
భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నెన్నో పథకాలను (స్కీమ్స్) అందిస్తోంది. ఇందులో సీనియర్ సిటిజన్ల ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ 'ఆయుష్మాన్ భారత్' (Ayushman Bharat) కూడా ఉంది. దీని కవరేజికి మరింత విస్తరించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీని విస్తృతం చేయడానికి, ఆయుష్మాన్ వే వందన కార్డు (Ayushman Vay Vandana Card) అర్హత వయస్సును 70 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రతి కుటుంబానికి ఏటా అందించే ఆరోగ్య సంరక్షణ కవరేజీని పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇది అమలులోకి వస్తే.. మరో 4.5 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి.
ప్రస్తుతం భారతదేశంలో 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద్ ఆరోగ్య సౌకర్యాలను పొందుతున్నారు. కాగా ఇప్పుడు నిర్ణీత వయసును 70 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తే.. ఇది మరింత మంది వృద్దులకు ఉపయోగకరంగా ఉంటుందని.. పార్లమెంటరీ కమిటీ యోచిస్తోంది.
ఇదీ చదవండి: డీఏ పెంపు ప్రకటన త్వరలో..: ఈ సారి ఎంతంటే?
ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను మరింత మందికి అందించడానికి వయసును తగ్గించడం మాత్రమే కాకుండా.. కవరేజికి కూడా పెంచాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న కవరేజీ రూ.10 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)లోని అంతరాలను కూడా పార్లమెంటరీ కమిటీ తన నివేదిక హైలైట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment