
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయుష్మాన్ భారత్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత‍్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎంతో హైప్ చేసిందని.. కానీ, ఆ పథకం కింద కోవిడ్ రోగులకు మాత్రం ఉచితంగా వైద్యం అందించలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, కరోనా సమయంలో కోవిడ్ రోగులు, ప్రజల విషయంలో కేంద్రం అశ్రద్ధ చూపిందని మండిపడ్డారు. ఇక, కోవిడ్ రోగులను, కోవిడ్ వర్కర్లను, దేశ ప్రజలను నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. కోవిడ్ సమయంలో బాధితులకు ఉచిత వైద్యం అందలేదని, పేదలకు కనీస ఆదాయం కూడా రావడంలేదని అన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు.
COVID पीड़ितों का इलाज मुफ़्त में करवाया?
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2022
- नहीं
ग़रीबों और श्रमिकों को न्यूनतम आय मिली?
- नहीं
छोटे उद्योगों को डूबने से बचाया?
- नहीं
The PM does not CARE! pic.twitter.com/68J08eQKyk