ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) కింద కేరళలోని కోజికోడ్‌లో నిర్మించిన వైద్య కళాశాలను ప్రశంసిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఎన్ని వైద్య కళాశాలలు ఇచ్చారని ఓ నెటిజన్ ప్రశ్నించగా ఆమె ఘాటుగా స్పందించారు. అప్పుడు నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆలస్యంగా మేల్కొని వైద్య కళాశాలలు అడుగుతోందని వ్యాఖ్యానించారు.
పీఎంఎస్‌ఎస్‌వై కింద కొత్త వైద్య కళాశాలల కోసం ఇతర రాష్ట్రాలన్నీ దరఖాస్తు చేసుకోగా, సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో తెలంగాణ విఫలమైందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. తమిళనాడు కేవలం ఒకే ఏడాదిలో 11 వైద్య కళాశాలలను పొందిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment