అనంతపురం అర్బన్ : గుంతకల్లు కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 11న అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని తెలిపారు.
ఈ ప్రతిపాదనపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యామ్నాయాన్ని సూచిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింద ని, ఈ క్రమంలో విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలనే అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ, అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతం చేస్తుండటంతో రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సీపీఐ కౌన్సిల్ సమావేశం వాయిదా
ఈ నెల 10న జిల్లా బంద్ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించాల్సిన సీపీఐ జిల్లా కౌన్సిల్ విస్తృత స్థాయి సమావేశం వాయిదా వేసినట్లు జగదీశ్ తెలిపారు. సమావేశం నిర్వహించే తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు.
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
Published Fri, Sep 9 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement