jagadeesh
-
పరిశోధనలతో సమాజానికి మేలు
పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టం చేశారు. యువత పరిశోధన రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువ దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు.సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్‌గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయత్నిస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేయకూడదు పరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్‌పై ఆసక్తి (ప్యాషన్) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’ అని చెప్పారు. న్యాక్ గుర్తింపు తీసుకోవాలి తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్‌కుమార్ తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. -
నీ కుంభకోణాల చరిత్ర నాకు తెలుసు ఆధారాలు బయటపెట్టానంటే..
-
ఆ సీన్ గురించి తప్పుడు ప్రచారం.. చాలా బాధ పడ్డాను: నటి శరణ్య
శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి .. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడటంలో ఆమె కంటూ ఒక స్టైల్ ఉంది .. అందువలన పల్లె పాత్రలలో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా సుహాస్‌కు అక్కగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో తన నటనతో విశ్వరూపాన్ని చూపింది. ఈ సినిమాలో సుహాస్‌ను పూర్తిగా శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో విలన్ ఆమెను బట్టలు తొలగించి ఓ స్కూళ్లో బంధించి వెళ్లినప్పుడు గానీ… పోలీస్ స్టేషన్లో విలన్‌ను కాలితో తన్నిన సీన్లో గానీ శరణ్య విజృంభించేసింది. శరణ్యతో పాటుగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో పుష్ప ఫేమ్ జగదీశ్ కూడా నటించాడు. ఈ చిత్రంలో శరణ్యకు ప్రియుడి పాత్రలో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒక యువతిని ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణం అయ్యాడనే ఆరోపణలతో జగదీశ్ జైలుకు వెళ్లి ఆపై బెయిల్‌పై వచ్చాడు. ఈ అంశం గురించి శరణ్య తాజాగా ఇలా రియాక్ట్ అయింది. 'జగదీస్ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అలాంటి సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన జగదీశ్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం బాధాకరం. అయితే మా సినిమా సెట్లో మాత్రం జగదీశ్ అందరితో చాలా బాగా ఉండేవాడు. నాతో పాటు అందరినీ కూడా చాలా గౌరవంగా పలకరించేవాడు. నాకు తెలిసినంత వరకు అతడి క్యారెక్టర్లో ఎలాంటి తేడా లేదు. కానీ ఆయన కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.' అని శరణ్య పేర్కొంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ఆమెను వివస్త్రను చేసిన సీన్ గురించి ఆమె ఇప్పటికే పంచుకుంది. తన భర్త సపోర్ట్ ద్వారా మాత్రమే ఆ సీన్ చేయగలిగానని చెప్పింది. కానీ కొంతమంది యూట్యూబ్ వారు తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. సినిమాలో ఎం లేకపోయినా కూడా ఎదో ఉంది అనేలా క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో చాలా వీడియోలకు స్ట్రైక్స్ కొట్టినా ఉపయోగం లేదని శరణ్య వాపోయింది. వాస్తవంగా ఆ సీన్లో ఎలాంటి అసభ్యత లేదు. ఆ సీన్లో నటించాలంటే గట్స్ ఉండాలి. కానీ శరణ్య ఎంతో ధైర్యంగా ఒప్పుకుని ఆ సీన్లో మెప్పించింది. దీంతో తన సినీ కెరియర్లో మరో పది మెట్లు ఎక్కేలా చేసింది. ఏదేమైనా సరైన కథ,దర్శకుడి చేతిలో శరణ్య పడితే మరోసారి తన నటనతో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. -
'పుష్ప: ది రూల్' సినిమా షూటింగ్లో కేశవ ఎంట్రీ..!
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు కేశవగా నటించిన బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్(31) అరెస్ట్ కావడంతో పుష్ప-2 షూటింగ్‌పై ఎక్కువగా ప్రభావం పడింది. హైదరాబాద్‌లో ఒక యువతిని బెదిరించి ఆమె ఆత్మహత్యకు కారకుడైనట్లు ఆధారాలు లభించడంతో గతేడాదిలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప పార్ట్-2 లో కేశవ పాత్ర చాలా కీలకం.. అతను జైలుకు వెళ్లడంతో చిత్ర యూనిట్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా విడుదల విషయంలో జాప్యం ఎదరౌతుందేమో అనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా జగదీష్‌కు బెయిల్ వచ్చిందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఆయన జైలు నుంచి రాగానే వెంటనే 'పుష్ప 2' సినిమా షూటింగ్లో పాల్గొన్నాడట. జగదీష్, అల్లు అర్జున్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారట. పార్ట్-1 కంటే పుష్ప ది రూల్లోనే అల్లు అర్జున్‌తో జగదీష్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయట అందుకే అతన్ని రిప్లేస్ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని తెలస్తోంది. హైదరాబాద్‌లో ఒక భారీ సెట్లో గంగమ్మ జాతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. జగదీశ్‌కు బెయిల్ వచ్చేందకు పుష్ప చిత్ర యూనిట్ ఎక్కువగా సహకరించినట్లు టాక్. కానీ జగదీశ్ బెయిల్ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ స్పందించిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్నట్లే 2024 ఆగష్టు 15న విడుదల చేస్తామని వారు ప్రకటించారు. జగదీశ్ జైలుకు ఎందుకు వెళ్లాడు..? జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన జగదీశ్ చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు. పుష్ప సినిమాకు ముందు రోజుల్లో నుంచే ఒక యువతితో అతను సన్నిహితంగా ఉండేవాడు. డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన అవకాశంతో కేశవగా పాపులర్ అయ్యాడు. పుష్ప సినిమాలో కేశవ పాత్రతో గుర్తింపు వచ్చిన క్రమంలో ఆ యువతికి దూరంగా ఉంటూ వచ్చాడు. అప్పటికే ఆమెకు వివాహమై భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఇద్దరి మధ్య పలుమార్లు వివాహ విషయమై గొడవలు జరిగాయి. ఆమె మరో వ్యక్తితో కలసి ఉండగా రహస్యంగా ఫొటోలు తీశాడు. ఇక నుంచి తనతో దూరంగా ఉండాలని కోరాడు. లేదంటే వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. దీనంతటికి కారణం జగదీశ్నే అని పోలీసులు అరెస్ట్ చేశారు. -
పుష్ప జగదీశ్ కేసు.. అసలు నిజం అదేనన్న నటుడు!
పుష్ప సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఫేమ్ తెచ్చుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా). ఇటీవలే ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి మరొకరితో సన్నిహితంగా మెలగడం జగదీశ్‌కు నచ్చక ఆమెను వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఈ విషయాన్న జగదీశ్ చెప్పినట్లు తాజా సమాచారం. తన దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. కాకినాడకు చెందిన యువతి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే.. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుండేది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా.. ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్‌ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి.. ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్‌కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ.. అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పుష్ప-2 యూనిట్ కు బిగ్ షాక్ నటుడు జగదీష్ అరెస్ట్..
-
ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్‌తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం!
సాక్షి, మహబూబ్‌నగర్: నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను తీసింది. డ్రైవర్‌తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరం మండలం కందుకూర్ నుంచి కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగళూర్‌కు కోళ్లను తరలిస్తున్న డీసీఎం.. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణంగా గురువారం అర్ధరాత్రి మక్తల్ మండలం బొందల్‌కుంట స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం వసుదుర్గాకు చెందిన డీసీఎం డ్రైవర్ విజయ్‌కుమార్ (40)తో పాటు కోళ్లను లోడ్ చేసేందుకు వెళ్లిన అంబ్లే గ్రామానికి చెందిన జగదీష్ అలియాస్ మంజు (37), భద్రావతికి చెందిన షఫివుల్లా (35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్, ఎస్ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డీసీఎం క్యాబిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. డ్రైవర్ విజయ్‌కుమార్‌కు భార్య కుమార్‌బాయితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీష్‌కు (మంజు)కు భార్య గీత, ఇద్దరు పిల్లలు, షఫి ఉల్లాకు భార్య షాభానుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పర్వతాలు తెలిపారు. Follow the Sakshi TV channel on WhatsApp: -
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్!
రాయదుర్గం (హైదరాబాద్): 2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ గుర్తింపు పొందడం ఖాయమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్(యూజీసీ) చైర్మన్, విద్యావేత్త ప్రొఫెసర్ ఎం.జగదీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలి లోని శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాల తోపాటు గోల్డ్‌మెడల్స్, ఫ్యాకల్టికి చాన్స్‌లర్స్ అవార్డుల ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగానే కాకుండా ఆర్థికంగా ఎదుగుతున్న దేశంగా భారత్ ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో 2030 నాటికి 100 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు. దేశంలోని అన్ని స్టేట్ యూనివర్సిటీలలో 70 నుంచి 80% ఫ్యాకల్టీ ఖాళీలు కొనసాగుతున్నాయని తెలుస్తోందని, వాటిని వెంటనే భర్తీ చేయా లని జగదీశ్‌కుమార్ సూచించారు. సెంట్రల్ వర్సిటీలలో భర్తీల ప్రక్రియ ఆరంభమైందని, త్వరలో పూర్తి స్థాయిలో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. యువత నోబెల్ బహుమతి సాధించాలి: గవర్నర్ తమిళిౖసై నేటి తరం యువత నోబెల్ బహుమతి సాధించాలనే లక్ష్యంతో కష్టపడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యావిధానం–2020లో ఎన్నో సంస్కరణలకు దారి తీసిందని, దీన్ని అందరూ స్వాగతించాలన్నారు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే విద్యార్థులు మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం హెచ్‌సీయూ చాన్స్‌లర్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు కూడా మాట్లాడారు. రిజి స్ట్రార్ డాక్టర్ దేవే‹Ùనిగమ్, పలువురు ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, అధికారులు పాల్గొన్నారు. -
పుష్ప 2రిలీజ్ పై సూపర్బ్ అప్డేట్ ఇచ్చిన కేశవ
-
ఆ రోజు నుంచే ఓటీటీలోకి రానున్న పుష్ప నటుడి కొత్త సినిమా!
పాన్ ఇండియా మూవీ పుష్పను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వస్తున్న తాజా చిత్రం సత్తిగాని రెండు ఎకరాలు. అమ్ముతడా? సస్తడా? అనేది ఉపశీర్షిక. పుష్ప ఫేమ్ జగదీశ్ భండారి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కొల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. వెన్నెల కిశోర్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఇదే తొలి తెలుగు ఓటీటీ సినిమా కావడం విశేషం. తాజాగా ఓ సినిమా ఓటీటీ విడుదల తేదీ ప్రకటించారు. మార్చి 17 నుంచి ఈ మూవీ ఆహాలో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. మంచి కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్నవాళ్లు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న సత్తిగాని రెండు ఎకరాలు చూసి ఆస్వాదించేయండి. ఉన్నవే రెండు ఎకరాలు. అమ్మకపోతే గడవదు, అమ్మితే మింగుడుపడదు. సత్తి గాని రెండు ఎకరాలు, మార్చ్ 17 నుండి. మన ఆహా లో చూడండి..#SGREOnAHA@MythriOfficial @OG_Jagadeesh @vennelakishore @_mohanasree @DamaAneesha @RajTirandasu@BithiriSathiV6 @abhinavdanda #sureshkomminenii @jaymkrish pic.twitter.com/U5FNkAklpK— ahavideoin (@ahavideoIN) March 5, 2023 -
సీఐ జగదీశ్ కేసు: రోజుకో విషయం వెలుగులోకి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి సీఐ జగదీశ్ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ కంఠేశ్వర్‌లోని యాక్సిస్ బ్యాంక్ లాకర్లో ఉన్న రూ.34 లక్షల నగదు, 9 లక్షల విలువ చేసే బంగారంతో పాటు ఇతర విలువైన ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్‌ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచే బెట్టింగ్ నిర్వాహకులతో సీఐ జగదీశ్ టచ్‌లో ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా, జగదీశ్‌కు బెట్టింగ్ వ్యవహారంలోనే కాకుండా ఓ వివాహిత హత్య కేసుతో, ఓ పెళ్లి సంబంధం విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగదీశ్‌కు సంబంధించిన బాధితుల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఐపీఎల్ క్రికెట్‌కు సంబందించి బెట్టింగ్ నిర్వాహకుల నుంచి సీఐతో పాటు జిల్లాకు చెందిన పలువురు సీఐలు, ఏఎస్సైలు పెద్ద ఏత్తున మాముళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇతర పోలీస్ అధికారుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. చదవండి: (బెయిల్ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం) -
హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అలీ
బాలనటుడిగా ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన అలీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచారు. తాజాగా ఈ స్టార్ కమేడీయన్.. హాలీవుడ్లో తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు జగదీష్ దానేటి దర్శకత్వంలో అలీ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్రబృందం మీడియాకు వెల్లడించింది. ఒక స్ట్రయిట్ హాలీవుడ్ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని తెలిపింది. ఈ ఇండో హాలీవుడ్ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిల్మ్స్, పింక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు చెప్పింది. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుమతుల విషయమై నటుడు అలీ, దర్శకుడు జగదీష్.. సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘హాలీవుడ్ సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. హాలీవుడ్ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్ జవదేకర్గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. జగదీష్ మాట్లాడుతూ.. ‘ఇండో హాలీవుడ్ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్లో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని తెలిపారు. -
టాలీవుడ్ టు హాలీవుడ్
భారతీయ సినిమా నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లాలనే కల చాలామందికి ఉంటుంది. అయితే కొందరికి అది కలగా మిగిలిపోతుంది. కానీ తన ప్రతిభతో భారతీయ సినీ దర్శక, రచయిత జగదీష్ దానేటి హాలీవుడ్ వరకూ వెళ్లారు. హాలీవుడ్లో ‘జె.డి.’ పేరుతో ఎంట్రీ ఇచ్చిన జగదీష్ పలు అంతర్జాతీయ చిత్రాలకు ‘క్రియేటివ్ కన్సల్టింగ్’ చేయటంలో విశేష నైపుణ్యం సాధించారు. హాలీవుడ్ ప్రఖ్యాత ప్రొడక్షన్ కంపెనీ మార్టిన్ ఫిలిమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు జగదీష్. లాస్ ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన ఒక వేడుకలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు–నిర్మాత జాని మార్టిన్.. జేడీతో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల తన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘జె.డి. రాసిన కథలు, స్క్రీన్‌ప్లే అద్భుతం. అందుకే ఆయన దర్శకత్వం వహించబోతున్న హాలీవుడ్ చిత్రాలకు నేను నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నా’’ అన్నారు జాని మార్టిన్. ఈ ఇండో–అమెరికన్ చిత్రాల్లో హాలీవుడ్ నటులతో పాటు భారతీయ సినిమాకి సంబంధించిన నటీనటులను కూడా నటింపజేయనున్నారు. -
ఘనంగా జరిగిన నటి అర్చన పెళ్లి
-
అమ్మ..రాయపాటీ!
ఒంగోలు: విద్యార్థి సంఘం ముసుగులో కాలేజీల్లో రాజకీయ ప్రచారాలు చేస్తున్నారని, ఇటువంటి వాటిని కాలేజీ సిబ్బంది కూడా అనుమతించి విద్యాసంస్థల నిబంధనలను అతిక్రమించి నేరానికి పాల్పడ్డారంటూ ఓ విద్యార్థిని తండ్రి, బాధ్యతగలిగిన పారాలీగల్ సెల్ వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న బీవీ సాగర్ శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కళానికేతన్ వద్ద ఉన్న శ్రీచైతన్య మహిళా కాలేజీ క్యాంపస్‌లో సాగర్ కుమార్తె బైపీసీ చదువుతోంది. మరో నాలుగు రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో పాప ఫీజు విషయం మాట్లాడేందుకు శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కాలేజీకి వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున పిల్లలను హాజరు పరిచి మాట్లాడుతుంటే పరీక్షల సందర్భంగా అధ్యాపకులు ఏమైనా సూచనలు ఇస్తున్నారేమో అనుకుంటూ దూరంగా ఉన్నారు. కొద్ది సేపటికి మీకు ఓటు ఉంటే మీరు.. లేకుంటే మీ తల్లిదండ్రులకు చెప్పి అయినా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి, సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అలా చేస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుందంటూ విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపాటి జగదీష్ మాట్లాడటాన్ని సాగర్ గుర్తించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగబోతుంటే కాలేజీల్లో విద్యార్థులకు రాజకీయ పార్టీల గురించి, ఎవరికి ఓటు వేయాలనే దానిపై ప్రచారం చేయడం ఏమిటంటూ జగదీష్‌ను సాగర్ నిలదీశా>రు. నువ్వెవరంటూ జగదీశ్ ప్రశ్నించడంతో తన కుమార్తె ఇక్కడే చదువుతోందని, ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తుంటే ప్రశ్నించడంలో తప్పేమిటంటూ నిలదీశారు. కాలేజీలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నేరం కాదా.. పరీక్షలని పిల్లలు ఉదయం 3 గంటలకే నిద్రలేచి చదువుకుంటుంటే ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థుల కాలాన్ని ఎందుకు వృథా చేస్తున్నారంటూ సాగర్ ఎదురు ప్రశ్నించారు. దీంతో జగదీష్ నా ఇష్టం..ఏం చేసుకుంటావో చేసుకోపో..అంటూ సమాధానం ఇచ్చాడని సాగర్ తెలిపారు. కాలేజీలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం నేరమని మీకు తెలియదా..అని కాలేజీ సిబ్బందిని ప్రశ్నిస్తే ప్రత్యేక హోదా కోసం..అంటూ జగదీష్ చెప్పాడని, అందుకోసం పిల్లలను బయటకు పిలిచామని, అందుకు భిన్నంగా ఆయన మాట్లాడతాడని తాము ఊహించలేదని కాలేజీ సిబ్బంది చెప్పినట్లు సాగర్ వివరించారు. రాజకీయ ప్రచారానికి అనుమతి ఇచ్చిన శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపాల్, విద్యార్థి సంఘ నాయకుడు జగదీష్‌కు నోటీసులు ఇవ్వాలని కోరుతూ బాధ్యత గల పారాలీగల్ సెల్ వలంటీర్‌గా తాను జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సాగర్ వివరించారు. విద్యా సంస్థల్లో రాజకీయ ప్రచారాలు నిర్వహించడంపై సంబంధిత కాలేజీ ప్రతినిధులు, విద్యార్థి జేఏసీ నాయకుడినని చెప్పుకుంటున్న జగదీష్‌లు ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో వేచి చూద్దాం.. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ప్రత్యేక హోదా కోసమని రాయపాటి జగదీష్ చెప్పడంతో విద్యార్థినులను బయటకు పిలిచామని, ఆ తర్వాత ఆయన తన ఉపన్యాసం రాజకీయాల వైపు మళ్లించడంతో విద్యార్థినులను తరగతి గదుల్లోకి పంపించామని చెప్పారు. -
మోదీ కోసం వికారుద్దీన్ అహ్మద్...
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సరిహద్దుల్లో ఉన్న రమోల్ ప్రాంతం... అఫ్జల్‌గంజ్ ఠాణా పరిధిలోని ప్రిన్స్ పేపర్ ట్రేడర్స్‌లో రూ.11 లక్షలు చోరీ చేసిన ‘మాజీ ఇంటి దొంగ’ జగదీష్ గిరి అక్కడే చిక్కాడు. హైదరాబాద్‌కు సంబంధించి ఆ ప్రాంతంలో పోలీసు ఆపరేషన్ జరగడం ఇది రెండోసారి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఉగ్రవాది వికార్ అహ్మద్ కేసు దర్యాప్తులో అక్కడే ఓ సెర్చ్ ఆపరేషన్ సాగింది. ఇప్పుడు జగదీష్ కోసం రెండోది జరిగింది. జగదీష్ అరెస్టు ఆపరేషన్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ గురువారం మీడియాకు వెల్లడించిన విషయం విదితమే. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన జగదీష్ గిరి తన స్నేహితుడైన ప్రవీణ్ సింగ్‌తో కలిసి ప్రిన్స్ పేపర్ ట్రేడర్స్‌లో రూ.11 లక్షలు చోరీ చేశాడు. ఈ పని పూర్తయిన తర్వాత ఇద్దరూ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తమ స్వస్థలానికి ప్రయనమయ్యారు. వారు అక్కడికి చేరుకునే లోపే కేసు దర్యాప్తులో భాగంగా జగదీష్ ద్వ యం కదకలను గుర్తించిన అఫ్జల్‌గంజ్ పోలీసులు రమోల్ అధికారులను అప్రమత్తం చే యగా... అక్కడి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన రమోల్ పోలీసులు జగదీష్, ప్రవీణ్‌లను పట్టుకుని, నగ దు స్వాధీనం చేసుకున్నారు. నగరం నుం చి వెళ్లిన పోలీసులు వీరిద్దరినీ అక్కడి కోర్టులో హా జరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. మోదీ కోసం వికారుద్దీన్ అహ్మద్... తెహరీక్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన నగరవాసి వికార్ అహ్మద్ అలియాస్ వికారుద్దీన్ 2009–10ల్లో పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఇతను అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని టార్గెట్ చేశాడు. గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా, ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ మోదీనే హత్య చేయాలని కుట్రపన్నాడు. ఆ ఆపరేషన్ కోసం అహ్మదాబాద్ శివార్లలోని రమోల్ ప్రాంతంలో డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. తన అనుచరుడు డాక్టర్ హనీఫ్ ద్వారా పరిచయమైన ఆ ప్రాంత లోకల్ లీడర్ జుబేర్ ద్వారా గవర్నమెంట్ స్థలాన్ని కొని అందులో ఇంటిని నిర్మించాడు. మీడియా ప్రతినిధుల్లా మోదీని సమీపించి తుపాకులతో కాల్చి చంపాలని కుట్రపన్నాడు. దీని కోసం ఇమ్రాన్‌ఖాన్ పేరుతో జీ టీవీ, స్టార్ న్యూస్ రిపోర్టర్‌గా పేర్కొంటూ నాలుగు బోగస్ గుర్తింపుకార్డులు తయారు చేసుకున్నాడు. రమోల్ పోలీసుస్టేషన్ ప్రారంభోత్సవానికి మోదీ వచ్చినప్పుడు, మరో రెండుసార్లు ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఎన్ఎస్జీ సెక్యూరిటీ నేపథ్యంలో తన వద్ద ఉన్న షార్ట్ వెపన్స్‌తో ఆపరేషన్ చేయడం కష్టమని వెనక్కుతగ్గాడు. 2010లో వికార్ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసు లు రమోల్ వెళ్లి అక్కడి వికార్ ఇంట్లో సోదాలు చేయగా, ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేసిన మారణాయుధాల్లో మూడింటిని, ఓ ఎయిర్ పిస్టల్, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. -
తెలుగుదేశం నాయకుడికి 14 రోజుల రిమాండ్
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు, అగనంపూడి ఆస్పత్రి కమిటీ చైర్మన్ కొరాయి జగదీష్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మూడు రోజుల కిందట అగనంపూడి కాలనీలో గ్రామదేవత సంబరాలు నిర్వహించారు. ఆ సంబరాల్లో మహిళలతో అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో జగదీష్ పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతోపాటు దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులను హెచ్చరించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కొరాయి జగదీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు గాజువాక న్యాయస్థానంలో బుధవారం హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో జగదీష్‌ను పోలీసులు జైలుకు తరలించారు. -
తమ్ముడే కాలయముడు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సొంత తమ్ముడే కాలయముడయ్యాడు. భార్యా, పిల్లలను రోజూ మద్యం మత్తులో కొడుతున్నాడన్న కారణంతో అన్నను చంపేయడంతో పెదజాలారిపేటలో కలకలం రేగింది. ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదజాలారిపేట గాంధీసెంటర్ సమీపంలో మడ్డు జగదీష్(40) భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. ఇతను సముద్రంలో చేపల వేటకు వెళ్తూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. జగదీష్‌కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జగదీష్ రోజూ మద్యం మత్తులో భార్యా, పిల్లలను కొడుతుండేవాడు. దీంతో వన్‌టౌన్‌లో గల జగదీష్ తమ్ముడు మడ్డు స్వామికి వదిన, పిల్లలు తమ గోడు వెల్లబోసుకునేవారు. దీంతో స్వామి ఇప్పటికే పలుసార్లు జగదీష్‌ని ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికాడు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో జగదీష్ ఇంటి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గొడవ జరిగింది. భార్యా, పిల్లలను కొట్టవద్దని అన్నయ్యను స్వామి గట్టిగా హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం పెరిగింది. మాటా మాటా పెరగడంతో స్వామి కత్తితో జగదీష్ పొట్ట భాగంలో పొడిచి హత్యచేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సంఘటనా స్థలాన్ని ఎంవీపీ సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్ఐ ధర్మేంద్ర, తదితరులు పరిశీలించారు. సీఐ పర్యవేక్షణలో ఎస్ఐ ధర్మేంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఏకం అనేకం! అనేకం ఏకమే!!
ఆయన ఒక సాధువు.... ఏకాంతం కోసం ఓ పర్వతప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఓ పూరిపాక ఏర్పాటు చేసుకున్నారు. ఆయన దర్శనం కోసం ఓరోజు ఓ సన్యాసిని వచ్చింది. ఆమె తలపై గడ్డితో చేసిన ఓ టోపీ ఉంది. ఆమె మూడుసార్లు ఆ పూరిపాక చుట్టూ ప్రదక్షిణం చేసి అనంతరం ఆయన ముందుకొచ్చి నిల్చుని నమస్కరించింది. ‘‘అయ్యా! ఒక్క మాట చెప్పండి. నా టోపీని తీసి మిమ్మల్ని గౌరవిస్తాను’’ అంది ఆమె. సాధువు ఏం చెప్పాలా అని ఆలోచించారు. ‘ఒక మాట అంటే పెద్దగా ఉండక్కరలేదు. ఏం చెప్పాలి. నన్ను చిక్కుల్లో పడేసిందా ఈమే?’ అనుకున్నారు. ‘‘మీరు చెప్పలేకపోయారు. నేను పోతున్నాను’’ అని ఆమె వెళ్ళిపోయింది... ‘‘ఆమె ఏమడిగింది? ఆమె గడ్డి టోపీ దేనికి సంకేతం?’’ అని సాధువు ఆలోచనలో పడ్డారు. ‘‘ఇక్కడ ఇంతకాలమూ ఏకాంతంలో ఉండి ఏం లాభం? ఓ సాధారణ మహిళకు ఒక మాట చెప్పలేకపోయాను....’’ అని బాధపడ్డారు.ఇక ఇక్కడుండి లాభం లేదు అనుకుని అలా వెళ్తుండగా ఓ గురువు ఎదురుపడ్డారు. ఈయన్ని చూడగానే, ‘‘ఏమిటీ ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నావు... ఏమైంది?’’ అని అడిగారు గురువు. ‘‘ఒక మహిళ దగ్గర నేను ఓడిపోయాను. అవమానభారంతో ఉన్నాను. నేనిక బతికుండి ఏం లాభం?’’ అనుకుంటూ జరిగినందతా చెప్పి బాధపడ్డారు సాధువు. గురువు తన చూపుడు వేలు పైకెత్తి చూపించారు. ‘‘అన్ని నిజాలకు ఇందులో ఉంది సమాధానం... అన్నీ ఇందులో ఒదిగిపోతాయి. ఒకటి వందై, వంద వేలై, వేలు లక్షయి, లక్ష కోటయి... విడిపోయి మళ్ళీ పెరుగుతాయి. కానీ అన్నీ ఒకట్లో ఒకటై పోతాయి...’’ అన్నారు గురువు. సాధువు ఆ వేలి వంక దీక్షగా చూసారు. ఆ వేలిలో ఆ మహిళా కనిపించింది. ఆమె టోపీ తీసి తల వంచి గౌరవించినట్టు అనుభూతి చెందారు సాధువు. – యామిజాల జగదీశ్ -
అగ్రిగోల్డ్ బాధితుల బాధలు పట్టవా?
అనంతపురం అర్బన్: అగ్రిగోల్ సంస్థ బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన దాని కంటే ఆ సంస్థ ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సంస్థ ఆస్తులను రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు తక్కువ ధరకే ఎగరేసుకు పోయేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలనే డిమాండ్‌తో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఆగస్టు 16న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి చేపట్టిన బస్సుయాత్ర గురువారం అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తుందన్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో ర్యాలీ, సాయంత్రం 4 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ ఉంటుందన్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌కు కొమ్ముకాస్తున్నారు
సోమందేపల్లి : ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్‌కు కొమ్ముకాస్తోందనీ, అందుకే ఆర్టీసీ నష్టాలబాటలో కూరుకుపోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విమర్శించారు. సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి
అనంతపురం అర్బన్ : జిల్లాలో 2016లో చేపట్టిన ప్రభుత్వ పథకాల్లో పెద్దఎత్తున అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిందని, దానిపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ జిల్లా నాయకులతో కలిసి మాట్లాడారు. గతేడాది జరిగిన నీరు–చెట్టు, హరిత వనం, గాలిమరలు, సోలార్ ప్లాంట్, ఇసుక విక్రయాలు, తదితర పథకాల్లో రూ.వందల కోట్లు అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫారంపాండ్లు, రెయిన్గన్లు, రక్షక తడుల పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ అయ్యిందన్నారు. దీనిపై జిల్లా యంత్రాగమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి 80 శాతం ఉన్నట్లు స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించారన్నారు. ఇందులో అధికార పార్టీ నాయకులే అవినీతిని అధిక శాతం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సి.మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు కాటమయ్య, ఎస్.నాగరాజు పాల్గొన్నారు. -
బ్యాంక్ బోర్డు చింపింది మా కార్యకర్తలే
అనంతపురం అర్బన్ : ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఈ నెల 22న ధర్నా చేస్తున్న క్రమంలో బ్యాంక్ బోర్డుని చించివేసింది తమ పార్టీ కార్యకర్తలేనని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ అన్నారు. శనివారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.నోట్ల రద్దు కారణంగా పేద, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపద్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ధర్నా చేసేందుకు వెళితే, బ్యాంకర్లు తమని దొంగల మాదిరిగా చూస్తూ షెటర్లు వేశారన్నారు. మా విన్నపాన్ని స్వీకరించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనై బ్యాంక్ పేరు బోర్డుపై దాడి చేయాల్సి వచ్చిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ప్రజల పక్షాన పోరాడే క్రమంలో ఎన్ని కేసులు బకాయించినా, జైలుకి పంపినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నోట్ల రద్దుపై జనవరి 3 నుంచి 10 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మేరకు చిల్లర నోట్లను పంపిణీ చేయకుండా శ్రీమంతులు, కార్పొరేట్ శక్తులకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా నోట్లు తరలిస్తున్నారన్నారు. ఈ వర్గాలకు ప్రైవేటు బ్యాంకులపై సహకరిస్తున్నాయన్నారు. ఇవే చర్యలు కొనసాగితే ప్రైవేటు బ్యాంకులపై దాడులను కొనసాగిస్తామని, ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 26న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం : సీపీఐ 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 26న జిల్లాలోని పార్టీ శాఖల్లో ఘనంగా నిర్వహించాలని నాయకులకు జగదీశ్ పిలుపునిచ్చారు. అనంతపురం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతాన్నారు. -
ఇద్దరి దుర్మరణం
= ఐచర్, బొలెరో ఢీ = మూగజీవాలను తప్పించబోయి ప్రమాదం ముదిగుబ్బ/తనకల్లు : ముదిగుబ్బ మండలంలో ఘోర రోడ్డు ప్ర మాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న మూగ జీవాల ను తప్పించబోయి రెండు నిండు ప్రాణాలు బల య్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మండలకేంద్రంలోని ఎన్ఎస్పీ కొట్టాల జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటు చే సుకుంది. వివరాలు.. తనకల్లు మండలం చీకటిమానుపల్లి నుంచి ఐచర్ వాహనంలో చిత్తూరు జిల్లా పీలేరుకు వెళ్లి బ్రాయిలర్ కోళ్లను ముదిగుబ్బకు సరఫ రా చేసేందుకు గొల్ల జగదీష్(21), కొండకమర్ల బాబాజీ(30) సహా ఐదుగురు బయలు దేరారు. వా హనం ఉదయాన్నే ఎన్ఎస్పీ కొట్టాల వద్దకు వేగం గా వచ్చింది. రహదారిపై అదే గ్రామానికి చెందిన ఆదెప్ప అనే వ్యక్తి పశువులు సమూహం (గుర్రాలు, కుక్కలు) రోడ్డు దాటించేందుకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పశువుల సమూహాన్ని సకాలంలో గుర్తించ ని ఐచర్ డ్రైవర్ ఉన్నఫలంగా వాటిని తప్పించేం దుకు యత్నించాడు. దీంతో వాహనం అదుపుతప్పి పశువులతో పాటు ఎదురుగా వస్తున్న బొలెరో వా హనాన్ని ఢీ కొట్టాడు. దీంతో ఐచర్ వాహనం బోల్తా కొట్టింది. ఐచర్‌లో ఉన్న జగదీష్, బాబాజీ అక్కడికక్కడే మృతి చెందారు. బొలేరో డ్రైవర్ నాగరాజు, ఐచర్‌లో ప్రయాణిస్తున్న గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఐచర్‌లో వందల సంఖ్యలో ఉన్న కోళ్లు, రోడ్డుపై ఉన్న ఒక గుర్రం, 3 కుక్కలు మృతి చెందాయి. సమాచారం తెలిసిన నల్లమాడ సీఐ శివరాముడు, ఎస్ఐ జయానాయక్, ఏఎస్ఐ విజయభాస్కర్‌రాజు క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయడపడిన గణేష్, నాగరాజు ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి చీకటిమానుపల్లికి వెళ్లి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. -
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
అనంతపురం అర్బన్ : గుంతకల్లు కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 11న అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యామ్నాయాన్ని సూచిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింద ని, ఈ క్రమంలో విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలనే అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ, అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతం చేస్తుండటంతో రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సీపీఐ కౌన్సిల్ సమావేశం వాయిదా ఈ నెల 10న జిల్లా బంద్ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించాల్సిన సీపీఐ జిల్లా కౌన్సిల్ విస్తృత స్థాయి సమావేశం వాయిదా వేసినట్లు జగదీశ్ తెలిపారు. సమావేశం నిర్వహించే తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు. -
‘మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి’
అనంతపురం అర్బన్ : జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీలు చేతల్లో చూపకపోతే ప్రజలు నమ్మరని వామపక్ష పార్టీ నాయకులు అన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు ఇచ్చిన వాటిలో ఏ ఒక్క హామీ అమలు కాలేదని, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలకు అదే గతి పట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా తన హామీలను ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఎస్‌యూసీఐ(సీ) జిల్లా కార్యదర్శులు డి.జగదీశ్, వి.రాంభూపాల్, సి.పెద్దన్న, ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, అమర్నాథ్ మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాకు రూ.6,554 కోట్ల ప్యాకేజీని చంద్రబాబు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికో, మోసగించేందుకో చంద్రబాబు మాటలు చెబితే సరిపోదని, ఈ మొత్తాన్ని బడ్జెట్లో చూపించడంతో పాటు, నిధులు కేటాయించి, నిర్ధిష్ట గడువు విధించి అమలు చేసినప్పుడు సీఎం స్థాయికి, స్వాతంత్య్ర దినోత్సవ వేదికకు విలువ ఉంటుందన్నారు. గతంలో కర్నూలులో వేడుకలు నిర్వహించిన సందర్భంలో అక్కడ ఇచ్చిన హామీల్లో ఊర్దూ యూనివర్సిటీ తప్ప ఏ ఒక్కటీ అమలు కాలేదని గుర్తు చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆశయమైన హంద్రీ–నీవా ప్రాజెక్టు, హెచ్ఎల్సీ ఆధునికీకరణ అంశాలను ప్రస్తావించలేదని, పారిశ్రామికాభివృద్ధికి జిల్లాలో 1.72 లక్షల ఎకరాలు సేకరించారని, అయితే ఇప్పటి వరకు పదెకరాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. బెల్ కంపెనీకి శంకుస్థాపన చేసి 18 నెలలు గుడుస్తున్నా కనీసం ప్రహరీ నిర్మాణం కాలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు కేంద్రం ఇచ్చిన రూ.100 కోట్లను జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించారని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ప్యాకేజీని అమలు చేయకపోతే ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. -
కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా దక్కలేదని, అదే గతి బీజేపీకి పడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజిని అందిస్తామని చెప్పి రెండేళ్లయినా ఎటువంటి హామీని అందించలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే సీపీఐ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, నగర కార్యదర్శి లింగమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, నగర సహాయ కార్యదర్శి అల్లీపీరా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేవై ప్రసాద్, రమణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్సన్‌బాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు పాల్గొన్నారు. -
ఎన్జీ కాలేజీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
నల్లగొండ : నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు సెమినార్ హాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రత్యే క ఆహ్వానితులుగా ఎంజీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, ఎస్పీ ప్రకాశ్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సిహెచ్ ప్రభాకర్, ఎన్‌కాలేజీ స్థాపన సభ్యులు టి.వెంకటనారాయణ, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎం.రామానుజాచార్యులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కాలేజీ ప్రి న్సిపల్ డా.ఆర్.నాగేందర్ రెడ్డి వ్యవహరిస్తారు. -
యువకుడిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం
విజయనగరం: ఓ యువకుని పై గుర్తు తెలియని దుండగులు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసిన సంఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మకపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జగదీష్(23) అనే యువకుడు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, కొత్తవలస రైల్వేగేటు సమీపంలో.. ఆటోలో వచ్చిన గుర్తుతెలియని దుండగులు కత్తులతో, ఇనుప రాడ్లతో అతనిపై దాడి చేసి తిరిగి ఆటోలో పరారయ్యారు. స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి త రలించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం అతిని పరిస్థితి విషమించడంతో అతనిని వైజాగ్ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
'అనంత'లో కొనసాగుతున్న ఆందోళనలు
అనంతపురం: వేరు శెనగ విత్తనాలు పంపిణీ చేయాలంటూ అనంతపురం పట్టణంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని తపోవనం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆధ్వర్యంలో 44వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో బెంగళూరు - హైదరాబాద్ రహదారిలో కిలో మీటరు మేర వాహనాలు నిలిచి పోయాయి. అనంతరం కలెక్టరేట్ వద్ద సీపీఐ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేసేంత వరకు తమ దీక్షలు ఆపేది లేదని ఈ సందర్భంగా సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు కల్పించుకుని సీపీఐ జిల్లా అధ్యక్షుడు జగదీశ్ తో సహా 100 మంది సీపీఐ నేతలను అరెస్టు చేశారు. -
నేడు ప్రేమికుల దినోత్సవం
‘ప్రేమ’ రెండక్షరాల మధుర భావన.. మాటలకందని తియ్యని అనుభూతి.. మనసును ఓలలాడించే ఓ అద్భుత కావ్యం.. రెండు మనసుల కలయిక.. రెండు హృదయాల గుండె చప్పుడు.. ప్రేమ ఒక సాగరం.. ఇలా వర్ణించుకుంటూ పోతే రోజులు చాలవు. అందుకే ఈ రెండక్షరాల మాట నుంచే ఎందరో సినీ కవులు మధురమైన గేయాలను రచించగలిగారు. మరెందరో దర్శకులు విభిన్నమైన చిత్రాలు తీయగలిగారు. ప్రేమ గురించి.. ప్రేమికుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. నేడు ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా అలా {పేమ లోకంలో విహరించి వివాహ బంధంతో ఒక్కటైన కొన్ని జంటల ఉద్యమం కలిపింది... ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన జగదీశ్.. విశాఖపట్నం ఆనందపురం మండలానికి చెందిన రాజకుమారిలను ఉద్యమం కలిపింది. జగదీశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు. రాజకుమారి విశాఖపట్నం ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్. రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. రాజకుమారి విద్యార్థుల సమస్యలపై స్పందించే తీరు.. పోరాట పటిమ జగదీశ్‌ను కట్టిపడేశాయి. సంఘాన్ని నడిపించడంలో శక్తిసామర్థ్యాలు.. తోటివారికి అండగా నిలవాలనే సేవాగుణం రాజకుమారికి నచ్చాయి. ఇద్దరినీ ప్రేమ తీరాలవైపు నడిపించాయి. రెండేళ్లు ప్రేమించుకుని అనంతరం ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాజకుమారి ఓ న్యూస్‌చానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తుండగా.. జగదీశ్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. ‘అంతరాలు లేని సమాజం కోసం పనిచేస్తూ.. ప్రేమ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నదే తమ లక్ష్యం’ అంటోంది ఆ జంట. తమలాంటి ప్రేమికులకు ‘వాలెంటైన్స డే’ ఒక పండుగలాంటిది అంటున్నారు. అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ... తాండూరు పట్టణానికి చెందిన ఎం.విజయ్‌కుమార్ ఓ ఉద్యమ పార్టీలో పని చేస్తున్నప్పుడు హైదరాబాద్‌కు చెందిన అనితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అఖిలపక్షాల ఆధ్వర్యంలో 2012లో ఇద్దరూ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోని కష్ట,సుఖాల్లో కలకాలం కలిసుండేదే నిజమైన ప్రేమ అని చెబుతున్నారు. అన్యోన్యంగా ఉన్నాం.. ఇంటర్ నుంచి ప్రేమించుకున్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 17 ఏళ్లు అవుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒకరు ఉద్యోగం చేస్తే ఇంకొకరు న్నత చదువులకు ప్రిపేర్ కావాలన్నది ఇద్దరి అంగీకారం. అందులో భాగంగానే ఈఓపీఅర్డీగా ఏంపికై ఉద్యోగం చేస్తున్నాను. ప్రేమించుకోవడం ముఖ్యం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసి ఉండడం ప్రధానం. -అమృత, ఈఓపీఅర్డీ, మోమిన్‌పేట మనసులు కలిశాయి.. మనువు ఒక్కటి చేసింది నల్లగొండ జిల్లా చింతల పల్లి మండలం, నర్సాల పల్లి గ్రామానికి చెందిన జింకల యాదగిరి పేదరికం కారణంగా వసతి గృహంలో ఉండి చదువుకునేవాడు. ఈ క్రమంలో తీవ్రం జ్వరంతో కాలుకు పోలియో సోకింది. చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో తనకు తెలిసిన వారి సాయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టెలిఫోన్ బూత్ ఆపరేటర్‌గా పనికి కుదిరాడు. యజమానికి నచ్చేలా నడుచుకున్నాడు. అదే సమయంలో యజమాని నిర్వహించే మరోషాపులో పనిచేస్తున్న అనాథ అమ్మాయి శ్రీలక్ష్మితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ముందుగా విషయాన్ని తమ యజమానికి తెలిపారు. ఆయన అంగీకరించడంతో యాదగిరి కుటుంబ సభ్యులను అడిగారు. ముందు నిరాకరించినా తర్వాత అంగీకరించారు. ఇద్దరూ పెళ్లి చేసుకొని ఘట్కేసర్ బస్టాపులో టెలిఫోన్ బూత్, టీస్టాల్, పేపర్ ఏజెన్సీ నిర్వహిస్తూ అభివృద్ధి సాధించారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ తమ మధ్య ఏనాడు మనస్పర్థలు రాలేదని చెబుతున్నారు. -
సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం
పుస్తకం : విజయోస్తు (వ్యక్తిత్వ వికాసం) రచన : శ్రీనివాస్ మిర్తిపాటి పేజీలు: 188 వెల: 89 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ. విషయం : వ్యక్తిత్వ వికాసం మీద కొత్తగా మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నిజం చెప్పే ధైర్యం నాకుంది, మరి చదివే ధైర్యం మీకుందా? అని చెప్పి, ఒక ఛాలెంజ్ చేసి మరీ ఈ పుస్తకం చదివిస్తాడు రచయిత. ప్రతి మనిషికీ ఒక సిద్ధాంతం ఉండాలంటాడు రచయిత. సిద్ధాంతం అంటేనే ఎన్ని పేజీలు అయినా సరిపోవు. కానీ సింపుల్‌గా ఒక్కొక్క పేజీలో చెప్పడం, చెయ్యి తిరిగినవారికే సాధ్యం. బహుశా జర్నలిజమ్‌లో అపారమైన అనుభవం ఇందుకు ఉపయోగపడి ఉండాలి. గాంధీ సిద్ధాంతం, మోడి, సోక్రటిస్... వీరందరివీ రాయడం గొప్ప విషయం. టీవీలు ఎందుకు చూడకూడదు - ఆసక్తికరంగా ఉంటుంది. జాతకాలు... 120 కోట్లమంది ప్రజలకు 12 రాశులు... అంటే ప్రతి 10 కోట్ల మందికీ ఒకేలా జరగడం సాధ్యమేనా? సచిన్, కాంబ్లీ మధ్య వ్యత్యాసం ఏమిటి? మార్పు సాధించిన అశోకుడు, సాధించలేని ఔరంగజేబు... ఇలా ఎన్నో విషయాలతో ఈ పుస్తక రచన సాగింది. - జగదీష్ హాస్య శృంగార సందేశాత్మకం పేజీలు: 140 వెల: 75 ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు పుస్తకం : మైత్రీవనం (కథలు) రచన : జిల్లేళ్ల బాలాజీ, రాచపూటి రమేష్, పేరూరు బాలసుబ్రమణ్యం విషయం : మిత్ర కథకత్రయం... ఒక్కొక్కరివి ఆరేసి చొప్పున 18 కథలతో ‘మైత్రీవనం’గా సంపుటీకరించి కథా భారతికి కంఠహారంగా సమర్పించారు. బాలాజీ ‘ఏకాంబరం ఎక్స్ట్రా ఏడుపు’ వస్తు వైవిధ్యంతో నవ్వులు పూయిస్తుంది. రమేష్ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రహసనాన్ని అధిక్షేపాత్మకంగా ‘ఏడుకొండలు - ఎలక్షన్ డ్యూటీ’లో ఆవిష్కరించాడు. బాలసుబ్రహ్మణ్యం ‘సుబ్బు ఐడియా’లో అమాయకపు ఇల్లాలు అతి తెలివితో భర్త పడే భంగపాట్లు హాస్యస్ఫోరకంగా చిత్రించాడు. బాలాజీ ‘అమ్మ డైరీ’లో రవిచంద్ర తన తల్లి వద్దని ప్రాధేయపడినా పట్టుదలతో మాతృదేశ రక్షణ కోసం మిలటరీలో చేరేందుకు వెళ్లాడు. రవిచంద్ర పాత్రను ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ సిద్ధాంతానికి అక్షర లక్ష్యంగా తీర్చిదిద్దాడు రచయిత. ‘నీడలు-నిజాలు’ కథలో మతోన్మాదాన్ని నిరసిస్తాడు రమేష్. ‘శిశిర స్వప్నం’ కథలో వృద్ధుల దయనీయ స్థితిని వర్ణించాడు సుబ్రమణ్యం. - డా॥పి.వి.సుబ్బారావు పిల్లలు గీసిన వన్నెల చిత్రం! పేజీలు: 54 వెల: 70 పుస్తకం : ఎ పొయెట్ ఇన్ హైదరాబాద్ (కవిత్వం) రచన : ఆశారాజు ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040-24642387 విషయం : లేటెస్ట్ స్టడీ ఒకటి చెబుతుంది: ‘జ్ఞాపకాల్లోకి వెళ్లిన వాళ్లు తాజాగా ఉంటారు. మనసును పరిమళభరితం చేసుకుంటా’రని. పురాతన నగరం హైదరాబాద్‌తో పెన వేసుకున్న బంధాన్ని జ్ఞాపకాల్లో నుంచి తీసుకువస్తున్నాడు ఆశారాజు. యవ్వనానికి ఊదు పొగలేసిన సుల్తాన్ బజారులో నడిచినప్పుడు, లాడ్‌బజార్‌లో మెరిసే గాజుల పూలసవ్వడి విన్నప్పుడు, గోలుకొండెక్కి మబ్బుల సొగసును ముద్దాడినప్పుడు, పంచమహల్ ముషాయిరాలో శ్రోత అయినప్పుడు కవితో పాటు మనమూ ఉంటాం. హైదరాబాద్ సౌందర్యాన్ని మనసు కాన్వాసుపై బొమ్మలేసుకొని ‘ఇది మా హైదరాబాద్’ అని మురిసిపోతాం. నిద్రపోయిన జ్ఞాపకాలను నగరం తట్టిలేపి, ‘ఫిర్సే షురూ కరెంగే జిందగీ’ అనేలా చేస్తుందని చెప్పడానికి ఈ పుస్తకం విశ్వసనీయ సాక్ష్యం. చదువుతున్నంతసేపు రంజాన్ సాయంత్రాల్లో పాతబస్తీ గల్లీ గల్లీ తిరుగుతున్నట్లు ఉంటుంది. - యాకుబ్ పాషా కొత్త పుస్తకాలు మైల (శుద్ధాత్మక నవల) రచన: వరకుమార్ గుండెపంగు పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: రచయిత, సన్నాఫ్ భిక్షం, 5-94, అంబేద్కర్ విగ్రహం దగ్గర, బేతవోలు, చిలుకూరు మం. నల్గొండ జిల్లా. ఫోన్: 9948541711 శాలువా (కథలు) రచన: పిడుగు పాపిరెడ్డి పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: రచయిత, 8/137, అప్పయ్యగారి వీధి, కొత్తపేట, కనిగిరి-523230. ఫోన్: 9490227114 1.గ్రేట్ అలెగ్జాండర్ తమిళ మూలం: ఆత్మారవి తెలుగు: ఎజి.యతిరాజులు పేజీలు: 96; వెల: 50 2. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రచన: గురజాడ అప్పారావు బుర్రకథగా అనుసరణ: కమ్మ నరసింహారావు పేజీలు: 32; వెల: 25 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌజ్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 డయాబెటిస్తో ఆరోగ్యంగా జీవించడం ఎలా? (‘మన ఆహారం’ బుక్‌లెట్‌తో) రచన: డా.టి.ఎం.బషీర్ పేజీలు: 232; వెల: 180 ప్రతులకు: స్పందన హాస్పిటల్, ధర్మవరం-515671. ఫోన్: 9908708880 తాత చెప్పిన కథలు రచన: బి.మధుసూదనరాజు పేజీలు: 60; వెల: 60 ప్రతులకు: జి.రామకృష్ణ, లైబ్రేరియన్, శాఖాగ్రంథాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. -
కూలీబిడ్డ ఐఈఎస్
న్యూస్‌లైన్: మీ కుటుంబ నేపథ్యం చెబుతారా..? జగదీశ్: మాది నిరుపేద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములం. అమ్మ అంగూరీదేవి, నాన్న రోషన్‌లాల్. నాన్న తుప్పు సామగ్రి సేకరించి విక్రయించేవాడు.(10రోజులక్రితం కాలంచేశారు. విచార వదనాలతో) న్యూ: మీ విద్యాభ్యాసం గురించి వివరిస్తారా... జగదీశ్: శాలినీ, నేను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో చదివాం. న్యూ: ఐఈఎస్ స్థాయికి ఎలా చేరుకోగలిగారు? జగదీశ్: నాన్న కష్టార్జితంతో బాల్యం గడిచింది. పేదరికంపై స్వీయానుభవమున్న నేను మన దేశంలో పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు...ఆర్థిక ప్రణాళికా విభాగంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అత్యున్నత విద్యార్జనకు ఆర్థిక ప్రతిబంధాకలను అధిగమించేందుకు ప్రైవేటులో ట్యూషన్లు చె ప్పాను. ప్రభుత్వ ఉపకార వేతనమూ ఆసరానిచ్చింది. న్యూ: మీ ఆశయాలేమిటి? జగదీశ్: దేశంలోని గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు పరిపుష్టం కావాలి. ప్రణాళికల రచనలోనూ కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులోనూ పేదలకు తగిన ప్రాధాన్యం దక్కేలా ఆయా మంత్రిత్వ శాఖలకు ఉపయోగపపడతాం. న్యూ: శిక్షణ విశేషాలేంటీ..? జగదీశ్: మేం ఒకే యూనివర్సిటీలో చదివాం. యా ధృచ్ఛికంగా ఒకే కోర్సును ఎంచుకున్నాం. తద్వారా యూపీఎస్సీలో అర్హత సాధించాం. మాకు 16 నెలల కాలంపాటు శిక్షణ ఉంటుంది. మొదట నాలుగు మాసాల ట్రైనింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికొచ్చాం. తర్వాత ఏడాది ఢిల్లీలోనే తర్ఫీదు ఉంటుంది. ఆపై పోస్టింగులిస్తారు. న్యూ: రాఘవాపూర్ ఎంపికలో ప్రత్యేకత ఉందా? జగదీశ్: జిల్లా కేంద్రం నుంచి కనీసం 90 నిమిషాల ప్రయాణం సాగేంతటి దూరాన ఉన్న ఏదేని పల్లెటూరులో అధ్యయనం చేయాలి. అందుకే సంబంధిత అధికారులు రాఘవాపూర్‌కు మమ్మల్ని పంపిం చారు. నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండి గ్రామీణ స్థితిగతులను ఆకళింపు చేసుకొంటాం. న్యూ: యువతకు మీరిచ్చే సలహా/సందేశం? జగదీశ్: స్థిరమైన ఆలోచనలు, నిబద్ధత ఉండాలి. ప్రతిబంధకాలను దాటుకునేలా పరిస్థితులను అనుకూలింప జేసుకొని ముందుకు సాగాలి. చదువైనా పనైనా శ్రద్ధాసక్తులుండాలి.