రాయదుర్గం (హైదరాబాద్): 2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ గుర్తింపు పొందడం ఖాయమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్(యూజీసీ) చైర్మన్, విద్యావేత్త ప్రొఫెసర్ ఎం.జగదీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలి లోని శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాల తోపాటు గోల్డ్‌మెడల్స్, ఫ్యాకల్టికి చాన్స్‌లర్స్ అవార్డుల ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగానే కాకుండా ఆర్థికంగా ఎదుగుతున్న దేశంగా భారత్ ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో 2030 నాటికి 100 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు.
దేశంలోని అన్ని స్టేట్ యూనివర్సిటీలలో 70 నుంచి 80% ఫ్యాకల్టీ ఖాళీలు కొనసాగుతున్నాయని తెలుస్తోందని, వాటిని వెంటనే భర్తీ చేయా లని జగదీశ్‌కుమార్ సూచించారు. సెంట్రల్ వర్సిటీలలో భర్తీల ప్రక్రియ ఆరంభమైందని, త్వరలో పూర్తి స్థాయిలో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
యువత నోబెల్ బహుమతి సాధించాలి: గవర్నర్ తమిళిౖసై
నేటి తరం యువత నోబెల్ బహుమతి సాధించాలనే లక్ష్యంతో కష్టపడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యావిధానం–2020లో ఎన్నో సంస్కరణలకు దారి తీసిందని, దీన్ని అందరూ స్వాగతించాలన్నారు.
మాతృభాషలో విద్యాబోధన చేస్తే విద్యార్థులు మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం హెచ్‌సీయూ చాన్స్‌లర్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు కూడా మాట్లాడారు. రిజి స్ట్రార్ డాక్టర్ దేవే‹Ùనిగమ్, పలువురు ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment