తెలంగాణలో ఏకీకృత ఫీజు, కామన్ ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్క్షప్తి చేసినట్లు మెడికల్ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు బృందం శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. అనంతరం మల్లారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఫీజు పెంపును ఆమోదించలేమని ప్రభుత్వం తమకు వెల్లడించిందని చెప్పారు. ఇదే అంశంపై ప్రభుత్వంతో మరోదఫా చర్చలు జరుగుతాయని మల్లారెడ్డి చెప్పారు.