guntakal railway zone
-
రైల్వే ఎన్నికలకు రెడీ..!
సాక్షి, రాజంపేట: భారతీయ రైల్వేలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రైల్వేకార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు యాజమాన్యం రెడీ అవుతోంది. ఈమేరకు ఎన్నికలకు సంబంధించి మెంబర్షిప్ వెరిఫికేషన్‌కు అన్ని జోనల్ జనరల్ మేనేజర్లకు రైల్వేబోర్డు డైరెక్టరు డి.మల్లిక్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిలకు రైల్వే యాజమాన్యం సన్నాహాలకు దిగినట్లే. రైల్వే బోర్డు ఆదేశాలతో ఆల్ ఇండియ రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్)కు అనుబంధంగా ఉన్న సౌత్‌సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్ఎఫ్ఐఆర్) సౌత్‌సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకత్వాలు జోన్, డివిజన్ల స్థాయిలో క్యాడర్‌ను సిద్ధం చేస్తోంది. ఆగస్టులో ఎన్నికలు : ఆగస్టులో భారతీయ రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకోనున్నది. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో జిల్లా వరకు నందలూరు, కడప రైల్వేకేంద్రాలలో మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచిల పరిధిలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు ఈ ఎన్నికల్లో తమతమ సంఘాలను గెలిపించుకునేందుకు పోటీపడనున్నారు. రైల్వేబోర్డు ఆదేశాలతో కార్మిక సంఘాల నేతలు ఇప్పటి నుంచి సన్నద్దులవుతున్నారు. 2013లో ఎన్నికలు : 2013 ఏప్రిల్‌లో భారతీయ రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సౌత్‌సెంట్రల్ మజ్దూర్ యూనియన్ విజయఢంకా మోగించిన సంగతి విధితమే. ఆ ఎన్నికల్లో 46 శాతం ఓట్లను దక్కించుకుంది. జోన్ స్థాయిలో 86వేల ఓట్లలో 36వేల ఓట్లను ఎస్ఆర్ఎంయూ దక్కించుకుంది. ఎస్ఆర్ఎంయూ, సంఘ్‌కు సమానంగా వచ్చి రెండింటికి రిగ్నజైడ్ గుర్తింపు వచ్చింది. అయితే గుంతకల్ డివిజన్ స్థాయిలో ఎస్‌ఆర్‌ఎంయూకు 998 ఓట్ల మెజార్టీ వచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా... రైల్వే గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో నిర్వహించారు. కడప, నందలూరులో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో ఉన్న రైల్వే ఉద్యోగులు, కార్మికలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు ఇరు కార్మికసంఘాలు ప్రతిష్టాతక్మంగా తీసుకోనున్నాయి. గుంతకల్ డివిజన్ పరిధిలో 14వేల సభ్యులు ఉన్నారు. ఈ యేడాది ఈ సంఖ్యలో 20వేలలోపు చేరనున్నదని రైల్వే వర్గాలు అంటున్నాయి. -
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
వైవీయూ : విభజన కారణంగా అన్ని విధాలా నష్టపోయిన రాయలసీమలో రైల్వేజోన్, హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వైవీయూలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. శనివారం సాయంత్రం ఐఎస్ఎఫ్, ఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు సీమ కృష్ణనాయక్, నాగేంద్రారెడ్డి మాట్లాడుతూ చట్టంలో పేర్కొన్న రైల్వేజోన్‌ను సీమలోఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలని సూచించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రవీణ్, వీరేష్, నాయుడు, అభిరెడ్డి, మనోహర్, నవీన్, పవన్‌కుమార్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
అనంతపురం అర్బన్ : గుంతకల్లు కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 11న అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యామ్నాయాన్ని సూచిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింద ని, ఈ క్రమంలో విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలనే అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ, అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతం చేస్తుండటంతో రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సీపీఐ కౌన్సిల్ సమావేశం వాయిదా ఈ నెల 10న జిల్లా బంద్ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించాల్సిన సీపీఐ జిల్లా కౌన్సిల్ విస్తృత స్థాయి సమావేశం వాయిదా వేసినట్లు జగదీశ్ తెలిపారు. సమావేశం నిర్వహించే తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు.