గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి | Guntakallunu announce railway zone | Sakshi
Sakshi News home page

గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి

Published Sat, Sep 17 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి

గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి

వైవీయూ : విభజన కారణంగా అన్ని విధాలా నష్టపోయిన రాయలసీమలో రైల్వేజోన్, హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వైవీయూలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. శనివారం సాయంత్రం ఐఎస్‌ఎఫ్, ఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు సీమ కృష్ణనాయక్, నాగేంద్రారెడ్డి మాట్లాడుతూ చట్టంలో పేర్కొన్న రైల్వేజోన్‌ను  సీమలోఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలని సూచించారు.   జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని కోరారు.   ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రవీణ్, వీరేష్, నాయుడు, అభిరెడ్డి, మనోహర్, నవీన్, పవన్‌కుమార్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement