raghunandan rao
-
కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.. ఉచితాలతో అధికారం రాదు
-
జీహెచ్ఎంసీకి ఎంపీ వార్నింగ్..కారణమిదే..
సాక్షి,సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాను మరో జవహర్‌నగర్‌గా మార్చాలని చూస్తున్నారని,శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్‌లో రోజుకు వంద లారీల చెత్త పోసేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ మేరకు రఘునందన్‌రావు బుధవారం(ఫిబ్రవరి5) మీడియాతో మాట్లాడారు.‘చెత్త పోసే వ్యవహారాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు. పటాన్ చెరువు ప్రాంతం ఇప్పటికే కంపెనీలతో కలుషితం అయింది.2015లో అప్పటి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నలవల్లిలో చెత్త శుద్ధి పనులు ఆపకపోతే అధికారులకు భౌతిక దాడులు తప్పవు.పట్నం చెత్తను పల్లెలో వేస్తామంటే ఊరుకోం. అరెస్ట్ చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలి. పచ్చని అడవుల్లో చెత్త వేసి భూములు కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదు. దీన్ని ఉపసంహరించుకోకుంటే ప్రత్యక్ష నిరసనకు దిగుతాం.పోలీసులతో ప్రజలను భయపెట్టి పనులు చేపట్టడం సరికాదు.చెత్తకు హైదరాబాద్,రంగారెడ్డి అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డి మీద పడ్డారా’అని రఘునందన్‌రావు నిలదీశారు. -
మధ్యవర్తిత్వంతో తక్కువ ఖర్చు.. సత్వర న్యాయం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): న్యాయవాదులు మధ్యవర్తిత్వ పద్ధతులపై మెళకువలు పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయాన్ని అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హరి అన్నారు. మధ్యవర్తిత్వం మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు న్యాయవాదులు ఎక్కువ దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీ న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యాన గుంటూరు మెడికల్ కళాశాలలో శనివారం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సును ప్రారంభించిన జస్టిస్ రవినాథ్ తిల్హరి మాట్లాడుతూ పెరిగిపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి అవకాశమని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని వివరించారు. వ్యాపార, కుటుంబ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇరుపక్షాలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. మధ్యవర్తిత్వంపై నెలకొన్న అపోహలు వీడాలని, ఈ విధానాన్ని ప్రజల ముంగిటకు తీసుకువెళితే న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం: జస్టిస్ రావు రఘునందన్‌రావు సదస్సు ముగింపు సెషన్లో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్ జస్టిస్ రావు రఘునందన్‌రావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ప్రత్యేక చట్టం చేశారని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం నిర్వహించే వెసులుబాటు ఉందని చెప్పారు. ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ఇటీవల వస్తున్న మార్పులు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.ఇప్పటి వరకు అన్ని బార్ అసోసియేషన్లలో, జిల్లా, మండల, హైకోర్టు స్థాయిల్లో నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి, ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్.అమర రంగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి, సీనియర్ ట్రైనర్స్ రత్నతార, అరుణాచలం పాల్గొన్నారు. -
కవితకు ఎంపీ రఘునందన్ కౌంటర్
సాక్షి, సంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలకు కౌంటిరచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా ఆమెను డాక్టర్‌కు చూపించాలి అంటూ కామెంట్స్ చేశారు.సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కి రైతులు గుర్తుకు రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. మంచి డాక్టర్‌కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది.కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కి అవమానం జరిగింది. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ని గౌరవించలేదు. కేవలం అంబేద్కర్ జయంతి, వర్థంతి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్‌ను కాదని యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని లెక్కచేయలేదు.ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారు. ఆనాడు అధికారంలో ఉన్న బీసీలను, పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే. హస్తం పార్టీకి అధికారం ఉంటే ఒకలా ఉంటుంది.. లేకపోతే మరోలా మాట్లాడతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘అల్లు అర్జున్ను ఆరోజు ఎందుకు అడ్డుకోలేదు?’
హైదరాబాద్, సాక్షి: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్(Allu Arjun) విచారణ వేళ.. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారాయన. సాక్షితో ఆయన మాట్లాడుతూ..‘‘రేవతి కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉంది. పేదలైనా.. పెద్దలైనా వారికి మేం అండగా ఉంటాం. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ చేసేది ముమ్మాటికీ రాజకీయమే. అసెంబ్లీలో తన దోస్తుతో(ఎంఐఎం అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి..) ప్రశ్న అడిగించుకోని కాంగ్రెస్ రాజకీయం చేసింది. అలాంటప్పుడు.. మొదటి రోజే ఎందుకు కాంగ్రెస్ (Congress party) నేతలు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు?..ముమ్మాటికీ పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటన జరిగింది. అసలు అనుమతి లేదన్నప్పుడు అల్లు అర్జున్ ను ఇంటి నుంచి ఎందుకు బయటకు రానిచ్చారు. ఇంటి వద్దే ఆయన్ని బారికేడ్లు వేసి ఎందుకు అడ్డుకోలేదు?. థియేటర్ వద్ద యూనిఫాం లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా!. సంధ్య థియేటర్ గేట్లు మూసివేసి హీరో వెహికిల్ ను టోయింగ్ ఎందుకు చేయలేదు?. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్‌తో వచ్చిన బద్నాంను తప్పించుకునేందుకే ఇంతా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కక్ష గట్టి సాధిస్తోంది ’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే బీజేపీ అల్లు అర్జున్‌కు అండగా ఉంటుందని ఆ పార్టీ కీలక నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఇంతకు ముందే ప్రకటించారు. అంబేద్కర్ ఇష్యూపై..కాంగ్రెస్ కు అంబేద్కర్ పేరును తీసే అర్హత లేదని రఘునందన్ చెబుతున్నారు. ‘‘తెలంగాణలో 125 అడుగుల విగ్రహానికి కనీసం దండ వేయలేదు రేవంత్ ప్రభుత్వం. అంతపెద్ద విగ్రహానికి గేటుకు తాళం వేసిన రోజే కాంగ్రెస్ చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వలేదు కాంగ్రెస్. అంబేద్కర్ ను అన్ని రకాలుగా కాంగ్రెస్సే అవమానించింది. హాస్టళ్లలో ఫుడ్ తిని విద్యార్థులు చనిపోతున్నారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు అని రఘునందన్ మండిపడ్డారు. -
మిగతా కేసులతో పోలిస్తే ఈ కేసు చాలా చిన్నది
-
ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదయిన సందర్భంలో అన్ని వర్గాల్లోనూ చర్చ చాలా లోతుగానే జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలి పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తమ ఆకాంక్ష లకు అనుగుణంగా లేదని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు. తెలంగాణ కోసమే ఒక రాజకీయ పార్టీ స్థాపించి, తెలంగాణ పేరుతో ప్రతినిత్యం తన రాజకీయం నడిపించిన కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు శాశ్వతంగా పట్టం కట్టలేదనీ, కట్టరనీ ఏడాది క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.నిజానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టం కట్టిన ప్రజలు 2019 ఎన్నికలలోపే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వచ్చారు. ఇది కనిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలతో (2019) పాటు అసెంబ్లీ ఎన్ని కలు జరిగితే మోదీ సునామీలో అధికారం కోల్పోవడం ఖాయం అని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇతర వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అందుకే ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తనదైన టక్కు టమార విద్యలతో 2018 లోనే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉంటే అదే స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేది. రెండవ దఫా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళనుంచి తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. తెలంగాణలో అనుకోకుండా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఈ వ్యతిరేకత చూపించడానికి తొలి వేదిక అయ్యింది. సొంత జిల్లా సిద్దిపేటలో అటు గజ్వేల్, ఇటు సిరిసిల్లకు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ తరఫున నిల బడిన నన్ను గెలిపించడం దీనికి నిదర్శనం.ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు... ఏడాది కాలంగా సరిగ్గా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నది. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన మేనిఫెస్టోలో 42 పేజీలలో వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మారి ఏడాది కూడా గడవక ముందే తెలంగాణలో కొత్త సర్కారుపై తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతలు మొదలయ్యాయి.కేసీఆర్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ‘ఆరు గ్యారెంటీల’ పేరుతో అలవి కాని హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కి... ఇప్పుడు ప్రజలపై స్వారీ చేస్తోంది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీలలో నెర వేర్చినవి కూడా అరకొరగా మాత్రమే ఉండటం గమ నార్హం. ప్రజలకు అవసరం లేని... పేర్లలో మార్పు, విగ్రహాలలో మార్పు చేయడం మాత్రమే ప్రజా పాలనకు నిదర్శనమా? తెలంగాణ తల్లి విగ్రహం మలిదశ ఉద్యమంలో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ప్రజల మన సుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం మార్పు చేయడం వల్ల ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నదా? నిజానికి తల్లి... దేవతతో సమానం. అట్లాంటి తెలంగాణ తల్లిని దేవత రూపంలో ఉండకూడదని కాంగ్రెస్ సర్కార్ అనుకోవడమే వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. మార్పు చేసిన విగ్రహం కూడా తెలంగాణలో బలిదానాలకు మూల కారణమైన సోనియా గాంధీ పుట్టిన రోజున ఆవిష్కరణ చేయడం తెలంగాణ ఆత్మగౌరవ వంచనగా భావించాల్సిందే. ‘అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం’ అని ప్రమాణ పత్రంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ... కేవలం ‘పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు’ల్లో మాత్రమే ఆడపడుచులు ప్రయాణించడానికి అర్హులని అవమా నిస్తోంది. ఇలా ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయని ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి.చదవండి: వ్యవసాయాన్ని పండుగ చేశాం!అత్తాకోడళ్ళతో సహా కుటుంబంలోని మహిళలందరికీ ఇస్తానన్న నెలకు రూ. 2,500 ఎక్కడకు పోయినాయి? వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అని... ఇప్పుడు కేవలం కొన్ని రకాల సన్న ధాన్యాలకు ఇస్తా మని చెప్పడం మోసం చేయడం కాదా? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి, తర్వాత ‘షరతులు వర్తిస్తాయ’ని కార్పొరేట్ తరహా మోసం చేసిన ప్రభుత్వం ఇది. ‘రైతు భరోసా’ పెంచి కౌలు రైతులకు కూడా 15 వేల రూపా యలు ఇస్తామని ముఖం చాటేసిన గొప్ప సర్కారు ఇది. అందుకే మేనిఫెస్టోలో ఉన్న 42 పేజీలపై ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలి. వారు అమలు చేశామని చెప్పుకుంటున్న హామీలపై కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరన్న విషయాన్ని రుజువు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఎన్నికల వరకు కూడా ప్రజలు తిరుగుబాటు చేయకుండా నిలిచే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. తిరుగుబాటు సహజ గుణంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది కొత్త కూడా కాకపోవచ్చు.- రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులు -
జన్వాడ మందు పార్టీ సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: ఎంపీ రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ బీఆర్ఎస్ను నమ్మరు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. అలాగే, దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు అంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ ఎంపీ రఘునందన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని అంటున్నారు. ఆయన తప్పుకుంటే వద్దు అనే వాళ్లు ఎవరూ లేరు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్‌కు ప్రజలను కలిసే సమయం దొరకలేదు. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు?. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ పట్టించుకోరు. కేసీఆర్ పది నెలలుగా ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. ఏమైనా నష్టం జరిగిందా?. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం మాత్రమే. మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారు.కేటీఆర్‌కు ఎవరి మీదా నమ్మకం లేదు. చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా నమ్మకం లేదు. జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలి. అప్పుడే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా?. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ మంత్రి పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు’ అంటూ సెటైర్లు వేశారు. -
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్‌రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
పొంగులేటికి రఘునందన్ స్ట్రాంగ్ కౌంటర్
-
నిధులు కేంద్రానివి.. పేరు ఇందిరమ్మదా?: రఘునందన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేసీఅర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. అలాగే, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. బీఆర్ఎస్కు ప్రజలు సీఆర్ఎస్ (రిటైర్ మెంట్)ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారు. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తాం. ఆరు నెలల కింద కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12వందల కోట్లు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.సొమ్ము కేంద్రానిది అయితే ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇందిరమ్మ కమిటీలు ఇళ్ళ లబ్దిదారులను ఎంపిక చేస్తే అడ్డుకుంటాం. ఇందిరమ్మ కమిటీలకు ఒక విధానం లేదు. గతంలో సిరిసిల్ల, సిద్దిపేటను సుడా చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌ను కుడా చేసుకున్నారు. గ్రామ సభలు పెట్టీ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలి తప్పితే.. ఇందిరమ్మ కమిటీల ద్వారా కాదు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ భాగస్వామ్యం లేదు. ఇందిరమ్మ కమిటీలు చెల్లుబాటు కాదు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
కొండా సురేఖ,రఘునందన్ ఫొటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫొటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఎంపీ రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వివాదాస్పద ఫొటోలను మార్పింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న,జగిత్యాల రాయకల్‌కు చెందిన వ్యాపారవేత్త మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కొండా సురేఖపై ట్రోలింగ్.. రఘునందన్ సీరియస్
మెదక్, సాక్షి: రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం ఏమాత్రం మంచిది కాదని.. బీఆర్ఎస్ పార్టీకి మహిళల మీద గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై రఘునందన్ మీడియాతో మాట్లాడారు.‘‘బీఆర్ఎస్కు మొదటి నుంచి మహిళల మీద గౌరవం లేదు. అందుకే.. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. తల్లీ, అక్కాచెల్లి మధ్య ఉండే సంబంధం గురించి సోషల్ మీడియాలో సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. ఇంతకు ముందు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఇలాగే నూలు పోగు దండను వేశా. .. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కూడా కప్పారు. కానీ, ఆ పార్టీకి చెందిన వాళ్లు ఇంత సంస్కారహీనంగా.. సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు... అసలు బీఆర్ఎస్కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా?. పోస్టు పెట్టిన అకౌంట్లో డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావులు ఈ వ్యవహారంపై స్పందించి క్షమాపణలు చెప్పాలి. తమ సోషల్ మీడియా విభాగాలను కంట్రోల్ చేసుకోవాలి. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే తీవ్రంగా పరిగణించండి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు కదా.. అలాగైనా పోలీసు కంప్లయింట్ ఇవ్వండి... నా వల్ల మా అక్కకు(కొండా సురేఖ) కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా. ఒక అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా’’ అని రఘునందన్ హెచ్చరించారు. -
నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. కొండా సురేఖ కంటతడి
హైదరాబాద్, సాక్షి: మెదక్ పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ దండ వ్యవహారంపై నడుస్తున్న ట్రోలింగ్‌పై ఎంపీ రఘునందన్‌రావు తనకు క్షమాపణలు చెప్పారని కొండా రేఖ అన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తోంది బీఆర్ఎస్సేనని ఆమె మండిపడ్డారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు.‘‘ఇంచార్జీ మినిస్టర్‌గా మెదక్ పర్యటనకు వెళ్లా. అక్కడి ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు నాకు చెప్పి.. గౌరవంగా చేనేత మాల నా మెడలో వేశారు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశాను. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది. కానీ, కొంతమంది పోగై నన్ను ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా చెప్పుకోలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారు. నాకు మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళని కొట్టారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారామె.రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్లో భారీ మార్పులు వచ్చాయి. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు.‘‘ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి. అమెరికా సంస్కృతి తెచ్చి బతుకమ్మకు అంటించింది మీ చెల్లి. బతుకమ్మ సహజత్వాన్ని చెదగొట్టిందే మీ చెల్లి’’ అంటూ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు..ఈ విషయం తెలిసి.. రఘునందన్ ఫోన్ చేశారు. అక్కా.. క్షమించు కాళ్లు మొక్కుతా అన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా నన్ను అక్కా అని.. నా భర్తను బావా అని పిలుస్తారు.అలాంటిది మానసిక వేదనతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు. ఏదో ఒకరోజు ప్రజలూ తిరగబడుతారు అని కొండా సురేఖ హెచ్చరించారు.ఇక.. సహచర మంత్రి కొండా సురేఖకు మరో మంత్రి సీతక్క బాసటగా నిలిచారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆమె హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అని వ్యాఖ్యానించిన దుర్మార్గులున్న పార్టీ బీఆర్ఎస్. నా సోదరమైన మంత్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.‘‘మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది. సీఎం కుటుంబాన్ని కూడా వదలడం లేదు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రీయా శీలకంగా పనిచేసే వాళ్లను లక్క్ష్యంగా చేసుకుని బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనూ మహిళలు ఉన్నారు. వాళ్లేం చేశారో.. దేశం మొత్తానికి తెలుసు. అయినా సభ్యత కాదనే మేం నోళ్లు విప్పడం లేదు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలా?. ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటికి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. ఆడ కూతుర్లను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు వెనక్కు నెడుతున్నారు. మల్లి దోరల రాజ్యం తెవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న మేయర్ విజయ లక్ష్మీ, నిన్న నాపై,నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్. మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా?. బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకుని బుద్ది తెచ్చుకోండి.తక్షణమే క్షమాపణలు చెప్పి.. తమ సోషల్ మీడియా విభాగాలను కట్టడి చేయాలి అని సీతక్క హెచ్చరించారు. -
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్‌తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
ఫస్ట్ KTR ని అరెస్ట్ చేయాలి..
-
సోనియా నివాసానికి రఘునందన్.. కారణం ఇదే..
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనియా గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేరుకుని బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని బ్లిట్జ్ పత్రిక ఇచ్చిన కథనాలను సోనియా ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీకి చూపించి లోపలికి వెళ్లారు. అనంతరం.. సోనియా, రాహుల్ బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. -
పార్టీలే వేరు.. ఆలోచనా విధానం ఒక్కటే
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్ఎస్ లు.. పార్టీలే వేరు కానీ, నేతల ఆలోచనా విధానం మాత్రం ఒక్కటే అని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. రాష్ట్రంలో జెండాలు మారాయి తప్ప విధానాలు మార లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల తీరుపై విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లా డారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.26 వేల కోట్లు, గ్రాంట్స్ కింద రూ.21 వేల కోట్లపైన చూపించారన్నారు. ఈ రెండు కలిపితే రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తుండగా.. మరి రాష్ట్రానికి ఏమిచ్చారని ఎలా ప్రశ్ని స్తున్నారని రఘునందన్ నిలదీశారు. ‘నిధులు వచ్చుడో.. ఇద్దరం చచ్చుడో’అన్న వారు.. కేంద్రం తెలంగాణకు నిధులు ఇచ్చిందని తేలితే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ముక్కు నేలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదన్న సీఎం, కేంద్రానికి డీపీఆర్ ఇచ్చారా? డీపీఆర్ ఇవ్వకుండా నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్లో కొండగల్‌కు రూ.5 వేల కోట్లు ఇచ్చుకున్న వారు కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడే హక్కు లేదన్నారు. -
రేవంత్, కేటీఆర్.. ధర్నా చేసే దమ్ముందా?: బీజేపీ ఎంపీ రఘునందన్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేనని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రెండు పార్టీలు బడ్జెట్ కేటాయింపులపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయాలి అంటూ ఘాలు వ్యాఖ్యలు చేశారు.కాగా, ఢిల్లీలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగాయి. గత పదేళ్లుగా ఎన్డీయే నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితోనే చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే. జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైఖరి ఒకటే ఏం మారలేదు. మార్పు ఏదైనా ఉందా అంటే.. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారారు. మార్పు ఇంకేదైనా ఉందంటే.. కుర్చీలు మాత్రం మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ.20 కోట్లతో కేసీఆర్ కొన్నారని, కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.5 కోట్లకే కొన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో చెప్పారు.ప్రతీ మహిళకు రూ.2,500 ఇస్తామన్నారు. ఏడాదికి రూ.30వేలు అవుతుంది.. ఇది ఇచ్చారా? బడ్జెట్లో కేటాయింపులు ఏవి?. వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్లో కేటాయింపులు ఏవి మరి?. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రూ. 35,500 కోట్లు రుణం తెచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.9లక్షలపైనే ఉంది. వికారాబాద్ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.1 లక్షపైన ఉంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంత వ్యత్యాసం ఉంది. దేశవ్యాప్తంగా చూసినా సరే ఇదే తరహా అంతరాలు ఉంటాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.26వేల కోట్లుగా చూపించారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.21వేల కోట్లపైన చూపించారు. ఈ రెండు కలిపితే దాదాపు రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తున్నాయి. మరి తెలంగాణకు ఏమిచ్చారు అని ఎలా ప్రశ్నిస్తున్నారు.రేవంత్ రెడ్డి, కేటీఆర్ జంతర్ మంతర్ల ధర్నా చేయాలి. నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా. ఢిల్లీ జంతర్ మంతర్ రండి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి కడుతున్నారా లేదా?. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షలకు కేంద్రం పెంచింది. దీన్నే ఆరోగ్యశ్రీ కింద మీ పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారు. మైనారిటీల పండుగల కోసం రూ.33 కోట్లు కేటాయించారు. మరి తెలంగాణలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా?. సెక్యులరిజం అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు. -
35 మందిని ఒకేసారి విలీనం చేసుకోండి
గజ్వేల్‌రూరల్/ప్రశాంత్‌నగర్: ‘బావ, బామ్మర్ది, మామ (హరీశ్, కేటీఆర్, కేసీఆర్).. ముగ్గురిని వదిలేసి, 35 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఒకేసారి విలీనం చేసుకోవాలి’అని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు వ్యంగ్యంగా అన్నా రు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆయన అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. సంతలో పశువులను కొన్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్లో రాజ్యాంగ విలువల గురించి మట్లాడుతూ, ఇక్కడ రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడాన్ని ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక సీఎం వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కండువా కప్పిన మరుక్షణం ఆ ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలనపై దృష్టిపెట్టాలి..:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై కాకుండా పరిపాలనపై సీఎం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్‌రావు హితవు పలికారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో నంబర్ టూగా చెలామణి అవుతున్న మంత్రి, బీఆర్ఎస్ బెదిరింపులు ఆపేదాక ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉంటాయనడం సరికాదన్నారు. -
‘పంచాయతీ ఎన్నికల వాయిదా కోసం కాంగ్రెస్ కొత్త డ్రామాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమీ మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.కాగా, నేడు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం, రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశాం. రైతులకు రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రూప్-1 పోస్టుల్లో అదనంగా కేవలం 60 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు 30 రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటు.కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు. డీఎస్సీ ఒక నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. మేము వారికి మద్దతు ఇస్తున్నాము. నెలకు నాలుగు లక్షల నెల జీతం ఏడు మాసాలుగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?. అధికారులను అరెస్ట్ చేస్తున్నారు.. పనులు చేయించిన అప్పటి మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. ఒక్కో మంత్రి ఒక్కో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.ధరణి పరిస్థితి ఏంటి?. ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గత ప్రభుత్వ పెద్దలు తిన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చడానికి, మంత్రి పదవులు భర్తీ కోసం ఢిల్లీకి వారం రోజులుగా వెళ్లున్నారు. పంచాయతీల కాల పరిమితి ముగిసింది. వెంటనే ఎన్నికలు జరపాలి. కులగణన త్వరితగతిన పూర్తి చేయాలి. ఎన్నికలు వాయిదా వేసేందుకు డ్రామాలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నెలకు 1200 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. ఆ ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ప్రజలకు ఇ చ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఆయా అంశాలపై కమిషన్ల నియామకాలతోనే కాలయాపన చేస్తోందని బీజేపీ మెదక్ ఎంపీ ఎం.రఘునందన్‌రావు మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైంపాస్ చేస్తున్నారు. గుంపు మేస్త్రీ సరిగా ఉంటేనే ఇతర మేస్త్రీలు కూడా పనిచేస్తారన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు, వరి ధాన్యానికి మద్దతు ధర, రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణం హామీ ఏమైందని ఆయన ప్రశ్నలు సంధించారు. లక్ష్మీనరసింహస్వామి మీద, ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్ ఒట్లు వేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ, దానిని ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశా రు. రైతు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడో అన్ని ఎకరాలకూ రైతు భరోసా ఇవ్వా లని సూచించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటామని మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్నారు కదా అని ఓ విలేకరి స్పందించగా.. అసెంబ్లీ సమావేశాలు ప్రా రంభం అయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కాపాడుకోలేని పరిస్థితి తలెత్తు తుందని వ్యాఖ్యానించారు. మరో 15 నెలలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అనేది కూడా అనుమానమేనని, అలాంటిది మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు ఉంటామంటే ఎట్లా అని బదులిచ్చారు. -
బీఆర్ఎస్ టైటానిక్‌లా మునిగిపోతుంది
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాక తప్పదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివిధ కేసుల్లో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వివిధ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అందరూ కేసీఆర్ పేరే చెబుతున్నా రన్నారు. రాబోయేరోజుల్లో బీఆర్ఎస్కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్ఎస్) ఖాయమన్నారు. టైటానిక్షిప్ మాదిరిగా బీఆర్ఎస్ నావ మునిగి పోతుందని అన్నారు. బీజేపీలోకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, అలాగే నక్సలైట్లు, మరెవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.శనివారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో రఘునందన్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే తాను క్షీరసాగర్ నుంచే పని మొదలుపెడతానని, దళితుల భూములను తిరిగి వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని చెప్పారు.మీడియా ప్రతి నిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు రఘునందన్‌రావు సమాధానాలిస్తూ.. నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తా. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తన అభిప్రాయం వెల్లడించారు’అని అన్నారు. జర్నలిస్ట్ యూనియన్ సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధానకార్యదర్శి బింగిస్వామి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
నరకాసురుడు చనిపోతే దీపావళి జర్పుకున్నట్టు నేడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘు నందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అన్నీ వర్గాల ప్రజల్ని ప్రజలను అణిచి వేయాలని చూసింది. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. తన గెలుపును మల్లన్న సాగర్‌లో తన చితి తానే పెర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.దుబ్బాకలో రఘునందన్ రావుకి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారు కానీ నేడు సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్న రఘనందన్ .. నా గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు పరోక్షంగా ప్రచారం చేశారని అన్నారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకున్నట్లు నేడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారుబీఆర్ఎస్ నేత వెంకట్ రాంరెడ్డి 30రోజులలో గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్ రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వకపోతే ఎక్కడి వరకు అయినా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంకట్ రాంరెడ్డి స్వాధీనం చేసుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి దానిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. -
"టార్గెట్ కేసీఆర్"..పొలిటికల్ హీట్ రేపుతున్న రఘునందన్ వ్యాఖ్యలు
-
KCRపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
-
కేసీఆర్ పై ఈడి కేసు నమోదు రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
-
కేసీఆర్‌పై ఈడీ కేసు?
సాక్షి, మెదక్: మాజీ సీఎం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారంటూ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన సన్మాన సభలో మాట్లాడుతూ.. కాసేపటి క్రితం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. కేసీఆర్, హరీశ్‌రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండగ. గొర్రెల స్కాంలో కేసీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది’’ అంటూ వ్యాఖ్యానించారు.‘‘రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీకి వినిపిస్తుందని చాలా మంది కష్టపడ్డారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటా. ర్యాక్ పాయింట్ ఏర్పాటుకు కృషి చేస్తా. మీ గొంతుకగా పార్లమెంట్లో కొట్లాడతా. రఘునందన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి. మీరు ఏ ఆపదలో ఉన్న రఘునందన్ ఉంటాడు’’ అని ఆయన చెప్పారు.వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచాం. మాజీ సీఎం కేసీఆర్ మీద కొద్దిసేపటి క్రితం ఈడి వచ్చింది. దుబ్బాకలో దెబ్బ కొట్టిన అని ఆరడుగుల హరిశ్ ఎగిరిండు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్యాడర్ ముందుకు సాగాలి. జనం గుండెల్లో ఉన్నాం కాబట్టి గెలిచాం. చాయ్ అమ్మిన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు’’ అని రఘునందన్ అన్నారు. -
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు. -
మెదక్ అభివృద్ధి కోసం పని చేస్తా: ఎంపీ రఘునందన్ రావు
-
గెలుపు పై మాటల యుద్ధం
-
మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం
మెదక్: మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పరిపాటి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలోకి దిగిన ఓటమిపాలయ్యారు. -
రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్లు కొనుగోలు చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారికి బీజేపీ నేత రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి అక్రమాలకు పాల్పడిందని ఆరో ³ంచారు. మంగళవారం ఈ మేరకు సీఈఓను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు పత్రం అంద జేశా రు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియా తో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ద్వారా డబ్బు పంపించిన అకౌంట్, పాన్ కార్డు వివరాలు అందజేసినట్టు తెలిపారు.వాటి ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరినట్టు తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఆదాయపన్ను మినహాయింపు పొందిన బీఆర్ఎస్ బ్యాంక్ ఖాతా ద్వారా రూ.30 కోట్లు పలువురు నాయకులకు బదిలీ చేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడిందన్నారు. డబ్బు పంచి ఓట్ల కొనుగోలుతో ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎమ్మె ల్యేలపై చర్యలతోపాటు బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని బీజేపీ తరఫున కోరినట్టు తెలిపారు. ఏ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించారో, తిరిగి ఓట్లు కొనుగోలుకు ప్రయత్నించారో ఆ అకౌంట్ వివరాలు సీఈఓకు అందజేశామ న్నారు. తాను అందజేసిన వివరాలు, సమాచారాని కి అనుగుణంగా చర్యలు తీసుకోక పోతే ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి బీఆర్ఎస్ అకౌంట్ డిటైల్స్, ఆదాయపు పన్ను మినహాయింపు పొందిన ఆ పార్టీ పాన్ కార్డు వివరాలు అందజేస్తామన్నారు. -
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర లేపి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు ఈ డబ్బు బదిలీ చేసిందని తెలిపారు.ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్‌ను కూడా తాను రాసిన లేఖకు జతచేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తుందని అన్నారు. వెంటనే అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని కోరుతున్నామని రఘునందన్ రావు అన్నారు.రాష్ట్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు. -
ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మజ్లిస్ అంటే భయం మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ది నయవంచన: రఘునందన్‌రావు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహరా ఇండియా బాధితుల నిరసన సహరా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. -
బీజేపీ నేత రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మోదీ ఫొటోలతో ముద్రించిన శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచుతున్నారంటూ బీజేపీ నేత రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రఘునందన్‌రావును పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కాంగ్రెస్ నేతలు కోరారు. కాగా, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు గత నెల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పరుష పదజాలంతో మాట్లాడి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
2014 నుంచి ట్యాపింగ్‌లపై విచారణ జరిపించాలి: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయిన 2014 జూన్ 2 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ జరిపించి.. తప్పు చేసిన వారిని శిక్షించాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తాను ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమాజం ఎదుట ఇన్ని ఆధారాలు పెట్టినా కూడా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని, అన్ని తెలిసి కూడా సీఎం సగం మాత్రం బయటపెట్టడం కూడా సరికాదన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. 2015లో జరిగిన ఓటుకు కోట్లు కేసులో జరిగిన రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టి 2016 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ అని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్ల కేసుపై కూడా విచారణ జరిపితేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు. 2015లో జరిగిన తన టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ‘రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఎస్ఐబీలో ఉన్నది ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్... రేవంత్‌రెడ్డి ఇవ్వన్ని ఎందుకు దాచిపెడుతున్నారో సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బయటపడిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో అప్పటి సీఎం, అప్పటి డీజీపీలను ఎందుకు ముద్దాయిలుగా చేర్చడం లేదని ప్రశ్నించారు. నిజంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ పేరును ఎందుకు ఇందులో చేర్చడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి ముద్దాయిగా కేసీఆర్, ఆ తర్వాత హరీశ్‌రావు, వెంకట్రాంరెడ్డి, కేటీఆర్, నవీన్‌రావు, సందీప్రావుల పేర్లు వరుసగా చేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల అవగాహనతోనే విచారణ ప్రస్తుతం ఈ కేసు విచారణ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య కుదిరిన అవగాహనతోనే జరుగుతోందని రఘునందన్‌రావు ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో రూ.3.5 కోట్లు పట్టుకున్నా, ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అయినా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అని ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడకు పోయాయని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలిస్తే ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో సెలెక్టివ్ విచారణ జరుగుతున్నదనే అనుమానం కలుగుతోందన్నారు. ‘దుబ్బాక ఉపఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ జరిగిందని డీజీపీకి చెప్పాను. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావును ముద్దాయిగా చేయాలని చెప్పిన. ఎందుకు చేర్చుతలేరో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంగారు దుకాణాల ఓనర్లను బెదిరించి వాళ్ల దగ్గర తెచ్చిన బంగారంతో యాదగిరి టెంపుల్ కట్టారా అని ప్రశ్నించారు. రఘునందన్‌రావుపై కేసు నమోదు సంగారెడ్డి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ.. మాటల తూటాలు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్‌ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరినొకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ ఎద్దేవా? బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు సైటెర్లు వేశారు. గులాబీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయన్నే బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయనకు నిధులెక్కడివి? బీఆర్ఎస్ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక రూ.వంద కోట్లు సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్సైట్లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు రూ.వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో రఘునందన్ ప్రశ్నించారు. ఇవి చదవండి: కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్‌కుమార్ -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ముగ్గురిపై కేసులు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగి న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకటరామి రెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి, ఈ కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, చీఫ్ జస్టిస్‌లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దుబ్బా క ఉపఎన్నికతో పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతోపాటు, తన కుటుంబసభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై చర్యలు తీసు కోవాలని కోరుతూ బుధవారం డీజీపీ ఆఫీసులో రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించాక రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరానని, ఆవిధంగా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్‌రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కొందరు ట్యాపింగ్ చేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్ సంభాషణలు విన్నారని కూడా తెలుస్తోందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు వస్తున్నందున ఆయనకు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడి న్యాయమూర్తులు తెలియజేయాలని కోరారు. -
ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడు రేవంత్: రఘునందన్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ఫోన్లూ ట్యాపింగ్ తమ ఆఫీసులో పనిచేసిన నేతలు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. 2019లో బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుంటే తమ కార్యాలయ సిబ్బందిని బంధించారని తెలిపారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి తమ వాళ్లను బంధించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఈ కేసులో ఉన్నారని తెలిసిందన్నారు కిషన్ రెడ్డి. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో మాత్రమే అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందన్నారు. అవినీతి, అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని తెలిపారు. రాజకీయ నేతలవే కాకుండా వ్యాపారస్తుల ఫోన్ల ద్వారా వ్యక్తిగత విషయాలు ట్యాపింగ్ చేశారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు కవిత పాత్ర లేకపోతే బహిరంగ చర్చకు రావాలి ‘కవిత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా?. కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలి. షెల్ కంపెనీలు పెట్టీ బినామీ వ్యక్తుల్ని పెట్టరా లేదా..? ఆప్ ప్రభుత్వంతో కవిత చర్చలు జరిపారా లేదా? రూ. వందల కోట్లు చేతులు మారాయా లేదా? అని ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కాంపై కేసీఆర్ స్పందించాలి.క విత లిక్కర్ వ్యాపారానికి, అరెస్టుకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌కు సవాల్ కవితది అక్రమ కేసు అనుకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా..?. కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు ఆడటంలో అగ్రగాములు. కడిగిన ముత్యంలా తిరిగి వస్తా అని కవిత అన్నారు. ఎందులో కడిగించుకొని వస్తారో చెప్పాలి. సికింద్రాబాద్‌కు కేంద్రమంత్రిగా ఎం చేశానో ప్రజలకు తెలుసు. కేటీఆర్‌కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్‌లో నేనూ బాధితుడినే: రఘునందన్ రావు 2 జూన్ 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ , 2015 ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ రెండో బాధితుడు రఘునందన్ రావు. బీజేపీ నేత BL సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరుపుతారా? మీకు చిత్త శుద్ధి ఉందా సీఎం రేవంత్?. మీ బిడ్డ పెళ్లికి పేరోల్ మీద బయటికి వచ్చారు. మీరు అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత డీజీఏపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? కేసీఆర్@ A1 అమెరికాకి ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు పంపారు తెలియాలి. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఏంతకు కొన్నారు తెలియాలి. సీఎం రేవంత్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. మీకు నచ్చినట్టు విచారణ జరిపిస్తే ఎలా? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు, కేసీఆర్‌కు తెలియదా? ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్‌ను పెట్టాలి. రెండో ముద్దాయి హరీష్ రావుని పెట్టాలి. మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. ఆ తర్వాతే మిగతా పోలీస్ ఆఫీసర్లు. మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన కేసీఆర్‌ను ముద్దాయిగా చేర్చాలి. కుటుంబ సభ్యుల ఫోన్లు వినే అధికారం ఎవరికి లేదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి. ఓ టీవీ ఛానెల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంతకీ దిగజారుతారా?. నేను బాధితుడిగా మాట్లాడుతున్నకేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి. రేవంత్‌తో హరీష్‌రావు విమాన ప్రయాణం? నిన్న మాజీ మంత్రులు ముగ్గురు రహస్య సమావేశం అయ్యారు. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 19 మార్చి రాత్రి 10.15కి సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారు. విమానంలో రెండు గంటలు ఇద్దరు ఏం మాట్లాడారో తెలియాలి. సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య ఏం సంభాషణ జరిగింది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ గురించి చర్చ జరిగిందా?. 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి వస్తాను అన్నావా?. మెదక్ ఎంపీ ఎన్నికల వరకు మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి తోసుకోకుమని చెప్పావా?. అసలేం మాట్లాడారో తెలియాలి. సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్లను అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే ముగ్గురు విదేశాలకి పారిపోయారు అంటున్నారు. వీళ్ళని కూడా విదేశాలకు పొమ్మంటున్నారా?. 2015లో డీజీపీ ఎవరో అతన్ని విచారించాలి. హైకోర్టు జడ్జీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక సంస్థ నుంచి ఎత్తుకు వచ్చారు. ఈ కేసులో అందరిని ముద్దాయిలుగా చేర్చాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు సైతం.. ఈ కేసులో కొందరిని ఇరికించి కొందరిని కాపాడే కుట్ర జరుగుతుంది. సీఎం రేవంత్, డీజీపీ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. నాకు నోటీస్‌లు పంపిస్తే నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా నిజాలు తెలుస్తారా సీఎం చెప్పాలి. ట్యాపింగ్ జరగపోతే కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? బీఎల్ సంతోష్‌ను అనవసరంగా కేసులో ఇరికించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతాం అంటే కేసీఆర్ బెదిరించి ఇలా ప్లాన్ చేశారు. బీఎల్ సంతోష్ కేసులో ఆడియో, వీడియోలు కేసీఆర్ చూపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఇవన్నీ కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ఈకేసుని విచారణ చేయాలి. సీబీఐపై నమ్మకం ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. అందరూ అధికారులు మళ్ళీ మీ చుట్టే చేరుతున్నారు సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలి’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి.. రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారినవారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీటు ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు.. లేదంటే లేనట్లా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీటిచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచింది.. లేకుంటే మంచిది కాదు. ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పార్టీకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ తప్ప.. ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరం. ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీ, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీపై ఈ వ్యాఖ్యలు పొరపాటున వ్యాఖ్యానించారని భావిస్తున్నా. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేదీలేంటి?. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడాతారని చెప్పారు. మా పార్టీలో చాలారోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడంలేదు. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలేవి?. సర్వే నంబర్ 343లో ఉన్న ప్రభుత్వ భూమిఎంత? ఎన్నిఫ్లోర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చారు?. కడితే ఎంత ఖర్చవుతుంది.. అమ్మితే ఎంత వస్తుంది?. గత ప్రభత్వ హయాంలో ఏం చేశారు.. ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయి. అసలు ఏరకంగా మీరిద్దరూ కలసి ఎన్నికలకు కమర్షియల్ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది వారే. భూమికి భూమి ఎక్కడా ఇవ్వలేదు.. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు. 25 ఫ్లోర్లకు అనుమతులిస్తే.. 33 ఫ్లోర్లు అయ్యాయి. పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో గుట్టలు కొడతారా? గుడులు మింగుతారా? ఏఐసీసీకి లేఖ రాస్తామని? చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు? జితేందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? కంపెనీల ప్రయోజనాలు ఏంటి?. ఎన్నికలకు మీరు పంపిచే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితాలో కేవలం జితేందర్ రెడ్డి కుమారుడి ఒక్కరి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా?. షేక్‌పేటలోని సర్వే నంబర్ 403ఒక సంచలనం. అందులో ఎలా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి.. వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనే అంశాలపై విచారణ జరగాలి. వారు చేసే అడ్డగోలు దందాపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జితేందర్‌రెడ్డి వెంట్రుక కూడా కొనలేరని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇప్పుడున్న స్పీకర్ గతంలో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ.500 కోట్ల స్కామ్‌లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి ఆర్థిక నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు పంపించే డబ్బు సంచులతోనూ అప్రమత్తంగా ఉండాలి’ అని రఘునందన్ రావు అన్నారు. -
బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం గురువారం విడుదల చేసింది. ఇటీవల హర్యానా సీఎం పదవికి అనూహ్య రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1) ఢిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20),, త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు.. మహబూబ్‌నగర్: డీకే అరుణ మెదక్: రఘునందన్ రావు ఆదిలాబాద్: నగేష్ మహబూబాబాద్ : సీతారాం నాయక్ నల్గొండ : శానం సైదిరెడ్డి పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ రెండో జాబితాలో ప్రముఖులు బీజేపీ రెండో జాబితాలో పలువురు కేంద్ర మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, కేంద్ర సమాచారం బ్రాడ్‌కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు అవకాశం ఇచ్చింది. వీరితోపాటు కర్ణాటక మాజీ సీఎం, షిగ్గావ్ ఎమ్మెల్యే బసవరాజ్ బొమ్మెకు ఈసారి ఎంపీగా చాన్స్ ఇచ్చింది. హవేరి నుంచి ఆయన లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్రావత్ బరిలో నిలిపింది. నితిన్ గడ్కరీ- నాగ్‌పూర్(మహారాష్ట్ర) పీయూష్ గోయల్- ముంబై నార్త్(మహారాష్ట్ర) ప్రహ్లాద్ జోషి, ధార్వాడ్(కర్ణాటక) అనురాగ్ ఠాగూర్- హమిర్పూర్( హిమాచల్ ప్రదేశ్) మనోహర్‌లాల్ ఖట్టర్- కర్నాల్( హర్యానా) లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. -
కడియంను బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కి బడుగులు, దళితులు గుర్తుకు రాలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్.రఘునందన్‌రావు మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా సీనియర్ నాయకుడు, దళితనేత కడియం శ్రీహరిని ఎన్నుకోవాలని ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సూచించారు. ‘కేసీఆర్‌కు ఎలాగూ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్‌గా దళితుడిని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒక బీసీని చేయాలని సూచించారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు ఇప్పుడు జ్యోతిబా పూలే గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. కవిత ఉన్నా లేకపోయినా పూలే గుర్తుంటారని, ఇందుకోసం వారు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కవితకు, ఆమె ఫ్యామిలీకి పబ్లిసిటీ అంటే అంత పిచ్చి ఎందుకని అన్నారు. శాసనసభలో కేటీఆర్, హరీశ్ కనపడాలని, తెలంగాణ భవన్లో కేసీఆర్, మండలి లో కవిత కనపడాలంటే ఎలా అని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు జరుగుతోంది: రఘునందన్ రావు
-
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు జరుగుతోంది: రఘునందన్ రావు
-
‘BRS ఎమ్మెల్యేలది బలవంతపు ప్రెస్‌మీట్’
హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యేలు మీడియా ద్వారా వివరణ ఇచ్చిన వేళ.. బీజేపీ నేత రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. ఇవాళ బలవంతంగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యేంతా బీఆర్ఎస్ను వీడడం ఖాయమని అన్నారాయన. తాజా పరిణామలపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు రగిలింది. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబట్టుతోంది. అందుకే హరీష్ రావు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. హరీష్‌రావుకు తెలియకుండానే ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిశారా?. ఆయన అనుమతితోనే వాళ్లు కలిశారు. ఇవాళ బలవంతంగా వాళ్లతో ప్రెస్‌మీట్ పెట్టించారు. కానీ, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ కావడం ఖాయం’’ అని అన్నారాయన. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతోందని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ జీరో కాబోతోందని రఘునందన్ అన్నారు. ప్రోటోకాల్ కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించారా? అని నిలదీశారాయన. హిస్టరీ రిపీట్ అవుతది ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 26 మంది అయిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. గతంలో గులాబీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఎలా లాక్కుందో.. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అలాగే గుంజుకుంటుంది అని రఘనందన్ జోస్యం పలికారు. -
కేటీఆర్, హరీశ్‌రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావుపై ఫైరయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నేతల మాటల ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లడారు. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నాగా మిగులుతుందని అన్నారు. బీజేపీపై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి -
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కల్వ కుంట్ల కుటుంబంలోని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్, ఎంపీ సంతోష్ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు సవాల్ విసిరారు. వీరంతా పోటీచేసినా ఓటమి చెందుతారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోవడం ఖాయమన్నారు. శనివారం రఘునందన్‌రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఉందా.. అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలకు పార్టీ సత్తా ఏంటో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడ తామన్నారు. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు అమ్ముకోవడం బీఆర్ఎస్కు అలవాటు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా రూ.వందల కోట్లు సమర్పించుకున్న వారికే టికెట్లు అమ్ముకోవడం బీఆర్ఎస్ అధినా యకులకు అలవాటని రఘునందన్ ఆరోపించారు. పార్టీనే నమ్ము కున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరని వ్యాఖ్యా నించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న ప్పుడే తెలంగాణతో ఆ పార్టీ పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే హుస్సేన్ సాగర్‌లో వేసినట్టేనన్నారు. ఆ విషయంపై హరీశ్ సమాధానం చెప్పాలి కేఆర్ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అప్పజెప్పడం వల్ల నష్టం జరుగుతుందంటూ, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటివాటా లభ్యం కాదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడడం సరికాదని రఘునందన్ అన్నారు. 2014–2019 మధ్య నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమ క్షంలో... కృష్ణానదీ జలాల పంపకాల సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరై 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చా లని సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..? అని నిలదీశారు. ఈ విషయమై హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌కు ఈ విషయాలు తెలియవా అని నిలదీశారు. -
కేసీఆర్ పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ, నేతలపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే(1999) మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్.. అయిదుగురు పోటీ చేయాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. వీరెవరు పోటీ చేసినా గెలవరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే హుస్సేన్ సాగర్‌లో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్నారు. చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: కేటీఆర్ కేసీఆర్‌ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవిలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులి కాదు, పిల్లి అంతకన్నా కాదు. ఎలుక అంటూ ఎద్దేవా చేశారు. బయటకు వచ్చేది పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అంటూ కేసీఆర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు రఘునందన్‌రావు. ‘గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా సూట్ కేసులు ఇచ్చే వాళ్లకు టికెట్లను ఆ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు టికెట్ల ఇవ్వరు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు లోక్ సభ సీటు ఇవ్వగలరా?. బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని గుర్తుచేశారు. గతంలో ప్రధాని మోదీ తెలంగాణ వస్తే అప్పటి సీఎం కేసీఆర్ మొహం చాటేశారు’ అని గుర్తుచేశారు. -
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎంకున్న అభ్యంతరాలేమిటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. అందుకు సీఎంకి ఉన్న అభ్యంతరాలేమిటి? సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని నిలదీశారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు... మేడిగడ్డ అందులో చిన్న భాగం మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వరకే పరిమితం చేయా లని కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కేసును పక్కదారి పట్టించడమే అవుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో టీపీసీ సీ అధ్యక్షుడిగా రేవంత్ కేంద్రానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేశారని గుర్తుచేశారు. తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి రేవంత్ లేఖ కూడా రాశారని చెప్పారు. ఇప్పుడు సీఎం హోదా లో తన దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐకు, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కథ కంచికి చేర్చాలనే కుట్ర కాంగ్రెస్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కథ కంచికి చేర్చాలని చూస్తోందని రఘునందన్ ఆరోపించారు. ఈ ప్రాజె క్టు అవినీతి విషయంలో గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ పలు దఫాలుగా ఉత్తరాలు రాసిందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 20న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని లేఖ వచ్చిందన్నారు. ఈ లేఖకు ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా.. తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ వరకే విషయా న్ని పరిమితం చేస్తున్నారని, ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థపైకి మాత్రమే నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. -
'పెన్షన్లు కాదు.. నౌకర్లు కావాలి' : ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు
సాక్షి, మెదక్: చదువుకున్న బిడ్డలకు నౌకర్లు కావాలే గాని.. పెన్షన్లు కాదని .. ఇంట్లో పిల్లలకు కొలువులు వస్తే పెన్షన్లకు ఆశపడే అవసరం ఎందుకు ఉంటుందో తల్లిదండ్రులు ఆలోచించాలని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కోరారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పారు. అలాగే దౌల్తాబాద్, తొగుట మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యోగాలు వస్తే కుటుంబాలు ఆర్థికంగా బాగుపడుతాయి తప్పా ప్రభుత్వాలు ఇచ్చే స్వార్థపూరిత కానుకలతో కాదన్నారు. నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పకుండా సాగనంపుతారన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు! రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ కల్లబొల్లి మాటలు, కథలు చెబుతున్నాడని.. వాటిని ప్రజలు నమ్మి మళ్లీ మోసపోవద్దని రఘునందన్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మరోసారి ఆశీర్వదించండి.. పేదలు, నిరుద్యోగులు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాల తరఫున పోరాడుతున్న తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని రఘునందన్‌రావు కోరారు. నిరుద్యోగులు, అంగన్వాడీలు, వీఆర్ఏ, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయపరంగా దక్కాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నానని, వారితో కలిసి ధర్నాలు, ఆందోళనలు ప్రత్యక్షంగా చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో సైతం పేదలు, నిరుద్యోగులతో పాటు చాలా సమస్యలపై గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. ప్రశ్నించే గొంతుకను.. కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మళ్లీ అసెంబ్లీకి పంపిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసమే నా తపన.. ‘దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా తపన, ఆవేదన, ఆకాంక్ష’ అని రఘునందన్‌రావు అన్నారు. నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురొడ్డి న్యాయపరంగా దక్కాల్సిన నిధులు వచ్చేలా పోరాడుతున్న విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. తాను గెలిచిన 3 ఏళ్లలో నియోజకవర్గంలో ఎంతో మార్పు వచ్చిందో.. అభివృద్ధి ఎలా పరుగెత్తింతో గమనించి మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ సారి దుబ్బాకను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే ఆగమవుతాం! దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేసి ఆగం కావద్దని మాధవనేని రఘునందన్‌రావు కోరారు. సోమవారం మాచిన్పల్లి, చెట్లనర్సంపల్లి, అప్పాయిపల్లి గ్రామాలతో పాటు తొగుట మండలంలోని వర్ధరాజుపల్లి, కాన్గల్, గుడికందుల గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. ఇంటింటి ప్రచారం! చేగుంటతో పాటు రుక్మాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఉపసర్పంచ్ రాంచంద్రం సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మ్యాకల రమేశ్, బాలరాజు, నవీన్, స్వామి, ముత్యం, సిద్దిరాములు, శ్రీరాం సిద్దిరాంలు, గణేష్, లావణ్య పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: 'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్‌రెడ్డి -
దుబ్బాకలో నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది..!
దుబ్బాకటౌన్: సీఎం కేసీఆర్‌కు వైన్స్ టెండర్లపై ఉన్న ప్రేమ కొలువుల నోటిఫికేషన్లపై ఎందుకు లేదని.. ఇంతటి దుర్మార్గమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు బీజేపీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని భూంపల్లి–అక్భర్పేట, రాయపోల్ మండలాల్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబపాలనకు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడటం ఖాయమైందన్నారు. రాష్ట్రంలో ఏం మిగులకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ఇప్పటికే తాగుబోతుల రాష్ట్రంగా మర్చారని, మళ్లీ గెలిస్తే పేదల భూములు సైతం ఏం మిగుల్చరన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడ వేయలేదని, పెట్టిన పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించకుండా పేపర్లు లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క శాతం ఉన్న సీఎం కులానికి ఐదు మంత్రి పదవులా..? కేసీఆర్ కేబినెట్లో కేవలం ఒక్క శాతం ఉన్న తన కులానికి ఐదు మంత్రి పదవులు ఇచ్చి.. 23 శాతం ఉన్న ఎస్సీలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చాడని.. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల బాగు కోసమే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. 2020 ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో సహా మొత్తం కేబినెట్, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులందరూ కలిసి నన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారని.. కానీ చైతన్యవంతమైన దుబ్బాక గడ్డ మీద పుట్టిన ప్రజలు నన్ను గెలిపించి తమ పౌరుషాన్ని చూపారన్నారు. మూడేళ్లు తనకు అధికారం ఇస్తే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు తెచ్చానని తెలిపారు. రాష్ట్ర ఖజానా అంతా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకే ఖర్చుపెట్టి మిగతా నియోజకవర్గాలకు చాలా అన్యాయం చేశారన్నారు. హరీశ్‌ను దుబ్బాక ప్రజలు నమ్మరు హరీశ్‌రావును దుబ్బాక ప్రజలు నమ్మరని.. ట్రబుల్ షూటర్ అని గొప్పలు చెప్పుకునే ఆయనకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని.. మళ్లీ ఓటమి రుచి చూపుతామని రఘునందన్‌రావు అన్నారు. ఉన్న నిధులన్నీ సిద్దిపేటకే తీసుకుపోయి దుబ్బాక నియోజకవర్గానికి తీరని అన్యాయం చేస్తుంది హరీశ్‌రావే అన్నారు. నన్ను ఓడగొట్టేందుకు ఆయన చేస్తున్న కుట్రలు చాలా ఉన్నాయని, ఎన్ని చేసినా ప్రజల మద్దతుతో తిప్పిగొట్టి భారీ మెజార్టీతో గెలుపొందుతానన్నారు. ఎంపీగా ఉండి దుబ్బాకకు ఏం చేసిండు రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిండో ప్రజలు గమనించాలని రఘునందన్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి జరిగితే తామే చేశామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభాకర్‌రెడ్డికి ఓట్లేస్తే పరాయి పెత్తనం సాగుతుందని, దుబ్బాక కోసం బరిగీసి కొట్లాడే నన్ను గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా.. దుబ్బాకరూరల్: ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం భూంపల్లి–అక్భర్పేట మండలంలోని చౌదర్పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయడం చూస్తేనే బీఆర్ఎస్ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలన్నారు. రాయపోల్ మండలంలో..| రాయపోల్ః తన స్వగ్రామం బోప్పాపూర్, రాయపోల్ మండలం టెంకంపేట, బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో మహిళలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరీశ్ దుబ్బాకపై పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులన్నీ సిద్దిపేటకే తరలించుకుపోయి తీరని అన్యాయం చేశాడన్నారు. పొలంపల్లిలో ఇంటింటి ప్రచారం చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు రఘునందన్‌రావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, వరి క్వింటాలుకు రూ.3100 మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా మాభూమి పోర్టల్ వస్తుందని ప్రచారంలో వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, వేణు, శ్రీకాంత్, రమశ్, ఎల్లం, గణేష్, భూపాల్, కుమ్మరి నర్సింలు, బాలకృష్ణ, స్వామి పాల్గొన్నారు. అనంతరం చేగుంట, మాసాయిపేట మండలాలకు చెందిన 200మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. ఏరులై పారుతున్న మద్యం మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పాలనలో వేసిన శిలాఫలకాలకే దిక్కుమొక్కు లేదని రఘునందన్‌రావు విమర్శించారు. అక్బర్పేట–భూంపల్లి మండలం రుద్రారంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మద్యం ఏరులై పారితే తప్ప పాలన ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు. దుబ్బాకలో ఎక్కడ కూడా దళిత బంధు అమలు కాని పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న బీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లన్నగారి శాంతవ్వ, భిక్షపతి పాల్గొన్నారు. -
దుబ్బాక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: రఘునందన్
-
ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు
పాలమూరు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనతో రఘునందన్‌రావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని, అలాంటి ఘటనలు ప్రోత్సహించే వ్యక్తిని తాను కాదన్నారు. దాడి చేసిన గటాని రాజు అనే వ్యక్తికి దళితబంధు రాలేదని ఉద్దేశంతోనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందన్‌రావు చెప్పారు. రాజు ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అతను కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు, ఇతర వివరాలు లభ్యమవుతాయని, అతని దగ్గర ఓ చానల్ ఐడీ కార్డు కూడా దొరికిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎవరెంత బురద చల్లినా దుబ్బాకలో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట సీపీ కేసు పరిశీలించి, అతని ఇతర అకౌంట్లు పరిశీలించి మాట్లాడాలి కానీ, మీరే బీజేపీ సానుభూతిపరుడని అని చెప్పడం సరికాదన్నారు. సీపీ మాట్లాడిన మాటలతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్‌రావు ఆందోళన చెందారు. పాలమూరు నుంచి నేరుగా ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చికిత్స పొందుతున్న ప్రభాకర్‌రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు. -
ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి.. రఘునందన్ రావు ఏమన్నారంటే..
సాక్షి, సిద్ధిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో నిజానిజాలు ఎంత బురద చల్లేందుకు ప్రయత్నించినా.. అదే బురద నుంచి కమలం వికసిస్తుందని తెలిపారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ దాడికి పాల్పడితే తనే స్వయంగా అలాంటి వాడిని పోలీసులకు అప్పచెబుతానని అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్ రిపోర్టర్ అని, దళితబంధు రాలేదనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చిందని తెలిపారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డి మిత్రుడు, ఆయన్ను పరామర్శిస్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి అనంతరం ఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని రఘునందన్ రావు తీవ్రంగా పరిగణించారు. ఈ హింసాత్మక ఘటనలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి నిరసనలకు ఎవరు అనుమతి ఇచ్చారో సిద్దిపేట కమిషనర్ వెల్లడించాలని అన్నారు. ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని ఆసుపత్రికి వెళ్లి అతని పరామర్శిస్తానని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్‌ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఓపెన్ సర్జరీ చేస్తున్నారు. -
ఒకేరోజు 1,603 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆశావహుల నుంచి వెల్లువలా దరఖాస్తుల సమర్పణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శనివారం ఒక్కరోజే 1,603 మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో గత ఆరు రోజుల్లో మొత్తం అందిన అప్లికేషన్ల సంఖ్య 3,223కు చేరుకుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆదివారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. శనివారం దరఖాస్తులిచ్చిన వారిలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు (తమ ఆఫీసు ప్రతినిధి ద్వారా అందజేత), శేరిలింగంపల్లికి గజ్జల యోగానంద్, రాజేంద్రనగర్ నుంచి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, షాద్‌నగర్‌కు మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి, సనత్‌నగర్ సీటుకు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, జనగామ నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు బేజాది బీరప్ప, పాలకుర్తి టికెట్ కోసం సీనియర్ జర్నలిస్ట్ యెడ్ల సతీష్ కుమార్ తదితరులున్నారు. ఆదివారంతో దరఖాస్తుల స్వీకారం ముగుస్తున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నేతల చేరిక, బీజేపీ నుంచి ముఖ్యనేతల పోటీకి సంబంధించి కొన్ని స్థానాలకు అభ్యర్థుల ఖరారుకు ఇంకా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అందువల్ల ఇతర పార్టీల నుంచి బలమైన నేతలొచ్చే కొన్ని నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని పార్టీ కీలక నేతలకు సంబంధించి దరఖాస్తులు లేకుండానే ఆయా స్థానాలకు వారి అభ్యర్థిత్వాలను పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా వలస నేతలతోపాటు పార్టీ ముఖ్య నేతలకు కొంత వెసులుబాటు ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ వంటివి ఎన్నికల దాకా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగనుందని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను ఎంపిక చేయాలని కోరుతూ ఆ పార్టీ గజ్వేల్ నేతలు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం సమరి్పంచారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్‌రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్‌మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్‌చేసి టాస్క్‌పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్‌గా స్పందించారు. శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్‌గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్‌రావు. -
బీజేపీలోనే ఉంటా.. పోటీ చేసేది అక్కడి నుంచే: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక, మరికొందరు నేతలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, రఘునందన్ ఈ వార్తలపై స్పందించారు. పార్టీ మార్పు వార్తపై తాజాగా రఘునందన్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్‌లో ఏం అభివృద్ధి చేశారో చూద్దామని పిలుపునిస్తే ముందురోజే తమను అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కామారెడ్డి నుంచి బస్సులు పెట్టుకుని గజ్వేల్ వస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. ఇక, ఏదోఒక రోజు సమయం చూసుకుని, డేట్ చెప్పకుండా గజ్వేల్‌కు వస్తానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గజ్వేల్ బస్ స్టాండ్ ఎలావుందో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఉన్నాయో చూస్తామన్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండదు. ఈ విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రేవంత్ Vs కవిత.. మాటల వార్తో దద్దరిల్లిన ట్విట్టర్ -
బీజేపీ ‘చలో గజ్వేల్’ భగ్నం
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట జరిగిన వనరుల విధ్వంసాన్ని ప్రజలకు చూపించడం కోసం బీజేపీ చేపట్టిన ‘చలో గజ్వేల్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరమణారెడ్డిని ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం నుంచి భారీసంఖ్యలో బీజేపీ శ్రేణులు వెంకటరమణారెడ్డి ఇంటికి తరలిరాగా, వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. దీంతో జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. వెంకటరమణారెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ బిచ్కుంద పోలీస్‌స్టేషన్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేశారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆందోళన చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కారులో హైదరాబాద్ నుంచి బిచ్కుంద పోలీసుస్టేషన్‌కు బయలుదేరగా పెద్దకొడప్గల్ మండలకేంద్రం శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడుచుకుంటూ పెద్దకొడప్ గల్‌కు చేరుకుని రెండుగంటలపాటు నిరీక్షించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. పోలీసులు సాయంత్రం వెంకట రమణా రెడ్డిని విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గజ్వేల్‌లో అక్రమాలు వెలుగులోకి వస్తాయని, సీఎం చెబుతున్న అభివృద్ధికి సంబంధించిన గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. -
అసెంబ్లీలో డీకే అరుణకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: గద్వాల నియోజకవర్గంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన కోర్టు.. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ అందించి.. తనను ఎమ్యెల్యేగా గుర్తించాలని కోరేందుకు శుక్రవారం అసెంబ్లీకి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లారు. గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శి కి అందించడానికి వెళ్లారామె. అయితే ఆ సమయంలో కార్యదర్శితో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా అందుబాటులో లేరు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ‘‘ 24న ఈ తీర్పు వచ్చింది, ఆర్డర్ కాపీ తో స్పీకర్ ను కలవడానికి వస్తే.. స్పీకర్, కార్యదర్శి ఇద్దరూ లేరు. నిన్న సాయంత్రం ఫోన్ చేశాను. మెసేజ్ కూడా పెట్టాను. రోజూ అసెంబ్లీకి వచ్చే కార్యదర్శి ఇవాళ మాత్రం ఎందుకనో రాలేదు.కార్యదర్శి పై ప్రభుత్వ ఒత్తిడి ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం ఉంది స్పీకర్ దగ్గర సమావేశం ఉందని కార్యదర్శి వెళ్లారట. ముందు సమాచారం ఇచ్చిన వీరిద్దరూ లేకపోవడం బాధాకరం. అందుకే కోర్టు ఆర్డర్ కాపీని స్పీకర్ పేషీలో ఇచ్చాం. అసెంబ్లీ స్పీకర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పును అమలు చేయాలి. ఈ తీర్పు నాలుగేళ్ల కింద వస్తె నా గద్వాల ను అభివృద్ది చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ చాలా ఆలస్యంగా ఈ తీర్పు వచ్చింది ఎన్నికల సంఘాన్ని కలుస్తాం ‘‘గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే గా డీకే అరుణ తీర్పు వచ్చింది. దీనిపై సోమవారం భారత ఎన్నికల ప్రధాన అధికారి ని కలుస్తాం. డీ కే అరుణ విషయంలో వచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది’’అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. -
లెక్క మారిన రఘునందన్
-
దుబ్బాక నియోజకవర్గం పాలకవర్గం ఎవరిది..?
దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను 1079 ఓట్ల తేడాతో ఓడిరచి సంచలనం సృష్టించాడు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఐ అభ్యర్థి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డికి 22196 మాత్రమే ఓట్లు వచ్చి డిపాజిట్ కొల్పోయాడు. 2018లో రామలింగారెడ్డి 66421 ఓట్ల మెజార్టీ తెచ్చుకోగా ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ 1079 ఓట్ల తేడాతో బిజేపి చేతిలో ఓటమి చెందడం విశేషం. ఎం.రఘునందన్‌రావు రెండుసార్లు అసెబ్లీకి పోటిచేసి ఓటమిచెంది మూడోవ సారి ఉప ఎన్నికల్లో నెగ్గారు. మాజీ జర్నలిస్టు అయిన దివంగత రామలింగారెడ్డి 2004, 2008 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికలలో గెలిచారు. మొదట దొమ్మాటగా ఉన్న ఈ నియోజకవర్గం, 2009 నుంచి దుబ్బాక కేంద్రంగా నియోజకవర్గం అయింది. 2018లో సోలిపేట రామలింగారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది నాగేశ్వరరెడ్డిపై 66421 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయన తెలంగాణ ఉద్యమంలో మొదట నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో ఒకరుగా ఉన్నారు. సోలిపేటకు 89112 ఓట్లు రాగా, నాగేశ్వరరెడ్డికి 26691 ఓట్లు వచ్చాయి. 2018లో ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి నేత ఎమ్. రఘునందన్ రావుకు 22 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. రెండువేల నాలుగులో మొదటిసారి టిఆర్ఎస్ పక్షాన గెలిచిన రామలింగారెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం లో భాగంగా తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. తదుపరి 2009సాధారణ ఎన్నికలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేతిలో ఓడిపోయారు. ముత్యం రెడ్డి అంతకుముందు టిడిపిలో ఉండేవారు. ఆయన కాంగ్రెస్ ఐలోకి వచ్చి గెలుపొందడం విశేషం. కాని 2014లో మాత్రం నెగ్గ లేకపోయారు. ఆ తర్వాత కాలంలో ముత్యంరెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయారు. ముత్యంరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. 1972లో దొమ్మాటలో గెలిచిన సోలిపేట రామచంద్రారెడ్డి ఒకసారి రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే మెట్రో విస్తరణ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయనే 270 కి.మీ. మెట్రో రైలు నిర్మాణం చేస్తామంటూ బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఈ మెట్రో విస్తరణ అని అందరూ అనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. తొమ్మిదేళ్లలో కనీసం పాతబస్తీలో 5.5 కి.మీ మైట్రోరైలు సదుపాయం కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం, ఒకేసారి రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తామనడం పలు అనుమానా లకు తావిస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాల యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరదలో మునిగిపోయి ప్రజ లు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటించకుండా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం మహారాష్ట్ర వెళ్లారన్నారు. -
కేసీఆర్ ఎవరి శిష్యుడు? రఘునందన్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా సీఎంల పేర్లతో మరోసారి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కిరణ్‌కుమార్‌రెడ్డి శిష్యుడంటూ చేస్తున్న ప్రచారంపైనా రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సంజయ్ గాంధీ శిష్యుడు కదా?.. నేర్చుకునేటప్పుడు ఎవరు ఎవరికైన శిష్యుడిగా ఉండొచ్చు. ఆంధ్ర సీఎంల పేర్లతో కేసిఆర్ మరోసారి పబ్భం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే పని చేయన్నోల్లు మహారాష్ట్రలో ఏమీ చేస్తారు ?. మహారాష్ట్ర స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాలు ఎన్ని? అంటూ సెటైర్లు సంధించారు రఘునందన్. నగర కమిషన్ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి హైదరాబాద్‌లో ఉంది. అసలు చిన్న వానకే ట్రాఫిక్ ఎందుకు అవుతుందని సమీక్ష చేసారా?. ఇదేనా భాగ్యనగర్ ఎదుగుదల?. మున్సిపల్ మీటింగ్‌లకు ఆ శాఖ మంత్రే హాజరు కావడం లేదు. అందుకే.. సభలో వరదల మీద చర్చ జరపాలి. రైతు రుణ మాఫీ అనేది బ్యాంకులు చేయవు. ప్రభుత్వం చేస్తుంది. రుణ మాఫీ చేయకుంటే సెక్రటేరియట్ ముందు లేదా ఆ శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఇది కాంగ్రెస్ కు తెలీదు. ఎందుకంటే.. ఇదంతా ఎన్నికల ముందు కాంగ్రెస్-బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా కాబట్టి. కార్మికులు, ఉద్యోగుల సమస్యపైనా.. తెలంగాణ వస్తే.. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని చెప్పారు కదా?. మరి మీ సొంత జిల్లాలో ఎంత మంది కాంట్రాక్ట్ కార్మికులు సంఖ్య ఎంత? పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య ఎంత? చర్చకు సిద్ధమా?. కాళేశ్వరం రుణాలపై చర్చ సభలో పెట్టండి. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు మీదా సభలో మాట్లాడాలి. ప్రతి మండలంలో పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. వాటి మీద చర్చిద్దాం. హైదరాబాద్‌లో అమ్మిన భూములు ఎంత? దాని విలువ ఎంత? ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ?. మైనారిటీ బంధు ఇస్తామంటున్నారు. రాష్ట్రంలో అధిక జనాభా బీసీ బందు ఎందుకు ఇవ్వరు?.. సర్కార్ కొలువున్నా.. హుజూరాబాద్ లో దళిత బంధు ఇచ్చారు. అదే విధంగా అన్ని నియోజకర్గాల్లోనూ ఇవ్వాలి. గృహలక్ష్మి అంటున్నరు.. అందులో కేంద్రం వాటా చెప్పరు. కట్టిన ఇళ్ళ రంగులు పోతున్నాయి..పేదలకు మాత్రం ఇవ్వట్లేదు. Ghmc లో ఎన్ని డబుల్ ఇళ్లు కావాలనే అంచనా మీకుందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారాయన. నాతో చెప్పించుకోవడం సిగ్గు చేటు మేము నిర్ణయించిన రోజులే శాసన సభ జరగాలి అనేది మూర్ఖపు ఆలోచన. ప్రతిపక్షం అంటేనే ప్రజల గొంతుక. ఎన్నికలు ఎప్పుడొస్తాయో మీకు తెలుసు. ఇవే చివరి సమావేశాలు కాబట్టి.. రోజుకో అజెండాతో శాసన సభ 30 రోజులు నడపాలి. ప్రతిపక్ష సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలు చర్చించే శాసన సభను నెల రోజులు నడపకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో కేంద్రాన్ని చూసి నేర్చుకోవాలి. సంప్రదాయాలు పాటించరు! బీఎస్సీ మీటింగ్‌కు పిలవురు. ఈ విధంగా సభ నిర్వహించడం బాధాకరం. ఉన్న ముగ్గురికి సభలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు భయమెందుకు? బలం మీదే అని అంటున్నప్పుడు.. నెలపాటు సభ నడపడానికి అభ్యంతరం ఏంటి?. నాలాంటి కొత్త సభ్యులతో ఇలాంటి సూచన చెప్పించుకోడం సిగ్గు చేటు. 30రోజులు సభ నడపాలని బీజేపీ తరపున సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నాం. నేరుగా లేఖ ఇచ్చే అవకాశం మాకు లేదు కాబట్టి మీడియా ముఖంగా ఈ లేఖ రాస్తున్నాం. కేంద్ర నిధుల మీద అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి. చర్చించేందుకు మేము సిద్ధం అని ఎమ్మెల్యే రఘునందర్ స్పష్టం చేశారు. -
తెలంగాణ బీజేపీ.. రఘునందన్, అర్వింద్‌కు కీలక బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 29వ తేదీన తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అమిత్ షా పర్యటనకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల పార్టీ నేతల్లో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పరిస్థితిని చక్కదిద్దేపనిలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి బిజీగా ఉన్నారు. ఇక, అమిత్ షా పర్యటన సందర్భంగా డాక్టర్స్, లాయర్స్, ఇంజినీర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వార్ రూమ్ ఇన్చార్జ్గా ఎవరిని పెడతారనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. స్ట్రాటజీ టీమ్ ఇన్చార్జ్గా శ్వేతా శాలిని, సోషల్ మీడియా బాధ్యతలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్, కో ఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతలకు అప్పగించారు. కాగా, దీనిపై రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే బీజేపీ హైకమాండ్‌పై రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి సీనియర్ నేతలు! -
కిషన్‌రెడ్డి ఎందుకు ఈ రాజకీయ డ్రామా?: తలసాని ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతల బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పర్యటన ఉద్రిక్తరంగా మారిన విషయం తెలిసిందే. పర్యటన సందర్బంగా బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం.. బీజేపీ పార్టీ ఆఫీసు వద్ద దింపేశారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. ఈ క్రమంలో బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తలసాని మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి అధికారికంగా వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూడవచ్చు. కిషన్‌రెడ్డి ఎందుకు ఈ రాజకీయ డ్రామా?. కిషన్‌రెడ్డి వస్తానంటే నేనే కొల్లూరు తీసుకునిపోయి చూపిస్తాను. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు మాత్రమే ఇస్తోంది. తెలంగాణకు కేంద్రం ఏం చేసింది?. మేము కట్టిన ఇళ్ల దగ్గర బీజేపీ నేతల తాపత్రయం ఎందుకు?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిందా?. ఈరోజు ఉదయం నుంచి కిషన్‌రెడ్డి డ్రామా చేస్తున్నారు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాలకు కిషన్ రెడ్డి, నేను కలిసి వెళ్లాం. కిషన్ రెడ్డి చాలా సార్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బాగున్నాయని అన్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది: కిషన్ రెడ్డి ఫైర్ -
కిషన్ రెడ్డి, రఘునందన్ అరెస్ట్
-
ఢిల్లీలోనే బండి సంజయ్.. రఘునందన్‌రావుపై చర్యలు?
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో తనను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా స్వీకరించేందుకు అయిష్టత చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోపాటు ఇతర పెద్దలకు వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. సంజయ్‌తో సునీల్ బన్సల్ భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని అంటున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు నేతల అంశాన్ని బన్సల్ వద్ద ప్రస్తావించారని.. తనతోపాటు అధిష్టానం పెద్దలపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యల విషయాన్ని వివరించారని చెప్తున్నారు. ఈ క్రమంలో రఘునందన్‌రావుపై చర్యలు తీసుకునే విషయంపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సంజయ్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో అపాయింట్మెంట్ ఉన్న కారణంగా బుధవారం ఢిల్లీలోనే ఆగి.. గురువారం హైదరాబాద్ వెళుతున్నట్టు వివరించారు. -
బండికి 100 కోట్లు ఎక్కడివి?
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు..సోమవారం పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పత్రికల్లో రూ.100 కోట్ల విలువైన యాడ్లు ఇచ్చారని, అసలు భార్య పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడివని నిలదీశారు. రెండు, మూడేళ్లయినా పార్టీలో పదవులను భర్తీ చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడు విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై వస్తున్న కథనాలు వాస్తవమేనని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఏయే పదవులు ఖాళీగా ఉన్నాయో కూడా తెలియదని విమర్శించారు. పార్టీకి ఎల్పీ నేత లేరన్న విషయమూ నడ్డాకు తెలియదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారని ధ్వజమెత్తారు. దుబ్బాకలో తనను చూసి ఓట్లేశారు తప్పితే.. పార్టీ గుర్తును చూశో, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్‌ను చూశో కాదని స్పష్టం చేశారు. తాను కోరిన పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వకుంటే తన దారి తనదేనని అల్టిమేటమ్ ఇచ్చారు. కిషన్‌రెడ్డిని కలిసిన కొద్ది సేపట్లోనే .. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీలో మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెంచిన నేపథ్యంలో పార్టీ పెద్దలతో భేటీ అయ్యేందుకు రఘునందన్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. 3 గంటల సమయంలో కిషన్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అక్కడే ఉన్న మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. అధ్యక్షుడి మార్పు విషయంలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనని, సంజయ్‌ను మార్చేందుకే అధిస్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విషయంలో సంజయ్‌ది స్వయంకృతాపరాధం అన్నారు. ‘పార్టీల ఇన్చార్జిలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్‌ల ఫొటోలు పెట్టి రూ.100 కోట్లతో పత్రికల్లో యాడ్లు వేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నా ఫోటోనో, ఈటల రాజేందర్ ఫొటోనో వేయలేదు. తరుణ్ఛుగ్నో, బన్సల్‌ను చూసి ప్రజలు ఓట్లేయరు కదా..’అని రఘునందన్ ప్రశ్నించారు. జాతీయ అధ్యక్షుడికే తెలియదంటే ఎలా..? పార్టీ శాసనభా పక్షనేత పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా దానిపై బండి సంజయ్ నిర్ణయం తీసుకోలేక పోయారని, ఈ విషయమై నడ్డాను అడిగితే.. ’అవునా..నిజమా’అంటూ తననే ప్రశ్నించారని రఘునందన్ తెలిపారు. ‘పదవుల నియామకంపై పార్టీ జాతీయ అధ్యక్షుడికే తెలియకుంటే ఎలా? అట్లుంది పార్టీ పరిస్థితి..’అంటూ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్‌లీడర్ విషయంలోనూ నాన్చుడు ధోరణినే అవలంబించారని, చివరకు ఫ్లోర్ లీడర్ పదవి అడిగిన కార్పొరేటర్ చనిపోయినా, ఇంతవరకు దానిపై నిర్ణయమే లేదని విమర్శించారు. పదేళ్లుగా కష్టపడుతున్నా.. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్నానని రఘునందన్ అన్నారు. మధ్యలో వచ్చిన నేతలు పదవులకు పనికొస్తారు కానీ నేను పనికిరానా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను సైతం అర్హుడనేనని అన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి, జాతీయ అధికార ప్రతినిధి పదవి, శాసనసభాపక్ష నేత పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తన దారి తనదేనంటూ వ్యాఖ్యానించారు. కీలక పదవులకు తనకు కులమే శాపంగా పరిణమించిందని ఆవేదన చెందారు. సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేక పోయారు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో తాను పూర్తిగా సొంత బలంతోనే గెలిచానని రఘునందన్ చెప్పారు. ‘దుబ్బాకలో నేను స్వయంశక్తితో గెలిచా. నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఇక్కడ పార్టీ గుర్తు చివరి అంశమే. మళ్లీ నా సొంత బలంతోనే దుబ్బాకలో గెలుస్తా’అని స్పష్టం చేశారు. తన గెలుపు తర్వాతే ఈటల పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి భుజంపై చేయి వేసి మరీ నేను గెలిపిస్తానని అమిత్‌షా ప్రకటించారని, కానీ గెలిపించలేకపోయారని విమర్శించారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేకపోయారని అన్నారు. -
Telangana: అసమ్మతి శ్రుతి పెంచుతున్న కమలనాథ స్వరం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర నేతలు చేస్తున్న రచ్చ, పార్టీలో ఇటీవలి పరిణామాలతో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఏర్పడి 43 ఏళ్లు గడుస్తున్నా గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదనే అభిప్రాయం కొందరు సీనియర్లలో వ్యక్తమౌతోంది. నేతల మధ్య అభిప్రాయభేదాల వంటివి ఉన్నా ఇప్పటిలా ముఖ్యనేతలు గ్రూపులుగా, వర్గాలుగా ఏర్పడటం వంటివి చోటు చేసుకోలేదు. బహిరంగ విమర్శలు, ఆరోపణలకు దిగిన సందర్భాలు కూడా లేవు. కానీ ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యులు మొదలుకుని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సైతం బహిరంగంగా, ట్విట్టర్ లేదా ఏదో ఒక పరోక్ష రూపాల్లో అసంతృప్తి గళం విన్పించడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. చల్లార్చలేదు..చక్కదిద్దలేదు..: వాస్తవానికి పలువురు ముఖ్యనేతల్లో అసంతృప్తి, సఖ్యత కొరవడడం, పాత–కొత్త నాయకుల మధ్య సమన్వయం లేమి, గ్రూపులు లేదా వర్గాలను ప్రోత్సహించే విధంగా కొందరు వ్యవహరించడం, రాష్ట్ర రాజకీయాల్లో తామే ఫోకస్లో ఉండేలా, మీడియాలో తమకే ప్రచారం లభించేలా కార్యక్రమాల నిర్వహణ వంటివి రాష్ట్ర బీజేపీలో కొన్నినెలలుగా సాగుతున్నాయి. అయినా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు అసంతృప్తిని చల్లార్చేందుకు, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర పార్టీలో సమన్వయానికి తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాష్, అరవింద్ మీనన్‌లను ఇన్చార్జిలుగా నియమించినా, వారెప్పుడూ పార్టీలోని అంతర్గత సమస్యలు, నేతల మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని కొందరు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పైగా ఒకరిద్దరు ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడల్లా వత్తాసు పలకడం, మద్దతు తెలపడం వంటివి చేయడం వల్ల కూడా పార్టీలో పరిస్థితులు దిగజారాయని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరింత గందరగోళంగా తయారయ్యాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, సరైన విధంగా స్పష్టత ఇవ్వకపోవడం కూడా కేడర్‌తో పాటు ముఖ్యనేతలను సైతం అయోమయానికి గురి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఈ నెల 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో..లేదో’ అంటూ ఆదివారం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మాటల మంటలు.. ఇటీవల ఓ దున్నపోతును వెనకనుంచి తన్ని వ్యానెక్కించే వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి.. రాష్ట్ర పార్టీకి ఇదే ట్రీట్మెంట్ అవసరమంటూ వ్యాఖ్యానించడం కలకలం సృష్టించింది. అంతకు కొన్నిరోజుల ముందే.. సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో సంజయ్‌కు అనుకూలంగా ఉండే వారితో తన నివాసంలో జితేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డిలకు జాతీయపార్టీ అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవడంపై నేతల్లో అసంతృప్తి వ్యక్తం అయినట్టు వార్తలొచ్చాయి. అంతకు ముందు ఓ జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి, ఓ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఇద్దరు మాజీ ఎంపీలు, ఓ ఎమ్మెల్యే విడివిడిగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలగజేశాయనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం, రాష్ట్ర అధ్యక్షుడి వైఫల్యాలు, పార్టీలో చేరికలు లేకపోవడం, ముఖ్య నాయకత్వం ఒంటెద్దు పోకడలు, ఇతర అంశాలపై చేసిన వ్యాఖ్యలు వారిలోని అసంతృప్తిని బహిర్గతం చేశాయని అంటున్నారు. ఇక ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డాలతో ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డి ప్రత్యేక భేటీల సందర్భంగా, హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నడ్డాతో పలువురు ముఖ్యనేతలు సమావేశమైనప్పుడు కూడా నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నడ్డాతో జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు విడివిడిగా సమావేశమై తమ అసంతృప్తికి గల కారణాలను, పార్టీలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులను గురించి విడమరిచి చెప్పినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. తాజాగా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఢిల్లీలో అసంతృప్తి స్వరం తీవ్రస్థాయిలో విన్పించడం బీజేపీలో మరోమారు కలకలం రేపింది. తనకు తగిన ప్రాధ్యానత, గుర్తింపు లభించడం లేదని పేర్కొంటూ ప్రధాని మోదీ మినహా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలపై విమర్శలు గుప్పించడం గమనార్హం. జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అగ్రనేత అమిత్‌షాల తీరుపై సైతం ఆయన వ్యాఖ్యలు చేయడం పార్టీ కేడర్‌ను విస్మయానికి గురి చేసింది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో నెలకొన్న పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని పలువురు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు: రఘునందన్
ఢిల్లీ: తాను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. తాను పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను పార్టీ నాయకత్వాని ధిక్కారించేవాడిని కాదని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటానని తెలిపారు. తాను ఢిల్లీలో అసలు ప్రెస్‌మీట్ పెట్టలేదని, తనకు కీలకమైన పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. గత రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ఉన్నానని, దుబ్బాక నియోజకవర్గానికి నిధులు కోసం వచ్చానని క్లారిటీ ఇచ్చారు రఘునందన్. అయితే పార్టీలో పదవులు కోరుకోవడం తప్పుకాదన్నారు. చదవండి: ప్రతీ పార్టీ లెక్క చెప్పాల్సిందే.. ఎన్నికల సంఘం కొత్త ఆన్లైన్ పోర్టల్ -
మూడు పదవుల్లో ఏదిస్తారు?: రఘునందన్ అల్టిమేటం
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన వేళ.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఢిల్లీలో తిష్ట వేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఉన్న పదవి ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని పట్టుబట్టుకు కూర్చోన్నారు. ఈ మేరకు మీడియాతో చిట్‌చాట్ నిర్వహిస్తూ తన ఆసక్తిని తెలియజేశారు రఘునందన్. ‘మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వండి. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు. రెండు నెలల్లో బిజెపి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తది. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా. మునుగోడులో రాజగోపాల్ ను గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారు. దుబ్బాకలో నా కష్టంతోనే గెలిచాను. పార్టీ సింబల్ అనేది చివరి అంశం. నాకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా. రెండేళ్లుగా జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్లను నియమించలేకపోయారు. శాసనసభ పక్ష నాయకుడిని కూడా నియమించలేకపోయారు. పార్టీని నడిపేది ఇలాగేనా?, నేను మూడు పదవులు ఆశిస్తున్నాను. ఒకటి జాతీయ అధికార ప్రతినిధి, రెండు బీజేపీ శాసనసభ పక్ష నేత , మూడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదో ఒకటి ఇస్తారని భావిస్తున్నా. లేదంటే నా దారి నాదే’ అని వ్యాఖ్యానించారు. చదవండి: పాత మిత్రుల కౌంటర్ల ఎపిసోడ్‌కు శుభం కార్డు.. ‘ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టమంటూ.. -
కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్
-
మమ్మల్నెందుకు పట్టించుకోరు.. బీజేపీలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనేంత స్థాయి వరకు నేతలు గళం విప్పుతున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వాల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో అధికమౌతున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు సైతం ఈ తరహా నేతల జాబితాలో ఉండటం గమనార్హం. వారితో మాట్లాడి.. మమ్మల్ని విస్మరించారు! పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డిలు అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఇటీవల వారిని ఢిల్లీ పిలిపించి బుజ్జగించింది. ఈ నేపథ్యంలో మరికొందరు ముఖ్యనేతలు.. తమ అసంతృప్తిని తెలుసుకునేందుకు నాయకత్వం ఎందుకు ప్రయత్నించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ద్వారా పార్టీకి పెద్ద ఊపు తెచ్చిన తనను ఎమ్మెల్యేగా, ముఖ్యనేతగా పరిగణించకుండా రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్ ఫైర్.. రాష్ట్ర అధ్యక్షుడి తీరును, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి పలుమార్లు అమిత్‌షా, నడ్డాలకు తెలియజేసినా ఓపిక పట్టాలనే సూచన తప్ప సమస్య పరిష్కారానికి ఏ చర్యా తీసుకోలేదనే భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించారని, తనను మాత్రం పట్టించుకోలేదనే భావనతో ఆయన ఉన్నట్టు సమాచారం. బీజేఎల్పీ నేత రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత తనకు శాసన సభాపక్షపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించి తనను విస్మరించడం, పార్టీకి తాను చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఆశించినా అవి జరగకపోవడం రఘునందన్‌లో అసంతృప్తిని మరింత పెంచిందని అంటున్నారు. తన కార్యకర్తలు, అనుయాయులు వెలిబుచ్చుతున్న అసంతృప్తినే తాను బయటకు చెబుతున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి రాష్ట్ర బీజేపీపై వ్యంగ్య ధోరణిలో ఓ ప్రతీకాత్మక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడం పారీ్టలో దుమారాన్నే రేపింది. దున్నపోతును వెనుకనుంచి తన్ని వ్యాన్‌లోకి ఎక్కించే వీడియో పోస్ట్ చేసి, రాష్ట్ర నాయకత్వానికి ఇలాంటి చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించడంపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేరుగా నడ్డా దృష్టికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగానూ పలువురు నాయకులు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించక పోవడంపై అసంతృప్తిని తెలియజేశారు. జాతీయ కార్యవర్గసభ్యులు డా.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు వేర్వేరుగా నడ్డాను కలుసుకుని వివిధ అంశాలపై తమ అసంతృప్తికి గల కారణాలను తెలియజేశారు. రాష్ట్ర పార్టీలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులతో నాయకులు సమైక్యంగా లేరనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం, పార్టీలో సమష్టి నిర్ణయాలు కొరవడడంతో నష్టం జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేశారు. తీవ్ర అసంతృప్తి.. పలు సందర్భాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను సంప్రదించకుండానే ముఖ్య నేతల భేటీలో నిర్ణయమంటూ ప్రకటనలు వెలువడుతున్నాయని నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. తాము జాతీయ కార్యవర్గ సభ్యులుగా, మాజీ ఎంపీలుగా, ఉద్యమకారులుగా ఉన్నా తగిన ప్రాధాన్యత, గుర్తింపునివ్వడం లేదని, నష్టం కలుగజేసేలా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వంటి వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలపై జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: చర్చనీయాంశంగా.. సామేలు రాజీనామా -
అంతర్గత విబేధాలు.. సైలెంట్ మోడ్‌లోకి ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ, అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. పార్టీలోని కీలక నేతల్లో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై పలువురు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బండి సంజయ్‌కు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మధ్య పొసగటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే సైలెండ్ మోడ్‌లోకి వెళ్లారు. ఆయనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన ఈ మధ్య పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వానికి, రఘునందన్ రావుకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న రఘునందన్ రావు.. ఇదే విషయంపై ఇటీవల జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ బీజేపీపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో పార్టీ నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను అధిష్ఠానం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. బండిని ఆ పదవి నుంచి మార్చేసి.. కేంద్రమంత్రి బాధ్యతలు ఇవ్వనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. బండి సంజయ్‌ను తప్పిస్తే.. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వనున్నారన్నది ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీలో కోల్డ్‌వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ముసలం కొనసాగుతోంది. పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం ఇప్పటికే మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీలో వారికున్న సమస్యలను వివరించినట్టు సమాచారం. మరోవైపు.. నిన్న(ఆదివారం) నాగర్‌కర్నూలులో బీజేపీ సభ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేపీ నడ్డాతో బీజేపీ నేతలు విజయశాంతి, రఘునందన్ రావు, వివేక్ విడివిడిగా మంతనాలు జరిపారు. ఇక, తెలంగాణలో బీజేపీ నేతల నుంచి ఫిర్యాదుల చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఇక, రాబోయే వారం పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణలో మోదీ పర్యటన అనంతరం.. పార్టీ కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలకు పదవులు వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 600 కార్ల కాన్వాయ్‌తో.. -
ఓఆర్ఆర్ టెండర్‌పై రఘునందన్ సంచలన ఆరోపణలు, సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లో అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టెండర్ పైన సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లు అప్పనంగా ఐఆర్బీ సంస్థకు టెండర్ అప్పగించారని దుయ్యబట్టారు. ఔటర్ రింగు రోడ్డు టెండర్ లో అవినీతి జరిగిందని గతంలోనే ఈడీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐఆర్బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే మనుషుల్నే లేకుండా చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. (చదవండి: ప్రైవేటుకు ఓఆర్ఆర్!.. 30 ఏళ్లకు లీజుకిచ్చిన కేసీఆర్ సర్కార్) 'ఓఆర్ఆర్ టెండర్ అంశంపై బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని ఇటీవల కొందరు విమర్శిస్తున్నారు. ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై మా పార్టీ చాలారోజులుగా ప్రశ్నిస్తోంది' అని రఘునందన్ రావు చెప్పారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ అనే సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్లో భారీ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐఆర్బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని విమర్శిస్తున్నాయి. మరోవైపు పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. (చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) -
‘పాత నంబర్ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్ ఎందుకు వెళ్లాయి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. ఇటీవల రేవంత్, ఈటల మధ్య సవాల్ ముగిసిన వెంటనే మరో సవాల్‌తో ముందుకొచ్చారు నేతలు. మంత్రి నిరంజన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరంజన్ రెడ్డి చేసిన సవాల్‌కు సిద్ధమన్నారు రఘునందన్ రావు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచానా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇక, తాజాగా రఘునందన్ మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఈడీ విచారణ జరపాలి. మంత్రి పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాకు కాల్స్ వెళ్లాయి. మంత్రి పాత నెంబర్ ఎందుకు మార్చారు?. మంత్రికి ఉన్న దత్తపుత్రులు ఎవరు?. దత్తపుత్రుడికి కాంట్రాక్ట్‌లు.. వియ్యంకుడికి వీసీ పదవులు. కొన్న భూములకు మంత్రి లెక్కలు చూపించాలి. గౌడ నాయక్ పేరు మీద మీ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు అన్నీ చేస్తున్నారు. దత్త పుత్రుడు గౌడ నాయక్ పేరు మీద పొందిన సబ్సిడీలు ఎన్ని? ఏయే శాఖల నుంచి తీసుకున్నారు?. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ రానే లేదు. అగ్రికల్చర్ యునివర్సిటీ నుంచి దానికి 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్‌ను దత్త పుత్రుడికే ఇప్పించుకున్నారు. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ఎవరు మంజూరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా?. గౌడ నాయక్ కొన్నభూములు ఎలా కొన్నారు? కొన్న డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతకుముందు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో ఫాంహౌజ్ నిర్మించారని తెలిపారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు. దీంతో, రంగంలోకి దిగిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రఘునందన్‌కు సవాల్ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను తాను కబ్జా చేశానని రఘునందన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూసుకోవాలన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలన్నారు. రఘునందన్ వస్తే తన భూములు సర్వే చేసి చూపిస్తానన్నారు.