Mallareddy
-
TG: కిషన్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం(అక్టోబర్10) తెలంగాణ బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. తన అల్లుడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. తన మనవరాలి పెళ్లికి రావాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు. వివాహపత్రికను కిషన్‌రెడ్డికి అందించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే కిషన్‌రెడ్డిని కలిశానని, రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. చంద్రబాబునాయుడు రాజకీయ భిక్ష పెట్టడం వల్లే గతంలో ఎంపీ అయ్యానన్నారు. టీడీపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు మాత్రం మల్లారెడ్డి సమాధానం దాటవేశారు.కాగా, ఇటీవలే మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి రావాల్సిందిగా ఏపీ సీం చంద్రబాబునాయుడును కలిసి ఆహ్వానించారు. బాబును కలిసిన తర్వాత మల్లారెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే పెళ్లికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిశానని మల్లారెడ్డి ఆ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇదీ చదవండి: మార్కెటింగ్‌లో సీఎం రేవంత్ నెంబర్‌వన్ -
ముమ్మా..నిన్ను మిస్సవుతున్నా..
సుభాష్‌నగర్: ‘‘ముమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీవు లేకుండా అసలు అయితలే..నేను నీ దగ్గరకే వచ్చేస్తున్నా.. మన మధ్య మనస్పర్థలు సృష్టించారు., నేను చనిపోయాక అందరికీ నిజం తెలుస్తుంది.. అరేయ్ రాజురెడ్డి అన్నింటికీ నీవే కారణం, ఇద్దరం పెళ్లి చేసుకునేందుకు వెళ్లాం. తేజు లేనిదే నేను లేను.. నాది వన్ సైడ్ లవ్ కాదు.. ఒకరంటే ఒకరికి ప్రాణం. ముమ్మా నీ దగ్గరికే వస్తున్నా శ్రీ.. అక్క నీవే మమ్మీని చూసుకో’’.. అంటూ.. ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న దోమడుగుకు చెందిన తేజస్వి అనే యువతి ఇంటి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తేజస్వి ఆత్మహత్యకు శ్రీహరి వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికిలోనైన శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతడిని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రీహరి సోమవారం రాత్రి ఆస్పత్రి నుండి తప్పించుకున్నాడు. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని అతడి తల్లిదండ్రులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.బుధవారం బహదూర్‌పల్లిలోని సాయినా సొసైటీలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని శ్రీహరిగా గుర్తించారు. ఘటనా స్థలంలో శ్రీహరి రాసిన సుసైడ్ నోట్ స్వా«దీనం చేసుకున్నారు. అందులో తాను, తేజస్వీ ప్రేమించుకున్నామని, బీజేపీ నాయకుడు రాజురెడ్డి, తేజస్వీ తండ్రి, సోదరుడు తమను విడదీసేందుకు యతి్నంచారని పేర్కొన్నాడు. తేజస్వీ లేనిదే తాను లేనని, తాను కూడా ఆమె దగ్గరకే వెళ్తున్నానని, తమ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అందులో పేర్కొన్నాడు. పోలీసులు శ్రీహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీఆర్ఎస్ మళ్లీ గెలిచుంటే...మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం(జులై 30) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి ఉంటే తాను హోమ్ మంత్రి అయ్యేవాడినన్నారు. సినిమాలు తీసేవాడినని, టీవి ఛానల్ పెట్టేవాడినని చెప్పారు. బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదన్నారు. -
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
సుభాష్‌నగర్/ సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లు డు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై శనివారం పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర ప్రాంతంలో సర్వే నంబర్ 82, 83లో తనతో పాటు 8 మందికి ప్లాట్లు ఉన్నాయంటూ కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తాత్కాలికంగా ప్రహరీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి.. అనుచరులతో అక్కడికి చేరుకుని ప్రహరీని కూల్చివేశారు. ఆ భూమి తమదని, అక్కడ ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు.. విచారణ అయ్యేంత వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టవద్దని సూచించడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.మా భూమిని ఆక్రమించారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న భూమిలోకి శుక్రవారం రాత్రి 300 మంది అక్రమంగా చొరపడి హద్దులను చెరపి, ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మరో బిహార్‌గా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. -
పొలిటికల్ ఎంట్రీపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ..
-
రేవంత్ సీఎం అవుతారని పదేళ్ల క్రితమే చెప్పా..
కంటోన్మెంట్: రేవంత్‌రెడ్డి సీఎం అవుతాడని తాను పదేళ్ల క్రితమే జోస్యం చెప్పానని మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. 2014 సెపె్టంబర్లో మల్లారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కంటోన్మెంట్ పరిధిలో జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షన్లో రేవంత్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదా సంభాషణల్లో భాగంగా మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ... ‘అన్నా నువ్వు సీఎం అవుతావు అన్నా.. ఆ చాన్స్ నీ ఒక్కడికే ఉంది రెడ్డిలల్ల..’అన్నారు. అప్పట్లో తీన్మార్ వార్తల్లో ప్రసారం అయిన ఈ వీడియా తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శనివారం మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వీడియోను చూపుతూ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకు రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో తామిద్దరం కలిసి ప్రచారం చేసిన ఫొటోలను సైతం చూపించారు. తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. తాను మాత్రం బీఆర్ఎస్ను వీడేది లేదంటూ స్పష్టం చేశారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నానని తెలిపారు. -
కబ్జా భూములను సరెండర్ చెయ్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సహా మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు. అలాంటి భూకబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. అలాంటి వారు చేరేందుకు వస్తే.. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా ఎదుర్కొంటుంది..’’అని మైనంపల్లి పేర్కొన్నారు. చెరువులోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. ఇకమీద తాము దగ్గరుండి కూల్చివేతలకు సహకరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాలను బయటపెడతామన్నారు. శనివారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కండ్లకోయలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శంఖారావం సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
‘మల్కాజిగిరి’కి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ అభ్యర్థులుగా పోటీలో ఉంటారనుకున్న నేతలు బరి నుంచి తప్పుకొంటుంటే.. మరోవైపు కొత్తవారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొందరు నేతలు, ఎంపీలు.. మరో పార్టీలో చేరి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో, నాగర్‌కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. చేవెళ్ల నుంచి పోటీచేయబోనని సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. తాజాగా మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల బరి నుంచి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం తప్పుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కూల్చివేతతో.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల భవనాలను అక్రమ నిర్మాణాలంటూ ప్రభు త్వం గురువారం కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనితో మల్కాజిగిరిలో రాజకీయాలపై ప్రభావం పడింది. వాస్తవానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం జరిగింది. పార్లమెంటు పరిధి లో భద్రారెడ్డి పేరిట ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు కూడా వెలిశాయి. కానీ గత రెండు రోజుల్లో పరిణామాలు మారి పోయాయి. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి చర్చించారు. కానీ అధికారులు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో కళాశాల భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మల్లారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని.. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోపించారు. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. గురు వారం రేవంత్ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలవడంపై, పార్టీ మారుతున్నట్టు జరిగిన ప్రచారంపై కేటీఆర్‌కు వివరణ ఇచ్చారు. తాను పార్టీ మార డం లేదని తెలిపారు. తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంలో కలిశామని వివరించారు. ఇదే సమయంలో తమ కు టుంబం లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా లేదని కేటీఆర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆస్తులపై దాడులకు భయపడేనా? సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహి ంచిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీకోసం 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీచేయడం దాదాపు ఖరారైంది. కానీ మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పై దాడుల నేపథ్యంలో ఈ సీటు నుంచి తమ కుటుంబసభ్యులెవరూ పోటీ చేయబోరని మల్లారెడ్డి పేర్కొనడం చర్చనీయాంశమైంది. -
మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం
మేడ్చల్ రూరల్/కంటోన్మెంట్: హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కమలానగర్ హెచ్ఎండీఏ లే అవుట్లో మాజీమంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధీనంలో ఉన్న 10 గుంటల (2,500 గజాలు) స్థలాన్ని (సర్వే నంబర్ 388 పార్ట్, 523, 524 పార్ట్లు) మున్సిపల్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, తన కళాశాలలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ ఫిర్యాదు పెండింగ్‌లోనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు.. మల్లారెడ్డి లే అవుట్ స్థలాన్ని కబ్జాచేసి రోడ్డు వేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు పత్రాన్ని తమ ఫిర్యాదుకు జత చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రాములు, అధికారులు సదరు స్థలంలో రోడ్డును ధ్వంసం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాములు తెలిపారు. మల్లారెడ్డి గార్డెన్స్‌కు నోటీసులు మరోవైపు మల్లారెడ్డి కుటుంబం అధీనంలో ఉన్న మల్లారెడ్డి గార్డెన్స్ ఆవరణలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటీవల నోటీసులు (కంటోన్మెంట్స్ యాక్ట్ –2006, సెక్షన్ 320 ప్రకారం) జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా అధికారులు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంటోన్మెంట్ పరిధిలో పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఓల్డ్ గ్రాంట్ బంగళాలు (ఓజీబీ) 100కు పైగా ఉన్నాయి. ఇవి హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద కేటాయించిన వారి పేరిట ఉంటాయి. అయితే ఈ బంగళాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకూడదు. చుట్టుపక్కల స్థలాల్లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదు. కమర్షియల్‌గా మార్చకూడదు లాంటి పలు కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని బంగళాల్లో కొందరు అనధికారికంగా నివాసం ఉంటున్నారు. అంతేగాకుండా నిబంధనలు ఉల్లఘించారు. దీంతో 2007లో బోర్డు అధికారులు 42 బంగళాల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే 2013–2017 మధ్య కాలంలో 20కి పైగా బంగళా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్ సైతం నాటి కూల్చివేతల జాబితాలో ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎల్ఆర్ సర్వే నంబర్ 537లోని 7.80 ఎకరాల్లో విస్తరించిన ఓజీబీ స్థలంలో మల్లారెడ్డి గార్డెన్స్, చందన గార్డెన్స్, సీఎంఆర్ హైస్కూల్, సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కొనసాగుతున్నాయి. -
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అన్నీ కష్టాలే: మల్లారెడ్డి
-
కౌన్సిలర్లతో దుబాయ్ వెళ్లిన మాజీమంత్రి మల్లారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాలకమండళ్ల గడువు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలోని పలు నగర/పురపాలికల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 28తో పాలక మండళ్లు ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఇప్పటికే పలువురు మేయర్లు, చైర్మన్లు, చైర్ పర్సన్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో కొంతమంది క్యాంపులకు వెళ్లారు. వీరిలో కొంత మంది తిరిగి రాగా, మరికొంత మంది అక్కడే ఉండిపోయారు. ఇంతకీ వారికి వ్యతిరేకంగా తీర్మానం ఉంటుందా? ఈ నోటీసులపై కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలనే కల నెరవేరుతుందా? లేదా అనే ప్రశ్న ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ఇచ్చిన నోటీసులపై ఒకవైపు తీవ్రమైన సందిగ్ధత కొనసాగుతుండగా, మరోవైపు షాద్‌నగర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలు, బడంగ్ పేట్ కార్పొరేషన్‌లోని ఆశావహులు తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఆదిబట్ల.. తేలేదెట్లా..! ఆదిబట్ల మున్సిపల్ చైర్‌పర్సర్ ఆర్తిక(కాంగెస్)పై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు జనవరి 9న అదనపు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. మున్సిపాలిటీలో 15 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో 13 మంది నోటీసులపై సంతకాలు పెట్టారు. ఆ తర్వాత 12 మంది క్యాంపు (రాజమండ్రి, వైజాగ్, బీమవరం)నకు వెళ్లారు. తాజాగా బుధవారం ఉదయం క్యాంపు నుంచి తిరిగి వచ్చారు. చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న ఓ కౌన్సిలర్ తనతో పాటు క్యాంపునకు వచ్చిన వారికి భారీగా ప్యాకేజీ ముట్టజెప్పినట్లు తెలిసింది. బండ్లగూడ .. ఒత్తిడి తెచ్చినా.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అభ్యర్థి లతా ప్రేమ్గౌడ్పై 16 మంది (బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి 13 మంది) తిరుగుబావుటా ఎగురవేశారు. మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా, వీరిలో ఒకరు మృతి చెందారు. వీరంతా ఇటీవల కలెక్టర్ శశాంకను కలిసి నోటీసులు అందజేశారు. అదే రోజు క్యాంపునకు వెళ్లారు. నిన్నటి వరకు ఏపీలో ఉన్న నేతలు తాజాగా బుధవారం బెంగళూరుకు చేరుకున్నారు. కేవలం ఆరు నెలల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం సరైన నిర్ణయం కాదని, క్యాంపు నుంచి తిరిగి రావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చేదిలేదంటూ హెచ్చరించినా వారు ససేమిరా అనడం గమనార్హం. పెద్ద అంబర్‌పేట .. వీడేనా ఉత్కంఠ? పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, వీటిలో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఐ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి చొప్పున గెలుపొందారు. ఎక్స్ అఫీషియో సభ్యులు, కాంగ్రెస్‌లోని మరికొంత మంది కౌన్సిలర్ల సహకారంతో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి చవుల స్వప్న చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు బీఆర్ఎస్లో కొనసాగిన చైర్ పర్సన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. గత జనవరి 28న 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ అప్పటి కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఒక గ్రూపు, పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు మరో గ్రూపు ఇలా రెండు గ్రూపులు 25 రోజుల పాటు క్యాంపునకు వెళ్లారు. హైకోర్టు స్టే విధించడంతో పాటు ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. గత నోటీసులనే పరిగణనలోకి తీసుకుంటారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దుబాయ్ వెళ్లిన మేడ్చల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీజేపీకి రెండు, కాంగ్రెస్‌కు ఆరు, బీఆర్ఎస్కు 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కప్పరి స్రవంతిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం 17 మంది కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు జనవరి 8న అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు నోటీసులు ఇచ్చి, ఆ వెంటనే 11 మంది క్యాంపు(గోవా)నకు వెళ్లిపోయారు. నోటీసులు అందజేసి పది రోజులైనా ఇప్పటి వరకు బలప్రదర్శనకు ఏర్పాట్లు చేయకపోవడంతో క్యాంపుల్లో ఉన్న వారిలో ఆందోళన మొదలైంది. మేడ్చల్: అసమ్మతితో రగులుతున్న మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి కొంతమంది నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మంగళవారం దుబాయ్ వెళ్లగా.. మరికొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైటెక్కారు. ఏడాది నుంచి మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య అసమ్మతి చెలరేగుతోంది. చైర్మన్‌ను గద్దె దించాలని అవిశ్వాస నోటీసు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటీసు ఇవ్వడంతో అవిశ్వాస తేదీ ఖరారు కాలేదు. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు మారి కాంగ్రెస్ రూలింగ్ రావడంతో తమ పార్టీ కౌన్సిలర్లు అసమ్మతితో ఎక్కడా దూరం అవుతారోనని ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను విదేశీ టూర్‌కు తీసుకెళ్లారు. -
BRS: మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీఎన్నికల హడావుడి ముగిసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల్లోనూ మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా విపక్షాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, గెలిచిన పలువురు నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ మాజీ మంత్రి ఎంపీగా పోటీ చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంపై అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతల కన్ను పడింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం అయిన మల్కాజ్‌గిరిలో 31 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు గుర్తు మీద పోటీచేసి మరోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మేడ్చల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఎంపీ సీటుపై ఆయన కన్ను పడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు పోటీ చేసి గెలిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఓటమి చెందారు. అందుకే ఈసారి తానే పోటీ చేసి గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ మల్లారెడ్డి ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే.. ఆ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ సీటుకు తన కోడలు ప్రీతి రెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలకు, ఆ తర్వత జరిగే అసెంబ్లీ ఉపఎన్నికకు ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..మల్లారెడ్డికి ఎంపీ సీటు ఇస్తే.. మేడ్చల్‌కు ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇతర నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని స్థానిక నేతలు పార్టీని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలు రెండూ కీలకమే కావడంతో.. ఈ సారి కచ్చితంగా మల్కాజ్గిరి పై గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మల్లారెడ్డికి పట్టున్న స్థానం కావడంతో ఈ విషయంలో సీరియస్‌గానే ఆలోచన చేస్తోంది. ఏదేమైనా మల్కాజ్ గిరి విషయంలో మాజీ మంత్రి మల్లన్న కూడా గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇక్కడ ఎలాగూ ప్రతిపక్షమే గనుక మళ్ళీ పార్లమెంట్ లో అడుగుపెట్టి... ఇక్కడున్న వివాదాల నుంచి బయట పడవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది..? -
సీఎం రేవంత్‌కు మల్లారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్..ఏంటంటే..?
సాక్షి,హైదరాబాద్:మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సోమవారం మల్లారెడ్డి పరామర్శించారు. కేటీఆర్‌ను కలిసి కేసీఆర్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంకా రెండుమూడు రోజులు తర్వాత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ కేసీఆర్ తెలంగాణను ఒక మోడల్‌గా తయారు చేశారు. కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు’ అని మల్లారెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అన్ని సదుపాయాలు మెరుగుపడ్డాయి.లోకల్‌గా ఎమ్మెల్యే కి ఓటు వెయ్యకూడదని ప్రజలు అనుకున్నారు కానీ సీఎంగా కేసీఆర్ ఉండరని వారు అనుకోలేదు. కేసీఆర్ సీఎంగా లేనందుకు ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నా’ అని మల్లారెడ్డి చెప్పారు. ఇదీచదవండి..సీఎం రేవంత్‌తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు -
పదేళ్లలో మేడ్చల్‌పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్‌పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్‌లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
మంత్రి మల్లారెడ్డి కోసం ఎదురు చూస్తున్న మహేశ్ బాబు ఫ్యాన్స్..!
తెలుగు రాష్ట్రాల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన స్పీచ్‌లో కొంతమేరకు కళాత్మకమైన హిడెన్ టాలెంట్ కనిపిస్తుంది. తన రాజకీయ విమర్శల్లో కూడా సినిమా డైలాగ్స్ కనిపిస్తుంటాయి. అలా తెలంగాణ రాజకీయాల్లో ఆయన చాలా ఫేమస్. 'పాలమ్మినా.. పూలమ్మినా.. బోర్వెల్ నడిపినా.. కష్టపడ్డా.. పైకి వచ్చినా..' అంటూ ఆయన చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెడింగ్‌లోనే ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మల్లారెడ్డి మాట్లాడుతూ చిరంజీవి, పవన్ కల్యాణ్ కన్నా తానే ఫేమస్ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ సరదాగా మాట్లాడే ఆయనలో ఒక నటుడు కూడా కనిపిస్తాడు. పలు సినిమాల్లో నటించాలనే కోరక తనకు ఉందని కూడా మల్లారెడ్డి గతంలో చెప్పేవారు. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఇష్టమైన హీరో ప్రిన్స్ మహేశ్ బాబు అని చాలా ఇంటర్వ్యూలలో ఓపెన్‌గానే మల్లారెడ్డి చెప్పారు. శ్రీమంతుడు సినిమా ఆడియో వేడుకలో మహేశ్ గురించి ఆయన ఇలా చెప్పారు. 'మీకో ముఖ్యమైన విషయం చెబుతున్నా.. నేను మహేశ్ బాబు అభిమానిని. నేను ఈరోజు ఎంపీ అయినాను అంటే కూడా మహేశ్ సినిమా చూసే' అని తెలిపారు. సినిమాల్లో మాదిరి వాటిని ప్లాన్ చేసి.. దాని మాదిరిగానే సక్సెస్ అయ్యానన్నారు. మహేశ్ బాబును కలవాలనే పట్టుదలతోనే ఈ ఫంక్షన్‌కు వచ్చానని అప్పట్లో మల్లారెడ్డి తెలిపారు. శ్రీమంతుడు సినిమా సమయంలో ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. నేడు (నవంబర్ 27) యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్- రష్మిక జోడీగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈమేరకు యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్శిటీలో జరగనుంది. ఆ ఈవెంట్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో తన అభిమాన హీరో అయన మహేశ్‌ను మంత్రి మల్లారెడ్డి కలుస్తారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో ఎక్కడో ఫంక్షన్ జరుగుతుంటే... అదే పనిగా వెళ్లి మహేశ్‌ను కలిశాడు మల్లారెడ్డి.. ఇప్పుడు యానిమల్ వేడుక తన సొంత కాలేజీలోనే జరుగుతుంది. అక్కడికి ప్రిన్స్ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఛాన్స్‌ను ఆయన ఎట్టిపరిస్థితిల్లో పోగొట్లుకోరని సమాచారం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ఒకవేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందులో ఆయన స్పీచ్ ఎలా ఉంటుందోనని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్‌పై గంతంలో మల్లారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను వారు షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu FC (@_urstrullymahesh_) View this post on Instagram A post shared by Mahesh Babu FC (@_urstrullymahesh_) -
Malkajgiri: అల్లుడి గెలుపు మల్లారెడ్డికి సవాల్
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం తాము నిలిపిన వాళ్లను గెలిపించాల్సిన బాధ్యత భుజస్కంధాలపై ఉండటం. వారు గెలవకపోతే తమ పరపతికి భంగం వాటిల్లుతుంది. ప్రతిష్ట మసకబారుతుంది. ఓవైపు పార్టీల పరంగా బాధ్యతలు, మరోవైపు తమ వారి గెలుపు వారికి సవాల్‌గా మారింది. ఇది కొందరి పరిస్థితి. ఇంకొందరు తాము పోటీ చేస్తున్న చోట గెలవడంతోపాటు మరోచోట తమ వారినీ గెలిపించాలి. ఇటు కృష్ణ యాదవ్.. అటు పూస రాజు.. ► బీజేపీలో జాతీయస్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నగరానికి చెందిన ఇద్దరు నేతలకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. నగరంలోని అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్థానిక సెగ్మెంట్ అయిన అంబర్‌పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో తన నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు ఆయనకు సవాల్‌గా మారింది. ► ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన డా.కె. లక్ష్మణ్దీ దాదాపుగా ఇదే పరిస్థితి. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పూస రాజుకు టికెట్ దక్కింది. పార్టీ ఓబీసీ మోర్చా చైర్మన్‌గా ఉన్న లక్ష్మణ్.. అదే విభాగంలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రాజుకు టిక్కెట్ ఇప్పించుకున్నారని పార్టీవర్గాల ప్రచారం. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత లక్ష్మణ్ మీద పడింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడుగానూ, రాజ్యసభ సభ్యుడుగానూ, ఇతరత్రానూ ఎన్నో కీలక స్థానాల్లో ఉన్న లక్ష్మణ్ తన నియోజకవర్గంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన తప్పనిసరి స్థితి. ఇలా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు తమ జాతీయస్థాయి బాధ్యతల నిర్వహణతోపాటు తమ నియోజకవర్గాల్లో బరిలోని వారు గెలిచేందుకు కృషి చేయాల్సి ఉంది. ఆయనకు అదనపు బాధ్యతలు.. ఈయనకు అల్లుడి గెలుపు ► పోటీ చేస్తున్న తాము గెలవడంతో పాటు తమవారిని గెలిపించాల్సిన బాధ్యతలు బీఆర్ఎస్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డిలపై అదనంగా పడ్డాయి. కంటోన్మెంట్ నియోజవర్గంలోనే తన ఓటు ఉన్న మంత్రి తలసాని ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. కంటోన్మెంట్లో పోటీ చేస్తున్న లాస్య నందిత ఎమ్మెల్యేగా బరిలో దిగడం కొత్త. అధిష్ఠానం ఆమె గెలుపు బాధ్యతలు కూడా తలసానికి అప్పగించింది. ఇటు సనత్‌నగర్‌లో తాను గెలవాలి. అటు కంటోన్మెంట్లో ఆమెను గెలిపించాలి. ► అలాగే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మంత్రి మల్లారెడ్డిపై పడింది. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించి పార్టీని వీడిన మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ గెలుపు పార్టీ అధిష్థానానికే సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మేడ్చల్‌లో అల్లుడి గెలుపు మల్లారెడ్డికి అనివార్యంగా మారింది. మేడ్చల్‌లో తాను గెలవడంతోపాటు అల్లుణ్ని గెలిపించడం మల్లారెడ్డికి పెను సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఇలా.. ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్‌ఖేరా భార్య కోటా నీలిమ సనత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాతీయస్థాయిలో కీలకస్థానంలో ఉన్న ఆయనకు తన భార్యను గెలిపించుకోవడం సవాల్‌గా మారింది. -
మంత్రి మల్లారెడ్డి స్థిర ఆస్తులు రూ.90.24 కోట్లు
హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇందులో ఆయన సతీమణి చామకూర కల్పనా స్థిర ఆస్తుల విలువ రూ.38,69,25,565 పేర్కొన్నారు. తమ స్థిర ఆస్తులు(భూములు, భవనాలు) సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఉన్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే, వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు(లోన్లు) రూ.7,39,94,301 కాగా, ఇందులో ఆయన సతీమణి కల్పనా పేరుతో ఉన్న అప్పులను రూ.4,48,95,098 తెలిపారు. అలాగే, చరా ఆస్తులు(వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు) రూ.5,70,64,666 ఉన్నట్లు పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి, ఇందులో సతీమణి కల్పనకు సంబంధించివి రూ.72,39,185గా తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలతోపాటు చేతిలో నగదు ఉన్నట్లు గానీ ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదు. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఇలా.. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీహెచ్.మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో స్థిర ఆస్తులు విలువ రూ.49,26,79,933 చూపించారు. అలాగే, 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిట్విట్లో మల్లారెడ్డి తన స్థిర ఆస్తుల విలువ రూ.48,85,25,332 గా పేర్కొన్నారు. -
‘జయలలిత డబ్బులు కాజేసి పైకొచ్చాడు’
మేడ్చల్ రూరల్: పాలమ్మి, పూలమ్మి మంత్రి మల్లారెడ్డి ధనవంతుడు కాలేదని, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి, ఇతరుల ఆస్తులు కాజేసి పై కొచ్చాడని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రాత్రి మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుదీర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని అందులో డైయిరీ ఫాం ఏర్పాటు చేసుకుందన్నారు. ఆ సమయంలో పాలవ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడికి వెళ్లేవాడన్నారు. ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు సమాచారం అందడంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఓ చోట దాచిపెట్టగా మల్లారెడ్డి వాటిని దొంగిలించాడన్నారు. తన ఇంటి పక్కన ఉండే క్రిస్టియన్ విద్యా సంస్థల యజమానురాలిని మోసం చేసి కుటుంబీకులకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి కాజేశాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మైసమ్మగూడలో చెరువు శిఖం స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కాలేజీలు కట్టడం వల్లే మొన్న భారీ వర్షాల కారణంగా విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నాయకులు చివరకు తమ మేనిఫెస్టోను కాఫీ కొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి పదవీ వ్యామోహం ఎక్కువన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు పంచి, బెదిరింపులకు పాల్పడి గతంలో గెలిచారని కానీ ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. మంత్రి మల్లారెడ్డి, అతని బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉండి చేసిందేమీ లేదన్నారు. తమ వ్యాపారాల కోసమే మేడ్చల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాళాల, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి వెలుగులోకి తెస్తామని తనకు మేడ్చల్ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్‌గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్, నాయకులు రమణారెడ్డి, మహేశ్‌గౌడ్, పోచయ్య, వరదారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశ్‌గౌడ్, నడికొప్పు నాగరాజు, రంజిత్, రాహుల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నా.. మజాకా!
మేడ్చల్: మామూలు రోజుల్లోనే మల్లారెడ్డి అంటే ఒక వైరెటీ. ఇక ఎన్నికల ప్రచారం వేళ ఆయన ఇంకెంత వైరెటీగా దూసుకుపోతారో ఈ చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది. శుక్రవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా ఆయన హాజరయ్యారు. ఓ నాయకుడి ఇంటి వద్ద కూర్చున్న మహిళలు, వృద్ధుల వద్దకు మంత్రి మల్లారెడ్డి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. గౌరమ్మ అనే వృద్ధురాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెకు పూల బొకే ఇచ్చి సరదాగా ముచ్చటించారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే క్రమంలో ఎన్టీఆర్ గ్రౌండ్లో మల్లారెడ్డికి సంబంధించిన ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయి. -
గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు?
హైదరాబాద్: కారు స్పీడ్‌ను అందుకునేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా రాజకీయ వర్గాల్లో వాడీవేడీ చర్చ సాగుతోంది. అధికార బీఆర్ఎస్ అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అభివృద్ధి మంత్రంతో ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగింది. కాగా.. కాంగ్రెస్, బీజేపీ పారీ్టల్లో ఇప్పటి వరకు టికెట్లు ఖరారు కాకపోవటంతో ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. మరోపక్క మల్కాజిగిరిలోబీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పారీ్టపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పారీ్టలో చేరటంతో మారిన సమీకరణల నేపథ్యంలో జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. జిల్లాలో ప్రధాన పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో రేపో మాపో టికెట్ తమకే లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయిదు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల పరిస్థితి ఇలా.. మేడ్చల్ ఠిసిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ టికెట్ మళ్లీ దక్కడంతో హంగూ ఆర్భాటం.. అభివృద్ధి జపంతో ప్రచార రంగంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి సహా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కాంగ్రెస్‌లో చేరిన నక్క ప్రభాకర్‌గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అధిష్ఠానం తోటకూర జంగయ్య యాదవ్ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతున్నా.. హరివర్ధన్‌రెడ్డి, నక్క ప్రభాకర్‌గౌడ్ తమ రాజకీయ పలుకుబడితో టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఠిభారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డి సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి మేడ్చల్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. బీజేపీ మాత్రం బీఆర్ఎస్ దీటుగా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించటంతో పాటు అవసరమైతే.. కొత్త నేతను కూడా రంగంలోకి దింపవచ్చనే చర్చ కేడర్‌లో సాగుతోంది. మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యరి్థగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఖరారు కాగా.. వీరు అనుచరగణంతో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి మామ, మంత్రి మల్లారెడ్డి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై ప్రచారం చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో నలుగురు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్‌కు ఎంబీసీ చైర్మన్ పదవి రావడంతో ఆయన అనుచరులు కూడా మర్రికి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరిలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మైనంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో అన్ని డివిజన్లలో అభిమానులు, మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన సేవలు ప్రచారంలో ఉపయోగపడుతున్నాయి. ఇద్దరు కార్పొరేటర్లు వెంట ఉండగా, రాజకీయ పార్టీ నాయకులతో కూడా మైనంపల్లికి మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం జాతీయ కోశాధికారి టి.సాయి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధాన పారీ్టలు బలమైన సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దింపుతుండగా.. బీజేపీ వ్యూహాత్మకంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యరి్థని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆకుల రాజేందర్ ఎమ్మెల్యేగా పని చేయడం, స్థానికుడు కావడంతో పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఖరారు కాకపోయినప్పటికీ, పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, సంప్రదాయ ఓటు బ్యాంకు ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం. ఉప్పల్ ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డిని కాదని బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించటంతో కార్యకర్తల సమావేశాలతో పాటు సామాజిక వర్గాల వారీగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ భర్త మందుముల పరమేశ్వర్‌రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. రేపో మాపో అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారంతో తమకు పలుకుబడి ఉన్న నేతలో లాబీంగ్ నిర్వహిస్తున్నారు. బీజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టికెట్ కోసం ప్రయతి్నస్తుండగా, స్థానిక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అధిష్టానాలతో రాయబారాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఎవరు ఇస్తానంటే ఆ పారీ్టలో సుభా‹Ùరెడ్డి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గులాబీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరో? ∙సిట్టింగ్ ఎమ్మెల్యే కేవీ వివేకాందగౌడ్‌కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. తాను చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాల పేరుతో ఆయన ప్రజల వద్దకు వెళ్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ శంభీరాజు మాత్రం చివరి క్షణం వరకైనా బీ– ఫారం తనకే దక్కుతుందన్న ఆశతో అనుచరులతో కలిసి ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థితో శంభీపూర్ రాజు ఎన్నికల ప్రచారంలో కలిసి తిరగకపోవటంపై బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నుంచి కొలను హనుమంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి పోటీలో ఉన్నారు. ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్న వీరు టికెట్ తనకేనని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు టికెట్ ఖరారైనట్లు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. పార్టీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాగా.. ఆ పారీ్టకి చెందిన మరో నాయకుడు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు ఏ పదవి రాకపోవడంతో ఈసారి బీఆర్ఎస్కు ప్రచారం చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నుంచి వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు, బొమ్మరెడ్డి ప్రేమ్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో ఎవరికి వారే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గొట్టుముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం టికెట్ ఆశిస్తుండగా, మరో నాయకుడు మన్నే సతీష్ తనకే టికెట్ రానుందని ప్రచారం చేసుకుంటున్నారు. -
హైలెస్సో హైలెస్సా...
‘‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా చేసిన ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లు. సామ్ .జి, వంశీకృష్ణ వర్మ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ సాగే పాటని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విడుదల చేశారు. డి. ప్రసన్న కుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్ సీపాన, ఎ. ప్రవస్తి పాడారు. ‘‘అందమైన ప్రేమకథని తెలియజేసే లవ్లీ మెలోడీగా ఈ పాటని స్వరపరిచారు అనూప్’’ అన్నారు మేకర్స్. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్‌గా అవార్డు సాధించిన ఆయన.. 77వ స్వాత్రంత్య దినోత్సవం రోజున ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడితేనే ఎవరైనా విజయం సాధించగలరనడానికి ఈ అవార్డులే నిదర్శనమన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని, ఇక మిగిలిన జీవితమంతా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానని చెప్పారు. చదవండి: స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ.. క్రీడాకారిణికి అసభ్య మెసేజ్‌లు.. -
కేంద్రం నిధులపై లెక్కలు రాయాలి
మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులపై రాష్ట్ర ప్రజలందరూ లెక్కలు రాసి వాటిని అవసరమైనప్పుడు చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ ఫేజ్–2 కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని, అమరవీరుల స్థూపాన్ని ఆదివారం ఆమె మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొ. జయశంకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కోసం ఖర్చు చేసిన నిధులపై లెక్కలు రాసి రాష్ట్ర సాధన ఉద్యమాల సమయంలో ప్రజలకు నాయకుల ద్వారా వివరించారన్నారు. ఆయన రాసిన లెక్కల ద్వారానే తెలంగాణ ఎంత అన్యాయం జరిగింది ప్రజలకు తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మోసం చేస్తున్న వారిని పక్కాగా గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటో తమకు అర్థంకావడం లేదని అన్నారు. అలుపెరగని యోధుడు జయశంకర్.. అలుపెరగని యోధుడు జయశంకర్ అని ఆమె పేర్కొన్నారు. జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశాడన్నారు. ఆంధ్రలో తెలంగాణ వీలీనాన్ని ఆయన ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆ తర్వాత తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన జీవితం యువతకు ఆదర్శనీయమన్నారు. కేసీఆర్‌కు అండగా నిలిచారు.. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ దొర అని ఆయన వెనుక బీసీ అయిన జయశంకర్ ఉండవద్దని ఎంతో మంది జయశంకర్‌కు చెప్పారని అందుకు ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాడని ఆయన తెలంగాణ నినాదం వదిలితే తాను కేసీఆర్‌ను వదులుతానని అనేవారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమాన్ని వదలేదని జయశంకర్ కేసీఆర్‌ను వదలేదన్నారు. ఉద్యమంలో అమరుడైన శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తానని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవీ వరప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, వీరభద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్ ,సత్యపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ యాద వ్, శంకర్‌ముదిరాజ్, జగన్‌రెడ్డి, దయానంద్‌యాదవ్, రమేష్ , దేవ, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి మల్లారెడ్డి అనౌన్స్ చేసిన ‘అన్ స్టాపబుల్’ రిలీజ్ డేట్ (ఫొటోలు)
-
మేడ్చల్ టికెట్ నాదేనంటున్న సుధీర్ రెడ్డి.. మంత్రి మల్లారెడ్డి పరిస్థితేంటి?
మేడ్చల్: రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యే కావాలని కొంతమంది నాయకులు, స్థానాన్ని తిరిగి నెలబెట్టుకోవాలని మరి కొంతమంది నాయకులు రాజకీయాలు మొదలు పెట్టారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలతో కలిసి ఉన్న మేడ్చల్ ప్రజలు ప్రతీ ఎన్నికలో విలక్షణ తీర్పు ఇస్తున్నారు. నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న మేడ్చల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అభ్యర్థులకు అంగబలం, అర్థబలం ఉండి తీరాల్సిందే.. అన్ని పార్టీల్లో అంతర్గత పోరే.. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో టికెట్లు ఆశించే నాయకులు ఒకరి కంటే ఎక్కువగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మేడ్చల్‌కు మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడు పార్టీల నుంచి ఎనిమిది మంది బలమైన నాయకులు ఈ ఎన్నికల్లో ప్రధాన మూడు పార్టీల్లో టికెట్ కోసం పోటీపడుతున్నారు. మూడు టికెట్ల కోసం 8మంది పోటీలో ఉన్నారు. సీజన్ ప్రారంభం నాటికి మరి కొంతమంది వలస నాయకులు, జంప్ జలానీలు జాబితాలో చేరతారు. బీఆర్ఎస్లో ముగ్గురు.. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో ఎమ్మెల్యేగా సుదీర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో మల్లారెడ్డి తన టికెట్ బలవంతంగా చివరి నిమిషంలో లాక్కున్నారని, ఈసారి టికెట్ తనదేనని ఆయన పలు సమావేశాల్లో చెబుతున్నారు. టికెట్ ఈసారి తనదేనని సీఎం కేసీఆర్ తనకు ఇప్పటికే ఖరారు చేశారని మంత్రి మల్లారెడ్డి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య టికెట్ పోరు జోరుగా సాగుతోంది. సుదీర్‌రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆయన కుమారుడు శరత్‌చంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఉండి తమ గ్రూపు రాజకీయం జోరుగా సాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి పార్టీలో 80శాతం నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని తన స్టైల్ రాజకీయం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కీలకంగా ఉండి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసి ఓటమి పాలైన నక్క ప్రభాకర్‌గౌడ్ బీఆర్ఎస్ మేడ్చల్ టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి శిష్యుడిగా పేరుపొందిన ఆయన ఈసారి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో జోరుగా.. కాంగ్రెస్ పారీ్టలో ప్రతి ఎన్నికల్లో గ్రూపు రాజకీయం కనబడటం సాధారణం. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోయాక నియోజకవర్గ రాజకీయానికి కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అయ్యా క ధిక్కార స్వరం వినిపించి కాంగ్రెస్‌లో కనుమరుగయ్యారు. ఎన్నికల సీజన్ కావడంతో తిరిగి రేస్‌లోకి వచ్చాడు. నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు హరివర్ధన్‌రెడ్డి, వజ్రేయాదవ్లు ఈ సారి ఎన్నికల్లో టికెట్ సాధించేందుకు ఇద్దరు నేతలు ఎంపీ రేవంత్‌రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఇద్దరు నేతలు నియోజకర్గంలో ఎవరికి వారుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరివర్ధన్‌రెడ్డి జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా ఉండి జోరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. బీజేపీలో ఎవరో..? బీజేపీలో మేడ్చల్ అభ్యరి్థగా నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన కొంపల్లి మోహన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డిలు ఈ సారి పార్టీ బీఫారం ఆశిస్తున్నారు. ఆ పార్టీ అధినాయకత్వం వలస నాయకులను నమ్ముకోవడంతో ఎన్నికల సమయానికి ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి వచ్చి చేరుతాడో.. టికెట్ ఎవరికి వస్తుందో ఎన్నికల వరకు సస్పెన్స్‌గానే ఉంటుంది. మిగతా పారీ్టలైన బీఎస్పీ, వామపక్షాలు పార్టీ అభ్యర్థుల వేటలో ఉన్నాయి. -
కబళించిన మంటలు.. ఐదేళ్ల కుమారుడుసహా దంపతుల సజీవ దహనం
కుషాయిగూడ (హైదరాబాద్): ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయం. కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో ఉన్న ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే తీవ్రమైన మంటలు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి అంటుకుని వ్యాపించాయి. అందులో ఆరు కుటుంబాలు నివసిస్తుండగా, అందరూ ఏదో విధంగా ప్రాణాలతో బయటపడినా ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మాత్రం అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కుషాయిగూడ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా.. సాయినగర్ కాలనీ ప్రధానరోడ్డు మార్గంలో ఉదయ్‌శంకర్, శివసాయి అనే అన్నదమ్ములు శ్రీ ఆదిత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో గత 25 సంవత్సరాలుగా టింబర్ డిపో నడుపుతున్నారు. ఏ జరిగిందో తెలియదు కానీ తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అందులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న భవనానికి అంటుకున్నాయి. అదే సమయంలో బాత్రూంకు వెళ్లేందుకు నిద్రలేచిన వాచ్మెన్ కుమార్తె ఉమ మంటలను గమనించి కేకలు పెడుతూ తల్లిదండ్రులను లేపింది. వారు వెంటనే మూడో అంతస్తులో ఉండే యజమాని రాంచందర్షాకు సమాచారం ఇవ్వడంతో పాటు భవనంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. అప్పటికే భవనమంతా దట్టమైన పొగలతో నిండిపోయి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కింద దుకాణాలు, పైన పోర్షన్లు మూడంతస్తుల భవనంలో కింద వాణిజ్య దుకాణాలు ఉండగా, పైన యజమాని నివాసంతో పాటు ఆరు పోర్షన్లు ఉన్నాయి. వాచ్మెన్ అరుపులతో నిద్రలోంచి మేల్కొన్న వారు దిక్కుతోచని స్థితిలో ఆర్తనాదాలు చేస్తూ భవనం నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు. కొంతమంది భవనంపైకి వెళ్లి పక్క భవనంపై నుంచి సురక్షితంగా బయట పడగా, మరికొందరు మంటల్లోంచే బయటకు వచ్చి గాయాలపాలయ్యారు. అయితే రెండో అంతస్తులోని సింగిల్ గదిలో ఉంటున్న సూర్యాపేట జిల్లాకు చెందిన రెపినేని నరేష్ (37), అతని భార్య సుమ (28) కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. అప్పటికే బయటంతా మంటలు, పొగ తీవ్రరూపం దాల్చాయి. సింగిల్ రూం కావడంతో వారికి మరో మార్గం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కుమారుడు జశ్వంత్ (5)ను తీసుకుని మంటల్లోంచే గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయతి్నంచి..మొదటి అంతస్తు మెట్ల వద్ద పడిపోయి సజీవ దహనమయ్యారు. నరేష్ దంపతుల పెద్ద కుమారుడు అది్వక్ శనివారం రాత్రి అక్కడికి సమీపంలోనే ఉన్న సుభాష్ చంద్రనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక రెండో అంతస్తులో ఉన్న నారాయణ, ఉమ దంపతులు బయటకు వచ్చే క్రమంలో మంటల సెగ తాకి గాయపడ్డారు. పద్మావతి అనే మహిళ రెండో అంతస్తు నుంచి చీర సాయంతో దిగుతుండగా మంటల వేడికి చీర తెగడంతో కింద పడిపోయి గాయపడింది. ఆమె భర్త పూర్ణచందర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా వాచ్మెన్ వీరమల్లేష్ ఇంట్లో ఉన్న సిలిండర్ పేలుతుందోమోనన్న భయంతో లోపలికి వెళ్లి దాన్ని తీసుకువచ్చే క్రమంలో స్వల్పంగా గాయపడ్డాడు. మంటలు క్షణాల్లోనే మంటలు భవనాన్ని చుట్టుముట్టాయని వాచ్మెన్ కూతురు ఉమ చెప్పింది. ఆరు గంటలు శ్రమించాం: ఫైర్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి ‘అగ్ని ప్రమాదం గురించి 4 గంటలకు మాకు సమాచారం అందింది. పది నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే మంటలు, దట్టమైన పొగ కారణంగా బిల్డింగ్‌లోకి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి లోనికి ప్రవేశించాం. ఓ కుటుంబం మిస్ అయ్యిందని చెప్పడంతో గాలించగా మొదటి అంతస్తు కారిడార్‌పై ఓ శవం, మెట్లపై రెండు శవాలను గుర్తించాం..’అని చర్లపల్లి అగ్ని మాపక అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా సాయినగర్ కాలనీలో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనుల కోసం రోడ్డును తవ్వేయడంతో ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి దగ్గరగా చేరుకోలేక పోయాయని స్థానికులు చెప్పారు. ఇలావుండగా అగిప్రమాదాలకు సంబంధించిన ఎలాంటి భద్రతా వ్యవస్థ లేకుండా టింబర్ డిపో నిర్వహిస్తున్న శ్రీ ఆదిత్య సాయి ఎంటర్ప్రైజెస్ యజమాని నూతలపాటి శివసాయిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. నరేష్, సుమ, జశ్వంత్‌ల మృతదేహాలకు గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పేలిన రెండు సిలిండర్లు.. మంటలు భారీఎత్తున ఎగసి పడటానికి భవనం కింద ఉన్న ఆటోమొబైల్ షాప్ గోదామే ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. గోదాంలోని టైర్లు, ఆయిల్ డబ్బాలతో పాటుగా ఇతర సామగ్రికి నిప్పు అంటుకోవడం వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన టింబర్ డిపోలో 8 గ్యాస్ సిలిండర్లు ఉండగా వీటిల్లో రెండు పేలిపోయాయి. టింబర్ డిపోలో అన్ని గ్యాస్ సిలిండర్లు ఎందుకున్నాయో తెలియరాలేదు. అలాగే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది కూడా తెలియరాలేదు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: హోంమంత్రి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మి క శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంపై హోం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారిని ఆదుకుంటామన్నారు. గాంధీ మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తానిక్కడికి వచ్చానని, తల్లిదండ్రుల మృతితో అనాథగా మిగిలిన అద్విక్ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే చూస్తుందని మల్లారెడ్డి చెప్పారు. కాగా బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.2 లక్షల చొప్పున రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియాను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. -
యాభై ఏళ్లలో చేయనోళ్లు.. ఇప్పుడు అభివృద్ధి చేస్తారట!
సాక్షి, మేడ్చల్ జిల్లా: యాభై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయనివాళ్లు.. ఇప్పుడు అవకాశమిస్తే ఎలా చేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో రూ.251 కోట్లతో 2000 కేఎల్డీ సామర్థ్యం కలిగిన లీచెట్ ప్లాంట్‌ను కార్మిక మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , రాంకీ సంస్థ ప్రతినిధులతో కలసి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 3,619 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జవహర్‌నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా కలుషితమవుతున్న మల్కారం చెరువుతో పాటు యార్డు చుట్టుపక్కల చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్దీకరణ ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని ప్లాంట్ నిర్వాహకులు హామీ ఇచ్చారని తెలిపారు. దేశానికే హైదరాబాద్ ఆదర్శ నగరం కాబోతోంది.. హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 2వేల ఎంఎల్టీ ( 2వేల మిలియన్ లీటర్ల) మురికినీరు ఉత్పత్తి అవుతోందని, 100 శాతం ఎస్టీపీలతో జూలై కల్లా దేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వెల్లడించారు. జపాన్‌లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చూశానని అక్కడ పైన పార్కు, కింద ప్లాంట్ ఉందని, ఏ మాత్రం వాసన లేదని వివరించారు. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడలను ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. 3 వేల మెట్రిక్ టన్నుల యార్డ్... 8 వేల మెట్రిక్ టన్నులైంది జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైద రాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని డిజైన్ చేశారని, కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. ప్రస్తుతం జవహర్ నగర్‌కు వచ్చే చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి, రైతులకు అమ్ముతున్నామని కేటీఆర్ తెలిపారు. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఈ చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్‌ను ప్రారంభించి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రెండోదశలో మరొక రూ.550 కోట్లతో 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో స్థాపించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో ఒక్క జవహర్‌నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం చెత్తతో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మూడో రకం చెత్తతో సిమెంట్, బ్రిక్స్ తయారీ తడి,పొడి చెత్త కాకుండా, ఇళ్లు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు వచ్చే కంకర రాళ్లు, మట్టితో మూడో రకం చెత్త వస్తోందని కేటీఆర్ తెలిపారు. నిర్మాణం, శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి.. వాటి నుంచి సిమెంట్, బ్రిక్స్, ఫుట్‌పాత్‌ల మీద వేసే టైల్స్ తయా రు చేస్తున్నామన్నారు. ఈ రకమైన ప్లాంట్లను ఒకటి ఫతూల్గూడలో, రెండోది జీడిమెట్లలో పెట్టినట్లు వివరించారు. ఈ రెండూ కూడా ఒక్కోటి 500మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నడుస్తున్నాయని, మరో రెండు కూడా త్వరలో పెట్టబోతున్న ట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుదీర్‌రెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, మేయర్లు మేకల కావ్య, జక్కా వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు రైతులా! దున్నపోతులా!
ఘట్కేసర్: రైతుల సమావేశంలో మంత్రి మల్లారెడ్డి అన్నదాతలపై విరుచుకుపడ్డారు. రుణమాఫీ ఎక్కడ చేశారని నిలదీసిన రైతుల్ని పట్టుకుని ‘మీరు రైతులా దున్నపోతులా’అంటూ దుర్భాషలాడారు. దీంతో ఆగ్రహించిన రైతులు అక్కడికక్కడే సభలోనుంచి లేచి నిరసనకు దిగారు. మంగళవారం పట్టణంలోని నారాయణగార్డెన్‌లో రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన 2022–23 అర్థ వార్షిక నివేదిక సదస్సుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండుగ అనేవారని, నేడు పండుగ వాతావరణంలో సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో హరినాథ్‌రెడ్డి అనే రైతు రుణమాఫీ అవుతుందని తీసుకున్న రూ.80 వేలకు మరో 80 వేలు వడ్డీ అయిందని రుణమాఫీ ఎక్కడ చేశారని అడగగా మరో రైతు మహిపాల్‌రెడ్డి వడ్డీ రేటు తగ్గించాలని కోరారు. దీంతో దున్నపోతుల్లా ఉన్నారు, మీరు రైతులా, బయటకు గుంజుకుపోండని మల్లారెడ్డి ఆదేశించడంతో రైతులు నిరసనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. రైతుల్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా 'సీఐ భారతి' లాంచ్
నరేంద్ర, గరిమా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సీఐ భారతి. రమణారెడ్డి గడ్డం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ సమర్పణలో విశాల పసునూరి నిర్మిస్తున్నారు. సోమవారం నాడు హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ... 'రొటీన్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్టాం. మా సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గతంలో నేను రెండు సినిమాలు చేశాను. ఇక మీదట కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయనున్నాం' అన్నారు. హీరో నరేంద్ర మాట్లాడుతూ... 'రమణా రెడ్డి గారు అద్భుతమైన కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఒక మంచి స్క్రిప్ట్ లో హీరోగా నటించడం చాలా సంతోషం. నా పాత్ర చాలా బాగా డిజైన్ చేశారు. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం' అన్నారు. -
చిన్నారులకు పతంగులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
-
మంత్రి మల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ అధికారుల లేక
-
పంచనామాపై బలవంతంగా సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు «భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసివచి్చన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. వెలుగులోకి రఘురామ కృష్ణరాజు పేరు -
మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు
-
ఐటీ దాడులనగానే గుండె నొప్పా..
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులకు, వారి బంధువులకు ఐటీ, ఈడీ సంస్థలు నోటీస్‌లు ఇవ్వగానే గుండె నొప్పి అంటూ ఆస్పత్రులకు వెళుతున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఐటీ అధికారులు తన కొడుకుపై చేయి చేసుకున్నారని, దొంగల్లాగా దాడి చేశా రని మంత్రి మల్లారెడ్డి ఆరోపించడం బాధ్యతారాహిత్యమన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ సోదాలనగానే మల్లారెడ్డి తన సెల్‌ఫోన్ చెత్తబుట్టలో ఎందుకు దాచారని, బకెట్లలో ఫైళ్లు పెట్టే దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నిన్నటి దాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి... నోటీస్‌లు ఇవ్వగానే గుండెపోటు ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదన్నారు. దుబ్బాక అభివృద్ధి నిధులు రూ.5 కోట్లు తాను ఖర్చు చేసే వెసులుబాటు కల్పిస్తూ వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను రఘునందన్ కోరారు. ఇదీ చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు -
రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి ఇళ్లలో కొనసాగిన దాడులు
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్/రసూల్‌పుర/మేడ్చల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు బుధవారం రెండోరోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. వైద్య కళాశాలల్లో సీట్లకు నిర్దేశిత ఫీజు కంటే అధిక మొత్తాన్ని నగదు రూపంలో తీసుకుని రియల్ ఎస్టేట్‌కు, సూరారం ఆసుపత్రికి తరలించినట్లు బయటపడింది. మరోవైపు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడం, ఆస్పత్రిలో చేరడం, ఈ విషయం తెలిసి ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్ జవాన్లను నెట్టేసి మంత్రి ఆస్పత్రికి వెళ్లడం, కుమారుడిని చూడనీయలేదంటూ అక్కడ ధర్నాకు దిగడం, మహేందర్‌రెడ్డిని జవాన్లు చిత్రహింసలు పెట్టారని ఆరోపించడం, ఆయన కోడలు ప్రీతిరెడ్డిని ఐటీ అధికారులు మంత్రి ఇంటికి తీసుకురావడం.. తదితర పరిణామాలతో బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. బుధవారం రాత్రివరకు తనిఖీలు కొనసాగుతుండగా, గురువారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉందని తెలిసింది. ఐటీ అధికారులకు సహకరిస్తున్నామని, ఆస్తులు, కాలేజీల వివరాలన్నీ ఇచ్చామని మంత్రి వెల్లడించారు. సోదాలు గురువారం ముగిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి ఐటీ దాడులు కొనసాగుతుండగా.. మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతీలో నొప్పిరావడంతో బుధవారం సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చేరారు. మరో బంధువు ప్రవీణ్‌రెడ్డి కూడా ఆసుపత్రిలో చేరి సాయంత్రానికి డిశ్చార్జి అయ్యారు. మంత్రి ఇంట్లో పనిచేసే పనిమనిషి ఫిట్స్‌తో అనారోగ్యానికి గురయ్యారు. కుమారుడు ఆసుపత్రిలో చేరారని టీవీల ద్వారా తెలుసుకున్న మంత్రి తన నివాసం నుంచి.. సోదాలు చేస్తున్న ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్ జవాన్లను నెట్టేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట ఐటీ అధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. మహేందర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వద్దకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రావడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడటం, సీఆర్పీఎఫ్ జవాన్లు..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు జవాన్లు లాఠీలు ఝళిపించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఐటీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నన్నూ, సీఎంను బద్నాం చేయాలని చూస్తున్నారు.. ‘మేము దొంగలమా..దొంగ వ్యాపారం చేస్తున్నామా..? కేసినో నడిపిస్తున్నామా.? హవాలా దందా చేస్తున్నామా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా.? తక్కువ మొత్తంతో పేద పిల్లలకు ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్య అందిస్తున్నాం. మేము ఏమైనా అవినీతికి పాల్పడితే.. కేసులు పెట్టుకోండి. మా ఇళ్లు వేలం వేయండి.. స్వాధీనం చేసుకోండి..? కానీ మమ్మల్నెందుకు క్షోభకు గురి చేస్తున్నారు? కాలేజీలు, హాస్టళ్లకు సంబంధించిన ఫీజుల చెల్లింపులు మొత్తం ఆన్లైన్లోనే జరుగుతాయి. ఎవరి దగ్గరో డబ్బు దొరికితే దానిని నాతో ముడిపెట్టడం ఏమిటి? నన్ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. నేను టీఆర్ఎస్ మంత్రిని కావడం వల్లనే దాడులు చేస్తున్నారు. వందల మంది అధికారులతో దాడులు చేయడం ఏమిటి? నా కొడుకు ఛాతీపై కొట్టారు. వాడు తీవ్రంగా భయపడుతున్నాడు. వాడికి ఏమైతుందోనని భయంగా ఉంది. సోదాల్లో ఏమీ దొరకకపోయినా ప్రధాని నరేంద్రమోదీ మాపై కక్షతో వ్యవహరిస్తున్నారు..’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడినుంచి మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని ఇంటికి వచ్చిన తరువాత ఆయన కోడలు ప్రీతిరెడ్డిని కూడా ఐటీ అధికారులు తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీల వ్యవహారం ఆమె చూస్తారని చెబుతున్నారు. ఇలావుండగా మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలను చూసే సంతోష్‌రెడ్డి కొంపల్లి నివాసంలో ఐటీ అధికారులు దాదాపు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకుని ఐటీ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. సంతోష్‌రెడ్డి డిలీట్ చేసిన కంప్యూటర్ డేటాను రిట్రీవ్ చేసినట్లు సమాచారం. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి కక్ష సాధింపులు మంచివి కాదని, వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టే ఓపికతో ఉన్నామని, కానీ ఐటీ అధికారుల తీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉందని ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, ఎల్.రమణలు విమర్శించారు. సూరారం ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ.. బహిరంగంగా వ్యాపారాలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసి, ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇకనైనా కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను నిరసిస్తూ కంటోన్మెంట్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పలు కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్లారెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి లాకర్లపై దృష్టి.. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన లాకర్లపై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయనకు ఎనిమిది బ్యాంకుల్లో 12 లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం టర్కీలో ఉండటంతో మంత్రి కూతురు శ్రేయారెడ్డిని తీసుకెళ్లి లాకర్లను తెరవడానికి ప్రయత్నించారు. అందులో నాలుగు లాకర్లను తెరిచినట్లు ఐటీ అధికార వర్గాల సమాచారం. కాగా లాకర్లలో పెద్దయెత్తున నోట్ల కట్టలు కనుగొన్నట్లు తెలిసింది. రూ.4 కోట్ల నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాజశేఖర్‌రెడ్డి గురువారం నగరానికి చేరుకుంటారని తెలుస్తోంది. ఇదీ చదవండి: తెలంగాణలో సోదాలు, దాడుల కాలమిది! -
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు
-
మల్ల రెడ్డి మాటలకూ చిరు అదిరిపోయే రియాక్షన్
-
చిరు అన్న.. బీఆర్ఎస్ కి సహకరించాలి
-
బూర నర్సయ్యగౌడ్ ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు : మల్లారెడ్డి
-
మునుగోడు లో టీఆర్ఎస్ విజయం ఖాయం : మల్లారెడ్డి
-
రేవంత్ తనను చంపడానికి కుట్ర పన్నారని మల్లారెడ్డి ఆరోపణలు
-
ఎన్టీఆర్ శతజయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాజకీయ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారామె. ఆపై టీఆర్ఎస్ నాయకులు- మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించి.. భారతరత్న డిమాండ్ వినిపించారు. ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టం. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనకు తారాస్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని నామ నాగేశ్వరావు అన్నారు. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు. -
రేవంత్ రెడ్డి ఓ దొంగ: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ దివాలా తీసిన దరిద్రపు పార్టీ అని, రేవంత్ రెడ్డి ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. రేవంత్ తనపై చేసిన కామెంట్లకు కౌంటర్‌గా.. టీఆర్ఎస్ఎల్పీ నుంచి మంగళవారం ఆయన మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లోని భట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి అమాయకులు. రేవంత్ మాత్రం లుచ్చా పనులు చేస్తున్నాడు. పదే పదే కేసీఆర్, కేటీఆర్‌లను తిడుతున్నాడు. అది రచ్చబండ కాదు.. లుచ్చా బండ. పెళ్లి పెటాకులు లేకుండా నైట్ క్లబ్‌ల చుట్టూ తిరిగే రాహుల్ గాంధీ ఓ తోపు.. ఈ పీసీసీ చీఫ్(రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి..) ఓ తోపు. అప్పుడే సీఎం అయిపోయినట్లు మాట్లాడుతున్నాడు. సీఎం కాదు కదా.. కనీసం అటెండర్ కూడా కాలేడంటూ రేవంత్‌పై మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి తమ మధ్య గొడవలు జరుగుతుండేవని పేర్కొన్న మల్లారెడ్డి.. టీడీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రేవంత్ తనపై బెదిరింపులకు దిగాడని చెప్పారు. ‘నా కాలేజీలు మూయిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి ఎవరి డబ్బుతో చేశాడు.. నా డబ్బుతో చేశాను’ అంటూ సంచలన కామెంట్లు చేశాడు మల్లారెడ్డి. కాదని యాదగిరిగుట్టపై ప్రమాణం చెప్పాలని రేవంత్‌కు సవాల్ విసిరాడు మల్లారెడ్డి. రేవంత్ వ్యాఖ్యలపై సొంత సామాజిక వర్గమే అసంతృప్తితో ఉందని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డిది అంతా డ్రామా అని, మూడేళ్లలో ఎంపీగా ఏం చేశాడని, చివరికు రాహుల్ గాంధీని సైతం బ్లాక్మెయిల్ చేసే రకం అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబును పట్టుకుని పీసీసీ తెచ్చుకున్నాడంటూ సెటైర్ సంధించారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని, ఆయన అల్లుడికి అందులో హస్తం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరినీ జైలుకు పంపి తీరతానంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కౌంటర్‌గానే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఇలా మీడియా ముందుకు వచ్చారు. తాను ప్రభుత్వ భూమిని ఎక్కడా కొనలేదని.. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే కొన్నానని, అందులో తప్పేముందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం భూములు కొంటున్నారు కదా అని ప్రశ్నించారు. కోర్టు సైతం తనకు అనుకూల తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మల్లారెడ్డి గుర్తు చేశారు. -
అక్కడ చంద్రుడు.. ఇక్కడ రాముడు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఒకసారి దేశ్‌కీ నేతగా అవకాశం కల్పిస్తే.. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టుగా దేశాన్ని తీర్చిదిద్దుతారని కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ఎదుగుతుంటే కేంద్రం ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా తమ శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రి మాట్లాడారు. ‘బలవంతమైన సర్పం చలిచీమల చేతచిక్కి చావదా సుమతీ’అనే నానుడి బీజేపీకి అతికినట్టు సరిపోతుందని.. ‘కేసీఆర్ ఒకసారి ఫైర్ అయితే మీరు మసై పోతారు’అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తాము ట్రెండ్ ఫాలో కాబోమని, ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పారు. రామరాజ్యం మళ్లీ వస్తుందని.. అయితే అక్కడ (ఢిల్లీలో) చంద్రుడు, ఇక్కడ (తెలంగాణలో) తారకరాముడు ఉంటారని.. బంగారు భారత్‌తో చరిత్ర సృష్టిస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులు బుల్లెట్ బండ్లపై పనికి రావాలని, అందుకోసం రూ.లక్ష సబ్సిడీతో మే 1 నుంచి వాహనాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. కరోనా సమయంలో కూలీబిడ్డలకు తెలంగాణ అడ్డా అయిందని.. సారా జహాసే అచ్చాలో హిందుస్థాన్‌కు బదులు తెలంగాణ నిలిచిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ముందు దుబాయ్, గల్ఫ్ ఉత్తవే (నథింగ్)నని వ్యాఖ్యానించారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
యాదగిరి నర్సన్నకు.. మంత్రి మల్లన్న 3.5 కిలోల బంగారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడంకోసం మూడున్నర కిలోల బంగారానికి సరిపడే నగదును కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (మల్లన్న) గురువారం తన నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి అందజేశారు. మేడ్చల్‌లోని తన క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో మం త్రి మల్లారెడ్డి యాదాద్రి కొండకు చేరుకున్నారు. రూ.కోటి 83 లక్షల నగదును తలపై పెట్టుకొని కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లతో కలిసి బాలాలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీతారెడ్డి, ఆచార్యులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించిన సందర్భంగా.. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరపున కిలో బంగారం, అలాగే మేడ్చల్ ప్రజల తరపున కూడా బంగారం అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరపున కిలో బంగారం, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరపున రూ.1 కోటి 83 లక్షలను విరాళంగా అందజేశారు. ఇందులో రూ.72 లక్షలు చెక్కు రూపంలో, రూ.కోటి 11 లక్షలు నగదు రూపంలో అందజేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.మల్లారెడ్డి అనుచరులు బాలాలయంలో శ్రీస్వామివారి ప్రతిష్టా కవచమూర్తుల విగ్రహాలను సెల్ ఫోన్లతో ఫొటోలు తీశారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఫొటోలను సెల్ ఫోన్లో నుంచి తొలగించారు. ‘జేఎస్ఆర్ సన్‌సిటీ’రూ.50 లక్షల విరాళం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడం పనులకు స్థిరాస్తి సంస్థ జేఎస్ఆర్ సన్‌సిటీ అధినేత జడపల్లి నారాయణ విరాళం అందజేశారు. గురువారం రూ.50 లక్షల చెక్కును ఆయన ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. -
‘అసమ్మతి’ కమిటీలు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల ఏర్పాటు ఆలస్యమవుతోంది. ఈ నెలాఖరులోగా అన్ని స్థాయిల్లో కమిటీల నిర్మాణం పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావించారు. అయితే, నియోజకవర్గ స్థాయిలో విభేదాలు, కమిటీల్లో చోటు కోసం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలపై ఒత్తిడి తదితర కారణాలతో కమిటీల ఏర్పాటు మందకొడిగా సాగుతోంది. అందరినీ కలుపుకొని వెళ్లాలని అధిష్టానం చెప్పినా ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు పోతున్నారని అసమ్మతి నేతలు అంటున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి నడుమ నెలకొన్న విభేదాలు సీఎం కేసీఆర్ వద్దకు చేరాయి. కమిటీల ఏర్పాటులో మల్లారెడ్డి తనను సంప్రదించడం లేదని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఏకంగా రాజీనామాకు సైతం సిద్ధపడిన విషయం తెలిసిందే. శరత్ ప్రస్తుతానికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా, ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ తిరిగి వచ్చిన తర్వాతే మేడ్చల్ పంచాయతీకి తెరపడే అవకాశముంది. తాండూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య నెలకొన్న పంచాయతీ కేటీఆర్ వద్దకు చేరింది. ఎవరికి వారు తమ అనుచరులతో గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకోగా, పట్టణ కమిటీకి అధ్యక్షుడిని ప్రకటించి మిగతా కార్యవర్గం జోలికి వెళ్లలేదు. ఇద్దరిలో ఎవరి కమిటీకి అధిష్టానం ఆమోదముద్ర వేస్తుందనే ఉత్కంఠ కేడర్‌లో ఉంది. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండల కమిటీ ఏర్పాటు సందర్భంగా జరిగిన ఘర్షణపై ఎమ్మెల్యే సునీత, స్థానిక నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కేటీఆర్‌కు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇతర వర్గాలను పట్టించుకోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే ఆధిపత్యం చెలాయిస్తుండటంతో పార్టీలో దీర్ఘకాలంగా ఉన్న వారు, వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన వారు తమ అనుచరులకు కమిటీల్లో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కమిటీల ఏర్పాటుకు దూరంగా ఉండగా.. నకిరేకల్, పాలేరు, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, భూపాలపల్లి తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులకే అవకాశం దక్కింది. ఇదిలాఉంటే ఎమ్మెల్యేల కనుసన్నల్లో కమిటీలు ఏర్పాటైనా మండల, పట్టణ, గ్రామ కమిటీల ఏర్పాటులో కేడర్ నడుమ పోటీ ఉండటం కూడా తలనొప్పులకు దారితీస్తోంది. ఇదిలాఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీ కమిటీల ఏర్పాటు కూడా మందకొడిగా సాగుతోంది. 150 డివిజన్ కమిటీలతో పాటు 400కు పైగా బస్తీ కమిటీలు ఏర్పాటు చేయాలనుకున్నా ఇప్పటివరకు సగం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. దసరా తర్వాతే... ఈనెల 12లోగా గ్రామ, మున్సిపల్ వార్డు, 20వ తేదీలోగా మండల, పట్టణ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని కేసీఆర్ గడువు విధించారు. అయితే ఇప్పటివరకు 30 నియోజకవర్గాల నుంచి మాత్రమే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వివరాలు అందినట్లు తెలిసింది. గడువులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు కేటీఆర్ రెండు పర్యాయాలు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కూడా నిర్వహించారు. అన్ని స్థాయిల్లోనూ ప్రధాన కమిటీల్లో చోటు కోసం పోటీపడుతున్న నేతలు, క్రియాశీల కార్యకర్తలు అనుబంధ కమిటీలపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. అన్ని స్థాయిల్లోనూ ప్రధాన కమిటీలతోపాటు మహిళ, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్‌తోపాటు సోషల్ మీడియా కమిటీలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామ కమిటీల్లో 11 నుంచి 15 మంది, అనుబంధ కమిటీల్లో 15 మంది, మండల కమిటీల్లో 22 మందికి అవకాశం ఇచ్చారు. జిల్లా కమిటీల్లో అధ్యక్షుడితోపాటు 24 మందికి అవకాశం లభిస్తుంది. క్రియాశీల కార్యకర్తలకు మాత్రమే చోటు కల్పించాలనే నిబంధన ఉండటంతో అనుబంధ కమిటీల ఏర్పాటుకు అవసరమైన మేర క్రియాశీల కార్యకర్తలు లేక కమిటీలు అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. ఓ వైపు గడువు ముగియడం, మరోవైపు కమిటీల్లో చోటు కోసం పోటీ పడుతున్న అనుచరులు వెనక్కి తగ్గకపోవడంతో కమిటీలకు తుది రూపు ఇవ్వడంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు తర్జనభర్జన పడుతున్నారు. -
‘హత్యాచార’ నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తాం
-
‘మంత్రి మల్లారెడ్డి ఒక బడాచోర్’
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): మంత్రి మల్లారెడ్డి ఒక బడాచోర్ అని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అన్నారు. మంత్రి అక్రమదందాలు, భూకబ్జాల ఆధారాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బట్టబయలు చేసినా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడడం ఎందుకని ప్రశ్నించారు. దళిత, గిరిజన దండోరా సభకు మద్దతుగా పెద్దపల్లిలో శనివారం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పూదరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఓదెల జెడ్పీటీసీ గంట రాములుతో కలిసి మాట్లాడారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కేసీఆర్ కూడా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తూ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి అంతిమఘడియలు సమీపించాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని అన్నారు. కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు బి.రమేశ్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెమినిగౌడ్, కల్వల శ్రీనివాస్, బొంకూరి అవినాష్, శ్రీమాన్, బొడ్డుపల్లి శ్రీను, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు: మాజీ మంత్రి -
మంత్రి మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): బాధ్యతగల మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ అన్నారు. గురువారం సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీనేతలు, మంత్రివర్గంలో వణుకు పుడుతోందన్నారు. ప్రజాభిమానం పొందుతున్న టీపీసీసీ ప్రెసిడెంట్‌పై బహిరంగంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిపక్షంలో ప్రజలచే సరైన గుణపాఠం చెబుతామన్నారు. జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: దిశ ఎన్‌కౌంటర్‌పై నేడు విచారణ -
మంత్రి మల్లారెడ్డి ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం
-
తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘నువ్వు అబద్ధాలు, బ్లాక్మెయిల్ వ్యవహారాల్లో నంబర్ వన్ కదా. రేపు నేను నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా..’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సవాల్ విసిరారు. ‘నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇప్పుడు, రేపు, రెండేళ్లు ఆగు అని సవాల్ చేసుడు కాదు.. దమ్ముంటే ఇప్పుడు పోటీ చేసి గెలిచి ట్రైలర్ చూపించు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి ఇంటికి పోవాలే’అని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మల్లారెడ్డి బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ఆయన పార్లమెంటులో నా కాలేజీ మీద ప్రశ్న అడిగాడు. నేను మచ్చలేని మహారాజును.. తప్పు చేయకుండా రూపాయి రూపాయి కష్టపడి సంపాదించా. నీలాగా బ్లాక్మెయిల్, సమాచార హక్కు చట్టం అడ్డు పెట్టుకుని అ క్రమాలు చేయలేదు. పాలు, పూలు అమ్ముడు త ప్పా. నన్ను బ్రోకర్, జోకర్ అన్నందుకే స్పందిస్తున్నా’అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ‘దళిత ఆత్మ గౌరవ సభలు అం టూ నువ్వు చెడి పోయి మమ్మల్ని చెడ గొడతవా.. మా నోట్లో మన్ను పో స్తవా అని స్థానికులు తిట్టారు. సర్కస్‌లా గా టెంట్ సామాను తెచ్చి ఐదేసి వందలు ఇస్తే వచ్చిన వాళ్ల ముందు తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నాడు. నాలుగు పార్టీలు మారి పైసలిచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నావు. పీసీసీ అధ్యక్ష పదవికి ఎవరూ దిక్కులేకనే.. నీకు పదవిస్తే పైసలు వసూలు చేసి పార్టీని నడిపిస్తావని ఇచ్చారు’అని మల్లారెడ్డి అన్నారు. ‘సీఎం ఎన్నో గొప్ప పనులు చేస్తున్నా కనపడతలేదా.. 17 లక్షల కుటుంబాలకు దళితబంధు తరహాలో ఇతరులకు కూడా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంబేడ్కర్ తర్వాత మా కేసీఆరే’అని మల్లారెడ్డి అన్నారు. చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు? -
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా రైతుల నినాదాలు : మేడ్చల్
-
మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
దుండిగల్: ఓ భూవివాదంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఆరో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, మంత్రితో పాటు ఆయన కుమారుడు, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పద్మావతి కుమార్తె శ్యామలాదేవి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బాధితురాలు శ్యామలాదేవి ఫిర్యాదు ప్రకారం... తల్లి పొన్నబోయిన పద్మావతి పేరుపై సూరారం సర్వే నంబర్ 115, 116, 117లలో 2.13 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని విక్రయించాలంటూ మంత్రి తన అనుచరులతో బెదిరించారు. దీనిపై 2017లో పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో తల్లి పద్మావతితో కలిసి కోర్టులో మల్లారెడ్డిపై భూవివాదానికి సంబంధించిన పిటిషన్ వేసేందుకు న్యాయవాది లక్ష్మీనారాయణను ఆశ్రయించారు. అయితే మంత్రితో చేతులు కలిపిన న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకని బాధితులనుంచి స్టాంప్ పేపర్‌పై సంతకాలు తీసుకున్నాడు. వాటి ఆధారంగా మల్లారెడ్డి అనుచరుడు గూడూరు మస్తాన్‌కు ఆ భూమిని అమ్మేందుకు రూ.ఎనిమిది లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీ అగ్రిమెంట్ పేపర్లను తయారు చేశారు. దీన్ని అడ్డుపెట్టుకొని పద్మావతి, శ్యామలాదేవిలను ఆ భూమిలోకి రానివ్వలేదు. ఈ ఒత్తిడులు ఇలా ఉన్న సమయంలోనే కొన్ని నెలల క్రితం శ్యామలాదేవి తల్లి పద్మావతి, సోదరి మరణించారు. దీంతో ఒంటరిగా ఉన్న తనకు ప్రాణహాని ఉందంటూ, మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామలాదేవి దుండిగల్ పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. దీంతో కోర్టులో శ్యామలాదేవి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. -
మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మంత్రి మల్లారెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారన్న క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రాంమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడ్డ మంత్రి మల్లారెడ్డిని తక్షణం మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలని సూచించారు.(ఎంపీ అర్వింద్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్) ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవాలని చూసిన మంత్రి మల్లారెడ్డిపై.. అలాగే టికెట్లు కొనుక్కోవాలని చూసిన అభ్యర్థులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అంటున్న కేసీఆర్, కేటీఆర్‌లు.. మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల బలహీనతలే పెట్టుబడిగా .. డబ్బు, మద్యం , ప్రలోభాలతో టిఆర్ఎస్ ప్రతిసారి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థగా మార్చిన టిఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని సామ రాంమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: కలకలం రేపుతున్న మల్లారెడ్డి ఆడియో టేపు -
అందుబాటులోకి మరో రెండు అర్బన్ పార్క్‌లు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర వాసులకు మరో రెండు అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయు పార్క్‌లను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలికోసం హైదరాబాద్‌కు నలువైపులా ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’పేరిట రిజర్వ్ ఫారెస్టులను అభివృద్ధి చేస్తోందన్నారు. దమ్మాయిగూడలో 298 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో రూ.74 లక్షల వ్యయంతో బెంచ్‌లు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ పార్కుల్లో ఫుడ్ కోర్ట్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ గేమ్‌జోన్ ఏరియా ఏర్పాటు చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, మేడ్చల్ జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యోగం కావాలంటే ఈ యాప్ ఉండాలి గురూ..!
సాక్షి, హైదరాబాద్ : ఇకపై ఉద్యోగ ప్రయత్నం మరింత సులభతరం కానుంది. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్‌పేజీ తెరిచింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులు ఈ యాప్ లేదా వెబ్‌పేజీలో వివరాలు నమోదు చేసుకుంటే చాలు.. వారి అర్హతకు తగ్గ ఉద్యోగాల జాబితా ప్రత్యక్షమవుతుంది. ఇంతకుముందు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ... అవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఉద్యోగం వచ్చిన తర్వాత.. లేదా ఉద్యోగాల జాబితా ప్రచురణకు వెబ్సైట్ నిర్వహణ సంస్థకు రుసుము చెల్లించాల్సి వచ్చేది. తాజాగా కార్మిక ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ మాత్రం పూర్తిగా ఉచితం. కంపెనీలల్లో ఖాళీల నమోదుకు ఎలాంటి చెల్లింపులుండవు. ఉద్యోగ ప్రయత్నం చేసే అభ్యర్థికి సైతం పూర్తిగా ఉచిత సేవలందిస్తారు. గుర్తింపు ఉన్న కంపెనీల్లోనే.. డీట్ యాప్, వెబ్పేజీల్లో గుర్తింపు ఉన్న కంపెనీల్లో ఖాళీల ప్రదర్శనకు కచ్చితమైన నిబంధనలు పాటిస్తుంది. ఉద్యోగ ఖాళీలున్నట్లు వచ్చే నోటిఫికేషన్ల తాలూకు కంపెనీ పూర్వాపరాలు ముందుగా యాప్ నిర్వాహకులు పరిశీలిస్తారు. మొబైల్ ఫోన్ వెరిఫికేషన్, ఈ–మెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత క్షేత్ర పరిశీలన చేసి నిర్ధారిస్తారు. అలా మూడు దశల్లో ఆమోదం పొందిన తర్వాతే సదరు నోటిఫికేషన్లను యాప్, వెబ్పేజీల్లో ప్రదర్శిస్తారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని నిర్వహించే కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు రంగ కంపెనీలైనా.. సంబంధిత శాఖల సలహాలు, సూచనలు సైతం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. యాప్ డౌన్లోడ్ ఇలా.. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో డీట్ (deet) అని టైప్ చేసి సెర్చ్ చేస్తే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో యాప్ ప్రత్యక్షమవుతుంది. ఇన్స్టాల్ చేసుకుని.. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత అవకాశాలను బట్టి ఉద్యోగం ఇచ్చే కంపెనీతో చాట్ చేసే వీలుంటుంది. ఆ కంపెనీ ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుని ఉద్యోగ పరిస్థితి, ఇంటర్వూ్య తదితర ప్రక్రియల కోసం ముందుకెళ్లొచ్చు. అలాగే https://tsdeet.com వెబ్సైట్ ద్వారా కూడా ఉద్యోగాల శోధన చేయొచ్చు. డీట్ యాప్, వెబ్‌పేజీలను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి డీట్ యాప్, డీట్ వెబ్‌పేజీలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా ఉచితంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాప్, వెబ్‌పేజీ నిర్వహణ కోసం ఏటా రూ.10 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కార్మిక ఉపాధి కల్పన డైరెక్టర్ కేవై నాయక్, మోహిత్‌కుమార్ పాల్గొన్నారు. ఓకే చోట పరిశీలన ఉద్యోగావకాశాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుంది. అక్కడ ఉద్యోగాలున్నా అవి అభ్యర్థి అర్హతలకు సరిపోతాయో లేదోనన్న సందేహం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే కంపెనీలు వెబ్‌పేజీల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఆయా కంపెనీల పేజీలను ఒక్కొక్కటిగా వీక్షించడంతో సమయం ఎక్కువ పడుతుంది. వీటిన్నింటిని అధిగమించి సులభంగా ఒకే వేదికగా ఉద్యోగాలను చూసుకునే వీలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఈ యాప్/వెబ్‌పేజీలు ప్రారంభదశలో ఉన్నాయి. ఇప్పటికే 45 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారం ఉంది. – చల్లా మణికాంత్, సీఈవో స్టోరీటెక్ -
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం
సాక్షి, మేడ్చల్ : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన శుక్రవారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే పార్టీ నేతలు మంత్రి సమక్షంలోనే బాహా బాహీకి దిగారు. వారిని వారించినా ఫలితం లేకపోవడంతో మంత్రి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి... పార్టీ తొలి సభ్యత్వాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా గురువారం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం అయింది. -
మంత్రి మల్లారెడ్డి మానవత్వం
బాలానగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని అటుగా వెళుతున్న మంత్రి మల్లారెడ్డి స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన సంఘటన సోమవారం బాలానగర్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలానగర్ రాజు కాలనీకి చెందిన బాలస్వామి మేస్త్రీగా పని చేసేవాడు. సోమవారం సోమవారం సైకిల్‌పై నర్సాపూర్ చౌరస్తాలో ఓ వ్యక్తిని కలిసేందుకు వస్తున్న అతడిని లారీ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో బోయినపల్లి నుంచి కూకట్‌పల్లికి వెళుతున్న కార్మిక, ఉపాధి కల్పనా శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి దీనిని చూసి కాన్వాయ్‌ని నిలిపివేశారు. బాధితుడిని తానే స్వయంగా కాన్వాయ్‌లోకి ఎక్కించి సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మంత్రి మల్లారెడ్డి స్పందించిన తీరుపట్ల స్థానికులు ప్రశంసలు కురిపించారు. -
మంత్రులకు షాక్!
కంటోన్మెంట్: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇద్దరు మంత్రులకు షాక్ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అదే విధంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి మల్కాజిగిరి నుంచి బరిలో నిలచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయా పార్లమెంట్ స్థానాల్లోని అసెంబ్లీ స్థానాల్లోనే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగించలేకపోయింది. ఆయా మంత్రులు ఓటేసిన బూత్‌లలోనూ టీఆర్ఎస్కు ఆధిక్యం దక్కకపోవడం గమనార్హం. మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌లో నివాసముండే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు సాయికిరణ్ యాదవ్‌ల ఓట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కస్తూర్బా కాలేజీలోని పోలింగ్ బూత్ నెం.220లో ఉన్నాయి. ఈ బూత్‌లో బీజేపీకి 395, కాంగ్రెస్‌కు 153 ఓట్లు రాగా... టీఆర్ఎస్కు కేవలం 89 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీతో పోలిస్తే టీఆర్ఎస్ 306 ఓట్లు తక్కువ రావడం గమనార్హం. ∙మంత్రి మల్లారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ స్కూల్లోని పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి 207 ఓట్లు రాగా... మంత్రి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి 179 ఓట్లు దక్కాయి. ఈ బూత్‌లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్కు 28 తక్కువ ఓట్లు పడ్డాయి. బీజేపీ సైతం ఈ బూత్‌లో 169 దక్కించుకోవడం గమనార్హం. -
ఎన్ఆర్ఐ కోటాలో ఎమ్మెల్యే.. పేమెంట్ కోటాలో మంత్రి..
మల్లాపూర్: ఎన్ఆర్ఐ కోటాలో ఎమ్మెల్యే పదవి.. పేమెంట్ కోటాలో మంత్రి పదవిని.. వేలం పాటలో అల్లుడికి ఎంపీ టిక్కెట్‌ను మల్లారెడ్డి కుటుంబం దక్కించుకుందని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రోడ్‌షోలో భాగంగా గురువారం ఆయన మల్లాపూర్ నెహ్రూనగర్ చౌరస్తా వద్ద మాట్లాడుతూ.. ఐదేళ్లలో మల్లారెడ్డి ఎప్పుడూ మల్కాజిగిరి పార్లమెంట్‌లోని ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, ఆయన అల్లుడు పట్టించుకుంటాడా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతాడన్నారు. ప్రతి పేదవాడికి నెలకు రూ.6 వేలను నేరుగా తమ ఖాతాలోకి వేస్తారని హామీ ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నెహ్రూనగర్, అశోక్‌నగర్ కాలనీల్లో హైటెన్షన్ వైర్లను తొలగింపజేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్, వీఎస్.బోస్, సోమశేఖర్‌రెడ్డి, మొసలి శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, రాజేష్, సూర్ణం రాజేష్, చిన్న దుర్గయ్య, కేబుల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎంపీ, ఎమ్మెల్యే.. మంత్రి
సాక్షి, మేడ్చల్ జిల్లా: అదృష్ట జాతకమంటే ఆయనదే అని అందరూ అనుకుంటున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతోనే ఒక్కసారిగా ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా వరుసగా పదవులు వరించాయి మల్లారెడ్డిని. అనూహ్యంగా పార్లమెంట్ టికెట్ సాధించటంతో పాటు అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డి ఐదేళ్ల పదవీకాలం పూర్తికాక ముందే మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీచేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఆ వెంటనే కేసీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు. ఎంపీగా అయినా, ఎమ్మెల్యేగా అయినా పోటీ చేసిన తొలిసారే విజయం సాధించారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి 88,066 మెజారిటీతో విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం, టీడీపీ బలహీన పడటం వంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అలాగే, ముందస్తు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన శాసనసభపై మోజుతో మేడ్చల్ టికెట్ ఆశించారు. ఆ ఎన్నికల్లో 88,066 ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. అనూహ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. -
అన్ని సర్వేల్లో టీఆర్ఎస్కు 16 సీట్లు: కేటీఆర్
హైదరాబాద్: అత్యధిక స్థాయిలో ఓటర్లు ఉన్న పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి అని, ఇక్కడ ప్రాంతాల వారీగా కులాల వారీగా వివక్షకు తావులేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లికి మేనమామలా కేసీఆర్ సాయం చేస్తున్నారని అన్నారు. మనం చేపట్టిన రైతు బంధు పధకాన్ని కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టాయని గుర్తు చేశారు. దేశం మొత్తం తెలంగాణా పరిపాలనను గమనిస్తోందని వ్యాక్యానించారు. ఒక ఉద్యమ కారుడు, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా ఉండటం చాలా గొప్ప విషయమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, కేసీఆర్‌ని పొడిగిన విషయం గురించి మళ్లీ గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రలు అదుపులో ఉన్నాయని, సీఎం కేసీఆర్ మీద నమ్మకంతో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు మనకు వేసి మరోసారి పట్టం కట్టారని అన్నారు. రాహుల్ కాకపోతే మోదీ..వీళ్లే నాయకులు..వేరే వారు లేరా.. బడితే ఉన్నోడిదే బర్రె అన్నట్లు ఉంటది ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అని ఎద్దేవా చేశారు. మోదీ చేసింది చెప్పడానికేమీ లేదన్నారు. మహిళలు పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులను డీమానిటైజేషన్ పేరుతో ఎత్తుకుపోయిండని విమర్శించారు. అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలుస్తోందని చెబుతున్నాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఆ రెండు జాతీయ పార్టీలకు గెలిచే అవకాశాలు తక్కువన్నారు. మనం పదహారు సీట్లు సాధిస్తే కేంద్రం మెడలు వంచి మనకు కావాల్సిన నిధులను తీసుకురావచ్చని వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధకు కలిపి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. మన పోటీ ఎవరితోనూ కాదని మనకు మనమే పోటీ అని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ దివాళా పార్టీ: మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు పార్టీ అని టీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గమని, అన్ని నియోజకవర్గాల కంటే అత్యదిక మెజారిటీని ఇక్కడ నుంచి అందిస్తామని చెప్పారు. కేటీఆర్ లాంటి యువ నాయకుడు మనకు ఉండటం మన అదృష్టమన్నారు. వేరే పార్టీలకు ఓటు అడిగే హక్కే లేదన్నారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. రూ.4 వేల కోట్లతో దాహార్తి తీర్చిండు: తలసాని హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో బాధపడుతుంటే రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి వారి దాహార్తిని కేటీఆర్ తీర్చారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గుర్తు చేశారు. కేటీఆర్ తన రోడ్‌షో ద్వారా బల్దియాలో 99 సీట్లను గెలిపించాడని, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేటీఆర్ ఒక్కరే తన రోడ్‌షో ద్వారా గ్రేటర్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు సాధించి పెట్టారని కొనియాడారు. -
ప్రజాసేవకు.. ఫుల్‌టైం
‘కష్టం, కన్నీళ్లు తెలిసినవాన్ని..అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన వాన్ని..అందుకే ప్రజల కష్టాల్లో, సుఖాల్లో పాలుపంచుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చా. ఎంపీ, ఎమ్మెల్యే కంటే..రాష్ట్ర మంత్రిగా విస్తృత సేవ చేసే అవకాశాన్నికల్పించిన సీఎం కేసీఆర్‌కు, నాకువరుస విజయాలు అందించిన మేడ్చల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా’ అని రాష్ట్ర నూతన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం జరిగే యజ్ఞంలో తాను మరింత చురుకైన పాత్ర పోషిస్తూ బంగారు తెలంగాణ కోసం మిగిలిన జీవితాన్ని అంతా ఫుల్‌టైం కేటాయిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినా..రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. మరోవైపు వచ్చే లోక్‌సభ, మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. -
కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయం
సాక్షి, కీసర: రాష్ట్రంలో టీఆర్ఎస్ 100 పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం కీసరలోని కేబీఆర్‌గార్డెన్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగున్నర ఏళ్ల కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను మరో మారు గెలిపిస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తాను 2012 నుంచి టీఆర్ఎస్లో చురుగ్గా పని చేశానన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ నుంచి 43 వేల మెజారిటీతో గెలుపొందారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కొంగర కలాన్ ప్లీనరీ తరువాత సీఎం కేసీఆర్ స్వయంగా తనకు మేడ్చల్ నుంచి మరో మారు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ మొదటి లిస్టులో తన పేరును కుడా చేర్చారని కొన్ని దుష్టశక్తులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 రోజులుగా మేడ్చల్ టిక్కెట్ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో గత మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ తనను పిఠి లిపించుకొని కొన్ని కారణాలతో ఈ సారి టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారని తెలిపారు. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటాం... మేడ్చల్ అభ్యర్థిగా ఎవరు ఎంపికైన వారిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. పల్లారాజేశ్వర్‌రెడ్డి రెండు రోజుల క్రితం తన ఇంటికి ఎంపీ చామకూరమల్లారెడ్డిని తీసుకొచ్చారని ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లారెడ్డిని అధిష్టానం ప్రకటిస్తే ఆయనను మంచి మెజారిటీతో గెలిపిస్తానని చెప్పానన్నారు. అందుకోసం ఇప్పటి వరకు తన వెంట ఉన్న నేతలు కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ప్రచారకార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఎంపీ చామకూరమల్లారెడ్డి మాట్లాడుతూ.... మలిపెద్దిసుధీర్‌రెడ్డి గొప్ప నాయకుడని ఎంతో త్యాగ గుణమున్న వ్యక్తి అని కొనియాడారు. మలిపెద్దిసుధీర్‌రెడ్డి రాజకీయ అనుభవం తనకూ పార్టీకి ఎంతో అవసరమన్నారు. ఆయన సూచనల మేరకే తాను మందుకెళ్తానని పేర్కొన్నారు. నేతలను, కార్యకర్తలందరిని కలుపుకొని ముందుకెళ్తానన్నారు. ఎమ్మెల్యేగా బరిలో నిలువనున్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. మేడ్చల్ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి జహంగిర్ మాట్లాడుతూ... మేడ్చల్ అభ్యర్థి గెలుపు బాధ్యత కేసీఆర్ సుధీర్‌రెడ్డిపై ఉంచారని పేర్కొన్నారు. కేసీఆర్ మాట నిలబెట్టెందుకు సుధీర్‌రెడ్డి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని చెప్పారు. సుధీర్‌రెడ్డికి భవిష్యత్‌లో ఎమ్మెల్సీతో పాటు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. కాగా కార్యకర్తల సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి మాట్లాడుతుండగా కార్యకర్తలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. సుధీర్‌రెడ్డి నాయకత్వం జిందాబాద్ అని నినాదాలు చేయడంతో సుధీర్‌రెడ్డి కల్పించుకొని కార్యకర్తలను శాంతపరచారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన కొందరు నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో కీసర, శామీర్‌పేట, ఘట్కేసర్, మేడ్చల్ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మండల పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో ఐక్యతా రాగం
సాక్షి,మేడ్చల్ జిల్లా/ఘట్కేసర్: మేడ్చల్ టీఆర్ఎస్లో ఐక్యతా రాగానికి పార్టీ అధిష్టానం నడుం బిగించింది. దీంతో మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్టిగా ఎంపీ మల్లారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లయింది. పార్టీ ‘బి’ ఫారం కూడా బుధవారం మల్లారెడ్డికి అందించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతి బెడదను చక్కబెట్టుకోవాలని ఎంపీ మల్లారెడ్డికి అధిష్టానం సూచించినట్లు సమాచారం. అందులో భాగంగా మంగళవారం ప్రతాప్ సింగారంలో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులతో ఎంపీ మల్లారెడ్డి సమావేశమయ్యారు. ఇందులో నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు వెలుబుచ్చిన అభిప్రాయాలు, సూచనలను ఎంపీ మల్లారెడ్డి అంగీకారం తెలిపినట్టు తెలిసింది. నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న మండల పార్టీ కమిటీలను యథాతథంగా కొనసాగించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే, మండల కమిటీలు సూచించిన వారికి అవకాశం కల్పించాలని చేసిన సూచనలు, సలహాలను పాటించే విషయమై సమావేశంలో సంసిద్ధత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలతోపాటు మిగతా నాలుగు మండలాల్లో పార్టీ ప్రచార కమిటీలను నియమించేందుకు సంయుక్తంగా బుధవారం బోడ్పుల్లో రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన నాయకులు ,కార్యకర్తల సమావేశం, కీసరలో నాలుగు మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మేడ్చల్ అభ్యర్థిగా ఎంపీ మల్లారెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షులతోపాటు మేడ్చల్ మున్సిపాలిటీ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అ«ధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, ఎంపీపీలు చంద్రశేఖర్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, పలువురు ముఖ్య నాయకులు హాజరు కాగా, మాజీ ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్న బోడుప్పల్ , పీర్జాదిగూడ మున్సిపాలిటీలకు చెందిన నాయకులు జేడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, దర్గ దయాకర్‌రెడ్డి గైర్హాజర్ అయినట్టు తెలిసింది. -
పేదల సమస్యలకే పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: అన్నిరంగాల్లో నిర్లక్ష్యానికి గురైన పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పనకు సీపీఎం కసరత్తు చేస్తోంది. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ రెండో సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగింది. నిర్మాణాత్మకమైన, సుస్థిరమైన అభివృద్ధి జరగాలని, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు అందడానికి తీసుకోవాల్సిన చర్యలపై మేనిఫెస్టోలో నిర్దిష్టంగా చెప్పడానికి కసరత్తు జరిగింది. రైతులు, భూమి లేని కూలీలు, పేదలకు ఇళ్లు వంటివి సమకూర్చడానికి ఉన్న మార్గాలను సీపీఎం మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు. ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం అందించడంతో పాటు భూమి లేని నిరుపేదలకు భూమిని అందించడానికి ఉన్న అవకాశాలను కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొననున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాకు రెండురోజుల్లో తుదిరూపు ఇస్తామని సీపీఎం నేతలు వెల్లడించారు. -
150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసుకోవచ్చు
- మల్లారెడ్డి మహిళా కాలేజీకి కేంద్రం అనుమతి సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి మహిళా మెడికల్ కాలేజీకి ఎట్టకేలకు ఈసారి 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసుకునేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనుమతించింది. 2016-17 వైద్య విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు ఈ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసింది. ఆ కాలేజీలోని సగం కన్వీనర్ కోటా (75) సీట్లకు ఈనెల 29న వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వాటితోపాటు రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలే సీట్లకు, స్పోర్ట్స్ కోటాకు చెందిన 10 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. స్పోర్ట్స్ కోటా సీట్లకు సంబంధించి ఇంకా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మెరిట్ లిస్టు రాలేదు. లిస్టు 28వ తేదీ సాయంత్రానికి వస్తేనే ఆ సీట్ల భర్తీ జరుగుతుందని వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. జాబితా పంపాలని అథారిటీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. మల్లారెడ్డి కాలేజీలో 29న ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నందున, బి కేటగిరీ మొదటి కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లతోపాటు మల్లారెడ్డి కాలేజీకి వచ్చిన సీట్లలో బి కేటగిరీకి చెందిన 35 సీట్లకు ఈనెల 30న కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్య సంఘానికి అనుమతి ఇచ్చినట్లు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
నిర్బంధ విద్యకు ‘ట్రెస్మా’ బాసట
మిరుదొడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేజీ టు పీజీని స్వాగతిస్తూ ఉచిత నిర్బంధ విద్యకు ట్రెస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) సహకరిస్తుందని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జెగ్గు మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం మిరుదొడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ట్రెస్మా అత్యంత కీలకపాత్ర పోషించిందన్నారు. అదే స్ఫూర్తితో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో టెన్త్ ఫలితాల్లో అగ్రగామిగా నిలపడానికి ట్రెస్మా సభ్యులు ఎనలేని కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎఆర్ఆర్ కృష్ణమాచారి, కోశాధికారి జి.సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు కె.రవీందర్, జిల్లా ప్రతినిధులు సంతోష్, బాల్‌రెడ్డి, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, సికిందర్, లింగం తదితరులు పాల్గొన్నారు. -
స్టాంప్ పేపర్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
పాత స్టాంప్ పేపర్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. చంపాపేటకు చెందిన లతీఫ్ ఖాన్, మల్లారెడ్డి అనే వ్యక్తులు 70, 80 సంవత్సరాల పాత స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 75 స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తమ్ముళ్ల దాడి
యల్లనూరు : మండల పరిధిలోని కొడవండ్లపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తెలుగు దేశం పార్టీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసి గాయపర్చిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... తాడిపత్రి ఎమ్మెల్యే∙జేసీ ప్రభాకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం కొడవండ్లపల్లి పర్యటించారు. ఆ రోజే అనవసరంగా వైఎస్సార్సీపీ నేతలతో తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. మల్లారెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్త తన ఇంటికి వెళ్లాలంటే టీడీపీకి చెందిన వారి ఇంటి ముందు నుంచే వెళ్లాలి. మంగళవారం రాత్రి మల్లారెడ్డి తన ఇంటికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు కేశవ, జయరామకృష్ణలు మారణాయుధాలతో దాడి చేశారు. మల్లారెడ్డి కాపాడేందుకు వెళ్లిన భూపతి, రామకృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూడా వారు దాడి చేశారు. ఈ ఘటనలో మల్లారెడ్డి తీవ్రంగా గాయపడగా, భూపతి, రామకృష్ణలు గాయాలపాలయ్యారు. బాధితులను పుట్లూరు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. -
బైపాస్ రోడ్డు నిర్మించొద్దు
తుర్కపల్లి : బైపాస్‌రోడ్డు పేరుతో రైతుల పొట్టకొట్టొద్దని జాతీయ కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బైపాస్ వద్ద ఉన్న రోడ్డు వెంటనే నాలుగు లైన్ల రోడ్డు విస్తరించాలని తెలంగాణపరిరక్షణ సమితి ఆధ్యర్యంలో మంగళవారం మండలంలోని జేఎం ఫంక్షన్‌హాలులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్న ప్రభుత్వం ఉన్న భూములు ఆక్రమించుకున్న ప్రజాప్రతినిధులకు, రియల్టర్లకు వత్తాసు పలుకుతుందన్నారు. యాదాద్రి నుంచి కీసర వరకు ప్రభుత్వం తలపెట్టిన బైపాస్ రోడ్డులో 350 ఎకరాల వరకు రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు అన్నింటికి అనువుగా ఉండి, ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు రైతులు భూములు ఆక్రమించుకొని రోడ్డు వేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి సరాసరి యాదాద్రికి వెళ్లడానికే రోడ్డు వేసుకొని ఇటు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల జేబులు నింపడానికి జరుగుతున్న ప్రయత్నమేనన్నారు. 2013 చట్టం ప్రకారం భూముల కోల్పోతున్న రైతులు ఉన్న మార్కెట్ రేట్‌కు నాలుగింతల పరిహారం అందజేయాలని అన్నారు. ఇప్పటి వరకు బైపాస్ రోడ్డు విషయంలో ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా అమాయక రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. వెంటనే బైపాస్ రోడ్డు విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెండాలు పక్కన పెట్టి భూనిర్వాసితుల ఎజెండానే ముందుకు తీసుకొని పోరాటం చేయాలని అన్నారు. అనంతరం భూనిర్వాసితులు కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా కొక్కొండ లింగయ్య, గౌరవసలహాదారుగా కల్లూరి రామచంద్రారెడ్డి, బబ్బూరి రవీంధ్రనాథ్‌గౌyŠ , 20 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముల్కలపల్లి రాములు, కొండమడుగు నర్సింహ, బండ శ్రీశైలం, మటూరి బాల్‌రాజు, మాటూరి బాల్‌రాజు, మంగ నర్సింహులు, నాయకులు రంగ శంకరయ్య, బబ్బూరి పోశెట్టి, ఎలుగల రాజయ్య, పిడుగు అయిలయ్య, సిల్ల్వేరు దుర్గయ్య, కొక్కొండ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
చీటింగ్ కేసులో టీ9 ఛానల్ సీఈవో అరెస్ట్
హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న 'టీ9' న్యూస్ ఛానల్ సీఈవో సహా మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసాలకు పాల్పడుతున్న ఘరానా ముఠాను టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసుల సంయుక్త బృందం అదుపులోకి తీసుకుంది. మొత్తం నలుగురు నిందితులను పట్టుకున్నట్లు సీసీఎస్ సంయుక్త పోలీస్ కమిషనర్ టి.ప్రభాకర్ రావు తెలిపారు. తార్నాకకు చెందిన 'టీ9' న్యూస్ ఛానల్ సీఈవో కె.మల్లన్న అలియాస్ మల్లారెడ్డి, అబిడ్స్ లోని ఓ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.రమేష్, సితాఫల్మండికి చెందిన నిరుద్యోగి బి.నగేష్ బాబు, సచివాలయ ఉద్యోగి డి. వెంకటేశ్వరరావు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. జెన్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వేణు, మహేష్ అనే నిరుద్యోగులను నమ్మించారు. ఇందు కోసం రూ.10 లక్షలు అవుతుందని చెప్పి అడ్వాన్స్‌గా రూ.2.5 లక్షలు తీసుకున్నారు. జెన్కోలో ఏఈ పోస్టుల పేరుతో మరికొందరి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు మంగళవారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా 2010లోనూ రైల్వేలో గ్రూప్-డి పోస్టులు ఇప్పిస్తామంటూ 10 మంది రూ.10 లక్షలు వసూలు చేసినట్లు, ఆ మొత్తాన్ని నారయణగౌడ్ అనే వ్యక్తికి ఇచ్చినట్లు, ఆ డబ్బుతో అతడు పరారైనట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. అదనపు డీసీపీ విజయేందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ నిందితుల్ని అరెస్టు చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.విక్రమ్‌దేవ్ రూ.2.68 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
గుండెపోటుతో బస్సులో ప్రయాణికుడి మృతి
వెల్దుర్తి (కర్నూలు): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన మల్లారెడ్డి (48) అనే వ్యక్తి మంగళవారం రాత్రి డోన్ నుంచి కర్నూలుకు ఆర్టీసీ బస్సులో వెళుతున్నాడు. వెల్దుర్తి సమీపంలోకి రాగానే గుండెపోటు రావడంతో సీటులోనే కూలబడిపోయాడు. డ్రైవర్ బస్సును ఆపి పోలీసులకు సమాచారం అందించాడు. -
సంగారెడ్డి - అకోలా రహదారిని విస్తరించండి
నితిన్ గడ్కారీకి ఎంపీ మల్లారెడ్డి వినతి సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారిగా గుర్తించిన సంగారెడ్డి-నాందేడ్-అకోలా రహదారిని నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీకి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి విన్నవించారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరిలు కూడా ఇదే అంశమై రాసిన లేఖలను గడ్కరీకి అందజేశారు. -
నిరుపేదలకు అండగా ఉంటాం
మంత్రి మహేందర్‌రెడ్డి హామీ దుండిగల్: నిరుపేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట గ్రామంలో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయల నిధులతో ఆర్అండ్ బి రోడ్లు వేస్తున్నామన్నారు. చెరువుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. కుత్బుల్లాపూర్ మండలంలో త్వరలోనే బస్‌డిపో ఏర్పాటు చేస్తామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్‌తో చర్చిస్తామని, కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపేట సర్పంచ్ అర్కల అనంత స్వామి ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎండీఓ కె.అరుణ, టీఆర్ఎస్ నేతలు శంభీపూర్‌రాజు, కొలన్ హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కావలి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ప్రసంగాన్ని అడ్డంకులు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రసంగిస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ లోనూ అభివృద్ధి జరగాలని అనడంతో టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బంగారు తెలంగాణ ను నిర్మిస్తారంటూ పేర్కొన్నారు. కాగా ఎంపీ ప్రసంగించే ముందు జై తెలంగాణ నినాదం చేసి ప్రసంగించాలని దుండిగల్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. ఇక కుత్బుల్లాపూర్ మండలంలోని పలు సమస్యలపై మంత్రి మహేందర్‌రెడ్డికి ఎంపీపీ, సర్పంచ్‌లు విన్నవించారు. -
'ఏకీకృత ఫీజు, కామన్ ఎంట్రెన్స్ పై మరోదఫా చర్చలు'
తెలంగాణలో ఏకీకృత ఫీజు, కామన్ ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్క్షప్తి చేసినట్లు మెడికల్ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు బృందం శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. అనంతరం మల్లారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఫీజు పెంపును ఆమోదించలేమని ప్రభుత్వం తమకు వెల్లడించిందని చెప్పారు. ఇదే అంశంపై ప్రభుత్వంతో మరోదఫా చర్చలు జరుగుతాయని మల్లారెడ్డి చెప్పారు. -
మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు
హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి మల్లారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భన్వర్‌లాల్‌ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు...మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లోని లోపాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) దృష్టికి తీసుకొచ్చారు. 19 విద్యాసంస్థలు ఉన్నప్పటికీ ఏ ఒక్క దానిని కూడా అఫిడవిట్లో చూపించలేదని ఈసీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు. మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల వివరాలను, ఆధారాలను ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, జనక్‌ప్రసాద్, నాగేశ్వరరావు సమర్పించారు.