. మార్చిలో రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్లో పాల్గొన్న ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. -
వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి!
సాక్షి హిమాయత్‌నగర్: బద్వెల్ నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి యాదవ్‌రావు(65)ను అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 70శాతం ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. కుటుంబ సభ్యులు అతడిని కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 45 నిమిషాల తర్వాత ఒక నర్సు వచ్చి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ చెక్ చేయగా.. 72 ఉంది. అడ్మిట్ చేసుకుంటారో.. లేదో అనే ఆందోళనతో అదే అంబులెన్స్‌లో గంటల తరబడి వేచి చూశారు. గంటన్నర తర్వాత వెంటిలేటర్ లేదనడంతో తిరిగి మరో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఓ పక్క భర్త పరిస్థితి చూడలేక.. మరో పక్క బెడ్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్‌తో భార్య కన్నీటి పర్యంతమైంది.. మరో ఘటనలో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ 82 ఉంది. వెంటిలేటర్ బెడ్ లేదన్నారు. ఇంకో ఘటనలో యువకుడి పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. చేర్చుకోలేమని పంపేశారు. ఇదీ కింగ్‌కోఠి ఆస్పత్రిలో వెంటిలేటర్ బెడ్లు లేక రోగులు, రోగుల బంధువులు పడుతున్న అవస్థలు. గాంధీ ఆస్పత్రిలోని బెడ్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. కింగ్‌కోఠి ఆస్పత్రికి వస్తే నయం అవుతుందనే నమ్మకంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వస్తున్న రోగులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పడకలన్నీ ఫుల్ కావడంతో గాంధీకి వెళ్లిపోండంటూ మోహంపై చెప్పేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే గంటన్నర వ్యవధిలో 12మంది పేషెంట్లు కింగ్‌కోఠికి వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. వారంలో వందకు పైగా.. ప్రాణాలను నిలబెట్టుకునేందుకు వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. వచ్చిన వెంటనే ఇక్కడ బెడ్స్ లేవమ్మా.. వెళ్లిపోండి. టైం వేస్ట్ చేసుకోవద్దంటున్నారు. తిరిగి గాంధీకి వెళ్లలేక ప్రైవేటు ఆస్పత్రిని భరించలేక వెనుదిరుగుతున్నారు. ఇలా వారం రోజుల్లో సుమారు 100మందికి పైగా సీరియస్ కండీషన్లో ఉన్న వారు తిరిగి వెళ్లిపోయారు. వెంటిలేటర్లు పెంచితే.. కింగ్‌కోఠి ఆస్పత్రి చాలా విశాలంగా, సామర్థ్యం కలిగిన ఆస్పత్రి. ఇక్కడ సదుపాయాలను గుర్తించి ప్రభుత్వం వెంటిలేటర్ బెడ్స్ ఏర్పాటు చేయగలిగితే ఎందరో ప్రాణాలను రక్షించినవారవుతారు. కేవలం వెంటిలేటర్ బెడ్స్ లేక నిస్సహాయ స్థితిలో వెనుదిరుగుతున్న తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఒకరు చనిపోతే.. లేదా డిశ్చార్జి అయితేనే మరొకరిని వెంటిలేటర్‌పైకి తీసికెళ్లే పరిస్థితి కింగ్‌కోఠిలో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘చాలా మంది వెళ్లిపోతున్నారు’ ఎంతమంది వస్తున్నారు.. ఎంతమంది వెళ్లిపోతున్నారనేది చెప్పలేం. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 86కంటే ఎక్కువ ఉంటేనే మేం తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి వెంటిలేటర్ బెడ్స్ అన్నీంటిలోనూ పేషెంట్లు ఫుల్‌గా ఉన్నారు. ఎమర్జెన్సీపై వస్తున్న వారిని తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఉన్నవరకు మేం పేషెంట్లకు నయం చేసి బయటకు పంపిస్తున్నాం. – డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్, కింగ్‌కోఠి ఆస్పత్రి చదవండి: లాక్డౌన్ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు: హైకోర్టు -
ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి
సాక్షి, అనంతపురం: ప్రాణవాయువు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అనంతపురము సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 8-9 గంటల మధ్యన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని తెలిపారు. లోపాలు సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తెలిపారు. చదవండి: మన ప్రాణాల కన్నా ప్రధానికి అతడి స్వార్థమే ముఖ్యం చదవండి: అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు -
కరోనా: ఆసుపత్రి బయట టీ, కాఫీలకు వెళ్లొస్తున్న రోగులు
సాక్షి, హిమాయత్‌నగర్: కోవిడ్‌కు గురై కింగ్‌కోఠి ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులు కాస్తంత తేరుకున్నాక బయటకెళ్లొస్తున్నారు. పక్క బెడ్ వారికి ఓ మాట చెప్పేసి బయటకు వెళ్లి అలా ఓ టీ లేదా కాఫీ తాగి కొద్దిసేపు చెట్ల కింద కూర్చుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలేవీ కూడా అక్కడున్న సిబ్బంది, సూపరింటెండెంట్, నోడల్ అధికారి, స్టాఫ్ నర్సులకు కానీ అస్సలు తెలియడం లేదు. సిబ్బంది కారణంగా ఏ ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ లేని కారణంగా కోవిడ్ రోగులు ఇష్టారాజ్యాంగా బయటకెళ్లొస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు బెడ్లకు ఒకరు ఉండాలి ఆస్పత్రిలో మొత్తం మీద 350 పడకలు ఉన్నాయి. వీటిలో 50 ఐసీయూ పడకలు, 33 వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. మిగిలినవన్నీ ఆక్సిజన్ బెడ్సే. అయితే ఐసీయూలో పేషెంట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రతి ఐదు బెడ్లకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ.. ఇక్కడ జరుగుతుంది వేరు. ఐసీయూలోని వెంటిలేటర్ బెడ్ల వద్ద వైద్యుడి పర్యవేక్షణ కొరవడింది. దీనికి కారణం వైద్యులు తక్కువ ఉండటమే. ఆస్పత్రి మొత్తం సూపరింటెండెంట్, అడిషినల్ సూపరింటెండెంట్, నోడల్ అధికారి వంటి వారితో కలిపి సీనియర్, జూనియర్, డిప్యూటేషన్‌పై వచ్చిన వారు ఇలా మొత్తం మీద 28 మంది వైద్యులు ఉన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టు మొదలుకొని వ్యాక్సిన్ వేసే వరకు అన్ని చోట్ల వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీని కారణంగా ఐసీయూలో సరైన పాత్ర పోషించలేని పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది కొరతతోనే.. వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్, 4వ తరగతి ఉద్యోగుల కొరత సైతం తీవ్రంగా పట్టి పీడిస్తుంది. దీని కారణంగా కోవిడ్ రోగుల వద్ద సరైన పర్యవేక్షణ లేదు. రోగులను పట్టించుకునే వారు లేరు. దీంతో కాస్త కోలుకున్న కోవిడ్ రోగులు లోపల వార్డులో ఉండలేక ఆస్పత్రి బయటకు వెళ్లి మరీ టీ తాగి, కాస్త కాలక్షేపం చేసి వస్తున్నారని సీనియర్ వైద్యులు బహిర్గతంగా చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు చెప్పినప్పటికీ.. ఎవరూ కరోనా రోగి ఎవరూ అటెండెంట్ అనేది తాము గుర్తించలేమనే జవాబు ఎదురవుతుంది. ఇలా పేషెంట్లు బయటకు వెళ్లి వస్తే వారి నుంచి ఇతరులకు కోవిడ్ సోకే ప్రమాదం పొంచి ఉందని సిబ్బంది వాపోతున్నారు. మూడు రోజుల క్రితం ఒక పేషెంట్ ఏకంగా ఉద యం అనగా వెళ్లి రాత్రి 7 గంటలకు తిరిగి రాకపోవడాన్ని ‘సాక్షి’ ప్రచురించిన విషయం విధితమే. కోవిడ్ బారీన పడుతున్న సిబ్బంది కింగ్ కోఠి ఆస్పత్రి సిబ్బంది సైతం కోవిడ్ బారిన పడుతుండటంతో మరింత పనిభారం ప్రస్తుతం చేస్తున్న వారిపై పడుతుంది. ప్రతిరోజూ టెస్టుల కోసం వచ్చే వారి ఓపీ 350 నుంచి 400 మధ్య ఉంటుంది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, వైద్యులు అదే విధంగా కోవిడ్ వార్డులో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది, 4వ తరగతి ఉద్యోగులు సైతం కరోనాకు గురవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా 35 మందికి పైగా సిబ్బ ందికి కరోనా వ్యాపించింది. వారందరూ తిరిగి కోలుకుని విధులకు హాజరవుతున్నప్పటికీ.. మరికొంత మందికి మళ్లీ వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఆరుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కట్టడి చేసే దిశగా ఆలోచిస్తున్నాం కొద్దిగా తేరుకున్నాక కొందరు రోగులు బయటకు వెళ్లి వస్తున్న విషయం తెలిసింది. అటెండెంట్స్ వచ్చి మా పేషెంట్ ఎక్కడా అని మమ్మల్నే అడుగుతున్నారు. వారం రోజుల క్రితం శంకర్ అనే యువకుడు ఉదయం 7 గంటల ప్రాంతంలో వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి మళ్లీ వచ్చాడు. ఈ విషయంపై నారాయణగూడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఆ పరిణామాలను కట్టడి చేసే దిశగా ఆలోచిస్తున్నాం. – డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్, కింగ్‌కోఠి ఆస్పత్రి చదవండి: కరోనా టెస్ట్ చేయలేదని వ్యక్తి హల్చల్! -
కోవిడ్ బాధితుల కోసం ఉచిత ఆక్సిజన్ హబ్‌లు..
సాక్షి, మియాపూర్: నగరంలో రోజు రోజుకు కరోనా రెండో దశ వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. దీంతో కరోనా బారిన పడిన వారికి ఆస్పత్రిలో బెడ్స్ దొరకక, ప్రాణవాయువు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకడం ఎంతో కష్టంగా మారింది. ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన సంఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కొన్ని కార్పొరేట్ సంస్థల సహకారంతో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. చందానగర్ సర్కిల్–21 పరిధిలో రెండు చోట్ల ఆక్సిజన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్‌లలో పడకలతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో శ్వాస సమస్య తో బాధపడేవారు ఈ హబ్‌లలో ఉచితంగా చికిత్స పొందవచ్చు. కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినట్లయితే కూడా ఈ హబ్‌లలో చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఆక్సిజన్ హబ్‌లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ► చందానగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ, ఐకియా సహకారంతో కోవిడ్ బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఐకియా సంస్థ ఆక్సిజన్ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఐకియా సంస్థ సొంత నిధులతో ఆక్సిజన్ హబ్ ఏర్పాట్లకు కావాల్సిన యంత్రాలు, బెడ్స్‌ను సమకురుస్తోంది. ►మొదటి దశలో భాగంగా చందానగర్‌లోని హుడా కాలనీ కమ్యూనిటీ హాల్లో 30 పడకలతో ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ► అదే విధంగా త్వరలోనే మియాపూర్ డివిజన్ పరిధిలో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సమయత్తం అవుతున్నారని అధికారులు తెలిపారు. ► హుడాకాలనీ కమ్యూనిటీహాల్ ఆక్సిజన్ హబ్‌లో టెలి మెడిసిన్ సౌకర్యాన్ని కూడా సమకురుస్తున్నారు. ► కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే కూడా ఈ హబ్‌లలో ఉచితంగా చికిత్స పొందవచ్చని అధికారులు తెలిపారు. ఉచితంగా సేవలు పొందవచ్చు.. కరోనా లక్షణాలు లేకపోయిన శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆక్సిజన్‌ను ఉచితంగా అందించేందుకు చందానగర్‌లోని హుడా కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తు న్నారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్సిజన్ హబ్‌ల పనులను వేగవంతం చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ఎంతో మంది బెడ్స్, ఆక్సిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ కేంద్రాలలో ఉచితంగా సేవలు పొందవచ్చు. – సుధాంశ్, డీసీ చందానగర్ సర్కిల్–21 -
ఆక్సిజన్ కొరత: డాక్టర్ సహా, ఎనిమిది మంది మృతి
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రం వేధిస్తోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రులు ఆక్సిజన్ సప్లయ్ లేక అల్లాడి పోతున్నాయి. తాజాగా డిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ లేకపోవడంవల్ల ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఆర్.కె. హిమాథని ఉండటం మరింత విషాదాన్ని నింపింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో 5గురి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. దేశ రాజధానిలో ఆక్సిజన్ సంక్షోభంపై వరుసగా 11వ రోజు ఢిల్లీ హైకోర్టుకులో విచారణ జరిగింది. తమ వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వలు అయిపోతున్నాయని తక్షణమే స్పందించాలని వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు వేడు కుంటున్నాయి. అంతకుముందు బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుధాన్షు తాము ఆక్సిజన్ సంక్షోభంలో ఉన్నామనీ, రాబోయే 10 నిమిషాల్లో పూర్తిగా అయిపోతుందని, ఆదుకోవాలంటూ ఒక వీడియోను విడుదల చేయడం గమనార్హం. కానీ అధికారులు తేరుకుని ఆక్సిజన్ రీ సప్లై ట్యాంకర్ చేరుకునేసరికే అనర్థం జరిగిపోయింది. రోగుల ప్రాణాలను రక్షించడంలో కీలకమైన ఆక్సిజన్ అందక ఊపిరి ఆగి పోతున్న వైనాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. అంతా అయిపోయిన 45 నిమిషాల తరువాత ట్యాంకర్ చేరుకుందని, అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. చదవండి: విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి -
గుజరాత్: భారుచ్ కోవిడ్ ఆసుపత్రిలో విషాదం
-
ఇది ఆటో కాదు భాయ్.. ప్రాణాలు నిలిపే అంబులెన్స్..
రాంచీ: దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే అనేక మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. మొదటి దశ కంటే సెకండ్‌వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని అనేక ఆసుపత్రుల్లో సరైన మందులు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పీపీఈ కిట్లు అందుబాటులో లేక కరోనా బాధితులు నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికే కొందరు మాయగాళ్లు ఈ మందులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల కరోనా బాధితులను ఆసుపత్రికి చేర్చే అంబులెన్స్ వారు కూడా అధిక మొత్తంలో డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా ఓ ఆటో డ్రైవర్ మాత్రం కరోనా పేషెంట్ల కోసం తన వంతు సాయం చేయాలని సంకల్పించుకున్నాడు. భోపాల్ నగరానికి చెందిన జావేద్ఖాన్ అనే ఆటో డ్రైవర్ కోవిడ్ బాధితుల కోసం ఏదైనా చేయలనుకున్నాడు. ఈ క్రమంలో కరోనా బాధితులు అంబులెన్స్‌ల కొరతతో బాధపడుతున్నారని తెలుసుకున్నాడు. వెంటనే తన ఆటో రిక్షానులో మొబైల్ అంబులెన్స్‌గా మార్చాడు. అంతటితో ఆగకుండా, దాంట్లో ప్రథమ చికిత్సకు అవసరసరమయ్యే కిట్, ఆక్సిజన్ సిలిండర్ , శానిటైజర్, మందులను ఏర్పాటు చేశాడు. ఈ ఆటో రిక్షాను కరోనా బాధితులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. కాగా, జావేద్ 18 సంవత్సరాలుగా ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కోవిడ్ కల్లోలం వల్ల తన ఆటోను అంబులెన్స్‌గా మార్చిన భర్తను చూసి గర్వపడి ఊరుకోలేదు అతడి భార్య. తన బంగారు లాకెట్‌ను ఆటోలో సదుపాయాల కోసం అమ్మేసింది. ఇదిలా వుంటే ఒక్క ఆక్సిజన్ సిలెండర్ కోసమే ప్రతిరోజు 600 రూపాయలు ఖర్చవుతుందని జావేద్ తెలిపాడు. అయినా సరే ఎవరికి ఏ అవసరమొచ్చినా తనను సంప్రదించాలని భోపాల్ ప్రజలను కోరాడు. ఇతని గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, ఇప్పటికే రాంచీలో ఒక ఆటోడ్రైవర్ కరోనా రోగులకు ఉచితంగా ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. -
Helping Hands: మానవసేవే మాధవ సేవ!
ఒక్కసారి రిపోర్టులో.. ‘కరోనా పాజిటివ్’ వచ్చిందంటే ఆ వ్యక్తి హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి. వీరి దగ్గరకు వెళ్లాలన్న భయపడే రోజులివి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాజిటివ్ పేషంట్లకు స్వయంగా వంటచేసి అందిస్తున్నారు పాట్నాకు చెందిన తల్లీకూతుళ్లు. పాట్నాలోని రాజేంద్రనగర్‌లో నివసిస్తోన్న కుందన్ దేవి తన కూతుర్లతో కలిసి కోవిడ్ పాజిటివ్ పేషంట్ల ఆకలి తీరుస్తున్నారు. కుందన్ దేవి పెద్దకూతురు 32 ఏళ్ల అనుపమ సింగ్ తల్లికి ఫుడ్ తయారీలో సాయం చేస్తుంటే.. చిన్నకూతురు 26 ఏళ్ల నీలిమ సింగ్ ఫుడ్ ప్యాకెట్లను కరోనా పేషంట్ల వద్దకు చేరుస్తోంది. ఇటీవలే కుందన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ ఇబ్బందిని దగ్గర నుంచి గమనించిన తల్లీ కూతుళ్లు.. పాజిటివ్ వచ్చి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న పేషంట్లకు స్వయంగా వండి ఫుడ్ అందించాలనుకున్నారు. ఈ క్రమంలోనే నందన్ దేవి, అనుపమలు వంటచేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి నీలిమ సింగ్‌కు ఇస్తారు. నీలిమ రోజూ 15 కిలోమీటర్ల పరిధిలోని కోవిడ్ పేషంట్లకు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తోంది. దీని కోసం వీరు వివిధ అవసరాలకోసం దాచుకున్న డబ్బులను వాడుతుండడం విశేషం. ఎవరి సాయం లేకుండా వీరు ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. అయితే నందన్ దేవీ కూతుళ్ల సాయం గురించి తెలుసుకున్న చాలామంది వారికి సాయం చేయాలని ముందుకొచ్చినప్పటికీ వారు డబ్బు విరాళంగా ఇవ్వొద్దు! మీరు మాకు ఇవ్వాలనుకుంటున్న డబ్బులతో మీరే దగ్గర్లోని కరోనా పేషంట్లకు ఫుడ్ వండిపెట్టండి అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ‘‘మానవ సేవే మాధవ సేవ అన్నారు. సేవ చేయడం అంటే దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి కాస్త మానవత్వంతో మేము చేయగలిగిన సాయం చేస్తున్నాం. కొన్నిసార్లు నా స్నేహితులు ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ చేయడంలో నాకు సాయం చేసేందుకు వస్తున్నారు. ఒకపక్క నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఫుడ్ ప్యాకెట్స్‌ను పేషంట్లకు అందిస్తున్నాను’’ అని నీలిమ చెప్పింది. -
గ్రేటా: భారత్‌లో కరోనాను అడ్డుకోవాలి.. ప్రపంచ దేశాల సహాయం అవసరం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోగులు ఆక్సిజన్, బెడ్ల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. భారత్‌లో కరోనా పరిస్థితులపై ప్రపంచ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ స్పందించారు. ఇండియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో భారత్‌కు ప్రపంచ దేశాలు సహాయం చేయాలని కోరారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్.. ఫస్ట్ వేవ్ మించి విధ్వంసం సృష్టిస్తోందనే చెప్పాలి. ఏప్రిల్ నెలలో వరుసగా నాలుగవ రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇక దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లోని ఈ దారుణ పరిస్థితి చూసి స్పందిస్తూ గ్రెటా థన్‌బర్గ్ ఆవేదన చెందుతూ.. భారత్ ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, ఈ ఆపద నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు భారత్‌కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. "భారతదేశంలో కరోనా కారణంగా జరుగుతున్న దారుణ పరిణామాలను చూసి ఇండియాకు అవసరమైన సహాయాన్ని వెంటనే ప్రపంచ దేశాలు అందించాలి" అని గ్రేటా ట్వీట్ చేశారు. దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత తీవ్రంగా ఏర్పడిందని..దీంతో అనేక మంది రోగులు మరణిస్తున్నారని తెలిపింది. కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి జాతీయ రాజధానితో సహా పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు వైద్య ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ( చదవండి: కరోనా: 24 గంటల్లో కొత్తగా 3,46,786 కేసులు ) Heartbreaking to follow the recent developments in India. The global community must step up and immediately offer the assistance needed. #CovidIndia https://t.co/OaJVTNXa6R — Greta Thunberg (@GretaThunberg) April 24, 2021 -
ఆసుపత్రిలో బెడ్లు లేక కరోనా రోగుల అగచాట్లు
-
మానవత్వం బతికే ఉంది.. కరోనా పేషెంట్లకు ఫ్రీ రైడ్
రాంచీ: ప్రజలు కోవిడ్ మహమ్మారి సోకి నరకయాతన అనుభవిస్తుంటే కొందరు మాత్రం రోగుల నుంచి ఎవరికి తోచిన విధంగా వారు దొరికినంత దోచుకుంటున్నారు. ఇటీవల రెమ్డిసెవర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ల కొరతను అడ్డుపెట్టుకొని బ్లాక్‌లో వేలల్లో వీటిని అమ్ముకున్న సంగతి తెలిసింతే. వీళ్లు మానవత్వం చూపించకపోయినా ఫర్వాలేదు కానీ ప్రాణాలతో ఇలా వ్యాపారం చేయకూడదనే విషయాన్ని కూడా మరిచారు. ఓ వైపే ఇలా ఉంటే మరోవైపే మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందనేందుకు నిదర్శనంగా కొందరు కరోనా రోగులను తమ వంతు సాయం అందజేయడానికి ముందుకు వస్తున్నారు. అలా రాంచీలో ఓ ఆటోడ్రైవర్ కరోనా పేషంట్లకు తన వంతు సాయం చేస్తూ వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కోవిడ్ పేషెంట్ల కష్టాలు చూసి తన వంతు సహాయంగా ఏమైనా చేయదలచాడు. తన ఆటోలో ప్రయాణించే కరోనా రోగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. అంతేగాక సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ని పెట్టాడు. ఆటోకి కూడా ఫోన్ నెంబర్‌తో ఉన్న పోస్టర్ని అతికించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కోవిడ్ రోగులను హాస్పిటల్‌కి తీసుకెళ్లుతున్నాడు. వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. ఇలా చేయడానిక ఓ కారణం ఉందని.. ఈనెల 15న కోవిడ్ సోకిన ఓ మహిళను రిమ్స్ హాస్పిటల్లో దింపగా ఆ తర్వాత ఆమెని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మహిళ ఆ రోజు పడిన వేదన చూసినప్పటి నుంచి ఈ ఫ్రీ రైడ్ ప్రారంభమైందని అంటున్నాడు. అసలే కర్ఫ్యూ, అది కాకుండా పెరిగిన పెట్రోల్ ధరలతో ఆటో పై వచ్చే సంపాదన ఎంత. కానీ లాభాపేక్ష లేకుండా కేవలం మానవత్వంతో ఈ ఆటోడ్రైవర్ చేస్తోన్న సహాయానికి స్థానికులే కాదు నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ( చదవండి: రూ.22 లక్షల కారు అమ్మేశాడు: ఎందుకో తెలిస్తే దండం పెడతారు! ) Jharkhand: An auto driver in Ranchi offers free ride to people who need to go to hospitals, amid #COVID19 pandemic. Ravi, the driver says, "Doing this since 15th April when I dopped a woman at RIMS after everyone else refused. My number's on social media so people can contact me" pic.twitter.com/HkL49rzUni — ANI (@ANI) April 23, 2021 -
నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్...
-
ఉన్నచోటనే ఆక్సిజన్! డీఆర్డీవో వినూత్న పరికరం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలు కావద్దనుకుంటే రక్తంలోని ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పల్స్ ఆక్సీమీటర్ పరికరంతో రక్తంలోని ఆక్సిజన్ ఎంతుందో తెలుసుకోవచ్చు కానీ.. తక్కువ ఉంటే అప్పటికప్పుడు ఆక్సిజన్ కావాలంటే మాత్రం ఆసుపత్రికి పరుగెత్తాల్సిందే. అయితే డీఆర్డీవో పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్ అందించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఓ పరికరం ఇప్పుడు కరోనా బాధితులకు వరంగా మారనుంది. బెంగళూరులోని డీఆర్డీవోకు చెందిన ‘ది డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీ’తయరుచేసిన ‘ఎస్పీవో-2 సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టం’లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానే ఆక్సిజన్ సరఫరా మొదలుపెడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు ఎస్పీఓ2ను పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్యసిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. ఒక లీటర్ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్డీవో ఓ ప్రకటనలో తెలిపింది. రోగికి అవసరమైనంత ఆక్సిజన్ మాత్రమే ఉపయోగిస్తున్న కారణంగా వృథా తగ్గుతుందని తెలిపింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
మందుల కోసం రోడెక్కుతున్న కరోనా పేషెంట్స్
-
వెంటిలేటర్ మీదికి వెళ్తే ఇక బతకరా.. ఎంతవరకు నిజం?
వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఇక బతకరనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ మీద పెడతారు. ఇటీవల కరోనా ప్యాండమిక్ స్వైరవిహారం చేస్తున్న తరుణంలోనూ చాలామంది వెంటిలేటర్‌పైకి వెళ్తున్నారు. కోమార్బిడ్ కండిషన్స్‌తో ఉన్నవారు కరోనా వైరస్ కారణంగా వెంటిలేటర్ మీదికి వెళ్లాక కొందరు మృత్యువాతపడుతుండటంతో సాధారణ ప్రజల్లో ఈ దురభిప్రాయం మరింత బలంగా మారింది. నిజానికి ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానం వల్ల అనేక వ్యాధులకు చాలా ఆధునిక చికిత్సలు అందుతున్నందున వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లూ బతికేందుకూ, మళ్లీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కరోనా వ్యాధిగ్రస్తుల్లోనూ చాలామంది వెంటిలేటర్ మీద వెళ్లాక కూడా బతుకుతున్నారు. వెంటిలేటర్ అనేది కృత్రికంగా శ్వాస అందించే యంత్రం. దీన్ని పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేసి, దాన్ని కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్‌తో అనుసంధానం చేస్తారు. రక్తంలో ఆక్సిజన్ పాళ్లు తక్కువగా ఉండటం, కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు పెరుగుతున్నా, రోగికి ఆయాసం పెరుగుతున్నా, ఊపిరితీసుకోవడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోయినా వెంటిలేటర్ అమర్చుతారు. సాధారణంగా నిమోనియా, సీవోపీడీ వంటి వ్యాధులకూ, రక్తానికి ఇన్ఫెక్షన్ పాకే సెప్సిస్ వంటి కండిషన్లలో వెంటిలేటర్ పెడుతుంటారు. ఇటీవల కరోనా కారణంగా ఊపిరి అందని పరిస్థితి వచ్చిన సందర్భాల్లోనూ రోగిని వెంటిలేటర్‌పై ఉంచడం సాధారణంగా జరుగుతోంది. ఒకసారి వెంటిలేటర్ పెట్టిన తర్వాత... పరిస్థితి మెరగయ్యే వరకూ వెంటిలేటర్ తీయడం కష్టం కావచ్చు. సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ పెట్టడం అవసరమైతే ట్రకియాస్టమీ చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. వెంటిలేటర్‌ను త్వరగా తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల అవసరమనుకుంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా వెంటిలేటర్ మళ్లీ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల మన వద్ద కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వైద్యపరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులోకి ఉన్నాయి. కానీ వైద్యపరమైన అంశాలలో మనలో చాలామందికి తగినంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఆ అపోహలను తొలగించుకంటే... వెంటిలేటర్‌పైకి వెళ్లినప్పటికీ... ఆ చికిత్స తర్వాత బతికేవాళ్లే ఎక్కువనే వాస్తవం తెలిసివస్తుంది. -
కళ్లుతిరిగే.. కార్పొ‘రేటు’.. రూ.10కి దొరికే టాబ్లెట్ 100కు!
విజయవాడ నక్కల రోడ్డులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గుడివాడకు చెందిన ఓ రోగి స్వల్ప పక్షవాతంతో చేరారు. మూడు రోజులు ఇంపేషెంట్ గా ఉన్నారు. ఆయనకు రూ.2.85 లక్షలు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసి గొల్లుమనడం పేషెంట్ వంతయ్యింది. ఇందులో ఇంజెక్షన్ల ఖరీదే రూ.1.30 లక్షలు. వాస్తవానికి ఆ ఇంజెక్షన్లను ఆస్పత్రి కొన్నది రూ.65 వేలకు మాత్రమే. వైద్య శాఖలో పెద్ద హోదాలో రిటైర్ అయిన ఓ డాక్టర్ విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. ఇటీవలే ఓ 70 ఏళ్ల మహిళ కోవిడ్ బారినపడటంతో చికిత్స కోసం ఆ ఆస్పత్రికి వెళ్లింది. వారం రోజులు చికిత్స చేసి రూ.3.30 లక్షలు బిల్లు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఆమె కొడుకులు లబోదిబోమంటున్నారు. ఈ రెండు ఉదాహరణలే కాదు.. ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో చూసినా నిత్యం ఇదే తంతు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులు బ్రాండెడ్ మందుల పేరిట రోగులు, వారి కుటుంబీకుల నడ్డి విరుస్తున్నాయి. తక్కువ ధరకు జనరిక్ మందులు దొరుకుతున్నా వాటి జోలికెళ్లకుండా అధిక ధరలుండే మందులు రాస్తూ దోచుకుంటున్నాయి. ఓ ఆస్పత్రిలో ఎక్కువ బిల్లు వేస్తున్నారని మరో ఆస్పత్రికి వెళితే ఆ ఆస్పత్రిలోనూ దీనికి మించి బిల్లులు వేస్తున్న పరిస్థితి. చిన్న జ్వరమొచ్చి ఆస్పత్రిలో చేరినా రెండ్రోజులు ఇంపేషెంట్ గా ఉంటే చాలు కనీసం రూ.లక్షయినా బిల్లు చెల్లించకుండా బయటకు రాలేని పరిస్థితి. బయట రూ.10కి దొరికే టాబ్లెట్ ఆస్పత్రిలో రూ.100కు అమ్ముతున్నారు. మందుల్ని బయట కొనుక్కోనివ్వరు. ఆస్పత్రిలో ధర తగ్గించరు. నర్సింగ్ హోం నుంచి కార్పొరేట్ ఆస్పత్రి వరకూ అన్నిచోట్లా భారీ దోపిడీతో పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్ధికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. జనరిక్ మందులు రాసేందుకు ససేమిరా బ్రాండెడ్ మందుల స్థానంలో చాలారకాల మందులు జనరిక్‌లో వచ్చాయి. ఈ మందులు రాస్తే 70 నుంచి 80 శాతం ధర తగ్గుతాయి. కానీ జనరిక్ మందులు రాసే ప్రైవేటు డాక్టర్లే లేరు. బ్రాండెడ్ మందులను ఆయా కంపెనీల నుంచి అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసి ఎంఆర్పీని అడ్డం పెట్టుకుని విక్రయిస్తున్నారు. ఎంఆర్పీ ధరకూ.. కొనుగోలు చేసిన ధరకూ కొన్ని మందుల విషయంలో 200 శాతం కూడా తేడా ఉంటోంది. జనరిక్ మందులు రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలిచ్చినా డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. క్యాన్సర్ మందుల్లోనూ అంతే రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు జనరిక్ మందులను వాడి బాధితులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కానీ బ్రాండెడ్ ధర పేరుతో వారిని మరింత ఆర్ధికంగా చికితిపోయేలా చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితిల్లోనూ జనరిక్ మందులు రాయకపోగా, బ్రాండెడ్ ధరల్లో ఒక్క పైసా తగ్గించడం లేదు. చట్టం చేయడం వల్లే నియంత్రణ సాధ్యం మందుల ధర తగ్గించడం కేంద్ర ప్రభుత్వమే నియంత్రించాలి. తయారీదారు, రిటైల్ అమ్మకందారు, కార్పొరేట్ ఆస్పత్రుల మార్జిన్లను దృష్టిలో ఉంచుకుని ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ)లోకి తీసుకురావాలి. ఒకప్పుడు రూ.1.50 లక్షలున్న స్టెంట్‌ను రూ.25 వేలకు తగ్గిస్తే దిగొచ్చారు. ఇప్పుడు ప్రాణాధార మందుల ధరలను తగ్గించి విధిగా నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జనరిక్ మందులు రాయాలని వైద్యులకు చెబుతున్నాం. జనరిక్ రాసి కనీసం బ్రాకెట్లో వారు సూచించే బ్రాండ్ అయినా రాస్తే అవగాహన వస్తుందని చెప్పాం. – డాక్టర్ బి.సాంబశివారెడ్డి, అధ్యక్షుడు, ఏపీ మెడికల్ కౌన్సిల్ నిర్వహణ కష్టమవుతుంది ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు అమ్మితే ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతుంది. వందల మంది సిబ్బందికి వేతనాలు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఉంటాయి. 100 పడకల ఆస్పత్రిని నిర్వహించాలంటే ఇప్పుడు చాలా వ్యయమవుతోంది. ఇక జనరిక్ రాయాలంటే కొద్దిగా క్వాలిటీని చూసుకోవాలి కదా. ఎంఆర్పీ కంటే తగ్గించడం కష్టం. – డాక్టర్ మురళి, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖ -
వెంటి లేటర్పైకి వెళ్లినా రోగి వెనక్కిరావచ్చు!
ఒకసారి వెంటిలేటర్‌పైకి వెళ్తే రోగి తిరిగి కోలుకోవడం కష్టమనే అపోహ చాలామంది రోగుల్లో, వారి రోగి బంధువుల్లో ఉంటుంది. సాధారణంగా రోగులను డాక్టర్లు.. సాధారణ పరిస్థితులోనే మొదట ట్రీట్మెంట్ అందిస్తారు. అయితే ఒక్కొసారి వారి శరీరం, మాములు స్థితికి సహకరించకపోతే ఆసమయంలోనే వారిని వెంటిలేటర్‌పైన ఉంచి వైద్యం చేస్తారు..ఒకసారి రోగిని వెంటిలేటర్‌పై పెట్టాక... ఏ పరిస్థితి కారణంగా రోగిని వెంటిలేటర్‌పై పెట్టారో, అది మెరుగయ్యే వరకు వెంటిలేటర్‌పైనే ఉంచాల్సి వస్తుంది. ఇక రోగి కోలుకోవడం అన్నది, అతడికి ఉన్న జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ పై ఉంచుతారు. కొన్ని రోజుల గడిచిన తర్వాత వాళ్ళు సాధారణ స్థితిలోకి చేరుకుంటారు. కాబట్టి వెంటిలేటర్‌పై పెట్టిన రోగులంతా కోలుకోరని భావించడం సరికాదు. తక్కువ మంది మాత్రమే పరిస్థితి విషమించి, ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తున్నారు. కాబట్టి వెంటిలేటర్ అనగానే ఆందోళన అక్కర్లేదు. చదవండి: సిజేరియన్ తర్వాత మహిళల ప్రధాన సమస్య ఇదే! -
బెడ్లు లేవని పేషెంట్లను చంపిన డాక్టర్!
రోమ్: వైద్యో నారాయణ హరి అన్న పదానికే మచ్చ తెచ్చాడో వైద్యుడు. ప్రాణం పోయాల్సిన చేతితో ఇద్దరు కరోనా పేషెంట్ల ఉసురు తీశాడు. ఈ దారుణ ఘటన కరోనా విజృంభించిన తొలినాళ్లలో ఇటలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ కార్లొ మోస్కా ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ ఎమర్జెన్సీ వార్డుకు ఇంచార్జిగా పని చేస్తున్నాడు. అక్కడ బెడ్లు ఖాళీగా లేకపోవడంతో సదరు వైద్యుడు కొందరు పేషెంట్లను చంపేయాలని చూశాడు. ఇందుకు ఎక్కువ వయసున్న వారిని ఎంచుకున్నాడు. 61 ఏళ్ల నటాలే బస్సీ, 80 ఏళ్ల ఏంజెలో పలెట్టి అనే ఇద్దరు కోవిడ్ పేషెంట్లకు మత్తుమందుతో పాటు కండరాల నొప్పులకు వాడే మందులను ఎక్కువ డోసులో ఇవ్వడంతో వారు ప్రాణాలు విడిచారు. మార్చిలో చోటు చేసుకున్న ఈ ఘటన మీద పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో సదరు వైద్యుడు, నర్సులతో చేసిన చాటింగ్ బయటపడింది. (చదవండి: స్ట్రెయిన్‌తో యూరప్ బెంబేలు, మరణాలూ ఎక్కువే!) 'కేవలం బెడ్లు ఖాళీ అవడం కోసం నేనీ పని చేయలేను', 'ఇది చాలా మూర్ఖత్వపు చర్య' అంటూ నర్సులు మెసేజ్‌ల ద్వారా అతడిని హెచ్చరించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా అతడే స్వయంగా ఆ పని చేసేందుకు పూనుకున్నాడు. పైగా రోగులకు ఔషధాలిచ్చే సమయంలో నర్సులను బయటకు వెళ్లమని చెప్పినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో మరణించిన మరో ముగ్గురి చావుకు గల కారణాలను కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా పేషెంట్ల ప్రాణాలు తీశాడన్న ఆరోపణలతో ఎమర్జెన్సీ వార్డ్‌కు హెడ్‌గా ఉన్న అతడిని మోంటిచైరి ఆస్పత్రి విధుల నుంచి తొలగించింది. మరోవైపు పోలీసులు అతడిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో సదరు వైద్యుడు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. ఇవన్నీ నిరాధారమైనవిగా పేర్కొన్నాడు. ప్రాణాలు కాపాడే వాడినే కానీ తీసేవాడిని కానని చెప్పుకొచ్చాడు. (చదవండి: 'కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకోలేదు') -
కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రాజీనామా
ఉలాన్ బాతర్: కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితి గట్టెక్కేందుకు విశ్వమంతా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఒక దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం మంగోలియా దేశంలో వచ్చింది. కరోనా ప్రారంభ దశలో మంగోలియా కట్టడి చర్యలు పటిష్టం తీసుకుంది. (చదవండి: 7 లక్షల మందికి వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అన్న బిల్‌గేట్స్?) అయితే ఆ దేశంలో ఇప్పుడు రెండో దశ వ్యాప్తి మొదలైంది. దీంతో ఆ దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. దీనిపై ఆ దేశంలో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. అయితే ఈ కరోనా విషయంలో ఇద్దరి ఆగ్రహావేశాలు తట్టుకోలేక ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే కరోనా రోగి, ఓ చిన్నారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారికి ఆ అవకాశం కల్పించకపోవడంపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసనలకు తట్టుకోలేక వాటికి బాధ్యత వహిస్తూ ఖురేసుఖ్ ఉఖ్నా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్‌లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలతో పాటు నిరసనలు వచ్చాయి. ఈ విధంగా కరోనా వ్యాప్తి ప్రధానికి చుక్కలు చూపించింది. (చదవండి: కరోనా కథలెన్నెన్నో..) -
ఏపీ చేస్తోంది... మీరెందుకు చేయలేరు?
సాక్షి, హైదరాబాద్: కరోనా పరీక్షల సంఖ్య అప్పుడప్పుడూ అనూహ్యంగా తగ్గినా.. తగ్గలేదంటూ తప్పుడు సమాచారంతో నివేదిక సమర్పించి ఫూల్స్‌ను చేయాలని చూస్తారా అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ ఆదేశాల అమలుకు సంబంధించి ప్రభు త్వం సమర్పించిన నివేదిక అస్పష్టంగా, అసమగ్రంగా, తప్పుల తడకగా ఉందంటూ ఆగ్ర హం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, వైద్య ఆరోగ్య సిబ్బం ది రక్షణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కరోనా బిల్లుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణకు సంబంధించి దాఖలైన 20కి పైగా ప్రజాహితవ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. తదు పరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది. ఏపీ చేస్తోంది... మీరెందుకు చేయలేరు? ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 1.20 లక్షల పరీక్షలు చేస్తోంది. కరోనా చికిత్స కోసం 581 ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. తెలంగాణలో కేవలం 62 ఆసుపత్రులనే కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేశారు. కర్ణాటకలో 1,029, తమిళనాడులో 1,809 ఆసుపత్రులను కేటాయించారు. తెలంగాణలో ఆసుపత్రుల సంఖ్యతోపాటు పరీక్షల సంఖ్యనూ గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి వెయ్యి మందిలో ఆక్సిజన్ బెడ్స్ సంఖ్య తెలంగాణలో 1.3గానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం కనీసం 3 బెడ్స్ ఉండాలి. తెలంగాణలో శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల సంఖ్య పెంచి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. నవంబర్ 16లోగా నివేదిక ఇవ్వండి... ‘‘బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున సమావేశమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభు త్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. అలాగే కరోనా రెండో దశలో విజృంభించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మా ఆదేశాల అమలుపై నవంబర్ 16లోగా సమగ్ర నివేదిక సమర్పించండి’’అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణాల లెక్కలపై అనుమానాలు... ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు వందల్లో ఉన్న రోజుల్లోనూ రోజువారీ కరోనా మరణాల సంఖ్య 10–13 మాత్రమే ఉందన్నారు. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగినా ఇప్పుడూ అన్నే మరణాలు నమోదవుతున్నాయని మీడియా బులెటిన్‌లో పేర్కొంటున్నారు. ఇది వాస్తవ సమాచారం కాదని భావిస్తున్నాం. శ్మశానవాటికల నిర్వాహకులను రోజూ ఎన్ని కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారనే దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే మరణాల సంఖ్య ఎంతో తెలియాల్సిన అవసరం ఉంది. కరోనా కట్టడి చర్యల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను మరోసారి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించాల్సి ఉంటుంది’’అని ఈ కేసు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుకు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయండి... జూలై 1 నుంచి అక్టోబర్ 10 వరకు ఢిల్లీ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఎన్ని పరీక్షలు నిర్వహిస్తే ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయి? కరోనాతో ఎందరు మరణించారనే వివరాలతోపాటు రాష్ట్రంలో అదే కాలానికి చేసిన పరీక్షలు, నమోదైన కేసులు, మరణాల సంఖ్యను గ్రాఫ్ రూపంలో నివేదిక సమర్పించండి. రాష్ట్రవ్యాప్తంగా 1,135 వెంటిలేటర్ బెడ్స్ ఉండగా ఇటీవల 135 బెడ్స్ పెంచామన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పడకలు సరిపోవు, వాటిని మరింతగా పెంచండి. గాంధీ, చెస్ట్ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను తెలిపేలా లైవ్ డ్యాష్ బోర్డులను ఏర్పాటు చేయాలన్న మా ఆదేశాలను ఇప్పటికైనా అమలు చేయండి. ప్రస్తుతమున్న 17 ఆర్టీ–పీసీఆర్ పరీక్షా కేంద్రాలకు మరో 6 కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నా ఎప్పటిలోగా ఏర్పాటు చేసేదీ చెప్పలేదు. త్వరలో అంటే రెండు రోజులా, రెండు నెలలా, రెండేళ్లా? కేసుల సంఖ్య పెరిగే అవకాశమున్న దృష్ట్యా వాటిని మరింతగా పెంచండి. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై నివేదిక సమర్పించాలని ఆదేశించినా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఎందుకు సమర్పించలేదు? తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకోవాలి. -
ఆక్సిజన్ దాత సుఖీభవ
మంచిదనీ, చెడ్డదనీ ఫిక్స్ అయిపోడానికి లేకుండా మంచి చెడులు మిక్స్ అయిపోయి ఉంటుంది లోకం. రెంటినీ వేరు చేస్తూ కూర్చుంటే జీవితం ముగిసిపోతుంది. బాధ కలిగిన చోట బాధపడి, మంచి కనిపించిన చోట సంతోషపడి జన్మను గడిపేయాలని, చేతనైతే నిస్వార్ధాన్ని గడించి వారస మానవులకు వీలునామా రాసిపోవాలనీ జీవిత అంతరార్థమేమో! ఈ కరోనా కాలంలో స్వార్థం బుసలు కొట్టే చోట కొడుతుంటే, నిస్వార్ధం ప్రాణవాయువై కొన్నిచోట్ల ఊపిర్లు ఊదుతోంది. కర్ణాటకలోని బెల్గాంలో వెంకటేష్ పాటిల్ అనే ఆయనకు ఆక్సిజన్ సిలిండర్ల రీ ఫిల్లింగ్ కంపెనీ ఉంది. కంపెనీతో పాటు మంచి మనసు కూడా. బెల్గాం కోవిడ్ ఆసుపత్రుల్లో ఎవరైనా ఆక్సిజన్ అవసరమై, కొనే స్థోమత లేక చావు బతుకుల్లో ఉన్నారని తెలియగానే వెంకటేష్ పాటిల్ హుటాహుటిన అక్కడికి సిలిండర్లు పంపిస్తున్నారు. అలా ఇప్పటివరకు ఆయన 1882 సిలిండర్లను ఉచితంగా రీఫిల్ చేసి పంపించారు. ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఒక్క రీఫిల్‌కి 260 రూపాయలు అవుతుంది. అదే ఒకసిలిండర్‌కి కార్పొరేట్ ఆసుపత్రులలో పది వేలు బిల్ అవుతుంది! వాళ్లు చేస్తున్న దాని గురించి పాటిల్ తనేమీ మాట్లాడ్డం లేదు. తను చేయగలిగిన దాని పైనే ధ్యాస పెట్టారు. ఆక్సిజెన్ కంపెనీ ఉన్నవాళ్లు ఉచితంగా సిలిండర్ రీఫిల్ చేసి ఇవ్వడం పెద్ద విషయం కాదనిపించవచ్చు. పెద్దపెద్ద కంపెనీలనే తలదన్నేలా ఉండే కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు ఒక్క టెస్ట్ అయినా పేదవాళ్లకు ఉచితంగా చేసినట్లు విన్నామా?! కొండంత స్వార్థాన్ని కొలవలేం. నిస్వార్ధాన్ని మాత్రం వెంకటేష్ పాటిల్ వంటి వాళ్లను కూర్చోబెట్టి తూచవచ్చు. కానీ ఆయన కూర్చోడానికి ఒప్పుకోరే! ‘పాపం ఎవరికో ఆక్సిజెన్ కావాలట’ అని పరుగెత్తి వెళతారు. కనుక నిస్వార్థాన్నీ కొలవలేం. లోకం ఎప్పటికీ ఇలాగే ఉంటుందేమో మంచీ చెడ్డా కలిసిపోయి! మంచికి దండం. చెడుకు దూరం. ఇదే మనశ్శాంతికి దివ్యౌషధం. -
కోవిడ్ రోగుల కోసం డియాగో విరాళం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారిన పడి అధిక మోతాదులో ఆక్సిజన్ అవసరమయ్యే రోగుల కోసం బెంగళూరుకు చెందిన డియాగో సంస్థ వంద యూనిట్ల హై ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్ఎఫ్ ఎన్సీ) యంత్రాలను అందజేసింది. ఈ మేరకు సంస్థ సీఈవో ప్రథమేష్ మిశ్రా గురువారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు యంత్రాలను అప్పగించారు. కోవిడ్ రోగులకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఈ యూనిట్లను గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, ఛాతీ ఆసుపత్రి, టిమ్స్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని సోమేశ్ కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కోవిడ్ రోగుల డ్యాన్స్
-
పాడేరు కోవిడ్ సెంటర్లో రోగుల డ్యాన్స్
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం కరోనావైరస్ తీవ్రత కంటే మానసిక ఆందోళన మనుషుల్ని అధికంగా ఇబ్బంది పెడుతోంది. దాంతో పలువురు వైద్య సిబ్బంది వైరస్ బాధితుల్లో ఉత్సాహాన్ని నింపుతూ డ్యాన్సులు వేయడం, పాటలు పాడటం వంటి విశేషాలను చూశాం. తాజాగా జిల్లాలోని పాడేరు కోవిడ్ సెంటర్ వైద్య సిబ్బంది కరోనా సోకిన పేషెంట్లలో ఆనందాన్ని నింపారు. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్లో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు కరోనా సెంటర్లో వైద్య సిబ్బంది రోగులను ఉత్సాహపరుస్తూ ఉర్రుతూలుగించే పాటలకు స్టెప్పులు వేయించారు. (తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు) దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాజిటివ్ లక్షణాలకు గురైన వ్యక్తుల్లో కొంత ఉత్సాహం నింపినట్లయితే త్వరితగతిన వారు కోలుకునే అవకాశాలు ఉంటాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పాజిటివ్ లక్షణాలు సోకడం సహజంగా మారిందని తెలిపారు. కానీ, కోవిడ్ వచ్చిందని మానసిక ఆందోళన చెందడం సరికాదని వైద్య వర్గాలు సూచించాయి. ఇక ఇటీవల పాడేరు ఏజెన్సీలో కూడా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. -
ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో కావాల్సినన్ని గ్లూకోజ్ స్టాండ్లు అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు గ్లూకోజ్ స్టాండ్‌కి బదులు బెడ్స్ కర్ర సహాయంతో సెలైన్ బాటిల్స్‌ను ఎక్కించుకుంటున్నారు. ఈ దయనీమైన పరిస్ధితి గురించి మీడియాకి సమాచారం అందడంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులకు గ్లూకోజ్ స్టాండ్లు తెప్పించారు. -
కరోనా రోగులకు మరిన్ని సేవలు: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు జిల్లా: కరోనా బాధితులకు మరిన్ని సేవలు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజుకు ఆరువేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి సత్వరమే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గూడూరు, నాయుడుపేటలో కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. (కరోనా పరీక్షల్లో అగ్రస్ధానంలో ఏపీ) కరోనా వస్తే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స అందించేందుకు కోవిడ్ ఆసుపత్రుల్లో మరిన్ని అధునాతన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కోరారు. -
వసూలు చేసింది రూ.14.5 లక్షలు చేతికి రూ.1.91 లక్షల బిల్లు
సికింద్రాబాద్ పాన్‌బజార్‌కు చెందిన ఓ వ్యక్తి(53) కోవిడ్‌తో బాధపడుతూ జూలై 24న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. హెల్త్‌కార్డుపై చికిత్సకు ఆస్పత్రి నిరాకరించింది. వైద్యులు రెండురోజులపాటు సాధారణ ఐసీయూలో ఉంచారు. 26వ తేదీ నుంచి ఆగస్టు 4 వరకు వెంటిలేటర్‌పై చికిత్స అందించగా అదేరోజు ఆయన చనిపోయారు. 12 రోజులకు రూ.14.50 లక్షల బిల్లు వసూలు చేశారు. ఇన్సూరెన్స్ సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకునేందుకుగాను బిల్లు తాలూకు రశీదు ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరగా రూ.1,91,700 బిల్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నించగా, జీవో మేరకే బిల్లు ఇచ్చామని స్పష్టం చేసింది. ఎక్కువ మాట్లాడితే... మీ జువెలరీ షాప్‌పై ఐటీ దాడులు చేయిస్తామని ఆస్పత్రి యాజమాన్యం బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరిస్తుండటం గమనార్హం. నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి(68) కూడా కోవిడ్‌తో ఇటీవల ఇదే ఆస్పత్రిలో చేరారు. 18 రోజుల చికిత్సకు రూ.18 లక్షలు చెల్లించారు. డిటైల్డ్ బిల్లు ఇవ్వాల్సిందిగా కుటుంబసభ్యులు కోరగా అలా ఇవ్వడం కుదరదని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం రశీదు ఇవ్వాలని కోరితే రూ.5 లక్షల బిల్లు ఇవ్వడంతో కుటుంబసభ్యులు విస్తుపోవాల్సి వచ్చింది. బోయినపల్లికి చెందిన ఓ ప్రముఖ బిల్డర్ కుటుంబసభ్యులు నలుగురు ఇటీవల కోవిడ్ బారిన పడి చికిత్స కోసం ఇదే ఆస్పత్రిలో చేరారు. ఇందులో బిల్డర్ తండ్రి కోవిడ్‌తో మృతి చెందగా... ముగ్గురు కోలుకున్నారు. కానీ వారికి అయిన బిల్లు చూస్తే షాక్ తప్పదు. రూ.50 లక్షలు చెల్లించగా వారికి ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన బిల్లు రూ.2 లక్షలే. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 79,495 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 45 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 627 మంది కోవిడ్‌తో మృతి చెందగా, వీరిలో 500 మందికిపైగా సిటిజనులే. ప్రభుత్వం ప్యాకేజీ నిర్ణయించిన ధరలు తమకు గిట్టుబాటు కావని కార్పొరేట్ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఈహెచ్ఎస్, జీహెచ్ఎస్, సీహెచ్ఎస్, ఈఎస్‌ఐసహా ఇతర ప్రైవేటు సంస్థల ఇన్సూరెన్సులను కలిగినవారికి ఈ ప్యాకేజీలు వర్తించవని ప్రభుత్వమే స్పష్టం చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న యాజమాన్యాలు ఐసీయూ, వెంటిలేటర్ పడకలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రోగుల బలహీనత.. వారికి కాసులపంట అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్న రోగుల బలహీనతను ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. షరతులు విధిస్తున్నాయి. నగదు చెల్లించేందుకు అంగీకరించేవారికే అడ్మిషన్లు ఇస్తున్నాయి. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రోగి నుంచి రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ‘ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం’పూర్తి బిల్లులకు రశీదులివ్వాలని కోరితే పలు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా డబ్బులు దండుకుంటున్న ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
కరోనా రోగుల పర్యవేక్షణకు కొత్త పరికరం
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులను పర్యవేక్షించడం డాక్టర్లకూ కత్తిమీద సామే. పీపీ ఈ కిట్లు, మాస్కులు, తరచూ శానిటైజేషన్ తప్పనిసరి! మరి ఇవేవీ లేకుండా.. ఆ మాటకొస్తే సమీపంలోకి వెళ్లకుండానే రోగి తాలూకూ వివరాలన్నీ పొందగలిగితే? వైద్యుల పని సులువవుతుంది. ఈ అద్భుతాన్ని మద్రాస్ ఐఐటీ సాధించింది. కరోనా రోగుల చికిత్సకు కీలకమైన గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఊపిరి తీసుకొనే వేగం, రక్తంలో ఆక్సిజన్ మోతాదులను దూరం నుంచే చూసేందుకు ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. హెల్త్‌కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ (హెచ్‌టీఐసీ)తోపాటు హేలిక్సన్ అనే స్టార్టప్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వినూత్న పరికరాన్ని ఇప్పటికే సుమారు 2 వేల మంది రోగులకు ఉపయోగించారు. మరో 5 వేల మంది పర్యవేక్షణకు పరికరాలు సిద్ధమవుతున్నాయి. పరికరం స్థాయి, అందులోని కొలమానాలను బట్టి దీని ధర రూ. 2,500 నుంచి రూ.10 వేల మధ్య ఉంది. ఒకసారి ఈ పరికరాన్ని రోగి వేలికి తొడిగితే చాలు.. వివరాలన్నీ మొబైల్ ఫోన్‌కు లేదా సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్‌కు చేరతాయి. రోగి శరీర ఉష్ణోగ్రతలను చంకల నుంచి సేకరిస్తే.. ఆక్సిజన్ మోతాదులు, ఇతర వివరాలను వేలి నుంచే తీసుకోవచ్చు. ఏడాదిపాటు పనిచేసే ఈ పరికరాన్ని మళ్లీమళ్లీ వాడుకోవచ్చు కూడా. కరోనా తదనంతరం కూడా... కరోనా తదనంతర పరిస్థితుల్లోనూ ఆసుపత్రుల్లో ఈ పరికరాన్ని వాడుకోవచ్చని హెచ్‌టీఐసీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ మోహన్ శంకర్ శివప్రకాశం తెలిపారు. శరీర వివరాలను తెలిపే పరికరాలు మార్కెట్లో ఇప్పటికే కొన్ని వాణిజ్యస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ అవేవీ కచ్చితమైన వివరాలు ఇవ్వవని, అందుకే వైద్యులు ఆసుపత్రుల్లో వాటిని వాడేందుకు ఇష్టపడరని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన పరికరం ఆసుపత్రుల్లో ఉపయోగించే మానిటరింగ్ వ్యవస్థలతో సమానమైన ఫలితాలిస్తుందని చెప్పారు. ఏడాదిపాటు చెన్నై, చుట్టుపక్కల ఉన్న అనేక ఆసుపత్రుల్లో తాము ఈ పరికరంపై పరీక్షలు జరిపామని, కచ్చితమైన ఫలితాలు సాధించామని ఆయన వివరించారు. కరోనా సమయంలో వైద్యులు, నర్సులు రోగుల సమీపానికి వెళ్లే అవసరం లేకుండా చేసేందుకు... తద్వారా ఖర్చులు తగ్గించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పారు. ఆక్సిజన్ మోతాదును గుర్తించే పరికరాన్ని జోడించడం ద్వారా ఈ పరికరం ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బందిపై పనిభారం గణనీయంగా తగిస్తుందని, అదే సమయంలో ఇళ్లలో ఉన్నవారి వివరాలను కూడా గమనిస్తూ తగిన సూచనలు ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని హేలిక్సన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్‌శంకర్‌రాజా తెలిపారు. వందల మంది రోగుల వివరాలను ఒకేచోట నుంచి పర్యవేక్షించే స్థాయికి ఈ పరికరాన్ని అభివృద్ధి చేయవచ్చని, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాయంతో విషమ పరిస్థితి ఎదుర్కొంటున్న రోగులను వెంటనే గుర్తించవచ్చని తెలిపారు. -
గాంధీలో విద్యుత్ అంతరాయం
గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం సుమారు అరగంటపైగా విద్యుత్ అంతరాయం కలిగింది. అత్యవసర, సాధారణ వార్డుల్లో అంధకారం అలముకోవడంతో కరోనా బాధితులతోపాటు వైద్యులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అనంతరం జనరేటర్లు ఆన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో సాయం త్రం 5.30 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లు కమ్ముకోవడంతో ఏం జరుగుతుం దో తెలియక రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఐసీయూ, అత్యవసర విభాగాల్లో సుమా రు 850 మంది ఆక్సిజన్, వెంటిలేటర్లపై వైద్యసేవలు పొందుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. స్పం దించిన ఆస్పత్రి పాలనా యంత్రాంగం సంబంధిత ఎలక్ట్రీషియన్లను అప్రమత్తం చేసింది. ఆస్పత్రిలో ఉన్న 500 కేవీ జనరేటర్లను ఆన్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. 35 నిమిషాల తర్వాత ఆస్పత్రి మొత్తానికి విద్యుత్ సరఫరా జరిగింది. 11 కేవీ ఫీడర్‌లైన్ ద్వారా ఆస్పత్రి ఎలక్ట్రిసిటీ కంట్రోల్ బోర్డుకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఉదయం నుంచి నిరంతరం కురుస్తున్న వర్షానికి ఫీడర్‌లైన్ జంపర్ హఠాత్తుగా తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా ఓవర్‌లోడ్ పడడంతో ఆటోమేటిక్‌గా ఆన్ కావాల్సిన జనరేటర్లు స్విచ్చాఫ్ అయ్యాయి. గాంధీలో ఆరుగురే కాంట్రాక్టు సిబ్బంది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మొత్తం 21 ఎలక్ట్రీషియన్ పోస్టులు అవసరం కాగా ప్రస్తుతం మూడు షిఫ్ట్‌ల్లో ఆరుగురు కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్లు మాత్ర మే అందుబాటులో ఉన్నారు. వారికి కూడా సంబం ధిత సర్టిఫికెట్, తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం గమనార్హం. అంతరాయం 7 నిమిషాలే.. గాంధీ ఆస్పత్రిలో కేవలం ఏడు నిమిషాలు మాత్రమే విద్యుత్ అంతరాయం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరణ ఇచ్చారు. గురువారం సాయంత్రం 5.35 నుంచి 5.56 గంటల వరకు సరఫరా నిలిచిపోయిందని, ఏడు నిమిషాల వ్యవధిలో జనరేటర్ల ద్వారా విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు. ఐసీయూ, అత్యవసర విభాగాలతో పాటు సాధారణ వార్డులో రోగులకు అందిస్తున్న చికిత్సలకు ఎటువంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. -
కరోనా: వైద్యులకు తప్పని వెతలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనాతో బాధపడే ప్రజలకు వైద్యం అందిస్తూ డాక్టర్లు చేస్తున్న కృషి మరువలేనిది. కనిపించే దైవంగా భావించే డాక్టర్లను కరోనా కబలిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు 100 మంది డాక్టర్లు మరణించారు. జనాభాకు సరిపడా వైద్య సిబ్బంది లేనందున ప్రస్తుతం ఉన్న డాక్టర్లే అధిక గంటలు సేవలందిస్తున్నారు. 40 డిగ్రీల వేడిలో పీపీఈ కిట్లతో కరోనా రోగులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఇంత వేడిలో పీపీఈ కిట్లను ధరించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, కానీ తమ ప్రాణాలు, రోగుల ప్రాణాలను కాపాడానికి వేరే మార్గం లేదని ఢిల్లీలోని శారదా ఆస్పత్రికి చెందిన ఓ డాక్టర్ తెలిపారు. దేశంలోని ఆరోగ్య రంగానికి ప్రభుత్వం చాలా తక్కువ బడ్జెట్ ఖర్చు పెడుతుందని, వైద్య సిబ్బందికి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్లు అధిక సమయం ఆస్పత్రులలో పనిచేస్తుండడం వల్ల తలనొప్పి, వాంతులు తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సరియైన సదుపాయాలు లేక వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆరోగ్య సమస్యలు, తక్కువ వేతనాల అసంతృప్తితో చాలా మంది డాక్టర్లు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. -
ఐసీయూలో 500 మంది బాధితులు
గాంధీ ఆస్పత్రి: కరోనా వైరస్ విజృంభణతో కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఐసీయూలో ఉండే రోగుల సంఖ్య శనివారం నాటికి 500కు చేరుకుంది. వీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 850 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తుండగా, వీరిలో కరోనాతోపాటు వివిధ రుగ్మతలకు గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న సుమారు 500 మందిని ఐసీయూలకు తరలించి వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ, లివర్, ఆస్తమా, షుగర్, బీపీ, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని, అందుకే వీరిని ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు. ఆస్పత్రిలో పడకలు, వెంటిలేటర్ల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. క్రిటికల్ పొజిషన్లో ఉన్నవారు కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు తొమ్మిది మందికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించామని, వందశాతం సక్సెస్ సాధించామన్నారు. ప్లాస్మా చికిత్సతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైన ఐదుగురిని డిశ్చార్జ్ చేశామని, మరో నలుగురు కోలుకుంటున్నారని, వారిని రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వివరించారు. మరో ఐదుగురికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించేందుకు అవసరమైన ప్లాస్మాకణాలు గాంధీ బ్లడ్‌బ్యాంకులో అందుబాటులో ఉన్నాయని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు వాటిని వినియోగిస్తామన్నారు. -
స్పెషల్ డైట్.. అదే రైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ యమా యాక్టివ్‌గా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా అంతే యాక్టివ్‌గా స్పందిస్తోంది. స్పెషల్ డైట్ ఇచ్చి రోగుల శరీరం నుంచి కరోనాను సాగనంపాలని నిర్ణయించింది. కోవిడ్ బాధితుల రోగనిరోధకశక్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో పోషక విలువలున్న ప్రత్యేక భోజనం అందించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులకు కోవిడ్ బాధితుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో 10 వేల యాక్టివ్ కేసులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగంమంది హోం క్వారంటైన్లో ఉండగా మిగతా వారు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌కు సరైన మందు లేకపోవడంతో రోగనిరోధకశక్తిని పెంచడమే వ్యాధిని జయించడానికి ఏకైక మార్గమని భావిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతోపాటు ఎన్ఐఎన్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) ఆధ్వర్యంలో ప్రత్యేక డైట్‌చార్ట్ రూపొందించింది. దీని ప్రకారం గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న ఈ డైట్‌ను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వేగంగా కోలుకునేలా... కోవిడ్ పేషెంట్ వేగంగా కోలుకునేందుకు అదనపు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు అన్నివర్గాలు ప్రాధాన్యత ఇచ్చే ఆహార పదార్థాలనే డైట్‌చార్ట్‌లో పొందుపర్చారు. రోజూ తినే భోజనంతోపాటు కొన్ని అదనపు పోషకాల కింద ఉడికించిన కోడిగుడ్డు, పండ్లు, డ్రైఫ్రూట్స్ జోడించారు. కోవిడ్ రోగులకు ఆహారాన్ని తాజాగా, వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలని, అప్పుడే పోషకాలు పూర్తిస్థాయిలో శరీరంలోకి చేరతాయని, ఆ మేరకు వండిన వెంటనే ఆహారాన్ని ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పేషెంట్ డైట్‌చార్ట్ ఇలా.... ► ఉదయం 7.30 నుంచి 8.00 గంటల మధ్య అల్పాహారం కింద ఇడ్లీ, పూరి, బొండా, ఉప్మా, ఊతప్పలలో ఏదో ఒకదాన్ని అందిస్తారు. దీనితోపాటు కాచిన పాలు ఇస్తారు. ► ఉదయం 10 గంటలకు బిస్కెట్లతోపాటు టీ లేదా కాఫీ ఇస్తారు. ► మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య వరి అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, వెజ్‌కర్రీ, మినరల్ వాటర్ బాటిల్‌తోపాటు ఉడికించిన కోడిగుడ్డు, అరటిపండు అందిస్తారు. ► సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల్లోపు ప్రత్యేక పోషకాహారంగా కాఫీ లేదా టీతోపాటు ఖర్జూరం, బాదంపప్పు ఇస్తారు. æ రాత్రి డిన్నర్లో అన్నంతోపాటు వెజిటబుల్ కర్రీ, సాంబార్, పెరుగు, పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, అరటిపండు, మినరల్ వాటర్ అందజేస్తారు. -
ఒక్క రోజులో 11వేల మంది డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 10,994 మంది 24 గంటల్లో డిశ్చార్జి అయ్యారని కేంద్రం మంగళవారం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 2,48,189 మంది కోలుకున్నట్లయిందని, రికవరీ రేటు 56.38 శాతంగా ఉందని వెల్లడించింది. ఒక్క రోజులోనే 14,933 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,40,215కు చేరుకోగా మరో 312 మంది కోవిడ్‌తో మరణించడంతో ఇప్పటి దాకా చనిపోయిన వారి సంఖ్య 14,011కు ఎగబాకిందని వెల్లడించింది. దేశంలోని ప్రతి లక్ష మంది జనాభాలో ఒక్కరు మాత్రమే కోవిడ్‌తో చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతుండగా.. ప్రపంచ దేశాల్లో ఇది 6.04గా ఉందని తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కోవిడ్ మరణాల సంఖ్య రీత్యా ప్రపంచ దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. అదేవిధంగా, తీవ్ర ప్రభావిత దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ ఉంది. కర్ణాటక మంత్రి కుటుంబంలో.. కర్ణాటక వైద్య విద్యా మంత్రి డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఆయన తండ్రి (82)కి సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, సుధాకర్ భార్య, కుమార్తెకు మంగళవారం పాజిటివ్‌గా వెల్లడైంది. ఇటీవల మంత్రి ఇంట్లో వంట మనిషికి కరోనా సోకింది. తనకు, ఇద్దరు కుమారులకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. మిగతా అందరినీ కోవిడ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. బెంగళూరులోని సదాశివనగరలో ఉన్న మంత్రి నివాసంలో ఏడుగురు ఉండగా నలుగురికి కరోనా సోకింది. -
కరోనా: ముంబైలో 99% ఐసీయూలు ఫుల్
ముంబై : భారత్‌లో కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క మహారాష్ట్రలో ఆ సంఖ్య లక్ష దాటింది. అదే విధంగా దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో ఇప్పటి వరకు 55,000 వేల కేసులు వెలుగు చూడగా.. 2,044 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 1,366 కొత్త కేసులు నమోదవ్వగా.. 90 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వరకు 28,163 యాక్టివ్ కేసులు ఉండగా, 25,152 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ముంబైలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో వైద్య మౌలిక సదుపాయాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఎమ్మెల్యే భార్యతో పాటు మరో ముగ్గురికి కరోనా) ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్(ఐసీయూ) విషయానికొస్తే ముంబైలో 99 శాతం మేర నిండిపోయాయి. అంతేగాక నగరంలో 94 శాతం వెంటిలేటర్లు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శనివారం పేర్కొంది. జూన్ 11 నాటికి ముంబై నగరంలో ఐసీయూలో మొత్తం 1.181 పడకలు ఉంటే వాటిలో 1, 167 పడకలు ఇప్పటికే ఆక్రమించాయి. కేవలం 14 పడకలు మాత్రమే కొత్తగా చేరే పేషెంట్ల కోసం మిగిలి ఉన్నాయి. అలాగే 530 వెంటిలేటర్లలలో 497 ఉన్నాయి. 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986 (76 శాతం) వాడుకలో ఉన్నట్లు బీఎంసీ తెలిపింది. కాగా నగరమంతా ఉన్న కోవిడ్ హాస్పిటల్స్, కోవిడ్ హెల్త్ సెంటర్లలలో 10,450 పడకలు ఉండగా, వీటిలో 9,098 పడకలు (87 శాతం) నిండిపోయాయి. అయితే కేసులు పెరుగుతన్నప్పటికీ అందుబాటులో ఉండే పడకల సంఖ్య కూడా పెంచుతున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. (కరోనా: రోగుల పేర్లు ఒకేలా ఉండటంతో...) -
ప్రత్యేక రైళ్లు : వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన రైళ్లు ఈ రోజు (మంగళవారం) నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. 15 రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో రాయితీలకు సంబంధించి రైల్వే శాఖ స్పష్టత నిచ్చింది. మొదట ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వమని ప్రకటించిన రైల్వే శాఖ తాజాగా విద్యార్థులు, దివ్యాంగులు, రోగులకు ఊరటనిచ్చింది. కొంతమంది రోగులకు, దివ్యాంగులకు, విద్యార్థులకు మాత్రమే రాయితీ ధరల్లో టికెట్లు అందుబాటులో వుంటాయని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువ చేయకుండా మూడు కేటగిరీలకు తప్ప ఇతరులకు రైల్వే టికెట్లలో రాయితీలు ఇవ్వకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. (తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ) అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యుటీఎస్), ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) టిక్కెట్ల రాయితీలపై రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విద్యార్థులు, 4 వర్గాల దివ్యాంగులు, 11 రకాల రోగులకు మాత్రమే రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని రైల్వే శాఖ ప్రజలకు సూచించింది. కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 కొనసాగుతుండగా, దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) -
కరోనాను గెలిచారు.. ధైర్యం నింపారు..
సాక్షి, కర్నూలు: జిల్లాలో 14 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో 281 మంది కరోనాపై విజేతలుగా నిలిచారు. జిల్లాలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 278 కంటే డిశ్చార్జ్ అయిన కరోనా విజేతల సంఖ్య 281 కావడం విశేషం. సోమవారం నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 12 మందిని, కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నుంచి ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. (అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్) కరోనా వైరస్ నివారణాకు ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవడంతో జిల్లాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనాపై విజేతలుగా నిలిచిన బాధితులు అందరిలోనూ ధైర్యంతో పాటు స్ఫూర్తిని నింపారు. ల్యాబ్ సౌకర్యాల నుంచి ఐసోలేషన్ వార్డుల వరకూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడంతో కరోనా బారినపడిన బాధితులు క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు. -
కశ్మీర్లోకి ‘కరోనా’ ఉగ్రవాదులు
జమ్మూ: భారత్‌తో ముఖాముఖి తలపడలేని పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. కోవిడ్–19 బారిన పడిన ఉగ్రవాదులను దొంగచాటుగా దేశంలోకి పంపిస్తోంది. ‘ఇప్పటి వరకు కశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడిన వారిని దేశంలోకి పంపిస్తోంది. వీరి ద్వారా ఇక్కడి ప్రజలకు వైరస్ సోకుతోంది. దీనిపై పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంది’అని కశ్మీర్ డీఐజీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జమ్మూలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదుల్లో చాలామంది కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. -
కరోనాను జయించి.. క్షేమంగా ఇంటికి..
సాక్షి, అమరావతి: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నివారణ చర్యలను చేపట్టడంతో పలువురు కరోనా బాధితులు సురక్షితంగా డిశ్చార్జ్ అవుతున్నారు. ల్యాబ్ సౌకర్యాల నుంచి ఐసోలేషన్ వార్డుల వరకూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి.. ఉత్తమ వైద్య సేవలతో కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 35 మంది డిశ్చార్జ్ కాగా.. ఒక్క గురువారమే 15 మంది వరకూ ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు. అనంతపురంలో తల్లి,కుమారుడికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడంతో వారు త్వరగా కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయ్యారు. కడపలో ఒకే సారి 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొదటి విడతగా చేరిన పాజిటివ్ కేసులకు పూర్తి జాగ్రత్తలతో వైద్యం అందించారు. మరికొంత మంది 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకుని త్వరలోనే డిశ్చార్జ్ కాబోతున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి నిలయంలోని క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయిన బ్రిటన్ దేశస్తుడు ఏపీ ప్రభుత్వం సేవలు ఫైవ్ స్టార్ స్థాయిలో ఉన్నాయని కొనియాడారు. తమ ప్రాణాలకు తెగించి మరీ సిబ్బంది చేసిన సేవలు తాము జన్మలో మర్చిపోలేమని బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరో వైపు ప్రభుత్వం రోగులకు వైద్య సదుపాయాలు అందించడంలో పూర్తి అప్రమత్తతతో ముందుకెళ్తుంది. దీంతో రానున్న రోజుల్లో డిశ్చార్జ్ కేసుల సంఖ్య పెరగనుంది. -
ఇంట్లోనే ఉండండి.. ధ్యానం చేయండి
సాక్షి, హైదరాబాద్: కరోనా బారినపడకుండా వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సూచించింది. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్ బారినపడే ప్రమాదముందని తెలిపింది. అలాగే డయాబెటిస్, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల, శ్వాసకోశ వ్యాధి లక్షణాలు కూడా కొందరిలో ఎక్కువగా ఉంటాయని, వైరస్ కారణంగా వృద్ధుల మరణాలు పెరిగితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు.. ♦ ఇంట్లోనే ఉండాలి. సందర్శకులను కలవరాదు. తప్పనిసరై కలవాల్సి వస్తే మీటరు దూరంలో ఉండి మాట్లాడాలి. ♦ సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ♦ దగ్గు, తుమ్ము, వస్తే మోచేతిని అడ్డం పెట్టుకోవాలి. లేదా టిష్యూ పేపర్, చేతి రుమాలును అడ్డుగా ఉంచుకోవాలి. ♦ దగ్గు లేదా తుమ్ముకు వాడిన టిష్యూ పేపర్‌ను పారవేయాలి. రుమాలునైతే ఉతకాలి. ♦ ఇంట్లో వండిన తాజా వేడి భోజనం తినాలి. తీసుకునే ఆహారంలో అధికంగా పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ♦ రోగనిరోధక శక్తి కోసం తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. ♦ వ్యాయామం, ధ్యానం చేయాలి. ♦ రోజువారీ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ♦ కుటుంబసభ్యులు, స్నేహితులతో ఫోన్ కాల్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలి. ♦ కంటి శుక్లం లేదా మోకాలి మార్పిడి వంటి ఆపరేషన్లను వాయిదా వేసుకోవాలి. ♦ వృద్ధులు తాకిన పర్నిచర్‌ను క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులతో కడగాలి. ♦ జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. సొంత వైద్యం పనికిరాదు. ♦ జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే కనుక.. కళ్లు, ముఖం, ముక్కు, నాలుకను తాకవద్దు. ♦ బాధిత లేదా అనారోగ్య వ్యక్తుల దగ్గరకు వెళ్లవద్దు. ♦ ఎవరితోనూ కరచాలనం చేయవద్దు. స్నేహితులను, సమీప బంధువులను కౌగిలించుకోవద్దు. ♦ సాధారణ తనిఖీ కోసం ఆసుపత్రికి వెళ్లవద్దు. సమస్య ఉంటే, కుటుంబ డాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి నిర్ధారించుకోవాలి. ♦ పార్కులు, మార్కెట్లు, మతపరమైన ప్రదేశాలు, ఇతర రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు. -
చైనాలో కుప్పకూలిన కరోనా ఆస్పత్రి..!
ఫ్యూజియాన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్-19) వైరస్‌ను ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందనే చెప్పాలి. హుబే ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన ఈ ప్రాణాంతక వైరస్ బారినపడిన వేలాది జనానికి చికిత్స అందించేందుకు చైనా హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు, కాలేజీలు, ఆడిటోరియంలను ఆస్పత్రులుగా మార్చివేసింది. ఈక్రమంలో ఫ్యూజియాన్ ప్రావిన్స్ క్వాన్‌జౌ నగరంలో కరోనా బాధితులకు చికిత్సాలయంగా పనిచేస్తున్న ఓ హోటల్ భవనం శనివారం కుప్పకూలింది. ఈఘటనలో 80 మంది కరోనా బాధితులు శిథిలాల్లో చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 34 మందిని రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఫ్యూజియాన్ ప్రావిన్స్‌లో 296 కరోనా కేసులు నమోదయ్యాయని, పదివేలకు పైగా కరోనా అనుమానితులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు కరోనా వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, ఇతర ప్రాంతాల్లో ఎక్కువ వ్యాపిస్తోంది. భారత్‌లో శనివారం వరకు 34 కరోనా కేసులు నమోదయ్యాయి. -
వైద్యులూ.. ఇదేం తీరు.!
పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణం): కేజీహెచ్‌లోని చర్మవ్యాధుల ఓపీ విభాగంలో వైద్యుల తీరుతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సమయ పాలన పాటించకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. క్యూలో నిల్చోలేక నీరసించిపోతున్నారు. ఈ విభాగం ఓపీ సేవలందించే బ్లాకు రెండో అంతస్తులో ఉంది. ఈ ఓపీకి సగటున రోజుకు 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారు. వీరంతా ఉదయం 8.30 గంటలకే ఓపీ చీటీ రాయించుకుని పడుతూ లేస్తూ రెండో అంతస్తుకు చేరుకుని క్యూలైన్లో కూర్చుంటారు. వైద్యుడు రాగానే చూపించుకుని అవసరమైన మందులు తీసుకుని ఎండకు చిక్కకుండా ఇంటికి చేరుకోవాలని ప్రతి రోగి మనసులో అనుకుంటాడు. కానీ అది ఆచరణ సాధ్యం కావడం లేదు. ఉదయం 9 గంటలకు ఓపీకి వచ్చి వైద్య పరీక్షలు చేయాల్సిన వైద్యులు 10.30 దాటితే కాని రావడం లేదు. ముఖ్యంగా పురుషుల ఓపీకి వచ్చే వైద్యులు ఆలస్యంగా రావడంతో రోగులు క్యూలైన్లో పడిగాపులు పడాల్సి వస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలు దాటిన తర్వాత వైద్యులు రావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ మండిపోతుండడంతో చర్మవ్యాధులతో వచ్చే రోగులు ఎక్కువ సేపు కూర్చోలేకపోయారు. క్యూలైన్లో ఎక్కువ మంది ఉండడంతో వైద్య పరీక్షలు చాలా ఆలస్యంగా జరిగాయి. పరీక్షల అనంతరం మందుల కోసం చాంతాడంత లైన్లో నిల్చున్నారు. వృద్ధులు, పిల్లలను ఎత్తుకుని వచ్చే మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజు సకాలంలో ఓపీని తెరవాలని పలువురు కోరుతున్నారు. ఉదయం నుంచి క్యూలో ఉన్నా.. ఉదయం 8.30 గంటలకు వచ్చి క్యూలో కూర్చున్నాను. ఎండ వేడి పెరిగిపోవడంతో కూర్చోవడం చాలా కష్టంగా ఉంది. 9 గంటలకు రావలసిన వైద్యులు 11 గంటలు దాటిన తర్వాత వచ్చారు. ప్రతి రోజు ఉదయాన్నే వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తే రోగులకు వెసులుబాటుగా ఉంటుంది. – ఎస్.అప్పలరాజు, గాజువాక రెండంతస్తులు ఎక్కడం కష్టమే.. వైద్యం కోసం రెండంతస్తులు కష్టపడి ఎక్కాక.. అక్కడ వైద్యులు లేకపోతే ప్రాణం ఉసూరుమంటుంది. వైద్యులు వచ్చే వేళకు లైను కూడా పెరిగిపోతోంది. వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత మందులు చీటీ తీసుకుని మందులు ఇచ్చే లైన్లో నిల్చోవాలి. వైద్యులు ఉదయాన్నే వస్తే బాగుంటుంది. – ఎస్.మల్లేష్, మధురవాడ -
దుప్పట్లు.. ఇక్కట్లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఏడురోజులు..ఏడు రంగుల దుప్పట్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, అది ఆచరణలో సాధ్యం కాలేదు. వైట్, పింక్ కలర్ దుప్పట్లు ఇచ్చి సరిపెట్టారు. చలికాలం సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా దుప్పట్ల పంపిణీ సంగతి దేవుడెరుగు..కనీసం వాటికోసం ప్రతిపాదనలు కూడా తయారు చేయలేదంటే... ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగుల పట్ల అధికారులకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు దుప్పట్లు లేక చలికి గజగజ వణికిపోతున్నారు. జనవరి నెల నాటికి చలితీవ్రత పెరిగే అవకాశమున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్టీ, ఛాతి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక చికిత్సలయాల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు విలవిల్లాడుతున్నారు. అసలే అనారోగ్యం..ఆపై చలేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక రోగులకు సహాయంగా వచ్చిన బంధువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్‌లో నైట్ షైల్టర్లు ఏర్పాటు చేసినా, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఏడన్నారు..రెండిచ్చారు... ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం రోజుకో దుప్పటి చొప్పున ఏడు రంగుల దుప్పట్లను సరఫరా చేయాలని భావించింది. ఆదివారం–బూడిద రంగు, సోమవారం–తెలుగుపురంగు. మంగళవారం–గులాబీరంగు, బుధవారం–ఆకుపచ్చరంగు, గురువారం పసుపుపచ్చరంగు, శుక్రవారం–ఊదారంగు, శనివారం–నీలిరంగు దుప్పట్లు అందజేస్తామని ప్రకటించింది. ఆ మేరకు 2016 ఆగస్టు 27న నగరంలోని ఉస్మానియా, గాంధీ సహా అనుబంధ ఆస్పత్రులకు సుమారు 12 వేల దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఏడు రోజులకు ఏడు రంగులు సరఫరా చేయడం సాధ్యం కాదని, వైట్, పింక్ రంగులకు పరిమితం చేసింది. ఆ తర్వాత దుప్పట్ల సరఫరా నిలిపివేయడంతో ఆయా ఆస్పత్రులే సొంత నిధులతో కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొన్ని ఆస్పత్రులు జైళ్లశాఖ తయారు చేసిన దుప్పట్లను కొనుగోలు చేశాయి. ప్రభుత్వం ఆస్పత్రులకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడంతో అధికారులు దుప్పట్ల కొనుగోలు నిలిపివేశారు. అప్పుడు కొనుగోలు చేసినవాటిలో చాలా వరకు చిరిగిపోగా, మిగిలినవాటిలో మరికొన్ని రోగులు డిశ్చార్జి అయ్యాక తమవెంట తీసుకెళ్లారు. ప్రస్తుతం చాలా పడకలపై దుప్పట్లు కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు రోగుల అవసరాలకు అనుగుణంగా దుప్పట్లు కొనుగోలు చేయాల్సి ఉండగా, దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. అసలే చలికాలం..ఆపై అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు చేరుకున్న క్షతగాత్రులకు కప్పుకునేందుకు పడకపై దుప్పటి కూడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రుల్లో ఇలా ఉంటే రోగుల నుంచి వైద్య ఖర్చులు వసూలు చేస్తున్న నిమ్స్‌లోనూ దుప్పట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు చలి..అటు డెంగీ దోమలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులుకు ఇన్ఫెక్షన్ సోకుతోంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న దుప్పట్లు కూడా రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో రోగులే సొంతంగా దుప్పట్లు సమకూర్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున ఎవరైనా దుప్పటి తెచ్చుకోక పోతే రాత్రంగా చలికి వణకాల్సిందే. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన దుప్పట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటి వరకు తయారు చేయలేదు. -
ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం అందట్లేదని రోగులు ఆవేదన
-
రోగుల పట్ల శ్రద్ధతో మెలగండి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రోగులపట్ల శ్రద్ధతో మెలగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ, విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆమె ఒకింత హెచ్చరిస్తూ వైద్యులు జాగ్రత్తగా మెలగాలని సూచించారు. ఈఎస్ఐసీ వైద్యకళాశాలలో శుక్రవారం జరిగిన హిప్పోక్రటిక్ ప్రమాణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఈఎస్ఐసీ 2019–20 బ్యాచ్ వైద్య విద్యార్థులతో హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు. 2019–20 విద్యా ఏడాదిలో ప్రతిభ కనబర్చిన 19 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీని దేశంలో ప్రముఖ కళాశాలగా తీర్చిదిద్దినందుకు కళాశాల యాజమాన్యాన్ని తమిళిసై అభినందించారు. 2016 నుంచి ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ప్రాంగణం ప్లాస్టిక్ రహితంగా ఉండటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఈఎస్ఐసీ ఫైనాన్స్ కమిషనర్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. -
పావనం
శ్రీ రామకృష్ణ పరమహంస సేవలో, శిష్యరికంలో ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరిన గృహస్థు నాగ మహాశయుడు. వైద్యుడైన ఆయన తన వద్దకు వచ్చే నిరుపేద రోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేయడమేగాక, పథ్యపానీయాలకు సరిపడ డబ్బును కూడా తానే సమకూర్చేవాడు. అవధూతలా జీవించిన నాగమహాశయులు ఒకసారి కలకత్తా నుంచి స్వగ్రామం వెళ్లారు. ఆ రోజు ఏదో పర్వదినం. ఇలాంటి పర్వదినాన కలకత్తాలో ఉండి కూడా పవిత్రమైన గంగలో స్నానం చేయకుండా వచ్చేసినందుకు తండ్రి ఆయన్ని మందలించాడు. అందుకు నాగమహాశయులు ‘‘తండ్రీ! గంగ కలకత్తాలోనే కాదు... అన్నిచోట్లా ఉంది. భగవదనుగ్రహం ఉంటే, మనం ఉన్నచోటే మనం గంగాస్నానం చేయవచ్చు’’ అని జవాబిచ్చాడు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. నాగమహాశయులు స్నానం చేయడానికి వెళుతున్నారు.. అప్పుడు పెరట్లో ఒకచోట చిమ్మిన గొట్టంలోనుంచి వస్తున్నట్లుగా నీరు పైకి ఎగజిమ్ముతూ వచ్చి ఆ ఆవరణమంతా జలమయం అయిపోయింది. భగవదనుగ్రహం జలప్రవాహంలా ప్రవహించి, తన నమ్మకాన్ని నిలబెట్టినందుకు నాగమహాశయుడు పొంగిపోయి, భావోద్రేకంతో ‘‘స్వాగతం గంగామాతా! స్వాగతం! మమ్మల్నందరినీ పావనం చెయ్యి తల్లీ’’ అని అరిచాడు. ఆయన తండ్రి, ఇరుగు పొరుగు వారందరూ ఆ పవిత్ర గంగాజలాలలో స్నానం చేసి, గంగాస్నానం చేసిన అనుభూతికి లోనయ్యారు. దైవకృప... దేవుని పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంటే ఇలానే జరుగుతుంది మరి. -
ఆపరేషన్‌కు సహకరించడం లేదని...
సాక్షి, పాలమూరు : ఆపరేషన్‌కు సహకరించడంలేదన్న కారణంతో కొందరు వైద్యులు బూతులు తిడుతూ.. పిడి గుద్దులు గుద్దుతుండడంతో ఆ బాలింతలు నరకం అనుభవిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కు.ని (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేకో.. మరే కారణంతోనో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న మహిళల పట్ల దయాగుణంతో వ్యవహరించాల్సిందిపోయి.. ఇక్కడికి ఎందుకు వస్తారని.. ప్రైవేట్‌కు పోవచ్చు కదా అంటూ వైద్యులు దూషిస్తున్నారు. ఇదేమిటని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. సర్జరీకి సహకరించడం లేదని సాకులు చెబుతున్నారు. ఈ వ్యవహారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న పీపీయూనిట్‌లో చోటుచేసుకుంది. ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలో పనిచేస్తున్న పీపీయూనిట్‌లో సంతానం వద్దని భావించే మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్(కుని) చేస్తుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మహిళలు అందరూ ఇక్కడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి వస్తుంటారు. అయితే ఇక్కడ పనిచేసే మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రఫీక్, మరో వైద్యురాలు కలిసి కుని ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చిన మహిళలు ఆపరేషన్‌కు సహకరించడం లేదని ముఖంపై, ఇతర ప్రాంతాల్లో పిడి గుద్దులు గుద్దడం, రక్కడం వంటివి చేస్తున్నారు. దీంతో పాటు నోటికి వచ్చిన బూతులు తిడుతూవారిని మానసికంగా..శారీరకంగా వేధిస్తున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా... ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోవడం పెద్ద చర్చనీయ అంశంగా మారింది. పేద మహిళలు..నిరక్షరాస్యులు కావడంతో ఇన్ని రోజుల పాటు విషయం వెలుగులోకి రాలేదు. అయితే బుధవారం అంజలి అనే బాలింతరాలు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొదటి నుంచి ఆరోపణలు మహబూబ్‌నగర్ పీపీయూనిట్‌లో పని చేస్తున్న డాక్టర్ రఫీక్‌పై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఇతను పీపీ యూనిట్లో 2011–12ప్రాంతం నుంచి అక్కడే పని చేస్తున్నాడు. చాలా కాలం నుంచి పనిచేయడం వల్ల స్థానికంగా పాతుకుపోయాడు. దీంతో అక్కడ అతను చెప్పిన మాటే వేదంగా మారింది. ఏడాదికి కేటాయించిన లక్ష్యం పూర్తి చేయకపోవడం..సకాలంలో కుని ఆపరేషన్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పారిపాటిగా మారింది. అయితే డీఎంహెచ్‌వో శ్రీనివాస్ పనిచేసే సమయంలో ఇతనిని సరెండర్ కూడా చేయడం జరిగింది. తిరిగి కొన్ని రోజులకు అక్కడే విధుల్లో చేరాడు. ఆ తర్వాత ఓసారి కలెక్టర్ విజిట్ చేసిన సమయంలో అతను విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కర్కశత్వం ఎందుకు? ఎన్నో పురటి నొప్పులు భరించి శిశువుకు జన్మనిచ్చిన తల్లి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అప్పటికే ప్రసవం కోసం ఆపరేషన్ చేసుకొని..మళ్లీ పిల్లలు కాకుండా ఉండటానికి మరో ఆపరేషన్ చేసుకోవడానికి వస్తోంది. అలాంటి తల్లి శరీరం ఆపరేషన్‌కు సహకరించడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా.. సమయం తీసుకొని ఆపరేషన్ చేయాలి. అంతే తప్పా మానవత్వం మరిచి దాడి చేయడం సరైన చర్యకాదు. అలా కొడుతున్న సమయంలో ఆ తల్లి ఎంతటి బాధను అనుభవిస్తోందో అంతు చిక్కడం లేదు. చాలా కొట్టారు నేను సోమవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి ఆస్పత్రికి వచ్చి ఆడ్మిట్ అయ్యాను. మంగళవారం ఉదయం ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్ రఫీక్ నా దవడపై, ముఖంపై బలంగా కొట్టాడు. తొడ భాగంపై కొట్టడంతో పాటు నడుముని విపరీతంగా మెలిమి తిప్పాడు. దీంతో నాకు పెదవి చిట్లి రక్తం వచ్చింది. అదేసమయంలో చెప్పకూడని బూతులు తిట్టాడు. – అంజలి, చౌదర్పల్లి పొట్ట లోపలికి తీసుకోలేదని కొట్టారు నాకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో పొట్టను లోపలికి తీసుకోలేదని ఓ మేడం రెండుసార్లు కొట్టారు. – రేణుక, మర్లు, మహబూబ్‌నగర్ ముఖంపై కొట్టడంతో రక్తం వచ్చింది నాకు ఆపరేషన్ చేసే సమయంలో నా ముఖంపై కొట్టడంతో నా పెదవి నుంచి రక్తం రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రైవేట్ ఆస్పత్రికి పోవద్దా అని..బూతులు తిట్టారు. – తిరుపతమ్మ విచారణ చేసి చర్యలు తీసుకుంటాం మహబూబ్‌నగర్ పీపీ యూనిట్లో వైద్యులు మహిళలపై దాడులు చేసిన విషయంపై ఫిర్యాదు వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీపీ యూనిట్‌కు వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరిస్తాం. ఆపరేషన్ కోసం వచ్చిన వారిపై మాత్రం దాడి చేయడం అనేది సరైన చర్య కాదు. – డాక్టర్ రజిని, డీఎంహెచ్ఓ, మహబూబ్‌నగర్ -
నెలకు సరిపడా మందులు ఒకేసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీపీ, షుగర్ రోగులకు ఒకేసారి నెలకు సరిపడా మందులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) స్క్రీనింగ్ అనంతరం రక్తపోటు, మధుమేహ వ్యాధులకు నెలకు సరిపడా మందులిచ్చే కార్యక్రమం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేకాదు వారి జీవిత కాలమంతా ఈ మందులను ఉచితంగా అందించనున్నారు. కొనసాగుతోన్న వైద్య పరీక్షలు ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన 12 జిల్లాల్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)పై స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతోంది. అలాగే జూన్ చివరి వారం లేదా జులై మాసంలో మరికొన్ని జిల్లాల్లో ఎన్సీడీ స్క్రీనింగ్స్ చేపట్టబోతున్నారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ అసంక్రమిత జబ్బుల పరీక్షలను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ గట్టి పట్టుదలతో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ కూడా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. గ్రామాల్లో ఆశా, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు చాలక అవస్థలు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 104 వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మందు గోలీలు ఇస్తున్నారు. వారానికో పదిరోజులకో సరిపోయేంత మాత్రమే ఇస్తున్నారు. దీంతో 104 ఇచ్చే మందుల మీదే ఆధారపడ్డ పేద రోగులు మళ్లీ మందులు వచ్చేదాకా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాక ప్రస్తుతం స్క్రీనింగ్ జరిగే జిల్లాల్లో బీపీ ఎక్కువగా ఉన్నవారికి , షుగర్ లెవల్స్ అసాధారణంగా ఉన్నవారికి ఈ డోసులు సరిపోవడం లేదని, అందుకే వారికి బయటనుంచి ట్యాబ్లెట్స్ కొనుక్కోమని చెబుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మందుల పంపిణీ బాధ్యత ‘ఆశ’లదే బీపీకి రెండు రకాలు, షుగరుకు మూడు రకాల గోలీలు వైద్య ఆరోగ్యశాఖ ఇవ్వబోతోంది. బీపీకి 50 ఎంజీ , 20 ఎంజీ డోసులతో కూడిన ట్యాబ్లెట్లను ఇస్తారు. ప్రతి నెలా మందులు అయిపోయాక వాటిని తిరిగి తెచ్చి ఇచ్చే బాధ్యత స్థానిక ఆశ కార్యకర్తలకు అప్పగించారు. స్థానికంగా ఉండే ఆశ కార్యకర్తల వద్దే ఆ గ్రామంలో ఎంతమంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే డేటా ఉంటుంది. దాని ఆధారంగా ప్రతి నెలా మందులు ఇవ్వనున్నారు. -
వేళకురాని వైద్యులు..రోగుల ఎదురుచూపులు
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యులు దేవుడితో సమానమని దీని అర్థం. అంతటి ప్రాధాన్యత ఉన్న డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందక పలువురు మృత్యు ఒడికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ దుస్థితి కనిపిస్తోంది. సాక్షి, వరదయ్యపాళెం : 24గంటలు స్థాయి కలిగిన మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ముగ్గురు వైద్యులున్న ఈ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11గంటలు కావస్తున్నా ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు డాక్టర్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. నిరీక్షించలేని రోగులు ఆస్పత్రిలో ఉన్న నర్సు ద్వారా తాత్కాలిక వైద్యం చేయించుకుని వెనుదిరిగారు. 11 గంటలు దాటిన తర్వాత ఓ వైద్యాధికారి వచ్చారు. మరో వైద్యాధికారిణి 11.40గంటలకు వచ్చారు. సరిగ్గా ఒంటిగంటకు వీరు తిరుగుపయనమయ్యారు. ఆస్పత్రికి వైద్యం కోసం ప్రతిరోజూ 100మందికి వస్తుంటారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మండు వేసవి కారణంగా గ్రామాల్లో వడదెబ్బ బాధితులు అధికంగా ఉన్నారు. విషజ్వరాలు కూడా ప్రబలమవుతున్నాయి. ఇటీవల చిన్న పాండూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంజీనగర్ గిరిజనకాలనీలో ఊరంతా విషజ్వరాలు ప్రబలి నలుగురు మృతి చెందారు. అయినా ఇక్కడి వైద్యుల పనితీరులో మాత్రం మార్పు కనిపిం చడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు వేసవి కాలం దృష్ట్యా ఉదయం 10 గంటలపైబడి ప్రభుత్వ కార్యాలయాల వద్దకు సామాన్య ప్రజలను రప్పించద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చిన్న పాండూరు ఆస్పత్రిలో పది గంటల వరకు డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. ఆస్పత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. 24 గంటలు స్థాయి కలిగిన ఈ ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్యులను ప్రభుత్వం నియమించింది. అయితే వీరు ముగ్గురు ఒక్క రోజు కూడా హాజరుకావడం లేదు. రోజు మార్చి రోజు విధులకు హాజరవుతూ హాజరు పట్టికలో మాత్రం నెలంతా హాజరైనట్లు నమోదు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తప్పనిసరిగా బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ అక్కడ నెట్ పనిచేయలేదన్న సాకుతో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. రోజులో విధులకు హాజరయ్యే ఆ ఒక్క వైద్యుడు సైతం 2గంటలు మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ మొక్కుబడి విధులు నిర్వహించడమేమిటంటూ పరిసర ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
ముగిసిన చేప ప్రసాద పంపిణీ
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిని సోదరులు నిర్వహించే చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రెండో రోజు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆస్తమా రోగులతో ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది. రెండవ రోజు కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా తిరిగి వెళ్తున్నారన్నారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున కల్పించిన మౌలిక సదుపాయాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం పలు స్వచ్చంద సంస్థలు చేసిన సేవలు అభినందనీయమని, ఇటువంటి సామాజిక సేవలను భవిష్యత్తులో కొనసాగించాలని సూచించారు. రెండు రోజుల పాటు 87 వేల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిని హరినాథ్ గౌడ్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కీళ్ల నొప్పులు.. టోకెన్ తిప్పలు..!
కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు నిమ్స్‌లో నిలువుకాళ్ల జపం తప్పట్లేదు. ఓపీ టోకెన్ కోసం అర్ధరాత్రి 2 గంటలకే ఆస్పత్రికి చేరుకుని క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. నొప్పుల బాధను దిగమింగుకుని గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా.. తీరా ఓపీ వేళకు నిరాశే మిగులుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు నిమ్స్ ఆస్పత్రికి కీళ్ల నొప్పులతో బాధపడే రోగులు రోజుకు దాదాపు 150 మందికిపైగా వస్తుంటారు. అయితే 60 మంది రోగులకు మించి వైద్య సేవలు అందించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. కీళ్లనొప్పుల బాధితుల కోసం 1994లో ప్రత్యేకంగా రుమటాలజీ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రొఫెసర్ జి.నరసింహులు ఆస్ట్రేలియాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. అప్పటివరకు ప్రైవేటులో ఎక్కడా రుమటాలజీ వైద్యుల్లేకపోవడంతో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. దీంతో 2001లో రుమటాలజీ విభాగం కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మరింత మంది స్పెషలిస్టులను తయారు చేసేందుకు 2005లో డీఎం రుమటాలజీ కోర్సు ఏర్పాటు చేయగా, 2007లో దీనికి గుర్తింపు లభించింది. అనేక పరిశోధనలు, మెరుగైన వైద్యసేవలు, అత్యుత్తమ వైద్యవిద్య బోధనతో దేశంలోనే ఓ వెలుగు వెలిచిన రుమటాలజీ విభాగం ప్రస్తుతం కనీస వైద్యసేవలు అందించలేకపోతోంది. ఒక్కొక్కరూ వీడిపోవడంతో ప్రొఫెసర్ నరసింహులు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత రోగుల నిష్పత్తికి తగ్గట్లు ఆ విభాగాన్ని అభివృద్ధి చేయకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, నిమ్స్‌తో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేతనాలు రెట్టింపు స్థాయిలో ఉండటంతో వైద్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రిని వీడారు. ఇప్పటివరకు ఇక్కడ 45 మంది వరకు రుమటాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తిచేయగా, వీరి సేవలను వినియోగించుకోవడంలో పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉస్మానియా, గాంధీ సహా జిల్లా కేంద్రాల్లోనూ రుమటాలజీ వైద్యుల్లేకపోవడం, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ చికిత్సలు ఖరీదు కావడం, కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్‌లో మరింత మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. 2011 వరకు ఐదుగురు ఫ్యాకల్టీ వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరికి పడిపోయింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ వేళలు కొనసాగుతుండటం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో రోజుకు సగటున 60 మందికి మించి చూడలేకపోతున్నారు. ఎలాగైనా ఇక్కడ వైద్యం చేయించుకోవాలనే ఆశతో అర్ధరాత్రి రెండు గంటలకే ఓపీ కౌంటర్‌కు చేరుకుంటున్నారు. తీరా ఉదయం టోకెన్లు దొరక్క తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే.. కీళ్లవాతం బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేరు. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా కింగ్‌జార్జ్, కోల్‌కతా, చండీగఢ్, వేల్లూర్, ముంబై, నిమ్స్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ల నుంచి ఏటా 45 మంది మాత్రమే సూపర్ స్పెషాలిటీ వైద్యులు బయటికి వస్తున్నారు. రుమటాలజీలో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన వైద్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ డిమాండ్ ఉంది. వేతనం కూడా నిమ్స్‌లో కన్నా రెట్టింపు ఉంది. పాలకులు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల నిమ్స్ సహా ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరిపైనే భారం పడుతోంది. –ప్రొఫెసర్ జి.నరసింహులు, విశ్రాంత వైద్యుడు, నిమ్స్ -
మందులేవి మహాప్రభో?
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సర్కారీ ఆస్పత్రుల్లో మందుల సరఫరా పూర్తిగా గాడి తప్పింది. ఆపత్సమయంలో ఆదుకునే మందులూ కరువయ్యాయి. ఏ ఆస్పత్రికి వెళ్లినా జబ్బు నయం చేసే మందులు కనిపించడం లేదని రోగులు వాపోతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలతో వడదెబ్బకు జనం పిట్టల్లా పడిపోతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు తీసుకెళితే తక్షణమే కోలుకునేందుకు ఇవ్వాల్సిన సెలైన్ బాటిళ్లకూ దిక్కులేకుండా పోయింది. వడదెబ్బతో కొందరు, మంచి నీరు లభించక కలుషిత నీరు తాగి డయేరియాతో మరికొందరు ఇలా లెక్కకు మించి బాధితులు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. వీరికి తక్షణమే సెలైన్ ఎక్కించి వారిని ముందు కోలుకునే విధంగా చేయాలి. అయితే.. వచ్చిన ప్రతి రోగికి ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) మాత్రమే ఇస్తున్నారు. దీంతో రోగులు కోలుకోలేకపోతున్నారు. ‘సెలైన్ కావాలంటే బయట తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రుల సిబ్బంది తెగేసి చెబుతుండటంతో బాధితుల బాధ వర్ణనాతీతం. పేదల మందులకు వెచ్చించాల్సిన రూ.140 కోట్లను ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పసుపు–కుంకుమ పథకానికి తరలించి రోగుల ప్రాణాలతో ఆడుకుంటోంది.530 రకాల వరకు మందులు ఉండాల్సి ఉన్నా..: పావలా ఖరీదు కూడా చేయని పారాసెటమాల్ మందులు కూడా ఆస్పత్రుల్లో లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. అంతుచిక్కని జ్వరాలతో ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. వారికి తక్షణమే పారాసెటమాల్ ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా లేవు. రెండ్రోజుల క్రితమే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌కు వచ్చాయని చెబుతున్నా అవి ఇంతవరకూ ఆస్పత్రులకు సరఫరా కాలేదు. గత కొన్ని నెలలుగా ఏఆర్వీ మందులు అందుబాటులో లేకపోయినా పట్టించుకునే నాథుడే లేరు. ఈఎంఎల్ (ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్) జాబితాలో 530 రకాల మందుల వరకూ ఉండాలి. కానీ బోధనాస్పత్రుల్లోనే 150 రకాల మందులకు మించి లేవు. అంటే.. 70 శాతానికి పైగానే మందులు అందుబాటులో లేవు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ..: వాస్తవానికి.. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఈ మందులను సరఫరా చేయాలి. ఈ సంస్థ తమకు ఆస్పత్రుల నుంచి మందులు కావాలని సమాచారం రాలేదంటోంది. ఆస్పత్రులేమో తాము పంపించినా మందులు ఇవ్వలేదని చెబుతున్నాయి. ఇలా ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. దీంతో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక గాయమై ఆస్పత్రులకు వస్తే కట్టు కట్టడానికి కనీసం బ్యాండేజీ, గాయాన్ని శుభ్రం చేయడానికి దూది కూడా లేదు. తాము ఎన్నిసార్లు మందుల గురించి అడిగినా పట్టించుకోవడం లేదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. చివరకు పేద రోగుల మందులకు వెచ్చించాల్సిన రూ.140 కోట్ల నిధులను పసుపు–కుంకుమకు మళ్లించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం వంటి చోట్ల పెద్దాస్పత్రుల్లో మందుల కొరత తక్షణమే తీర్చాలని వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ)కి లేఖలు రాసినా ఫలితం శూన్యం. ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ ప్రస్తుతం సెలవులో ఉండటంతో ఆయనకు బదులుగా దీన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కొరత ఉన్న మందులు వచ్చాయి ఇటీవల పారాసెటమాల్, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేని మాట వాస్తవమే. అయితే.. మొన్ననే ఆ మందులు పంపించారు. మిగతా మందుల కొరత గురించి నా దృష్టికి రాలేదు. కొన్ని మందులు అందుబాటులో లేకపోవడంతో పక్క జిల్లాల నుంచి తెప్పించుకున్నాం. అలాంటిదేదైనా ఉంటే తక్షణమే చర్యలు తీసుకుంటాం. – డా.దుర్గాప్రసాద్, కమిషనర్, వైద్యవిధాన పరిషత్ మందుల కొరత నా దృష్టికి రాలేదు నేను సోమవారం చాలా బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో మాట్లాడాను. ఎవరూ ఎక్కడా మందుల కొరత ఉందని నాతో చెప్పలేదు. ఐవీ ఫ్లూయిడ్స్ కొరత కూడా లేదు. ఏదైనా ఒకటో అరో ఖరీదైన మందులు లేకపోవచ్చుగానీ, రొటీన్‌గా వాడే అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. – డా.కె.బాబ్జీ, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు -
మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడు మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేరట్‌పై చికిత్స పొందుతున్న అయిదుగురు రోగులు ఊపిరి ఆడక మృతి చెందారు. మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా మధురైలో కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్ బ్యాకప్ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆస్పత్రి తప్పిదం ఏమీ లేదంటూ డీన్ చేతులు దులుపుకున్నారు. కాగా మృతులు మల్లిక (55). రవిచంద్రన్ (55)గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. -
‘సర్వ’జన కష్టాలు
అనంతపురం న్యూసిటీ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రిలోని పలు వార్డుల్లో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. స్కాన్, ఎక్స్‌రేలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలకు వెళ్లాలన్నా స్ట్రెచర్ ఉండదు. ఒక వేళ స్ట్రెచర్ ఉంటే రోగి సహాయకులు ఉండరు. దీంతో రోగుల బంధువులే ఎంఎన్ఓ, ఎఫ్‌ఎన్‌ఓలుగా మారాల్సి వస్తోంది. హిందూపురం ఆరుమాకులపల్లికి చెందిన నారమ్మ అనే వృద్ధురాలును ఎఫ్ఎం వార్డులో అడ్మిషన్ చేయాల్సి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలికి వైద్యులు స్కాన్‌కు రెఫర్ చేశారు. కొడుకు గోవిందు, అల్లుడు నరసింహ, ఇతర కుటుంబీకులు ఉదయం 9.45 నుంచి వార్డులో స్ట్రెచర్, వీల్ చైర్ కోసం ఎదురుచూశారు. రోగి సహాయకులు లేకపోవడంతో చివరకు ఈ ముగ్గురే వృద్ధురాలిని వార్డు నుంచి స్ట్రెచర్‌పై స్కాన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఉదయం 11.25 గంటలకు స్కాన్ పూర్తయ్యింది. తిరిగి ఆ వృద్ధురాలిని వార్డుకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలో ఏ వార్డు ఎటువైపు ఉందో తెలియని పరిస్థితి. ఎఫ్ఎం వార్డులో తీసుకెళ్లేది పోయి ఓపీ నంబర్ 3కి తీసుకెళ్లారు. వార్డు ఎక్కడుందని అందరినీ బతిమాలుకోవాల్సిన పరిస్థితి. చివరకు 12 గంటల సమయంలో అక్కడే ఉన్న రోగులు సమాచారం ఇవ్వడంతో వారు అతికష్టం మీద వార్డుకు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో నిత్యం ఇలాంటి దయనీయమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నా..యాజమాన్యం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా మేలుకొని వార్డుల్లో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలను అందుబాటులో ఉంచి సేవలందించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. -
రోగులకూ ఆధార్ లింకేజీ
సాక్షి, వేములవాడ: ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే తప్పకుండా వెంట ఆధార్‌కార్డు తీసుకెళ్లాల్సిందే... ఎందుకంటే ప్రతీ రోగి వివరాలను ఆన్లైన్లో పొందుపరచేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగి సర్కారు వైద్యం కోసం దవాఖానాకు వెళ్లగా, బీపీ, షుగర్, జ్వరం పరీక్షలు నిర్విహించి వాటిని నమోదు చేస్తారు. దీంతో ప్రతీ రోగి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం 200లకు పైగా రోగులు వైద్య పరీక్షలకు వస్తున్నట్లు డాక్టర్ మానస తెలిపారు. వీరి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఆధార్‌కార్డు నంబర్ నమోదు చేయకుంటే ఆన్లైన్లో పేర్లు నమోదు కావడం లేదని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చేవారు తప్పకుండా తమ ఆధార్‌కార్డును తీసుకుని రావాలని సూచిస్తున్నామని చెబుతున్నారు. రోగుల వివరాలు నమోదు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను నమోదు చేస్తారు. రోగి పూర్తి పేరు, ఊరు, వీధి, వ్యాధి లక్షణాలు నమోదు చేస్తారు. అనంతరం బీపీ, షుగర్, ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫార్మాసీకి తీసుకెళితే సదరు రోగి పేరు నమోదు చేసుకోని, ఈ–ఔషదీలో మందుల పేర్లను నమోదు చేస్తారు. దీంతో రోగి వాడిన మందుల సమాచారం ఆన్లైన్లో ఉండిపోతుంది. ఇలా ప్రతీ రోగి పూర్తి వివరాలు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఆధార్‌కార్డుతో కూడిన ఐటీ నంబర్‌పై లభ్యం కానుంది. ఇంటింటికి నమోదు ఆశావర్కర్లు ఇంటింటికి తిరుగుతూ రోగుల వివరాలను పొందుపరుస్తారు. దీంతో ఎవరికి ఎలాంటి వ్యాధి ఉంది, ఎంత కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు, ఎలాంటి మందులు వాడుతున్నారు అనే వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. దీర్ఘకాలిక, వంశపారంపర్య వ్యాధులు, ఇతర రోగాలతో బాధపేడే వారి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీంతో ఏ ఇంటిలో ఎంత మంది ఎలాంటి రోగాలతో బాధపడుతున్నారు? ఏ పరీక్షలు చేయాలనే అంశాలపై నిపుణులు పునరాలోచించుకుంటారు. ప్రతీరోగికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నాం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగి పూర్తి వివరాలు తమ సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఇంతేకాకుండా అన్ని అంశాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. దీంతో ఈ రోగి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తన ఆధార్‌కార్డు నంబర్ చెప్పడంతో రోగి పూర్తి వివరాలు, అనారోగ్య లక్షణాలు, వాడుతున్న మందులు మొత్తం అంశాలు ఆన్లైన్లో లభిస్తాయి. దీంతో ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడే అంశంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం పంచేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. - డాక్టర్ మహేశ్‌రావు, వైద్యాధికారి -
ప్రాణభిక్ష పెట్టండి..
సంగెం: రెక్కాడితేనే డొక్కాని నిరుపేద కుటుంబం. నిత్యం కూలీనాలీ చేసుకుంటేనే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లే దీనస్థితి. అలాంటి కుటుంబంలోని తల్లికి రెండు కిడ్నీలు పాడైపోయాయనే పిడుగులాంటి నిజం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో దిక్కుతోచని దయనీయస్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యురాలి దీనగాధ. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తికి చెందిన సదిరం లలిత(45), మల్లయ్య దంపతులకు ఒక కుమారుడు రాజు, కూతరు కోమల ఉన్నారు. గుంట జాగలేని నిరుపేద కుటుంబం కావడంతో రెక్కల కష్టాన్ని నమ్ముకిని కూతురు కోమల, కుమారుడు రాజులకు వివాహం జరిపించారు. ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని అనుకుంటున్న సమయంలో లలిత ఆనారోగ్యం భారినపడింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి మందులు వాడుతున్న క్రమంలో లలితకు రెండు కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు పిడుగులాంటి నిజం చెప్పారు. లలిత ఆరోగ్యం కుదుట పడాలంటే కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లలిత ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నది. లలితకు కిడ్నీ ఇచ్చేందుకు భర్త మల్లయ్య, కుమారుడు రాజు సిద్ధంగా ఉన్నప్పటికీ వీరి కిడ్నీ లలి తకు సరిపోతుందో లేదోనని, పరీక్షలు నిర్వహిం చుకోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. తమ కిడ్నీ సరిపోకుంటే జీవ న్ధాన్ కింద అవయవదానం చేసిన వారి కిడ్నీ అయినా అమర్చి లలితకు ప్రాణభిక్ష పెట్టా లని భర్త ,కుమారుడు వేడుకుంటున్నారు. కిడ్నీ మార్పిడికి దాతలు సహకరించాలని కోరుతున్నారు. అకౌంట్ నంబర్ 73065213615 సదిరం లలిత ఏపీజీవీబీ గవిచర్ల బ్రాంచ్, ఐఎఫ్‌సీ కోడ్ ఏపీజీవీ0005158 -
ఇలాగైతే వైద్యం చేయలేం..!
సాక్షి, హైదరాబాద్ రోజురోజుకూ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో దాడులు చోటు చేసుకున్నాయి. గత వారం గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే రెండు నెలల శిశువు చనిపోయిందని ఆగ్రహానికి గురైన బంధువులు ఓ డాక్టర్‌పై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రధానంగా బోధనాస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లపై ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. దాడులకు నిరసనగా జూనియర్ డాక్టర్లు (జూడా)రెండ్రోజులపాటు గాంధీ, నీలోఫర్ ఆసుపత్రుల్లో వివిధ రకాల వైద్య సేవలను బంద్ చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత జూడాలతో సమావేశమై చర్యలు తీసుకుంటానని హామీయిచ్చారు. దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, డాక్టర్లకు భద్రత కల్పిస్తామన్నారు. ఎందుకీ పరిస్థితి...? నిలోఫర్ ఆసుపత్రిలో రోగి బంధువు వార్డుల్లోకి వెళ్లాలంటే అటెండర్‌కు పది రూపాయలు ఇవ్వాలి. నాలుగు ఫోర్లకు వెళ్లాలంటే రూ. 40 ఇవ్వాలి. ప్రభుత్వాసుపత్రుల్లో కొరత కారణంగా డాక్టర్లు మందులు రాసిస్తారు. వాటిని కొనేందుకు రోగి బయటకు వెళ్లాలి. తిరిగి వచ్చేప్పుడు మళ్లీ అదే తంతు. ఏదైనా పరీక్ష చేయించాలంటే ఆసుపత్రిలో అందుబాటులో ఉండవు. బయటకు వెళ్లి చేయించాలి. రోగిని బంధువే వీల్‌చైర్‌లో కానీ, మోసుకొని కానీ తీసుకెళ్లాలి. ఒకవేళ రోగికి సీరియస్ అయితే వైద్యుల కొరత కారణంగా సకాలంలో వైద్యం చేసే పరిస్థితి ఉండదు. ఇవే ఇప్పుడు జూనియర్ డాక్టర్లపై దాడులకు కారణంగా నిలుస్తున్నాయని జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ అభిప్రాయపడుతున్నారు. వైద్యం విషయంలో రోగులకు అనేక హక్కులున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల 17 రకాల హక్కులపై ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని అమలు చేయకపోవడం వల్లే రోగులకు, డాక్టర్లకు మధ్య వివాదంగా మారి ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. రోగుల హక్కులేంటి? ►జబ్బుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు రోగికి ఉంది. రోగికి వచ్చిన జబ్బు ఏంటో వైద్యులు తెలియజేయాలి. జబ్బు తీవ్రతను రోగికి అర్థమైన సులువైన భాషలో చెప్పాలి. డాక్టర్ అర్హతను తెలుసుకునే హక్కు రోగికి ఉంది. ►అత్యవసర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగికి తక్షణమే వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులది. అత్యవసర వైద్యం పొందే హక్కు ప్రతి రోగికీ ఉంది. ముందస్తు ఫీజు చెల్లించకున్నా వైద్యం చేయాలి. ►మహిళారోగులకు పురుష వైద్యుడు చికిత్స చేసే పరిస్థితి వస్తే, తప్పనిసరిగా ఆ మహిళా రోగికి తోడుగా మరో మహిళ ఉండేలా చూడాలి. ►ఫీజులు, ధరల విషయంలో పారదర్శకత ఉండాలి. చికిత్సలకు వసూలు చేసే ధరలను ఆసుపత్రులు రోగులకు బ్రోచర్ల రూపంలో ఇవ్వాలి. ఇంగ్లిషులోనూ, స్థానిక భాషలోనూ అవి ముద్రించి ఇవ్వాలి. ►ఫీజుల విషయం సహా ఇతరత్రా వివాదాలు నెలకొంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యే హక్కు రోగికి ఉంది. శవాన్ని తీసుకెళ్లేందుకు బంధువులకు హక్కుంది. ఒకవేళ సంబంధిత బంధువులు ఫీజు చెల్లించకపోయినా శవాన్ని తీసుకెళ్లకుండా ఆపకూడదు. ►రోగుల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ప్రతి రోగిని పట్టించుకునే పరిస్థితి ఉండటంలేదు. ఇది రోగికి, డాక్టర్‌కు మధ్య అగాధాన్ని పెంచుతోంది. దాన్ని అర్థం చేసుకోవాలే కానీ డాక్టర్లపై రోగులు దాడి చేయడం సమంజసం కాదు. డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, ఆరోగ్య విశ్వవిద్యాలయం సమయం ఇవ్వకపోవడం వల్లే అసహనం వైద్యులపై ఒత్తిడి పెరుగుతున్నమాట వాస్తవం. వైద్యులు రోగులకు సమయం కేటాయిస్తే వారి మధ్య అగాథం పెరగదు. ఈ విషయాన్ని మేం జూనియర్ డాక్టర్లకు చెబుతున్నాం. రోగులు ఇలా వైద్యులపై దాడులు చేయడం సమంజసం కాదు. డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ -
రోగులతో చెలగాటం!
జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గల శేషుపల్లికి చెందిన కుర్మ ప్రవీణ్‌కుమార్ ఇటీవల మంచిర్యాల పట్టణంలోని అభయ కిడ్నీ ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స చేయించుకున్నాడు. ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న మెడికల్ షాపులో మందులు కొన్నాడు. ఇవి వేసుకున్న ప్రవీణ్‌కు వాంతులు, విరేచనాలు కావడంతో వాటిని ఆపేసి పరిశీలించగా కాలం చెల్లిన తేదీ ఉంది. దీంతో ఖంగుతిన్న ఆయన మరుసటి రోజు వెళ్లి మెడికల్ షాపులో నిలదీశాడు. డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన డ్రగ్ ఇన్స్పెక్టర్ సంతోశ్ ఆ మందులు కాలం చెల్లినవిగా నిర్దారించారు. ఈ మెడికల్ షాపుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాలటౌన్: దుకాణంలో ఫార్మసిస్టు ఉండడు.. అయినా మందులు అమ్ముతారు. డాక్టర్ చీటీ లేకుండా ఏ మందు అడిగినా ఇచ్చేస్తారు. కాలం చెల్లినా ఫర్వాలేదు రోగులకు దర్జాగా అంటగడుతారు. ఒకటీ, రెండు కాదు...అనేక మెడికల్ షాపుల్లో ఇదే తంతు జరుగుతోంది. జిల్లాలో మెడికల్ షాపుల నిర్వహణ ఇష్టారాజ్యంగా తయారైంది. డబ్బే పరమావధిగా వ్యాపారం సాగుతోంది. ఏ మాత్రం అవగాహన లేనివారు కూడా మందులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుకాణం నిర్వహించే వ్యక్తి ఫార్మసిస్టు అయి ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కనీసం ఇంటర్ వరకు చదివిన వారైనా దుకాణాల్లో కనిపించకపోవడం గమనార్హం. అధికారులు మామూళ్ల మత్తులో పడి మెడికల్ షాపులపై కన్నెత్తి చూడకపోవడంతో అడిగేవారే లేరన్న ధీమాతో వ్యాపారులు కాలం చెల్లిన మందులు సైతం దర్జాగా విక్రయిస్తున్నారు. నిబంధనలు బేఖాతర్.. జిల్లాలో సుమారు 1000 వరకు మెడికల్ షాపులు ఉండగా.. వీటికి మందులు సరఫరా చేసేందుకు 30 వరకు ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులకు అనుసంధానంగా 700లకుపైగా మందుల దుకాణాలు ఉన్నాయి. ఇందులో సగం దుకాణాలు ఫార్మసిస్టులు లేనివే ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడైనా ఆస్పత్రి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుసంధానంగా మందుల దుకాణం పెట్టేందుకు పోటీ విపరీతంగా ఉంటోంది. రెండున్నరేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా ఏర్పడడంతో కొత్తగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇక్కడ కొత్తగా వెలుస్తున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో మందుల దుకాణాలు పెట్టేందుకు చాలా మంది పోటీ పడుతూ అవకాశం దక్కించుకుంటున్నారు. మరికొన్ని ఆస్పత్రులు సొంతంగా మెడికల్ షాపులు నెలకొల్పుతున్నాయి. అయితే విడిగా నిర్వహిస్తున్న మందుల దుకాణాల్లో ఫార్మసిస్టే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. దుకాణం నిర్వహిస్తున్న సమయాల్లో ఫార్మసిస్టు పర్యవేక్షణనే మందుల విక్రయాలు జరగాలి. కాని అనేక రిటైల్ దుకాణాల్లో ఫార్మసిస్టు అందుబాటులో ఉండడం లేదు. పట్టణాల్లోనే ఫార్మసిస్టు లేకుండా విక్రయాలు కొనసాగుతుంటే ఇక గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. గ్రామాల్లో ఎలాంటి ఫార్మసిస్టు ధ్రువపత్రం లేకుండానే, ఇతరుల సర్టిఫికెట్లను అద్దెకు తెచ్చుకుని దుకాణాలు నడుపుతూ మందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంబీబీఎస్ వైద్యులు సిఫార్సు చేసిన మందుల చీటీ ఆధారంగానే జులుబు, జ్వరం వంటి చిన్నచిన్న రోగాలకు సైతం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చిన్నపిల్లలు వెళ్లి అడిగినా మందు బిళ్లలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్ సూచన మేరకు ఎవరికైనా ఇచ్చే మందులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలి. కానీ బిల్లు కావాలంటే నిర్వాహకులు అదనంగా పదిశాతం డబ్బులు వసూలు చేస్తున్నారు. కానరాని తనీఖీలు జిల్లాలో మందుల దుకాణాల నిర్వహణపై జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. కానీ జిల్లాలో ఇష్టారీతిన మందుల దుకాణాలు నిర్వహిస్తున్నా, ఒక్క దుకాణంపై డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మెడికల్ దుకాణాల్లో ఫార్మసిస్టుల స్థానంలో మెడికల్ దుకాణాల నిర్వాహకులు పలువురు సిబ్బందిని నియమించుకుని మందుల విక్రయాలు జరుపుతున్నారు. వారికి మందులపై ఎలాంటి అవగాహన లేకపోవడం, డాక్టర్లు మందుల పేర్లను స్పష్టంగా రాయకుండా, గీతల రూపంలో రాసి ఇవ్వడంతో, ఏ మందులు రోగులకు అంటగడుతున్నారోననే భయం ప్రజల్లో ఉంది. మెడికల్ దుకాణంలోని మందులు డేట్ ఎక్స్పైరీ(కాలం చెల్లినవి) ఉంటే, వెంటనే వాటిని షాపు నుంచి తొలగించి, మళ్లీ కొత్త మందులను తెప్పించి, రోగులకు ఇవ్వాలి. కానీ ఎలాంటి అవగాహన లేనివారు మందులను విక్రయిస్తుండడం, కాలం చెల్లిన మందుల గురించి పట్టించుకోకుండా, వాటినే రోగులకు ఇస్తున్నారు. కాలం చెల్లిన మందులు వేసుకున్న వారికి వ్యాధి తగ్గకపోగా, కొత్త వ్యాధులు వస్తున్నాయి. దీంతో జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మందుల దుకాణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్ నిత్యం తనిఖీ చేస్తూ, ఆయా దుకాణాలకు లైసెన్సు ఉందా, సర్టిఫికెట్ ఉన్న ఫార్మసిస్టు దుకాణం నిర్వహిస్తున్నారా అనే విషయాలతోపాటు, కాలం చెల్లిన మందుల విక్రయాలు జరుపుతున్నారా? అనే దానిపై ఇకనైనా అధికారులు దృష్టి సారించి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. తనిఖీలు నిర్వహిస్తున్నాం జిల్లాలో మెడికల్ షాపులపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి, ఆయా మెడికల్ షాపులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. జిల్లా కేంద్రంలో అభయ కిడ్నీ ఆస్పత్రి ఆవరణలోని మెడికల్ షాపు నిర్వాహకులు కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుపై స్పందించి తనిఖీ చేశాం. కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లుగా నిర్దారించి, ఆ దుకాణంపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదించాం. – సంతోష్, మంచిర్యాల జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ -
చివరి మజిలీలో భరోసా
ఆదిలాబాద్‌టౌన్ : దీర్ఘకాలిక వ్యాధులు నయం కాక నరకయాతన పడుతున్న వ్యాధిగ్రస్తులకు భరోసా ఇచ్చేందుకు రిమ్స్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. చివరి మజిలీలో ప్రశాంత జీవనం గడపడానికి కౌన్సెలింగ్‌తోపాటు వైద్యం చేస్తున్నారు. ఫ్యాలియేటివ్ కేర్ సెంటర్ ద్వారా నయం కాని వ్యాధితో బాధపడుతున్న వారికి మనోధైర్యాన్నిస్తూ భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం రోగులకు ఈ కేంద్రం ద్వారా చికిత్స అందిస్తున్నారు. వ్యాధి నయం కాదని తెలిసినా చివరి దశలో వారికి చికిత్సలు చేస్తూ ధైర్యం నింపుతున్నారు. అంతే కాకుండా ఆస్పత్రికి రాకుండా ఇంటి వద్ద మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు చికిత్సలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, పుండ్లతో మంచం పట్టిన వారికి, పక్షవాతం వల్ల నడవలేని వారికి, కాలేయం, కిడ్నీ పాడైపోయిన వారికి కేంద్రంలో ముఖ్యంగా వైద్యసేవలు అందజేస్తూ మేమున్నామని భరోసానిస్తున్నారు వైద్యులు. రిమ్స్‌లో కేంద్రం.. దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు ప్యాలియేటీవ్ సేవ కేంద్రం రిమ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 8 పడకలు అందుబాటులో ఉంచారు. 50శాతం క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తుండగా, మిగతా కాలేయం, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం వ్యాధిగ్రస్తులకు చికిత్స నిర్వహిస్తున్నారు. బతకడం కష్టమని తెలిసినా ఇంటివద్ద రోగంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ చికిత్స అందించి కొంతమేర అయిన నొప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేక భోజనంతోపాటు ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా పీఆర్పీసీ సొసైటీ ద్వారా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2018 అక్టోబర్ 8వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రోగాల బారిన పడి కుటుంబ సభ్యుల నుంచి చేయూతలేని వారికి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇంటి వద్దే వైద్యం.. ఆస్పత్రికి రాలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రోగులకు ఈ సేవలు అందజేస్తున్నారు. ప్రత్యేక వాహనం ద్వారా ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 392 మందికి హోమ్‌కేర్ ద్వారా వైద్యం అందిస్తున్నట్లు ప్యాలియేటీవ్ కేంద్రం వైద్యులు తెలిపారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి ఇంటికెళ్లి క్యాన్సర్, పక్షవాతం, కాలేయం వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 120 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, 600 మంది ఇతర దీర్ఘకాలిక రోగులకు చికిత్సలు చేసినట్లు వారు చెబుతున్నారు. సేవలు ఇలా.. రిమ్స్‌లోని మొదటి అంతస్తులో ఈ కేంద్రం ఉంది. ఇక్కడ చేరిన రోగులకు వైద్యం అందించడంతోపాటు భోజనం వసతి కల్పిస్తున్నారు. అలాగే రోగి బంధువుకు కూడా భోజనం అందిస్తున్నారు. ప్రతినెలా 4వ బుధవారం హైదరాబాద్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్య నిపుణులు) వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. అయితే రోగులకు వైద్యం అందించేందుకు ఒక వైద్యురాలు, ఒక ఫిజియోథెరపిస్ట్, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్ఎంలు, హోంకేర్ వెళ్లేందుకు వాహనం కోసం ఒక డ్రైవర్, నలుగురు కేర్‌గీవర్స్ పనిచేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు పాలియేటీవ్ సేవ కేంద్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధి నయం కాని వారికి వైద్యసేవలు అందిస్తాం. మంచానికే పరిమితమైన వారికి నొప్పులు తగ్గించడానికి వైద్యసేవలు అందిస్తున్నాం. ఆస్పతికి రాలేని పరిస్థితిలో ఉన్న వారికి 30 కిలోమీటర్ల పరిధిలోని వారి ఇంటికి వెళ్లి వైద్యం చేస్తున్నాం. ప్రశాంత జీవనం గడపడం కోసం రోగులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎవరైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే సేవ కేంద్రంలో చేరేందుకు సెల్ నం.9492903315లో సంప్రదించవచ్చు. – వెంకటలక్ష్మి, పాలియేటీవ్ సేవ కేంద్రం వైద్యురాలు -
జిల్లా ఆస్పత్రికి కమీషన్ల జబ్బు
ఇచట అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ కారణంతోనే జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పుడు కమీషన్ల జబ్బు పట్టింది... ఇక్కడి సిబ్బంది, దళారులు కుమ్మక్కై రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ధర్మాస్పత్రిని ఆశ్రయించిన క్షతగాత్రులను, గర్భిణులను, రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ, కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేయిస్తున్నారు. ఇంతజరుగుతన్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు... నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో సమస్యలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రికి స్థానికులే గాక మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, ప్రజలు వైద్యం కోసం రోజూ వందలాది మంది వస్తుంటారు. కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ నుంచి కూడా ఆస్పత్రికి వస్తారు. కేంద్ర ప్రభుత్వ ఎన్హెచ్ఎం నిధులతో ఇటీవల ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు సమకూరాయి. సిటీ స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, డయాలసిస్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల ఎమ్మార్ఐ కూడా మంజూరు అయింది. ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. సౌకర్యాలు ఉండడంతో ఓపీ కూడా పెరిగింది. ఆస్పత్రిలో వైద్యం కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చాలా వరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వస్తారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉంటే కర్నూలు, కడప రిమ్స్‌కు రెఫర్ చేస్తారు. అయితే ఇటీవల ఎక్కువ కేసులు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడి జిల్లా ఆస్పత్రికి వస్తే ఆస్పత్రి సిబ్బంది కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఫోన్ చేస్తున్నారు. వారి ప్రతినిధి వెంటనే వచ్చి ‘మా ఆస్పత్రిలో మంచి గ్యారెంటీ ట్రీట్మెంట్ చేస్తాం’అని చెప్పి వారి ఆస్పత్రికి తీసుకొని వెళ్తున్నారు. ఇందుకు గాను సమాచారం చేరవేసిన సిబ్బందికి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం కమీషన్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నారు. కొన్ని సమయాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు జిల్లా ఆస్పత్రి వద్దనే కాపుకాచి ఉంటున్నారు. + జిల్లా ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చే వారిని కొందరు సిబ్బంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. బీపీ తక్కువగా ఉందని, రక్తం ఎక్కించాలని ఇలా పలు కారణాలు చూపుతూ వారిని ఆస్పత్రి నుంచి పంపిస్తున్నారు. కడపకు వెళ్తామని గర్భిణీ తరఫు వాళ్లు చెప్పినా కమీషన్ల కోసం కొందరు సిబ్బంది వారిని భయపెట్టి ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేలా చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ‘అమ్ము’లెన్స్..! జిల్లా ఆస్పత్రిలో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. అత్యవసర సమయంలో ఆస్పత్రిలోని రోగులను అంబులెన్స్‌ల ద్వారా కడప రిమ్స్‌కు తీసుకొని వెళ్తారు. గతంలో అయితే ప్రభుత్వ అంబులెన్స్‌ల్లోనే కర్నూలు, తిరుపతికి తీసుకొని వెళ్లేవారు. అయితే ఇటీవల ఆస్పత్రికి ఏ కేసు వచ్చినా ప్రైవేట్ అంబులెన్స్‌ల్లోనే కడపకు తరలిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఆస్పత్రిలో పని చేస్తున్న కొందరు సిబ్బంది ఏదైనా కేసు వచ్చినా వెంటనే ప్రైవేట్ అంబులెన్స్‌లకు సమాచారం ఇస్తున్నారు. దీంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. తాగునీటికి ఇక్కట్లు ఆస్పత్రి ప్రాంగణంలో ప్రధాన ద్వారం సమీపంలో మంచి నీళ్ల ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. మంచి నీరు కావాలంటే రెండో అంతస్తులోని వార్డులో ఉన్న రోగులు కిందికి దిగి రావాల్సి ఉంటుంది. వార్డుల్లో మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని గతంలో అధికారులు చాలా సార్లు చెప్పారు. అయితే ఇంత వరకు అది అమలు కాకపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలూ ఆలకించరూ.. ఆస్పత్రి ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. అయితే అందులో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో గది నిరుపయోగంగా ఉంది. దీంతో రోగుల బంధువులు, సహాయకులు ఆస్పత్రి గోడల కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. + హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల కోసం మొదటి అంతస్తులోని టీబీ విభాగం పక్కన వార్డు ఉండేది. ఇది వారికి ఎంతో సౌకర్యంగా ఉండేది. అయితే ఇటీవల హెచ్ఐవీ వార్డును ప్రధాన గేట్ సమీపంలోని ఔట్‌పోస్టు పక్కన ఏర్పాటు చేశారు. అందరూ చూసేవిధంగా వార్డు ఉండడంతో హెచ్ఐవీ బాధితులు వార్డులో నుంచి బయటికి రావడం లేదు. వార్డును పై అంతస్తులోకి మార్చాలని వారు కోరుతున్నారు. + ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో గతంలో బయోమెట్రిక్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ విధానం ఉన్న సమయంలో ఆస్పత్రిలోని సిబ్బంది, అధికారులతో పాటు వైద్యులు కూడా నిర్ణీత సమయానికి విధులకు హాజరయ్యేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత మిషన్ చెడిపోవడంతో పక్కన పడేశారు. ఇటీవల కొత్త మిషన్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. అయితే ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వస్తున్నారు. కొందరైతే అస్సలు రావడం లేదు. జిల్లా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. నేడు అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సలహామండలి సమావేశం శుక్రవారం మ«ధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. సమావేశానికి కలెక్టర్ హరికిరణ్ హాజరుకానున్నారని తెలిపారు. ఆస్పత్రిలోని పలు సమస్యలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ఏవిధంగా స్పందిస్తారో నేటి సమావేశంలో తెలియనుంది. నేడ కేంద్ర బృందం రాక స్థానిక జిల్లా ఆస్పత్రికి కేంద్ర లక్ష్యా టీం రానున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్నో, జోథ్‌పూర్‌ల నుంచి సభ్యులు వస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలోని లేబర్‌వార్డు, ఆపరేషన్ థియేటర్, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ఎస్ఎన్సీయూ, చిన్న పిల్లల విభాగాలను పరిశీలిస్తారన్నారు. లక్ష్యా అవార్డులో భాగంగా పరిశీలన కోసం కేంద్ర బృందం సభ్యులు వస్తునట్లు తెలిపారు. లక్ష్యా అవార్డు పరిశీలన కోసం రాష్ట్రంలో మూడు ఆస్పత్రులు ఎంపిక కాగా అందులో ప్రొద్దుటూరు జిల్లా అస్పత్రి కూడా ఒకటి అన్నారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి పరిశీలిస్తారని తెలిపారు. -
పరోపకారార్థం ఇదం శరీరం
ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక సాధారణ నర్సు. దీపం చేత పట్టుకుని వ్యాథిగ్రస్థులు, యుద్ధంలో క్షతగాత్రులయిన వాళ్ళ కోసం రోజుకు 20 గంటలపాటు విరామం లేకుండా సేవ చేసింది. రోగులను ఆమె ఎంతగా ఆత్మీయంగా చూసుకునేదంటే, ఆమె అటుగా వెడుతుంటే అక్కడ పడిన ఆమె నీడను ఆదరణ భావంతో ముద్దాడేవారు. ఆమె సేవ అంతగా మెప్పించేది. ఆ క్రమంలో ఆమె మంచంపట్టింది. ఆ స్థితిలోకూడా ఆమె ‘నోట్స్ ఆన్ నర్సింగ్’ పేరిట ఒక పుస్తకం రాసింది. అది ప్రపంచమంతటా ఆదరణ పొందింది. ఆస్పత్రుల నిర్వహణలో ఈరోజుకూ దానిని ప్రామాణికంగా భావిస్తారు. ఎప్పటి నైటింగేల్..!!! ఇప్పటికీ ఆమెను తలచుకుంటున్నాం. మార్గరెట్ ఎలిజబెత్ ఎక్కడో పుట్టింది. స్వామీ వివేకానంద ప్రసంగాలకు పరవశించిపోయింది. స్వామి ఆహ్వానంపై భారతదేశానికి వచ్చి ఇక్కడి భాషలు నేర్చుకుంది. చాలా కష్టాలకోర్చి పాఠశాలలు పెట్టి స్త్రీలనెందరినో విద్యావంతులను చేసింది. ‘‘నిన్ను నీవు సమాజానికి నివేదన చేసుకున్నావు. అందుకని నీకు నివేదిత అని పేరు పెడుతున్నా. నిన్ను భారతదేశం సోదరీ, అని గౌరవిస్తుంది’’ అన్నాడు వివేకానందుడు. అలా ఆమె ‘సిస్టర్ నివేదిత’ అయింది. చాలా పుస్తకాలు కూడా రాసింది. వాటిమీద లక్షల రూపాయలు రాయల్టీ వస్తాయని తెలిసి కూడా వాటిని రామకష్ణ మిషన్‌కు రాసిచ్చింది. ఎక్కడి ఎలిజబెత్ !! కాటన్ ఎక్కడి వాడు !! చివరకు అన్నార్తులకు లేదనకుండా ఏళ్ళ తరబడి తల్లిలా ఆకలి తీర్చిన మన డొక్కా సీతమ్మ.... వీళ్ళందరూ ఎవరు !!!....‘‘కులం, మతం, జాతి, ప్రాంతం, భాషవంటి పట్టింపులు’’ ఏవీ లేకుండా ఉపకారం చేయడమే పరమ ధర్మంగా భావించి, అలా జీవించి చరితార్థులయ్యారు. అరబిందో జీవితాన్ని చూడండి...స్వాతంత్ర్య సంగ్రామం నాటి రోజుల్లో... ‘ప్రజలను ప్రేరేపిస్తున్నారు’ అనే నేరంకింద ఆయనతోపాటు ఆయన సహచరులను జైళ్ళల్లో పెట్టారు. అవెలా ఉండావో తెలుసా....పడుకోవడానికి, కూర్చోవడానికి కూడా వీలు లేకుండా గదుల్లో గోతులు తవ్వి ఉంచేవారు. నీళ్ళు తాగడానికి అల్యూమినియం పాత్రలు పెడితే ఎండలకు అవి బాగా వేడెక్కి ఉండేవి. దాహం తీరదు. ఒక పింగాణీ పళ్ళెం, ఒక చిన్న పింగాణీ చిప్ప ఇచ్చేవారు. నీళ్ళు ముంచుకుని తాగాలన్నా, కూర వేసుకోవాలన్నా, చేతులు కడుక్కోవాలన్నా, స్నానం, శౌచం అన్నీ వాటితోనే. తారుపూసిన డబ్బాలు కూడా ఇచ్చేవారు. మలమూత్రాలు వాటిలో విసర్జించాలి. రోజుమొత్తం మీద ఒకసారో రెండు సార్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి అవి తీసేస్తాడు. ఆ పక్కరోజు అతనొచ్చేదాకా వాటిలో ఉన్నవి అంతే. ఇదంతా ఒకే గదిలో. ఒక రోజు, వారం కాదు, సంవత్సరాల తరబడి ఆ గదుల్లో అలా మగ్గిన మహనీయులు తీసుకొచ్చి ఇచ్చిన స్వాతంతా్ర్యన్ని అనుభవిస్తున్నాం. ఇది అనుక్షణం గుర్తుంటే మనకు లంచం, అవినీతి, బంధుప్రీతి వంటి అవలక్షణాలు అబ్బవు. అందుకే జనగణమన పాడేటప్పడు మనం తప్పక గుర్తుంచుకోవలసింది వీరి త్యాగాలను. అలాగే సర్వసుఖాలను వదులుకుని దేశ సరిహద్దులను తమ కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులను కూడా. వీటిని మీరందరూ గుర్తించి మెలగాలన్న ఆర్తితో ఈ జాతి వైభవాన్ని రక్షించే బాధ్యతను కలాం ఈ దేశ విద్యార్థులమీద, యువతీయువకులమీద పెట్టారు. దానికి అవసరమైన శక్తి వారికి చేకూరాలని నేను భగవంతుడిని వేడుకుంటున్నాను. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంచిర్యాలలో రోగులకు చికిత్స చేస్తున్న చాయ్‌వాలా
-
మందులు బయట కొనుక్కోండి..!
ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎర్రగుంట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీ దేవగుడి శంకర్‌రెడ్డి సుబ్బారామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ ఆస్పత్రి సూపర్ స్ఫెషాలిటీ వైద్యులు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే రోగులను పరీక్షించి, మందులను బయట కొనుక్కోవాలని చీటీలు రాసిచ్చారు. ఈ పరిస్థితిలో మంత్రి ఆదినారాయణరెడ్డి వైద్య శిబిరాన్ని సందర్శించారు. మందులు రాసిచ్చిన విషయాన్ని రోగులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆది స్పందిస్తూ మందులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మందులు తెప్పించాలని ఆదేశించారు. అప్పటికే చాలా మంది రోగులు చీటీలతో వెళ్లిపోయారు. ఈ శిబిరాన్ని మంత్రి ఆది సతీమణి అరుణ, తనయుడు సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నారాయణ ఆస్పత్రి గుండె, చర్మ, ఆర్థోఫెడిక్ తదితర వ్యాధుల వైద్య నిపుణులు రోగులను పరీక్షించారు. మందులు ఇవ్వకుండా చీటీలు రాసివ్వడంపై చాలా మంది రోగులు నిరాశకు గురయ్యారు. మంత్రి ఆదేశాలతో ఎర్రగుంట్లలోని ఓ ప్రైవేట్ మెడికల్ షాపు నుంచి మందులు తెప్పించి ఉన్న రోగులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి ఆది సోదరుడు జయరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముసలయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ జెక్కు చెన్నకృష్ణారెడ్డి, కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. -
డోస్ పెరుగుతోంది
శివ్వంపేట(నర్సాపూర్) : మారుమూల గ్రామాల్లో పేదవారి ఆరోగ్యంతో ఆర్ఎంపీలు ఆటలాడుకుంటున్నారు. తెలిసీతెలియని వైద్యానికి అమాయకులు బలవుతున్నారు. పుట్టగొడుగుల్లా గ్రామాల్లో విచ్చలవిడిగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుంటూ కాసులు దండుకుంటున్నారు. స్థాయికి మించి చేసిన వైద్యానికి రెండు నెలల క్రితం శివంపేట మండల కేంద్రానికి చెందిన రాములు(48) వైద్యం వికటించి మృతి చెందాడు. అయినా ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఉన్నాతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీళ్ల వైద్యానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. మండల పరిధిలో 50కిపైగా ఆర్ఎంపీలు ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీలు తెలియకపోయినా అన్ని రకాల రోగాలకు వైద్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దీనికితోడు మోతాదుకు మించి ఇంజక్షన్ల డోస్, మాత్రలు ఇస్తున్నారు. దీంతో ఉన్న రోగం అటుంచితే కొత్త రోగాల భారిన పడాల్సి వస్తోందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీళ్లు అనాధికారికంగా మందుల విక్రయాలు కూడా జరుపుతున్నారు. పలు కంపెనీలు ఇచ్చే శాంపిల్ మందులు సైతం రోగులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రోగికి హైడోస్ మందులు ఇవ్వడం వల్ల త్వరగా తగ్గిపోతుందని నమ్మేవారికి ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. కొంత మంది ఇంకో అడుగు ముందుకేసి డెలివరీలు సైతం చేస్తున్నారు. రత్నాపూర్లో ఆర్ఎంపీ డెలివరీలు చేస్తున్న విషయం జిల్లా వైద్యాధికారి దృష్టికి వెళ్లగా తనిఖీ కోసం వైద్య సిబ్బంది రత్నపూర్ గ్రామానికి వెళ్లగా సదరు ఆర్ఎంపీ అసుపత్రికి తాళం వేసి ఉండడంతో సిబ్బంది వెనుతిరిగి వచ్చారు. కార్పొరేట్ కమీషన్ దందా.. గ్రామాల నుంచి రోగులను నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తే ఆయా ఆస్పత్రుల నుంచి ఆర్ఎంపీలకు కమీషన్ సైతం అందజేస్తున్నారు. రోగికి అయిన బిల్లులో కొంత పర్సెంటీజీ ఇవ్వడంతో వారు అవసరం లేకపోయినా పెద్ద ఆస్పత్రులకు పంపిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం సైతం ఆర్ఎంపీలను మచ్చిక చేసుకునేందుకు పలు బహుమతులు, పర్సెంటేజీలు ఇస్తున్నారు. పలు రకాల పరీక్షల కోసం తూప్రాన్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లోని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించి అక్కడి నుంచి కూడా వాటా తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. పలు సందర్భాల్లో వైద్యం వికటించి రోగులు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకుంటున్నా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రోగి బంధువులు ఆందోళన చేపడుతుండడంతో బాధిత కుటుంబాలకు ఆర్ఎంపీలు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నెల రోజుల క్రితం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేయడానికి రాగా ఆర్ఎంపీల స్థాయికి మించి వైద్యం గురించి ఆయన దృష్టికి తీసుకెల్లగా పలు క్లీనిక్‌లను తనిఖీ చేయగా హైడోస్ ఇంజక్షన్లు, మందులు ఇస్తున్న విషయాన్ని గుర్తించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటాం.. గ్రామాల్లో ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అంతకు మించి వైద్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో తనీఖీలు నిర్వహించి స్థాయికి మించి వైద్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. గర్భిణులకు చికిత్సలు అస్సలు చేయరాదని సూచించారు. ఆర్ఎంపీలు ఇష్టరాజ్యంగా చికిత్సలు నిర్వహిస్తున్న విషయంపై రాత పూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే చర్యలు తీసుకుంటాం. –వెంకటేశ్వర్రావ్, జిల్లా వైద్యధికారి -
జీవచ్ఛవాలు
ఔను వారు జీవచ్ఛవాలే.. పలుకరించే తోడు లేదు. పట్టెడన్నం పెట్టే చేయీ లేదు. ఒంటికి వచ్చిన రోగం ఓపికనంతా పిండేస్తోంది. శరీరానికి తగిలిన గాయం ప్రాణాలను నిలువునా తోడేస్తోంది. దారినపోయే దానయ్యలెవరో దయతలిస్తే ఆస్పత్రికి చేరినా వైద్యానికి నోచుకోని అభాగ్యులు. వైద్యులు, వైద్య సిబ్బంది అనుక్షణం హడావుడిగా ఉండే అత్యవసర విభాగం వద్దనే స్ట్రెచర్‌పై కదలలేని పరిస్థితుల్లో పడి ఉన్నా ఎవరికీ పట్టని అనాథలు. ఇదీ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో నెలకొన్న పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన, ప్రయాణంలో ఉండగా అనారోగ్యంతో అస్వస్థతకు గురైన రోగులను సహాయకులు లేరన్న కారణంతో ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్నా స్ట్రెచర్లపైనే వదిలేస్తున్నారు. వార్డులో చేర్చకపోవడంతో వారికి ఆహారం కూడా అందడం లేదు. ప్రాణం పోయేవరకు రోగులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఎప్పుడూ వివిధ శాఖల అధికారులతో కలిసి వేదికపై కూర్చుని, తమ వద్దకు వచ్చే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ఆలకించారు. పలు సమస్యలను పరిష్కరించాలంటూ అప్పటికప్పుడే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే అవకాశమున్న ‘గ్రీవెన్స్’ అంటే తనకెంతో ఇష్టమన్నారు. సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన ఏ ఒక్కరు అసంతృప్తితో వెనుదిరిగినా ఇక తమ అధికారాలకు అర్థమే లేదన్నారు. గుంటూరు ఈస్ట్ : శ్రీకాకుళం జిల్లాకు చెందిన 30 ఏళ్ల చిన్ననారాయణ తాపీ పనుల కోసం చెన్నై వెళ్లి తిరిగి రైలులో ప్రయాణిస్తున్నాడు. గుంటూరు సమీపంలో రైలు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 ద్వారా జూన్ 28న అత్యవసర విభాగానికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. చిన్ననారాయణ కొంత మతిస్థితిమతం కోల్పోవడం, సెల్‌ఫోన్ పోగొట్టుకున్న కారణంగా బంధువుల వివరాలు చెప్పలేకపోయాడు. తన పని తాను చేసుకోలేక నరకయాతన పడుతున్నాడు. ఆకలి అయితే తిండి పెట్టేవారు లేక, మరోవైపు గాయాల నొప్పులతో అల్లాడిపోతున్నాడు. ఈ నెల 8న పక్షవాతంతో గుర్తు తెలియని వృద్ధుడు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి షేక్ రబ్బాని జీజీహెచ్ అత్యవసర విభాగంలో చేరారు. ఇద్దరూ కొంత స్పృహలో ఉన్నప్పటికీ తీవ్ర అస్వస్థతో తమ వివరాలు చెప్పలేక పోయారు. స్ట్రెచర్ మీద నుంచి పైకి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నారు. వారిని పట్టించుకున్న నాథుడే లేడు. ఎందరో రోగులు.. కొందరే వైద్యులు ఇలా తీవ్ర అస్వస్థతో జీజీహెచ్ అత్యవసర విభాగానికి వచ్చే గుర్తు తెలియని వ్యక్తులు, అనాథల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వీరికి సహాయకులు ఎవరు ఉండక పోవడంతో ఎక్కువ కాలం వార్డుల్లో ఉండాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఈ క్రమంలో పట్టించుకునేవారు లేకపోవడంతో అత్యంత దయనీయంగా బతుకీడుస్తున్నారు. ప్రతిరోజు జీజీహెచ్‌కు 3,500 నుంచి 4,000 మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తారు. అత్యవసర విభాగానికి ప్రతి రోజు వెయ్యి మందికి పైగా వస్తుంటారు. వీరందరికీ సమర్థవంతంగా చికిత్స అందించడానికి వైద్య, వైద్యేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా అడ్మిషన్ పొంది సహాయకులు ఉన్న రోగులకు చికిత్స అందించడంలో చాలా సార్లు లోపాలు వెల్లువెత్తాయి. నెలకు సుమారు 50 నుంచి 60 మంది అనాథలు, గుర్తు తెలియని వ్యక్తులు తీవ్ర గాయాలతో జీజీహెచ్‌కు వస్తున్నారు. వీరిని వార్డులో చేర్చుకుని ఎక్కువ రోజులు చికిత్స అందించడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రాణాలు పోతున్నాయి.. సహాయకులు లేని రోగులను వార్డుల్లో చేర్చుకోవడానికి గతంలో వైద్యులు నిరాకరించేవారు. కానీ ప్రతికల్లో వచ్చిన కథనాలతో ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి వారిని వార్డుల్లో చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఇటువంటి వారిని వైద్య సేవలు లభిస్తున్నాయి. కానీ కదలలేని స్థితిలో ఉన్న వీరికి ఆహారం ఇచ్చేవారు కరువయ్యారు. అంతే కాకుండా వీరు తమ పనులు చేసుకోలేక మంచం మీద, స్ట్రెచర్‌పై సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక చర్యలు చేపట్టాలి.. ఇటువంటి వారిలో ఎముకలు విరిగినవారిని ఆర్థో విభాగానికి, నరాల సంబంధిత సమస్యలు ఉన్న వారిని నరాల విభాగానికి పంపుతున్నారు. ఇతర సమస్యలు ఉన్నవారిని ఎక్కడ బెడ్లు ఖాళీ ఉంటే అక్కడ వదిలి పెడుతున్నారు. అయితే తిండి అందక విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలో మృతి చెందిగానే మార్చురికి తరలిస్తున్నారు. ఒక్కొసారి బాగా బతికిన కుటుంబాలకు చెందిన వారు, ఇతర రాష్ట్రాల వారు ప్రయాణాలలో గాయపడి వస్తే వారిది ఇదే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఇటు వంటి వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు మానవసేవ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే ఈ సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘మానవ సేవ’ ఏమైంది? జీజీహెచ్‌లో రోగులకు సహాయం అందించేందుకు మాన సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య అధికారులు క్రమేపీ దానిపై అశ్రద్ధ వహిస్తూ వచ్చారు. ఫలితంగా కార్యక్రమం పడకేసింది. ఇందులో భాగంగా రోగులకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న మానవతావాదులు జీజీహెచ్‌కు వచ్చి వివిధ వార్డుల్లో రోగులకు సేవ చేసేవారు. ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తే నగరంలోని విద్యార్థులు, యువత, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో వచ్చి రోగులకు సేవల అందించే అవకాశం ఉంది. -
జన్యు చికిత్సతో పక్షవాతానికి చెక్
లండన్ : పక్షవాత బాధితులకు ఊరటగా మెరుగైన చికిత్సా పద్ధతులను శాస్త్రవేత్తలు ఆవిష్కరించే క్రమంలో జన్యు చికిత్స వేలాది బాధితులకు వరంగా మారనుంది. జీన్ థెరఫీ ద్వారా పక్షవాత రోగులు చచ్చుబడిపోయిన కాళ్లు, చేతులు, భుజాలపై తిరిగి నియంత్రణ సాధించేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి గురైన ఎలుకలపై పరిశోధకులు చేపట్టిన అథ్యయనం సానుకూల ఫలితాలను ఇవ్వడంతో జన్యు చికిత్స ద్వారా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని అంచనా వేస్తున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన న్యూరోసర్జన్ల బృందం చేపట్టిన ఈ అథ్యయనంలో పక్షవాత చికిత్సలో మేలి మలుపు వంటి అంశాలను గుర్తించారు. ఇక వెన్నుపూస గాయాలతో రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బందిపడే వారికి ఆయా అవయవాల్లో తిరిగి కదలిక రావడం అసాధ్యమవుతున్న క్రమంలో తాజా అథ్యయన వివరాలు చికిత్సా పద్ధతులను కొత్తపుంతలు తొక్కిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. పక్షవాతం, వెన్నుపూస గాయాలతో ఇబ్బంది పడే వారికి సరికొత్త చికిత్సా పద్ధతుల ద్వారా మెరుగైన జీవితాన్ని అందించేలా తమ అథ్యయన ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఎలిజమెత్ బ్రాడ్‌బురీ తెలిపారు. -
‘బోద’పడని వ్యధ
మెదక్‌జోన్ : రాష్ట్ర ప్రభుత్వం బోదకాలు బాధితులకూ పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. వీరికి నెలకు రూ. వెయ్యి చొప్పున పింఛన్ మంజూరు చేశారు. కానీ జిల్లాలో ఇది నామమాత్రపు బాధితులకు మాత్రమే అందనుంది. జిల్లా వ్యాప్తంగా బోదకాలు బాధితులు 2,494 మంది ఉన్నారు. కానీ అందులో కేవలం 303 మందికి మాత్రమే పింఛన్ మంజూరు చేశారు. ఎంపికలో వ్యాధి తీవ్రతను బట్టి మూడు కేటగిరిలుగా విభజించి పింఛన్ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి కేటగిరిలో ఇప్పుడిప్పుడే వ్యాధి ప్రారంభమైన వారిని గుర్తించారు. ఈ జాబితాలో 1,100 మంది ఉనట్లు గుర్తించారు. వీళ్లు అన్ని రకాల పనులు చేసుకుంటున్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి తగ్గుతుందని సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండో కేటగిరిలో కూడా వ్యాధి మందులతో కంట్రోల్ అవుతోంది. ఈ జాబితాలో 1,092 మందిని గుర్తించారు. మూడో కేటగిరి లో 303 మందిని గుర్తించారు. వీరి అవయవాలు బాగాలావెక్కి అందవికారంతో పాటు ఎప్పుడు జ్వరంతో ఇబ్బందులు పడుతుంటారు. వీరికి ఆదరణ తప్పనిసరిని గుర్తించిన అధికారులు వీరిని పింఛన్‌కు తీసుకునేందుకు అర్హులుగా గుర్తించారు. వీళ్లకు జూన్ ఒకటో తేదీ నుంచి పింఛన్ అందనుంది. సమాజంలో చిన్నచూపునకు గురై.. బోద వ్యాధిగ్రస్థులకు శరీరక అవయవాలు లావెక్కి ఏ పనిచేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటారు. వారు నిరాదరణతో నిస్సాహాయ పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. సమాజంతో పాటు కుటుంబాల్లోనూ చిన్నచూపుకు గురై మనోవేదన పడుతున్నారు. వీరికి నెలలో 20 రోజుల పాటు జ్వరంతో బాధపడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ప్రతినెల రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆస్పత్రుల్లో ఖర్చుచేస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్థులో 95 శాతం మేర నిరుపేదలే కావటంతో ఆర్థిక భారం పైబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పింఛన్ ఇవ్వటం శుభపరిణామమే. అయినప్పటికి అతికొద్ది మందికి మాత్రమే ఇస్తూ మిగతావారికి ఇవ్వక పోవటంతో బాధితులు మరింత ఆవేదన చెందుతున్నారు. దోమకాటుతోనే వ్యాప్తి.. టులెక్స్ అనే దోమకాటుతో ఫైలేరియా(బోదవ్యాధి) వస్తుంది. పరిసరాలు అపరిశుబ్రంగా ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది అవి కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా స్లమ్ఏరియాలో నివశించే నిరుపేదలకు అధికంగా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిసోకిన బాధితులు ఎప్పుడూ జ్వరంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి ప్రభావం శరీరంలోని అనేక అవయవాలపై పడుతోంది. దీంతో అవయవాలు ఉబ్బుతాయి. 20 ఏళ్ల నుంచి బాధపడుతున్నా.. 20 ఏళ్ల నుంచి బొదకాలతో బాధపడుతున్నాను. దీంతో నిత్యం జ్వరం వస్తోంది. నెలకు రూ. 3 వేలు మందు గోలీలకు ఖర్చు అవుతున్నాయి. ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పింఛన్ ఇచ్చి, నాలాంటి వారిని మర్చిపోయింది. ప్రభుత్వం అంటే అందరికీ సహకారం చేయాలి. కానీ కొంతమందికి మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సమంజసం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి. –మోసయ్య, జంగరాయి, చిన్నశంకరంపేట మండలం నిబంధనల ప్రకారమే ఎంపిక.. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పింఛన్ అర్హులుగా గుర్తించాం. జిల్లాలో 2,494 మంది వ్యాధిగ్రస్థులు ఉండగా వ్యాధి తీవ్రంగా ఉన్న 303 మందికి మాత్రమే పింఛ న్ వస్తోంది. మూడు కేటగిరీలుగా విభజించి ప్రభుత్వానికి నివేదించాం. –కుమార్, జిల్లా మలేరియా అధికారి -
‘తియ్యటి’ విపత్తు.!
ఒకవైపు పెరిగిన జీవన వేగం, అది పెంచిన ఒత్తిడి.. మరోవైపు మోడ్రనైజేషన్ ముసుగులో అభివృద్ధి చెందుతున్నామనుకుంటూ దీర్ఘకాలిక రోగులతో నిండిపోతోంది మన సమాజం. ఎప్పుడో అరవైల్లో కనపడాల్సిన వ్యాధులు కూడా ఇరవై, ముప్పైల్లోనే పలకరించేస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం.. ఇది అంటు వ్యాధి కాదు అయినా దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఇదొక సైలెంట్ కిల్లర్. ముందుగానే గుర్తించి నియంత్రణలో పెట్టుకుంటే సరే! లేకపోతే పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకుండానే.. చాప కింద నీరులా ఒళ్లంతా గుల్ల చేసేస్తుంది. ఇంతటి పెను ముప్పు మన ‘కృష్ణా’ ఒంట్లో పాగా వేసింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణాజిల్లాలో మధుమేహ వ్యాధి వ్యాప్తి వేగంగా ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలు నిర్థారించడంతో, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫైలట్ పథకానికి జిల్లాను ఎంపిక చేశారు. జిల్లా జనాభాలో 30 ఏళ్లు దాటిన గ్రామీణుల్లో 11 శాతం, పట్టణాల్లో 18 శాతం మంది మధుమేహ రోగులు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తేల్చాయి. వ్యాధిగ్రస్తుల్లో 25 శాతం మందికి లక్షణాలు ఏమి కనిపించని కారణంగా మందులు వాడటం లేదని.. వ్యాధి ఉందని తెలిసిన వారిలో కూడా 50 శాతం మందే మందులు వాడుతున్నారని, వారిలో కూడా 25 శాతం మంది మాత్రమే వ్యాధిని అదుపులో (హెచ్‌బీఏ1సీ 6.5 శాతంలోపు) ఉంచుకోగలుగుతున్నట్లు నిర్ధారణయ్యింది. చిన్న వయస్సులోనే.. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే వ్యాధి బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 20 నుంచి 30 ఏళ్ల యువకుల్లో సైతం మధుమేహం సోకుతున్నట్లు చెబుతున్నారు. రెండు జిల్లాలో 8 లక్షలకు పైగా మధుమేహ రోగులు వుండగా, వారిలో 10 శాతం మంది 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సువారేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాధి సోకిన ఐదు నుంచి పదేళ్లలో అవయవాలపై దుష్ఫలితాలు చూపుతున్నందున 35 నుంచి 45 ఏళ్లలోనే దయనీయ స్థితికి చేరుకుంటున్నట్లు హెచ్చరిస్తున్నారు. దుష్ఫలితాలు.. ♦ గుండె జబ్బులకు గురవుతున్న వారిలో 40 శా తం మందిలో మధుమేహం కారణం అవుతోంది. ♦ ఏటా మధుమేహం కారణంగా ఐదు వేల మం దికి పైగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ♦ సుగర్ కారణంగా జిల్లాలో ఏటా వెయ్యిమందిలో కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ♦ వ్యాధి ఉన్న వారిలో 5 శాతం మందిలో గాంగ్రీన్స్ వస్తున్నట్లు చెబుతున్నారు. దీనిని తొలిదశలో గుర్తించకుంటే అవయవాలు(కాలు, చేయి) తొలగించాల్సిన ప్రమాదం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టులో చేసేది ఇది.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య సిబ్బంది మధుమేహంపై ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నారు. గ్రామీణుల్లో మధుమేహం ఉన్నట్లు నిర్థారణ అయితే వారు రెగ్యూలర్‌గా మందులు వాడేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆహార నియమాలు, వ్యాయామం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. రెగ్యూలర్‌గా రక్తపరీక్షలు, వైద్య పరీక్షలు చేస్తూ మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించనున్నారు. అదుపు ఇలా.. మన శరీరంలో చక్కెర స్థాయిలు పరగడుపున 126.. ఆహారం తీసుకున్న తర్వాత 160 మించకుండా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా మూడు నెలల చక్కెర స్థాయిలు(హెచ్‌బీ ఏ1సీ) 6.5 ఉండేలా చూడాలి. అందుకు మితాహారం తీసుకుంటూ.. కొవ్వు పదార్థాలకు, పామాయిల్, వనస్పతి, కొబ్బరి నూనెలకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువుగా తీసుకోవాలి. అంతేకాకుండా రోజూ 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ముందు చూపే మందు మధుమేహంపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి సోకిన వారిలో సగం మందికిపైగా సరైన నియమాలు పాటించకపోవడం వల్ల దాని ప్రభావం గుండె, కిడ్నీ, మెదడు, కళ్లపై పడుతోంది. దీంతో ప్రాణాపాయం ఏర్పడంతో పాటు, మరికొందరు పూర్తిగా చూపును కోల్పోతున్నారు. వ్యాధి సోకిన పదేళ్లలోపు దుష్ఫలితాలు కనిపించడం లేదని, నియమాలు పాటించకపోతే.. అనంతరం అవయవాలు దెబ్బతిన్న తర్వాత చేయగలిగిందేమి ఉండదు. మధుమేహ వ్యాధి ఉన్న వారు ఆరోగ్యకరమైన ఆహార, వ్యాయామ నియమాలు పాటించడం, ఇతర నిర్ధేశిత మందులను క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు.– డాక్టర్ ఎం. శ్రీకాంత్,మధుమేహ నిపుణుడు, విజయవాడ -
మెదక్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
సాక్షి, మెదక్ : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ సంబంధిత రోగులకు వరంగా మారాయి. గతంలో డయాలసిస్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అపుడు దూరాభారంతో పాటు ఒక్కో సెట్టింగ్‌కు రూ.1500 నుంచి రూ.1900 చెల్లించాల్సివచ్చేంది. ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆ బాధలు తొలిగిపోయాయి. జిల్లా కేంద్రంలో గత ఏడాది డిసెంబర్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆనందంతో అందరూ ఇక్కడే రక్త శుద్ధి చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఈ సేవలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కేంద్రంలో ఒకే సారి ఐదుగురికి రక్తశుద్ధి చేసేందుకు మిషన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కబెడ్ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రత్యేకమైన వైద్యులు, సిబ్బంది ఉండటంతో రోగులకు ఇబ్బందులు తొలిగిపోవడంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 35 మందికిపైగా డయాలసిస్ అవసరమయ్యే రోగులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. కిడ్నీలు సరిగా పనిచేయని పక్షంలో డయాసిస్(రక్తశుద్ధి) ప్రక్రియ అవసరం ఉంటుంది. ఈ రకమైన సమస్య ఉన్న వారు, మూత్రపిండాల మార్పిడి సమయంలో రక్తశుద్ధి (డయాలసిస్) తప్పనిసరి. గతంలో ఆరోగ్యశ్రీలో డయాలసిస్ సేవలు అందించినప్పటికీ హైదరాబాద్ వెళ్లడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో దూరభారంతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడేవారు. ఉచితంగా మందులు ఇవ్వాలి.. జిల్లాలోని 35 మంది రోగులకు గడిచిన ఆరు నెలల్లో 180 సార్లు డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేయించుకునే పేషెంట్ 4 గంటల నుంచి వ్యాధి తీవ్రతను బట్టి 8 గంటల వరకు బెడ్‌పై ఉండాల్సి వస్తోంది. వైద్యులు, సిబ్బంది మంచిగా సేవలు అందజేస్తున్నట్లు వారు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు చెబుతున్నారు. కరెంటు పోయిన సమయంలో వెంటనే జనరేటర్ పనిచేయకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చిన్నశంకరంపేటకు చెందిన ఓ రోగి తెలిపారు. డయాలసిస్ సెంటర్‌కు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని రోగులు కోరుతున్నారు. అలాగే ఉచితంగా మందులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత డయాలసిస్ మెదక్‌లో పొందే సౌకర్యం కల్పించడం హర్షనీయం. అయితే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందని పలువురు రోగులు కోరుతున్నారు. నర్సాపూర్ ప్రాంతంలో 6మంది వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం డయాలసిస్ కోసం మెదక్‌కు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కు కూడా వెళ్తున్నారు. అయితే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని, తద్వారా అక్కడి రోగులకు సౌలభ్యంగా ఉంటుందని శివ్వంపేటకు చెందిన ఆనంద్‌రావు తెలిపారు. బతుకుపై ఆశ కలిగింది నేను 12 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాను. 2006లో కిడ్నీ మార్పిడి జరిగింది. తర్వాత అది విఫలమై రెండు కిడ్నీలూ చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్ కోసం లక్షల రూపాయాలు ఖర్చు పెట్టాను. డయాలసిస్ కోసం ప్రతివారం హైదరాబాద్ వెళ్లే వాడిని. ఇప్పటివరకు రూ.15 లక్షల వరకు ఖర్చుయ్యాయి. దీంతో ఎంత కాలం చేయించుకోను.. ఇక అనుకున్న సమయంలో మెదక్ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు బతుకుపై ఆశ కలిగింది. దీంతో ఇక్కడే వారానికి రెండు సార్లు చేయించుకుంటున్నాను. దూరభారం తగ్గడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. –ఎర్రగొల్ల సత్యం, రామాయంపేట -
మళ్లీ విజృంభించనున్న ‘ఎయిడ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎయిడ్స్ రహిత తరాన్ని అందించడానికి అవసరమైన సాధనాలు ఇప్పుడు మన వద్ద ఉన్నాయి’ అంటూ 2011, డిసెంబర్ 1వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్య ఓ కొత్త చొరవకు దారితీసింది. ఎయిడ్స్‌ను కనుగొన్న 30 సంవత్సరాల అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైద్య రంగానికే స్ఫూర్తినిచ్చింది. అప్పటికే దాదాపు మూడు కోట్ల మంది మరణానికి కారణమైన ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచం కలసికట్టుగా ముందుకు కదిలింది. ఆ కృషి ఫలితంగానే ఇప్పుడు ఎయిడ్స్ రోగులను ‘పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ’ అని పిలుస్తున్నారు. ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన కృషి ఫలితంగా 2000 సంవత్సరం నుంచి హెచ్ఐవీ కేసుల సంఖ్య 30 శాతం తగ్గింది. 2003 నుంచి మృతుల సంఖ్య 40 శాతం తగ్గింది. ఒక్క సబ్ సహారా ఆఫ్రికాలో గత దశాబ్దం కాలంలో 25 నుంచి 50 శాతం కేసులు తగ్గాయి. ఈ క్రమంలోనే ఆమ్‌స్టర్‌డామ్‌లో జూలై 23 నుంచి 27 వరకు ఎయిడ్స్‌పై ప్రపంచ సదస్సు జరుగుతోంది. ఇదే సమయంలో ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. రెండో రకం చికిత్సను కూడా తట్టుకొని బతకకలిగే శక్తిని హెచ్ఐవీ సాధించిందనేదే ఆ వార్త. ఎయిడ్స్ నివారణలో ప్రస్తుతం రెండు రకాల చికిత్స విధానాన్ని అమలు చేస్తున్నారు. మొదటి రకం విధానానికి రోగి స్పందించకపోతే రెండోరకం విధానాన్ని అమలు చేస్తారు. దాంతో 90 శాతం మంది రోగులకు హెచ్ఐవీ నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ విధానం కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదని, రోగుల్లో వ్యాధి ముదిరి మరణిస్తున్నారని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇతర బ్యాక్టీరియాలకన్నా పరావర్తనం చెందే శక్తి హెచ్ఐవీ వైరస్‌లో పది లక్షల కన్నా ఎక్కువ ఉండడం వల్ల అది మందులకు లొంగకపోతే విపరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఎయిడ్స్ నివారణకు అమెరికాలో 28 రకాల మందులు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు రకాల కాంబినేషన్లలో మాత్రమే ఈ మందులను వాడుతారు. ఒకటో రకం కాంబినేషన్ రోగిపై పనిచేయడం ఇది వరకే నిలిచిపోగా, ఇప్పుడు రెండో రకం కాంబినేషన్ కూడా పనిచేయక పోవడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కార్పొరేట్ ‘వివక్ష’!
సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యశ్రీ ఓ మంచి పథకం. పేదలకు వరం. కానీ కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు దీన్ని ఓ అంటు వ్యాధిలా చూస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పట్టుకుని ఆస్పత్రికి వచ్చిన రోగులను ఎలా భయపెట్టాలి? వారిని ఏవిధంగా బయటికి పంపాలన్నదానిపై ముందే అక్కడి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం 2008లో ప్రారంభమైంది. ప్రారంభంలో 46 ఆస్పత్రుల్లో ఈ సేవలు అందేవి. 2018 నాటికి 341 ఆస్పత్రులకు విస్తరించాయి. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల కుటుంబాల్లోని 2.75 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.700 కోట్లు ఖర్చు చేస్తుంది. ఏటా 2.5 లక్షల చికిత్సలు జరుగుతున్నాయి. మొదట్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు పోటీపడిన కార్పొరేట్ ఆస్పత్రులు.. ఆ తర్వాత ఈ సేవలను భారంగా భావించాయి. ఆరోగ్యశ్రీ రోగి అంటేనే చులకనగా చూడటం మొదలు పెట్టాయి. నగదు చెల్లింపు రోగులను ఒక భవనంలో, ఆరోగ్యశ్రీ రోగులను మరో భవనంలో ఉంచుతున్నాయి. అంతే కాదు వీరికి చికిత్స చేస్తే ఎక్కడ తమ ఇమేజ్ దెబ్బతింటుందోని భావించి సీనియర్లు చికిత్సలకు నిరాకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమవద్ద పనిచేస్తున్న జూనియర్లతో సర్జరీలు చేయిస్తున్నారు. కనీసం గాలి వెలుతురు కూడా లేని చోట వీరిని అడ్మిట్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులను అంటు రోగులుగా చూస్తూ...వారికేదో ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాయి. చీదరింపులు..చీత్కారాలు నగదు చెల్లించే రోగులతో సమాన వైద్యసేవలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇస్తూ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ సహా నగరంలో మరో 135 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో అవగాహన ఒప్పం దం కుదుర్చుకున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా పొందాయి. తీరా నెట్‌వర్క్‌లో పేరు రిజిస్టర్ అయిన తర్వాత అనేక ఆస్పత్రులు ఈ నిబంధనలను తుంగలో తొక్కాయి. నగదు చెల్లించే రోగుల సరసన కాకుండా పార్కింగ్ ప్లేసుల్లో, ఓ మూలన ఇరుకైన రేకుల షెడ్డులో ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పాటు చేశాయి. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. అయినా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. అంతేకాదు వీరి పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా అవమానకరంగా ఉంది. నగదు చెల్లించే రోగులను ఆప్యాయ పలకరిస్తూ వెంటతోడుకెళ్తూ, ఆరోగ్యశ్రీ రోగులను మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ రిజి స్ట్రేషన్ కౌంటర్‌కు ఓపీ, ఐపీ విభాగాలకు చాలా దూరం ఉంటోంది. అసలే అనారోగ్యం ఆపై అటు ఇటు తిరగలేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఓపీ సేవల్లోనే కాదు చికిత్సల్లోనూ, మందుల పంపిణీలోనూ ఇదే వివక్ష కొనసాగుతోంది. సమస్యలు ఇవే... ♦ ఎమర్జెన్సీలో ఆస్పత్రిలో చేరిన రోగికి ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే 72 గంటల సమయం ఇవ్వాల్సి ఉంది. కానీ అలా ఇవ్వడం లేదు. అత్యవసర సమయంలోనూ డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నాయి. ముఖ్యంగా సెలవు రోజుల్లో జాయినైన రోగి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులదీ అదే పరిస్థితి. ♦ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల చికిత్సల విషయంలో అనేక మెలికలు పెడుతున్నారు. ప్రమాదంలో రెండు మూడు చోట్ల బోన్ఫ్రాక్చర్ ఉంటే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం లేదు. ఎన్ని కట్లు కడితే అన్ని వేర్వేరు ప్యాకేజీల కింద డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేమంటే ఆరోగ్యశ్రీలో ఎన్నిఫ్రాక్చర్లు ఉన్నా ఒకే ప్యాకేజీ కింద బిల్లు చెల్లిస్తుందని, ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని ఆస్పత్రి యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ♦ బైపాస్ సర్జరీల్లో భాగంగా హృద్రోగులకు స్టంట్లు అమర్చుతారు. మార్కెట్లో 32 రకాల స్వదేశీ, విదేశీ కంపెనీల స్టంట్లు ఉన్నాయి. ఒక స్టంటు తయారీకి రూ.3 వేల నుంచి రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇటీవల వీటి ధరలను భారీగా తగ్గించింది. ఆరోగ్యశ్రీ పథకంలో నాసిరకం స్టంట్లు వేస్తున్నారని, కొంత ఖర్చు భరిస్తే మంచి స్టంట్ వేస్తామని చెబుతున్నారు. తొలత స్టంట్ వేస్తున్నారు. మూడు నెలల తర్వాత అదే రోగికి బైపాస్ సర్జరీ చేస్తున్నారు. ఒక రోగిపై రెండుసార్లు సంపాదిస్తున్నారు. అటు ఇటు తిరగలేకఇబ్బందిపడ్డా... కిడ్నీలో రాయి ఉండటంతో వైద్యుడికి చూపిద్దామని మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాను. ఓపీకి దూరంగా ఉన్న మరో భవనం పార్కింగ్ ప్లేసులో ఆరోగ్యశ్రీ కౌంటర్ ఏర్పాటు చేశారు. అసలే నొప్పి, ఆపై అటు ఇటూ తిరుగలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. – నవీన్, జనగాం ఈసడించుకుంటున్నారు ఆరోగ్యం బాగాలేక పోవడంతో వైద్యుడికి చూపించుకుందామని ఎల్బీనగర్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాను. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్తే..ఇక్కడ ఆ సేవలు లేవని చెప్పారు. నన్ను చూసి ఈసడించుకున్నారు. ఆరోగ్యశ్రీ రోగులను చాలా చులకనగా చూస్తున్నారు. – భవానీ, ఎల్బీనగర్ -
ఎవరి గుండె ఎవరికి ఊపిరి !?
సాక్షి, న్యూఢిల్లీ : ఏప్రిల్ 18వ తేదీ. రివ్యానీ రహంగ్డలే ఆరేళ్ల పాప. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన ఆ పాప రోడ్డు పక్కనున్న కుళాయి నుంచి మంచినీళ్లు తాగుతుండగా, ఓ మోటార్ సైకిల్ అదుపుతప్పి వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయమైన ఆ బాలికను నాగపూర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ పాప మెదడుకు సర్జరీ చేశారు. అయినా స్పృహ రాలేదు. ‘బ్రెయిన్ స్టెమ్ డెడ్’ అని ప్రకటించారు. అది విన్న ఆ పాప తల్లిదండ్రులు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. అయితే అంతటి విషాదంలో ఆ పాప శరీరంలోని అవసరమైన అన్ని అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు. ‘నా కూతురుకు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె శరీరంలోని ఇతర అవయవాలు బాగానే ఉన్నాయికదా, అవెందుకు బతకకూడదు! అని అనిపించిందీ. వాటిని అవసరమైన వారికి డొనేట్ చేయాలని అనుకున్నాను’ అని పోలీసు డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధేశ్యామ్ రహంగ్డలే తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీన రివ్యానీ గుండె, కాలేయం, కిడ్నీలను వైద్యులు తొలగించి అత్యంత అవసరమైన నలుగురు వ్యక్తులకు అమర్చారు. ఆ అవయవాలు ఎవరికి వెళుతున్నాయో కూడా తెలుసుకోకుండా వారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అవయవాలు దానం చేసిన మహానుభావుల జాబితాలో రివ్యానీ తల్లిదండ్రులు కూడా చేరి పోయారు. పెరిగిన అవయవ దానాలు భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య ఇలాంటి అవయవదానాలు పెరిగాయి. నగరాల మధ్యనే కాకుండా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల మధ్య కూడా గ్రీన్ కారిడార్ ద్వారా (ఎక్కడి ట్రాఫిక్‌ను అక్కడే నిలిపివేసి) ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అవయవాలను రవాణా చేస్తున్నారు. కుల, మత, లింగ వివక్షతలు లేకుండా అవయవాల మార్పిడి కూడా జరుగుతోంది. దేశంలో అవయవ దానాలు పెరుగుతున్నందుకు ఆనందించాల్సిందే. కానీ ఎక్కువ అవయవదానాలు ఎవరు చేస్తున్నారు? వారి అవయవాలు ఎవరికి వెళుతున్నాయి? అవయవదానాలపై ఆధారపడి దేశంలో బతుకుతున్న వారు ఎవరు? ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి అవయవాలు ధనవంతుడిని బతికిస్తున్నాయి. అవయవాలు ఇచ్చేది పేదవాళ్లే అనేక సామాజిక, ఆర్థిక కారణాల వల్ల పేద వాళ్లే అస్వస్థత కారణంగానో, ప్రమాదాల కారణంగానో బ్రెయిన్ డెడ్‌కు గురవుతున్నారు. కొందరు రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇస్తున్నారు లేదా అమ్ముకుంటున్నారు. డబ్బున్నవారిలో దాతలు ఉండరని కాదు. చాలా తక్కువ ఉంటున్నారు. అవయవాలు మాత్రం కచ్చితంగా డబ్బున్న వారికే ఊపిరి పోస్తున్నాయి. అందుకు కారణం అవయవ మార్పిడి అత్యంత ఖరీదైన వైద్యం అవడమే. ఉదాహరణకు కాలేయం, గుండె మార్పిడికి 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి. సులభమైన కిడ్నీ ఆపరేషన్‌కు కూడా 8 నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంత డబ్బు పెట్టి ఏ పేద వాడు వైద్యం చేయించుకోలేడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు చేయరు. కాలేయం, గుండె, మూత్ర పిండాలు లాంటి మానవ అవయవాల మార్పిడి చికిత్సను మొట్టమొదట విజయవంతంగా నిర్వహించిందీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే. ఆశ్చర్యంగా నేడు 1 నుంచి రెండు శాతం అవయవాల మార్పిడి వైద్య చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే. సరైన వ్యవస్థ లేనిదీ భారత్‌లోనే ఇలాంటి దారణమైన పరిస్థితి భారత్ దేశంలోనే ఉందని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాలు సమాన న్యాయం అనే మౌలిక సూత్రం లేదా అంతర్జాతీయ వైద్య విధాన వ్యవస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని దేశాలు నేరుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. ఆ సంస్థ ‘ఈక్వెటబుల్ అలొకేషన్ ఆఫ్ ఆర్గాన్స్’ అని చెబుతోంది. అంటే, ఓ అవయవం వైద్యం ఖర్చులు భరించే ధనవంతుడికి వెళితే, మరో అవయవం పేదవాడికి వెళ్లాలి. పేద వాడికి ప్రభుత్వ ఆస్పత్రులుగానీ, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రైవేటు ఆస్పత్రిగానీ ఉచితంగా అవయవమార్పిడి చే యాలి. ఓ గుండె ధనవంతుడికి వెళితే మరో గుండె పేదవాడికి వెళ్లడం, ఓ కాలేయం ధనవంతుడికి వెళితే మరో కాలేయం పేదవాడికి వెళ్లడం సమాన న్యాయం అనిపించుకుంటుంది. అయితే ఏ అవయం ఎవరికి ఎంత అత్యవసరమో అన్న ప్రాతిపదికనే సాధారణ అవయవ మార్పిడి ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. మోదీ ఆలోచించి ఉండాల్సిందీ అవయవాల మార్పిడిలో సమాన న్యాయం జరగాలంటే దానికో పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం’లో దాన్ని భాగం చేయవచ్చు. ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయవచ్చు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మానవ అవయవాలను దానం చేయండంటూ పిలుపునిచ్చారు. వాటిని ఎవరి కోసం దానం చేయమంటున్నారో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది. అవయవాలను ఎవరికి దానం చేయాలనే విషయాన్ని డోనర్లు లేదా వారి సంబంధీకుల చిత్తానికి వదిలి పెట్టాలని కొందర భావించవచ్చు. అందరూ మన రాధేశ్యామ్లాంటి వారు ఉండకపోవచ్చు. వారిని డబ్బుతో ప్రలోభ పెట్టవచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు. అందుకని ఓ పటిష్టమైన వ్యవస్థ ఉండాల్సిందే. మన రాధేశ్యామ్ కూతురు రివ్యానీ బతికుంటే మే 5వ తేదీన ఏడవ పుట్టిన రోజును జరుపుకునేది. ఆమె గుండెను ఓ మూడేళ్ల పాపకు అమర్చారు. ప్రతి ఏడాది ఆ పాప పుట్టిన రోజుతోపాటు తన పాప పుట్టిన రోజును కూడా మే 5వ తేదీన జరుపు కోవాల్సిందిగా ఆ పాప తల్లిదండ్రులను మన రాధేశ్యామ్ కోరారు. మరేమీ కోరలేదు. మనం మనవంతుగా అవయవదానంతో పాటు వాటి మార్పిడికి మంచి వ్యవస్థను కోరుదాం. (గమనిక : ముంబైలోని జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్ జాయింట్ సెక్రటరీ, సర్జన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షర రూపం ఈ వార్తా కథనం) -
జనాలతో..ఆటలమ్మ
గరివిడి (చీపురపల్లి) : గరివిడి మండలం కొండదాడి గ్రామంలో చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) విజృంభిస్తోంది. సరాసరి రోజున 5 నుంచి ఆరుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం 100 మందికి పైగా ఆటలమ్మ బాధితులు ఊర్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రతీ ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు బాధితులు ఉన్నారని పేర్కొంటున్నారు. తొలుత నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. వారికి ఎలాగోలా తగ్గినా ఆ రోజు నుంచి వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం మొదలైంది. ఊపందుకున్న పుకార్లు.. ఊరంతా అమ్మవారి బారిన పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది గ్రామ దేవత పండగను సరిగా నిర్వహించకపోవడం వల్లే అమ్మవారు ఉగ్రరూపం దాల్చి ఇలా ప్రతాపం చూపిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు. అయితే బాధితుల బాధలు మాత్రం వర్ణనాతీతం. ఇంటి చిట్కాలు, నాటు వైద్యం పాటించి సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. మూఢ నమ్మకాలను పట్టుకుని అశాస్త్రీయ పద్ధతిలో చికిత్సలు చేయించుకుంటుండడంతో వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడమే కాక మరింత మందికి వ్యాపిస్తోంది. పీహెచ్‌సీకి వెళ్లినా.. కొంతమంది వైద్యం కోసం బొండపల్లి పీహెచ్సీ గడప తొక్కినా అక్కడి వైద్యులు రోగులను పట్టించుకోవడం లేదు. నిజానికి విషయం తెలుసుకోగానే వైద్యులు అప్రమత్తమై సకాలంలో వైద్య సేవలందించాలి. శాస్త్రీయ పద్ధతుల వైద్యాన్ని వారికి పరిచయం చేయాలి. కానీ ఇప్పటివరకు అలాంటిది జరిగిన దాఖలాలు లేవు. వైరస్ ద్వారా వ్యాపించే చికెన్ పాక్స్ వేసవి వాతావరణం అనుకూలంగా ఉండడంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇతర గ్రామాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించాలి.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగ జేసుకుని వ్యాధి బారినుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మొదట్లోనే వ్యాధి సోకిందని తెలుసుకుని వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించి ఉంటే బాగుండేదని, ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఒక సారి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించలేదని చెబుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన మంత్రి సూర్యనారాయణ, మంత్రి వసంత, వినయ్, మండాది అప్పయ్యమ్మ, బార్నాల తవుడమ్మ, మండాది రాము, బంగారమ్మ తదితర 100 మంది రోగులు వ్యాధితో మంచం పట్టారు. పీహెచ్సీ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. బొండపల్లి పీహెచ్సీ అధికారులు ఆటలమ్మ వ్యాధితో బాధపడుతూ వెళ్తే పట్టించుకోవడం లేదు. కొంత మంది సిబ్బందికి ఆటలమ్మ వ్యాధి సోకిందన్న విషయమే తెలియదు. ఏదో రెండు నెలలకోసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారే తప్ప గ్రామంలో సమస్యలు పట్టించుకోవడం లేదు. – కొండదాడి వాసులు. నా దృష్టికి రాలేదు.. కొండదాడిలో ఆటలమ్మ విజృంభిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. రాజకీయ నాయకులు, ప్రజలు ఎవరైనా వచ్చి చెబితే చర్యలు తీసుకునేదాన్ని. స్థానిక నేతలను అడిగి వివరాలు తెలుసుకుని, చర్యలు తీసుకుంటా. – ఎన్.భార్గవి, బొండపల్లి పీహెచ్సీ వైద్యాధికారి. -
కాకినాడ ఆసుపత్రిలో చావుకేక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లో మరణ మృదంగం మోగుతోంది. ఈ ఏడాది జనవరిలో 615 మంది, ఫిబ్రవరిలో 531, మార్చిలో 483 మంది ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రధానంగా సెరిబ్రో వాస్క్యులర్ యాక్సిడెంట్ (మెదడులో రక్తనాళాలు చిట్లడం), హెమీప్లీజియా(పక్షవాతం)తో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. ఇక్కడ అవసరమైన మందులు అందుబాటులో లేవు. ప్రభుత్వం మందుల సరఫరాను నిలిపివేసింది. అరకొర బడ్జెట్ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 1,065 పడకలు ఉన్నాయి. రోగుల ఆక్యుపెన్సీ 2,000 నుంచి 2,500 వరకు ఉంటోంది. అంటే ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులు ఉండాల్సి వస్తోంది. నిత్యం రోగులతో కిటకిటలాగే ఈ ఆసుపత్రికి మందుల కోనుగోలు కోసం ప్రభుత్వం ఏటా రూ.1.82 కోట్లు మాత్రమే కేటాయిస్తోంది. ఆ మేరకే సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ మందులను సరఫరా చేస్తోంది. కేటాయించిన రూ.1.82 కోట్లకు ఒక్కపైసా పెరిగినా మందులు సరఫరా చేయడం లేదు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఆరు నెలలకు కూడా సరిపోవడం లేదు. అత్యవసర మందులు, పరికరాలు లేక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆసుపత్రిలో 400 రకాల మందులు ఉండాలి. కానీ, ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో కేవలం 150 రకాల మందులే ఉండడం గమనార్హం. ఇవి కొద్దిరోజుల్లో అయిపోతున్నాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నది అధికారులకే అంతుబట్టడం లేదు. అత్యవసరమైన సక్షన్ ఆపరేటర్స్ (ఊపిరితిత్తుల నుంచి నీరు తీసే పరికరం), ఆక్సిజన్ ప్లో మీటర్ల కొరత కూడా వేధిస్తోంది. మరణాలపై అధ్యయనమేదీ? కాకినాడ జీజీహెచ్‌లో ప్రతినెలా వందల సంఖ్యలో రోగుల మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. మరణాలపై అధ్యయనం జరగడం లేదు. అనారోగ్యంతో ఈ ఆసుపత్రిలో చేరితే క్షేమంగా ఇంటిరి తిరిగివెళ్తామన్న నమ్మకం లేకుండా పోయింది. ఇక్కడ ఏం జరుగుతోందో సమీక్ష చేసే నాథుడే లేడు. మందుల సరఫరా నిలిచిపోవడం వాస్తవమే అత్యవసర మందుల సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రికి కేటాయించిన బడ్జెట్ అయిపోవడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ మందుల సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మందులు అందిస్తున్నాం. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అనుమతితో ప్రైవేట్ మెడికల్ దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తాం’’ – ఎం.రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, కాకినాడ జీజీహెచ్ -
రిమ్స్ సెక్యూరిటీగార్డ్కు దేహశుద్ధి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన వ్యక్తి బంధువుల అశ్లీల చిత్రాలు సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ సెక్యూరిటీ గార్డు దొరికిపోయారు. దీంతో అతడికి రోగి బంధువులతోపాటు అక్కడ ఉన్న మరికొంతమంది దేహశుద్ధి చేశారు. రిమ్స్‌లో ఆస్పత్రిలో ఫిమేల్ మెడికల్ (ఎఫ్ఎం) వార్డులో ఈ సంఘటన శుక్రవారం జరిగింది. రిమ్స్‌లో ఎఫ్ఎం వార్డులో నరసన్నపేటకు చెందిన రోగి బంధువు బాత్రూమ్లో ఉండగా ఆ వార్డులో విధులు నిర్వహిస్తున్న బలగ గ్రామానికి చెందిన ఒక సెక్యూరిటీ గార్డు సెల్ఫోన్లో వీడియో తీస్తుండటాన్ని కొందరు మహిళలు గమనించారు. విషయం తెలిసిన మహిళలందరూ దేహశుద్ధి చేశారు. రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సి.హెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులు కొంతమంది సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటీవల జీతాలను కోత పెట్టారు. పూర్తి జీతాల కోసం ఈనెల 9 నుంచి 19 రోజులు సమ్మెచేశారు. కాంట్రాక్టరు, అధికారుల చొరవతో ఈ సమస్య సద్దుమణిగింది. సమ్మె ముగిసిన రెండో రోజుల్లోనే సెక్యూరిటీ సిబ్బంది ఇటువంటి చర్యలకు పాల్ప డడం రిమ్స్‌లో చర్చనీయంశంగా మారింది. -
కొవ్వుకోట్లు కరిగిస్తున్నారు
రాజశేఖర్.. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్.. వయసు 29.. మంచి జీతం.. అంతా బాగానే ఉంది.. పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఓ సంబంధం చూశారు.. పెళ్లి చూపులకెళ్లారు.. అయితే అక్కడ అమ్మాయికి రాజశేఖర్ నచ్చలేదు! కాస్త లావుగా ఉండటమే అందుకు కారణం. ఎలాగైనా లావు తగ్గా లన్న ఉద్దేశంతో రాజశేఖర్ ఒబేసిటీ ట్రీట్మెంట్కు వెళ్లాడు. ఇలా ఆయన ఒక్కరే కాదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో 14 శాతం మంది యువకులది ఇదే బాధ. ఒబేసిటీ కారణంగా వారంతా పెళ్లి చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్టు తాజాగా ఆరోగ్య సంస్థలు చేసిన అధ్యయనంలో బయటపడింది. సాక్షి, హైదరాబాద్ : స్థూలకాయం నగరవాసులకు పెద్ద ఇబ్బందినే తెచ్చిపెట్టింది. పెళ్లి జరగాలంటే బరువు తగ్గించుకోవాల్సిందేనని కండిషన్లు పెట్టే స్థాయికి చేరింది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో టెకీలు బరువు పెరిగిపోతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో సుమారు 150 వరకు ఒబేసిటీ క్లినిక్‌లున్నాయి. ఒక్కో క్లినిక్‌కు నిత్యం 25 నుంచి 30 మంది వస్తున్నారు. ఈ లెక్కన 3,700 నుంచి 4,500 మంది వరకు ఒబేసిటీ చికిత్స కేంద్రాలను సంప్రదిస్తున్నారు. వీరిలో 65 శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారని, వారిలోనూ పెళ్లికి ముందు బరువు తగ్గించుకోవాలనుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. కొన్ని ప్రముఖ క్లినిక్‌లు వారం నుంచి పదిహేను రోజులు, నెల నుంచి రెండు నెలల పాటు ఉండే ట్రీట్మెంట్కు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఏటా హైదరాబాద్‌లోనే ఒబేసిటీ ట్రీట్మెంట్కు బాధితులు రూ.243 నుంచి రూ.275 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వెల్లడైంది. లావైపోతున్నారు.. ఒబేసిటీ సమస్య ఏటేటా పెరిగిపోతున్నట్టు 2015–16లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’లో తేలింది. తెలంగాణలో 32 శాతం మంది మహిళలు, 29 శాతం మంది పురుషులు ఒబేసిటీతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. 2005–06లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అధ్యయనంలో 17.7 శాతం మంది మహిళలు, 17.6 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నట్టు తేలింది. మా మరదలే అయినా చిన్నప్పట్నుంచి నాతో పాటు కలిసి పెరిగిన మా మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఎంఎస్ పూర్తిచేసి బెంగళూరులో పనిచేస్తున్నా. అయితే పెళ్లికి మరదలు ఒప్పుకోవడం లేదు. అదేంటని ప్రశ్నిస్తే.. లావుగా ఉన్నానని చెప్పింది. దీంతో ఓ హోమియోపతి ఒబేసిటీ సెంటర్‌కు వెళ్లి రూ.1.6 లక్షల ప్యాకేజీతో 4 నెలల కోర్సుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. – రవిశంకర్, నిజామాబాద్ ఇంటర్ నుంచి బరువు పెరిగా నేను వరంగల్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో బరువు పెరిగాను. ఇంజనీరింగ్, తర్వాత స్పెషలైజేషన్ కోర్సు పూర్తయ్యే సరికి 90 కేజీలకు చేరా. ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బరువు తగ్గేందుకు వారం క్రితమే మాదాపూర్‌లోని ఓ ఒబేసిటీ క్లినిక్‌ను సంప్రదించా. మూడు నెలల ట్రీట్మెంట్ కోర్సుకు రూ.1.2 లక్షలు తీసుకున్నారు. – శృతి, మాదాపూర్ -
విశ్వాసమే కీలకం
సాక్షి, హైదరాబాద్: ‘రోగులు వైద్యులను దేవుడిలా భావిస్తారు. అలాం టి వైద్యుడిపై ప్రస్తుతం రోగుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. జబ్బును ముందే గుర్తించి హెచ్చరించినా లెక్కచేయడం లేదు. తమ నుంచి డబ్బులు గుంజేందుకే లేని రోగాన్ని ఉన్నట్లు చెప్పి భయపెడుతున్నారని భావిస్తున్నారు. వైద్యుల పట్ల నమ్మ కం లేకపోవడం వల్ల వారికంటే ఎక్కువగా నష్టపోయేది రోగులేనన్న విషయాన్ని గుర్తించాలి’ అని పలు వురు ప్రముఖ వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. రోజు వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ‘నాట్ జస్ట్ మెడ్స్–లెట్స్ టాక్ బియాండ్ మెడిసిన్’ అనే అంశం పై ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హోటల్లో జరిగిన సదస్సులో అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని, కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు, సన్‌షైన్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి, స్టార్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గోపిచంద్ మన్నం, డాక్టర్ అమిత్వారే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోగుల్లో తమపై నమ్మకం సడలకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులదని అన్నారు. మరోవైపు వృత్తిపరంగా చోటు చేసుకుంటున్న సాంకేతిక మార్పులు, చట్టాలు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మెడికల్ కాలేజీ నుంచి బయటకొచ్చి వైద్యుడిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత అనేక అంశాలు సవాల్‌గా మారుతాయని, వృత్తిపరమైన అంశాలే కాదు, ఆర్థిక, సామాజిక అంశాలు, కుటుంబ పరమైన సమస్యలు తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తుంటాయన్నారు. వీటిని తట్టుకోలేక అనేక మంది యువ వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. చేస్తే ఒక సమస్య.. చేయకపోతే మరో సమస్య వైద్య పరీక్షలు చేస్తే ఎందుకు చేశారని, చేయకపోతే వ్యాధినెలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు. రోగికి ఏదైనా జరిగితే.. వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. నిజం చెప్పినా నమ్మని దుస్థితి. ఇది వైద్యుల కంటే రోగులకే నష్టం తెచ్చిపెడుతుంది. –డాక్టర్ సోమరాజు మధ్యవర్తుల జోక్యం వల్లే.. వైద్యసేవల్లో రాజకీయ నాయకులు, ఇతరుల జోక్యం పెరిగింది. బాధితుల కంటే ఎక్కువ వీరే హల్చల్ చేస్తున్నారు. బెదిరింపులకు, దూషణలకు పాల్పడుతున్నారు. ఈ మార్పు రోగులకు, వైద్యులకు మధ్య కొంత గ్యాప్‌ను పెంచింది. ఇది మంచిది కాదు. వైద్యులపై నమ్మకం ఉంచాలి. –డాక్టర్ ఏవీ గురువారెడ్డి ఒత్తిడి వల్లే వైద్యులు చనిపోతున్నారు ఇతరులతో పోలిస్తే వైద్యులు ఐదు నుంచి పదేళ్లు తక్కువ జీవిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని కూడా నష్టపోతున్నారు. వృత్తిపరమైన సమస్యలతో అనేకమంది వైద్యులు ఒత్తిడికి గురవుతున్నారు. వృత్తిపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను తట్టుకోలేక దేశవ్యాప్తంగా ఏటా 2,500 మంది వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. –డాక్టర్ హరిప్రసాద్, అపోలో ఆస్పత్రి -
ఈ మహమ్మారి తీరు..చాప కింద నీరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడ్స్ మళ్లీ విజృంభిస్తోంది. జాతీయ సగటు కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారితో మరణిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 2016–17లో 13.03 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 12,058 ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. 2017–18లో జనవరి 31 వరకు 11.25 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 10,194 మంది కొత్త బాధితులు తేలారు. 40 ఏళ్లు దాటిన వారే ఎక్కువగా ఎయిడ్స్ బారి న పడుతున్నారు. బాధితుల్లో 52 శాతం మంది 40 నుంచి 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. 15–49 ఏళ్ల వయసున్న వారితోనే ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) పేర్కొంటోంది. ఈ వయసున్న వారిలో 6 శాతం మంది ఎయిడ్స్ పరంగా ‘హై రిస్క్’జోన్లో ఉంటారని ఈ సంస్థ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ వయసున్న వారిలో ఆరు శాతం లెక్కన.. 10.50 లక్షల మంది ఉన్నారు. ‘‘40 ఏళ్లు దాటిన వారిలో జీవితపరంగా స్థిరత్వం వస్తోంది. ఆర్థికంగానూ ఇలాగే ఉంటున్నారు. ఎక్కువ మంది ఉపాధి, ఉద్యోగాల కోసం బయటి ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితులో కొత్త వ్యక్తులతో సంబంధాలు ఎయిడ్స్‌కు కారణమవుతున్నాయి’’అని హైదరాబాద్‌లోని ప్రభుత్వ బోధన ఆస్పత్రి వైద్య నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ప్రైవేటు’ రోగుల లెక్కలేవి? రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ విషయంలో సరైన విధానం కనిపించడంలేదు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రాష్ట్ర విభాగం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన వారి సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటోంది. ఎయిడ్స్ రోగుల్లో గ్రామీణులు, పేదలు మాత్రమే ప్రభుత్వ ఎయిడ్స్ చికిత్స కేంద్రాలకు వస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రులలోనే ఎక్కువ మంది ఎయిడ్స్ రోగులు వైద్యం తీసుకుంటున్నారు. వ్యాధి సోకినవారు బయటకి చెప్పుకోవడం లేదు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ జరుగుతున్నా.. అక్కడ మందులు తీసుకుంటే అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రైవేటు చికిత్సకే మొగ్గు చూపుతున్నారు. ఇలా ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారెంత మంది అన్న లెక్కలు ప్రభుత్వ విభాగాల వద్ద ఉండటం లేదు. ప్రైవేటు సంస్థలపై పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడంతో ఎయిడ్స్ నియంత్రణ విషయంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో జాతీయ సగటును మించి కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పరీక్షలు నిర్వహించిన ప్రతి వంద మందిలో ఒకరికి వ్యాధి ఉన్నట్లు తేలగా.. అదే రాష్ట్రంలో ఆ సంఖ్య రెండుగా ఉంటోంది. చికిత్స అరకొరే.. రాష్ట్రంలో ఏటా కనీసం వెయ్యి మందిని ఎయిడ్స్ బలి తీసుకుంటోంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటికే 31,416 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,80,937 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. వీరిలో 90,156 మంది ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. న్యాకో ప్రతి రోగికి ఉచితంగా మందులు సరఫరా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పింఛన్ ఇస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(టీ సాక్స్) సంస్థ ఆధ్వర్యంలో మందులు పంపిణీ జరుగుతోంది. రెగ్యులర్‌గా మందులు తీసుకోని వారి విషయంలో టీ సాక్స్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో 37,732 మంది ఎయిడ్స్ రోగులు క్రమపద్ధతిలో మందులు తీసుకోవడం లేదు. ఫలితంగా వ్యాధి నియంత్రణ సాధ్యం కావడం లేదు. సరిపడ ఏఆర్టీ కేంద్రాలేవీ? ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) కేంద్రాలు రాష్ట్రంలో 22 మాత్రమే ఉన్నాయి. నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, మెదక్, వనపర్తి, జోగులాంబ, నాగర్‌కర్నూలు, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో ఒక్క ఏఆర్టీ సెంటర్ లేదు. -
ఆస్పత్రిలో ఆకుపచ్చ రంగులే ఎందుకు వాడతారు?
ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా ఆస్పత్రుల్లో రక్తపు మరకలు అంటుకునే అవకాశం ఎక్కువ. వేరే రంగు దుస్తులు వాడితే ఆ ఎరుపు రంగు మరింత బాగా కనిపించి రోగులను వారి బంధువుల్ని భయాందోళనలకు గురిచేసే అవకాశం ఉంది. ఆకుపచ్చ బట్టలపై రక్తం చిందినా అది ఎర్రగా కాకుండా నల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైన రంగులు. ఈ రెండు రంగులూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి కొత్త రంగు ఏర్పడుతుంది. ఆ రంగు నలుపుగా ఉంటుంది. అంటే ఆకుపచ్చ రంగు మీద పడ్డ రక్తపు మరకలు నల్లగా కనిపించడం వల్ల రోగికి భయం అనిపించదు. అందువలనే ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు, నర్సులు ఆకుపచ్చని దుస్తులు ధరిస్తారు. కొన్ని ఆస్పత్రి వార్డుల్లో పేషెంట్లకు కూడా ఆకుపచ్చని దుస్తులు ఇస్తారన్న విషయం తెలిసిందే. -
రోగులను ఇబ్బంది పెట్టొద్దు
వనపర్తి టౌన్ : ‘కేసీఆర్ కిట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సర్కారు దవాఖానాలకు వస్తున్నారు.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలి.. అని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆస్పత్రి ఆవరణలో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలతోపాటు ఓపీకి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపీ, ల్యాబ్ సేవలను సైతం కంప్యూటరీకరణ చేయాలని, రోగులు వారికి వచ్చిన రోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం పక్కాగా ఉండాలన్నారు. వైద్యులు రోగులను పరీక్షించిన తర్వాతే ల్యాబ్‌కు పంపాలని సూచించారు. జిల్లాకు ఎంసీహెచ్‌ఎస్ కేంద్రం మంజూరైందని వెల్లడించారు. ఖాళీ స్థ«లాన్ని, సామూహిక వంటశాలను వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. సీసీ రోడ్లుకు ప్రతిపాదనాలు పంపాలని కన్సల్టెన్సీ ప్రదీప్‌ను సూచించారు. కాన్పులు, ఓపీ, ఇన్పేషంట్కు తగ్గట్టుగా సిబ్బంది నియమించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్ఎంఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు సిద్ధంకండి మార్చిలో నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్షలకు అధికారులు ఇప్పటినుంచే సిద్ధం కావాలని కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, 28 నుంచి 19 వరకు రాతపరీక్షలు ఉంటాయని తెలిపారు. ఫస్టియర్‌లో 7,606, సెకండియర్‌లో 7,280 మొత్తం 14886 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇందుకు గాను జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రయ్య, ఏఎస్పీ సురెందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సింహయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక చేయూత పథకాలపై సోషల్ ఆడిట్ ఆయా సంక్షేమశాఖల ద్వారా ఆర్థిక చేయూతనిచ్చే పథకాల యూనిట్లపై ఫిబ్రవరి 7 నుంచి సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం తన చాంబర్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో గ్రౌండింగ్ చేసిన రుణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2015–16 సంవత్సరంలో యూటిలైజేషన్ ధ్రువపత్రాలు, 2016–17 సంవత్సరంలో యూనిట్ల గ్రౌండింగ్ల రుణాలపై సమీక్షించారు. 2015–16 లో 83 బీసీ యూనిట్లకు గాను కేవలం 5 యూనిట్ల యూసీలు వచ్చాయని, 226 గిరిజన యూనిట్లకు గాను 74 యూసీలు వచ్చాయని మిగతా వెంటనే సమర్పించాలన్నారు. కొత్త యూనిట్ల గ్రౌండింగ్ విషయంలో అందరు చొరవ చూపాలని ఆదేశించారు. -
ఇక ప్రైవేటు ఆస్పత్రుల ఆటకట్టు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘రోగులు చస్తున్నా సరే వైద్యం చేయడానికి ముందుకు రారు ప్రభుత్వ వైద్యులు. రోగులు చచ్చాక కూడా వైద్యం చేస్తారు కార్పొరేట్ వైద్యులు’ అన్న వాక్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యాన్ని, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యుల కాసుల కక్కుర్తిని సూచిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిని పక్కన పెడితే దేశంలోని కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టి, రోగుల హక్కుల పరిరక్షణ కోసం ఓ ఆన్లైన్ వేదిక త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. ‘ప్రైవేట్‌హాస్పటల్స్‌వాచ్. ఆర్గ్’ అనే పేరుతో వస్తున్న ఆ ఆన్లైన్ వేదిక సైట్ ప్రస్తుతానికి నిర్మాణంలో ఉంది. రోగుల హక్కులపై ఇటీవల రెండు రోజులపాటు జరిగిన దక్షిణ ఆసియా స్థాయి వర్క్‌షాప్ సందర్భంగా సైట్‌పేరును ఖరారు చేశారు. ముంబైకి చెందిన సతి, సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ జస్టిస్ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కెన్యా దేశాలతోపాటు భారత దేశంలోని 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న 60 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి రంగంలో జరగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం కోసం ఈ వెబ్‌సైట్‌ను తీసుకొస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో చదువుకొని, ప్రభుత్వం ఇచ్చే స్థలాలు తీసుకొని, పన్ను రాయతీలు అనుభవిస్తూ ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండకుండా ప్రైవేటు ఆస్పత్రులు అడ్డదారుల్లో నడుస్తున్నాయని ‘జన్ స్వస్థ్ అభియాన్’ జాతీయ కన్వీనర్ డాక్టర్ అభయ్ శుక్లా ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రులు జవాబుదారిగా వ్యవహరించేందుకు తమ వెబ్సైట్ పబ్లిక్ వేదికగా పనిచేస్తుందని, ఆస్పత్రుల అన్యాయాలు, అక్రమాలను ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ల రూపంతో వెబ్సైట్లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు. -
నిలోఫర్ ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల దవాఖాన నిలోఫర్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేద చిన్నారులకు చికిత్స అందించే నిలోఫర్ ఆస్పత్రిలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని, మూడురోజులైనా ఆస్పత్రిలోని బెడ్‌షీట్స్ మార్చడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెడ్షీట్లు మార్చకపోవడంతో అస్వస్థతతో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని వారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో కనీసం డాక్టర్లు, నర్సులు కూడా అందుబాటులో లేరని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ విషయమై ఆర్‌ఎంవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో చికిత్స కోసం వచ్చిన చిన్నారులు అనేక అవస్థలు పడుతున్నారంటూ రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. -
వైద్యుల నిర్లక్ష్యమే..
కోరుట్ల: వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత లత, అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయారని బాధిత కుటుంబీకులు శుక్రవారం ఉదయం కోరుట్ల ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. లత మృతికి కారకులను శిక్షించాలని కోరారు. సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను శిక్షిస్తామని డీఎంహెచ్‌వో సుగంధిని హామీ ఇచ్చారు. వివరాలు బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం. కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన గర్భిణి లత ప్రసవం కోసం గురువారం రాత్రి ఆస్పత్రికి వచ్చారు. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పిన వైద్యురాలు శ్రీలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోయారని, తర్వాత కాంపౌండర్లు పట్టించుకోలేదని మృతురాలి భర్త శ్రీనివాస్, పోసానిపేట సర్పంచ్ గంగారెడ్డి, గ్రామస్తులు ఆరోపించారు. అప్పుడే పుట్టిన పసికందు చనిపోయిందని తెలిసి షాక్‌కు గురైన లతను ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఆలస్యంగా వైద్యులు స్పందించారని, అప్పటికే పరిస్థితి విషమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. లతతోపాటు పసికందు మృతికి వైద్యులే కారణమని వారు ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న కోరుట్ల, కథలాపూర్ తహసీల్దార్లు సత్యనారాయణ, మధు, సీఐ సతీష్‌చందర్‌రావు, ఎస్సైలు రవికుమార్, జాన్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. డీఎంహెచ్‌వో వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అదే సమయంలో డీఎంహెచ్‌వో సుగంధిని ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులను శిక్షిస్తామని, మృతురాలి భర్త శ్రీనివాస్‌కు ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని డీఎంహెచ్‌వో సుగంధిని హామీ ఇచ్చారు. లత పిల్లల చదువుకు సాయం చేస్తామని, అంత్యక్రియలకు రూ.10వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
విసుగెత్తి 100 మంది రోగులను చంపిన నర్సు!
బెర్లిన్: వైద్యం చేయడంలో విసుగెత్తి జర్మనీకి చెందిన ఓ మగ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకున్నాడు. ప్రాణాంతక మందులను ఇచ్చి వీరిని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డెల్మెన్‌హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్(41) 2015లో ఓ ఇద్దరి రోగులను హత్య చేసి, మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపాడన్న కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే అతను మరిన్ని హత్యలకు పాల్పిడ్డాడని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 90 మంది రోగులను అతను హతమార్చినట్లు పోలీసులు అదే ఏడాది ఆగష్టులో ప్రకటించారు. దీంతో జర్మనీ కోర్టు హోగెల్కి జీవిత కాల జైలు శిక్ష విధించింది. ఈ కేసు బాధితులు మరింతమంది పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా మరో 16 మందిని కూడా నీల్స్ హోగెల్ చంపినట్లు గురువారం వెల్లడించారు. ఈ హత్యలను 1999-2005లో నీల్స్ పనిచేసిన రెండు ఆసుపత్రిలో జరిపినట్లు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా రోగులకు ప్రాణాంతక మందులు ఇంజెక్ట్ చేసి చంపేవాడు. 2005లోనే ఓ రోగికి విషపు ఇంజెక్షన్ ఇవ్వటం గుర్తించిన మరో నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే నీల్స్‌ను అరెస్టు చేయగా.. అతనికి కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇవన్నీ వైద్యం చేయడంలో విసుగు చెందే చంపినట్లు నిందితుడు అంగీకరించందని పోలీసులు పేర్కొన్నారు. (నీల్స్ హోగెల్-ఫైల్ ముఖానికి అడ్డుపెట్టుకున్న వ్యక్తి) -
గాంధీ ఆస్పత్రిలో దారుణం..
-
‘వెల్నెస్’... వెయిటింగ్ ప్లస్!
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లు, ఉద్యోగులు, పాత్రికేయుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వెల్నెస్ సెంటర్లకు రోగులు పోటెత్తుతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్‌కు పది మాసాల క్రితం రోజూ సగటు ఓపీ 30–50 ఉండగా, ప్రస్తుతం 1,700 దాటింది. వనస్థలిపురం ఓపీ రోజుకు సగటున 500–600 మంది వస్తున్నారు. ఖైరతాబాద్ సెంటర్లో ఇప్పటి వరకు 1.60 లక్షల మంది రోగులకు చికిత్స అందించగా, వనస్థలిపురంలో 70 వేల మంది చికిత్స పొందారు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్లు లేకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదు. ఏమీ తినకుండా వైద్య పరీక్షల కోసం సెంటర్‌కు చేరుకున్న వృద్ధులు, మధుమేహగ్రస్తులు, బీపీ బాధితులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి రావడం వల్ల స్పృహ తప్పి పడిపోతున్నారు. వృద్ధులకు తప్పని నిరీక్షణ రాష్ట్రవ్యాప్తంగా 52 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబర్లో ఖైరతాబాద్ ఆరోగ్య కేంద్రంలో వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇటీవల వనస్థలిపురంలో ఏరియా ఆస్పత్రిలోనూ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఖైరతాబాద్‌లో మొత్తం 21 విభాగాల్లో వైద్యసేవలు అందిస్తోంది. అయితే రోగుల నిష్పత్తికి తగినన్ని మందులు, ఫార్మసీ కౌంటర్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 8 గంటలకు సెంటర్‌కు చేరుకుంటే మధ్యాహ్నం 2 గంటలవుతోంది. అంతేకాదు వైద్యుడు రాసిన మందుల్లో సగమే ఇస్తున్నారు. ముఖ్యంగా కేన్సర్, హృద్రోగులు, మూత్రపిండాల బాధితులు, కాలేయ బాధితులకు సంబంధించిన లైఫ్ సేవింగ్ మందుల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉంటే అప్పటికే ఇతర ఆస్పత్రుల్లో చూపించుకుని ఇన్‌పేషెంట్ అడ్మిట్ కోసం వచ్చిన రోగుల వద్ద వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు అన్నీ ఉన్నా.. మా కోర్సు పూర్తయిన తర్వాతే అడ్మిట్‌కు అనుమతి ఇస్తామని చెబుతుండటం కొసమెరుపు. మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలి రోగుల నిష్పత్తికి తగినన్ని సెంటర్లు లేవు. దీంతో ఉన్నవాటిపై భారం పడుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని పాతబస్తీ, కూకట్పల్లి, గచ్చిబౌలి, సికింద్రాబాద్ ఏరియాలతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేయాలి. – రత్నం, భారత్ పెన్షనర్ల సంఘం కార్యదర్శి 4 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నా. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్‌కు చేరుకున్నా. గంటన్నర తర్వాత ఓపీ చీటీ తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్లా. మందులు తీసుకు నేందుకు ఫార్మసీ కౌంటర్ వద్ద 3 గంటలు నిలబడాల్సి వచ్చింది. అది కూడా సగం మందులే ఇచ్చారు. – సరోజిని, నల్లగొండ ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం గతంతో పోలిస్తే ఖైరతాబాద్, వనస్థలిపురం వెల్నెస్ సెంటర్లకు రోగుల తాకిడి పెరిగింది. రోగుల నిష్పత్తికి సరిపడా సాంకేతిక పరికరాలు, మానవ వనరులు లేకపోవడంతో స్వల్ప ఇబ్బం దులు ఎదురవుతున్న మాట వాస్తవమే. వచ్చిన వాళ్లకు సత్వరమే వైద్యసేవలు అందిస్తున్నాం. అత్యవసర రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ పద్మ,సీఈఓ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్