Ayushman Bharat
-
ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా
ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు.ఆయుష్మాన్ భారత్ పథకంఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజీని అందించడం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం వల్ల వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.సీనియర్ సిటిజన్లపై ప్రభావం..ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను వర్తింపజేయాలన్న నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలా మంది వృద్ధులు వైద్య సేవలను పొందడంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్యను ఆరు కోట్లకు చేర్చాలనే నిర్ణయం వారికి ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు. వారికి సకాలంలో, తగిన వైద్య సంరక్షణ లభించేలా చేస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే తొలిసారిఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధతదేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందని ముర్ము నొక్కి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో విస్తృత వ్యూహంలో భాగంగా పరిగణించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడం, అవసరమైన మందుల లభ్యతను పెంచడం, నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముర్ము అన్నారు. -
‘సుప్రీం’లో ఆప్ సర్కార్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు విషయంలో ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పథకానికి సంబంధించిన ఎంవోయూపై ప్రభుత్వం సంతకాలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బలవంతంగా సంతకం చేయించడం ఏంటన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ.. నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని కిందటి నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) scheme) పథకాన్ని కేంద్ర ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశపెట్టాలని చూసింది. అయితే దేశ రాజధానికి దీని అవసరం లేదని, ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రమంగా ఇది రాజకీయ దుమారం రేపింది.దీనిపై బీజేపీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్ వేయగా.. పథకాన్ని వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదనంతరం బీజేపీ ఆప్ మధ్య మాటలు తుటాలు పేలాయి. అయితే సుప్రీం కోర్టులో ఆ ఆదేశాలకు బ్రేకులు పడ్డాయి. సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.ఏమిటీ పథకం.. పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడమే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఉద్దేశం. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఒక అంచనా. ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. -
ఉచితంగా రూ.5 లక్షల బీమా.. 70 ఏళ్లు దాటినవారికి వరం!
కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వారికి పేద, ధనిక అనే తేడాలేకుండా వైద్యం కోసం ప్రత్యేక బీమా కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజెఎవై) కింద అక్టోబర్ 30 నుంచి ఆరోగ్య బీమా అవకాశం కల్పిస్తోంది.అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద కొత్త, విభిన్నమైన కార్డ్ జారీచేస్తారు. ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా... ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కేంద్రం తెలిపింది.దరఖాస్తు చేసే విధానం...ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంజేఏవై పోర్టల్ పీఎంజేఏవైజీవోవీ.ఇన్ లాగిన్ అయి 70 ప్లస్ ట్యాబ్ఫై క్లిక్ చేయాలి. దాంతో www.beneficiary.nha.gov.in అనే వెబ్ సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత ఆధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇవీ ఉపయోగాలు..● అర్హులైన సీనియర్ సిటిజన్లందరికీ ఈ పథకం కింద ఏబీ–పీఎంజేఎవై రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానెల్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 1,835 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్సలు పొందవచ్చు.● లబ్ధిదారులు నమోదు చేసుకున్న మొదటి రోజు నుంచి చికిత్సను యాక్సెస్ చేయడం ప్రారంభించవచ్చు. ఏదైనా వ్యాధి లేదా చికిత్స కోసం వేచి ఉండే కాలం ఉండదు, కాబట్టి కవరేజ్ వెంటనే ప్రారంభమవుతుంది. -
‘మానవత్వం లేదు’.. బెంగాల్, ఢిల్లీపై ప్రధాని మోదీ ధ్వజం
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయనందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లను లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో ఉన్న ప్రజలను పట్టించుకోకపోవటం అమానుషమని మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళవారం వృద్ధుల కోసం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య రక్షణ పొందుతారు. దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు.‘‘ ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు. తీవ్రమైన వ్యాధికి చికిత్సకు అయ్యే ఖర్చు విని పేదలు వణికిపోయేవారు. డబ్బు లేకపోవడంతో వైద్యం చేయించుకోలేని నిస్సహాయతలో ఉండేవారు. ఈ నిస్సహాయతలో ఉన్న పేద ప్రజలను నేను చూడలేకపోయా. అందుకే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా దేశంలోని 4 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారు. .. కానీ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయలేక పోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను మీకు సహాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వాలు ఈ పథకంలో చేరటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రంలోని జబ్బుపడిన ప్రజలను అణచివేసే ధోరణి అమానుషం. నేను దేశ ప్రజలకు సేవ చేయగలను. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయకుండా నన్ను అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.చదవండి: రాణి రాంపాల్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ -
70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!
ఒక్కసారి ఆస్పత్రి పాలైతే.. కొన్నేళ్ల పాటు కూడబెట్టుకున్నదంతా కరిగిపోయే పరిస్థితి. ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనా అప్పుడు ఇదే చూశాం. ఈ పరిస్థితి రాకూడదంటే ముందస్తుగా బీమా రక్షణ కలి్పంచుకోవడమే మార్గం. కానీ, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్టు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందుతోంది. ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎం జేఏవై కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ లభించనుంది. అతి త్వరలోనే అమల్లోకి రానున్న ఈ పథకం గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. పీఎంజేఏవై పథకం కింద రూ.5,00,000 సమగ్రమైన కవరేజీ లభిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు అయ్యే వైద్య పరమైన ఖర్చుల (డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు)కు సైతం కవరేజీ ఉంటుంది. చికిత్సా సమయంలో ఔషధాలు, కన్జ్యూమబుల్స్ కూడా ఉచితమే. చికిత్సలో భాగంగా వేసే స్టెంట్లు, పేస్మేకర్ల వంటి వాటికీ కవరేజీ లభిస్తుంది. ఐసీయూ, జనరల్ వార్డ్‌లో ఉండి తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది. రోగికి చికిత్సా సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే అన్ని రకాల (ఎంపిక చేసిన) చికిత్సలకు ఉచితంగా కవరేజీ అమల్లోకి వస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతుల్లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,350 మెడికల్ ప్యాకేజీలకు కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించి పథకంలో భాగంగా ఏఏ చికిత్సలకు కవరేజీ లభిస్తుందన్నది ప్రభుత్వ నోటిఫికేషన్‌తోనే స్పష్టత వస్తుంది.అర్హత? 70 ఏళ్లు నిండి, ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి అర్హులే. పీఎంజేఏవై కింద ఇప్పటికే రూ.5 లక్షల కవరేజీ కలిగిన కుటుంబాల విషయానికొస్తే.. ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు నిండిన వారు అదనంగా రూ.5 లక్షల హెల్త్ టాపప్ (కవరేజీ)ను పొందేందుకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్), ఎక్స్ సరీ్వస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కింద కవరేజీ ఉన్న వారు ఎప్పటి మాదిరే అందులో కొనసాగొచ్చు. లేదా వాటి నుంచి పీఎంజేఏవైకు మారొచ్చు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారు, ఈఎస్ఐ కింద కవరేజీ కలిగిన వారు, వీటితోపాటు అదనంగా పీఎంజేఏవై కవరేజీకి సైతం అర్హులే.దరఖాస్తు ఎలా..? పీఎంజేఏవై డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్ లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 70 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇది ఆరంభం కానుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి, అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికగా ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ/ఆభా) కలిగి ఉంటే, ఈ బీమా ఉచితమని అనుకోవద్దు. ఆభా అన్నది డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరుచుకునేందుకు ఉపయోగపడే ఖాతా. తమ హెల్త్ రిపోర్ట్‌లను ఈ ఖాతాలోకి ఉచితంగా అప్లోడ్ చేసుకుని, వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వాటిని డిజిటల్ రూపంలోపంచుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులను పొందొచ్చు. ఆభాతో సంబంధం లేకుండా పీఎంజేఏవై కింద రూ.5 లక్షల కవరేజీకి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారు, పీఎంజేఏవై కింద ఇప్పటికే హెల్త్ కవరేజీ పొందుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.అందరికీ అనుకూలమేనా?70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. ఆస్పత్రి బిల్లులు ∙రూ.5 లక్షలకే పరిమితం కావాలని లేదు. విడిగా తమ ఆరోగ్య చరిత్ర ఆధారంగా, వాటికి కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ పరిధిలోని ప్యాకేజీ వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు అందులో లేని చికిత్సలకు కవరేజీనిచ్చే ప్లాన్‌ను విడిగా తీసుకోవచ్చు. వృద్ధులు ఆయుష్మాన్ భారత్ కవరేజీని అదనపు రక్షణగానే చూడాలన్నది నిపుణుల సూచన. అంటే విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు సమగ్రమైన రక్షణతో నిశ్చి తంగా ఉండొచ్చన్నది నిపుణుల సూచన. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితం కనుక.. పథకం కింద చికిత్సలకు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చు. మన దేశంలో ఆస్పత్రి పడకల సగటు చాలా తక్కువ. కనుక తమవంతు చికిత్స కోసం వేచి చూడాల్సి రావచ్చు. ఇది నచ్చని వారు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు విడిగా హెల్త్ ప్లాన్ వీలు కలి్పస్తుంది. ప్రభుత్వ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలో సింగిల్ ప్రైవేటు రూమ్‌కు అవకాశం ఉండదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల డబ్బులతో అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకంలో ప్రీమియం సదుపాయాల కల్పన కష్టం. ఒకవేళ ప్రైవేటు రూమ్ తీసుకునేట్టు అయితే, తమ జేబు నుంచి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.ఆర్థిక భారం పడకుండా..ఉన్నట్టుండి అత్యవసర వైద్యం అవసరమైతే సమీపంలోని ప్చైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాల్సి రావచ్చు. అప్పుడు విడిగా హెల్త్‌ప్లాన్ లేకుంటే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా ఎంపిక చేసుకునే హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ పరిధిలో లేకపోవచ్చు. విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారం చూపుతుంది. ప్రైవేటు హెల్త్ ప్లాన్‌లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నా, తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేదు. కేవలం నగదు రహిత వైద్యమే అందుతుంది. టాప్ రేటెడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు, ప్రభుత్వ పథకంలో కవరేజీ లేని మరిన్ని రకాల చికిత్సలకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బీమా సంస్థలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హాప్పిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంటాయి. ‘‘దీర్ఘకాలిక వ్యాధులు లేదా సర్జరీలు, కేన్సర్ తదితర చికిత్సల్లో అధిక సమ్ ఇన్షూర్డ్ (బీమా రక్షణ) ఉండటం వృద్ధులకు ఎంతో కీలకం. వ్యాధులతో బాధపడే వారు స్వతంత్రంగా హెల్త్ కవరేజీ కలిగి ఉండాలి. వృద్ధాప్యంతో అనారోగ్యాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం. అందుకు రూ.5 లక్షల కవరేజీ సరిపోదు. వయసుమీద పడడం వల్ల వచ్చే అనారోగ్యాలకు కొన్సి సందర్భాల్లో ఖరీదైన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆరి్థక భారం పడుతుంది’’ అని పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ చాబ్రా వివరించారు. 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్పీఎంజేఏవై కింద దేశవ్యాప్తంగా 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. ఇందులో 13,466 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కానీ, అన్నీ యాక్టివ్‌గా లేవు. యాక్టివ్ హాస్పిటల్ అంటే గడిచిన 45 రోజుల్లో ఆయా ఆస్పత్రుల నుంచి కనీసం ఒక పేషెంట్ అయినా డిశ్చార్జ్ అయి ఉండాలి. యాక్టివ్ ఆస్పత్రులు కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. పైగా ఎంప్యానెల్ అయిన ఆస్పత్రులు అన్నీ కూడా అన్ని రకాల చికిత్సలను ఆఫర్ చేయడం లేదన్నది గుర్తు పెట్టుకోవాలి. అంటే పీఎం జేఏవై కింద ఎంపిక చేసిన ప్యాకేజీలలో కొన్నింటినే ఆఫర్ చేసే వెసులుబాటు ఆస్పత్రులకు ఉంటుంది.మరో మార్గం? పీఎం జేఏవై కింద రూ.5 లక్షల కవరేజీ తీసుకున్న వారు.. విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించే స్థోమత లేకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్‌కు బదులు సూపర్ టాపప్ మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షలు డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఆస్పత్రి బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తుంది. ఒక్కసారి అడ్మిషన్లో రూ.5 లక్షలకు మించి బిల్లు రావాలని లేదు. రెండు మూడు సార్లు చేరి చికిత్స తీసుకుని, మొత్తం బిల్లులు రూ.5 లక్షలు దాటినా సరే సూపర్ టాపప్ కింద పరిహారం పొందొచ్చు. పైగా బేసిక్ హెల్త్ ప్లాన్‌తో పోలి్చతే, సూపర్ టాపప్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఆరోగ్య సమస్యలకు మెరుగైన రక్షణ దిశగా వృద్ధులు ప్రణాళిక రూపొందించుకోవాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
‘ఆయుష్మాన్’ అమలుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: డెబ్భై ఏళ్లు ఆపైబడిన వారందరికీ పేద, ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు తెలంగాణలో రంగం సిద్ధమైంది. ఆ వయస్సు వారు తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత వైద్యం అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు అందజేస్తారు.ఆధార్ కార్డును ఆధారం చేసుకుని వయస్సును లెక్కించి కార్డులు ఇస్తారు. అలా కార్డులు పొందినవారు ఏదైనా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌కు పథకాల పేర్లలో తేడాలు ఉన్నా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశమని అంటున్నారు. ఆరోగ్యశ్రీలో 77.19 లక్షల కుటుంబాలకు వైద్యం అందుతోంది.ఇందుకు ఏటా సగటున రూ.700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే, దీనికింద కవర్ అయ్యే 26.11 లక్షల కుటుంబాల కోసం సుమారు రూ.200 కోట్ల వరకూ కేంద్రమే భరిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా 5 లక్షల మంది 70 ఏళ్లు పైబడిన వారికి కూడా వైద్యం అందితే అందుకు అవసరమైన నిధులను కేంద్రమే భరిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. కలిపి అమలు చేయాలి ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 972 రకాల వ్యాధులకు చికిత్స అందుతుండగా, ఆయుష్మాన్ భారత్‌లో 1,350 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్లోలేని 540 వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 వ్యాధులు ఆయుష్మాన్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటినీ కలిపి అమలు చేయాలని వైద్య వర్గాలు అంటున్నాయి. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు. కానీ ఆయుష్మాన్ భారత్ పథకం వాటికి వర్తిస్తుంది.కిడ్నీ, లివర్ మారి్పడులు ఆరోగ్యశ్రీలో ఉండగా... ఆయుష్మాన్‌లో లేవు. ఈ రెండు స్కీంలు కలిపితే అన్ని చికిత్సలు ఒకే గొడుగు కిందకి వస్తాయి. ఈ రెండు పథకాల ద్వారా రాష్ట్రంలో అర్హులైన వారికి 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం లభిస్తుంది. ఆయుష్మాన్‌లో చికిత్సల ప్యాకేజీల ధరలు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
AB-PMJAY: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: డెబ్భై ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబి్ధదారులకు త్వరలో కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.కుటుంబసభ్యులు ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్ఐ పథకంలో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం వాటినో, ఏబీపీఎంజేఏవైనో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు మేలు చేకూరనుంది. ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అమలవుతోన్న అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది. తొలినాళ్లలో జనాభాలో దిగువ తరగతి 40 శాతం మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్దిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా/అంగన్వాడీ/ఏడబ్ల్యూహెచ్ఎస్లకూ వర్తింపజేశారు. 31వేల మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ రూ.12,461 కోట్ల వ్యయంతో మొత్తంగా 31,350 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్టులకూ కేబినెట్ ఓకే చెప్పింది.→ పీఎం గ్రామ్ సడక్ యోజన–4 కింద అదనంగా 62,500 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్ సరేనంది. కొత్తగా 25వేల జనావాసాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో వంతెనలనూ ఆధునీకరించనున్నారు. → విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం–ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకాల అమలు కోసం రూ.14,335 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి ఇచి్చంది. విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర, అంబులెన్స్, ట్రక్కు, ఇతర వాహనాలపై రూ.3,679 కోట్ల మేర సబ్సిడీ ప్రయోజనాలు పౌరులకు కలి్పంచనున్నారు. → ముందస్తు వాతావరణ అంచనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. రెండేళ్లలో రూ.2,000 కోట్ల వ్యయంతో ‘మిషన్ మౌసమ్’ను అమలుచేయనున్నారు. భారత వాతావరణ శాఖతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ విభాగాల ద్వారా ఈ మిషన్‌ను అమలు చేయనున్నారు. -
70 ఏళ్లుపైబడినవాళ్లకు ఆయుష్మాన్ భారత్ అమలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్భారత్ వర్తింపజేస్తూ నిర్ణయం. ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నది: మంత్రి అశ్వినీ వైష్ణవ్తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందుతాయి.కేబినెట్ నిర్ణయాలుపీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి ఆమోదం.. రూ.10,900 కోట్ల కేటాయింపు.. ఈవీలపై సబ్సిడీ కొనసాగింపు.. 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్‌ల ఏర్పాట్లు జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్ల కేటాయింపు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన.. రూ. 70,125 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం.. 25,000 గ్రామాలను కలిపేలా రోడ్ల నిర్మాణం పీఎం ఈ -బస్ సేవా పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. రూ. 3,435 కోట్ల రూపాయలతో 38వేల ఈ -బస్ ల ఏర్పాటు వాతావరణ శాఖ టెక్నాలజీ(మిషన్ మౌసమ్) కోసం రూ.2 వేల కోట్ల కేటాయింపు -
ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ 2024లో ప్రతిపాదనలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే వార్షిక కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారికి విస్తరించాలని యోచిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎంజేఏవై)ను 12 కోట్ల కుటుంబాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. మరో రూ.646 కోట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు కేటాయించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే నేషనల్ హెల్త్ అథారిటీ రూపొందించిన అంచనాల ప్రకారం కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్ల అదనపు భారం పడుతుంది.ఇదీ చదవండి: అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలిబడ్జెట్ రూపొందించడానికి ముందు ప్రభుత్వం వివిధ పరిశ్రమ వర్గాలను సంప్రదించింది. అందులో బడ్జెట్లో ఆర్థిక వనరులను పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ఆరోగ్యంపై ప్రభుత్వం తక్కువ ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దేశ జీడీపీలో 1.1 శాతం నుంచి 1.6 శాతం మాత్రమే ఆరోగ్య సంక్షేమానికి కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. వీక్షిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పింది. పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి ప్రాధాన్యతా రంగంగా ఆరోగ్య రంగాన్ని మార్చాలని సూచించింది. -
పల్లె ‘నాడి’ పట్టడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం నా హక్కు’.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరికొత్త నినాదమిది. ప్రతి వ్యక్తికి నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందాలనేది డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా నిర్దేశించి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ బాధ్యతను ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన జీవనం అందుతుందని సూచిస్తోంది. దేశంలో ఆరోగ్య సేవలపై నివేదకను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ పేరిట పేదలకు అరోగ్య సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల తీరు ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరువేరుగా చూస్తే గ్రామీణ ప్రాంతంలో సేవలు బాగా వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పేదరికంతో సతమతం... గ్రామీణ భారతంలో పేదలే ఎక్కువ. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం నుంచి 47 శాతం మంది శస్త్రచికిత్సల కోసం రుణాలు తీసుకోవడం, అప్పులు చేస్తున్నారు. ఇక 20 శాతం నుంచి 28 శాతం మంది ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికే నోచుకోవడం లేదు. పట్టణ ప్రాంత జనాభాతో పోలీస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 64% మంది వయసు మీదపడకముందే మరణిస్తున్నారు. ఇక దేశ జనా భాతో పోలిస్తే 6లక్షల డాక్టర్ల కొరత ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లక్ష్యాలు బాగున్నా... ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలు వైద్య సేవల కోసం చేస్తున్న సగటు ఖర్చు జీడీపీలో 5.8శాతం కాగా, భారత్ మాత్రం 1%మాత్రమే ఖర్చు చేస్తోంది. 195 దేశాల్లో వైద్య సేవలపై అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్ఓ పలు కేటగిరీల్లో దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఆస్పత్రి ప్రసవాల్లో 125వ ర్యాంకు, శిశు మరణాల్లో 135వ ర్యాంకుతో భారత్ సరిపెట్టుకుంది. కేటాయింపులు రెట్టింపు చేయాలి వైద్య రంగానికి ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు రెట్టింపు చేయాలి. అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు లేకపోవ డంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కొరవడతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెడికల్ టీచర్స్ -
దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం!
రోడ్డు మరణాలు, ప్రమాదాల్ని తగ్గించేందకు కేంద్ర రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. జైన్ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ సదస్సులో రోడ్ సెక్రటరీ అనురాగ్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా గాయపడిన రోడ్డు ప్రమాద బాధితులందరికీ నగదు రహిత వైద్య చికిత్సను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న అన్ని బ్లాక్స్పాట్లను తొలగించడం గురించి జైన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 4000 ప్రమాదాలకు గురయ్యే ఇంజినీరింగ్ లోపాలను సరిచేశామని అన్నారు. మిగిలిన 5,000 బ్లాక్స్పాట్లకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను రాబోయే మూడు లోపు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. అన్ని డీపీఆర్‌లు మూడు నెలల్లో తయారవవుతాయని, మే 2025 నాటికి అన్ని ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అన్ని ప్రాజెక్టులను ఒకేసారి మంజూరు చేయాలని మేము భావిస్తున్నాము’ అని ఆయన వెల్లడించారు. -
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌పై తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడకముందే పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేశారు. కాగా, తరుణ్ చుగ్ ఎల్బీనగర్లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం చేతితో కారు స్టీరింగ్ ఉంది. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల స్కీమ్ ఎందుకు అమలు చేయడం లేదు. కుటుంబ పాలన, దుష్ట పాలన నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేది కేవలం బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు బీ టీమ్. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోని నెట్టారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు. మెట్రో నగరమైన హైదరాబాద్‌కు కేంద్రం నిధులు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోంది. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్.. ప్రజలను మోసం చేస్తున్నాడు. దీనిలో కేంద్రం నిధులున్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశంలో ప్రతీ గ్రామంలో స్వతంత్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే! -
పల్లెపల్లెకూ ఫార్మసీ స్టోర్!
న్యూఢిల్లీ: మారిన జీవనశైలి, ఆహార నియమాలతో పట్టణం, పల్లె అని వ్యత్యాసం లేకుండా ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. దీనికితోడు వైద్య వసతులు పెరగడంతో పల్లెల్లోనూ ఔషధ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో ఫార్మసీ స్టోర్లు జోరుగా తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఏర్పడిన అవగాహన సైతం ఔషధ వినియోగాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం, ఏటా మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో ఫార్మాసిస్టులు రావడం కూడా ఔషధ దుకాణాల సంఖ్య విస్తరణకు మద్దతుగా ఉంటున్నాయి. ఏటా 4,50,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంటే, ఇందులో 40,000–45,000 వరకు సొంతంగా దుకాణాలను తెరుస్తున్నట్టు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. దేశంలో 12 లక్షల మంది ఫార్మాసిస్టులకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘‘ఫార్మాసిస్టులు పల్లె బాట పడుతున్నారు. కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు కనీసం 1,000–2,000 మంది జనాభా ఉన్న ప్రతి ఊరులోనూ ఫార్మసీ స్టోర్ ఉంది’’అని సింఘాల్ వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారని, క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం పల్లెలు, చిన్న పట్టణాల్లో ఔషధ విక్రయాలు పెరగానికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కీలకంగా పనిచేస్తోంది. ఈ పథకం కింద 26,055 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 4.3 కోట్ల మంది చేరి వైద్యం పొందినట్టు 2022–23 ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,54,070 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రిస్కిప్షన్‌ను జారీ చేస్తే ఔషధాలను ప్రభుత్వ చానళ్ల ద్వారా లేదంటే ప్రైవేటు ఫార్మసీ స్టోర్లలో కొనుగోలు చేసుకుంటున్నట్టు సింఘాల్ తెలిపారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ ఔషధాలకు డిమాండ్ ఏర్పడినట్టు చెప్పారు. భారత ఫార్మా మార్కెట్లో టైర్–2 నుంచి టైర్–6 వరకు పట్టణాల వాటా 21 శాతంగా ఉంటుందని అంచనా. ఔషధాలకు డిమాండ్ ఏర్పడడంతో ఫార్మసీ కంపెనీలు సైతం మార్కెటింగ్ సిబ్బందిని చిన్న పట్టణాల్లోనూ మోహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పెంచుకుంటున్నాయి. తమకున్న విస్తృత నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటు ధరలకే నాణ్యమైన ఔషధాలను అందిస్తున్నట్టు సన్‌ఫార్మా ప్రతినిధి తెలిపారు. ‘‘నేను దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజలు, మా కంపెనీ స్టాకిస్టులు, అమ్మకాల సిబ్బందితో మాట్లాడాను. రహదారులు, ఆస్పత్రులు, విద్యుత్ తదితర సదుపాయాల విస్తరణతో ప్రజలు తమ స్వస్థలాల్లోనే ఉండాలనుకుంటున్నారు. మెట్రో పట్టణాలకు రావాలని అనుకోవడం లేదు. కరోనా తర్వాత సొంత గ్రామాల్లోనే ఉండాలన్నది వారి అభీష్టంగా ఉంది’’అని మ్యాన్ కైండ్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ రాజీవ్ జునేజా వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం సైతం అమ్మకాలు పెరగడానికి తోడ్పడుతున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ వైద్యుల అందుబాటు పెరిగినట్టు ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కృష్ణకుమార్ పేర్కొన్నారు. ‘‘మాకు 140 పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఉన్నాయి. ఒక్కోటీ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఈ పాయింట్లను 300కు పెంచుతున్నాం. దేశంలో 85 శాతం ప్రాంతాలను చురుకోగలం’’అని వివరించారు. -
హెల్త్ ఐడీల జారీలో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: ఆరోగ్య రంగంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానాన్ని మధ్యప్రదేశ్, మూడో స్థానాన్ని ఉత్తరప్రదేశ్ దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ– ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వెళ్లి 3,86,86,305 మందికి సార్వత్రిక ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఐడీలను జారీ చేసిందని వెల్లడించింది. ప్రాథమిక దశలోనే వ్యాధుల నివారణ.. జీవనశైలి, జీవనశైలేతర వ్యాధులను నివారించడానికి రాష్ట్రంలోని 4.66 కోట్ల జనాభాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ప్రజలకు వారి ఇళ్ల వద్దే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు.. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, రక్తహీనతతో పాటు ఇతర వ్యాధులను గుర్తించడానికి ప్రాథమిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో వ్యాధులు బయటపడినవారికి వైద్యులతో తదుపరి పరీక్షలు చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటికి 3,86,86,305 మందికి వారి ఇళ్ల వద్దే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. వారి ఆరోగ్య వివరాలతో కూడిన హెల్త్ ఐడీలను జారీ చేసి డిజిటలైజ్ చేశారు. అలాగే ప్రజల హెల్త్ ఐడీలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానించారు. దీంతో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. చదవండి: మే రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా -
స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ అమల్లో ఏపీకి ఉత్తమ అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పాఠశాల ఆరోగ్యం, సంక్షేమం కార్యక్రమం (స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్) అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన 2వ జాతీయ వర్క్ షాపులో ఆంధ్రప్రదేశ్ తరఫున స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్, పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు (ఎస్సీఈఆర్టీ) నోడల్ ఆఫీసర్ హేమరాణి ఈ పురస్కారాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోలీ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారని పేర్కొన్నారు. కేంద్రం 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో ఆగస్టు 2020 నుంచి ఎస్సీఈఆర్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంయుక్తంగా యూనిసెఫ్ సాంకేతిక సాయంతో అమలు చేశాయని తెలిపారు. చదవండి: (కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు) -
వైద్యం.. మరింత సులభతరం
రోగి వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు ఇదివరకు తీసుకున్న చికిత్స.. వైద్య పరీక్షల నివేదికలు తప్పనిసరి. దీని ఆధారంగా చికిత్స ఏది అవసరమో అది కొనసాగించవచ్చు. ఇలాంటివి రోగి మరచిపోయినప్పుడు వైద్యులు మొదటి నుంచి పరీక్షలు, స్కానింగ్ చేయించి వివరాలు తెలుసుకుని తర్వాత చికిత్స ప్రారంభించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో భాగంగా అలాంటి కాగితాలు ఏవీ లేకుండానే ‘రోగి చరిత్ర’ మొత్తం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (ఈ–హెల్త్ రికార్డ్)లో నిక్షిప్తం చేసే విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోగులు రాష్ట్రంలో ఎక్కడ వైద్యానికి వెళ్లినా తమ పూర్వపు ఆరోగ్య స్థితులను ఇట్టే తెలియజెప్పే ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈ–హెచ్ఆర్) రిజిస్ట్రేషన్ ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. రోగులు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పుడు వారికి వైద్యపరీక్షలు నిర్వహించడం, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి జబ్బులు ఇలాంటివేవైనా ఉంటే పూర్తిస్థాయిలో వివరాలన్నీ ఎల్రక్టానిక్ రికార్డుల్లోకి ఎక్కిస్తారు. రోగి ఆధార్, మొబైల్ నంబర్లను క్రోడీకరించి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఈ నంబర్ ఆధారంగా పూర్వపు ఆరోగ్య వివరాలన్నీ ఏ డాక్టరు వద్దకు వెళ్లినా తెలుసుకోవచ్చు. అనంతలో 43 వేలు, శ్రీసత్యసాయిలో 35 వేలు.. రాష్ట్రంలో 542 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అందులో శ్రీసత్యసాయి జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 26 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల వాసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుండగా, పట్టణ పేదలు అర్బన్ హెల్త్ కేంద్రాలకు వస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో శ్రీసత్యసాయి జిల్లాలో 35,052 మందికి, అనంతపురం జిల్లాలో 43,578 మందికి ఈహెచ్‌ఆర్ నమోదు పూర్తి చేశారు. ఇప్పటికీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఎలక్ట్రానిక్ హెల్త్‌రికార్డులతో.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల వల్ల వైద్యం మరింత సులభమవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన డేటా మొత్తం ఇందులో ఉండటంతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ ఆస్పత్రికెళ్లినా పూర్తి వివరాలు ఉంటాయి. కొత్తగా ఎప్పుడు వైద్యం చేయించుకున్నా అదనపు వివరాలు నమోదు చేస్తారు. దీనివల్ల జీవనశైలి జబ్బులు ఎంతమందికి ఉన్నాయి, దీర్ఘకాలిక జబ్బులు ఎంతమందికి ఉన్నాయి ఇలా జిల్లాలో ఉన్న మొత్తం వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీన్నిబట్టి జబ్బుల శైలిని కూడా అంచనా వేయొచ్చు. ఈహెచ్‌ఆర్‌లో ఆరోగ్యశ్రీ నెంబర్ కూడా నమోదు చేయడం వల్ల ఎక్కడికెళ్లినా ఉచితంగానే వైద్యం పొందే అవకాశం ఉంటుంది. రోగులతో పాటు వైద్యుల వివరాలు ఏబీడీఎంలో నమోదు చేస్తారు. ఏ డాక్టరు ఏ వైద్యం చేశారన్నది కూడా ఇకపై హెల్త్ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇదీ చదవండి: సర్కారీ వైద్యం సూపర్ -
‘డిజిటల్ హెల్త్’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(ఆభా) కార్డుల జారీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) ఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ గోపాల్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సభ్యులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ కృషి చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్యక్రమంలో ప్రైవేట్ ఆస్పత్రులు భాగస్వాములు కావాలని చెప్పారు. ఆభా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్ మాట్లాడుతూ డిజిటల్ యుగం వైపు దేశం దూసుకుపోతున్న తరుణంలో వైద్య, ఆరోగ్య రంగం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాలకు వెళ్లిన వైద్యులు ప్రజలకు అందించే వైద్య సేవలను వారి ఆభా ఐడీలకు అనుసంధానం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రజలు ఎక్కడికి వెళ్లినా వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలిసిపోతుందని, సత్వర వైద్యం అందించేందుకు దోహదపడుతుందని వివరించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి, ఆయుష్మాన్ భారత్ ప్రత్యేకాధికారి బీవీ రావు, డాక్టర్ కోటిరెడ్డి, పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతి కథనం అవాస్తవం
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులు సరిగా జరగడంలేదంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనం అవాస్తవమని ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు క్లెయిమ్స్ చెల్లించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరానికి విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధుల్ని నెట్వర్క్ ఆస్పత్రులకు వినియోగించారనేది సత్యదూరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు నేషనల్ హెల్త్ ఏజెన్సీ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,790 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఈహెచ్ఎస్కు సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.199.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈహెచ్ఎస్ కింద ఈ ఏడాది ఇప్పటివరకు 3,25,390 మంది చికిత్స పొందారని వివరించారు. చదవండి: (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్) -
డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ముందడుగు వేసింది. శుక్రవారానికి రాష్ట్రంలో కోటి హెల్త్ రికార్డులను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానం చేసి, ఈ ఘనతను సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ జీఎస్ నవీన్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో 3.4 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీ రికార్డులను రాష్ట్ర ప్రజలకు అందజేశామని, ఇది కూడా మిగతా రాష్ట్రాలకంటే అధికమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు డిజిటలైజేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. రోగుల ఆరోగ్య నివేదికలను డిజిటలైజ్ చేసి భద్రపరచడంతో పాటు అవసరమైనప్పుడు వాటిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇందులో అర్బన్, రూరల్ హెల్త్ సెంటర్ల నుంచి బోధనాస్పత్రుల వరకు భాగస్వాములవుతాయన్నారు. ఈ కేంద్రాలన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎకో సిస్టంలో భాగంగా మారాయని ఆయన వివరించారు. -
‘ఆరోగ్యశ్రీ’లో 25 లక్షల శస్త్రచికిత్సలు
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పథకంతో ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానించింది. దీంతో 87.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలకుపైగా శస్త్రచికిత్సలు జరిగాయని పేర్కొంది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్తనిల్వ కేంద్రాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. 27 బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్ సెపరేటర్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కొత్తగా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో భాగంగా డైట్ చార్జీలను రెట్టింపు చేసి కొత్త డైట్ మెనూను ప్రవేశపెట్టారు. కొత్త ఔషధ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. రూ.61 కోట్ల అంచనా వ్యయంతో 29 బోధనాసుపత్రులు, 20 జిల్లా ఆసుపత్రులు, 30 సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ పనులు సాగుతున్నాయి. రూ.61 కోట్లతో 20 ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు(ఎస్టీపీ) మంజూరయ్యాయి. రూ.31 కోట్ల అంచనా వ్యయంతో 153 ఇతర ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పనులు మంజూరయ్యా యి. 61 ఆసుపత్రుల్లో మార్చురీల మర మ్మతు, పునరుద్ధరణ, అప్‌గ్రేడేషన్ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 12,755 ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతిచి్చందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగిందని, జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానానికి చేరుకుందని తెలిపారు. -
ఓటు బ్యాంకు కోసం కాదు.. నయా భారత్ కోసమే సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: ‘ఓటు బ్యాంకు కోసం కాదు. నయా భారత్ కోసమే సంస్కరణలు చేపడుతున్నాం. ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రయతి్నస్తున్నాం’అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పేదల ఆరోగ్యం కోసమే ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టామని అన్నా రు. ఎగుమతుల్లో భారత్ చరిత్ర సృష్టించిందని చెప్పారు. మెడికల్, టెక్నికల్ విద్యను మాతృభాషలో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో మంగళవారం జరిగిన ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’కార్యక్రమానికి అనుసంధానంగా తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ లబి్ధదారులతో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ పరిశోధనా క్షేత్రంలో వర్చువల్‌గా కార్యక్రమం జరిగింది. 3 వేల మంది లబి్ధదారులతో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని వర్చువల్ పద్ధతిలో మోదీ విడుదల చేశారు. రైతుల ఖాతా ల్లోకి నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉం డాల్సిందేనని.. దీంతో ప్రజలకు మేలు జరుగుతుందని, అవి నీతి తగ్గుతుందని చెప్పారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే ధ్యేయమని, సర్జికల్ స్ట్రైక్ చేయడం పట్ల గర్వపడుతున్నా మని చెప్పారు.భారత స్టార్టప్‌లపై చర్చ జరుగుతోందన్నారు. ధాన్యం సేకరణకు రూ. 26,600 కోట్ల ఖర్చు: కిషన్‌రెడ్డి 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లను ఏకకాలంలో జమ చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎరు వుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఎరువుల దుకాణాల వద్ద క్యూ కట్టేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నా రు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ. 4 లక్షల కోట్ల వరకు పెంచామన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గతంలో కొన్ని రకమైన పంటలకు మాత్రమే మద్దతు ధర ఉండేదని, నేడు 23 రకాల పంటలకు ఇస్తున్నామని చెప్పారు. భూ రికార్డుల ఆధునీకరణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నా రు. నానో యూరియా దిగుబడి పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 2014లో రూ. 3,400 కోట్లను ఖర్చు చేస్తే ప్రస్తుతం రూ. 26,600 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. రామగుండం ఫ్యాక్టరీని కేసీఆర్ అడ్డుకుంటున్నారు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభం కావాల్సి ఉందని, ప్రారంభమైతే బీజేపీ నేతలకు పేరొస్తుందని కాలుష్యం పేరుతో ఫ్యాక్టరీకి నోటీసులిప్పించి అడ్డుతగులుతున్నారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అందనివ్వట్లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. కేసీఆర్ ఎన్ని రోజులు ఫామ్ హౌస్‌లో ఉంటారో.. ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ‘డబ్బా ఇల్లు వద్దన్నారు. 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టారు’అని రాష్ట్ర సర్కారును ప్రశ్నించారు. పేదల కోసం ఎన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికైనా రాష్ట్రానికి నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. -
ఆయుష్మాన్ భారత్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయుష్మాన్ భారత్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎంతో హైప్ చేసిందని.. కానీ, ఆ పథకం కింద కోవిడ్ రోగులకు మాత్రం ఉచితంగా వైద్యం అందించలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కరోనా సమయంలో కోవిడ్ రోగులు, ప్రజల విషయంలో కేంద్రం అశ్రద్ధ చూపిందని మండిపడ్డారు. ఇక, కోవిడ్ రోగులను, కోవిడ్ వర్కర్లను, దేశ ప్రజలను నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. కోవిడ్ సమయంలో బాధితులకు ఉచిత వైద్యం అందలేదని, పేదలకు కనీస ఆదాయం కూడా రావడంలేదని అన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. COVID पीड़ितों का इलाज मुफ़्त में करवाया? - नहीं ग़रीबों और श्रमिकों को न्यूनतम आय मिली? - नहीं छोटे उद्योगों को डूबने से बचाया? - नहीं The PM does not CARE! pic.twitter.com/68J08eQKyk — Rahul Gandhi (@RahulGandhi) March 24, 2022 -
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్’ అమలు చేయాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దూరం చేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అన్ని రాష్ట్రాలలో అమలవుతుంటే తెలంగాణలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం చిక్కడపల్లిలో బీజేపీ రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సివేగి బాలు, కె.ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 300లకు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కె.రవిచారి, జి.భరత్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, సి.పార్ధసారథి, గడ్డం నవీన్, ప్రవీణ్ నాయక్, కిరణ్, లోక్యానాయక్, రమణయ్య, సంపత్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. -
అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదన్న ఆయన వ్యక్తిగత స్థాయిలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఆకాశవాణి మన్ కీ బాత్ 83వ సంచికలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తనకు అధికారం అక్కర్లేదని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుడు ఒకరు మోదీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పగా ప్రధాన సేవకుడిగా దేశ ప్రజలందరికీ సేవ చేయడమే తన కర్తవ్యమని అన్నారు. ‘‘వాస్తవానికి నేను ఇప్పుడు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండను. ప్రజా సేవలో ఉండాలన్నదే నా లక్ష్యం. ఒక ప్రధానమంత్రిగా నేను చెలాయిస్తున్నది అధికారం కాదు. ఇదంతా ప్రజాసేవే’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నడుస్తున్నది స్టార్టప్‌ల యుగమని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో స్టార్టప్ పరిశ్రమ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోందని కొనియాడారు. దేశంలో 100 కోట్ల డాలర్ల విలువను కలిగిఉన్న స్టార్టప్‌లు ప్రస్తుతం 70కి పైగా ఉన్నాయని వెల్లడించారు. దేశంలోని పల్లెల్లో యువత కూడా స్టార్టప్‌లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ సమస్యలకి పరి ష్కార మార్గాలు చూపిస్తున్నారని మోదీ అన్నా రు. కరోనాతో ప్రపంచ దేశాలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తల్లడిల్లుతూ ఉంటే మన స్టార్టప్ రంగం ఎంతో ఎత్తుకి ఎదిగిందని చెప్పారు. 1971 యుద్ధానికి గోల్డెన్ జూబ్లీ డిసెంబర్ మాసం వచ్చిందంటే తనకి వీర సైనికులు గుర్తుకు వస్తారని ప్రధాని అన్నారు. నేవీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ డేని ఇప్పటికే జరుపుకున్నామని 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో విజేతలుగా నిలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వీర సైనికుల్ని కన్న తల్లులకు మోదీ జోహార్లు అర్పించారు. -
Andhra Pradesh: ‘డిజిటల్ హెల్త్’కు నాంది
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశవ్యాప్తంగా చేపట్టిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ పనులు ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి అనంతపురం జిల్లా సర్వజనాస్పత్రితో పాటు తిరుపతి, విజయవాడ, కాకినాడ ఆస్పత్రులు ముందుకొచ్చాయి. డిసెంబర్ మొదటి వారంలో ఆయా చోట్ల ఏబీడీఎం (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. మొదట ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది (ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ తదితరులు) వివరాలతోపాటు అదనంగా వైద్య సదుపాయాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీరికి 14 అంకెలతో కూడిన నంబర్ కేటాయిస్తారు. ఈ వివరాలను పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోకి వెళ్లినా ఆ నంబర్‌తో కూడిన వ్యక్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నాలుగు ఆస్పత్రుల్లో నమోదు పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. నాలుగు వారాల్లో బోధనాస్పత్రుల్లోనూ, ఆ తర్వాత నాలుగు వారాల్లో జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ, తర్వాత నాలుగు వారాల్లో సీహెచ్సీల్లోనూ, చివరగా పది వారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ హెల్త్‌కేర్ ఫెసిలిటీస్, వైద్య సిబ్బంది వివరాలన్నీ సేకరించి ఏబీడీఎం పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. త్వరలోనే ప్రైవేటు ఆస్పత్రుల వివరాలనూ సేకరిస్తారు. రోగుల వివరాలూ నమోదు.. ► రాష్ట్రవ్యాప్తంగా ఎన్సీడీ (అసాంక్రమిక వ్యాధులు)పై సర్వే వివరాలను ఈ డిజిటల్ రూపంలోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ►ప్రస్తుతం రాష్ట్రంలో 20 ఏళ్ల వయసు దాటిన వాళ్లందరికీ ఏఎన్ఎంలు బీపీ, షుగర్, బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) చెక్ చేస్తున్నారు. ఈ వివరాలన్నీ డిజిటల్ మిషన్‌కు అనుసంధానం చేస్తారు. ►పేషెంటు వివరాలతోపాటు మనం చికిత్స చేయించుకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వివరాలూ, వైద్యం చేసిన డాక్టరుకు ఎంసీఐ కేటాయించిన ప్రత్యేక క్రమ సంఖ్య, పేరు నమోదు చేస్తారు. ►ఈ ప్రక్రియకు మన రాష్ట్రంలో కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ►ఈ వివరాలతో ప్రతి వ్యక్తికి ప్రత్యేక డిజిటల్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ నంబరే పేషెంటుకు దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఉపయోగపడుతుంది. ►ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశంగా ఈహెచ్‌ఆర్ (ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్) ఏర్పాటు చేస్తారు. ►ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డు మన రాష్ట్రంలో ఎలా పనిచేస్తుందో.. అలాగే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోకి వెళ్లినా ఈహెచ్‌ఆర్ నంబర్ పనిచేస్తుంది. ►మనకు కేటాయించిన డిజిటల్ ఐడీ నంబర్‌ను ఎంటర్ చేయగానే మన వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల వైద్యం సులభతరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. -
ఆరోగ్యానికి రూ.64 వేల కోట్లు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాశిలో ప్రారంభించారు. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చారు. నాలుగేళ్లలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వైద్య కళాశాలలను కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ధ నగర్, వారణాశిలలోలు పర్యటించిన ప్రధాని మోదీ ఆరోగ్య రంగంపై కేంద్రం తీసుకోబోతున్న చర్యలు వివరించారు. ‘‘ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడం అనేది దశాబ్దాల క్రితమే జరిగి ఉండాల్సింది’’ అని వారణాశిలో మోదీ వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ఆరోగ్య రంగంలో ఉన్న అంతరాలను తగ్గిస్తుందని అన్నారు. ‘‘మా కన్నా ముందు అధికారంలో ఉన్న వారు ఆరోగ్య సేవలను డబ్బు సంపాదనకు, కుంభకోణాలకు ఓ సాధనంగా వినియోగించుకున్నారు. గతంలో ప్రజల సొమ్ము కుంభకోణాల్లోకి వెళ్లేది... ఇప్పుడా సొమ్ము పెద్ద ప్రాజెక్టులకు వినియోగపడుతోంది. ఎన్డీయే ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సదుపాయాలపై దూకుడు విధానం అవలంభిస్తాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వంలో ఉండి కూడా వారు వైద్య రంగం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడలేదని మోదీ విమర్శించారు. గ్రామాల్లో సరిపడా ఆసుపత్రులు లేవు, ఒక వేళ ఆసుపత్రులు ఉంటే వాటిలో వైద్యులు ఉండేవారు కాదన్నారు. ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల సదుపాయాలు లేవని... ఆయా సమస్యలన్నింటినీ ఈ మిషన్ పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. ఈ మిషన్ దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, మహమ్మారులను ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని, ఆరోగ్య రంగానికి మరింత ఆత్మవిశ్వాసం అందిస్తుందన్నారు. ఆరోగ్య రంగం బలోపేతం వల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవతాయన్నారు. సదుపాయాలన్నీ ఉన్న ఓ ఆసుపత్రి ఏర్పాటు వల్ల సమీప పట్టణంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా వారణాశిలో రూ.5,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా పది కీలక రాష్ట్రాల్లోని 17,788 గ్రామీణ ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నారు. దీంతోపాటు 11,024 అర్బన్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.. -
డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?
న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం సెప్టెంబర్ 27న సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం.. ఈ కార్యక్రమం పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆ కార్డులో పొందుపరుస్తారు. దీంతో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే చికిత్స రికార్డ్లను పోగొట్టుకున్నా.. చికిత్స అందించాల్సి వస్తే.. మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా వెంటనే ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే స్వయం చాలకంగా ఆ రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేళ కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. సంబంధిత సమాచారం ఈ వెబ్ సైట్లో భద్రంగా ఉంటుంది. ఇక నుంచి ఆస్పత్రికి వెళ్లి హెల్త్ ఐడి చెబితే సరిపోతుంది.(చదవండి: కార్లకు డిజిటల్ ‘కీ’ స్ తయారుచేయనున్న శాంసంగ్) డీజీటల్ హెల్త్ ఐడీ కార్డ్ 2021 ఆన్లైన్ దరఖాస్తు విధానం: ఎన్డిహెచ్ఎమ్ హెల్త్ ఐడీ కార్డ్ కోసం(https://healthid.ndhm.gov.in/register) పోర్టల్ ఓపెన్ చేయండి రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి. ఇప్పుడు, మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మొబైల్ నెంబరు, ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లింక్ మీద క్లిక్ చేసి వివరాలను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. హెల్త్ ఐడీ కార్డ్ సృష్టించబడిన తర్వాత వ్యక్తి యూజర్ నేమ్ నమోదు చేయండి. అలాగే, కొన్ని వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత, మీరు డిజిటల్ హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
యూపీఐ తరహాలోనే యూహెచ్ఐ
Unified Health Interface Soon: యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) సర్వీసులను డిజిటల్ పేమెంట్స్ కోసం ఉపయోగిస్తున్నాం కదా! . గూగుల్ పే, ఫోన్ పే.. ఇలా మొత్తం యాభైకి పైగా థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో చెల్లింపులు చేసే విధంగా తీసుకొచ్చిన ఒకేఒక్క ప్లాట్‌ఫామ్ ఈ యూపీఐ. సరిగ్గా ఇదే తరహాలో త్వరలో యూహెచ్ఐ రాబోతోంది. మొత్తం వైద్య సేవల కోసమే రాబోతున్న ఈ సర్వీస్.. జనాభా ఆరోగ్య సమాచార సేకరణలో రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారీ హెల్త్ డేటా సేకరణకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకోసం యూపీఐ తరహాలో యూహెచ్ఐ (యునిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్) సర్వీస్ తీసుకురాబోతోంది. యూపీఐ తరహాలో ఇందులోనూ ఎన్ని హెల్త్ యాప్స్కైనా చోటు ఉండబోతుందని నేషనల్ హెల్త్ అథారిటీ అండ్ కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ చెప్తున్నారు. ఆన్లైన్-ఆఫ్‌లైన్ కన్సల్టేషన్, ఏయే ఆస్పత్రికి వెళ్లారు? ఎంత ఖర్చైంది? వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. ఇలా పేషెంట్లకు సంబంధించిన సమాచారం మొత్తం యూహెచ్ఐ అనే ఒకే ప్లాట్ఫామ్లో డేటా మొత్తం ఉండబోతుందన్నమాట. అంతేకాదు యూహెచ్ఐ ద్వారా డాటా సేకరణతో పాటు చెల్లింపులకు సైతం వీలు కల్పించనున్నారు. చిన్న మెడికల్ షాప్ నుంచి పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి దాకా యాప్ ద్వారా యూహెచ్ఐ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, నేరుగా అవి ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు వీలు ఉంటుందని శర్మ చెప్తున్నారు. National Digital Health Missionలో భాగంగా ఆరోగ్య సేవల పరిధిని విస్తృతం చేయడానికే ఈ ప్రణాళిక తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. ఈరోజుల్లో వర్చువల్ ప్లాట్‌ఫామ్స్‌ను కమ్యూనికేషన్ పర్పస్‌లో ఎంతగా వినియోగించుకుంటున్నారో తెలిసిందే. కాబట్టే, వైద్య సేవల్లో ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అని శర్మ అభిప్రాయపడుతున్నారు. యునిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ సర్వీస్‌ను ఇప్పటికే ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించి చూశారు. త్వరలోనే ఈ సర్వీసును అన్ని స్టేట్స్లో అమలులోకి తీసుకురాబోతున్నారు. అదే జరిగితే వైద్య సేవలకు సంబంధించిన ప్రతీది ఒకే ప్లాట్‌ఫామ్ కిందకు వస్తుంది. ఇందుకోసం హెల్త్ స్టార్టప్స్.. యూహెచ్ఐలోకి ఫ్లగ్ ఇన్ అయితే చాలు. చదవండి: అరచేతిలో... ఆరోగ్యం?! -
అరచేతిలో... ఆరోగ్యం?!
ఒకరకంగా ఇది విప్లవాత్మక ఆలోచన. అసంఖ్యాక ప్రజానీకానికి అవసరమైన ఆరోగ్యదాయక ఆలోచన. పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యచికిత్సనూ, ఆరోగ్య సంరక్షణనూ అందుబాటులోకి తేవడా నికి సంపూర్ణంగా సాయపడితే... స్వాగతించదగ్గ ఆలోచన. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ గుర్తింపు కార్డు ఇచ్చే భారీ దేశవ్యాప్త ప్రయత్నానికి మోదీ సర్కారు సోమవారం శ్రీకారం చుట్టింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవంలో ఎర్రకోట సాక్షిగా ప్రధాని ప్రకటించిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’లో ఇది భాగం. అప్పటి నుంచి 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ బృహత్ కార్యక్రమం ఇప్పుడిక దేశవ్యాప్తం కానుంది. అంటే, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుల జాబితాలో మరో దేశవ్యాప్త గుర్తింపు కార్డు చేరనుంది. సంక్షేమం కోసమే అయినప్పటికీ, ప్రజలందరి సమాచారాన్నీ సర్కారు సేకరించి, డిజిటల్ మ్యాపింగ్ చేసేందుకు కొత్త వీలు చిక్కింది. సమగ్ర డిజిటల్ ఆరోగ్యవ్యవస్థలో వ్యక్తులకు ఆరోగ్య ఐడీ కార్డులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల జాబితా, అలాగే ఆరోగ్య వసతుల జాబితా కూడా సిద్ధం చేయాలన్నది కేంద్ర ఆలోచన. ఈ కొత్త ఆరోగ్య గుర్తింపు కార్డు కింద ఆయా వ్యక్తుల ఆరోగ్య రికార్డులన్నీ డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయి. జన్‌ధన్ ఖాతా, ఆధార్, మొబైల్ ఫోన్ (సంక్షిప్తంగా జామ్) – ఈ మూడింటì అనుసంధానం, అలాగే సర్కారీ ఇతర డిజిటల్ ప్రయత్నాల వల్ల ఈ ‘జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్’ (ఎన్డీహెచ్ఎం)కు పునాదిగా ఆన్లైన్ వేదిక ఇట్టే దొరుకుతుందని సర్కారు భావిస్తోంది. నగదు చెల్లింపుల్లో విప్లవం తెచ్చిన ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్’ (యూపీఐ) లానే, ఇక్కడ ‘యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేజ్’ (యూహెచ్ఐ) వాడతారట. డాక్టర్లు, ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మందుల దుకాణాలు రోగుల గత రిపోర్ట్‌లను డిజిటల్‌గా నమోదు చేస్తాయి. దాంతో, రోగి ఐడీ కార్డుతో ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఆ వ్యక్తి ఆరోగ్య చరిత్ర, తీసుకున్న చికిత్స, అందుబాటులో ఉన్న సేవలు దేశవ్యాప్తంగా చిటికెలో తెలుస్తాయి. అందుకే, ఆరోగ్యరంగంలో ఉన్నవారందరికీ పని సులువయ్యే ఈ విధానం ఓ సరికొత్త విప్లవం. ప్రతి పౌరుడికీ 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ నంబర్ ఇస్తారు. అదే ఆ వ్యక్తి ఆరోగ్య ఖాతా నంబర్. ఈ ఆరోగ్య ఖాతాలో డిజిటల్‌గా అతని ఆరోగ్య చరిత్రంతా నమోదై ఉంటుంది. పాత రికార్డుల మోతబరువు తగ్గుతుంది. రోగి కొత్త ప్రాంతానికి, కొత్త డాక్టర్ వద్దకు వెళ్ళినా సరే సమా చారమంతా డిజిటల్‌గా మీట నొక్కితే అందుబాటులో ఉంటుంది. ఇలా ఈ డిజిటల్ హెల్త్ మిషన్‌లో సేకరించే వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని గోప్యంగా, భద్రంగా ఉంచుతామని ప్రభుత్వ హామీ. ఆరోగ్యరంగంలో సాంకేతికవినియోగం ఇటీవల విస్తృతమైంది. కరోనా వేళ టెలీ మెడిసిన్ వసతి విస్తరించింది. ‘ఇ–సంజీవని’తో 125 కోట్ల రిమోట్ కన్సల్టేషన్లు జరిగాయని కేంద్రం లెక్క. వాటిలో ఏపీదే అగ్రస్థానం. ఇక, ‘ఆరోగ్యసేతు’ యాప్ లాంటివి కోవిడ్‌కు అడ్డుకట్టలో సహకరించడమూ తెలిసిందే. ఇప్పుడీ డిజిటల్ హెల్త్‌కార్డ్ మరో ముందంజ. నిజానికి, ఇది మరీ కొత్తదేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత జగన్మోహనరెడ్డి సర్కారు ఈ పని చాలాకాలంగా చేస్తోంది. ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో లబ్ధి పొందుతున్న దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే క్యూఆర్ కోడ్ ఉన్న కార్డులిచ్చింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరేసి డాక్టర్లను పెట్టింది. రాష్ట్రంలో మొబైల్ మెడికల్యూనిట్ ‘104’ సర్వీసుతో 700 దాకా వాహనాలు రోజూ కనీసం ఓ గ్రామానికెళ్ళి, అక్కడి ప్రజల ఆరోగ్యస్థితులు విచారించి, ఆ సమాచారం రికార్డు చేసే బృహత్ యజ్ఞం చేపట్టింది. ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డున్నవారు ఇప్పటికే రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్ళినా వారి ఆరోగ్యచరిత్ర మొత్తం వైద్యులకు అందుబాటులో ఉంటోంది. తాజా కేంద్ర ప్రయత్నంతో డేటా దేశమంతటా ఎక్కడైనా అందుబాటులోకి వస్తుందన్న మాట. వ్యక్తుల సమాచారం, మొబైల్ ఫోన్, ఆధార్ నంబర్ లాంటి వివరాల ఆధారంగా ఉచితంగా ఈ కొత్త హెల్త్ ఐడీ కార్డ్ సృష్టి జరగనుంది. ఆరోగ్య నిపుణుల చిట్టా (హెచ్‌పీఆర్), ఆరోగ్య వసతుల చిట్టాల (హెచ్‌ఎఫ్‌ఆర్) లాంటి యాప్‌లు పెడతారు. ఇలా దేశపౌరులందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం వల్ల రాష్ట్రాలలో ఆరోగ్య పథకాలను మెరుగ్గా ప్లాన్ చేయవచ్చు. దేనికి తగినట్టు దానికి నిధులు కేటాయించవచ్చు. వృథా ఖర్చు అరికట్టవచ్చనేది ప్రభుత్వ వాదన. అరచేతిలో ఆరోగ్యం లాంటి ఈ మాటలు వినడానికి బాగున్నాయి. కానీ, డిజిటల్ అక్షరాస్యత మాట దేవుడెరుగు, మామూలు అక్షరాస్యతే అందరికీ లేని దేశం మనది. పాశ్చాత్య ప్రపంచానికి భిన్నంగా ఆర్థికంగానే కాదు అంతర్జాల వసతుల్లోనూ భారీ అంతరాలున్న చోట ఈ భగీరథ యత్నం ఏ మేరకు, ఎప్పటికి ఆచరణ సాధ్యమో! దేశంలోని 135 కోట్ల మందికీ హెల్త్ కార్డులంటే సంకల్పశుద్ధి అవసరం. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపుకార్డన్న దశాబ్దకాల ఆధార్ ఆలోచనే నేటికీ సంపూర్ణ సాకారం కాలేదు. ఆధార్ నమోదులో, డేటా అక్రమ వాడకంలో ఎన్నో స్కామ్‌లు బయటపడ్డాయి. ఈ కొత్త కార్డుకైనా ఆ లోపాలు లేకుండా చూడాలి. అది సర్కార్‌కు సవాలే. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు వ్యక్తుల ఆరోగ్య రికార్డులను అప్డేట్ చేసే సత్తా మన ఆస్పత్రులకు ఏ మేరకు ఉంది? చిత్తశుద్ధితో, లోపరహితంగా ఎప్పటికప్పుడు ఆ పని చేయించడం కష్టసాధ్యం. ఆ కష్టాలెలా ఉన్నా, ఈ కార్డులతో పాటు ప్రాథమిక ఆరోగ్య వసతులు, రోగులు– వైద్యులు – పడకల నిష్పత్తిపై కేంద్ర సర్కారు వారి దృష్టి పడితే మహద్భాగ్యం. -
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభం, అది ఎలా పనిచేస్తుంది?
దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం 11గంటలకు ప్రధాని కార్యాలయంలో జరిగే వర్చువల్ ఈవెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాన్ని ప్రారంభించారు. గత ఏడాది ఆగస్ట్ 15న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్ కార్డ్‌లతో పాటు హెల్త్ ఐడీలను అందించనున్నారు. వీటి ఆధారంగా ప్రజలు హెల్త్ ఇన్ఫర్మేషన్ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ వెబ్ సైట్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. Tomorrow, 27th September is an important day for India’s healthcare sector. At 11 AM, the Ayushman Bharat Digital Mission would be launched. This Mission leverages technology to improve access to healthcare and opens doors for new innovation in the sector. https://t.co/MkumY17Ko1 — Narendra Modi (@narendramodi) September 26, 2021 ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే ట్రీట్మెంట్ రికార్డ్లను పోగొట్టుకున్నా సంబంధిత సమాచారం ఈ వెబ్ సైట్లో భద్రంగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి హెల్త్ ఐడి చెబితే సరిపోతుంది. డైరెక్ట్‌గా సంబంధిత ఆస్పత్రి సిబ్బంది సదరు వ్యక్తి హెల్త్ ఇన్ఫర్మేషన్ను డిజిటల్ రూపంలో చూసే వీలుంటుంది. కొత్తగా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి వస్తే.. ఆ వివరాల్ని వెబ్ సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. పౌరులే కాదు నేషనల్ హెల్త్ అథారిటీ నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో పౌరులతో పాటు డాక్టర్లకు సైతం కేటగిరిని ఏర్పాటు చేసింది. పౌరుల ఆరోగ్య భద్ర రిత్యా ఈ కేటగిరిలో డాక్టర్ల ఇన్ఫర్మేషన్తో పాటు, ఆస్పత్రులు, క్లీనిక్‌ల డేటా ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా కింద ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ప్రస్తుతం ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ & నికోబార్, చండీగఢ్, దాద్రా & నాగర్ హవేలీ మరియు డామన్ & డయు, లడఖ్, లక్షద్వీప్ & పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేస్తున్నారు. చదవండి: PM Modi: వ్యాక్సిన్ ఒక సురక్ష చక్రం -
‘ఆయుష్మాన్ భారత్’తో పేదలకు అన్యాయమే
సాక్షి, హైదరాబాద్: ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేసేందుకు ఉన్న నిబంధనల దృష్ట్యా పేదలందరికీ ఉచిత వైద్యం అందే అవకాశం లేదని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారానే పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుతాయని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బుధవారం ఆమె బెంగళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, దీనివల్ల రాష్ట్రంలో కేవలం 26 లక్షల 11 వేల కుటుంబాలు మాత్రమే లబ్ధిపొందే అవకాశం ఉందని, ప్రభుత్వ నిర్ణయంతో మిగతా వారికి వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సంవత్సరానికి ఒక కుటుంబం గరిష్టంగా రూ. 5 లక్షల వరకే లబ్ధిపొందే అవకాశం ఉందని, గరిష్ట పరిమితి దాటిన పక్షంలో పేదలపై ఆర్థిక భారం తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్‌లో 1,350 వ్యాధులకు చికిత్స లభిస్తుండగా, అందులో లేని 540 వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స లభిస్తుందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి పూర్తిగా ఆయుష్మాన్ భారత్‌నే అమలు చేస్తారనే అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు చికిత్సలు నిరాకరిస్తున్న సందర్భాలు చూస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ అమలుతో ఇక కేంద్రం నుంచి ఎప్పటికి నిధులు వచ్చేనని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఒక పటిష్ట వ్యవస్థ ఉందని, ప్రభుత్వం పేదల వైద్యం విషయంలో తప్పించుకునే వైఖరిని మానుకుని, తక్షణం కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చి రాష్ట్రంలోని 80 లక్షల పేద కుటుంబాలకు భరోసా కల్పించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. -
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్
-
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం
-
ఆయుష్మాన్ భారత్: సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: పేద ప్రజల వైద్య చికిత్సల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం ఇక రాష్ట్రంలో కూడా అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వైద్య, ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వైద్యశాఖ అధికారులు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. ఈ నిబంధనలకు లోబడి వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)కు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. ‘ఆయుష్మాన్ భారత్‌లో చేరడాన్ని స్వాగతిస్తున్నాం’ -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 19న తలపెట్టిన ‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష‘ను వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: కేసీఆర్ పాతాళ భైరవి సినిమాలోలాగా చేస్తున్నారు: భట్టి తెలంగాణ జూడాలు, హౌస్ సర్జన్లకు తీపి కబురు -
వ్యాక్సిన్ అందరికీ అక్కర్లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని అది సైంటిఫిక్ పద్ధతి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. వైరస్ తన పంథాను మార్చుకుంటున్న కొద్దీ, దాన్ని బట్టి మన ప్రాధాన్యతలను మార్చుకోవాలని లోక్‌సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహా మేరకు ఆరోగ్య రంగం, ఫ్రంట్‌లైన్ వర్కర్ల రంగం, వృద్ధులు, 45 సంవత్సరాలు దాటి వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవాలి.. కాంగ్రెస్ ఎంపీ రవీత్‌సింగ్ బిట్టు ప్రశ్నిస్తూ.. కోవిడ్ –19 వల్ల ప్రజల భయపడుతున్నారని, అది భవిష్యత్తులో వారికి హాని చేస్తుందా అని ప్రశ్నించారు.. దానికి హర్షవర్ధన్ సమాధానమిచ్చారు. పోలియో, చికెన్ పాక్స్ వంటి వ్యాధులపై మనం విజయం సాధించామని, అందుకు కారణం వ్యాక్సినేషన్ అని చెప్పారు. త్వరలోనే భారత్ నుంచి మరికొన్ని కోవిడ్ వ్యాక్సిన్లు వస్తాయని వాటితో పాటే ప్రీ–ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. అందరికీ రక్తం అందింది.. తలసేమియాపై పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానమిస్తూ.. తలసేమియా రోగులకు తరచుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని అన్నారు. కరోనాతో దేశం అతలాకుతలమైన సమయంలో కూడా ఏ ఒక్క తలసేమియా రోగికి రక్తం అందని పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే.. ఏడాదిలోనే 75 వైద్య కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 30 వేల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇదంతా కోవిడ్ విజృంభించి సమయంలోనే జరిగిందన్నారు. ఆరేళ్లలో 24 వేల కొత్త పీజీ మెడికల్ సీట్లను సృష్టించినట్లు వెల్లడించారు. 39,726 కొత్త కరోనా కేసులు.. దేశంలో గత 24 గంటల్లో 39,726 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 154 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,370కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,10,83,679కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,71,282గా ఉంది. -
ఇక అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు
న్యూఢిల్లీ: దేశంలో ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు లభించనున్నాయి. భారత్‌లోని 735 జిల్లాల్లోనూ ఏప్రిల్ 1నుంచి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఇన్సూర్డ్ పర్సన్స్‌కు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు కేవలం 387 జిల్లాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, మరో 187 జిల్లాల్లో పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. 161 జిల్లాల్లో మాత్రం అసలు ఈ సేవలే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్రం ఈ సేవల ఏర్పాటుకు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన బిల్లుల ప్రక్రియను ఎసిక్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. -
‘ఆయుష్మాన్’తో ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం చేయించు కునేందుకు మన రాష్ట్ర పేదలకు వెసులుబాటు కలగనుంది. దీని ద్వారా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికొచ్చి వైద్యం పొంద డానికి అవకాశం ఏర్పడనుంది. కేంద్రం ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీ కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ పథకాలను అనుసంధానం ఎలా చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండింటినీ అమలు చేసేలా పథకాన్ని ఆధునీకరించే అవకాశముంది. ఆయుష్మాన్ పథకం రాష్ట్రంలో ప్రవేశపెట్టినా ఆరోగ్యశ్రీ పథకం కూడా దానితోపాటు అమలయ్యే అవకాశముంది. చదవండి: (రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్) ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో 77.19 లక్షల కుటుంబాలు అర్హులుగా ఉండగా, ఆయుష్మాన్ పథకంలోకి రాష్ట్రంలో 26.11 లక్షల కుటుంబాలు మాత్రమే వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆయుష్మాన్ భారత్ అమలుతో ఆరోగ్యశ్రీ పరిధిలో లేని దాదాపు 400కిపైగా చికిత్సలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు రూ.780 కోట్ల మేరకు ఖర్చుచేస్తోంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా రూ.2 లక్షలు పరిమితి ఉండగా, కొన్ని జబ్బులకు రూ.18 లక్షల వరకూ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. 946 చికిత్సలను ఈ పథకం కింద పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు ఆయుష్మాన్ భారత్‌లో ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకూ కేంద్రం ఖర్చు చేస్తుంది. 1,350 రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీలో లేనివి, ఆయుష్ వైద్య సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకం పరిధిలోకి ఇటీవలే కరోనా చికిత్సలను చేర్చడంతో ఆయా బాధితులకు కొంతమేరకు ఊరటగా ఉంటుంది. ఆరోగ్యశ్రీలో కిడ్నీ, లివర్, బోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటివి చేయడంతోపాటు జీవితకాలం మందులు వంటివి కూడా ఇస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ, ఆయుష్మాన్ భారత్‌లో ఇటువంటి వసతులు లేవు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలైతే రాష్ట్రానికి దాదాపు రూ. 250 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్యాకేజీ ధరలు పెంచాలంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీ కంటే ఆయుష్మాన్ భారత్ ప్యాకేజీలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రైవేట్ ఆసుపత్రులు అంటున్నాయి. అందువల్ల ప్యాకేజీ ధరలను పెంచకుండా చికిత్స చేయడం కష్టమని పేర్కొంటున్నాయి. వాస్తవంగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీలనే పెంచాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను యథాతథంగా అమలు చేస్తూనే, కొత్త చికిత్సలకు ఆయుష్మాన్ భారత్ ధరలను పర్తింపజేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తుంది. అందుకు సంబంధించి త్వరలో ఉమ్మడిగా మార్గదర్శకాలను జారీ చేసే అవకాశముంది. -
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకంతో కలిపి అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వయంగా తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరైన సీఎస్.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను ఆరోగ్యశ్రీతో కలిపి అమలు చేయనున్నట్టు నివేదించారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తదితర అధికారులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యంపై మీ పాఠాలా?
న్యూఢిల్లీ/జమ్మూ: ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని, వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడం, ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం దేశానికి గర్వించే క్షణమని చెప్పారు. ఆయన శనివారం జమ్మూకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక్కడ మూడంచెల పంచాయతీ వ్యవస్థ పూర్తిరూపం సంతరించుకుందని మోదీ తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని అన్నారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కొద్ది కాలంలోనే పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం(కాంగ్రెస్) స్థానిక ఎన్నికలు ఇంకా నిర్వహించలేదని ఆక్షేపించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజాస్వామ్యంపై వారికున్న గౌరవం ఇదేనా? ‘‘ఢిల్లీలో కూర్చున్న కొందరు వ్యక్తులు నన్ను నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు. అభ్యంతరకర పదజాలం వాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నాకు రోజూ పాఠాలు చెబుతున్నారు. వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతా. ప్రజాస్వామ్యం గురించి నాకు బోధిస్తున్న పార్టీ పుదుచ్చేరిలో అధికారంలో ఉంది. ఆ పార్టీ అక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. పుదుచ్చేరిలో చివరిసారిగా 2006లో స్థానిక ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం 2011లోనే ముగిసింది. అయినా ఎన్నికలే జరపడం లేదు. అంటే వారు చెప్పేదానికి, చేసేదానికి ఏమాత్రం పొంతన లేదని దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల వారికున్న గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కొత్త నాయకత్వానికి శ్రీకారం జమ్మూకశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. ప్రతికూల వాతావరణం, కరోనా భయం ఉన్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేశారు. నాకెంతో గర్వంగా ఉంది. దేశానికి ఇదొక గర్వించే క్షణం. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం, భద్రతా సిబ్బంది అహోరాత్రులు శ్రమించారు. ప్రజల కోసం పని చేసినవారు ఎన్నికల్లో గెలిచారు. కొత్త దశాబ్దంలో కొత్త నాయకత్వానికి ఇది శ్రీకారం. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో ప్రజలు వారి హక్కులను వారు పొందారు. పాత చరిత్రను వెనక్కి నెట్టేసి, కొత్త భవిష్యత్తు కోసం ఓటేశారు.’’ ‘ఫెరాన్’ ధరించిన మోదీ జమ్మూకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కశ్మీరీ సంప్రదాయ ఫెరాన్ వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలను గత ఏడాది కశ్మీర్ వ్యవసాయ కూలీ ఒకరు మోదీకి బహూకరించారు. కశ్మీర్ పర్యటనలో ఈ వస్త్రాలు ధరించాలని మోదీ భావించినప్పటికీ కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఇది చరిత్రాత్మక దినం ‘‘ఆయుష్మాన్ భారత్ పథకంతో జమ్మూకశ్మీర్‌లో ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాకు అర్హులవుతారు. ఈ ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం. జమ్మూకశ్మీర్ సమగ్ర అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన నేతలు సరిహద్దు రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించారు. ఆ తప్పిదాన్ని మేము సరిచేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మోదీ పాలనలో జమ్మూకశ్మీర్‌లో శాంతి: అమిత్ షా ప్రధానమంత్రి మోదీ ఆరేళ్ల పాలనాకాలం జమ్మూకశ్మీర్‌లో చరిత్రలో 1990 తర్వాత అత్యంత శాంతియుతమైన కాలంగా గుర్తుండిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభోత్సవం లో ఆయన ప్రధాని మోదీతోపాటు గువాహటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ ప్రజలతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. ఆయనను తాను ఎప్పుడు కలిసినా జమ్మూకశ్మీర్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి, ప్రజల బాగోగులు, శాంతి భద్రతల గురించి కచ్చితంగా ప్రస్తావిస్తుంటారని గుర్తుచేశారు. 2019 ఆగస్టు 5 తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రతిరంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. శాంతి లేకుంటే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. యువత కలలు నిజం కావాలంటే శాంతి చాలా ముఖ్యమని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ తప్పనిసరిగా నెరవేరుస్తారని ఉద్ఘాటించారు. -
ఎల్లప్పుడూ నన్ను అవమానించేలా: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రెండు నాల్కల ధోరణి కలిగిన కొంతమంది వ్యక్తులు తనకు ప్రజాస్వామ్యం గురించి హితబోధ చేయాలని ఆరాటపడుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలు చేశారు. అలాంటి వారు జమ్మూ కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండళ్ల(డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఎన్నికలు జరిగిన తీరును ఓసారి పరిశీలించాలని చురకలు అంటించారు. ప్రజాస్వామ్య దేశంలోనే ఇలాంటివి జరుగుతాయని పేర్కొన్నారు. కాగా మోదీ సర్కారును విమర్శించే క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్యం లేదంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వారి స్థానంలో ఉన్నా ఆయనను కూడా టెర్రరిస్టుగానే అభివర్ణిస్తారంటూ ధ్వజమెత్తారు. (చదవండి: రాష్ట్రాన్ని నాశనం చేశారు: ప్రధాని మోదీ) ఇక రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. జమ్మూకశ్మీర్ వాసులకు ఆరోగ్య బీమా వర్తింప జేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘‘ ఢిల్లీలోని కొంతమంది నాయకులు ఎల్లప్పుడూ నన్ను అవమానించేలా మాట్లాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకు డీడీసీ ఎన్నికలు నిర్వహించిన తీరు ప్రజాస్వామ్యానికి చక్కని ఉదాహరణగా నేను చూపిస్తాను. నిజానికి ఆ వ్యక్తులు, వారి పార్టీలు డెమొక్రసీ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పుదుచ్చేరిలో వారి పార్టీ ఎన్నికలు నిర్వహించదు. కానీ జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన ఏడాది కాలంలోనే పంచాయతీ స్థాయి ఎన్నికల నిర్వహణ సాఫీగా సాగింది. ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ వాసులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువతతో పాటు వృద్ధులు కూడా భారీ ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది హర్షిందగ్గ విషయం’’ అని ప్రధాని మెదీ పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ స్థానిక ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూటమి 13 జిల్లాల్లో ఆధిపత్యం కనబరచగా.. బీజేపీ ఆరు జిల్లాల్లో సత్తా చాటింది. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కమలనాథులు కశ్మీర్ లోయలో కమలం విరబూసిందంటూ హర్షం వ్యక్తం చేయగా.. అధికారం మాత్రం తమదేనంటూ కూటమి నేతలు వ్యాఖ్యానించారు. కాగా గుప్కార్ కూటమిలో జమ్ముకశ్మీర్‌లో ప్రధాన పార్టీలైన ఎన్సీ, పీడీపీ తోపాటు సీపీఐ-ఎం, పీపుల్స్ కాన్ఫరెన్స్, ఆవామీ నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, పీపుల్స్ మూవ్మెంట్ తదితర పార్టీలు ఉన్నాయి. -
మమత సర్కార్‌పై గవర్నర్ విమర్శలు
కోల్కత్తా : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయకపోవడంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైద్య అధికారులపై ఒత్తిడి చేశారని విమర్శించారు. కోవిడ్ నియంత్రకు దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడోదశ ప్రయోగాన్ని బుధవారం ఐసీఎంఆర్ వద్ద గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలులో ఉన్న రాష్ట్రాల్లో వైద్య పరంగా వృద్ధిని సాధించామని, దురదృష్టవశాత్తు బెంగాల్ దీనిలో భాగస్వామ్యం కాలేకపోయిందని అన్నారు. వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, ఆరోగ్యమంత్రిత్వ శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రూ. 2,000 కోట్ల విలువైన నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. గవర్నర్ వ్యాఖ్యలను మంత్రి ఫిర్హాద్ హకీమ్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ హోదాలో ఉండి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అవకతవకలపై దర్యాప్తు కోసం ఆగస్టులో ముఖ్యమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2019 జూలైలో బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధంఖర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
తెలంగాణ సర్కార్‌కు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుపై చీఫ్ సెక్రటరీ, కేంద్ర ఆరోగ్య శాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, ఢిల్లీ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టులో పేరాల శేఖర్ రావు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం కేంద్ర ఆరోగ్య శాఖ, తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. (ఎమ్మార్వో కేసులో హైకోర్టు స్టే: సుప్రీం అసంతృప్తి) కోవిడ్ 19తో సహా 1500 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా ఆయుష్మాన్ భారత్ భీమా దేశంలోని అన్ని రాష్ర్టాలలో అమలులో ఉండగా తెలంగాణ, ఢిల్లీ, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలు అమలు చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కోవిడ్ 19కు సరైన చికిత్స అందుబాటులో లేక ఎంతో మంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకంలో కోవిడ్ 19 చికిత్స లేదని, అలాంటప్పుడు కోవిడ్ కవరేజ్ ఉన్న ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పిటిషనర్ వివరించారు. (కరోనా టెస్టు చేయించుకున్న ఉప రాష్ట్రపతి) కోవిడ్ రోగుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు భారీగా ఫీజులు దండుకుంటున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ భీమా పథకాల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. కోవిడ్ 19 చికిత్స అంశం ఈ కేసులో ఉన్నందువల్ల విచారణకు షార్ట్ డేట్ ఫిక్స్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ చేసిన విన్నపాన్ని అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు బదులు రెండు వారాలకు ఖరారు చేసింది. -
గట్టిగా బుద్ధి చెప్పాం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్తాన్లకు గట్టి హెచ్చరికలే పంపారు. ఎల్ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయన్నారు. లద్దాఖ్‌లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్ ప్రపంచం చూసిందన్నారు. శనివారం ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్ ఫర్ వరల్డ్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ కోసం ప్రాణాలర్పించిన వారికి ఎర్రకోట నుంచి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాదమైనా, విస్తరణ వాదమైనా భారత్ వాటిపై యుద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. అయితే పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు. గత ఏడాది విదేశీ పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి సాధించామని ప్రపంచ దేశాలు భారత్‌పై విశ్వాసం ఉంచాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజను ప్రస్తావిస్తూ శతాబ్దాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించమన్నారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు. మోదీ కొత్త మంత్ర మేక్ ఫర్ వరల్డ్ మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు కూడా దేశ సంకల్ప బలాన్ని అడ్డుకోలేవని ధీమాగా చెప్పారు. ఇంక ఎక్కువ కాలం దిగుమతులు మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ దిశగా భారత్ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో నాలుగు నెలల్లోనే భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఎగుమతులు కూడా చేస్తోందని అన్నారు. దీంతో యువతకి ఉపాధి అవకాశాలను కల్పించామని ప్రధాని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం సృష్టించేలా రూ. 110 లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్టుల్ని ప్రారంభించామని అన్నారు. కోవిడ్ విసిరిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధాని రైతులే పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలుగా లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించామని చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వెయ్యిరోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టుని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు. తయారీలో మూడు కరోనా వ్యాక్సిన్లు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ఇప్పటికే మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీలో అహరహం శ్రమిస్తున్న శాస్తవేత్తల్ని ప్రధాని రుషులు, మునులతో పోల్చారు. కరోనాపై విజయం సాధించడానికి వారు ల్యాబొరేటరీల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ చేరేలా చూస్తామన్నారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు లభించాయి. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నట్లు మోదీ తెలిపారు. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించామన్నారు. క్షిపణుల నుంచి తేలికపాటి సైనిక హెలికాప్టర్లు, రైఫిల్స్, యుద్ధ రవాణా విమానాలను భారత్‌లో తయారుచేస్తామన్నారు. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఆధునీకరణ జరుగుతోందన్నారు. దేశ రక్షణలో సరిహద్దు, తీరప్రాంత మౌలికసదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో, హిందూ మహాసముద్రంలోని దీవుల మధ్య, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు రహదారుల నిర్మాణం జరిగిందని, రవాణా సదుపాయాలకు ప్రాధాన్య మిచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఏడాదిలో 2 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి సురక్షిత మంచినీరు అందించామని తెలిపారు. రూపాయికే శానిటరీ ప్యాడ్ స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఈ సారి ప్రధాని ఏనాడూ ఎవరూ మాట్లాడని మహిళల రుతు స్రావం అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మహిళా సాధికారత గురించి వివరిస్తూ నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్లు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న 18 ఏళ్లుగా ఉన్న అమ్మాయిల పెళ్లి వయసును మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని, దీనికోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళా అధికారుల్ని కీలక పదవుల్లో తీసుకున్నామని, ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేశామన్నారు. ప్రధాని శానిటరీ ప్యాడ్ల ప్రస్తావనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 40 కోట్ల ‘జన్‌ధన్ బ్యాంకు అకౌంట’్లలో 22 కోట్ల అకౌంట్లు మహిళలవేనని, ఈ మహమ్మారి కాలంలో వారి ఖాతాల్లో రూ.30 వేలకోట్ల నిధులను వేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ముద్ర’రుణాల్లో 70 శాతం చెల్లెళ్ళు, తల్లులకే ఇచ్చామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధిక రిజిస్ట్రేషన్లు మహిళల పేరిటే ఉన్నాయన్నారు. అందరికీ హెల్త్ కార్డులు ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ నంబర్ ఇస్తారు. ఈ హెల్త్ ఐడీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్ రిపోర్ట్స్ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు. ఈ్త ఐడీలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మోదీ చెప్పారు. ఎన్సీసీ కేడెట్లకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఎర్రకోట వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృశ్యం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న రాష్ట్రపతి నివాస ప్రాంతం రైసినా హిల్స్ -
ఐరాసకు ఇది పునర్జన్మ: మోదీ
ఐక్య రాజ్య సమితి: కరోనా మహమ్మారి ఐక్య రాజ్య సమితి పునర్జన్మకు, పునర్నిర్మాణానికి అవసరమైన సందర్భాన్ని అందించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ భేటీలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఐరాస ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రస్తుత ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. మావన కేంద్రిత నాగరికత దిశగా సరికొత్త అడుగులను ఐరాస వేయాలంటూ ఆకాంక్షించారు. దేశాలు పెరుగుతున్న కొద్దీ సంస్థపై అంచనాలు కూడా పెరుగతున్నాయని అన్నారు. బహుదేశీయ విధానం ద్వారా ప్రపంచంలో సుస్థిరమైన శాంతి, అభివృద్ధి పెరుగుతాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మానవ లక్ష్యాలను అందుకునేలా 75వ యానివర్సరీకి ఐరాస తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. రెండవప్రపంచ యుద్ధం ఐరాస పునాదికి నాంది పలికిందని, కోవిడ్ మహమ్మారి ఐరాస పునర్నిర్మాణానికి పునాది కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలతో కలసి పని చేస్తున్నట్లు చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదాలతో పాటు భారతీయ వైద్య మూలాలతో నేడు ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా నుంచి కోలుకుంటున్న దేశంగా భారత్ నిలిచిందని అన్నారు. దేశంలో పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలను తెరిపించామని, భారీ స్థాయిలో ఆయుష్మాన్ భారత్ చేపట్టినట్లు గుర్తుచేశారు. 2022 నాటికి ప్రతి భారతీయుడు ఇల్లు కలిగి ఉండాలనేది తమ లక్ష్యమని చెప్పారు. -
ఆయుష్మాన్ భారత్ సీఈఓ పీఏకు కరోనా
-
ఆరోగ్యశ్రీలో కేన్సర్‌ను చేర్చేందుకు ప్రయత్నిస్తా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ దేశంలోని అత్యధిక మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోందని.. అత్యంత క్లిష్టమైన కేన్సర్ల చికిత్సకూ ఇందులో అవకాశం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదని, తమదైన ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ లో కేన్సర్ చికిత్సను కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన ఇండియన్ కోఆపరేటివ్ ఆంకాలజీ నెట్వర్క్ (ఐకాన్) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై గవర్నర్ మాట్లాడారు. కేన్సర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి 42 ఏళ్లుగా కేన్సర్ విషయంలో విశేష కృషి చేస్తున్న ఐకాన్ సంస్థ ప్రజా చైతన్యం విషయంలో మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐకాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పర్వేశ్ పారీఖ్, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి డాక్టర్ సాయిరామ్, సీనియర్ ఆంకాలజిస్ట్ కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. గవర్నర్ అధికారిక కార్యక్రమాలు రద్దు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శనివారం నుంచి తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. -
వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో ఏపీకి అగ్రస్థానం
సాక్షి, అమరావతి: ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అమలులో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ 66 మార్కులతో మొదటి ర్యాంక్ దక్కించుకుంది. ఆయుష్మాన్ భారత్‌లో రెండు రకాల సేవలు ఉంటాయి. ఒకటి.. జన ఆరోగ్య యోజన (ఆరోగ్యశ్రీ తరహా) కాగా రెండోది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణ. గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించడం, వారి వివరాలను నమోదు చేయడం, వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ పోర్టల్‌కు అనుసంధానించడం వంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రతిభ కనబరిచినట్టు కేంద్రం కితాబిచ్చింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. 2019 డిసెంబర్, 2020 జనవరి నెలలకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రతిభను లెక్కించారు. ఇందులో 58 మార్కులతో గోవా, తమిళనాడు రెండో స్థానంలో, 57 మార్కులతో గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 37 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది. కాగా.. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణకు కేంద్రం నిధులు ఇస్తుంది. మాతృవందన యోజనలోనూ ఏపీదే అగ్రస్థానం దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి మాతృవందన యోజనలోనూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంత గర్భిణులకు ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, వారికి వైద్య పరీక్షలు చేయించడం, బిడ్డ పుట్టాక వారికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం చేస్తారు. ఇందుకు దశలవారీగా రూ.5 వేలు ఆ మహిళకు చెల్లిస్తారు. ఇలా ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పథకం అమలులో జిల్లాలను ప్రతిభ ఆధారంగా గుర్తించగా కర్నూలు జిల్లాకు రెండో ర్యాంకు వచ్చింది. -
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా భారత్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య రంగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే సత్తా భారత్‌కు ఉందని, 50 కోట్ల మంది ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కల్పించేందుకు చేపట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో వాస్ (వసంత్) నరసింహన్ స్పష్టం చేశారు. దేశంలోని మేధో సంపత్తిని దృష్టిలో ఉంచుకున్నా, బయో టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో మన శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకున్నా భారత్ ప్రపంచంపై తనదైన ముద్ర వేసేం దుకు ఇది మంచి తరుణమని అభిప్రాయపడ్డారు. జీవశాస్త్ర పరిశ్రమల రంగంలో విశేష కృషి జరిపేందుకు బయో ఆసియా ఏటా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును వాస్ నరసింహన్ మంగళవారం అందుకున్నారు. మంత్రి కె.తారక రామారావు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం వైద్య రంగంలో వస్తున్న మార్పులపై వాస్ ప్రసంగించారు. మందులనేవి వచ్చి కేవలం రెండు మూడు వందల ఏళ్లు మాత్రమే అయిందని మందులతో చేసే వైద్యం కూడా ఇప్పుడు మారి పోయి.. కణ ఆధారిత, జన్యు ఆధారిత వైద్యంగా పరిణమిస్తోందన్నారు. కేన్సర్‌తోపాటు గుండె జబ్బులకు, మలేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా కణ ఆధారిత చికిత్సలు అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా బయోమ్.. నోవార్టిస్‌కు ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కేంద్రం ఉందని, దీనికి అదనంగా బయోమ్ పేరుతో ఇంకో వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వాస్ నరసింహన్ ప్రకటించారు. -
హెల్త్‌కు వెల్త్
న్యూఢిల్లీ: ‘‘ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నాం’’ అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రుల సంఖ్యను పెంచనున్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు సోకితే ఆస్పత్రుల్లో చికిత్స చేయడమే కాదు, ప్రజలు రోగాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండేలా చూడడం కూడా. ఇందుకోసం ఈ సారి ప్రజారోగ్యమే అంతిమ లక్ష్యంగా కేంద్రం కొనసాగిస్తున్న ఎన్నో పథకాలను విస్తరించాల్సిన అవసరం గురించి సీతారామన్ వివరించారు. గత బడ్జెట్‌తో పోల్చి చూస్తే ఆరోగ్య రంగ నిధుల్ని 8శాతం పెంచారు. ఆయుష్మాన్ భారత్ విస్తరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల పథకం ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) విస్తరించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఆస్పత్రుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులకి లాభదాయం కాకపోతే వయబిలిటీ గ్యాప్ కింద ప్రభుత్వమే నిధుల్ని సమకూరుస్తుంది. దీని కోసం దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చే ఆస్పత్రులు లేని చోట కొత్త ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా యువతకు ఎన్నో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌కి గత బడ్జెట్లో రూ.6,400 కోట్లు కేటాయిస్తే, ఈ సారీ అంతే మొత్తాన్ని కేటాయించారు. 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత్ జనాభాలో దాదాపుగా 40శాతం మందికి లబ్ధి చేకూరేలా, నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపుగా 50 కోట్ల మంది ఈ పథకం లబ్ధి దారులుగా ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019, నవంబర్ 25 నాటికి ఆయుష్మాన్ భారత్ కింద 11.4 కోట్ల మందికి ఇ–కార్డుల్ని జారీ చేశారు. ప్రతీ జిల్లాలో ఓ మెడికల్ కాలేజ్ దేశంలోని ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి ప్రైవేటు–ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతీ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి మెడికల్ కాలేజీని అనుంబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. భూమి, మౌలిక సదుపాయాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రాష్ట్రాల్లో వీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రోగులు– వైద్యుల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ పథకం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సరిపడినంత స్థాయిలో రెసిడెంట్ డాక్టర్స్ డిప్లొమా/ ఫెలో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోర్సులను ఆఫర్ చేసే ఆసుపత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యాంశాలు.. ► మిషన్ ఇంద్ర ధనుష్ (ప్రభుత్వ వాక్సినేషన్ కార్యక్రమం) కింద అయిదు వైరస్లు సహా 12 కొత్త తరహా వ్యాధుల్ని తీసుకువచ్చారు. ► ప్రజల జీవన విధానంలో వచ్చే మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఫిట్ ఇండియా ఉద్యమం, అందరికీ సురక్షిత మంచినీరు అందించడం కోసం జలజీవన్ మిషన్ , దేశంలో పారిశుద్ధ్య వ్యవస్థని మెరుగుపరిచి పరిశుభ్రంగా ఉండడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిరుపేదలకు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. ► ఆయుష్మాన్ భారత్ కిందకి వచ్చే ఆసుపత్రుల సంఖ్యను టైర్ 2, టైర్ 3 నగరాల్లో పెంచాలని నిర్ణయం. ప్రస్తుతం ఈ పథకం కింద 20 వేలకుపైగా ఆసుపత్రులు ఉన్నాయి. మరో వెయ్యి ఆస్పత్రులు పెంచడానికి చర్యలు ► ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం. ► ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు దొరికేలా అన్ని జిల్లాల్లో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు. జనరిక్ మెడిసిన్స్‌ని విక్రయించే ఈ దుకాణాలను నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు. ► వైద్య పరికరాల దిగుమతులు, విక్రయం ద్వారా వచ్చే పన్నుల్ని ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగం. కొన్ని నిర్దిష్ట వైద్య పరికరాల దిగుమతులపై 5శాతం ఆరోగ్య సెస్ విధింపు . ప్రస్తుతం భారత వైద్య పరికరాల రంగం 80 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడింది. ఈ నిర్ణయంతో రెండు రకాలుగా ప్రయోజనాలున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీకి చెందిన సమన్వయకర్త రాజీవ్ నాథ్ అన్నారు. వైద్య పరికరాల రంగం మేకిన్ ఇండియాకు ఊతమిస్తుందని, మౌలిక సదుపాయాలకు ఈ నిధుల్ని వినియోగించడం వల్ల జాతీయ ఆరోగ్య రంగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోయే అవకాశాలున్నాయని అన్నారు. ► ఆరోగ్య రంగ అధికారులు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వ్యాధులపై పోరాటం చేయాలి. ► క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న నినాదంతో ట్యూబర్ కొలాసిస్ (టీబీ)పై పోరుబాట. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం అడుగులు. -
‘భారతీయులు ఏం చెప్పినా నమ్మేస్తారు’
ఢిల్లీ : భారతీయులంతా అమాయకులను ఎక్కడా చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరైన చిదంబరం మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో భారతీయులంతా అమాయకులను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ఎవరేం చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి దానిని నమ్ముతాం. గ్రామాలన్నీ విద్యుదీపాలతో వెలిగి పోతున్నాయంటే నమ్ముతాం. దేశంలోని 99 శాతం కుటుంబాలకు టాయిలెట్లు నిర్మించారని చెబితే నమ్మేస్తాం’ అని కేంద్ర పథకాలను ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారని చిదంబరం విమర్శించారు ఈ సందర్బంగా కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్‌పై ఆయన మండిపడ్డారు. ‘ఢిల్లీకి చెందిన నా డ్రైవర్ తండ్రికి ఆయుష్మాన్ భారత్ కింద సర్జరీ జరిగింది. అయితే అక్కడి వైద్యులు ఈ పథకం గురించి వారికి ఏం తెలియదని, ఇది వర్తించదని చెప్పారు. కానీ మనం ఆయుష్మాన్ దేశమంతా వర్తిస్తుందని, దీని ద్వారా అన్ని రోగాలకు వైద్యం చేయించుకోవచ్చని నమ్ముతాం. మనం అమాయకులం కదా. అనేక విషయాలకు సంబంధించిన వార్తలు, నివేదికలు అన్నీ వాస్తవానికి విరుద్దమే’ అని కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలను ఎత్తి చూపారు. -
కేంద్రం కంటే రాష్ట్ర పథకం చాలా బెటర్ : ఈటల రాజేందర్
సాక్షి, ఢిల్లీ : కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణలో ఉన్న ఆరోగ్య శ్రీ పథకం మెరుగైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమావేశానికి కో చైర్మన్‌గా ఈటల రాజేందర్ గురువారం హాజరయ్యారు. చైర్మన్‌గా కేంద్ర మంత్రి హర్షవర్ధన్, వైస్ చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ వ్యవహరించారు. ఈ సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణలో 24 లక్షల మంది మాత్రమే లబ్దిదారులుండగా, ఆరోగ్య శ్రీ వల్ల 85 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. కేంద్ర పథకం వల్ల గరిష్టంగా రూ. 5 లక్షల వరకు మాత్రమే వైద్య సేవలుండగా, ఆరోగ్య శ్రీ ద్వారా మూత్ర పిండాలు, గుండె మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలకు గరిష్టంగా రూ. 13 లక్షల వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ వంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్‌కి కేంద్రం ఎక్కువ మద్దతునందించి, నిధులను నేరుగా అందించాలని ఈటల కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ సేవల పరిధిని పెంచి, సిబ్బంది జీతభత్యాలను భరించాలని ఈటల ఈ సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమావేశాల వల్ల కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. -
కలిసికట్టుగా ఉగ్ర పోరు
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదం ఏ ఒక్క దేశం సమస్యో కాదని.. ప్రపంచ దేశాలన్నింటికీ అది సవాలుగా మారిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి పునాదులుగా నిలిచిన సైద్ధాంతిక భూమికను సైతం ఉగ్రవాదం ధ్వంసం చేస్తోందని, మానవాళికి ఈ మహమ్మారి శాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం బాధాకరమన్నారు. ఐరాస సాధారణ సభ 74వ సమావేశాలను ఉద్దేశించి శుక్రవారం మోదీ ప్రసంగించారు. హిందీలో 20 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో వాతావరణ మార్పులు, అభివృద్ధి దిశగా భారత్ తీసుకున్న చర్యలు, ముఖ్య పథకాలు, ఆధునిక సాంకేతికత ప్రభావం.. తదితరాలను ప్రస్తావించారు. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో.. ఐరాస నిర్వహిస్తున్న ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ‘భారత్ ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు.. బుద్ధిని ఇచ్చింది. శాంతి, అహింసల సందేశాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ‘ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేసి మాకు మళ్లీ అధికారం అందించారు. వారిచ్చిన ఆ అద్భుతమైన తీర్పు కారణంగానే మరోసారి ఈ వేదికపైకి రాగలిగాను’ అని ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తమ విజయాన్ని గుర్తుచేశారు. ఐరాస వేదికపై మోదీకి ఇది రెండవ ప్రసంగం. గతంలో 2014లో ఇక్కడ ఆయన ప్రసంగించారు. 1996లో ఐరాసలో ఉగ్రవాదంపై సమర్పించిన నివేదికపై దేశాలు ఏకాభిప్రాయానికి రాలేదు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు... వాతావరణ మార్పు.. వాతావరణ మార్పు ప్రతికూల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల సంఖ్య, విధ్వంస స్థాయి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రకృతి విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల కల్పన కోసం భారత్ ‘కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ను ఏర్పాటు చేసింది. వాతావరణ మార్పు ప్రతికూలతలపై సాగుతున్న పోరులో భారత్ పాత్ర కీలకం. ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ స్థాయిలోనే గ్రీన్‌హౌజ్ వాయువులను విడుదల చేస్తున్నప్పటికీ.. వాతావరణ కాలుష్యంపై భారత్ పోరాటం గణనీయం. మా శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యం 450 గిగావాట్లు. అంతర్జాతీయ స్థాయిలో సౌరవిద్యుదుత్పత్తి కోసం ఒక కూటమిని ఏర్పాటు చేశాం. ఆయుష్మాన్ భారత్.. భారత్‌లో తమ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు ప్రపంచదేశాలకు భవిష్యత్తుపై భరోసా కల్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవి దిక్సూచిగా నిలుస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన పరిశుభ్రత కార్యక్రమం ‘క్లీన్ ఇండియా మిషన్’ను 2014లో ప్రారంభించాం. ఇందులో భాగంగా గత ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చాం. సార్వత్రిక గుర్తింపుగా ఆధార్‌ను తీసుకువచ్చాం. దీన్ని వివిధ పథకాల్లో అమలు చేయడం ద్వారా దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలను ఆదా చేశాం. 50 కోట్లమందికి లబ్ధి చేకూర్చే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించాం. పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను దగ్గర చేసే దిశగా 37 కోట్ల జనధన్ ఖాతాలు తెరిపించాం. 2022 నాటికి పేదలకు 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నాం. సాంకేతికత.. ఆధునిక సాంకేతికత దైనందిన జీవితంలో, ఆర్థిక వ్యవస్థలో, భద్రత, కనెక్టివిటీ, అంతర్జాతీయ సంబంధాల్లో మార్పులు తెచ్చింది. 21వ శతాబ్దంలో దేశాలు తమ సరిహద్దుల్లోపలే గిరిగీసుకుని కూర్చోలేవు. ప్రపంచం ముక్కలుగా చీలడం ఎవరికీ లాభం కాదు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయతావాదానికి, ఐరాసకుS దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత మనదే. 1893లోనే స్వామి వివేకానంద చికాగోలో శాంతి, సంయమనాల భారత సందేశాన్ని అందించారు. -
అక్టోబరు 2 వరకూ ‘ఆయుష్మాన్ భారత్’ పక్షోత్సవాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అందరూ ఆరోగ్యంగా జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ఆయుష్మాన్ భారత్ పేరుతో జిల్లా వ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వయస్సు 30 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. జనాభాలో 37 శాతం మంది 30 ఏళ్లు దాటిన వారు ఉన్నట్లు గుర్తించగా సుమారు 16 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయనున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్స్తో పాటు, పట్టణాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలు అక్టోబరు 2 వరకూ కొనసాగనున్నాయి. వ్యాధుల నిర్థారణ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్స్‌లో మధుమేహం(సుగర్), బీపీ(రక్తపోటు) క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్‌పరీక్షలు నిర్వహించనున్నారు. వాటితో పాటు పోగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నోటి క్యాన్సర్, ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యం వల్ల కలిగే వ్యాధుల నిర్థారణ, చెవి ముక్కు, గొంతు సమస్యలు, దంత వ్యాధుల నిర్థారణకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. వాటితో పాటు హార్మోనల్ డిసీజెస్(థైరాయిడ్), కంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులకు నిర్థారణ పరీక్షలు చేస్తారు. వాటితో పాటు టీబీ, లెప్రసీ, జ్వరాలపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయనున్నారు. ఆరోగ్య కార్యకర్తలతో పా టు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లను ప్రజల ను తీసుకు వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంలో తమవంతు పాత్ర వహించనున్నారు. గుండె స్క్రీనింగ్ పరీక్షలు.. ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా ఈనెల 23 నుంచి 29 వరకూ జిల్లాలోని అన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రిల్లో గుండె జబ్బులకు సంబంధించి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో గుండె వ్యాధులు ఉన్నట్లు గుర్తించిన వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు. అంతేకాకుండా ఈ నెల 29 ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గుండెజబ్బులకు గురై, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొంది ఆరోగ్యంగా ఉన్న వారిని సత్కరించడంతో పాటు, వారి అనుభవాలను ప్రజలకు తెలియచేసి అవగాహన కలిగించనున్నారు. వృద్ధులకు ప్రత్యేక వార్డులు.. వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబరు 1న విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిల్లో 10 పడకల చొప్పున ప్రత్యేక వార్డులను ప్రారంభించనున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రిల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ వార్డులను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రిల్లో చికిత్సకోసం వచ్చిన 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రత్యే క్యూలైన్లు, కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. రక్తపరీక్షలు, వైద్య పరీక్షలు, ఫార్మసీ ఇలా అన్ని చోట్ల వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పాఠశాల విద్యార్థులకు పోటీలు.. వ్యాధులకు చిన్నారులకు అవగాహన కలిగించేందుకు జిల్లాలోని పలు పాఠశాలల్లో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆరోగ్యకరమైన జీవనం, దీర్ఘకాలిక వ్యాధుల వంటి అంశాలతో ఈ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అక్టోబరు 2న బహుమతులు అందజేయనున్నారు. జిల్లా అంతటా స్క్రీనింగ్ పరీక్షలు.. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఆరోగ్యం పేరిట జిల్లా అంతటా వయస్సు 30ఏళ్లు దాటిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లలో ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. మధుమేహం, రక్తపోటుతో పాటు, క్యాన్సర్, ఈఎన్టీ, డెంటల్ స్క్రీనింగ్, హార్మోనల్ డిసీజ్, గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్యం అవసరమైన వారికి విజయవాడ, మచిలీపట్నం ఆస్పత్రులకు తరలిస్తాం. వృద్ధుల కోసం విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రుల్లో 10 పడకలతో వార్డులు ఏర్పాటు చేయనున్నాం.– డాక్టర్ జె. ఉషారాణి,జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాకాధికారి -
మళ్లీ ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించాయి. బకాయిల విడుదలకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం రాత్రి సచివాలయంలో మంత్రి ఈటలతో తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం (తన్హా) ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. నిధుల విడుదలకు మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నామని డాక్టర్లు ప్రకటించారు. దీంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. చర్చల అనంతరం ఈటల మాట్లాడుతూ ఇకపై ప్రతి నెలా ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. సాధ్యమైన మేర బకాయిలు ఎక్కువగా లేకుండా చూస్తామన్నారు. గతంలో లాగా కాకుండా ఎప్పటికప్పుడు హాస్పిటళ్ల యాజమాన్యాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో హాస్పిటళ్లకు ఉన్న ఎంవోయూ వందల పేజీలతో గందరగోళంగా ఉందని, దీన్ని సరళీకరించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామన్నారు. వైద్య సేవల ప్యాకేజీలను కూడా సమీక్షిస్తామన్నారు. అటు ఆసుపత్రులకు, ఇటు రోగులకు ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకం అన్నారు. ఆయుష్మాన్‌తో రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలకే వైద్యం అందే అవకాశముందని, తాము 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నామని తన్హా ప్రెసిడెంట్ డాక్టర్ రాకేశ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒప్పందంలోని లొసుగులే సమస్యలకు దారి తీస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ వద్దు, ఆరోగ్యశ్రీ ముద్దు అని ఈ సందర్భంగా రాకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం నుంచి ప్రజలకు యథావిధిగా సేవలందిస్తామని తెలిపారు. ఇక పై తన్హా గౌరవ అధ్యక్షునిగా మంత్రి ఈటల ఉంటారని ఆయన ప్రకటించారు. ఐదు రోజులుగా రోగుల ఇక్కట్లు... ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌కు సంబంధించి బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఈ నెల 16 నుంచి తన్హా హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. అదేరోజు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ బకాయిల లెక్క తేలకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. సుమారు రూ. 1,200 కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు తన్హా పేర్కొనగా బకాయిలు రూ. 600 కోట్లేనని ఆరోగ్యశ్రీ అధికారులు చెప్పడంతో చర్చలు అర్ధంతరంగానే ముగిశాయి. ఈ ప్రతిష్టంభన కారణంగా గత ఐదు రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం నుంచి సోమవారం వరకూ ఐదు రోజులపాటు సమ్మె కొనసాగింది. వేల మంది రోగులు ఇబ్బంది పడ్డారు. -
‘ఆయుష్మాన్’ను అడ్డుకోవద్దు
హైదరాబాద్ : పేదలకు ఉచితంగా వైద్య ఆరోగ్య సదుపాయాన్ని కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం తగదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. పేదలకు రూ. 5లక్షల వరకు వైద్య ఖర్చులను భరించే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు కాకుండా మోకాలడ్డుతోందని ఆరోపించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో శనివారం కేంద్రమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన ‘ఆయుష్మాన్ భారత్ ’ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సదుపాయాన్ని అందిస్తున్న ఈ పథకాన్ని అడ్డుకోవడం అంటే పేదలను వైద్యానికి దూరం చేయడమేనన్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడుసహా అనేక రాష్ట్రాలు ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తున్నాయన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారానే పేదలు ఆరోగ్యం గా జీవించడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఒక్క రూ స్వచ్ఛ భారత్‌లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 10 కోట్ల మరుగుదొడ్లు, 18 వేల గ్రామాలకు కరెంట్ సదుపాయాన్ని కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. -
ఆరోగ్యానికి ఆయుష్షు..
న్యూఢిల్లీ: గత రెండు బడ్జెట్లతో పోల్చితే ఈసారి ఆరోగ్య రంగానికి కేంద్రం నిధులు గణనీయంగా పెంచింది. వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా మెడికల్ కాలేజీలను నవీకరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో రూ. 62,659.12 కోట్లు ప్రతిపాదించారు. 2018–19 బడ్జెట్ (రూ. 52,800 కోట్లు)తో పోల్చితే 19 శాతం పెంచారు. కేంద్రం కీలకంగా భావిస్తున్న బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్–ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై)కు రూ. 6,400 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ నెలకొల్పడానికి రూ. 249.96 కోట్లను కేటాయించారు. ఇక జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ. 1,349.97 కోట్లు ప్రతిపాదించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 32,995 కోట్లు కేటాయించారు. అయితే ఎన్హెచ్ఎం కార్యక్రమమైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై) పథకానికి భారీగా కోత పెట్టారు. ఈసారి కేవలం రూ. 156 కోట్లు మాత్రమే కేటాయించారు. జాతీయ ఎయిడ్స్, ఎస్టీడీ నియంత్రణ కార్యక్రమానికి గతేడాది కంటే రూ. 400 కోట్లు పెంచి రూ. 2,500 కోట్లు కేటాయించారు. ఇక ఎయిమ్స్‌కు గత బడ్జెట్లో రూ. 3,018 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 3,599.65 కోట్లకు పెంచారు. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి రూ. 40 కోట్లు, కేన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల నియంత్రణ కార్యక్రమానికి రూ. 175 కోట్లు కేటాయించారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పెద్ద ఆస్పత్రుల్లో వైద్యానికి సంబంధించిన టెర్షియరీ కేర్ పోగ్రామ్‌లో రూ. 200 కోట్లు కోత పెట్టి రూ. 550 కోట్లు ప్రతిపాదించారు. నర్సింగ్ సర్వీసులకు రూ. 64 కోట్లు, ఫార్మసీ స్కూళ్లు, కాలేజీకు రూ. 5 కోట్లు, జిల్లా ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్) అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 800 కోట్లు, జిల్లా ఆస్పత్రులను కొత్త మెడికల్ కాలేజీలుగా మార్చడానికి రూ. 2,000 కోట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (అండర్ గ్రాడ్యుయేట్), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడానికి రూ. 1,361 కోట్లు ప్రతిపాదించారు. సంప్రదాయ వైద్యానికి రూ. 1,939.76 కోట్లు సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించే దిశగా మోదీ ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖకు సుమారు 15 శాతం అధికంగా నిధులిచ్చింది. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) వైద్యానికి సంబంధించి రూ. 1,939.76 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఆయుష్ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ. 92.31 కోట్లు ప్రతిపాదించారు. ఇక అటానమస్ సంస్థలైన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ వైద్యానికి సంబంధించి వరుసగా.. రూ. 292.31 కోట్లు, రూ. 118.53 కోట్లు, రూ. 152.65 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయాలంటే రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ.100 లక్షల కోట్లను కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. విదేశీ బీమా మధ్యవర్తిత్వ సంస్థల్లో 100 శాతం ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) వల్ల భారత ఆరోగ్య రంగానికి పరోక్షంగా లబ్ధిచేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. - గౌతమ్ ఖన్నా సీఈవో హిందుజా ఆసుపత్రి–ఎంఆర్సీ -
ఆ మూడింటికే ఎక్కువ క్లెయిమ్‌లు
న్యూఢిల్లీ: ‘ఆయుష్మాన్ భారత్– ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) కింద కేన్సర్, కీళ్లు, గుండె సంబంధ వ్యాధులకే ఎక్కువ క్లెయిమ్‌లు అందినట్లు జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) తెలిపింది. గుండె వ్యాధుల ప్యాకేజీలో ఉన్న యాంజియో ప్లాస్టీ, స్టెంట్ల అమరిక వంటి ఖరీదైన వైద్య సౌకర్యాన్ని అత్యధికులు వినియోగించుకున్నారని వివరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంతో ఇప్పటి వరకు 10.8 లక్షల మంది లబ్ధి పొందారని పేర్కొంది. ఈ పథకం కింద గుర్తించిన 14,756 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.1,041 కోట్ల విలువైన 8 లక్షల క్లెయిమ్‌లు అందగా రూ.808 కోట్ల విలువైన ఆరు లక్షల క్లెయిమ్‌లకు ఆమోదం తెలిపినట్లు ఎన్హెచ్ఏ వివరించింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, దగ్గర్లోని ఆస్పత్రుల వివరాలు, సహాయం పొందే విధానం వంటి వివరాలతో రూపొందించిన యాప్‌ను ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా మంగళవారం ప్రారంభించారు. ఇప్పటికే ఈ యాప్‌ను 10,460 మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఎన్హెచ్ఏ తెలిపింది. -
ఆరోగ్యం..ఆయుష్మాన్!
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6,400 కోట్లను ఆయుష్మాన్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా కేటాయింపులు జరపడం గమనార్హం. ఇతర విశేషాలు.. ► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్‌సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల కేటాయింపు. ► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రూ.1,350.01 కోట్ల కేటాయింపు. ► ఈ పథకం కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాల్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. రక్తపోటు, డయాబెటిస్, కేన్సర్, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు ఈ కేంద్రాల్లో చికిత్స అందిస్తారు. ► జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) పథకానికి రూ.31,745 కోట్లు కేటాయించారు. ► ఎన్హెచ్ఎంలో అంతర్భాగమైన రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన కు రూ. 156 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గతేడాది కన్నా రూ.1,844 కోట్లు తక్కువ కావడం గమనార్హం. ► ఎయిడ్స్, అసురక్షిత లైంగిక వ్యాధుల నివారణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.400 కోట్లు అధికం. ► ఎయిమ్స్‌కు రూ.3,599.65 కోట్లు కేటాయించారు. ► జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గించారు. ► కేన్సర్, డయాబెటిస్, హృద్రోగ సంబంధ వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమానికి కేటాయింపులను రూ.295 కోట్ల నుంచి రూ.175 కోట్లకు తగ్గించారు. ► టెర్షరీ కేర్(ప్రత్యేక సంరక్షణ, చికిత్సలు) కార్యక్రమాలకు కేటాయింపులను రూ.750 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించారు. ► నర్సింగ్ సేవల ఆధునీకరణకు రూ.64 కోట్లు, ఫార్మసీ స్కూల్స్, కళాశాలల బలోపేతానికి రూ.5 కోట్లు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల(పీజీ సీట్లు) ఆధునీకరణకు రూ.800 కోట్లు కేటాయించారు. ► ప్రభుత్వ మెడికల్ కళాశాలలు(డిగ్రీ సీట్లు), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి రూ.1,361 కోట్ల కేటాయింపు. కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.2 వేల కోట్లు, రాష్ట్రాల్లో ప్రభుత్వ పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు. ‘ఆయుష్మాన్’తో 3 వేల కోట్లు ఆదా: పీయూష్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటిదాకా ఉచితంగా వైద్యం చేయించుకున్న సుమారు 10 లక్షల మంది పేదలు రూ.3 వేల కోట్లను ఆదాచేసుకున్నారని పీయూష్ గోయల్ చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం చౌక ధరలకే ఔషధాల్ని అందిస్తోందని, గుండెలో అమర్చే స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపుతో లక్షలాది మంది పేదలు ప్రయోజనం పొందారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని, అందులో 14 ఆసుపత్రుల్ని ఎన్డీయే ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. పేదలకు ఆరోగ్య సేవల్ని చేరువచేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఉటంకిస్తూ..2030 నాటికి ఎలాంటి అవాంతరాలు లేని సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. అలాంటి ఆరోగ్య భారత నిర్మాణంలో మహిళలనూ సమాన భాగస్వాముల్ని చేస్తామని తెలిపారు. దీర్ఘాయుష్మాన్ భవ... ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం నోచుకోని పల్లెలున్న భారతమిది. ఇక్కడ నిరుపేదకు సుస్తీ చేస్తే చావే శరణ్యం. కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని సాకారం చేసే సార్వత్రిక ఆరోగ్య బీమానిచ్చే ఏ పథకాన్నయినా దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించాల్సిందే. కాకపోతే గత బడ్జెట్లో ప్రకటించి ఊరుకున్నారు. ప్రయోగాలకే పరిమితమయ్యారు. ఈ సారి ఎన్నికలొస్తున్నాయి కనక పూర్తి స్థాయి కేటాయింపులు చేస్తూ... వెల్నెస్ సెంటర్ల నుంచి ఎయిమ్స్ దాకా పూర్తిస్థాయి వైద్య సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చే విజన్‌నూ ఆవిష్కరించారు. ఏ ప్రభుత్వమున్నా ఆ విజన్ సాకారం కావాలన్నదే నిరుపేదల ఆకాంక్ష. ఎందుకంటే వారికి కావాల్సింది వైద్యం మరి. -
ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ ఉత్తమం : కేసీఆర్
-
ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ ఉత్తమం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మెరుగైందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై చేపట్టిన ధన్యవాద తీర్మానంపై ఆయన ప్రసంగించారు. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా తమ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని స్పష్టం చేశారు. చర్చలో వివిధ పార్టీల సభ్యులు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సీఎం సమాధానమిచ్చారు. లాటరీ పద్దతిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నామని, ఇప్పటికే 2.70 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతిపై, చట్ట వ్యతిరేక బెట్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధూల్‌పేట ప్రజలకు పునరావాస కల్పిస్తామన్నారు. వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్ అని, రాష్ట్రంలో ఇళ్లు అవసరమైన పేదల వివరాలు సేకరిస్తామన్నారు. -
‘ఆయన ఆంగ్లంలో మాట్లాడలేరు’
కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో విమర్శల దాడికి దిగారు. ప్రధాని కనీసం ఒక వాక్యం కూడా ఆంగ్లంలో సరిగా మాట్లాడలేరని, ఆయన ఆంగ్లంలో మాట్లాడే సమయంలో నిరంతరం టెలీప్రాంప్టర్ వైపు చూస్తుంటారని దీదీ వ్యాఖ్యానించారు. ఈ విషయం మీడియా సహా చాలామందికి తెలుసునన్నారు. ప్రధాని మోదీ స్క్రీన్ వైపు చూస్తూ తనకు ఆంగ్లంలో ప్రావీణ్యమున్నట్లు అక్కడ రాసిన ప్రసంగాన్ని చదివేస్తారన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయం చేస్తున్నారంటూ ఆ పథకం నుంచి వైదొలుగుతున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించే క్రమంలో ప్రధానిపై ఈ వ్యాఖ్యలు చేశారు. -
2019 ఇండియా టాప్‌టెన్..
2018 వెళ్లిపోయి కొత్తసంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2019 వివిధ రంగాల్లో ఆశావహంగా కనబడుతుంటే.. మరికొన్ని రంగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరికొన్ని చర్చనీయాంశం అవుతున్నాయి. అన్నింటికీ మించి ఇది ఎన్నికల సంవత్సరం. అందుకే.. రాజకీయ పార్టీలన్ని అజెండాలు, కూటముల రూపకల్పనలో తలమునకలవుతున్నాయి. కేంద్రంలో ఎవరు పాగా వేస్తారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వాల ఆర్థిక నిర్ణయాలు జనాల జేబులు నింపుతాయా? లేక చిల్లులు పెడతాయా? అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆరోగ్య భారత్ కల సాకారమవ్వాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. సాంకేతిక రంగంలో అనుకున్న మాదిరిగానే దూసుకెళ్తున్నాం. దాయాది దేశంతో సఖ్యత ఎండమావేనని గతేడాది పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. క్రీడారంగంలో 2018లో సాధించిన విజయాల పరంపర ఈసారీ కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ వివిధ రంగాల భవిష్యత్తుపై ఓ విశ్లేషణ. మోదీ మళ్లీ గెలుస్తారా? వచ్చే సార్వత్రిక ఎన్నికలు మాత్రం పూర్తిగా మోదీ కేంద్రంగానే జరుగుతున్నాయి. మోదీ అనుకూల, మోదీ వ్యతిరేక కూటముల మధ్యే ప్రధానంగా పోరు ఉండబోతుందనేది సుస్పష్టం. చాయ్‌వాలా స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి జయకేతనం ఎగరేసి రెండోసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్టిస్తారా లేక ‘పునరుజ్జీవ ’కాంగ్రెస్‌కు దారిస్తారా? అనే అంశంపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2014 తర్వాత మోదీ ‘రాజకీయ చాణక్యం’తో దేశంలో ఒక్కో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంటూ బలమైన శక్తిగా తయారైంది. దీంతో జాతీయంగా, అంతర్జాతీయంగా మోదీ ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. అయితే.. దేశంలో వ్యవసాయంతోపాటు పలు రంగాల్లో ఎదురవుతున్న సమస్యలతో.. మోదీ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏదేమైనా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మాత్రం పూర్తిగా మోదీ కేంద్రంగానే జరుగుతున్నాయి. మోదీ అనుకూల, మోదీ వ్యతిరేక కూటముల మధ్యే ప్రధానంగా పోరు ఉండబోతుందనేది సుస్పష్టం. అటు కాంగ్రెస్ కూడా ఎలాగైనా మోదీని గద్దెదించాలని అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలకు చెక్‌పెట్టి.. ప్రజామోదాన్ని మోదీ పొందగలరా? లేదా? అనేదే భారత్‌తోపాటు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ ఏడాదేనా 5ఎ అమెరికాతోపాటు యూరప్, ఆస్ట్రేలియా, జపాన్లలో 5జీ ఈ ఏడాదే అందుబాటులోకి వస్తోంది. ఈ తాత్కాలిక ఏర్పాటు వల్ల ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల ఇంటర్నెట్ వేగం సెకనుకు రెండు గిగాబైట్ల స్థాయికి చేరుకోవచ్చునని అంచనా. సాంకేతిక ప్రపంచం ఎదురుచూస్తున్న 5జీ టెక్నాలజీ ఈ ఏడాది అమల్లోకి వస్తుందనే అంచనాలున్నాయి. అయితే ఇది భారత్‌లోనూ అందుబాటులోకి వస్తుందా? లేదా.. ఇంకొంత ఆలస్యమవుతుందా అన్నదానిపై స్పష్టత రాలేదు. స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ వేగాన్ని 4జీ స్థాయికి పదింతలు చేయగల 5జీ టెక్నాలజీకి అవసరమైన స్పెక్ట్రమ్ కేటాయింపులు మన దేశంలో ఇంతవరకూ జరగకపోవడమే ఇందుకు కారణం. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా స్పెక్ట్రమ్ వేలం జరిగే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు స్పెక్ట్రమ్ వేలంతో సంబంధం లేకుండా 5జీ వేగాలను అందించే అవకాశం ఉంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్లలో 5జీ ఈ ఏడాదే అందుబాటులోకి వస్తోంది. ఈ తాత్కాలిక ఏర్పాటు వల్ల ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల ఇంటర్నెట్ వేగం సెకనుకు రెండు గిగాబైట్ల స్థాయికి చేరుకోవచ్చునని అంచనా. ఎజెండాపై అన్నదాత అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో ‘అన్నదాత’పై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. ఇందులో రైతు రుణమాఫీపై ప్రధాన అజెండాగా మారింది. రుణమాఫీ బదులు రైతులకు అవసరానికి ఆర్థిక సాయం అందించే పథకాలు మంచివన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో రైతు ఎదుర్కొంటున్న సమస్యలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి రైతుల్లో నెలకొన్న ఆగ్రహమే కారణమనే విశ్లేషణల నేపథ్యంలో.. అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో ‘అన్నదాత’పై దృష్టి సారించనున్నాయి. ఇందులో రైతు రుణమాఫీపై ప్రధాన ఎజెండాగా మారింది. దేశంలో ఏడు రాష్ట్రాలు ఇప్పటికే రుణమాఫీని అమలు చేస్తున్నాయి. అయితే.. రుణమాఫీ ప్రభుత్వాలకు ఆర్థికంగా గుదిబండ అవుతుందని ఆర్బీఐ, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైతులకు అవసరానికి ఆర్థిక సాయం అందించే పథకాలు మంచివన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో, ఒడిశా కాలియా పేరుతో, జార్ఖండ్ సర్కారు మరో పేరుతో రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొన్నటివరకు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుకు కనీస మద్దతు ధర అందేలా ‘భావాంతర్ భుగ్తాన్’ యోజన అమలు చేసింది. కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు ఉన్న తేడా సొమ్మును రైతు ఖాతాలో జమ చేయడం ఈ పథకం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ రెండేళ్ల క్రితమే రైతు భరోసా పేరుతో పథకాన్ని ప్రకటించింది. 2017, జూలై 9న జరిగిన పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల్లో ఈ పథకం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్నదాతే ప్రధాన అజెండాగా మారతారా అనే చర్చ జరుగుతోంది. ఆరోగ్య బీమా కేంద్రం X రాష్ట్రాలు ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల విలువైన వైద్య సాయం అందేలా కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రారంభించింది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేస్తున్నందున ఆయుష్మాన్‌తో పనేముందని కొన్ని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆరోగ్య సంరక్షణ కూడా ప్రధాన అంశంగా మారనుందనేది నిర్వివాదాంశం. దేశ ప్రజలకు అందుబాటు ధరల్లోనే నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల విలువైన వైద్య సాయం అందుతుంది. దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలు (దాదాపుగా 50–60 కోట్ల మంది ప్రజలు) ఈ పథకం పరిధిలోకి వస్తాయి. అయితే ఈ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ, ఢిల్లీ, కేరళ, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యం రాష్ట్రాల పరిధి కిందకు వస్తుందని.. ఈ పథకం ద్వారా రాష్ట్రాల హక్కుల్లో జోక్యం చేసుకోవాలని కేంద్రం భావిస్తోందని ఈ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేస్తున్నందున ఆయుష్మాన్‌తో పనేముందని వాదిస్తున్నాయి. దీనికితోడు ఆయుష్మాన్ భారత్ కింద ప్రభుత్వ వాటాగా కట్టే బీమా సొమ్మును రాష్ట్రాలే చెల్లించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ఆరోగ్య బీమా పథకం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు రాలుస్తుందా అన్నది చర్చనీయాంశం కానుంది. సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతాయా? నియంత్రణరేఖ వెంబడి భారీ దాడికి పాకిస్తాన్ సరిహద్దు రక్షణ బృందం (బీఏటీ) చేసిన ప్రయత్నం రెండు దేశాల మధ్య పెరగనున్న ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. 2018లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. కొత్త సంవత్సరంలోనూ భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది. ఈసారి కశ్మీర్లో మంచు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో.. చొరబాట్లు వచ్చే ఏడాది ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. సంవత్సరం చివరి రోజున.. కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు, ఉగ్రవాదులు కలిసి భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మన బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఈ ప్రయత్నంలో ఇద్దరు పాక్ జవాన్లు మరణించారు. అటు, నియంత్రణరేఖ వెంబడి భారీ దాడికి పాకిస్తాన్ సరిహద్దు రక్షణ బృందం (బీఏటీ) చేసిన ప్రయత్నం రెండు దేశాల మధ్య పెరగనున్న ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. దీనికితోడు పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం.. ఆర్మీ చెప్పుచేతుల్లోనే పాలన కొనసాగిస్తుండటం, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తరచూ రెచ్చగొట్టేలా ప్రకటను ఇవ్వడం ఇరుదేశాల ఉద్రిక్తతలు మరింత పెరిగేందుకు సంకేతాలిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ తరహా లేదా అంతకన్నా ఎక్కువ శక్తిమంతమైన దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. ఈ దాడులు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. దూసుకొస్తున్న ఐఓటీ,కృత్రిమ మేధ ఆఫీసులో కూర్చుని ఇంట్లోని ఫ్రిజ్‌లో ఏమున్నాయో తెలుసుకోవడం.. ఏసీ ఎప్పుడు ఆన్/ఆఫ్ కావాలో ఎక్కడి నుంచైనా నిర్ణయించడం ఐఓటీ టెక్నాలజీ సౌకర్యాలు నిన్న, మొన్నటివరకూ సామాన్యుడికి సంబంధం లేదని అనుకున్న కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఇప్పుడు స్మార్ట్ఫోన్ల రూపంలో అరచేతుల్లోకి చేరిపోయింది. 2019లో దీని పరిధి మరింత విస్తృతం చేసుకుని. దాదాపు అన్ని రంగాల్లోనూ తన ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఇంటర్నెట్కు అనుసంధానమైన పరికరాలు (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), అక్రమాలకు తావివ్వని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలు 2019లో అందరికీ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. వరద ముప్పుపై ముందస్తు హెచ్చరికలు చేసేందుకు, మధుమేహం కారణంగా కంటికి జరిగే నష్టాలను తెలుసుకునేందుకు గూగుల్ కృత్రిమ మేధ సాయంతో ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగార్థుల దరఖాస్తులను వడపోసి సరైన వారిని గుర్తించేందుకూ ఈ అత్యాధునిక టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాయి. ఆఫీసులో కూర్చుని ఇంట్లోని ఫ్రిజ్‌లో ఏమున్నాయో తెలుసుకోవడం.. ఏసీ ఎప్పుడు ఆన్/ఆఫ్ కావాలో ఎక్కడి నుంచైనా నిర్ణయించడం.. రైతన్న ఇంట్లో కూర్చుని పంటకు నీరు, ఎరువులు ఎప్పుడు, ఎంతమేరకు వేయాలో తేల్చేయగలగడం.. ఐఓటీ టెక్నాలజీ ద్వారా వచ్చే సౌకర్యాలకు కొన్ని ఉదాహరణలు. నట్టింట్లో బూతు పురాణం మన ప్రమేయం ఇసుమంతైనా లేకుండా నేరుగా.. ఇళ్లల్లోకి, మన పిల్లల మస్తిష్కాల్లోకి చొరబడి నవతరాన్ని ప్రభావితం చేస్తోన్న అశ్లీల, అసభ్య, అనైతిక ఇంటర్నెట్ దృశ్యాల నుంచే ఈ యేడాది మనకు ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు సినిమా పాటలో అశ్లీలం ఉందంటేనే తీవ్ర విమర్శలు వచ్చేవి. ఆ తర్వాత నిబంధనలు కాస్త సరళీకృతమైనా.. సినిమాల్లో అశ్లీలాన్ని నియంత్రించేందుకు సెన్సార్‌బోర్డు తనవంతు పనిచేస్తోంది. కానీ.. పెరుగుతున్న సాంకేతికత ఎలాంటి పట్టపగ్గాల్లేకుండా బూతును నేరుగా నట్టింట్లోకి తీసుకొచ్చింది. మన ప్రమేయం ఇసుమంతైనా లేకుండా నేరుగా.. మన ఇళ్లల్లోకి, మన పిల్లల మస్తిష్కాల్లోకి చొరబడి నవతరాన్ని ప్రభావితం చేస్తోన్న డిజిటల్ వ్యవస్థ నుంచే ఈ యేడాది మనకు ప్రమాదం పొంచి ఉంది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ల ద్వారా.. అశ్లీల, అసభ్య, అనైతిక ఇంటర్నెట్ దృశ్యాలు.. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ.. మన సంస్కృతిపై యుద్ధం ప్రకటిస్తున్నాయి. వెబ్ సిరీస్‌ల్లో నగ్న, అర్థనగ్న చిత్రాలతో పాటు బూతుపురాణం కూడా వెగటుగా తయారైంది. దీనికితోడు చిన్నారులను ఆత్మహత్యకు పురిగొల్పే ‘బ్లూవేల్’ వంటి మొబైల్ గేమ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఇలాంటి వెబ్‌సిరీస్‌లు, గేమ్స్‌ను నియంత్రించే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. క్రికెట్ ప్రపంచకప్ మనదేనా మే 30న ప్రారంభమయ్యే క్రికెట్ పండగ ఈ ఏటి ఆసక్తికర క్రీడాంశాల్లో మొదటి స్థానంలో నిలువనుంది. భారత్‌తోపాటు ఆతిథ్య ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న పెద్ద పండగ 2019– వన్డే వరల్డ్ కప్.. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరగనుంది. ఇప్పటికే 1983, 2011 ప్రపంచకప్‌లను గెలుచుకున్న భారత్ ఈసారి కూడా టైటిల్ గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇటీవలి కాలంలో జట్టు విదేశాల్లో చూపిస్తున్న ఆటతీరు. కోహ్లీ ఆటతీరు, జోష్‌తోపాటు.. జట్టులో ఉత్సాహమైన యువరక్తం అవకాశం వచ్చినపుడు సత్తా చాటుతుండటంతో భారత జట్టు విజయావకాశాలపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఏడాది కాలంగా విదేశాల్లో భారత బౌలర్లు (ముఖ్యంగా పేస్ బౌలర్లు) రాణిస్తున్నారు. దీనికితోడు ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో స్థిరంగా రాణిస్తున్న బ్యాట్స్‌మెన్ (రోహిత్ శర్మ, రాయుడు, కోహ్లీ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా తదితరులు)లు భారత జట్టులో ఉండటమే ఈ భారీ అంచనాలకు కారణం. దీనికితోడు భారత క్రికెట్‌ను ఉన్నతశిఖరాలకు చేర్చడంలో తన పాత్రకు న్యాయం చేసిన మహేంద్రసింగ్ ధోనీ తన చివరి వరల్డ్ కప్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో ఉంది. మే 30న ప్రారంభమయ్యే క్రికెట్ పండగ ఈ ఏటి ఆసక్తికర క్రీడాంశాల్లో మొదటి స్థానంలో నిలువనుంది. భారత్‌తోపాటు ఆతిథ్య ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మ్యాన్ – మెషీన్ అనుసంధాన విద్య ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అటోమేషన్, రొబోటిక్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులకు ప్రాధాన్యం పెరగనుంది. తయారీ, సేవలు తదితర రంగాలతోపాటు ఆటోమొబైల్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఈ–కామర్స్ విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్ర పెరుగుతున్న తరుణంలో.. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు లేని లక్షల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో రొబోటిక్స్, అటోమేషన్ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. మారుతున్న వ్యాపారాలు, పనివాతావరణం, ఉత్పత్తి ప్రక్రియల కారణంగా ఎంత రొబోటిక్స్ ప్రభావం ఉన్నా.. మ్యాన్–మెíషీన్ సమన్వయం తప్పనిసరంటూ పరిశోధకులంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో.. ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అటోమేషన్, రొబోటిక్స్, ఏఐ, మెషీన్ లెర్నింగ్ కోర్సులకు ప్రాధాన్యం పెరగనుంది. ఏమంటాయో! చమురు ధరల పతనం, ఆర్బీఐ కొత్త గవర్నర్ ఉదారవాద విధానాన్ని అవలంభించడంతో రూపాయి పుంజుకోవచ్చు. ముడిచమురు బ్యారెల్ ధర 82 డాలర్లను చూసి.. మళ్లీ ఇపుడు 50 డాలర్ల శ్రేణిలోకి వచ్చింది. అలాగే మన రూపాయి డాలర్‌తో పోలిస్తే ఏకంగా 74 రూపాయలను దాటేసి.. ఇపుడు రూ.70 కిందికు దిగింది. ఇవే 2019లో మన స్టాక్ మార్కెట్లను, ఆర్థిక వ్యవస్థనూ శాసించబోతున్నాయి. పతనమైన ముడి చమురు ధరలపై ఒపెక్ దేశాల నిర్ణయం నేపథ్యంలో మరింతగా పతనమవుతుందని ఊహించలేం. ద్రవ్యోల్బణం దిగివస్తుండటం, చమురు ధరల పతనంతో డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవచ్చు. -
మంచిని పంచుదాం..పెంచుదాం!
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా సానుకూల(పాజిటివ్) విషయాలను వైరల్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతికూల అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభమని వ్యాఖ్యానించారు. ప్రజల ఉమ్మడి కృషి కారణంగా భారత్ 2018లో పలు అద్భుతాలను సాధించిందన్నారు. ఆశయం బలంగా ఉంటే ఎదురయ్యే అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతాయని తెలిపారు. 2019లో కూడా భారత అభివృద్ధి, పురోగతి ఇలాగే సాగాలని ..సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. 2018లో చివరి మాసాంతపు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ పలు అంశాలపై ముచ్చటించారు. ఏడాదిలో అనేక విజయాలు... ‘మనమంతా కలిసి సానుకూల అంశాలను వైరల్ చేద్దాం. ఇలా చేయడం వల్ల చాలామంది ప్రజలు సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు, మహనీయుల గురించి తెలుసుకుంటారు. ప్రతికూల వార్తలు, అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభం. కానీ చుట్టూ సానుకూల విషయాలను వ్యాప్తిచేసే ప్రయత్నం నిజంగానే జరుగుతోంది. చాలా వెబ్సైట్లు ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నాయి. ఇలాంటి వార్తల లింక్స్‌ను విస్తృతంగా పంచుకోండి. తద్వారా సానుకూలతను వైరల్ చేయవచ్చు’ అని మోదీ సూచించారు. 2018లో ఎన్డీయే ప్రభుత్వ సాధించిన కీలక విజయాలపై మాట్లాడుతూ..‘ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమైన ఆయుష్మాన్ భారత్‌ను ఆవిష్కరించాం. దేశంలోని ప్రతీపల్లెకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రజల దృఢ సంకల్పంతో పరిశుభ్రత అన్నది 95 శాతం దాటింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి త్రివర్ణ పతాకాన్ని ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోటపై ఎగురవేస్తున్నారు. కానీ స్వతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశచరిత్రలో తొలిసారి అక్టోబర్ 21న ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించాం. తొలి భారత హోంమంత్రి సర్దార్ పటేల్ గౌరవార్థం ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఏర్పాటుచేశాం. ఈ ఏడాదే భూ, జల, వాయు మార్గాల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది’ అని మోదీ వెల్లడించారు. యువతకు గొప్ప అవకాశం... యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాపై స్పందిస్తూ..‘ఈ కార్యక్రమం సందర్భంగా భక్తితో పాటు పరిశుభ్రత కూడా పరిఢవిల్లుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి యువతకు కుంభమేళా గొప్ప అవకాశం’ అని పేర్కొన్నారు. అలాగే ఈసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరవుతారని తెలిపారు. దక్షిణాఫ్రికాలో∙గాంధీ జాతి వివక్షపై మొదటిసారి పోరాడి, మహాత్ముడిగా మారారని గుర్తుచేశారు. అండమాన్ ప్రజలు దేశానికే ఆదర్శం అండమాన్ దీవుల్లో మోదీ పర్యటన కార్ నికోబార్ / పోర్ట్‌బ్లెయర్ : 2004లో విరుచుకుపడ్డ సునామీ దుష్ప్రభావం నుంచి అండమాన్ ప్రజలు శరవేగంగా కోలుకున్నారని ప్రధాని కితాబిచ్చారు. అండమాన్ దీవుల్లో ఉంటున్న ప్రజల సంక్షేమానికి, భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కార్ నిరోబార్ దీవుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రశంసించిన మోదీ, ఈ విషయంలో అండమాన్ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సాధారణంగా ప్రజలు ప్రధాన భూభాగాన్ని, ద్వీపాలను వేరుగా చూస్తారనీ, తనకు మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల కంటే పోర్ట్బ్లెయరే ప్రధాన భూభాగమని అన్నారు. స్థానికుల డిమాండ్ మేరకు సముద్రపు అలల తాకిడికి నేల కోతకు గురికాకుండా రూ.50 కోట్లతో గోడను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్ నికోబార్‌లోని బీజేఆర్ స్టేడియంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. కొబ్బరి పొట్టు కనీస మద్దతు ధరను రూ.7 వేల నుంచి రూ.9 వేలకు పెంచామన్నారు. ఈ సందర్భంగా సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. సావార్కర్ గదిలో ధ్యానం.. పర్యటనలో భాగంగా పోర్ట్‌బ్లెయర్‌లోని సెల్యూలర్ జైలును సందర్శించిన ప్రధాని.. బ్రిటిష్ పాలనలో స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన వీరులకు నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న హిందుత్వవాది వీర సావార్కర్‌ను బంధించిన గదిలో నేలపై ధ్యాన ముద్రలో కూర్చున్నారు. ఆతర్వాత జైలు సెంట్రల్ టవర్ వద్ద గోడపై చెక్కిన అమరుల పేర్లను పరిశీలించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి వెనుదిరిగారు. కాలాపానీగా పిలిచే ఈ జైలును 1896–1906లో నిర్మించారు. ఈ పర్యటనలో భాగంగా చెన్నై–పోర్ట్‌బ్లెయర్ మధ్య ఫైబర్ కేబుల్, 7 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు, సోలార్ మోడల్ గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. అలాగే అండమాన్ దీవుల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రితో పాటు 50 మెగావాట్ల ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ) ప్లాంట్‌ను స్థాపిస్తామని తెలిపారు. మూడు ద్వీపాలకు కొత్త పేర్లు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 వసంతాలు పూర్తయిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి రోస్ ఐలాండ్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా, నీల్ ఐలాండ్‌ను షహీద్(అమరుల) ద్వీపంగా, హేవ్‌లాక్ ఐలాండ్‌ను స్వరాజ్య ద్వీపంగా నామకరణం చేస్తున్నట్లు పోర్ట్‌బ్లెయర్‌లోని నేతాజీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్మారక స్టాంపును, రూ.75 నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..‘స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి ప్రస్తావించాల్సి వస్తే నేతాజీ పేరును గర్వంగా ప్రకటిస్తాం. ఆయన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి తొలి ప్రధాని. ఆయన అండమాన్ గడ్డపై భారత్ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేశారు. అండమాన్ నుంచి దేశం స్ఫూర్తి పొందుతోంది. 1943లో ఇదే రోజున అండమాన్, నికోబార్ దీవులను షహీద్, స్వరాజ్ దీవులుగా గుర్తించాలని నేతాజీ సూచించారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా నేతాజీకి గౌరవంగా మొబైల్ ఫోన్ల ఫ్లాష్లైట్లను ఆన్ చేయాలని కోరడంతో స్టేడియం ఒక్కసారిగా వెలుగుజిలుగులతో కాంతులీనింది. అనంతరం మెరీనా పార్క్‌లో 150 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను మోదీ ఆవిష్కరించారు. -
ఆరోగ్య తెలంగాణ... బీజేపీ దార్శనికత
భారత ప్రధాని నరేంద్రమోదీ 14 ఏప్రిల్, 2018న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ జయంతి రోజున ‘ఆయుష్మాన్ భారత్’ అనే పథకాన్ని ప్రకటించారు. 25 సెప్టెంబర్, 2018 తేదీన పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. 2022 నాటికి అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చదిద్దడమే దీని ముఖ్యలక్ష్యం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1,50,000 ‘వెల్నెస్ సెంటర్లు’ ఏర్పాటు కానున్నాయి. ఇవి సమగ్ర ఆరోగ్య సంరక్షణ కల్పించడంతో బాటు రోగులకు ఔషధాలు అందిస్తూ విశ్లేషణ సేవలు అందించడానికి బాధ్యత వహిస్తాయి. వీటి ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వం రూ. 1,200 కోట్లు కేటాయించింది. తద్వారా దేశవ్యాప్తంగా ‘ఆరోగ్య అవస్థాపన’ పెద్ద ఎత్తున సామాన్య గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ‘జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం’ కోసం 10 కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు రూ. 10,500 కోట్లను మోదీ ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గం ద్వారా మంజూరు చేసింది. అర్హులైన పేద ప్రజలు వైద్యం కోసం ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండానే వారికి కూత వేటు దూరంలోనే ఈ ‘వెల్నెస్ సెంటర్లు’ ఏర్పాటవుతాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారితోపాటు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాల వారు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు. ఒకవైపు ఉన్నత వర్గాలవారు, ఆర్థికంగా అవకాశం ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉండగా, మరోవైపు పేదవర్గాల వారు కనీసం మందులు కూడా కొనే స్థితిలో లేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో తక్షణంగా ప్రజలు ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడానికి అవసరమైన డబ్బును కేటాయించడం, ఆ తరువాత జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని బలోపేతం చేసి, వాటి ద్వారా పూర్తి స్థాయిలో సేవలను వినియోగించుకునే విధంగా చేయడం రెండవ కర్తవ్యంగా చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వైద్యసహాయం కల్పిస్తూ దేశవ్యాప్తంగా పది కోట్ల కుటుంబాలకు సహాయం అందించనుంది. ఈ పథకం ప్రకారం 2018 నుంచి ప్రారంభించి 2022లో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి. లబ్ధిదారుడు ప్రతి సంవత్సరం ఈ పథకంలో కట్టాల్సిన ప్రీమియం రూ. 2,000ల్లో కేంద్ర ప్రభుత్వం 60% అంటే రూ. 1,200లు, రాష్ట్రాలు 40 శాతం అంటే రూ. 800లు భరిస్తాయి. కానీ, ప్రజలకు మేలు చేసే ఈ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరకపోవడం బాధాకరం. ప్రస్తుతం మెడిక్లెయిం పాలసీలో 5 లక్షల రూపాయల వైద్య బీమా ప«థకానికి వినియోగదారుడు సుమారు 10 వేల రూపాయల ప్రీమియం చెల్లిస్తుండగా, ‘ఆయుష్మాన్ భారత్’ ప«థకం ద్వారా విని యోగదారుడు 80% ఆదా చేసుకుంటూ కేవలం రూ. 2,000లు చెల్లించి కుటుంబం సభ్యులందరికీ వైద్య బీమా సదుపాయం పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి ఏటా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఒక కుటుంబానికి సంవత్సరానికి 3 లక్షల రూపాయల వరకు మాత్రమే బిల్లు చెల్లిస్తున్నారు. కానీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో కుటుంబానికి 5 లక్షల రూపాయలు వైద్య ఖర్చులను చెల్లిస్తారు. రాష్ట్రంలోని మెుత్తం 80 లక్షల కుటుంబాలకు ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అమలు చేసినా సంవత్సరానికి 640 కోట్ల రూపాయలే ఖర్చు అవుతుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 70 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో చేరి ఆరోగ్య తెలంగాణను త్వరలో నిర్మించవచ్చు. ప్రతి వ్యక్తి జీవితం విలువైనదని బీజేపీ భావి స్తుంది, ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకొని దగ్గరలోని ఆస్పత్రిలో చేర్చాలనేది బీజేపీ సంకల్పం. రాబోయే నాలుగేళ్ల (2022 కల్లా)లో బాధలు లేని తెలంగాణను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2018 జనవరి ‘అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన’లో నేను ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ కార్యక్రమం కింద స్వయం ఉపాధి కోసం 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో సంప్రదాయ చికిత్సలైన (1) ఆయుర్వేద, (2) హోమియోపతి, (3) యునాని, (4) యోగా, (5 ) ప్రకృతి చికిత్స, (6) సిద్ధ చికిత్స పద్ధతితో పాటు ఇతర వ్యక్తిగత, సామూహిక సాంప్రదాయ చికిత్సలకు ప్రోత్సాహాన్నిచ్చి ఆరోగ్య, సిరి సంపదలను సృష్టిస్తాము. వ్యాసకర్త : ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ -
రెండోసారి చికిత్సకు ఆధార్ ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(ఏబీ పీఎంజేఏవై)లో చికిత్స పొందే వ్యక్తి మొదటిసారి చికిత్సకు వచ్చినప్పుడు ఆధార్ తప్పనిసరి కాదని, రెండోసారి చికిత్సకు వస్తే మాత్రం ఆధార్ కార్డు తప్పనిసరి అని నేషనల్ హెల్త్ ఏజెన్సీ సీఈవో ఇందు భూషణ్ ప్రకటించారు. మొదటిసారి చికిత్సకు మాత్రం ఆధార్ నెంబర్‌లేని పక్షంలో ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా ఆధారాలు చూపించాలని వారు తెలిపారు. మొదటిసారి చికిత్సకోసం ఆధార్ లేకపోతే ఎన్నికల గుర్తింపుకార్డు లాంటి ఆధారాలతో ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. -
‘ఆయుష్మాన్’ లబ్ధిదారులను గుర్తించండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య అభియాన్(ఏబీ–పీఎం–జేఏవై) కింద లబ్ధిదారులను గుర్తించాలని ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించే జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) రాష్ట్రాలను కోరింది. జిల్లా కలెక్టర్లకు, జిల్లా మేజిస్ట్రేట్లకు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ ఉత్తర్వులిచ్చింది. సామాజిక, ఆర్థిక, కుల గణన–2011లో లేని వారి పేర్లను ఆయుష్మాన్ భారత్ లబ్దిదారుల జాబితాలో చేర్చుతున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని 10.74 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించే ఈ పథకం సెప్టెంబర్ 23న మొదలైంది. -
నోబెల్ పురస్కారానికి మోదీ నామినెట్..!
సాక్షి, చెన్నై : భారత ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ రాష్ట్రా అధ్యక్షురాలు తమిళ్సై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆవిష్కరించిన మోదీకి నోబెల్ ఇవ్వాలని.. ఆ మేరకు ఆయన పేరును నోబెల్ కమిటీకి ఆమె నామినెట్ చేశారు. దీనికి దేశ ప్రజలు అందరూ మద్దతు తెలపాలని కోరారు. దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధాని ఆరోగ్య బీమా యోజనా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదే ఆదివారం రాంచీలో అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. దీన్ని ‘మోదీ కేర్’గా అభివర్ణిస్తున్న పాలకపక్షం, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమంటూ ప్రచారం చేస్తోంది. ఇంత పెద్ద పథకం ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలులో లేదని దానికి రూపకల్పన చేసిన మోదీకి అత్యున్నత పురస్కారం ఇవ్వాలని తమిళసై అన్నారు. కాగా ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేర్చనున్నారు. -
ధీమా లేని పీఎం ఆరోగ్య బీమా పథకం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పదివేల పేద కుటుంబాలు అంటే, 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధాని ఆరోగ్య బీమా యోజనా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదే ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. దీన్ని ‘మోదీ కేర్’గా అభివర్ణిస్తున్న పాలకపక్షం, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమంటూ విస్తృత ప్రచారం సాగిస్తున్నది. ఇది ఎలా ఉందంటే ‘ఆలు లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది. ఐదు లక్షల రూపాయల ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి బీమా కంపెనీలతోని, ఆ తర్వాత కార్పొరేట్ ఆస్పత్రులతోని ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంది. ఒక్క బీమా కంపెనీలతోనే చర్చలు జరపాలంటే ఆరు నెలల కాలం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఆ తర్వాత కార్పొరేట్ ఆస్పత్రులతో చర్చలు జరిపేందుకు మరికొంత సమయం పడుతుందనడంలో సందేహం లేదు. ఐదు లక్షల బీమాకు 1.082 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రీమియంగా నిర్ణయించింది. ఏ బీమా కంపెనీ కూడా ఇంత తక్కువ ప్రీమియంను అంగీకరించే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కనీసం 1,765 రూపాయలకు పెంచాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు. అలా పెరిగే ప్రీమియం భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో 60 శాతం ఆర్థిక భారాన్ని కేంద్రం భరించాలని, 40 శాతం భారాన్ని రాష్ట్రాలు భరించాలని కేంద్రం మార్గదర్శకాల్లో నిర్ణయించింది. అలాంటప్పుడు గొప్ప కేంద్ర పథకంగా ఆరోగ్య బీమాను ప్రచారం చేసుకోవడంలో అర్థం ఉందా? లక్ష కోట్లకు రెండు వేల కోట్లకు తేడా ఎంత? పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏటా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఈ పథకం కింద ఈ ఏడాది బడ్టెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేవలం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. మిగతా 98 వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? వాస్తవానికి 2016లో బడ్జెట్ ప్రవేశ పెడుతూ అరుణ్ జైట్లీ పేద ప్రజల కోసం 1.5 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకం కార్యరూపం దాల్చనే లేదు. ఇప్పుడు ప్రధాని ఆరోగ్య బీమా యోజన అంటూ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎన్నో చిక్కు ముడులున్న ఈ పథకాన్ని అమలు చేస్తారని ప్రజలు ఎలా విశ్వసించాలి? 25 కోట్లకుగాను 3.6 కోట్ల మందికే... 2008 సంవత్సరం నుంచే కేంద్రం పేద ప్రజల కోసం ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి 30వేల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని కల్సిస్తున్న ఈ పథకానికి 750 రూపాయలను ప్రీమియంగా నిర్ణయించారు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఐదు లక్షల రూపాయల బీమాకు ప్రీమియం ఎన్ని వేలవుతుందో ఊహించవచ్చు. మరి అలాంటప్పుడు వెయ్యి రూపాయల ప్రీమియంను ఏ బీమా కంపెనీ అంగీకరిస్తుంది? పెంచితే అది ఎవరికి లాభం? 25 కోట్ల మందిని లక్ష్యంగా పెట్టుకొని స్వాస్థ్య బీమాను అమలు చేస్తుండగా, ఇన్నేళ్లకు కూడా లబ్ధిదారుల సంఖ్య 3.6 కోట్లకు దాటలేదు. ఇప్పుడు 50 కోట్లకు లక్ష్యంగా పెట్టుకుంటే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు? ఈ స్కీమ్‌ను అభివృద్ధి చేయాల్సిన కేంద్రం కొత్త స్కీమ్‌ను ప్రకటించడంలో ఉద్దేశం ఏమిటీ? కార్పొరేట్ ఆస్పత్రుల కోసమే ఉత్తరాదిలో కార్పొరేట్ ఆస్పత్రులు అంతగా విస్తరించ లేదు. ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలే అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఇటు దక్షణాదిలో కూడా కార్పొరేట్ ఆస్పత్రులు నగరాలకు, పట్టణాలకే పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లేదు. ఈ కారణంగా కార్పొరేట్ ఆస్పత్రి రంగాన్ని ప్రోత్సహించడం కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని బెంగళూరులోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ వ్యవస్థాపకులు, డైరెక్టర్ ఎన్. దేవదాసన్ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. తమిళనాడు లక్ష రూపాయలు, రెండు లక్షల రూపాయల బీమాతో రెండు పథకాలను సమర్థంగా అమలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రెండు లక్షల రూపాయలతో ‘ఆరోగ్య శ్రీ’ పథకాలను బాగానే అమలు చేస్తున్నాయి. అందుకే ఈ రాష్ట్రాలు కేంద్రం కొత్త పథకంలో చేరేందుకు సుముఖంగా లేవు. మూడు లక్షల రూపాయలతోనే ఆరోగ్య బీమా పథకాన్ని ఎంతో సమర్థంగా అమలు చేయవచ్చని వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీలు లాంటి వ్యాధులకు ఐదు లక్షల రూపాయలకుపైగా ఖర్చు అవుతాయి. ఆ పైన అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలాగా మరో స్కీమ్‌ను తీసుకరావచ్చని వారు చెబుతున్నారు. ఐదు లక్షల రూపాయలతో ఒకే బీమా పథకం అంటే కచ్చితంగా అది కార్పొరేట్ ఆస్పత్రులకే మేలు చేస్తోందని, అనవసరైన ఆరోగ్య పరీక్షలకు, చికిత్సలకు అది దోహదపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 2011లో బిహార్‌లో ఆరోగ్య బీమా ఉందన్న కారణంగా 700 మంది మహిళలకు అనవసరంగా కార్పొరేట్ ఆస్పత్రులు శస్త్ర చికిత్సలు చేసి వారి గర్భసంచులను తొలగించడం తెల్సిందే. లక్ష కోట్లు ఎలా తెస్తారు? దేశంలో మొత్తం ఆరోగ్య రంగానికి 2017–18 ఆర్థిక సంవత్సరానికి 48,878 కోట్ల రూపాయలను కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ కేటాయింపులు 53,198 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరానికి అదే ఆరోగ్య రంగానికి 54,667 కోట్ల రూపాయలను కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 11.8 శాతం, సవరించిన బడ్జెట్ అంచనాలతో పోలిస్తే కేటాయింపులు కేవలం 2.7 శాతం పెరిగాయి. జీడీపీతో కేటాయింపులను పోలిస్తే పెరగాల్సిన కేటాయింపులు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక్క పేదల బీమా కోసమే లక్ష కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రపంచంలోనే పెద్ద పథకం ఎలా అవుతుంది? మనకన్నా అధిక జనాభా కలిగిన చైనా తమ దేశ పౌరులందరికి ఐదు లక్షలు, పది లక్షలు అంటూ పరిమితి అనేది లేకుండా నూటికి నూరు శాతం (ఎంత ఖర్చయితే అంత) ఆరోగ్య బీమాను అమలు చేస్తోంది. అప్పుడు అది పెద్ద స్కీమ్ అవుతుందా? మనది పెద్ద స్కీమ్ అవుతుందా? పేదలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, తాను మాత్రం అలా కాదని పథకం ప్రారంభోత్సవంలో మోదీ చెప్పుకున్నారు. ఇంత తాత్సారంతో, ఈ దశలో గ్రౌండ్ వర్క్ పెద్దగా లేకుండానే ఈ ఆరోగ్య బీమా పథకాన్ని తెచ్చారంటే ఏమనుకోవాలి? 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై దృష్టితో కాదా?! -
‘ఆయుష్మాన్ భారత్’ను వద్దంటున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ : దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అమలవుతోన్న ఈ పథకం 5 బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అమలుకావడం లేదు. తెలంగాణ, ఢిల్లీ, ఒడిషా, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు తమ సొంత హెల్త్ స్కీమ్‌ను అనుసరిస్తున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ భారతం కంటే కూడా తమ అమలుచేస్తోన్న హెల్త్ స్కీం ఎంతో బాగున్నట్లు ఆయా రాష్ట్రాలు భావిస్తున్నట్లు సమాచారం. దీని గురించి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పథకం కన్నా తాము రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందని, ఆయుష్మాన్ భారత్ నిబంధనలు కఠినంగా ఉన్నందున రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గే ప్రమాదముందని వివరించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంతో పటిష్టంగా అమలవుతోందని, కాబట్టి కేంద్ర పథకంలో చేరబోమని, ఒకవేళ రాష్ట్రానికి అనుగుణంగా మార్పులు చేస్తే పరిశీలిస్తామని తెలిపింది. మిగతా రాష్ట్రాలు కూడా తమ తమ అభ్యంతరాలను తెలిపినట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని మోదీ పేదల పాలిట సంజీవనిగా వర్ణిస్తుండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీన్ని ఓ పీఆర్ ఎక్సర్సైజ్ కార్యక్రమం అంటూ విమర్శించారు. -
ఇక ఆయుష్మాన్ భారతం
రాంచి: దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని.. పేదల సేవకు ఉద్దేశించిన పథకాల్లో ఇది అత్యంత ప్రభావవంతమైందని పేర్కొన్నారు. ఆదివారం నుంచే ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ‘పీఎంజేఏవై – ఆయుష్మాన్ భారత్ పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం. ఈ పథకం ద్వారా భారత్‌లో లబ్ధిపొందేవారి జనాభా.. అమెరికా, కెనడా, మెక్సికోల జనాభా మొత్తంతో సమానం’ అని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వాలు పేదలకు సాధికారత కల్పించకుండా.. వారిని ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, జార్ఖండ్ సీఎం రఘువీర్ దాస్, గవర్నర్ ద్రౌపది ముర్ము తదితరులు పాల్గొన్నారు. సేవ చేసేందుకు అవకాశంగా.. ‘ప్రజలు ఈ పథకాన్ని మోదీ కేర్ అని, ఇంకా వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారు. కానీ మేం మాత్రం దీన్ని పేదలకు సేవ చేసేందుకు మరో అవకాశంగా భావిస్తున్నాం. సమాజంలో బడుగు, బలహీన వర్గాలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేయడంలో సహకరించే ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. అధికారులందరికీ.. 50 కోట్ల మంది లబ్ధిదారుల ఆశీస్సులు అందుతాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెండో, మూడో తరగతి నగరాల్లో 2,500 ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయన్నారు. ‘ఇప్పటికే 13వేల ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగమయ్యాయి. మా ప్రభుత్వం పేదలకు వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు సమగ్రమైన విధానంతో ముందుకెళ్తోంది’ అని ఆయన తెలిపారు. ‘గరీబీ హఠావో నినాదాన్ని వింటూనే వస్తున్నాం. ఇది పేదలను మోసం చేసే కార్యక్రమం మాత్రమే. అప్పటినుంచే సంక్షేమ పథకాలు సరిగ్గా అమలుచేసి ఉంటే.. నేటికి దేశం మరింత అభివృద్ధి చెంది ఉండేది. నేను పేదరికంలోనే పెరిగాను. పేదరికాన్ని చూశాను. బీజేపీ ఒక్కటే పేదలకు న్యాయం చేస్తోంది. సాధికారత కల్పిస్తోంది’ అని పేర్కొన్నారు. వైద్యశాలలు ఖాళీగానే ఉండాలి ‘ఎవరైనా ఆసుపత్రులకు వెళ్లే అవసరం రావొద్దనే దేవుడిని ప్రార్థిస్తాను. కానీ ఒకవేళ పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సివస్తే.. ఆయుష్మాన్ కవర్ వారికి సేవచేస్తుంది. ధనికులు అనుభవిస్తున్న వసతులను.. నాదేశ పేదలు కూడా అందుకోవాలనేదే ఈ పథకం ఉద్దేశం. కుల, మతాలకు అతీతంగా ఈ పథకాన్ని అమలుచేస్తాం. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాం’ అని మోదీ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఈ పథకం ఓ ఉదాహరణలా మిగిలిపోతుందన్నారు. రాంచీ ప్రభాత్ తారా మైదానంలో జరిగిన కార్యక్రమంలో కొందరు లబ్ధిదారులకు ఆయన హెల్త్ కార్డులు అందజేశారు. అనంతరం చాయ్‌బాసా, కోడర్మాల్లోని వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు. 15 కొత్త ఎయిమ్స్‌లు వైద్య సేవల మెరుగు కోసం దేశ్యవాప్తంగా 15 కొత్త ఎయిమ్స్‌లకు ఆమోదం తెలిపామన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎయిమ్స్‌ను నిర్మిస్తామని ఆయన చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో దేశవ్యాప్తంగా లక్ష మంది వైద్యులకు శిక్షణనిచ్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జార్ఖండ్‌లో 10 వెల్నెస్ సెంటర్లను మోదీ ప్రారంభించారు. ‘జార్ఖండ్‌లో వెల్నెస్ కేంద్రాలు 40కి చేరాయి. దేశవ్యాప్తంగా మొత్తం 2,300 సెంటర్లు పనిచేస్తున్నాయి. వచ్చే నాలుగైదేళ్లలో ఈ సంఖ్యను 1.5లక్షలకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ వెల్నెస్ కేంద్రాలు క్షయ, కేన్సర్, మధుమేహం వంటి వ్యాధుల విషయంలో నివారణోపాయాలను సూచిస్తాయి. పథకం ప్రత్యేకతలివి.. ► సమాజంలో పదికోట్ల వెనుకబడిన కుటుంబాల్లోని దాదాపు 50 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వస్తారు. ► ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. అయితే లబ్ధిదారుడిగా నమోదు చేయించుకునేందుకు ఎన్నికల గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించాలి. ► గ్రామాలు, పట్టణాల్లో జరిపిన తాజా సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) ఆధారంగా డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7 కేటగిరీల్లో ఉన్నవారు లబ్ధిదారులవుతారు. ఎస్ఈసీసీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణాల్లో 2.33 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని పొందవచ్చు. ► ఇప్పటికే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో భాగంగా ఉన్నవారినీ ఆయుష్మాన్‌తో జోడిస్తారు. దేశవ్యాప్తంగా 445 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమైంది. ► ఈ పథకంలో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, మోకాలిచిప్ప మార్పిడులు, మధుమేహం సహా 1,300కు పైగా వ్యాధులు వర్తిస్తాయి. ► ఒక కుటుంబంలో ఇంతమందికే అన్న నిబంధనేమీ లేదు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు క్యాష్‌లెస్, పేపర్‌లెస్ వైద్యాన్ని అందజేస్తారు. ► ఈ పథకంలో లబ్ధిదారులు ఆసుపత్రి పాలైతే.. చికిత్స కోసం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం సూచించిన లేదా.. పథకం జాబితాలో ఉన్న ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి. ► ఇలాంటి ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్‌ల్లో సరైన గుర్తింపుకార్డులు చూపించాలి. ► పథకం అమలును పర్యవేక్షించే నేషనల్ హెల్త్ ఏజెన్సీ (ఎన్హెచ్ఏ) ఝ్ఛట్చ.pఝ్జ్చy.జౌఠి.జీn సైట్‌ను, 14555 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించింది. ► లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఉన్న లేఖలు ఇస్తారు. వీటిని చూపించి వైద్యం చేయించుకోవాలి. ► ఇప్పటికే 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు మాత్రం ఒప్పందంపై సంతకాలు చేయలేదు. -
‘ఆయుష్మాన్ భారత్’లో చేరబోం: తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలనుకోవడం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. కేంద్ర పథకం కన్నా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందని, ఆయుష్మాన్ భారత్ నిబంధనలు కఠినంగా ఉన్నందున రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గే ప్రమాదముందని వివరించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంతో పటిష్టంగా అమలవుతోందని, కాబట్టి కేంద్ర పథకంలో చేరబోమని, ఒకవేళ రాష్ట్రానికి అనుగుణంగా మార్పులు చేస్తే పరిశీలిస్తామని తెలిపింది. 20 లక్షల కుటుంబాలకే లబ్ధి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఆధారంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా చెబుతున్న ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో దారిద్య్రరేఖకు దిగువనున్న 10.74 కోట్ల కుటుంబాలకు (50 కోట్ల మందికి) ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని కేంద్రం పేర్కొంది.ఆయుష్మాన్ భారత్‌కు అర్హుల గుర్తింపులో కఠిన నిబంధనలున్నాయి. ఆరోగ్యశ్రీలో తెల్లరేషన్ కార్డు ఉన్నవారంతా పథకానికి అర్హులే. రాష్ట్రంలో 77 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతుండగా, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 20 లక్షల కుటుంబాలే అర్హత పొందుతాయి. బైకున్నా.. బోటున్నా అనర్హులే! ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా, ల్యాండ్ ఫోన్ ఉన్నా ఆ కుటుంబానికి ఆయుష్మాన్ వర్తించదని కేంద్ర నిబంధనలు చెబుతున్నాయి. కుటుంబంలో ఒకరు నెలకు రూ.10 వేలకు మించి సంపాదిస్తున్నా, రెండు చక్రాల బండి ఉన్నా, చేపలు పట్టే బోటున్నా పథకం వర్తించదు. రెండున్నర ఎకరాలకు మించి సాగునీటి వసతి ఉన్న వ్యవసాయ భూమి ఉన్నా పథకానికి అనర్హులు. ఇలా అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రం లేఖ రాసినా స్పందన లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల అనాసక్తి ఆయుష్మాన్ అమలుపై ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. ఆ పథకంలో చేర్చిన 1,354 చికిత్సల్లో 80 శాతానికి పైగా చికిత్సల ధరలు రాష్ట్రంలోని ధరల కన్నా తక్కువే అంటున్నారు. కొన్ని ధరలే రాష్ట్ర పథకాల కన్నా ఎక్కువున్నాయని చెబుతున్నారు. 2014లో నిర్ణయించిన ఆరోగ్యశ్రీ ధరలనే పెంచాలని కార్పొరేట్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తుండగా.. ఆయుష్మాన్ భారత్‌లో అంతకన్నా తక్కువ ధరలు నిర్ణయిస్తే ఎలా గిట్టుబాటు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ‘ఆయుష్మాన్’కింద రూ.280 కోట్లే.. ఆరోగ్యశ్రీతో రాష్ట్ర ప్రభుత్వానికి పేరొచ్చింది. పైగా దాని కోసం ఏటా రూ.700 కోట్లకు పైగా కేటాయిస్తోంది. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి కేంద్రం రూ. 280 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో కలిపి ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తే ఆరోగ్యశ్రీ పేరు మరుగునపడుతుంది. అంతా తామే చేస్తున్నామని కేంద్రం చెప్పుకునే అవకాశముంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుందని రాష్ట్ర సర్కారు భావనగా చెబుతున్నారు. కొందరు ఆయుష్మాన్ భారత్‌లో చేరితే నిధులొస్తాయని, ఆ మేరకు ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని, పేరును దెబ్బతీసేలా ఉంటే కేంద్ర పథకంలో చేరబోమని ఓ వైద్యాధికారి పేర్కొన్నారు. -
ఆయుష్మాన్ భారత్‌కు శ్రీకారం
-
ఆయుష్మాన్ భారత్‌కు శ్రీకారం
రాంచీ : దేశంలో నిరుపేదలకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖఃడ్ రాజధాని రాంచీలో ఆదివారం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ తరహా భారీ హెల్త్‌కేర్ కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని అమలు చేయగలిగిందని చెప్పారు. దేశంలో 50 కోట్ల మంది పేదల ఆశీస్సులతో అధికారుల బృందం రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేరాయన్నారు. గరీబీ హఠావో అని నినదించిన నేతలు నిజానికి పేదల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని విమర్శలు గుప్పించారు. పేదల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ వారి ఆత్మగౌరవాన్నీ విస్మరించిందన్నారు. తప్పుడు హామీలతో పేదలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. కుల, మత విచక్షణ లేకుండా అందరికీ అభివృద్ధి అందాలనే ఉద్దేశంతోనే ఆయుష్మాన్ భారత్‌కు శ్రీకారం చుట్టామన్నారు. -
ఆరోగ్య బీమా నేడు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోని 10.74 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)ను ప్రధాని మోదీ నేడు జార్ఖండ్‌లో ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లోని 2.33 కోట్ల కుటుంబాలు వెరసి దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. తొలుత ఈ పథకానికి ఆయుష్మాన్ భారత్–జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్(ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం)గా నామకరణం చేసినప్పటికీ, ఆ తర్వాత పీఎంజేఏవైగా పేరు మార్చారు. ఈ పథకానికి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకరించాయనీ, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు పీఎంజేఏవై అమలుకు ముందుకు రాలేదన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు గుర్తింపు పత్రంగా ఆధార్ లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. ఈ పథకంలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు mera.pmjay.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చనీ, లేదంటే టోల్‌ఫ్రీ నంబర్ 14555కు కాల్ చేయవచ్చని వెల్లడించారు. -
23న ‘ఆయుష్మాన్ భారత్’
రాంచీ/న్యూఢిల్లీ: ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఈ నెల 23న ప్రధాని మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జార్ఖండ్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖండ్ నుంచి ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించడం మాకు గర్వకారణం’ అని జార్ఖండ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని 3.25 కోట్ల మంది ప్రజలతో సహా భారతీయులంతా ఈ చారిత్రక సందర్భం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చైనా పర్యటనలో ఉన్న జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 23న ఈ కార్యక్రమం సందర్భంగా.. కోడర్మాలో మెడికల్ కాలేజీకి, చాయ్‌బాసాలో కేన్సర్ ఆసుపత్రికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బిర్సాముండా జైలు పునరుద్ధరణ పనులనూ మోదీ ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ భారత్ భేష్! కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 50 కోట్ల మంది పేదలకు (10కోట్ల కుటుంబాలకు) ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవ భేష్ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అభినందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని.. ప్రధాని చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘సార్వత్రిక ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప మార్పుకు సంకేతం. ప్రధానికి కృతజ్ఞతలు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు’ అని టెడ్రోస్ గురువారం ీæ్వట్ చేశారు. డబ్ల్యూహెచ్‌వో డీజీకి కేంద్ర మంత్రి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ అందరికీ అందాలనేదే మోదీ లక్ష్యమన్నారు. ‘డాక్టర్ టెడ్రోస్ మీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలని మోదీ సంకల్పించారు. 50 కోట్ల మందికి (అమెరికా, కేనడా, మెక్సికో దేశాల జనాభా కలిపితే) ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుంది’ అని నడ్డా ట్వీట్ చేశారు. -
అరుదైన ఘనత సాధించిన కరిష్మా
చంఢీఘర్ : మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఆయుష్మాన్ భారత్’ ఫలితాలను పొందిన తొలి వ్యక్తిగా 18 రోజులు నిండిన కరిష్మా గుర్తింపు పొందింది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా చెప్పిన రెండు రోజులకే అనగా ఆగస్టు 17న హరియాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా, కల్పనా చావ్లా ఆస్పత్రిలో జన్మించిన కరిష్మా ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద 9 వేల రూపాయల నగదుతో పాటు వ్యాక్సిన్లను ఉచితంగా పొందింది. ఈ నగదును అధికారులు ఆమె తల్లిదండ్రులకు అందించారు. ఈ విషయాన్ని ‘ఆయుష్మాన్ భారత్’ డిప్యూటీ సీఈవో డాక్టర్ దినేష్ అరోరా తన ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం ఈ నెల 25 ప్రారంభమవ్వాల్సిన ఉన్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఓ 105 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ముందుగానే ప్రారంభించారు. అందులో భాగంగా హరియాణాలోని ఓ 26 ఆస్పత్రులను ఈ పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఎన్నుకున్నారు. వాటిలో కరిష్మా జన్మించిన కల్పనా చావ్లా ఆస్పత్రి కూడా ఉండటంతో సదరు చిన్నారి అందరి కంటే ముందే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రయోజానాన్ని పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. ‘ఆయుష్మాన్ భారత్’, ‘మోదీ కేర్’, ‘పీఎమ్‌జా’గా పిలవబడే ఈ పథకం సెప్టెంబర్ 25న దీన్ దయాళ్ పండిట్ జయంతి సందర్భంగా దేశమంతటా అమల్లోకి రానుంది. దేశంలోని పది కోట్ల కుటుంబాలకు, అంటే 50 కోట్ల మందికి ఈ పథకం వలకల లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. -
‘ఆయుష్మాన్ భారత్’తో కార్పొరేట్ వైద్యం
చిత్తూరు అర్బన్:ఈనెల 15న ప్రారంభం కావాల్సిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే నెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రధా ని మోదీ ఇటీవల ప్రకటించారు. దీనికి ఎవరు అర్హులు, పథక ఉద్దేశం ఏమిటని చాలా మందికి తెలియడం లేదు. పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారికోసం మాత్రమే ఉద్దేశించింది కాబట్టి అందరూ అర్హులు కాదు. మోదీ కేర్‌గా కూడా వ్యవహరిస్తున్న ఈ పథకంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.5లక్షల వరకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వైద్య సహాయం పొందవచ్చు. దేశంలో 10.74 కోట్ల కుటుంబాలకు (సుమారు 50 కోట్ల మందికి) మోదీ కేర్ వర్తిస్తుందని ప్రభుత్వం చెబు తోంది. జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి న యంత్రాంగం తొలిగా 7 లక్షల మందిని ఈ పథకానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దశలవారీగా అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. పథక లక్ష్యం... ⇔ ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా ⇔ సామాజిక ఆర్థిక కులగణన ఆధారంగా అర్హత ఆధారపడి ఉంటుంది ⇔ ప్రభుత్వాస్పత్రి లేదా ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు ⇔ ప్రారంభమైన మొదటి రోజు నుంచే అన్ని వ్యాధులకూ వర్తిస్తుంది ⇔ ఏదైనా వ్యాధితో ఒకసారి చికిత్సపొందితే మళ్లీ చికిత్స కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు ⇔ ఆధార్‌కార్డు తప్పనిసరి కాదు. నిర్దేశించిన గుర్తింపు ధ్రువీకరణ ఉండాలి వీళ్లు అర్హులు.. ⇔ గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా గోడలు, కచ్చా పైకప్పుతో ఒకే గదిలో నివాసముంటున్న కుటుంబాలు ⇔ 16 నుంచి 59 ఏళ్ల వయోజనులు లేని కుటుంబాలు ⇔ 16 నుంచి 59 ఏళ్ల లోపు పురుషులు లేని మహిళ కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు ⇔ దివ్యాంగులైన సభ్యుడు ఉన్న కుటుంబాలు, శరీర సామర్థ్యం గల వయోజనులు ఒక్కరూ లేని కుటుంబాలు ⇔ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ⇔ రోజూవారీ కూలిపై ఆధారపడిన భూమిలేని కుటుంబాలు ⇔ అనాథలు, యాచకులు ⇔ చేతితో పారిశుద్ధ్య (స్కావెంజర్) పనిచేసే కుటుంబాలు ⇔ ఆదిమ గిరిజన వర్గాలు ⇔ చట్టబద్ధంగా వెట్టిచాకిరి నుంచి విముక్తులైన వారు పట్టణ ప్రాంతాల్లో... ⇔ చెత్త ఏరుకుని బతికేవారు, యాచకులు ⇔ ఇళ్లల్లో పనిచేసే వాళ్లు ⇔ వీధుల్లో తిరిగి వస్తువులు అమ్మేవారు, చర్మకారులు, వీధుల్లో ఉండి పనిచేసేవారు. ⇔ నిర్మాణ కార్మికులు, ప్లంబర్, మేస్త్రీ, పెయింటర్, వెల్డర్, సెక్యూరిటీ గార్డు, కూలీ, బరువులు మోసే కార్మికులు ⇔ స్వీపర్, పారిశుధ్య కార్మికుడు, తోటమాలి ⇔ చేతివృత్తి కార్మికులు, టైలర్లు, ఇంటి వద్ద ఉండి పనిచేసుకునే వారు ⇔ రవాణా కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, సహా యకులు, తోపుడు బండి రిక్షా కార్మికులు ⇔ దుకాణాల్లో పనిచేసేవారు, సహాయకులు, చిన్న సంస్థల్లో ప్యూన్లు, అటెండర్లు, వెయిటర్లు ⇔ ఎలక్ట్రీషియన్లు, మెకానిక్, అసెంబ్లర్, మరమ్మతు కార్మికుడు. ⇔ రజకులు, కాపలాదారులు -
‘పీఎంజా’ ఆయుష్మాన్ భవ!
సాక్షి, న్యూఢిల్లీ: మొన్న ‘ఆయుష్మాన్ భారత్’, నిన్న ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ‘నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్’, నేడు ‘ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్’ ఇలా పేర్లు మార్చుకుంటున్న పేద ప్రజల ఐదు లక్షల జాతీయ ఆరోగ్య భీమా పథకం సెప్టెంబర్ 25వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎర్ర కోట వేదిక నుంచే ప్రకటించారు. దేశంలోని పది కోట్ల కుటుంబాలకు, అంటే 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న ఈ పథకం అమలుపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల భారీ మొత్తాన్ని భీమాగా నిర్ణయించడం ఒక్కటయితే, దాన్ని ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించాలా? అన్న ప్రభుత్వ సంశయంపై ఈ అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. 2016లో ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ పేద ప్రజల కోసం లక్ష రూపాయల ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. అదే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018లో వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతూ ఐదు లక్షల రూపాయల భీమాతో కొత్తగా ప్రధాన మంత్రి ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించారు. ఎన్నికలకు ఏడాది ముందు ఈ పథకాన్ని తీసుకరావడం పట్ల పథకం పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఎంత ? అన్నది ఒక్క అనుమానమైతే, 2009 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ స్వస్త్ భీమా యోజన’ పథకాన్ని చిత్తశుద్ధితో మోదీ ప్రభుత్వం అమలు చేయక పోవడం ఆ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది. 25 కోట్ల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని కుటుంబానికి 30 వేల ఆరోగ్య భీమాను కల్పిస్తూ నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాష్ట్రీయ స్వస్త్ భీమా యోజన’ పథకంలో 3.6 కోట్ల మంది పేద ప్రజలు మాత్రమే స్కీమ్‌లో చేరారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంఘం ప్రశంసలు అందుకున్న ఈ స్కీమ్ ఇప్పుడు మంచం పట్టింది. ఈ స్కీమ్‌ను ఉపయోగించుకొని అటు ప్రైవేటు భీమా కంపెనీలు, కార్పొరేట్ ఆస్పత్రులు లాభ పడుతూ వస్తున్నాయి తప్పా, పేదలకు ఆరోగ్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఈ పథకానికి కేంద్రం 75 శాతం నిధులు సమకూరుస్తుండగా, 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఇప్పుడు ‘ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్’లో 60 శాతం నిధులను కేంద్రం సమకూరుస్తుండగా, 40 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సొంతంగా పేదల కోసం ఆరోగ్య భీమా స్కీమ్‌లను అమలు చేస్తున్నాయి. వాటిలో కర్ణాటకలో ‘వాజపేయి ఆరోగ్య శ్రీ, తెలుగు రాష్ట్రాలో రాజీవ్ ఆరోగ్య శ్రీ, తమిళనాడులో ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య భీమా పథకాలు సవ్యంగానే అమలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహానికి పోటీగా పంధ్రాగస్టు రోజునే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్కాయక్ పేదల కోసం ఐదు లక్షల రూపాయల భీమాతో ‘బిజూ పట్నాయక్ ఆరోగ్య భీమా పథకం’ను ప్రకటించారు. ఆ రాష్ట్ర జనాభాలోని 70 శాతం మంది, అంటే 70 లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య స్కీమ్‌లను కూడా సమీక్షించి కేంద్రం రాష్ట్రాలతో కలిసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సమగ్ర ఆరోగ్య స్కీమ్‌ను తీసుకరావడం మంచిదని ఎప్పటి నుంచో ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. ప్రైవేటు భీమా కంపెనీలకు ఆరోగ్య భీమా కింద డబ్బులను కట్టబెట్టడంకన్నా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను అభివృద్ధి చేయడం అవసరమని కూడా వారు చెబుతూ వస్తున్నారు. నరేంద్ర మోదీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలనుకుంటే ప్రైవేటు భీమా కంపెనీలకు కాకుండా ప్రభుత్వ ట్రస్టుల ఆధ్వర్యంలో అమలు చేయడం మంచిదని జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంద్రానిల్ ముఖో«పాద్యాయ్, నేషనల్ హెల్త్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇందూ భూషణ్‌లు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మోదీ ప్రకటించిన ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ 28 రాష్ట్రాలు సంతకాలు చేయగా, వాటిలో 23 రాష్ట్రాలు భీమా కంపెనీలను వ్యతిరేకిస్తూ ట్రస్టీల వైపు మొగ్గు చూపడం విశేషం. కాకపోతే ఎక్కువ రాష్ట్రాలు స్వచ్ఛంద ట్రస్టుల వైపు మొగ్గు చూపడం విచారకరం. పథకాలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టడం, వాటిని క్లుప్త పదంలో పిలవడం కూడా ముచ్చటగా ఉండాలని మోజుపడే మోదీ, ఆరోగ్య పథకానికి కూడా ‘పీఎమ్‌జా (పీఎంజెఏఏ)’ క్లుప్త పదం వచ్చేలా చూశారు. పీఎమ్‌జా కాస్త అబెఛా! కాకుండా చూసుకోవాలన్నదే ప్రజల కోరిక. చదవండి: ఎవరి ఆరోగ్యం కోసం ఈ స్కీమ్ -
ఆయుష్మాన్ భారత్‌తో ప్రజలకు మేలు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్రం అమల్లోకి తెస్తున్న పథకం తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద హెల్త్ స్కీం అని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవుతున్న తరుణంలో దీంతో ప్రజలకు ఎంతో మేలు కలగనుందన్నారు. ఆరోగ్యశ్రీలో రూ.2 లక్షల వైద్య సహాయమే ఉండగా, ఇందులో రూ.5 లక్షల వైద్య సహాయం అందుతుందని చెప్పారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేద ని వార్తలు వస్తున్నాయని తెలిపారు. కేంద్రం చేపట్టిన అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. -
సెప్టెంబర్ 25న ఆయుష్మాన్ భారత్
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికి ఇళ్లు, విద్యుత్, నీరు, వైద్యం, పారిశుద్ధ్యం తదితర వసతులు అందించే లక్ష్యంతో అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధిలో విదేశాలను అధిగమించగల సానుకూల మార్పు కోసం అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధాని చరిత్రాత్మక ఎర్రకోట వద్ద జెండా వందనం చేసి, అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మోదీ కాషాయ రంగు తలాపాగా ధరించి రావడం విశేషం. ప్రస్తుత ఎన్డీయే హయాంలో ఇదే ఆయనకు చివరి పంద్రాగస్టు ప్రసంగం కానుంది. తన ప్రసంగంలో.. తమ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తూనే.. మరోవైపు, ఎన్నికల ప్రసంగం తరహాలో విపక్షాలపై విమర్శనాస్త్రాలను కూడా మోదీ ఎక్కుపెట్టారు. పండిట్ దీన్‌దయాళ్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అలాగే, గగనయాన్ పథకంలో భాగంగా 2022 నాటికి అంతరిక్షంలోకి భారతీయుడిని పంపిస్తున్నామన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన విధానాన్ని త్వరలో ఆవిష్కరించనున్నామని తెలిపారు. అత్యాచార కేసుల్లో విధించిన శిక్షలను బాగా ప్రచారం చేయాలని, తద్వారా అలాంటి దుష్ట ఆలోచనలున్నవారిలో భయాందోళనలు కలిగించవచ్చని ప్రధాని సూచించారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మాజీ ప్రధాని వాజ్‌పేయి చూపిన ‘ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్’ మార్గాన్ని అనుసరిస్తామని అన్నారు. ఇకపై మహిళలను కూడా త్రివిధ దళాల్లో శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని ప్రకటించారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే చట్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్షాలే దానికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. దళితుల ప్రయోజనాల పరిరక్షణకు తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, త్రివిధ దళాల అధిపతులతో పాటు భారీగా ప్రజలు హాజరయ్యారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. అభివృద్ధిపై.. అభివృద్ధిలో మనకన్నా ముందున్న దేశాలను భారత్ అధిగమిస్తే చూడాలనే ఆత్రుతతో ఉన్నా. చిన్నారుల్లో పోషకాహార లోపం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వ ట్లేదు. పౌరులకు నాణ్యమైన, సౌఖ్యవంతమైన జీవితం, ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు తహతహలాడుతున్నా. నాలుగో తరం పారిశ్రామిక విప్లవాన్ని భారతే ముందుండి నడపాలని కోరుకుంటున్నా. ఆయుష్మాన్ భారత్‌పై.. 50 కోట్ల మంది భారతీయుల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజైన సెప్టెం బర్ 25న ప్రారంభిస్తాం. వ్యక్తి జబ్బున పడితే అతనొక్కడే కాదు కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఈ పథకంతో కొత్త ఆసుపత్రులు వస్తాయి. భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుంది. అత్యాచారాలపై..: దేశం ఇలాంటి నీచ మనస్తత్వాన్ని వదిలించుకోవాలి. సమన్యాయ పాలనే మనందరికీ శిరోధార్యం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అత్యాచార బాధితురాలి కన్నా సమాజమే లక్షల రెట్లు ఎక్కువ బాధపడాలి. ఉరిశిక్ష విధించిన రేప్ కేసులపై ప్రచారం చేస్తే అత్యాచారం చేయాలనుకునే ఆలోచన రాదు. రైతుల ఆదాయంపై..: సాగు ఎగుమతుల కొత్త విధానాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయాలన్న లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం సాగుతోంది. పంటల కనీస మద్దతు ధరను సాగు వ్యయానికి 1.5 రెట్లు పెంచడం కీలక నిర్ణయం. రికార్డుస్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతోంది. మన ధాన్యాగారాలు నిండిపోయాయి. ► నకిలీ లబ్ధిదారులు, మధ్యవర్తులను తొలగించి, పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెంచడం ద్వారా నాలుగేళ్లలో 90 వేల కోట్లను ఆదాచేశాం. ► ఈ నాలుగేళ్లలో మేము ఢిల్లీని ఈశాన్య రాష్ట్రాలకు చేరువచేశాం. ప్రపంచదేశాల దృష్టిలో.. ‘‘అంతర్జాతీయ సమాజంలో నేడు భారత్ గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. ఒకప్పుడు అనుమానంతో చూసిన వారే ఇప్పుడు మనవైపు ఆశతో చూస్తున్నారు. మనదేశంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత పాస్‌పోర్ట్ విలువ పెరగడం దేశ పౌరుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేసింది. గతంలో ‘రెడ్‌టేప్’ గురించి మాట్లాడిన అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ‘రెడ్ కార్పెట్’ గురించి చర్చిస్తోంది. ఒకప్పుడు బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఆకర్షించే స్థాయికెళ్లింది. నిద్రాణ స్థితిలో ఉన్న ఏనుగు లాంటి మన ఆర్థిక వ్యవస్థ మేల్కొని పరుగులు పెడుతోంది. వచ్చే మూడు దశాబ్దాలపాటు ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి భారతే ఇంజిన్ కానుంది’’ అని మోదీ అన్నారు. మోదీ సుదీర్ఘ ప్రసంగం 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరోసారి సుదీర్ఘంగా ప్రసంగించారు. గతేడాది ఆగస్టు 15 సందర్భంగా 57 నిమిషాల పాటు ప్రసంగించగా.. ఈసారి 80 నిమిషాలకుపైగా మాట్లాడారు. 2016లో అయితే మోదీ ఏకంగా 96 నిమిషాల పాటు మాట్లాడారు. దీంతో దేశ చరిత్రలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎక్కువసేపు మాట్లాడిన ప్రధానిగా రికార్డు సృష్టించారు. 2015 వరకూ ఆ రికార్డు నెహ్రూ (1947లో 72 నిమిషాలు) పేరిటే ఉండేది. పదేళ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రసంగం ఏనాడూ 50 నిమిషాలకు దాటలేదు. విద్యార్థుల ఉత్సాహం ఈ వేడుకల సందర్భంగా మోదీతో కరచాలనం చేసేందుకు స్కూలు పిల్లలు ఉత్సాహం చూపారు. ఎర్రకోటలో ప్రసంగం ముగిసిన అనంతరం మోదీ ప్రజలు అభివాదం చేస్తూ బయలుదేరారు. ఇంతలో జాతీయ జెండా రంగులున్న దుస్తులు ధరించి అక్కడికి వచ్చిన చిన్నారులను కలుసుకోవడం కోసం తన రక్షణ వలయం నుంచి బయటికొచ్చారు. చిన్నారుల తో కాసేపు ముచ్చటించారు. బాగా చదువుకోవాలని వారికి సూచించారు. సాక్షాత్తూ ప్రధాని దగ్గరకు రావడంతో చిన్నారులు ఆయనతో కరచాలనం కోసం పోటీపడ్డారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. మోదీ నోట భారతి మాట ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రముఖ తమి ళ కవి సుబ్రమణ్య భారతి రాసిన మాటల్ని ప్రస్తావించారు. ‘దేశ స్వాతంత్య్రానికి కొన్నేళ్ల ముందు భారతి భారత్ భవిష్యత్ ఎలా ఉం టుందో ఊహించారు. అన్ని రకాల బంధనాల నుంచి మనిషి విముక్తి పొందడం ఎలాగో భారత్ ప్రపంచానికి దారి చూపిస్తుందని ఆయ న చెప్పారు’ అని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆధునిక తమిళ సాహిత్యంలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన సుబ్రమణ్య భారతి 1882లో తమిళనాడులోని ఎట్టయాపురంలో జన్మించారు. ఆయన 1921లో కన్నుమూశారు. చెత్త కుప్పగా ఎర్రకోట స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట సాక్షిగా అధికారులు దేశ పరువును తీశారు. వేలాది మంది ప్రముఖులతో పాటు విదేశీ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రజల కోసం అధికారులు డస్ట్బిన్లను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆహార పదార్థాలను తిన్న ప్రజలు వాటిని అక్కడే వదిలేసి వెళ్లడంతో ఎర్రకోట ప్రాంగణమంతా చెత్త కుప్పలా తయారైంది. జాతీయ జెండా రంగుల్లోని దుస్తుల్లో ఇక్కడికొచ్చిన స్కూలు విద్యార్థులకు అరటి పళ్లను, మంచినీటిని అందించారు. కానీ చెత్తను పడేసేందుకు చిన్న అట్టపెట్టలను మాత్రమే అందుబాటులో ఉంచారు. అవి త్వరగా నిండిపోవడంతో మరో మార్గంలేక అరటితొక్కలు, ప్లాస్టిక్ బాటిళ్లను అక్కడే పడేశారు. కాషాయ రంగు తలపాగా ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా మోదీ ఈసారి కాషా య రంగు తలపాగా ధరించారు. ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన 2014లో ఎర్రకోట ప్రసంగం సందర్భంగా మోదీ.. కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న జోధ్‌పురి బందేజ్ సఫా తలపాగాను ధరించారు. 2015లో ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, మరుసటి ఏడాది ఎరుపు–గులాబీ– పసుపు వర్ణాలున్న తలపాగాను ఎంచుకున్నారు. గతేడాది తెలుపు, పసుపుపచ్చ, ఎరుపు రంగులున్న తలపాగాను మోదీ ధరించారు. పంద్రాగస్టు వేడుకల్లో విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తున్న మోదీ. ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన అమిత్ షా, రాహుల్ గాంధీ, నితిన్ గడ్కారీ తదితరులు. ఎర్రకోట వద్ద విధులు నిర్వర్తిస్తున్న ‘స్వాట్’ మహిళా సిబ్బంది