yvu students
-
పాత ఇనుముతో సూపర్ బైక్!
వైవీయూ: పాత ఇనుము సామానుతో రూపొందించిన ‘సూపర్ బైక్’అందరినీ ఆకర్షిస్తోంది. వైఎస్సార్ జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ)లో ఎలక్ట్రీ షియన్‌గా పనిచేస్తున్న ఎన్.లక్ష్మీనరసింహరాజు ఈ బైక్‌ను తయారు చేశారు. గతంలో వినూత్నమైన సైకిల్‌ను రూపొందించి మన్ననలు పొందిన ఈయన తాజాగా రూపొందించిన ఈ బైక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పాత ఇనుమును వినియోగించి రూపొందించిన బైక్ 6 అడుగుల పొడవుతో రేసింగ్ బైక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. రూ.38 వేలు ఖర్చుతో 3 నెలలు శ్రమించి 55 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బైక్‌ను తీర్చిదిద్దారు. 6 అడుగులు ఉన్న ఈ బైక్‌ను అవసరమైతే 9 అడుగుల వరకు పొడిగించుకునేలా రూపొందించారు. లైటింగ్ సిస్టం ఆకట్టుకునేలా.. బైక్ వెళ్తున్న సమయంలో బంతి తిరుగుతూ ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. -
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
వైవీయూ : విభజన కారణంగా అన్ని విధాలా నష్టపోయిన రాయలసీమలో రైల్వేజోన్, హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వైవీయూలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. శనివారం సాయంత్రం ఐఎస్ఎఫ్, ఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు సీమ కృష్ణనాయక్, నాగేంద్రారెడ్డి మాట్లాడుతూ చట్టంలో పేర్కొన్న రైల్వేజోన్‌ను సీమలోఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలని సూచించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రవీణ్, వీరేష్, నాయుడు, అభిరెడ్డి, మనోహర్, నవీన్, పవన్‌కుమార్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.