central govt schemes
-
కేంద్ర పథకాల అమలులో నిర్లక్ష్యం
ఖమ్మంమామిళ్లగూడెం: పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలుకాకుండా ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుంటోందని జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్ విమర్శించారు. ఖమ్మంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం యువత బలిదానాలు చేసి తెలంగాణ కోసం పోరాడగా రాష్ట్ర ఏర్పాటుకు నాడు బీజేపీ పార్లమెంట్లో కృషి చేసిందని గుర్తుచేశారు. అయితే, రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. దళితబంధు అంటున్న సీఎం కేసీఆర్ ప్రజలకు అన్ని బంద్ పెట్టారని పేర్కొన్నారు. ఖమ్మంలో జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.1,200 కోట్ల నిధులు ఇచ్చిందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేస్తుండగా, ఖమ్మం మార్కెట్లో మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ కూడా అందుబాటులో లేదని చెప్పారు. అలాగే, ఖమ్మంలో బీజేపీ కార్పొరేటర్ ఉన్న డివిజన్‌కు నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తున్నారని తెలిపారు. కాగా, గురువారం ఖమ్మంలో జరగాల్సిన సభకు కేంద్ర హోమంత్రి అమిత్‌షా హాజరు కావాల్సి ఉన్నా, వివిధ రాష్ట్రాల్లో తుపాన్ కారణంగా వాయిదా పడిందని నిర్మల్‌సింగ్ చెప్పారు. త్వరలోనే ఖమ్మంలో అమిత్‌షా సభ ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన ఖమ్మం సారథినగర్‌లోని రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించగా, రోడ్డుకు లింక్ చేయకపోవడంతో నిరుపయోగంగా మారిందని బీజేపీ నాయకులు తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్ దొంగరి సత్యనారాయణ, నాయకులు నున్నా రవికుమార్, దేవకి వాసుదేవరావు, నకిరికంటి వీరభద్రం, చావా కిరణ్, గంటెల విద్యాసాగర్, శ్యాంరాథోడ్, రుద్ర ప్రదీప్, వీరెల్లి లక్ష్మయ్య, అల్లిక అంజయ్య, దొడ్డ అరుణ తదితరులు పాల్గొన్నారు. పత్తిపై జీఎస్టీ సమస్య పరిష్కరించాలి ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లపై వస్తు సేవా పన్ను (జీఎస్టీ) సమస్యను పరిష్కరించాలని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల మార్కెట్లో పత్తి కాలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన చాంబర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చాంబర్ బాధ్యులు మాట్లాడుతూ తొలుత పత్తి కొనుగోళ్లపై జీఎస్టీ వసూలు చేయగా, ఆ తర్వాత అమ్మకంపై కూడా జీఎస్టీని విధించడంతో భారం పడిందని తెలిపారు. బీజేపీ నాయకులతో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, బాధ్యులు సోమా నర్సింహారావు, మన్నెం కృష్ణ, తల్లాడ రమేశ్, నల్లమ ల ఆనంద్, చెరుకూరి సంతోష్‌కుమార్, పాండురంగారావు, సత్యంబాబు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
మూడేళ్లలో 67% తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం లబ్ధిదారులు ఏటికేడు తగ్గిపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైన సమయంలో మొదటి విడత లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల మంది కాగా, ఈ ఏడాది జూన్‌లో మొదటి ఇన్స్టాల్మెంట్ 3.87 కోట్ల మంది ఖాతాల్లోనే జమ అయింది. అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఏ) కింద అడిగిన ప్రశ్నకు సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. లబ్ధిదారుల సంఖ్య 67% తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. పీఎం–కిసాన్ పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదికి రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదిలో రైతులకు అందించేందుకు పీఎం–కిసాన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాజాగా 12వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. మొదటి విడతలో 11.84 కోట్ల రైతులు లబ్ధిదారులుగా ఉండగా, ఆరో విడత వచ్చే సరికి ఈ సంఖ్య 9.87 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు, గుజరాత్లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. దేశంలోని మూడొంతుల మంది రైతుల్లో రెండొంతుల మందికి కూడా పీఎం–కిసాన్ అందకపోవడం దారుణమని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలె అంటున్నారు. ఈ పథకాన్ని క్రమేపీ కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏపీ ముందంజ
సాక్షి, విశాఖపట్నం: మిగిలిన రాష్ట్రాలతో పోల్చిచూస్తే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) డైరెక్టర్ జనరల్ సురేంద్రనాథ్ త్రిపాఠి స్పష్టం చేశారు. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యుల ఐఐపీఏ బృందం రెండో రోజు విశాఖలో పర్యటించింది. ఇందులో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, సంబంధిత శాఖల అధికారులతో సురేంద్రనాథ్ త్రిపాఠి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందరి కంటే ఎక్కువగా ఏపీ సద్వినియోగం చేసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, గ్రామ, వార్డు వలంటీర్లు ద్వారా గ్రామస్థాయిలో పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల సేవలు సరికొత్త సేవా విప్లవానికి నాంది పలికినట్లుగా ఉన్నాయన్నారు. స్వయం సహాయక బృందాలు, అంగన్వాడీ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. డీబీటీ ద్వారా ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం వల్ల.. ఏపీ ప్రజల జీవన స్థితిగతులు, ప్రమాణాలు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని తమ క్షేత్ర స్థాయి పర్యటనలో వెల్లడైందని డీజీ త్రిపాఠి వివరించారు. స్వచ్ఛత విషయంలో విశాఖ నగరం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.వీఎన్ అలోక్, ఐఐపీఏ అడిషనల్ డైరెక్టర్ కుసుమ్లతతో పాటు త్రివిధ దళ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: సకల వసతులు: రూ.3,364 కోట్లతో సంక్షేమ హాస్టళ్ల ఆధునీకరణ -
నాడు– నేడు’ స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’
అనంతపురం: విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి ‘నాడు–నేడు ’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా సర్కారీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కలి్పంచేందుకు ‘పీఎం శ్రీ’ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 1,174 పాఠశాలలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, మండల పరిషత్, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. మొత్తం 42 అంశాల్లో ఎన్ని అమలు అవుతున్నాయో వాటి వివరాలను బట్టి 1,174 పాఠశాలల నుంచి తుది జాబితాను త్వరలో ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2026–27 వరకు దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రీన్ స్కూల్స్, పాఠశాల ఆవరణంలో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు, సేంద్రీయ విధానంలో తోటల పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన, నీటి యాజమాన్య పద్ధతులు, వాతావరణ మార్పుల గురించి విద్యార్థులకు వివరించడం, విద్యలో గుణాత్మకమైన మార్పులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం, ప్రతి విద్యారి్థకీ మేథమేటిక్స్, సైన్స్ కిట్లు అందజేయడం చేస్తారు. అలాగే పాఠశాల వార్షిక నిధులు అందేలా చూడడం, స్మార్ట్ తరగతులు, డిజిటల్ శిక్షణ నిర్వహించడం, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీలు ఏర్పాటు చేయడం, నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం చేస్తారు. తుది జాబితా ఎంపిక చేస్తాం పీఎం శ్రీ పథకానికి సంబంధించి పాఠశాల వివరాలను పంపాలని విద్యాశాఖ కోరింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రాథమికంగా 1,174 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇందులో 42 పాయింట్లను బట్టి పాఠశాలల తుది జాబితాను ఎంపిక చేస్తాం. – కే. వెంకట కృష్ణారెడ్డి, ఇన్చార్జి డీఈఓ, అనంతపురం (చదవండి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!) -
75 గంటల ‘పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్’ నిర్వహించనున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి వివిధ రూపాల్లో అందుతున్న నిధులు వంటి అంశాలపై ‘సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్’పేరిట ఈనెల 30 నుంచి జూన్ 14 దాకా రాష్ట్ర వా్యప్తంగా రాష్ట్ర బీజేపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది. దీంతో పాటు 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో వివిధ వర్గాల ప్రజలకు ఎదురైన సమస్యలు, హామీలు అమలు చేయకపోవడం, వివిధ రంగాల్లో వైఫలా్యలు తదితర విషయాలపై టీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. 75 గంటలు ప్రత్యేక కార్యక్రమాలు... ప్రతీ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు, ఆపై నాయకులు ఆయా బూత్‌లలో పబ్లిక్ ఔట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టనునా్నరు. ఇందులో భాగంగా ఒక్కో మండలంలో 75 మంది పాల్గొనేలా ఏరా్పట్లు చేస్తునా్నరు. మే 30 నుంచి జూన్ 14 వరకు ఈ నాయకులంతా ప్రతీరోజు 5 గంటల చొప్పున 15 రోజుల్లో మొత్తం 75 గంటలు పార్టీ ప్రచార, నిరే్దశిత కార్యక్రమాలకు కేటాయిస్తారు. పథకాల లబ్ధిదారులతో సంభాషణ, వికాస్ తీర్థ బైక్ ర్యాలీ, బాబాసాహెబ్ విశ్వాస్ ర్యాలీ, బిర్సా ముండా విశ్వాస్ ర్యాలీ, ప్రాంతీయ స్థాయిలో (వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్) ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. కార్యక్రమాలు ఇలా... ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళ, రైతులు, మైనారిటీలు టార్గెట్‌గా ఔట్ రీచ్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఎస్టీ నాయకులు, ఎంపీలతో కుమ్రుం భీం విశ్వాస్ ర్యాలీ, గిరిజన మేళా నిర్వహణతోపాటు ఎస్టీలు అధికంగా ఉన్న జిల్లాల్లో సమ్మేళనాలు చేపడతారు. జూన్ 6న మైనారిటీల వద్దకు ఔట్రీచ్ ప్రోగ్రామ్. జూన్ 7న యువమోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీల ద్వారా కేంద్ర ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ప్రదేశాలను సందర్శన. జూన్ 8న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బాబా సాహెబ్ విశ్వాస్ ర్యాలీ, చౌపాల్ భైఠక్ (బస్తీ సమావేశం) ఎస్సీల జనాభా ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుల ద్వారా నిర్వహణ. జూన్ 9న మహిళా మోర్చా ఆధ్వర్యంలో పొదుపు సంఘాల సమావేశాలు. జూన్ 10న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 8 ఏళ్లలో రైతుల కోసం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను రైతాంగానికి వివరించడం జూన్ 11న ఓబీసీ మోర్చా ద్వారా సమాజంలోని పీడిత వర్గాలకు కేంద్ర పథకాల వర్తింపుపై వివరణ జూన్ 12న వాక్సినేషన్, హెల్త్ వలంటీర్లకు సత్కారం జూన్ 13న పట్టణ మురికివాడల పర్యటన జూన్ 14న వివిధ రంగాల్లో నిష్ణాతులు, విజేతలను గుర్తించి పౌర సన్మానం. -
పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర
కోజికోడ్: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు. హోలీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. -
ఎక్కడైనా సరే తగ్గేదేలే! 'మెగా' జాక్ పాట్ కొట్టేసిన ముఖేష్ అంబానీ!
దేశీయంగా బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన రూ.18,100 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి నాలుగు సంస్థలు ఎంపికయ్యాయి. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్, ఓలా ఎలక్ట్రిక్, హ్యుందాయ్ గ్లోబల్ మోటర్స్ కంపెనీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వీటిలో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పీఎల్ఐ స్కీము కింద ఎంపికైన సంస్థలు..రెండేళ్ల వ్యవధిలోగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీల తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశీయంగా తయారు చేసిన బ్యాటరీల అమ్మకాలపై అయిదేళ్ల పాటు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. అమర రాజా బ్యాటరీస్,లూకాస్–టీవీఎస్ తదితర 10 కంపెనీలు పీఎల్ఐ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తులకు గడువు జనవరి 14 కాగా, జనవరి 15న సాంకేతిక బిడ్లను తెరిచారు. చదవండి: అంబానీ అదరహో..ఈసారి ఏకంగా!! -
బడిని బాగుచేసుకుందాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: చిన్నప్పుడు మీరు అఆలు దిద్దిన బడిని చక్కగా తీర్చిదిద్ది రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారా.. మీ ఆర్థికసాయాన్ని బడిఒడికి ఎలా చేర్చాలోనని యోచిస్తున్నారా.. ఎక్కడో దూరంగా ఉండటం వల్ల మీకు వీలు చిక్కడంలేదా.. ‘విద్యాంజలి’ ఉండగా.. చింత ఎందుకు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగస్వాములుకండి. మీ కలల సాకారానికి ఇది చక్కని వేదిక. సర్కారు బడుల్లోని సమస్యల పరిష్కారంలో దాతలను భాగస్వాములను చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఆయా పరిశ్రమలవారు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పథకం ద్వారా స్కూళ్లకు ఆర్థిక తోడ్పాటును ఇవ్వవచ్చు. విద్యాంజలిలో నమోదు చేసుకున్న పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం దాతలు ముందుకొస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారితో ఎంవోయూ కుదుర్చుకొని పనులు మొదలుపెడతారు. వెబ్సైట్లో పేరు నమోదు ఇలా..: రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల వివరాలు, సమస్యలు, అవసరాల గురించి ప్రధానోపాధ్యాయులు విద్యాంజలి వెబ్సైట్లో నమోదు చేస్తారు. సంబంధిత పాఠశాలకు సాయం చేయాలనుకునేవారు అదే వెబ్సైట్లో ఉన్న దాతల ఆప్షన్‌ను క్లిక్ చేసి తమ పేర్లు నమోదు చేసుకొని సేవలను అందించవచ్చు. తొలిస్థానం రాజన్న సిరిసిల్లదే..: ఈ ప్రక్రియలో రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, కేజీబీవీ, ఎంఎస్యూఆర్ఎస్, ఎయిడెడ్ తదితర అన్ని రకాల పాఠశాలలు 28,888 ఉండగా.. 21,585 పాఠశాలలు(74.72 శాతం) నమోదు చేసుకున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉంది. మొత్తం 514 పాఠశాలలకుగాను 506 (98.44 శాతం) పాఠశాలల పేర్లు నమోదు చేసి ప్రథమ స్థానంలో ఉండగా.. ఖమ్మం జిల్లా 1,273 పాఠశాలలకు 558 పాఠశాలల (43.83 శాతం) నమోదుతో చివరి స్థానంలో ఉంది. నమోదైన సమస్యలివే...: పాఠశాలలను నమో దు చేసిన హెచ్ఎంలు తమ పాఠశాలల్లోని సమస్యలను కూడా అందులో పొందుపర్చారు. అత్యధికం గా నిర్మాణ పనులు, విద్యుత్ ఉపకరణాలు, బోర్డు లు, బల్లలు, కుర్చీలు, పుస్తకాలు, సైన్స్, గణితం కిట్లు, కంప్యూటర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్, ఇంటరాక్టివ్ వైట్‌బోర్డు, టీవీ, ల్యాప్‌టాప్, క్రీడలు, విద్యేతర(కో కర్క్యులర్) కార్యకలాపాలకు అవసరమైన వస్తు సామగ్రి, ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ ప్యూరిఫైడ్, థర్మామీటర్, చేతుల శుభ్రత (హ్యాండ్‌వాష్) సౌకర్యాలు, వీల్‌చైర్, హియరింగ్ హెడ్స్, టూల్‌కిట్స్, బోధన–అభ్యసన సామగ్రి, నిర్వహణ–మరమ్మతులు, కార్యాలయ అవసరాల కోసం సాయం చేయాల్సిందిగా దాతలను కోరారు. దాతలు ముందుకొస్తేనే.. విద్యాంజలి పథకంతో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవచ్చు. సమాజ భాగస్వామ్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా పరిషత్ హసన్‌పర్తి బాలుర పాఠశాల పేరును ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాం. ఇందుకోసం దాతలు సహకరించాలి. -
కేంద్రం పెన్షన్ పథకం రూల్స్ మారాయ్.. వివరాలు తెలుసుకోండి
రీటైర్మెంట్ తర్వాత జీవితం సాఫిగా సాగేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్పీఎస్)పేరిట పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా పెన్షన్ నిధి నియంత్రణ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీఏ) కొన్ని నిబంధనల్ని సడలించింది. మారిన సడలింపులు లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సడలించిన నిబంధనలు ►పీఎఫ్ ఆర్డీఏ సడలించిన నిబంధనల ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద సూచించిన పరిమితి వరకు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. ►ఎన్పీఎస్ అకౌంట్లో జమచేసే సొమ్ము మొత్తంలో రిటైర్మెంట్కు ముందు 25 శాతం దాకా తీసుకోవచ్చు ►రిటైర్మెంట్ తర్వాత ఎన్‌పీఎస్‌లో జమయ్యే నిధిలో 60 శాతం మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మరో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు వెచ్చించాలి. ►గడువుకు ముందే ఎవరైనా ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచింది. ►ఎన్‌పీఎస్‌లో చేరే వయసు ఇప్పటివరకూ 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్లకు పెంచారు. ►ఎవరైనా 65 సంవత్సరాల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరితే, కనీసం 3ఏళ్ల పాటు కొనసాగాలి. ►ఒకవేళ 65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరి..3 సంవత్సరాల ముందే విత్‌డ్రా చేయాలనుకుంటే..జమ చేసిన మొత్తంలో 20% వరకు మాత్రమే పన్నురహిత ఉపసంహరణను అనుమతిస్తారు. మిగతా మొత్తం జీవితకాలం పెన్షన్‌గా ఉంటుంది. రూ.5 లక్షల నిధి మాత్రమే ఉంటే.. మొత్తం వెనక్కి.. గతంలో ఎన్పీఎస్ నుంచి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే సదుపాయం లేదు. ఉదాహరణకు పథకంలో జమ చేసిన మొత్తం రూ.2లక్షలు దాటితే.. పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40శాతంతో ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వీలుండేది. కానీ తాజాగా సడలించిన నిబంధనలతో రూ.5 లక్షల లోపు ఎన్పీఎస్ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసినా..ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. -
ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే
ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే అధిక భద్రతనిస్తూనే, పూర్తి హామీతో కూడిన రాబడులను ఇచ్చే సాధనాలు ఏవైనా ఉన్నాయా? – కవాన్జైన్ మీరు సీనియర్ సిటిజన్ అయితే (60 ఏళ్లు నిండినవారు) సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) పథకాలను పరిశీలించొచ్చు. ఇవన్నీ భద్రతతో కూడిన పెట్టుబడి సాధనాలు. వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. వీటి తర్వాత షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇవి తక్కువ నాణ్యత (రేటెడ్) సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. ఒకవేళ మీరు చిన్న వయసులో ఉండి, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే.. కొంత మొత్తాన్ని ఈక్విటీకి కూడా కేటాయించుకోవాలి. రిస్క్ ఏ మాత్రం తీసుకోకపోతే చెప్పుకోతగ్గ రాబడులను పొందలేరు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుందని అనుకుంటారు కానీ.. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే వాస్తవ విలువ తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువగా మీ పెట్టుబడులు వద్ధి చెందుతుంటే కనుక.. చూడ్డానికి పెరిగినట్టు అనిపించినా వాటి విలువ తగ్గిపోయినట్టే. కనుక దీర్ఘకాలానికి పెట్టుబడుల్లో కొంత మేర రిస్క్ తీసుకోవచ్చు. నా వయసు 50 ఏళ్లు. స్మాల్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో స్మాల్‌క్యాప్‌నకు, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల మధ్య కేటాయింపులు ఎలా ఉండాలి? – ఎస్కే శర్మ మీ వయసు ప్రకారం చూస్తే.. స్మాల్‌క్యాప్ విభాగంలో (మార్కెట్ విలువ పరంగా చిన్న కంపెనీలు) ఇన్వెస్ట్ చేయడం మంచిదే. గణనీయంగా విలువ పడిపోయినా ఫర్వాలేదనుకుంటే మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అద్భుత రాబడులను ఇచ్చినా.. స్వల్పకాలంలో ఇవి ఎంతో నిరుత్సాహపరుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వీటిల్లో పతనం చాలా స్వల్పకాలంలోనే గణనీయంగా ఉంటుంది. అయితే ప్రతీ ఇన్వెస్టర్ కూడా కనీసం 20–25 శాతం వరకు అయినా స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఎటువంటి సూత్రం అవసరం లేదు. ఇలా చేయడం వల్ల స్మాల్‌క్యాప్స్ నుంచి సంపాదించుకున్న మొత్తానికి కొంత రక్షణ కల్పించుకోవచ్చు. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు గణనీయంగా పెరగొచ్చు లేదా పడిపోవచ్చు. దానికి తగినట్టు పెట్టుబడుల కేటాయింపులను మార్చుకోవాలి. ఉదాహరణకు స్మాల్‌క్యాప్‌లో 75 శాతం, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు 25 శాతంగా అస్సెట్అలోకేషన్ను నిర్ణయించుకున్నారనుకుంటే.. స్మాల్‌క్యాప్ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల్లో 90 శాతానికి చేరితే.. అప్పుడు తిరిగి 75 శాతానికి తగ్గించుకోవాలి. అంటే ఆ మేరకు స్మాల్‌క్యాప్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 75 శాతం కంటే తగ్గిపోయి, డెట్ సాధనాల విలువ పెరిగిన సందర్భాల్లో.. డెట్ పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుని, మిగిలిన మేర స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు పెంచుకోవాలి. డెట్ సాధనాలకు కనీసం 20–25 శాతం అయినా కేటాయించుకుంటేనే అర్థవంతంగా ఉంటుంది. ఇంతకంటే తక్కువ కేటాయింపులు చేసుకుని.. పోర్ట్‌ఫోలియోలను మార్చుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం నెరవేరదు. చదవండి: డీమ్యాట్ అకౌంట్ల స్పీడ్, స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడులు -
బీమా.. ధీమా
సాక్షి, సంగారెడ్డి: ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పంటల బీమాకు రైతుల నుంచి స్పందన కరువైంది. కొన్ని సంవత్సరాలుగా బీమా సదుపాయం కల్పిస్తున్నా రైతులు మాత్రం అతి తక్కువ ప్రీమియం చెల్లించడానికి సైతం ముందుకు రావడం లేదు. ఫసల్ బీమాపై ప్రచారం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పథకంపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఏటా పంటలను నష్టపోతున్నా పరిహారం అందని దయనీయ పరిస్థితి నెలకొంది. వాతావరణం అనుకూలించక పంటలు నష్టపోయే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టింది. ఖరీఫ్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలకు బీమా చేసుకునేందుకు ఈ నెల 15 నుంచి 31 వరకు గడువు ఇచ్చింది. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతులకు సరైన సమాచారం చేరవేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో క్షేత్ర స్థాయిలో సిబ్బంది సరిపడా లేకపోవడంతో రైతులకు సమాచారం అందడం లేదు. పంటలకు బీమా చేసుకుంటే రైతులకు మేలు చేకూరుతుందనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారు. పంటలు నష్టపోయినప్పుడు చూద్దాంలే అనుకుంటున్న రైతులు..నష్టపోయినప్పుడు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. గ్రామ, మండల యూనిట్ల వారీగా బీమా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలతో బీమా అవకాశాన్ని రైతులకు కల్పించింది. గతంలో పంటలు నష్టపోయినప్పుడు బీమా సొమ్మును అందించేందుకు బీమా సంస్థలు సవాలక్ష కొర్రీలు పెట్టడంతో బీమా చేయించడానికి రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. బీమా చెల్లించడమే కానీ నష్టపోయినప్పుడు డబ్బులు వచ్చిన దాఖలాలు తక్కువేనని రైతులు నిట్టూరుస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు ఆలస్యమైనా ఇటీవలే అడపాదడపా కురుస్తున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ పంటలు సాగు చేయడం ఆరంభించారు. విత్తనాలు విత్తుకుంటున్నారు. జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 2,21,614 హెక్టార్లు ఉంది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 39,807 హెక్టార్లుగా ఉంది. జిల్లాలో ప్రధానంగా కంది పత్తి, వరి, మినుము, పనుపు, పెసర, మొక్కజొన్న సాగు చేస్తారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాతం మాత్రమే సాగు విస్తీర్ణం నమోదైందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్లో మరో 10 రోజులవరకు విత్తనాలు వేసుకునే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. రైతులకు భరోసాగా.. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద రైతులు సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలకు బీమా ప్రకటించింది. పలు పంటలను గ్రామ యూనిట్‌గా, మరికొన్నింటిని మండల యూనిట్‌గా లెక్కించనున్నారు. మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్ పరిధిలో చేర్చారు. ఈ నెల 31 తేదీ వరకు ప్రీమియం డబ్బులు చెల్లించి బీమా పొందేలా అవకాశం కల్పించారు. అంతే కాకుండా పత్తి పంటకు ఈ నెల 15వ తేదీ గడువు విధించింది. వరి, పసుపు, కంది, సోయా, మినుము, పెసర, జొన్న పంటలకు మండల యూనిట్ జాబితాలో బీమా సౌకర్యం ప్రకటించారు. ఖరీఫ్‌లో రైతులకు తక్కువ వర్షపాతం, ప్రతికూల పరిస్థితులతో పంటలు నష్టపోతే బీమా పథకం వర్తిస్తుంది. మీ సేవా కేంద్రాల్లో ఫసల్ బీమా పథకానికి సంబంధించి రైతులు మీ సేవ కేంద్రాల్లో బీమా ప్రీమియం డబ్బులను చెల్లించాలి. సహకార, గ్రామీణ, ఇతర జాతీయ బ్యాంకుల్లో పంట రుణాలను పొందిన రైతులకు బ్యాంక్ అధికారులే బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటారు. రుణం పొందని రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే బీమా సౌకర్యం వివరాలను తెలియజేస్తారు. యూనిట్ వారీగా బీమా.. రైతులు పండిస్తున్న పంటలకు మూడు రకాల బీమా చేయనున్నారు. అందులో మొక్కజొన్న పంటలను గ్రామ యూనిట్ పరిధిలో చేర్చారు. గ్రామంలో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లితే అదే గ్రామ పరిధిలోని విస్తీర్ణంలో దిగుబడిని బట్టి బీమా సొమ్మును చెల్లిస్తారు. అయితే కంది, జొన్న, వరి, సోయా, పెసర, మినుములాంటి పంటలను మండల యూనిట్ జాబితాలో చేర్చారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మండలాన్ని పరిగణలోకి తీసుకొని బీమా వర్తించే విధంగా నిబంధనలు రూపొందించారు. పత్తి పంటకు మాత్రం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీమా వర్తించేలా ప్రభుత్వం ఫసల్ బీమాను అమలు చేస్తోంది. పంటలను బట్టి వాణిజ్య, సాధారణ పంటలుగా గుర్తించారు. వాణిజ్య పంటలకు బీమా పరిహారం అధికంగా ఉంటుంది. పత్తి, పసుపు పంటలు నష్టపోతే బీమాను అధికంగా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీమా చేయించండి వాతావరణ విపత్కర పరిస్థితుల్లో పంటలు నష్టపోతే బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందవచ్చు. ప్రభుత్వం బీమా చేయించేందుకు ఈ నెలాఖరు వరకు పంటల వారీగా గడువు ఇచ్చింది. పంటలు సాగుచేస్తున్న రైతులు బీమా ప్రీమియం చెల్లించండి. పంటలు నష్టపోతే లాభదాయకంగా ఉంటుంది. – బి.నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి -
‘కిసాన్’ లెక్క తేలింది
కరీంనగర్: ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్)’కి అర్హులైన రైతుల లెక్క తేలింది. ఐదు ఎకరాల లోపు భూమి, ఒక కుటుంబంలో ఒక పాస్‌బుక్ ఉన్న రైతులకే కేంద్రసాయం అందనుంది. ఈ లెక్కన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 60,268 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సదరు రైతు ఖాతాల్లో ఈనెల 24వ తేదీ నుంచి తొలి విడత రూ. 2వేల సాయం జమ కానుంది. ఈ మేరకు వ్య వసాయ శాఖ అధికారులు సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో 1.40 లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. వీరిలో 72,924 మంది పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక రూపొందించారు. మొదటి విడత సర్వేలో ఒకే కుటుంబంలో ఒక్క రైతుకు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం వల్ల 60,268 మంది రైతులు అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. గ్రామాల్లో ఆదాయ పన్ను కట్టేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థల పేరుతో భూములు కలిగి ఉన్నవారు, పది వేలకు మించి పింఛన్ పొందుతున్నవారు, ఒకే కుటుంబానికి ఐదు ఎకరాలకు మించి భూములు ఉన్నవారు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, కార్పొరేషన్ మేయర్లు, ఉద్యోగ విరమణ పొందినవారు, వృత్తినిపుణలైన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెట్ అకౌంటెంట్లను మినహాయించి సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరం మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రెండవ విడత సర్వేలో మిగిలిన రైతు కుటుంబాల నుంచి వివరాలు సేకరించి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులను ప్రభుత్వానికి నివేదించనున్నారు. కొందరికే లబ్ధి.. రైతుల అసంతృప్తి చిగురుమామిడి: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి’ పథకంపై రైతులు సంతృప్తికరంగా లేరు. ఈ పథకం కింద ప్రభుత్వం విధించిన నిబంధనలపై రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చిగురుమామిడి మండలంలోని దాదాపు 70శాతం మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. ఎందుకనగా ఒకే రేషన్‌కార్డులో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న రైతు కుటుంబీకులకు ఈ పథకం వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగ విరమణ పొందని వారికి కూడా వర్తించడంలేదు. ఐదు ఎకరాలు, ఆపైన భూమి కలిగి ఉన్నా ఈ స్కీమ్‌కు రైతు అర్హుడుకాడు. ఇచ్చే రూ.6వేలకు పలు నిబంధనలు విధించడం వల్ల రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐదు ఎకరాల భూమి కంటే లోపు ఉన్న రైతులే అర్హులని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లెక్కన చిగురుమామిడి మండలంలో మొదటి విడతగా 4194 మంది రైతులు మాత్రమే అర్హత పొందారు. ఈ మండలంలో దాదాపు 11వేల మంది రైతులకు గాను 4194 మందికే రూ.6వేల పెట్టుబడి సాయం అందనుదని వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో అర్హుల జాబితాలను ప్రచురించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వేసిన జాబితాలను చూసిన రైతులు తమ పేర్లు రాలేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని అధికారుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం అందనుందని మండల వ్యవసాయాధికారి కె.రంజిత్‌రెడ్డి తెలిపారు. -
‘గిఫ్ట్’ దిగుమతులకు కేంద్రం చెక్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతుల నిబంధనలు దుర్వినియోగం అవుతుండటంపై కేంద్రం దృష్టి సారించింది. కస్టమ్స్ సుంకాలను ఎగవేసే ఉద్దేశంతో బహుమతుల పేరిట రూ. 5,000 దాకా విలువ చేసే ఐటమ్స్ దిగుమతి చేసుకుంటుండటాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం రూ. 5,000 దాకా ఉన్న మినహాయింపును ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే ఒక వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా నాలుగు కన్సైన్మెంట్స్ మాత్రమే బహుమతులుగా అనుమతించే విషయమూ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ–కామర్స్ రంగంపై జరిగిన కార్యదర్శుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు వివరించాయి. దీనిపై తాము చేసిన సిఫార్సులపై కస్టమ్స్ విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రూ. 5,000 దాకా విలువ చేసే గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతులకు కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్న భారత విదేశీ వాణిజ్య చట్టంలోని నిబంధనలను చైనాకి చెందిన పలు ఈ–కామర్స్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ పరిశ్రమ వర్గాలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. -
తెలంగాణలో కేంద్ర పథకాల అమలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ (టీ సిపార్డ్)లో సోమవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వివరించారు. ఉపాధి హామీ, పీఎంజీఎస్‌వై, రూర్బన్, డీడీయూజీకేవై, టీఆర్ఐజీపీ, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాంకృపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని, మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల మనుగడ రేటు 70 శాతం వరకు ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల్ని పెంచండి దేశానికే ఆదర్శంగా గ్రామీణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహకారం అందజేయాలని కోరారు. పెద్ద ఎత్తున ఉపాధి హామీని అమలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదట్లో ఇచ్చిన 8 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని 16 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నిలిచిన పనులకు సంబంధించి రూ.800 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి పీయంజీఎస్‌వై–2 కింద అనుమతినివ్వాలని కోరారు. రాష్ట్రానికి మూడు విడతల్లో 16 రూర్బన్ క్లస్టర్లను మంజూరు చేశారని.. కనీసం జిల్లాకు ఒక్కటైనా ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్‌కు జూపల్లి వినతి పత్రం అందజేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రపథకాలకు ‘గులాబి’ రంగు వేస్తున్నారు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు దుబ్బాక : కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం. రఘునందన్ రావు ఆరోపించారు. పల్లె పల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉప్పేసి పొత్తు కుదుర్చుకున్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన మరుగుదొడ్లకు గులాబిరంగు వేసుకుంటోందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నామని చెప్పిన సీఎం రాష్ట్రంలో ఎంతమందికి మూడెకరాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల కింద మంజూరు చేసిన లక్ష అవాస ఇళ్లలో ఎంతమందికి నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు, స్టౌలు సబ్సిడీపై కేంద్రం అందజేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారాగౌడ్, పగడాల నరేందర్, వాసరి శ్రీనివాస్ యాదవ్, మన్నె బాబు, నాయకం తిరుపతి ముదిరాజు, అస్క నరేందర్, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె వంశీకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తాం'
హైదరాబాద్: రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. యువత, రైతులు, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర పథకాలు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఆదివారం అమిత్‌షా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన తాలుకు అవినీతిని కడిగిపారేశమని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని అమిత్‌షా పేర్కొన్నారు.