
సాక్షి, బనశంకరి: రాజధాని బెంగళూరులో కరోనా రక్కసి ఉధృతి కొనసాగడానికి వైరస్ సోకిన కొన్ని వేలమంది అదృశ్యమైనట్లు ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలో దాదాపు 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో 10,835 మంది అదృశ్యం కాగా వారి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. ప్రస్తుతం మళ్లీ 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో సిలికాన్‌సిటీ వాసుల్లో తీవ్ర ఆందోళన ఉంది. తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు మొబైళ్లు సిచ్చాఫ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వారిని కనిపెట్టడం పోలీసులు తలనొప్పిగా మారింది. వీరు మరింతమందికి కరోనా అంటిస్తారనే భయం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment