సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులకు, వారి బంధువులకు ఐటీ, ఈడీ సంస్థలు నోటీస్‌లు ఇవ్వగానే గుండె నొప్పి అంటూ ఆస్పత్రులకు వెళుతున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఐటీ అధికారులు తన కొడుకుపై చేయి చేసుకున్నారని, దొంగల్లాగా దాడి చేశా రని మంత్రి మల్లారెడ్డి ఆరోపించడం బాధ్యతారాహిత్యమన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ సోదాలనగానే మల్లారెడ్డి తన సెల్‌ఫోన్ చెత్తబుట్టలో ఎందుకు దాచారని, బకెట్లలో ఫైళ్లు పెట్టే దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నిన్నటి దాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి... నోటీస్‌లు ఇవ్వగానే గుండెపోటు ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదన్నారు. దుబ్బాక అభివృద్ధి నిధులు రూ.5 కోట్లు తాను ఖర్చు చేసే వెసులుబాటు కల్పిస్తూ వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను రఘునందన్ కోరారు.
ఇదీ చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు
Comments
Please login to add a commentAdd a comment