బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు
దుబ్బాక : కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం. రఘునందన్ రావు ఆరోపించారు. పల్లె పల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉప్పేసి పొత్తు కుదుర్చుకున్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన మరుగుదొడ్లకు గులాబిరంగు వేసుకుంటోందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నామని చెప్పిన సీఎం రాష్ట్రంలో ఎంతమందికి మూడెకరాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల కింద మంజూరు చేసిన లక్ష అవాస ఇళ్లలో ఎంతమందికి నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు, స్టౌలు సబ్సిడీపై కేంద్రం అందజేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారాగౌడ్, పగడాల నరేందర్, వాసరి శ్రీనివాస్ యాదవ్, మన్నె బాబు, నాయకం తిరుపతి ముదిరాజు, అస్క నరేందర్, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె వంశీకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రపథకాలకు ‘గులాబి’ రంగు వేస్తున్నారు
Published Mon, Feb 27 2017 1:57 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
Advertisement
Advertisement