Tamilisai
-
కాటన్ క్యాండీలపై నిషేధం.. వీడియో విడుదల చేసిన తమిళిసై!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్ క్యాండీలను తయారు చేస్తున్నారనే కారణంతోనే వీటిపై నిషేధం విధించారు. ఒక వీడియోలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ మాట్లాడుతూ కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నారన్నారు. కాటన్ క్యాండీలలోని విష రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. అందుకే పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. குழந்தைகளின் உடல்நலத்தை பாதிக்கும் ரசாயனம் கலந்த பஞ்சு மிட்டாயை குழந்தைகளுக்கு வாங்கி கொடுக்காதீர்கள்.#CottonCandy #PanchuMittai #Puducherry pic.twitter.com/VJR451Y403 — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 8, 2024 లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ షేర్ చేశారు. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆ వీడియోలో తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం, రోడోమైన్ బీ అనే రసాయనాన్ని ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. -
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
TSPSC సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిళ్ సై
-
TS: రాజీనామాపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని... గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్.. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తెలియజేస్తాన్నారు. రాజకీయాలు అనేది నా కుటుంబ నేపథ్యంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపించాయి. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. -
సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల సాక్షిగా తెలంగాణలో ఇందిరమ్మ పాలన వరి్ధల్లుతుందని కాంగ్రెస్ సర్కారు తరఫున గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి.. హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై తొలి సంతకం చేయటం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోందని చెప్పారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని.. వారి విజ్ఞతను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని.. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పేందుకు గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశిస్తూ గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అనుభవం, యువరక్తం మేళవింపుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం ఉందని తమిళిసై ఆకాంక్షించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ‘‘ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం. ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచి్చన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కలి్పంచే ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయటం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోంది. ఇది ప్రజాపాలన. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉండే పాలన తెలంగాణలో మొదలైందనడానికి నిదర్శనంగా ప్రారంభమైనదే ప్రజావాణి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించే మహాలక్షి్మ, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు.. ఈ రెండు గ్యారంటీల అమలు ప్రారంభమైంది. మొత్తం ఆరు గ్యారంటీలైన మహాలక్షి్మ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతలను వచ్చే 100 రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటాం. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్‌లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్.. అన్నీ అమలు చేస్తాం. సాధ్యమైనంత త్వరలో అమరవీరుల కుటుంబాలను గుర్తించి.. 250 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని, గౌరవ భృతిని అందజేస్తాం. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. ఆదిలాబాద్‌కు సాగునీరు ఇస్తాం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతలోపం, అవినీతి, అవకతవకలపై విచారణ దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేసి ఎగువన ఆదిలాబాద్, ఇతర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం దిశగా సాగుతాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధనకు కట్టుబడి ఉన్నాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. దానికి జాతీయ హోదా సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతాం. త్వరలో మెగా డీఎస్సీ మెగా డీఎస్సీ నిర్వహణతో వచ్చే ఆరు నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ.లక్ష, స్థలం లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇంటి స్థలం ఇస్తాం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రారంభించేలా త్వరలో కార్యాచరణ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. భూసంస్కరణలలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన 25లక్షల ఎకరాల భూమిపై పేదలకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తాం. మాఫియాపై ఉక్కుపాదం రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియాను నిర్మూలించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. డ్రగ్స్ విషయంలో దోషులు ఎంతటివారైనా వదిలేది లేదు. ఐటీ విషయంలో మరింత వేగంగా పురోగతి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నగరాన్ని అన్నిదిశలా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం సంకల్పం. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా భావిస్తూ.. ఔటర్ లోపల ఉన్న నగరం, ఔటర్ రింగురోడ్డు– ప్రతిపాదిత రీజనల్ రింగురోడ్డు మధ్య ఉన్న ప్రాంతం, రీజనల్ రింగు రోడ్డు ఆవల ఉన్న ప్రాంతం.. ఇలా మూడు ప్రాంతాలను నిర్ధారించి వాటికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అప్పుల్లో విద్యుత్ సంస్థలు గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. రూ.50,275 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీని సరిదిద్ది గాడిలో పెట్టాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసి, వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలపై భారం మోపకుండానే ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి సంక్షేమ పాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యక్తుల కోసం విధ్వంసమా? ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సిన వ్యవస్థలు, సంస్థలు వ్యక్తుల కోసం పనిచేసే పరిస్థితికి దిగజారాయి. ఈ తీరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో విలువలు పునరుద్ధరిస్తాం. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు తీసుకుంటాం. అభివృద్ధి విషయంలో వివక్ష ఉండదు. పారీ్టలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధి నిధులు పొందుతారు. సచివాలయం అలంకారప్రాయంగా ఉండదు. రైతులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుంది. యువత జాబ్ కేలండర్ విషయంలో కార్యాచరణ ప్రారంభిస్తాం. ప్రతి గ్రామం యూనిట్‌గా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం..’’ అని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాళోజీ, అంబేడ్కర్ మాటలను ఉటంకిస్తూ.. ‘‘మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలె భారతాన..’’ అన్న ప్రజాకవి కాళోజీ మాటలను ఉటంకిస్తూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చివరిగా ‘‘ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వ పాలనా రూపం మాత్రమే కాదు.. వాస్తవానికి అది తోటి మానవుల పట్ల గౌరవాదరాలతో కూడిన ఒక వైఖరి..’’ అన్న అంబేడ్కర్ మాటలను ప్రస్తావించారు. ప్రముఖ కవి దాశరథి పేర్కొన్న ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..’’ అనే మాటలతో ప్రసంగాన్ని ముగించారు. -
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం
-
Bathukamma Celebrations: రాజ్ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై (ఫొటోలు)
-
ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
-
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్!
రాయదుర్గం (హైదరాబాద్): 2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ గుర్తింపు పొందడం ఖాయమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్(యూజీసీ) చైర్మన్, విద్యావేత్త ప్రొఫెసర్ ఎం.జగదీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలి లోని శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాల తోపాటు గోల్డ్‌మెడల్స్, ఫ్యాకల్టికి చాన్స్‌లర్స్ అవార్డుల ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగానే కాకుండా ఆర్థికంగా ఎదుగుతున్న దేశంగా భారత్ ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో 2030 నాటికి 100 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు. దేశంలోని అన్ని స్టేట్ యూనివర్సిటీలలో 70 నుంచి 80% ఫ్యాకల్టీ ఖాళీలు కొనసాగుతున్నాయని తెలుస్తోందని, వాటిని వెంటనే భర్తీ చేయా లని జగదీశ్‌కుమార్ సూచించారు. సెంట్రల్ వర్సిటీలలో భర్తీల ప్రక్రియ ఆరంభమైందని, త్వరలో పూర్తి స్థాయిలో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. యువత నోబెల్ బహుమతి సాధించాలి: గవర్నర్ తమిళిౖసై నేటి తరం యువత నోబెల్ బహుమతి సాధించాలనే లక్ష్యంతో కష్టపడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యావిధానం–2020లో ఎన్నో సంస్కరణలకు దారి తీసిందని, దీన్ని అందరూ స్వాగతించాలన్నారు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే విద్యార్థులు మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం హెచ్‌సీయూ చాన్స్‌లర్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు కూడా మాట్లాడారు. రిజి స్ట్రార్ డాక్టర్ దేవే‹Ùనిగమ్, పలువురు ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, అధికారులు పాల్గొన్నారు. -
గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే తిరస్కరించేవారు కాదు
-
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం తనకు కల్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు, ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించేలా చూడాలన్నారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి అరుణ వినతిపత్రం సమర్పించారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన రాజపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. గద్వాల అసెంబ్లీ స్థానానికి సంబంధించిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్న గవర్నర్, అరుణతో ప్రమాణస్వీకారం చేయించేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌తో మాట్లాడతానని చెప్పినట్టు బీజేపీ వర్గాల సమాచారం. అనంతరం అరుణ మీడియాతో మాట్లాడుతూ తన ప్రమాణానికి ఏర్పాట్లు చేయాలని రెండుసార్లు అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరన్నారు. దీనిపై వారి నుంచి ఎలాంటి సమాధా నం రాకపోవడంతో గవర్నర్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంలో ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఛలో రాజ్‌భవన్.. స్పందించిన గవర్నర్, చర్చలకు సై!
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు. యూనియన్ నాయకులను గవర్నర్ చర్చలకు పిలిచారు. యూనియన్ నాయకులు రాజ్ భవన్ రావాలని ఆహ్వానం పంపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపనున్నారు. I am pained to know about the strike conducted by RTC employees creating inconvenience to common public...I want to convey that I am always with them even during the previous strike I was with them ..now also I am studying it carefully because their rights should be… pic.twitter.com/WXqTSWHj7Q — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 5, 2023 -
మా మంచి పనులు ఎందుకు కన్పించవు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధిలాగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం హైదరాబాద్ కోఠి లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ ట్వీట్, వ్యాఖ్యలు దురదృష్టకరం. భవన నిర్మాణంపై మొదట స్పందించింది ముఖ్యమంత్రి కేసీఆరే. 2015 జూలైలో సీఎం ఆసుపత్రిని సందర్శించారు. నూతన భవన నిర్మాణానికి అప్పుడే రూ.200 కోట్లు ప్రకటించారు. అయితే ఆగస్టు 5వ తేదీన కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అందువల్ల అది ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ ఐఐటీ నిపుణులు, పురావస్తు శాఖ డైరెక్టర్‌తో ప్రభుత్వం స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ ఆసుపత్రి నిర్వహణకు భవనం పనికిరాదని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం కోర్టుకు ఇదే విషయం చెప్పింది. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. అది రాగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ ఈ విషయాలన్నీ పక్కనపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వెతికినట్టు రాజకీయంగా బురద జల్లే వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న మంచి పనులు గవర్నర్‌కి కని పించవా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాం.. అది గవర్నర్‌కి కనిపించదు. ‘‘మంచి కనబడదు.. మంచి వినబడదు.. మంచి చూడం’’అన్నట్టుగా గవర్నర్ తీరు ఉంది..’అని హరీశ్‌రావు విమర్శించారు. చెడు మాత్రమే చూస్తామంటే ఎలా? ‘గవర్నర్ తీరులో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వైద్యురాలిగా గవర్నర్ వైద్య ఆరోగ్యశాఖ కష్టాన్ని గుర్తించడం లేదు. 2014తో పోల్చితే పరిస్థితి మారింది. నీతి ఆయోగ్ నివేదికలో వైద్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నిమ్స్‌లో పడకల సంఖ్యను 1,500కు పెంచాం. కొత్తగా 2,000 పడకలతో విస్తరిస్తున్నాం. కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి కార్యక్రమాలు అమలు చేసి, ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు పెంచి మాతా శిశు మరణాలను తగ్గించాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను 30 శాతం నుండి 70 శాతానికి పెంచాం. దేశంలో 100 శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పింది. కంటి వెలుగు చాలా బాగా చేశాం. ఇవేవీ గవర్నర్ గుర్తించరు. ప్రశంసించడానికి మనసు రాదు. అభినందిస్తూ కనీసం ఒక ట్వీట్ కూడా చేయరు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థితి నుంచి నేను వస్తా బిడ్డ సర్కార్ దవాఖానకు అనే స్థాయికి చేర్చాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దేశంలోనే ఒక చరిత్ర. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. డయాలసిస్ సెంటర్లు గతంలో మూడు ఉంటే 102కు పెంచాం. గాంధీ, నిమ్స్, ఉస్మానియాలో పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అవయవ మార్పిడి చేస్తున్నారు. బస్తీ దవాఖానాలను కూడా నీతి అయోగ్ ప్రశంసించింది. ఇవేమీ గవర్నర్‌కు ఎందుకు కనిపించండలేదు? ఎందుకు అభినందించరు? ఎందుకు స్పందించరు? ఒక డాక్టర్గానైనా గవర్నర్ అభినందించాలి కదా? వైద్యుల మనోధైర్యం పెంచేలా అభినందిస్తూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు? ప్రశంసిస్తే మేమింకా ఉత్సాహవంతంగా పనిచేస్తాం కదా? అలా కాకుండా చెడును మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే మాట్లాడతాం అన్నట్టుగా వ్యవహరించడం గవర్నర్‌కు తగదు. బీజేపీలా రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరం..’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
రక్తదానం జీవన దానమే!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, దీనిపై అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రక్తదానం అంటే జీవన దానమే అని స్పష్టం చేశారు. కృత్రిమ శ్వాస పరిజ్ఞానం (సీపీఆర్) పట్ల ప్రజల్లో విస్తృత అవగావన కల్పించాలన్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సొసై టీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె 50సార్లకుపైగా రక్తదానం చేసిన దాతలు, అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను టీసీఎస్, ఎస్బీఐ స్టాఫ్ కళాశాల, ఉస్మానియావర్సిటీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ, నిజామాబాద్ యూనిట్లు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను పొందడాన్ని అభినందిస్తూ ఇందుకు కృషి చేసిన స్థానిక ప్రతినిధులు డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్, బుస్సా అంజన్నకు సైతం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 139 సార్లు రక్తదానం చేసిన అంజయ్య, 50 సార్లు రక్తదానం చేసిన అతడి భార్య పి.మనోరమతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు కుర్రె సిద్ధార్్థ, శ్రీలేఖ, మరో పీజీ వైద్య విద్యార్థిని ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ తెలంగాణ చైర్మన్ అజయ్‌మిశ్రా, వైస్ చైర్మన్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలి రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో ఎన్ఐఆర్డీ, పీఆర్ సీనియర్ అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటివనరుల మ్యాపింగ్‌తోపాటు వాటి నిర్వహణ, పునరుజ్జీవనానికి ప్రాధాన్యతతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కష్టసాధ్యంగా మారుతున్నందున ప్రపంచస్థాయిలో ప్రత్యేకంగా ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశలో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. -
యోగాను పండుగలా జరుపుకోవాలి
రసూల్‌పురా (హైదరాబాద్): అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకుని 25 రోజుల కౌంట్‌డౌన్ సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర ఆయుష్, ఓడరేవుల, షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, కార్మిక, ఉపాధి, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముంజపరా మహేంద్రభాయ్ కాలూభాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దీపావళి, ఉగాదిలాగా యోగా కూడా ఒక పండుగలా సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి యోగా చేయాలని సూచించారు. కౌంట్‌డౌన్‌కు హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విషయమని అన్నారు. యోగా మన జీవన విధానం: కిషన్‌రెడ్డి మన దేశంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన యోగా మన జ్ఞాన సంపద, జీవన విధానమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. జూన్ 21న యోగా దినోత్సవం రోజున అనేక దేశాల్లో యోగా చేస్తారని, ఆరోజు మన దేశంలోనూ ప్రతిఒక్కరూ యోగా చే యాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 13 నుంచి దేశవ్యాప్తంగా వంద రోజులపాటు యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు హైదరాబాద్‌లో 25 రోజుల కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి సోనోవాల్ మాట్లాడుతూ, యోగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మనసు సుసంపన్నం అవుతుందని అన్నారు. జూన్ 21న మైసూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ఈ 25 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సినీ ఆరి్టస్టులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన పదివేల మంది పైగా యోగా మహోత్సవ్‌లో పాల్గొన్నారు. -
భద్రత ఉంటేనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, హైదరాబాద్/జవహర్‌నగర్: ఏ దేశమైనా అంతర్గతంగా సురక్షితంగా, శాంతిభద్రతలతో ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. దేశాన్ని అంతర్గతంగా సురక్షితంగా ఉంచడంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అత్యంత కీలకంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్‌లో దేశ ఆర్థికాభివృద్ధి, అన్ని రంగాల వికాసంలోనూ సీఐఎస్ఎఫ్ ప్రముఖ పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్మారక స్తూపం వద్ద సీఐఎస్ఎఫ్ అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని కేంద్ర ప్రభుత్వ భవన సముదాయాలు, ఎయిర్‌పోర్టుల వంటి అనేక కీలక సంస్థలకు భద్రత కల్పించడంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని.. కేంద్ర హోం మంత్రిగా తాను ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వందో స్వాతంత్య్ర వేడుకల వరకు 5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల సేకరణను లక్ష్యంగా నిర్ధేశించారని, ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేందుకు భద్రత అనేది కీలక అంశమని అన్నారు. దేశంలో శాంతియుత వాతావరణం ఉంటేనే ఇది సాధ్యమని హోం మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. 1930 మార్చి 12న మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్రం కోసం ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారని, అదే రోజున సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ భద్రత విధుల్లో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ సమయంలోనూ సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అధికారులు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి, మానవీయ కోణంలో ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో సేవలందించారని ప్రశంసించారు. సమస్యలను సవాలుగా తీసుకుని ముందుకు సాగాలని జవాన్లకు సూచించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. గతంతో పోలిస్తే కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల హింసాత్మక ఘటనలు తగ్గాయని, ప్రజల్లోనూ కేంద్ర బలగాలపై విశ్వాసం పెరుగుతోందని అమిత్‌షా అన్నారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రధాని మోదీ సర్కార్ అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, సీఐఎస్ఎఫ్ డీజీపీ షీల్వర్ధన్ సింగ్, నిసా డైరెక్టర్ కె.సునీల్ ఇమ్మాన్యుయెల్, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న విన్యాసాలు.. సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హకీంపేటలోని నిసాలో ఆదివారం నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉగ్రమూకల దాడులను ఎలా తిప్పికొడతారు.. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది పనితీరు, అగ్నిప్రమాదాల సమయంలో సహాయక చర్యల వంటి విన్యాసాలను కళ్లకుకట్టినట్టు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చూపారు. మహిళా సిబ్బంది ప్రదర్శించిన కలరిపయట్టు విన్యా సాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకు ముందు నిసా ప్రాంగణంలోనే ‘అర్జున’పేరిట ఫైరింగ్ రేంజ్‌ను అమిత్‌షా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన అధికారులు, జవాన్లకు బహుమతులను అందజేశారు. -
ఎన్నిసార్లు అడిగినా ఒక్కటి కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు
తెలంగాణ విషయంలో కేంద్రం చూపిస్తున్న వివక్షపై రాజ్‌భవన్ దృష్టి పెడితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం చేసిన ట్వీట్‌పై ఆయన ట్విట్టర్లో స్పందించారు. వైద్య కళాశాలలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కూడా హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. మెడికల్ కాలేజీలపై మోసం ‘రాష్ట్రానికి కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపింది. ఒకటో ఫేజ్‌లో ఇస్తారనుకుంటే రెండో ఫేజ్‌లో కూడా ఇవ్వలేదు, మూడో ఫేజ్‌లో ఇస్తామని చెప్పి చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే.. మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేక పోయామని అంటారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు..?’అని హరీశ్ నిలదీశారు. దేశంలోనే నం.1గా రాష్ట్రం ‘కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వకున్నా, పైసా నిధులివ్వకున్నా..సీఎం కేసీఆర్ రాష్ట్ర సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా ఉండటం వాస్తవం కాదా? ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?..’అని ప్రశ్నించారు. గిరిజన వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీపై దృష్టి పెట్టండి తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని, తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు నిలదీయడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఏపీ పునర్ విభజన చట్టం –2014 లో ఇచ్చిన0 హామీల మేరకు గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్‌భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినట్టవుతుందని పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు ఎందుకింత దుస్థితి? ‘గతంలో బీబీనగర్ ఎయిమ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఒక కేంద్ర మంత్రి అన్నారు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సి న బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకని గల్లీలోని మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉంది? రూ.1,365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ.156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు? ఇదే సమయంలో అంటే 2018లో మంజూరు అయిన గుజరాత్ ఎయిమ్స్‌కు 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా?..’అని హరీశ్ నిలదీశారు. -
అప్పుడు నిద్రపోయి ఇప్పుడు మేల్కొంది
ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద కేరళలోని కోజికోడ్‌లో నిర్మించిన వైద్య కళాశాలను ప్రశంసిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఎన్ని వైద్య కళాశాలలు ఇచ్చారని ఓ నెటిజన్ ప్రశ్నించగా ఆమె ఘాటుగా స్పందించారు. అప్పుడు నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆలస్యంగా మేల్కొని వైద్య కళాశాలలు అడుగుతోందని వ్యాఖ్యానించారు. పీఎంఎస్ఎస్వై కింద కొత్త వైద్య కళాశాలల కోసం ఇతర రాష్ట్రాలన్నీ దరఖాస్తు చేసుకోగా, సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో తెలంగాణ విఫలమైందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. తమిళనాడు కేవలం ఒకే ఏడాదిలో 11 వైద్య కళాశాలలను పొందిందని పేర్కొన్నారు. -
ప్రీతి ఘటనపై వివరాలివ్వండి
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై కళాశాల ప్రిన్సిపల్ మోహన్‌దాస్‌ను ఆదేశించారు. ప్రీతి ఆత్మహత్యకు ముందు కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రిలో ఏం జరిగింది? ప్రీతికి కౌన్సెలింగ్ నిర్వహించిన వైద్యులు ఎవరు? ప్రీతి ఆత్మహత్యకు అనస్తీషియా తీసుకోవడమే కారణమా? ఎంజీఎంలో ఎలాంటి వైద్యం అందించారు? ఎవరి సూచన మేరకు ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు? అనే అంశాలను కూడా నివేదించాలని ఆదేశించారు. అలాగే, ఐదేళ్ల కాలంలో కళాశాలలో ఏమైనా ర్యాగింగ్ ఘటనలు జరిగాయా? కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.. లాంటి వివరాలు కూడా ఇవ్వాలని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని వివరాలను నివేదిస్తామని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ పేర్కొన్నారు. ఎంజీఎంలో రెఫరల్ వైద్యమా? ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో రెఫరల్ వైద్యం పేరుతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే విషయంపై గవర్నర్ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆస్పత్రిలో సదుపాయాలు, వైద్యుల కొరత ఉందా? అనే అంశంపైనా ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, బాధితులను హైదరాబాద్‌కు తరలించే విధానంపైనా నివేదిక పంపాలని కోరారు. -
బడ్జెట్‌పై లంచ్ మోషన్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామని ప్రభుత్వ తరపు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. రాజ్యాంగపరంగా నిబంధనలన్నీ నిర్వర్తిస్తామని తెలిపారు. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ తెలంగాణ సర్కార్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్ సిఫార్సులకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో .. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే.. ఈ నాటకీయ పరిణామల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌కు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా లంచ్ మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్, హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్ ముసాయిదా ప్రతులకు ఆమోదం తెలపలేదు అని, గవర్నర్ ఆమోదం తెలపకపోతే కష్టతరమవుతుందని ఏజీ.. బెంచ్ ముందు విజ్ఞప్తి చేశారు. అయితే.. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకోగలుగుతామని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. లంచ్ మోషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న అడ్వకేట్ జనరల్ సమాధానంతో.. అందుకు బెంచ్ అంగీకరించింది. అయితే పిటిషన్ రెడీగా ఉందా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. సిద్ధంగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ఏజీకి స్పష్టం చేసింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం. -
గన్ షాట్ : తెలంగాణ రాజకీయాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయా ..?
-
ఫోన్ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిపక్షాల నేతలు, ఇతర ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నా యంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభు త్వంలోని కీలక వ్యక్తుల కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ జరు గుతోందని, దీనికి పోలీసులు సహకరిస్తు న్నారని వివిధ పార్టీల నేతలు తనకు ఫిర్యాదు చేశారని వివరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవా రం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వచ్చిన గవర్నర్.. సాయంత్రం నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు పది నిమిషాల పాటు వారు వివిధ అంశాలపై చర్చించారు. తన మూడేళ్ల పదవీ కాలంలో రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణ యాలకు సంబంధించిన నివేదికను అమిత్‌షాకు తమి ళిసై అందజేశారు. రాష్ట్రంలో ఇటీ వలి రాజకీయ పరిణా మాలు, ఎమ్మెల్యేల కొను గోలు అంశం, పలు బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వ సహ కారం వంటి అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొను గోలు వ్యవహారంలో కేసీఆర్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం, కేంద్రంలోని పెద్దలను ఇరకాటంలోకి నెట్టేలా వ్యవహరి స్తున్న తీరుపైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఇక తన ఆమోదం కోసం వచ్చిన పలు బిల్లుల విషయంలో అదనపు సమాచారం కోరినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన కరువైన విషయాన్ని అమిత్‌షా దృష్టికి గవర్నర్ తీసుకెళ్లినట్టు తెలిసింది. విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లుపై సందేహాలు ఉన్నాయని.. వాటి నివృత్తి కోసం రాష్ట్ర విద్యా మంత్రికి లేఖ రాసినా స్పందన లేదని వివరించినట్టు సమాచారం. మామూలు భేటీయే: గవర్నర్ అమిత్‌షాతో భేటీ అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో ముక్తసరిగా మాట్లాడారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. గవర్నర్‌గా తన మూడో ఏడాదికి సంబంధించిన కార్యకలాపాలను నివేదిక రూపంలో హోంమంత్రికి ఇచ్చానని వివరించారు. కేంద్ర హోంమంత్రితో భేటీ సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమేనని, ఎలాంటి ప్రత్యేకతా లేదని పేర్కొన్నారు. చదవండి: వచ్చి చర్చించండి.. సబితకు గవర్నర్ పిలుపు -
వచ్చి చర్చించండి.. సబితకు గవర్నర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాకిచ్చారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్‌భవన్‌కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి సోమవారం గవర్నర్ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఈ కొత్త విధానంపై అభిప్రాయం వ్యక్తం చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి గవర్నర్ లేఖ రాశారు. కొంతకాలం నుంచి రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. ‘‘ప్రస్తుత విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు ఎదురై పోస్టుల భర్తీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగార్థులు నష్టపోరా? గత ఎనిమిదేళ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోలేదు? యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని గత 3 ఏళ్లలో తాను ఎన్నోసార్లు లేఖలు రాసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని ప్రశ్నించారు. ఈ అంశాలపై చర్చించడానికి రాజ్‌భవన్‌కు రావాలని మంత్రి సబితను కోరారు. ఇక రాష్ట్రంలోని వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం చట్టబద్ధమేనా? న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవుతుందా? అన్న విషయంలో అభిప్రాయం చెప్పాలని యూజీసీని గవర్నర్ తమిళిసై కోరారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. ఇంకా పెండింగ్‌లోనే 7 బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13న తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుతోపాటు మరో ఏడు బిల్లులను శాసనసభ, శాసనమండలిలలో ఆమోదించి గవర్నర్‌కు పంపింది. అందులో ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లును గవర్నర్ ఆమోదించి తిరిగి పంపారు. వర్సిటీల బిల్లు సహా ఏడు బిల్లులు ఇంకా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ములుగు అటవీ కళాశాలను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లు, పురపాలికల చట్ట సవరణ బిల్లు, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వాహనాలపై పన్నుల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్ ఆమోదిస్తే వెంటనే వాటిని అమల్లోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో యూనివర్సిటీల బోర్డు బిల్లును గవర్నర్ మంగళవారంలోగా ఆమోదించకపోతే.. రాజ్‌భవన్‌ను వేలాది మందితో ముట్టడిస్తామని యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై మంత్రి సబితకు లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. ఎత్తులు.. పైఎత్తులతో.. ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని.. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయని రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని అంటున్నాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్ హెలికాప్టర్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు రావడం మానేశారని ఆమె ఎన్నో పర్యాయాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. మరోవైపు మంత్రులు బీజేపీ కార్యకలాపాలకు రాజ్‌భవన్ అడ్డాగా మారిందని గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఇటీవల తన వ్యక్తిగత ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని గవర్నర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తనను కలిసేందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులెవరూ రాకపోవడంతోనే.. యూనివర్సిటీల నియామకాల బిల్లును అడ్డు పెట్టుకుని మంత్రిని పిలుస్తూ గవర్నర్ లేఖ రాశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాజ్‌భవన్‌కు వెళ్తారా? సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు ఏడాదికాలం నుంచి రాజ్‌భవన్‌తో అంటీముట్టనట్టు ఉంటున్న నేపథ్యంలో ఓ రాష్ట్ర మంత్రికి గవర్నర్ నుంచి పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ లేఖకు స్పందించి మంత్రి సబిత రాజ్‌భవన్‌కు వెళ్తారా, లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోతే మాత్రం మంత్రి సబితను రాజ్‌భవన్‌కు పంపించే అవకాశాలు ఉండవని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇటీవల గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... ‘‘శాసనసభలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా నా పరిధిలోనిది. గవర్నర్‌గా నాకు విస్తృత అధికారాలు ఉంటాయి. నా పరిధిలోనే నేను నడుచుకుంటున్నాను’’ అని పేర్కొనడం గమనార్హం. చదవండి: మోదీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం -
రాజ్‌భవన్‌లో దీపావళి సంబురాలు రేపు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సామాన్య ప్రజానీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఫైర్
‘గవర్నర్ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.’ - గవర్నర్ తమిళిసై సందరరాజన్ సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించడం లేదు. స్పందించడం లేదు. అన్నీ అవమానాలే. నేనెక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్ వచ్చి పలకరించడం లేదు. తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం రాకపోతే ఆ సమాచారం ఇవ్వడం లేదు. అత్యున్నత పదవిలో ఉండి కూడా ఎన్నో అడ్డంకులు, వివక్షను ఎదుర్కొంటున్నా. ఒక మహిళా గవర్నర్‌ను ఎలా వివక్షకు గురి చేశారన్నది గత మూడేళ్ల రాష్ట్ర చరిత్రలో నమోదైంది..’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పాలనా విధానాలపై ఆమె ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడూ సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని.. ఇవి తననేమీ చేయలేవని తమిళిసై స్పష్టం చేశారు. గౌరవించక పోయినంత మాత్రాన తక్కువైపోనని.. తాను చాలా శక్తివంతురాలినని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో గవర్నర్ చెప్పిన అంశాలు, చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. రాజ్‌భవన్ అంటరాని ప్రాంతమా? ‘‘సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ కావాలని అడిగితే చివరిక్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇచ్చేదీ, లేనిదీ కనీసం సమాచారం ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించి జాతరకు వెళ్లాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కోరలేదు. ఎక్కడికైనా కారు, రైలు ద్వారా వెళ్తున్నాను. అయినా అసెంబ్లీలో నా ప్రసంగాన్ని నిరాకరించారు. గణతంత్ర దినోత్సవం నాడు నేను జాతీయ జెండా ఎగురవేయకుండా నిరాకరించారు. ప్రసంగం కాపీ కోరితే ప్రభుత్వం పంపలేదు. నేను నోరు మూసుకుని ఉండాలా? సాధారణ పౌరురాలిగానే ఆ రోజు మాట్లాడాను. గణతంత్ర దినోత్సవానికి సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? ఇది అంటరాని ప్రాంతమా? వివక్ష చూపుతారా? గణతంత్ర వేడుకలను కేవలం రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని మంత్రివర్గం ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది? పరేడ్ ఎందుకు ఉండకూడదు? అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం పరేడ్ నిర్వహించాయి. కోవిడ్ మహమ్మారి కేవలం తెలంగాణలోనే ఉందా? రాజకీయ సభలు జరగలేదా? హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టు గవర్నర్ ఆమోదించాలని లేదు. నేనేమీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి విషయాన్ని తిరస్కరించడం లేదు. హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నాను. గవర్నర్ కోటాలోని సర్వీసు కేటగిరీలోకి రాడనే ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి నియామకాన్ని అంగీకరించలేదు. గవర్నర్ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. తాము ఎన్నుకున్నవారు అందుబాటులో లేకపోవడంతోనే ప్రజలు తమ సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు. మహిళా దర్బార్‌కు వచ్చిన అర్జీలు, బాసర ట్రిపుల్ ఐటీలో దయనీయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదు. గవర్నర్ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు లేవని గుర్తుంచుకోవాలి. విద్య, వైద్యం, మహిళా భద్రతే.. రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళల భద్రత అతిపెద్ద సమస్యలు. గతంలో నన్ను కలవడానికి సీఎం కేసీఆర్ వచ్చేవారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని చాలాసార్లు చెప్పా. కు.ని. శస్త్రచికిత్సలు విఫలమవడం వంటి ఘటనలు చూస్తున్నాం. నిమ్స్ డైరెక్టర్ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలెవరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. పిల్లలను పిల్లులు, ఎలుకలు కరుస్తున్నాయి. కేంద్రం కొత్తగా 8 వైద్య కళాశాలలను మంజూరు చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మవడంతో ఎంసీఐ అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ పాత్ర అంతకే పరిమితం! రుణాలపై ఆంక్షలు, హామీల అమలు విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. ‘‘నేను కేవలం రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నాను. పలు పరిమితులున్నాయి. ప్రతి రాష్ట్రానికి కేంద్ర సహాయం కచ్చితంగా లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవడానికి వేదిక, వ్యవస్థలు ఉన్నాయి. గవర్నర్ పాత్ర ప్రేరణ కల్పించడానికే పరిమితం’’ అని తమిళిసై సమాధానమిచ్చారు. విమోచన దినమే కరెక్టు..! రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే తెలంగాణ విమోచన దినం పేరును మార్చిందని. విమోచన దినమే సరైనదని తాను భావిస్తున్నానని గవర్నర్ తమిళిసై చెప్పారు. తెలంగాణ చరిత్రపై తాను అధ్యయనం చేశానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించగా.. ఈ విషయాన్ని పాలనా యంత్రాంగం చూసుకుంటుందని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
తెలంగాణ ప్రభుత్వం పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
-
అమిత్ షాతో తమిళిసై భేటీ.. శాంతిభద్రతలపై నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను తమిళిసై వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, పర్యవసానంగా రెండు పార్టీల శ్రేణుల మధ్య తలెత్తిన వివాదాల అంశాన్నీ అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్, పోలీసులు వ్యవహరించిన తీరు వంటి అంశాలనూ అమిత్‌షా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం దృష్టి పెట్టిందని, ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా అమిత్ షా చెప్పినట్లుగా తెలుస్తోంది. అవసరాన్ని బట్టి కేంద్ర బలగాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని గవర్నర్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్‌తో గవర్నర్ భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతికి అభినందనలు తెలిపి, వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. -
క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
యానాం: క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. యానాంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అలా.. గవర్నర్ ఇలా.. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ వల్లే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు సంభవించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. విదేశాలే ఈ కుట్ర చేసి ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు గవర్నర్ తమిళిసై మాట్లాడటం గమనార్హం. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 51.8అడుగులకు చేరింది. ఎగువ నుంచి 13 లక్షల 50వేలు క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వస్తోంది. భద్రాచలం టౌన్‌లోని ముంపునకు గురైన కాలనీలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికీ రామాలయం పురవీధులు చెరువులను తలపిస్తున్నాయి. 53 అడుగుల లోపు వచ్చిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి తెలిపారు. చదవండి: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు -
తగ్గేదేలే.. ఎవరికి వారే.. అటు గవర్నర్.. ఇటు కేసీఆర్ పోటాపోటీగా..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓ వైపు సీఎం కేసీఆర్, మరో వైపు గవర్నర్ తమిళిసై పర్యటనలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. తమిళిపై పర్యటనలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కనిపించలేదు. గవర్నర్ వెంట ఏఎస్పీ, ఆర్డీవో మాత్రమే ఉన్నారు. పోటోకాల్ వివాదంపై నో కామెంట్ అంటూ గవర్నర్ మాట దాట వేశారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు. చదవండి: వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు 36 ఏళ్ల తర్వాత గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో రావడంతో భద్రాచలం నీట మునిగింది. వరద ముంపు ప్రాంతాలలో సీఎం, గవర్నర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గాన హనుమకొండ నుంచి భద్రాచలంకు సీఎం వచ్చారు. మరో వైపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మణుగూరు చేరుకుని అక్కడ నుంచి అశ్వాపురంలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. భద్రాచలంలో సీఎం కేసీఆర్, అశ్వాపురంలో గవర్నర్ తమిళ్ సై పర్యటనలు పోటా పోటీగా సాగుతున్నాయి. -
ప్రజా దర్బార్ కాదది.. పొలిటికల్ దర్బార్: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ (ఫొటోలు)
-
అంతర్జాతీయ యోగా ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
-
నేతన్న పనితీరు అద్భుతం,చేనేత దుస్తులు ధరిద్దాం
చేనేత కార్మికులకు మద్దతునివ్వడానికి ప్రతిఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలని, వాటి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపజలకు పిలుపునిచ్చారు. ప్రోత్సాహకాలకు నేత కార్మికులు అర్హులని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆకాంక్షించారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని రాజ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు నేత కార్మికులను సన్మానించారు. 2015లో తమిళనాడులో ప్రధాని మోదీ ప్రారంభించిన తొలి జాతీయ చేనేత దినోత్సవంలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేత కార్మికులు తమ వృత్తిపై అసాధారణమైన అభిరుచిని ప్రదర్శిస్తున్నారని, అద్భుతమైన డిజైన్లతో ఉత్పత్తులు తీసుకొస్తున్నారన్నారు. నారాయణపేట, సిద్దిపేట, వరంగల్ చేనేత ఉత్పత్తుల ప్రత్యేకతల ను తెలుపుతూ పోస్టల్ కవర్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోస్టల్ సర్కిల్ కృషిని గవర్నర్ ప్రశంసించారు. – సాక్షి, హైదరాబాద్ -
బడ్జెట్ సమావేశాలు నవ్వులాటగా మారాయి: భట్టి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై ప్రసంగంలో పసలేదు, స్పష్టత లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గన్‌పార్క్ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అరేళ్లుగా చెప్పిందే చెప్తున్నారని, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 57 ఏళ్లు దాడినవారి పెన్షన్లు ఇస్తామని చెప్పారని, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. క్రాంగ్రెస్ హయాంలో బియ్యంతో పాటు 9 రకాల సరుకలు ఇచ్చేశాళ్లం అన్నారు. నిరుద్యోగ భృతికి విధి విధానాలు రూపొందించలేదని, లక్షా 39 వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీరు ఎవరికి ఇస్తున్నారని, మునుగోడు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో నీరు రావట్లేదన్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భగీరథ నీటిపై విసిరిన సవాల్‌ను స్వీకరించిన, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నాగార్జున సాగర్ నుంచి రావాల్సిన నీరు రావట్లేదన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని అడ్వకేట్ దంపతుల హత్య పట్టపగలే జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాలు నవ్వులాటగా మారాయని, బడ్జెట్‌పై చర్చ కేవలం ఆరు రోజులే నిర్వహించటం దారుణమన్నారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదని భట్టి ప్రశ్నించారు. అలాగే ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. కరోనాకు సరైన ట్రీట్మెంట్ చేయట్లేదని గతంలో గవర్నరే చెప్పారు, మళ్లీ ఆ గవర్నర్‌తోనే కరోనాకు మంచి ట్రీట్మెంట్ చేసినట్లు చెప్పుకున్నారన్నారని విమర్శించారు. 60 ఏళ్లలో చేయని అప్పులు టీఆర్ఎస్ చేసిందని, కేసీఆర్‌ను పొగడటానికే గవర్నర్ ప్రసంగం సాగిందని మండిపడ్డారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం సమయంలోనే 18 రోజులు అసెంబ్లీ నడిపారన్నారు. బైంసా ఘటనలో బాధిత బాలికకు న్యాయం చేయాలని, హైదరాబాద్‌లో హత్యలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అనంతరం గవర్నర్ సభను పొడిగించాలని కోరుతున్నామని ఆమె పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 50 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ తెచ్చారు కానీ ఆ పథకం 50 శాతం కూడా విజయం సాధించలేకపోయిందన్నారు. ప్రపంచంలో ఎక్కువ ఫ్లోరైడ్‌తో బాధపడిన ప్రాంతం మునుగోడని, అక్కడ ఇంకా భగీరథ నీరు అందటం లేదని ఆరోపించారు. సీమాంధ్ర నాయకులకే మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారని, దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో ఓడిపోయినా ప్రభుత్వ తీరు మారలేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రి తీరు బాగలేదని, సీఎం కేసీఆర్ కుటుంబం ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళ్ళాలన్నారు. ఇక కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మట్లేదని ఆయన పేర్కొన్నారు. -
సౌందరరాజన్‌కు సీఎం కేసీఆర్ సన్మానం
సాక్షి, హైదరాబాద్ : ద్రోణాచార్య పురస్కారానికి ఎంపికైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త డాక్టర్ సౌందరరాజన్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈమేరకు శుక్రవారం రాజ్‌భవన్‌ను సందర్శించిన సీఎం.. ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. మూత్రపిండాల వైద్య విభాగం (నెఫ్రాలజీ)లో 35 ఏళ్ల పాటు బోధనలు, పరిశోధనలు, వైద్య సేవలు అందించినందుకుగాను ‘సీనియర్ ఢిల్లీ నెఫ్రాలజిస్టుల ఫోరం’ఆయనకు ఇటీవల ఈ పురస్కారాన్ని ప్రకటించిన విష యం తెలిసిందే. సౌందరరాజన్ సాధించిన విజయాలు యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణమని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు. సౌందరరాజన్ తమిళనాడు వైద్య కాలేజీలో వైద్య అధ్యాపకుడిగా 15 ఏళ్లు, రామచంద్రా వైద్య కాలేజీలో 20 ఏళ్ల పాటు నెఫ్రాలజీ విభాగాధిపతిగా సేవలందించారు. తన సర్వీసులో 1,200 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా పాముకాటుతో మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన మూత్రపిండాలను విజయవంతంగా మార్పిడి చేశారు. రజినీకాంత్, జానకి, ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులకు వైద్య సేవలందించారు. జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో 200కిపైగా వైద్య పరిశోధన పత్రాలను ప్రచురించారు. -
గవర్నర్.. ప్రజాదర్బార్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజల సాదక బాధలను తెలుసుకుని వారికి ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో నెలకోసారి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. గవర్నర్ ఆదేశాలతో రాజ్‌భవన్ సచివాలయం ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు కచ్చితంగా పరిష్కారం లభించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తులకు పరిష్కారం లభించిందా? అవి ఏ దశలో ఉన్నాయి? ఏ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్త ఫైల్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను రాజ్‌భవన్ సచివాలయం రూపొందిస్తోంది. రాజ్‌భవన్ సచివాలయం అన్ని ప్రభుత్వ శాఖలతో అనుసంధానమై పనిచేసే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. నెల రోజుల్లో ఏర్పాట్లు పూర్తికానున్నాయని, ఆ తర్వాత గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహణ తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. నేపథ్యంమిది... సీఎం కేసీఆర్ ప్రజలను కలుసుకోవడం లేదని, ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు ఓ వేదిక లేకుండా పోయిందని, కనీసం మీరైనా ప్రజాదర్బార్ నిర్వహించాలని ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ ట్వీట్టర్ వేదికగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేయగా, తమిళిసై సానుకూలంగా స్పందించారు. ప్రజాదర్బార్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని, ఈ అంశం తన పరిశీలనలో ఉందని గతేడాది సెప్టెంబర్‌లో ట్వీట్టర్లో ప్రకటించారు. ఆ తర్వాత మరో రెండు దఫాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తానని ప్రకటన చేశారు. ఆ దిశగా రాజ్‌భవన్ సచివాలయం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్‌తో ప్రారంభమై... ఉమ్మడి రాష్ట్రంలో 2004కు ముందు ముఖ్యమంత్రులు సాధారణ ప్రజలను నేరుగా కలిసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే వ్యవస్థ లేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 7 నెలల పాటు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ తర్వాత గ్రీన్‌ల్యాండ్స్‌లో కొత్త నివాసం ఏర్పాటు చేసుకున్నాక ఐదేళ్ల పాటు ఆయన సాధారణ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకునేవారు. ఆయన మరణం తర్వాత సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాదర్బార్ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. పాత సీఎం క్యాంపు కార్యాలయం వాస్తుప్రకారం లేకపోవడంతో కొత్త కార్యాలయం కట్టుకున్న తర్వాత కేసీఆర్ ప్రజాదర్బార్ నిర్వహిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రగతి భవన్ నిర్మాణం పూర్తైనా సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేకుండా పోయింది. సీఎంను కలసి తమ సమస్యలను వినిపించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రగతిభవన్‌కు వచ్చే సాధారణ ప్రజలను అక్కడి భద్రత సిబ్బంది ‘సీఎం అపాయింట్మెంట్’లేదని పేర్కొంటూ వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రత్యేకత సంతరించుకుంది. గవర్నర్లు ప్రజాదర్బార్ నిర్వహిస్తే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఎన్నడూ గవర్నర్లు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న సందర్భాలు సైతం లేవని గుర్తు చేస్తున్నాయి. -
కావాలని షూతో మెట్లు ఎక్కలేదు : విప్ సునీత
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం సం దర్శించారు. ఉదయం 11గంటలకు యాదాద్రి కొండపైకి చేరుకున్న గవర్నర్ తమిళిసై దంపతులు 11.02 గంటలకు బాలాలయానికి చేరుకున్నారు. బాలాలయం ప్రధాన ద్వారం వద్ద ఆల య ఆచార్యులు పూర్ణకుంభంతో సంప్రదాయంగా వారికి స్వాగతం పలికారు. ప్రతిష్టామూర్తులకు గవర్నర్ తమిళిసై దంపతులు విశేషంగా పూజలు నిర్వహించారు. సుమారు 19నిమిషాల పాటు పూజలు చేశారు. అనంతరం మహా మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ ఆచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామి లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్ దంపతులకు అందజేశారు. గవర్నర్‌కు ఘన స్వాగతం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ అనితారాంచంద్రన్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘన స్వాగతం ఫలికారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి స్వాగతం పలకగా.. కలెక్టర్ అనితరాంచంద్రన్ మొక్కను అందజేశారు. అంతకు ముందు గవర్నర్ తమిళిసై పర్యటనను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ఆలయ అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విప్ సునీత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అనుకున్న సమయానికి ఆలయానికి రాలేదు. గవర్నర్ దంపతులు క్షేత్రంలోకి వెళ్తున్న సమయంలో ఐదు నిమిషాలు ఆలస్యంగా విప్ సునిత వచ్చారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్తున్న తొందరలో తన కాళ్లకు ధరించిన షూ ఆలయానికి వెళ్లే దారిలోని మెట్లపై వదిలి వెళ్లారు. వాటిపై భక్తుల్లో చర్చ జరిగింది. కావాలని షూతో మెట్లు ఎక్కలేదు శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ వచ్చిన హడావుడిలో అనుకోకుండా షూతో ఐదు మెట్లు ఎక్కానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలని షూతో మెట్లు ఎక్కలేదని తెలిపారు. -
జాతిపితకు మహా నివాళి
లంగర్‌హౌస్: మహాత్మా గాంధీ 150వ జయంతి సంద్భంగా బుధవారం లంగర్‌హౌస్ త్రివేణి సంగమంలోని బాపూ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు నివాళులు అర్పించారు. అనంతరం బాపూధ్యాన మందిరానికి వెళ్లి అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే బాపూఘాట్‌లోని గాం«దీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చేమకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, బాల్క సుమన్, వివేక్, అరికెపుడి గాం«దీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్, మల్లే‹Ù, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి ఉన్నారు. -
తెలుగు నేర్చుకుంటున్నా..
సాక్షి, చెన్నై : తెలుగు నేర్చుకుంటున్నా..తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా అని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. తనకు ఇక్కడ ఇస్తున్న గౌరవాన్ని చూస్తుంటే, ఒక రకమైన ఇబ్బంది కల్గుతోందని, అయితే, తనతో గతంలో వలే ఆప్యాయంగా మెలిగితే మరింత ఆనందంగా ఉంటుందన్నారు. రాష్ట్రానికి చెందిన తమిళి సై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. అక్కడ ఆమె బాధ్యతలు స్వీకరించి తన సేవలకు శ్రీకారం చుట్టి ఉన్నారు. తమిళనాడుకు చెందిన మహిళా నాయకురాలికి ఇంత పెద్ద పదవి దక్కడంతో ఆమెను సత్కరించుకునేందుకు చెన్నై పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో టీనగర్‌లోని సర్ పిట్టి త్యాగరాయ హాల్ వేదికగా ఆదివారం తమిళి సై సత్కార వేడుక జరిగింది. ఇందులో డీఎండీఎకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్, పీఎంకే నేత జీకే మణి, తమిళ మానిల కాంగ్రెస్ నేత జ్ఞాన దేశికన్‌లతో పాటు పలు సంఘాలు, సంస్థల ప్రతినిధులుహాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసైను ఉద్దేశించి ప్రేమలత, శరత్‌కుమార్, జీకే మణి, జ్ఞానదేశికన్ ప్రసంగించే క్రమంలో ప్రత్యేక గౌరవాన్ని పాటించే రీతిలో (హర్ ఎక్సలెన్సీ) అన్నట్టుగా తమిళంలో ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చే రీతిలో తమిళిసై పేరుకు ముందుగా ఉపయోగించారు. అలాగే, ఆమె చేసిన సేవలు, ఆమెతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. కఠిన శ్రమకు గుర్తింపుగా గవర్నర్ పదవి ఆమెను వరించినట్టుగా కొనియాడారు. ఆమెలోని ధైర్యం, వాక్ చాతుర్యాన్ని గుర్తు చేశారు. అనంతరం తమిళి సై సౌందరరాజన్ ప్రసంగిస్తూ అందరికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆప్యాయంగా..... ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి అందరితో కలిసి మెలిగి తాను తిరిగినట్టు గతాన్ని తమిళిసై గుర్తు చేసుకున్నారు. తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లు సైతం ఇప్పుడు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తున్నారని, ఇది ప్రొటోకాల్ ధర్మంగా ఉన్నా, ఇది ఒకరకంగా ఇబ్బందికి గురి చేస్తున్నదని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడున్నా, తమిళి సై అని, ఇక్కడి వారి అభిమానం, ఆప్యాయతల మధ్య మెలిగానని, ఇది తన మీద చూపిస్తే మరింత ఆనందంగా ఉంటుందని స్పందించారు. దివంగత నేత మూపనార్‌ను చూసి తాను పెరిగినట్టు గుర్తు చేసుకున్నారు. తన వివాహానికి దివంగత నేతలు ఎంజీఆర్, కరుణానిధి హాజరై ఆశీస్సులు అందించారని, అవి ఇప్పుడు ఇంతటి స్థాయికి చేర్చాయని పేర్కొన్నారు. జయలలితలోని ధైర్యం, కరుణానిధిలో తమిళం, రాందాసులోని సామాజిక సేవ, విజయకాంత్‌లోని నిరాడంబరం మేళవింపుతో ముందుకు సాగాలన్న తపనతో ఉన్నట్టు పేర్కొన్నారు. దేవుడు ఇచ్చిన వరం, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఈ పదవితో, తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నానని, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తన బాధ్యతల మీద దృష్టి పెట్టి ఉన్నట్టు వివరించారు. శ్రమించే వారికి ఏదో ఒకరోజు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నది తన కు దక్కిన ఈ పదవి ఓ సాక్ష్యంగా పేర్కొన్నారు. తనకు వెన్నంటి భర్త సౌందరరాజన్ ఉన్నట్టుగా ఇక్కడున్న వాళ్లు అనేక మంది వ్యాఖ్యానించారని, ఆయన వెన్నంటి లేరని పక్క బలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలుగు నేర్చుకుంటున్నానని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో తన కృషిని అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కాళి దాసు, నిర్మాత∙కలైపులి థాను, తమిళ మానిల కాంగ్రెస్ జీఆర్ వెంకటేష్ పాల్గొన్నారు. -
8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ఈ నెల 8వ తేదీ 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ఆదివారం ఉదయం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, పలువురు ఉన్నత అధికారులు హాజరు కానున్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ఈ నెల 11వ తేదీన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. -
హిందీ నేర్పలేక టీచర్లు పారిపోయారు..
తమిళనాట సూర్యుడు ఉదయిస్తాడో లేదోగానీ.. తామర వికసిస్తుంది’. ఇది ఆమె ఎప్పుడూ భావోద్వేగంగా చెప్పే మాట. ఆ మాట ఆమెను గేలిచేసేలా, హేళనకు గురయ్యేలా చేసింది. ఇక ఆమె చింపిరి తలకట్టుపై ఒక కామెంట్ కాదు. సామాజికమాధ్యమాలలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు! అయినా తాను నమ్మిన సిద్దాంతం.. పార్టీ ఆమెను గుర్తించేలా చేసింది. ఆమెను ఎవరూ ఊహించనిఅందలానికి ఎక్కించింది. తమిళ నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి.. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా నియమితురాలైన ఆమే.. తమిళిసై సౌందర్‌రాజన్. వైద్యురాలిగా.. సాహితీవేత్తగా.. రాజకీయనేతగా తమిళిసైది వెన్నుచూపని మార్గం. తమిళ రాజకీయాల్లో తలపండిన వారుఎందరు ఉన్నా.. ఆమెలోని సంకల్పబలమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. వద్దన్నా పాలిటిక్స్‌లోకి! తమిళిసై తండ్రి కుమరి అనంతన్ గాంధేయవాది. జాతీయ కాంగ్రెస్‌లో సీనియర్ నేత. తమిళనాట కాంగ్రెస్‌కు డెబ్భైలలో ప్రచార ఫిరంగిగా ఆయనకు పేరుంది. అదే తమిళిసైకి రాజకీయ వారసత్వంగా వచ్చింది. అయితే అనంతన్‌కు వారసత్వ రాజకీయాలు నచ్చవు. అందుకే తన కుటుంబం రాజకీయాల్లో రాదని కరాకండిగా తేల్చేశాడు. కూతురు రాజకీయాల్లోకి వస్తానంటే అదేమాట చెప్పేశాడు. అయినా తన రాజకీయ సభలకు, చట్టసభలకు కావాల్సిన కొన్ని నోట్స్ తమిళిసైతోనే రాయించుకునేవాడు. అదే ఆమెకు రాజకీయాల్లోకి రావటానికి పునాది వేసింది. తండ్రిలోని వాక్పటిమ, నాయకుడిగా ప్రజల్లో మమేకమయ్యే తీరు ఆమెను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. భర్తతో తమిళిసై ‘పెద్దల్ని’ కలిపిన పెళ్లి తమిళిసై కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో పుట్టింది. ఆమెను డాక్టర్‌ను చేయాలన్నది తల్లిదండ్రుల కోరిక. వారి కోరిక మేరకే మద్రాసు మెడికల్ కాలేజిలో ఆమె వైద్య విద్య అభ్యసించారు. వైద్య విద్య రెండవ ఏడాదిలో ఆమెకు అక్కడే వైద్యుడిగా ఉన్న డాక్టర్ సౌందర్రాజన్తో వివాహం జరిగింది. ఆమె వివాహం తమిళనాట ఓ సంచలనం. కారణం.. ఆమె తండ్రి అనంతన్పై ఉన్న గౌరవంతో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ తోపాటు ప్రతిపక్ష నేత కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి భక్తవత్సలం వంటి హేమాహేమీలు హాజరయ్యారు. ఇందులో మరొక విశేషం ఉంది. రాజకీయంగా విరోధులుగా మారిన ఎంజీఆర్, కరుణానిధిలు పదేళ్ల తర్వాత తొలిసారిగా ఈ వివాహంలో కలుసుకోవటమే కాకుండా కరుణానిధి నేరుగా ఎంజీఆర్ పక్కనే కూర్చుని స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకున్నారు! పెళ్లిలో ముందుగా మాట్లాడిన కరుణానిధి ‘తమిళనాట తమిళ శబ్ధం వినపడుతుందా అని ఎదురు చూస్తున్న రోజుల్లో కుమరి అనంతన్ తన కుమార్తెకు తమిళ్ ఇసై.. అంటే తమిళ సంగీతం అంటూ పేరు పెట్టడం ఆమె గురించి రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా చేసింది’ అన్నారు. ఎంజీఆర్ మాట్లాడుతూ.. తమిళిసైను చూస్తుంటే చిన్న పిల్లలా కనిపిస్తున్నా ఏదో రోజు దేశంలోనే పెద్ద పేరు తెచ్చుకుంటుందని ఆకాంక్షించారు. తొలి అడుగు కన్యాకుమారి 1996లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తమిళిసై రాజకీయ ప్రవేశానికి దారి తీశాయనే చెప్పాలి. ఆమె తన తండ్రి కోసం కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడి నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న పొన్.రాధాకృష్ణన్ ప్రచారాన్ని ఆమె చూడటం జరిగింది. ఆయన కోసం బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ వర్గాలు కన్యాకుమారిలో ప్రచారం చేయటం, వారి ప్రచార సరళి ఆమెను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత తమిళిసై తంజావూరులో హౌస్ సర్జన్ చేస్తుండటం, అక్కడి హాస్పిటల్ లోని వార్డుబాయ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త వాజ్‌పేయి గురించి చెప్పటం ఆమెను బీజేపీ వైపు మొగ్గుచూపేలా చేశాయి. వాజ్‌పేయి ప్రసంగాలూ ఆమెపై ప్రభావం చూపాయి. ప్రధానంగా ఆయన ప్రసంగంలోని ‘మతం కన్నా మానవత్వం మిన్న’ అనే నినాదం ఆమెను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. అప్పుడే వాజ్‌పేయి ప్రధాని కావటం, కేవలం పదమూడు రోజులే ఆయన పదవిలో ఉండటం, ప్రభుత్వం కూలిపోవడం వంటి సంఘటనలు ఆమెను బీజేపీలో కార్యకర్తగా చేరేలా చేశాయి. అలా రాజకీయంగా ఆమె ఒక్కో మెట్టూ ఎక్కారు. నేనా.. పాడనా పాటా..! తమిళిసైకి కర్నాటక సంగీతం ఇష్టం. వీణ వాయిస్తారు. నిశ్చితార్థం తర్వాత కాలేజ్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళిసై పాడిన ఓ పాటంటే సౌందర్‌రాజన్‌కు చాలా ఇష్టం. ఇప్పటికీ అడిగి మరీ ఆ పాటను పాడించుకుంటారు. తమిళిసైకి వంటరాదు. కనీసం టీ కూడా చేయలేదు! పెళ్లయిన కొత్తలో పుస్తకాలు చూసి వంటచేయటం భరించలేక ఆమెతో వంట మాన్పించారని ఆమె భర్త నవ్వుతూ చెబుతారు. ‘‘అదొక్కటే కాదు.. తమిళిసైకి హిందీ నేర్పలేక ఆరుగురు టీచర్లు పారిపోయారు’ అని సౌందర్‌రాజన్ సరదాగా అన్నారు. తమిళిసై ఎంత ఎత్తుకు ఎదిగినా రోజుకు కనీసం ఓ గంటైనా వైద్య సేవలు అందించాలన్నది సౌందర్‌రాజన్ కోరిక. ఇక ఆమె డ్రెస్, హెయిర్ స్టైల్ అంతా కుమార్తె సూచనలే. ఆరంభంలో దూరదర్శన్, రాజ్ టీవీలో డిబేట్స్ నిర్వహించిన తమిళిసై అనర్గళంగా మాట్లాడగలరు. పదవులు ఉన్నా, లేకపోయినా తనపై విమర్శలు వచ్చినా వివాదాస్పద విషయాలైనా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మీడియా ముందు మాట్లాడేయడం ఆమె ప్రత్యేకత. కనిమొళిపైనే పోటీ! తమిళిసై చట్టసభల్లో గెలుపెరగని నేత. అయినా నిరాశ చెందని ఉక్కు మహిళగా పేరొందారు. తమిళ శాసనసభకు మూడుసార్లు, లోక్‌సభకు రెండుసార్లు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకుడి నుండి డిఎంకె సీనియర్ నేత కనిమొళిపై పోటీ చేయటం, ఓటమిపాలైనా రెండవస్థానంలో నిలవటం తమిళిసై సత్తాను చాటేలా చేసింది. పేదల డాక్టర్ ఒకే కాలేజ్‌లో పరిచయం అయినా తమిళిసైది పెద్దలు కుదిర్చిన వివాహమే. భర్త, ఇద్దరు పిల్లలు. కుమారుడు సుగంధన్, కుమార్తె పూవినీ.. ఇదీ తమిళిసై కుటుంబం. ఇంట్లో ఐదుగురు వైద్యులున్నారు. కొడుకు, కోడలు, కూతురు కూడా వైద్యులే. తమిళిసై వైద్యురాలిగా ఐదేళ్ల పాటు చెన్నైలోని ఎస్ఆర్ఎంసీలో సేవలు అందించిన అనంతరం పలు కళాశాలలకు ప్రొఫెసర్‌గా పనిచేశారు. తమిళిసై అల్ట్రాసౌండ్ స్కాన్ లో నిష్ణాతురాలు. తన నివాసంలోనే డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేసి కొందరికి ఉచితంగా, మరికొందరికీ కేవలం రెండు వందల రూపాయలకే డయాలసిస్ సేవలు అందించి స్థానికంగా పేదల డాక్టర్ అనే పేరు తెచ్చుకున్నారు. మిస్డ్ కాల్ ఐడియా తనదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీని బలోపేతం చేసే క్రమంలో తమిళిసై చేసిన కోటి మంది సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఒక్క మిస్డ్ కాల్ తో పార్టీ సభ్యత్వం అంటూ ఆమె ప్రవేశపెట్టిన కొత్త మార్గం రాష్ట్రంలోని యువతను ఆకట్టుకునేలా చేసింది. అప్పుడే.. ‘సూర్యుడు ఉదయిస్తాడో లేదో కాని తమిళనాట తామర వికసిస్తుంది’ అంటూ ఆమె చేసే ప్రసంగాలపై, ఆమె జుట్టుపై సామాజిక మాధ్యమాలలో ఆమెపై హేళనగా సెటైర్లు పడ్డాయి. అయితే అవి ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. ఈ క్రమంలో గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో తూత్తుకుడి నుండి చెన్నై వస్తున్న విమానంలో జరిగిన ఓ సంఘటన తమిళిసై వైపు రాష్ట్రం తిరిగి చూసేలా చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలోనే ఉన్న సోఫియా అనే యువతి తమిళిసైను చూడగానే ఫాసిస్ట్ బీజేపీ నశించాలంటూ నినదించింది. ఆ ఘటనతో మొదటిసారిగా తమిళనాడు ఆమెలోని ఆగ్రహాన్ని తలెత్తి చూసింది. విమానం చెన్నై ఎయిర్ పోర్ట్‌లో దిగగానే సోఫియాను పోలీసులు అరెస్టు చేయటం తమిళిసై సోఫియాపై కేసు నమోదు చేయటం ఒక్కసారిగా బీజేపీలో రాజకీయాల్ని వేడెక్కేలా చేశాయి. అదొక్కటే కాదు, గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేయటంతోపాటు రజనీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, సుబ్రమణ్యస్వామి, హెచ్.రాజా వంటి వారు కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై చేసిన విమర్శలను ఆమె సమర్థంగా తిప్పికొడుతూ వచ్చారు.– సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధిసాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
రజనీ రాజకీయ ప్రవేశంపై ట్విట్టర్ వార్!
చెన్నై: ట్విట్టర్లో కుష్బు, తమిళి సై మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం విమర్శలతో ఎవరికి వారే అన్నట్టుగా ఇద్దరూ చాటింగ్‌తో రచ్చకెక్కారు. గురువారం ఇద్దరు మహిళా నేతల మధ్య ఏకంగా కొంతసేపు ట్విట్టర్లో వ్యాఖ్యల తూటాలు పేలడం చర్చకు దారి తీసింది. ఆ ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు, మరొకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై. ట్విట్టర్ వార్ : రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చర్చ ఈ ఇద్దరు మహిళా నేతల మధ్య ట్విట్టర్‌వార్ నడిచింది. రజనీకాంత్ బీజేపీ వైపుగా రావాలని తమిళి సై చేసిన ట్విట్లో కుష్బు వ్యంగ్యాస్త్రంతో కూడిన కామెంట్ చేయడంతో వివాదానికి దారి తీసింది. ఇలా, బ్రతిమలాడి పార్టీలోకి ఆహ్వానించడం కాదు అని, సిద్ధాంతాలకు ఆకర్షితులై రావాలని సూచిస్తూ, ఈ ట్విట్ భిక్షాటనతో సమానం అన్నట్టుగా కుష్బు స్పందించడం తమిళిసైకు ఆగ్రహం కలిగించింది. ఇందుకు ఆమె సమాధానమిస్తూ, ప్రస్తుతం తమరికి ఎదురవుతున్న సమస్యలు నాకు తెలుసు అని, సిద్ధాంతాల ఆకర్షణ అంటే, వేరే పార్టీలో చేరడమా, లేదా జంప్ జిలానీనా అని ప్రశ్నించారు. ఇందుకు కుష్బు సమాధానమిస్తూ, తమరి మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందా తనకు తెలియదంటూ, తనకు నచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యలు చేశారు. తనను ఎవ్వరూ కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించలేదు, దూతల్ని పంపించలేదంటూ వ్యంగ్యాస్త్రం సందించారు. దీంతో తమిళి సై మరింత దూకుడు పెంచి, డీఎంకే నుంచి తమరిని గెంటేశారుగా అని ట్విట్ చేయడం కుష్బులో మరింత ఆగ్రహం రేపింది. తమరు తనకు పీఆర్వోనా, అసిస్టెంటా? అని ప్రశ్నిస్తే ఏ కారణంతో తాను డీఎంకే నుంచి బయటకు వచ్చానో తెలుసా?, తన గురించి తమరికి ఏమి తెలుసు పెద్దరికంతో వ్యవహరిస్తే బాగుంటుందని, తమరేమైనా మానసిక వైద్యులా అని ప్రశ్నిస్తూ.. తమిళి సైకు కుష్బు చురకలు అంటించారు. ఇందుకు తమిళి సై ట్విట్ చేస్తూ, తాను డాక్టర్నే, ఇతరుల మెదడు స్కాన్ చేసే సత్తా ఉందని సమాధానం ఇచ్చారు. చురకలు అంటించిన సామన్యుడు.. సెకండ్ గ్యాప్‌లో ఈ ట్వీట్ వార్‌ను ఆసక్తిగా పరిశీలిస్తూ వచ్చిన ఓ వ్యక్తి ట్వీట్‌తో ఆ ఇద్దరికి చురకలు అంటించే కామెంట్ పెట్టడం గమనార్హం. 2014లో కుష్బు డీఎంకే నుంచి బయటకు వచ్చారని, అప్పుడు ఆమెను తమ వైపు రావాలని బీజేపీ తరఫున తమిళి సై కూడా ఆహ్వానించిన్నట్టుందేనని కామెంట్ చేశాడు. అప్పుడు ఇలా వార్ సాగ లేదే అని చురకలు అంటించడంతో, సీనియర్ నేతగా, మహిళా నాయకురాలిగా ఉన్న తమిళి సైకు తాను గౌరవం ఇస్తున్నట్టు ట్విట్టర్‌ను కుష్బు సైన్ అవుట్ చేశారు. ఇక, ఈ యుద్ధం కాస్త మీడియాలోకి ఎక్కడంతో వేదికల మీదే కాదు, ట్విట్టర్లోనూ తాము ఏ మాత్రం తగ్గమని ఇద్దరు మహిళా నేతలు నిరూపించుకోవడం గమనార్హం. -
తప్పుకోకుంటే... తప్పిస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలికి హత్యా బెదిరింపులు పార్టీ అధ్యక్షులకే రక్షణ లేదా అని విమర్శ చెన్నై : ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోకుంటే హతమారుస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు బెదిరింపు ఎస్ఎమ్ఎస్ వచ్చింది. చెన్నై విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తమిళిసై ఆదివారం రాత్రి తన ప్రచారాన్ని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఒక అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమె సెల్‌ఫోన్‌కు ఒక ఎస్ఎమ్ఎస్ వచ్చింది. తమిళభాషలో ఉన్న ఎస్ఎమ్ఎస్లో ‘ఈ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించండి, నామినేషన్ వాపసు తీసుకోండి, లేకుంటే మీ కారుపై లారీని ఎక్కించి చంపివేస్తా’మని పేర్కొన్నారు. ఈ బెదిరింపులకు ఆశ్చర్యానికి లోనైన ఆమె వెంటనే పార్టీ అగ్రనేతలకు సమాచారం ఇచ్చారు. తమిళిసై ఫిర్యాదు మేరకు ఎస్ఎమ్ఎస్ వచ్చిన సెల్‌ఫోన్ నెంబరుపై విరుగంబాక్కం పోలీసులు విచారణ ప్రారంభించారు. బెదిరేది లేదు: తమిళిసై ఇలాంటి చవకబారు రాజకీయాలకు, బెది రింపులకు తాను బెదిరేది లేదని తమిళిసై ఈ సందర్భంగా సోమవారం మీడియాతో అన్నా రు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలికే భద్రతలేకుంటే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏమిటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన ఎస్ఎమ్ఎస్పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నానని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను ఎంతమాత్రం భయపడేది లేదని అన్నారు. ప్రతిపార్టీ అధ్యక్షులకు తగిన బందోబస్తు కల్పించాలని ఆమె ఈసీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని అనుసరించి జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక రణరంగం కాకూడద నే ఉద్దేశంతో మాత్రమే తాను ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తున్నా, తనకు అదనపు బందోబస్తు కల్పించాలని ఎంతమాత్రం కోరబోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈసీ సీరియస్‌గా తీసుకోవాలి: మురళీధరరావు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసైకి హత్యా బెదిరింపులు రావడాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సోమవారం ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఒంటరికి సై!
డీఎండీకే అధినేత విజయకాంత్ తీరుతో కమలనాథులు విసిగి వేసారినట్టున్నారు. ఇక, ఆయనతో ఎలాంటి చర్చలు సాగించ కూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గట్టుగామంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై వ్యాఖ్యానించారు. ఒంటరి నినాదంతో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో మునిగారు. చెన్నై : డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునే ప్రయత్నంలో ఢీలా పడ్డ కమలనాథులకు ప్రాంతీయ పార్టీల తీరు తీవ్ర అసహనానికి గురిచేస్తున్నట్టుంది. పొత్తు వ్యవహారంలో పీఎంకే తన స్పష్టతను తెలియజేసినా, నాన్చుడు ధోరణితో ఒంటరి నినాదాన్ని డీఎండీకే అందుకున్నా, ఆ ఇద్దరు తమతో కలసి వస్తారన్న ఆశల పల్లకిలో ఇన్నాళ్లు కమలనాథులు ఊగిసలాడారని చెప్పవచ్చు. అయితే, పొత్తు మంతనాల్లో తమతో ఆ పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కలత చెందిన కమలనాథులు, ఇక వారిని తమ దరి దాపుల్లోకి చేర్చకూడదన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఇం దుకు తగ్గ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇక చర్చల్లేవ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒంటరి కసరత్తు : డీఎండీకే, పీఎంకేలు ఇక తమతో కలసి వచ్చేది అనుమానం గానే మారడంతో తమ బలాన్ని చాటుకునేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో తమదైన శైలిలో రాజకీయం సాగించేందుకు కసరత్తుల్లో మునిగారు. ఈ సారికి ఆయా పార్టీలు తమ దైన బాణిలో పయనిస్తుండడంతో, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ఓట్ల చీలిక ద్వారా లబ్ధిపొందాలన్న వ్యూహంతో ముందుకు సాగేందుకు కమలనాథులు నిర్ణయించి ఉన్నారు. ఇందుకు తగ్గ కార్యచరణను సిద్ధం చేసే పనిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై నిమగ్నం అయ్యారు. మంగళవారం టీ నగర్‌లోని కమలాలయంలో ఒంటరి నినాదాన్ని అందుకునేందుకు తగ్గ కసరత్తుల్ని చేపట్టారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో ఆమె సమాలోచించారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ బలా బలాలను జిల్లాల వారీగా సమీక్షించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న బలాన్ని అంచనా వేశారు. ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల వివరాల్ని పరిశీలించారు. ఇందుకు తగ్గ నివేదికను ఢిల్లీకి పంపించేందుకు నిర్ణయించారు. చర్చల్లేవ్ : ఈ కసరత్తుల తదుపరి మీడియాతో తమిళి సై మాట్లాడుతూ, ఇక, డీఎండీకేతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొత్తు కోసం వెనక్కు తగ్గే స్థితిలో బీజేపీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ పార్టీ అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా విజయకాంత్‌కు హితవు పలికారు.ఈ ఎన్నికల్ని ఎలా ఎదుర్కొనాలో తమకు తెలుసునని, ఎవర్నీ తాము నిర్బంధించబోమని, వస్తే కలిసి పనిచేస్తామేగానీ, వాళ్ల డిమాండ్లకు తలొగ్గి, సామరస్య పూర్వకంగా వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 234 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టగలిగిన బలం బీజేపీకి ఉందని, అందుకు తగ్గ కసరత్తులోనే ఉన్నామని వ్యాఖ్యానించడం విశేషం. నేడు అమిత్ షా : తమిళనాట ఎన్నికల రాజకీయ రసవత్తరంగా మారిన సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం చెన్నైకు రానున్నారు. ఆయన రాకతో రాజకీయ ప్రాధాన్యతకు ఆస్కారం ఉంటుందా..? అన్న చర్చ బయలు దేరింది. అయితే, ఆయన కామరాజర్ అరంగంలో జరిగే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సహస్త్ర చంద్ర దర్శనం వేడుకకు హాజరై వెంటనే ఢిల్లీ వెళ్లేలా పర్యటనను సిద్ధం చేసుకుని ఉన్నారు. -
మళ్లీ దక్కేనా?
చెన్నై : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మళ్లీ దక్కించుకునేందుకు తమిళిసై ప్రయత్నాల్లో పడ్డారు. ఆ పదవిని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు కమలనాథులు సీపీ రాధాకృష్ణన్, హెచ్ రాజా కుస్తీలు పడుతున్నారు. అయితే, ఢిల్లీ పెద్దలు ఎవర్ని ఆ పదవికి ఎంపిక చేస్తారోనన్నది బుధవారం తేలబోతోంది. దీంతో పదవీ ఆశలో పడ్డ నాయకులు ఢిల్లీకి మంగళవారం పరుగులు తీశారు. బీజేపీలో ఒకరికి ఒకే పదవి అన్న విషయం తెలిసిందే. ఆ మేరకు గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ద్వారా ఎంపీగా గెలిచిన పొన్ రాధాకృష్ణన్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోక తప్పలేదు. ఆ సమయంలో ఆ పదవి కోసం కమలనాథులు పెద్ద సంఖ్యలోనే పోటీ పడ్డారు. అయితే, పార్టీ కోసం అహర్నిషలు శ్రమిస్తూ, ఏళ్ల తరబడి బీజేపీని నమ్ముకుని పయనం సాగించిన తమిళి సై సౌందరరాజన్‌కు అవకాశం దక్కింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆమెకు అధ్యక్ష పగ్గాలు కేటాయించిన, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అందుకు తగ్గ అధికారాలు అప్పగించారు. దీంతో రాష్ర్టంలో కమలం బలపడేందుకు తీవ్రంగానే తమిళి సై కృషి చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ, పార్టీ వర్గాల్ని కలుపుకుని ముందుకు సాగారు. ఆ పదవి చేపట్టి ఏడాది అవుతున్న దృష్ట్యా, సంస్థాగత ఎన్నికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియ, కొత్త అధ్యక్ష ఎంపిక మీద దృష్టి సారించాల్సి ఉంది. అయితే, వర్షాలు ముంచెత్తడంతో ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష ఎంపిక మీద జాతీయ పెద్దలు దృష్టి పెట్టారు. దీంతో మరో మారు పదవిని చేజిక్కించుకునేందుకు తమిళి సై ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. తనకే మళ్లీ దక్కుతుందన్న ఆశాభావంలో ఉన్నా, ఆమెకు కాకుండా తమకంటే, తమకు అప్పగించాలని కమలనాథులు సీపీ రాధాకృష్ణన్, హెచ్ రాజాఢిల్లీ పెద్దల ముందు వాదన ఉంచినట్టు సమాచారం. రానున్నది ఎన్నికల కాలం కావడంతో అందుకు తగ్గ వ్యూహా రచన, అమలు బాధ్యతలకు తగ్గ నేత నియామకాలకు అధిష్టానం కసరత్తులు చేపట్టి ఉండటంతో పదవీ ఆశల్లో ఉన్న నాయకులు రెడీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో అమిత్ షా నేతృత్వంలో జరగనున్న సమావేశంలో కొత్త అధ్యక్ష నియామకం సాగబోతోంది. దీంతో పదవీ ఆశలో ఉన్న నాయకులు ఢిల్లీ బాట పట్టి ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు తమిళి సై, పదవిని ఆశిస్తున్న సీపీ రాధాకృష్ణన్, హెచ్ రాజాలు ఢిల్లీ చేరారు. అలాగే, పార్టీ సీనియర్లు ఇల గణేషన్, లక్ష్మణన్ సైతం ఢిల్లీకి వెళ్లి ఉండడంతో అధ్యక్షులు ఎవరు అన్నది మరి కొన్ని గంటల్లో తేలే అవకాశం ఉంది. అయితే, మెజారిటీ శాతం మంది మాత్రం తమిళి సైకు మళ్లీ చాన్స్ దక్క వచ్చని పేర్కొంటుండగా, మార్పు జరిగినా జరగవచ్చంటూ మరి కొందరు పేర్కొంటున్నారు. -
తమిళిసైకు అభినందనల వెల్లువ
సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జయలలిత ప్రత్యేకంగా అభినందన లేఖ పంపించారు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే నేతలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుమరి ఆనందన్ తన కుమార్తె ఎక్కడున్నా, ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు. సమష్టి సహకారంతో పార్టీ బలోపేతానికి ముందుకు సాగునున్నట్టు కొత్త అధ్యక్షురాలు తొలి పలుకు పలికారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ప్రప్రథమంగా మహిళా నాయకురాలు తమిళి సై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. ఈమె తండ్రి కుమరి ఆనందన్ కాంగ్రెస్‌వాది. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కుమరి ఆనందన్ బాటలో కాకుండా, బీజేపీ వైపుగా పదిహేనేళ్ల క్రితం తమిళి సై అడుగులు వేశారు. భర్త సౌందరరాజన్, తాను వృత్తి పరంగా వైద్యులైనప్పటికీ, రాజకీయంగా స్వశక్తితో బీజేపీలో ఆమె ఎదిగారు. రెండు సార్లు అసెంబ్లీకి, ఓ మారు లోక్ సభకు పోటీ చేసి ఓటమి చవి చూసినా డీలా పడలేదు. చిన్న చిన్న పదవుల నుంచి జాతీయ స్థాయి పదవిని దక్కించుకుని, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కూర్చున్న తొలి మహిళగా రికార్డులోకి ఎక్కారు. దీంతో తమిళి సైకు పార్టీలకు అతీతంగా అభినందిస్తున్నారు. అభినందన లేఖ : తమిళి సై సౌందరరాజన్‌ను అభినందిస్తూ సీఎం జయలలిత ప్రత్యేక లేఖ పంపించారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా తమరు నియమితులు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రశంసించారు. తమరు మరింతగా రాణించగలరన్న నమ్మకం ఉంద ంటూ తన శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, పుదియ నిధి కట్చి నేత ఏసీ షన్ముగం శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్నాళ్లు బీజేపీ నేతలకు దూరంగా ఉన్న ఎండీఎంకే, పీఎంకే, డీఎండీకే నేతలు తమిళి సై రాకతో ఆనందం వ్యక్తం చేయడం గమనించాల్సిందే. ఇక, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వంతో స్నేహ పూర్వకంగా మెలిగే పనిలో పడ్డ సీఎం జయలలిత, కొత్త అధ్యక్షురాలికి అభినందనల లేఖ రాయడం బట్టి చూస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని అక్కున చేర్చుకోవచ్చన్న చర్చ మొదలైంది. ఇక, తన కుమార్తె రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులవడంతో కుమరి ఆనందన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడున్నా.., ఆనందంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నట్లు పేర్కొన్నారు. సమష్టిగా ముందుకు : అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుని సమష్టిగా పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగనున్నట్టు ప్రకటించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో ఈ పదవిని జాతీయ నేతలు అప్పగించారని పేర్కొన్నారు. పదవిగా కాకుండా బాధ్యతగా తాను భావిస్తున్నానన్నారు. ప్రతి క్షణం పార్టీ కోసం శ్రమించనున్నట్టు చెప్పారు. అందర్నీ కలుపుకుని పార్టీ బలోపేతానికి అడుగులు వేయనున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లోపు బలమైన శక్తిగా అవతరించాలన్న కాంక్షతో ముందుకు సాగుతామని తెలిపారు. తమిళ ప్రజలకు తన వంతుగా కేంద్రం నుంచి ఏమేమి రావాలో, అందాలో వాటిని సరైన సమయంలో సక్రమంగా తెప్పించేందుకు కృషి చేస్తానన్నారు. -
బీజేపీ అధ్యక్షురాలిగా తమిళిసై
చెన్నై, సాక్షి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యూరు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం ప్రకటించారు. మరో సీని యర్ నేత హెచ్ రాజాను జాతీయ కార్యదర్శిగా పార్టీ నియమించింది. పార్టీలో అనేక హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న తమిళిసైకు పార్టీ పగ్గాలు ఇస్తారనే ప్ర చారం ఎంతో కాలంగా సాగుతోంది. అయితే ఆమెకు పోటీగా సీనియర్ నేతలు ఇల గణేశన్, హెచ్ రాజాల పేర్లు కూడా వినిపించాయి. గవర్నర్ పదవిని ఆశిస్తున్న ఇల గణేషన్ స్వచ్ఛదంగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో పోటీ తమిళిసై, రాజాల మధ్యనే నడిచింది. దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు పార్టీ ఎట్టకేలకూ తెరదించి తమిళిసైకు పార్టీ పగ్గాలు అప్పగించింది. మహిళాకర్షణతో చెక్ దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం చేజిక్కుంచుకునే అంశం లో బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకునేలా లేదు. రాబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ర్టంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించిన తరువాత ఆపార్టీకి జీవం వచ్చింది. తిరుచ్చిలో మోడీ నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచార సభతో ఒక్కసారిగా ఎక్కడలేని ఊపువచ్చింది. ఆ తరువాత వరుసగా తమిళనాడులో సాగిన మోడీ సభలతో బీజేపీ ఒక ప్రధాన పార్టీగా మారిపోయింది. అన్నాడీఎంకే, డీఎంకే మినహా అన్ని ప్రాంతీ య పార్టీలు బీజేపీ పొత్తుకోసం క్యూకట్టాయి. కూటమి లో చేరిపోయాయి. రాష్ట్రంలో బలమైన ఏకైక జాతీయ పార్టీగా వెలుగొందుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పరిణామంతో ఖంగుతింది. ఎన్నికల ఫలితాల తరువాత బలహీన పార్టీగా కాంగ్రెస్ మారిపోయింది. దీంతో ప్రాంతీయ పార్టీలు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే కొలమానం రాష్టంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల బలాబలాలకు 2016 అసెంబ్లీ ఎన్నికలే కొలమానంగా మారనున్నా రుు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం మాత్రమే ఉండడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర అసెంబ్లీపై దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పొన్ రాధాకృష్ణన్‌కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో కొత్త అధ్యక్షుని అన్వేషణ మొదలైంది. పాత పరిస్థితులలోనైతే ఏదో ఒక వ్యక్తికి కట్టబెట్టి చేతులు దులుపుకునేవారు. ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చగల చతురుడిగా అమిత్‌షాపై ముద్రపడిపోగా, ఆ ముద్రను తమిళనాడుపై కూడా వేసేందుకు ఆయన భారీ కసరత్తునే చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని బలమైన పార్టీగా తీర్చిదిద్దగల వారికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని జాప్యం చేస్తూ వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుని స్థానానికి మొన్నటి వరకు వినపడిన హెచ్ రాజాను జాతీయ కార్యదర్శిగా నియమించడం ద్వారా తమిళిసైకు మార్గం సుగమం చేశారు. రాష్ట్రంలో అమ్మ (సీఎం జయలలిత) హవాను దీటుగా ఎదుర్కోవాలంటే మరో మహిళ అవసరమని అమిత్ షా భావించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని పార్టీలు కమలనాథుల కరుణ కోసం కాచుకుని ఉన్నాయి. అన్నాడీఎంకే పరోక్షంగా ఇప్పటికే స్నేహహస్తం చాచింది. అయితే గతంలో బీజేపీకి వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో చేదు అనుభవం ఉంది. అలాగని బలమైన ప్రాంతీయ పార్టీ లేకుండా రాష్ట్రంలో నెగ్గుకురావడం అసాధ్యం. ఈ అంశాలన్నీ అమిత్‌షా తన అంతర్గత సమావేశంలో రాష్ట్ర నేతలతో చర్చించినట్లు సమాచారం. కాబట్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నియామకంలో అమిత్‌షా ఆచితూచి అడుగువేసినట్లు జాతీయనేత ఒకరు పేర్కొనడం గమనార్హం.